spiceJet aircraft
-
స్పైస్‌జెట్ విమానంలో పనిచేయని ఏసీ.. ప్రయాణికుల అవస్థలు
న్యూఢిల్లీ: విమానంలో సాంకేతిక లోపాలు, అనుచిత ఘటనలు, బెదిరింపు కాల్స్.. వంటివి తరుచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ విమానంలో ఏసీ పనిచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గాలి లేక ఉక్కపోతతో కొందరు అవస్థలు పడ్డారు. ఈ ఘటన స్పైస్ జెట్ విమానంలో చోటుచేసుకుంది.న్యూ ఢిల్లీ నుంచి దర్బంగా వెళుతున్న SG 476 విమానంలో సుమారు గంటకు పైగా ఏసీ పని చేయలేదు దీంతో ప్రయాణికులు ఉక్కపోతతో అల్లాడారు. కొందరు అస్వస్థతకు గురయ్యారు. వెంటిలేషన్ లేకపోవడం వల్ల గాలి కోసం తమ చేతిలో ఉన్న వస్తువులతో విసురుకుంటూ కనిపించారు. వృద్ధులు చిన్నపిల్లలతో సహా అనేక మంది ప్రయాణీకులు ఉక్కపోతతో అవస్థలు పడ్డారు. విమానంలోని పరిస్థితిని తోటి వారు డియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది."నేను ఢిల్లీ నుంచి దర్భంగాకు స్పైస్ జెట్‌లో ప్రయాణిస్తున్నాను. ఢిల్లీ విమానాశ్రయంలో చెక్ ఇన్ తర్వాత గంట వరకు ఏసీ ఆన్ చేయలేదు. విమానం లోపల ఉష్ణోగ్రత 40 డిగ్రీలు ఉంది. విమానం టేకాఫ్ కాగానే ఏసీ ఆన్ చేశారు’’ అని ప్రయాణీకుడు రోహన్‌కుమార్ తెలిపారు.#WATCH | SpiceJet passengers travelling from Delhi to Darbhanga (SG 476) had to wait inside an aircraft without air conditioning (AC) for over an hour amid the ongoing heatwave, with several feeling unwell. pic.twitter.com/cIj2Uu1SQT— ANI (@ANI) June 19, 2024 వీడియోపై స్పందించిన విమానయాన సంస్థ ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. సాంకేతిక సమస్యతో ఈ పరిస్థితి నెలకొందని, ఇలాంటి ఘటన మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటామని వివరణ ఇచ్చింది. -
స్పైస్‌జెట్‌కు ఏమైంది?.. రాడార్ సమస్యతో వెనక్కి వచ్చిన కార్గో విమానం
కోల్‌కతా: గతకొన్ని రోజులుగా విమానాలను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్న ఘటనలతో.. స్పైస్‌జెట్‌కు ఏమైంది అనే ప్రశ్నలు ప్రతిఒక్కరిలోనూ లేవనెత్తుతున్నాయి. గడిచిన మూడు వారాల వ్యవధిలో 8 స్పైస్‌జెట్ విమానాల్లో సాంకేతిక సమస్యలు వెలుగు చూశాయి. ఒక్క మంగళవారం రోజే రెండు విమానల్లో భద్రత సమస్యలు ఏర్పడి అత్యవసర ల్యాండింగ్ చేయగా.. తాజాగా కల్‌కతా నుంచి చైనా బయలుదేరిన స్పైస్‌జెట్ కార్గో విమానంలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. స్పైస్‌జెట్ బోయింగ్ 737 కార్గో విమానం జూలై అయిదో తేదీన కోల్‌కతా నుంచి ఛాంగ్‌క్వింగ్ వెళ్లాల్సి ఉంది. కోల్‌కతా నుంచి టేకాఫ్ అయిన తరువాత విమనాంలో వాతావరణ రాడార్ పనిచేయడం ఆగిపోయింది. దీంతో పైలట్ విమానాన్ని తిరిగి కోల్‌కతాకు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. కోల్‌కతాలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని స్పైస్‌జెట్ ప్రతినిధి తెలిపారు. చదవండి: ముంబైలో మరో స్పైస్ జెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. గత 17 రోజుల్లో ఏడు ఘటనలు కాగా ఈ ఘటన కంటే ముందు ఢిల్లీ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని దారి మళ్లించి కరాచి ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. స్పైస్‌జెట్ విమానంలో ఇండికేటర్ లైట్ సరిగా పనిచేయకపోవడంతోనే కరాచికి మళ్లించారు. అంతేగాక గుజరాత్‌లోని కాండ్లా నుంచి బయలుదేరిన స్పైస్ జెట్ విమానం ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. విమానం గాల్లో ఉండగా విండ్‌షీల్డ్ ఔటర్ పేన్ పగలడంతో ముంబైలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అయితే ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నారని ఎయిర్‌లైన్స్ తెలిపింది. -
737 విమానాలతో స్పైస్‌జెట్‌కు రెక్కలు
ముంబై, సాక్షి: బోయింగ్ 737 మ్యాక్స్ విమాన సర్వీసులకు యూఎస్ వైమానిక నియంత్రణ సంస్థ తిరిగి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన వార్తలతో స్పైస్‌జెట్ కౌంటర్‌కు జోష్ వచ్చింది. రెండు ఘోర ప్రమాదాల నేపథ్యంలో సుమారు ఏడాదిన్నర కాలంగా నిలిచిపోయిన 737 మ్యాక్స్ విమానాలను తిరిగి సర్వీసులకు వినియోగించేందుకు బుధవారం యూఎస్ ఎఫ్ఏఏ అనుమతించింది. 2019 మార్చి నుంచి బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను సర్వీసుల నుంచి తప్పించిన విషయం విదితమే. అయితే నిలిచిపోయిన ఈ విమానాలను ఆధునీకరించాక మాత్రమే సర్వీసులను ప్రారంభించుకోవలసిందిగా యూఎస్ ఎఫ్ఏఏ ఆదేశించినట్లు తెలుస్తోంది. సాఫ్ట్వేర్, వైరింగ్ సవరణలతోపాటు.. పైలట్లు సైతం తగినంత సన్నద్ధత కావలసి ఉంటుందని తెలియజేసింది. షేరు జోరు బోయింగ్ తయారీ 737 మ్యాక్స్ విమానాలను సర్వీసులకు తిరిగి అనుమతించిన వార్తలో స్పైస్‌జెట్ లిమిటెడ్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. దేశీయంగా స్పైస్‌జెట్ మాత్రమే 13 ఎయిర్ క్రాఫ్ట్‌లను కలిగి ఉంది. దీంతో ఎన్ఎస్ఈలో ఈ షేరు ప్రస్తుతం 15 శాతం దూసుకెళ్లి రూ. 76 వద్ద ట్రేడవుతోంది. మ్యాక్స్ 737 విమానాల నిలిపివేత కారణంగా కంపెనీ వ్యయాలు పెరిగినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. కాగా.. గత నాలుగు రోజులుగా స్పైస్‌జెట్ కౌంటర్ ర్యాలీ బాటలో సాగుతుండటం గమనార్హం. గత నాలుగు రోజుల్లో ఈ షేరు 40 శాతం దూసుకెళ్లడం విశేషం! -
తప్పిన ప్రమాదం; విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
సాక్షి, తిరుపతి : ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో స్పైస్‌జెట్ విమానం అత్యవరసంగా ల్యాండ్ అయింది. పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన రేణిగుంట విమానాశ్రయంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్లు సాంకేతిక సమస్యను గుర్తించి వెంటనే అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఊహించని పరిణామంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ విమానంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఉన్నట్టు సమాచారం. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలకు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడానికి స్పైస్ జెట్ సిబ్బంది ఏర్పాట్లు చేస్తోంది. ట్రాక్టర్ సహాయంతో విమానాన్ని రన్‌వే నుంచి పక్కకు తరలించారు. -
తృటిలో తప్పిన పెనుముప్పు
-
తృటిలో తప్పిన పెనుముప్పు
న్యూఢిల్లీ: ఇండిగో, స్పైస్ జెట్ విమానాలకు పెద్ద ప్రమాదం తప్పింది. రెండు విమానాలు ఢీకొనబోయి తృటిలో తప్పించుకున్నాయి. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పౌరవిమానయాన శాఖ డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) విచారణకు ఆదేశించింది. ఎయిర్ పోర్టులో దిగిన తర్వాత ఇండిగో విమానం ట్యాక్సీ వే వైపు వెళుతుండగా, స్పైస్ జెట్ విమానం టేకాఫ్ తీసుకుంటూ దానికి ఎదురుగా వచ్చింది. రెండు విమానాలు ఎదురెదురుగా దగ్గరగా వచ్చాయి. పైలట్లు అప్రమత్తంగా వ్యవహరిచడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఇండిగో విమానం లక్నో నుంచి 176 మంది ప్రయాణికులతో ఇక్కడకు వచ్చింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లో తలెత్తిన గందరగోళం వల్లె రెండు విమానాలు అతిచేరువగా వచ్చినట్టు సమాచారం. -
విమానానికి తప్పిన పెద్ద ప్రమాదం
న్యూఢిల్లీ: స్పైస్ జెట్ విమానానికి మంగళవారం సాయంత్రం పెద్ద ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి 211 మందితో బయలుదేరిన విమానం కోల్ కతా విమానాశ్రయంలో దిగగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. టేకాఫ్ అయిన తర్వాత విమానం టైరు ఊడిపోయినట్టు గుర్తించిన రన్ వే సిబ్బంది వెంటనే ఏసీటీకీ సమాచారం అందించారు. రన్ వేపై లభ్యమైన టైరు శకలాలు స్పైస్ జెట్ విమానానికి చెందినవేనని నిర్ధారించుకున్న తర్వాత పైలట్ కు ఏసీటీ సమాచారం అందించింది. దీంతో విమానం భద్రతపై ఆందోళన మొదలైంది. ముందు జాగ్రత్తగా విమానాన్ని కోల్ కతా ఎయిర్ పోర్టులో దించేశారు. విమానాన్ని పైలట్ సురక్షితంగా కిందకు దించడంతో ఉత్కంఠకు తెరపడింది. ల్యాండ్ అయిన వెంటనే విమానంలోని వారందరినీ కిందకు దించేశారు. విమానంలోని వారంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. టైరు ఊడిపోయిందా, పేలిందా అన్నది విచారణలో తేలనుంది. దీనిపై పౌరవిమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ అధిపతి ఎం సాధి విచారణకు ఆదేశించారు.