
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి ఏడాది దాటిపోయింది. కానీ ఇప్పటికీ ఆయన అభిమానులు సుశాంత్ జ్ఞాపకాల్లోనే మునిగి తేలుతున్నారు. ఆయన బతికుండుంటే బాగుండేది అని నిత్యం తల్చుకుంటూనే ఉన్నారు. కాగా సుశాంత్ గతేడాది జూన్ 14న బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరికి వేలాడిన విషయం తెలిసిందే. ఆయన మరణం తర్వాత నుంచి ఆ అపార్ట్‌మెంట్ మూగబోయింది. సుమారు ఏడాది కాలంగా ఆ భవనం ఖాళీగా ఉంటూ వస్తోంది.
దీంతో తాజాగా దీన్ని అద్దెకిస్తామని ముందుకు వచ్చారు ఓనర్లు. ఇందుకుగానూ నెలవారీ అద్దె రూ.4 లక్షలుగా ఖరారు చేశారు. నిజానికి సుశాంత్ ఈ అపార్ట్‌మెంట్‌ను మూడేళ్ల పాటు లీజుకు తీసుకున్నాడు. 2019 నుంచి అక్కడే ఉంటున్న సుశాంత్ ఆ సమయంలో నెలకు రూ.4.5 లక్షలు చెల్లిస్తూ వచ్చాడు. అతడి లీజు గడువు వచ్చే ఏడాది డిసెంబర్‌తో ముగియనుంది. కానీ ఇంతలోనే అతడు ఆత్మహత్య చేసుకుని అభిమానులను శోకసంద్రంలో వదిలేశాడు.
Comments
Please login to add a commentAdd a comment