రూ.40 కోట్ల విలువైన కొకైన్ పట్టివేత
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ మొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. టాంజానియ, నైజీరియాకు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి దాదాపు రూ.40 కోట్ల విలువైన కొకైన్‌ను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాల రవాణాకు పాల్పడుతున్నారన్న సమాచారంతో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టాంజానియా, నైజీరియాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద 4 కిలోల కొకైన్ లభించింది.
మార్కెట్‌లో దీని విలువ దాదాపు రూ.40 కోట్లు ఉంటుందని నార్కోటిక్స్ విభాగం అధికారులు తెలిపారు. టాంజానియా, నైజిరియాకు చెందిన వీరిద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.