తృటిలో తప్పిన పెనుముప్పు | Two aircraft (Indigo and SpiceJet) came face to face at Delhi's IGI Airport | Sakshi
Sakshi News home page

తృటిలో తప్పిన పెనుముప్పు

Published Tue, Dec 27 2016 10:21 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 PM

తృటిలో తప్పిన పెనుముప్పు

తృటిలో తప్పిన పెనుముప్పు

న్యూఢిల్లీ: ఇండిగో, స్పైస్‌ జెట్‌ విమానాలకు పెద్ద ప్రమాదం తప్పింది. రెండు విమానాలు ఢీకొనబోయి తృటిలో తప్పించుకున్నాయి. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పౌరవిమానయాన శాఖ డైరెక్టర్‌ జనరల్‌(డీజీసీఏ) విచారణకు ఆదేశించింది.

ఎయిర్‌ పోర్టులో దిగిన తర్వాత ఇండిగో విమానం ట్యాక్సీ వే వైపు వెళుతుండగా, స్పైస్‌ జెట్‌ విమానం టేకాఫ్ తీసుకుంటూ దానికి ఎదురుగా వచ్చింది. రెండు విమానాలు ఎదురెదురుగా దగ్గరగా వచ్చాయి. పైలట్లు అప్రమత్తంగా వ్యవహరిచడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఇండిగో విమానం లక్నో నుంచి 176 మంది ప్రయాణికులతో ఇక్కడకు వచ్చింది. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ లో తలెత్తిన గందరగోళం వల్లె రెండు విమానాలు అతిచేరువగా వచ్చినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement