తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బ మృతులు | sunstroke deaths raising in telugu states | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బ మృతులు

Published Mon, May 25 2015 12:28 PM | Last Updated on Sun, Sep 3 2017 2:40 AM

sunstroke deaths raising in telugu states

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సూర్య 'ప్రతాపం' కొనసాగుతోంది. ప్రఛండ భానుడు నిప్పులు కక్కుతుండడంతో జనం విలవిలలాడుతున్నారు. వడదెబ్బతో పిట్టల్లా రాలుతున్నారు. సోమవారం వివిధ ప్రాంతాల్లో పలువురు వడదెబ్బ కారణంగా మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్:

  • ప్రకాశం జిల్లాలో వడదెబ్బకారణంగా ముగ్గురు మృతి చెందారు. నెట్టెంపాడు మండలం నారపల్లిలో వెంకటస్వామి(65) వడ దెబ్బతో మృతి చెందాడు.
  • వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరులోని బలిజ వీధికి చెందిన మాదా పద్మావతమ్మ (70) నాలుగు రోజులు నుంచి విరేచనాలు, వాంతులు, నీరసంతో బాధపడుతుండగా సోమవారం ఉదయం మృతి చెందింది.
  • కర్నూలు: వెల్దుర్తి మండలంలో సోమవారం ఓ వృద్ధుడు వడద్బెకు మృతి చెందాడు. మండలంలోని రామల్లకోట గ్రామంలో వీరశేఖర(68) ఎండ తీవ్రతను తట్టుకోలేక తీవ్ర అస్వస్థతతో ప్రాణాలొదిలాడు.

తెలంగాణ:

  • ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన శేర్ల పెద్దయ్య ఆదివారం ఇళ్లకు తడికెలు అల్లే పనికి వెళ్లి ఎండవేడికి అస్వస్థత పాలయ్యాడు. సోమవారం వేకువ జామున మృతి చెందాడు.
  • రంగారెడ్డి జిల్లా పరిగి మండలం సయ్యద్ మల్కాపూర్‌కు చెందిన స్మిత (18) కూడా వడదెబ్బ కారణంగా సోమవారం ఉదయం మృతి చెందింది.
  • మెదక్ జిల్లా సిద్ధిపేల మండలం లక్ష్మీందేవపల్లిలో వడదెబ్బతో ఇద్దురు మృతి చెందారు.
  • ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టాపురంలో వడదెబ్బకు మహిళ మృతి చెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement