
సాక్షి, హైదరాబాద్: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో నటుడి పీఆర్ మేనేజర్ సిద్ధార్థ్ పితాని అరెస్టయ్యాడు. మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం(ఎన్‌సీబీ)అధికారులు శుక్రవారం నాడు హైదరాబాద్‌లో సిద్ధార్థ్‌ను అరెస్ట్ చేశారు. అతడు గతంలో సుశాంత్ నివసించిన ఫ్లాట్‌లోనే మూడేళ్లపాటు ఉన్నాడు. జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకునే ముందు చివరిసారిగా సిద్ధార్థ్‌తో మాట్లాడినట్లు పోలీసులు గతంలోనే గుర్తించారు.
ఈ నేపథ్యంలో సుశాంత్ ఆత్మహత్య కేసులో సీబీఐ అధికారులు ఇతడిపై విచారణ జరిపారు. అలాగే ఈ కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంలోనూ ఎన్సీబీ అధికారులు సిద్ధార్థ్‌ను పలుమార్లు విచారించారు. ఈ క్రమంలో సుశాంత్ మరణించి ఏడాది కావడానికి కొన్ని రోజుల ముందు సిద్ధార్థ్ అరెస్ట్ కావడం చర్చనీయాంశంగా మారింది. కాగా సిద్ధార్థ్ సుశాంత్‌కు పీఆర్ మేనేజర్‌గానూ పని చేశాడు.
చదవండి: డ్రగ్స్ కేసు చార్జిషీట్: రియా చక్రవర్తి సహా 33 మంది..
Comments
Please login to add a commentAdd a comment