IGI Airport
-
ఆ ఘటన షాక్‌కు గురిచేసింది: శశి థరూర్
ఢిల్లీ: తన మాజీ సిబ్బందిలో ఒకరిని గోల్డ్ స్మగ్లింగ్ విషయంలో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకోవటం షాక్‌కు గురిచేసిందని కాంగ్రెస్ నేత శశి థరూర్ అన్నారు. ఢిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో రూ. 35 లక్షల బంగారంతో శివ ప్రసాద్ అనే వ్యక్తి కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డారు. దీంతో అధికారులు అయన్ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కాంగ్రెస్ నేత శిశి థరూర్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.‘‘లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో నేను ధర్మశాలలో ఉన్నా. నా వద్ద తాత్కాలికంగా పని చేసిన సిబ్బందిని బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారన్న విషయంలో ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు అధికారులు అదుపులోకి తీసుకోవటంపై షాక్‌కు గురయ్యాను. 72 ఏళ్ల వ్యక్తి తరచూ డయాలసీస్ చేయించుకుంటున్నారు. ఆ వ్యక్తిపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న అధికారులకు నా పూర్తి మద్దతు తెలుపుతున్నా. చట్టం తన పని తాను చేస్తుంది’’ అని థరూర్ అన్నారు.While I am in Dharamshala for campaigning purposes, I was shocked to hear of an incident involving a former member of my staff who has been rendering part-time service to me in terms of airport facilitation assistance. He is a 72 year old retiree undergoing frequent dialysis and…— Shashi Tharoor (@ShashiTharoor) May 30, 2024 బుధవారం ఢిల్లీ ఎయిర్‌పోర్టు టెర్మినల్ 3 లో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో 500 గ్రాములో బంగారంలో శవ ప్రసాద్ అనే వ్యక్తి పట్టుబడ్డారు. ఆయన వద్ద ఉన్న బంగారంపై ప్రశ్నించగా సంబంధం లేని సమాధానం చెప్పటంతో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయన కాంగ్రెస్ నేత శశిథరూర్ సహాక సిబ్బంది అని అధికారులు గుర్తించారు. -
టాయిలెట్లో రూ.2 కోట్లు విలువ చేసే బంగారు కడ్డీలు
సాక్షి, ఢిల్లీ: టాయిలెట్లో రెండు కోట్లు విలువ చేసే బంగారు కడ్డీలు కనిపించడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటన న్యూఢిల్లీలోని ఇందీరాగాంధీ ఇంటర్నేషనల్(ఐజీఐ) విమానాశ్రయంలో ఆదివారం చోటు చేసుకుంది. దేశీయ పర్యటనలు పూర్తి చేసుకున్న అంతర్జాతీయ విమానg ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 2వద్ద ఆగినప్పుడూ ఈ ఘటన వెలుగు చూసిందని అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారుల ఎయిర్‌పోర్ట్‌లో ఆగి ఉన్న విమానాన్ని తనిఖీ చేస్తుండగా.. వాషరూమ్లో సింక్‌కు దిగువున టేప్‌తో అతికించిన బూడిదరంగు పర్సును కనుగొన్నారు. దీంతో వెంటనే అధికారులు ఆ పర్సును స్వాధీనం చేసుకుని చూడగా..మొత్తం మూడు వేల గ్రాములకు బరువున్న నాలుగు దీర్ఘచతురస్రాకరా బంగారు కడ్డీలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. దీర్ఘచతురస్రాకారంలో ఉండే బంగారు కడ్డీల ధర సుమారు 2 కోట్లు రూపాయాలపైనే ఉంటుందని ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. (చదవండి: 'మా రక్షణ కోసం చేస్తున్న యుద్ధం': రష్యా విదేశాంగ మంత్రి) -
IGI: ఇందిరాగాంధీ విమానాశ్రయం అరుదైన ఘనత
ఢిల్లీ: నగరంలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(IGI) అరుదైన ఘనత సాధించింది. దేశంలోనే తొలి పూర్తిస్థాయి హైడ్రో, సోలార్ పవర్ ఎయిర్పోర్ట్ గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ ఎయిర్పోర్ట్ మొత్తం హైడ్రో, సోలార్ పవర్‌తోనే నడుస్తోంది. 2030 నాటికి.. పునరుత్పాదక ప్రయత్నంతో పూర్తిస్థాయి కార్బన్ ఉద్గార రహిత ఎయిర్‌పోర్ట్‌గా మార్చాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించడంలో ఇది ఒక ప్రధాన అడుగు అని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (DIAL) ప్రకటించుకుంది. సుమారు రెండు లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించే ప్రయత్నంగా తెలిపింది. ఇదిలా ఉంటే.. 2036 దాకా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు హైడ్రోఎలక్ట్రిసిటీ సరఫరా చేసే ఉద్దేశంతో.. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది డయల్. కిందటి ఏడాది భారత్‌తో పాటు మధ్య ఆసియాలో ఉత్తమ ఎయిర్‌పోర్ట్‌గా గుర్తింపు దక్కించుకుంది ఐజీఐ. -
విమానం మిస్సయిందని చెప్పి...
న్యూఢిల్లీ: ప్రముఖ విదేశీ యూనివర్సిటీలో చదువుతున్నానని, ఫ్లైట్ మిస్ కావడంతో వేరే విమానంలో సొంతూరు వెళ్లేందుకు డబ్బు సాయం చేయాలని మోసం చేస్తున్న ఓ యువకుడిని ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం అధికారులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన మోదెల వెంకట దినేశ్‌కుమార్ నాలుగైదేళ్లుగా ఈ దందా చేస్తూ 100 మందికి పైగా ప్రయాణికులను మోసగించినట్లు అధికారులు తెలిపారు. ఓ వ్యక్తి డిసెంబర్ 19న బరోడా నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కొచ్చారు. టెర్మినల్–3 వద్ద ఉన్న ఆయన్ను దినేశ్ మాటల్లోకి దించాడు. విదేశీ వర్సిటీ విద్యార్థినని పరిచయం చేసుకుని సొంతూరు విశాఖపట్టణం వెళ్లే విమానం మిస్సయిందని టికెట్‌ను చూపించాడు. మరో ఫ్లైట్‌లో వెళ్లాలంటే తన వద్ద ఉన్న రూ.6,500 సరిపోవని, విశాఖకు టికెట్ ఖరీదు రూ.15వేలు ఉంటుందని చెప్పాడు. ఇంటికి వెళ్లాక తిరిగి పంపిస్తానంటూ నమ్మబలికి ఆయన వద్ద నుంచి రూ.9,250 తన బ్యాంకు అకౌంట్‌కు గూగుల్ పేద్వారా వేయించుకున్నాడు. తర్వాత ఎన్నిసార్లు అడిగినా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 30న దినేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
‘ఎయిర్పోర్ట్ నుంచి ట్యాక్సీకి రూ.10,000’
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యూపీలోని 250 కిమీ పరిధిలోని ప్రాంతాలకు వెళ్లే ట్యాక్సీలకు భారీ మొత్తంలో రూ 10,000 నుంచి రూ.12,000 చార్జీలుగా నిర్ణయించిన యూపీఎస్ఆర్టీసీ నిర్ణయం వివాదాస్పదమైంది. ఢిల్లీకి సమీపంలోని నోయిడా, ఘజియాబాద్‌లకు వెళ్లే క్యాబ్‌లకు కూడా ఇదే భారీ మొత్తం వసూలు చేయాలని యూపీఎస్ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో విమర్శలు చెలరేగడంతో యూపీ ప్రభుత్వం వెనక్కితగ్గింది. చార్జీలను పునఃసమీక్షించేందుకు యూపీఎస్ఆర్టీసీ కమిటీని నియమించింది. వందే భారత్ మిషన్ కింద విదేశాల నుంచి ఢిల్లీకి తిరిగివచ్చే ప్రయాణీకులు అక్కడి నుంచి నోయిడా, ఘజియాబాద్ సహా యూపీలోని 250 కిమీ పరిధిలోని ప్రాంతాలకు క్యాబ్‌కు రూ 10,000, ఎస్‌యూవీకి అయితే రూ 12,000 చెల్లించాలని యూపీఎస్ఆర్టీసీ ఎండీ రాజశేఖర్ నోయిడా, ఘజియాబాద్ ప్రాంతీయ మేనేజర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి యూపీలోని క్వారంటైన్ సెంటర్లకు తాము నడిపే సర్వీసులు పూర్తి ఉచితమని, ట్యాక్సీ సేవల కోసం నిర్ణయించిన చార్జీలపై సమీక్షించేందుకు కమిటీని నియమించామని, 24 గంటల్లో కమిటీ తమ నివేదికను సమర్పిస్తుందని యూపీఎస్ఆర్టీసీ ఎండీ రాజశేఖర్ ప్రకటించారు. చదవండి : ఢిల్లీలో బీభత్సం సృష్టించిన వడగండ్ల వాన -
క్రీడాకారులకు ఎయిరిండియా క్షమాపణ
న్యూఢిల్లీ : నేషనల్ క్యారియర్ ఎయిరిండియా.. టెన్నిస్ ప్లేయర్లను వదిలేసి గాలిలోకి ఎగిరిపోయింది. టెన్నిస్ ప్లేయర్లను ఇలా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానశ్రయంలోనే వదిలిపోయిన ఘటనకు ఎయిరిండియా క్షమాపణ చెప్పింది. ఇది చాలా దురదృష్టకర సంఘటన అని, తాము ఆటగాళ్లకు క్షమాపణ చెబుతున్నామని ఎయిరిండియా అధికార ప్రతినిధి అన్నారు. తదుపరి అందుబాటులో ఉన్న విమానాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. క్రీడలను ప్రోత్సహించడంలో ఎయిరిండియా గొప్ప వారసత్వం కలిగి ఉందని, ఆటగాళ్లకు తాము ఎక్కువ గౌరవం కూడా ఇస్తామన్నారు. పలు పీఎన్ఆర్లలో మెల్బోర్న్ విమానాన్ని దేశీయ టేబుల్ టెన్నిస్ టీమ్ బుక్ చేసుకున్నారని, పొరపాటున వీరిలో కొంతమంది ప్రయాణం ఆగిపోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తర్వాత విమానాలను ఏర్పాటు చేసేంతవరకు క్రీడాకారులకు ఎయిరిండియా హోటల్ సదుపాయం కూడా కల్పించినట్టు ఈ విమానయాన సంస్థ మరో ట్వీట్లో చెప్పింది. అసలేం జరిగిందంటే... ఎయిరిండియా విమానం నెంబర్. ఏఐ0308లో టిక్కెట్లను దేశీయ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ల టీమ్ బుక్ చేసుకుంది. కామన్ వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ మనీకా బాత్రాతో పాటు ఏడుగురు ప్లేయర్లను ఎయిరిండియా విమానంలోకి అనుమతించలేదు. సీట్లన్నీ బుక్ అయి ఉండటం మాత్రమే కాక, వారి పి.ఎన్.ఆర్. (ప్యాసింజర్ నేమ్ రికార్డ్) నంబర్లు సరిపోలేదని ఎయిర్ ఎండియా విమానం నిరాకరించింది. ఈ విషయంపై మనీకా బాత్రా ట్విటర్ ద్వారా తన బాధను షేర్చేసుకున్నారు. క్రీడా మంత్రి రాజ్యవర్థన్ రాథోర్, ప్రధానమంత్రి కార్యాలయానికి ఈ ట్వీట్ షేర్ చేశారు. దేశీయ టేబుల్ టెన్నిస్ టీమ్‌కు చెందిన మొత్తం 17 మంది క్రీడాకారులు, అధికారులు ఏఐ 0308 విమానంలో మెల్బోర్న్కు వెళ్లాల్సి ఉంది. మెల్బోర్న్లో మొదలౌతున్న ఐ.టి.టి.ఎఫ్. (ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్) వరల్డ్ టూర్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనాల్సి ఉంది. కానీ తాము ఎయిరిండియా కౌంటర్ వద్దకు వచ్చిన తర్వాత విమానమంతా ఓవర్‌బుక్ అయినట్టు తెలిసింది. కేవలం 10 మంది మాత్రమే ప్రయాణించడానికి వీలుందని కౌంటర్ వద్ద చెప్పారు. మిగతా ఏడుగురు క్రీడాకారులు ప్రయాణించడానికి వీలులేదు అనే సరికి, క్రీడాకారులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాం అని చెప్పింది. సమాచారం వెలుగులోకి వచ్చిన తర్వాత స్పోర్ట్ డైరెక్టర్ జనరల్ నీలం కపూర్ వెంటనే స్పందించారు. కొన్ని గంటల తర్వాత మరో విమానంలో వారిని మెల్బోర్న్కు పంపించేలా కృషిచేశారు. మిగతా క్రీడాకారులకు కూడా మెల్బోర్న్ వెళ్లేందుకు బోర్డింగ్ పాస్ దొరకడంతో, మనీకా క్రీడా మంత్రికి, పీఎం ఆఫీసుకు, స్పోర్ట్స్ అథారిటీకి, నీలం కపూర్ మేడమ్‌కి కృతజ్ఞతలు చెబుతున్నట్టు మరో ట్వీట్ చేశారు. -
ట్రక్కును ఢీకొన్న జెట్ ఎయిర్వేస్
న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీ ప్రమాదం తప్పింది. జెట్ ఎయిర్వేస్కు చెందిన ఓ విమానం ట్రక్కును ఢీకొంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని జెట్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది. దుబాయ్ నుంచి వస్తున్న జెట్ ఎయిర్వేస్ విమానం, ఎయిర్‌పోర్టులోని టర్మినల్ 3 వద్ద ల్యాండ్ అయింది. దానికి కేటాయించిన పార్కింగ్ ప్రాంతంలో విమానాన్ని ల్యాండ్ చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తేజ్ శాట్స్ సర్వీసు ప్రొవైడర్ కేటరింగ్ వాహనం అక్కడే ఉండటంతో, ల్యాండ్ అవుతున్న ఆ విమానం రెక్కలు ట్రక్కును ఢీకొన్నాయి. అయితే ఈ విమానం పెను ప్రమాదం నుంచి బయటపడిందని ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు చెప్పారు. -
18 ఏళ్ల తర్వాత అరెస్ట్.. ఢిల్లీలో అలర్ట్
సాక్షి, ఢిల్లీ : ఉగ్రవాది అరెస్ట్ తో దేశ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కి పడింది. లష్కర్-ఇ-తాయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2000 సంవత్సరంలో ఎర్రకోట వద్ద జరిగిన ఉగ్రవాద దాడిలో ఇతను నిందితుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 37 ఏళ్ల బిలాల్ అహ్మద్ కవాను న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ వద్ద బుధవారం అదుపులోకి తీసుకున్నారు. శ్రీనగర్ నుంచి అతను వచ్చినట్లు గుజరాత్ ఏటీస్-స్పెషల్ సెల్ పోలీసులు వెల్లడించారు. హెడ్ క్వార్టర్స్‌కు అతన్ని తరలించిన అధికారులు ప్రస్తుతం అతన్ని ప్రశ్నిస్తున్నారు. కవా బ్యాంక్ అకౌంట్ వివరాలు సేకరించిన అధికారులు హవాలా ద్వారా జమ్ము కశ్మీర్‌లోని ఉగ్ర సంస్థలకు అతను నగదు బదిలీ చేసినట్లు ధృవీకరించారు. ఎర్ర కోట దాడి తర్వాత 18 ఏళ్లుగా కవా పలు ప్రాంతాలు తిరుగుతూ.. చివరకు కశ్మీర్‌కు చేరాడని తెలుస్తోంది. గణతంత్ర్య దినోత్సవ వేడుకలు దగ్గర పడుతుండటంతో మరోసారి ఏదైనా దాడులకు ఫ్లాన్ చేశారేమోనన్న అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అలర్ట్ ప్రకటించిన ఢిల్లీ పోలీసులు రద్దీ ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అయితే తన సోదరుడిని చూడటానికి ఢిల్లీకి వచ్చానని.. పోలీసులు అరోపిస్తున్నట్లు తనకు ఉగ్రవాద సంస్థలతో సంబంధం లేదని కవా చెబుతున్నాడు. డిసెంబర్ 20, 2000 సంవత్సరంలో ఎర్రకోట వద్ద జరిగిన ఉగ్ర కాల్పుల్లో ఇద్దరు జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ దాడికి సంబంధించిన సంబంధించి పాక్‌కు చెందిన మహ్మద్ అరిఫ్‌తోపాటు మరో 10 మందిని దోషులుగా న్యాయస్థానం తేల్చింది. -
ఎయిర్ ఇండియా స్టాఫ్‌పై మహిళ వీరంగం
విమానశ్రయాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తన నిరోధించడం కోసం నో-ఫ్లై లిస్టు అంటూ ఎన్ని చర్యలు తీసుకొచ్చినా ఘటనలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఎయిరిండియా స్టాఫ్‌పై ఓ మహిళ ప్రయాణికురాలు తన ప్రతాపం చూపించింది. టిక్కెట్ జారీ విషయంలో ఎయిరిండియా ఉద్యోగిని ఆ మహిళా ప్రయాణికురాలు కొట్టింది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రయాణికురాలు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. గతంలో శివసేన ఎంపీ రవింద్ర గైక్వాడ్ కూడా ఎయిరిండియా స్టాఫర్తో అమర్యాదగా ప్రవర్తించారు. డ్యూటీ మేనేజర్‌పై చెప్పుతో దాడికి దిగి 25 సార్లు కొట్టారు. అనంతరం ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పౌర విమానయాన శాఖ 'నో ఫ్లై' జాబితాను విడుదల చేసింది. దీని కింద దురుసుగా ప్రవర్తించే ప్రయాణికులపై మూడు నెలల నుంచి జీవిత కాలం పాటు విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించనున్నట్టు పేర్కొంది. -
రూ.40 కోట్ల విలువైన కొకైన్ పట్టివేత
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ మొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. టాంజానియ, నైజీరియాకు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి దాదాపు రూ.40 కోట్ల విలువైన కొకైన్‌ను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాల రవాణాకు పాల్పడుతున్నారన్న సమాచారంతో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టాంజానియా, నైజీరియాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద 4 కిలోల కొకైన్ లభించింది. మార్కెట్లో దీని విలువ దాదాపు రూ.40 కోట్లు ఉంటుందని నార్కోటిక్స్ విభాగం అధికారులు తెలిపారు. టాంజానియా, నైజిరియాకు చెందిన వీరిద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
‘నేను ఐఎస్ఐ ఏజెంట్‌ను’
న్యూఢిల్లీ: ‘హలో.. నేను ఐఎస్ఐ ఏజెంట్‌ను. ఇకపై ఆ సంస్థలో పనిచేయదలుచుకోలేదు. ఇప్పటినుంచి భారత్‌లోనే నివసించాలను కుంటున్నాను’ అంటూ మాట్లాడి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడు అందరిని హడలెత్తించాడు. ముహమ్మద్ అహ్మద్ షేక్ ముహమ్మద్ రఫీక్ పేరుతో పాకిస్తాన్ పాస్‌పోర్టు కలిగిన ఒక వ్యక్తి దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీకి వచ్చాడు. ఆ తర్వాత కఠ్మాండుకు టికెట్ బుక్ చేసుకున్నాడు. కానీ ఏమనుకున్నాడో ఏమో కానీ తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాడు. విమానాశ్రయంలోని సహాయ కేంద్రం వద్దకు వచ్చి, అక్కడ పనిచేస్తున్న ఒక మహిళతో తాను పాకిస్తాన్ గూఢచర్య సంస్థలో పనిచేస్తున్నట్లు, ఆ సంస్థకు సంబంధించిన సమాచారం తెలపాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. వెంటనే సదరు ఉద్యోగి భద్రతా అధికారులకు సమాచారం తెలిపింది. వారు రఫీక్ వివరాలను కేంద్ర నిఘా సంస్థలSకు తెలియజేశారు. అతడిని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి అధికారులు ప్రశ్నిస్తున్నారు. -
బంగారానికే రంగులు వేసి..
ఢిల్లీ : ఇంధిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వైర్లలా కనిపించేలా బంగారం పై రంగులు వేసి తీసుకురావాలని నిందితులు ప్రయత్నించారు. అయితే కస్టమ్స్ అధికారులు జరిపిన తనిఖీల్లో దాదాపు వెయ్యి గ్రాముల బంగారాన్ని గుర్తించి సీజ్ చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
తృటిలో తప్పిన పెనుముప్పు
-
తృటిలో తప్పిన పెనుముప్పు
న్యూఢిల్లీ: ఇండిగో, స్పైస్ జెట్ విమానాలకు పెద్ద ప్రమాదం తప్పింది. రెండు విమానాలు ఢీకొనబోయి తృటిలో తప్పించుకున్నాయి. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పౌరవిమానయాన శాఖ డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) విచారణకు ఆదేశించింది. ఎయిర్ పోర్టులో దిగిన తర్వాత ఇండిగో విమానం ట్యాక్సీ వే వైపు వెళుతుండగా, స్పైస్ జెట్ విమానం టేకాఫ్ తీసుకుంటూ దానికి ఎదురుగా వచ్చింది. రెండు విమానాలు ఎదురెదురుగా దగ్గరగా వచ్చాయి. పైలట్లు అప్రమత్తంగా వ్యవహరిచడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఇండిగో విమానం లక్నో నుంచి 176 మంది ప్రయాణికులతో ఇక్కడకు వచ్చింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లో తలెత్తిన గందరగోళం వల్లె రెండు విమానాలు అతిచేరువగా వచ్చినట్టు సమాచారం. -
బేబీ డైపర్లలో బంగారం బిస్కెట్లు
న్యూఢిల్లీ: అక్రమార్కులు చివరికి బేబీ డైపర్లు ను కూడా వదలడం లేదు. తాజాగా ఢిల్లీ విమానాశ్రయంలో బేబీ డైపర్లలో దాచి అక్రమంగా రవాణా చేస్తున్న 16 కిలోల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వస్తున్న ప్రయాణీకులనుంచి 16 కిలోల బంగారం బిస్కెట్లను అధికారులు కనుగొన్నారు. ఆరుగురు ప్రయాణికులతో కూడిన బృందం దుబాయ్ నుంచి ఇక్కడకు చేరుకున్నారు. తమతో పాటు తీసుకొస్తున్న ఇద్దరు పిల్లల డైపర్లలో ఈ బిస్కట్లను చాలా తెలివిగా దాచి పెట్టారు. అయితే తనిఖీల్లో అధికారులు చాకచక్యంగా వాటిని పట్టుకొన్నారు. కిలో బరువున్న పదహారు బంగారు బిస్కెట్లను రెండు గ్రూపుల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు. వీరిలో సూరత్ కు చెందిన దంపతులు కూడా ఉన్నారన్నారు. విచారణ కొనసాగుతోందని తెలిపారు. -
రైలుకోసం ఎయిర్పోర్ట్ గోడదూకి రన్ వే పైకి..
న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భద్రతా విషయంలో డొల్లతనం కనిపించింది. ఎప్పుడూ డేగ కన్నేసి ఉంచే కేంద్ర బలగాలు, వాచ్ టవర్స్ కళ్లు గప్పి ఓ వ్యక్తి ఆ విమానాశ్రయం గోడ దూకాడు. అనంతరం రన్ వే వద్దకు వెళ్లి అరగంటపాటు కలియ తిరిగాడు. అతడి చేతిలో ఓ బ్యాగ్, ఇతర వస్తువులు కూడా ఉన్నాయి. ఎట్టకేలకు 19, 20వ వాచ్ టవర్ గుర్తించిన తర్వాత గానీ బలగాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి. అయితే, అతడు వెళ్లింది రైలు కోసమంట. ఇప్పటికీ ఊడీ ఉగ్రదాడితో భారత్ తీవ్ర ఆలోచనలో పడగా తాజాగా జరిగిన ఈ ఘటన మరోసారి అధికారులను కలవరంలో పెట్టింది. సాధారణంగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చుట్టూ పెద్ద ఎత్తున ప్రహరీ గోడ, దానికి పైన ఇనుపముళ్ల కంచె ఉంటుంది. దాంతో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ పర్యవేక్షణ ఉంటుంది. మరోపక్క వాచ్ టవర్స్ కూడా ఎయిర్ పోర్ట్ ప్రాగణమంతా గమనిస్తుంటాయి. ఇంత సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఆ వ్యక్తి అసలు గోడ ఎలా ఎక్కాడు? రన్ వే వద్దకు వెళ్లే వరకు సెక్యూరిటీ సిబ్బంది ఏం చేశారని ఉన్నతస్థాయి అధికారులు మండిపడుతున్నారు. ఎయిర్ పోర్ట్ లోకి అక్రమంగా ప్రవేశించిన ఆ వ్యక్తిని మధ్యప్రదేశ్ కు చెందిన సాగర్ జిల్లా వాసి సంగ్రామ్ సింగ్ గా గుర్తించారు. అతడిని ఢిల్లీ పోలీసులకు పట్టించారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు. తాను మధ్యప్రదేశ్ వెళ్లే రైలును క్యాచ్ చేసేందుకు వెళుతున్నానని అందుకే అడ్డుగా ఉన్న ఎయిర్ పోర్ట్ వాల్ దూకానని చెప్పినట్లు సమాచారం. -
80 కేజీల బంగారం మాయంపై సీబీఐ దర్యాప్తు
న్యూఢిల్లీ: ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న దాదాపు రూ.25 కోట్ల విలువైన బంగారం మాయమైన ఘటనలో సీబీఐ విచారణకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. గడిచిన నాలుగేళ్లలో కస్టమ్స్ అధికారుల ఆధీనంలో ఉన్న సుమారు 80 కేజీల బంగారు కడ్డీలు, ఆభరణాలు చోరీకి గురయ్యాయి. వీటి విలువ సుమారు రూ. 25 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. బంగారం మాయమవడంపై ఢిల్లీ పోలీసులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. 2012 నుంచి ఈ ఏడాది జూన్ వరకు స్వాధీనం చేసుకున్న బంగారంలో చాలా వరకు మాయమైందని ఫిర్యాదులు నమోదయ్యాయి. దీని వెనుక కస్టమ్స్ అధికారుల ప్రమేయం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆమోదం తెలిపారు. -
హనీమూన్ నుంచి తిరిగొచ్చి.. భర్తకు షాకిచ్చి!
న్యూఢిల్లీ: ఆ జంటకు కొత్తగా పెళ్లయింది. హిమాలయ పర్వత సానువుల వద్ద ఉన్న బాగ్దోగ్రాకు హనీమూన్‌కు వెళ్లొచ్చారు. హనీమూన్ ముగించుకొని ఇంటికి తిరిగి వెళుతుండగా భర్తకు షాకిస్తూ.. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతన వధువు అదృశ్యమైంది. సోమవారం సాయంత్రం ఎయిర్‌పోర్టులోని వాష్‌రూమ్‌లోకి వెళ్లిన వధువు ఎంతకు బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన భర్త సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్)ను ఆశ్రయించాడు. దీంతో అతను, సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఎయిర్‌పోర్టులోని సీసీటీవీ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నీలిరంగు చీర కట్టుకొని వాష్‌రూమ్‌లోకి వెళ్లిన అతని భార్య.. బయటకు వచ్చేటప్పుడు మాత్రం బురఖా ధరించింది. సీసీటీవీ దృశ్యాల్లో ఆమె ఎత్తు, బరువు, నడకతీరును గమనించిన భర్త బురఖాలో ఉన్నది తన భార్యేనని తెలుసుకొని బిత్తరపోయాడు. ఆమె బురఖా ముసుగు కప్పుకొని వెళ్లి ఓ వ్యక్తిని కలిసింది. అతనికి మరొకడు జత కలిశాడు. ఆ ముగ్గురు ట్యాక్సీల వద్దకు వెళ్లి జనంలో కలిసిపోయారు. ఈ దృశ్యాలన్నింటినీ చూసి బిత్తరపోయిన ఆ నూతన వరుడు లబోదిబోమంటున్నాడు. లక్నో చెందిన ఓ వ్యక్తి విషయంలో ఈ ఘటన జరిగింది. పెళ్లయి హనీమూన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత అతని భార్య తన ప్రియుడితో కలిసి లేచిపోయి ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. ఉద్దేశపూరితంగానే ఆమె తన హ్యాండ్ బ్యాగ్‌ను, సెల్‌ఫోన్‌ను భర్త వద్ద వదిలేసి వెళ్లిందని భావిస్తున్నారు. ఈ దృశ్యాలు చూసి దిగ్భ్రాంతుడైన సదరు భర్త పోలీసులకు ఫిర్యాదు కూడా చేయకుండా అక్కడి నుంచి నిష్క్రమించాడు. అతని భార్య స్వచ్ఛందంగా వెళ్లిపోవడంతో ఆమె ప్రియుడితో కలిసి వెళ్లి ఉంటుందని, బాధితుడు ఫిర్యాదు చేయనందున కేసు కూడా నమోదు కాకుండానే ఈ వ్యవహారం ఇంతటితో ముగిసిందని పోలీసులు అంటున్నారు. -
ఆ ఫీజు రద్దు చేసిన ఢిల్లీ ఎయిర్పోర్ట్
న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు(ఐజీఐ) నుంచి విమానంలో ప్రయాణిస్తున్నారా? అయితే మీక శుభవార్త. ఇంతవరకు ఇప్పటివరకూ విమాన ప్రయాణీకుల నుంచి చేసిన డెవలప్ మెంట్ ఫీజును రద్దు చేసింది. ఇక విమానాశ్రయం నుంచి మిగతా ప్రదేశాలకు ఎగరడం ఇక చౌకే. అంతేకాదు ఇంతవరకూ ప్రయాణీకులకు గుదిబండలా మారిన ఈ చార్జిలను ఉపసంహరించుకోవడంతోపాటు, ఈ నెలకు ఇప్పటికే చెల్లించినవారికి తిరిగి చెల్లించనుంది.ఎన్నో ఏళ్లుగా విమాన ప్రయాణికులపై వేస్తున్నఅభివృద్ధి ఫీజులను ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లిమిటెడ్(డీఐఏఎల్) ఉపసంహరించుకుంది. దీంతో ఆ ఎయిర్ పోర్టు నుంచి ప్రయాణించే వారికి అదనపు వసూళ్ల బాధ తగ్గింది. దేశీయ మార్గాలలో ప్రయాణించే ప్యాసింజర్లపై డెవలప్ మెంట్ చార్జీ కింద డీఐఏఎల్ రూ. 100 వసూలు చేయగా.. ఇంటర్నేషనల్ గమ్యస్థానాలకు వెళ్లేవారిపై రూ.600 వసూలు చేసింది. ప్యాసెంజర్లపై వేసే అభివృద్ధి లెవీ ఫీజును మే 1 నుంచి వసూలు చేయడం మానేయాలని డీఐఏఎల్ కు ఎయిర్ పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ(ఏఈఆర్ఏ) ఫిబ్రవరిలో ఆదేశాలు జారీచేసింది. ఈ డీఎఫ్ లెవీని డీఐఏఎల్ 2012 డిసెంబర్ నుంచి వసూలు చేసింది. డీఎఫ్ కింద నెలకు రూ.30 కోట్ల మేర వసూలు జరిగింది. డీఎఫ్ కింద మంజూరుచేసిన రూ.3,415 కోట్లను 2016 ఏప్రిల్ 30 వరకూ డీఐఏఎల్ కు రికవరీ అవుతుందని, ఎయిర్ పోర్ట్ టారిఫ్ రెగ్యులేటరీ అథారిటీ ఫిబ్రవరిలో ఈ ఆదేశాలను జారీచేసింది. ఏప్రిల్ 30 తర్వాత ఐజీఐ ఎయిర్ పోర్టు నుంచి ప్రయాణించేందుకు టికెట్లు బుక్ చేసుకున్న ప్యాసెంజర్లకు డెవలప్ మెంట్ చార్జీలను రిఫండ్ చేయాలని అన్నీ ఎయిర్ లైన్ సంస్థలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గత నెలే ఆదేశాలు కూడా జారీచేసింది. -
ఆ డ్రోన్‌ను పట్టిస్తే లక్ష
న్యూఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంపై అనుమానాస్పదంగా పలుమార్లు చక్కెర్లు కొట్టిన డ్రోన్ వివరాలను వెల్లడిస్తే రూ.లక్ష ఇస్తామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఈ విషయంలో ఎంత త్వరగా సమాచారం అందిస్తే అంత సహాయం చేసినట్లవుతుందని అన్నారు. గత అక్టోబర్ 27న ఓ డ్రోన్ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పరిసరాల్లో నాలుగైదు సార్లు కనిపించింది. అది పలు అనుమానాలు రేకెత్తించింది. ఏవియేషన్ నిబంధనల ప్రకారం అది వ్యతిరేక చర్య కావడంతోపాటు ఇటీవల ఉగ్రవాదులు ఎక్కువగా డ్రోన్ లతోనే రెక్కీలు నిర్వహిస్తున్నారని తెలుస్తుండటంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే కేసును నమోదుచేసి విచారణ చేపట్టిన ఇప్పటి వరకు ఆధారాలు గుర్తించలేకపోయారు. డ్రోన్ పంపించిన వారికోసం మేధావులతో చాలాసార్లు సమావేశాలు నిర్వహించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో తాజాగా లక్ష రూపాయల రివార్డును కూడా ప్రకటించారు. -
విమానం కేబిన్‌లో బాంబు బెదిరింపు
-
విమానం కేబిన్‌లో బాంబు
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టర్కిష్ ఎయిర్ లైన్స్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. బ్యాంకాక్ నుంచి ఇస్తాంబుల్ కు సుమారు 148 మంది ప్రయాణికులతో బయలుదేరిన టర్కిష్ ఎయిర్ లైన్స్ విమానంలో ఉన్నట్టుండి బాంబు కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. క్యాబిన్లో బాంబును కనుగొన్న పైలట్.. వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశారని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు వెల్లడించారు. ఆ సమయానికి దగ్గరలో ఉన్న న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అనుమతి తీసుకుని అత్యవసరంగా విమానాన్ని కిందకు దించారు. దీంతో న్యూఢిల్లీ విమానాశ్రయంలో అత్యవర పరిస్థితిని ప్రకటించారు. అన్ని భద్రతా దళాలతో పాటు నేషనల్ సెక్యూరిటీ దళాలను అప్రమత్తం చేసి హై ఎలర్ట్ ప్రకటించారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ , అగ్నిమాపక దళాలు హుటాహుటిన విమానాశ్రయానికి చేరుకున్నాయి. విమానం లోపల, రన్ వే తదితర ఏరియాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. దీనిపై ఎన్ఎస్జీ అధికారులు, ఇతర సీనియర్ అధికారులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారని సమాచారం. -
నేపాల్‌ను వణికిస్తున్న మరో భూతం
కఠ్మాండు: ప్రకృతి ప్రకోపంతో భీతిల్లిన నేపాల్‌ను ఇపుడు మరో భూతం వణికిస్తోంది. అసలే హ్యూమన్ ట్రాఫికింగ్ (మనుషుల అక్రమ రవాణా)కు పెట్టింది పేరుగా ఉన్న నేపాల్ దేశంలో మహిళల అక్రమ రవాణా మరింత పెరగొచ్చనే ఊహాగానాలు బలంగా సాగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితిని ఆసరాగా తీసుకుని ట్రాఫికర్స్ రెచ్చిపోవచ్చనే అనుమానాలు వణికిస్తున్నాయి. మరోవైపు ఈ వార్తల నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత ఇమ్మిగ్రేషన్ అధికారులు, ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. అరాచక శక్తులకు అడ్డుకట్టవేసేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. సరిహద్దు దగ్గర, విమానాశ్రయాల దగ్గర హై అలర్ట్ ప్రకటించి, ఆయా ప్రదేశాలలో సీఐఎస్ఎఫ్ దళాలను, మఫ్టీ పోలీసులను మోహరింపచేసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, మహిళా ప్రయాణీకుల వివరాలపై శ్రద్ధ పెట్టారు. నిపుణులతో కూడిన ఒక కమిటి ప్రయాణీకుల వివరాలను, వారి వీసా డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తోందని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు తెలిపారు. అనుమానిత వ్యక్తుల కదలికలను గమనిస్తున్నామని, దీనికి సంబంధించి చాలా హోమ్ వర్క్ చేశామని, ముఖ్యంగా రోడ్డు మార్గం, టాక్సీ బూత్, టాక్సీ యూనియన్లపై ఓ కన్నేసి ఉంచామని ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ప్రముఖ హెటళ్ళ దగ్గర కూడా నిఘా పెట్టామన్నారు. కాగా భీకరంగా విరుచుకుపడిన భూకంపం నేపాల్ దేశాన్ని వణికించిన విషయం తెలిసిందే. వేలాదిమంది మృత్యువాత పడగా, శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారో తెలియని పరిస్థితి. తమ ఆప్తుల జాడ తెలియక ఇప్పటికీ అనేకమంది అల్లాడుతున్నారు. -
ఐజీఐ ఎయిర్‌పోర్టులో ఇంటిదొంగలు
న్యూఢిల్లీ: విదేశాలకు వెళ్లేందుకు మీరు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తున్నారా? స్వదేశానికి వచ్చేందుకు మీ బంధువులెవరైనా విమానాశ్రయంలో దిగుతున్నారా? అయితే మీ లగేజీ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేశ రాజధానిలో నిరంతరం కట్టుదిట్టమై భద్రత ఉండే ఈ విమానాశ్రయంలో కూడా ప్రయాణికుల లగేజీ మాయమవుతోంది. గత రెండేళ్లుగా ఈ కేసులు రెట్టింపు అయ్యాయి. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు ఆదివారం వెల్లడించారు. ఇవీ సంఘటనలు... 2012లో ఐజీఐ ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్లో లగేజీలు మాయం అయిన కేసులు 36 నమోదు అయ్యాయి. 2013లో 56 కేసులు నమోదు అయ్యాయి. 2014లోని మొదటి ఎనిమిది నెలల్లో ఈ కేసులు రెట్టింపు అయ్యాయి. 2012లో నమోదు అయిన కేసులతో పోల్చితే ఈ సంవత్సరం ఆగస్టు 28 వరకూ 60 కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. 2012లో నమోదైన 36 కేసుల్లో 15 కేసులను ఛేదించి, 22 మందిని అరెస్ట్ చేశారు. 2013లో 10 కేసుల్లో, 14 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఏడాది 11 కేసుల్లో 14 మందిని అరెస్ట్ చేశారు. గత మూడేళ్లలో 80 శాతం లగేజీలు చోరీకి గురయ్యాయి. అయితే సామగ్రిని లోడ్‌చేసే వాళ్లే బ్యాగ్‌ల చోరీలకు పాల్పడుతున్నట్లు ఎయిర్‌పోర్టు గ్రౌండ్ హ్యాండ్లింగ్ స్టాఫ్ గుర్తించిందని ఐజీఐ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎంఐ హైదర్ పేర్కొన్నారు. సహ ప్రయాణికులు కూడా లగేజీలను మాయం చేసిన సంఘటనలు ఉన్నాయని, అయితే ఇలాంటి కేసులు అతితక్కువగా నమోదు అయ్యాయని తెలిపారు. తాజా ఘటన.. ఆగస్టు 17న ఉదయం 4 గంటలకు షాహుల్ హమీద్ మహ్మద్ ఇక్బాల్ అనే ప్రయాణికుడు ఢిల్లీలోని ఐజీఐ టెర్మినల్-3లో దిగాడు. యూఎస్ నుంచి తిరుగు ప్రయాణంలో గల్ఫ్ విమానంలో వయా ఫ్రాంక్ఫర్ట్- బహ్రెయిన్ మీదుగా ఇక్కడకు చేరుకొన్నాడు. కానీ, అతడి నాలుగు లగేజీ బ్యాగుల్లో నుంచి ఒక బ్యాగ్ కనిపించలేదు. ఈ విషయాన్ని ఐజీఐ ఎయిర్‌పోర్టు మేనేజర్‌కు తెలియజేశాడు. బహ్రెయిన్ ఎయిర్‌పోర్టులో లగేజీని దించలేదని చెప్పాడు. బ్యాగ్ గల్లంతైందని ఫిర్యాదు చేయాలని మేనేజర్ ప్రయాణికుడికి సూచించాడు. 24 గంటల్లో ఆ బ్యాగ్‌ను అప్పజెప్పుతామని చెప్పాడు.. ఇలాంటి ఘటనలు ఇంధిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో నిత్యం జరుగుతూనే ఉంటాయి.ఎయిర్‌పోర్టులో బ్యాగ్‌లను లోడింగ్-అన్లోడింగ్ చేసేవాళ్లే బ్యాగుల చోరీకి పాల్పడుతున్నట్లు చాలా ఘటనల్లో రుజువైంది. అందుకే తాజా ఘటన కూడా వారి పనే అయి ఉంటుందని పోలీసులు బావిస్తున్నారు. ఆ దిశగా ఎయిర్‌పోర్టు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పొగమంచుతో 90 విమానాలు రద్దు
న్యూఢిల్లీ: పొగమంచు దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ప్రభావం చూపింది. పొగ మంచు దట్టంగా అలముకోవడంతో విమాన, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు మూడు గంటల పాటు విమానాలు నిలిచిపోయాయి. సుమారు 150 దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడవం, కొన్నింటిని దారి మళ్లించారు. మంచు కారణంగా వెలుతురు మందగించడంతో పలు విమానాలు రద్దు చేశారు. గత రాత్రి 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల మధ్యలో 90 విమానాలు రద్దు చేసినట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు. పొగమంచుతో రైళ్ల రాకపోకలకు కూడా ఆటంకం కలిగింది. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా, కొన్ని రద్దయ్యాయి. ఉదయం సమయంలో రోడ్లపై వాహనాలు సంచారం చాలా తక్కువగా ఉంది. -
రాహుల్‌గాంధీకి తప్పిన ప్రమాదం
-
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 6డి ధియేటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలోనే తొలిసారిగా ఒక విమానాశ్రయంలో 6డి సినిమా ధియేటర్ ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టులో అందుబాటులోకి వచ్చింది. ‘ఇరిడో 6డి’ పేరిట దేశీయ టెర్మినల్ 1డిలో ధియేటర్ను ఏర్పాటు చేసినట్లు జీఎంఆర్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఆరు డిగ్రీల కోణంలో కూర్చున్న సీటు కదలడంతోపాటు, తెరమీద వస్తున్న చిత్రానికి అనుగుణంగా నిజమైన అనుభూతిని కలిగించే విధంగా నీళ్ళు జల్లడం, పక్కనే పేలిన శబ్దాలు, గాలి, పొగ, మంచు, సువాసనలు వంటివి ఇరిడో 6డిలోని ప్రత్యేకతలు. పారామౌంట్ టెక్నాలజీ నిర్వహించే ఈ థియేటర్లో 15 నిమిషాల నిడివిగల చిత్రానికి రూ.250 టిక్కెట్ ధరతోపాటు పన్నులు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించడంలో భాగంగా 6డి థియేటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని, ఇది అన్ని వయస్సుల వారినీ ఆకట్టుకుంటుందన్న ఆశాభావాన్ని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సీఈవో ఐ.ప్రభాకర రావు పేర్కొన్నారు.