bandra
-
కాలగర్భంలోకి చివరి ఐరన్ బ్రిడ్జి.. తొలగింపు ప్రక్రియ షురూ
కాలం... ఎవరి ప్రమేయం లేకుండా ముందుకు సాగిపోతుంటుంది. ఈ ప్రకియలో అన్నింటినీ తన గర్భం(కాలగర్భం)లో కలిపేసుకుంటుంది. ఈ విషయంలో గొప్ప కట్టడాలు, నిర్మాణాలకు మినహాయింపేమీ ఉండదు. మనదేశాన్ని బ్రిటీషర్లు పాలించిన కాలంలో వారు అనేక వంతెనలు, రైలు బ్రిడ్జిలను నిర్మించారు. స్వాతంత్య్రానంతరం రైల్వే బ్రిడ్జీలను నూతన టెక్నాలజీతో పునర్నిర్మిస్తున్నారు. రైల్వే ట్రాక్‌లకు దన్నుగా నిలిచి..ముంబైలోని బాంద్రాలోని మిథి నదిపై నిర్మించిన బ్రిటీష్ కాలంనాటి రైల్వే వంతెనను ఇప్పుడు పునర్నిర్మించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ వంతెనపై ఏర్పాటు చేసిన చివరి ఐరన్ స్క్రూ పైల్స్‌లో ఒకటి త్వరలో చరిత్రలో కలసిపోనుంది. దీని స్థానంలో సిమెంట్ కాంక్రీట్ గిర్డర్‌ను నిర్మించనున్నారు. ఈ వంతెన 1888 నుండి రైల్వే ట్రాక్‌లకు దన్నుగా నిలిచింది. సరిగ్గా ఇదే సమయంలో బాంద్రా రైల్వే స్టేషన్‌ను నిర్మించారు.ఇనుప స్తంభాల తొలగింపుఈ వంతెన ట్రాక్‌ల కింద ఎనిమిది స్తంభాలు ఉన్నాయి. వీటిని ఇనుముతో తయారు చేశారు. ఇవి 8 నుంచి 10 టన్నుల బరువును కలిగి ఉన్నాయి. అలాగే 15 నుంచి 20 మీటర్ల లోతున పునాదుల్లోకి ఉన్నాయి. ఈ స్తంభాల వ్యాసం సుమారు రెండు అడుగులు. వాటి మందం 50 మి.మీ. ఇవి స్టీల్ గిర్డర్లను, వాటి పైన ఉన్న రైల్వే లైన్ల బరువును మోస్తుంటాయి. ఈ స్తంభాలు దాదర్ ఎండ్‌లోని రాతి గోడకు ఆనుకుని ఉన్నాయి. వీటిని ఇప్పుడు కూల్చివేయనున్నారు.ఇదే చివరి స్క్రూ పైల్భారతీయ రైల్వేలో కాస్ట్ ఐరన్‌కి సంబంధించిన చివరి స్క్రూ పైల్ ఇదేనని పశ్చిమ రైల్వే ఇంజనీర్ తెలిపారు. అది నీటిలో మునిగిపోయి, బలహీనంగా మారినందున దానిని తీసివేయవలసి ఉంటున్నదన్నారు. ఇది రైలు కార్యకలాపాల భద్రతా సమస్యగా మారే అవకాశం ఉన్నదని, అందుకే ఇప్పుడు దానిని పునర్నిర్మిస్తున్నామన్నారు. ఈ ఎనిమిది ఇనుప స్తంభాలు 9-10 మీటర్ల పొడవుతో నాలుగు రైల్వే లైన్ల భారానికి దన్నుగా నిలుస్తున్నాయి.ఇది కూడా చదవండి: Year Ender 2024: ఈ 10 అంశాలపైనే అంతటా చర్చవంతెనకు దన్నుగా ఏడు సిమెంట్ గర్డర్లు ఈ రైల్వే బ్రిడ్జి ఉత్తర-దక్షిణ దిశలో దాదాపు 50-60 మీటర్ల పొడవు కలిగివుంది. దీనికి ఏడు సిమెంట్ గర్డర్ల ద్వారా దన్ను దొరుకుతుంది. చర్చ్‌గేట్ చివరన నదిలో ఇనుప స్తంభాలు కూరుకుపోయాయి. మిగిలిన ఇనుప స్తంభాలు సిమెంటు కాంక్రీటు మధ్య ఉన్నాయి. స్క్రూ పైల్స్ చివరలు మాత్రమే పైన కనిపిస్తాయి. ప్రస్తుతం ఇంజనీర్లు నీటి ప్రవాహాన్ని ఆపడానికి మిథి నదికి తూర్పు, పడమర ఒడ్డున కాఫర్డ్యామ్లను ఏర్పాటు చేశారు. ఇనుప స్తంభాలను తొలగించేందుకు వీలుగా అక్కడ నిలిచిన నీటిని హైపవర్ పంపుల సాయంతో బయటకు తీస్తున్నారు.కాసేపు రైళ్ల నిలిపివేతజనవరిలో పశ్చిమ రైల్వే రెండు 9.5 గంటల రైలు బ్లాకులను (రైలు రాకపోకల నిలిపివేత) కొనసాగించనుంది. పశ్చిమ రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ బ్లాక్ జనవరి 24 నుంచి 26 వరకూ రాత్రివేళ 9.5 గంటల పాటు ఉండనుంది. ఈ బ్లాక్‌ల సమయంలో ఈ మార్గంలో నడిచే రైలు సర్వీసులను రద్దు చేయనున్నారు. ఈ రెండు బ్లాక్‌ల సమయంలో ఇంజనీర్లు ఇనుప స్తంభాల పైన ఉన్న స్టీల్ గిర్డర్లను తొలగించి, వాటి స్థానంలో 20 మీటర్ల పొడవైన కాంక్రీట్ గర్డర్లను ఏర్పాటు చేయనున్నారు. -
తమన్నా డిజాస్టర్ సినిమా.. ఏడాది తర్వాత ఓటీటీలోకి
మిల్కీ బ్యూటీ తమన్నా ఇంకా ఫామ్‌లోనే ఉంది. అడపాదడపా సినిమాలు చేస్తోంది. గ్యాప్ దొరికితే ఐటమ్ సాంగ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. మలయాళంలోనూ గతేడాది ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ మూవీ పెద్ద డిజాస్టర్ అయింది. ఇప్పుడు ఆ చిత్రమే తెలుగులోనూ ఓటీటీలోకి స్ట్రీమింగ్కి సిద్ధమైంది.(ఇదీ చదవండి: 'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ)ఉత్తరాదికి చెందిన తమన్నా.. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. 'బాంద్రా' అనే మూవీతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. గతేడాది నవంబర్‌లో ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాగా.. ఘోరంగా ఫెయిల్ అయింది. రూ.35 కోట్లు బడ్జెట్ పెడితే రూ.2 కోట్ల వసూళ్లు మాత్రం వచ్చాయి. దీంతో డిజిటల్ మార్కెట్ కూడా జరగలేదు. అలా మూలన పడిపోయింది.ఇన్నాళ్లకు 'బాంద్రా' డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సొంతం చేసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. నవంబర్ 15న లేదా 22న స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి తీసుకురావొచ్చు. 'బాంద్రా' విషయానికొస్తే.. మాఫియా డాన్ నుంచి తప్పించుకున్న ఓ హీరోయిన్.. గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడుతుంది. ఊహించని పరిస్థితుల్లో ఆమె చనిపోతుంది. తర్వాత ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన దేవర, వేట్టయన్, జనక అయితే గనక.. ఏది ఎందులో?) -
బాంద్రా రైల్వేస్టేషన్లో తొక్కిసలాట.. సీసీటీవీ దృశ్యాలు వైరల్
ముంబైలోని బాంద్రా టెర్మినస్ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. బాంద్రా టెర్మినస్ లోని ఒకటో నంబర్ ప్లాట్ ఫామ్‌పై బాంద్రా -గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కే సమయంలో భారీగా ప్రయాణికులు ఒక్కసారిగా రావడంతో ఈ ఘటన జరిగింది.Complete failure of Narendra Modi Govt and Railway ministry A stampede at Platform No. 1, Bandra Terminus, occurred at 5: 10 a.m. on October 27 as heavy passenger rush led to overcrowding. Train No. 22921, the Bandra-Gorakhpur Expresspic.twitter.com/83tTNOndf4— Pritesh Shah (@priteshshah_) October 27, 2024 ాజాగా రైల్వేస్టేషన్లో రైలు రావడానికి ముందు ఎదురుచూస్తున్న ప్రయాణికులకు చెందిన సీసీటీవీ ఫుటేజీ వైరల్‌గా మారింది. ఆదివారం తెల్లవారుజామున 2.44 గంటలకు 22 కోచ్‌లతో బాంద్రా-గోరఖ్‌పూర్ అంత్యోదయ ఎక్స్‌ప్రెస్‌ప్లాట్‌ఫామ్ మీదకు రావడంతో జనరల్ బోగీలో ఎక్కేందుకు ఒక్కసారిగా ప్రయాణికులు ఎగబడినట్లు ఇందులో కనిపిస్తుంది. దీపావళి పండగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులు. పెద్దఎత్తున రైలు ఎక్కేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. కొంతమంది ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండో ద్వారా కూడా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.त्योहार के समय हर किसी का सपना होता है घर पहुंचना।#Bandra स्टेशन पर आज भीड़ और भगदड़ से कई लोग घायल हुए।रेल मंत्री जी से अनुरोध है कि त्योहारों में स्पेशल ट्रेन चलाकर यात्रियों की सुरक्षा सुनिश्चित करें।#BandraTerminus #SafeTravels pic.twitter.com/zSHMX3fThU— Shelesh Bamniya (@SheleshBamniya) October 27, 2024 గాయపడిన వారిని షభీర్ అబ్దుల్ రెహ్మాన్ (40), పరమేశ్వర్ సుఖ్‌దర్ గుప్తా (28), రవీంద్ర హరిహర్ చుమా (30), రామసేవక్ రవీంద్ర ప్రసాద్ ప్రజాపతి (29), సంజయ్ తిలక్రం కాన్గే (27), దివ్యాంశు యోగేంద్ర యాదవ్ (18), మహ్మద్, షరీఫ్ షేక్ (25), ఇంద్రజిత్ సహాని (19), నూర్ మహ్మద్ షేక్ (18) లుగా అధికారులు గుర్తించారు. -
పెళ్లి జరిగిన ఇంటిని అమ్మేస్తున్న స్టార్ హీరోయిన్
హీరోయిన్ సోనాక్షి సిన్హా మొన్నీ మధ్యే జూన్ 23న పెళ్లి చేసుకుంది. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఈ వేడుకంతా ముంబయిలోని బాంద్రా ఏరియాలో ఉన్న సోనాక్షి అపార్ట్మెంట్లోనే జరిగాయి. ఇప్పుడు ఆ ఇంటినే అమ్మకానికి పెట్టేసింది. ఈ విషయం ఆమె చెప్పలేదు. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ పోస్ట్ చేసిన వీడియో వల్ల ఇది బయటపడింది.(ఇదీ చదవండి: బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. కొత్త వీడియోతో నటి హేమ)ప్రముఖ నటుడు శత్రుఘ్ని సిన్హా కూతురు సోనాక్షి సిన్హా. సల్మాన్ ఖాన్ 'దబంగ్' మూవీతో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. దక్షిణాదిలోనూ రజినీకాంత్ 'లింగా' సినిమాలో హీరోయిన్గా చేసింది. ఆడపదడపా సినిమాలు చేస్తోన్న ఈమె.. గతంలో తనతో పాటు నటించిన జహీర్ ఇక్బాల్‌తో చాన్నాళ్ల క్రితమే ప్రేమలో పడింది. ఈ ఏడాది జూన్‌లో పెళ్లికి కొన్నిరోజుల ముందు ఈ విషయం బయటపడింది.ఇక 2020లో బాంద్రాలో ఓ అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన సోనాక్షి.. అదే బిల్డింగ్‌లో మరో అపార్ట్‌మెంట్‌ని గతేడాది మే నెలలో సొంతం చేసుకుంది. తాజాగా అందులోనే తన పెళ్లిని గ్రాండ్‌గా జరుపుకొంది. ఇప్పుడు ఏమైందో ఏమో గానీ దీన్ని రూ.25 కోట్ల రేటుకి అమ్మకానికి పెట్టింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. పెళ్లి జరిగిన ఇంటిని మరి సోనాక్షి ఎందుకు అమ్మాలనుకుందనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: వెయిట్ చేయండి.. సర్ప్రైజ్ ఇస్తా: హీరోయిన్ సమంత) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) -
సెల్ఫీ అడిగిన అభిమాని.. ఓవర్ యాటిట్యూడ్ చూపించిన హీరో!
కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాదిలో తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది చిన్నా సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ఆయన కమల్ హాసన్ చిత్రం ఇండియన్-2 లో కనిపించనున్నారు. తాజాగా సిద్ధార్థ్ ముంబయిలోని బాంద్రాలో సందడి చేశారు.సిద్ధార్థ్ తన కారు వద్దకు వెళ్తుండగా ఫోటో దిగేందుకు యత్నించాడు. దీంతో అతనిపై హీరో సిద్ధార్థ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దయచేసి ఇక్కడ సౌండ్ చేయొద్దంటూ అతన్ని వారించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ సిద్ధార్థ్ తీరుపై మండిపడుతున్నారు. అభిమానులతో ఇలాంటి ప్రవర్తన సరికాదని సూచిస్తున్నారు.కాగా.. ఈ ఏడాదిలోనే సిద్ధార్థ్, ఆదితి రావు హైదరీ నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. వనపర్తిలోని ఓ ఆలయంలో ఈ జంట సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఆదితి రావు హైదరీ ఇటీవల సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి వెబ్ సిరీస్‌లో మెరిసింది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
లగ్జరీ ఫ్లాట్ కొన్న ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్.. కోట్లు పెట్టి మరీ ఇలా!
టీమిండియా బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ పృథ్వీ షా ఖరీదైన ఇల్లు కొన్నాడు. దాదాపు రూ. 20 కోట్లు ఖర్చు చేసి విలాసవంతమైన ఫ్లాట్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని బాంద్రాలో సముద్ర ముఖంగా ఉన్న ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తన లగ్జరీ ఫ్లాట్‌కు సంబంధించిన ఫొటోలను పృథ్వీ షా మంగళవారం షేర్ చేశాడు. ‘‘నాకంటూ ఓ సొంత ప్రదేశం. అందుకోసం ఎంతగానో శ్రమించి ఇప్పుడు ఇలా ఇక్కడ అడుగుపెట్టడం ఎంతో ప్రత్యేకం. ఈ ప్లేస్ గురించి కలలగనడం.. ఇప్పుడు ఇక్కడ వాటిని నిజం చేసుకోవడం.. నాకంటూ సొంత ఇల్లు.. స్వర్గం లాంటిది! ఇక ముందు అంతా మంచే జరగాలి’’ అంటూ ఉద్వేగపూరిత నోట్ రాశాడు పృథ్వీ షా. ఈ ఫొటోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కాగా టీమిండియా ఓపెనర్‌గా అరంగేట్రంలోనే అదరగొట్టిన ముంబై బ్యాటర్ పృథ్వీ షా.. ఆ తర్వాత తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. అనంతరం దేశవాళీ క్రికెట్లో అదరగొట్టినా మళ్లీ సెలక్టర్ల పిలుపు అందుకోలేకపోయాడు. ఇక ఇటీవల గాయంతో సతమతమైన పృథ్వీ షా రంజీ బరిలో దిగి.. ముంబై ట్రోఫీ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ప్రస్తుతం ఐపీఎల్-2024 సీజన్‌తో ఈ ఓపెనింగ్ బ్యాటర్ బిజీగా ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పృథ్వీ షా.. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో కలిపి 119 పరుగులు సాధించాడు. కాగా ఢిల్లీ ఫ్రాంఛైజీ పృథ్వీ షా కోసం రూ. 8 కోట్లు చెల్లించింది. చదవండి: #Klaasen: గంటకు 140 కి.మీ వేగంతో బౌలింగ్.. అయినా మెరుపు స్టంపింగ్! వీడియో -
మాలీవుడ్‌లో దడ పుట్టిస్తున్న మిల్కీ బ్యూటీ
తమన్నా.. ఇది ఇప్పుడు పేరు కాదు. గ్లామర్‌కు బ్రాండ్. అదీ హైపర్ బ్రాండ్. ఎక్కడైనా, ఎప్పుడైనా తన ప్రత్యేకతను చాటుకోవాల్సిందే, వార్తల్లో మారుమోగాల్చిందే. దట్ ఇస్ మిల్కీ బ్యూటీ. ఇటీవల జైలర్ చిత్రంలో నువ్వు కావాలయ్యా పాటలో విజృంభించి అందాలను ప్రదర్శించిన తమన్నకు ఇప్పుడు క్రేజ్ మామూలుగా లేదు. కాగా ఇప్పటివరకు హిందీ, తెలుగు, తమిళం భాషల్లో నటిగా తన సత్తాను చాటుకున్న తమన్న తాజాగా తన పేరును మాలీవుడ్ కు విస్తరింపచేసుకుంది. అక్కడ పాదం మోపింది లేదో మాలీవుడ్ హీరోయిన్లకు దడ పుట్టించింది. నటుడు దిలీప్ కథానాయకుడుగా నటించిన బాంద్రా అనే చిత్రంతో తమన్నా కథానాయకిగా మలయాళం చిత్ర పరిశ్రమలోకి రంగప్రవేశం చేసింది. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ చిత్ర ప్రమోషన్ లో నటుడు దిలీప్ పేర్కొంటూ ఈ చిత్ర కథ పూర్తి అయిన తర్వాత ఇందులో ఇప్పటివరకు మలయాళంలో నటించని, తనతో జతకట్టని నటిని హీరోయిన్గా నటింపజేయాలని భావించారన్నారు. దీంతో చాలా గట్స్ కలిగిన ఈ పాత్రకు నటి తమన్నా అయితే బాగుంటుందని అనిపించిందన్నారు. దర్శకుడు అరుణ్ గోపీ ఎలాగో తమన్నాకు కథ వినిపించి ఆమె అనుమతి పొందారన్నారు. అయితే చిత్ర ప్రారంభోత్సవ పూజ వరకు ఆమె ఇందులో నటిస్తారనే నమ్మకం తనకు లేదన్నారు. మరో విషయం ఏమిటంటే ఇందులో తమన్నా కాకుండా మరో ముఖ్యపాత్ర ఉందని ఆ పాత్రలో నటింప చేయడానికి పలువురు నటీమణులను సంప్రదించగా, తమన్నా ఉంటే చిత్రంలో తాము కనిపించమని భావించి ఇందులో నటించడానికి నిరాకరించారన్నారు. ఇలా తొలి చిత్రంతోనే మిల్కీ బ్యూటీ మాలీవుడ్ హీరోయిన్ల గుండెల్లో దడ పుట్టించిందన్నమాట. అయితే నటి మమతా మోహన్ దాస్ ఆ చిత్రంలో మరో పాత్ర నటించడానికి ధైర్యంగా ముందుకు వచ్చిందట. : -
కోట్లు ఖరీదు చేసే అపార్ట్మెంట్ కొన్న ప్రీతి జింటా!
ప్రముఖ నటి 'ప్రీతి జింటా' (Preity Zinta) ముంబైలోని బాంద్రాలో ఓ ఖరీదైన అపార్ట్మెంట్ కొనుగోలు చేసినట్లు 'రియల్టీ ప్లాట్‌ఫామ్ ఇండెక్స్‌టాప్.కామ్' ద్వారా తెలిసింది. ఈ అపార్ట్మెంట్ ధర ఎంత? ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసారనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రీతి జింటా ముంబైలోని పాష్ బాంద్రాలో సుమారు 1,474 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన అపార్ట్‌మెంట్‌ను రూ. 17.01 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అక్టోబర్ 23న జరిగినట్లు తెలుస్తోంది. కీస్టోన్ రియల్టర్స్ లిమిటెడ్ దీనిని విక్రయించినట్లు, దీని కోసం నటి రూ. 85.07 లక్షల స్టాంప్ డ్యూటీని చెల్లించినట్లు సమాచారం. ప్రీతి జింటా మొత్తం ఆస్తుల విలువ ప్రేమంటే ఇదేరా, రాజకుమారుడు వంటి తెలుగు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మదిదోచిన ఈ సొట్టబుగ్గల సుందరి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఈమె మొత్తం ఆస్తుల విలువ 15 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ. 110 కోట్లు. ముంబై రియల్ ఎస్టేట్ ముంబై రియల్ ఎస్టేట్ రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు ఇక్కడ స్థలాలను కొనుగోలు చేశారు. ఇటీవల బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి, అతని భార్య షబానా బాజ్‌పేయి ముంబైలోని ఓషివారా ప్రాంతంలో రూ. 32.94 కోట్లతో 7,620 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాలో నాలుగు ఆఫిస్ యూనిట్లను కొనుగోలు చేశారు. ఇదీ చదవండి: బుర్జ్ ఖలీఫాను మించి.. నిర్మాణ సామగ్రి ఉత్పత్తి గురించి ఆసక్తికర విషయాలు! సినీ నటులు అమితాబ్ బచ్చన్ , కార్తీక్ ఆర్యన్ గతంలో ముంబై, దాని పరిసర ప్రాంతాలలో స్థలాలను కొనుగోలు చేశారు. ఎక్కువ మంది నివాస స్థలాల కంటే ఎక్కువ అద్దె రాబడి కోసం కమర్షియల్ ఆస్తుల మీద పెట్టుబడులు పెడుతున్నారు. -
ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన దబాంగ్ బ్యూటీ.. ఎన్ని కోట్లంటే?
దబాంగ్ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. తొలి చిత్రంతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా గారాల పట్టిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ దహాద్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించింది. సోనాక్షికి ఇది తొలి వెబ్ సిరీస్. ఇందులో అంజలి భాటి అనే పోలీసు పాత్రలో కనిపించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. తాజాగా ఈ దబాంగ్ బ్యూటీకి సంబంధించిన ఓ వార్త బీటౌన్‌లో వినిపిస్తోంది. (ఇది చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ మృతి!) సోనాక్షి సిన్హా ముంబైలోని ఖరీదైన ప్రాంతంలో ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. బాంద్రా ప్రాంతంలో ఓ లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతం సముద్ర పక్కనే ఉండడంతో సినీ ప్రముఖులు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. సోనాక్షి అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేయడానికి దాదాపు రూ. 11 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. బాంద్రాలోని ఆరియాట్ భవనంలో ఓ లగ్జరీ ఫ్లాట్ కోసం రూ.55 లక్షల విలువైన స్టాంప్ డ్యూటీని కూడా చెల్లించింది. ఈ ఏడాది ఆగస్టులో రిజిస్ట్రేషన్ జరిగినట్లు తెలుస్తోంది. అపార్ట్మెంట్ సౌకర్యాలు అపార్ట్మెంట్లో నాలుగు కార్లకు పార్కింగ్ సౌకర్యం, లాబీతో పాటు ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ కూడా ఉంది. 2020లో కూడా రూ. 14 కోట్లకు బాంద్రాలో విలాసవంతమైన ఓ ఫ్లాట్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సోనాక్షి రాబోయే సినిమాలు సోనాక్షి చివరిసారిగా విజయ్ వర్మ, గుల్షన్ దేవయ్య కలిసి నటించిన వెబ్ సిరీస్ దహాద్లో కనిపించింది. ఈ సిరీస్ ద్వారా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ది బుక్ ఆఫ్ డార్క్‌నెస్‌లో నటించనుంది. దీనికి ఆమె సోదరుడు కుష్ సిన్హా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్ హీరామండిలో సోనాక్షి కూడా కీలక పాత్రలో కనిపించనుంది. View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) -
అమ్మానాన్నల విడాకులు.. డిప్రెషన్‌కి వెళ్లాను: అమీర్ ఖాన్ కూతురు
మానసిక అనారోగ్యం వెంటనే తెలియదు. తమకు మానసిక అనారోగ్యం ఉంది అని చాలామంది తామే అంగీకరించరు. కుటుంబ సభ్యులు గమనించినా నామోషి వల్ల వైద్యుని దగ్గరకు తీసుకెళ్లరు. ‘వైద్యులే ఇంటింటికి వెళ్లి చెక్ చేస్తే చాలా సమస్యలు తెలుస్తాయి’ అంటుంది ఇరా ఖాన్. ఆమిర్ ఖాన్ కూతురైన ఇరా ఖాన్ మానసిక సమస్యలతో బాధ పడుతూ తనలా బాధ పడేవారి కోసం ‘అగత్సు ఫౌండేషన్’ స్థాపించి మానసిక ఆరోగ్య ప్రాముఖ్యతను ప్రచారం చేస్తోంది. బాంద్రాలోని పాలీ విలేజ్‌లో ఉంటుంది రెండంతస్తుల అగత్సు ఫౌండేషన్. ముంబైలో ముఖ్యంగా బాంద్రాలో ఉన్న మానసిక సమస్యల బాధితులు అక్కడికి వచ్చి సహాయం పొందవచ్చు. చుట్టుపక్కల బస్తీల్లో ఉన్నవారు కూడా వచ్చి అందులోని కమ్యూనిటీ సెంటర్లో వైద్య సహాయం పొందవచ్చు. నిజానికి మానసిక వైద్యం, కౌన్సిలింగ్, థెరపీ కొంచెం ఖరీదుతో కూడినవి. కాని ఇక్కడ 50 రూపాయల నుంచి 750 రూపాయల లోపు ఎంతైనా ఫీజు కట్టవచ్చు. ఇక్కడ నలుగురు సైకియాట్రిస్ట్‌లు ఉంటారు. వైద్యసూచనలు చేస్తారు. దీనికి తోడు నిర్ణీత రోజులలో బాంద్రాలో డోర్ టు డోర్ తిరిగి ఇళ్లల్లో ఉన్నవాళ్ల మానసిక సమస్యలను తెలుసుకుని వైద్య సహాయం ఎంత అవసరమో చెబుతారు. ఈ పనులన్నీ మంచి ఫలితాలను ఇస్తున్నాయి. అగత్సు ఫౌండేషన్ స్థాపించి ఈ పనంతా చేస్తున్న వ్యక్తి ఇరా ఖాన్. ఆమిర్ ఖాన్– రీనా దత్తా (మొదటి భార్య)ల కుమార్తె. ‘శరీరానికే కాదు.. మనసుకూ గాయాలవుతాయి. ఆ గాయాల వల్ల మనసు ప్రభావితం అవుతుంది. దానికి సరైన వైద్య సహాయం అందాలి’ అంటుంది ఇరా ఖాన్. స్వయంగా బాధితురాలు ‘మా కుటుంబంలో మానసిక సమస్యలు ఉన్నాయి. నా మానసిక సమస్యకు అనువంశికత కొంత కారణం అనుకుంటాను. నాకు 12వ ఏట స్కూల్లో ఉన్నప్పటి నుంచే డిప్రెషన్ సూచనలు కనిపించాయి. అయితే గుర్తించలేదు. ఇంటర్ తర్వాత నెదర్లాండ్స్‌లో లిబరల్ ఆర్ట్స్ చదవడానికి వెళ్లినప్పుడు నేను తీవ్ర డిప్రెషన్‌తో బాధ పడ్డాను. రోజంతా ఏడుస్తూ... నిద్రపోతూ ఉండేదాన్ని. నా డిప్రెషన్‌కు నా తల్లిదండ్రుల విడాకులు వేసిన ప్రభావం కూడా కారణం కావచ్చు. అక్కడ నేను చదువు డిస్కంటిన్యూ చేసి ఇండియా వచ్చి ఒక సంవత్సరం బ్రేక్ తీసుకున్నాను. మళ్లీ వెళ్లి జాయిన్ అయినా చదవలేకపోయాను. 2018లో చదువు మానేసి ఇండియా వచ్చేశాను. ఇక్కడకు వచ్చాక నా బాధ లోకానికి చెప్పాలనిపించింది. 2019లో మొదటిసారి నా డిప్రెషన్ గురించి చెప్పాను. ఇందుకు నా తల్లిదండ్రులు అడ్డు చెప్పలేదు. నాకు వారెంతో సపోర్ట్‌గా నిలిచారు. అంతేకాదు మానసిక ఆరోగ్యం విషయంలో చాలా మంది చూపే నిర్లక్ష్యానికి ముగింపు పలికే చైతన్యం కోసం పని చేయాలంటే అందుకూ సపోర్ట్ చేశారు. అలా ఈ అగత్సును మొదలెట్టాను’ అని తెలిపింది ఇరా ఖాన్. మానసిక శుభ్రత ‘మనందరికీ శారీరక శుభ్రత తెలుసు. అలాగే మానసిక శుభ్రత కూడా ఉండాలి. భావోద్వేగాల శుభ్రత ఉండాలి. నా విషయమే చూడండి... డబ్బుంది.. తల్లిదండ్రుల సపోర్ట్ ఉంది... మంచి వైద్య సహాయం ఉంది... అయినా సరే డిప్రెషన్ నన్ను చావగొట్టింది. అలాంటిది పై మూడింటిలో ఏది లేకపోయినా అలాంటి వారు ఎంత బాధ పడుతుంటారో అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ పరంగా, ప్రయివేటుగానూ ప్రజల మానసిక ఆరోగ్యం గురించి చేయవలసిన పని చాలా ఉంది. యాంగ్జయిటీ, డిప్రెషన్ వంటి వాటిని మనసును శుభ్రం చేసుకోవడం వల్ల తొలగించుకోవాలి. ఇందుకు చేయవలసిన పనులతో పాటు మందులు కూడా తీసుకోవాల్సి రావచ్చు. మేం ఏం చేస్తామంటే ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నవారిని అలాంటి సమస్యతోనే బాధ పడుతున్నవారితో కలుపుతాము. వారంతా ఒక కమ్యూనిటీ అవుతారు. ఒకరికొకరం సాయంగా దీనిపై పోరాడవచ్చనే ధైర్యం తెచ్చుకుంటారు. ఆ విధంగా మేము పని చేస్తాం’ అంటుంది ఇరా ఖాన్. గమనించుకోవాలి ‘మానసిక సమస్యలు పునరావృత్తం అవుతుంటాయి. మీరు ఏం చేస్తే సమస్య అధికమవుతుంది, ఏం చేయకపోతే సమస్య తక్కువ అవుతుంది గమనించుకోవాలి. ఎన్ని రోజులకొకమారు సమస్య కనపడుతూ ఉంది... ఎన్నాళ్లకు దూరమవుతుంది ఇదంతా గమనించుకుని మనకు మనమే సమస్య పై పోరాడాలి. మంచి నిద్ర అలజడి తగ్గిస్తుంది. నిద్ర సరిగా పట్టేలా చూసుకోవాలి’ అంటుంది ఇరా ఖాన్. మానసిక సమస్యలను దాచుకోవద్దని, అవి శారీరక సమస్యల్లాంటివేనని చెబుతోంది ఇరా ఖాన్. ‘సెలబ్రిటీ కూతురినై ఉండి నేను బయటకు చెప్పినప్పుడు మీరు కూడా చెప్పండి. సహాయం పొందండి’ అని కోరుతోందామె. -
‘చికెన్ కర్రీలో ఎలుక’ ఎపిసోడ్లో ట్విస్ట్!
రెస్టారెంట్లో చికెన్ కర్రీలో చచ్చిన ఎలుక కనిపించడం.. ఆ వార్త ప్రముఖంగా వార్తల్లో, సోషల్ మీడియా ద్వారా వైరల్ అవ్వడం తెలిసిందే. అయితే.. ముంబై బాంద్రాలో జరిగిన ఈ ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. కస్టమర్లు ఫుల్‌గా తాగొచ్చి అల్లరి చేయడమే కాకుండా.. తప్పుడు కేసు బనాయించారని రెస్టారెంట్ మేనేజర్ వాపోతున్నాడు. ఫిర్యాదుదారుల కథనం ప్రకారం.. అనురాగ్ సింగ్ అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి ఆదివారం రాత్రి బాంద్రా వెస్ట్ పరిధిలోని పాలి నాకాలోని పాపా పంచావో దా దాబా రెస్టారెంట్‌కు భోజనం చేసేందుకు వెళ్లాడు. అక్కడ చికెన్, బ్రెడ్‌తో మటన్ తాలి ఆర్డర్ చేశారు. ఫుడ్ తింటుండగా మాంసం ముక్క రుచిలో తేడా అనిపించడంతో పరీక్షించి చూడగా అందులో చనిపోయిన చిన్న ఎలుక కనిపించింది. దీనిపై కంగుతిన్న కస్టమర్ రెస్టారెంట్ మేనేజర్‌ను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదు. మేనేజర్ తీరుపై ఆగ్రహంతో బాంద్రా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా బాంద్రా పోలీసులు రెస్టారెంట్ మేనేజర్, చెఫ్‌తో పాటు సర్వర్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. తాగి వచ్చి డ్రామాలు గత 22 ఏళ్లుగా రెస్టారెంట్ నడుస్తోంది. ఇంతవరకు ఇలాంటివి జరగలేదు. మద్యం మత్తులో ఆ ఇద్దరూ మా రెస్టారెంట్‌కు వచ్చారు. వచ్చాక కూడా తాగుతూ కనిపించారు. మందు కోసం డిమాండ్ చేశారు. మాది కేవలం ఫుడ్ డైనింగ్ మాత్రమని స్పష్టం చేసినా వినిపించుకోలేదు. సర్వర్‌తో గొడవ పడ్డారు. చివరకు చచ్చిన ఎలుకతో డ్రామాకు దిగారు. డబ్బు ఇస్తేనే సైలెంట్‌గా వెళ్లిపోతామని చెప్పారు. మేం ఒప్పుకోకపోవడంతో ఇంత రాద్ధాంతం చేశారు. సీసీటీవీ ఫుటేజీ గమనిస్తే.. వాస్తవాలు బయటపడతాయి అని మేనేజర్, సర్వర్లు చెబుతున్నారు. బెయిల్‌పై విడుదల అయితే రెస్టారెంట్ పేరును దెబ్బ తీయడంతోపాటు డబ్బు వసూలు చేసే ఉద్దేశంతోనే రెస్టారెంట్‌పై అపవాదు మోపారని నిందితుల తరపు న్యాయవాది చెబుతున్నారు. మంగళవారం నిందితులు ముగ్గురినీ బెయిల్‌పై విడుదల చేశారు పోలీసులు. కలుషిత ఆహారం నేరం కింద కేసు నమోదు అయ్యిందని.. ఎలుక బయటపడిందిగా చెబుతున్న ప్లేట్‌ను ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు పంపామని.. నివేదిక వస్తే అసలు విషయం బయటపడుతుందని బాంద్రా పోలీస్ అధికారి చెబుతున్నారు. @MumbaiPolice Rat found in our gravy at #papaPanchodadhaba near Pali naka Bandra West . No manager or owner is ready to listen . We called police and 100 as well . No Help yet . @mumbaimirror @TOIMumbai pic.twitter.com/YRJ4NW0Wyk — Stay_Raw (@AMINKHANNIAZI) August 13, 2023 చదవండి: సింగిల్‌గా ఉంటే.. చిరుతైనా గమ్మునుండాల్సిందే!లేదంటే.. -
ముంబయిలో ఫ్లాట్.. నాలుగు రోజులు నరకం చూశా: హీరోయిన్
రాక్ స్టార్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ భామ నర్గీస్ ఫక్రీ. ఆ తర్వాత మద్రాస్ కేఫ్, హౌస్‌ఫుల్, మైన్ తేరా హీరో, అజహర్ లాంటి చిత్రాల్లో నటించింది. తెలుగులోనూ పవన్ కల్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంతో ఎంట్రీ ఇస్తోంది. అంతే కాకుండా ఓటీటీలో కూడా అరంగేట్రం చేసేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం దిల్లీ ఉంటోన్న ముద్దుగుమ్మ కెరీర్ ప్రారంభంలో ఎదురైన అనుభవాలను పంచకుంది. తాజా ఇంటర్వ్యూకు హాజరైన భామ ముంబయిలో తనకు ఎదురైన భయంకరమైన రోజులను గుర్తు చేసుకుంది. (ఇది చదవండి: హీరోయిన్‌కు అసభ్యకరంగా విష్ చేసిన హీరో.. ఏకంగా ఆ వీడియోతో! ) నర్గీస్ ఫక్రీ మాట్లాడుతూ..'ముంబయిలోని బాంద్రాలో ఓ అపార్ట్మెంట్లో నివసించేదాన్ని. మేముండే ప్రాంతం హిల్ రోడ్. మా అపార్ట్‌మెంట్‌కు సమీపంలో శ్మశానవాటిక ఉంది. అక్కడ ఉన్నప్పుడు నాకు భయంకరమైన కలలు వచ్చేవి. భయంతో తెల్లవారుజామున 3 గంటలకే లేచేదాన్ని. కలలో ఓ వ్యక్తి దెయ్యంలా కనిపిస్తూ.. నన్ను స్మశానవాటికకు తీసుకువెళతాడు. అక్కడ తను స్మశానవాటికలో మనుషుల ఎముకలు తీసి నన్ను తినమని చెప్పేవాడు. అలా వరుసగా నాలుగు రోజులు అదే కల వచ్చిందని. దీంతో భయంతో వణికిపోయా.' తెలిపింది. నర్గీస్ ఫక్రీ మాట్లాడుతూ.. 'అలా నాలుగు రోజులు పీడకలలు రావడంతో నాకు భయం వేసి వెంటనే ఆ ఫ్లాట్ ఖాళీ చేసి దిల్లీకి వచ్చేశా. అంతే కాకుండా నా రూమ్ ఖాళీ చేసేటప్పుడు ఆరు చనిపోయిన పక్షి పిల్లలు కనిపించాయని ప్యాకర్స్ నాతో చెప్పారు. అది నాకు చాలా విచిత్రంగా అనిపించింది. అసలు అక్కడ ఏమి జరుగుతుందో నాకర్థం కాలేదు.' అంటూ ఆ భయానకమైన రోజుల గురించి చెప్పుకొచ్చింది. అందుకే ఆ ఇంటిని వదిలి దిల్లీకి వెళ్లానని నర్గీస్ ఫక్రీ తెలిపారు. న్యూయార్క్‌లో జన్మించిన బాలీవుడ్ భామ.. యూరప్, ఆగ్నేయాసియాలో పెరిగింది. బాలీవుడ్ చిత్రాలలో నటించడానికి ముందు మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. (ఇది చదవండి: ప్రతి సినిమా ఓ పాఠం నేర్పించింది: రాజమౌళి ఎమోషనల్ ట్వీట్ ) -
'అందుకే ఇలా పెళ్లి చేసుకున్నాం'.. రివీల్ చేసిన ఆలియా
బాలీవుడ్ ప్రేమజంట ఆలియాభట్-రణ్‌బీర్ కపూర్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ముంబై, బాంద్రాలోని వాస్తు అపార్ట్మెంట్లో వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. అయితే వివాహాం అనంతరం తొలి ఫోటోను ఆలియా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. 'మా కుటుంబం, స్నేహితుల సమక్షంలో మాకెంతో ఇష్టమైన ప్రదేశంలోనే మేం పెళ్లి చేసుకున్నాం. గత ఐదేళ్లుగా మేము ఏ బాల్కనీలో అయితే ప్రేమించుకున్నామో అక్కడే మా పెళ్లి జరగడం సంతోషంగా ఉంది. ఇద్దరం కలిసి జంటగా మరెన్నో జ్ఞాపకాలను నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం' అంటూ ఆలియా ఆనందం వ్యక్తం చేసింది. నీతూ కపూర్, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, కరిష్మా కపూర్, కరణ్ జోహార్, అయాన్ ముఖర్జీ సహా తదితరులు పెళ్లింట సందడి చేశారు. కాగా ఆలియా షేర్ చేసిన పెళ్లి ఫోటోలు క్షణాల్లోనే వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt) -
భార్యభర్తలుగా ఆలియా-రణ్‌బీర్.. తొలిసారి మీడియా ముందుకు
ఆలియా భట్-రణ్‌బీర్ కపూర్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అత్యంత వైభవంగా వీరి పెళ్లి జరిగింది. బాంద్రాలోని వాస్తు అపార్ట్మెంట్ ఈ వేడుకకు వేదికైంది. ఇక పెళ్లి విషయంలో మొదటి నుంచి అత్యంత గోప్యత పాటించిన ఈ జంట ఎట్టకేలకు తమ పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. సోషల్ మీడియా వేదికగా వివాహానికి సంబంధించిన అత్యంత మధురమైన ఫోటోలను ఆలియా పంచుకుంది. ఇక అనంతరం తొలిసారిగా భార్యాభర్తలుగా ఆలియా-రణ్‌బీర్‌లు మీడియా ముందుకు వచ్చారు.ఎంతో ఆనందంతో ఫోటోలకు ఫోజులిచ్చారు. అనంతరం వెనుతిరిగే క్రమంలో రణ్‌బీర్ ఆలియాను స్వయంగా ఎత్తుకొని తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక ఆలియా-రణ్‌బీర్‌లను చూస్తుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపిస్తుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #WATCH | Actors Alia Bhatt and Ranbir Kapoor make their first public appearance after tying the knot in Mumbai, today. pic.twitter.com/yQP5bTDnvM — ANI (@ANI) April 14, 2022 -
ఇట్స్ అఫీషియల్: ఆలియా-రణ్‌బీర్‌ల పెళ్లయిపోయింది
బాలీవుడ్ లవ్‌బర్డ్స్ ఆలియా భట్-రణ్‌బీర్ కపూర్ల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. గురువారం(ఏప్రిల్14)న రణ్‌బీర్ కపూర్ ఇల్లు బాంద్రాలోని 'వాస్తు'లో గ్రాండ్‌గా వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుకకు కరీనా కపూర్, కరిష్మా కపూర్, కరణ్ జోహార్, ఆకాష్ అంబానీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాగా నూతన జంట రణ్‌బీర్-ఆలియాల పెళ్లి ఫోటోలు మాత్రం ఇంకా బయటికి రాలేదు. చాలా గోప్యంగా పెళ్లి వేడుకలకు ఏర్పాటు చేసిన కపూర్ అండ్ భట్ కుటుంబం వివాహం జరిగేంత వరకు ఒక్క ఫోటోని కూడా లీక్ కానివ్వలేదు. అయితే అభిమానుల కోసం మరికాసేపట్లో ఆలియా -రణ్‌బీర్‌లు సోషల్ మీడియా వేదికగా ఫోటోలను పోస్ట్ చేయనున్నారు. ఈ ఫోటోల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక కొత్తజంటకు బాలీవుడ్ సహా పలువురు ప్రముఖులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆలియా-రణ్‌బీర్‌ల పెళ్లి వేడుకకు సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. -
రామ్ చరణ్ చుట్టూ ఎగబడ్డ జనం.. వీడియో వైరల్
RRR: Ram Charan Mobbed By Mumbai Fans At Bandra: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. అల్లూరి సీతరామారాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌లు అద్భుత నటనతో సంచలన హిట్‌గా దూసుకుపోతోంది. ఈ సినిమాతో రామ్ చరణ్‌కు, ఎన్టీఆర్‌కు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం ఈ సక్సెస్‌ను రామ్ చరణ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో చాడాలన్న ఉద్దేశంతో ఆదివారం సాయంత్రం ముంబై బాంద్రాలోని గెయిటీ గెలాక్సీకి వెళ్లాడు రామ్ చరణ్. అక్కడి ప్రేక్షకులకు రామ్ చరణ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. అక్కడ రామ్ చరణ్‌ను చూసిన అభిమానులు ఆయన్ను చుట్టుముట్టారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ముంబై ప్రేక్షకుల ప్రేమాభిమానాలకు చెర్రీ ఎంతో సంతోషించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో రామ్ చరణ్ నలుపు రంగు దుస్తులు ధరించి అయ్యప్ప స్వామి మాల దీక్షలో కనిపించాడు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ ఇదివరకు బాలీవుడ్లో 'జంజీర్' అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ మూవీకి చాలా మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్లో అల్లూరి సీతరామరాజుగా చెర్రీ పలికించిన హావభావాలు, నటనకు ముంబై ఆడియెన్స్ ఫిదా అయినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఆర్ఆర్ఆర్ వారం రోజుల్లోనే రూ. 700 కోట్లను కొల్లగొట్టింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లకు మార్కుకు చేరువలో ఉందని అంచనా. ఈ సినిమాలో బాలీవుడ్ తారలు అజయ్ దేవగణ్, అలియా భట్, సముద్ర ఖని, ఒలివియా మోరిస్, అలిసన్ డూడీ, రే స్టీవెన్సన్ కీలక పాత్రల్లో మెప్పించారు. -
నేలమట్టం కానున్న దేశంలోనే మొదటి స్కై వాక్
సాక్షి, ముంబై: దేశంలోనే మొదటి స్కై వాక్‌గా గుర్తింపు పొందిన తూర్పు బాంద్రాలోని స్కై వాక్‌ను త్వరలో బీఎంసీ నేలమట్టం చేయనుంది. ఈ స్కైవాక్ ప్రమాదకరంగా మారడంతో దీన్ని తొలగించి కొత్తగా నిర్మించాలని బీఎంసీ భావించింది. ఈ పనులకు బీఎంసీ పరిపాలన విభాగం రూ.18.69 కోట్లు ఖర్చు చేయనుంది. రైలు దిగిన ప్రయాణికులు తోపులాటలు లేకుండా సులభంగా ప్రధాన రహదారిపైకి చేరుకునేందుకు 2007లో ఎంఎంఆర్డీయే స్కై వాక్‌లు నిర్మించాలనే ప్రతిపాదన తెరమీదకు తెచ్చింది. ఆ మేరకు దేశంలోనే మొదటి స్కైవాక్‌ను బాంద్రా రైల్వే స్టేషన్ నుంచి కళానగర్ వరకు నిర్మించింది. ప్రారంభంలో పాదచారులందరూ దీన్ని వినియోగించేవారు. 2015లో ఎంఎంఆర్డీయే ఈ స్కైవాక్‌ను బీఎంసీకి అప్పగించింది. కాల క్రమేనా బిచ్చగాళ్లు, మాదక ద్రవ్యాల బానిసలు, తాగుబోతులు, జూదగాళ్లు దానిపై తిష్టవేయడం మొదలుపెట్టారు. దీంతో ఆ స్కైవాక్పై పాదచారులకు ముఖ్యంగా మహిళలకు భద్రత లేకుండా పోయింది. మెల్లమెల్లగా దీని వినియోగం పూర్తిగా తగ్గిపోయింది. ఆ తరువాత బీఎంసీ ఈ స్కైవాక్‌ను బీజేటీఐ సంస్ధ ద్వారా తనఖీ చేయించగా ప్రమాద కరంగా ఉందని తేల్చిచెప్పింది. దీంతో 2019 నుం చి ఈ స్కైవాక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసింది. ఇప్పుడు దీన్ని నేలమట్టం చేసి కొత్తగా నిర్మించాలని బీఎంసీ భావిస్తోంది. దీనికోసం రూ.16.20 కోట్లతో కూడిన టెండర్లను ఆహ్వానించింది. అందు లో ఎన్ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ 15 శాతం తక్కువ ధరకు అంటే రూ.14.25 కోట్లతో పని చేయడానికి ముందుకు వచ్చింది. దీంతో వివిధ పన్నులతోసహా రూ.18.69 కోట్లు ఖర్చుకానున్నాయి. స్కైవాక్‌పైకి ఎక్కడానికి ఇదివరకు మెట్లు ఉండేవి. కానీ కొత్తగా నిర్మించనున్న ఈ స్కైవాక్ పైకి చేరుకోవడానికి మెట్లకు బదులుగా ఎస్కలేటర్‌ను నిర్మించను న్నారు. చట్టపరంగా అనుమతులన్నీ లభించగానే 18 నెలల్లో ఈ పనులు పూర్తి చేయనుంది. -
అద్దెకు సుశాంత్ సింగ్ నివాసం, ధర ఎంతంటే?
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి ఏడాది దాటిపోయింది. కానీ ఇప్పటికీ ఆయన అభిమానులు సుశాంత్ జ్ఞాపకాల్లోనే మునిగి తేలుతున్నారు. ఆయన బతికుండుంటే బాగుండేది అని నిత్యం తల్చుకుంటూనే ఉన్నారు. కాగా సుశాంత్ గతేడాది జూన్ 14న బాంద్రాలోని తన అపార్ట్మెంట్లో ఉరికి వేలాడిన విషయం తెలిసిందే. ఆయన మరణం తర్వాత నుంచి ఆ అపార్ట్మెంట్ మూగబోయింది. సుమారు ఏడాది కాలంగా ఆ భవనం ఖాళీగా ఉంటూ వస్తోంది. దీంతో తాజాగా దీన్ని అద్దెకిస్తామని ముందుకు వచ్చారు ఓనర్లు. ఇందుకుగానూ నెలవారీ అద్దె రూ.4 లక్షలుగా ఖరారు చేశారు. నిజానికి సుశాంత్ ఈ అపార్ట్‌మెంట్‌ను మూడేళ్ల పాటు లీజుకు తీసుకున్నాడు. 2019 నుంచి అక్కడే ఉంటున్న సుశాంత్ ఆ సమయంలో నెలకు రూ.4.5 లక్షలు చెల్లిస్తూ వచ్చాడు. అతడి లీజు గడువు వచ్చే ఏడాది డిసెంబర్‌తో ముగియనుంది. కానీ ఇంతలోనే అతడు ఆత్మహత్య చేసుకుని అభిమానులను శోకసంద్రంలో వదిలేశాడు. చదవండి: కంగనా తిట్టినా..చేయి చేసుకున్నా తట్టుకున్నా కానీ... -
తప్పిన పెను ప్రమాదం: అరగంటలో రెండుసార్లు
సాక్షి, ముంబై: బాంద్రా టర్మినస్ నుంచి రామ్‌నగర్ బయలుదేరిన ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు రెండు సార్లు విడిపోవడంతో రైళ్ల రాకపోలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పశ్చిమ రైల్వే మార్గంలోని బాంద్రా టర్మినస్ నుంచి గురువారం ఉదయం రామ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరింది. కొద్ది సేపటికే పశ్చిమ ఉప నగరంలోని జోగేశ్వరీ–రామ్ మందిర్ స్టేషన్ల మధ్య కప్లింగ్ ఊడిపోయి చివరి రెండు బోగీలు విడిపోయాయి. రంగంలోకి దిగిన సాంకేతిక సిబ్బంది గంటన్నరకుపైగా శ్రమించి వాటిని జోడించి రైలును పంపించారు. దీంతో ఫాస్ట్ మార్గంలో లోకల్ రైళ్లతో పాటు దూర ప్రాంత ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా నిలిచిపోయాయి. ఆ తర్వాత నగర శివారు ప్రాంతమైన నాయిగావ్–వసై రోడ్ స్టేషన్ల మధ్య మళ్లీ ఆ బోగీలు విడిపోయాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు ఆ బోగీలను మళ్లీ రైలుకు జోడించకూడదని నిర్ణయం తీసుకున్నారు. వాటి స్థానంలో మరో రెండు ఎల్‌హెచ్‌బీ బోగీలను తెప్పించి జోడించడం కుదరదని అధికారులు గుర్తించారు. దీంతో ఆ రెండు బోగీల్లో ఉన్న ప్రయాణికులను దింపి అదే రైలులో మిగతా బోగీల్లో సర్దుబాటు చేసి పంపించారు. అందుకు మరో 25 నిమిషాల సమయం పట్టింది. రెండుసార్లు జరిగిన ఈ ఘటనపై ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేయాలని పశ్చిమ రైల్వే నిర్ణయం తీసుకుంది. రైల్వే నియమాల ప్రకారం దూరం నుంచి వచ్చిన ప్రతీ రైలును యార్డులో నిర్వహణ పనులు పూర్తయిన తర్వాతే మళ్లీ పంపించడానికి సిద్ధం చేస్తారు. అంతా సవ్యంగా ఉంటేనే రైలును ప్లాట్ఫారం పైకి తెస్తారు. కానీ ఇలా బయలుదేరిన అర గంటలోపే రెండు సార్లు బోగీలు విడిపోవడం వర్క్ షాపు సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కొత్త టెక్నాలజీతో తయారైన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఇలా విడిపోవడం రైల్వే సిబ్బంది నిర్వహణ లోపం, నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. చదవండి: ఇంజన్లో ఇరుక్కున్న బైక్, ఆగిన రైలు ఆమె కోసం ఇల్లు అమ్మేసి... ఆటోలోనే తిండి, నిద్ర -
కంగనా ఆఫీస్ కూల్చివేత.. హైకోర్టు కీలక తీర్పు
సాక్షి, ముంబై : బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు భారీ ఊరట లభించింది. ముంబై బాంద్రాలోని కంగనా ఆఫీసును బ్రిహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) కూల్చివేయడాన్ని ముంబై హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. చట్ట ప్రకారం నిర్మించిన భవనాన్ని చట్ట విరుద్ధంగా కూల్చివేశారని బీఎంసీ అధికారుల తీరుపై న్యాయస్థానం మండిపడింది. పిటిషనర్‌కు జరిగిన నష్టాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. కాగా మహారాష్ట్ర ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలతో పాటు ముంబైను పీవోకేతో పోల్చుతు కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అనంతరం చోటుచేసుకున్న పరిణామాల ఫలితంగా బాంద్రాలోని కంగనా కార్యాలయం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించబడిందని ఆరోపిస్తూ బీఎంసీ అధికారులు దాన్ని కూల్చేందుకు సిద్ధమైయ్యారు. (కంగనాను అరెస్టు చేయకండి: హైకోర్టు) ఈ క్రమంలోనే బీఎంసీ అధికారులు నిర్ణయాన్నీ సవాలు చేస్తూ ఆమె ముంబై హైకోర్టును ఆశ్రయించగా.. కూల్చివేతపై న్యాయస్థానం స్టే విధించింది. ఈ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. కంగనా కార్యాలయాన్ని చట్ట విరుద్ధంగా కూల్చివేశారని తీర్పులో పేర్కొంది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వంపై పోరాడి న్యాయస్థానంలో కంగనా విజయం సాధించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
బాంద్రా డీసీపీ- రియా ఫోన్ కాల్స్
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తి కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కాల్ లిస్ట్‌కు సంబంధించి ఇప్పుడు ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. బాంద్రా డీజీపీ అభిషేక్ త్రిముఖితో రియా పలుమార్లు మాట్లాడినట్లు తెలుస్తోంది. రియాకు అభిషేక్ రెండు సార్లు కాల్ చేసినట్లు, రియా అభిషేక్‌కు రెండు పర్యాయాలు కాల్ చేసినట్లు ఉంది. కాల్స్‌తో పాటు ఒక మెసేజ్ కూడా చేశారు. దీనిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముంబై పోలీసులు మాత్రం రియాను మొదట కేసుకు సంబంధించి విచారించగా తాను షాక్‌లో ఉన్నానని ఇప్పుడు ఏం చెప్పలేనని అన్నట్టు తెలిపారు. మరో సారి కేసుకు సంబంధించి మెసేజ్ చేసినప్పుడు రియా స్పందించలేదని తెలిపారు. ఇక రియాతో పాటు సుశాంత్ ఆత్మహత్య విషయంలో నిందుతులుగా ఉన్న అందరితోనూ అభిషేక్ టచ్‌లో ఉన్నారని ముంబై పోలీసులు తెలిపారు. (దిశ మరణించిన రాత్రి ఏం జరిగింది?) ఇదిలా వుండగా బిహార్ ప్రభుత్వం అభ్యర్థన మేరకు ప్రభుత్వం కేసును సీబీఐకు అప్పగించిన సంగతి తెలిసిందే. రియా చక్రవర్తి మీద కేసు నమోదు చేసిన సీబీఐ ఆమెను విచారిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె కాల్ డేటాపై విచారణ మొదలు పెట్టారు. వీటిలో ఎక్కువ సార్లు రియా తన తమ్ముడుకి కాల్ చేసింది. తరువాత తన తండ్రితో ఎక్కువసార్లు మాట్లాడినట్టు తేలింది. చదవండి: రియా వచ్చిన కారు ఎవరిదో తెలుసా! -
బాంద్రా ఘటన: అతడికి బెయిల్
ముంబై: బాంద్రా రైల్వేస్టేషన్ వద్ద వలస కార్మికుల ఆందోళనకు కారణమైన వినయ్ దూబేకు బెయిల్ లభించింది. బాంద్రా కోర్టు మంగళవారం అతడికి రూ. 15వేల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. వలస కార్మికులను రెచ్చగొట్టి బాంద్రా రైల్వేస్టేషన్ వద్ద అలజడికి కారణమయ్యాడని వినయ్ దూబే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. లాక్డౌన్ ఎత్తేస్తున్నారన్న ప్రచారంతో ఈనెల 14న భారీ సంఖ్యలో వలస కార్మికులు బాంద్రా రైల్వేస్టేషన్‌కు తరలివచ్చారు. అయితే లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించగానే వారందరూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు లాఠిచార్జి చేసి వారిని చెదరగొట్టారు. తాము తిరిగి వెళ్లేందుకు అవసరమైన రవాణా సౌకర్యాలు కల్పించకపోతే కాలినడకన భారీ ర్యాలీగా ఉత్తర భారత్‌కు బయలుదేరేందుకు సిద్ధపడాలంటూ సోషల్ మీడియాలో వినయ్ దూబే ప్రచారం చేయడం వల్లే అమాయక కార్మికులు బాంద్రా రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారని తెలిపారు. దీంతో అతడిని అరెస్ట్ చేసి ఐపీసీ 117, 153ఏ, 188, 269, 270, 505(2), సెక్షన్ 3 కింద కేసులు నమోదు చేశారు. అతడికి విధించిన పోలీసు కస్టడీ నేటితో ముగిసింది. కాగా, వలసకూలీలను స్వస్థలాలకు పంపబోమని, వారి బాగోగులను ప్రభుత్వం చూసుకుంటుందని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ముంబై అలజడి; వినయ్ దూబే అరెస్ట్ -
‘చాలా తీవ్రమైన సంఘటన’
ముంబై: వలస కార్మికులను ఆదుకోవడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు. బాంద్రా రైల్వేస్టేషన్ వద్ద మంగళవారం వలస కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంపై స్పందిస్తూ.. ‘చాలా తీవ్రమైన సంఘటన’గా పేర్కొన్నారు. దీని నుంచి రాష్ట్ర ప్రభుత్వం పాఠాలు నేర్చుకుని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. వలస కార్మికుల వెతలకు కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అని వ్యాఖ్యానించిన మంత్రి ఆదిత్య ఠాక్రేకు పరోక్షంగా ఫడ్నవీస్ చురకలంటించారు. కోవిడ్-19పై చేస్తున్నది రాజకీయ పోరాటం కాదన్న విషయం తెలుసుకోవాలని సూచించారు. కరోనా మహమ్మారిపై సమరంలో సీరియస్‌నెస్ చూపాలని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వానికి హితవు పలికారు. కాగా, లాక్డౌన్ పొడిగింపు నేపథ్యంలో మంగళవారం వేలాది కార్మికులు బాంద్రా రైల్వే స్టేషన్ వద్ద ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి వినయ్ దూబే అనే వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వలస కార్మికులను రెచ్చగొట్టినందుకు అతడిపై కేసు నమోదు చేశారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు. ముంబై అలజడి; వినయ్ దూబే అరెస్ట్ -
లాక్డౌన్ ఉల్లంఘన; వినయ్ దూబే అరెస్ట్
ముంబై: వలస కార్మికుల ఆందోళనకు కారణమైన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్లో అసత్య ప్రచారం చేశారన్న ఆరోపణలతో వినయ్ దూబే అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘ఇంటికి వెళ్లిపోదాం’ అంటూ ఆన్లైన్లో ప్రచారం చేయడం వల్లే వలస కార్మికులు భారీ సంఖ్యలో బాంద్రా రైల్వేస్టేషన్‌కు తరలివచ్చినట్టు పోలీసులు తెలిపారు. ఫేస్బుక్, ట్విటర్ ద్వారా వలస కార్మికులను అతడు రెచ్చగొట్టినట్టు వెల్లడించారు. తనను తానుగా కార్మికుల నాయకుడిగా చెప్పుకుంటున్న వినయ్ దూబే.. వలస జీవులు స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించాలని డిమాండ్ చేస్తూ ఫేస్బుక్లో పోస్ట్‌లు పెట్టాడని చెప్పారు. వలస కార్మికులు తిరిగి వెళ్లేందుకు సరిపడా రవాణా సౌకర్యాలు కల్పించకపోతే భారీ ర్యాలీగా ఉత్తర భారత్‌కు కాలినడకన బయలుదేరతామని ఫేస్బుక్ వీడియోలో అతడు హెచ్చరించాడు. అతడి మాటలు నమ్మి అమాయక కార్మికులు మంగళవారం బాంద్రా రైల్వేస్టేషన్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగారని పోలీసులు వివరించారు. వినయ్ దూబేపై ఐపీసీ 117, 153ఏ, 188, 269, 270, 505(2), సెక్షన్ 3 కింద కేసులు నమోదు చేశారు. అతడిని కోర్టులో హాజరుపరచగా ఈ నెల 21 వరకు పోలీసు కస్టడీ విధించింది. లాక్డౌన్ నేపథ్యంలో ఆంక్షలు ఉల్లఘించారన్న కారణంతో 1000 మందిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీఎం ఉద్ధవ్ వార్నింగ్ లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు. వలస కార్మికులను తప్పుదారి పట్టించి బాంద్రా రైల్వేస్టేషన్‌కు తీసుకొచ్చారని తెలిపారు. ఏప్రిల్ 14 తర్వాత రైళ్లు నడుస్తాయని తప్పుడు ప్రచారం చేయడంతో వారందరూ బాంద్రా రైల్వేస్టేషన్ వచ్చారని చెప్పారు. వలస కార్మికులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, లాక్డౌన్ ముగిసిన తర్వాత వారందరికీ స్వస్థలాలకు వెళ్లే ఏర్పాటు చేస్తామని హామీయిచ్చారు. లాక్డౌన్: ఉండలేం.. ఊరెళ్లిపోతాం! -
బాంద్రాలో వలస కార్మికుల ఆందోళన
-
లాక్‌డౌన్‌పై నిరసన.. రోడ్లపైకి వేలాది జనం!
ముంబై: లాక్డౌన్ పొడిగింపును నిరసిస్తూ ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ ప్రాంతంలో వేలాది వలస కార్మికులు భారీ ప్రదర్శనకు యత్నించారు. లాక్డౌన్ నిబంధనలు సామాజిక దూరం సూచనల్ని పక్కనబెట్టి మంగళవారం మధ్యాహ్నం గుంపులుగా రోడ్లపైకొచ్చారు. అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలెవరూ రోడ్లపైకి రావొద్దని, అక్కడ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించారు. వారి మాటల్ని నిరసనకారులు లెక్కచేయకపోడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. దీంతో ఎక్కడివారక్కడ పరుగులు పెట్టారు. ఈ వీడియో సంచలనమైంది. (చదవండి: క్వారంటైన్ సెంటర్‌గా మార్చొద్దంటూ దాడి!) కాగా, దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేటి ఉదయం ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా కట్టడికి లాక్డౌన్ ఒక్కటే సరైన నిర్ణయమని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా కేసులు లేని ప్రాంతాల్లో ఏప్రిల్ 20 నుంచి లాక్డౌన్ అమల్లో కొన్ని సడలింపులు ఉంటాయని తెలిపారు. అయితే, రోజూ కూలీ చేసుకుని బతికే తాము తిండిలేక చస్తున్నామని వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇళ్లకు వెళ్లేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. ఇక మంగళవారం సాయంత్రం నాటికి కేంద్ర ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం.. దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 10,815 కు చేరగా.. 1189 మంది కోలుకున్నారు. 353 మరణాలు సంభవించాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 9272గా ఉంది. 2337 కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. కేవలం ముంబై నగరంలోనే 1500 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌తో 160 మంది మరణించగా.. 229 మంది కోలుకున్నారు. (వైరల్: సీతాపహరణం చూస్తున్న ‘రావణుడు’!) -
ముంబై బాంద్రా రైల్వేస్టేషన్ ప్రాంతంలో లాక్‌డౌన్‌పై నిరసన
-
నన్నెందుకు నిందిస్తున్నారు: నటుడి భార్య
ముంబై: తన భర్త ఆత్మహత్యకు తనను బాధ్యురాలిని చేయడం భావ్యం కాదని నటుడు కుశాల్ పంజాబీ భార్య అడ్రే డోలెన్ అన్నారు. కుశాల్‌తో తనకు అభిప్రాయ భేదాలు తలెత్తిన మాట వాస్తవేమనని... అయితే తన కారణంగా అతడు చనిపోలేదని పేర్కొన్నారు. బాలీవుడ్ నటుడు కుశాల్ పంజాబీ బాంద్రాలోని తన ఇంట్లో ఉరి వేసుకున్న విషయం తెలిసిందే. తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ రాసిన కుశాల్.. తన ఆస్తిని తల్లిదండ్రులు, తన కొడుకు కియాన్‌కు సమానంగా పంచాలని లేఖలో కోరాడు. అయితే కుశాల్ తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడి మృతికి కోడలి వేధింపులే కారణమని ఆరోపించారు. కియాన్‌ను కుశాల్‌కు దూరం చేసిందని.. తరచూ డబ్బులు ఇవ్వాలంటూ వేధించినందు వల్లే కుశాల్ బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలపై స్పందించిన డోలెన్... ‘మా వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయి. అయితే మేం విడిపోవాలని అనుకోలేదు. కియాన్‌ను తన తండ్రి దగ్గరికి వెళ్లకుండా నేను ఏనాడు అడ్డుపడలేదు. నిజానికి కుశాల్‌కు బంధాలపై ఆసక్తి లేదు. నన్ను, నా కొడుకును ఏనాడు లెక్కచేయలేదు. ప్రస్తుతం నేను షాంఘై(చైనా)లో ఉద్యోగం చేస్తున్నాను. చెప్పాలంటే కుశాల్ ఖర్చులు కూడా నేనే భరిస్తున్నా. అపార్థాలు తొలగించుకునేందుకు తనను ఇక్కడకు రావాలని కోరాను. కుశాల్‌తో బంధాన్ని నిలబెట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశాను. కానీ ఇప్పుడు నాపై నిందలు వేస్తున్నారు. ఉద్యోగరీత్యా నేను షాంఘైలో ఉండటం కుశాల్‌కు ఇష్టం లేదు. లండన్‌కు షిఫ్ట్ అవుదామన్నాడు. కానీ జాబ్ వదులుకోవడం నాకు ఇష్టం లేదు. కొడుకు భవిష్యత్తు గురించి శ్రద్ధలేని కుశాల్‌ను నమ్మాలనుకోలేదు. నేను, కియాన్ క్రిస్మస్ సెలవుల కోసం ఫ్రాన్స్‌లో ఉన్నపుడు ఇలా జరిగింది’ అని వివరణ ఇచ్చారు. (‘నా చావుకు ఎవరూ కారణం కాదు’ ) కాగా ఫియర్ ఫాక్టర్, నౌటికా నావిగేటర్స్ ఛాలెంజ్, ఝలక్ దిఖ్లా జా తదితర రియాలిటీ షోల్లో పాల్గొన్న కుశాల్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఫర్హాన్ అక్తర్ లక్ష్యా, కరణ్ జోహార్ కాల్ సినిమాలతో వెండితెర మీద తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అతడికి 2015లో డోలెన్‌తో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమారుడు కియాన్ ఉన్నాడు. ఇక డిసెంబరు 26న కుశాల్ ఆత్మహత్యకు పాల్పడిన క్రమంలో విచారణకు హాజరుకావాలంటూ డోలెన్‌కు పోలీసులు నోటీసులు పంపించారు. -
ఆ నటుడిది ఆత్మహత్యే..!
ముంబై : నటుడు కుశాల్ పంజాబీ బలవన్మరణానికి పాల్పడ్డాడని ముంబై పోలీసులు తెలిపారు. అతడి మృతదేహం వద్ద సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. గురువారం అర్ధరాత్రి బాంద్రాలోని తన నివాసంలో అతడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. తన చావుకు ఎవరూ కారణం కాదని కుశాల్ లేఖలో పేర్కొన్నాడని తెలిపారు. అదే విధంగా తన ఆస్తిని తల్లిదండ్రులు, తన కుమారుడికి సమానంగా పంచాలని కోరాడు. కాగా కుశాల్ పంజాబీ హఠాన్మరణం చెందినట్లు తొలుత వార్తలు వచ్చాయి. కుశాల్ స్నేహితుడు, నటుడు కరణ్వీర్ బోహ్రా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సెలబ్రిటీలు అతడి మృతికి సంతాపం తెలిపారు. అయితే ప్రస్తుతం కుశాల్ ఆత్మహత్య విషయం తెలిసి వారంతా షాక్‌కు గురవుతున్నారు. (టీవీ నటుడి హఠాన్మరణం.. ) ఇక రియాలిటీ షో జోర్ కా జట్కాలో విజేతగా నిలిచిన కుశాల్ బుల్లితెర నటుడిగా గుర్తింపు పొందాడు. ఫియర్ ఫాక్టర్, నౌటికా నావిగేటర్స్ ఛాలెంజ్, ఝలక్ దిఖ్లా జా తదితర రియాలిటీ షోల్లో పాల్గొని అభిమానులను సంపాదించుకున్నాడు. ఫర్హాన్ అక్తర్ లక్ష్యా, కరణ్ జోహార్ కాల్ సినిమాలతో వెండితెర మీద తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అతడికి భార్య, కుమారుడు ఉన్నారు. కాగా కుశాల్ మృతిపై ప్రముఖ గాయకుడు బాబా సెహగల్ విచారం వ్యక్తం చేశాడు. ‘కుశాల్ లేడంటే నమ్మలేకపోతున్నాను. సవాళ్లను ఎదుర్కునేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. తను ఓ మంచి తండ్రి. నా తమ్ముడి వంటి నీ ఆత్మకు శాంతి చేకూరాలి కుశాల్’ అని ట్వీట్ చేశాడు. I just cannot come to the terms that Kushal is no more. Always ready to face challenges of all kinds and such an adorable father. He was a friend but more like a younger brother to me. RIP #KushalPunjabi pic.twitter.com/GZxdgp5t3A — Baba Sehgal (@OnlyBabaSehgal) December 27, 2019 -
54 సార్లు పొడిచి.. గొంతుకోసి స్టేషన్‌కు
బాంద్రా : ముంబయిలో దారుణం చోటు చేసుకుంది. తన ముందు పదే పదే ఆంగ్లంలో మాట్లాడి తనను అవమానించాడనే అక్కసుతో స్నేహితుడిని హత్య చేశాడు ఓ యువకుడు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 54 సార్లు కత్తితో పాశవికంగా పొడిచి చంపేశాడు. ఆ తర్వాత అతడి గొంతును చీల్చాడు. ఈ భయానక సంఘటన గత బుధవారం చోటు చేసుకున్నప్పటికీ నిందితుడు పోలీసులకు నేరుగా లొంగిపోయిన తర్వాతే తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మహ్మద్ అమిర్ అబ్దుల్ వహీద్ రహిన్ (21), మహ్మద్ అఫ్రాజ్ అలాం షేక్ (18) ఇద్దరు స్నేహితులు. అయితే, అఫ్రాజ్ పలుమార్లు రహిన్ ముందు ఆంగ్లంలో మాట్లాడుతూ హేళన చేశాడట. దాన్ని అవమానంగా భావించిన రహిన్ ఎలాగైనా అఫ్రాజ్‌ను హత్య చేయాలనుకున్నాడు. అందుకోసం వారం రోజులపాటు ఆలోచించి ప్లాన్ వేసుకున్నాడు. బుధవారం బయటకు వెళ్లి సరదాగా కూల్ డ్రింక్ తాగి వద్దామని తీసుకెళ్లాడు. అనంతరం తనతో తెచ్చుకున్న కత్తితో గొంతుకోసం చనిపోయాడని నిర్ధారించుకునే వరకు 54సార్లు కత్తితో పొడిచినట్లు పోలీసులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 1గంట ప్రాంతంలో స్టేషన్‌కు వెళ్లి రహిన్ లొంగిపోయాడు. -
హోలీ.. వికృత కేళి!
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో హోలీ పండుగ వికృత చేష్టలకు తెరతీసింది. దీంతో కొంత మంది గాయాలపాలయ్యారు. కొందరు ఆకతాయిలు వెళ్తున్న రైళ్లపై రంగు నింపిన వాటర్ బెలూన్లును విసురుతూ ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించారు. ములుండ్ సమీపంలోని లోకల్ రైలు మొదటి తరగతి మహిళల కోచ్ వద్ద పోలీసులు భద్రతను ఏర్పాటు చేసినప్పటికీ వారిపై వాటర్ బెలూన్లను విసిరారు. ట్రాక్ పక్కన నివసిస్తున్న కొందరు గ్రూప్‌లుగా ఏర్పడి ఈ దురాగతానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఇలాంటి ఘటనలు కుర్లా, సియోన్, బాంద్రాల్లోనూ చోటుచేసుకున్నాయని తెలిపారు. సాధారణ దుస్తులు ధరించి మఫ్టిలో తాము డ్యూటీ చేశామని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది తెలిపారు. ములుండ్ ప్రాంతాన్నే కొందరు టార్గెట్‌గా చేసుకొని ఈ పనికి పాల్పడ్డారని పేర్కొన్నారు. నిందితులను తాము గుర్తించామని, త్వరలో వారిని పట్టుకుంటామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పలువురికి గాయాలు.. హోలీ ఆడుతున్న ఆనందంలో పలువురు యువకులు గాయాలపాలయ్యారు. కుర్లా ప్రాంతంలో నివసిస్తున్న రామ్ దుబే (28) హోలీ ఆడుతూ గేట్ మధ్యలో వేలు ఇర్కుపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని సియోన్ ఆస్పత్రికి తరలించారు. వడాలకు చెందిన మరో వ్యక్తి వాటర్, రంగులు నింపిన బెలూన్లను కుక్కపై విసరడంతో అది అతనిపై దాడి చేసి గాయపరిచింది. వెంటనే అతన్ని కేఈఎం ఆస్పత్రికి తరలించారు. ఇలాంటివి 17 కేసులు నమోదయ్యాయని ఆ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 17 కేసుల్లో 12 కంటికి సంబంధించినవని తెలిపారు. మరోవైపు సియోన్ ఆస్పత్రిలో కూడా 20, నాయర్ ఆస్పత్రిలో 2 కేసులు నమోదైయ్యాయని పేర్కొన్నారు. హోలీ నింపిన విషాదం పుణే: హోలీ పండుగ ఓ కుటుంబంలో విషాదం నింపింది. హోలీ ఆడుతూ బస్సు నుంచి కింద పడి సతీశ్ కాంబ్లె (14) అనే విద్యార్థి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన ప్రకారం, కాంబ్లె కుటుంబం పుణేలోని లక్ష్మీ నారాయణ ప్రాంతంలో నివసిస్తున్నారు. మోజే హై స్కూల్లో సతీశ్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. శనివారం స్కూల్ అయిపోయాక బస్సులో ఇంటికి వస్తున్నాడు. ఆ క్రమంలో బస్సులో స్నేహితులతోపాటు సతీశ్ హోలీ ఆడుతున్నాడు. అందులో కొంత మంది సతీశ్‌పై వాటర్ బెలూన్లు విసిరారు. వాటిని తప్పించుకునే క్రమంలో ప్రమాదవశాత్తు బస్సు నుంచి కింద పడ్డాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
ముంబైలో భారీ అగ్నిప్రమాదం
-
ముంబైలో భారీ అగ్నిప్రమాదం
ముంబై: నగరంలో గురువారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలోని బెహ్రంపాడ మురికివాడల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. అగ్నిప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని 16 ఫైర్‌ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమీప ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పొగలు కమ్ముకొని అంధకారం ఆవహించింది. అయితే ఈ ప్రమాదంలో రైల్వే లైన్లకు, రైలు సర్వీసులకు ఎలాంటి అంతరాయం ఏర్పడలేదని అధికారులు తెలిపారు. -
ఐశ్వర్యరాయ్ పుట్టింట్లో భారీ అగ్నిప్రమాదం
ముంబై : బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ పుట్టింట్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బాంద్రాలోని లా మెర్ భవనంలో మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. ఎనిమిది అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపు చేశారు. ప్రమాదం చోటుచేసుకున్న ఈ భవనంలోని 12వ ఫ్లోర్లో ఐశ్వర్యరాయ్ తల్లి బ్రిందా రాయ్, 10వ ఫ్లోర్లో సచిన్ టెండ్కూలర్ అత్తామామలు నివాసముంటున్నారు. మంటలు వ్యాపించడంతో ఐశ్వర్యరాయ్ తల్లి, సచిన్ కుటుంబీకులు హుటాహుటిన అపార్ట్మెంట్ బయటికి పరుగులు తీశారు. ప్రమాదం జరిగినట్టు తెలుసుకున్న వెంటనే ఐశ్వర్యరాయ్, ఆమె భర్త అభిషేక్ బచ్చన్ హుటాహుటిన ఆ భవంతి వద్దకు వచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ముప్పు వాటిల్లలేదని బాంద్రా పోలీసు స్టేషన్ అసిస్టెంట్ పోలీసు ఇన్పెస్టర్ సవిత షిండె తెలిపారు. షార్ట్ సర్క్యూట్‌తో 13వ ఫ్లోర్లో ఈ అగ్నిప్రమాదం జరిగినట్టు పేర్కొన్నారు. ఐశ్వర్యరాయ్ పెళ్లి కాకముందు ఈ భవంతిలోనే నివాసం ఉండేవారు. అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకున్న అనంతరం, ప్రస్తుతం ఆమె కుటుంబం జూహులో నివాసముంటోంది. -
ఆ స్కూలులో తల్లిదండ్రులకూ డ్రెస్‌కోడ్
ముంబయి: సాధారణంగా పాఠశాలల్లో క్రమ శిక్షణ విద్యార్థులకు మాత్రమే ఉంటుంది. కానీ, ముంబయిలోని బాంద్రాలో గల ఓ పాఠశాల తల్లిదండ్రులకు కూడా క్రమశిక్షణ తాలూకు నియమ నిబంధనలు విధించింది. ముఖ్యంగా వారి డ్రెస్ కోడ్ విషయంలో నొక్కి చెప్పింది. విద్యార్థుల విషయంలో ప్రతి నెల పాఠశాలలో జరిగే తల్లిదండ్రుల సమావేశాలకు వారు తప్పకుండా హుందాతనంతో కూడిన, డిసెంట్ దుస్తులనే ధరించి వస్తానని హామీ ఇవ్వాలని, ఒక వేళ అలా రాకుంటే తదుపరి జరగబోవు పరిణామాలకు, పాఠశాల యాజమాన్యం తీసుకునే చర్యలకు బాధ్యత వహిస్తామని ముందుగా ఒప్పుకోవాలంటూ ఆ నిబంధనల్లో చేర్చింది. బాంద్రాలోని రిజ్వీ స్ప్రింగ్ఫీల్డ్ స్కూల్ ఈ నిబంధన పెట్టింది. గత నెల మార్చి 30న ప్రొగ్రెస్ కార్డులను పంపించిన పాఠశాల వాటిని తీసుకొని తల్లిదండ్రులు రావాలని అలా వచ్చే సమయంలో హుందాగా డ్రెస్‌లు ధరించాలని అందులో పేర్కొంది. అంతేకాకుండా ఒక వేళ మొబైల్ ఫోన్స్‌తో వస్తే వాటిని రిసెప్షన్లోనే అందజేయాలని, స్కూల్ ప్రాంగణంలో ఎలాంటి చెడు ప్రవర్తన చూపించరాదని, అడిగే ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పాలని, స్టాఫ్‌ను తిట్టడంగానీ, వారితో దురుసుగా ప్రవర్తించడంగానీ చేయరాదంటూ పలు నిబంధనలు పెట్టింది. అయితే, దీనిపై తీవ్ర నిరసన తెలిపిన తల్లిదండ్రులు అసలు తాము ఏ దుస్తులు వేసుకోవాలో వేసుకోకూడదో స్కూల్ చెప్పడమేమిటని నిలదీస్తున్నారు. మాకు అంత బాధ్యత లేదని అనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కుప్పకూలిన ఐదంతస్తుల భవనం
ముంబై: బాంద్రాలో గురువారం ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ముంబై తూర్పు బాంద్రాలోని బెహ్రాంపాడా మురికి వాడలో జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
అంతుచిక్కని రియల్ ఎస్టేట్ ధరల చిత్రం
అవలోకనం ప్రపంచంలోని చాలా ఇతర ప్రాంతాల్లోకంటే రవాణా, ఆహారం చాలా చౌకగా ఉండే మన నగరాల్లో ఆస్తుల ధరలు విపరీతంగా ఎక్కువ. ఎందుకు అనేదే అంతుచిక్కని ప్రశ్న. మన దేశంలో ఆదాయపు పన్ను చెల్లించకపోవడం చాలా ఎక్కువ. అయినాగానీ కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి దేశంలోని ప్రతి నగరంలోనూ ఈ ఆస్తులను కొంటున్న వ్యక్తులు ఎవరు అనేదాన్ని అది వివరించదు. ఇంత ఖరీదైన ఈ ఫ్లాట్లను ఎవరు కొంటున్నారు, ఎక్కడి నుంచి ఎలా వారింత డబ్బును సంపాదిస్తున్నారు? కొన్నేళ్ల క్రితం నేను ముంబైలో ఉండగా క్రితం రోజునే కొన్న నా కారును బాంద్రాలోని నా ఇంటి బయట నుంచి ఎవరో దొంగిలించారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి నేను పోలీసు స్టేషన్‌కు వెళ్లగా, సీనియర్ ఇన్స్పెక్టర్ను కలవమని చెప్పారు. ఆ ఇన్స్పెక్టర్ దాదాపు 50 ఏళ్లుండే లావాటి మనిషి . ఆయన తన డెస్క్వద్ద ఒక వార్తా పత్రికలోని వర్గీకృత ప్రకటనలను చూస్తూ సున్నాలు చుడుతున్నాడు. నా కారు దొంగతనానికి గురైన సంగతి చెప్పాక, ఏం చేస్తున్నారని నేను ఆయనను అడిగాను. త్వరలోనే తాను రిటైర్ కాబోతున్నానని, అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. భార్య ఇల్లు కొనమని ఒత్తిడి చేస్తోంది, తమకు అందుబాటులో ఉన్న కొన్ని ప్రకటనలకు ఆయన గుర్తులు పెడుతున్నారు. ఏమైనా దొరికాయా? అని అడిగాను. ఆయన నవ్వేస్తూ ‘‘నేను కొనగలిగేవి ఏవీ ఇక్కడ లేవు’’ అన్నాడు. భారత నగరాలకు సంబంధించిన విచిత్రమైన విషయాలలో ఒకటి ఆస్తుల విలువ అతి ఎక్కువగా ఉండటం. నేను తరచుగా ఆఫీసుకి సైకిల్‌పై వెళు తుంటాను. లేదా ఏ వాన వల్లనో సైకిల్‌పై వెళ్లలేకపోతే టాక్సీలో వెళతాను. ఆ ఆరు కిలోమీటర్ల దూరానికి ట్రాఫిక్‌ను బట్టి టాక్సీకి 85 నుంచి 100 రూపాయలు వరకు అవుతుంది. ప్రపంచంలోని ఏ పెద్ద నగరంలోనూ ఇంత తక్కువ ధరకు టాక్సీ దొరకడం అసాధ్యం. లండన్‌లో ఇదే దూరానికి రూ.1,200 అవుతుంది. న్యూయార్క్, టోక్యో, హెల్సెంకి, పారిస్‌ల విషయంలోనూ ఇది నిజం. దుబాయ్, షాంఘైలలో అతికొద్దిగా తక్కువ కావచ్చుగానీ, నేనిప్పుడు ఉంటున్న బెంగళూరు నగరంలోకంటే చౌక మాత్రం కాదు. ఆహారం విషయం లోనూ ఇదే పరిస్థితి. భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో రూ. 50లకు సమంజస మైనంత మంచి భోజనం దొరుకుతుంది. అయితే నేను పైన పేర్కొన్న నగరాల న్నిటిలోనూ అది అసాధ్యం. లండన్‌లో రూ.50 అంటే అర పౌండు లేదా న్యూయార్క్‌లో దాదాపు 70 సెంట్లు. అంటే చిల్లర మాత్రమే. అదే ఆస్తుల విలువకు వస్తే పరిస్థితి తలకిం దులవుతుంది. నేనుండే భవనానికి పక్కన ఉన్న కొత్త భవనంలో రెండు ఫ్లాట్లు అమ్మకానికి ఉన్నాయి, ధర రూ.7 కోట్లు చెబుతున్నారు. రెండు వందల గజాల దూరంలోని మరో భవనంలో కూడా రెండు ఫ్లాట్లు అమ్మకానికి ఉన్నాయి. వాటి ధర కూడా రూ. 5 కోట్లకుపైనే. బెంగళూరు విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో కనీసం రెండు డజన్ల ఆస్తుల అమ్మకం ప్రకటనల హోర్డింగులు ఉంటాయి. వాటిలో చాలా వరకు ధరలను పేర్కొంటాయి. ఏదీ రూ.4 కోట్లకు తక్కువ కాదు. ఇవన్నీ నగర శివార్లలోని ఆస్తులే. ప్రాథమికమైన, మధ్యతరగతి ఇళ్ల హోర్డింగులు కూడా కొన్నిసార్లు కన బడుతుంటాయి గానీ అవి కూడా చౌకేమీ కావు. నేను బాంద్రాలో ఉండేటప్పుడు అద్దె ఇళ్లలో ఉండేవాడిని. ఆ ప్రాంతాల్లో నేడు నెలకు అద్దె రూ. 1.5 లక్షల నుంచి, ఫ్లాట్ల ధరలు రూ. 7 కోట్ల నుంచి మొదల వుతాయి. అవేమీ అత్యధునాతనమైన భవనాలూ కావు, ప్రత్యేక సదుపాయాలూ ఉండవు... ప్రాథమికమైన రెండు పడక గదుల అపార్ట్మెంట్లే. ఆ ధరకు మీకు న్యూయార్క్, లండన్లలో నగరం మధ్యనే మంచి ఇల్లు దొరుకుతుంది. రూ. 7 కోట్లు అంటే 10 లక్షల డాలర్లు. ప్రపంచంలోని ఏ నగ రంలోనైనా చక్కటి నివాసం దొరుకుతుంది. మన రియల్ ఎస్టేట్ ఆస్తులను రూపాయి నిజమైన విలువలోకి మార్చి చూస్తే అవి మరింత ఖరీదైనవిగా ఉండటం నిజంగానే విచిత్రం. కొనుగోలుశక్తి సమతుల్యత ఆధారంగా చూస్తే మన ఒక రూపాయి 3 డాలర్లకంటే ఎక్కువ. అంటే ఒక రూపాయి విలువతో అమెరికాలో కొనగలిగేవాటికంటే మూడు రెట్లు భారత్‌లో కొనగలుగుతారు. అదే తర్కాన్ని అన్వయించి చూస్తే రూ.7 కోట్ల ఫ్లాటు ఇప్పుడు రూ.21 కోట్లవుతుంది. కాబట్టే నా రూ.100 టాక్సీ చార్జీ వాస్తవంగా న్యూయార్క్‌లోని రూ.300కు సమానం. కాబట్టి అది మరీ అంత తక్కువ అనిపించదు. అలాగే నా రూ.50 భోజనం రూ. 150 అవుతుంది. అదే తర్కంతో చూస్తే రూ.7 కోట్ల ఫ్లాటు ఇప్పుడు రూ.21 కోట్లవుతుంది. ప్రపంచంలోని చాలా ఇతర ప్రాంతాల్లోకంటే రవాణా, ఆహారం చాలా చౌకగా ఉండే మన నగరాల్లో ఆస్తుల ధరలు విపరీతంగా ఎక్కువ. ఎందుకు అనేదే ప్రశ్న. బ్రిటిష్‌వారు అద్భుతమైన కొన్ని నివాస ప్రాంతాలను నిర్మించి ఇచ్చారు అనేది దీనికి సులువుగా లభించే సమాధానం. ట్యూటియన్ ఢిల్లీ లేదా దక్షిణ ముంబైలో ఆస్తులు అంత ఎక్కువ ఖరీదైనవిగా ఉండటాన్ని అది వివరించవచ్చు. కానీ బెంగళూరులోని ఫ్లాట్లు ఇంత ఖరీదైనవిగా ఎందుకు ఉన్నాయనే విష యాన్ని మాత్రం వివరించలేదు. ఇంత ఖరీదైన ఈ ఫ్లాట్లను ఎవరు కొంటున్నారు, ఎక్కడి నుంచి ఎలా వారింత డబ్బును సంపాదిస్తున్నారు? అనేది మరో విషయం. 5,430 మంది భారతీయులు మాత్రమే రూ. 1 కోటికి మించిన ఆదాయపు పన్నును చెల్లి స్తున్నారు. మన దేశంలో ఆదాయపు పన్ను చెల్లించకపోవడం చాలా ఎక్కువని నాకు తెలుసు. అయినాగానీ కోట్లకు కోట్లు పెట్టి దేశంలోని ప్రతి నగరంలోనూ ఈ ఆస్తులను కొంటున్న వ్యక్తులు ఎవరు అనేదాన్ని అది వివరించదు. కొన్ని వందల మంది కార్పొరేట్ ఉద్యోగుల జీతాలు అత్యధికంగా ఉంటాయి. అలాంటి వారు ప్రధాన కంపెనీల సీఈఓలో లేదా ద్వితీయ, తృతీయ అత్యున్నత అధికారులో అయివుంటారు. అయినా అది, నా చుట్టూ కనిపిస్తున్న వేలాది ఫ్లాట్లు, వందలాది భవనాలను కొంటున్నవారెవరో వివరించలేదు. భారతదేశంలోని రియల్ ఎస్టేట్ ఆస్తుల ధరలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఒక ప్రాంతంలోనే విలువ సరితూగక పోవడం ఏమిటో ఎవరైనా వివరించే వారుంటే బాగుండని నేను చూస్తున్నాను. ఆకార్ పటేల్, వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
'సచిన్ ఇంటి ముందు నిరాహారదీక్ష చేస్తాం'
ముంబై: సెలెబ్రిటీలు అంబాసిడర్లుగా ఉన్న కంపెనీ లేదా సంస్థ ఉత్పత్తులు కొని మోసపోయామంటూ ఆయా సెలెబ్రిటీలపై వినియోగదారులు కేసులు వేసిన సంఘటనల గురించి విన్నాం. బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న కంపెనీ తనను మోసం చేసిందని తాజాగా పుణె వాసి వాపోతున్నాడు. ఈ విషయంలో సచిన్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18 నుంచి ముంబైలోని బాంద్రాలో గల సచిన్ నివాసం ముందు తన కుటుంబ సభ్యులతో కలసి నిరవధిక నిరాహారదీక్ష చేపడుతానని సందీప్ ఖుర్హడే అనే ల్యాబ్ టెక్నీషియన్ హెచ్చరించాడు. ఆయన చెప్పిన వివరాలిలా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ సంస్థ అమిత్ ఎంటర్ ప్రైజెస్‌కు సచిన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. పుణెలో పెద్దల ద్వారా సందీప్‌కు సంక్రమించిన భూమిని, ఆయన మామ శివాజీ పింజన్ సమ్మతితో నాలుగేళ్ల క్రితం అమిత్ ఎంటర్ ప్రైజెస్ కొనుగోలు చేసింది. దీని విలువ రెండు కోట్ల రూపాయలు కాగా, అప్పట్లో అమిత్ ఎంటర్ ప్రైజెస్ యాజమాన్యం సందీప్‌కు 20 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించింది. కాగా ఈ ఆస్తిలో శివాజీ వాటా కింద ఆయనకు కోటి 50 లక్షల రూపాయలు చెల్లించింది. ఈ నేపథ్యంలో సచిన్ అమిత్ ఎంటర్ ప్రైజెస్ యాజమాన్యంతో మాట్లాడి తనకు న్యాయం చేయాలని సందీప్ కోరుతున్నాడు. 'సచిన్ గురించి ఎంతో విన్నాం. ఆయన మానవతావాది, ఇతరులకు సాయం చేసే వ్యక్తి. బిల్డర్ నుంచి తమకు న్యాయం చేయాలని కోరుతూ సచిన్ ఇంటి ఎదుట దీక్ష చేపడుతాం' అని సందీప్ చెప్పాడు. బాంద్రా పోలీస్ స్టేషన్ ఏసీపీకి ఈ మేరకు లేఖ రాశారు. తమకు రక్షణ కల్పించాల్సిందిగా సందీప్ పోలీసులను కోరాడు. కాగా సందీప్ ఆరోపణలను అమిత్ ఎంటర్ప్రైజెస్ యాజమాన్యం కొట్టిపారేసింది. 'సందీప్ తల్లి రంజన ఆ ఆస్తిపై గల హక్కులను ఆమె తమ్ముడు శివాజీకికి బదలాయించింది. ఆమె తన భర్త సమక్షంలోనే ఈ మేరకు రిజిస్ట్రేషన్ చేయించింది. శివాజీ ఈ డీడ్ తమకు సమర్పించాడు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి సంబంధిత కాపీని తీసుకుని సరిచూసుకున్న తర్వాతే భూమి కొనుగోలు చేశాం. శివాజీ నుంచి ఈ భూమిని కోటి 50 లక్షల రూపాయలకు కొనుగోలు చేశాం. ఆయన కోరిక మేరకు రంజనకు 20 లక్షలు చెల్లించాం' అని అమిత్ ఎంటర్ప్రైజెస్ యజమానులు చెప్పారు. ప్రస్తుతం తమ సంస్థకు సచిన్‌తో సంబంధం లేదని వివరించారు. సచిన్ 2000 నుంచి 2014 వరకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారని తెలిపారు. -
ఆ ఇంట్లో నేనొక్కదాన్నే ఉంటా!
పరిణీతి చోప్రాకి ఎప్పట్నుంచో ఓ కల ఉంది. ఉదయం నిద్రలేవగానే సముద్రాన్ని చూడాలన్నదే ఆ కల. ఆ కల నెరవేర్చుకోవాలంటే ఏం చేయాలి? సముద్రం కనిపించేలా ఇల్లు కట్టుకోవాలి. పరిణీతి అదే పనిలో ఉన్నారు. ఈ విషయం గురించి ఆమె చెబుతూ -‘‘ఉదయాన్నే కళ్లు తెరవగానే సముద్రాన్ని చూడాలి. ఆ సాగరఘోష అనునిత్యం నా జీవితంలో భాగం అయిపోవాలి. సముద్రానికి ఆటుపోట్లు ఎలాగో, మన జీవితంలో కష్టసుఖాలు కూడా అలానే. నా అభిరుచికి తగ్గట్టుగా నా కలల గృహాన్ని తీర్చిదిద్దుకుంటున్నాను’’ అన్నారు. ముంబయ్‌లోని ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన బాంద్రాలో ఈ డ్రీమ్ హౌస్‌ని నిర్మించుకుంటున్నారామె. ఈ ఇంటి గురించి వివరంగా చెబుతూ - ‘‘పదేళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నా. మొత్తానికి నా పేరుతో బాంద్రాలో ఇల్లు కట్టుకుంటున్నా. ఇదంతా ఓ కలలా ఉంది. చిన్నతనం నుంచి నేను పుస్తకాల పురుగుని. అందుకే నా ఇల్లు ఏకంగా వెయ్యి పుస్తకాలతో నిండిపోవాలని నా ఆశ. పుస్తకాలన్నీ పెట్టుకోవడానికి ప్రత్యేకంగా ఫర్నీచర్ కొనుగోలు చేస్తున్నా. విషయం ఏంటంటే... ఈ ఇంట్లో నేనొక్కదాన్నే ఉండబోతున్నా. అందుకే, ఏ టైల్స్ వేయాలి? ఏ రంగులైతే బాగుంటాయి? లాంటివన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటున్నా’’ అని పరిణీతి తెలిపారు. -
బట్టలూడదీసి..ఊరేగిస్తానని మహిళపై ఎమ్మెల్యే ప్రతాపం!
ముంబై: ఓ మహిళపై దురుసుగా ప్రవర్తించి.. అనుచిత వ్యాఖ్యలు చేసిన శివసేన నేత, తూర్పు బాంద్రా ఎంఎల్ఏ ప్రకాశ్ బాలా సావంత్ పోలీసులు కేసు నమోదు చేశారు. బట్టలూడదీసి ఊరేగిస్తానని అనడమే కాకుండా మహిళపై దౌర్జన్యానికి దిగిన సంఘటన ముంబైలోని సబర్బన్ బాంద్రా లో చోటు చేసుకుంది. ఓ హౌసింగ్ సొసైటీ పునర్ నిర్మాణ వ్యవహారంలో చోటు చేసుకున్న గొడవ చోటు చేసుకుంది. నీ బట్టలూడదీసి ప్రతి ఒక్కరి ముందు ఊరేగిస్తాను అని అనడమే కాకుండా మహిళను చావబాదినట్టు ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో మహిళ చేసిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎమ్మెల్యేపై ఐపీసీ ప్రకారం సెక్షన్ 504, 506, 509 కేసుల్ని పెట్టారు. ఎమ్మెల్యేతోపాటు, బాధితురాలు ఒకే హౌసింగ్ సొసైటీలో ఉంటున్నారని.. రీ డెవలప్ మెంట్ విషయంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొందని బాంద్రా పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. -
ఖార్ రైల్వే స్టేషన్ @ 90
ముంబై: నగర ప్రజలకు విశేష సేవలందిస్తున్న ఖార్ రైల్వేస్టేషన్ ఏర్పాటుచేసి ఇప్పటికి 90 ఏళ్లు నిండాయి. బాంద్రా పట్టణానికి అనుబంధంగా ఏర్పడిన ఈ స్టేషన్‌ను 1924 జూలై ఒకటో తేదీన ప్రారంభించారు. నగరాభివృద్ధికి అనుగుణంగా అంచెలంచెలుగా వృద్ధి చెందుతూ వస్తున్న ఈ స్టేషన్‌ను ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 85 వేలమంది ఆశ్రయిస్తున్నారు. ఉత్తర బాంద్రాలో ముంబై అభివృద్ధి శాఖ చేపట్టిన పలు పథకాల అమలుకు అవసరమైన సేవలందించేందుకు ఈ స్టేషన్‌ను మొదట ఏర్పాటుచేశారని పశ్చిమ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఖార్‌లో నగరావసరాలకు గాను గృహ నిర్మాణ పథకం కింద పదివేల జనాభాకు సరిపడా 842 ఫ్లాట్లను నిర్మించారు. అంతేకాక ప్రఖ్యాత పాలి హిల్ ప్రాంత వాసులకు కూడా ఈ ఖార్ స్టేషన్ అనుకూలంగా మారింది. మొదట్లో ఈ స్టేషన్‌ను రోజూ సుమారు 1,700 మంది వినియోగించుకుంటారని పశ్చిమ రైల్వేఅధికారులు అంచనా వేశారు.అయితే తర్వాత కాలంలో నగరీకరణ నేపథ్యంలో ఈ స్టేషన్ మంచి సెంటర్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఈ స్టేషన్ నుంచి ప్రతిరోజూ 85 వేల మందికి పైగా రాకపోకలు సాగిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతిరోజూ 648 పశ్చిమ రైల్వే రైళ్లు, 108 హార్బర్ లైన్ రైళ్లు నిలుస్తున్నాయి. ఈ స్టేషన్‌కు ఉత్తరాన శాంతాకృజ్, దక్షిణాన బాంద్రా ఉన్నాయి. 1960 నాటికే ఈ స్టేషన్ సమీపంలో పలు కార్పొరేట్సంస్థలు, బహుళ అంతస్తుల భవనాలు, ప్రముఖ పాఠశాలలు, కాలేజీలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం ఖార్ ప్రాంతం పలువురు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఇతర సెలబ్రిటీలకు నివాసప్రాంతంగా మారింది. -
మహారాష్ట్రలో దుర్ఘటన
-
డజన్ల కొద్దీ డెంగీ కేసులు
ముంబై: నగరంలోని తూర్పు బాంద్రావాసుల ను డెంగీ వ్యాధి భయపెడుతోంది. ఇక్కడి ప్రభుత్వ కాలనీ పరిసర ప్రాంతాల్లో డజన్ల కొద్దీ కేసులు నమోదవుతున్నాయి. ఈ వ్యాధిబారినపడి 16 ఏళ్ల యువకుడు రెండు రోజుల క్రితం చనిపోయిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎం సీ) అధికారులు ఈ ప్రాంతంలో పర్యటించారు. తగు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారి రాజన్ నరింగ్రేకర్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో దోమల ఉత్పత్తి ఎక్కువగా ఉందన్నారు. ఈ ప్రాంతంలో అనేక ఇళ్లకు పగుళ్లు ఉన్నాయని, వర్షాకాలంలో నీరు చేరుతుండడంతో తమ తమ ఇళ్లపై స్థానికులు టార్పాలిన్ పట్టాలు కప్పారన్నారు. అవి దోమ ల ఉత్పత్తి కేంద్రాలుగా మారిపోతున్నాయన్నా రు. దీంతోపాటు గోరేగావ్ పరిసరాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. గోరేగావ్ పరిసరాల్లో ఈ వ్యాధి బారినపడి ఒకరు చనిపోయారు. అయితే తూర్పు బాంద్రా పరిసరాల్లో డెంగీ వ్యాధిపీడితుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. 20 రోజుల వ్యవధిలో 29 మంది ఈ వ్యాధి బారినపడ్డారు. శనివారం మరో ఇద్దరికి ఈ వ్యాధి సోకినట్టు వైద్యుల పరీక్షల్లో తేలింది. -
రాజేశ్ ఖన్నా విగ్రహావిష్కరణ దృశ్యాలు
ముంబైలో శుక్రవారం జరిగిన రాజేశ్ ఖన్నా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులతోపాటు పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
ముంబైలో రాజేశ్ ఖన్నా విగ్రహం ఆవిష్కరణ
బాలీవుడ్ చిత్రసీమలో మకుటంలేని మహారాజుగా వెలుగులు విరజిమ్మిన సుపర్‌స్టార్ రాజేశ్ ఖన్నా ధైర్యానికి ప్రతీక అని ఆయన మాజీ భార్య డింపుల్ కపాడియా పేర్కొన్నారు. ఆయన ఆనంద్ చిత్రంలో నటించడమే కాకుండా ఆనంద్‌లా జీవించారని తెలిపారు. మరణం సమీపించిన తరుణంలో కూడా రాజేశ్ ఖన్నా తన ముఖాన చిరునవ్వు చెక్కుచెదరలేదని ఆమె గుర్తు చేసుకున్నారు. రాజేశ్ ఖన్నా విగ్రహాన్ని ముంబై నగరంలోని బాంద్రా విధిలో శనివారం ఆవిష్కరించారు. ఆ కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులు డింపుల్ కపాడియా, కూతుళ్లు ట్వింకిల్ ఖన్న అల్లుడు అక్షయ్ కుమార్‌లు హాజరయ్యారు. చేతిలో బెలూన్లు పట్టుకున్నట్లు ఉన్న రాజేష్ ఖన్న విగ్రహాం చూస్తేంటే ఆనందంగా ఉందని అక్షయకుమార్ తెలిపారు. రాజేష్ ఖన్నా (కాకాజీ)కి ఆ అరుదైన గౌరవం లభించినందుకు ట్వింకిల్ ఖన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రాజేశ్ ఖన్నా తనుకు మంచి స్నేహితుడని అందాల నటి హేమమాలిని తెలిపారు. అలాగే ఆయనతోకలసి నటించడం ఎంతో ఆహ్లాదంగా ఉంటుందని చెప్పారు. రాజేశ్ ఖన్నాతో కలసి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన సంగతిని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు ఆశా ఫరేఖ్, మిధున్ చక్రవర్తి రాకేష్ రోషన్, ఫరాహ్ అక్తర్, జితేంద్ర, జోయ అఖ్తర్, రణదీర్ కపూర్, రిషి కపూర్, జాకీ షరాఫ్, హేమమాలి తదితరులతోపాటు ఆయన అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. 2012 జూలై 18న రాజేశ్ ఖన్నా తీవ్ర అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే.