Sushant Singh Rajput
-
ముగ్గురు స్టార్స్, పరమ చెత్త సినిమాగా రికార్డ్.. థియేటర్లలో నో రిలీజ్!
కొన్ని సినిమాలు అద్భుతంగా ఆడతాయి. మరికొన్ని అట్టర్ ఫ్లాప్‌గా నిలుస్తాయి. భారీ తారాగణం, భారీ బడ్జెట్ ఉన్నా సరే కంటెంట్‌లో దమ్ము లేకపోతే ప్రేక్షకులను మెప్పించడం కష్టం. ఇప్పుడు చెప్పుకునే సినిమా అదే కోవలోకి వస్తుంది. సడక్.. 1991వ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఇదీ ఒకటి. మహేశ్ భట్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సంజయ్‌దత్, పూజా భట్ ప్రధానపాత్రల్లో నటించారు. రెండు దశాబ్దాలకు సీక్వెల్ఐదింతలు లాభాలు తెచ్చిపెట్టిన ఈ సినిమాకు రెండు దశాబ్దాల తర్వాత సీక్వెల్ ప్రకటించారు. సంజయ్ దత్, ఆలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్.. ఇలా బడా స్టార్స్‌తో 2020లో సీక్వెల్ తీసుకొచ్చారు. అయితే సడక్ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతలా ఆదరించారో సడక్ 2 మూవీని అంతే స్థాయిలో తిప్పికొట్టారు. యూట్యూబ్‌లో ట్రైలర్ రిలీజ్ చేసిన 24 గంటల్లోనే 70 లక్షలమంది డిస్లైక్ కొట్టారు.నేరుగా ఓటీటీలో రిలీజ్తీరా సినిమాకు థియేటర్లు దొరక్కపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీకి ఐఎమ్‌డీబీలోనూ అత్యంత దారుణమైన రేటింగ్స్ ఉన్నాయి. కేవలం 1.2 రేటింగ్ ఉంది. అంతేకాదు, ఓటీటీలో రిలీజైన రెండు రోజులకే సడక్ 2 వంద అత్యంత చెత్త చిత్రాల్లో ఒకటిగా చేరిపోవడం గమనార్హం.ముఖ్య కారణం!కాగా సడక్ 2పై అంత వ్యతిరేకత రావడానికి మరో ముఖ్య కారణం కూడా ఉంది. ఈ మూవీ రిలీజైన ఏడాదే నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. బాలీవుడ్‌లోని నెపోటిజమే అతడి ప్రాణాలు తీసిందని జనాల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఈ కారణం వల్లే బాలీవుడ్ బడా స్టార్స్ కలిసి నటించిన సడక్ 2 సినిమాకు యూట్యూబ్‌లో లక్షల్లో వచ్చిపడ్డాయి. చదవండి: Pushpa 2 Movie: నార్త్‌లో పుష్ప 2 దూకుడుకు బ్రేక్? -
సుశాంత్ కేసు.. సుప్రీంకోర్టులో రియా చక్రవర్తికి ఊరట
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో నటి రియా చక్రవర్తికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నటితోపాటు ఆమె కుటుంబంపై సీబీఐ జారీ చేసిన లుక్అవుట్ సర్క్యూలర్‌ను (ఎల్ఓసీ)ను రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఈమేరకు బాంబే హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన సీబీఐ, మహారాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.ఈ సందర్భంగా సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ అనవసరమైనదని పేర్కొంది. ‘నిందితుల్లో ఒకరు సమాజంలో ఉన్నతస్థాయి వ్యక్తి అయినందున మీరు ఈ పనికిరాని పిటిషన్ వేశారు. మేము మిమ్మల్నిహెచ్చరిస్తున్నాం. ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం. ఇద్దరు వ్యక్తులు( సుశాంత్, రియా) సమాజంలో పేరు కలిగిన వారు.’ అని పేర్కొంది.ఇదిలా ఉండగా నటుడు సుశాంత్ సింగ్ 2020 జూన్ 14న ముంబయిలోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. అది ఆత్మహత్య కాదని, సుశాంత్ మరణంపై దర్యాప్తు చేయాలని కోరుతూ పాట్నాలో అతని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. తర్వాత ఈ కేసును సీబీఐకి విచారణ చేపట్టింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి జైలుకు కూడా వెళ్లారు. ఈ క్రమంలోనే రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి విదేశాలకు వెళ్లకుండా సీబీఐ గతంలో ఎల్వోసీ జారీ చేసింది. దీనిపై ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం దానిని రద్దు చేసిన విషయం తెలిసిందే. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. తాజాగా ఈ తీర్పు వెలువడింది. -
సుశాంత్.. నువ్వు బతికే ఉన్నావ్..!
మనిషి మరణించినప్పుడు రెండు కన్నీటి బొట్లు రాలుస్తారు. రెండు రోజులకు అందరూ మరిచిపోతారు. కాలం గడిచేకొద్దీ ఆ వ్యక్తి గురించి ఆలోచించడమే మానేస్తారు. కానీ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషయంలో మాత్రం ఇప్పటికీ అభిమానులు అతడిని స్మరిస్తూనే ఉన్నారు. సుశాంత్ చనిపోయి నాలుగేళ్లవుతున్నా నిత్యం ఏదో ఒక సందర్భంలో తనను తలుచుకుంటూనే ఉన్నారు.నొప్పి లేకుండా మరణం..2020, జూన్ 14.. సుశాంత్ ఆఖరి శ్వాస విడిచిన రోజు.. చాలామందికి ఇదొక బ్లాక్ డే! తను ఆత్మహత్య చేసుకున్నాడని అధికారుల వివరణ.. లేదు, బాలీవుడ్ రాజకీయాలే తనను బలి తీసుకున్నాయని అభిమానుల ఆవేదన, ఆరోపణ! 'నొప్పి లేకుండా ఎలా చనిపోవాలి? మెంటల్ డిజార్డర్ అంటే ఏమిటి?' అని చనిపోయేముందు సుశాంత్ గూగుల్‌లో సెర్చ్ చేసిన పదాలే తన మానసిక స్థితికి అద్దం పడుతున్నాయి. తను ఎంత వేదన అనుభవించాడన్నది చెప్పకనే చెప్తున్నాయి.అలిసిపోయాడా..చిచోరె సినిమాలో ఆత్మహత్యలను వ్యతిరేకించే అనిరుధ్ పాత్రలో గొప్పగా నటించాడు. దిల్ బేచారాలో జనన మరణాలు మన చేతుల్లో లేకపోవచ్చు.. కానీ ఎలా జీవించాలన్నది మన చేతుల్లోనే ఉంటుందన్న సందేశాన్ని ఇచ్చాడు. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం దాన్ని పాటించలేకపోయాడో.. పరిస్థితులతో పోరాడీ పోరాడీ అలిసిపోయాడో కానీ తన కలల్ని, ఆశయాలను అలాగే వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అభిమానుల మనసు గెలుచుకున్న సుశాంత్ వారి హృదయంలో ఎప్పటికీ జీవించే ఉంటాడు..కెరీర్..సుశాంత్.. గ్రూప్ డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించాడు. కిస్ దేశ్ మే హై మేరా దిల్ సీరియల్లో చిన్న పాత్రలో నటించాడు. పవిత్ర రిష్తా సీరియల్లో ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. జెర నాచ్కే దిఖా 2, ఝలక్ దిక్లాజా 4 రియాలిటీ షోలలో డ్యాన్సింగ్ స్కిల్స్ చూపించాడు. 2013లో కాయ్ పో చే చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. శుద్ధ్ దేశీ రొమాన్స్, పీకే, డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి, ఎంస్ ఎధోని సినిమాలతో అభిమానులను అలరించాడు. చివరగా దిల్ బేచార చిత్రంలో కనిపించాడు.నా సినిమాలు ఆడకుంటే ఇండస్ట్రీ నుంచి నన్ను పంపించేస్తారు. ఎందుకని ఈ ఇండస్ట్రీ నన్ను తనలో ఒకడిగా భావించడం లేదు.. అంతా ముగిసిపోయినట్లుగా ఉంది.. - సుశాంత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు..మసకబారిన జీవితం కన్నీటిబొట్టు రూపంలో ఆవిరవుతోంది. అంతులేని కలలు చిరునవ్వును, అశాశ్వతమైన జీవితాన్ని చెక్కుతున్నాయి. ఆ రెండింటి మధ్య బతుకుతున్నాను. - సుశాంత్ తల్లిని గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్టు..ఆల్ ఇండియా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలో 7వ ర్యాంక్ సాధించిన సుశాంత్.. ప్రాణంగా భావించిన నటనకోసం అన్నింటినీ త్యజించాడు. కానీ ఆ సినిమా చివరకు అతడినే బలి తీసుకుంది. Sushant's dream journal: Learn to fly...dive into a blue hole...the dreams that he realised before moving on...💔 #SushantSinghRajput pic.twitter.com/a1MHc8KqWe— Mahim Pratap Singh (@mayhempsingh) June 14, 2020 -
జీవితమంటే ఏంటో తెలిసొచ్చింది.. సుశాంత్ సింగ్ వల్లే.. : నటి
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మొదట సీరియల్స్‌లో నటించాడు. పవిత్ర రిష్తా సీరియల్ అతడికి నటుడిగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇందులో అతడికి జోడీగా అంకితా లోఖండే నటించింది. వీరిద్దరూ షూటింగ్ టైంలో లవ్‌లో పడ్డారు. కానీ ఆ ప్రేమ ఎంతోకాలం సాగలేదు. ఇకపోతే 2009లో ప్రసారమైన ఈ సీరియల్ కొన్నేళ్లపాటు కొనసాగింది.అర్చనగా మొదలైన జర్నీతాజాగా పవిత్ర రిష్తా సీరియల్ ప్రేక్షకుల్ని అలరించి పదిహేనేళ్లు అవుతున్న సందర్భంగా అంకిత సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. 15 ఏళ్ల క్రితం పవిత్ర రిష్తా సీరియల్లో అర్చనగా నా జర్నీ మొదలుపెట్టాను. తర్వాత కొన్ని వేరే ప్రాజెక్టులు కూడా చేశాను కానీ జనాలు నన్ను అర్చనగానే గుర్తుపెట్టుకుని నాపై ప్రేమాభిమానాలు కురిపించారు. అందుకే ఆ పాత్ర ఇప్పటికీ నాలోనే, నాతోనే ఉంది. ఆ పాత్ర నాకు జీవితమంటే ఏంటో నేర్పింది.సుశాంత్ వల్లే..కెరీర్ ప్రారంభంలో ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన సీరియల్ యూనిట్‌కు థ్యాంక్స్. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సపోర్ట్ లేకుండా నా జర్నీయే పూర్తి కాదు. సీరియల్ ప్రారంభమైన కొత్తలో ఎలా నటించాలో తెలిసేది కాదు. అతడే దగ్గరుండి యాక్టింగ్ నేర్పించాడు. అందుకు ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. నాకు ఇంత ప్రేమాభిమానాలు అందించిన టీవీ ఇండస్ట్రీకి థ్యాంక్స్. అభిమానులు, స్టార్డమ్ ఇవన్నీ ఈ సీరియల్ నుంచే మొదలయ్యాయి అని ఇన్స్టాగ్రామ్ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అలాగే మిస్ యూ సుశాంత్ అంటూ కొన్ని ఫోటోలు కూడా షేర్ చేసింది. View this post on Instagram A post shared by Ankita Lokhande Jain (@lokhandeankita) View this post on Instagram A post shared by Ankita Lokhande Jain (@lokhandeankita)చదవండి: 'ఆడిషన్ కోసం వెళ్లి స్వలింగ సంపర్కుడిని కలిశా'.. బిగ్‌బాస్ కంటెస్టెంట్! -
బరాబర్ తన గురించే మాట్లాడతా.. నన్నెవరూ ఆపలేరు: నటి
బాలీవుడ్ నటి అంకిత లోఖండే గతంలో నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను ప్రేమించింది. దాదాపు ఆరేళ్లపాటు రిలేషన్లో ఉన్న వీరు 2016లో విడిపోయారు. అనంతరం అంకిత..విక్కీజైన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అటు సుశాంత్.. రియా చక్రవర్తితో లవ్‌లో పడ్డాడు. కానీ కొంతకాలానికే డిప్రెషన్‌తో 2020లో తనువు చాలించాడు. ఈ మధ్య హిందీ బిగ్‌బాస్ 17వ సీజన్‌కు భర్తతో కలిసి వెళ్లింది అంకిత లోఖండే. హౌస్‌లో ఉన్ననాళ్లూ పోట్లాటలతోనే గడిపారు. బయటకు వచ్చాక మాత్రం మామూలైపోయారు. ఆఖరికి సొంత అత్త కూడా.. అయితే హౌస్‌లో ఉన్నప్పుడు తరచూ సుశాంత్ గురించి మాట్లాడింది అంకిత. ఇది చూసిన నెటిజన్లు.. సుశాంత్ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికే అతడి పేరు వాడుకుంటోందని విమర్శించారు. అంత ప్రేముంటే ఎందుకు విడిపోయిందో.. చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడటం అవసరమా? సింపతీ కోసమే ఇలా చేస్తోందని ట్రోల్ చేశారు. ఆఖరికి ఆమె సొంత అత్తయ్య కూడా అదే మాట అనడంతో అగ్గిమీద గుగ్గిలమైంది నటి. తనకంలాంటి సింపతీ అక్కర్లేదని చెప్పింది. నా లైఫ్ నా ఇష్టం.. తాజాగా మరోసారి ఈ అంశంపై మాట్లాడుతూ.. 'నా జీవితం నా ఇష్టం. నాకెవరైనా తెలిసినా.. వారి గురించి ఏదైనా మంచి విషయాలు తెలిసున్నా వాటిని బయటకు చెప్తూ ఉంటాను. దాన్ని ఎవరూ ఆపలేరు. మీరు తిట్టుకోండి.. ఏమైనా చేసుకోండి.. నాకవసరమే లేదు' అని చెప్పుకొచ్చింది. కాగా అంకిత.. బిగ్‌బాస్ 17వ సీజన్ థర్డ్ రన్నరప్‌గా నిలిచింది. చదవండి: ఓటీటీలో దూసుకెళ్తోన్న ఊరుపేరు భైరవకోన.. టాప్‌లో ట్రెండింగ్! -
నువ్వేనా? నీ తల్లి కూడా ఇంతేనా? నటిపై విరుచుకుపడ్డ అత్త
బిగ్‌బాస్‌లో కొట్లాటలు సహజం. పెళ్లైన జంటల్ని తీసుకొచ్చి మరీ వాళ్ల మధ్య చిచ్చు పెడుతుంటాడు బిగ్‌బాస్. అయితే భార్యాభర్తలు గొడవపడటం, తిరిగి కలిసిపోవడం సర్వసాధారణం. ఈ పోట్లాటలు చాలానే చూశాం. కానీ కనీవినీ ఎరగని రీతిలో లోపల భార్యాభర్తలు ఫైటింగ్‌లు చేస్తుంటే బయట వారి తల్లులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఒకరినొకరు నిందించుకుంటున్నారు. దీనికి గల కారణమేంటి? అసలేమైంది? అనేది తెలియాలంటే ఇది చదివేయండి.. ఒకరిని మించి మరొకరు హిందీ బిగ్‌బాస్ 17వ సీజన్లో బుల్లితెర జంట అంకిత లోఖండే- విక్కీ జైన్ పాల్గొంది. చుట్టూ కెమెరాలున్నా సరే ఎప్పుడూ ఏదో ఒకదాని గురించి ఇద్దరూ పోట్లాడుతూనే ఉంటారు. అందరిముందే భర్తను చులకన చేసి మాట్లాడటమే కాక ఒకానొక సమయంలో అతడిని తన్నిందా ఇల్లాలు. అతగాడేమీ తక్కువ కాదన్నట్లు భార్య ముందే మరో అమ్మాయి చేయి పట్టుకుని మాట్లాడిందే కాక అర్ధాంగి మీదకే చేయెత్తాడు. వీళ్లు చేసే రచ్చకు ఇది సాంపుల్ మాత్రమే! అంకిత అయితే పదేపదే తన మాజీ ప్రియుడు, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గురించి ఎప్పుడూ ఏదో ఒక విషయం మాట్లాడుతూనే ఉంది. ఇదేనా నీ సంస్కారం? ఇది విక్కీ జైన్ తల్లి రంజనాకు మింగుడుపడలేదు. ఇంకేముంది.. ఇంటర్వ్యూలలో కోడలి తీరును ఉతికారేసింది. సింపతీ కోసమే నా కోడలు తన మాజీ ప్రియుడైన సుశాంత్‌ను తలుచుకుంటోంది. అతడు బతికి ఉన్నప్పుడు ఎంతో ప్రేమను పొందాడు. ఎన్నో గొప్ప పనులు చేశాడు. ఇప్పుడతడు లేడు. మరి తన గురించి తలుచుకుని ఏం లాభం? అంకిత నా కొడుకును కాలితో తన్నడం చూసి తట్టుకోలేకపోయాం. మన దేశంలో భర్తను దేవుడిగా చూస్తారు. కానీ నువ్వు నీ భర్తను ఎలా చూస్తున్నావు? ఇదేనా సంస్కారం? అని తిట్టిపోసింది. మరో ఇంటర్వ్యూలో అంకితను తన ఇంటి కోడలిగా తెచ్చుకోవడమే ఇష్టం లేదని చెప్పింది. కానీ కుమారుడి ఇష్టాన్ని కాదనలేక మౌనంగా ఉన్నామని చెప్పింది. నీ తల్లి కూడా ఇంతేనా? అయితే భార్యాభర్తలన్నాక లక్ష గొడవలుంటాయి. ప్రతిదాంట్లో మనం దూరనవసరం లేదు. వారి సరదా చేష్టలను సీరియస్‌గా తీసుకోనవసరం లేదు అని గట్టిగానే కౌంటర్ ఇచ్చింది అంకిత తల్లి వందన. ఎనిమిదేళ్లపాటు సుశాంత్‌తో కలిసి ప్రయాణించింది. బ్రేకప్ చెప్పుకున్నాక కూడా అతడి మంచే కోరుకుంది. అతడి గురించి ఆలోచిస్తే సింపతీనా? అని ఆగ్రహించింది వందన. ఇకపోతే ఫ్యామిలీ వీక్‌లో భాగంగా మంగళవారం నాడు అంకిత తల్లి, విక్కీ తల్లి ఇద్దరూ హౌస్‌లో అడుగుపెట్టారు. విక్కీని తన్నినందుకు అంకితకు ఆమె అత్త మొట్టికాయలు వేసింది. 'నీ ప్రవర్తన చూశాక నా భర్తకు ఎంత కోపమొచ్చిందో తెలుసా? ఆవేశంతో నీ తల్లికి ఫోన్ చేసి నువ్వు కూడా ఇలాగే నీ భర్తను తంతావా? నీ కూతురికి అదే నేర్పించావా? అని అడిగాడు' అని చెప్పింది. ఇకనైనా గొడవలు తగ్గించేస్తారా? ఈ మాటలు విని అంకిత బాధపడింది. ఈ మధ్యే నాన్న చనిపోయాడని, అలాంటప్పుడు ఈ గొడవలోకి మా అమ్మను ఎందుకు లాగుతున్నారంటూ ఏడ్చేసింది. అనంతరం అంకిత తల్లి బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టింది. కూతురు-అల్లుడును దగ్గరకు తీసుకున్న ఆమె ఇద్దరూ గొడవలు తగ్గించుకుని ఆప్యాయంగా ఉండమని సలహా ఇచ్చింది. మరోవైపు సోషల్ మీడియాలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా.. అంకితాకు మద్దతుగా నిలబడటం విశేషం. మరి ఇకనుంచైనా అంకిత- విక్కీ పోట్లాటలు ఆపేస్తారా? లేదా అలాగే మొండిగా వ్యవహరిస్తారా? అనేది చూడాలి! చదవండి: ఎంతోమందికి లైఫ్ ఇచ్చిన హీరో విజయ్‌కాంత్.. ఆయన కుమారుడి కోసం.. -
మిస్టర్ పొలిశెట్టి బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
సుశాంత్ ఆత్మహత్య.. అందుకే వెళ్లలేదన్న మాజీ ప్రియురాలు!
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. ఎంస్ ధోని సినిమాతో సినీ ప్రేక్షకుల మనసులను ఆకట్టుకున్నారు. అయితే ఎవరు ఊహించని విధంగా సుశాంత్ మరణించారు. ముంబయిలోని తన గదిలో సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. ప్రస్తుతం హిందీ బిగ్ బాస్ సీజన్-17 జరుగుతోంది. ఈ రియాలిటీ షోకు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోలో బాలీవుడ్ నటి, సుశాంత్ ప్రియురాలు అంకితా లోఖాండే కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఈ నేపథ్యంలో హౌస్‌లో ఉన్న ఆమె తన మాజీ ప్రియుడు సుశాంత్‌ను గుర్తుకు తెచ్చుకుంది. అతని గురించి మరో కంటెస్టెంట్ మునావర్ ఫారూఖీతో మాట్లాడింది. అంకితా లోఖండే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంత్యక్రియలను మళ్లీ గుర్తు చేసుకున్నారు. మునావర్ ఫరూఖీతో మాట్లాడుతూ.. అలాంటి వ్యక్తిని కోల్పోవడం నా జీవితంలో ఇదే మొదటిసారి. సుశాంత్ మరణం నాకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. అందువల్లే నేను అతని అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు. ఈ విషయం తెలిసి కూడా నేను వెళ్లలేకపోయాను. ఆ పరిస్థితిలో నేను సుశాంత్‌ను చూడలేను. విక్కీ నన్ను వెళ్లమని చెప్పాడు. కానీ నేనే నిరాకరించాను. నా జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురుకాలేదు. మొదటిసారి మా నాన్నని అలా చూశా. ఒక వ్యక్తిని కోల్పోతే కలిగే నష్టాన్ని నేను గ్రహించా. కాగా.. అంకిత తండ్రి శశికాంత్ లోఖండే ఈ ఏడాదిలోనే మరణించారు. అంకిత ప్రస్తుతం బిగ్ బాస్ -17లో తన భర్త విక్కీ జైన్‌తో కలిసి పాల్గొంది. వీరిద్దరు 2021లో పెళ్లి చేసుకున్నారు. #AnkitaLokhande talks abt SSR, what a great man he was, his funeral, how it’s difficult talking abt him in past tense n breaks down remembering him n her dad ❤️#BB17 #BiggBoss17 pic.twitter.com/MWUshVXPG0 — Rachit (@rachitmehra_2) November 20, 2023 -
సుశాంత్ మరణం.. ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదు: నటి
నటుడు సుశాంత్ ఆత్మహత్య బాలీవుడ్‌ను కుదిపేసింది. ఇది ఆత్మహత్య కాదని అనుమానాలు వ్యక్తం కావడం, డ్రగ్స్ కోణం కూడా బయటపడటంతో సుశాంత్ ప్రియురాలు, నటి రియా చక్రవర్తి మెడకు ఈ కేసు చుట్టుకుంది. పోలీసులు రియాతో పాటు ఆమె సోదరుడిని కూడా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో జైలు జీవితం గడిపిన ఈ నటి కొన్ని వారాల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చింది. తాను ఏ తప్పూ చేయలేదని చెప్తున్నా ఆమెపై వ్యతిరేకత మాత్రం పోవడం లేదు. ట్రోలింగ్ దాదాపు తగ్గింది.. కానీ.. అంతేకాదు, తన కెరీర్ సైతం దెబ్బతిందని, ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదని వాపోయింది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. 'భయం, ట్రోలింగ్.. ఇలా చాలా ఫేస్ చేశాను. పరిస్థితి కొంత సద్దుమణిగింది. త్వరలోనే వాతావరణం అంతా మామూలైపోతుందనుకుంటున్నాను. ముఖ్యంగా ట్రోలింగ్ అయితే చాలావరకు తగ్గిపోయింది. గతంలో అయితే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న వ్యక్తిగా నేను మొదటి స్థానంలో ఉన్నాను. నాకు ఛాన్సులు ఇవ్వడానికి భయపడుతున్నారు ఆ స్థాయిలో నాపై విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో నా స్నేహితులు, కుటుంబం ఇచ్చిన అండదండల వల్లే బలం కూడగట్టుకుని నిలబడ్డాను. కానీ నాకు బాలీవుడ్లో అవకాశాలు రావడం లేదు. ఎవరూ ఛాన్సులు ఇవ్వడం లేదు. నన్ను సినిమాలోకి తీసుకునేందుకు భయపడుతున్నారు' అని బాధపడింది. కాగా రియా చక్రవర్తి 2021లో వచ్చిన చెహర్ సినిమాతో చివరిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తర్వాత బుల్లితెరపై ప్రసారమైన ఎమ్‌టీవీ రోడీస్: కరమ్ యా ఖాంద్ అనే రియాలిటీ షోలో గ్యాంగ్ లీడర్‌గా మెప్పించింది. View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) చదవండి: నెలసరి ఆలస్యం.. బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌కు ప్రెగ్నెన్సీ టెస్ట్ -
సుశాంత్ మానసిక స్థితి గురించి నిజాలు తెలుసు: రియా
బాలీవుడ్ నటుడు సుశాంత్ సూసైడ్ అప్పట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే అతని మరణంపై ప్రియురాలైన రియా చక్రవర్తిపై సుశాంత్ తండ్రి ఫిర్యాదు చేయడంతో ఎన్సీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో రియాతో పాటు ఆమె సోదరుడిని అరెస్టు చేసింది. రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించిన రియా.. సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్‌గా ఎక్కువగా వార్తల్లో నిలిచింది. అయితే ప్రస్తుతం బెయిల్‌పై బయటకొచ్చిన రియా.. తన కెరీర్‌తో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకు కూడా హాజరైంది. సుశాంత్ గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. (ఇది చదవండి: ముంబయిలో ఒంటరిగా జీవితాన్ని ప్రారంభించా: స్టార్ హీరోయిన్) రియా మాట్లాడుతూ.. 'సుశాంత్ మానసిక ఆరోగ్య సమస్యల గురించి తనకు బాగా తెలుసు. తను మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు నాకు తెలుసు. సుశాంత్ జీవితంలోకి తాను వచ్చినప్పటి నుంచి లైఫ్ మారిపోయింది. అతను అంతకుముందే బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక చిన్న పట్టణం నుంచి వచ్చిన వ్యక్తి బాలీవుడ్లో పెద్ద స్టార్‌గా ఎదిగాడు. అందువల్ల అతన్ని నియంత్రించే మనస్సు కాదని చెప్పుకొచ్చింది. సుశాంత్‌కు డ్రగ్స్ సరఫరా చేశారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంతో.. ఈ విషయం గురించి మాట్లాడదలుచుకోలేదని చెప్పింది. ముంబైలోని బాంద్రా నివాసంలో 2020 జూన్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. -
'అందుకే జైలులో నాగిని డ్యాన్స్ చేశా'.. సుశాంత్ ప్రియురాలు!
ఎంఎస్ ధోని మూవీ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషాదం ఆయన అభిమానుల్లో తీవ్రంగా కలిచివేసింది. 2020లో ముంబైలోని బాంద్రా నివాసంలో సుశాంత్ సూసైడ్ తర్వాత అతని ప్రియురాలు రియా చక్రవర్తిపై ఆరోపణలు రావడంతో ఎన్సీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమె సోదరుడు షోక్ చక్రవర్తి కూడా నిందితుడిగా ఉన్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రియా.. తన జైలు జీవితం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. జైలులో ఉన్న ఇతర మహిళలను చూసి తాను చాలా నేర్చుకున్నానని చెప్పింది. ఈ కేసులో నేను కేవలం నిందితురాలినే తప్ప.. దోషిని కాదని రియా స్పష్టం చేశారు. బెయిల్ వచ్చిన తర్వాత అక్కడున్న జైలులో మహిళలతో కలిసి నాగిన్ డ్యాన్స్ చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. తనకు బెయిల్ వచ్చిన రోజు తన సోదరుడికి బెయిల్ రాలేదని.. ఆరోజు తాను చాలా బాధపడ్డానని తెలిపారు. అయితే తనకు బెయిల్ వచ్చిన రోజు డ్యాన్స్ చేస్తానని నా తోటి మహిళా ఖైదీలకు మాట ఇచ్చానని.. అందుకే అలా చేశానని తెలిపింది రియా. వారిని నేను మళ్లీ చూడలేను కాబట్టే.. వారితో ఐదు నిమిషాల పాటు డ్యాన్స్ చేసి ఆనందాన్ని ఇవ్వగలిగానని చెప్పుకొచ్చింది. ఇది నా జీవితంలో అత్యంత ఆనందకరమైన క్షణమని వెల్లడించింది. మహిళలతో కలిసి డ్యాన్స్ చేస్తున్నప్పుడు వారి కళ్లలో కనిపించిన ఉత్సాహం, ఆనందం, సంతోషం బహుశా ఇప్పటి వరకు తన జీవితంలో ఎప్పుడు చూడలేదని రియా అన్నారు. ఈ కేసులో రియా దాదాపు ఆరు వారాల పాటు బైకుల్లా జైలులో రిమాండ్‌లో ఉన్నారు. కాగా.. రియా ప్రస్తుతం ఎంటీవీ రోడీస్: కర్మ యా కాంద్లో కనిపించనుంది. ఇందులో ఆమె గ్యాంగ్ లీడర్ పాత్ర పోషిస్తోంది. -
నిన్ను చాలా మిస్ అవుతున్నా.. హీరోయిన్ పోస్ట్ వైరల్!
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా పరిచయం అక్కర్లేని పేరు. ప్రియాంక చోప్రా సోదరిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. త్వరలోనే ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను పెళ్లాడనున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట మే నెలలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో వీరి పెళ్లి వేడుక జరగనుంది. అయితే ఇప్పటికే పెళ్లి డేట్ ఫిక్స్ కాగా.. తాజాగా పరిణీతి చోప్రా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: మెగాస్టార్ ప్రశంసలే మాకు బిగ్ సక్సెస్: దర్శకుడు కామెంట్స్!) 2013లో ఆమె నటించిన చిత్రం శుద్ధ్ దేశీ రొమాన్స్. ఈ చిత్రంలో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటించారు. ఈ చిత్రం విడుదలై ఇప్పటికీ పదేళ్లు పూర్తయిన సందర్భంగా పరిణీతి చోప్రా ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సినిమాను తలుచుకుంటూ ఇన్‌స్టాలో ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. పరిణీతి తన ఇన్‌స్టాలో రాస్తూ.. అవును నిజమే.. కాలం ఎగురుతుంది! దశాబ్దం గడిచినా ఆ సినిమా జ్ఞాపకాలు ఇంకా కొత్తగానే ఉన్నాయి. అది నవ్వులతో నిండిన ఓ మధురమైన ప్రయాణం. అలాంటి దిగ్గజ నటులతో ఈ సినిమా చేయడం జీవితంలో గొప్ప అనుభవం. రిషి సార్ మిమ్మల్ని మిస్ అవుతున్నాం. సుశాంత్ సింగ్ నిన్ను ఇంకా చాలా ఎక్కువగా మిస్ అవుతున్నా. మీరు నాకు ఇష్టమైన నటుల్లో ఒకరు.' అంటూ పోస్ట్ చేశారు. 2013లో విడుదలైన శుద్ధ్ దేశీ రొమాన్స్ చిత్రంలో పరిణీతి చోప్రా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌లతో పాటు వాణి కపూర్, భువన్ అరోరా, రాజేష్ శర్మ నటించారు. (ఇది చదవండి: 17 ఏళ్లకే పాన్ ఇండియా మూవీ.. ఆ స్టార్ కిడ్ ఎవరో తెలుసా?) View this post on Instagram A post shared by @parineetichopra -
Rhea Chakraborty-Nikhil Kamath: ప్రేమలో పడ్డ సుశాంత్ సింగ్ ప్రేయసి.. అతడెవరో తెలుసా?
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించినప్పుడు బాలీవుడ్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నెపోబ్యాచ్ సుశాంత్‌ను సైడ్ చేయడం వల్లే అతడు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని అభిమానులు ఆక్రందన చెందారు. నటుడిది ఆత్మహత్య కాదని.. సినిమా ఇండస్ట్రీనే హత్య చేసిందని ఆరోపించారు. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి కూడా అతడి మరణానికి కారణమంటూ ఆరోపణలు సైతం వెలువడ్డాయి. అటు సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్ కోణం కూడా వెలుగు చూసిన సంగతి తెలిసిందే! ఈ డ్రగ్స్ కేసులో భాగంగా రియా జైలు శిక్ష సైతం అనుభవించింది. ఈ విమర్శలు, తీవ్రమైన నెగెటివిటీ, ఆరోపణలు, కోర్టు కేసుల ఫలితంగా రియా చక్రవర్తికి అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇప్పుడిప్పుడే తిరిగి మామూలవుతున్న ఆమె తాజాగా ప్రేమలో పడిందంటూ ఓ పుకారు షికారు చేస్తోంది. జెరోదా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో ఆమె ప్రేమాయణం సాగిస్తోందని రెడ్డిట్‌లో ఓ రూమర్ వైరలవుతోంది. రియా ప్రేమలో పడిదంటూ వార్తలు రావడం ఇది కొత్తేమీ కాదు. గతంలోనూ విరాట్ కోహ్లి మేనేజర్ బంటీ సాజ్దేతో ప్రేమలో పడిందని వార్తలు రాగా అవన్నీ వట్టి పుకారుగానే తేలిపోయింది. మరి ఇప్పుడు నిఖిల్ కామత్‌తో ప్రేమాయణంలో ఎంతవరకు నిజముందన్నది తెలియాల్సి ఉంది. చదవండి: హీరోయిన్ రిఫర్ చేసింది.. కానీ డైరెక్టర్ ఆ మాట అని రిజెక్ట్ చేశాడు.. అర్జున్ కల్యాణ్ -
ఆ ఫ్లాట్‌లో హీరో సూసైడ్.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్!
ఈ ఏడాది ది కేరళ స్టోరీ సినిమాతో క్రేజ్ దక్కించుకున్న భామ ఆదా శర్మ. కేరళలో జరిగిన బాలికల మిస్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా ఆదా శర్మకు మరింత గుర్తింపును తీసుకొచ్చింది. ఇటీవల కమాండో వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రీమియర్ అవుతోంది. అయితే తాజాగా ఆదా శర్మకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరలవుతోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: సినిమాల్లో కూడా అవకాశాలొచ్చాయి.. కానీ: అభిషేకం సీరియల్ నటి) ఎంఎస్ ధోని చిత్రంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. ఊహించని పరిణామాలతో ఆత్మహత్య చేసుకున్నారు. ముంబయిలోని బాంద్రాలోని మాంట్ బ్లాంక్ అపార్ట్‌మెంట్స్‌లో సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ ఇంటిని ది కేరళ స్టోరీ స్టార్ ఆదా శర్మ కొనుగోలు చేసినట్లు బీటౌన్ సమాచారం. అయితే గతంలో సుశాంత్ ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఆ ఇంటికి సుశాంత్ నెలకు రూ.4.5 లక్షలు అద్దె చెల్లించేవారట. అయితే ఈ విషయంపై ఆమె ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం పెద్దఎత్తున వైరలవుతోంది. అయితే త్వరలోనే ఆ ఇంటికి మారబోతున్నట్లు కూడా తెలుస్తోంది. కాగా.. 2009లో హిందీ హారర్ చిత్రం 1920తో రజనీష్ దుగ్గల్ సరసన బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది ఆదాశర్మ. (ఇది చదవండి: క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తోన్న 'క్రిమినల్' !) View this post on Instagram A post shared by Tellychakkar Official ® (@tellychakkar) -
ఆమెకు దూరంగా ఉండాలంటూ సోనూసూద్‌కు సలహాలిస్తున్న ఫ్యాన్స్
కరోనా సమయంలో లాక్డౌన్ నుంచి ఇప్పటివరకూ ఎంతోమందికి అపన్నహస్తం అందించి రియల్ హీరోగా సమాజానికి స్ఫూర్తినిచ్చారు నటుడు సోనూసూద్. పలు సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ ఆయన సోషల్‌మీడియా వేదికగా అందుబాటులో ఉంటూ తనకు చేతనైనంత సాయం చేస్తున్నారు. దీంతో ఆయనను అభిమానించే వారిలో ఎక్కువగా యూత్నే ఉంటారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి రాబోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ) ప్రస్తుతం ఆయన తదుపరి ప్రాజెక్ట్ 'MTV రోడీస్ సీజన్ 19' షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇదే ప్రాజెక్ట్‌లో నటి రియా చక్రవర్తి కూడా ఉన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన షూటింగ్ హిమాచల్ ప్రదేశ్‌లో జరుగుతోంది. అక్కడ సెట్లో ఉన్న వారి కోసం సోనూసూద్ దోశెలు వేశారు. ఎవరికి ఎలాంటి దోశె కావాలో అడిగి మరీ సోనూ వడ్డించారు. ఇదే సమయంలో నటి రియా చక్రవర్తి కూడా అక్కడికి రాగా... 'మీకు ఎలాంటి దోశె కావాలి' అని అడిగి ఆమె కోరుకున్నట్లు టిఫిన్ సిద్ధం చేసి ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోనూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీనిని చూసిన ఆయన అభిమానులు... 'మీరు అంటే మాకు ఎంతో గౌరవం.. అది ఎప్పటికీ కొనసాగుతుంది.. ఈ చర్యతో మీపై మరెంతో గౌరవం పెరుగుతుంది' అని కామెంట్స్ చేశారు. (ఇదీ చదవండి: రూ. 20 కోట్లతో ఇల్లు కొన్న హీరోయిన్.. ఆయన బహుమతే కదా అంటూ..) కానీ.. ఈ వీడియో చూసిన బాలీవుడ్ యువ నటుడు, దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులు మాత్రం కొంతమేరకు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రియా చక్రవర్తికి దూరంగా ఉండాలని ఇలా సోనూను కోరారు. 'మీరు ఆమెకు దోశెలు చేసి పెట్టడం మాకు ఏ మాత్రం నచ్చలేదు' అంటూ... తమ అసహనాన్ని కామెంట్ల రూపంలో తెలియచేశారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొని కోంతకాలం పాటు రియా జైలులో ఉన్న విషయం తెలిసిందే. అందుకే వారు సోనూసూద్‌కు ఈ సలహా ఇచ్చారు. -
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు: డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. తాజాగా ఈ కేసుపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించినట్లు తెలిపారు. తాజాగా ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై సీబీఐ మూడేళ్లుగా జరుపుతున్న దర్యాప్తు గురించి స్పందిస్తూ.. 'మొదట్లో ఈ కేసులో వాళ్లూవీళ్లు చెప్పిన సమాచారం మాత్రమే ఉంది. ఆ తర్వాత కొందరు తమ వద్ద బలమైన సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. వారి వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు సమర్పించాలని కోరాము. ప్రాథమిక సాక్ష్యాలను సేకరించాం. వాటి విశ్వసనీయతను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతున్నందున ప్రస్తుతం ఈ కేసు గురించి ఇంతకంటే ఏం చెప్పలేను' అన్నారు. కాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020 జూన్‌లో ముంబైలోని తన అపార్ట్మెంట్లో విగతజీవిగా కనిపించారు. మొదట ఆయన ఆత్మహత్య చేసుకున్నారని అంతా అనుకున్నారు. కానీ ఇందులో కుట్ర కోణం ఉందని ఆయన కుటుంబసభ్యులు ఆరోపించడంతో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. మరోవైపు సుశాంత్ చనిపోవడానికి వారం రోజుల ముందు ఆయన మాజీ మేనేజర్ దిశా సాలియన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చదవండి: లగ్జరీ కారు కొనుగోలు చేసిన నాగార్జున -
సుశాంత్ ఆత్మహత్యపై కంగనా సంచలన ఆరోపణలు..!
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పరిచయం అక్కర్లేని పేరు. బీ టౌన్ సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఎమర్జెన్సీ చిత్రంలో నటిస్తోన్న కంగనా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటోంది. ఇప్పటికే పలుసార్లు వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కంగనా మరోసారి బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. గతంలో తనపై గూఢచర్యం చేస్తున్నారంటూ రణ్‌బీర్ కపూర్‌ను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: థియేటర్లో లైంగిక వేధింపులు.. ఏం చేయాలో అర్థం కాలేదు: స్టార్ హీరోయిన్) తాజాగా కంగనా రనౌత్ రణబీర్‌ను 'దుర్యోధనునితో' పోలుస్తూ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. అంతే కాకుండా ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌ను శకునిగా అభివర్ణించింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వెనుక ఈ దుష్టశక్తులు ఉన్నాయంటూ పరోక్షంగా ఆరోపించింది. వారి పేర్లు చెప్పకుండానే వైట్ ర్యాట్, పాపా జో అంటూ సంభోధిస్తూ కామెంట్స్ చేసింది. కంగనా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో రాస్తూ.. 'సినిమా పరిశ్రమలో రకరకాల బెదిరింపులు ఉన్నాయి. అయితే ఈ దుర్యోధనుడు (తెల్ల ఎలుక),శకుని (పాప జో) జోడి వేధింపులు మరింత దారుణంగా ఉన్నాయి. వారు తమను తాము సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖగా ఫీలవుతారు. బాలీవుడ్ పరిశ్రమకు ఈ విషయం తెలుసు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వెనుక ప్రధాన నిందితులు వీరే. అతన్ని ఆత్మహత్యకు పురికొల్పింది వీరే. నాపై అన్ని రకాల అసభ్యకరమైన పుకార్లను కూడా వ్యాప్తి చేశారు. నా జీవితంలో వారి వేధింపులు మించిపోయాయి.' అంటూ రాసుకొచ్చారు. గతంలో హృతిక్ రోషన్‌తో వివాదంలో కూడా వీరిద్దరు తనపై దుష్ప్రచారం చేశారని ఆరోపించింది. బాలీవుడ్ క్వీన్‌గా పేరొందిన కంగనా తన సంచలన కామెంట్స్‌తో మరోసారి బీటౌన్‌లో చర్చ మొదలైంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు ప్రేరేపించారని పరోక్షంగా రణ్‌బీర్, కరణ్‌ను ఉద్దేశించి పోస్ట్ చేయడంతో వివాదం మరింత చర్చనీయాంశంగా మారనుంది. (ఇది చదవండి: ఘనంగా బుల్లితెర నటి సీమంతం.. సోషల్ మీడియాలో వైరల్!) -
ధోని బయోపిక్ రీరిలీజ్.. సుశాంత్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
దిగంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఆయన నటించిన సూపర్ హిట్ మూవీ 'ఎంఎస్ ధోనీ ది అన్ టోల్డ్' స్టోరీ సినిమా ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అలా ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపాయి. చదవండి: అందుకే మేం విడాకులు తీసుకున్నాం.. నాగచైతన్య ఓపెన్ కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ నటించిన ఎంఎస్ ధోనీ సినిమాను రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా 2016లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో సుశాంత్ సింగ్ ధోని పాత్రలో నటించగా, దిశా పటానీ, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు ముందు, ఆ తర్వాత కూడా పలు క్రీడాకారుల బయోపిక్‌తో సినిమాలు వచ్చినా 'ఎంఎస్ ధోనీ ది అన్ టోల్డ్ స్టోరీ' అంతగా ఏ సినిమా ప్రభావం చూపలేదు..వసూళ్లు సాధించలేదు. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కూడా నడుస్తుండటంతో అటు క్రికెట్, ఇటు సినీ అభిమానుల కోసం ఈ సినిమాను మే12న మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. చదవండి: ఈ జన్మకు నువ్వు మాత్రమే.. ఆ ఙ్ఞాపకాలతో బతికేస్తాను : అలేఖ్య రెడ్డి Maahi phir aa raha hai!! M.S. Dhoni: The Untold Story Re-Releasing in cinemas on 12th May in Hindi, Tamil and Telugu#MSDhoniTheUntoldStory @msdhoni #sushantsinghrajput @starstudios_ @advani_kiara @DishPatani @AnupamPKher @bhumikachawlat pic.twitter.com/bOFtEaup4X — Ramesh Bala (@rameshlaus) May 4, 2023 -
మీకెందుకు భయం.. మీ పని అదేగా.. సుశాంత్ సోదరి సంచలన ఆరోపణలు
దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి ప్రియాంక సింగ్ సంచలన ఆరోపణలు చేసింది. సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిపై తీవ్రస్థాయిలో ఫైరయింది. నువ్వు ఒక వేశ్య అంటూ రియాను ఉద్దేశించి హిందీలో ట్వీట్ చేసిందామె. సోమవారం రియా తాను సినిమాల్లో నటిస్తున్నట్లు ప్రకటించడంతో ప్రియాంక సింగ్ ఆగ్రహాం వ్యక్తం చేసింది. రియా వెనక పాలకులు ఉన్నందుకే భయపడట్లేదని ప్రియాంక ఆరోపిస్తోంది. ప్రియాంక ట్వీట్లో రాస్తూ.. 'మీరు ఎందుకు భయపడతారు? మీ చేసే వేశ్య వృత్తిలో ఉన్నారు. ఎప్పటికీ అందులోనే కొనసాగుతారు. మీకు మద్దతు ఇస్తున్న పాలకులను చూసే నీకంత ధైర్యం' అంటూ పోస్ట్ చేసింది. సుశాంత్ కేసు విచారణలో ఆలస్యానికి బాధ్యులెవరో తనకు తెలుసని ప్రియాంక పేర్కొంది. అయితే కాసేపటికే తాను ప్రత్యేకంగా ఎవరినీ ఉద్దేశించి ట్వీట్ చేయలేదని స్పష్టం చేసింది. కాగా.. సోమవారం రియా చక్రవర్తి తిరిగి రోడీస్ 19 షోలో నటిస్తున్నట్లు ప్రకటించింది. 'పోయినా వారు ఎలాగో తిరిగి రారు.. కానీ ఇప్పుడు ఎందుకు భయపడాలి? అలా భయపడేవారు వేరేలా ఉంటారు' అంటూ రియా మాట్లాడింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంతో అతని గర్ల్‌ఫ్రెండ్ రియాపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె జైలుకు కూడా వెళ్లి వచ్చారు. సూసైడ్‌కు ముందు సుశాంత్, రియా రిలేషన్ షిప్లో ఉన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14, 2020న తన బాంద్రా నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. అయితే అతని కుటుంబసభ్యులు ఆత్మహత్యకు ప్రేరేపించేలా చేసిందంటూ రియాపై కేసు నమోదు చేశారు. రియా బెయిల్‌పై విడుదలైనప్పటికీ సీబీఐ, ఈడీ, ఎన్సీబీ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. तुम क्यूँ डरोगी? तुम तो व्यश्या थी, हो, और रहोगी! प्रशन् ये है कि तुम्हारे उपभोगता कौन है? कोई सत्ताधारी ही ये हिम्मत दे सकता है। WhoResponsible 4Delay InSSRCs is obvious — Priyanka Singh (@withoutthemind) April 10, 2023 -
Sushant Singh Death: ఒక్కసారి కాల్ చేసి ఉంటే.. కంటతడి పెట్టుకున్న స్మృతి ఇరానీ
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి దాదాపు మూడేళ్లు కావోస్తుంది. 2020 జూన్ 14l ముంబై బాంద్రాలోని తన అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ ఈ లోకాన్ని విడిచి వెళ్లి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆయన మరణం మిస్టరీలానే ఉంది. నటుడి మృతిని సెలబ్రిటీలు, అభిమానులు మర్చిపోలేకపోతున్నారు. నేటికి ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూనే ఉన్నారు. సుశాంత్ అకాల మరణంపై తాజాగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. స్మతి ఇరానీ రాజకీయాల్లోకి రాకముందు మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించి ఆ తరువాత టీవీ సీరియల్స్, పలు సినిమాల్లో కూడా నటించిన విషయం తెలిసిందే. సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలో సుశాంత్ సింగ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి ముంబైలో టీవీ షోలలో పనిచేయడంతో అతనితో ఆమెకు మంచి బంధం ఉంది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కేంద్ర మంత్రి..సుశాంత్ మరణించినప్పటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. ‘సుశాంత్ సింగ్ మరణం గురించి తెలిసినప్పుడు నేను వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నాను. ది స్లో కాన్వర్సేషన్‌లో నీలేష్ మిశ్రాతో మాట్లాడుతున్నాను. సుశాంత్ మరణ వార్త తట్టుకోలేక పోయాను ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. వెంటనే ఆ కాన్ఫరెన్స్ ఆపేశాను. మరణించే ముందు సుశాంత్ నాకు ఎందుకుఫోన్ చేయలేదని బాధపడ్డాను. ఒకవేళ చేసి ఉంటే.. మిమ్మల్ని మీరు బలవంతంగా చంపుకోవడం ఆపండి అని చెప్పాలి అనుకున్నాను’ అని భావోద్వేగానికి లోనయ్యారు. తరువాత సుశాంత్ సహానటుడు, స్నేహితుడు అమిత్ సాద్‌కి కాల్ చేసి మాట్లాడినట్లు స్మృతి ఇరానీ చెప్పుకొచ్చారు. సుశాంత్ ఎందుకు బాధపడుతున్నాడో తెలుసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఆ సమయంలో అమిత్ కూడా షాక్‌లో ఉన్నాడని, సుశాంత తనకు జీవించడం ఇష్టం లేదని తనతో చెప్పినట్లు అమిత్ చెప్పాడని పేర్కొన్నారు. కనీసం ఒక్కసారయినా తనకు ఫోన్ చేసే సుశాంత్.. ఆత్మహత్య చేసుకునేముందు ఎందుకు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
సుశాంత్ మరణించేముందు మెసేజ్ వచ్చింది, నేను పట్టించుకోలే!
యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం బాలీవుడ్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే! బాలీవుడ్ సెలబ్రిటీలు సుశాంత్‌ను పట్టించుకోలేదని, అతడిని సైడ్ చేయడం వల్లే సుశాంత్ కుమిలిపోయి ఆత్మహత్యకు యత్నించాడంటూ అభిమానులు విమర్శలు గుప్పించారు. ఇప్పటికీ సుశాంత్‌ను తలుచుకుంటూ నిత్యం అతడి ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో ఏదో ఒక పోస్టు పెడుతూనే ఉంటారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సుశాంత్ విషయంలో తానిప్పటికీ బాధపడుతున్నానన్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'అందరి ముందు అరుస్తున్నానని నాకు చాలా లేట్‌గా తెలిసొచ్చింది. కొన్ని విషయాలను గ్రహించడానికి నాకు ఏడాదిన్నర పట్టింది. సోషల్ మీడియా వచ్చాక నేను వెనక్కు తగ్గాను. ప్రతిదానికి రియాక్ట్ అవ్వాల్సిన పని లేదని గ్రహించాను. సుశాంత్ మరణంతో చాలా కుంగిపోయాను. తను చనిపోవడానికి మూడు వారాల ముందు సుశాంత్ టీమ్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. అతడు నాతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాడని, నాతో మాట్లాడాలనుకుంటున్నాడని చెప్పారు. నేను మాత్రం కుదరదు, మాట్లాడనని చెప్పేశా. గతంలో నా ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడన్న కోపంతో అలా మాట్లాడాను. కానీ సుశాంత్ చనిపోయాక ఎంత గిల్టీగా ఫీలయ్యానో! తర్వాత ఓసారి అభయ్కు ఫోన్ చేసి అతడికి సారీ చెప్పాను. ఎందుకంటే నేను పబ్లిక్‌గా అతడి గురించి మాట్లాడినందుకు తను హర్ట్ అయ్యాడని తెలిసింది. అందుకే మరేం ఆలోచించకుండా క్షమాపణలు చెప్పాను' అని చెప్పుకొచ్చాడు అనురాగ్ కశ్యప్. I am sorry that I am doing this but this chat is from three weeks before he passed away. Chat with his manager on 22 May .. havent don’t it so far but feel the need now .. yes I didn’t want to work with him for my own reasons .. https://t.co/g4fLmI5g9h pic.twitter.com/cHSqRhW9BD — Anurag Kashyap (@anuragkashyap72) September 9, 2020 చదవండి: నా కన్నీళ్లు నేనే తాగి బతికిన.. నన్నాపకుండ్రి..: రచ్చ రవి కీర్తి సురేశ్ పెళ్లి.. వరుడెవరో తెలిసిపోయింది -
సుశాంత్ పెంపుడు కుక్క మరణం, నెటిజన్ల భావోద్వేగం
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పెంపుడు కుక్క ఫడ్జ్ మరణించింది. ఈ బాధాకర విషయాన్ని సుశాంత్ సోదరి ప్రియాంక సింగ్ సోషల్ మీడియాలో వెల్లడించింది. 'ఫడ్జ్.. స్వర్గంలో ఉన్న నీ ఫ్రెండ్ దగ్గరకు వెళ్లిపోయావు. మేము కూడా ఏదో ఒకరోజు మిమ్మల్ని అనుసరిస్తాం.. అప్పటివరకు మాకీ బాధ తప్పదు' అని భావోద్వేగంతో ట్వీట్ చేసింది. దీనికి సుశాంత్, తాను కుక్కతో కలిసి దిగిన పాత ఫోటోలను జత చేసింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు శునకం మరణంపై విచారం వ్యక్తం చేశారు. 'యజమాని చనిపోయిన తర్వాత కుక్క సంతోషంగా, ఎప్పటిలా మామూలుగా ఉండలేదు. ఆ బాధతోనే ఇన్నేళ్లు బతికి చివరికి తన యజమానిని చేరుకుంది', 'సుశాంత్ గురించి ఏ చిన్నవార్త తెలిసినా తట్టుకోలేకపోతున్నాను.. ఇప్పుడు ఫడ్జ్ చనిపోయిందంటే దుఃఖం దానంతటదే వస్తోంది.. మిస్ యూ ఫడ్జ్' అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే సుశాంత్ ఫడ్జ్‌తో ఆడుకున్న వీడియోలను సైతం షేర్ చేస్తున్నారు. కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020లో జూన్ 14న మరణించాడు. ఆయన ఈ లోకాన్ని విడిచి మూడేళ్లవుతున్నా ఇప్పటికీ ఆయన మరణంపై అనుమానాలు వీడనేలేదు. So long Fudge! You joined your friend’s Heavenly territory… will follow soon! Till then… so heart broken 💔 pic.twitter.com/gtwqLoELYV — Priyanka Singh (@withoutthemind) January 16, 2023 Dear Sushant There's a shadow looming over you. A shadow with a tail He’s crossed over the rainbow bridge. Hope you feel His affectionate kisses happy embraces & trusting eyes again ♥️ Om shanti adorable Fudge thank you for leaving paw prints in our hearts pic.twitter.com/mXaV8XItcs — me4SSR (@memia26645588) January 17, 2023 చదవండి: టీమిండియాతో జూనియర్ ఎన్టీఆర్ -
సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న ఫ్లాట్‌లో అద్దెకు దిగుతున్న ఫ్యామిలీ
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి దాదాపు మూడేళ్లు అవుతోంది. కానీ ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆయన పేరు వినిపిస్తూనే ఉంది. తనది ఆత్మహత్య కాదని హత్యేనని అభిమానులు వాదిస్తూనే ఉన్నారు. ఈ అనుమానాలకు ఆజ్యం పోస్తూ సుశాంత్ బాడీపై గాయాలున్నాయని అతడి పోస్ట్‌మార్టమ్‌కు హాజరైన సిబ్బంది రూప్‌కుమార్ మీడియాకు వెల్లడించడంతో మరోసారి సుశాంత్ మరణంపై చర్చ మొదలైంది. ఇదిలా ఉంటే సుశాంత్ మరణించిననాటినుంచి అతడి ఫ్లాట్ ఖాళీగా ఉంటూ వస్తోంది. ఎవరూ ఆ ఇంట్లో అద్దెకు దిగడానికి ముందుకు రాలేదు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఓ కుటుంబం ఆ ఫ్లాట్‌లో ఉండేందుకు ముందుకు వచ్చిందట. రియల్ ఎస్టేట్ ఏజెంట్ రఫీక్ మర్చంట్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. 'సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్న ఇంట్లోకి వచ్చేందుకు మొదట ఎవరూ ముందుకు రాలేదు. కొందరు రావాలనుకున్నా చివరికి వారి కుటుంబం వద్దనడంతో ఆగిపోయారు. దీనివల్ల ఇంటి యజమాని చాలా కంగారుపడ్డారు. కానీ కాలక్రమేణా ఆ భయాలు కొంత దూరమయ్యాయి. ఇప్పుడిప్పుడే ఆ ఇంటిపై కొందరు మక్కువ చూపిస్తున్నారు. ఓ ఫ్యామిలీ ఆ ఇంట్లో అద్దెకు దిగేందుకు సిద్ధమైంది. నెలకు రూ.5 లక్షలు అద్దె. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.30 లక్షలు కట్టాల్సి ఉంటుంది. ఇది ఆరునెలల రెంట్‌తో సమానం' అని చెప్పాడు. కాగా 2019లో సుశాంత్ ఈ ఫ్లాట్‌కు షిఫ్టయ్యాడు. నెలకు రూ.4.51 లక్షల చొప్పున అద్దె చెల్లించేవాడు. చదవండి: వినరో భాగ్యము విష్ణు కథ.. యంగ్ హీరో ఫ్యాన్స్‌కు బంపరాఫర్ జోర్దార్గా సుజాత బర్త్‌డే సెలబ్రేషన్స్, ఫోటోలు వైరల్ -
సుశాంత్‌ది హత్యే!.. ఇప్పటికైనా న్యాయం చేయండి : సుశాంత్ సోదరి ఆవేదన
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి రెండేళ్లు దాటినా, అతడి మృతికి గల కారణాలు ఏంటన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఇక సుశాంత్‌ది ఆత్మహత్య కాదు, హత్యేనంటూ పోస్టుమార్టం చేసిన బృందంలోని రూప్‌కుమార్ షా అనే వ్యక్తి సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ కేసు మరోసారి తెరమీదకి వచ్చింది. సుశాంత్ బాడీపై పలు గాయాలు ఉన్నాయని పేర్కొన్న రూప్‌కుమార్.. పోస్టుమార్టం జరిగేటప్పుడు వీడియో రికార్డు చేయకుండా కేవలం ఫోటోలు మాత్రమే తీశారని, పైఅధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు త్వరగా పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేశామని వెల్లడించారు. దీంతో సుశాంత్ మరణంపై మరోసారి అనుమానాలు రేకెత్తుతున్నాయి. తాజాగా ఇదే విషయమై ఇప్పటికైనా న్యాయం చేయాలంటూ సుశాంత్ సోదరి ట్వీట్ చేసింది. రూప్‌కుమార్ చేసిన వ్యాఖ్యలను స్క్రీన్‌షాట్స్‌లో జోడించి.. సుశాంత్ కేసును సీబీఐ విచారణ జరిపి నిజనిజాలు ఏంటో బయటకు వెల్లడిస్తారని ఎప్పటినుంచో మేం ఎదురుచూస్తున్నాము. సుశాంత్‌కు న్యాయం జరగాలి అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కాగా 2020 జూన్14న ముంబై బాంద్రాలోని తన ఫ్లాట్‌లో సుశాంత్ మరణించిన సంగతి తెలిసిందే. If there is an ounce of truth to this evidence, we urge CBI to really look into it diligently. We have always believed that you guys will do a fair investigation and let us know the truth. Our heart aches to find no closure as yet. 🙏 CBI Make SSRCase TimeBound pic.twitter.com/g58mj2F37q — Shweta Singh Kirti (@shwetasinghkirt) December 26, 2022 We have to make sure safety of RoopKumar Shah is insured. 🙏 CBI Make SSRCase TimeBound @narendramodi @AmitShah #SushantSinghRajput https://t.co/suY8sCuwrU — Shweta Singh Kirti (@shwetasinghkirt) December 26, 2022 -
సుశాంత్‌ది ఆత్మహత్య కాదు, హత్య: ఆస్పత్రి సిబ్బంది
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి రెండేళ్లుపైనే అయింది. అతడిని బాలీవుడ్ పొట్టనపెట్టుకుందని ఎందరో శాపనార్థాలు పెట్టారు. అసలు ఆయనది ఆత్మహత్య కాదని హత్యేనని ఇప్పటికీ వాదించేవాళ్లు ఉన్నారు. తాజాగా కూపర్ ఆస్పత్రి సిబ్బంది సుశాంత్‌ది ముమ్మాటికీ హత్యేనని ముందుకు రావడం సంచలనంగా మారింది. పోస్ట్ మార్టమ్ చేసేటప్పుడు అతడి శరీరంపై గాయాలున్నాయని చెప్పడంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సుశాంత్ సింగ్ పోస్ట్‌మార్టమ్‌కు హాజరైన సిబ్బంది రూప్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. సుశాంత్ చనిపోయినరోజు మా ఆస్పత్రికి ఐదు శవాలు వచ్చాయి. అందులో ఒకరైన సుశాంత్ శరీరానికి పోస్ట్‌మార్టమ్ చేసేందుకు మేము వెళ్లాము. అప్పుడాయన శరీరంపై, మెడపై గాయాలు కనిపించాయి. పోస్ట్‌మార్టమ్ ప్రక్రియను వీడియో తీయాల్సింది కానీ అధికారులు కేవలం ఫోటోలు మాత్రమే తీయండని చెప్పారు. దీంతో వారి ఆదేశాల ప్రకారం ఫోటోలు మాత్రమే తీసి పంపాము. కానీ సుశాంత్ డెడ్‌బాడీ మొదటిసారి చూసినప్పుడే అది ఆత్మహత్య కాదని, హత్యేనని అర్థమైంది. కానీ అధికారులు వెంటనే ఫోటోలు తీసి డెడ్‌బాడీని పోలీసులకు అప్పజెప్పాలని ఆదేశించడంతో ఆ రాత్రే పోస్ట్‌మార్టమ్ కంప్లీట్ చేశాం అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి సుశాంత్ మరణంపై చర్చకు దారి తీశాయి. ఈ క్రమంలో ట్విటర్లో #SushantSinghRajput హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. కాగా సుశాంత్ సింగ్ 2020 జూన్ 14న ముంబైలోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడాడు. చదవండి: ఈ ఏడాది చివరివారంలో రిలీజవుతున్న సినిమాలు అవతార్ 2 సెన్సేషన్.. వేల కోట్ల వసూళ్లు ఆగడం లేదుగా -
సుశాంత్ మృతిలో ఆదిత్య ఠాక్రే ప్రమేయం ఉందా? దర్యాప్తు స్టేటస్ ఏంటి?
న్యూఢిల్లీ: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి రెండేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు ఈ కేసు విషయాన్ని లోక్‌సభలో లేవనెత్తారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే క్యాంప్ ఎంపీ రాహుల్ షెవాలే. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంలో ఆదిత్య ఠాక్రే ప్రమేయం ఉందా? సీబీఐ దర్యాప్తు స్టేటస్ ఏమిటి? అని ప్రశ్నించారు ఎంపీ. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తికి ఆదిత్య ఠాక్రే 44 సార్లు ఫోన్ చేసినట్లు గతంలో తేలిందని గుర్తు చేశారు. లోక్‌సభలో షిండే వర్గం ఎంపీ రాహుల్ షెవాలే మాట్లాడుతూ..‘ఏయూ నుంచి రియా చక్రవర్తికి 44 సార్లు ఫోన్ వెళ్లింది. ఏయూ అంటే ఆదిత్య ఉద్ధవ్ ఠాక్రే అని బిహార్ పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ప్రస్తుత స్టేటస్ ఏంటి?’అని ప్రశ్నించారు. తిప్పికొట్టిన ఆదిత్య ఠాక్రే.. లోక్‌సభ వేదికగా తనపై చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు ఆదిత్య ఠాక్రే. సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచే వారి నుంచి ఇంతకన్నా ఎక్కువ ఊహించలేమని విమర్శలు గుప్పించారు. ‘నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నానని మాత్రమే చెప్పగలను. సొంత పార్టీకి, ఇంట్లో విధేయుడిగా ఉండని వారి నుంచి ఇంతకు మించి ఆశించలేం. ఇది కేవలం సీఎం ఏక్నాథ్ షిండే భూకుంభకోణం, రాష్ట్ర ప్రముఖులను అవమానించిన అంశాలను పక్కదారిపట్టించేందుకే చేస్తున్నారు. అలాంటి నిరాధారమైన ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు.’ అని స్పష్టం చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలు రియా చక్రవర్తికి ఏయూ అనే వ్యక్తికి మధ్య పలుమార్లు ఫోన్ కాల్స్ నడిచినట్లు 2020లోనే ఓ నివేదిక వెల్లడించింది. మొత్తం 44 కాల్స్ వెళ్లినట్లు పేర్కొంది. సుశాంత్ సింగ్ మరణంపై ఆదిత్య ఠాక్రే మౌనంగా ఉండిపోవడంతో ఏయూ అంటే ఆదిత్య ఠాక్రే అని బిహార్ ప్రభుత్వం ఆరోపించింది. యాదృచ్చికంగా ఆ సమయంలో ఆదిత్య ఠాక్రే ట్విట్టర్ ఖాతా @AUThackeray అని ఉండటం ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్లయింది. ఇదీ చదవండి: సుశాంత్.. నువ్వు లేకుండా జీవితం లేదు: రియా భావోద్వేగం -
సుశాంత్ సింగ్ నటించిన ఆ సినిమా రీమేక్‌లో రజనీకాంత్!
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించే చిత్రాల గురించి ప్రస్తావించగానే ఆయన అభిమానుల్లో ఎక్కడలేని జోష్ వస్తుంది. అయితే ఇటీవల సక్సెస్ ఆయనతో దోబూచులాడుతుందనే చెప్పాలి. బాషా, పడయప్పా, రోబో లాంటి హిట్ కోసం ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న జైలర్ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రాన్ని నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. నటి రమ్యకృష్ణ, కన్నడ నటుడు శివరాజ్ కుమార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న జైలర్ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా తదుపరి రజనీకాంత్ లైకా ప్రొడక్షన్స్‌లోనే వరుసగా రెండు చిత్రాలు చేయబోతున్నారు. అందులో ఒక చిత్రానికి డాన్ చిత్రం ఫేమ్ విను చక్రవర్తి దర్శకత్వం వహించనున్నారు. రెండో చిత్రానికి రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించనున్నారు. దీనికి లాల్ సలాం అనే టైటిల్ నిర్ణయించారు. ఇందులో విష్ణు విశాల్ కథానాయకుడిగా నటించనున్నారు. కాగా సూపర్ స్టార్ రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. అతిథి పాత్రే అయినా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. తాజాగా జరుగుతున్న ప్రచా రం ఏమిటంటే హిందీలో సుశాంత్ సింగ్ నటించిన సూపర్ హిట్ చిత్రం కైపో చేకు రీమేక్ అని. క్రికెట్ క్రీడ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రాజకీయ అంశాలతో పాటు మతపరమైన వివాదాస్పద సన్నివేశాలు ఉన్నాయి. రజనీకాంత్ అతిథి పాత్రలో నటించేది హిందీ చిత్రం కైపో చేకు రీమేక్ అయితే కచ్చితంగా సంచలనాత్మక కథా చిత్రమే అవుతుంది. -
సుశాంత్ సూసైడ్‌ను తట్టుకోలేకపోయింది, కానీ ఇప్పుడు..
ప్రముఖ సీరియల్ 'యే రిష్తా క్యా కెహ్లాతా హై' నటి వైశాలి టక్కర్(30) ఆత్మహత్య చేసుకుంది. మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని తన నివాసంలో ఆదివారం ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభ్యమైందని పోలీసులు తెలిపారు. కాగా వైశాలి.. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు అత్యంత ఆప్త మిత్రురాలు. 2020లో జూన్ 14న సుశాంత్ సూసైడ్ చేసుకున్నప్పుడు వైశాలి అతడి మరణాన్ని జీర్ణించుకోలేక రెండు మూడురోజులపాటు ఏకధాటిగా ఏడ్చింది. ఆ సమయంలో స్పాట్బైకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'సుశాంత్‌ది ఆత్మహత్య కాదు, హత్యేనని అందరూ అంటున్నారు. అతడి మృతదేహం మీద ఉన్న కొన్ని గుర్తులను చూస్తుంటే ఎక్కడో ఏదో జరిగిందనిపిస్తోంది. ఏ ఒక్కరో ఈ పనికి పూనుకోలేదు. మూవీ మాఫియానే అతడిని చంపేసింది. అసలు నిందితులు నటి రియా చక్రవర్తి వెనకాల దాక్కునేందుకు ప్రత్నిస్తున్నారు. అలా అని రియా తప్పు లేదనట్లేదు. సుశాంత్ అలాంటి దుస్థితికి రావడానికి ఆమె కూడా ఓ కారకురాలే'నని మండిపడింది. తన స్నేహితుడు అన్యాయంగా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడని బాధపడిన వైశాలి.. చివరకు సుశాంత్ బాటలోనే నడిచి సూసైడ్ చేసుకోవడం గమనార్హం. చదవండి: బుల్లితెర నటి ఆత్మహత్య ఉత్కంఠ రేపుతున్న మిలి ట్రైలర్ -
సోనాలి ఫోగట్ మృతి కేసు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులా కానివొద్దు
చండీగఢ్: హర్యానా బీజేపీ నేత సోనాలి ఫోగట్ మృతిపై అనుమానాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పోలీసులు ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేసినా ఆమె మరణానికి గల కారణాలపై మిస్టరీ వీడటం లేదు. ఈ నేపథ్యంలో సోనాలి ఫోగట్ కుటుంబసభ్యులు ఈ కేసును బాలీవుడ్ దివంగత నుటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుతో పోల్చుతున్నారు. ఫోగట్ మృతి కేసు కూడా సుశాంత్ కేసులా కాకూడదని అంటున్నారు. 'సుశాంత్ సింగ్ హత్యకు గురై ఉంటాడని ఆయన కుటుంబసభ్యులు ఇంకా నమ్ముతున్నారు. రియా చక్రవర్తి అతనికి డ్రగ్స్ ఇచ్చింది. అయినా ఇప్పుడు ఆమె బయటే ఉంది. కేసు విచారణ ఇంకా పూర్తి కాలేదు. ఆ కేసు డ్రగ్స్ గురించి కాదు. హత్య గురించి' అని సోనాలి ఫోగట్ సోదరుడు కుల్దీప్ ఫోగట్ అన్నారు. సోనాలి ఫోగట్ మృతికి కారణమైన వారిని ఉరి తీయాలని కుల్దీప్ డిమాండ్ చేశారు. ఒకవేళ ఆమె హత్యకు గురైందని పోలీసులు రుజువు చేయలేకపోతే సీబీఐని ఆశ్రయిస్తామన్నారు. నార్కో టెస్టు కూడా నిర్వహించాలని కోరుతామన్నారు. కుటుంబసభ్యుల అనుమతి అనంతరం సోనాలి భౌతికకాయానికి గురువారం పోస్టుమార్టం చేశారు వైద్యులు. ఆమె శరీరంపై గాయాలున్నట్లు గుర్తించారు. దీంతో గోవా పోలీసులు సోనాలి మృతిని హత్య కేసుగా నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆమె సహాయకులిద్దరితో పాటు క్లబ్ ఓనర్, డ్రగ్ పెడ్లర్‌ను అరెస్టు చేశారు. చదవండి: సోనాలి ఫోగట్ దారుణ హత్య.. ఆ రెండున్నర గంటలేం జరిగింది? -
దివంగత నటుడికి ఘోర అవమానం.. ఫ్లిప్‌కార్ట్ ‘ఛీ’ ప్ ట్రిక్స్!
Boycott Flipkart: ఇటీవల కంపెనీలు ప్రతీది వ్యాపార కోణంలోనే చూస్తున్నాయి. తమ వస్తువుల మార్కెటింగ్ విషయంలో కంటెంట్‌ని కాకుండా కాంట్రవర్శీతో లాభాలను పొందాలని భావిస్తున్నాయి. సోషల్ మీడియా వాడకం పెరిగినప్పటి నుంచి ఇలాంటి వాటినే పబ్లిసిటీ స్టంట్‌గా చేసుకుని దాన్ని వ్యాపారంగా మార్చుకోవాలని చూస్తున్నాయి. ప్రస్తుతం ఇదే తరహాలో దేశంలోని అతిపెద్ద ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ పాటించింది. వీళ్ల మార్కెటింగ్ పైత్యం చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగింది.. ఈ కామర్స్ సైట్లో ఓ టీ-షర్ట్ పై సుశాంత్ ఫోటోతో పాటు "డిప్రెషన్ ఈజ్ డ్రోయింగ్" అనే ట్యాగ్‌లైన్‌తో వాటిని అమ్ముతున్నారు. ఇదే కాంట్రవర్సీకి తెర తీసింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోటోని చూసిన సుశాంత్ సింగ్ అభిమాని, ట్విటర్లో పోస్ట్ చేస్తూ బాయ్‌కాట్ ఫ్లిప్‌కార్ట్ హ్యాష్‌ట్యాగ్ పెట్టాడు. అప్పటి నుంచి ఈ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయిపోయింది. వెంటనే అన్ని ఇ-కామర్స్ సైట్ నుంచి ఆ టీ షర్ట్‌లని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ .. తమ వస్తువుల సేల్ కోసం ఇంతకి దిగజారుతారా అని కామెంట్ చేయగా, మరొకరు ఫ్లిప్‌కార్ట్‌కి ఎందుకీ పైత్యం.. ఇలాంటి చీప్‌ట్రిక్స్ ఆపాలంటూ కామెంట్ చేశారు. మరొక యూజర్ "చనిపోయిన వ్యక్తి ఫోటోను టీ షర్ట్‌పై పెట్టడమే కాకుండా, అలాంటి కోట్‌ను యాడ్ చేస్తారా" అంటూ ఓ నెటిజన్ తీవ్రంగా మండిపడ్డాడు. How dare you @Flipkart & @amazon call Sushant depressed? There is absolutely no evidence proving he was depressed. Stop maligning Sushant's image Remove it right now#BoycottFlipkart #boycottAmazon Smear Campaign Against SSR pic.twitter.com/uH0M5wknYI — Justice seeker-Kritika🔱 (@Kritika4Sushant) July 27, 2022 చదవండి: New Delhi: దేశంలో ఆఫీస్ స్పేస్.. ఆ నగరం చాలా కాస్ట్లీ గురూ! -
వేలెత్తి చూపేలా ఎదుగు: సుశాంత్ సోదరి కామెంట్స్‌కి రియా కౌంటర్
రియా చక్రవర్తి.. పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. హీరోయిన్గా తెరపై కంటే దివంగత నటుడు సుశాంత్ సింగ్ మృతి, డ్రగ్స్ కేసులో ఈమే పేరు ఎక్కువగా వినిపించింది. సుశాంత్ ప్రియురాలైన రియా అతడి మృతి, డ్రగ్స్ కేసులో కీలక వ్యక్తిగా మారింది. 2020లో సంచలనం సృష్టించిన ఈ కేసు ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. ఈ కేసు విచారణ చేప్పట్టిన నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) రీసెంట్గా ఆమెపై చార్జీషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ మృతికి ఆమె ప్రధాన కారణమని, అతడికి డ్రగ్స్ కొని తెచ్చిందని ఎన్సీబీ పేర్కొంది. చదవండి: లలిత్ మోదీ కంటే ముందు 9 మందితో సుష్మితా డేటింగ్, వారెవరంటే! ఇప్పిటికే రియాపై పీకలదాకా కోపంతో ఉన్న సుశాంత్ కుటుంబ సభ్యులు ఎన్సీబీ చార్జిషీట్ అనంతరం గుప్పుమన్నారు. పలు సందర్భాల్లో రియాపై మాటల దాడికి దిగిన సుశాంత్ సోదరి ప్రియాంక సింగ్ తాజాగా ఆమెను టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘2019లో అన్నయ్య(సుశాంత్ సింగ్) జీవితంలోకి రియా వచ్చినప్పుడే మా జీవితాలు నాశనమయ్యాయి. సుశాంత్‌కు క్లబ్‌లు, పార్టీలు అలవాటు లేదు. అందుకే అందుకే బాలీవుడ్ పెద్దలు కొందరు రియాను నియమించి సుశాంత్‌ను అలా తయారు చేశారు’ అంటూ మండిపడింది. ఇక ఆమె కామెంట్స్‌పై రియా స్పందిస్తూ కౌంటర్ ఇచ్చింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కొట్ను షేర్ చేసింది. చదవండి: యంగ్ హీరో ఇంట తీవ్ర విషాదం ‘శబ్దానికి, ఈగోకు అతీతంగా ఎదుగు. నీవైపు వేలెత్తి చూపేలా ఎదుగు. ఎందుకంటే వారు చేరుకొలేని స్థానంలో నువ్వు ఉండాలి. నువ్వు ప్రశాంతంగా ఉండాలి. ప్రేమతో ఎగరాలి. ఏ కారణం లేకుండానే నువ్వు వారిపట్ల కరుణతో ఉండాలి. నువ్వు వారిని ఆశ్చర్యపరచాలి. నీలా నువ్వు ఉండు. అదే నువ్వు. అదే నీ జీవితం. అంతేకాని ఇతరులు చెప్పేలా నువ్వు ఉండకు’ అంటూ ఆసక్తిగా పోస్ట్ పెట్టింది. కాగా రియా, ఆమె సోదరుడు సోవిక్ చక్రవర్తితో పాటు మరో 34 మంది పేర్లను ఎన్సీబీ ఈ తమ చార్జీషీట్ల పేర్కొంది. కాగా రియా డ్రగ్స్ కొనుగోలు చేసి సుశాంత్‌కు ఇవ్వడం వల్లే అతడు ఈ అలవాటుకు బానిసయ్యాడని, సుశాంత్ మరణానికి రియా ఇచ్చిన డ్రగ్సే కారణమని ఎన్సీబీ తమ చార్జీషీట్లో వెల్లడించింది. -
షాకింగ్.. రియాపై ఎన్సీబీ చార్జిషీట్, పదేళ్లు జైలు శిక్ష తప్పదా?
2020లో కలకలం రేపిన దివంగ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డ్రగ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఆయన ప్రియురాలు, నటి రియా చక్రవర్తి డ్రగ్ కోనుగోలు చేసి సుశాంత్‌కు ఇచ్చినట్లు ఆరోపిస్తూ తాజాగా నేషనల్ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) చార్జిషీట్ దాఖలు చేసింది. ఆమెతో మరో పాటు 34 మంది పేర్లను ఎన్సీబీ ఈ చార్జీషీట్ల పేర్కొంది. కాగా రియా డ్రగ్స్ కొనుగోలు చేసి సుశాంత్‌కు ఇవ్వడం వల్లే అతడు ఈ అలవాటుకు బానిసయ్యాడని, సుశాంత్ మరణానికి రియా ఇచ్చిన డ్రగ్సే కారణమని ఎన్సీబీ తమ చార్జిషీట్లో వెల్లడించింది. చదవండి: అతియా, రాహుల్ పెళ్లి డేట్‌పై క్లారిటీ ఇచ్చిన సునీల్ శెట్టి రియా, ఆమె సోదరుడు సోవిక్ చక్రవర్తితో పాటు ఆమె ఎవరెవరి దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసిందో వారిని కూడా ఎన్సీబీ నిందితులు పేర్కొంది. ఇక కోర్టులో ఎన్సీబీ చార్జిషీట్లో చేసిన అభియోగాలు రుజువైతే మాదక ద్రవ్వాల నిరోధక చట్టం కింద రియాకు పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు. ఎన్సీబీ తమ చార్జీషీట్లో.. రియా, ఆమె సోదరుడుతో పాటు ఇతర నిందితలంత మార్చి 2020 నుంచి డిసెంబర్ 2020 మధ్య బాలీవుడ్లో డ్రగ్స్ పంపిణీ చేయడానికి, విక్రయించేందుకు ఒక గ్రూప్‌గా ఏర్పడి డ్రగ్స్ సప్లై చేశారు. చదవండి: డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్‌కి మధ్య మనస్పర్థలు,నిలిచిపోయిన షారుక్ మూవీ! నిందితులు ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో మాదకద్రవ్యాల అక్రమ రావాణకు ఆర్థికంగా సహాయం చేశారని, గంజాయి, చరస్, కొకైన్‌తో పాటు ఇతర మాదకద్రవ్యాలు సైకోట్రోపిక్ పదార్థాలను ఉపయోగించారని ఎన్సీబీ పేర్కొంది. రియా సోదరుడు సోవిక్ చక్రవర్తి మాదక ద్రవ్యాలు సరఫర చేసే ముఠా తరచూ సంప్రదింపులు చేశాడని తెలిపింది గంజాయి, చరస్ ఆర్డర్ చేసిన అనంతరం ఇతర నిందితుల నుంచి దాన్ని పొందేవాడని, ఎన్డిపీఎస్ చట్టానికి సంబంధించిన కేసులను విచారిస్తున్న ప్రత్యేక న్యాయమూర్తి విజి రఘువంశీ ఈ కేసు విచారణను జూలై 27కువ వాయిదా వేశారు. కాగా ఈ కేసులో రియా 2020 సెప్టెంబర్‌లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నెల రోజులకు ఆమె బెయిలుపై బయటకు వచ్చింది. -
సుశాంత్.. నిన్ను చాలా మిస్ అవుతున్నా: రియా చక్రవర్తి
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదట టీవీ సీరియల్స్‌లో ప్రారంభమైన అతని కెరీర్ ఆ తర్వాత స్టార్ హీరో రేంజ్‌కు ఎదిగింది. ఎంఎస్ ధోనీ, చిచోరే వంటి చిత్రాలతో మరింత పాపులర్ అయ్యాడు. స్టార్ స్టేటస్‌తో కేరీర్లో దూసుకుపోతున్న సమయంలోనే అర్థాంతరంగా తనువు చాలించాడు. సుశాంత్ మనకు దూరమై రెండేళ్లయినా ఇంకా అతని మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నేడు(శుక్రవారం) సుశాంత్ 36వ జయంతి. ఈ సందర్భంగా అభిమానులు సహా పలువురు సోషల్ మీడియా వేదికగా సుశాంత్‌కు నివాళులు అర్పిస్తున్నారు. సుశాంత్ మరణించే సమయంలో ప్రియురాలుగా ఉన్న రియా చక్రవర్తి సైతం సుశాంత్‌కు బర్త్‌డే విషెస్ తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. జిమ్‌లో ఇద్దరూ వర్కవుట్స్ చేస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. మిస్ యూ సో మచ్ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా సుశాంత్‌తో కలిసి దిగిన ఓ ఫోటోను సైతం ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ లవ్ ఎమోజీని జతచేసింది. ప్రస్తుతం రియా షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) -
నువ్వు లేవు.. నీ డ్రీమ్స్ అలాగే ఉన్నాయ్!
Sushant Singh Rajput Birth Anniversary: చెదరని చిరునవ్వు, భవిష్యత్తంతా ఈ కుర్రాడిదే అన్నంత అద్భత నటన. అతని టాలెంట్ చూసి పెద్ద స్టార్ అవుతాడు అనుకున్నారు అంతా. కానీ అంతలోనే అనూహ్యంగా ఆ చుక్కల్లో కలిసిపోయాడు. అతడే బాలీవుడ్ విలక్షణ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. కరియర్లో ఎదుగుతున్న తరుణంలో అకస్మాత్తుగా ప్రపంచానికి గుడ్ బై చెప్పేశాడు. రెండేళ్ల క్రితం సుశాంత్ అకాలమరణం యావత్ సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. జనవరి 21 సుశాంత్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పుట్టినరోజు. సుశాంత్ ఈ లోకంలో ఉండి ఉండే ఈ రోజు తన 36వ బర్త్‌డేను సోదరీమణులు, అభిమానుల మధ్య గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేవాడు. బట్..అన్నీ మనం అనుకున్నట్టు జరగవు మిస్ యూ బ్రో అంటూ అభిమానులు సుశాంత్‌ను గుర్తు చేసుకుంటున్నారు. నువ్వు ఎక్కడున్నా నీ ఆత్మకు శాంతి కలగాలి..హ్యాపీ బర్త్‌డే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంటున్నారు. సుశాంత్ కలగన్న ఆ 50 డ్రీమ్స్ తమకు స్పూర్తి అని కమెంట్ చేస్తున్నారు. 1986 జనవరి 21 న పాట్నాలో కృష్ణ కుమార్ సింగ్, ఉషా సింగ్ దంపతులకు పుట్టాడు సుశాంత్ సింగ్. నటన అంటే మక్కువతో మోడల్‌గా రాణించాడు. ఆ తరువాత కిస్ దేశ్ మే హై మేరా దిల్ అనే టీవీ సీరియల్‌తో 2008లో టీవీ నటుడిగా బుల్లితెరకు పరిచయమయ్యాడు. అలా 2013లో కోటి ఆశలతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టాడు. తొలి మూవీ ‘కై పో చే’ లో నటనకు ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నాడు. అలా తనకంటూ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా, పెద్దోళ్ల అండ లేకపోయినా స్వశక్తితో ఎదిగాడు. బుల్లితెర మీద తిరుగులేని స్టార్ ఇమేజ్ అందుకున్న యువ నటుడు బిగ్ స్క్రీన్‌పై కూడా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, డిటెక్టివ్ బ్యోమ్కేష్ భక్షి, ‘పీకే’, ‘ఎం.ఎస్. ధోని : ద అన్‌టోల్డ్ స్టోరీ’, ‘రాబ్తా’, ‘కేదార్ నాథ్’, ‘చిచ్చోరే’, ‘దిల్ బెచారా’ లాంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న సుశాంత్. చదువుకునే రోజుల్లో జీనియస్ అని పేరు తెచ్చుకుని జాతీయ స్థాయి ఒలింపియాడ్ ఫిజిక్స్‌లో విజేతగా నిలిచాడు. సుశాంత్ కేవలం హీరోగానే కాదు, డ్యాన్సర్‌గా, దాతగా పేరు తెచ్చుకున్నాడు. A place where WWW was invented. A place that discovered the God (damn:) particle. A place of numerous divine collisions. A place where Matter matters. 😉 A big thanks to #CERN for being so welcoming and making my dream come true. —Dream 17/50 ✅ #livingMyDreams#lovingMyDreams pic.twitter.com/LEnwdSmwSw — Sushant Singh Rajput (@itsSSR) October 15, 2019 కమర్షియల్‌గా సక్సెస్‌ను సాధిస్తూ కరియర్ అలా సాగుతున్నతరుణంలో నెపోటిజమో, మానసిక ఒత్తిడో, ధైర్యాన్ని కోల్పోయాడో తెలియదు కానీ 2020 జూన్ 14 న శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ ముంబైలోని అతని అపార్ట్మెంట్లో ఉరివేసుకుని చనిపోవడంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భౌతిక శాస్త్ర ప్రయోగాలు, ప్రకృతి, క్రికెట్, విమానాన్ని నడపడం, అంతరిక్షం, మొక్కలు నాటడం, సిక్స్ ప్యాక్ బాడీ, ఒక పుస్తకం రాయడం,లాంబోర్గిని కారు ఇలాంటి 50 కలల్ని రాసిపెట్టుకున్న సుశాంత్ అర్థాంతరంగా తనువు చాలించడం ఒక మిస్టరీ. ఆత్మహత్యే అని పోలీసులు చెప్పినా, చిచ్చోరే సినిమాద్వారా ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదని సందేశం ఇచ్చిన హీరో సుశాంత్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది. Like the shadow I am and I am not... ~ Jalaluddin Rumi ❤️ pic.twitter.com/Ejj1X6LSyV — Sushant Singh Rajput (@itsSSR) October 26, 2019 -
Maharashtra: సీఎం కొడుకు ఆదిత్య ఠాక్రేకు బెదిరింపులు..
సాక్షి, ముంబై, బెంగళూరు: మహారాష్ట్ర సీఎం కుమారుడు, పర్యాటక– పర్యావరణ మంత్రి అయిన ఆదిత్య ఠాక్రేను బెదిరించిన కేసులో ముంబై పోలీసులు గురువారం బెంగళూరులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన వ్యక్తి జైసింగ్ రాజపుత్‌గా గుర్తించారు. ఇతడిని ముంబై క్రైం బ్రాంచ్ సైబర్ విభాగం పోలీసులు అరెస్ట్‌చేసి ముంబైకి తీసుకెళ్లారు. కాగా ఈ నెల 8వ తేదీన మంత్రికి జైసింగ్ ఫోన్ చేశాడు. మంత్రి ఫోన్ తీయకపోవడంతో రాజపుత్ ప్రాణహాని బెదిరింపులతో మళ్లీ మెసేజ్ పంపించాడు. ఈ నేపథ్యంలో నిందితున్ని గురువారం అరెస్ట్ చేశారు. గతంలో ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌కు ఇతడు అభిమాని అని, ఆ ఘటనకు సంబంధించి బెదిరింపు సందేశాలను పంపినట్లు తెలిసింది. చదవండి: మిత్రుడితో తరుచూ ఫోన్లు.. ఇంటినుంచి పారిపోయే ప్రయత్నంలో.. చదవండి: ‘మహా’ అసెంబ్లీ సమావేశాలు: 10 మందికి పాజిటివ్ -
రియా చక్రవర్తి పోస్ట్.. 'ఇట్స్ ఓకే టు నాట్ బీ ఓకే' అంటూ హ్యాష్‌ట్యాగ్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత రియా చక్రవర్తి సోషల్ మీడియాకు దూరంగా ఉంది. కానీ ఇప్పుడు, ఆమె తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో అద్భుతమైన సందేశాలను పంచుకుంటుంది. ఇటీవల, నటి జీవితం గురించి ఒక విషయాన్ని షేర్ చేసింది. రియా చక్రవర్తి తన ఇన్‌స్టా గ్రామ్‌లో 'నవ్వుతూ ఉండు.. ఎందుకంటే ఇప్పుడున్నదే జీవితం' అంటూ నవంబర్ 16న స్టోరీ షేర్ చేసింది. అలాగే దానికి 'ఇట్స్ ఓకే టు నాట్ బీ ఓకే' అని ఒక హ్యాష్‌ట్యాగ్‌ను ఇచ్చింది. సెండింగ్ యూ లవ్ అంటూ అని కూడా రాసి లవ్ ఎమోజీని పెట్టి స్టోరీని ముగించింది. జూన్ 14న నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మొదటి వర్ధంతి సందర్భంగా సుశాంత్‌తో ఉన్న చిత్రాన్ని షేర్ చేసింది రియా. ఆ పోస్ట్‌లో 'నువ్వు ఇక్కడ లేవని నేను నమ్మే క్షణం కూడా లేదు. సమయం అన్నింటిని నయం చేస్తుందని అంటారు. కానీ నా సమయం, నా సర్వస్వం అన్ని నువ్వే. అవును నువ్ ఇప్పుడు నన్ను కాపాడే సంరంక్షకుడివి అని నాకు తెలుసు. చంద్రుని నుంచి టెలిస్కోప్‌తో నన్ను చూస్తున్నావు, నన్ను రక్షిస్తున్నావు.' ఇలా ప్రేమగా రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) -
సుశాంత్ సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం
Sushant Singh Rajput Relatives Died In Road Accident In Bihar: దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుశాంత్ కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. సుశాంత్ బంధువు ఓం ప్రకాశ్ సింగ్ సోదరి అంత్యక్రియలకు హాజరైన అనంతరం పాట్నా నుంచి తిరిగి వస్తుండగా లఖిసరాయ్ జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. వారు ప్రయాణిస్తున్న సుమో ట్రక్‌ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో మొత్తం 10మంది ఉన్నారు. వారిలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో సుశాంత్ మేనల్లుడు సహా బావ, హర్యానా కేడర్ ఐపీఎస్ ఓం ప్రకాశ్ సింగ్ సమీప బంధువులు ఉన్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రిలో చేర్పించారు. చదవండి: భర్త విషయంలో షాకింగ్ డెసిషన్ తీసుకున్న కాజల్ Bhumika Chawla: 'నా కోసం ముంబై వచ్చిన మేకర్స్ చాలామంది ఉన్నారు' -
ముంబై స్పెషల్ కోర్టులో రియాకు ఊరట
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆయన ప్రియురాలు రియా చక్రవర్తికి ముంబై స్పెషల్ కోర్టులో ఊరట లభించింది. సుమారు 14 నెలల నుంచి సీజ్‌లో ఉన్న ఆమె బ్యాంక్ ఖాతాలను తిరిగి ఉపయోగించుకోవడానికి న్యాయస్థానం ఆమోదం తెలిపింది. సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్న రియా గతేడాది సెప్టెంబర్‌లో అరెస్టై జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా ఎన్సీబీ అధికారులు ఆమె బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. అంతేగాక ఆమె ల్యాప్‌టాప్, సెల్ఫోన్లను కూడా ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: అవన్నీ రూమర్స్ అంటూ కొట్టిపారేసిన నటి రియా చక్రవర్తి ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం బెయిల్‌పై బయటకు వచ్చిన రియా.. తన బ్యాంక్ ఖాతాలను తిరిగి తన విడుదల చేయాలని స్పెషల్ కోర్టును అభ్యర్థించింది. ఈ మేరకు ఆమె పిటిషన్ దాఖలే చేస్తూ ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పోషణ నిమిత్తం తన బ్యాంక్ ఖాతాలను వెంటనే విడుదల చేయాలని పటిషన్లో పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. వాదోపవాదాలు విన్న తర్వాత.. రియా బ్యాంక్ ఖాతాలను తిరిగి అప్పగించాలని ఆదేశించింది. అంతేకాకుండా ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ని సైతం తిరిగి ఆమెకే ఇచ్చేయమని తీర్పులో పేర్కొంది. విచారణ పూర్తి అయ్యే వరకూ సెల్, ల్యాప్‌టాప్‌లను విక్రయించవద్దని కోర్టు రియాను ఆదేశించింది. -
సుశాంత్ ఆత్మహత్య కేసులో కొత్త మలుపు..
బాలీవుడ్ నటుడు సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసును పూర్తి చేసేందుకు సీబీఐ అమెరికాను ఆశ్రయించింది. ఈ దర్యాప్తు సంస్థ మ్యూచ్‌వల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ (MLAT) కింద డిలీట్ అయిన సుశాంత్ చాట్స్, ఈ-మెయిల్స్ డాటా కావాలని గూగుల్, ఫేస్‌బుక్‌లను కోరింది. ఇందుకు గానుకాలిఫోర్నియాలోని గూగుల్, ఫేస్బుక్ ప్రధానకార్యాలయానికి చేరుకుంది సీబీఐ. అలాగే నటుడికి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్, ఈ-మెయిల్, లింక్ ఏదైనా ఉండిపోయిందా లేదా ధ్రువీకరించాలన్నారు. ఈ కేసు పూర్తి చేయడానికి సీబీఐ ఏ చిన్న ఆధారాన్ని కూడా విడిచిపెట్టేలా లేదని తెలుస్తోంది. సుశాంత్ సింగ్ కేసులో సీబీఐ ఎలాంటి నిర్ధారణకు రాకపోయేసరికి డిలీటైన చాట్, ఈమేయిల్స్ కోరినట్లు సుశాంత్ ఫ్యామిలీ లాయర్ వికాస్ సింగ్ తెలిపారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14, 2020న ఆత్మహత్యకు పాల్పడిన విషయం విధితమే. ఎయిమ్స్‌లోని ఫోరెన్సిక్ బృందం సుశాంత్ మరణాన్ని ఆత్మహత్యగా ప్రకటించినప్పటికీ, సీబీఐ అది ఆత్మహత్య లేదా హత్యకు ప్రేరేపణ అని పేర్కొంది. సుశాంత్ సింగ్ మరణం తర్వాత ముంబై పోలీసులు దర్యాప్తు చేసి ఆత్మహత్యగా నిర్ధారించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని అరెస్టు అయ్యింది. ఆమె సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించిందని సుశాంత్ కుటుంబ సభ్యులు ఆరోపించడంతో సుశాంత్ మరణం దేశవ్యాప్తంగా కాంట్రవర్సీ అయింది. చదవండి: దయచేసి నన్ను ఫాలో కావొద్దు అనంతరం కేసును బెదిరింపు, ప్రేరేపణ కింద నమోదు చేసి ఆ తర్వాత సీబీఐకి అప్పగించారు. సీబీఐకి బదిలీ అయిన తర్వాత సుశాంత్ ఇంట్లో ఉన్న సిబ్బంది, రియా, ఆమె సోదరుడు షోవిక్‌ల వాంగ్మూలాలను చాలాసార్లు ఏజెన్సీ నమోదు చేసింది. ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సహా మరో రెండు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. సుశాంత్ మరణానికి సంబంధించి ఎన్సీబీ అనేక మందిని అరెస్టు చేసింది, ఇందులో రియా, ఆమె సోదరుడు షోవిక్ డ్రగ్స్ కేసులో ఉన్నారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన చాట్ బయటపడిన తర్వాత దీపికా పదుకొణెతో సహా పలువురు బాలీవుడ్ యాక్టర్స్ ఏ జాబితాలో చేర్చి విచారణ జరిపారు. చదవండి: ‘సుశాంత్ సింగ్ చావును క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు...!’ నిజానిజాలను వెలికితీయడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఈ కేసులో సీబీఐ ఇంకా నిర్ధారణకు రాలేదు. దీంతో ఇప్పుడు మ్యూచ్‌వల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ (MLAT) ద్వారా యూఎస్ సహాయం కోరుతోంది. ఈ దర్యాప్తు తర్వాత సుశాంత్ సింగ్ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన మరికొన్ని వివరాలు తెలిస్తే కేసులో మరిన్నికొత్త కోణాలను చూడవచ్చు. -
ఆ ఒక్క క్షణం ఆగి ఆలోచించి ఉంటేనా..
World Suicide Prevention Day 2021: మనిషికి జంతువుతో పోలిస్తే ఉన్న అడ్వాంటేజ్.. మనుగడ పోరాటంలో తెలివితేటల్ని, విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకోగలగడం. నోరు లేని మూగజీవాలు ఎలాగోలా తమ బతుకుల్ని నెట్టుకొస్తుంటే.. అన్నీ ఉన్నా సంఘజీవి మనిషి మాత్రం పిరికితనంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నాడు. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలెన్నో బతుకుల్ని బుగ్గిపాలు చేస్తుంటే.. అందులో ఒకటైన ఆత్మహత్య మనిషిని మానసికంగా కుంగదీసి మరీ చంపేస్తోంది. ఒకవేళ ఆ ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే.. నెగెటివ్ అంశాలెన్నో పాజిటివ్‌గా మారిపోవడమే కాదు.. మరో మలుపు తిరిగి జీవితంలో అద్భుతాలు జరగొచ్చేమో కదా! ► సమస్యలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ, ప్రాణం పోతే తిరిగి రాదు. ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదు. ►ఆత్మహత్యలను నివారించేందుకు, అది ఎంత పెద్ద నేరమో అవగాహన కల్పించేందుకు ప్రతీ ఏటా ఒక దినం నిర్వహిస్తున్నారు. ►ప్రతీ ఏటా ఆత్మహత్యా నివారణ దినోత్సవం సెప్టెంబర్ 10న జరుపుతున్నారు. ►ఈ ఏడాది థీమ్ ఏంటో తెలుసా? ‘బతకాలనే ఆశను అవతలివాళ్లలో సృష్టించడం.. అదీ చేతల ద్వారా’. ►కరోనా వల్ల మనిషిలో మానసికంగా కుంగుబాటు ఎక్కువ అయిపోయింది. ►ఉద్యోగాలు కోల్పోవడం, ఉపాధి అవకాశాలు పోగొట్టుకోవడం, అయినవాళ్లను దూరం చేసుకోవడం, సోషల్ గ్యాదరింగ్‌లు లేకపోవడం వల్ల మనిషి.. నిరాశానిస్పృహలోకి నెట్టేస్తున్నాయి. క్షణికావేశంలో అయినవాళ్లకు, అభిమానించేవాళ్లకు దూరంగా వెళ్లిపోతున్నారు. ►కిందటి ఏడాది బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హఠాన్మరణం తర్వాత దేశవ్యాప్తంగా డిప్రెషన్-సూసైడ్‌ల గురించి విస్తృత చర్చ నడిచింది. అంతకు ముందు ఆత్మహత్యలు చేసుకున్న సెలబ్రిటీలతో పాటు యువత మానసిక స్థితి గతులపై సమీక్ష నిర్వహించేందుకు మేధావులకు, మానసిక నిపుణులకు అవకాశం ఇచ్చింది. ►అందుకే ఈ ఏడాది “Creating Hope Through Action” థీమ్ తెచ్చారు ►వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. ది ఇంటర్నేషనల్ అసోషియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్(IASP), వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్(WFMH) సంయుక్తంగా ఈ రోజును నిర్వహిస్తారు. ►2003లో తొలిసారి ఈ దినోత్సవాన్ని నిర్వహించారు ►వందల్లో 60 మంది ఆత్మహత్యలకు పాల్పడడానికి కారణం.. ఒంటరిమనే భావన. కష్టకాలంలో సరైన ఓదార్పు లేకపోవడం. ►ఆర్థిక కారణాలు, బంధాలు, అయినవాళ్లతో గొడవలు కూడా మనిషిని ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నాయి. ►కాలు విరిగినా, చెయ్యి విరిగినా ఎలా విశ్రాంతి తీసుకుంటామో.. అలాగే మనసుకు విశ్రాంతి ఇవ్వాలి. ►సపోర్ట్‌గా నిలవాల్సింది సొసైటీనే. అంటే కుటుంబ సభ్యులు, స్నేహితులు, చుట్టుపక్కల ఉండే ఎవరైనా కావొచ్చు. ►సెన్సిటివ్ బిహేవియర్.. అంటే అప్పటిదాకా ధైర్యంగా ఉన్న మనిషి, చిన్న సంఘటనతోనూ కుంగుబాటుకు గురై ఆత్మహత్యకు పాల్పడే అవకాశాలు ఉండొచ్చు. కాబట్టి, వరుస దెబ్బలతో నిరాశనిస్పృహల్లోకి కూరుకుపోయిన వాళ్లే ఆత్మహత్యలకు పాల్పడతారనే అభిప్రాయం సరైంది కాదు. ►ఆత్మహత్యకు పాల్పడటం, ఆత్మహత్యకు యత్నించడం, పుసిగొల్పడం-ప్రేరేపించడం.. ఇవన్నీ నేరాలే. ఐపీసీ సెక్షన్-309 ప్రకారం.. జైలుశిక్ష జరిమానా తప్పవు. రాజీ కుదుర్చుకోవడానికి వీల్లేదు. అలాగే వీళ్ల తరపున ఏ లాయర్ వాదించడు. ►ప్రపంచంలో ప్రతీ నలభై సెకన్లకు ఒక ఆత్మహత్య నమోదు అవుతోంది. అందులో భారత్ టాప్ టెన్‌లో ఉండడం గమనార్హం. ►ఎందుకు బతకాలి? బతికి ఏం సాధించాలి? అనే పిరికి ప్రశ్నల కంటే.. బతికి సాధించుకోవాలి అనే ధైర్యం మనిషిని మహర్షిగా మారుస్తుంది. క్షణికావేశ నిర్ణయం ఒక జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తుంది. ఆ క్షణాన్ని గనుక అధిగమిస్తే అంతా వెలుగే నిండుతుంది - జాకీ చాన్ ఓడిన ప్రతీసారి రెట్టింపు ఉత్సామంతో పైకి లేవడమే మనిషి తన జీవితంలో సాధించే గొప్ప కీర్తి - నెల్సన్ మండేలా - సాక్షి, వెబ్‌డెస్క్ స్పెషల్ -
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సిద్ధార్థ్ శుక్లా.. ఫొటో వైరల్
ఒకరు ఎం.ఎస్.ధోనితో బాలీవుడ్ వెండితెర స్టార్‌గా ఎదిగిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. మరొకరు హిందీ హిట్ సీరియల్ బాలికా వధుతో బుల్లితెర స్టార్ మారిన సిద్ధార్థ్ శుక్లా. వాళ్లిద్దరూ కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి కారణం వారిద్దరూ దాదాపు ఏడాది వ్యవధిలో మరణించడమే.. బాలీవుడ్ యంగ్ హీరో, దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గతేడాది జూన్‌లో మరణించగా, నివేదికల ప్రకారం ఆత్మహత్యగా తేల్చారు. కాగా, బిగ్‌బాస్ సీజన్ 13 విజేత, బుల్లితెర నటుడు సిద్ధార్థ్ శుక్లా సెప్టెంబర్ 2న మరణించిన విషయం విదితమే. 40 ఏళ్ల సిద్ధార్థ్ అకాల మరణం తర్వాత ఆయన అభిమానులు సుశాంత్‌తో ఉన్న పాత ఫోటోను షేర్ చేయగా వైరల్‌గా మారింది. ఈ ఇద్దరూ నటులు నవ్వుతూ ఉన్న ఆ ఫోటోలో సుశాంత్ జీన్స్, ఎల్లో టీ షర్ట్‌తో క్యాప్ పెట్టి కొని ఉండగా, సిద్ధార్థ్ వైట్ అండ్ వైట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. #SiddharthShukla Legend's gose without saying anything 🙏😭💐 #SiddharthShukla #SushantSinghRajput pic.twitter.com/TvkzkAg0a6 — 👑दिव्या किरण👑 (@DivYaKiRaN05) September 2, 2021 'బాలికా వధు'లో చేసిన పాత్రతో మంచి పేరు తెచ్చుకున్న శుక్లా ' దిల్ సే దిల్ తక్ ',' బిగ్ బాస్ 13 ',' ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 7 'వంటి వివిధ షోలతో అలరించాడు. ఫిట్‌గా ఉన్నందుకు పాపులారిటీ సాధించిన ఆయన ఖత్రోన్ కే ఖిలాడీ 7 విజేతగా సైతం నిలిచారు. కాగా, సిద్దార్థ్ మృతి పట్ల భారతీయ చలనచిత్ర, టెలివిజన్ పరిశ్రమల్లోని పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. చదవండి: Sidharth Shukla Last Post: వైరల్‌గా మారిన సిద్దార్థ్ చివరి పోస్ట్ -
సుశాంత్ పాత్రలో నటించాలంటే భయపడేలా చేశారు: నటుడు
Pavitra Rishta 2 Serial: బుల్లితెరపై ప్రభంజనం సృష్టించిన 'పవిత్ర రిష్తా' సీరియల్ ఇప్పుడు రెండో సీజన్ రాబోతోంది. ఇందులో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మానవ్ పాత్రలను ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ రెండో సీజన్లో సుశాంత్ మానవ్ పాత్రలో ప్రముఖ బుల్లితెర నటుడు షాహీర్ షేక్ నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో షాహిర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆస్తికర విషయాలను పంచుకున్నాడు. అలాగే పవిత్ర రిష్తాలో మానవ్ పాత్రకు తాను ఒకే చెప్పడంతో చాలా మంది తనని భయపెట్టారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షాహిర్ మాట్లాడుతూ.. ‘ఈ ఆఫర్ రాగానే చాలా ఎక్జైయిట్ అయ్యాను. కానీ కొంతమంది నా దగ్గరకి వచ్చి నిజంగానే నువ్వు ఈ మానవ్ పాత్ర చేయడానికి సిద్దంగా ఉన్నావా? అని ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఎంతో పాపులర్ అయిన సీరియల్ ఇది. అంతేగాక లెజెండరీ నటుడు సుశాంత్ చేసిన పాత్ర కావడంతో ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెరిగిపోతాయని హెచ్చరించారు. ఇవి అన్ని విని నాలో భయం మొదలైంది. ఈ పాత్ర చేయాలా వద్దా? అని ఆలోచనలో పడిపోయాను’ అంటూ చెప్పుకొచ్చాడు. అంతేగాక ‘మహాభారతం సీరియల్ సమయంలో కూడా అర్జునుడు పాత్రకు కూడా అంతే భయపడ్డాను. ఈ పాత్ర నేను చేయగలనా? లేదా? అని ఆలోచించాను. కానీ పట్టుదలతో ప్రయత్నిస్తే తప్పుకుండా సక్సెస్ అవుతామనే సిద్దాంతాన్ని గట్టిగా నమ్ముతాను. అలా మహభారతంలో నటించడానికి ఒప్పుకున్న. ఇప్పుడు మానవ్ పాత్రకు కూడా అలాంటి పరిస్థితియే ఎదురైంది. దీంతో ఈ దీన్ని చాలెంజీంగ్ తీసుకున్నాను. ప్రయత్నించకుండానే అవకాశాన్ని వదులుకోవడం కరెక్ట్ కాదు అనుకున్న. అందుకే పవిత్ర రిష్తాలో నటించడాలని గట్టిగా నిర్ణయించుకున్నా’ అని పేర్కొన్నాడు. కాగా ‘పవిత్ర రిష్తా 2’లో అర్చన పాత్రలో అంకిత లోఖండే నటిస్తుంది. అయితే ఈ సీరియల్‌ను ప్రకటించగానే సుశాంత్ అభిమానులు ఈ సీరియల్‌పై విమర్శలు గుప్పించారు. మానవ్ పాత్రలో వేరొకరిని ఊహించుకోలేమని, సుశాంత్ వల్లే పవిత్ర రిష్తా సీరియల్ హిట్టయిందని, అలాంటిది అతడు లేకుండా రెండో సీజన్ ఎలా తీస్తారని ప్రశ్నిస్తున్నారు. ‘మానవ్ అంటే ఒక పేరు కాదు, అది ఒక ఎమోషన్.. మానవ్ 2గా సుశాంత్‌ను కాకుండా మరొకరిని ఊహించుకోలేం’ అంటూ #BoycottPavitraRishta2 అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఇక సుశాంత్ అంటే నిజమైన ప్రేమే ఉంటే అంకిత ఈ సీరియల్లో నటించేందుకు ఒప్పుకునేదే కాదని అంకిత లోఖండేను కూడా విమర్శిస్తున్నారు. View this post on Instagram A post shared by ALTBalaji (@altbalaji) -
అంతరిక్షంపై సినిమాలు: సుశాంత్ కల కలగానే మిగిలిపోయింది!
నింగిలో ఏం ఉంది? తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. వెళ్లి తెలుసుకునే ధీరోదాత్తులు కొందరే ఉంటారు. గతంలో రాకేశ్ శర్మ, కల్పనా చావ్లా వంటివారు స్పేస్‌కి వెళ్లారు. తాజాగా అంతరిక్ష యానం చేసిన తొలి తెలుగు అమ్మాయిగా బండ్ల శిరీష రికార్డ్ సాధించారు. ఆస్ట్రోనాట్లను నింగికి పంపడానికి నేల మీద శాస్త్ర వేత్తలు జె. అబ్దుల్ కలామ్, నంబి నారాయణన్ వంటివారు కృషి చేశారు. వ్యోమ గాములు... శాస్త్రవేత్తల జీవితం ఆదర్శప్రాయం. అందుకే రాకేశ్ శర్మ, కల్పనా చావ్లా, అబ్దుల్ కలామ్, నంబి నారాయణన్ బయోపిక్స్‌కి శ్రీకారం జరిగింది. ఆ చిత్రాల విశేషాలను తెలుసుకుందాం. కల్పనా చావ్లా అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళా ఆస్ట్రోనాట్ కల్పనా చావ్లా. 1997లో కల్పన అంతరిక్షంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మరో స్పేస్ మిషన్ కోసం అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి భూమిని చేరుకునే క్రమంలో జరిగిన ప్రమాదంలో కల్పన మరణించారు. ఇండియా నేషనల్ హీరోస్లో ఒకరు అనిపించుకున్న కల్పనా చావ్లా 40 ఏళ్ళ వయసులోనే మరణించడం విషాదం. అయితే కల్పన సాధించిన ఘనత మాత్రం ఎందరికో స్ఫూర్తిదాయకం. అందుకే ఆమె జీవితాన్ని వెండితెరపైకి తీసుకుని రావాలనుకున్నారు ‘చక్ దే ఇండియా’ డైరెక్టర్ షిమిత్ అమిన్. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా నటిస్తారని వార్తలు వచ్చాయి. అలాగే కల్పనా చావ్లా బయోపిక్‌లో నటించేందుకు తాను ఆసక్తిగా ఉన్నట్లు ఓ సందర్భంలో హీరోయిన్ వాణీ కపూర్ వెల్లడించారు. అయితే ప్రియాంక దాదాపు ఖరారయ్యారని టాక్. సుశాంత్ సింగ్ - చందమామ దూర్ కే యువహీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎన్నో కలలు కన్నాడు. అందులో వ్యోమగామి పాత్ర చేయాలన్న కల ఒకటి. 2017లో సంజయ్ పూరన్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమాని ప్రకటించారు కూడా. అసలు సిసలైన ఆస్ట్రోనాట్‌గా ఒదిగిపోవడానికి సుశాంత్ ‘నాసా’లో శిక్షణ కూడా తీసుకున్నారు. అయితే గత ఏడాది సుశాంత్ ఆకస్మిక మరణంతో ఈ సినిమా పట్టాలెక్కలేదు. ‘చందమామ దూర్ కే’ టైటిల్‌తో సినిమా తీయాలనుకున్నారు. ఈ సినిమా ఆగలేదని దర్శకుడు సంజయ్ చెబుతూ – ‘‘సుశాంత్ మరణం నాకు తీరని లోటు. ‘చందమామ...’ కథ ఆయనకు చాలా నచ్చింది. కొన్ని ఇన్పుట్స్ కూడా ఇచ్చారు. అందుకే సుశాంత్‌కి నివాళిగా ఈ సినిమా తీస్తాను. కానీ ఎప్పుడు తీస్తానో చెప్పలేను’’ అన్నారు. ఏపీజే అబ్దుల్ కలామ్ భారతరత్న అవార్డుగ్రహీత, భారత మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుచుకునే ఏపీజే అబ్దుల్ కలామ్ జీవితం వెండితెరపైకి రానుంది. డీఆర్డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్), ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) సంస్థల్లో నిర్వహించిన బాధ్యతల ద్వారా భారత అంతరిక్ష రంగం అభివృద్ధికి అబ్దుల్ కలామ్ ఎంతో కృషి చేశారు. ఆయన జీవితం ఆధారంగా బయోపిక్‌ల ప్రకటనలు వచ్చాయి. నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర ఓ బయోపిక్‌ను ప్రకటించారు. ఇందులో అబ్దుల్ కలామ్గా నటించనున్నట్లు ప్రముఖ నటుడు పరేష్ రావల్ గత ఏడాది జనవరిలో వెల్లడించారు. అలాగే అబ్దుల్ కలామ్ జీవితం ఆధారంగా వస్తున్న మరో చిత్రం ‘ఏపీజే అబ్దుల్ కలాం: ది మిసైల్ మ్యాన్’. ఇందులో అలీ టైటిల్ రోల్ చేస్తున్నారు. జగదీష్ తానేటి, సువర్ణ, జానీ మార్టిన్ నిర్మిస్తున్నారు. నంబి నారాయణన్ ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ చిత్రం రూపొందింది. ఇందులో నారాయణన్‌గా మాధవన్ నటించి, దర్శకత్వం వహించారు. ‘ఇస్రో’లో ముఖ్య విభాగానికి ఇన్చార్జ్గా నారాయణన్ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆయనపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. కొంతకాలం తర్వాత ఈ ఆరోపణల్లో నిజం లేదని, నంబి నారాయణన్ నిర్దోషి అని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ అంశాలతో తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయాలనుకుంటున్నారు. రాకేశ్ శర్మ అంతరిక్షంలో కాలుమోపిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి రాకేశ్ శర్మ బయో పిక్ గురించి 2018లో ఓ ప్రకటన వచ్చింది. మహేశ్ మాథై దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సిద్ధార్థ్‌రాయ్ కపూర్ నిర్మించనున్నారు. ‘సారే జహా సే అచ్చా’ టైటిల్ కూడా అనుకున్నారు. మొదట్లో హీరోగా ఆమిర్ ఖాన్ పేరు బలంగా వినిపించింది. ఆ తర్వాత షారుక్ ఖాన్ పేరు తెరపైకి వచ్చింది. ఇక వరుసగా రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్ లేటెస్ట్గా ఫర్హాన్ అక్తర్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఎవరూ ఫైనలైజ్ కాలేదు. ఈ సినిమా ప్రకటించి మూడేళ్లయిన నేపథ్యంలో ఆగిందనే వార్త గతేడాది ప్రచారంలోకి వచ్చింది. అయితే సినిమా ఆగిపోలేదని, వర్క్ జరుగుతోందని సిద్ధార్థ్ రాయ్ స్పష్టం చేశారు. -
సుశాంత్ ప్లేస్‌లో మరొకరిని ఊహించుకోలేం, దాన్ని నిషేధించండి
'పవిత్ర రిష్తా' సీరియల్ పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చే వ్యక్తి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. 2009లో ఏక్తాకపూర్ తెరకెక్కించిన ఈ సీరియల్ బుల్లితెర మీద ప్రభంజనం సృష్టించింది. మానవ్‌గా సుశాంత్ సింగ్, అర్చనగా అంకిత లోఖండేల నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. సుమారు ఐదేళ్లపాటు ప్రసారమైన ఈ సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యాడు సుశాంత్. తాజాగా ఈ సీరియల్ రెండో సీజన్ త్వరలో సందడి చేయబోతుందంటూ ఆల్ట్ బాలాజీ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. 'ఆర్డినరీ జీవితాల్లో కొన్నిసార్లు ఎక్స్ట్రార్డినరీ లవ్‌స్టోరీలు కూడా కనిపిస్తాయి. పవిత్ర రిష్తా షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలో ఆల్ట్ బాలాజీలో స్ట్రీమింగ్ కానుంది' అని ప్రకటన రిలీజ్ చేసింది. ఈ సీజన్లో అర్చన పాత్రను మరోసారి అంకిత చేస్తుండగా మానవ్ పాత్రలో నటించేందుకు షాహీర్‌ను ఎంపిక చేసుకున్నట్లు ఫొటోతో సహా వెల్లడించారు. View this post on Instagram A post shared by ALTBalaji (@altbalaji) అయితే సుశాంత్ సింగ్ అభిమానులు మానవ్ పాత్రలో వేరొకరిని ఊహించుకోలేకపోతున్నారు. సుశాంత్ వల్లే పవిత్ర రిష్తా సీరియల్ హిట్టయిందని, అలాంటిది అతడు లేకుండా రెండో సీజన్ ఎలా తీస్తారని ప్రశ్నిస్తున్నారు. 'మానవ్ అంటే ఒక పేరు కాదు, అది ఒక ఎమోషన్.. మానవ్ 2గా సుశాంత్‌ను కాకుండా మరొకరిని ఊహించుకోలేం' అంటూ #BoycottPavitraRishta2 అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. సుశాంత్ అంటే నిజమైన ప్రేమే ఉంటే అంకిత ఈ సీరియల్లో నటించేందుకు ఒప్పుకునేదే కాదని సదరు నటిని కూడా విమర్శిస్తున్నారు. If this lady really loved our SSR then she would never take part in this serial again . Such a fake lady😠🤒. Thank god SSR was break-up with her.#BoycottPavitraRishta2 Eyes On Law Minister 4 SSR#SSRians pic.twitter.com/vFVKYuaIR0 — Scarcastic memer (@scarcasticmemer) July 13, 2021 #BoycottPavitraRishta2 No one will be able to take Sushant's place. @itsSSR 🌿🌸💫✨🦋🌼🦋✨💫🌸🌿 Pavitra Rista serial was popular for Sushant, not for any Natunkita. OUR MANAV ONLY SUSHANT#BoycottBullywood #BoycottPavitraRishta2 pic.twitter.com/aY7lTAPDsB — Pari Sona Sanjay (@PariSonaSanjay) July 13, 2021 #pavitrarishta pic.twitter.com/XP92sIZL8r — Ankita lokhande (@anky1912) July 11, 2021 looking so cheap...how can a person even think to cash a dead person's name... #BoycottPavitraRishta2#Boycottankita#JusticeForSushantSinghRajput pic.twitter.com/LnhqoS6e1R — debashree (@debashr35191593) July 13, 2021 #BoycottPavitraRishta2 You deserve this only.God will never leave you in peace. You are killing his soul everyday! Why remake after his death not before?? @ektarkapoor @Shaheer_S @anky1912 VULTURES!! pic.twitter.com/t5oWT57f3S — Ritu🇮🇳 (@Sushritu) July 13, 2021 -
అద్దెకు సుశాంత్ సింగ్ నివాసం, ధర ఎంతంటే?
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి ఏడాది దాటిపోయింది. కానీ ఇప్పటికీ ఆయన అభిమానులు సుశాంత్ జ్ఞాపకాల్లోనే మునిగి తేలుతున్నారు. ఆయన బతికుండుంటే బాగుండేది అని నిత్యం తల్చుకుంటూనే ఉన్నారు. కాగా సుశాంత్ గతేడాది జూన్ 14న బాంద్రాలోని తన అపార్ట్మెంట్లో ఉరికి వేలాడిన విషయం తెలిసిందే. ఆయన మరణం తర్వాత నుంచి ఆ అపార్ట్మెంట్ మూగబోయింది. సుమారు ఏడాది కాలంగా ఆ భవనం ఖాళీగా ఉంటూ వస్తోంది. దీంతో తాజాగా దీన్ని అద్దెకిస్తామని ముందుకు వచ్చారు ఓనర్లు. ఇందుకుగానూ నెలవారీ అద్దె రూ.4 లక్షలుగా ఖరారు చేశారు. నిజానికి సుశాంత్ ఈ అపార్ట్‌మెంట్‌ను మూడేళ్ల పాటు లీజుకు తీసుకున్నాడు. 2019 నుంచి అక్కడే ఉంటున్న సుశాంత్ ఆ సమయంలో నెలకు రూ.4.5 లక్షలు చెల్లిస్తూ వచ్చాడు. అతడి లీజు గడువు వచ్చే ఏడాది డిసెంబర్‌తో ముగియనుంది. కానీ ఇంతలోనే అతడు ఆత్మహత్య చేసుకుని అభిమానులను శోకసంద్రంలో వదిలేశాడు. చదవండి: కంగనా తిట్టినా..చేయి చేసుకున్నా తట్టుకున్నా కానీ... -
సుశాంత్.. నువ్వు లేకుండా జీవితం లేదు: రియా భావోద్వేగం
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి నేటికి ఏడాది గడుస్తోంది. 2020 జూన్ 14వ తేదిన బాంద్రాలోని తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. సుశాంత్ ఈ ప్రపంచాన్ని వీడి ఏడాది పూర్తవడంతో సినీ ప్రముఖులు, అభిమానులు, అందరూ నటుడిని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా.. నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా.. సుశాంత్ మరణించే సమయంలో ఆయన ప్రియురాలిగా ఉన్న రియా చక్రవర్తి, సుశాంత్‌ను తలుచుకుంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ చేసింది. సుశాంత్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. నిన్ను తలచుకోని క్షణం లేదంటూ రాసుకొచ్చింది. ‘నువ్వు ఇక్కడ లేవనే నిజాన్ని నేనింకా నమ్మలేకపోతున్నాను. టైమ్ అన్నింటిని నయం చేస్తుందని విన్నాను. కానీ నువ్వే నా టైమ్. నా సర్వస్వం నువ్వే. నిన్ను తలచుకోని క్షణమంటూ లేదు. నువ్వు ఎక్కడున్న నన్ను అనుక్షణం చూస్తూ.. నన్ను ఎల్లప్పుడు రక్షిస్తుంటావు. నువ్వు నన్ను నీతోపాటే తీసుకెళ్తావని ప్రతిరోజూ ఎదురుచూస్తున్నాను.. నీ కోసం ప్రతి చోట వెతుకుతున్నాను. నా వెంటే ఉన్నావని అనుకుంటున్నాను. కానీ కొన్నిసార్లు గుండె పగిలేలా చేస్తావు. నువ్వు సాధించావు బేబూ అని మనసులో అనుకొని మరుసటి రోజు కోసం ఎదురుచూస్తుంటాను” అని రియా చక్రవర్తి తన పోస్టులో రాసుకొచ్చింది. ‘నువ్వు నా పక్కన లేవనే విషయం నా గుండెలో ఎన్నో ఎమోషన్స్ రేకెత్తిస్తుంది. ఈ విషయం బయటకు చెప్పడానికి గుండె పగిపోయేంత బాధ నాలో ఉంది. నువ్వు లేకుండా నా జీవితం లేదు. జీవితం అనే అర్ధాన్ని నువ్వే తీసుకెళ్లావ్. ఈ శూన్యాన్ని ఎవరూ పూడ్చలేరు. నువ్వు లేకుండా ఒక్కదాన్నే నిల్చోని ఉన్నాను. నా స్వీట్ బాయ్ కోసం ఇంకా ఎదురుచూస్తునే ఉంటాను. నేను మీకు ప్రతిరోజూ 'మాల్పువా' ఇస్తాను. ఈ ప్రపంచంలోని అన్ని క్వాంటం ఫిజిక్స్ పుస్తకాలను చదువుతానని వాగ్దానం చేస్తున్నాను. దయచేసి నా వద్దకు తిరిగి వచ్చేయ్. అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: Viral Video: ప్రియురాలితో సుశాంత్ సింగ్ స్టెప్పులు View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) -
Sushant Singh: ఆ నవ్వులు చూస్తుంటే కన్నీళ్లొస్తున్నాయి
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి నేటికి ఏడాది. ఈ సందర్భంగా అతడి మాజీ ప్రేయసి, నటి అంకిత లోఖండే పదేళ్ల క్రితం సుశాంత్‌తో కలిసి దీపావళి వేడుకల్లో డ్యాన్స్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'ఇది 2011 దీపావళి నాటి వీడియో. నీ జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి సుశాంత్.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం' అని రాసుకొచ్చింది. ఇందులో బ్లాక్ డ్రెస్ ధరించిన సుశాంత్ చిరునవ్వులు చిందిస్తూ అంకితతో స్టెప్పులేశాడు. ఆయన చిరుదరహాసాన్ని చూస్తుంటే అభిమానుల కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. కాగా సుశాంత్ గతేడాది జూన్ 14న బాంద్రాలోని తన నివాసంలో ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఎంతో భవిష్యత్తున్న టాలెంటెడ్ నటుడు హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడమేంటని అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇది ఆత్మహత్య కాదని, బాలీవుడ్ మాఫియా చేయించిన హత్య అని ఆరోపించారు. సుశాంత్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం కావడంతో సీబీఐ విచారణ కూడా జరుపుతోంది. సుశాంత్ ఈ లోకాన్ని విడిచి పెట్టి సంవత్సరం పూర్తైనా అభిమానుల గుండెల్లో మాత్రం ఇప్పటికీ కొలువై ఉన్నాడు. ఇదిలా వుంటే పవిత్ర రిష్తా సీరియల్ షూటింగ్ సమయంలో అంకిత, సుశాంత్ సింగ్‌ల మధ్య ప్రేమ చిగురించింది. దాదాపు ఆరేళ్లపాటు ప్రేమించుకున్న వీరు 2016లో విడిపోయారు. ఆ తర్వాత సుశాంత్, రియా చక్రవర్తిని లవ్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: నేను సారా అలి ఖాన్ కలిసి గంజాయ్ పీల్చాం: రియా -
Sushant Singh Rajput: సుశాంత్ తండ్రికి దక్కని ఊరట
న్యూఢిల్లీ: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. సుశాంత్ జీవితం ఆధారంగా ఎవరినీ సినిమాలు తియ్యనీయకుండా అడ్డుకోవాలని కోరుతూ సుశాంత్ తండ్రి కృష్ణ కిషోర్ సింగ్ ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. గురువారం అందులోని వివరణను పరిశీలించిన కోర్టు పిటిషన్‌ను కొట్టేసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జీవితం, మరణం గురించి దాదాపుగా అన్ని మీడియా హౌజ్‌ల ద్వారా జనాలకు తెలిసిపోయింది. ఈ తరుణంలో వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం అనే ప్రస్తావన ఉండకపోవచ్చనే జస్టిస్ సంజీవ్ నరులా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాదు తన కొడుకు విషయంలో కిషోర్ సింగ్ ప్రస్తావించిన ‘ పబ్లిసిటీ రైట్’ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం.. ఆ హక్కు సెలబ్రిటీ చనిపోయాక ఉంటుందా? ఉండదా? అనే విషయంపై లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందని, అంతమాత్రాన సినిమా తీస్తే ప్రైవసీకి భంగం కలిగించినట్లు కాదని బెంచ్ వ్యాఖ్యానించింది. రిలీజ్ తర్వాత రండి ఇదిలా ఉండగా సుశాంత్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘న్యాయ్ ది జస్టిస్’ ఇవాళ(శుక్రవారం) రిలీజ్ కావాల్సి ఉంది. ఈ తరుణంలోనే కృష్ణ కిషోర్ సింగ్ కోర్టును ఆశ్రయించారు. అంతేకాదు సుశాంత్ లైఫ్ ఆధారంగానే ‘సూసైడ్ ఆర్ మర్డర్’, ‘ఎ స్టార్ వాజ్ లాస్ట్’, ‘శశాంక్’, క్రౌడ్‌ఫండ్‌తో తీస్తున్న మరో సినిమా.. ఇలా వరుసగా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న తన కొడుకు జీవితాన్ని అడ్డుపెట్టుకుని కొందరు దర్శకనిర్మాతలు డబ్బులు సంపాదించాలని చూస్తున్నారని కృష్ణ కిషోర్ సింగ్ వాదిస్తున్నాడు. అయితే ‘సినిమా స్వేచ్ఛ’ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు నిర్మాతలకు నష్టం కలిగించే ఈ అంశంపై త్వరగతిన నిర్ణయం తీసుకోలేమని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఒకవేళ సినిమా రిలీజ్ తర్వాత ఏమైనా అభ్యంతరాలు ఉంటే తమను ఆశ్రయించవచ్చని కోర్టు సుశాంత్ తండ్రికి సూచించింది. చదవండి: సుశాంత్ గురించి నవీన్ పొలిశెట్టి.. -
నేను సారా అలి ఖాన్ కలిసి గంజాయ్ పీల్చాం: రియా
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి ఏడాది కావొస్తున్న ఇప్పటికి ఈ కేసు ఒక కొలిక్కి రాలేదు. అతడి మరణంతో బీ-టౌన్ డ్రగ్ వ్యవహరం బట్టబయలైంది. అలా సుశాంత్ సింగ్ కేసులో ఇప్పుడు ఎన్సీబీ, సీఐడీ ఇలా అనేక విభాగాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. దీంతో ఏడాది నుంచి ఈ కేసు ఎన్నో మలుపు తిరుగుతూ వస్తోంది. ఇక ఎన్సీబీ కేసు విచారణ, దర్యాప్తు అంటూ తన పని తను చేసుకుంటూ ముందుకు సాగుతోంది. కాగా ఈ కేసులో అతడి ప్రియురాలు, నటి రియా చక్రవర్తి సుశాంత్ సింగ్‌కు అత్యధిక మోతాదులో డ్రగ్స్ ఇచ్చిందని, ఆమెకు డ్రగ్ పెడ్లర్లతో సంబంధం ఉందని నిర్ధారణ కావడంతో ప్రధాన నిందితురాలిగా ఆమెపై ఎన్సీబీ కేసు నమోదు చేసింది. అనంతరం ఆమెను అరెస్టు చేసి జైలుకు తరలించింది. రియాతో పాటు ఆమె సోదరుడు, మరికొంతమందికి ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు తేలడంతో వారిని కూడా అరెస్టు చేసి జైలుకు తరలించారు. అనంతరం ఈ ఇద్దరికి బెయిల్ మంజూరైంది. అలా బయటకు వచ్చిన ఆమె కొద్ది రోజులు సైలెంట్‌గానే ఉన్నా.. తాజాగా ఎన్సీబీ విచారణలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సుశాంత్ సోదరి ప్రియాంక, ఆమె భర్త ఇద్దరూ కూడా డ్రగ్స్ వాడేవారని, సుశాంత్ డ్రగ్స్ వాడతారని ఇంట్లో వాళ్లకు తెలుసని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేగాక సుశాంత్ చనిపోయే ముందు అంటే ఓ నాలుగు రోజుల ముందు అంటే జూన్ 8వ తేదీన సుశాంత్ సోదరి ప్రియాంక డ్రగ్స్ కావాలని వాట్సప్ మెసేజ్ చేసిందని, తనకు 10 గ్రాముల లిబ్రియం, నెక్సిటో కావాలంటూ చాట్ చేసినట్లు తెలిపింది. అంతేగాక నటి సారా అలీ ఖాన్ కూడా ఇందులో భాగమైనట్లు వెల్లడించింది. సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్‌ల కూతురైన సారా తనకు పరిచయం ఉందని, ఆమెతో కలిసి గంజాయి పిల్చానని, పలుమార్లు, సారా తనకు గంజాయితో పాటు వోడ్కాను కూడా ఆఫర్ చేసినట్లు రియా తన వాంగ్మూలంలో వెల్లడించింది. మరో వారంలో సుశాంత్ తొలి వర్థంతి వస్తున్న నేపథ్యంలో రియా తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. కాగా గతేడాది జూన్ 14 సుశాంత్ ముంబైలోని తన ఇంటిలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి తెలిసిందే. -
‘సుశాంత్ సింగ్‌కు పట్టిన గతే తనకు పట్టిస్తారు’
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌ని దోస్తానా 2 సినిమా నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ సగం పూర్తయ్యింది. అయినప్పటికి కార్తీక్‌ను సినిమా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో కావాలనే కార్తీక్‌ను సినిమా నుంచి తొలగించారని.. అతడికి వ్యతిరేకంగా ఇండస్ట్రీలో ప్రచారం చేస్తున్నారని పలువురు ప్రముఖులు బహిరంగంగానే ప్రకటించడమే కాక కార్తీక్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు అనుభవ్ సిన్హా, రైటర్ అపూర్వ అస్రానీ కార్తీక్ ఆర్యన్‌కు మద్దతుగా ట్వీట్ చేశారు. ‘‘నిర్మాతలు నటులను తప్పించినప్పుడు వారు దాని గురించి మాట్లాడరు. ఎప్పుడు ఇదే జరుగుతుంది. కార్తీక్ ఆర్యన్‌కు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుందని నాకు తెలిసింది. ఇది చాలా అన్యాయం. నేను తన మౌనాన్ని గౌరవిస్తున్నాను’’ అంటూ అనుభవ్ సిన్హా ట్వీట్ చేశారు. And by the way... when Producers drop Actors or vice versa they don't talk about it. It happens all the time. This campaign against Kartik Aryarn seems concerted to me and very bloody unfair. I respect his quiet. — Anubhav Sinha (@anubhavsinha) June 3, 2021 అపూర్వ అస్రానీ దీన్ని రీట్వీట్ చేస్తూ.. ‘‘అనుభవ్ సిన్హాను నేను గౌరవిస్తున్నాను. కార్తీక్‌కు వ్యతిరేకంగా చాలా స్పష్టమైన ప్రచారం జరుగుతుందని తెలిపారు. సరిగ్గా ఏడాది క్రితం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషయంలో కూడా ఇదే జరిగింది. అతడు ఎదుర్కొంటున్న బెదిరింపులు గురించి నేను బ్లాగ్ చేశాను. దాంతో చాలా మంది జర్నలిస్ట్‌లు నన్ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. మంచి కోసం ఏదైనా మారుతుందని నేను భావిస్తున్నాను’’ అంటూ అపూర్వ అస్రానీ. I respect Anubhav Sinha for calling out the very obvious campaign against #KartikAaryan. A year ago I had blogged about the bullying Sushant Singh Rajput went through. And though I remain blacklisted for it by many journalists, I feel like something IS changing for the better.✊ https://t.co/8DbWRtLGa7 — Apurva (@Apurvasrani) June 4, 2021 కార్తీక్ ఆర్యన్ తొలగింపుపై ధర్మ ప్రొడక్షన్ స్పందించింది. కార్తీక్ పద్దతేమీ బాగోలేదని, అతడి ప్రవర్తన అనైతికంగా ఉండటంతోనే తనను తొలగించామని తెలిపింది. కొల్లిన్ డీ కున్హా దర్శకత్వంలో తెరకెక్కుతున్న దోస్తానా 2ని తిరిగి డైరెక్ట్ చేయనున్నాం. త్వరలోనే దీని గురించి అధికారకి ప్రకటన చేస్తాం అని తెలిపింది. చదవండి: సగం షూటింగ్ అయ్యాక యంగ్ హీరోను సైడ్ చేశారు -
హైదరాబాద్‌లో సుశాంత్ ఫ్లాట్మేట్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో నటుడి పీఆర్ మేనేజర్ సిద్ధార్థ్ పితాని అరెస్టయ్యాడు. మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం(ఎన్సీబీ)అధికారులు శుక్రవారం నాడు హైదరాబాద్‌లో సిద్ధార్థ్‌ను అరెస్ట్ చేశారు. అతడు గతంలో సుశాంత్ నివసించిన ఫ్లాట్‌లోనే మూడేళ్లపాటు ఉన్నాడు. జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకునే ముందు చివరిసారిగా సిద్ధార్థ్‌తో మాట్లాడినట్లు పోలీసులు గతంలోనే గుర్తించారు. ఈ నేపథ్యంలో సుశాంత్ ఆత్మహత్య కేసులో సీబీఐ అధికారులు ఇతడిపై విచారణ జరిపారు. అలాగే ఈ కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంలోనూ ఎన్సీబీ అధికారులు సిద్ధార్థ్‌ను పలుమార్లు విచారించారు. ఈ క్రమంలో సుశాంత్ మరణించి ఏడాది కావడానికి కొన్ని రోజుల ముందు సిద్ధార్థ్ అరెస్ట్ కావడం చర్చనీయాంశంగా మారింది. కాగా సిద్ధార్థ్ సుశాంత్‌కు పీఆర్ మేనేజర్‌గానూ పని చేశాడు. చదవండి: డ్రగ్స్ కేసు చార్జిషీట్: రియా చక్రవర్తి సహా 33 మంది.. సుశాంత్ చేజార్చుకున్న 7 హిట్ సినిమాలివే.. -
నన్ను నమ్మి తీరాల్సిందే: రియా చక్రవర్తి
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. నింగికేగిన ఈ నటుడిని అభిమానులు తల్చుకోని రోజంటూ ఉండదు. సైన్స్ గురించి మాట్లాడినా, స్పేస్(అంతరిక్షం) ప్రస్తావన తీసినా, ఇండస్ట్రీలో ఎవరైనా అణిచివేతకు గురయ్యారన్నా.. ఫ్యాన్స్‌కు ముందు సుశాంత్ పేరే తడుతుంది. అతడు అభిమానులను ఒంటరివాళ్లను చేస్తూ ఈ లోకాన్ని వదిలి వెళ్లి జూన్ 14 నాటికి సంవత్సరం పూర్తి కాబోతోంది. ఈ సందర్భంగా అతడి ప్రేయసి రియా చక్రవర్తి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. 'ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటే అంత గొప్ప బలం చేకూరుతుంది. ఈ విషయంలో మీరు నన్ను నమ్మి తీరాల్సిందే.. అక్కడే ఉండు, ప్రేమతో రియా..' అని రాసుకొచ్చింది. కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గతేడాది ముంబైలో బాంద్రాలోని తన నివాసంలో జూన్ 14న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో డ్రగ్స్ కోణం వెలుగు చూడటంతో విచారణ చేపట్టిన మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం(ఎన్సీబీ) అధికారులు సుశాంత్ ప్రేయసి రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని అరెస్ట్ చేశారు. సుమారు నెల రోజుల జైలు జీవితం గడిపిన తర్వాత రియా బెయిల్ మీద బయటకు వచ్చింది. కానీ ఈ డ్రగ్స్ కేసుకు బీటౌన్‌లో లింకులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవడంతో పాటు సెలబ్రిటీలు దీపికా పదుకొనే, శ్రద్దా కపూర్, ఫిరోజ్ నదియావాలా సహా పలువురి పేర్లు తెర మీదకు రావడం అప్పట్లో సంచలనంగా మారింది. View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) చదవండి: రియాకు బెయిల్!: సుప్రీంకోర్టుకు ఎన్సీబీ రియా కొత్త ఫొటో వైరల్.. మండిపడుతున్న నెటిజన్లు -
టాలీవుడ్లో అవకాశాల కోసం చూస్తున్న రియా చక్రవర్తి
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో వెలగులోకి వచ్చిన నటి రియా చక్రవర్తి ప్రస్తుతం కెరీర్‌పై దృష్టిపెట్టింది. సినిమాల్లో తిరిగి నటించేందుకు సిద్ధమయ్యింది. అయితే ప్రస్తుతం ఆమెకు బాలీవుడ్లో అవకాశాలు రావడం లేదు. ఇండస్ర్టీలో తనకు బాగా తెలిసివాళ్లు ఉన్నా ఆమెకు అవకాశాలు ఇప్పించలేకపోతున్నారు. దీంతో రియా చూపు ఇప్పుడు తెలుగు సినిమాలపై పడింది. గతంలో తూనీగ తూనీగ సినిమాతో రియా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మెగా హీరో కళ్యాణ్దేవ్తోనూ ఓ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత బాలీవుడ్‌కే మకాం మార్చింది. అక్కడ సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్‌గా పాపులర్ అయిన రియా ఆ తర్వాత సుశాంత్ రికమండేషన్ వల్లే కొన్ని సినిమా ఆఫర్లను అందుకున్నట్లు అప్పట్లో మీడియాలో కథనాలు వచ్చాయి. అంతేకాకుండా సుశాంత్ సినిమాలో తననే హీరోయిన్గా పెట్టుకోవాలంటూ ఒత్తిడి చేసేదని కూడా సమాచారం. ఆ తర్వాత సుశాంత్ హత్య, బాలీవుడ్ డ్రగ్ వ్యవహరంలో రియా చక్రవర్తిని కోర్టు ప్రధాన నిందితురాలిగా తేల్చింది. దాదాపు నెల రోజుల జైలు జీవితం అనంతరం అక్టోబర్‌లో ఆమె బెయిల్‌పై విడుదలయిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోందట. బాలీవుడ్ తలుపు తట్టినా ఛాన్సులు రాకపోవడంతో ఇప్పుడు తెలుగు ఇండస్ర్టీ వైపు ఆశగా చూస్తుందట. మరి రియాకు తెలుగులో అవకాశాలు వస్తాయో లేదో చూడాలి మరి. చదవండి: రియా కొత్త ఫొటో వైరల్.. మండిపడుతున్న నెటిజన్లు భావోద్వేగం: సుశాంత్ రాసుకున్న లేఖ వైరల్ -
ఏడాది కూడా ఆగలేకపోయావా అంకితా!
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ ప్రియురాలు అంకిత లోఖండేకు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. తన ప్రస్తుత బాయ్‌ఫ్రెండ్ విక్కీ జైన్‌తో కలిసి హోలీ పండగ వేడుకను సెలబ్రెట్ చేసుకున్న వీడియోను అంకిత సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అది చూసి సుశాంత్ అభిమానులు, నెటిజన్లు ఆమెపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాయ్‌ఫ్రెండ్‌తో ఆనందంగా చిందులేస్తూ హోలీ పండగను జరుపుకోవడమే కాక ఆ వీడియోను షేర్ చేస్తావా అంటూ నెటిజన్లు మండిపడుతూ తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇందులో అంకిత ఆమె బాయ్‌ఫ్రెండ్ విక్కిలు సంతోషంతో ఊగిపోతూ ఒకరికొకరు రంగులు అద్దుకుంటూ.. డ్యాన్స్ చేస్తూ కనిపించారు. దీనిని అంకిత ‘అందరికి హోలీ శుభాకాంక్షలు’ అంటూ షేర్ చేసింది. ఇక దీనిపై సుశాంత్ ఫ్యాన్స్ స్పందిస్తూ.. ‘ఛీఛీ సిగ్గుచేటు సుశాంత్ చనిపోయి ఏడాది కూడా కాలేదు హోలీ ఎలా సెలబ్రెట్ చేసుకుంటున్నావ్ అంకిత’, ‘సుశాంత్ అభిమానులుగా మేమే హోలీ పండగ సెలబ్రేట్ చేసుకోలేకపోయాం.. కానీ నువ్వు ఆయన ప్రియురాలివి..ఒక్క ఏడాది కూడా అగలేకపోయావా అంకిత’, ‘సుశాంత్ విషయంలో అంకిత చెప్పినవన్ని అబద్ధాలే.. ఫేం కోసం సుశాంత్ ప్రియురాలినని చెప్పుకుంది. పెద్ద మహానటి’, ‘హేట్ యూ అంకిత’ అంటూ కామెంట్స్ చేయడం ప్రారంభించారు. కాగా అంకిత సుశాంత్ మరణాంతరం తనిన ప్రేమించానని, ఏడాది వారకు తామిద్దరం డేటింగ్లో ఉన్నామంటు అవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతేగాక సుశాంత్‌ను పెళ్లి చేసుకోవడం కోసం తనకు వచ్చి మూవీ ఆఫర్స్‌ను తిరస్కరించానని, షారుక్ ఖాన్‌తో ‘హ్యాపీ న్యూయర్’, ‘రామ్-లీలా’ వంటి సూపర్ హిట్ మూవీస్ కూడా వదులుకున్నట్లు ఆమె ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Ankita Lokhande (@lokhandeankita) చదవండి: చాన్స్ కోసం నిర్మాత గదిలోకి వెళ్లమన్నారు: నటి ‘మేం విడిపోయినప్పుడు ఎందుకు మాట్లాడలేదు?’ -
చాన్స్ కోసం నిర్మాత గదిలోకి వెళ్లమన్నారు: నటి
ఈ మధ్య కాలంలో క్యాస్టింగ్ కౌచ్‌పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండటంతో నిర్భయంగా మీడియా ముందుకు వచ్చి తాము ఎదుర్కొన్న సంఘటనల గురించి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే పలువురు హీరోయిన్లు తమ కెరియర్లో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి మీడియాతో పంచుకున్న విషయం తెలిసిందే. తాజాగా సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మాజీ ప్రేయసి, నటి అంకితా లోఖండే దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాలను జాతీయ మీడియాతో పంచుకుంది. ‘నాకు 20 ఏళ్లు ఉన్నప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చాను. హిందీలో పవిత్ర రిస్తా సీరియల్ ద్వారా నేను ప్రేక్షకాదరణను పొందిన తర్వాత నాకు దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి ఒక ఆఫర్ వచ్చింది. ఒక స్టార్ హీరో నన్ను గదిలోకి పిలిచి కంప్రమైజ్ అవుతావా అని అడిగాడు. ఆయన ప్రశ్నకు నేను తెలివిగా సమాధానం ఇచ్చాను. మీ నిర్మాతకు ఎలాంటి కంప్రమైజ్ కావాలట? నేనేమైనా పార్టీలకు, డిన్నర్లకు రావాలా అని ప్రశ్నించాను. దీంతో ఆ హీరో ఏమి మాట్లాడలేదు. అతనికి ఒక షేక్‌హ్యాండ్ ఇచ్చి బయటకు వచ్చాను. ఆ సినిమా చాన్స్ ఇక నాకు రాదని అప్పుడే అర్థమైంది. ’అని అకింతా లోఖండే చెప్పుకొచ్చింది. అయితే ఆ స్టార్ హీరో పేరుకాని, నిర్మాత పేరును కానీ అకింతా వెల్లడించలేదు. ఇక అంకితా లోఖండే కెరీర్ విషయానికొస్తే.. ఆమె నటిగా కంటే సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలిగానే ఎక్కువ గుర్తింపుపొందింది. బాలీవుడ్లో మణికర్ణిక, భాగీ3 చిత్రాల్లో నటించింది. చదవండి: ‘ఏం అర్హత ఉందని నీకు ఇంత అందమైన భార్య?’ హీరోయిన్‌పై పిడిగుద్దులు కురిపించిన నితిన్! -
నువ్వు చూస్తున్నావని తెలుసు: నవీన్ పొలిశెట్టి ఎమోషనల్
జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు ఇండస్ట్రీ మెరుపు మెరిసింది. 2019వ సంవత్సరానికి గాను సోమవారం ఢిల్లీలో ప్రకటించిన ఈ అవార్డుల్లో తెలుగు సినిమా ఏకంగా నాలుగు అవార్డులను ఎగరేసుకుపోయింది. ఇందులో సూపర్ స్టార్ మహేశ్‌బాబు 'మహర్షి' సినిమాకు రెండు, నేచురల్ స్టార్ నాని 'జెర్సీ'కి మరో రెండు అవార్డులు వచ్చాయి. ఇక తెలుగు హీరో నవీన్ పొలిశెట్టి నటించిన 'చిచోరే'కు ఉత్తమ హిందీ చిత్రంగా అవార్డు వరించింది. ఇందులో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సందర్భంగా నవీన్ అతడిని తలుచుకుని సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యాడు. "ఓవైపు 'చిచోరే'కు జాతీయ అవార్డు వచ్చింది. మరోవైపు జాతిరత్నాలు బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. సుశాంత్.. ఇదంతా నువ్వు చూస్తున్నావని నాకు తెలుసు. ఇది నీకే సొంతం. అలాగే చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు. లవ్ యూ యాసిడ్" అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. కాగా ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ యాసిడ్ పాత్రలో నటించిన నవీన్ హిందీ ప్రేక్షకులకు నవ్వులు పంచిన విషయం తెలిసిందే. #Chhichhore wins the National award for Best Hindi film. And #JathiRatnalu is a blockbuster. I know you are watching Sushant. This one is for you . Miss you bhai ❤️ congratulations to Nitesh sir , maya , Derek , bewda, mummy , Sexa and the whole team. Love , Acid ❤️ pic.twitter.com/ZWri1ebrGJ — Naveen Polishetty (@NaveenPolishety) March 23, 2021 చదవండి: కంగనా రనౌత్ అసలు పేరు వార్తలమ్మ అని పెడితే సరిపోయేది 2019 జాతీయ అవార్డుల్లో మెరిసిన తెలుగు సినిమా -
ఆమె చావుకు అంత పబ్లిసిటీ వద్దు: హైకోర్టు
ముంబై: ఆత్మహత్యకు పాల్పడిన పుణె యువతి కేసుకు అనవసర పబ్లిసిటీ ఇవ్వొద్దంటూ బాంబే హై కోర్టు శుక్రవారం మీడియాను ఆదేశించింది. యువతి మరణం తర్వాత.. వేరే యువకుడితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందని.. దాని గురించి కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆమె బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందంటూ వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో మృతురాలి తండ్రి తన కుమార్తె మరణానికి సంబంధించి మీడియా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోందని.. దీని అడ్డుకోవాలని హై కోర్టును ఆశ్రయించాడు. ఎస్ ఎస్ షిండే అధ్వర్యంలోని డివిజన్ బెంచ్ శుక్రవారం ఈ పిటిషన్ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి తరఫున సీనియర్ లాయర్ శిరిష్ గుప్తే వాదిస్తూ.. ‘‘పుణెకి చెందిన యువతి గత నెల 8న తన ఇంటి బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో ప్రింట్, ఎలాక్ట్రానిక్ మీడియాలు ఆమె మృతి సంబంధించి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయి. వేరే యువకుడితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందని.. దాని గురించి కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది అంటూ తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తున్నాయి. అంతేకాక మృతురాలికి, వేరే వ్యక్తికి మధ్య జరిగిన సంభాషణలు అంటూ కొన్ని వీడియోలను ప్రచారం చేస్తున్నాయి. తక్షణమే వీటిని నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలి’’ అంటూ కోర్టును కోరారు. ఈ వాదనలు విన్న బెంచ్.. ‘‘బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో మీడియా ట్రయల్స్‌కు సంబంధించి హై కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను మీడియా సంస్థలు పాటించాలి. బాధితురాలి మరణానికి అనవసర ప్రచారం ఇవ్వకూడదు. అంతేకాక ఆమెకు సంబంధించి ఎలాంటి వార్తలను ప్రచారం చేయకూడదు’’ అని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. చదవండి: భార్య.. భర్త ఆస్తికాదు: హైకోర్టు భార్య పొగాకు నములుతోంది.. విడాకులు కావాలి -
డ్రగ్స్ కేసు: 12 వేల పేజీల చార్జిషీట్
ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణం వెలుగు చూడటంతో మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం(ఎన్సీబీ) రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. డ్రగ్స్‌కు, బాలీవుడ్‌కు ఏమైనా లింకులున్నాయా? అన్న కోణంలో ఎన్సీబీ ప్రత్యేక విచారణ చేపట్టింది. ఈ క్రమంలో డ్రగ్స్ కేసు ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్ నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. కొన్ని నెలలుగా విచారణ ముమ్మరం చేసిన ఎన్సీబీ శుక్రవారంనాడు ముంబైలోని ప్రత్యేక కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ చార్జిషీటులో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌తో పాటు 33 మంది నిందితుల పేర్లను ప్రస్తావించింది. 200 మంది సాక్ష్యుల నుంచి సేకరించిన సమాచారాన్ని జత చేస్తూ 12 వేల పేజీలకు పైగా ఉన్న చార్జిషీటును కోర్టుకు సమర్పించింది. కాగా గతేడాది జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో డ్రగ్స్ కోణం వెలుగు చూడగా సెప్టెంబర్ 8న ఎన్సీబీ అధికారులు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌ను అరెస్ట్ చేశారు. తర్వాతి నెలలోనే వీళ్లిద్దరూ బెయిల్ మీద బయటకు వచ్చారు. కానీ తర్వాత ఈ డ్రగ్స్ కేసుకు బీటౌన్‌లో లింకులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో సెలబ్రిటీలు దీపిక పదుకునే, శ్రద్దా కపూర్, ఫిరోజ్ నదియావాలా సహా పలువురి పేర్లు తెర మీదకు రావడం అప్పట్లో సంచలనంగా మారింది. చదవండి: సుశాంత్ వదిలేసుకున్న బ్లాక్‌బస్టర్ సినిమాలు! భావోద్వేగం: సుశాంత్ రాసుకున్న లేఖ వైరల్ -
‘మేం విడిపోయినప్పుడు ఎందుకు మాట్లాడలేదు?’
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతం తర్వత బాలీవుడ్లో నెపోటిజం, డ్రగ్స్ వినియోగం గురించి భారీ ఎత్తున చర్చ జరిగింది. ఇక సుశాంత్ మరణించిన నాటి నుంచి ఆయన అభిమానులు కొందరు తన మాజీ లవర్ అంకితా లోఖండేని టార్గెట్ చేస్తూ.. ట్రోల్ చేస్తున్నారు. సుశాంత్ మరణించి ఇప్పటికి దాదాపు 10 నెలలు గడుస్తున్నప్పటికి వారి ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదట. ఈ నేపథ్యంలో తనను విమర్శిస్తున్న సుశాంత్ అభిమానులపై మండి పడ్డారు అంకిత. నా జీవితం గురించి మీకేం తెలుసని నన్ను విమర్శిస్తున్నారు అని ప్రశ్నించారు. ఈ మేరకు అంకిత ‘‘నా వైపు వేలు చూపుతున్న వారికి మా బంధం గురించి ఏ మాత్రం తెలియదు. మీరు తనని(సుశాంత్) ఎంతో ఎక్కువగా ప్రేమించే వారే అయితే.. ఇప్పుడేందుకు గొడవపడుతున్నారు. మా బంధం ముగిసిన నాడు మీరంతా ఎక్కడున్నారు. ఈ రోజు నన్ను తప్పు పడుతున్నారు. ఆ రోజు ఎక్కడ ఉన్నారు. మా బంధం విషయంలో నేను తప్పు చేయలేదు. ప్రతి ఒక్కరికి తమ జీవితానికి సంబంధించి వేర్వేరు దృక్పథాలు ఉంటాయి. సుశాంత్ తన జీవితంలో ఎదగాలనుకున్నాడు.. అలానే జీవించాడు. అందుకే తన దారి తాను చూసుకున్నాడు. దానికి నేనేలా బాధ్యురాలిని అవుతాను. నేను ఎందుకు అవమానం పొందాలి.. నేనేం తప్పు చేశాను.. నా గురించి మీకేం తెలుసని నన్ను తప్పుపడుతున్నారు. దయచేసి విమర్శించడం ఆపండి. ఇది చాలా బాధిస్తుంది’’ అన్నారు. ‘‘ఆరేళ్ల మా బంధానికి ముగింపు పలికినప్పుడు నేను చాలా చాలా బాధపడ్డాను. ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను. నేను కూడా డిప్రెషన్ బారినపడ్డాను. నా జీవితంలో చీకటి రోజులు అంటే అవే. ఎంతో ఏడ్చాను. కానీ నేను ఎవరిని నిందించలేదు కదా.. దయచేసి నన్ను విమర్శించడం ఆపండి’’ అన్నారు అంకిత. పవిత్ర రిష్తా సీరియల్ షూటింగ్ సమయంలో అంకిత, సుశాంత్ సింగ్‌ల మధ్య ప్రేమ చిగురించింది. దాదాపు ఆరేళ్లపాటు ప్రేమించుకున్న వీరు 2016లో విడిపోయారు. ఆ తర్వాత సుశాంత్, రియా చక్రవర్తిని లవ్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: ‘ఎలా ఉన్నా జడ్జ్ చేస్తూనే ఉంటారు’ ‘నా వల్లే ఈ విమర్శలు.. క్షమించు’ -
సుశాంత్ కేసు: ఓ సోదరికి బెయిల్.. మరొకరికి షాక్
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు విచారణ ఇంకా విచారణ సాగుతోంది. విచారణలో భాగంగా సోమవారం అతడి సోదరి మీటు సింగ్‌కు బెయిల్ లభించింది. అయితే మరో సోదరి ప్రియాంక సింగ్‌కు మాత్రం షాక్ తగిలింది. ఆమెకు బాంబే హైకోర్టు క్లీట్ చిట్ ఇవ్వలేదు. ఆమె పాత్రపై కొన్ని అనుమానాలు ఉన్నాయని హైకోర్టు అభిప్రాయ పడింది. సుశాంత్ మృతి కేసులో నటి రియా చక్రవర్తి ఓ కేసును దాఖలు చేసిన విషయం తెలిసిందే. సుశాంత్ ఇద్దరు సోదరిలు మీటు సింగ్, ప్రియాంక సింగ్‌పై రియా కేసు నమోదు చేయించింది. ఈ కేసుపై బాంబే హైకోర్టు తన తీర్పులో మీటూ సింగ్‌కు ఊరట కల్పిస్తూ ఆదేశాలిచ్చింది. సతీశ్ మనేశ్ షిండే, ఎంఎస్ కార్నిక్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసులో విచారణ చేపట్టింది. రియా దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన ఎఫ్ఐఆర్లను సుశాంత్ సోదరిలు కొట్టివేయాలని కోర్టును కోరారు. సుశాంత్ అనుమానాస్పద మృతి కేసులో సోదరి ప్రియాంక సింగ్‌పై కొన్ని ప్రాథమిక అనుమానాలు ఉన్నాయని, ఆమెను విచారణకు దూరంగా ఉంచాల్సిన అవసరం లేదని కోర్టు తన పేర్కొన్నది. దీంతో మీటుకు ఊరట లభించగా ప్రియాంకకు షాక్ తగిలింది. అయితే నటి రియా డాక్టర్ తరుణ్ కుమార్‌పై కూడా కేసు నమోదు చేయించింది. దీనిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. రియా చక్రవర్తి సత్యం కోసం కృషి చేస్తుందని.. ఆమె వేదనంతా అదేనని న్యాయమూర్తి సతీశ్ మనేశ్ షిండే పేర్కొన్నారు. హీరోయిన్ మెహ్రీన్‌కు కాబోయే భర్త ఎవరో తెలుసా..? లైవ్‌లో ఏడ్చేసిన హీరోయిన్ -
అర్నాబ్ గోస్వామిపై పరువు నష్టం దావా
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి రిపబ్లిక్ మీడియా అధినేత అర్నాబ్ గోస్వామి, అతని భార్య సమ్యబ్రతా రే గోస్వామిలపై ముంబై జోన్-9 డీసీపీ అభిషేక్ త్రిముఖే పరువు నష్టం దావా వేశారు. తనపై అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు గానూ మిస్టర్ అండ్ మిసెస్ గోస్వామిలపై క్రిమినల్ పరువు నష్టం దావా దాఖలు చేశానని డీసీపీ పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును మహారాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతితో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా దాఖలు చేశానని ఆయన తెలిపారు. కాగా, గతేడాది జూన్ 14న బాంద్రాలోని ఫ్లాట్‌లో సుశాంత్ అనుమాస్పద రీతిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. -
సుశాంత్ చేజార్చుకున్న 7 హిట్ సినిమాలివే..
‘చిచోరే’లో అనిరుథ్‌లా ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారికి ధైర్యం చెప్పేంత బలమైన వ్యక్తి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. కానీ మానసిక వేదనను మెదడును, మనసును అనుక్షణం దహించివేస్తుండటంతో గతేడాది జూన్ 14న ముంబైలోని నివాసంలో ఆత్మహత్య చేసుకుని తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. భౌతికంగా అయినవారిని, అభిమానులను అందరీ అర్ధాంతరంగా వదిలి పోయినా ఇంకా తన సినిమాలతో కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాడు. అయితే సుశాంత్ తన కెరీర్లో కొన్ని సినిమాలను చేజేతులా వదులుకున్నాడు. అందులో కొన్ని బ్లాక్‌బస్టర్ హిట్లు సాధించాయి. మరి సుశాంత్ తిరస్కరించిన ఆ 7 సినిమాలేంటో ఓసారి చదివేయండి. (చదవండి: భావోద్వేగం: సుశాంత్ రాసుకున్న లేఖ వైరల్) రామ్ లీలా: సంజయ్ లీలా భన్సాలీ ఈ కథను మొదట సుశాంత్‌కే వినిపించాడు. కానీ అప్పటికే కొన్ని ప్రాజెక్టులు లైన్లో ఉండటంతో కుదరదని చెప్పాడు. దీంతో ఈ సినిమా హీరో రణ్వీర్ చెంతకు చేరింది. కబీర్ సింగ్: ఓ వైపు వివాదాల్లో నానుతూనే మరోవైపు కలెక్షన్ల వర్షం కురిపించిన చిత్రం అర్జున్ రెడ్డి. దీని హిందీ రీమేక్ కబీర్ సింగ్‌ను సుశాంత్‌తో లేదా అర్జున్ కపూర్‌తో తీయాలనుకున్నారు. కానీ ఇద్దరూ నో చెప్పడంతో ఈ హిట్ సినిమా షాహిద్ కపూర్ చేతిలో పడింది. అంధదున్: శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమా యూనిట్‌ను ఎంపిక చేసుకునేటప్పుడు సుశాంత్ అయితే బాగుంటుంది అని అనుకున్నాడట. కానీ ఏమైందో ఏమో కానీ సడన్‌గా ఈ సినిమా ఆయుష్మాన్ ఖురానా దగ్గరకు వెళ్లడం, అతడు ఓకే చెప్పడం చకచకా జరిగిపోయాయి. ఫితూర్: ఈ సినిమాను ఎలాగైనా సుశాంత్‌తోనే చేయాలని దర్శకనిర్మాతలు పట్టుపట్టారు. కానీ బిజీ షెడ్యూల్ వల్ల ఈ సినిమా చేయడం కుదరదని అతడు చేతులెత్తేశాడు. దీంతో ఆదిత్యరాయ్ కపూర్ టైటిల్ రోల్ చేశాడు. అయితే ఈ సినిమా అనుకున్నంత బాగా లేదని, అతడు ఈ సినిమాను చేయకపోవడమే మంచిదైందని ఆదిత్యరాయ్ పేర్కొన్నాడు. బేఫికర్: కథ రాసుకున్న వెంటనే సుశాంత్-వాణీకపూర్ జోడీ అయితే బాగుంటుందని అనుకున్నాడు దర్శకుడు ఆదిత్య చోప్రా. కానీ పలు కారణాల వల్ల సుశాంత్ స్థానంలో హీరో రణ్వీర్ సింగ్ నటించాడు. హాఫ్ గర్ల్‌ఫ్రెండ్: ప్రముఖ రచయిత చేతన్ భగత్ రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో సుశాంత్, కృతీ సనన్‌ను హీరోహీరోయిన్లుగా అనుకున్నారు. చివరికి మాత్రం అర్జున్ కపూర్, శ్రద్ధా కపూర్ ప్రధానపాత్రల్లో నటించారు. రా(రోమియో అక్బర్ వాల్టర్): ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని కూడా సుశాంత్ చేజార్చుకున్నాడు. (చదవండి: 200 ఆడిషన్స్‌కు వెళ్లాను: మీర్జాపూర్ నటి) -
సుశాంత్ బర్త్ డే: నువ్వు మా జీవితాల్లో భాగం
ముంబై: నేడు బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 35వ పుట్టిన రోజు. జనవరి 21 సుశాంత్ మొదటి జయంతి సందర్భంగా అభిమానులు, సన్నిహితులు, సహా నటీనటులు భావోద్యేగానికి లోనవుతూ సోషల్ మీడియాలో ఆయన ఫొటోలను షేర్ చేస్తున్నారు. అదే విధంగా సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కూడా అతడి ఫొటోలను పంచుకున్నారు. దీనికి ‘లవ్ యూ భాయ్.. మీరు మా జీవితంలో భాగం. నిన్ను ఎప్పటికి మర్చిపోలేము’ అంటూ షేర్ చేసిన ఈ ఫొటోలో సుశాంత్ తన మేనల్లుడు, మేనకోడలును ఎత్తుకుని సరదాగా వారితో ఆడుతూ కనిపించాడు. దీంతో శ్వేతా పోస్టు చూసిన సుశాంత్ అభిమానులు ‘లెజెండ్స్‌కు మరణం లేదు’, ‘సుశాంత్ ఎప్పటికి మన గుండెల్లో బ్రతికే ఉంటారు. ఈ రోజు సుశాంత్ మనతోనే ఉంటారని ఆశిస్తున్నాం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదే విధంగా ‘వన్ డే టూ ఎస్ఎస్ఆర్ బర్త్‌డే’ అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా వైరల్ చేస్తున్నారు. (చదవండి: భావోద్వేగం: సుశాంత్ రాసుకున్న లేఖ వైరల్) Love you Bhai ❤️❤️❤️ You are part of me and will always remain so... #SushantDay pic.twitter.com/nDU8Zkeipp — Shweta Singh Kirti (@shwetasinghkirt) January 20, 2021 ఇక బాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులు సైతం సుశాంత్‌ను గుర్తు చేసుకుంటూ ఆయనతో ఉన్న జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. కాగా గతేడాది జూన్ 14న సుశాంత్ తన ముంబై ఇంటిలో ఉరివేసుకుని చనిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సుశాంత్ మరణానికి అతడి స్నేహితురాలు రియా చక్రవర్తి కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత ఈ కేసులో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఎంట్రీ మొదలు రోజుకో పరిణామంతో అనేక మలుపులు తిరుగుతూ చివరికి రాజకీయ సెగలు రేపింది. మాదక ద్రవ్యాల కోణం కూడా వెలుగు చూడటంతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) రియాను, ఆమె సోదరుడిని అరెస్ట్ చేసింది. ఆ తర్వాత బాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ నటీనటుల పేర్లు కూడా బయటకు రావడంతో వారందరిని విచారించింది. ఈ నేపథ్యంలో ఇటీవల రియా, ఆమె సోదరుడు బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. (చదవండి: సుశాంత్ ముఖం చూస్తేనే తెలిసిపోతుంది: హైకోర్టు) ONE DAY FOR SSR BIRTHDAY Love is eternal and it is directly connected to Soul. pic.twitter.com/wogYLkp60o — Soaham Chaturvedi (@oyeSKD) January 20, 2021 -
భావోద్వేగం: సుశాంత్ రాసుకున్న లేఖ వైరల్
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి చెంది ఏడు నెలలు గడిచాయి. గతేడాది జూన్ 14న సుశాంత్ తన నివాసంలో విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడి మృతి కేసులో ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుశాంత్ రాసుకున్న ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన సోదరి శ్వేతా సింగ్ బుధవారం దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘భాయ్ రాసుకున్న లేఖ.. ఆయన ఆలోచనలు చాలా లోతైనవి’ అంటూ ఆమె పంచుకున్నారు. ‘నా జీవితంలో ఇప్పటికే 30 ఏళ్లు గడిపాను. ఈ మొదటి 30 ఏళ్లను ప్రత్యేకంగా మలుచుకునేందుకు చాలా ప్రయత్నించాను. ఇందుకోసం నా ప్రతి పనిలో మంచిగా ఉండాలని కోరుకున్నాను. అలాగే టెన్నిస్, స్కూల్, చదువు, ర్యాంక్స్లో మొదటి స్థానంలో ఉండాలనుకున్నాను. అయితే ప్రతి కోణాన్ని అలా చూడటం వల్ల నేను అసంతృప్తికి లోనయ్యేవాడిని. నాకు మంచి జరిగినప్పుడు మాత్రం ఆట తప్పుగా ఆడానని గ్రహించాను. ఎందుకంటే నేనేంటో తెలుసుకోవడానికే ఆట ఉంది’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ లేఖ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. సుశాంత్ జీవితంపై ఎన్నో ఆశలతో రాసుకున్న ఈ లేఖ చూసి ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనవుతున్నారు. కాగా సుశాంత్ గతేడాది జూన్ 14న ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. (చదవండి: సుశాంత్ ముఖం చూస్తేనే తెలిసిపోతుంది: హైకోర్టు) అయితే తన కొడుకును ఆత్మహత్యకు ప్రేరెపించేలా నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిలు ప్రవర్తించారని ఆరోపిస్తు సుశాంత్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు సుశాంత్ మృతి కేసును దర్యాప్తు చేసిన ముంబై పోలీసులు అనంతరం ఈ కేసు విచారణకై నార్కొటిక్ కంట్రోల్ బ్యూరోకు ఇచ్చింది. ఈ క్రమంలో ఎన్సీబీ విచారణలో బాలీవుడ్ డ్రగ్ వ్యవహరం వెలుగు చూడటంతో పలువురు బాలీవుడ్ ప్రముఖులకు ఎన్సీబీ అధికారులు సమన్లు అందజేశారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితురాలైన రియాను పోలీసులు సెప్టెంబర్‌లో అరెస్టు చేసి జెలుగా తరలించగా ఇటీవలకామె బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. చదవండి: రియా కొత్త ఫొటో వైరల్.. మండిపడుతున్న నెటిజన్లు View this post on Instagram A post shared by Shweta Singh kirti (SSK) (@shwetasinghkirti) -
సుశాంత్ ముఖం చూస్తేనే తెలిసిపోతుంది: హైకోర్టు
ముంబై: బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గురించి బాంబే హైకోర్టు న్యాయమూర్తి ఎస్ఎస్ షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతడు హుందాగా వ్యవహరించేవాడని ముఖం చూస్తేనే తెలిసిపోతుందని, ముఖ్యంగా ఎంఎస్ ధోని సినిమాలో తన నటనతో అందరినీ మెప్పించాడని పేర్కొన్నారు. సుశాంత్ సింగ్ సోదరీమణులు ప్రియాంక సింగ్, మీతూ సింగ్ తమపై ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండానే అతడికి మందులు ఇచ్చారని, అతడి మృతితో తనకు సంబంధం లేదంటూ సుశాంత్ ప్రేయసి, నటి రియా చక్రవర్తి ప్రియాంక, మీతూపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, ఈ కేసును సీబీఐ లోతుగా దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు. (చదవండి: ప్రేమలో పడితే.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు) ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించిన సుశాంత్ సోదరీమణులు దాఖలు చేసిన పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది. దీనిపై తీర్పును రిజర్వ్ చేసిన జస్టిస్ ఎస్ఎస్ షిండే నేతృత్వంలోని ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘కేసు ఏదైనా కానివ్వండి.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముఖం చూస్తే అతడు అమాయకుడు, హుందాగా వ్యవహరించేవాడు.. అలాగే ఓ మంచి మనిషి అన్న విషయం అర్థమవుతుంది. ఎంఎస్ ధోని సినిమాలో తన నటన చూసి ప్రతి ఒక్కరు అతడిని ఇష్టపడ్డారు’’ అని జస్టిస్ షిండే వ్యాఖ్యానించారు. కాగా గతేడాది జూన్ 14న సుశాంత్ ముంబైలోని తన నివాసంలో ఉరికి వేలాడుతూ కనిపించిన విషయం విదితమే. అతడి అనుమానాస్పద మృతి పలు మలుపులు తిరిగిన అనంతరం సీబీఐ చేతికి వచ్చింది. ఈ కేసుతో బాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రియా చక్రవర్తి జైలుకు వెళ్లి బెయిలుపై విడుదలయ్యారు. -
మరోసారి ఎన్సీబీ సమన్లు.. గడువు కోరిన నటుడు
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో వెలుగు చూసిన డ్రగ్ వ్యవహరంలో సంబంధాలు ఉన్నట్లు బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) మరోసారి అర్జున్‌కు మంగళవారం సమన్లు అందజేసి తదుపరి విచారణకు ఇవాళ(డిసెంబర్ 16) ఎన్సీబీ కార్యాలయంలో హజరుకావల్సిందిగా ఆదేశించింది. అయితే ఈ రోజు విచారణకు అర్జున్ హాజరకాలేదు. డిసెంబర్ 21వ తేదీ వరకు ఆయనకు గడువుకాలని ఎన్సీబీని కోరాడు. కాగా ఇప్పటికే ఈ కేసులో అర్జున్‌కు గత నవంబర్ 9న ఎన్సీబీ సమన్లు అందజేసి ఆయన ఇంటిపై దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. కొద్ది గంటలపాటు ఆయన ఇంటిలో తనిఖీ చేసిన ఎన్సీబీ అధికారులు కొన్నీ డాక్యుమెంట్స్‌తో పాటు పలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను స్వాధీనం చేసుకుని 13న విచారించింది. ఆ తర్వాత ఆయన గర్ల్‌ఫ్రెండ్ గ్యాబ్రియోల్ డెమెట్రియేడ్స్‌కు కూడా సమన్లు అందజేసి విచారించారు. (చదవండి: అర్జున్ రాంపాల్‌కు మరోసారి సమన్లు) అయితే ఈ ఏడాది జూన్ 14న హీరో సుశాంత్ సింగ్ ముంబైలోని తన ఇంటిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ మృతి కేసు దర్యాప్తులో భాగంగా బాలీవుడ్ డ్రగ్ వ్యవహరం వెలుగు చూసింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి సుశాంత్‌కు డ్రగ్స్ ఇచ్చినట్లు ఆరోపణలు రుజువు కావడంతో వారిని పోలీసులు ఆరెస్టు చేశారు. విచారణలో రియా హీరోయిన్ దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్‌ల పేర్లను వెల్లడించడంతో ఎన్సీబీ వారికి కూడా సమన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో అరెస్టెయిన రియా, ఆమె సోదరుడు షోవిక్‌లకు ఇటీవల బెయిల్ లభించగా సుశాంత్ ఇంటీ మేనేజర్ శామ్యూల్ మిరాండా, పర్సనల్ స్టాఫ్ దీపేశ్ సావంత్‌తో మరో ఇద్దరూ జైలులోనే ఉన్నారు. (చదవండి: సుశాంత్ కేసు: రూ. 2.5 కోట్ల డ్రగ్స్ స్వాధీనం) -
సుశాంత్ కేసు: రూ. 2.5 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
ముంబై: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇప్పటికే నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి సహా పలువురు డ్రగ్ డీలర్లను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా నిందితులు వెల్లడించిన వివరాల ఆధారంగా ఎన్సీబీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో తాజాగా.. ముంబైలోని అంధేరీ వెస్ట్‌లో సోదాలు నిర్వహించింది. సుమారు రెండున్నర కోట్ల విలువ గల 5 కిలోల హషిష్, ఆఫీం, ఎండీఎమ్ఏ(మాలి) తదితర డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. వీటిని సరఫరా చేస్తున్న రీగల్ మహాకల్ అనే వ్యక్తిని అరెస్టు చేసింది. కాగా మహాకల్‌తో పలువురు బీ-టౌన్ ప్రముఖులకు సంబంధాలు ఉన్నట్లు ఎన్సీబీ భావిస్తోంది. బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం బయటపడిన నాటి నుంచి పరారీలో ఉన్న అతడిని పట్టుకోవడం ద్వారా కేసులో పురోగతి సాధించగలమని అధికారులు వెల్లడించారు.(చదవండి: షోవిక్ చక్రవర్తికి బెయిల్ మంజూరు) ఇక ఈ విషయం గురించి ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే మాట్లాడుతూ.. ‘‘ఈరోజు మేం రీగల్ మహాకల్‌ను అరెస్టు చేశాం. రియా చక్రవర్తి, షోవిక్‌తో అతడికి సంబంధాలు ఉన్న విషయాన్ని కొట్టిపారేయలేం’’ అని పేర్కొన్నారు. కాగా రీగల్, అనూజ్ కేశ్వానికి డ్రగ్స్ సరఫరా చేయగా, అతడి నుంచి రియా వాటిని కొనుగోలు చేసి సుశాంత్‌కి ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ ఏడాది జూన్ 14న సుశాంత్ తన నివాసంలో విగత జీవిగా కనిపించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తనతో సహజీవనం చేసిన రియా చక్రవర్తి కారణంగానే అతడు మరణించాడని సుశాంత్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సుశాంత్, రియా, వారి ఫ్లాట్‌లో నివసించే మరికొంత మందిని విచారించగా డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. అనేక పరిణామాల అనంతరం అరెస్టైన రియా చక్రవర్తి తొలుత బెయిలుపై బయటకు రాగా, షోవిక్ కూడా ఇటీవలే జైలు నుంచి విముక్తి పొందాడు. (చదవండి: డ్రగ్స్ వాడొద్దని రియా చెప్పింది. అయినా) -
ఈ ఏడాది ట్విట్టర్లో ఎక్కువగా చర్చించిందేంటంటే..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ప్రజలు అత్యధికంగా చర్చించిన అంశం కోవిడ్ అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ట్విట్టర్లో కూడా 2020లో అత్యధికంగా ప్రజలు చర్చించుకుంది దీని గురించే.. కోవిడ్‌కు సంబంధించిన విశ్వసనీయ సమాచారం, నిపుణులతో అనుసంధానం కోసంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ట్విట్టర్లో ప్రజలు విస్తృతంగా చర్చించారు. ఫ్రంట్‌లైన్ వర్కర్ల పట్ల ఈ ఏడాది ప్రజలు కృతజ్ఞతలను ప్రకటించారు. ట్విట్టర్ ద్వారా ఫ్రంట్ లైన్ వర్కర్లకు కృతజ్ఞతలు తెలపడం ప్రపంచ వ్యాప్తంగా 20% పెరగ్గా, ప్రత్యేకంగా వైద్యులకు కృతజ్ఞతలు తెలపడం 135%, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలపడం 30% పెరిగింది. మరికొన్ని రోజుల్లో 2020 ముగియనుండటంతో ఈ ఏడాది ట్విట్టర్ వేదికగా ప్రజలు చర్చించిన అంశాలను సోమవారం ఆ సంస్థ బహిర్గతం చేసింది. చదవండి: ట్విట్టర్ లవర్స్ కి గుడ్ న్యూస్ ఇంకా సుశాంత్, హాథ్రస్ ఘటనలు.. సమకాలిక అంశాల (కరెంట్ అఫైర్స్)లో కోవిడ్–19 మహమ్మారి (#covid19) అత్యధిక హ్యాష్‌ట్యాగ్ ట్వీట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఆత్మహత్యకు పాల్పడిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు నివాళి (# sushantsinghrajput) అర్పిస్తూ నెటిజన్లు పెట్టిన ట్వీట్లు రెండో అత్యధిక హ్యాష్‌ట్యాగ్ ట్వీట్లుగా నిలిచాయి. ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్లో దళితబాలికపై సామూహిక అత్యాచారం, హత్య ఘటన(# hathrs)పై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై కూడా ట్విట్టర్లో విస్తృత చర్చ జరిగింది. మూడో అత్యధిక హ్యాష్‌ట్యాగ్ ట్వీట్లు దీనిపై నెటిజన్లు చేశారు. చదవండి: ట్విటర్ లో మరో కొత్త ఫీచర్ క్రీడల్లో ‘విజిల్‌పొడు’కూడా.. ఇక క్రీడలకు సంబంధించిన అత్యధికంగా #ఐపీఎల్2020 గురించి ట్విట్టర్లో చర్చ జరగగా, ఆ తర్వాత మహేంద్రసింగ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ టీం హ్యాష్‌ట్యాగ్(# విజిల్‌పొడు), మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనకు ట్విట్టర్లో # టీమిండియా హ్యాష్‌టాగ్‌తో విస్తృత అభినందనలు లభించాయి. గోల్డెన్ ట్వీట్లలో విజయ్‌తో అభిమానుల సెల్ఫీ! ఈ ఏడాది అత్యధిక సంఖ్యలో రిట్వీట్స్, లైక్స్, కోట్ ట్వీట్స్‌ను పొందిన ట్వీట్లను గోల్డెన్ ట్వీట్లుగా ట్విట్టర్ ప్రకటించింది. తమిళ సూపర్‌స్టార్ విజయ్ వేలాది మంది తన అభిమానులతో దిగిన సెల్ఫీ ఫొటోను గత ఫిబ్రవరిలో ట్విట్టర్లో పోస్టు చేయగా, ఈ ఏడాది అత్యధిక రిట్వీట్స్ అందుకుని గోల్డెన్ ట్వీట్‌గా నిలిచింది. తమిళ సినీ అభిమానులు విస్తృతంగా ఈ ట్వీట్‌ను షేర్ చేశారు.భారతీయ క్రికెట్ జట్టు కెపె్టన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మ ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తను అభిమానులతో పంచుకోవడానికి చేసిన ట్వీట్ ఈ ఏడాది అత్యధిక లైకులు అందుకుని గోల్డెన్ ట్వీట్‌గా నిలిచింది. ‘సరిలేరు నీకెవ్వరు..’ ఇటు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ నటించిన హిందీ సినిమా #దిల్బెచారపై ట్విట్టర్లో అభిమానులు అత్యధికంగా చర్చించారు. హీరో సూర్య నటించిన తమిళ సినిమా # సూరారిపొట్రును తమిళ సినీ అభిమానులు మాస్టర్ పీస్‌గా ప్రకటించారు. ఇక అత్యధిక చర్చ జరిగిన తెలుగు సినిమాగా మహేష్‌బాబు, రష్మిక మందన్న నటించిన తెలుగు సినిమా # సరిలేరునీకెవ్వరు నిలిచింది. ఈ ఏడాది ట్విట్టర్లో ప్రపంచవ్యాప్తంగా సినిమాలు, టీవీ గురించి నిమిషానికి 700 ట్వీట్లు చేశారు. బినోద్పై నవ్వులే నవ్వులే.. ఇక #బినోద్( Binod) అత్యధిక హ్యాష్‌ట్యాగ్ ట్వీట్లు అందుకున్న మీమ్(Meme of the year)గా నిలిచింది. సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు పోస్టులకు సంబంధం లేకుండా అసంబద్ధమైన, హాస్యాస్పదమైన కామెంట్లు పెడుతుంటారు. ఇలానే ఓ పోస్టు కింద బినోద్ అనే వ్యక్తి తన పేరును కామెంట్‌గా పెట్టడంతో అతడి పేరు వైరల్‌గా మారి చర్చనీయాంశమైంది. ► కోవిడ్‌తో ప్రభావితమైన వారిని ఆదుకోవడానికి రూ.500 కోట్ల విరాళాన్ని ప్రకటిస్తూ టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా చేసిన ట్వీట్ విస్తృత ప్రశంసలు పొంది మరో గోల్డెన్ ట్వీట్‌గా నిలిచింది. ►కోవిడ్ బారినపడి ఆస్పత్రిలో చేరినట్టు తెలుపుతూ బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేయగా, ఆయన త్వరగా కోలుకోవాలని భారీ సంఖ్యలో అభిమానాలు ‘కోట్ రీట్వీట్’చేయడంతో.. ఇది కూడా గోల్డెన్ ట్వీట్‌గా మారింది. ►కోవిడ్ మహమ్మారిపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు కృతజ్ఞతగా రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆయన దీపాలు వెలిగిస్తూ పెట్టిన ట్వీట్.. రాజకీయ నేతల విభాగంలో అత్యధిక రీట్వీట్లు అందుకుంది. ►క్రికెట్‌కు ధోని చేసిన సేవను కొనియాడుతూ ప్రధాని మోదీ పంపిన ప్రశంసా పత్రాన్ని ధోని ట్వీట్ చేయగా, అభిమానులు భారీ సంఖ్యలో రీట్వీట్ చేశారు. అత్యధిక రీట్వీట్లు పొందిన ఒక క్రీడాకారుడి ట్వీట్ ఇదే.. తీపి గుర్తులు యాది చేసుకున్నరు.. డీడీలో రామాయణం సీరియల్‌ను పున:ప్రసారం చేయడంతో చాలా మంది తమ పాత తీపి గుర్తులను #రామాయణ్‌తో ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. మహేశ్‌బాబు నటించిన పోకిరి సినిమా 14 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా # పోకిరి.. మహాభారత్ సీరియల్‌ను మళ్లీ డీడీలో పున:ప్రసారం చేయడంతో # మహా భారత్.. అనే హ్యాష్ ట్యాగ్‌లతో ట్విట్టర్లో ప్రజలు చర్చించారు. వీటితో పాటు ప్రజలు # ఫొటోగ్రఫీ, #యోగా, # పొయెట్రీను సైతం బాగానే చర్చించారు. -
టాప్‌లో సుశాంత్.. బన్నీని వెనక్కినెట్టిన సోనూసూద్!
సినిమాలో విలన్ పాత్రలు పోషించే నటుడు సోనూసూద్ లాక్డౌన్లో రియల్ హీరోగా మారారు. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్లో ఇబ్బంది పడిన ఎంతో మందికి సాయం అందించి అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. లాక్డౌన్లో ప్రారంభమైన సోనూసూద్ చేస్తున్న సేవలు నేటికి కొనసాగుతున్నాయి. బాలీవుడ్ నటుడైన సోనూసూద్ తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా సుపరిచితుడే. సూపర్‌తో టాలీవుడ్‌కు పరిచయమైన సోనూసూద్ జులాయి, అతడు, ఆగడు, అరుంధతి, శక్తి, సీత వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. తాజాగా సెర్చ్ ఇంజన్ దిగ్గజం యాహూలో ఎక్కువ మంది సెర్చ్ చేసిన ప్రముఖుల్లో సోనూసూద్‌కు స్థానం లభించింది. చదవండి: సుశాంత్ కేసు: రియా సోదరుడికి బెయిల్ యాహూ 2020 లో అత్యధికంగా శోధించిన ప్రముఖుల జాబితాను విడుదల చేసింది. ఇందులో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ దేశ వ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచాడు. అతని తర్వాత రెండవ స్థానంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, మూడో స్థానంలో నటుడు అక్షయ్ కుమార్ నిలిచారు. కాగా తొలిసారి ఈ జాబితాలోకి సోనూసూద్ ఎంటర్ అయ్యారు. గూగుల్‌లో ఎక్కువ మంది శోధించిన వారిలో సోనూసూద్ ఎనిమిదో స్థానాన్ని దక్కించుకున్నారు. గతేడాది ఈ స్థానాన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దక్కించుకోగా. ప్రస్తుతం బన్నీ పదో స్థానానికి పడిపోయారు. యాహూ జాబితాలో టాప్ 10లో టాలీవుడ్ హీరోల నుంచి అల్లు అర్జున్ ఒక్కరే చోటు దక్కించుకున్నారు. వీరితో పాటు అక్షయ్ కుమార్, సల్మాన్, ఇర్ఫాన్ ఖాన్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి వారు సైతం ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. చదవండి: బన్నీకి విజయ్ దేవరకొండ సర్ప్రైజ్.. థ్యాంక్స్ బ్రదర్ టాప్ 10 మంది వరుసగా.. 1. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2. అమితాబ్ బచ్చన్ 3. అక్షయ్ కుమార్ 4. సల్మాన్ ఖాన్ 5. దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ 6. దివంగత నటుడు రిషి కపూర్ 7. దివంగత గాయకుడు బాల సుబ్రహ్మణ్యం 8. సోనూసూద్ 9. అనురాగ్ కశ్యప్ 10. అల్లు అర్జున్ కాగా ఈ జాబితాలో మహిళా ప్రముఖుల విభాగంలో బాలీవుడ్ నటి రియా చక్రవర్తి అగ్రస్థానంలో నిలిచారు. నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదురవ్వడంతో రియా నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. ఇటీవల కంగనా మహారాష్ట్ర ప్రభుత్వంపై, సుశాంత్ మరణంతోపాటు పలువురిపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆమెను హాట్ టాపిక్‌గా మార్చింది. ఇక వరుసగా టాప్ 10 జాబితాను చూసుకుంటే.. 1 రియా చక్రవర్తి 2 కంగనా రనౌత్ 3 దీపికా పదుకొనె 4 సన్నీ లియోన్ 5 ప్రియాంక చోప్రా 6 కత్రినా కైఫ్ 7 నేహా కక్కర్ 8 కనికా కపూర్ 9 కరీనా కపూర్ 10 సారా అలీ ఖాన్ -
సుశాంత్ కేసు: రియా సోదరుడికి బెయిల్
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో ప్రధాన నిందితురాలు నటి రియా చక్రవర్తికి అక్టోబర్‌లో ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె సోదరుడు సోవిక్ చక్రవర్తికి కూడా ముంబై స్పెషల్ కోర్టు బుధవారం బెయిల్ మంజురూ చేసింది. అయితే సుశాంత్ మృతి కేసుతో వెలుగు చూసిన బాలీవుడ్ డ్రగ్ కేసులో రియా, ఆమె సోదరుడు సోవిక్, సుశాంత్ ఇంటి మెనేజర్ శామ్యూల్ మిరాండాతో పాటు పలువురిని సెప్టెంబర్ 4న నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రియా, ఆమె సోదరుడు సోవిక్‌కు డ్రగ్ ప్లెడర్లతో సంబంధాలు ఉన్నాయని వారు సుశాంత్‌కు డ్రగ్ కూడా సప్లై చేసినట్లు ఆధారాలు కూడా ఉన్నాయని ఎన్సీబీ అధికారులు వెల్లడించడంతో వారిని ముంబై హైకోర్టు జైలుకు తరలించింది. ఈ నేపథ్యంలో రియా, సోవిక్లు బెయిల్ కోరుతూ సెప్టంబర్ చివరి వారంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. (చదవండి: ‘అందుకే రియా, సుశాంత్ ఇంటిని వీడింది’) అయితే అక్టోబర్‌లో రియాకు బెయిల్‌ను మంజూరు చేసిన కోర్టు సోవిక్ బెయిల్‌ను రద్దు చేసింది. అనంతరం నవంబర్ మొదటి వారంలో సోవిక్ మళ్లీ బెయిల్ పటిషన్ దాఖలు చేశాడు. అయితే ఈసారి సోవిక్ బెయిల్ పిటిషన్‌ను విచారించిన ముంబై హైకోర్టు ఎన్సీబీ అధికారులు ఇచ్చిన సాక్ష్యాలు అమోధయోగ్యం లేవని సోవిక్‌కు బెయిల్ మంజూరు చేసినట్లు పేర్కొంది. కాగా ఈ ఏడాది జూన్ 14వ సుశాంత్ సింగ్ ముంబైని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముంబై పోలీసులు అతడి ప్రియురాలు రియాను అనుమానిస్తూ విచారణ చేపట్టగా డ్రగ్ కేసు వెలుగు చూసింది. దీంతో ముంబై పోలీసుల ఈ కేసు విచారణను ఎన్సీబీ అధికారులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో రియాను విచారించగా ఆమెకు, సోవిక్‌కు డ్రగ్ ప్లెడర్లతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. ఈ విచారణలో రియా బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనె, శ్రద్దా కపూర్, అలియా భట్, రకుల్ ప్రీత్ సింగ్‌ల పేర్లను కూడా చెప్పడంతో ఎన్సీబీ వారిని కూడా విచారించిన విషయం తెలిసిందే. (చదవండి: సుశాంత్ కేసు: గాబ్రియెల్లా సోదరుడు అరెస్ట్) -
టాప్ సెర్చ్డ్ సెలబ్రిటీ లిస్ట్ : అల్లు అర్జున్ ఏ ప్లేస్
సాక్షి, న్యూఢిల్లీ: 2020 సంవత్సరానికి సంబంధించి తన ప్లాట్‌ఫాంలో ఎక్కువ మంది వెతికిన సెలబ్రిటీల జాబితాను సెర్చ్ ఇంజన్ యాహూ ప్రకటించింది. దివంగత బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020 లో 'మోస్ట్ సెర్చ్డ్ పర్సనాలిటీ'గా నిలవగా అతని ప్రేయసి, నటి రియా చక్రవర్తి అత్యధికంగా శోధించిన మహిళా సెలబ్రిటీగా ఉన్నారని యాహూఇండియా మంగళవారం విడుదలచేసిన జాబితాలో వెల్లడించింది. కోవిడ్ వారియర్స్ ను ‘పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్' 2020 గా పేర్కొంది. టాలీవుడ్ విషయానికి వస్తే..ఈ ఏడాది జనవరిలో అల వైకుంఠపురం సినిమాతో భారీ విజయాన్నిఅందుకున్న స్టైలిష్ స్టార్ అర్జున్ ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. 'మోస్ట్ సెర్చ్డ్ మేల్ సెలబ్రిటీ' విభాగంలో సుశాంత్ అగ్రస్థానంలో ఉండగా, అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్‌తో పాటు కరోనా కారణంగా మరణించిన గాన గంధర్వుడు ఎస్సీ బాలసుబ్రమణ్యం, దివంగత బాలీవుడ్ సీనియర్ హీరో రిషి కపూర్, క్యాన్సర్తోచనిపోయిన ఇర్ఫాన్ ఖాన్ కూడా ఆ లిస్టులో ఉన్నారు. ఈ ఏడాది 'మోస్ట్ సెర్చ్డ్ ఫిమేల్ సెలబ్రిటీ' జాబితాలో రియా మొదటి స్థానంలో ఉంది. నటి కంగనా రనౌత్ రెండవ స్థానంలో, దీపికా పదుకొనే, సన్నీ లియోన్, ప్రియాంక చోప్రా ఉన్నారు. 2020 'టాప్ న్యూస్‌మేకర్స్' కేటగిరీ విషయానికి వస్తే, ప్రధాని మోదీ మొదటి స్థానంలో నిలిచారు, సుశాంత్ , రియా సంయుక్తంగా రెండవ స్థానంలో, రాహుల్ గాంధీ మూడవ స్థానంలో ఉన్నారు. 2020 విభాగంలో 'సెలబ్రిటీస్ విత్ బేబీస్ అండ్ ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్స్' లో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచారు. కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ రెండో స్థానంలో ఉండగా, శిల్పా శెట్టి రాజ్ కుంద్రా మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. కాగా కరోనా , లాక్డౌన్ కాలంలో వలస కార్మికులకు అండగా నిలిచిన నటుడు సోనూ సూద్‌ను 'హీరో ఆఫ్ ది ఇయర్' గా ప్రత్యేకంగా గుర్తించింది టాప్ -10 మేల్ సెలబ్రిటీ లిస్ట్ 1. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ 2. అమితాబ్ బచ్చన్ 3. అక్షయ్ కుమార్ 4. సల్మాన్ ఖాన్ 5. ఇర్ఫాన్ ఖాన్ 6. రిషి కపూర్ 7. ఎస్సీ బాలసుబ్రమణ్యం 8. సోను సూద్ 9. అనురాగ్ కశ్యప్ 10. అల్లు అర్జున్ ఎక్కువగా వెతికిన వారిలో రాజకీయ నేతలు ఎక్కువ స్థానాలనుఅక్రమించగా, ఈ జాబితాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండో స్థానంలో నిలిచారు. 2017 తరువాత మోదీ అగ్రస్థానాన్ని కోల్పోవడం ఇదే మొదటి సారి. రియా మూడోస్థానంలో ఉన్నారు. ఇక ఆ తరువాతి స్ధానాల్లో రాహుల్ గాంధీ, అమిత్ షా, ఉద్దవ్ ఠాక్రే, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, అమితాబ్ బచ్చన్, కంగనా రనౌత్ ఉన్నారు. ఈ ఏడాది ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రముఖుల జాబితా 1. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2. నరేంద్ర మోదీ 3. రియా చక్రవర్తి 4. రాహుల్ గాంధీ 5. అమిత్ షా 6. ఉద్ధవ్ థాక్రే 7. అరవింద్ కేజ్రీవాల్ 8. మమతా బెనర్జీ 9. అమితాబ్ బచ్చన్ 10. కంగనా రనౌత్ మరోవైపు మహిళల జాబితాలో బాలీవుడ్ భామలదే పై చేయి అయింది. టాలీవుడ్ హీరోయిన్లకు స్థానం దక్కలేదు. పురుషుల జాబితాలో సుశాంత్, మహిళల జాబితాలో రియాకు తొలి స్థానాలు దక్కాయి. 1. రియా చక్రవర్తి 2. కంగనా రనౌత్ 3. దీపికా పదుకోణ్ 4. సన్నీ లియోన్ 5. ప్రియాంక చోప్రా 6. కత్రినా కైఫ్ 7. నేహా కాకర్ 8. కనికా కపూర్ 9. కరీనా కపూర్ 10. సారా అలీ ఖాన్ -
బాయ్‌కాట్ బింగో.. ఐటీసీ వివరణ
రణ్వీర్ సింగ్ తాజాగా నటించిన బింగో మ్యాడ్‌యాంగిల్స్ యాడ్‌పై నెటిజనులు తీవ్రంగా విరుకుచపడిన సంగతి తెలిసిందే. ఈ యాడ్‌లో రణవీర్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ని కించపరిచారని నెటిజనలు ఆరోపించారు. దాంతో బాయ్‌కాంట్ బింగో అంటూ రణ్‌వీర్‌ని ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో ఐటీసీ ఈ వివాదంపై స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. "బింగో మ్యాడ్ యాంగిల్స్ తాజా ప్రకటన దివంగత బాలీవుడ్ ప్రముఖుడిని ఎగతాళి చేసేలా రూపొందించారని వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం.ఇలాంటి తప్పుడు సందేశాలు, పోస్టులకు బలైపోవద్దని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. ఇటీవలి ప్రసారం అవుతోన్న బింగో మ్యాడ్‌యాంగిల్స్ యాడ్‌ని ఒక సంవత్సరం క్రితం అక్టోబర్ 2019 లో షూట్ చేశాం. బింగో ప్రయోగం ఆలస్యం కావడంతో ఈ ప్రకటన ఈ ఏడాది ప్రసారం అవుతోంది. కోవిడ్ కారణంగా ‘మ్యాడ్ యాంగిల్స్ చీజ్ నాచోస్ అండ్ బింగో!’ ‘మ్యాడ్ యాంగిల్స్ పిజ్జా’ లాంచ్ చేయడంలో ఆలస్యం జరిగింది" అంటూ ఐటీసీ ఫుడ్స్ ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. (బాయ్‌కాట్ బింగో: రణ్‌వీర్‌పై ట్రోలింగ్) ఇక బింగో మ్యాడ్ యాంగ్సిల్ ప్రకటనలో రణ్వీర్ తన తదుపరి ప్లాన్ గురించి బంధువులకు వివరిస్తూ.. పారడాక్సికల్ ఫొటాన్స్, అల్గారిథమ్స్, ఏలియన్స్.. అంటూ చెప్తూ ఇదే తన నెక్స్ట్ ప్లాన్ అని జవాబివ్వడంతో అందరూ షాక్ అవుతారు. అయితే ఈ యాడ్‌లో ఎక్కడా సుశాంత్ పేరును ప్రస్తావించలేదు. కానీ దివంగత నటుడి అభిమానులు మాత్రం సుశాంత్ మాత్రమే ఫొటాన్స్, ఏలియన్స్ అంటూ సైన్స్ గురించి ఎప్పుడూ మాట్లాడేవారని, కావాలనే ఈ యాడ్‌లో అతన్ని టార్గెట్ చేశారని ఆరోపించారు. ఈ యాడ్‌ని వెంటలనే తొలగించాలని డిమాండ్ చేశారు. -
4 సార్లు ఆత్మహత్యాయత్నం చేశాను: నటుడు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత డిప్రెషన్, మానసిక అనారోగ్య సమస్యల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పలువురు నటీనటులు తమ జీవితంలో డిప్రెషన్‌కు గురైన సందర్భాలను, సూసైడ్ చేసుకోవాలని భావించిన సందర్భాల గురించి వెల్లడించారు. తాజాగా ‘కాయ్ పో చే’ నటుడు అమిత్ సాధ్ జాబితాలో చేరారు. ఇప్పటికి నాలుగు సార్లు ఆత్మహత్య చేసుకోవాలని భావించానని తెలిపారు. అమిత్ మాట్లాడుతూ.. ‘16 నుంచి 18 ఏళ్ల వయసులో నాలుగు సార్లు ఆత్మహత్యాయత్నం చేశాను. ఆత్మహత్య ఆలోచనలు ఉండేవి కావు. కానీ సూసైడ్ చేసుకోవాలని భావించేవాడిని. ఇందుకు గాను ఓ ప్రాణాళిక అంటూ ఉండేది కాదు. ఏదో ఓ రోజు నిద్ర లేచిన దగ్గర నుంచి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేసేవాడిని.. అలా చేస్తూ ఉండేవాడిని’ అన్నారు. అమిత్ మాట్లాడుతూ.. ‘నాలుగోసారి ఆత్మహత్యాయత్నం చేస్తున్నప్పుడు నా ఆలోచన విధానం మారింది. ఎందుకు చనిపోవడం.. గివ్ అప్ చేయడం ఎందుకు అనుకున్నాను. అప్పటి నుంచి నా జీవితం మారిపోయింది’ అన్నారు. (చదవండి: ఏ తండ్రీ భరించలేడు.. నేను చచ్చిపోవాలి) ‘అయితే ఇదంతా ఒక్కరోజులో జరగలేదు. దాదాపు 20 ఏళ్లు పట్టింది. ఆ తర్వాత జీవితాన్ని ఇలా ముగించడం కరెక్ట్ కాదు. ఈ లైఫ్ ఒక బహుమతి అని నాకు అర్థం అయ్యింది. ఆ రోజు నుంచి.. నేను జీవించడం ప్రారంభించాను. నేను ఎంతో అదృష్టవంతుడిని అనిపించింది. జీవితం చూపిన వేలుగులో నేను పయణించాను. బలహీనుల పట్ల ఇప్పుడు నాకు చాలా కరుణ, ప్రేమ, తాదాత్మ్యం ఉన్నాయి’ అన్నాడు. ఇక సినిమాల విషాయనికి వస్తే ప్రస్తుతం అమిత్ సాధ్ నటించిన వెబ్ సిరీస్ 'బ్రీత్: ఇంటు ది షాడోస్' ఘన విజయం సాధించింది. ఇక అతను 'కై పో చే!' చిత్రంలో సుశాంత్ సింగ్‌తో కలిసి నటించాడు. దీంతో పాటు అతడు 'సుల్తాన్', 'గోల్డ్', 'శకుంతల దేవి' సినిమాల్లో నటించారు. అతని రాబోయే ప్రాజెక్ట్ 'జిడ్'. -
‘అక్షయ్ వేధింపులకు దిగుతున్నాడు’
ముంబై: బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ జారీ చేసిన పరువు నష్టం నోటీసులు తీసుకునేందుకు బిహార్‌కు చెందిన యూట్యూబర్ రషీద్ సిద్దిఖీ నిరాకరించాడు. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య విషయంలో రషీద్ య్యూట్యూబ్‌లో తనపై తప్పుడు ఆరోపణలు చేశాడని అక్షయ్ తన నోటీసుల్లో పేర్కొన్నాడు. తన పరువుకు భంగం కలిగించినందుకు రూ.500 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 17న వీటిని పంపించారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు సంబంధించి ఎఫ్ఎఫ్ న్యూస్ చానెల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా, అవమానకరమైన రీతిలో తనపై తప్పుడు ప్రచారం చేశాడని అక్షయ్ ఆరోపించాడు. అయితే అక్షయ్ తనకు పంపించిన నోటీసులు వెనక్కు తీసుకోవాలని, లేదంటే అతనిపై చట్టపరంగా ముందుకెళ్తానని సిద్దిఖీ అన్నారు. ఈ మేరుకు ఆయన తన న్యాయవాది జేపీ జైస్వాల్ ద్వారా శుక్రవారం నోటీసులు పంపించారు. అక్షయ్ కుమార్ నోటీసుల పేరుతో తనపై వేధింపులకు దిగుతున్నాడని అందులో ఆరోపించాడు. తమ అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ ప్రతీ పౌరుడికి ఉంటుందని, ప్రాథమిక హక్కుల్లో ఇది భాగమని సిద్దిఖీ స్పష్టం చేశారు. తన చానెల్లో వచ్చిన వీడియోలు పరువు నష్టం కిందకి రావని తెలిపారు. ఇతర న్యూస్ చానెళ్లలో వచ్చిన సమాచారం ఆధారంగానే తాను అక్షయ్‌పై వార్తలు ప్రసారం చేశానని పేర్కొన్నాడు. తాను ఆ వీడియోలను ఆగస్టులో ప్రసారం చేశానని.. అయితే ఇప్పటి వరుకు ఎందుకు స్నందించలేదో అక్షయ్‌సమాధానం చెప్పాలన్నారు. కావాలనే తనపై కక్ష్య సాధింపు చర్యలకు దిగాడని సిద్దిఖీ ఆరోపించారు. మహారాష్ట్ర పోలీసులతో పాటు ప్రభుత్వంపై ఉద్ధేశపూర్వకంగా తన యూట్యూబ్ చానెల్లో అసత్య ప్రచారం చేశాడనే ఆరోపణలతో ముంబై పోలీసులు సిద్ధిఖీపై కేసు నమోదు చేశారు. తనను అరెస్టు చేయకుండా నవంబర్ 3న సిద్దిఖీ ముందస్తు బెయిల్ పొందిన విషయం తెలిసిందే. -
బాయ్‌కాట్ బింగో: రణ్‌వీర్‌పై ట్రోలింగ్
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులు హీరో రణ్వీర్ సింగ్ మీద ఫైర్ అవుతున్నారు. ఆయన నటించిన బింగో యాడ్‌లో సుశాంత్‌ను కించపరిచారని విమర్శిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో #BoycottBingo హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. బింగోకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న రణ్వీర్ చిప్స్ కోసం నటించిన కొత్త యాడ్‌ను ఇటీవలే రిలీజ్ చేశారు. అందులో రణ్వీర్ ఓ ఫంక్షన్‌కు వెళ్తారు. అక్కడి బంధువులు నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అని హీరోను పదేపదే అడుగుతుంటారు. వాటికి సమాధానం చెప్పలేక, అక్కడనుంచి తప్పించుకోలేక సతమతమవుతున్న అతడికి బింగో మ్యాడ్ యాంగిల్స్ తినగానే ఓ ఐడియా వస్తుంది. (చదవండి: బాయ్‌కాట్ మీర్జాపూర్2 .. ట్విటర్లో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్) వెంటనే ఎవరికీ అర్థం కాని రీతిలో జవాబు చెప్పడం ప్రారంభిస్తారు. పారడాక్సికల్ ఫొటాన్స్, అల్గారిథమ్స్, ఏలియన్స్.. అంటూ చెప్తూ ఇదే తన నెక్స్ట్ ప్లాన్ అని జవాబివ్వడంతో అందరూ షాక్ అవుతారు. ఈ యాడ్‌లో ఎక్కడా సుశాంత్ పేరును ప్రస్తావించలేదు. అయితే సుశాంత్ మాత్రమే ఫొటాన్స్, ఏలియన్స్ అంటూ సైన్స్ గురించి ఎప్పుడూ మాట్లాడేవారని, కావాలనే ఈ యాడ్‌లో అతన్ని టార్గెట్ చేశారని ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు. దీంతో రణ్వీర్ను, బింగో యాడ్‌ను ఏకిపారేస్తున్నారు. సుశాంత్ ఆలోచనలను కించపరిచేలా ఉన్న ఈ యాడ్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: యూట్యూబర్‌కు భారీ షాక్ ఇచ్చిన అక్షయ్) 💫Paradoxical Photons of 𝕒𝕥𝕣𝕒𝕟𝕘𝕚 Algorithm! 💫E=mc2! 💫Mitramandal mai Aliens ki feelings match karni hai.. What the hell do you mean by using these terms?? 𝗠𝗮𝗸𝗶𝗻𝗴 fun of our @itsSSR 😑 𝙍𝙖𝙣𝙫𝙚𝙚𝙧 this isn't acceptable😾#BoycottBingopic.twitter.com/Y7EBeYKczK — Deepika981 (@Deepika9813) November 18, 2020 Yes boycott this ghatiya bingo! #BoycottBingo #boycottzomato #BoycottBollywood #RepublicRoar4SSR #NoSushantNoBollywood https://t.co/3yEwMALamc — Upendra Singh Rajput (@itsusrajput) November 19, 2020 #BoycottBingo #NoSushantNoBollywood https://t.co/NDwxpldSwx — WE ❤MODI (@NaYAmbre) November 19, 2020 -
ఎన్సీబీ కార్యాలయానికి అర్జున్ గర్ల్‌ఫ్రెండ్
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుతో వెలుగు చూసిన డ్రగ్ కేసులో ఇవాళ అర్జున్ రాంపాల్ గర్ల్‌ఫ్రెండ్ గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ముంబైలోని ఎన్సీబీ కార్యాలయానికి చేరుకున్నారు. అదే విధంగా అర్జున్ రాంపాల్‌ను కూడా ఎన్సీబీ విచారించనుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సోమవారం ఎన్సీబీ అధికారులు ఆర్జున్ రాంపాల్ ఇంటిలో సోదాలు నిర్వహంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్న అధికారులు ఆయన డ్రైవర్‌ను కూడా విచారించారు. గత నెల బాలీవుడ్ డ్రగ్ పెడ్లర్‌తో సంబంధాలు ఉన్నాయని గాబ్రియెల్లా సోదరుడు అగిసిలాస్‌ను ఎన్సీబీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం విధితమే. దక్షిణాఫ్రికా జాతీయుడైన ఆమె సోదరుడు అగిసిలాస్‌ను డ్రగ్ పెడ్లర్లతో సన్నిహితంగా ఉన్నాడన్న ఆరోపణలతో అరెస్ట్ చేసిన ఎన్సీబీ స్థానిక కోర్టులో హాజరు పరిచారు. అనంతరం అతడిని కస్టడీకి పంపారు. (చదవండి: అర్జున్ రాంపాల్ ఇంటిపై ఎన్సీబీ దాడులు) చదవండి: అర్జున్ రాంపాల్‌కు ఎన్సీబీ నోటీసులు ఈ క్రమంలో గాబ్రియెల్లాకు కూడా బాలీవుడ్ డ్రగ్స్ దందాతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై ఎన్సీబీ ఇవాళ ఆమెను విచారణ పలిపించింది. ఆమె తెలుగులో నాగార్జున, హీరో కార్తి నటించిన మల్లిస్టారర్ చిత్రం ‘ఊపిరి’లో అతిథి పాత్రలో కనిపించారు. ఇందులో ఆమె నాగార్జునకు ప్రియురాలిగా నటించారు. ఇప్పటికే ఈ కేసులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనె, శ్రద్దా కపూర్, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్‌లకు ఎన్సీబీ సమన్లు జారీ చేసి విచారించిన సంగతి తెలిసిందే. సుశాంత్ మృతి కేసులో ప్రధాన నిందితురాలైన రియాకు డ్రగ్స్ సరఫరా చేసిన పెడ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని సుశాంత్, మేనేజర్ శామ్యూల్ మిరాండా, పర్సనల్ స్టాఫ్ దీపేశ్ సావంత్ తదితరులను అరెస్ట్ చేశారు. 28 రోజుల రిమాండ్ తర్వాత రియాకు బెయిల్ మంజూరు కావడంతో ఆమె బయటకు రాగా... ఆమె సోదరుడితో పాటు ఇతరులు జైలులోనే ఉన్నారు. (చదవండి: సుశాంత్ కేసు: గాబ్రియెల్లా సోదరుడు అరెస్ట్) -
‘అందుకే రియా, సుశాంత్ ఇంటిని వీడింది’
‘‘సుశాంత్ రాజ్‌పుత్ సింగ్ ముంబైలో ఐదుగురు డాక్టర్లను సంప్రదించాడు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వారంతా అతడికి సూచించారు. మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్న తరుణంలో ఇలాంటి వ్యసనాలు వీడితే బాగుంటుందని చెప్పారు. రియా కూడా అతడికి ఇదే మాట చెప్పింది. డాక్టర్ల మాట వినమని సూచించింది. కానీ అతడు అందుకు తిరస్కరించాడు. సుశాంత్ తీరు రియాను అతడి ఇంటిని వీడేలా చేసింది. అతడి కోరిక మేరకే రియా ఈ పని చేసింది’’ అంటూ బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్‌పుత్ సింగ్ మృతికేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి లాయర్ సతీశ్ మనేషిండే కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ ఏడాది జూన్ 14న సుశాంత్ ముంబైలోని తన ఫ్లాట్‌లో విగతజీవిగా కనిపించిన విషయం విదితమే. ఈ క్రమంలో అతడి కుటుంబం, సుశాంత్ ప్రేయసి రియా పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్ సోదరి ప్రియాంక సింగ్‌పై రియా ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ప్రియాంక సూచించిన మందుల కారణంగానే అతడు మృతి చెందాడని, ఈ విషయంపై సీబీఐ కూడా ఈ విషయంపై దృష్టి సారించాలని రియా కోరింది. ఇదిలా ఉండగా.. సుశాంత్ మృతి కేసులో ముంబై పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రియాంకతో పాటు ఆమె సోదరి మీతూ సింగ్ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో బాంబే హైకోర్టులో సోమవారం అఫిడవిట్ దాఖలు చేసిన పోలీసులు, సుశాంత్ సోదరీమణుల పిటిషన్‌ను కొట్టివేయాల్సిందిగా కోరారు. (చదవండి: డ్రగ్స్ కేసు: ఎన్సీబీకి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు) అంతేగాకుండా రియా ఇచ్చిన ఫిర్యాదు మేరకే వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ పరిణామాల గురించి సతీశ్ మనేషిండే మాట్లాడుతూ.. ‘‘రియా చక్రవర్తి చెప్పిన అంశాల ఆధారంగానే ఎఫ్ఐఆర్ నమోదైంది. నిజానికి వైద్యులను సంప్రదించకుండా, ప్రిస్కిప్షన్‌ను ఫోర్జరీ చేయడం చట్టవిరుద్ధం. ప్రియాంక తన సోదరుడికి సూచించిన మందుల విషయం గురించి జూన్8 నాటి మెసేజ్‌లలో స్పష్టంగా కనబడుతోంది. సుశాంత్ డ్రగ్స్‌కు బానిసగా మారాడని, డిప్రెషన్ నుంచి బయటపడేందుకు చికిత్స తీసుకుంటున్నాడని తెలిసి కూడా ఆ కుటుంబం ఇలా చేసింది’’అని ఆరోపణలు గుప్పించారు. -
‘నా వల్లే ఈ విమర్శలు.. క్షమించు’
బాలీవుడ్ నటి అంకితా లోఖండే బాయ్‌ఫ్రెండ్, సోల్మెట్ విక్కిజైన్కి ఇన్స్టాగ్రామ్ వేదికగా క్షమాపణలు చెప్పారు. తన వల్లే అతడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడని వాపోయారు. తనలాంటి పబ్లిక్ ఫిగర్‌తో కలిసి ఉండటం వల్లే అతను విమర్శలు ఎదుర్కొంటున్నాడని.. కానీ వాటికి అసలు అతడు ఏ మాత్రం అర్హుడు కాదని తెలిపారు. అలానే ప్రతిసారి తనను అర్థం చేసుకుని.. మద్దతుగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. మాజీ ప్రేమికుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత అంకిత తరచుగా వార్తల్లో నిలిచారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు వెలికి తీయాలని కోరారు. అభిమానులు కూడా అంకితకు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో కొందరు విక్కి జైన్ అకింతకు తగినవాడు కాదంటూ ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో అంకిత విక్కి జైన్‌కి క్షమాపణలు, కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: ‘ఎలా ఉన్నా జడ్జ్ చేస్తూనే ఉంటారు’) ఈ మేరకు అంకిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘నీ పట్ల నా భావాలను వ్యక్తం చేయడానికి మాటలు దొరకడం లేదు. కానీ నిన్ను చూసిన ప్రతిసారి నా మదిలో దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతాను. ఎందుకంటే నీ లాంటి మంచి వ్యక్తిని నా స్నేహితుడిగా, భాగస్వామిగా, సోల్‌మెట్‌గా పంపినందుకు. అలానే నీవు నాకు అన్ని వేళలా తోడుగా నిలిచావు. నా సమస్యలన్నింటిని నీవిగా భావించావు. నాకు అవసరమైన ప్రతిసారి సాయం చేశావు. నా సపోర్టు సిస్టంగా ఉన్నందుకు ధన్యవాదాలు. అన్నింటికి మించి నన్ను, నా సమస్యలని అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు’ అంటూ విక్కి జైన్‌తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశారు అంకిత. (చదవండి: 2 సెకన్ల చీప్ పబ్లిసిటీ కోసమే; అవునా!) View this post on Instagram I can’t find the words to describe my feelings for you. One thing which come in my mind when I see us together is I’m grateful to god for sending u in my life as a friend, partner and as soul mate ❤️ Thanku for being someone who was always there for me. Thanks for making all my problems as yours and helping me whenever I needed you.Thankyou for being my support system. Most important thanku for understanding me and my situations ❤️ And I am sorry because of me u hv to face criticism which u don’t deserve at all . Words fall short but this bond is amazing🤗I love you 😽 @jainvick #viank A post shared by Ankita Lokhande (@lokhandeankita) on Nov 1, 2020 at 11:04pm PST పవిత్ర రిష్తా సిరీయల్ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు అంకిత. ఇందులో సుశాంత్ ఆమె కో స్టార్‌గా నటించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. దాదాపు ఏడేళ్లు ప్రేమించుకున్న వీరు ఆ తర్వాత విడిపోయారు. 2019లో అంకిత మణికర్ణిక చిత్రం ద్వారా సినిమాల్లోకి ప్రవేశించారు. -
దీపికా మేనేజర్‌కు మరోసారి ఎన్సీబీ సమన్లు
న్యూఢిల్లీ: బాలీవుడ్లో డ్రగ్స్ కేసు దర్యాప్తు భాగంగా స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె మేనేజర్ కరిష్మా ప్రకాష్‌కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూర్(ఎన్సీబీ) మరోసారి సమన్లులు జారీ చేసింది. గత నెలలో ఎన్సీబీ ఆమెకు సమాన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే కరిష్మా ప్రకాష్ విచారణకు గైర్హాజరు కావడంతో కరిష్మా పరారీలో ఉన్నట్లు అధికారుల గుర్తించారు. దీంతో ఇవాళ (సోమవారం) ఎన్సీబీ ఆమెకు మరోసారి సమన్లు జారీ చేసి, ఆ నోటీసులు ఆమె తల్లి మితాక్షర పురోహిత్‌కు అందచేశారు ఈ సందర్భంగా ఎన్సీబీ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇప్పటికే దీపికా పదుకొనెతో పాటు ఆమె మేనేజర్ కరిష్మా ప్రకాష్‌ను ప్రశ్నించాం. ఈ క్రమంలో కరిష్మా ఇంటిలో సోదాలు నిర్వహించగా ఆమె ఇంట్లో 1.7 కిలోగ్రాముల చరాస్, మూడు సీసాల సీబీడీ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నాం. దీనిపై కరిష్మాను మరోసారి విచారించేందుకు సమన్లు జారీ చేశాం. అయితే అప్పటికే ఆమె పరారీలో ఉన్నట్లు తెలిసింది. దీంతో తాజాగా మరోసారి సమన్లు జారీ చేశాం’ అని తెలిపారు. (చదవండి: పరారీలో హీరోయిన్ దీపిక మేనేజర్) అయితే ఈ కేసులో ప్రధాన నిందితురాలైన నటి రియా చక్రవర్తి ఎన్సీబీ విచారణలో పలువురు బాలీవుడ్ నటీనటులు పేర్లను వెల్లడించింది. దీని ఆధారంగా దర్యాప్తు చేపట్టగా దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్, సారా ఆలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్‌ల పేర్లు ఉన్నాయి. అంతేగాక దీపికా, ఆమె మేనేజర్ కరిష్మాల పాత వాట్సప్ డ్రగ్స్ చాట్ కూడా వెలుగులోకి రావడంతో వీరిద్దరిని ఎన్సీబీ విచారణకు పిలిచింది. అలాగే వీరితోపాటు శ్రద్దా కపూర్, సారా, రకుల్‌లకు కూడా ఎన్బీసీ అధికారులు సమన్లు ఇచ్చారు. వీరిపై ఎలాంటి నేరారోపణలు రుజువు కాకపోవడంతో వారిని ఎన్సీబీ తిరిగి పంపించిన విషయం తెలిసిందే. చదవండి: మరిన్ని కోడ్ వర్డ్లు బయటపెట్టిన దీపికా!) -
మౌనం వీడిన ఉద్ధవ్ ఠాక్రే : కంగనాపై ధ్వజం
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై మరోసారి ధ్వజమెత్తారు. శివసేన దసరా ర్యాలీలో ఆయన కంగనాపై పరోక్షంగా విమర్శలు చేశారు. అంతేకాదు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మరణం కేసులో తన కుమారుడు ఆదిత్య థాకరేపై వచ్చిన ఆరోపణలపై మహారాష్ట్ర సీఎం మౌనం వీడారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకుంటే, బిహార్ పుత్రుడు బలవన్మరణం చెందాడని ప్రచారం చేశారంటూ ఎద్దేవా చేశారు. అలాగే కొంతమంది మహారాష్ట్ర బిడ్డలను, ముఖ్యంగా తన కుమారుడు ఆదిత్యను కూడా దుర్భాషలాడారని ఆరోపించారు. కానీ తాము మాత్రం ఎలాంటి కళంకం లేకుండా ఉన్నామని స్పష్టం చేశారు. న్యాయం తమవైపే ఉందని ఆయన పేర్కొన్నారు. బతుకు దెరువు కోసం ముంబైకి వచ్చిన కొంతమంది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకె) అంటూ ముంబై నగరానికి అప్రతిష్టను ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు తాము ఇంట్లో తులసి మొక్కలు పెంచుతాం, గంజాయి కాదు...ఈ విషయం వారికి తెలియదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గంజాయి క్షేత్రాలు వాళ్ల రాష్ట్రంలోనే ఉన్నాయని పేర్కొన్నారు. తమ రాష్ట్రంలో తిండికి గతి లేక ఇక్కడకు వచ్చి డబ్బులు సంపాదించుకుని ముంబైని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌తో పోల్చి పరువు తీస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు నమ్మకద్రోహలుగా మిగిలిపోతారన్నారు. కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత, కంగనా ముంబైని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పోకె) తో పోల్చడం వివాదం రేపింది. దీంతో ఆమె ముంబై వీడి కంగనా తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ వెళ్లిపోవాలని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ మండిపడ్డారు. అక్రమ నిర్మాణమంటూ కంగనా ఆఫీసును బీఎంసీ కూల్చి వేసింది. దీనికి రూ .2 కోట్ల పరిహారాన్ని డిమాండ్ చేస్తూ కంగనా బొంబాయి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.