Narcotics Control Bureau
-
గుజరాత్ తీరంలో 700 కిలోల డ్రగ్స్ స్వాధీనం
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని పోర్బందర్ తీరంలో 700 కిలోల మాదక ద్రవ్యాలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు శుక్రవారం స్వా«దీనం చేసుకున్నారు. ఈ మెథాంఫెటామైన్ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ.3,500 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు. అలాగే 8 మంది ఇరాన్ జాతీయులను అరెస్టు చేశారు. విదేశాల నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ వస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో ‘సాగర్ మంథన్–4’ అనే కోడ్నేమ్లో ఎన్సీబీ, భారత నావికాదళం, గుజరాత్ పోలీసు శాఖకు చెందిన యాంటీ–టెర్రరిస్టు స్క్వాడ్(ఏటీఎస్) సిబ్బంది జాయింట్ ఆపరేషన్ ప్రారంభించారు. గుజరాత్ తీరంలో భారత ప్రాదేశిక జలాల్లో ప్రవేశించిన రిజిస్టర్ కాని ఓ పడవను అడ్డుకున్నారు. అందులో తనిఖీ చేయగా 700 కిలోల డ్రగ్స్ లభించాయి. పడవలో ఉన్న 8 మంది ఇరాన్ పౌరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లేవు. భారీ ఎత్తున డ్రగ్స్ స్వా«దీనం చేసుకున్న అధికారులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభినందించారు. ‘మాదక ద్రవ్యాల రహిత భారత్’ తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. డ్రగ్స్ రవాణా చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 3,500 కిలోల డ్రగ్స్‌ను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. మూడు కేసుల్లో 11 మంది ఇరాన్ పౌరులను, 14 మంది పాకిస్తాన్ పౌరులను అరెస్టు చేశారు. వారంతా ప్రస్తుతం ఇండియా జైళ్లలో ఉన్నారు. ఢిల్లీలో 80 కిలోల కొకైన్ స్వాధీనం దేశ రాజధాని ఢిల్లీలో రూ.900 కోట్ల విలువైన 80 కిలోల కొకైన్‌ను ఎన్సీబీ శుక్రవారం స్వా«దీనం చేసుకుంది. ఓ కొరియర్ సెంటర్లో ఆ డ్రగ్స్ లభించినట్లు అధికారులు చెప్పారు. -
డ్రగ్స్ సరఫరాపై కఠినంగా వ్యవహరించండి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా ముఠా లపై కఠినంగా వ్యవహరించాలని డీజీపీ డాక్టర్ జితేందర్ స్పష్టం చేశారు. డీజీపీ కార్యాలయంలో గురువారం యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధి కారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఇన్ చార్జి సందీప్ శాండిల్యతోపాటు పలువురు పోలీ సు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ....రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మకాల ను నియంత్రిస్తూ కేసులు పెడుతున్నప్పటికీ సరఫ రా విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశా లు జారీ చేశారు.రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూ రో పకడ్బందీగా వ్యవహరించి డ్రగ్స్ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు విభాగం నుంచి సిబ్బందిని అదనంగా బ్యూరోకి కేటాయిస్తామని తెలిపారు. విదేశీయులెవరైనా డ్రగ్ వ్యవహారాల్లో తల దూర్చితే వారిని తిరిగి వారి దేశాలకు పంపించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతల అదనపు డీజీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ...నిందితులను పట్టుకోవడంతోపాటు వారికి శిక్ష పడేలా సాక్ష్యాధారాలను కోర్టులకు సమర్పించాలని సూచించారు. అదనపు సిబ్బందిని కేటాయించడం పట్ల సందీప్ శాండిల్య సంతోషం వ్యక్తం చేశారు.నూతన నేర చట్టాలను పకడ్బందీగాఅమలు చేసేందుకు చర్యలు తీసు కో వాలని డీజీపీ జితేందర్ సూచించారు. క్షేత్రస్థాయి లో నూతన నేర చట్టాల అమలుకు తీసుకోవలసిన చర్యలపై గురువారం డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో డీజీపీ పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమీక్షలో సీఐడీ డీజీ శిఖాగోయెల్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, శాంతిభద్రతల అడిషనల్ డీజీ మహేశ్‌భగవత్ ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రూ.1,814 కోట్ల డ్రగ్స్ సీజ్
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఓ ఫ్యాక్టరీ నుంచి రూ.1,814 కోట్ల విలువైన 907 కిలోల మెఫెడ్రిన్‌తోపాటు, ముడి సరుకును, యంత్ర పరికరాలను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్), ఢిల్లీ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)సంయుక్తంగా జరిపిన దాడిలో బగ్రోడా పారిశ్రామిక ఎస్టేట్‌పై శనివారం దాడి జరిపినట్లు అధికారులు తెలిపారు. గుజరాత్ ఏటీఎస్ యూనిట్ సారథ్యంలో ఇంతభారీగా డ్రగ్స్ పట్టుబడిన ఘటన ఇదే. ఫ్యాక్టరీలో రోజుకు 25 కిలోల మెఫెడ్రిన్ తయారవుతోందని చెప్పారు. ఈ సందర్భంగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు 2017లో మహారాష్ట్రలోని అంబోలిలో మెఫెడ్రిన్ పట్టుబడిన కేసులో ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించాడని అధికారులు వివరించారు. అమృత్‌సర్‌లో రూ.10 కోట్ల కొకైన్ లభ్యం అమృత్‌సర్‌లో రూ.10 కోట్ల విలువైన కొకైన్‌ను స్వా«దీనం పోలీసులు చేసుకున్నారు. ఇటీవల ఢిల్లీలో రూ.5,620 కోట్ల విలువైన 560 కిలోల కొౖకైన్, 40 కిలోల మారిజువానాను సీజ్ చేయడం తెలిసిందే. ఆ కేసు దర్యాప్తు క్రమంలోనే తాజాగా కొకైన్ పట్టుబడింది. ఈ సందర్భంగా ఒక వ్యక్తితోపాటు అతడి టయోటా కారును స్వా«దీనం చేసుకున్నారు. నిందితుడు విదేశాలకు పరారయ్యేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడని అధికారులు తెలిపారు. -
డ్రగ్స్ క్వీన్ బ్లెస్సింగ్!
సాక్షి, హైదరాబాద్: నైజీరియన్ డ్రగ్స్ సిండికేట్‌లో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ కింగ్‌పిన్ డివైన్ ఎబుకా సుజీ దేశంలోని అన్ని మెట్రో నగరాలను లక్ష్యంగా చేసుకొని దందా నిర్వహించేవాడు. నగరానికి ఒకరిని చొప్పున అంకితమైన డ్రగ్ పెడ్లర్‌ను నియమించుకునేవాడని, ఈక్రమంలో హైదరాబాద్‌కు అనోహా బ్లెస్సింగ్ కొరియర్‌గా వ్యవహరించినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఇటీవల తెలంగాణ నార్కోటిక్ బ్యూరో (టీజీ న్యాబ్), సైబరాబాద్ పోలీసులు అంతర్జాతీయ డ్రగ్ రాకెట్‌ను ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నైజీరియన్లు బ్లెస్సింగ్, అజీజ్ నోహీమ్ అడెషోలాతో సహా ఐదుగుర్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.నకిలీ పాస్పోర్టుతో..2018లో ఉపాధి నిమిత్తం ముంబైకి వచ్చిన బ్లెస్సింగ్.. కొంతకాలానికి బెంగళూరుకు మకాం మార్చింది. హెయిర్ స్టయిలిస్ట్‌గా పనిచేస్తూ స్థానిక డ్రగ్ పెడ్లర్‌తో పరిచయం పెంచుకుంది. తొలుత చిన్న మొత్తాల్లో డ్రగ్స్ సరఫరా ప్రారంభించిన ఈమె క్రమంగా సుజీ ఆదేశాల మేరకు బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ నగరాలకు డ్రగ్స్ సరఫరా చేసే స్థాయికి ఎదిగింది.పోలీసులకు చిక్కినా తన అసలు గుర్తింపులు బహిర్గతం కాకుండా చూసుకునేది. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో జోనా గోమ్స్ పేరుతో పశ్చిమ ఆఫ్రికాలోని గినియా బిస్సా దేశం పాస్‌పోర్టును తీసుకుంది. కేవలం అంతర్జాతీయ సిమ్ కార్డులు, వాట్సాప్ ద్వారా మాత్రమే సంప్రదింపులు జరుపుతుండేది. 2019 సెప్టెంబర్ 27న ఒకసారి ధూల్‌పేట ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు.డ్రగ్స్‌తో 20సార్లు హైదరాబాద్‌కు..సుజీ సూచనల మేరకు ఆమె నివసించే బెంగళూరు నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్తుంది. అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి లేదా అప్పటికే నిర్మానుష్య ప్రాంతంలో ఉంచిన డ్రగ్ పార్సిల్‌ను తీసుకొని హైదరాబాద్‌కు సరఫరా చేసేదని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు 20సార్లు నగరానికి డ్రగ్స్ సరఫరా చేయగా.. ఇందులో ఏడు సందర్భాల్లో విమానంలో ప్రయాణించిందని, 13 సందర్భాల్లో రైళ్లు, బస్సుల్లో నగరానికి చేరుకుందని ఓ అధికారి తెలిపారు. బ్లెస్సింగ్ తన బ్యాగేజ్లో కొకైన్ దాచి పెట్టి, దాన్ని విమానం ఎక్కేక్రమంలో చెకిన్ లగేజ్‌లో ఇచ్చేదని, విమానాశ్రయంలో మాదక ద్రవ్యాల ఉనికి గుర్తించడంలో భద్రతా సిబ్బంది డొల్లతనానికి ఇదొక ఉదాహరణనని ఆయన పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చాక ఈ డ్రగ్ పార్సిల్‌ను లంగర్‌హౌస్‌లోని సన్‌సిటీలో ఉంటున్న ఫ్రాంక్లిన్ ఉచెన్నా అలియాస్ కలేషి లేదా ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన అజీజ్ నోహీమ్ అడెషోలాకు అందజేస్తుంది. ఈమె డ్రగ్స్‌ను నేరుగా వినియోగదారులకు లేదా ఇతర పెడ్లర్లకు విక్రయించేదని, డ్రగ్స్ హైదరాబాద్‌కు చేర్చిన ప్రతీసారి సుజీ... బ్లెస్సింగ్‌కు రూ.20 వేలు చెల్లించేవాడని పోలీసులు గుర్తించారు. బ్లెసింగ్‌కు ఈ డ్రగ్ పార్సిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అయితే సుజీ పోలీసులకు చిక్కితేనే ఈ కేసు మూలాలు బయటపడతాయని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. -
డ్రగ్స్ కేసులో రకుల్ సోదరుడు అమన్ అరెస్టు
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్‌బీ), సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ), రాజేంద్రనగర్ పోలీసులు చేపట్టిన ఉమ్మడి ఆపరేషన్‌లో ఐదుగురు డ్రగ్ పెడ్లర్స్ చిక్కారు. వీరి విచారణలో ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు, టాలీవుడ్ నటుడు అమన్ ప్రీత్ సింగ్ సహా 13 మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిలో అమన్ సహా ఐదుగురిని పరీక్షించగా, వారు డ్రగ్స్ వినియోగించినట్లు తేలింది. దీంతో ఈ ఐదుగురినీ నిందితులుగా చేర్చి అరెస్టు చేసినట్లు రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ పేర్కొన్నారు. డ్రగ్ పెడ్లర్స్‌లో కొందరు స్థానికులూ ఉన్నారని, పరారీలో ఉన్న ఇద్దరు ప్రధాన సూత్రధారుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఆయన ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. విదేశాల నుంచి తెప్పించి... నైజీరియాకు చెందిన డివైన్ ఎబుక సుజీ, ఫ్రాంక్లిన్‌లు బిజినెస్, స్టడీ వీసాలపై హైదరాబాద్‌కు వచ్చారు. కొన్నాళ్లు నగరంలోని పారామౌంట్‌కాలనీలో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఢిల్లీలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. విదేశాల నుంచి కొకైన్ సహా వివిధ రకాలైన డ్రగ్స్ ఖరీదు చేస్తున్న వీళ్లు తమ ఏజెంట్ల ద్వారా దేశవ్యాప్తంగా అనేక మంది పెడ్లర్స్‌కు సరఫరా చేస్తున్నారు. నైజీరియా నుంచి వచ్చి బెంగళూరులో హోమ్ సర్వీస్ పని చేస్తున్న అనోహ బ్లెస్సింగ్ వీరికి ప్రధాన ఏజెంట్‌గా ఉంది. ఈమె హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబై, గోవాల్లో ఉన్న పెడ్లర్స్, సెల్లర్స్‌కు మాదకద్రవ్యాలు సరఫరా చేసింది. ఏడాదిన్నర కాలంలో 20 సార్లు నగరానికి మాదకద్రవ్యాలు తెచ్చింది. డ్రగ్స్‌ను హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకుని, విమానాలు, రైళ్లలో తిరుగుతూ సప్లై చేస్తుంటుంది. ఈ డ్రగ్స్‌ను నిజాం కాలేజీ విద్యార్ధిగా ఉన్న నైజీరియన్ అజీజ్ నోహీమ్ అడెషోలా, బెంగళూరులో ఉంటూ ఓ కంపెనీకి లీడ్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్న విశాఖ వాసి అల్లం సత్య వెంకట గౌతమ్, అమలాపురం నుంచి వచ్చి నగరంలో నివసిస్తున్న కారు డ్రైవర్ సనబోయిన వరుణ్ కుమార్, బండ్లగూడకు చెందిన ఈవెంట్స్ కొరియోగ్రాఫర్ మహ్మద్ మెహబూబ్ షరీఫ్‌లకు పంపిణీ చేస్తోంది. వీళ్లు తమ వినియోగదారులకు వీటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గ్రాముకు రూ.500 కమీషన్ 2018 నుంచి ఈ దందాలో ఉన్న అనోహ ఆఫ్రికా నుంచి జోయినా గోమెస్ పేరుతో నకిలీ పాస్‌పోర్టు తీసుకుని వినియోగిస్తోంది. తరచూ బెంగళూరు–హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగిస్తున్న గౌతమ్... అనోహ ద్వారా అందుకున్న డ్రగ్స్‌ను పెడ్లర్స్‌కు సరఫరా చేస్తున్నాడు. ఒక్కో గ్రాముకు రూ.500 చొప్పున కమీషన్ తీసుకుంటూ డెలివరీ ఇస్తున్నాడు. ఇటీవలే ఇద్దరు నైజీరియన్లు ఇతడి బ్యాంకు ఖాతాలోకి రూ.13.24 లక్షల కమీషన్‌ను ట్రాన్స్ఫర్ చేశారు. ఇతడు ఐదు నెలల క్రితమే ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఆమె బ్యాంకు ఖాతాలోకీ రూ.2.5 లక్షల కమీషన్ డిపాజిట్ చేయించాడు. ఇతడు గత ఏడు నెలల్లో 2.6 కేజీల కొకైన్ క్రయవిక్రయాలు చేసినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. వరుణ్ కుమార్‌కు తన వినియోగదారుడైన మధు ద్వారా గౌతమ్‌తో పరిచయం ఏర్పడింది. అలా ఈ దందాలోకి వచ్చిన ఇతడు నైజీరియన్ల నుంచి గ్రాము రూ.8 వేలకు ఖరీదు చేసి, రూ.12 వేలకు విక్రయిస్తున్నాడు. ఇలా ఆరు నెలల కాలంలో రూ.7 లక్షల వరకు ఆర్జించాడు. నగరంలో 13 మంది... వీరి దందాపై టీజీఏఎన్‌బీ అధికారులకు సమాచారం అందింది. దీంతో సోమవారం హైదర్షాకోట్లోని ఓ అపార్ట్‌మెంట్‌పై దాడి చేశారు. అక్కడ ఎబుక, ఫ్రాంక్లిన్ మినహా మిగిలిన ఐదుగురూ చిక్కారు. వీరి నుంచి 199 గ్రాముల కొకైన్, వాహనాలు, సెల్ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. ఈ పెడ్లర్స్ విచారణలో 13 మంది నగరవాసులు తమ నుంచి తరచూ డ్రగ్స్ ఖరీదు చేసి వినియోగిస్తున్నట్లు బయటపెట్టారు. వీరిలో బంజారాహిల్స్‌కు చెందిన బిల్డర్ అనికేత్ రెడ్డి, కన్స్ట్రక్షన్ వ్యాపారి ప్రసాద్, సినీ నటుడు అమన్‌ప్రీత్ సింగ్, మాదాపూర్ వాసి మధుసూదన్, పంజగుట్టకు చెందిన నిఖిల్ దావన్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు డ్రగ్ టెస్ట్ చేయగా... కొకైన్ వాడుతున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో వీరిని అరెస్టు చేసిన అధికారులు పరారీలో ఉన్న సూత్రధారుల కోసం గాలిస్తున్నారు. డ్రగ్స్‌పై సమాచారం తెలిస్తే 8712671111కు తెలపాలని కోరారు. ఎబుక, ఫ్రాంక్లిన్ సమాచారం అందిస్తే రూ.2 లక్షల రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. కాగా, సూత్రధారులిద్దరూ నైజీరియా పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
డ్రగ్స్ వాడటం వన్ వే
డ్రగ్స్ వాడటం అనేది వన్‌వే లాంటిది. ఒక్కసారి ఆ దారిలోకి వెళ్లి వాటికి బానిసలుగా మారితే తిరిగి వెనక్కి రావడం అనేది చాలా కష్టం’ అని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) జోనల్ డైరెక్టర్ సచిన్ గోర్పడే అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ సమస్యను నిరోధించడానికే ‘ఎవిడెన్స్ ఈజ్ క్లియర్.. ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్’ (డ్రగ్స్ వాడటంపై ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. నిరోధంపై దృష్టి పెట్టండి) అనే థీమ్‌తో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. సచిన్ గోర్పడే గురువారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. సాక్షి, హైదరాబాద్ఇతర దేశాల ఏజెన్సీలతోనూ సమన్వయంఎన్సీబీ కేవలం డ్రగ్స్ నిరోధం కోసమే కాకుండా వీటి విని యోగానికి వ్యతిరేకంగా అవ గాహన కల్పించడానికి కూడా పనిచేస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 26 ఎన్సీబీ జోనల్ కార్యాల యాలు ఉన్నా యి. మాదక ద్రవ్యాలు అనేవి మన దగ్గర వరకు వచ్చేశాయి. అనేక మంది విద్యా ర్థులు, కుటుంబాలు, ప్రము ఖులు సైతం వీటి ప్రభావంలో ఉన్నారు. ఈ నేప థ్యంలోనే డ్రగ్ నెట్ వర్క్స్‌పై నిఘా ఉంచు తున్నాం. దీనికోసం ఇతర దేశాలకు చెందిన ఏజెన్సీల తోనూ సమన్వ యం చేసుకొని పని చేస్తున్నాం. ఆయాదేశాల నుంచి వచ్చే డ్రగ్స్‌కు సంబంధించిన వివ రాలు తెలుసుకొని కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం. అమెరికా టు అమెరికా వయా హైదరాబాద్ ⇒ ఇటీవల అమెరికాలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోయారు. దీనిపై దర్యాప్తు చేసిన అక్కడ ఏజెన్సీలు రెండు రకాలైన డ్రగ్స్ ఓవర్ డోస్ వల్ల ఇలా జరిగినట్టు తేల్చాయి. ఆ మాదకద్రవ్యా లను సరఫరా చేసింది హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించి సమాచారం ఇచ్చాయి. వెంటనే అప్రమత్తమై దాడి చేసి అతడిని పట్టుకున్నాం. భారీమొత్తం నగదుతో పాటు డ్రగ్స్ సీజ్ చేశాం. ఇతడికి అవి న్యూజిలాండ్ నుంచి వచ్చినట్టు తేలడంతో అక్కడి ఏజెన్సీలకు తెలిపాం. వారు కొన్ని అరెస్టులు చేయగా...అసలు మూలం అమెరికాలోని న్యూయార్క్ అని తేలింది. దీంతో అమెరికా ఏజెన్సీలు కీలక సూత్రధారిని పట్టుకున్నాయి. డ్రగ్స్ నెట్వర్క్స్ కార్యకలాపాలకు ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే.సాంకేతిక పరిజ్ఞానమే పెనుసవాల్⇒ డ్రగ్స్ మాఫియాలు ఇంటర్నెట్, డార్క్ వెబ్, క్రిప్టో కరెన్సీ వంటివి వినియోగిస్తుండటం పెద్ద సవాల్‌గా మారింది. అయినా హైదరాబాద్ యూనిట్ సమర్థంగా పనిచేస్తూ గడిచిన రెండేళ్లల్లో 24 భారీ డ్రగ్ నెట్‌వర్క్స్‌ను ఛేదించింది. ఈ కేసుల్లో కనీసం 15 నుంచి 20 ఏళ్లు శిక్ష పడుతుంది. ఎన్సీబీకి చిక్కితే బయట పడటం కష్టమనే భావన వినియోగదారులు, విక్రేతలు, సరఫరా దారులకు ఉంది. బయట నుంచి వచ్చే భారీ డ్రగ్ కన్సైన్మెంట్స్తో పాటు ఇక్కడ తయారయ్యే వాటిపై ఎక్కువ దృష్టి పెడతాం. ఫార్మా హబ్‌గా ఉన్న హైదరాబాద్ దానికి అనుబంధమైన కెమికల్ హబ్‌గానూ మారింది. ఇవే కొన్నిసార్లు పక్కదారి పట్టి ఎఫిడ్రిన్, సూడో ఎఫిడ్రిన్, ఎంఫిథిటమీన్ వంటి డ్రగ్స్ తయారవుతున్నాయి. ఇలా తయారు చేసే రెండు ల్యాబ్స్‌పై ఇటీవల దాడులు చేశాం.మార్పులు కనిపిస్తే జాగ్రత్త..ప్రధానంగా 12 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్కులే డ్రగ్స్‌కు అలవాటుపడుతున్నారు. అలాంటి వారితో మాన్పించడం కూడా పెద్ద సవాలే. వీరి ప్రవర్తనను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. ఎక్కువసేపు ఒంటరిగా గడపటం, బాగా చదివేవారు ఒక్కసారిగా డల్ అయిపోవడం, ముభావంగా ఉండటం, ఐ టు ఐ కాంటాక్ట్ లేకుండా మాట్లాడటం చేస్తుంటే అనుమానించి అప్రమత్తం కావాలి. డ్రగ్స్ వినియోగం వల్ల మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, సామాజికంగా నష్టపోతారనేది వారికి అర్థమయ్యేలా చెప్పాలి. హైదరాబాద్‌లో డ్రగ్స్ క్రయవిక్రయాలకు సంబంధించి భారీ గ్యాంగ్స్ లేవు. అన్నిరంగాల్లో ఉన్నట్టే అతి తక్కువ శాతమే సినీరంగంలో డ్రగ్స్ ఉన్నాయి. అయితే దీనిపై అందరూ దృష్టి పెట్టడంతోనే ఎక్కువ ఎక్స్పోజ్ అవుతోంది.డమ్మీవి పంపి పెడ్లర్స్‌ను పట్టుకున్నాం⇒ డ్రగ్ పెడ్లర్స్‌ను పట్టుకోవడానికి ఎన్సీబీ అనేక రకరకాల ఆపరేషన్లు చేస్తుంది. ఇటీవల ఓ కొరియర్ పార్శిల్‌పై మాకు సమాచారం అందింది. దానిని అడ్డుకొని విప్పి చూడగా అందులో 110 ఎల్ఎస్డీ బోల్ట్స్ దొరికాయి. వీటిని ఎవరు ఆర్డర్ ఇచ్చారో వారిని పట్టుకోవాలని నిర్ణయించుకున్నాం. దీంతో ఆ పార్శిల్లో డమ్మీ బోల్ట్స్ ఉంచి చేరాల్సిన చిరుమానాకు పంపి నిఘా ఉంచాం. దాన్ని తీసుకోవడానికి వచ్చిన ఇద్దరు పెడ్లర్స్‌ని గతవారం అరెస్టు చేశాం. రాజకీయ పార్టీల సిద్ధాంతాలు, ఆలోచనలు, ఆశయాలు వేరుగా ఉండవచ్చు. అయితే డ్రగ్స్‌కు మాత్రం అన్ని పార్టీలు వ్యతిరేకంగానే ఉన్నాయి. సమాజంలో ప్రతి ఒక్కరూ ‘సే ఎస్ టు లైఫ్... సే నో టు డ్రగ్స్’ అనేది గుర్తుంచుకోవాలి. దీనిపై పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థల్లో భారీ ప్రచారం చేస్తున్నాం. -
Narcotics Control Bureau: అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్.. డీఎంకే మాజీ నేత అరెస్ట్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ కీలక సూత్రధారిగా, డీఎంకే బహిష్కృత నేత జాఫర్ సాదిక్ (36)ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. ఇటీవల ఎన్సీబీ సుమారు రూ.2 వేల కోట్ల విలువైన అంతర్జాతీయ డ్రగ్ రాకెట్‌ను బ్యూరో ఛేదించడం తెలిసిందే. సాదిక్ పలు తమిళ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. తమిళ, హిందీ సినీ రంగ ప్రముఖులతో అతనికి సంబంధాలున్నాయని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జ్ఞానేశ్వర్ సింగ్ తెలిపారు. ‘‘పార్టీలకు నిధులిచ్చినట్టు దొరికిన ఆధారాలపై దర్యాప్తు జరుపుతున్నాం. సాదిక్ నుంచి ముడుపులందుకున్న డీఎంకే ముఖ్య నేతకు నోటీసులిచ్చి ప్రశ్నిస్తాం’’ అని చెప్పారు. అతనిపై త్వరలో మనీ లాండరింగ్ కేసు కూడా నమోదు చేయనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. మూడు దేశాలకు స్మగ్లింగ్ భారత్ నుంచి కొబ్బరి పొడి, మిక్స్ ఫుడ్ పౌడర్‌లో కలిపిన సూడోఎఫెడ్రిన్ తమ దేశాల్లోకి పెద్ద మొత్తాల్లో దొంగచాటుగా రవాణా అవుతోందంటూ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ 2023 డిసెంబర్లో ఎన్సీబీకి ఉప్పందించాయి. ఢిల్లీలో సాదిక్‌కు చెందిన అవెంటా కంపెనీలో ఫిబ్రవరిలో జరిపిన సోదాల్లో 50 కిలోల సూడోఎఫెడ్రిన్ దొరికింది. దీన్ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేసియాకు తరలిస్తున్న రాకెట్లో సాదిక్ కీలక సూత్రధారిగా తేలాడు. పైరేటెడ్ సీడీల నుంచి మొదలైన దందా సాదిక్ దందా పైరేటెడ్ సీడీలతో మొదలైంది. కెటమైన్ డ్రగ్‌ను అంతర్జాతీయ మార్కెట్‌కు స్మగ్లింగ్ చేసే స్థాయికి విస్తరించింది. మూడేళ్లలో 45 దఫాలుగా సుమారు రూ.2 వేల కోట్ల విలువైన 3,500 కిలోల సూడోఎఫెడ్రిన్‌ను అంతర్జాతీయ మార్కెట్లోకి పంపాడు. ఇది అత్యంత ప్రమాదకరమైన సింథటిక్ డ్రగ్. దీని సాయంతో తయారు చేసే మెథాంఫెటమైన్‌కు అంతర్జాతీయ మార్కెట్లో కిలో రూ.కోటి నుంచి కోటిన్నర వరకు ధర పలుకుతుంది! -
అరేబియన్ సముద్ర జలాల్లో 3,300 కేజీల డ్రగ్స్ స్వాధీనం
సాక్షి, విశాఖపట్నం: అరేబియా సముద్ర జలాల్లో భారీ మొత్తంలో మత్తుపదార్థాలను భారత నౌకాదళం స్వా«దీనం చేసుకుంది. సముద్రజలాలపై ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్‌ను స్వా«దీనం చేసుకోవడం ఇదే మొదటిసారి. ఇరాన్‌లోని ఛబహర్ నౌకాశ్రయం నుంచి బయల్దేరి మంగళవారం ఉదయం అరేబియా సముద్రంలో అంతర్జాతీయ సముద్రజలాల సరిహద్దు(ఐఎంబీఎల్)కు 60 నాటికల్ మైళ్ల దూరంలో భారత్ వైపు వస్తున్న ఒక అనుమానిత చేపల పడవను భారత నావికాదళ నిఘా విమానం కనిపెట్టి వెంటనే ప్రధాన కార్యాలయానికి సమాచారం చేరవేసింది. అక్కడి నుంచి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)కి సమాచారం అందింది. వెంటనే నేవీ, ఎన్సీబీ, గుజరాత్ పోలీసులు సంయుక్తంగా రంగంలోకి దిగారు. పీ8ఐ నేవీ విమానం, యుద్ధనౌక, హెలికాప్టర్లు ఆ పడవను చుట్టుముట్టి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. నౌకను ఎన్సీబీ అధికారులు తనికీచేయగా దాదాపు 3,300 కేజీల మాదకద్రవ్యాలున్న ప్యాకెట్లు బయటపడ్డాయి. ఈ ప్యాకెట్లలో 3,110 కేజీల ఛరస్/హషి‹Ù, 158.3 కేజీల స్ఫటికరూప మెథామ్ఫెటమైన్, 24.6 కేజీల హెరాయిన్ ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో వీటి మొత్తం విలువ గరిష్టంగా రూ.2,000 ఉండొచ్చని ఢిల్లీలో ఎన్సీబీఐ డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ ప్రధాన్ అంచనావేశారు. ఆ ప్యాకెట్ల మీద ‘రాస్ అవద్ గూడ్స్ కంపెనీ, పాకిస్తాన్ తయారీ’ అని రాసి ఉంది. మత్తుపదార్థాల ప్యాకెట్లతోపాటు పడవలో ఉన్న ఐదుగురు విదేశీయులను అరెస్ట్‌చేశారు. వీరి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు. వీరిని పాక్ లేదా ఇరాన్ దేశస్తులుగా భావిస్తున్నారు. వీరి నుంచి ఒక శాటిటైల్ ఫోన్, నాలుగు స్మార్ట్ఫోన్లను స్వా«దీనం చేసుకున్నారు. ‘భారత నావికాదళం, ఎన్సీబీ, గుజరాత్ పోలీసులు సాధించిన ఈ విజయం మత్తుపదార్థాల రహిత భారత్ కోసం కేంద్రం చేస్తున్న కృషికి నిదర్శనం’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. సముద్ర జలాల్లో ఇన్ని కేజీల డ్రగ్స్ పట్టివేత ఇదే తొలిసారి. అంతకుముందు 2023 మేలో కేరళ తీరంలో 2,500 కేజీల మత్తుపదార్థాలను ఎన్సీబీ, నేవీ పట్టుకున్నాయి. -
Narcotics Control Bureau: తమిళ నిర్మాత సూత్రధారిగా డ్రగ్స్ రాకెట్
న్యూఢిల్లీ: తమిళ సినీ నిర్మాత సూత్రధారిగా ఉన్న భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేసియాల్లో విస్తరించిన డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తెలిపింది. ఢిల్లీలో ఇటీవల జరిపిన సోదాల్లో డ్రగ్స్ తయారీకి వాడే 50 కిలోల సూడో ఎఫెడ్రిన్ రసాయనాన్ని స్వాధీనం చేసుకుని, తమిళనాడుకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. వీరు డ్రగ్స్‌ను ఓడలు, విమానాల్లో హెల్త్ మిక్స్ పౌడర్, కొబ్బరి పొడిలో డబ్బాలో దాచి రవాణా చేస్తున్నట్లు తేలిందని పేర్కొంది. కిలో రూ.1.5 కోట్లుండే సూడో ఎఫెడ్రిన్‌తో మెథాంఫెటమైన్ అనే ప్రమాదకరమైన సింథటిక్ డ్రగ్‌ను తయారు చేస్తారు. న్యూజిలాండ్ కస్టమ్స్, ఆస్ట్రేలియా పోలీసుల సమాచారం మేరకు డ్రగ్స్ రాకెట్‌పై విచారణ చేపట్టినట్లు ఎన్సీబీ వివరించింది. ఇవి ఢిల్లీ నుంచే రవాణా అవుతున్నట్లు అక్కడి బసాయ్దారాపూర్లోని గోదాం నుంచి వస్తున్నట్లు గుర్తించామని తెలిపింది. పట్టుబడిన వారిని విచారించగా గత మూడేళ్లలో రూ.2 వేల కోట్ల విలువైన 3,500 కిలోల సూడో ఎఫెడ్రిన్‌ను 45 దఫాలుగా పంపించినట్లు తేలింది. సదరు నిర్మాత పరారీలో ఉన్నట్లు వివరించింది. అతని కోసం గాలింపు ముమ్మరం చేశామని తెలిపింది. -
మత్తు వదిలించేలా..
సాక్షి, హైదరాబాద్ : మత్తు మహమ్మారిని తుద ముట్టించేందుకు ఈ ఏడాది కీలక అడుగులు పడ్డాయి. రాష్ట్ర యువతపై పంజా విసురుతున్న గంజాయి, డ్రగ్స్ పీడ వదిలించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మత్తుపదార్థాల రవాణాపై ఉక్కుపాదం మోపుతోంది. ఇటీవల కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన సమావేశంలోనూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. దీంతో ఈ ఏడాది నుంచే మత్తు కట్టడిపై ప్రభుత్వం యుద్ధభేరి మోగించినట్టు అయ్యింది. టీఎస్ న్యాబ్ (తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ బ్యూరో) డైరెక్టర్‌గా సందీప్ శాండిల్య బాధ్యతలు తీసుకున్న రోజుల వ్యవధిలోనే మూడు దశాబ్దాలుగా ఆల్ఫాజోలం మత్తుదందా చేస్తున్న నిందితులను వెలుగులోకి తేవడమే కాదు రూ.3.14 కోట్ల విలువైన ఆల్ఫాజోలం స్వాదీనం చేసుకున్నారు. మొత్తంగా ఈ ఏడాదిలో చెదురుమదురు ఘటనలు మినహా ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్‌శాఖ పక్కా ప్రణాళికలు ఫలించాయి. నిరుద్యోగుల జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చిన టీఎస్పీఎస్సీ వరుస పేపర్ లీకేజీలపై కేసుల నమోదు సంచలనం సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదే జరగడంతో దాదాపు సగం సమయం ఎన్నికల కసరత్తు, ఎన్నికల విధుల్లోనే పోలీసులు గడిపారు. ఈ ఏడాదిలో నమోదైన కొన్ని ప్రధాన నేర ఘటనలు ♦ ఫిబ్రవరి 23న వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ ఫస్టియర్ విద్యార్థిని ధరావత్ ప్రీతి సీనియర్ సైఫ్ వేధింపులతో ఆత్మహత్యకు యతి్నంచగా, చికిత్స పొందుతూ ఫిబ్రవరి 27న చనిపోయింది. ♦ ఫిబ్రవరి 17న అబ్దుల్లాపూర్‌మెట్ స్టేషన్ పరిధిలో బీటెక్ విద్యార్థి నవీన్‌ను తోటి విద్యార్థి హరిహరకృష్ణ హత్య చేసి తల, గుండె, చేతివేళ్లు, మర్మాంగాలను శరీరం నుంచి వేరు చేసి, వాటిని తగులబెట్టాడు. ♦ఈ ఏడాదిలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం అత్యంత కీలకమైంది. తొలుత టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్షపత్రం లీకేజీపై మార్చి 10న టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ సెక్రెటరీ సత్యనారాయణ ఫిర్యాదుతో తొలుత కేసు నమోదైంది. ఆ తర్వాత వరుసగా అనేక పరీక్షల లీకేజీ బయటపడడంతో ప్రభుత్వం మార్చి 14న హైదరాబాద్ సిటీ అడిషనల్ సీపీ క్రైమ్స్ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. నిందితుల అరెస్టు పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో సిట్ ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచింది. ♦ మార్చి 16 సాయంత్రం సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 14 మందిని అగి్నమాపకశాఖ సిబ్బంది కాపాడింది. ♦ మార్చి 11న ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితకు తొలిసారిగా నోటీసులు జారీ చేశారు. ♦ దేశవ్యాప్తంగా 17 కోట్ల మంది వ్యక్తిగత సమాచారం చోరీచేసి సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్న 12 మంది సభ్యుల ముఠాను ఈ ఏడాది మార్చి 23న సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ♦ ఒక నైజీరియాతో సహా నలుగురు సభ్యుల ముఠాను మే 7న అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు వారి నుంచి రూ.1.30 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్నారు ♦ మే నెలలో కుషాయిగూడలోని ఓ టింబర్ డిపోలో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదేళ్ల కుమారుడు సహా దంపతులు సజీవ దహనం అయ్యారు. ♦ అప్పు తిరిగి చెల్లించే విషయంలో వచి్చన వివాదంతో మలక్‌పేటలో మాజీ హెడ్నర్స్ అనురాధారెడ్డిని చంద్రమోహన్ మే 15వ తేదీ రాత్రి హత్య చేసి, శరీరభాగాలను ముక్కలు చేసి ఫ్రిజ్‌లో 13 రోజులు దాచి, ఆ తర్వాత వాటిని మూసీనదిలో వేశాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ♦ దేశవ్యాప్తంగా వందలమందిని ముంచిన ఈ–స్టోర్ ఇండియా సంస్థ రూ.1,000 కోట్ల మోసాన్ని మే 30న హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు వెలుగులోకి తెచ్చారు. ♦ మావోయిస్టు పార్టీ అగ్రనేత, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ మే 31న దండకారణ్యం గెరిల్లా జోన్లో గుండెపోటుతో మరణించారు. ♦ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో అప్పరను పూజారి సాయికృష్ణ రాయితో మోది దారుణంగా హతమార్చి మృతదేహాన్ని సరూర్‌నగర్ మండల ఆఫీస్ వెనుక ఉన్న పాత సెఫ్టిక్ ట్యాంక్‌లో వేసి ఉప్పు, ఎర్రమట్టి నింపిన ఘటన సంచలనం సృష్టించింది. ♦ ఓ మహిళా కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం నేపథ్యంలో మహబూబ్‌నగర్ సీసీఎస్ సీఐ ఇఫ్తికర్ అహ్మద్‌పై ఆ కానిస్టేబుల్ దంపతులు జగదీశ్, శకుంతల, మరో వ్యక్తి కృష్ణలు దాడి చేసి అతడి మర్మాంగాలు కోశారు. తీవ్రంగా గాయపడిన సీఐ చికిత్స పొందుతూ మరణించాడు. ♦ తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మిని్రస్టేషన్ (డీసీఏ) డిసెంబర్ 6న మచ్చ బొల్లారంలో జరిపిన సోదాల్లో రూ 4.3 కోట్ల విలువైన యాంటీ కేన్సర్ నకిలీ మందులను గుర్తించారు. ♦ డిసెంబర్ 8న సంగారెడ్డి జిల్లాలో టీఎస్ న్యాబ్ సోదాల్లో డ్రగ్ తయారీ కేంద్రాన్ని గుర్తించడంతోపాటు రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ♦ఏడాది డిసెంబర్ 14న ఖమ్మం పోలీస్‌స్టేషన్ పరిధిలో ముగ్గురు ఆటోలో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న రూ.1.22 కోట్ల విలువైన 484 కిలోల గంజాయిని టీఎస్ న్యాబ్ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. ♦ఆన్లైన్ బెట్టింగ్‌లతో అప్పుల ఊబిలో చిక్కిన సిద్దిపేట కలెక్టర్ గన్‌మన్ నరేశ్ డిసెంబర్ 15న చిన్నకోడూర్ మండలం రామునిపట్లలో తన సర్వీస్ రివాల్వర్‌తో కుమారుడు రేవంత్, కుమార్తె రిషిత, భార్య చైతన్యలను కాల్చి, తను ఆత్మహత్య చేసుకున్నాడు. నేర నియంత్రణలో కీలక అడుగులు ♦ఓవైపు పెరుగుతున్న సైబర్ నేరాలు, మరోవైపు రాష్ట్ర యువత భవిష్యత్‌కు ముప్పుగా మారిన మత్తు మహమ్మారి కట్టడికి ఈ ఏడాదిలోనే కీలక అడుగులు పడ్డాయి. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ఎన్ఏబీ), తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలు మే 31న ప్రారంభమయ్యాయి. ♦ బస్‌లో భరోసా పేరిట రాజన్న సిరిసిల్ల పోలీసులు ఆర్టీసీ బస్సులలో సీసీటీవీ కెమెరాలను ఈ ఏడాది ఆగస్టు 15న ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రజల భద్రత కోణంలో ఇదో నూతన ఆవిష్కరణ. ♦ మొబైల్ ఫోన్ చోరీకి గురైనా, పోగొట్టుకున్నా..తిరిగి గుర్తించేందుకు తెలంగాణ పోలీసుల టెలికమ్యూనికేషన్స్ విభాగం రూపొందించిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టార్ (సీఈఐఆర్) యాప్ వాడడం ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించారు. ఈనెల 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా 15,024 మొబైల్ఫోన్లు గుర్తించి దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచారు. ♦ పని ప్రదేశాల్లో మహిళలకు మరింత భద్రత కల్పించే లక్ష్యంతో తెలంగాణ పోలీస్ మహిళా భద్రత విభాగం ఈ ఏడాది మే 20న ‘సాహస్’వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఎన్నికల కమిషన్ కొరడా.. అనూహ్య బదిలీలు ♦ఎన్నికల విధుల్లో ఉండే పోలీస్ ఉన్నతాధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి కొంచెం గట్టిగానే కొరడా ఝుళిపించింది. అక్టోబర్ 9న రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చిన మూడు రోజుల తర్వాత ఏకంగా 20 మంది అధికారులపై బదిలీ వేటు వేసింది. ప్రతిపక్షాల నుంచి వచ్చిన ఆరోపణలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు గమనించిన అనంతరం ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ♦ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజు నిబంధనలకు విరుద్ధంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలిసిన అప్పటి డీజీపీ అంజనీకుమార్‌పై ఎన్నికల సంఘం అనూహ్యంగా సస్పెన్షన్ వేటు వేసింది. మరో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం..పోలీస్‌శాఖలోని కీలక బదిలీలు వరుసగా జరిగాయి. -
నార్కోటిక్ విచారణ పూర్తి.. నవదీప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
డ్రగ్స్ కేసులో భాగంగా తెలుగు నటుడు నవదీప్‌ని నార్కోటికి అధికారులు విచారించారు. దాదాపు ఆరు గంటల పాటు పలు ప్రశ్నలు అడిగారు. ఇదంతా పూర్తయిన తర్వాత బయటకొచ్చిన నవదీప్.. మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు సంబంధం లేదంటూనే కొత్త విషయాల్ని బయపెట్టాడు. ఇంతకీ అసలేం జరిగింది? నవదీప్ ఏం చెప్పాడు? ఏం జరిగింది? ఈ సెప్టెంబరు 14న తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు.. గుడిమల్కాపుర్ పోలీసులతో కలిసి బెంగళూరుకి చెందిన ముగ్గురు నైజీరియన్స్, ఓ దర్శకుడితో పాటు నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి పలు రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీళ్లని విచారించగా.. వీళ్లతో నటుడు నవదీప్ సంప్రదింపులు జరిపినట్లు తేలింది. అరెస్ట్ అయిన వారిలో రామచందర్ అనే వ్యక్తి నుంచి నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు ఆరోపించారు. ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆ బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) ఈ డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్‌ని నిందితుడుగా చేర్చిన పోలీసులు.. తాజాగా అతడిని విచారించారు. ఈ క్రమంలోనే శనివారం దాదాపు 6 గంటలకు పైగా ఈ విచారణ సాగింది. ఇది పూర్తయిన తర్వాత బయటకొచ్చిన తర్వాత నవదీప్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నవదీప్ కామెంట్స్ 'డ్రగ్స్ కేసులో నోటీసులు ఇచ్చినందుకు నేను విచారణకు వచ్చాను. రామచందర్ అనే వ్యక్తి నాకు పరిచయం ఉన్న మాట వాస్తవమే కానీ అది పదేళ్ల క్రితం విషయం. నేను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదు. గతంలో ఓ పబ్‌ని నిర్వహించినందుకు నన్ను పిలిచి విచారించారు. గతంలో సిట్, ఈడీ విచారిస్తే ఇప్పుడు తెలంగాణ నార్కోటిక్స్ విచారిస్తుంది. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. అవసరముంటే మళ్లీ పిలుస్తామని చెప్పారు. అలానే ఏడేళ్ల పాత ఫోన్ రికార్డులని కూడా పరిశీలించి దర్యాప్తు చేశారు. డ్రగ్స్ కేసులో సీపీ సీవీ ఆనంద్, ఎస్పీ సునీత రెడ్డి నేతృత్వంలో టీమ్ బాగా పనిచేస్తోంది' అని నవదీప్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: సీరియల్ బ్యాచ్‌ని వాయించేసిన నాగార్జున.. తప్పుల్ని గుర్తుచేస్తూ!) -
నటుడు నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో సోదాలు
-
డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. నవదీప్ ఇంటికి నార్కోటిక్ పోలీసులు!
మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక పరిణాణం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న టాలీవుడ్ నటుడు నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో సోదాలు నిర్వహించింది. అయితే పోలీసులు సోదాలు నిర్వహించే సమయంలో నవదీప్ ఇంట్లో లేరని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అతన్ని అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు రామ్‌చంద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాగా.. ఈ కేసులో నవదీప్ ఇప్పటికే మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నార్కోటిక్ బ్యూరో పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. అసలేం జరిగిందంటే... మాదాపూర్‌లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న ఫ్లాట్‌లో గత నెల 31న జరిగిన డ్రగ్ పార్టీ తీగ లాగిన టీఎస్ నాబ్ అధికారులు గురువారం మరో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో నైజీరియన్లతో పాటు టాలీవుడ్‌కు చెందిన వాళ్లు ఉన్నారు. ఈ కేసులో పట్టుబడిన రామ్‌చంద్ విచారణలోనే నటుడు నవదీప్ పేరు వెలుగులోకి వచ్చింది. . నవదీప్‌కు స్నేహితుడు, సన్నిహితుడు అయిన రామ్‌చంద్ తన వాంగ్మూలంలో నవదీప్ సైతం తనతో కలిసి మాదకద్రవ్యాలు సేవించినట్లు వెల్లడించాడు. చివరిసారిగా గత శనివారం వీరిద్దరు వీటిని తీసుకున్నట్లు బయటపెట్టాడు. దీంతో టీఎస్ నాబ్ అధికారులు నవదీప్‌ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. నవదీప్‌ను అరెస్టు చేయొద్దు: హైకోర్టు డ్రగ్స్ కేసులో నవదీప్‌ను మంగళవారం వరకు అరెస్టు చేయవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. గుడిమల్కాపూర్ పోలీసు స్టేషన్ పరిధి డ్రగ్స్ కేసులో పోలీసులు 13 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నవదీప్ వినియోగదారుడిగా ఉన్నాడని.. అతడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ శుక్రవారం లంచ్ మోషన్ రూపంలో నవదీప్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
అమిత్ షా చేతుల మీదుగా డ్రగ్స్ ధ్వంసం
ఢిల్లీ: దేశంలో ఇవాళ ఓ భారీ పరిణామం చోటు చేసుకుంది. భారీ మొత్తంలో డ్రగ్స్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) ధ్వంసం చేసింది. కేంద్ర హోం మంత్రి వర్చువల్‌గా బటన్ నొక్కి ఈ కార్యక్రమం ప్రారంభించి.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆ ధ్వంసాన్ని వీక్షించారు. ఢిల్లీలో ఇవాళ కేంద్రం హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో డ్రగ్స్ ట్రాఫికింగ్ అండ్ నేషనల్ సెక్యూరిటీ ప్రాంతీయ సదస్సు జరిగింది. ఈ భేటీ నుంచే ఆయన లక్షా 44 వేల కేజీల డ్రగ్స్‌ను నాశనం చేయడాన్ని ప్రారంభించి.. వీక్షించారు. ఈ డ్రగ్స్ మొత్తం విలువ సుమారు రూ. 2,416 కోట్లు ఉంటుందని తేలింది. ఎన్సీబీ.. యాంటీ నార్కోటిక్స టాస్క్ ఫోర్స్ సమన్వయంతో ఈ ఆపరేషన్‌ను చేపట్టింది. అందులో ఎన్సీబీ హైదరాబాద్ యూనిట్ నుంచి 6,590 కేజీలు, ఇండోర్ యూనిట్ 822 కేజీలు, జమ్ము యూనిట్ 356 కేజీలు సీజ్ చేసినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే.. అసోం నుంచి 1,468 కేజీలు, ఛండీగఢ్ నుంచి 229 కేజీలు, గోవా నుంచి 25 కేజీలు, గుజరాత్ నుంచి 4,277 కేజీలు, జమ్ము కశ్మీర్ నుంచి 4,069 కేజీలు, మధ్యప్రదేశ్ నుంచి 1,03,884 కేజీలు, మహారాష్ట్ర నుంచి 159 కేజీలు, త్రిపుర నుంచి 1,803 కేజీలు, ఉత్తర ప్రదేశ్ నుంచి 4,049 కేజీల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని నాశనం చేఏసినట్లు వెల్లడించింది. #WATCH | #Delhi | Union Home Minister #AmitShah chairs Regional Conference on ‘Drugs Trafficking and National Security’ in New Delhi; over 1,44,000 kilograms of drugs being destroyed in various parts of the country by #NCB, in coordination with ANTFs of all states. (ANI) pic.twitter.com/hE8kblYX6E — Argus News (@ArgusNews_in) July 17, 2023 డ్రగ్స్ రహిత దేశంగా భారత్‌ను మలిచే క్రమంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం ఈ ఆపరేషన్ చేపట్టింది. జూన్ 1,2022 నుంచి జులై 15వ తేదీల మధ్య ఎన్సీపీ అన్ని యూనిట్లు, అన్ని రాష్ట్రాల యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్‌ల సమన్వయంతో రూ.9,580 కోట్ల విలువ చేసే 8,76,554 కేజీల డ్రగ్స్‌ను నాశనం చేశారు. ఇది నిర్దేశించుకున్న టార్గెట్ కంటే 11 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. -
నేడు అమిత్ షా సమక్షంలో.. 1.44 లక్షల కిలోల డ్రగ్స్ ధ్వంసం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విధ్వంసానికి కేంద్రం రంగం సిద్ధం చేసింది. సోమవారం ఢిల్లీలో హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలో నిర్వహించనున్న ‘డ్రగ్స్ స్మగ్లింగ్, జాతీయ భద్రత’ సదస్సులో ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ ఎన్సీబీ పరిధిలో పట్టుకున్న 6,590 కిలోలు సహా 1,44,000 కిలోల మాదకద్రవ్యాలను (రూ.2,416 కోట్లు) ధ్వంసం చేయనున్నారు. దీంతో కలిపి జూన్ 1, 2022 నుంచి జులై 15, 2023 వరకూ రాష్ట్రాల్లోని ఎన్సీబీ, యాంటీ నార్కొటిక్స్ టాస్క్ ఫోర్స్‌ల ప్రాంతీయ యూనిట్లు సమష్టిగా సుమారు రూ.9,580 కోట్ల విలువైన 8.76 లక్షల కిలోల డ్రగ్స్‌ను ధ్వంసం చేశాయి. సోమవారం నాటితో ఏడాదిలో ధ్వంసమయ్యే డ్రగ్స్ మొత్తం 10 లక్షల కిలోలు దాటనుంది. డ్రగ్స్ రహిత భారతదేశాన్ని సృష్టించడానికి ప్రభుత్వం మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా జీరో టోలరెన్స్ విధానం అవలంభిస్తోందని హోంశాఖ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. -
తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో ఎవేర్ నెస్ ఈవెంట్
-
చంపుతామంటూ బెదిరిస్తున్నారు
ముంబై: తనను చంపుతానంటూ బెదిరింపులు వస్తున్నాయని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముంబై మాజీ చీఫ్ సమీర్ వాంఖడే ముంబై పోలీసులను ఆశ్రయించారు. తనను, తన భార్యను సామాజిక మాధ్యమాల్లో దుర్భాషలాడుతూ చంపుతామంటూ గత నాలుగు రోజులుగా బెదిరింపులు వస్తున్నాయని వాంఖడే పేర్కొన్నారు. వాంఖడే తన ప్రతినిధి ద్వారా ఈ మేరకు ఒక లేఖను దక్షిణ ముంబై పోలీస్ కమిషనరేట్‌కు పంపినట్లు ఒక అధికారి తెలిపారు. ‘క్రూయిజ్ డ్రగ్స్’ కేసులో బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌ను ఇరికించకుండా ఉండేందుకు రూ.25 కోట్లు లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై సమీర్ వాంఖడేను శని, ఆదివారాల్లో సీబీఐ ప్రశ్నించింది. -
పాకిస్తాన్ అండతో హాజీ సలీం భారీ దందా .. తాజాగా రూ.25 వేల కోట్ల డ్రగ్స్
అతనిది అత్యంత విలాసవంతమైన జీవన శైలి. అడుగు కదిలితే చుట్టూ అత్యాధునిక ఏకే ఆయుధాలతో అంగరక్షకుల భారీ భద్రత. ఎటు వెళ్లాలన్నా ముందే పలు అంచెల తనిఖీలు, దారి పొడవునా మూడో కంటికి అగుపడని రీతిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు. ఇది ఏ దేశాధ్యక్షుని పరిచయమో కాదు. భారత్‌తో సహా పలు ఆసియా దేశాలకు కొన్నేళ్లుగా కంటిపై కునుకు లేకుండా చేస్తున్న డ్రగ్ కింగ్ హాజీ సలీం జల్సా లైఫ్ స్టైల్! శనివారం కోచి సమీపంలో అరేబియా సముద్రంలో అంతర్జాతీయ జలాల్లో భారీగా డ్రగ్స్ మోసుకెళ్తున్న ఓ నౌకను పక్కా సమాచారం మేరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అడ్డగించి ముంచేయడం తెలిసిందే. అందులో ఏకంగా 2.5 టన్నుల మెథంఫెటామిన్ దొరకడం అధికారులనే విస్మయపరిచింది. ఇది ఎన్సీబీకి మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ స్మగ్లర్ అయిన హాజీదేనని దాడిలో పట్టుబడ్డ 29 ఏళ్ల పాక్ జాతీయుడు వెల్లడించాడు. భారత్, శ్రీలంక, సీషెల్స్ తదితర దేశాల్లో సరఫరా నిమిత్తం దీన్ని పాక్ దన్నుతో దొంగచాటుగా తరలిస్తున్నట్టు విచారణలో అంగీకరించాడు. మన దేశంలో ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే తొలిసారి! అంతేగాక పలు దేశాల్లో సరఫరా నిమిత్తం అత్యంత భారీ మొత్తంలో డ్రగ్స్‌ను మోసుకెళ్తున్న మదర్ షిప్ ఎన్సీబీకి చిక్కడమూ ఇదే మొదటిసారి! దాని విలువను రూ.12 వేల కోట్లుగా అధికారులు తొలుత పేర్కొన్నారు. కానీ ఇప్పటిదాకా దొరికిన డ్రగ్స్లోకెల్లా ఇదే అత్యంత హెచ్చు నాణ్యతతో కూడినదని తాజాగా పరీక్షల్లో తేలింది. దాంతో దీని విలువను సవరించి ఏకంగా రూ.25,000 కోట్లుగా తేల్చారు! పాక్ నుంచి ఉగ్రవాదుల చొరబాటుకు హాజీ ముఠా అన్నిరకాలుగా సాయపడుతున్నట్టు కూడా తేలింది. పాక్ అడ్డాగా... పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ, ఉగ్ర సంస్థ లష్కరే తొయిబా అండదండలతో అరేబియా సముద్రంలో హాజీ విచ్చలవిడిగా డ్రగ్స్ దందా నడుపుతున్నాడు. పాక్, ఇరాన్, అఫ్గానిస్తాన్ అతని అడ్డాలు! ఎక్కడా స్థిరంగా ఉండకుండా తరచూ స్థావరాలు మార్చడం హాజీ స్టైల్. అతని ప్రస్తుత అడ్డా పాకిస్తాన్. బలూచిస్తాన్‌లో మకాం వేసి కథ నడుపుతున్నాడు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతోనూ హాజీకి దగ్గరి లింకులున్నట్టు ఎన్సీబీ అనుమానం. గమ్మత్తైన సంకేతాలు.. తేలు, ఎగిరే గుర్రం, డ్రాగన్, కొమ్ముగుర్రం, 555, 777, 999. ఇవన్నీ డ్రగ్స్ సరఫరాలో హాజీ ముఠా వాడే సంకేతాల్లో కొన్ని. డ్రగ్స్ ప్యాకెట్లపై ఉండే ఈ ప్రత్యేకమైన గుర్తులు వాటిలోని డ్రగ్స్, దాని నాణ్యతకు సంకేతాలు. కొనుగోలుదారులు మాత్రమే వీటిని గుర్తిస్తారు. హాజీ మనుషులు డ్రగ్స్‌ను ఏడు పొరలతో పటిష్టంగా ప్యాక్ చేస్తారు. నీళ్లలో పడ్డా దెబ్బతినకుండా ఈ జాగ్రత్త. ఇలా డ్రగ్స్ సరఫరా, విక్రయంలో హాజీది విలక్షణ శైలి. హాజీ అప్పుగానే డ్రగ్స్ సరఫరా చేస్తాడు. తనకు హవాలా మార్గంలోనే సొమ్ము పంపాలని చెబుతాడు. వ్యాపారానికి శ్రీలంక పడవలు వాడుతుంటాడు. అవి పాక్, ఇరాన్ సముద్ర తీరాల్లో మదర్ షిప్ నుంచి డ్రగ్స్ నింపుకొని రహస్యంగా భారత్‌కు చేరుకుంటాయి. క్వింటాళ్ల కొద్దీ ఉన్న నిల్వను చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి గమ్యానికి తరలిస్తారు. -
రూ.12 వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత.. సముద్రంలో 134 సంచుల్లో తరలిస్తుండగా..
కొచ్చిన్: భారత సముద్ర జలాల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.12 వేల కోట్ల విలువైన సుమారు 2,500 కిలోల మెథాంఫెటమైన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్(ఎన్సీబీ) స్వాధీనం చేసుకుంది. కేరళ తీరంలోని భారత సముద్ర జలాల్లో సంచరిస్తున్న ఓ ఓడ నుంచి ఈ మత్తు పదార్థం ఉన్న 134 సంచులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్(ఆపరేషన్స్) సంజయ్ కుమార్ సింగ్ శనివారం మీడియాకు తెలిపారు. అఫ్గానిస్తాన్ నుంచి అక్రమంగా తరలించే డ్రగ్స్‌ను పట్టుకునేందుకు ఆపరేషన్ సముద్రగుప్త్ పేరుతో నేవీ, ఎన్సీబీ కలిసి చేపట్టిన ఆపరేషన్‌లో ఒక పాకిస్తానీని అదుపులోకి తీసుకున్నామన్నారు. అఫ్గానిస్తాన్ నుంచి డ్రగ్స్‌తో బయలుదేరిన భారీ ఓడ ఒకటి మక్రాన్ తీరం వెంబడి పాక్, ఇరాన్‌ల మీదుగా డ్రగ్స్‌ను చిన్న పడవల్లోకి పంపిణీ చేసుకుంటూ వస్తోందని చెప్పారు. మట్టన్‌చెర్రీ వద్ద ఈ ఓడను అడ్డగించినట్లు వెల్లడించారు. భారత్, శ్రీలంక, మాల్దీవులకు డ్రగ్స్‌ను చేరవేయడమే స్మగ్లర్ల లక్ష్యమన్నారు. ఇప్పటి వరకు 3,200 కిలోల మెథాంపెటమైన్, 500 కిలోల హెరాయిన్, 529 కిలోల హషిష్‌ను పట్టుకున్నట్లు తెలిపారు. చదవండి: గగన్‌యాన్.. క్రూమాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టం ఆపరేషన్ విజయవంతం -
అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ గుట్టురట్టు
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని లూథియానా కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ గుట్టురట్టు చేసినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) సోమవారం పేర్కొంది. ఇద్దరు అఫ్గాన్లు సహా 16 మందిని అదుపులోకి తీసుకోవడంతోపాటు 60 కిలోల డ్రగ్స్, 31 తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ‘‘ఈ ముఠాకు గతేడాది ఢిల్లీలోని షహీన్‌బాగ్, యూపీలోని ముజఫర్నగర్ల్లో పట్టుబడిన డ్రగ్స్‌తో సంబంధముంది. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్‌లతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నెట్వర్క్ ఉంది’’ అని ఎన్సీబీ డిప్యూటీ డీజీ జ్ఞానేశ్వర్ సింగ్ చెప్పారు. -
ఆర్యన్ ఖాన్‌ను ఇరికించారు: ఎన్సీబీ విజిలెన్స్ కమిటీ
ముంబై: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు కావాలనే డ్రగ్స్ కేసులో ఇరికించారని ఎన్సీబీ విజిలెన్స్ కమిటీ పేర్కొంది. దీనికి సంబంధించి ఒక సీనియర్ అధికారితో పాటు ఎనిమిది మందిపై చర్యలకు సిఫార్సు చేసింది. ఓ క్రూయిజ్ పడవలో పార్టీ సందర్భంగా డ్రగ్స్ తీసుకున్నారంటూ ఆర్యన్‌తో పాటు 15 మందిని గతేడాది అక్టోబర్‌లో ఎన్సీబీ అధికారులు అరెస్టు చేయడం తెలిసిందే. కానీ ఆర్యన్‌ను కేసు నుంచి తప్పించేందుకు అధికారులు లంచం డిమాండ్ చేశారని అనంతరం ఆరోపణలొచ్చాయి. ఆర్యన్‌తో పాటు ఇతర కేసుల్లో వచ్చిన ఇలాంటి ఆరోపణలపై విచారణ జరిపిన విజిలెన్స్ కమిటీ గత ఆగస్టులో మొత్తం 8 మంది అధికారులపై 3,000 పేజీల సుదీర్ఘ చార్జ్‌షీట్ నమోదు చేసింది. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు కమిటీ గత మేలో క్లీన్చిట్ ఇచ్చింది. ఇప్పుడు సొంత అధికారులే ఆర్యన్‌ను కావాలని ఇరికించారని తేల్చడం ఎన్సీబీకి మరోసారి తలవంపులు తెచ్చింది. -
అమిత్ షా సమక్షంలో 40,000 కిలోల డ్రగ్స్ ధ్వంసం
గువాహటి: మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో ఆధ్వర్యంలో ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 40,000 కిలోల వివిధ రకాల డ్రగ్స్‌ను పట్టుకున్నారు. వాటిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో శనివారం ధ్వంసం చేసినట్లు హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం అస్సాం పర్యటనలో ఉన్న అమిత్ షా గువాహటి నుంచి వర్చువల్‌గా డ్రగ్స్ ధ్వంసం చేసే ప్రక్రియను పర్యవేక్షించినట్లు ట్వీట్ చేసింది. అస్సాంలో 11,000 కిలోలు, అరుణాచల్ ప్రదేశ్‌లో 8,000 కిలోలు, మేఘాలయలో 4,000 కిలోలు, నాగాలాండ్‌లో 1600 కిలోలు, మణిపుర్లో 398 కిలోలు, మిజోరాంలో 1900కిలోలు, త్రిపురలో 13,500 కిలోలు పట్టుకున్నట్లు వెల్లడించింది. అస్సాం పర్యటనలో ఉన్న అమిత్ షా.. డ్రగ్ అక్రమ రవాణా, జాతీయ భద్రత అంశంపై ప్రాంతీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈశాన్య ప్రాంతంలో మత్తు పదార్థాల అక్రమ రవాణా, నియంత్రణపై సమీక్షించారు. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఎన్సీబీ ఆధ్వర్యంలో 75,000 కిలోల డ్రగ్స్‌ను ధ్వంసం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అంతకు రెండింతలు 150,000 కిలోలు ధ్వంసం చేయటం చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా పెద్ద విజయం.’ అని తెలిపారు షా. కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తున్న ఎన్సీబీ జూన్ 1 నుంచి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి మత్తు పదార్థాలను పట్టుకుంటోంది. దేశాన్ని మత్తు పదార్థాల రహితంగా మారుస్తామన్న మోదీ ప్రభుత్వ ఆశయానికి తగినట్లుగా డ్రగ్స్‌ను ధ్వంసం చేస్తున్నట్లు హోంశాఖ తెలిపింది. గత జులై 30న సుమారు 82వేల కిలోల డ్రగ్స్‌ను ధ్వంసం చేశారు. అదే రోజు ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించిన అమిత్ షా.. 31 వేల కిలోల డ్రగ్స్ ధ్వంసం చేసే ప్రక్రియను వర్చువల్‌గా పర్యవేక్షించారు. #WATCH | Union Home Minister Amit Shah conducts a meeting on Drug Trafficking and National Security in Guwahati in the presence of Assam CM Himanta Biswa Saram and Union Minister G Kishan Reddy. pic.twitter.com/yAvXXDvTsn — ANI (@ANI) October 8, 2022 ఇదీ చదవండి: అధ్యక్ష ఎన్నికల్లో చివరి వరకు కొనసాగుతా: శశిథరూర్ -
రూ.120 కోట్ల మెఫెడ్రోన్ స్వాధీనం
ముంబై: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు తాజాగా రూ.120 కోట్ల విలువైన 60 కిలోల మెఫెడ్రోన్ అనే డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి అంతర్రాష్ట్ర డ్రగ్స్ మాఫియా సూత్రధారి ఎయిరిండియా మాజీ పైలట్ సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. నావల్ ఇంటెలిజెన్స్ విభాగం అందించిన సమాచారం మేరకు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో సోమవారం సోదాలు జరిపి 10 కిలోల మెఫెడ్రోన్‌ను పట్టుకున్నామని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ సింగ్ మీడియాకు తెలిపారు. ఇందుకు సంబంధించి జామ్‌నగర్‌కు చెందిన ఒకరు, ముంబైకి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. వీరిచ్చిన సమాచారంతో గురువారం దక్షిణ ముంబైలోని ఎస్బీ రోడ్డులో ఉన్న ఓ గోదాముపై దాడి చేశామన్నారు. 50 కిలోల మెఫెడ్రోన్‌ను పట్టుకుని, డ్రగ్స్ మాఫియా సూత్రధారి, ఎయిరిండియా మాజీ పైలట్ సహా ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు. -
డ్రగ్స్ ముఠాలపై సీబీఐ దాడులు, 175 మంది అరెస్ట్
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో సీబీఐ మాదకద్రవ్యాల ముఠాలపై దాడులు చేసింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), ఇంటర్‌పోల్, రాష్ట్రాల పోలీసు యంత్రాంగం సహకారంతో గురువారం పకడ్బందీగా దాడులు నిర్వహించింది. డ్రగ్స్ విక్రేతలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 175 మందిని అరెస్ట్ చేసింది. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్న వారి పని పట్టడానికి ఆపరేషన్ గరుడ పేరుతో సీబీఐ ఈ దాడులు నిర్వహిస్తోంది. పంజాబ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మహారాష్ట్రాలలో మాదకద్రవ్యాల అక్రమ సరఫరా చేస్తున్న 6,600 అనుమానితుల్ని సీబీఐ గుర్తించింది. వారిలో 175 మందిని అరెస్ట్ చేసి, 127 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు సీబీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. -
నాడు ఎన్సీబీ నేడు హెచ్-న్యూ!.. ‘డార్క్ వెబ్–డ్రగ్స్ దందా’ గుట్టు రట్టు
సాక్షి, సిటీబ్యూరో: డార్క్ వెబ్ ద్వారా జరిగే డ్రగ్స్ దందా గుట్టురట్టు చేసి, నిందితులను అరెస్టు చేయడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. సాంకేతిక అంశాలతో ముడిపడిన ఉన్న ఇలాంటి ఆపరేషన్లను దేశంలో ఇప్పటి వరకు కేంద్రం ఆదీనంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) మాత్రమే చేసింది. ఇతర ఏ రాష్ట్ర పోలీసులతో సహా ప్రత్యేక విభాగాలు చేపట్టలేకపోయాయి. ఎన్సీబీ చరిత్రలో ఇలాంటి ఆపరేషన్లు ఎనిమిది ఉండగా... దాని తర్వాత ఆ కేటగిరీలోకి హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) చేరింది. ‘డార్క్ వెబ్... క్రిప్టో కరెన్సీ... డెడ్ డ్రాప్’ పంథాలో నెట్వర్క్ నడిపిస్తున్న ఇద్దరు సరఫరాదారులు, ఆరుగురు పెడ్లర్లను గురువారం పట్టుకున్న విషయం విదితమే. 25 మందితో 285కి చెక్... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన, ఆదేశాల మేరకు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఈ ఏడాది ఫిబ్రవరిలో హెచ్–న్యూకు రూపమిచ్చారు. డీసీపీ చక్రవర్తి గుమ్మి నేతృత్వంలో ఇన్స్పెక్టర్లు పి.రాజే‹Ù, పి.రమేష్‌రెడ్డిలతో సహా మొత్తం 25 మందితో ఈ వింగ్ పని చేస్తోంది. గడిచిన ఎనిమిది నెలల కాలంలో వివిధ మాదకద్రవ్యాలకు సంబంధించిన 58 కేసులు నమోదు చేసింది. వీటిలో నిందితులుగా ఉన్న స్థానికులు, ఇతర రాష్ట్రాల/దేశాల వారితో కలిపి మొత్తం 285 మందిని అరెస్టు చేసింది. వీరి నుంచి భారీ స్థాయిలో డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. మాదకద్రవ్యాలను హైదరాబాద్‌కు సరఫరా చేమంటూ పెద్దపెద్ద పెడ్లర్లే చేతులెత్తేసే స్థాయికి చేరింది. దీంతో అనేక మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లి డ్రగ్స్ ఖరీదు చేసుకుని రావడం మొదలెట్టారు. ఐదో అంచెలోకి అడుగు.. ఈ విషయం గుర్తించిన హెచ్–న్యూ తన పంథా మార్చింది. స్థానికులు, ఇతర జిల్లాల వారిని పట్టుకుంటే సరిపోదని, డ్రగ్స్ దందాకు పూర్తిగా చెక్ చెప్పాలంటూ పరిధిని మరింత విస్తరించుకోవాలని భావించింది. దీంతో ఇతర రాష్ట్రాల్లోనూ దాడులు చేసి పెడ్లర్స్‌ను పట్టుకోవడం మొదలెట్టింది. దీనికి తోడు ఈ దందాలో ఉన్న విదేశీయులను డిపోర్టేషన్ ద్వారా వారి దేశాలకు తిప్పి పంపుతోంది. ఇలా ఇప్పటి వరకు ఐదుగురిని బలవంతంగా తిప్పి పంపింది. ఐదో అంచెలోకి అడుగు పెట్టిన హెచ్–న్యూ అత్యంత క్లిష్టమైన డార్క్ వెబ్‌పై పట్టు సాధిస్తోంది. దీని ఆధారంగా సాగుతున్న మాదకద్రవ్యాల వ్యాపారాన్ని విచ్ఛిన్నం చేయడంపై దృష్టి సారించింది. అందులో భాగంగానే గురువారం నాటి అరెస్టులు చోటు చేసుకున్నాయి. కొరియర్ సంస్థలతో సమావేశం.. నగరంలో డెలివరీ అవుతున్న మాదకద్రవ్యాల్లో ఎక్కువ శాతం కొరియర్ రూపంలోనే వస్తున్నాయి. ఈ విషయం గుర్తించిన సిటీ పోలీసులు వాటి నిర్వాహకులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అందులో తమ దృష్టికి వచ్చిన కేసులను వివరించడంతో పాటు స్కానర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించనున్నారు. ఆ తర్వాత నిర్లక్ష్యంగా ఉన్న సంస్థలపై చర్యలు తీసుకుంటారు. మరోపక్క ఈ డ్రగ్స్ ప్రధానంగా సౌతాఫ్రికా, డర్బన్ తదితర ప్రాంతాల నుంచి వస్తున్నట్లు భావిస్తున్నారు. వీటిని అడ్డుకోవడానికి కేంద్ర ఏజెన్సీలు, ఇతర విభాగాలతో కలిసి పని చేయాలని నగర పోలీసులు నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఓ సమావేశం జరిగింది. త్వరలో మరో సమావేశం నిర్వహించి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని కొత్వాల్ సీవీ ఆనంద్ నిర్ణయించారు. ఇతర విభాగాలకు అందులో శిక్షణ.. కేవలం డ్రగ్స్ దందాకు మాత్రమే కాదు అక్రమ ఆయుధాలు, మనుషుల అక్రమ రవాణా సహా అనేక అసాంఘిక కార్యకలాపాలకు డార్క్ వెబ్ అడ్డాగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇతర విభాగాలకు దీనిపై పట్టు ఉండేలా చేయాలని కమిషనర్ సీవీ ఆనంద్ నిర్ణయించారు. దీనికోసం హెచ్–న్యూ సిబ్బందికి అదనపు శిక్షణ ఇప్పించడంతో పాటు వీళ్లు అటు టాస్క్‌ఫోర్స్, ఇటు సైబర్ క్రైమ్ పోలీసులకు తర్ఫీదు ఇచ్చేలా చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నగరంలో డ్రగ్స్‌కు బానిసలుగా మారిన వారికి రీహ్యాబ్ సంస్థల ద్వారా ఐదు దశల్లో కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు. ఇప్పటి వరకు 488 మందికి వివిధ దశల్లో ఈ ప్రక్రియ పూర్తి చేశారు. చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. అధికారికంగా ‘విమోచన’ ఉత్సవాలు