తృటిలో తప్పిన పెనుముప్పు
న్యూఢిల్లీ: ఇండిగో, స్పైస్ జెట్ విమానాలకు పెద్ద ప్రమాదం తప్పింది. రెండు విమానాలు ఢీకొనబోయి తృటిలో తప్పించుకున్నాయి. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పౌరవిమానయాన శాఖ డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) విచారణకు ఆదేశించింది.
ఎయిర్ పోర్టులో దిగిన తర్వాత ఇండిగో విమానం ట్యాక్సీ వే వైపు వెళుతుండగా, స్పైస్ జెట్ విమానం టేకాఫ్ తీసుకుంటూ దానికి ఎదురుగా వచ్చింది. రెండు విమానాలు ఎదురెదురుగా దగ్గరగా వచ్చాయి. పైలట్లు అప్రమత్తంగా వ్యవహరిచడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఇండిగో విమానం లక్నో నుంచి 176 మంది ప్రయాణికులతో ఇక్కడకు వచ్చింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లో తలెత్తిన గందరగోళం వల్లె రెండు విమానాలు అతిచేరువగా వచ్చినట్టు సమాచారం.