న్యూఢిల్లీ: విమానంలో సాంకేతిక లోపాలు, అనుచిత ఘటనలు, బెదిరింపు కాల్స్.. వంటివి తరుచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ విమానంలో ఏసీ పనిచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గాలి లేక ఉక్కపోతతో కొందరు అవస్థలు పడ్డారు. ఈ ఘటన స్పైస్ జెట్ విమానంలో చోటుచేసుకుంది.
న్యూ ఢిల్లీ నుంచి దర్బంగా వెళుతున్న SG 476 విమానంలో సుమారు గంటకు పైగా ఏసీ పని చేయలేదు దీంతో ప్రయాణికులు ఉక్కపోతతో అల్లాడారు. కొందరు అస్వస్థతకు గురయ్యారు. వెంటిలేషన్ లేకపోవడం వల్ల గాలి కోసం తమ చేతిలో ఉన్న వస్తువులతో విసురుకుంటూ కనిపించారు. వృద్ధులు చిన్నపిల్లలతో సహా అనేక మంది ప్రయాణీకులు ఉక్కపోతతో అవస్థలు పడ్డారు. విమానంలోని పరిస్థితిని తోటి వారు డియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.
"నేను ఢిల్లీ నుంచి దర్భంగాకు స్పైస్ జెట్‌లో ప్రయాణిస్తున్నాను. ఢిల్లీ విమానాశ్రయంలో చెక్ ఇన్ తర్వాత గంట వరకు ఏసీ ఆన్ చేయలేదు. విమానం లోపల ఉష్ణోగ్రత 40 డిగ్రీలు ఉంది. విమానం టేకాఫ్ కాగానే ఏసీ ఆన్ చేశారు’’ అని ప్రయాణీకుడు రోహన్‌కుమార్ తెలిపారు.
#WATCH | SpiceJet passengers travelling from Delhi to Darbhanga (SG 476) had to wait inside an aircraft without air conditioning (AC) for over an hour amid the ongoing heatwave, with several feeling unwell. pic.twitter.com/cIj2Uu1SQT
— ANI (@ANI) June 19, 2024
వీడియోపై స్పందించిన విమానయాన సంస్థ ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. సాంకేతిక సమస్యతో ఈ పరిస్థితి నెలకొందని, ఇలాంటి ఘటన మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటామని వివరణ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment