న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో ప్రజలు అల్లడిపోతున్నారు. ఓవైపు భానుడి ప్రతాపం.. మరోవైపు నీటి సంక్షోభం ఢిల్లీ ప్రజలను పీడిస్తున్నాయి.
ఎండ వేడిమి, వడగాలుల ధాటికి జనం పిట్టల్లా రాలుతున్నారు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గడచిన 72 గంటల్లో వడ దెబ్బతో 15 మంది మృతి చెందారు. ఢిల్లీలో 5, నోయిడాలో 10 మంది మరణించారు. ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హస్పిటల్‌లో 12 మంది వెంటిలేటర్ సపోర్టతో చికిత్స పొందుతున్నారు. మరో 36 మంది వడదెబ్బతో చికిత్స పొందుతున్నారు.
హీట్‌స్ట్రోక్ కేసుల్లో మరణాల రేటు దాదాపు 60-70 శాతం ఎక్కువāగా ఉందని ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్ శుక్లా తెలిపారు. రోగులలో చాలా మంది వలస కూలీలే ఉన్నట్లు తెలిపారు. అధికంగా 60 ఏళ్లు పైబడిన వారే ఉన్నట్లు పేర్కొన్నారు. హీట్‌స్ట్రోక్‌పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు
కాగా ఢిల్లీ వాసులు దాదాపు నెల రోజులుగా తీవ్ర ఎండ, వేడిగాలులతో అల్లాడిపోతున్నారు. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల మార్కును దాటాయి. హీట్‌వేవ్స్ కారణంగా నార్త్ ఇండియా ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. వారం రోజులుగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానాతో పాటు పంజాబ్‌లో వేడి గాలుల తీవ్రత పెరిగింది. ఉత్తరాఖండ్, బిహార్, జార్ఖండ్‌లోనూ ఎండలు దంచికొడ్తున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో సగటున 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు వుతున్నట్టు ఐఎండీ అధికారులు తెలిపారు. మరోవైపు ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో రాబోయే 24 గంటలపాటు వేడిగాలులు కొనసాగే అవకాశం ఉందని, ఆ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment