temparature raising
-
దేశ రాజధానిలో హీట్‌వేవ్.. ఢిల్లీ, నోయిడాలో 15 మంది మృత్యువాత
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో ప్రజలు అల్లడిపోతున్నారు. ఓవైపు భానుడి ప్రతాపం.. మరోవైపు నీటి సంక్షోభం ఢిల్లీ ప్రజలను పీడిస్తున్నాయి.ఎండ వేడిమి, వడగాలుల ధాటికి జనం పిట్టల్లా రాలుతున్నారు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గడచిన 72 గంటల్లో వడ దెబ్బతో 15 మంది మృతి చెందారు. ఢిల్లీలో 5, నోయిడాలో 10 మంది మరణించారు. ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హస్పిటల్లో 12 మంది వెంటిలేటర్ సపోర్టతో చికిత్స పొందుతున్నారు. మరో 36 మంది వడదెబ్బతో చికిత్స పొందుతున్నారు.హీట్‌స్ట్రోక్ కేసుల్లో మరణాల రేటు దాదాపు 60-70 శాతం ఎక్కువāగా ఉందని ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్ శుక్లా తెలిపారు. రోగులలో చాలా మంది వలస కూలీలే ఉన్నట్లు తెలిపారు. అధికంగా 60 ఏళ్లు పైబడిన వారే ఉన్నట్లు పేర్కొన్నారు. హీట్‌స్ట్రోక్‌పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారుకాగా ఢిల్లీ వాసులు దాదాపు నెల రోజులుగా తీవ్ర ఎండ, వేడిగాలులతో అల్లాడిపోతున్నారు. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల మార్కును దాటాయి. హీట్‌వేవ్స్ కారణంగా నార్త్ ఇండియా ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. వారం రోజులుగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానాతో పాటు పంజాబ్‌లో వేడి గాలుల తీవ్రత పెరిగింది. ఉత్తరాఖండ్, బిహార్, జార్ఖండ్‌లోనూ ఎండలు దంచికొడ్తున్నాయి.దేశ రాజధాని ఢిల్లీలో సగటున 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు వుతున్నట్టు ఐఎండీ అధికారులు తెలిపారు. మరోవైపు ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో రాబోయే 24 గంటలపాటు వేడిగాలులు కొనసాగే అవకాశం ఉందని, ఆ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. -
ఉపశమనం.. తెలంగాణకు నాలుగు రోజుల వర్ష సూచన!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎండలు దంచికోడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 41 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఈరోజు(ఆదివారం) రేపు(సోమవారం) రెండు రోజుల పాటు రాష్టానికి తీవ్రమైన ఎండలతో పాటు వడగాల్పుల హెచ్చరికలను ఐఎండీ జారీచేసింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ప్రజలు బయటకు రావద్దని ఐఎండీ హెచ్చరించింది. ఇక.. వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండటంతో ఈరోజు పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, జోగులంబ గద్వాల జిల్లాలకు వడగాల్పుల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రేపు (సోమవారం) రాష్ట్రంలో వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ వడగాల్పులు విచే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు.. ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో భిన్న పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కాస్త ఉపశమనం.. నాలుగు రోజుల వర్ష సూచన ఇప్పటికే తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు కాస్త ఉపశమనం లభించనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు(ఆదివారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజులు రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది. ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈరోజు ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం పలు జిలాల్లో కురిసే అవకాశం ఉంది, ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలకు వర్ష సూచనతో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. రేపు అదిలాబాద్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ మంచిర్యాల్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు మెదక్ కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. -
ఈ రాష్ట్రాల్లో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు
ఢిల్లీ: ఇప్పటికే భానుడి భగభగలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఏప్రిల్ - జూన్ మధ్య కాలంలో భారతదేశంలో తీవ్రమైన ఉష్ణోగ్రత ఉంటుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. భారత వాతావరణ విభాగం (IMD) డైరెక్టర్ జనరల్ 'మృత్యుంజయ్ మహపాత్ర' ప్రకారం.. ఏప్రిల్-జూన్ కాలంలో దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. మధ్య, పశ్చిమ ద్వీపకల్ప భారతదేశంలో అధిక వేడి ఉంటుంది. పశ్చిమ హిమాలయ ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర ఒడిశాలోని కొన్ని ప్రాంతాలలో తక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని మృత్యుంజయ్ మహపాత్ర చెప్పారు. అయితే మైదానాల్లోని చాలా ప్రాంతాలలో ఎక్కువ వేడిగాలులు వచ్చే అవకాశం ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 10 నుంచి 20 రోజులపాటు వేడిగాలులు నమోదయ్యే అవకాశం ఉందని, ఆ సమయంలో వేడి మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్రాల వారీగా గుజరాత్, మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లో వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని మోహపాత్ర తెలిపారు. -
Climate Change: డేంజర్ మార్క్ దాటేశాం
భయపడుతున్నంతా అవుతోంది. మితిమీరిన కాలుష్యం, ఇంధన వాడకం, అడ్డూ అదుపూ లేని పారిశ్రామికీకరణ, విచ్చలవిడిగా అడవుల నరికివేత భూమిని శరవేగంగా వినాశనం వైపు నెడుతున్నాయి. వీటివల్ల భూతాపోన్నతి అతి త్వరలో ‘2 డిగ్రీ’ల అంతిమ హద్దును దాటుతుందని, అదే జరిగితే సర్వనాశనమేనని పర్యావరణప్రియులు, శాస్త్రవేత్తలు కొన్ని దశాబ్దాలుగా హెచ్చరిస్తుండటం తెలిసిందే. ఈ పెను విపత్కర పరిస్థితిని నివారించడమే ఏకైక లక్ష్యంగా చిన్నా పెద్దా దేశాలన్నీ దశాబ్దాలుగా మేధోమథనం చేస్తున్నాయి. గ్లోబల్ వారి్మంగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు భారీ లక్ష్యాలు నిర్దేశించుకుంటూ వస్తున్నాయి. అందుకు వందల కోట్ల డాలర్లను కేటాయిస్తున్నట్టు ప్రకటనలు చేస్తున్నాయి. అవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయని, ఆ లక్ష్యాల సాధనకు క్షేత్ర స్థాయిలో చేస్తున్నదేమీ లేదని తేలిపోయింది. నవంబర్ 17న అంతటి విపత్కర పరిస్థితిని భూమి తొలిసారిగా రుచిచూసింది. భూతాపంలో గత శుక్రవారం తొలిసారి ఏకంగా 2 డిగ్రీల పెరుగుదల నమోదైంది! భూగోళాన్ని మనం శరవేగంగా వినాశనం దిశగా నెడుతున్నామనేందుకు ఇది తాజా హెచ్చరిక సంకేతమేనని సైంటిస్టులు ఆందోళన చెందుతున్నారు...! వినాశనమే...? గ్లోబల్ వారి్మంగ్‌తో ఎదురయ్యే ప్రమాదాన్ని కళ్లకు కట్టేందుకు పర్యావరణవేత్తలు భూతాపాన్ని పారిశ్రామికీకరణకు ముందు నాళ్లతో, అంటే 1850–1900 మధ్య కాలంతో పోల్చి చెబుతుంటారు. అప్పటితో పోలిస్తే భూతాపం ఇప్పటికే 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా పెరిగిపోయింది. దానికే కొన్నేళ్లుగా కనీవినీ ఎరగని ఉత్పాతాలతో ప్రపంచమంతా అతలాకుతలమైపోతోంది. అలాంటిది, నవంబర్ 17న సగటు భూతాపంలో పెరుగుదల కొద్దిసేపు ఏకంగా 2.06 డిగ్రీలుగా నమోదైందని యూరప్‌లోని కోపరి్నకస్ వాతావరణ మార్పుల సంస్థ సోమవారం ప్రకటించింది! 1991–2020 మధ్య నమోదైన భూతాప సగటుతో పోలి్చనా ఇది ఏకంగా 1.17 డిగ్రీలు ఎక్కువని సంస్థ డిప్యూటీ డైరెక్టర్ సమంతా బర్గెస్ ఆందోళన వెలిబుచ్చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆమె చేసిన పోస్టు పర్యావరణవేత్తల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ‘‘గ్లోబల్ వారి్మంగ్‌కు అడ్డుకట్ట వేయకుంటే సర్వనాశనం తప్పదన్న హెచ్చరికలను సంపన్న దేశాలు పెడచెవిన పెడుతున్నాయని తేలిపోయింది. భూమిపై జీవజాలాన్ని తుడిచిపెట్టగల ఈ ప్రమాదానికి అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తున్నామన్న మాటలు నీటి మూటలేనని రుజువైంది’’ అంటూ వారు మండిపడుతున్నారు. మానవాళి చరిత్రలో నవంబర్ 17 దుర్దినమేనని సైంటిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘కాప్’ లక్ష్యాలన్నీ గాలికి... గ్లోబల్ వారి్మంగ్ను 2 డిగ్రీల కంటే తక్కువ స్థాయికి, సరిగ్గా చెప్పాలంటే 1.5 డిగ్రీలకు పరిమితం చేసి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని పారిస్ పర్యావరణ సదస్సులో ప్రపంచ దేశాలు ప్రతినబూనాయి. దాని సాధనే ప్రధాన లక్ష్యంగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఏటా కాప్ సదస్సులు నిర్వహించుకుంటూ వస్తున్నాయి. కాప్–27 పర్యావరణ సదస్సు గతేడాది నవంబర్‌లో జరిగింది. పర్యవారణ లక్ష్యాల సాధనకు ఆర్థిక వనరుల్లేని పేద దేశాలకు వందలాది కోట్ల డాలర్లు గ్రాంట్‌గా అందజేసేందుకు సంపన్న దేశాలన్నీ అంగీకరించాయి. గ్లోబల్ వారి్మంగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు తామంతా కూడా చిత్తశుద్ధితో కృషి చేస్తామని ప్రకటించాయి. ముఖ్యంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని దాదాపుగా తగ్గించేస్తామని చెప్పుకొచ్చాయి. కానీ వాస్తవంలో జరుగుతున్నది వేరు... ► చాలా దేశాలు శిలాజ ఇంధనోత్పత్తిని 2030కల్లా రెట్టింపు, అంతకంటే ఎక్కువ చేయనున్నాయని ఐరాస గత వారం విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది! ► గ్లోబల్ వారి్మంగ్ 1.5 శాతానికి పెరగకుండా ఉండాలంటే కర్బన ఉద్గారాలను 2030కల్లా 45 శాతం తగ్గించాల్సి ఉంది. గత కాప్ సదస్సులో దేశాలన్నీ నిర్దేశించుకున్న లక్ష్యం కూడా అదే. కానీ అన్ని దేశాలూ తమ తమ పర్యావరణ లక్ష్యాలను సాధించినా కర్బన ఉద్గారాలు 2030కల్లా 9 శాతం పెరుగుతాయని హెచ్చరించింది. ► గ్లోబల్ వార్మింగ్ ఉత్పాతానికి అడ్డుకట్ట వేసేందుకు దేశాలు చేయాల్సినంత ప్రయత్నం చేయడం లేదని పలు అంతర్జాతీయ పర్యావరణ నివేదికలు కూడా ముక్త కంఠంతో ఘోషిస్తున్నాయి. ► ముఖ్యంగా గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాన్ని తగ్గించేందుకు కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడం చాలా అవసరమని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్‌లో క్లైమేట్ సైన్స్ ప్రొఫెసర్ రిచర్డ్ అలన్ స్పష్టం చేస్తున్నారు. ► గత సదస్సుల వాగ్దానాలేవీ ఆచరణలోకి రాలేదన్న పెదవి విరుపుల మధ్య మరో రెండు వారాల్లో దుబాయ్‌లో కాప్–28 సదస్సు జరగనుంది. అందులో ఏమేం చర్చిస్తారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి! వినాశనమే...? ఉష్ణోగ్రతలో ఒకట్రెండు డిగ్రీల పెరుగుదలతో ఏమవుతుంది లెమ్మనుకుంటే చాలా పొరపాటు. భూమి సగటు ఉష్ణోగ్రత అతి తక్కువగా పెరిగినా తీవ్ర పర్యవసానాలుంటాయి. అలాంటిది ఒక డిగ్రీ పెరిగిందంటే అది తీవ్ర ప్రభావమే చూపుతుంది. పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే అదే జరుగుతోంది! గత వందేళ్లలో భూతాపం విపరీతంగా పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే సగటున ఒకటిన్నర డిగ్రీల మేరకు పెరిగిపోయింది. దాంతో నానారకాల పర్యావరణ ఉత్పాతాలతో మానవాళి అతలాకుతలం అవుతోంది. అదే ఉష్ణోగ్రతలో పెరుగుదల గనక 2 డిగ్రీలకు చేరితే కనీవినీ ఎరగని వినాశనం, కష్టనష్టాలు తప్పవని పర్యావరణవేత్తలు ఎప్పట్నుంచో నెత్తీనోరూ బాదుకుంటున్నారు. భూతాపోన్నతి 1.5 డిగ్రీలను దాటిన కొద్దీ దారుణాలు జరుగుతాయి. అదే 2 డిగ్రీలు పెరిగిందంటే... ► పెను తుఫాన్లు, తీవ్ర దుర్భిక్షం వంటి అతి దారుణ పరిస్థితులు తలెత్తుతాయి. ► పర్యావరణ సంతులనాన్ని కాపాడటంలో అతి కీలకమైన కోరల్ రీఫ్‌లు, ధ్రువ ప్రాంతపు మంచు పొరలు సమూలంగా తుడిచిపెట్టుకుపోతాయి. ► పర్యావరణ వ్యవస్థ మరింకెప్పటికీ ఎన్నటికీ బాగుచేయలేనంతగా పాడైపోతుంది. ► క్రమంగా భూమి నివాసయోగ్యం కాకుండా పోతుంది. ► జీవ, జంతు జాలాల మనుగడ ప్రమాదంలో పడుతుంది. ► అత్యుష్ణ పరిస్థితులు స్థిరంగా కొనసాగితే జీవజాలం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా ఆశ్చర్యం లేదు. ► గత 12 నెలలు ఆధునిక ప్రపంచ చరిత్రలోనే అత్యంత వేడి నెలలుగా రికార్డుకెక్కాయి. గత ఏడాది కాలంలో పాకిస్తాన్, ఉత్తర అమెరికాలో తీవ్ర వరదలు, ఆస్ట్రేలియా, అమెరికాల్లో కార్చిచ్చులు, మంచు తుఫాన్ల వంటి వైపరీత్యాలతో ప్రపంచం అల్లాడింది. ► మన దేశంలో చూసుకుంటే పారిశ్రామికీకరణకు ముందు చెన్నై సగటు ఉష్ణోగ్రత 28 డిగ్రీలుండేది. ఇప్పుడది 29.5 డిగ్రీలు దాటేసింది! ఇదే ధోరణి దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ప్రతిఫలిస్తోంది. ► ఇటీవలే ఉత్తరాఖండ్‌లో భూమి బీటలుబారడం తెలిసిందే. భూతాపంలో పెరుగుదల 2 డిగ్రీల సెంటీగ్రేడ్ల సరిహద్దును దాటింది కొద్దిసేపు మాత్రమే. కానీ భూమి నానాటికీ ఆమోదయోగ్యం కానంతగా వేడెక్కిపోతోందనేందుకు ఇది అతి పెద్ద సంకేతం. ఇదే ధోరణి ఇంకొంతకాలం కొనసాగితే దిద్దుబాటు అసాధ్యమే కావచ్చు! – సమంతా బర్గెస్, డిప్యూటీ డైరెక్టర్, కోపర్నికస్ వాతావరణ మార్పుల సంస్థ – సాక్షి, నేషనల్ డెస్క్ -
సగం రాష్ట్రాలకు వడగాల్పుల వెతలు
న్యూఢిల్లీ: సూర్య ప్రతాపానికి దాదాపు సగం భారతదేశ రాష్ట్రాలు చెమటతో తడిసి ముద్దవుతున్నాయి. భానుడి భగభగలతో మొదలైన వడగాల్పులు మరో 3–4 రోజులు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ వేడి వేడి వార్తను పట్టుకొచ్చింది. మండే ఎండలను భరిస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలుగు రాష్ట్రాలూ ఉన్నాయి. రుతుపవనాలు తలుపుతట్టినా వడగాల్పులు మాత్రం వదిలిపోవట్లేవు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలుసహా విదర్భ ప్రాంతాల్లో తీవ్రస్థాయి నుంచి అతి తీవ్రస్థాయిలో వడగాల్పుల పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే బిహార్‌లో రెడ్అలర్ట్ను ప్రకటించారు. శనివారం(జూన్ 17)దాకా జార్ఖండ్‌లో స్కూళ్లు తెరుచుకోనేలేదు. ఛత్తీస్‌గఢ్, గోవాల్లోనూ ఇదే పరిస్థితి. వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు, రాత్రిపూట ఉష్ణోగ్రతలపై వాతావరణ శాఖ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. ► తెలంగాణ, రాయలసీమ, మధ్యప్రదేశ్ పశ్చిమ ప్రాంతం, తమిళనాడు రాష్ట్ర ప్రజలు ఆదివారం(జూన్ 18న) కూడా వడగాల్పులను భరించాల్సిందే. ► ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, యానాం, మధ్యప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతాలు, తూర్పు యూపీ, బిహార్‌లో మరో రెండు రోజులు ఎండలు మరింత మండుతాయి. ► ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో మరో నాలుగు రోజులపాటు వడగాల్పులు కొనసాగుతాయి. ► పశ్చిమబెంగాల్లోని గంగా పరీవాహక ప్రాంతాలు, జార్ఖండ్‌లో మరో 3 రోజులు ఎండలు మరింత ముదురుతాయి. ► రాత్రిపూట సైతం ఉష్ణోగ్రతలు పైస్థాయిలోనే ఉండే అవకాశం ఉంది. ► విదర్భ, ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతాల్లో ఆదివారం ఈ పరిస్థితులు ఉంటాయి. ► మధ్యప్రదేశ్ తూర్పు ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్‌లలో రెండు రోజులు రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువే ఉండనున్నాయి. ► మధ్య భారతం, తూర్పు భారతం, దక్షిణ భారతదేశంలో వచ్చే మూడు రోజులూ ఉష్ణోగ్రతల్లో మార్పేమీ ఉండదు. ► ఆ తర్వాత మాత్రం 2–4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గొచ్చు. -
మండిపోయిన మంగళవారం.. వచ్చే 5 రోజులు వడగాడ్పుల హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం ఒకట్రెండు చోట్ల 46 డిగ్రీలకు సమీపంలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో ఏకంగా 45.7 డిగ్రీల సెల్సియస్ పగటి ఉష్ణోగ్రత నమోదైంది. కొమురంభీం జిల్లా జంబుగలో 45.4 డిగ్రీలు నమోదైంది. రాగల ఐదు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధవారం నుంచి ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతోపాటు ఉత్తర తెలంగాణల్లోని మూడు నాలుగు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది. ఆ కాలంలో పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు స్థిరంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ దాని చుట్టు పక్కల జిల్లాల్లో 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డు కానున్నాయి. సోమవారం నాటి ఆవర్తనం మంగళవారం దక్షిణ చత్తీస్ఘడ్ దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతూ.. సగటు సముద్ర మట్టం నుండి 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద స్థిరంగా ఉంది. ద్రోణి విదర్భ నుండి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలోమీటర్ల వద్ద కొనసాగుతూ ఉంది. మరోవైపు రాగల మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరికొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. చదవండి: త్వరలో ఢిల్లీకి టీపీసీసీ నేతలు.. రాహుల్ అమెరికా నుంచి రాగానే! -
‘అత్యవసరం అయితేనే బయటకు రండి’
హైదరాబాద్/అమరావతి: భగ్గుమంటోన్న భానుడి ప్రభావంతో.. అడుగు బయటపెట్టాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఇప్పటికే నిప్పుల కొలిమిని తలపిస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఉష్ణోగ్రతలు.. మరో మూడు రోజులపాటు ఇదే తీవ్రతతో కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. పగటిపూటే కాదు.. రాత్రి పూట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని చెబుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో నమోదు అవుతుండడం.. ఒక పక్క ఉక్కపోత, మరోవైపు వడగాల్పులతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. వాయవ్య భారత్ నుంచి వీస్తున్న వేడిగాలుల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగినట్లు ఇదివరకే భారత వాతావరణ విభాగం వివరించింది. అయితే.. మరో మూడు రోజులు కూడా రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. ► గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పైనే నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వేసిన అంచనా నిజమైంది. తెలంగాణలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 41 డిగ్రీల దాకా నమోదయ్యాయి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. దిగువ స్థాయిలోని గాలులు వాయవ్య దిశ నుంచి తెలంగాణ వైపుకు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. వరంగల్ 43, నల్లగొండ, ఖమ్మం 44, భూపాలపల్లిలో 45 డిగ్రీలు, నల్గొండ నిడమనూరులో 45 డిగ్రీలు, ములుగు తాడ్వాయి 44.5 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్లు నమోదు అయ్యాయి. ► మరోవైపు ఏపీలో ఏకంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. వడగాలుల తీవ్రత కూడా అధికమైంది. భానుడి ప్రతాపంతో ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారాయి. సాధారణం కంటే 4-6 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రత దాదాపుగా 46 డిగ్రీలు దాటిపోయింది. ప్రకాశం 46, ఏలూరు, విజయవాడలో 47, గుంటూరులలో 48 డిగ్రీలు, రాజమండ్రిలో అత్యధికంగా 49 డిగ్రీల టెంపరేచర్లు నమోదు అయినట్లు తెలుస్తోంది. ► ఇక వడదెబ్బతో తెలంగాణలో ముగ్గురు(తాజాగా.. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఓ మహిళ), ఏపీలో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఏకంగా 20 మంది వడదెబ్బ బారినపడి ఆస్పత్రిపాలయ్యారు. పరిస్థితి మరో మూడురోజులు ఇలాగే ఉంటుందని.. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ► వాతావరణ మార్పులతో హెపటైటిస్-బీ ప్రమాదం పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బయటకు వెళ్లేవాళ్లు తలకు రక్షణ ధరించాలని, మంచినీళ్లు, సహజ సిద్ధమైన పానీయాలు, ఓఆర్ఎస్ లాంటి ఎనర్జీ డ్రింక్స్ వెంటపెట్టుకుని వెళ్లడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. వడదెబ్బ నుంచి రక్షణ కోసం సన్ స్క్రీన్ లోషన్ వాడడం, కాటన్ దుస్తులు.. కళ్లజోడు ధరించడం లాంటి సూచనలు చేస్తున్నారు. ఇదీ చదవండి: డిశ్చార్జికి రీచార్జికి మధ్య.. -
ఏసీ అక్కర్లేదు, ఒక చెట్టున్నా చాలు
న్యూఢిల్లీ: ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపంతో ఏసీ గదుల్లోంచి బయటకు రావడానికే జనం ఇష్టం పడడం లేదు. సుభాషిణి చంద్రమణి అనే మహిళ మాత్రం ఎండ నుంచి రక్షణకి ఏసీ గదులు అక్కర్లేదని ఒక చెట్టు చాలని ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఆమె మండుటెండలో నిల్చొని ఉష్ణోగ్రతని రికార్డు చేస్తే 40 డిగ్రీల సెల్సియస్ చూపించింది. అలా నడుచుకుంటూ పక్కనే ఉన్న చెట్టు నీడలోకి వెళితే ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోయి 27 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అంటే ఏకంగా 13 డిగ్రీలు తేడా ఉందన్న మాట. ఆమె ఈ ప్రయోగం చేసి దానికి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్టు చేస్తే అది వైరల్‌గా మారింది. -
మరో నాలుగేళ్లూ మండే ఎండలే!
సుమారు నూటాపాతికేళ్ల భారతదేశ చరిత్రలో ఈ 2022వ సంవత్సరం ప్రతికూల కారణాల వల్ల ప్రత్యేకమైనది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే, ఎట్టకేలకు వేసవి తగ్గుముఖం పడుతోందని సంతోషపడటానికి లేదు. రాబోయే నాలుగేళ్లూ కూడా ఎండలు ఇలాగే మండిపోతాయని ఇప్పటికే ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. వీటి ఫలితంగా వడగాడ్పులూ, ఉక్కపోతలతో పాటు ఆహార భద్రతా సంక్షోభం, అనారోగ్యాలు కలగడం లాంటి ఎన్నో విపరిణామాలను మానవాళి ఎదుర్కోవాల్సి ఉంది. దీనికి తక్షణం మనం చేయవలసిందల్లా శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారో వినడం, పర్యావరణ కార్యకర్తలు ఏం చేయమని చెబుతున్నారో చేయడం! ‘‘ఇప్పుడే కాదు, రాబోయే నాలుగేళ్ల పాటూ అదనంగా 1.5 డిగ్రీల చొప్పున తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఫలితంగా మరింతగా మంచు కరిగిపోవడం, సముద్ర జలరాశులు పోటెత్తిపోవడం, తీవ్ర స్థాయిలో వడగాడ్పులు వీయడం తదితర అసాధారణ పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది. ఫలితంగా ప్రజల ఆహార భద్రత, ఆరోగ్యం, పరిసరాలు, భద్రమైన అభివృద్ధికి చేటు మూడే ప్రమాదం ఉంది’’. – ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) హెచ్చరిక: 2022 మే మూడో వారంలో విడుదల చేసిన ప్రకటన. అంతేగాదు, దక్షిణాసియా పాత, కొత్త వలస సామ్రాజ్య పాలకుల యుద్ధోన్మాద వ్యూహాలు కూడా వాతావరణ పరిస్థితులు వికటించ డానికి దోహదపడుతున్నాయి. ఫలితంగా దక్షిణాసియాలో కీలక స్థానంలో ఉన్న భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ లాంటి దేశాలు వాతావరణ రక్షణకు మునుపటికన్నా ఎక్కువ శ్రద్ధతో, మెలకువతో, జాగరూకతతో వ్యవహరించాల్సిన అత్యవసర పరిస్థితులు నేడు ఏర్పడ్డాయి. ఈ పరిణామాల ఫలితంగా దక్షిణాసియా దేశాలలో తరచుగా ఇకపైన ఎప్పటికన్నా ఎక్కువగా సుదీర్ఘకాలంపాటు వడ గాడ్పులూ, ఉక్కిరిబిక్కిరి చేసే ఉక్కబోతలూ ఎక్కువయ్యే ప్రమాదం ఉందని సుప్రసిద్ధ పర్యావరణ, వాతావరణ శాస్త్రవేత్త షకీల్ అహ్మద్ రోమ్‌షూ హెచ్చరిస్తున్నారు. గత దశాబ్దాలుగా ప్రపంచ వాతావరణం అసాధారణ రీతిలో వేడెక్కిపోతుండటాన్ని గురించి శాస్త్రవేత్తలు ఆందో ళన వ్యక్తం చేస్తూనే ఉన్నారని మనం మరవ కూడదు. ఎండల్లోనే పుట్టిన తరం 2000 సంవత్సరం నుంచీ ఈ ఉష్ణోగ్రతల తీవ్రత నమోదవడాన్ని శాస్త్రవేత్తలు గమనిస్తూనే వస్తున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకునే, ‘‘2000 తర్వాత పుట్టిన యువతరాలు ఈ ఉష్ణోగ్రతల తీవ్రతను చవిచూడకుండా ఉన్న రోజులు లేవు’’ అని మరో ప్రసిద్ధ శాస్త్రవేత్త రాక్సీ మాథ్యూ కోల్ (పుణె) వ్యాఖ్యానించారు. ఉత్తరాది నుంచి దక్షిణాది పర్యంతం 1951 తర్వాత 40 డిగ్రీల సెల్సియస్‌కు వీసమెత్తు కూడా తగ్గకుండా ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. క్రమేణా పెక్కు రాష్ట్రాలలో 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరి ప్రజా జీవితాలను దుర్భరం చేస్తూ వచ్చాయి. ఫలితంగా 1992 నుంచి 2015 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా వేడిగాలుల కారణంగా అకాల మరణానికి గురైన వారి సంఖ్య 24 వేల మందికి పైగానేనని తేలింది. ఇక 1901–2022 సంవత్సరాల మధ్య కాలంలో చరిత్రకు తెలిసి నంతవరకూ 2022 మార్చి నెల అత్యంత తీవ్రతర ఉష్ణోగ్రతకు తొలి ఆనవాలుగా మిగిలిపోయింది. అంతేగాదు, వర్ధమాన దేశాలను తమ దోపిడీకి గురి చేసేందుకు వలస సామ్రాజ్య పెట్టుబడిదారీ రాజ్యాలకు ఇండో–ఫసిఫిక్ ప్రాంతం ఎలా కేంద్రమవుతూ వచ్చిందో... అదే మోతాదులో నిత్యం వాతా వరణ పరిస్థితులు తారుమారు కావడానికి కూడా కేంద్రమవుతోంది. ఈ దారుణ పరిస్థితులు చివరికి ఏ దశకు చేరుకుంటున్నాయంటే– ఇటీవలనే పదమూడేళ్ల ఆరవ్ సేuŠ‡ అనే వాతావరణ పరిరక్షణకు నడుం బిగించిన ముక్కుపచ్చలారని ఔత్సాహికుడు ఓ పెద్ద చెట్టు బొమ్మ సాయంతో దేశ ప్రజలకొక విజ్ఞానపూర్వకమైన సందేశం ఇచ్చాడు: ‘‘అయ్యా, నా తోటి మానవులారా, నన్ను (చెట్టును) నాశనం చేయకండి. నేను మీకు నీడనూ, ఆహారాన్నీ, నీటినీ, ప్రాణవాయువునూ దానం చేస్తూంటాను’’! అంతేగాదు, ఈ శతాబ్దం ప్రారంభమైన తర్వాత ప్రపంచ ఆహార సంస్థ డైరెక్టర్ జనరల్ డోంగ్యూ అత్యంత శాస్త్రీయమైన పద్ధతుల్లో చెట్లూ చేమల ప్రాధాన్యతను ఉగ్గడిస్తూ విశిష్టమైన ఒక సందేశం ఇచ్చాడు: ‘‘మానవ నాగరికతకూ, వ్యవసాయానికీ, ఆహార భద్రతకూ, గ్రామీణ జీవన స్రవంతికీ... చెట్లూ చేమలు ఎంతగా అని వార్యమైన పరిసరాలో మనం గుర్తించి గౌరవించాలి!’’ పటపటలు, చిటచిటలు... అందుకే వేసవి తాపం ఎందరో కవులకు ‘హాట్ టాపిక్’ అయింది. దీనికిగానూ మన సారస్వతంలో ఇవ్వదగిన ఎన్నో ఉదాహరణ లున్నాయి. 17వ శతాబ్దంలోనే తంజావూరు రఘునాథనాయకుడు తన వాల్మీకి చరిత్రలో వేసవి భీష్మతాపం ఎలా ఉండేదో ధ్వన్యనుకరణ ద్వారా వర్ణించాడు. ‘పటపట/ తటతట/ చిటచిట/ కటకట’ శబ్దాలను ప్రయోగిస్తూ గ్రీష్మాన్ని బొమ్మకట్టాడు. ‘పటపట పగిలెన్ కుంభిణి తటతట పథికుల మనంబు చల్లడపడియెన్ చిటచిట ఎగసెన్ దవిశిఖి కటకట గ్రీష్మంబు ఒకింత కనబడునంతన్’. అంతేగాదు, దావాగ్ని మూలాన మండిపోతున్న కొండలు, బంగారు ‘మలాము’ వేసినట్లు మెరిసిపోయాయట! ఎటుచూసినా ‘అఖండ దావాగ్ని శిఖలే’ అల్లుకుపోయాయన్నాడు! ఇక చలిగొండ ధర్మన్న కవి (చిత్ర భారతం) కూడా నిప్పులు చెరిగే వేసవి తీవ్రతను ‘మిటమిట/ పెటపెట/ బొటబొట/ చిటచిట’ శబ్దాలతో వర్ణించకుండా ఉండలేకపోయాడు! అలాగే ‘వైజయంతీ విలాసం’లో సారంగు తమ్మయ్య వేసవిలో భూమి ‘వేడి మంగలం’లా సెగలు కక్కిందన్నాడు. చివరికి భూమికి దిగి రావడానికి ఇష్టం లేక మంచుకొండను కౌగిలించుకుని కూర్చున్న శివపార్వతుల్ని సహితం భూమ్మీదనున్న చెట్ల నీడను ఆశ్రయించేటట్టు చేసినవాడు ఎవరో కాదు, మన కొంటె కోణంగి శ్రీనాథుడే సుమా! ‘హరుడు కైలాస కుధర నాథాగ్ర వసతి/ విడిచి వటమూల తలముల విశ్రమించె’ అన్నాడు. ఇంకో కొంటె కోణంగి తెనాలి రామకృష్ణుడు మండు వేసవిని పోలికలేని వస్తువులతో పోల్చి వర్ణించడంలో దిట్ట. ‘పంపా తరంగ రింఖణ ఝంపా సంపాద్యమాన జలకణ రేఖా సంపాత శితలానల సంపద వదలించె పరమశైవోత్తంసున్’. అలాగే మేఘాలు కమ్ముకు రావడాన్నీ, వర్షించడాన్నీ, వాటి క్రమాభివృద్ధినీ సూచించేలా పాలవేకరి కదిరీపతి ‘శుక్తసప్తతి’ రచనలో ప్రకృతిని ఎంతో చలనశీలంగా వర్ణించాడు. ఎంతగానో ఆశావహు లమై ఉరుములు మెరుపుల కోసం ఎదురుచూస్తున్న ఈనాటి మనల్ని ఎలా ఆకట్టుకోజూశాడో గమనించండి: ‘‘అప్పుడొక్కించుక మబ్బు గానబడి యింతై అంతౖయె మించి విష్ణుపదం బంతయు నాక్రమించి జన సందోహే క్షణాంధత్వ క్వచ్చపలంబై కడు గర్జిత ప్రబలమై సంజాత ఝంఝా మరుద్విపులంబై ఒక వాన వట్టె వసుధా విర్భూత పంకంబుగన్... పెళ పెళారని బెడిదంపు పిడుగులురల ఝల్లు ఝల్లున పెనుజల్లు చల్లుచుండ బోరుబోరున వర్షంబు ధారలురిసె’’! ఇప్పుడు ఆ ధారల కోసమే జనులు పడిగాపులు పడి ఉన్నారు. కానీ, ఎటుతిరిగీ మరో నాలుగేళ్లపాటు తీవ్ర ఉష్ణోగ్రతల మధ్యనే కాపురాలు వెలగబెట్టక తప్పదన్న తాజా హెచ్చరికలే ఆశలమీద నీళ్లు చల్లుతున్నాయి. అయినా వర్షాగమ వార్తలు ఏ మూల నుంచి వినబడినా ఆప్తవాక్యంగానే భావించుకోవాలి. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
సుర్రుమంటున్న సూర్యుడు..
సాక్షి, హైదరాబాద్: శివరాత్రి తర్వాత చలి తగ్గుముఖం పడుతుందని అంటారు. ఆ విధంగా ఫిబ్రవరి నెలాఖరు వరకు చలి ఉండాలి. కానీ ఈ ఏడాది అప్పుడే తగ్గినట్టుగా కన్పిస్తోంది. వాతావరణంలో తేమ శాతం పెరుగుతుండడంతో గాలులు వీస్తున్నప్పటికీ చలి ప్రభావం పెద్దగా తెలియడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పగటి పూట భానుడు భగభగమంటున్నాడు. దీంతో సాధారణం కంటే కాస్త ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తు తం చాలా చోట్ల 30 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగానే నమోదవుతుండగా... కొన్నిచోట్ల మాత్రం వేసవి కాలం ప్రారంభంలో నమోదయ్యే ఉష్ణోగ్రతల మాదిరి 34 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. అయితే రాత్రి వేళ మాత్రం చలితో తక్కువ ఉష్ణోగ్రతలునమోదవుతున్నాయి. పడుతూ లేస్తూ.. రాష్ట్రంలో సగటున 30 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదవుతోంది. గత వారం రోజుల నుంచి మహబూబ్‌నగర్, మెదక్, అదిలాబాద్, భద్రాచలంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 32 నుంచి 35 డిగ్రీల మధ్యనే నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గత ఏడాది ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో వరసగా 32, 30, 31 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు మాతమే నమోదు కావడం గమనార్హం. ఇక ప్రస్తుతం రాత్రి ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల నుంచి 17 డిగ్రీల మధ్యన నమోదవుతుండగా మంగళవారం మాత్రం అదిలాబాద్‌లో 9.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్, నల్గొండ, దుండిగల్‌లో ఉన్న వాతావరణ శాఖ అబ్జర్వేషన్ కేంద్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెలలో చలి ప్రభావం ఉంటుందని, పూర్తిగా తగ్గుముఖం పట్టినట్లు కాదని వాతావరణ శాఖ చెబుతోంది. ఒకట్రెండు రోజులు కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపించినప్పటికీ తర్వాత తగ్గడం, మళ్లీ పెరగడం కనిపిస్తుందని వాతావరణ శాఖాధికారి నాగరత్న ‘సాక్షి’కి తెలిపారు. నెలాఖరులో అంచనాలు... వేసవి కాలంలో ఉష్ణోగ్రతల తీరుపై వాతావరణశాఖ ముందస్తు అంచనాలు రూపొందిస్తుంది. ఈ ఏడాది ఎండలు సాధారణ స్థాయిలోనే ఉంటాయని అధికారులు చెబుతున్నప్పటికీ, అంచనాలు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ఫిబ్రవరి నెలాఖరులోగా ఉష్ణోగ్రతల అంచనాలను వెలువరించేందుకు వాతావరణ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ అంచనాలను బట్టే పలు ప్రభుత్వ శాఖలు తమ కార్యాచరణ రూపొందించుకుంటాయి. -
రెడ్ అలర్ట్: ఆ సమయంలో బయటకు రావొద్దు
న్యూఢిల్లీ: గడిచిన వారం రోజులుగా ఒక్కసారిగా దేశంలో ఉష్ణోగ్రతలు అధికమయ్యాయి. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైన నమోదవుతుండగా.. రాబోయే రోజుల్లో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ క్రమంలోనే ఉత్తర భారతదేశంలోని హర్యానా, పంజాబ్, రాజస్థాన్, చంఢీఘర్, ఢిల్లీ రాష్ట్రాలకు ఆదివారం 'రెడ్ అలర్ట్' ఉత్తర్వులను జారీ చేసింది. ఉత్తరప్రదేశ్‌లో కూడా వడగాలు వీస్తాయని ఐఎండీ 'ఆరెంజ్ వార్నింగ్' జారీ చేసింది. చదవండి: గాడ్సే దేశాన్ని రక్షించారంటూ ఎఫ్బీలో పోస్ట్ ఈ విషయంపై ఐఎండీ రీజినల్ మెటీరియాలజీ సెంటర్ హెడ్ కుల్దీప్ శ్రీవాస్తవ వివరణ ఇస్తూ.. రాబోయే రెండు మూడు రోజులు ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు దాటి నమోదవుతాయి. ఈ సంవత్సరం వేసవిలో అధిక సంఖ్యలో ఉష్ణోగ్రతలు నమోదుకావడం ఇదే తొలిసారి. ఉత్తర, మధ్య భారతదేశంలో ఉష్ణోగ్రతలు ఇప్పటి వరకూ సాధారణం కంటే తక్కువగానే నమోదయ్యాయి. ఏప్రిల్, మే మధ్య వరకు వర్షాలు కురవడంతో ఎండలు తీవ్రత అంతగాలేదని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకూ కొనసాగుతాయనీ, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిషా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కోస్తాంధ్రలో ఎండలు ఎక్కువగా ఉండనున్నట్లు ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 47 డిగ్రీలుగా నమోదైంది. దీనికి తోడు వేడిగాలుల తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెడ్ వార్నింగ్ జారీచేసిన ప్రాంతాల్లోని ప్రజలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటి నుంచి బయటకు రావద్దని ఐఎండీ సూచించింది. చదవండి: కరోనా : టాటా గ్రూపు సీఈవోల కీలక నిర్ణయం -
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వచ్చే మూడురోజులు పాటు రెండు రాష్ట్రాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. శుక్రవారం నుంచి మూడురోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. విజయవాడలో ఉష్ణోగ్రత 44 డిగ్రీలు దాటింది. అలాగే నిజామాబాద్‌లో 42 డిగ్రీలు, రామగుండంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉక్కపోతతో జనం ఉక్కిబిక్కిరి అవుతున్నారు. (‘అందుకే తెలంగాణలో తక్కువ కరోనా కేసులు’) -
పాములు ఎక్కడ దాక్కున్నాయో చూడండి..
-
ఆ పాములు ఎక్కడ దాక్కున్నాయో చూడండి..
సిడ్నీ : ఆస్ట్రేలియాలో ఎండలు మండిపోతున్నాయి.రోజురోజుకు ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. మంగళవారమక్కడ సగటు ఉష్ణోగ్రత 40.9 డిగ్రీలుగా నమోదైంది. ఇది 2013లో ఏర్పడిన 40.03 డిగ్రీల రికార్డును బ్రేక్ చేసిందని ఆస్ట్రేలియ వాతావరణ శాఖ వెల్లడించింది. అటు ఎండ తీవ్రత సమస్యను ఎదుర్కొంటున్న స్థానిక ప్రజలకు మరో విచిత్రకరమైన సమస్య ఎదురవుతుంది. బయటఎండ తీవ్రతను తట్టుకోలేని పాములు జనావాసాల్లోకి చొరబడి.. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇంట్లోకి ప్రవేశించిన పాములు మూలల్లోకి వెళ్లి తల దాచుకుంటున్నాయి. అక్కడా...ఇక్కడా అనే తేడా లేకుండా పాములు చల్లటి ప్రదేశాన్ని వెతుక్కుంటున్నాయి. తాజాగా ఓ ఇంట్లోకి చొరబడిన పాము, ఆ తర్వాత అది మాయమవడంతో ఆందోళన చెందిన ఆ ఇంటి యజమాని... జంతు సంరక్షులకు సమాచారం ఇవ్వగా చివరికి బూట్ల మధ్యలో ఆ పాము ఉండటం గమనించారు. సంరక్షులు దానిని రక్షించి అడవుల్లోకి వదిలిపెట్టారు. మరోక సంఘటనలో వూమ్భీలోని ఓ మహిళ తన వాష్ రూంలో పామును గర్తించింది. మొదటి దానిని చెట్టు కొమ్మ అనుకొని ఉండగా అనంతరం అది అక్కడ లేకపోవడంతో పాము అని నిర్ధారణకు వచ్చిన ఆమె... పాము సంరక్షులకు సమాచారం ఇచ్చింది. చివరికి వారు దానిని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆ పాము ఈస్టర్న్ బ్రౌన్ స్నేక్ అని, ఇది ప్రపంచంలో రెండవ అత్యంత విషపూరితమైనదని వారు పేర్కొన్నారు. అలాగే మరూచైడోర్ ప్రాంతంలో విచిత్రంగా కారు టైరులో పామును గుర్తించారు. దీనిని రెడ్ బెల్లీడ్ బ్లాక్ స్నేక్‌గా గుర్తించిన సంరక్షులు పామును రక్షించి అడవిలో విడిచిపెట్టారు. ఇలాంటి ఘటనలు నిత్యం ప్రజలను భయాందోళనకు గురిచేస్తుండగా..వీటిలో కొన్ని అతి ప్రమాదకరమైనవి, విషపూరితమైనవి ఉండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. -
గల్ఫ్‌లో మండుతున్న ఎండలు
(ముక్కెర చంద్రశేఖర్–కోరుట్ల) :వేసవిలో మండుటెండల నుంచి కార్మికులకు ఉపశమనం కలిగేలా గల్ఫ్ దేశాల్లో తీసుకొచ్చిన చట్టాలు పకడ్బం దీగా అమలు కావడం లేదు. గల్ఫ్ దేశాల్లో సాధారణంగా ఏడాది మొత్తం ఎండలు ఎక్కువగానే ఉంటాయి. ఈ దేశాల్లో ఎండాకాలం, శీతాకాలం మాత్రమే ఉంటాయి. వర్షాకాలం ఉండదు. నవంబర్ నుంచి మార్చి వరకు శీతాకాలం, ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఎండాకాలం ఉంటుంది. జూన్, జులై, ఆగస్టు నెలల్లో ఎండలు మరింత తీవ్ర రూపం దాలుస్తాయి. ఈ మూడు నెలల్లో ఉష్ణోగ్రతలు 37 నుంచి 49 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. సముద్ర తీరాలు, గ్యాస్ ఉత్పాదక కంపెనీలు ఉన్నచోట ఉష్ణోగ్రత దాదాపు 54 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుంది. దీనికి తోడు ఉక్కపోత వాతావరణంతో కార్మికులు మరింత బలహీనంగా మారుతారు. ఈ పరిస్థితుల్లో ఆరుబయట పనిచేయడం కష్టతరం. వేసవిలో కార్మికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జూన్, జులై, ఆగస్టు నెలల్లో పనివేళలు మారు స్తారు. ప్రతి రోజు 8 గంటల పనిచేయాల్సి ఉంటే.. తెల్లవారుజామున 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనివేళలు మారుస్తారు. వేసవిలో మధ్యాహ్నం 12.30 గం టల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఆరుబయట కార్మికులతో పనిచేయించడం చట్ట విరుద్ధం. చట్టాలకు విరుద్ధంగా పనిచేయించే కంపెనీలకు భారీగా జరిమానా విధిస్తారు. పట్టింపు అంతంతే.. జూన్, జులై, ఆగస్టు నెలల్లో మధ్యాహ్నం పనిచేయించరాదన్న నిబంధనపై పట్టింపు అంతంత మాత్రంగానే ఉంది. గల్ఫ్‌లోని చాలా కంపెనీలు ఈ నిబంధనలను పట్టించు కోకుండా ఆరుబయట భవన నిర్మాణ కార్మికులతో పనిచేయిస్తాయని మన కార్మికులు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కార్మికులు ఆరుబయట పనిచేస్తున్నారా.. అన్న అంశంపై హెలికాపర్ల ద్వారా అక్కడి కార్మిక శాఖ నిఘా పెడుతున్నప్పటికీ పెద్దగా ఫలితం లేకుండాపోతోందని సమాచారం. ఒక్క ఒమన్ దేశంలోనే గత ఏడాది నిర్వహించిన తనిఖీల్లో సుమారు 771 కంపెనీలు వేసవి నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు కార్మిక శాఖ గుర్తించింది. దీంతో పాటు వేసవి వడగాలుల నుంచి కార్మికులు రక్షణ పొందేందుకు, ప్రాథమిక చికిత్సకు ఉపయోగపడే పరికరాలు, మందులు అందుబాటులో ఉంచకపోవడం శోచనీయం. నిఘా పెంచాలి గల్ఫ్ దేశాల్లో వేసవిలో మూడు నెలలు మ«ధ్యాహ్నం పనివేళలు బంద్ చేయడం సాధారణంగా జరుగుతుంది. కానీ, అన్ని కంపెనీలూ కచ్చితంగా ఈ నిబంధనలు పాటించడం లేదు. కొన్ని కంపెనీలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఈ విషయంలో నిఘా మరింత పెంచితే బాగుంటుంది. వేసవిలో ఉపశమనానికి కనీస వసతులు కల్పించని కంపెనీలు కూడా ఉన్నాయి. – గుగ్గిల్ల రవిగౌడ్,బీమారం, మేడిపల్లి, జగిత్యాల జిల్లా వేడిని తట్టుకోలేం.. వేసవిలో మూడు నెలల పాటు ఎండలు తీవ్రంగా ఉంటాయి. ఒక్కోసారి 48– 50 డిగ్రీల సెల్సియస్‌కు మించి వేడి ఉంటుంది. ఈ వేడికి.. ఉక్కపోతకు శరీరంలోని నీరంతా బయటకు పోయి నీరసం వస్తుంది. కంపెనీల్లో పనిచేసే వారికి కష్టాలు తప్పవు. భవన నిర్మాణంలో పనిచేసే కార్మికులు చాలా మంది వేడిమిని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు. –దావేరి శ్రీనివాస్, సంగెం,కోరుట్ల మండలం, జగిత్యాల జిల్లా -
హింసించడమే..!
అగ్ని గుండంలా మారిన జిల్లారెండు మండలాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రత17 మండలాల్లో 40–44 డిగ్రీల నమోదు32 మండలాల్లో తీవ్రంగా వడగాడ్పులు9 మండలాల్లో పిడుగు పడే హెచ్చరికలుజాగ్రత్తలు తీసుకోకుంటే అంతేసరి ఒంగోలు సిటీ:ఉగ్రరూపం దాల్చిన భానుడు జనాలపై పగబట్టాడు. వడగాడ్పుల ప్రభావంతో ప్రజలు అనారోగ్యం బారినపడ్తున్నారు. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గడం లేదు. కొన్ని మండలాల్లో నిత్యం 46 డిగ్రీలకు తగ్గడం లేదు. బుధవారం పెద్దచెర్లోపల్లి మండలం అలవలపాడు, బల్లికురవ మండలం కొప్పెరపాడులో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 44–45 డిగ్రీల మధ్య కురిచేడు, వెలిగండ్ల మండలంలోని రాళ్లపల్లి, బల్లికురవ, దొనకొండ, దర్శిలో నమోదయ్యాయి. వడదెబ్బకు బలి జిల్లా వ్యాప్తంగా వడగాడ్పులు తీవ్రంగా నమోదవుతున్నాయి. ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా పశ్చిమ ప్రాంత మండలాల్లో 50 కి.మీ వేగంతో వడగాడ్పులు నమోదయ్యాయి. యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, కురిచేడు, దొనకొండ, పెద్దారవీడు, దోర్నాల, అర్ధవీడు, దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు, అద్దంకి, ల్లికురవ, సంతమాగులూరు, యద్దనపూడి, మార్టూరు, పర్చూరు, కారంచేడు, చీరాల, వేటపాలెం, ఇంకొల్లు, జె.పంగులూరు, కంభం, రాచర్ల, గిద్దలూరు, కొమరోలు, సీఎస్‌పురం, వెలిగండ్ల, పీసీపల్లి, చిన్నగంజాం, పామూరు, ఉలవపాడు మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్కాపురం, తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి, కొరిశపాడు, మద్దిపాడు, చీమకుర్తి, వీవీపాలెం, మర్రిపూడి, కనిగిరి, హనుమంతునిపాడు, బేస్తవారిపేట, నాగులుప్పలపాడు, కొత్తపట్నం, టంగుటూరు, జరుగుమల్లి, కందుకూరులో వడగాడ్పుల దెబ్బకు జనం బెంబేలెత్తిపోతున్నారు. పిల్లలు, వృద్ధులు అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని వైద్యులు సూచిస్తున్నారు. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి జిల్లాలో ఎండల తీవ్రత మరో మూడు రోజులు ఉంటాయని వాతావరణ పరిశోధన అధికారులు చెబుతున్నారు. వడగాడ్పులు 50 కి.మీ వేగంతో నమోదవుతాయి. నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి కాపాడుకొనేందుకు జాగ్రత్తలు పాటించాలి. వృద్ధులు, పిల్లల్ని వేసవి నుంచి రక్షించుకొనే చిట్కాలు పాటించడం తప్పని సరి. వేసవికి మస్కా కొట్టే చిట్కాలు ఇలా.. ♦ ఎండ మరీ ఎక్కువ ఉన్నప్పుడు పిల్లలను బయటకు తీసుకురాకుండా చూడడం మంచిది. నెలల వయస్సు ఉన్న చిన్నారులను ఎండకు పూర్తిగా దూరంగా ఉంచాలి. ♦ పిల్లలకు వదులుగా ఉన్న కాటన్ దుస్తులను వేయాలి. ఆర్గానిక్ కాటన్ అయితే సున్నితమైన పిల్లల చర్మానికి మరింత మేలు. ♦ పిల్లలు బయటకు వెళ్తున్నా ఇంట్లో ఎండ పడే చోట ఉన్నా వారికి టోపీలను విధిగా వాడాలి. గాలి చొరబడే వీలున్న టోపీలను కొనాలి. ఇలాంటివి వాడడం వల్ల పిల్లల తల వేడెక్కకుండా ఉంటుంది. ♦ వేసవిలో పిల్లల డైపర్ల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా ఉపయోగించే డిస్పోజల్ డైపర్లు సౌకర్యవంతంగా ఉంటాయి. ♦ వేసవిలో పిల్లలకు నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. వారికి తరుచూ పాలు పట్టాలి. దాహం తీర్చడానికి నీళ్లు ఇవ్వాలి. ూ చంటి పిల్లల ఉయ్యాల వారు పడుకొనే మంచం ఇంట్లో చల్లని ప్రదేశంలో ఉండేలా చర్యలు తీసుకోవాలి. కిటికీలు తలుపుల ద్వారా సూర్యకాంతి వారిపై పడకుండా చూడాలి. వృద్ధులు వడదెబ్బకు గురికాకుండా జిల్లాలో వడదెబ్బ మృతులు ఇప్పటికి 130కిపైగా ఉన్నారు. వడగాడ్పులకు తట్టుకొనే శక్తి వృద్ధులకు తక్కువగా ఉంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలను తీసుకొని వేసవి సమస్యలకు దూరంగా ఉండే వీలుందని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ♦ వృద్ధులు త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు. వారి శరీరానికి నీటికి నిల్వ ఉంచుకొనే శక్తి తక్కువగా ఉంటుంది. వారికి దాహం అంతగా తెలియదు. అందుకే వాతావరణంలోని మార్పులకు అనుగుణంగా శరీర వ్యవస్థ సర్దుబాటు చేసుకొనే చిట్కాలు పాటించాలి. ♦ తాము నిత్యం వాడుకొనే మందుల్లో వేడికి ప్రభావితమయ్యే మందులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. కొన్ని రకాల మందులు గది వేడి కంటే ఎక్కువ వేడి ఉన్న ప్రదేశాల్లో ఉంచితే పని చేయవు. ఇంట్లో ఏసీ లేని వారు తాము వాడుతున్న మందుల్లో ఈవిషయాన్ని నిర్ధారించుకోవాలి. ♦ ఉష్ణోగ్రతల్లో కాస్త మార్పులు వచ్చినా అది వీరిపై అధికంగా ప్రభావాన్ని చూపిస్తుంది. వృద్ధులు వంటరిగా ఉన్నట్లయితే వారి పిల్లలు గాని ఇతర సంరక్షకులు వారి క్షేమసమారాలను తెలుసుకుంటుండాలి. ♦ తమ వద్ద అత్యవసర ఫోన్ నంబర్లను ఉంచుకోవాలి. లేత రంగుల్లో వదులైన కాటన్ దుస్తులు వాడాలి. పెద్దవాళ్లల్లో కంటి సమస్యలు ఉంటాయి. దానికి తోడు ఎండలో తిరిగితే కంటికి మరింత హాని కలుగుతుంది. సూర్యకాంతి కంటికి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ♦ శరీర ఉష్ణోగ్రత 104 ఫారన్‌హీట్ కన్నా ఎక్కువ ఉన్నా గందరగోళంగా తికమకగా ప్రవర్తిస్తున్నా వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. ♦ బయటకు వెళ్లినప్పుడు టోపీలు, సన్‌స్క్రీన్ లోషన్లు వాడాలి. నడక, తోటపని, వ్యాయామాలు చేస్తుంటే అధికంగా నీరు తీసుకోవాలి. ఎక్కువ సమయం బయట తిరగకూడదు. ఆహారంలో ఇవి తీసుకోవాలి వేసవిలో నీరు ఎక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఇవి శరీరంలో నీటి శాతాన్ని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేసి యాంటీ ఆక్సిడెంట్లు పెంచుతాయి. ♦ ఉల్లిపాయలు, ఆకుపచ్చని కూరగాయలు, మంచి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. పుచ్చకాయలు, యాపిల్స్, సొరకాయ, దోస వంటివి తినాలి. వీటిలో నీరు శాతం అధికంగా ఉంటాయి. మేలు చేస్తాయి. శరీరంలో వేడి పెంచే ఆహారాన్ని తీసుకోకూడదు. పుల్లని పండ్లు, బీట్రూట్, క్యారెట్ వంటివి శరీరంలో వేడి పెంచుతాయి. ♦ వెల్లుల్లి, మిర్చి ,టమోటా, ఉప్పుతో కూడిన చీజ్ వంటివి తినకూడదు. సలాడ్లు ఎక్కువగా తీసుకోవాలి. ముదురు రంగులో ఉన్న మాంసాహారాన్ని తీసుకోకూడదు. మధ్యాహ్నం వేళలో ఆకలి ఎక్కువ ఉన్నప్పుడు ఆహారం తీసుకోవాలి. ఎండా కాలంలో మధ్యాహ్నం ఆహారం తీసుకోకపోతే పిత్త దోషం పెరిగి ఇబ్బంది పెడుతుంది. వేడిగా ఉన్న పానీయాలు తాగకూడదు. వేసవిలో చల్లని ఐస్‌క్రీమ్‌లు తింటుంటారు. ఇవి జీర్ణక్రియను అడ్డుకుంటాయి. వీటి వల్ల జఠరాగ్నిని చల్లార్చి రోగాలను కొనితెచ్చుకోవమే అవుతుంది. -
ప్రచండ భానుడు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై సూర్యుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. ఆదివారం అనేక ప్రాంతాల్లో నిప్పులు కురిపించాడు. దీంతో గరిష్ట ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెల్సియస్ దాటిపోయాయి. మంచి ర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 47.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, రెండోస్థానంలో జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం ఎండపల్లి రాజారాంపల్లిలో 47.7 డిగ్రీలుగా నమోదైంది. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలను ప్రకటించగా, అందులో కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోనివే 12 ప్రాంతాలు ఉండడం గమనార్హం. ఇందులో జగిత్యాల జిల్లాలోని 10 ప్రాంతాలు ఉండగా, కరీంనగర్ జిల్లాలో రెండున్నాయి. జంకుతున్న జనం ఉదయం నుంచే మొదలవుతున్న వేడి గాలులు రాత్రి వరకు కొనసాగుతుండడంతో జనాలు రోడ్లపైకి రావడానికి భయపడుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. కారుల్లో ఏసీలు కూడా పనిచేయనంత వేడి నెలకొందని వాహనదారులు పేర్కొంటున్నారు. ఇళ్లల్లో కూలర్లు , ఏసీలు లేకుండా ఒక్క నిమిషం ఉండలేని పరిస్థితి నెలకొంది. ఎండలతోపాటు వేడిగాల్పులు తీవ్రం గా వీస్తుండడంతో చిన్నారులు, వృద్ధుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో మధ్యాహ్నం తగిన జాగ్రత్తలు తీసుకోకుండా రోడ్లపైకి రాకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సింగరేణిలో బేజారు సాధారణంగా జిల్లాలో నమోదయ్యే ఉష్ణోగ్రతల కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా సింగరేణి ప్రాంతంలో ఉంటాయి. రామగుండం, ఎన్టీపీసీ, గోదావరిఖని, కమాన్‌పూర్, సెంటినరీకాలనీ ప్రాంతాల్లో వేడి తీవ్రత, వడగాల్పులు అధికం. సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంంది. అయితే ఉష్ణోగ్రతల వివరాల్లో రామగుండం, గోదావరిఖని వివరాలను లెక్కించడం లేదనే విమర్శలున్నాయి. ప్రస్తుతం గోదావరిఖని, రామగుండం ప్రాంతాల్లో 48 డిగ్రీల సెంటిగ్రేడ్ దాటి నమోదవుతున్నాయని కార్మిక సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాల్సి వస్తుందని యాజమాన్యం మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్ఎస్ పౌడర్లతో సరిపెడుతుందని ఆరోపిస్తున్నారు. -
ఆవిరవుతున్న ప్రాణాలు
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఎండ తీవ్రత తో ఉపాధి హామీ కూలీలకు ప్రాణసంకటం గా మారింది. పనులకు వెళ్తున్న వారు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుతారనే గ్యారంటీ లే కుండా పోయింది. నెల రోజుల్లో ఇద్దరు కూలీలు ఎండదెబ్బకు ప్రాణాలు కోల్పోయారు. ఉష్ణాగ్రతలు 44 డిగ్రీలు దాటుతుండగా.. ఎలాంటి రక్షణ, వసతులు లేకుండా నే కూలీలు ఉపాధిహామీ పనులను చేయా ల్సి వస్తోంది. జిల్లాలో 394 గ్రామాల్లో ఉపాధిహామీ పనులు కొనసాగుతున్నాయి. మొత్తం జాబ్ కార్డులు 2,59,338 ఉండగా, ఇందులో 5,32,044 మంది కూలీలుగా నమోదై ఉన్నారు. అప్పుడప్పుడూ పనులకు వస్తున్న కూలీలతో కలిపి 2,16,819 మంది ఉన్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. అయితే పనులకు వస్తున్న వారి సంఖ్య 90 వేలు దాటడం లేదు. చాలా మంది వడదెబ్బతో అస్వస్థతకు గురవుతూ పనులకు వెళ్లడం లేదని తెలుస్తోంది. దీంతో కూలీల హాజరు శాతం తక్కువగా నమోదవుతోంది. హాజరు శాతం పెంచాలనే ఉద్దేశంతో పనులు కల్పిస్తున్న అధికారులు మండుటెండలో అవస్థలు పడుతున్న కూలీలకు మాత్రం ఎలాంటి రక్షణ కల్పించడం లేదు. తాగునీరు, టెంట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు ఉపాధి హామీ పనులు జరిగే ప్రాంతాల్లో కనిపించడం లేదు. కూలీలే వారి వెంట తాగునీటిని తెచ్చుకుంటున్నారు. 11 గంటల వరకు పనుల్లోనే.. వాస్తవానికి ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో పని వేళలను ప్రభుత్వం మార్చింది. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు పని చేయించాలని అధికారులకు సూచించింది. అయితే ఉదయం 8 గంటల నుంచే భానుడు ఉగ్ర రూపాన్ని దాల్చుతున్నాడు. 9 గంటల నుంచి 11 గంటల వరకు 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత నమోదవుతోంది. చెరువుల్లో పనులు చేయిస్తున్నందున అక్కడ అధిక ఉష్ణోగ్రతతో కూలీలు పనులు చేయలేకపోతున్నారు. ఇచ్చిన కొలతల ప్రకారం గుంతను తవ్విన తరువాతే ఇంటికి వెళ్లాలని ఫీల్డ్ అసిస్టెంట్లు చెప్పడంతో ఎండలో కూడా కూలీలు పనులు చేయాల్సి వస్తోంది. ఎండాకాలం కావడంతో నేల గట్టిగా ఉండటం కారణం చేత పని త్వరగా జరగడం లేదు. దీంతో ఒక్కో సారి మధ్యాహ్నం 12 గంటలు కూడా దాటుతోంది. పత్తాలేని టెంట్లు, మెడికల్ కిట్లు.. వేసవిలో పనిచేసే కూలీలు సేద తీరడానికి ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం టెంట్లు అందజేసింది. వీటిని గ్రూపునకు ఒకటి చొప్పున మేట్లకు అందజేశారు. కామారెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలుగా ఉన్న సమయంలో టెంట్లను అందజేశారు. అవి కూడా అందరికి సరిపడా ఇవ్వలేదు. ఒక్కో టెంటును రూ.540 చొప్పున టెండరు ద్వారా 29,129 కొనుగోలు చేశారు. ఇప్పుడా టెంట్లు కొన్ని చోట్ల కనిపిస్తున్నా, చాలా చోట్ల వాటి ఆచూకీ లేదు. వాటిని ఎప్పుడో మాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా మేట్లు పనికి వచ్చే సమయంలో వెంట తేవడం లేదని ఫీల్డ్ అసిస్టెంట్లు చెబుతున్నారు. అలాగే ఎండలో పని చేస్తున్న కూలీలు డిహైడ్రేషన్కు గురి కాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేయాల్సి ఉండగా, కొంత మేరకే సరఫరా అవుతున్నట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు తెలిపారు. ఒక్కో గ్రూపునకు రెండు, మూడు ఓఆర్ఎస్ ప్యాకెట్లు మాత్రమే ఇస్తున్నారని, ప్రస్తుతం అవి కూడా అయిపోయాయన్నారు. ప్రాథమిక చికిత్సను అందించడానికి ప్రభుత్వం గతేడాది సరఫరా చేసిన మెడికల్ కిట్లూ కనిపించడం లేదు. మందుల గడువు తేదీ ముగియడంతో వాటిని వినియోగించడం లేదు. మండల పీహెచ్‌సీల నుంచి మందులను తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఎండలో పని చేసే సమయంలో తీసుకోవాల్సి జాగ్రత్తలపై కూలీలకు డ్వామా అధికారులు అవగాహన కల్పించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. -
నిప్పులపై రాష్ట్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారింది! తెలంగాణవ్యాప్తంగా 42 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతోపాటు తీవ్ర వడగాడ్పులు వీస్తుండటంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఉదయం 8 గంటలు దాటితే చాలు ఎండ తీవ్రతకు బెంబేలెత్తుతున్నారు. కూలీలు, కార్మికులు, ఉద్యో గులు వడదెబ్బల బారినపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 20 వడగాడ్పు రోజులు నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొనగా అనధికారికంగా పలుచోట్ల 47–48 డిగ్రీలు కూడా నమోదవుతోందని ప్రైవేటు వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే వరకూ ఎండల తీవ్రత, వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాజధాని హైదరాబాద్‌లో సాధారణంగా ఇతర ప్రాంతాల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితి ఉండగా ఈసారి మాత్రం ఇప్పటివరకు 43 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రియల్ ఎస్టేట్ కోసం నగర శివార్లలో చెట్ల నరికివేత పెరగడం, చాలా వరకు చెరువులు కబ్జాకు గురికావడం, అనేక చోట్ల సిమెంటు నిర్మాణాలు జరుగుతుండటం, రేడియేషన్ పెరగడం వంటి కారణాలు ఎండల తీవ్రతకు కారణమవుతున్నాయని వాతావరణశాఖ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. వడదెబ్బతో ఆసుపత్రులపాలు... ఎంత తీవ్రమైన ఎండ ఉన్నా రోజువారీ పనులు, ఇతరత్రా కార్యకలాపాల కోసం ప్రజలు బయటకు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకోసం ఎక్కువ మంది ప్రజలు ద్విచక్ర వాహనాలు, బస్సులు, ఆటోలను ఆశ్రయిస్తుంటారు. ఉపాధి కూలీలు ఎండలు దంచికొడుతున్నా పని మానే పరిస్థితి ఉండదు. దీంతో వేలాది మంది ప్రజలు వడదెబ్బకు గురవుతున్నారు. తీవ్రమైన జ్వరం, వాంతులు, విరేచనాలకు గురవుతున్నారు. ఆహారం, తాగునీరు కలుషితమైతే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. ఇలా అనేక ఆసుపత్రులకు వడదెబ్బ బాధితులు క్యూ కడుతున్నారు. వడదెబ్బ కారణంగా రాష్ట్రంలో దాదాపు వంద మంది మరణించినట్లు చెబుతున్నా ఇంకా కలెక్టర్ల నుంచి తమకు నివేదిక రాలేదని విపత్తు నిర్వహణశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అటకెక్కిన వేసవి ప్రణాళిక... వేసవిలో ఎండల తీవ్రత నుంచి రక్షణ కల్పించేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. కానీ అవేవీ పూర్తిస్థాయిలో పనిచేయడం లేదన్న విమర్శలున్నాయి. జిల్లా స్థాయిలో కలెక్టర్ వేసవి ప్రణాళిక అమలుకు నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సంబంధిత కమిషనర్లు నోడల్ ఆఫీసర్లుగా ఉంటారు. మార్చి నుంచి జూన్ వరకు కీలకమైన వేసవి సీజన్లో ప్రణాళిక అమలు చేస్తారు. తీవ్రమైన వడగాడ్పులు, ఎండలుండే హైరిస్క్ ప్రాంతాలను ఈ కమిటీలు గుర్తించాలి. తద్వారా వడదెబ్బ ద్వారా కలిగే అనారోగ్య సమస్యలను నివారించాలి. ఆరోగ్య కార్యకర్తలకు, స్థానిక ప్రజలకు వడదెబ్బ నివారణపై శిక్షణ ఇవ్వాలి. ఆస్పత్రులు, వృత్తి సంఘాలకు స్థానిక భాషలో కరపత్రాలు ముద్రించి ఇవ్వాలి. వాతావరణ కేంద్రం ద్వారా ఎప్పటికప్పుడు జిల్లాలవారీగా ఎండల తీవ్రతపై హెచ్చరికలు జారీ చేయాలి. సినిమా హాళ్లలో స్లైడ్లను ప్రదర్శించాలి. వైద్య విధాన పరిషత్, వైద్యవిద్య సంచాలకుల ఆధ్వర్యంలో సంబంధిత ఆస్పత్రుల్లో వడదెబ్బ బాధితులకు ప్రత్యేక పడకలు ఏర్పాటు చేయాలి. కానీ ఒకట్రెండు జిల్లాలు, ప్రాంతాలు మినహా ఎక్కడా వేసవి ప్రణాళిక అమలుపై యంత్రాంగం దృష్టి పెట్టడంలేదన్న విమర్శలున్నాయి. ఉపాధి హామీ కూలీలకు పనిచేసే చోట టెంట్లు ఏర్పాటు చేయాలి. నీటి వసతి కల్పించాలి. కానీ అవి కొన్నిచోట్ల మినహా అమలు కావడంలేదు. బస్టాండ్లలో ప్రయాణికుల కోసం తాగునీటి వసతి కల్పించాలి. కరపత్రాలు పంచాలి. సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో చల్లని తాగునీరు, ఐస్ ప్యాక్‌లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి. ఈ మేరకు ఆర్టీసీ చర్యలు తీసుకోవాలి. కానీ ఇవి కాగితాలకే పరిమితమయ్యాయి. నేడు వడగాడ్పులు, కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు... దక్షిణ అంతర కర్ణాటక, దాన్ని ఆనుకొని ఉన్న రాయలసీమలో 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్ నుంచి దక్షిణ అంతర కర్ణాటక వరకు దక్షిణ ఛత్తీస్‌గఢ్, తెలంగాణ మీదుగా 0.9 కిలోమీటర్ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడింది. అలాగే ఉత్తర అంతర కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఫలితంగా తెలంగాణలో మంగళవారం అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. బుధవారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల (గంటకు 30–40 కి.మీ. వేగం)తోపాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. -
‘అబ్బ! ఏమి ఎండలు...!’
ఎక్కడ చూసినా ఒకటే మాట. ‘అబ్బ! ఏమి ఎండలు...! ఇన్నాళ్ల జీవితంలో ఇంత ఎండలు ఎంత అరుదుగా చూశామో! ఇప్పుడే ఇలా ఉంటే, ఇక రోహిణి కార్తె వచ్చేసరికి బతకగలమా అని భయంగా ఉంది. రావి శాస్త్రి గారు దాదాపు 70 ఏళ్ల క్రితం ఒక చిన్న నాటకం రచించి, ఆనాటి ‘భారతి’ పత్రికలో వేయించారు. చరిత్రలో వివిధ కాలాలలో జరిగిన అయిదారు చారిత్రాత్మకమైన ఘట్టాలను నేపథ్యంగా తీసుకొని, ‘అయ్యో! ఇంతటి ఘోరకలి ఇంతకు మునుపెన్నడైనా చూశామా! ఇక రేపో మాపో ప్రళయం తప్పదు, ఈ లోకం పని అయిపోయినట్టే!’ అని ఎప్పటికప్పుడు, ఏ కాలానికి ఆ కాలంలో లోకులు ఎలా భయాందోళనలు చెందుతుంటారో ఆ నాటకంలో ఎత్తి చూపుతారు. రామాయణ కాలమైనా, మహా భారత యుద్ధం నాడయినా, చంద్రగుప్తుడి సమయంలోనైనా, జవహర్లాల్ నెహ్రూ జమానాలో అయినా, వర్తమాన అనుభవాలలో ఒక తాజాతనం, ఘాటూ, వాడీ ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాలనో, మానవ స్వభావాల ఉచ్చనీచాల అంచులనో చవి చూసినప్పుడు, ఆ తీవ్రత అప్పటికప్పుడు ‘నభూతో, న భవిష్యతి’ అనిపిస్తుంది. జ్ఞాపకాలు జీవితానుభవాల ఛాయా చిత్రాల లాంటివి. ఈనాటి ఛాయా చిత్రం వెలుగూ మెరుపూ ఏడాది తిరిగేసరికి మారిపోతుంది. ఏ పాతికేళ్ల తరవాతో చూస్తే ఏవేవో కొత్త అందాలు కనిపించి, కొత్త ఆనందాన్నిస్తాయి. అందుకే, ముగిసి పోయిన తరువాత ఎంతటి దుఃఖానుభవమైనా, యధార్థంగా దాన్ని అనుభవిస్తున్నప్పుడు కలిగించిన వేదనను కలిగించదు. వెనక్కు తిరిగి, అయిపోయిన జీవితాన్ని అనుభవించిన దైన్యాన్నీ, మానావమానాలనూ, కష్టనష్టాలనూ నెమరు వేసుకుంటే, ‘మనోబలంతో ఎంతటి కష్టాలు ఎదుర్కొని బయటపడ్డాను!’ అన్న భావన అసలే చల్లబడిన ఆ పాత అనుభవాలకు, గంధపు పూత వేసి, ‘ఆ రోజులు మళ్లీ రావు!’ అనే సుఖకరమైన భావాన్ని కూడా కలిగిస్తుంది. అబ్బ! ఏమి ఎండలు! ఇంత రాత్రయినా, చల్లదనమన్నమాట లేదు. దోసె పోస్తుంటే ఆవిర్లు వచ్చినట్టు, ఒకటే వేడిగాడ్పులు! అదుగో, ఎండకి ఫెటిల్లుమని పగిలి బూరుగ కాయలు ఎలా దూది చిమ్ముతున్నాయో, ఎండ వేడికి ఈ లోకం అంతా బూడిదైపోయి, ఆ బూడిదే గాలిలో ఎగురుతున్నట్టుగా! ఈసారి ఎండలతో ఈ సృష్టి పనై పోయింది. కావాలంటే, ఆ దున్నపోతుల మీదా, పందుల మీదా, ఏనుగుల మీదా అట్టలు కట్టిన బురద చూడండి. అదేమనుకొంటున్నారు? బ్రహ్మదేవుడు మళ్లీ సృష్టికి తయారీలు చేసుకొంటూ, ఈ ‘అచ్చు’లన్నీ పోసుకొని అట్టిపెట్టుకొంటున్నాడు...’ ఈ ఎండలు కృష్టదేవరాయల కాలం నాటివి. ఇవి ఆయన వర్ణనలు. అప్పటి ఎండలు అలా అనిపించాయి! వాటిని ఇప్పటి ఎండలతో పోలిస్తే...! – ఎం. మారుతి శాస్త్రి -
వడదెబ్బతో ప్రభుత్వ ఉద్యోగి మృతి
-
కరువు ఛాయలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జలం పాతాళానికి పడిపోతోంది. జిల్లా అంతటా భూగర్భ జలాలు రోజురోజుకు పడిపోతుండడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. దశాబ్ద కాలంగా పరిశీలిస్తే.. ఈ ఏడాది నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. ఇది కరువుకు సంకేతమని చెప్పవచ్చు. ఒక్క ఏడాది కాలంలోనే సుమారు 4 మీటర్ల లోతుకు నీటిమట్టం తగ్గిపోయింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉండటంతోపాటు పెద్దఎత్తున భూగర్భ జలాలను వినియోగిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణమని భూగర్భ జల శాఖ అధికారులు వివరిస్తున్నారు. గతేడాదితో పోల్చితే ఫరూఖ్‌నగర్ మండలంలో అదనంగా 13.08 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయింది. గతేడాది ఏప్రిల్ ఈ మండలంలో 28.70 మీటర్ల లోతులో నీటి జాడ ఉండగా.. ప్రస్తుతం ఇది 41.78 మీటర్ల కిందకు చేరింది. ఆ తర్వాత స్థానంలో చేవెళ్ల మండలం ఉంది. ఇక్కడ ఏడాది కాలంలో అదనంగా 8.45 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయింది. ఆందోళనకరంగా.. ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరు నాటికి జిల్లా సాధారణ వర్షపాతం 666 మిల్లీ మీటర్లు కాగా.. ఇప్పటివరకు 475 మి.మీ వర్షపాతమే కురిసింది. అంటే 28.7 శాతం లోటు వర్షపాతం నమోదైందన్నమాట. భూగర్భ జలాలు పెరగడానికి ప్రధాన వనరు వర్షమే. అయితే గతేడాది కనీసం సాధారణ స్థాయిలో కూడా వర్షాలు కురవలేదు. రోజువారీ అవసరాలు, పంటల కోసం విస్తృతంగా బోర్లపైనే జిల్లా వాసులు ఆధారపడ్డారు. ఎటువంటి రిజర్వాయర్లు, ఆనకట్టలు లేకపోవడంతో పంటల సాగుకు బోరు బావులే ఆయువుగా మారాయి. ఇలా అన్ని వైపుల నుంచి భూగర్భ జలాలపై భారం పడుతుండడం.. ఆ స్థాయిలో భూమిలోకి నీరు ఇంకే పరిస్థితులు లేకపోవడంతో భూగర్భ నీటిమట్టం పాతాళానికి చేరుకుంటోంది. జిల్లాలో 27 మండలాలు ఉండగా.. చౌదరిగూడం మండలంలో మాత్రమే సాధారణ స్థాయిలో వానలు కురిశాయి. మిగిలిన 26 మండలాల్లో లోటు వర్షపాతం నమోదు కావడంతో కరువు ఛాయలు అలుముకున్నాయి. డేంజర్ జోన్లోకి.. భూగర్భ జలాలు విచ్చలవిడిగా వాడే గ్రామాలు నాలుగైదేళ్ల కిందట వందలాదిగా ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య మరింత పెరగనుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భూగర్భ జల శాఖ ప్రతి మూడేళ్లకోసారి వంద శాతం కన్నా మించి భూగర్భ జలాలను వినియోగించే (ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్ విలేజెస్) గ్రామాల జాబితాను రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తుంది. దీని ఆధారంగా ఆయా గ్రామాల్లో భూగర్భ జలం పెంపుదలకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వం వివిధ శాఖలకు దిశానిర్దేశం చేస్తుంది. చివరిసారిగా తయారు చేసిన 2012–13 సంవత్సరం జాబితా ప్రకారం.. జిల్లాలో 171 గ్రామాలు డేంజర్ జోన్లో ఉన్నాయి. ఈ గ్రామాల్లో అవసరానికి మించి నీటి వినియోగం జరిగింది. 2016–17 సంవత్సరం వివరాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. దీన్ని ప్రకారం భూగర్భ జలాన్ని వినియోగించే గ్రామాల సంఖ్య గతం కంటే పెరిగే ప్రమాదం ఉందని భూగర్భజల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ సంఖ్య 200కు చేరవచ్చని చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మంచాల, కొత్తూరు, అబ్దుల్లాపూర్‌మెట్, శంకర్పల్లి, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, చేవెళ్ల, నందిగామ, హయత్‌నగర్, కడ్తాల్, యాచారం, కందుకూరు మండలాల్లో భూగర్భ జలాల వినియోగం అత్యంత ఎక్కువగా ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీని వల్ల భవిష్యత్తులో అనేక అనర్థాలు తలెత్తే ప్రమాదం ఉంది. అధికారుల పరిశీలనలో వెలుగుచూసిన అంశాలు జిల్లాలో వివిధ ప్రాంతాల్లోని 40 బోరుబావుల్లో నీటిమట్టాన్ని జిల్లా భూగర్భశాఖ అధికారులు ఏడాది పాటు పరిశీలించగా విస్తుపోయే ఫలితాలు వచ్చాయి. ఈ బావుల్లో గతేడాది ఏప్రిల్ నెలలో సగటున 14.86 మీటర్ల లోతులో నీళ్లు ఉండగా.. ఈ ఏడాది జనవరి వచ్చేసరికి నీటిమట్టం 18.73 మీటర్ల లోతుకు పడిపోయింది. అంటే ఏడాదికాలంలోనే 3.87 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. పరిశీలించిన 40 బావుల్లో.. నాలుగింటిలో మాత్రమే నీటిమట్టం పెరిగింది. బాలాపూర్ మండలం నాదర్గుల్లో గరిష్టంగా 3.28 మీటర్లపైకి నీటిమట్టం చేరుకుంది. మిగిలిన 36 బావుల్లో నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. గరిష్టంగా మొయినాబాద్‌లో 14.59 లోతుకు దిగజారింది. 8 మండలాల్లో 20మీటర్ల లోతుకుపైగా, మరో 8 మండలాల్లో 15 నుంచి 20 మీటర్ల లోతులో, 8 మండలాల్లో 10 నుంచి 15 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. చేతులెత్తేసిన ఆయా విభాగాలు పలు శాఖల మధ్య కొరవడిన సమన్వయం వల్ల భూగర్భ జల మట్టం పెరగడం లేదు. అత్యధికంగా భూగర్భ జలాలను వినియోగిస్తున్న గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టాల్సిన ప్రభుత్వ విభాగాలు చేతులెత్తేశాయి. ఆయా ఊళ్లలో బోరు బావుల తవ్వకాలను కట్టడిచేయడం, తక్కువ నీరుతో పండే పంటలను ప్రోత్సహించడం, వాల్టా చట్టం పక్కాగా అమలయ్యేలా చూడడం లాంటి చర్యలు తీసుకోవాలి. భూగర్భ జల శాఖ సూచనలతో అటు వ్యవ సాయ శాఖ, ఇటు గ్రామీణాభివృద్ధి శాఖ పనిచేస్తే కరవును అరికట్టే వీలుంది. సేద్యపు కుంటలు తవ్వుకోవడంలో చాలా మంది రైతులు అలసత్వం వహిస్తున్నారు. నీటి సంరక్షణ చేపట్టే రైతులకే వ్యవసాయ శాఖ వివిధ రాయితీలు ఇవ్వడంలో ప్రాధాన్యం ఇస్తే పరిస్థితి కొంత వరకు మెరుగుపడే అవకాశం ఉంది. ప్రజల్లో భూగర్భ జల సంరక్షణపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. -
45 డిగ్రీలు
ఇందూరు (నిజామాబాద్ అర్బన్): ఉన్నట్టుండి భానుడు ఇందూరుపై ఒక్కసారిగా నిప్పులు కక్కాడు. మూడు రోజుల కిందట 40 డిగ్రీలున్న ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతూ శుక్రవారం ఏకంగా 45 డిగ్రీలకు చేరువైంది. ఈ వేసవి సీజన్లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. భానుడి భగభగలతో ఇందూరు నిప్పుల కొలిమిలా మారింది. ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. ఇటు ముఖం మాడిపోయేలా భయంకరమైన వడ గాల్పులు దడ పుట్టించాయి. బయటకు వెళ్లాలంటే జనం జంకిపోయారు. ఉదయం 9 గంటలకే 34 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతోంది. 44 డిగ్రీలు దాటి ఎండలు దంచి కొట్టడంతో సాయంత్రం ఏడు దాటినా భూమి నుంచి వేడి సెగలు తగ్గడం లేదు. సాయంత్రం ఐదు గంటలకే 41 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటోంది. సీసీ రోడ్లు ఉన్న ప్రాంతాల్లో వేడి ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఇక బీటీ రోడ్లు, రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇంట్లో సీలింగ్ ఫ్యాన్లు ఏ మాత్రం పని చేయడం లేదు. వాటిని వినియోగించినా వేడి గాలి రావడంతో జనాలు కూలర్లను కొనుగోలు చేస్తున్నారు. ఎండల భయానికి ఇంటికే పరిమితమై ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. అత్యవసర ప్రయాణం చేసేవాళ్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు ముఖాలకు మాస్క్‌లు, తలకు క్యాప్‌లు వినియోగిస్తున్నారు. బయట పనులు చేసుకునే వారు ఉదయం 10 గంటల కల్లా పూర్తిచేసుకుని ఇళ్లకు చేసుకుంటున్నారు. మళ్లీ సాయంత్రం ఐదు దాటిన తరువాతే గడప దాటుతున్నారు. శీతల పానీ జ్యూస్‌లకు డిమాండ్ పెరిగింది. ప్రభుత్వ కార్యాలయాల్లో కూలర్లు ఏర్పాటు చేస్తున్నారు. కంప్యూటర్లు కూడా ఏసీలు, కూలర్లు పెడితే కానీ పని చేయడం చేదు. రెండేళ్ల తరువాత మళ్లీ ఇప్పుడే... 2016 ఏప్రిల్ 30న 45.1 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు కాగా మళ్లీ ఇప్పుడు అదే స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది.సిసలైన ఎండాకాలానికి ఏప్రిల్, మే నెలలకు పెట్టింది పేరు. రానున్న మే నెలలో ఎండల ఎంతగా తీవ్రంగా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం 45 డిగ్రీలు నమోదవుతున్న ఉష్ణోగ్రతలు రానున్న రెండుమూడు రోజుల్లో 46 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎండలు ఇంకా పెరిగే అవకాశముంది.. ఏప్రిల్ నెలలోనే 45 డిగ్రీల ఎండలు నమోదవుతున్నాయి. వచ్చే మే నెలలో 46 డిగ్రీలు దాటినా ఆశ్చర్యం లేదు. వచ్చే రెండు రోజుల్లో ఎండలు తీవ్రంగా ఉండనున్నాయి. అల్పపీడనాలు వస్తే తప్ప భానుడి భగభగల నుంచి ఉపశమనం లభించదు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటితే వాతావరణ శాఖ డేంజర్‌గా పరిగణిస్తుంది. -
45.4 డిగ్రీలు
ఆదిలాబాద్‌కల్చరల్: భానుడి ఉగ్రరూపంలో జిల్లా నిప్పుల కొలిమిగా మారింది. వారం రోజులుగా రాష్ట్రంలో ఈదురుగాలులు, అకాల వర్షాలు, చిరుజల్లులతో కూడిన వాతావరణం ఉన్నప్పటికీ జిల్లాలో భిన్నమైన వాతావరణం నెలకొంది. క్రమంగా పెరుగుతూ వస్తున్న ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడంతో గురువారం ఒక్కసారిగా ఉష్ణోగ్రత 44.3 డిగ్రీలకు చేరుకుంది. శుక్రవారం సైతం 45.4 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదైంది. సూర్యోదయం నుంచే ఎండవేడిమి మొదలవుతోంది. దీంతో ఉదయం 10 గంటల తర్వాత బయట అడుగు పెట్టాలంటే జంకుతున్నారు. మధ్యాహ్నం ఇక చెప్పనవసరం లేదు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. దీనికితోడు భరించలేని ఉక్కపోత, వడగాలులు వీస్తుండటంతో జనం బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. ఏప్రిల్‌లోనే ఇంత వేడిమి ఉంటే మే నెలలో ఇంక ఎలా ఉంటుం దోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రోజురోజుకు వడగాలుల తీవ్రత ఎక్కువయ్యే అవకాశమున్నందున ఎండలో తిరిగేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జనం ఉక్కిరిబిక్కిరి క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత వారం పదిరోజులు నుంచి ఎండలు హడలెత్తిస్తున్నాయి. ఎండలకు తోడు వేడిగాలులు వీస్తున్నాయి. శుక్రవారం గరిష్ట ఉష్ణోగ్రత 45.4 డిగ్రీలు నమోదైంది. ఉదయం 10 గంటలు దాటిందంటే భానుడు ఉగ్రరూపం దాల్చి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సాయంత్రం 6 గంటలు దాటినా వేడి తగ్గడం లేదు. రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశాలున్నాయని వాతావరణశాఖ నిపుణులు పేర్కొంటున్నారు. ఈసారి ఏప్రిల్‌లోనే ఉష్ణోగ్రతలు 45.4 డిగ్రీలు దాటే అవకాశముంమదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాగా ఆదిలాబాద్‌లో భిన్న వాతావరణం నెలకొంటుంది. ఈసారి వర్షాలు మోస్తరుగా కురిసినా చలి తీవ్రత ఎక్కువగా నమోదైంది. జిల్లాలోని భీంపూర్ మండలం అర్లి టి గ్రామంలో అత్యల్ప స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీలకు పడిపోయింది. ఇది రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగత్రగా నమోదైంది. ఎండలు కూడా తీవ్రంగా మండిపోతున్నాయి. భానుడి భగభగతో జిల్లా నిప్పుల కుంపటిగా మారింది. భూమి వేడి సెగలు కక్కుతోంది. వేడి గాలులు ధడ పుట్టిస్తున్నాయి. కాగా శుక్రవారం జిల్లాలో రికార్డుస్థాయిలో 45.4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. గత వారం రోజులుగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో ఎండలో పనిచేసేవారు. పనిమీద బయట తిరిగేవారు, వృద్ధులు, పిల్లలు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం లేకపోలేదు. వడదెబ్బకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండలో ఎక్కువ సేపు పనిచేయకూడదు. ఒకవేళ అత్యవసరమైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. బయటకు వెళ్లేటప్పుడు నెత్తిన టోపితోపాటుగా ముఖానికి వస్త్రం చుట్టుకోవడం మేలంటున్నారు. గొడుగు వెంట తీసుకెళ్లడంతోపాటు తరచుగా గ్లూకోజ్, ఎలక్ట్రాల్ ఓఆర్ఎస్ పౌడర్‌ను నీటిలో కలిపి తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ కాకుండా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. -
28, 29 తేదీల్లో జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నిప్పుల కుంపటిలోకి వెళ్లిపోయింది. ఉత్తర భారతం నుంచి పొడిగాలులు వీస్తుండటంతో తెలంగాణలో వడగాడ్పులు వీస్తున్నాయి. మరోవైపు గ్రేటర్‌ను కూడా మండుటెండలు ఠారెత్తిస్తున్నాయి. ఈనెల 28, 29 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వడగాడ్పులు తీవ్రంగా వీచే ప్రమాదం పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ‘గ్రేటర్’ నగరంపైనా వడగాల్పులు పంజా విసురుతాయని స్పష్టం చేసింది. పగటి వేళల్లో వీచే వేడి గాలులు తీవ్ర స్థాయిలో ఉంటాయని ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర దిశ నుంచి వీస్తున్న పొడిగాలుల కారణంగా గాలిలో తేమ 43 శాతం కంటే తగ్గడంతో వడగాడ్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయని పేర్కొంది. ఇదిలా ఉండగా, శుక్రవారం నగరంలో 41 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదవడంతో మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లిన వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతలు ఒకట్రెండు డిగ్రీలు పెరిగే అవకాశాలున్నాయని తెలిపింది. వడగాడ్పులు, అధిక ఎండల నేపథ్యంలో పగటి వేళ ఇంటి నుంచి బయటికి వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. పగటి వేళల్లో వృద్ధులు, రోగులు, చిన్నారులు అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటికి రావాలని పేర్కొంది. కాగా ఇటీవల హైదరాబాద్ గాలిలో తేమ శాతం 50 శాతానికి పైగా నమోదైందని, అందుకే మధ్యాహ్నం గాలుల్లో వేడి తీవ్రత అంతగా లేదని వాతావరణ శాఖ శాస్త్రవేత్త రాజారావు ‘సాక్షి’కి తెలిపారు. కానీ వచ్చే ఆది, సోమవారాల్లో వేడిగాలులు తీవ్రంగా వీచే అవకాశాలున్న నేపథ్యంలో అప్రమత్తం ఉండాలని సూచించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ.. చిన్నారుల విషయంలో..: పిల్లలు ఎక్కువసేపు ఎండలో ఆడకుండా చూడాలి. ఎండలో తిరిగితే వడదెబ్బబారిన పడే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు ఉదయం 10 గంటల లోపు, సాయంత్రం 5 గంటల తర్వాతే బయటకు అనుమతించాలి. సాధ్యమైనంత ఎక్కువ నీరు తాగించాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారంతో పాటు పండ్ల రసాలు ఎక్కువగా ఇవ్వాలి. ఉక్కపోతకు శరీరంపై చెమటపొక్కులు వచ్చే అవకాశం ఉంది. వీటిని గిల్లితే ఇన్ఫెక్షన్కు గురయ్యే ప్రమాదం ఉంది. జీన్స్ కాకుండా తేలికైన తెల్లని వస్త్రాలు ధరించడం ద్వారా శరీరానికి గాలి సోకుతుంది. రోజు రెండుసార్లు చన్నీటితో స్నానం చేయించాలి. వేసవిలో పిల్లలకు చికెన్‌ఫాక్స్ వచ్చే అవకాశం ఎక్కువ. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. దీనిపట్ల జాగ్రత్తగా ఉండాలి. మంచినీరు తాగాలి... నగరంలో చాలామంది ప్రతిరోజు టూవీలర్‌పై ప్రయాణిస్తుంటారు. దీంతో అతినీలలోహిత కిరణాలు నేరుగా ముఖానికి తగలడం వల్ల ముఖం, చేతులు నల్లగా వాడిపోయే ప్రమాదం ఉంది. చలివేంద్రాలు, హోటళ్లలో కలుషిత నీరు తాగితే వాంతులు, విరేచనాల బారినపడాల్సి వస్తుంది. శరీరానికి వేడిమినిచ్చే నల్లని దుస్తులు కాకుండా తేలికైన తెల్లని కాటన్ దుస్తులు ధరించడం, తలకు టోపీ పెట్టుకోవడం ఉత్తమం. సొమ్మసిల్లితే... వడదెబ్బ కొట్టి పడిపోయిన వారిని వెంటనే నీడ ప్రదేశానికి తీసుకెళ్లి నీటితో ముఖం శుభ్రం చేయాలి. నిమ్మకాయ, ఉప్పు కలిపిన నీళ్లు లేదా కొబ్బరి బొండం తాగించాలి. అత్యవసరమైతే ఆస్పత్రికి తరలించాలి. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, మంచినీళ్లు, తలకు టోపీ ధరించాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, రాగి జావ తదితర తీసుకోవడం మంచిది. వీధి కుక్కలతో జాగ్రత్త... ఎండ ప్రభావం వీధి కుక్కలపై ఎక్కువగా ఉంటుంది. సరిపడా ఆహారం లభించకపోతే కుక్కల మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతాయి. అందుకే అవి పిచ్చిగా ప్రవర్తిస్తుంటాయి. వేగంగా వచ్చిపోయే వాహనదారులు, వీధుల్లో ఆడుకుంటున్న చిన్నారులు, వృద్ధులపై దాడికి పాల్పడతాయి. ఇతర సీజన్లతో పోలిస్తే వేసవిలో కుక్కకాటు కేసులు ఎక్కువ నమోదు అవుతుండటానికి ఇదే కారణమిదే. కుక్కకాటుకు గురైనప్పుడు కట్టు కట్టకుండా నీటితో శుభ్రం చేయాలి. ఆ తర్వాత యాంటీ రేబీస్ ఇంజక్షన్ వేయించుకోవాలి. నిజామాబాద్‌లో అత్యధికంగా 45 డిగ్రీలు... ఈ సీజన్లోనే అత్యధికంగా శుక్రవారం నిజామాబాద్‌లో ఏకంగా 45 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండం, ఆదిలాబాద్‌లలో 44 డిగ్రీల రికార్డు అయింది. మహబూబ్‌నగర్‌లో 43 డిగ్రీలు, భద్రాచలం, హన్మకొండ, ఖమ్మంలో 42 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొనసాగుతున్న వాయుగుండం.. హిందూ మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది మచిలీపట్నంకు దక్షిణ ఆగ్నేయ దిశగా 1,720 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. రాగల 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా.. ఆ తరువాత 12 గంటలకు తుపానుగా మారే అవకాశం ఉందని ప్రకటించింది. ఏప్రిల్ 30 తేదీ సాయంత్రానికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్ర తీరాల దగ్గరకు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. -
‘ఉపాధి’కి ఎండదెబ్బ
సాక్షి, వరంగల్ రూరల్: పల్లెల నుంచి పట్నాలకు వలసలను నివారించేందుకు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. పథకం మాట అట్లుంచితే కూలీలకు కనీస వసతులు లేక అల్లాడుతున్నారు. మహబూబ్‌నగర్ ఘటనలో మట్టి దిబ్బ కూలి పది మంది మహిళా కూలీలు మృత్యువాత పడినా అధికారులు నిర్లక్ష్యం వీడకపోవడం గమనార్హం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఉపాధి కూలీలకు రక్షణ లేకుండా పోయింది. ప్రాణాలు అరచేతిలో పట్టి పనులు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఉపాధిహామీ చట్టంలో పని ప్రదేశంలో నీడ, మంచినీరు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఉంచాలని రాజీలేని అంశాలుగా చేర్చారు. నీటి వసతి నీడ, ప్రథమచికిత్స ఏర్పాటుచేయకపోవడంవల్ల కూలీలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రతి పల్లెలోనూ వ్యవసాయ పనులు ముగయడంతో ఎక్కువగా ఉపాధి హామి పనులకు వెళుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 7,31,280 జాబ్ కార్డులుండగా 16,67,339 మంది కూలీలున్నారు. వేసవిలో ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు పనులు చేయాలని నిబంధన ఉంది. భానుడు భగ్గున మండి పోతుండడంతో జిల్లా వ్యాప్తంగా ఉదయం 10 గంటల వరకే కూలీలు వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. కాని కొన్ని గ్రామాల్లో మధ్యాహ్నం వరకు పనులు చేస్తున్నారు. మండుటెండలో గ్రామీణ ఉపాధి హామీ కూలీలు పనులు చేయాల్సిన పరిస్థితి ఉంది. కనిపించని ఫస్ట్ ఎయిడ్ కిట్లు దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉపాధి హామీ పథకంలో నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మూడేళ్ల క్రితం ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందించారు. అవి కొందరు మెట్ల దగ్గరనే ఉండి పోయాయి. కూలీలు పని చేసే ప్రదేశంలో అనుకోని ప్రమాదం జరిగితే.. ప్రాథమికంగా చికిత్స చేసేందుకు మెడికల్ కిట్లు తప్పని సరి. ఇందు కోసం సీనియర్ మేట్లకు శిక్షణ కూడా ఇచ్చారు. కానీ జిల్లాలో ఎక్కడా కూడా మెడికల్ కిట్లు కనిపించడం లేదు. కాలుపై గడ్డపార పడినా.. క్రిమికీటకాలు కరిచినా.. వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఒక్కో సారి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఎదురవుతుంది. ప్రస్తుతం 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా.. ఈజీఎస్ అధికారులు దీనిపై దృష్టి సారించడం లేదు. ముందస్తు చర్యల్లో భాగంగా కూలీలు డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా టెంట్లు ఏర్పాటు చే యాలి. జాడ లేని టార్పాలిన్ షీట్లు.. రెండేళ్ల కిందట వేసవిలో కూలీలకు రక్షణగా ఉండేందుకు టార్పాలిన్ కవర్లను పంపిణీ చేశారు. ఆయా గ్రామాల్లోని సీనియర్ మేట్లకు టార్పాలిన్ కవర్లను అప్పగిస్తూ పని ప్రదేశంలో వాటిని వేసే బాధ్యతను అప్పగించారు. గ్రూపులోని ప్రతి ఒక్కరూ రూ.100 కూలీ పని చేస్తే, మేట్‌కు ఒక్కో వ్యక్తి నుంచి రూ.3 వేతనం వస్తుంది. ఈ డబ్బులను నేరుగా మేట్ ఖాతాలో జమ చేస్తారు. ప్రతి పనికి డబ్బులు ఇస్తున్నప్పటికీ, అనుకున్న మేర ‘ఉపాధి’ లక్ష్యం నెరవేరడం లేదు. ఇదిలా ఉంటే టార్పాలిన్ కవర్లు ఎక్కడా కనిపించడం లేదు. గతంలో ఉన్న కొంత మంది మేట్లను తొలగించడంతో టార్పాలిన్ కవర్లు వారి వద్దనే ఉన్నట్లు తెలిసింది. అధికారుల లెక్కల ప్రకారం పని ప్రదేశంలో టెంట్లు ఉన్నట్లు భావిస్తున్నా కనిపించిన దాఖలాలు లేవు. కూలీలు భోజనం చేసేందుకు, సేద తీరేందుకు నిలవ నీడ లేకపోవడంతో చెట్ల నీడకు వెళ్లాల్సి వస్తోంది. చెట్లు దుర ప్రాంతాల్లో ఉంటే అంత దూరం ఏం వెళ్లుతామని ఎండలోనే భోజనాలు, సేద తీరుతున్నారు. తాగు నీటి సౌకర్యం లేకపోవడంతో దాహంతో తండ్లాడాల్సిన పరిస్థితి ఉంది. పనుల వద్ద నీడ కల్పించాలి ఎండలు బాగా కొడుతున్నాయి. పనులు చేసే కాడా సేదా తీరేందుకు టెంట్లు వేస్తే బాగుండు. నీడకోసం కట్ట వెంబడి ఉన్న తాటి మట్టలతో నీడ ఏర్పాటు చేసుకున్నాం. ఎదైన దెబ్బతగిలితే ఇబ్బంది పడుడే. మందులు అందుబాటులో ఉంచాలి. కనీసం పని ప్రదేశంలో గ్లూకోజ్ ప్యాకెట్లు లేవు. అధికారులు అర్హత కలిగిన గ్రుపులకు టెంట్లు పంపిణీ చేయాలి.– పెరుమాండ్ల వసంత, ఉపాధి కూలి, శనిగరం ఎండలోనే ఉండాల్సి వస్తోంది.. బయట కూలి పనులు లేకపోవడంతో ఉపాధి పనులకు వస్తున్నాం. వ్యవసాయం పనులు లేకపోవడంతో ఈ కూలి పనుల ద్వారా వచ్చే డబ్బులతో ఎంతో లబ్ధి చేకురుతుంది. కానీ పనుల దగ్గర సేద తీరేందుకు నీడ లేదు భోజనం ఎండలోనే చేస్తున్నాం. మేం తీసుకువచ్చిన నీళ్లు ఎండకు వేడి అవుతున్నాయి. నీడ కోసం ఏమైనా ఏర్పాట్లు చేయాలి. – అన్నెపు సాంబలక్ష్మి, రాయపర్తి ఉపాధి పనులే దిక్కు.. ఈ ఏడాది వ్యవసాయ పనులు అంతగా లేవు. రోజు పనిచేస్తేనే పూట గడిచేది. కుటుంబంతో బతుకు దెరువు కోసం వలస వెళుదామనుకున్నాం. వారం రోజుల క్రితం శనిగరం మైసమ్మ చెరువులో ఉపాధి పనులు చేపట్టారు. పనులు చేపట్టిన రోజు నుంచి నా భార్యతో కలిసి పనికి పోతున్న. ఈ పనులే లేకపోతే వలస వెళ్లేవాళ్లం. పనులు లేక బతుకు దెరువులేని మాలాంటి కుటుంబాలకు ఉపాధి పనులే దిక్కుగా మారాయి. – మాట్ల రమ సూరయ్య దంపతులు, ఉపాధి కూలీలు, నల్లబెల్లి -
ఈసారి ఎండలు భగభగలే!
-
ఈసారి భగభగలే!
సాక్షి, హైదరాబాద్: సీజన్ ప్రకారం మార్చి ఒకటో తేదీ (శుక్రవారం) నుంచి వేసవి ప్రారంభమైంది. జూన్ ఒకటో తేదీ వరకు ఎండాకాలం కొనసాగనుంది. కానీ పదిరోజుల కింది నుంచే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈసారి ఏప్రిల్, మే నెలల్లో భానుడి ప్రతాపం ఎలా ఉంటుందో ఊహించుకునేందుకే భయమేస్తోంది. రానున్న రోజుల్లో రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి తెలంగాణపైకి వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతోపాటుగా దేశంలో వడగాడ్పులు అధికంగా వచ్చే డేంజర్ జోన్లో తెలంగాణ ఉండటంతో ఈసారి ఇక్కడ భానుడి భగభగలు తప్పవని స్పష్టమైంది. రాష్ట్రంలో కొన్నిచోట్ల 47 నుంచి 49 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గతేడాది కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఆదిలాబాద్, భద్రాచలం వంటి చోట్లనైతే 48–49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. హైదరాబాద్‌లో 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశముంది. ఈ మార్పులు, సూచనలతో ప్రభు త్వం కూడా వేసవి కార్యాచరణ ప్రణాళికను తక్షణమే అమలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. మూడు నెలల్లో 20 రోజులపాటు వడగాడ్పులే వేసవిలో ఏదో ఒక నిర్దిష్టమైన రోజున సాధారణంగా ఉండాల్సిన ఉష్ణోగ్రత కంటే ఐదారు డిగ్రీలు అధికంగా ఉంటే ఆ వాతావరణ పరిస్థితిని ‘వడగాడ్పులు’అంటారు. సాధారణం కంటే ఏడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రత అధికంగా నమోదైతే తీవ్రమైన వడగాడ్పులుగా పరిగణిస్తారు. 47 డిగ్రీల వరకు చేరుకుంటే తీవ్రమైన వడగాడ్పులనే అంటారు. ఇలాంటి పరిస్థితి.. తెలంగాణలో వచ్చే మూడు నెలల్లో 20 రోజుల వరకు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వడగాడ్పులు వచ్చే పరిస్థితిని వాతావరణ శాఖ ముందే గుర్తించగలదు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడానికి వీలు కుదురుతుంది. 2016 సంవత్సరం వేసవిలో ఏకంగా 27 రోజులు వడగాడ్పులు తెలంగాణలో నమోదయ్యాయి. వడగాడ్పులతో గతంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున మరణాలు సంభవించిన సంగతి తెలిసింది. 2015లో అత్యధికంగా 541 మంది వడదెబ్బతో చనిపోయారు. ఇక ఉష్ణోగ్రత సాధారణంగా ఉన్నా గాలిలో తేమ శాతం పెరిగితే దాని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఉష్ణోగ్రత 34 డిగ్రీలున్నా.. వాతావరణంలో తేమ 75% ఉంటే.. అది సాధారణంగా 49 డిగ్రీల ఉష్ణోగ్రతతో సమానం. ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా ఉండి.. తేమ 100% ఉంటే అది కూడా 49 డిగ్రీల ఉష్ణోగ్రతతో సమానం. కనుక ఉష్ణోగ్రత, వాతావరణంలో తేమ శాతాన్ని బట్టి కూడా తీవ్రతలో హెచ్చుతగ్గులుంటాయి. ఎండలు తీవ్రంగా ఉంటే రెడ్ అలర్ట్ వాతావరణశాఖ ఎండల తీవ్రతను బట్టి ప్రజలను అప్రమత్తం చేస్తుంది. సాధారణం కంటే ఆరు డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదైతే అత్యంత తీవ్రమైన ఎండగా గుర్తించి రెడ్ అలర్ట్ జారీచేస్తారు. సాధారణం కంటే నాలుగైదు డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైతే ఆరెంజ్ అలర్ట్ జారీచేస్తారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే కొద్దిగా ఎక్కువగా నమోదైతే వేడి రోజుగా గుర్తించి ఎల్లో (హీట్‌వేవ్ వార్నింగ్) అలర్ట్ ఇస్తారు. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే వైట్ అలర్ట్ జారీచేస్తారు. ఏటేటా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు 1971 నుంచి ఇప్పటివరకు ప్రతి ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మార్చి ఒకటో తేదీ నుంచి సమ్మర్ క్యాలెండర్ ఇయర్ ప్రారంభం అవుతుందన్నారు. ఈ వేసవిలో తెలుగు రాష్ట్రాల్లో వడగాడ్పులు ప్రతిఏటా కంటే ఈ ఏడాది కొంచెం ఎక్కువ ఉంటాయని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో ప్రతి సంవత్సరం కంటే ఈ ఏడాది సాధారణం కంటే 0.5 డిగ్రీల నుంచి 1 డిగ్రీ వరకు అధికంగా ఉంటాయన్నారు. గతేడాది కంటే అధికంగా నమోదవుతాయన్నారు. 2010లో వడగాడ్పుల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై చాలా తీవ్రంగా ఉందన్నారు. 2016లో ఆంధ్రప్రదేశ్‌లో వడదెబ్బ మరణాలు 720కి పైగా నమోదు అయ్యాయని గుర్తుచేశారు. 2015 తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం ప్రాంతంలో ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో 47 డిగ్రీలకు పైనే నమోదైందన్నారు. – వైకే రెడ్డి, డైరెక్టర్, హైదరాబాద్ వాతావరణ కేంద్రం -
ఈ ఏడాది ఎండలు ఎక్కువే
సాక్షి, హైదరాబాద్ : ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ డైరెక్టర్ వైకే రెడ్డి తెలిపారు. నేటి నుంచి సమ్మర్ క్యాలెండర్ ఇయర్ ప్రారంభం కానుందని తెలిపారు. వచ్చే మూడు నెలల పాటు సమ్మర్‌పై ఐఎండి బులిటెన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రతి యేటా కంటే ఈ ఏడాది 0.5 అధికంగా ఉంటుందని తెలిపారు. 1971 నుంచి ప్రతి ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉందన్నారు. 2010లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉందన్న ఆయన.. 2015లో 540, 2016లో 720కి పైగా మరణించినట్లు తెలిపారు. 2015లో తెలంగాణలోని భద్రాచలం ప్రాంతంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు 47కి చేరుకున్నాయని గుర్తు చేశారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చే గాలుల వల్ల మన రాష్ట్రాలకు వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. వాతావరణంలో వేడి ఎక్కువ నమోదు అయితే..ఆరోగ్య సమస్యలు వస్తాయని, ఎండలో పనిచేసేవారు, పిల్లలు, వృద్దులపై వడగాల్పుల ప్రభావం ఉంటుందన్నారు. -
వచ్చే వారం నుంచి తీవ్ర వడగాడ్పులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరుగుతోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు చేరుకున్నాయి. వచ్చే వారం నుంచి ఇంకా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇకనుంచి పలుచోట్ల 44 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరుకుంటుందని వెల్లడించింది. ప్రధానంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పరిధిలో వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని పేర్కొంది. వడగాడ్పుల తీవ్రత పెరిగితే సాధారణం కంటే ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా నమోదవుతాయి. ఈ నేపథ్యంలో ఎండ తీవ్రతకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవడంపై ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పలు సూచనలు చేసింది. తలనొప్పి, తలతిరగడం, తీవ్రమైన జ్వరం, చర్మం పొడిబారడం, మత్తు నిద్ర, వాంతులు, ఫిట్స్, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితి కలిగి ఉండటం వంటివి వడదెబ్బ లక్షణాలుగా వివరించింది. చేయకూడని పనులు.. అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలకు వెళ్లకూడదు. ఎండవేడిలో ఎక్కువ సేపు పనిచేయకూడదు. మధ్యమధ్యలో చల్లని ప్రదేశంలో సేద తీరుతూ ఉండాలి. తగిన జాగ్రత్తల్లేని నిల్వ ఉంచిన ఆహారం అధిక వేడితో చెడిపోతాయి. వాటిని తినొద్దు. తింటే డయేరియాకు గురయ్యే ప్రమాదముంది. వడదెబ్బ తగిలిన వారిని వేడి నీటిలో తడిపిన గుడ్డతో తుడవకూడదు. వడదెబ్బ తగిలిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లడంలో ఆలస్యం చేయకూడదు. ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు బయట పనిచేసేవారు సూర్యరశ్మి నుంచి కాపాడుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తరచూ నీరు తాగుతూ బయటకు వెళ్లేటప్పుడు మంచినీరు తీసుకెళ్లాలి. నిమ్మరసం, కొబ్బరినీళ్లు వంటివి తాగుతూ ఉండాలి. తెలుపు లేదా లేత వర్ణం కలిగిన పలుచటి కాటన్ వస్త్రాలు ధరించాలి. తలకు వేడి తగలకుండా టోపీ పెట్టుకోవాలి. లేదా రుమాలు చుట్టుకోవాలి. పలుచటి మజ్జిగ, గ్లూకోజ్ నీరు, చిటికెడు ఉప్పు, చెంచా చక్కెర ఒక గ్లాసులో కలుపుకొని ఇంటిలోనే తయారుచేసిన ఓఆర్ఎస్ ద్రావణం తాగితే వడదెబ్బ నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది. వడదెబ్బ తగిలిన వారిని చల్లని నీడ ఉన్న ప్రదేశంలో ఉంచాలి. శరీర ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది కాబట్టి సాధారణ ఉష్ణోగ్రత వచ్చే వరకు తడి గుడ్డతో తుడుస్తూ ఉండాలి. చంటి పిల్లలు, గర్భిణీలు, చిన్న పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, వడగాడ్పులకు గురికాకుండా కుటుంబసభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వడదెబ్బకు గురైనవారు ప్రాథమిక చికిత్స అనంతరం సాధారణ స్థితికి రాకుంటే వెంటనే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలి. -
నేడు, రేపు పలు జిల్లాల్లో వడగాడ్పులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో అప్పుడే వడగాడ్పులు మొదలయ్యాయి. ఆది, సోమవారాల్లో పలు జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కుమ్రంభీం, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. -
మారకపోతే... పావు వంతు ఎడారే!
భూమి ఉష్ణోగ్రత రెండు డిగ్రీలు పెరిగితే చాలు... పావు వంతు నేల బతికేందుకు వీల్లేని రీతిలో ఎడారిగా మారిపోవడం ఖాయం అంటున్నారు శాస్త్రవేత్తలు. అంతేనా. దీనివల్ల వ్యవసాయం దెబ్బతినడమే కాదు... జీవవైవిధ్యం అంతరించిపోయి, మరిన్ని కరువుకాటకాలు, కార్చిచ్చులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ విషయాలన్నీ గతంలో విన్నవే అయినప్పటికీ అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒకటి ఇంకోసారి ఈ విపరిణామాలను ధ్రువీకరించింది కాబట్టి ప్రాధాన్యమేర్పడింది. నేచర్ క్లయిమేట్ ఛేంజ్ జర్నల్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం... ప్రపంచ వాతావరణ భవిష్యత్తుకు సంబంధించి అందుబాటులో ఉన్న 27 కంప్యూటర్ నమూనాల విశ్లేషణ ద్వారా తుది అంచనాకు వచ్చారు. భూతాపోన్నతికి కారణమవుతున్న గ్రీన్హౌస్ వాయువులను తగ్గించకపోతే 2052 – 70 మధ్య కాలానికే సగటు ఉష్ణోగ్రత రెండు డిగ్రీల కంటే ఎక్కువవుతుందని వారు హెచ్చరించారు. ఆస్ట్రేలియాలోని దక్షిణ భాగం, దక్షిణాఫ్రికా, ఆగ్నేయాసియా, మధ్య అమెరికా ప్రాంతాల్లో ఈ ఎడారీకరణ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల దాదాపు 150 కోట్ల మంది ప్రభావితమవుతారని ఈ పరిశోధనల్లో పాలు పంచుకున్న శాస్త్రవేత్త మనోజ్ జోషీ తెలిపారు. అయితే ప్యారిస్ ఒప్పందంలో నిర్ణయించిన మాదిరిగా సగటు ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయగలిగితే మాత్రం ఈ ప్రమాదాన్ని దాదాపుగా పరిహరించవచ్చునని వివరించారు. -
ఏడుగురి మృత్యువాత
పెరిగిన ఉష్ణోగ్రతలు వడదెబ్బకు గాలిలో కలుస్తున్న ప్రాణాలు గుత్తిరూరల్/ శెట్టూరు/ బుక్కరాయసముద్రం/ లేపాక్షి/ యల్లనూరు/ నార్పల/ ఉరవకొండ రూరల్ : జిల్లాలో ఉష్ణోగ్రత తీవ్ర స్థాయిలో ఉంది. వడదెబ్బకు మంగళ,బుధవారాల్లో ఏడుగురు మృత్యువా తపడ్డారు. అనేక మంది ఆస్పత్రులపాలవుతున్నారు.గుత్తి రూరల్ మండలంలోని ఇసురాళ్లపల్లి గ్రామంలో బుధవారం ఎస్.సావిత్రమ్మ(61) వడదెబ్బతో మృతి చెందింది. వ్యవసాయ పొలంలోని పత్తికట్టెను తొలగించేందుకు మంగళవారం వెళ్లింది. ఇంటికి తిరిగివచ్చాక తీవ్ర అస్వస్థతకు గురై తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శెట్టూరు మండల కేంద్రానికి చెందిన భాస్కర్‌రెడ్డి (46) వడదెబ్బతో బుధవారం మృతి చెందారు. హోటల్ నిర్వహించే భాస్కర్‌రెడ్డి రోజు మాదిరిగానే మంగళవారం ఇంటి నుంచి హోటల్‌కు ఎండలో నడిచి వెళ్లారు. తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మృతి చెందారు. మృతుడికి భార్య రాములమ్మ, కూతురు ఉన్నారు. మృతుడి కుటుంబసభ్యులను కళ్యాణదుర్గానికి చెందిన వైఎస్సార్ సీపీ నేతలు నారాయణరెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ రఘునాథ్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ సోమనాథ్‌రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి హనుమంతరాయుడు, సర్పంచ్ రమేష్, నేత హరినాథ్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు కంబాలపల్లి మంజు, రామిరెడ్డి, తహశీల్దార్ వాణీశ్రీ, వీఆర్వోలు పరామర్శించారు. బుక్కరాయసముద్రం మండలం అమ్మవారిపేటకు చెందిన రాజమ్మ (26) వడదెబ్బకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. రాజమ్మ సోమవారం గ్రామంలో వ్యవసాయ కూలి పనికి వెళ్లింది. సాయంత్ర ఇంటికి వచ్చిన తర్వాత వాంతులు, విరేచనాలు చేసుకుంది. వెంటనే ఆమెను బంధువులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. లేపాక్షి మండలంలోని కోడిపల్లి గ్రామానికి చెందిన సంజీవమ్మ(45) వడదెబ్బతో మృతి చెం దింది. ఈమె జీవనోపాధి కోసం ఎప్పటిలాగే మంగళవారం కూడా చుట్టు పక్కల గ్రామాలకు గంపలో మామిడి కాయలు తీసుకెళ్లి విక్రయించింది. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అస్వస్థతకు గురైంది. వెంటనే హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. స్థానిక వీఆర్వో రామాంజినప్ప, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మురళి మృతురాలి ఇంటివద్దకు వెళ్లి పంచనామా చేశారు. యల్లనూరు మండలంలోని లింగారెడ్డిపల్లె గ్రామంలో రంగమ్మ(75) వడదెబ్బకు బుధవా రం మృతి చెందింది. ఎండలు తీవ్రంగా ఉండటంతో తట్టుకోలేకపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. నార్పల మండల కేంద్రంలోని మసీద్ కట్ట కాలనీకి చెందిన పన్నూరు లింగప్ప (55) వడదెబ్బతో మంగళవారం రాత్రి మృతి చెందింది. కూలి పనికి వెళ్లిన వచ్చిన లింగప్ప అస్వస్థతకు గురికావడంతో ఆర్ఎంపీ వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. చికిత్స అనంతరం ఇంటికి తీసుకొచ్చారు. నిద్రలోనే ఆయన మృతి చెందారు. రెవెన్యూ, వైద్యశాఖ అధికారులు బుధవారం విచారణ జరిపారు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.ఉరవకొండ రూరల్ పరిధిలోని వైరాంపురం గ్రామానికి చెందిన పరమేశ్వర్(38) బుధవారం వడదెబ్బతో మృతి చెందారు. ఉదయం పొలానికి వెళ్లిన పరమేశ్వర్ మధ్యాహ్నం ఇంటికి వచ్చి వాంతులు చేసుకుని మృతి చెందారు. ప్రభుత్వాస్పత్రి కిటకిట తాడిపత్రి టౌన్: మండుతున్న ఎండలకు జనం విలవిల్లాడుతున్నారు. వారం రోజులుగా తాడిపత్రి ప్రాంతం నుంచి రోజు 50 నుంచి 60 మంది రోగులు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం ఆ సంఖ్య 70కు చేరింది. ప్రధానంగా తాడిపత్రి పట్టణంతోపాటు రూరల్, యాడికి, పెద్దపప్పూరు మండలాల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు వడదెబ్బకు గురై వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరుతున్నారు. రోగుల సంఖ్య ఎక్కువగా ఉండటం, మందులు, పడకలు తక్కువగా ఉండటంతో వైద్యులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. -
వడదెబ్బకు 208 మంది మృతి
అత్యధికంగా నిజామాబాద్‌లో 47 డిగ్రీలు ఏపీలో వడదెబ్బకు 310 మంది మృతి సాక్షి నెట్వర్క్: రాష్ర్టంలో ఎండలు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. రాష్ర్టవ్యాప్తంగా బుధవారం వడదెబ్బ బారిన పడి 208 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 45 మంది మరణించగా, వరంగల్ జిల్లాలో 44 మంది మృతి చెందారు. ఖమ్మం 35, కరీంనగర్ 31, మహబూబ్‌నగర్ 18, ఆదిలాబాద్ 12, మెదక్ 8 మంది, రంగారెడ్డి ఆరుగురు, నిజామాబాద్ ఐదుగురు, హైదరాబాద్ జిల్లాలో నలుగురు మృత్యువాత పడ్డారు. హైదరాబాద్ వాతావరణ శాఖ నివేదిక ప్రకారం బుధవారం నిజామాబాద్‌లో 47 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండంలో 45.2, హైదరాబాద్‌లో 42 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, ఏపీలోనూ ఎండలు మండిపోతున్నాయి. బుధవారం ఏపీలో 310 మంది మరణించారు. ఒంగోలులో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వ్యాకోచిస్తున్న పట్టాలు రామగుండం: ఎండదెబ్బకు రైల్వే ట్రాక్‌లు మండిపోతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రత కంటే ట్రాక్‌లపై అదనంగా 10 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవడంతో పట్టాలు వ్యాకోచిస్తున్నాయి. దీంతో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను వేగాన్ని తగ్గించి నడుపుతున్నారు. విస్తరిస్తున్న ‘నైరుతి’ నైరుతి రుతుపవనాలు క్రమేపీ ముం దుకు కదులుతున్నాయి. ప్రస్తుతం ఇవి ఆగ్నేయ అరేబియా సముద్రం, మాల్దీవుల్లోకి ప్రవేశించాయి. మరో 24 గంటల్లో దక్షిణ, మధ్య బంగాళాఖాతంలోకి విస్తరిస్తాయని ఐఎండి తెలిపింది. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ నెలాఖరు నాటికి నైరుతి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. -
వడదెబ్బకు 36 మంది మృతి
సాక్షి నెట్వర్క : జిల్లాలో మరణమృదంగం కొనసాగుతూనే ఉంది. ఎండల తీవ్రత పెరుగుతూనే ఉంది. మంగళవారం 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా వడగాడ్పుల తీవ్రతకు 36 మంది మరణించారు. యడ్లపాడు మండలం చెంఘిజ్‌ఖాన్‌పేటకు చెందిన బసెల వీరమ్మ (78), తిమ్మాపురానికి చెందిన జంగా రవిబాబు (43), అమరావతి మండలం గాజులపాలెం పి.వెంకాయమ్మ (70), అమరావతి పల్లపువీధికి చెందిన లక్ష్మీనరసమ్మ (59), బీహెచ్ సీతారావమ్మ (75), ఈపూరు మండలంలోని ముప్పాళ్ల గ్రామానికి తుర్లపాటి సుబ్బాయమ్మ(65), బొల్లాపల్లి మండల పరిధిలోని మేళ్లవాగుకు చెందిన చాల మహిళ రాములు, నకరిల్లు మండలంలోని చల్లగుండ్ల గ్రామానికి చెందిన బడిగంచుల హనుమయ్య(65), నకరికల్లుకు చెందిన జూలకంటిబసవయ్య(65) వడదెబ్బతో మంగళవారం మృతి చెందారు. రొంపిచర్లలో ఐదేళ్ల బాలిక మృతి.. ఎండతీవ్రత తాళలేక మూడు రోజుల క్రితం వడదెబ్బకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రొంపిచర్ల మండలం వడ్లమూడివారిపాలెం గ్రామానికి చెందిన ఏసుపోగు షమీల(5) మంగళవారం మృతిచెందింది. అదేవిధంగా అచ్చంపేట మండలం ఓర్వకల్లు గ్రామానికి చెందిన కోట నాగయ్య (90), చామర్రులో కె.హనుమయ్య (80), పిట్టలవానిపాలెం గ్రామానికి చెందిన గోకరాజు అనసూయమ్మ (70), కర్రి తిరుపతయ్య(60), అలకాపురం శివారు సత్యనారాయణపురం గ్రామానికి చె ందిన మంతెన అన్నపూర్ణమ్మ (80), బాపట్లకు చెందిన దాది అనసూర్యమ్మ (92), మటకుమల్లి పార్వతిదేవి (49), కర్లపాలెం గ్రామానికి చెందిన కేతినేని సుబ్బమ్మ (70), మండలంలోని నల్లమోతువారిపాలెం గ్రామానికి చెందిన బడుగు తిరుపతమ్మ (64), భట్టిప్రోలుకు చెందిన కౌతరపు బాలకోటేశ్వరరావు(71), మండలంలోని పల్లెకోనకు చెందిన కోరపాటి మహాలక్ష్మీ(40), కొడుకు వెంటే తల్లి.. చిలకలూరిపేట మండలంలోని పసుమర్రు గ్రామంలో మంగళవారం కుమారుడు మరణించిన 48 గంటల తేడాతో తల్లికూడా మృతి చెందింది. వడదెబ్బ ప్రభావంతో గుదే వెంకటప్పయ్య ఆదివారం మరణించాడు. ఆ దుఃఖంలో ఉన్నతల్లి రాములమ్మ (82)మంగళవారం మృతి చెందింది. ఇదే గ్రామానికి చెందిన గొర్రెల కాపరి యలగాల వీరయ్య (62), చిలక లూరిపేట కాసు వెంగళరెడ్డినగర్‌కు చెందిన తలమాల సింగరమ్మ( 38) కారంపూడి మండలం పెదకొదమగుండ్ల గ్రామంలో గుంటకం హనుమాయమ్మ(62), గాదెవారిపల్లె గ్రామం లో కొత్తా చెన్నమ్మ(85), కారంపూడి గ్రామంలో వంగవరపు యేసురత్నం(65), మాచర్ల పట్టణానికి చెందిన అల్లూరి శంకరమ్మ (62), రెంటచింతలమండలంలోని పాలువాయి గ్రామానికి చెందిన శొంఠిరెడ్డి లచ్చమ్మ(84) వడదెబ్బకు మృతిచెందారు. గురజాల నియోజకవర్గంలో ఏడుగురు.. దాచేపల్లికి చెందిన ఈర్ల సురేష్, లక్ష్మీల ఐదు నెలల చిన్నారితో పాటు ముత్యాలంపాడు గ్రామానికి చెందిన పాశం మంగమ్మ(85), గురజాలలోని న్యూశాంతి లాడ్జి వెనుక నివాసం వుంటున్న బి. కోటమ్మ(80), గురజాల రూరల్ మండలంలోని జంగమహేశ్వరపురం గ్రామంలో వర్రా కొండమ్మ(80), గోగులపాడు గ్రామంలో ఇంజమూరి మార్తమ్మ(80), గుత్తికొంత సొసైటీ డెరైక్టర్ కాండ్రకుంట వెంకటేశ్వర్లు(45), మాచవరం మండలంలోని మోర్జంపాడు గ్రామానికి చెందిన వజ్జె వడితె బాయి(55) మృతిచెందారు. -
తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బ మృతులు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సూర్య 'ప్రతాపం' కొనసాగుతోంది. ప్రఛండ భానుడు నిప్పులు కక్కుతుండడంతో జనం విలవిలలాడుతున్నారు. వడదెబ్బతో పిట్టల్లా రాలుతున్నారు. సోమవారం వివిధ ప్రాంతాల్లో పలువురు వడదెబ్బ కారణంగా మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్: ప్రకాశం జిల్లాలో వడదెబ్బకారణంగా ముగ్గురు మృతి చెందారు. నెట్టెంపాడు మండలం నారపల్లిలో వెంకటస్వామి(65) వడ దెబ్బతో మృతి చెందాడు. వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరులోని బలిజ వీధికి చెందిన మాదా పద్మావతమ్మ (70) నాలుగు రోజులు నుంచి విరేచనాలు, వాంతులు, నీరసంతో బాధపడుతుండగా సోమవారం ఉదయం మృతి చెందింది. కర్నూలు: వెల్దుర్తి మండలంలో సోమవారం ఓ వృద్ధుడు వడద్బెకు మృతి చెందాడు. మండలంలోని రామల్లకోట గ్రామంలో వీరశేఖర(68) ఎండ తీవ్రతను తట్టుకోలేక తీవ్ర అస్వస్థతతో ప్రాణాలొదిలాడు. తెలంగాణ: ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన శేర్ల పెద్దయ్య ఆదివారం ఇళ్లకు తడికెలు అల్లే పనికి వెళ్లి ఎండవేడికి అస్వస్థత పాలయ్యాడు. సోమవారం వేకువ జామున మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా పరిగి మండలం సయ్యద్ మల్కాపూర్‌కు చెందిన స్మిత (18) కూడా వడదెబ్బ కారణంగా సోమవారం ఉదయం మృతి చెందింది. మెదక్ జిల్లా సిద్ధిపేల మండలం లక్ష్మీందేవపల్లిలో వడదెబ్బతో ఇద్దురు మృతి చెందారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టాపురంలో వడదెబ్బకు మహిళ మృతి చెందింది. -
చావుదెబ్బ
భానుడు చండ ప్రచండుడిగా మారాడు. సూరీడు నిప్పుల సెగలు కక్కుతున్నాడు. జిల్లాలో ఒక్క ఆదివారం నాడే 44 మంది ఎండదెబ్బకు ప్రాణాలొదిలారు. ఉదయం 8 గంటలు దాటిందంటే బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. వడగాడ్పుల ప్రభావం సాయంత్రం 7 గంటల వరకు ఉంటుంది. విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జిల్లా ప్రజలు విలవిల్లాడుతున్నారు. డబ్బాలో వృద్ధురాలు ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో అబ్బుని సత్తమ్మ(78) అనే వృద్ధురాలు వడదెబ్బతో మృతిచెందింది. వ్యవసాయ పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి రాగానే వాంతులు చేసుకుని కుప్పకూలింది. మీర్జంపేటలో వృద్ధుడు మీర్జంపేట(క్వాశ్రీరాంపూర్) : మండలంలోని మీర్జంపేటకు చెందిన పెనుగొండ రాజయ్య(60) గోదావరిఖనిలో ఉంటున్న కూతురి వద్దకు శనివారం వెళ్లాడు. వడదెబ్బకు గురై రాత్రి మృతిచెందాడు. మృతదేహాన్ని ఆదివారం స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కూతుళ్లు ఉన్నారు. జీలకుంటలో మహిళ ఓదెల : మండలంలోని జీలకుంటకు చెందిన అ గ్గి శోభ ఉరఫ్ మల్లేశ్వరి వడగాడ్పులకు అస్వస్థతకు గురై మృతిచెందింది. శంకరపట్నంలో ఇద్దరు శంకరపట్నం : మండలంలో వడదెబ్బతో ఇద్దరు వృద్ధులు మృతిచెందారు. కేశవపట్నంకు చెందిన అల్లెంకి వీరమ్మ(80), వంకాయగూడెంకు చెందిన నాంపెల్లి కనుకమ్మ(65) వడదెబ్బతో మృతిచెందారు. కమలాపూర్‌లో నలుగురు కమలాపూర్ : మండలంలోని కమలాపూర్, గూడూరు, శ్రీరాములపల్లికి చెందిన నలుగురు వడదెబ్బతో మృతిచెందారు. కమలాపూర్‌కు చెందిన బైక్ మెనానిక్ కొండి సదానందం(65), మౌటం వనమ్మ(50), గూడూరుకు చెందిన తెప్ప కొమురయ్య(60) వడదెబ్బతో ప్రాణాలొదిలారు. శ్రీరాములపల్లికి చెందిన ఇమామ్ పటాన్(60) బండరారుు కొట్టేందుకు వెళ్లి ఎండదెబ్బకు గురయ్యూరు. అర్ధరాత్రి పరిస్థితి విషమించి ప్రాణాలొదిలారు. వేములవాడలో వృద్ధురాలు వేములవాడ అర్బన్ : వేములవాడలోని న్యూఅర్బన్ కాలనీకి చెందిన గొడిశెల బాలవ్వ(70) కూలీ పనులకు వెళ్తుంటుంది. అరుుతే ఎండలు తీవ్రంగా ఉండడంతో అస్వస్థతకు గురై మృతిచెందింది. కరీంనగర్లో వృద్ధుడు కరీంనగర్ రూరల్ : కరీంనగర్ మండలం తీగలగుట్టపల్లి పంచాయతీ పరిధిలోని సరస్వతినగర్‌లో కర్ర చంద్రారెడ్డి(80) వడదెబ్బకు మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కరీంనగర్లో యువకుడు కరీంనగర్ : వడదెబ్బతో కరీంనగర్‌లోని 25వ డివిజన్‌కు చెందిన మారుతూరి కిరణ్(30) హార్వెస్టర్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. వృత్తి నిమిత్తం ఖమ్మం జిల్లా యశ్వంత్‌రావుపేట మండలం అమ్మగారిపల్లికి వెళ్లాడు. అరుుతే కిరణ్ వడదెబ్బకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించగా మృతిచెందినట్లు డివిజన్ కార్పోరేటర్ కట్ల విద్యసతీశ్ తెలిపారు. మల్కపేటలో వివాహిత మల్కపేట(కోనరావుపేట) : మండలంలోని మల్కపేటకు చెందిన మొగిలి దివ్య(28) రెండు రోజులుగా వ్యవసాయ పనులకు వెళ్తుంది. వడదెబ్బతో అస్వస్థతకు గురికాగా కుటుంబసభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. జాదారావుపేటలో ఉపాధిహామీ కూలీ కాటారం: మండలంలోని జాదారావుపేటకు చెందిన జాకె రాజయ్య(36) నాలుగు రోజుల క్రితం ఉపాధిహామీ పనులకు వెళ్లి అస్వస్థతకు గురయ్యూడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇబ్రహీంపల్లిలో వృద్ధురాలు కాటారం : మండలంలోని చింతకాని పంచాయతీ పరిధిలోని ఇబ్రహీంపల్లికి చెందిన చేరాల సమ్మక్క(65) బహిర్భూమికి వెళ్లి వడదెబ్బకు అస్వస్థతకు గురైంది. ఇంటికొచ్చిన కొద్ది సేపటికే మృతిచెందింది. అంత్యక్రియలు నిర్వహించేందుకు సర్పంచ్ ఆర్థిక సాయం చేశారు. బెజ్జంకిలో ఇద్దరు.. బెజ్జంకి : మండలంలోని జంగపల్లిలో వడదెబ్బతో ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. గుంటుక తులుశవ్వ(75) శనివారం రాత్రి, పంతంగి రాజవ్వ(80) ఆదివారం ప్రాణాలొదిలారు. సుల్తానాబాద్‌లో ఇద్దరు సుల్తానాబాద్: మండల కేంద్రంలోని గాంధీనగర్‌కు చెందిన బాదం జయప్రద (70) టీవీ వీక్షిస్తూ హఠాత్తుగా కుప్పకూలింది. వడగాల్పులు అధికంగా రావడంతోనే అస్వస్థతకు గురై మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గొల్లపల్లికి చెందిన బొంకూరి వెంకటయ్య (65) అనే మేకల కాపరి.. అడవి మేకలను తీసుకెళ్లి మధ్యాహ్నం ఇంటికొచ్చాడు. మంచంలో పడుకుని అలాగే ప్రాణాలొదిలారు. వల్లంపెల్లిలో వృద్ధురాలు వల్లంపెల్లి(మేడిపెల్లి) : మండలంలోని వల్లంపెల్లికి చెందిన సంపతి లింగవ్వ(70) వృద్ధురాలు కూలీ పనులకు వెళ్తుంది. వడదెబ్బకు గురై శనివారం మృతిచెందింది. మానకొండూర్‌లో ముగ్గురు మానకొండూర్: మండలంలో ముగ్గురు మృతి చెందారు. మండలంలోని ఈదులగట్టెపల్లికి చెందిన చెలికాని మల్లమ్మ(70) పింఛన్ డబ్బులు తీసుకునేందుకు వచ్చి అస్వస్థతకు గురై శనివారం రాత్రి మృతిచెందింది. శ్రీనివాస్‌నగర్ గ్రామానికి చెందిన గట్టు లక్ష్మయ్య(55) తన గేదె కోసం గాలించి వడదెబ్బకు గురయ్యూడు. రాత్రరుునా ఇంటికి రాకపోవడంతో బంధువుల ఇంటికి వెళ్లాడని కుటుంబసభ్యులు భావించగా.. గ్రామంలోని తూర్పు దర్వాజకు సమీపంలో మృతి చెందాడు. వెల్ది గ్రామానికి చెందిన గడమల్ల యాదయ్య(68) అనే వృద్ధుడు అస్వస్థతకు గురై కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతి చెందాడు. చీలాపూర్‌లో వృద్ధుడు బెజ్జంకి : మండలంలో చీలాపూర్‌కు చెందిన పరుకాల నర్సయ్య(90) వడదెబ్బకు గురై ఇంటి వద్ద మృతి చెందాడు. ఎండతీవ్రతతో అస్వస్థతకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బొమ్మకల్‌లో వృద్ధుడు సైదాపూర్‌రూరల్ : మండలంలోని బొమ్మకల్‌కు చెందిన కొంకట ఓదయ్య(75) వడగాడ్పులకు అస్వస్థతకు గురయ్యూడు. పరిస్థితి విషమించి ఆదివారం ప్రాణాలొదిలాడు. చొప్పదండిలో ఇద్దరు చొప్పదండి: మండలంలోని రుక్మాపూర్‌కు చెం దిన గాండ్ల సత్యనారాయణ(42) అనే రైస్‌మిల్ కార్మికుడు పనిచేస్తూ అస్వస్థతకు గురయ్యూడు. ఆస్పత్రికి తరలించేలోగానే ప్రాణాలొదిలాడు. దేశాయిపేటకు చెందిన కాషపాక సంపూర్ణ(19) వడదెబ్బతో మృతి చెందింది. వెంకటాయపల్లిలో గీతకార్మికుడు గంగాధర : మండలంలోని వెంకటాయపల్లికి చెందిన రావుల మల్లగౌడ్ అనే గీత కార్మికుడు ముంజలు విక్రరుుంచేందుకు ప్రధాన రహదారిపై మూడు రోజులుగా కూర్చోవడంతో అస్వస్థతకు గురయ్యూడు. పరిస్థితి విషమించి ప్రాణాలొదిలాడు. తంగళ్లపల్లిలో యువతి సిరిసిల్ల రూరల్ : సిరిసిల్ల మండలం తంగళ్లపల్లికి చెందిన వడ్నాల మానస(22) పనిపై బయటకు వెళ్లి అస్వస్థతకు గురైంది. ఇంటికొచ్చిన మానస ఒక్కసారిగా కుప్పకూలింది. ఆస్పత్రికి తరలించేలోగానే మృతిచెందింది. లస్మక్కపల్లిలో వృద్ధురాలు వీణవంక : మండలంలోని లస్మక్కపల్లికి చెందిన మర్రి వీరమ్మ(60) వ్యవసాయ పనులకు వెళ్లింది. ఇంటికి రాగానే అస్వస్థతకు గురై మృతిచెందింది. హుస్నాబాద్‌లో ముగ్గురు హుస్నాబాద్‌రూరల్ : హుస్నాబాద్‌కు చెందిన బొడ్డు వెంకటాద్రి(58), కేశ్వాపూర్‌కు చెంది ఐద నాంపెల్లి(65) రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యూరు. పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి ప్రాణాలొదిలారు. అక్కన్నపేటకు పంచాయతీ పరిధిలోని పంతుల్నాయక్ తండాకు చెందిన బానోతు ముంజ్యా(65)కు చెందిన గడ్డి వాము ప్రమాదవశాత్తు నిప్పంటుకోగా చల్లార్పే ప్రయత్నంలో వడదెబ్బకు గురై ప్రాణాలొదిలాడు. జగిత్యాలలో వికలాంగురాలు జగిత్యాల అర్బన్ : పట్టణంలోని సాయిరాంనగర్‌కు చెందిన వెంకటేశ్, సత్యవతి దంపతుల కుమార్తె సాయిని అనూష(15) ఆదివారం వడదెబ్బతో మృతి చెందింది. గుల్లపేటలో వృద్ధురాలు జగిత్యాల జోన్ : జగిత్యాల మండలం గుల్లపేటకు చెందిన మెడపట్ల పోషవ్వ(86) ఆదివారం వడదెబ్బతో మృతిచెందింది. జమ్మికుంటలో ఇద్దరు చనపల్లి(జమ్మికుంట రూరల్): మండలంలోని మాచనపల్లికి చెందిన వేల్పుల రాజమ్మ(70), వావిలాలకు చెందిన గుమ్మడవెల్లి మొండయ్య(60) వడదెబ్బతో ప్రాణాలొదిలారు. జగ్గరావుపల్లిలో వృద్ధుడు బోయినపల్లి : మండలంలోని జగ్గారావుపల్లికి చెందిన మల్లయ్య(60) ఆదివారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికొచ్చిన వెంటనే కుప్పకూలాడు. చీలాపూర్‌లో వృద్ధుడు బెజ్జంకి : మండలంలో చీలాపూర్‌కు చెందిన పరుకాల నర్సయ్య(90) తీవ్ర ఎండలకు అస్వస్థతకు గురయ్యూడు. పరిస్థితి విషమించడంతో ప్రాణాలొదిలాడు. పెద్దపల్లిలో మహిళ పెద్దపల్లి: పట్టణంలోని బండారుకుంట తాజ్మజీద్ ఏరియాకు చెందిన మీర్జా నబియూబేగం(42) శనివారం కూలీ పనులకు వెళ్లింది. రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైంది. తెల్లవారుజామున కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆవునూర్‌లో వృద్ధురాలు ముస్తాబాద్ : మండలంలోని ఆవునూర్‌కు చెందిన ఉమ్మనవేని రాజవ్వ(66) ఉదయం పొలానికి వెళ్లింది. తిరిగి ఇంటికొచ్చిన ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. సింగరేణిలో ముగ్గురు.. కోల్‌సిటీ : గోదావరిఖనిలో వడదెబ్బతో ముగ్గురు ప్రాణాలొదిలారు. విజయ్‌నగర్‌కు చెందిన పిక్కల ఓదెలు(59) పనిపై లక్ష్మీనగర్‌కు వెళ్లి అక్కడే కుప్పకూలాడు. సింగరేణి ఏరి యా ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. వినోభనగర్‌కు చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు తొగరి రాయలింగు(65) అస్వస్థతకు గురై తెల్లవారుజామున మృతిచెందాడు. కాకతీయనగర్‌లో ఆరెకటిక వృత్తి చేసుకునే కుంబార్కర్ లచ్చన్న(55) డయాలసిస్ చేయించుకునేందుకు కరీంనగర్‌కు శనివారం వెళ్లి వచ్చాడు. వడదెబ్బతో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
‘మృత్యు’తాపం
నిప్పులు కక్కుతున్న ప్రచండ భానుడు వడదెబ్బకు పిట్టల్లా రాలుతున్న జనం మరో 17 మంది మృతి మృతుల్లో ఎనిమిదేళ్ల బాలుడు జిల్లాలో సూర్య‘ప్రతాపం’ కొనసాగుతోంది. ప్రచండ భానుడు నిప్పులు కక్కుతుండడంతో జనం విలవిలలాడుతున్నారు. వడదెబ్బతో పిట్టల్లా రాలుతున్నారు. శని, ఆదివారాల్లో మరో 17 మంది చనిపోయారు. గాండ్లపెంట మండలంలో ఇద్దరు, గుత్తిలో ముగ్గురు, ధర్మవరం మండలంలో ఇద్దరు, గుంతకల్లు, అమడగూరు, ముదిగుబ్బ, యాడికి, ఉరవకొండ, హిందూపురం, కొత్తచెరువు, చిలమత్తూరు, రాయదుర్గం, రాప్తాడు మండలాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. -సాక్షి నెట్వర్క్ గాండ్లపెంట మండలం బనాన్‌చెరువుపల్లికి చెందిన ముద్దిరెడ్డి కళావతమ్మ(47) శనివారం తన అన్న శివారెడ్డి పొలంలో పని చేసి సాయంత్రం ఇంటికొచ్చి సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే కదిరిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ చనిపోయింది. ఇదే మండలం కటారుపల్లికి చెందిన మహమ్మద్ఫ్రీ(36) రెండు నెలల క్రితం విజయవాడకు వెళ్లాడు. అక్కడే రేషం దారం తీస్తూ జీవనం సాగించేవాడు. శనివారం పనిలో ఉండగానే వడదెబ్బకు గురయ్యాడు. తోటి కార్మికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. ఇతనికి భార్య, కుమారుడు ఉన్నారు. గుత్తి పట్టణంలోని దాసర కాలనీలో నివాసముంటున్న ఆర్బీ సుంకమ్మ(55) ఆదివారం కట్టెలు కొట్టడానికి కాలనీ పక్కనే ఉన్న తన పొలంలోకి వెళ్లింది. ఎండ తీవ్రత వల్ల స్పృహ తప్పి పడిపోయింది. అక్కడున్న వారు గమనించి ఇంటికి తీసుకొచ్చారు. ఆస్పత్రికి తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుండగానే ఆమె మృతి చెందింది. ఇదే పట్టణంలోని కమాటం వీధిలో నివాసముండే అబూ సలేహ(40) ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా రిక్షా తోలాడు. ఈ క్రమంలో ఎండకు తాళలేక స్పృహ తప్పి పడిపోయాడు. ఆస్పత్రికి తరలించడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుండగానే మృతి చెందాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. గుత్తి పట్టణంలోని సీపీఐ కాలనీకి చెందిన నక్కా వెంకటరమణ(56) పగలంతా ఎండలో తిరిగాడు. మధ్యాహ్నం అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. ఇంటికి తీసుకొచ్చాక రాత్రి ఎనిమిది గంటల సమయంలో మృతి చెందాడు. గుంతకల్లు పట్టణంలోని బెంచికొట్టాలకు చెందిన ట్యాంకర్ డ్రైవర్ మహబూబ్‌బాషా, హసీనాల పెద్దకుమారుడు షెక్షావలి (8) స్థానిక శ్రీచైతన్య స్కూల్లో రెండవ తరగతి పూర్తిచేశాడు. వేసవి సెలవులు కావడంతో స్నేహితులతో కలిసి శనివారం సాయంత్రం వరకు ఆడుకున్నాడు. సాయంత్రం ఉన్నట్టుండి స్పృహ కోల్పోయాడు. వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. అక్కడి నుంచి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వడదెబ్బతో బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఉరవకొండ మండలం రేణువూకులపల్లికి చెందిన తలారి వన్నూరప్ప (70) శనివారం సొంత పనిపై ఉరవకొండకు వెళ్లాడు. ఉదయుం నుంచి సాయుంత్రం వరకు ఎండలో తిరిగిరాత్రి ఇంటికొచ్చాడు. తనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పాడు. ఆదివారం ఉదయం ఆస్పత్రికి తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయి.. ప్రాణాలొదిలాడు. మండల కేంద్రం యాడికిలోని ఆంజనేయస్వామి కాలనీకి చెందిన రామలక్ష్మమ్మ(38) శనివారం కట్టెల కోసం ఎండలో తిరిగింది. ఇంటికొచ్చి ఎక్కువ నీరసంగా ఉందని చెప్పింది. కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఒక ఆర్ఎంపీ డాక్టర్‌తో చికిత్స చేయించారు. అయినా ఆదివారం తెల్లవారుజామున ఆమె చనిపోయింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మండల కేంద్రం కొత్తచెరువులోని కెంపుల వీధికి చెందిన పండ్ల వ్యాపారి రాజారాం(54) చెన్నేకొత్తపల్లి మండలం ఓబుళంపల్లి సమీపంలో కర్భూజా తోటను తీసుకున్నాడు. ఆదివారం కాయలను కోసి తరలిస్తుండగా ఎండ వేడిమికి స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే చికిత్స నిమిత్తం కొత్తచెరువుకు తీసుకువస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి పంచాయతీలోని జన్మభూమి నగర్‌కు చెందిన ఏసయ్య (55) ఆదివారం మధ్యాహ్నం కాలనీకి నీటి ట్యాంకర్ రావడంతో ఎండ వేడిమిని కూడా పట్టించుకోకుండా వెళ్లాడు. మండే ఎండలోనే నీటిని తీసుకుని వెళుతూ అస్వస్థతకు గురయ్యాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతన్ని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. ఇతనికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ముదిగుబ్బ మండలం మర్తాడు గ్రామానికి చెందిన వెంగముని(70) ఆదివారం వ్యక్తిగత పని నిమిత్తం ధర్మవరం పట్టణానికి వెళ్లాడు. పని ముగించుకుని ఆటోలో తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో ఎండ వేడిమికి తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. హిందూపురం మండలంలోని హనుమేపల్లికి చెందిన రైతుకూలీ రామాంజినప్ప(35) ఆదివారం మధ్యాహ్నం కూలి పనులు చేస్తూ ఆస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అక్కడున్నవారు అతని ముఖంపై నీళ్లుపోసి సపర్యలు చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే మృతిచెందాడు. ఇతను ఉదయం సరైన ఆహారం తీసుకోకుండానే మధ్యాహ్నం వరకు పనులు చేయడంతో ఆస్వస్థతకు గురై మృతిచెందినట్లు కూలీలు తెలిపారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. -అమడగూరు మండలం కందుకూరిపల్లికి చెందిన కుంచపు వెంకటరమణ(65) ఆదివారం గేదెలను కాసేందుకు వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చాడు. నీరు తాగి మంచంపై పడుకున్నాడు. ఎంత సేపటికీ లేవదు. అప్పటికే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. ఇతనికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ధర్మవరంలోని దుర్గానగర్‌కు చెందిన లారీడ్రైవర్ మణియార్ షాజహాన్ (45) శనివారం మధ్యాహ్నం లారీలో ద్రాక్ష లోడు వేసుకుని ఒడిశాకు వెళ్లాడు. తిరుగు ప్రయాణమై వస్తుండగా మార్గమధ్యంలోనే లారీని ఆపి కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. ధర్మవరం మండలం గొట్లూ రు గ్రామానికి చెందిన దాసరి శివయ్య(32) అనే చేనేత కార్మికుడు ఆదివారం సాయంత్రం కదిరి సమీపంలోని ఎర్రదొడ్డి గంగమ్మకు మొక్కులు తీర్చడానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించారు. అప్పటికే మృతి చెందాడు. చిలమత్తూరు మండలం చిన్నన్నపల్లికి చెందిన నారాయణమ్మ (52) ఆదివారం వడదెబ్బతో మృతి చెందింది. ఈమె కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతుండేది. ఆదివారం ఉదయం నుంచి బయట చిన్నచిన్న పనులు చేసింది. ఈ క్రమంలో ఎండవేడిమి తాళలేక అస్వస్థతకు గురై చనిపోయింది. రాయదుర్గం మండలం ఆయతపల్లికి చెందిన గంగప్ప(70) రైతు. ఆదివారం తోటలో పనిచేస్తుండగా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వడదెబ్బకు గురై అక్కడిక్కడే మృతి చెందాడు. నేడు ‘మీ కోసం’ రద్దు అనంతపురం అర్బన్ :జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో సోమవారం నిర్వహించనున్న మీ కోసం కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు సాధ్యమైనంత వరకూ ఎండలో తిరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. -
సూర్య @ 45.2
శింగనమల మండలంలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో సూర్యప్రతాపం కొనసాగుతోంది. ప్రజలు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. వైశాఖం ముగిసిన తరువాత భానుడు భగ్గుమనడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉష్ణోగ్రతలు 40 నుంచి 46 డిగ్రీలు నమోదవుతుండటంతో ‘అనంత’ వేడెక్కిపోయింది. పట్టణాల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారుతుండగా ఎండవేడికి గ్రామీణ ప్రాంతాలు అల్లాడుతున్నాయి. శనివారం కూడా శింగనమల మండలం తరిమెలలో 45.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. యాడికి, కళ్యాణదుర్గం మండలాల్లో వడదెబ్బతో ముగ్గురు మృత్యువాతపడ్డారు. చిన్నారులు, వృద్ధులు, రోజువారీ కష్టజీవులు, ఉపాధి కూలీలు ఉక్కపోతకు సొమ్మసిల్లిపోతున్నారు. మొత్తమ్మీద సూర్యప్రతాపంతో ‘అనంత’ ఉడికిపోతోంది. శింగనమల మండలంలో 45.2 డిగ్రీలు, యల్లనూరు 42.6 డిగ్రీలు, అనంతపురం 42.3 డిగ్రీలు, పామిడి 42.3 డిగ్రీలు, కూడేరు 42.1 డిగ్రీలు, యాడికి, ఆత్మకూరు 42 డిగ్రీలు, పుట్లూరు, విడపనకల్ 41.9 డిగ్రీలు, కళ్యాణదుర్గం 41.7 డిగ్రీలు, తాడిమర్రి, పెద్దవడుగూరు 41.4 డిగ్రీలు, రొద్దం 41.3 డిగ్రీలు, రాయదుర్గం 41.2 డిగ్రీలు, పెద్దపప్పూరు, నార్పల 41.1 డిగ్రీలు, ఉరవకొండ, తనకల్లు 41 డిగ్రీలు మేర నమోదు కాగా తక్కిన మండలాల్లో 38 నుంచి 40 డిగ్రీల మేర వేసవితాపం కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 27 నుంచి 29 డిగ్రీలుగా నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం పూట 60 నుంచి 70 శాతం ఉండగా మధ్యాహ్న సమయానికి 20 నుంచి 30 శాతానికి పడిపోయాయి. మరికొద్ది రోజులు వేసవితాపం కొనసాగే అవకాశం ఉన్నందున వడదెబ్బ సోకకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. -
వడదెబ్బకు 11 మంది బలి
ఎన్నాడూ లేనంతగా.. మూడు రోజులుగా భానుడు ప్రతాపాన్ని చూపుతుండడంతో ఎండ వేడిమిని తాళలేక జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. జిల్లాలో సాధారణం కన్నా మూడు నుంచి ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. గురువారం ఐదుగురు,శుక్రవారం ఆరుగురు మృతి చెందగా.. శనివారం 11 మంది మృత్యువాత పడ్డారు. తొగుట మండలం వెంకట్రావుపేటకు చెందిన బ్యాగరి రాములు (58) వ్యక్తిగత పనుల నిమిత్తం ఊరిలోకి వెళ్లా డు. అయితే గ్రామస్తులతో మాట్లాడుతుండగానే కుప్పకూలి మృత్యువాతపడ్డాడు. మృతుడికి భార్య భూదవ్వ, కుమారులు మహేష్, చందు ఉన్నారు. కల్హేర్ మండలం ఫత్తెపూర్ గ్రామానికి చెందిన జంగం కంఠప్ప (70) శుక్రవారం వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండగా.. అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఇంటికి రాగానే.. వాంతులు, విరేచనాలు చేసుకుంటుండడంతో కుటుంబ సభ్యులు కంఠప్పను రాత్రి స్థానిక ప్రైవే ట్ వైద్యుల వద్ద చికిత్స చేయించారు. రాత్రి పొద్దు పోయాక మృతి చెందాడు. చేగుంట మండలం పొలంపల్లి గ్రామానికి చెందిన టప్ప లక్ష్మి (60) రెండు రోజుల క్రితం చేగుంటకు వచ్చింది. ఇక్కడ భిక్షాటన చేస్తూ మక్కరాజీపేట రోడ్డులో ఉండేది. శనివారం మధ్యాహ్నం మక్కరాజీపేట రోడ్డులోని ఓ సిమెంట్ గోదాం వద్ద అచేతనంగా పడి ఉన్న లక్ష్మిని స్థానికులు గుర్తించారు. దగ్గరకు వెళ్లి చూడగా.. లక్ష్మి మృతి చెంది ఉంది. బ్లూ కోట్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వడదెబ్బతో లక్ష్మి మృతి చెందినట్లు గుర్తించి విష యం పొలంపల్లికి సమాచారం అందించారు. దీంతో మృతురాలు కుమారుడు కిష్టయ్యతో పాటు బంధువులు చేగుంట కు చేరుకుని లక్ష్మి మృతదేహాన్ని గ్రామానికి తరలించారు. టేక్మాల్ మండం ఎలకుర్తి మదిర గ్రామమైన శేర్‌పల్లికి చెందిన దాసరి సాయిలు (40) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా.. గత నెల రోజులుగా మామిడి చెట్లను గుత్తకు తీసుకుని పండ్లను నిజామాబాద్‌కు తరలిస్తూ అక్కడ విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో రెండు రోజులుగా అనారోగ్యానికి గురి కావడంతో ఇంటి వద్దనే ఉన్నాడు. శనివారం వాంతులు, విరోచనాలు చేసుకోవడంతో పాటూ జ్వరం రావడంతో 108లో జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్య లో మృతి చెందాడు. పుల్కల్ మండలం చౌటాకూర్ గ్రా మ పంచాయతీలో వాటర్‌సప్లయ్ కార్మికుడిగా పనిచేస్తున్న లక్ష్మయ్య (65) శనివారం మధ్యాహ్నం గ్రామంలోని వీధులకు నల్లాలకు నీటిని వదిలివచ్చిన అనంతరం ఇంటివద్దకు రాగానే సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లే లోపే మృతి చెందాడు. అదేవిధంగా ఇదే మండలం కొర్పోల్ గ్రామానికి చెందిన గజువాడ రామకృష్టారెడ్డి(70) శుక్రవారం వ్యవసాయ పనులకు వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురై ఇంటికి వచ్చాడు. కుటుంబ సభ్యులు అతడిని సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే రామకృష్ణారెడ్డి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శనివారం మధ్యాహ్నం అదే గ్రామానికి చెందిన వెల్టూరి వీరేశం (19) వడదెబ్బతో మృతి చెందాడు. జహీరాబాద్ మండలం మొగుడంపల్లి గ్రామానికి చెందిన జెట్టమ్మ (45) శనివారం పొలం పనులకు వెళ్లింది. ఎండలో పని చేసిన ఆమె సాయంత్రం ఇంటికి వచ్చింది. ఇంటికి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురి కాగా జెట్టమ్మను కుటుంబ సభ్యులు రాత్రి ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. తూప్రాన్ మండలంలోని కూచారంగ్రామానికి చెందిన డబీల్‌పూర్ మల్ల య్య (65) గురువారం మేడ్చల్ మండ లం అత్వేల్లిలో గల తన కుమార్తె వద్దకు వెళ్తి తిరిగి శుక్రవారం ఇంటికి వచ్చాడు. అయితే అక్కడ ఎండలో తిరగడం వల్ల అస్వస్థతకు గురైన మల్లయ్య అలాగే పడుకున్నాడు. అయితే నిద్రలోనే మృతి చెందాడు. ఈ విషయాన్ని శనివారం ఉద యం కుటుంట సభ్యులు గుర్తించా రు. ములుగు మండలం దామరకుంట గ్రామానికి చెందిన బక్కల పెంటయ్య (65) ఎండల కారణంగా రెండు రోజు లుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించి ఇంటికి తీసుకువచ్చారు. అయితే శనివారం ఉదయం అతడి పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడికి భార్య పిల్లలున్నారు. జిన్నారం మండలం గుమ్మడిదల గ్రామానికి చెందిన చంద్రయ్యగౌడ్ (50) బొంతపల్లి పారిశ్రామిక వాడలోని ఆర్ఎంఎస్ పరిశ్రమలో సెక్యూరిటీ గార్డుగా విధులను నిర్వహిస్తూ శనివారం వడదెబ్బకు గురై మృతిచెందాడు. కాగా.. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని మృతుడి బంధువులు పరిశ్రమ ఎదుట రాత్రి 9 గంటల సమయంలో ఆందోళన చేపట్టారు. కాగా.. నష్టపరిహారాన్ని అందించేందుకు యాజ మాన్యం ముందుకు రాలేదని తెలిసింది. -
అగ్నిగుండం..
♦ పిట్టల్లా రాలుతున్న జనం ♦ వడదెబ్బకు 22 మంది మృతి సాక్షి,గుంటూరు : ఎండ గండంగా మారింది. జిల్లాలో రికార్డు స్థాయిలో ఎండలు మండుతున్నాయి. శుక్రవారం గుంటూరులో 45.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వడదెబ్బకు తాళలేక ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. ఒకే రోజు వడదెబ్బకు 22 మంది మృతి చెందారు. మాచర్ల పట్టణంలోని ఏడవ వార్డుకు చెందిన వేముల గురవయ్య (80), మండలంలోని గన్నవరం గ్రామానికి చెందిన పేర్ల లింగయ్య (50)లు ఇంటివద్ద మరణించారు. పాత మాచర్లకు చెందిన కొమర సైదమ్మ (40)అనే కూలీ పొలం వద్ద మరణించింది. దుర్గి గ్రామంలో పెద్దశెట్టి సుబ్రహ్మణ్యం భార్య పుల్లమ్మ(74)మృతి చెందింది. ముటుకూరు గ్రామానికి చెందిన తిప్పాబత్తుల చెన్నయ్య(45), దుర్గికి చెందిన శింగు పద్మావతి (52)లు మృతి చెందారు. వెల్దుర్తి మండలం చినపర్లపాయ గ్రామానికి చెందిన వడితె హేమిలీబాయి (70) గ్రామ సమీపంలోని పొలంలో పుల్లలు ఏరుతుండగా వడదెబ్బకు గురై మృతిచెందింది. వట్టిచెరుకూరు మండలం పల్లపాడు గ్రామ దళితవాడకు చెందిన ఉండ్రాతి సుబ్బారావు (80) వడదెబ్బకు గురై శుక్రవారం మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. అమృతలూరు మండలం మోపర్రుకు చెందిన కంచర్ల సత్యవతి (59) వడగాలులకు మృతి చెందారు. పెదనందిపాడు మండలం అబ్బినేనిగుంటపాలెంలో సయ్యద్ పఠాన్ మస్తానమ్మ (80), గొల్ల ఆదిమ్మ (60) శుక్రవారం మృతిచెందినట్లు వీఆర్వో ఎం.భార్గవి తెలిపారు. శావల్యాపురం మండలం కనమర్లపూడిలో ఓ యాచక వృద్ధురాలు (65) గురువారం స్థానిక ఆంజనేయస్వామి ఆలయం పక్కన మృతి చెందింది. భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన దేవినేని బాపనయ్య(60) వడదెబ్బకు గురై శుక్రవారం మృతి చెందారు. వడదెబ్బకు నరసరావుపేట పట్టణంలో శతాధిక వృద్ధురాలు దాసరి సీతమ్మ(107) మృతి చెందింది. మండల కేంద్రమైన మాచవరంలో బండారుపల్లి కోటేశ్వరమ్మ(85), చల్లాపల్లి తిరుపతమ్మ(90), క్రోసూరి తిరుపతమ్మ(80)లు ఎండ తీవ్రతను తట్టుకోలేక మరణించినట్లు బంధువులు తెలిపారు. రొంపిచర్ల మండలం వి.రెడ్డిపాలేం గ్రామంలో సత్తెనపల్లికి చెందిన వేమలు వీరయ్య(55) వడదెబ్బకు గురై శుక్రవారం మృతిచెందాడు. యడ్లపాడు మండలం పరిధిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మండంలోని జగ్గాపురానికి చెందిన ముద్దన శివరామయ్య (70) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ పెరిగిన వేడిగాలులకు మృతి చెందాడని స్థానికులు తెలిపారు. కన్నతల్లికి అనారోగ్యంతో ఉందన్న సమాచారం అందుకుని ద్విచక్రవాహనంపై వెళుతున్న గుంటూరు బ్రాడీపేటలోని వైస్రాయ్ హోటల్ సూపర్వైజర్ చెర్లోపల్లి రాము (45) వడదెబ్బకు సొమ్మసిల్లి పడిపోయాడు. చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. వడదెబ్బ తాళలేక ఉండవల్లి గ్రామానికి చెందిన కనసాని రోశయ్య (80) శుక్రవారం మృతిచెందాడు. జయవాడ మొఘల్రాజపురానికి చెందిన అరవపల్లి పరంధామయ్య కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 18వ తేదీ ఇంటి నుంచి వెళ్లిన ఆయన గురువారం రాత్రి పెదకాకాని తోట ఎదురుగా ఆగి ఉన్న కారులో మృతి చెంది ఉన్నాడు. -
ఎండ.. ద డ
అనంతపురం అగ్రికల్చర్ : మూడు రోజులుగా ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపించడంతో ‘అనంత’లో మండే ఎండలు దంచేస్తున్నాయి. వేసవితాపం తారాస్థాయికి చేరుకోవడంతో ఉక్కపోతతో ప్రజలు అలమటిస్తున్నారు. ఉదయం 10 గంటలకే సన్‌స్ట్రోక్ మొదలవుతుండటంతో బయటకు రావడానికి జనం బెంబేలెత్తుతున్నారు. వృద్ధులు, పిల్లలు, కష్టజీవుల పరిస్థితి దారుణంగా తయారైంది. మధ్యాహ్న సమయంలో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. నీరు, నీడ కోసం జనం ఎగబడుతున్నారు. మొత్తమ్మీద వేసవికాలం ముగింపునకు వచ్చేసరికి ఎండతీవ్రత జనానికి ముచ్చెటమలు పట్టిస్తున్నాయి. గురువారం శింగనమల మండలం తరిమెలలో గరిష్టంగా 43.3 డిగ్రీలుగా నమోదైంది. గార్లదిన్నె, యల్లనూరు 42.8 డిగ్రీలు, గుంతకల్లు 42.3 డిగ్రీలు, పెద్దవడుగూరు, యాడికి 42.1 డిగ్రీలు, రాప్తాడు 41.9 డిగ్రీలు, తనకల్లు 41.8 డిగ్రీలు, విడపనకల్ 41.7 డిగ్రీలు, తాడిమర్రి 41.4 డిగ్రీలు, పామిడి 41.3 డిగ్రీలు, కూడేరు 41.3 డిగ్రీలు, పుట్లూరు 41.2 డిగ్రీలు, అనంతపురం 41.1 డిగ్రీలు, ఆత్మకూరు 40.9 డిగ్రీలు, పెద్దపప్పూరు, బెళుగుప్ప 40.8 డిగ్రీలు, కదిరి 40.4 డిగ్రీలు, వజ్రకరూరు 40.3 డిగ్రీలు, బత్తలపల్లి 40.2 డిగ్రీలు మేర నమోదయ్యాయి. మిగతా మండలాల్లో గరిష్టంగా 38 నుంచి 40 డిగ్రీలు, కనిష్టంగా 26 నుంచి 28 డిగ్రీలు నమోదయ్యాయి. అలాగే గాలిలో తేమశాతం ఉదయం పూట 65 నుంచి 75 ఉండగా మధ్యాహ్న సమయానికి 25 నుంచి 35 శాతానికి పడిపోయింది. నెలాఖరు వరకు ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతుండటంతో జనం హడలిపోతున్నారు. -
భగభగ
►మంగళవారం 43 డిగ్రీలు ►అల్లాడిపోతున్న జనం ►రోడ్లన్నీ నిర్మానుష్యం ►వడదెబ్బతో ఇద్దరి మృతి నెల్లూరు (అర్బన్) : భానుడు మండిపోతున్నాడు. తన ప్రతాపాన్ని పెంచేసి నిప్పులుగక్కుతున్నాడు. మే నెల కావడంతో జిల్లాలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. రోజురోజుకు ఎండలు పెరుగుతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. సోమవారం నుంచి సూర్యుడు భగభగమండుతున్నాడు. సోమవారం 39.9 డిగ్రీ ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండదెబ్బకు జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. రాత్రివేళల్లో కూడా ఉష్ణోగ్రత ఎక్కువగానే ఉంటున్నాయి. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. పల్లె ప్రాంతాల్లో కరెంటు కోతల కారణంగా చిన్న పిల్లలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. ఉపశమనం కోసం చెట్లకిందకు చేరుతున్నారు. ఎండలు కారణంగా ప్రజలు ఉదయం 10 గంటల తర్వాత రోడ్ల మీదకు వచ్చేందుకు భయపడుతున్నారు. సాయంత్రం ఎండ తగ్గాక బయటకు వచ్చే పరిస్థితులు వచ్చాయి. ఆగని వడదెబ్బ మృతులు ఎండలు కారణంగా వడదెబ్బకు గురై వృద్ధులు మృతిచెందుతున్న సంఘటనలు జిల్లావ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయి. ఈనెల 2వ తేదీన ఓజిలిలో ఒకరు, 8న గూడూరులో ఒకరు, 10న దొరవారిసత్రంలో ఒకరు, సూళ్లూరుపేటలో ఒకరు, 15వ తేదీ గూడూరులో ఒకరు మృతిచెందారు. ఒక్క మంగళవారం రోజే ఇద్దరు మృతిచెందారు. చిల్లకూరు మండలం తిప్పగుంటపాళెంలో ఒకరు, సూళ్లూరుపేటలో ఒకరు మృతిచెందారు. వీటిని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. వడదెబ్బ మృతులను తగ్గించాలంటూ డీఎంహెచ్ఓ భారతీరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించి ఆదేశాలు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో దీని గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎండలు ఎక్కువగా ఉన్నందున వడదెబ్బకు ఎవరూ చనిపోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
సిటీ హాట్ గురూ..
హైదరాబాద్: ఎండ ప్రచండమవుతోంది. తోటల నగరంగా పేరొందిన సిటీలో పచ్చదనం కరువవుతోంది. నగర విస్తీర్ణం మేరకు గ్రీన్‌బెల్ట్ 30 శాతం ఉండాల్సి ఉండగా.. కేవలం 8 శాతమే ఉంది. ఈ కారణంగానే వేసవి ఉష్ణోగ్రతలు ప్రజల్ని సొమ్మసిల్లేలా చేస్తున్నాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సిటీల్లో మనది రెండో స్థానంలో నిలిచింది. పాలకులు, ప్రజలు మేల్కొని పచ్చదనాన్ని పెంచకపోతే భవిష్యత్తులో పెనుముప్పు తప్పదు! శతాబ్దాలుగా తోటల నగరం(భాగ్)గా ప్రసిద్ధి చెందిన భాగ్యనగరంలో ఇపుడు గ్రీనరీ తగ్గుతోంది. ఫలితంగా వేసవి తాపం పెరుగుతోంది. రహదారులు, బహుళ అంతస్తుల భవంతులు శరవేగంగా విస్తరిస్తుండడంతో హరిత వాతావరణం క్రమేణా కనుమరుగవుతోంది. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకున్న తరుణంలో వేసవి తాపం పెరిగి చిన్నారులు, వృద్ధులు, రోగులు విలవిల్లాడుతున్నారు. హైదరాబాద్ నగర పాలక సంస్థ విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు. ఇందులో సుమారు 50 చదరపు కిలోమీటర్ల పరిధిలో గ్రీన్‌బెల్ట్ ఉందని జీహెచ్ఎంసీ లెక్కలు చెబుతున్నాయి. అంటే మొత్తం విస్తీర్ణంలో సుమారు 8 శాతమే హరిత వాతావరణం ఉందన్నమాట. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో 30 శాతం గ్రీన్బెల్ ్ట(హరితవాతావరణం) ఉండాల్సి ఉండాలి. ఇక మన పొరుగునే ఉన్న బెంగళూరు మహానగరంలో 13 శాతం (97 చదరపు కిలోమీటర్ల) మేర గ్రీన్‌బెల్ట్ ఉండడం విశేషం. చేజేతులా... వేసవిలో ఉదయం, సాయంత్రం పొడి వాతావరణం, మధ్యాహ్నం ఎండవేడిమి తీవ్రంగా బాధించినా..రాత్రి వేళ చల్లటి నిర్మలమైన వాతావరణం హైదరాబాద్ నగరానికున్న ప్రత్యేకత. ఉబ్బసం వ్యాధిగ్రస్తులకూ నగర వాతావరణం ఉపశమనం కలిగిస్తుందన్న పేరుంది. కానీ ఈ పరిస్థితిని మనమే చేజేతులా దూరం చేసుకుంటున్నాం. శరవేగంగా రహదారుల విస్తరణ, బహుళఅంతస్తుల భవంతులు, వాణిజ్య సముదాయాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నా..మొక్కల సంఖ్య అంతకంతకూ పెరగకపోవడంతో మోటారు వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న గ్రీన్హౌజ్వాయువులైన కార్బన్‌డయాకై్సడ్, కార్బన్ మోనాకై్సడ్ వంటి వాయువుల ఉద్గారాలు పెరిగి వేసవి తాపం ఉక్కిరిబిక్కిరిచేస్తోంది. మెట్రోనగరాల్లో వేసవి తాపం ఇలా.. మన దేశంలోని పలు మెట్రో నగరాల్లో మండుటెండలు కాసే మే నెలలో వేసవి తాపాన్ని పరిశీలిస్తే దేశరాజధాని ఢిల్లీ అగ్రభాగాన నిలిచింది. గత వందేళ్ల సగటును పరిశీలిస్తే ఇక్కడ గరిష్టంగా 40.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడం విశేషం. కొన్ని సార్లు ఉష్ణోగ్రతలు గరిష్టంగా 48 డిగ్రీలు నమోదయిన సందర్భాలున్నాయి. ఇక హైదరాబాద్ 39.0 సగటు ఉష్ణోగ్రతలతో రెండోస్థానాన్ని ఆక్రమించింది. మూడో స్థానం మన పొరుగునే ఉన్న చైన్నైది. ఇక్కడ 37.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆతర్వాత 35.5 డిగ్రీల ఉష్ణోగ్రతలతో కోల్కత్తా నాలుగోస్థానంలో నిలిచింది. దేశ వాణిజ్య రాజధాని ముంబాయి 33.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలతో ఐదవ స్థానంలో ఉంది. హరిత నగరంగా పేరొందిన బెంగళూరు 33.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలతో కూల్‌సిటీగా పేరుగాంచడం విశేషం. పలు మెట్రోల్లో మే నెల ఇలా ఉంటుంది... బెంగళూరు: ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సగటున 33 డిగ్రీల మేర ఉంటాయి. మధ్యాహ్నం ఎండవేడిమి మోస్తరుగా ఉన్నా..సాయంకాలం ఆహ్లాదకరంగా ఉంటుంది. వేసవిలో సేదదీరేందుకు ఈ నగరం ఎంతో అనువైనది. ముంబయి: మండువేసవిలో పగలు ఉక్కపోత ఉక్కిరిబిక్కిరిచేస్తుంది. గాలిలో తేమ శాతం అధికంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు కొన్ని రోజులపాటు 40 డిగ్రీల మేర నమోదవుతాయి. ఎండవేడిమి తట్టుకోవడం కాస్త కష్టమే. ముంబాయి పర్యటన మే నెలలో వాయిదా వేసుకోవడమే మంచిది. ఢిల్లీ: ఎండవేడిమిని తట్టుకోవడం కష్టమే. గరిష్టంగా కొన్నిసార్లు 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. టూరిస్టులు వేసవిలో రాజధానిని సందర్శిస్తే సొమ్మసిల్లాల్సి వస్తుందని టూర్ ఆపరేటర్లు చెబుతున్నారు. చెన్నై: ఆర్థశుష్క పొడి వాతావరణం ఉంటుంది. వాతావరణంలో రోజురోజుకూ శరవేగంగా మార్పులు చోటుచేసుకుంటాయి.భరించలేని ఉక్కపోతతో సతమతమవడం తథ్యం. వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. పరిష్కారాలివే.. నగరంలోఉన్న చెరువుల చుట్టూ పెద్దమొత్తంలో మొక్కలు నాటి గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు చేయాలి. తద్వారా భూగర్భజలమట్టాలు పెరిగి, పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. బహుళ అంతస్తుల భవంతులు నిర్మిస్తున్నవారు విధిగా కొంతవిస్తీర్ణంలో మొక్కలు పెంచుతామని, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తామని డిక్లరేషన్ ఇచ్చిన తరవాతనే వారికి జీహెచ్ఎంసీ అనుమతులు మంజూరు చేయాలి. నూతన కాలనీల్లో 30 శాతం గ్రీన్‌బెల్ట్ ఉండేలా చూడాలి. నూతన లే అవుట్లకు అనుమతులిచ్చే సమయంలో ఈ విషయాన్ని తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి.