Sunstroke deaths
-
పిట్టల్లా రాలిపోతున్నారు!
వాతావరణ మార్పుల కారణంగా దేశంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో పెరుగుతున్న వడగాడ్పులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వేడి గాలులు, వడదెబ్బకు దేశంలో దశాబ్ద కాలంలో 10 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. 2013 నుంచి 2022 మధ్య అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 10,635 మంది ప్రాణాలొదిలారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, కేంద్ర హోం శాఖలో నమోదైన వేడిగాలులు, వడదెబ్బ మరణాల వివరాలను మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పార్లమెంట్లో వెల్లడించింది. – సాక్షి, అమరావతిఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో 15వ స్థానంలో ఏపీదేశంలో వేగంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న రాష్ట్రాల్లో 15వ స్థానంలో ఏపీ ఉంది. ఈ విషయం అమెరికాకు చెందిన క్లైమేట్ సెంట్రల్ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. 1970 నుంచి 2023 మధ్య ఐదు దశాబ్దాల్లో దేశంలో ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులపై ఈ సంస్థ అధ్యయనం చేసింది. ఈ క్రమంలో 1970తో పోలిస్తే 2023లో ఏపీలో 0.9 డిగ్రీల మేర ఉష్ణోగ్రత పెరిగినట్టు వెల్లడైంది. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ నుంచి జూన్ మధ్య ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు పేర్కొంది. మానవ ప్రమేయంతో వాతావరణంలో వచ్చే మార్పులే ఉష్ణోగ్రతల పెరుగుదలకు ప్రధాన కారణమని స్పష్టం చేసింది.ఏపీలో 2015లోనే 654 మరణాలుదేశ వ్యాప్తంగా పదేళ్లలో 10 వేల మందికిపైగా మరణించగా అందులో ఏపీ నుంచే అత్యధికంగా 2,203 మరణాలున్నాయి. 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో వేడిగాలులు, వడదెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలారు. అప్పట్లో వడదెబ్బ ముప్పు నుంచి రక్షణ పొందడం, బాధితులకు సత్వర చికిత్సలు ఇతర అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించలేదు. దీంతో రాష్ట్రంలో పదేళ్లలో 2,203 మరణాలు సంభవించగా.. 2014–19 మధ్యనే 1,538 మరణాలు సంభవించాయి. అత్యధికంగా 2015లో 654 మరణాలున్నాయి. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం జగన్ ప్రభుత్వం వడదెబ్బ మరణాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. వేసవిలో వడదెబ్బ, వేడిగాలుల నుంచి రక్షణ పొందడంపై వైద్య శాఖ సిబ్బంది ద్వారా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. గర్భిణులు, చిన్నారులకు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీని చేపట్టడంతో పాటు, ఆస్పత్రుల్లోను ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి బాధితులకు సత్వర వైద్యం అందించింది. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వంలో వందల సంఖ్యలో ఉన్న మరణాలను గణనీయంగా నియంత్రించారు. దీంతో 2019లో 128.. 2020లో 50.. 2021లో 22.. 2022లో 47 చొప్పున మాత్రమే మరణాలు సంభవించాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 2014 నుంచి 2022 మధ్య 1,172 మరణాలు సంభవించాయి. -
వడదెబ్బతో విద్యార్థిని మృతి
కామారెడ్డి టౌన్ : వడదెబ్బ సోకి చికిత్స పొందు తూ 15 ఏళ్ల విద్యార్థిని మృతి చెందిన ఘటన కా మారెడ్డి జిల్లా కేంద్ర ప్రభు త్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. క్యాసంపల్లి తండాకు చెందిన ఇస్లావత్ నాజు–నీలా దంపతుల పెద్ద కూతురు లావణ్యకు వాంతులు, తీవ్ర జ్వరం రావడంతో మంగళవారం ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకొచ్చారు. బుధవారం మధ్యాహ్నం లావణ్య ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు రాజధానికి తీసుకెళ్లాలని చెప్పారు. ఆమెను జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందిందని అక్కడి వైద్యులు తెలిపారు. దీంతో బంధువులు మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకొచ్చి ధర్నాకు దిగారు. సీ ఐ నరేష్ వారిని సముదాయించారు. ఆర్ఎంవో శ్రీ నివాస్ మాట్లాడుతూ వైద్యుల నిర్లక్ష్యం ఏమీ లేదన్నారు. లావణ్యకు మెదడులో రక్తం గడ్డ కట్టిందన్నారు. -
వడదెబ్బ కారణంగా పలువురు మృతి
వడదెబ్బ కారణంగా పలువురు మృతి -
భగభగల సూరీడు: వడదెబ్బతో చనిపోతే .. సాయం పొందండిలా
నేరడిగొండ(అదిలాబాద్): వేసవిలో ఎక్కువగా వడదెబ్బకు గురవుతుంటారు. అనేక మంది దీనిని గుర్తించలేక ప్రాణాలు కోల్పోతుంటారు. ఇలాంటి వారికి ప్రభుత్వం నష్టపరిహారం అందజేస్తోంది. దీనికోసం త్రిసభ్య కమిటీ పనిచేస్తోంది. వడదెబ్బకు సంబంధించి ప్రతి మండలానికి ఒక కమిటీ ఉంటుంది. ఈ కమిటీ వడదెబ్బకు గురై చనిపోయిన వారి వివరాలు సేకరించి నివేదికను కలెక్టర్‌కు పంపించాల్సి ఉంటుంది. కలెక్టర్ పరిశీలించిన తర్వాత రూ.50వేల పరిహారం మంజూరవుతుంది. మండలానికో త్రిసభ్య కమిటీ వడదెబ్బ మృతుల నిర్ధారణకు మండలానికి ఒక త్రిసభ్య కమిటీ ఉంటుంది. ఇందులో తహసీల్దార్, ఎస్సై, వైద్యాధికారి సభ్యులుగా ఉంటారు. ఎవరైనా వడదెబ్బతో మరణిస్తే ముందుగా కమిటీ సభ్యులకు సమాచారం అందించాలి. ఆ వ్యక్తి వడదెబ్బతో మృతి చెందినట్లు ముందుగా వైద్యాధికారి ధ్రువీకరించాలి. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తారు. పోస్టుమార్టం నివేదికను వైద్యాధికారి పోలీస్ స్టేషన్‌కు అందజేస్తే ఎఫ్ఐఆర్ ఆధారంగా వడదెబ్బ మృతిగా నిర్ధారిస్తారు. ఈ నివేదికను తహసీల్దార్ ద్వారా ఆర్డీఓకు అక్కడి నుంచి కలెక్టర్ పరిశీలించిన తర్వాత పరిహారాన్ని బాధిత కుటుంబానికి విడుదల చేస్తారు. వీటిపై ప్రజలు తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పోస్టుమార్టం తప్పనిసరి వడదెబ్బతో మరణిస్తే తప్పనిసరిగా పోస్టుమార్టం నిర్వహించాలి. కేసు లేకుండా, పోస్టుమార్టం లేకుండా ఎలాంటి పథకం వర్తించదు. ప్రాణాలు ఎంతో విలువైనవి. వడదెబ్బ తగలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. – మహేందర్, ఎస్సై, నేరడిగొండ కలెక్టర్‌కు నివేదిక అందజేస్తాం వడదెబ్బ కారణంగా ఎవరైనా మరణిస్తే త్రిసభ్య కమిటీకి సమాచారం ఇవ్వాలి. డాక్టర్ వద్ద రిపోర్ట్ తీసుకుంటాం. కేసు వివరాలు ఎస్సై మాకిస్తే కలెక్టర్‌కు పంపిస్తాం. ఎండ తీవ్రత అధికంగా ఉంది. ప్రజలు జాగ్రత్తలుపాటించాలి. – పవన్‌చంద్ర, తహసీల్దార్, నేరడిగొండ సమాచారం అందించాలి వడదెబ్బ తగులుతున్న వారిలో అధిక శాతం కూలి పనులకు వెళ్లేవారు, రైతులే ఉంటారు. పని సమయంలో గానీ పనులకు వెళ్లి వచ్చాక గానీ మరణిస్తే వెంటనే సమాచారం అందించాలి. డాక్టర్ నివేదిక తప్పనిసరిగా తీసుకోవాలి. – ఆనంద్‌కుమార్, పీహెచ్సీ వైద్యుడు, నేరడిగొండ చదవండి: 'ఆమెకు 11 లక్షలు ఇస్తే.. రూ.5 కోట్లుగా మారుస్తుంది' -
నేడు.. రేపు పిడుగుల వాన!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకపక్క అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోపక్క ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో బుధవారం ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. మరోవైపు తూర్పు మధ్యప్రదేశ్ నుంచి ఉత్తర కర్నాటక వరకు విదర్భ, మరఠ్వాడా, మధ్య మహారాష్ట్రల మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ఫలితంగా గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలతో పాటు పిడుగులు కూడా పడనున్నాయి. అదే సమయంలో రాయలసీమలో గంటకు 30–40, కోస్తాంధ్రలో 50–60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం రాత్రి నివేదికలో తెలిపింది. ఇలావుండగా రాయలసీమలో రానున్న రెండు రోజులు వడగాడ్పులు కొనసాగనున్నాయి. కోస్తాంధ్రలో సాధారణంకంటే 2–3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. గడచిన 24 గంటల్లో సీతానగరంలో 5, పార్వతీపురం, పాలకొండలలో 4, సీతారాంపురం, దువ్వూరు, వీరఘట్టంలలో 3, పాతపట్నం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, కంబం, బలిజపేట, పులివెందుల, చాపాడుల్లో 2 సెం.మీల చొప్పున వర్షపాతం రికార్డయింది. పిడుగు పాటుకు ఇద్దరు గొర్రెల కాపరుల మృతి పెద్దపంజాణి / గురజాల: చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలో బుధవారం పిడుగు పాటుకు ఇద్దరు గొర్రెల కాపరులు మృతి చెందారు. కోగిలేరు పంచాయతీ బసవరాజుకండ్రిగ గ్రామానికి చెందిన అబ్బన్న కుటుంబ సభ్యులు గొర్రెలు మేపుకొంటూ జీవనం చేస్తున్నారు. రోజులాగే అబ్బన్న భార్య నాగమ్మ(68), మనవడు శశికుమార్(17)తో కలిసి గొర్రెలను సమీపంలోని పొలాలకు తీసుకెళ్లారు. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములతో కూడిన వర్షం కురవడంతో ఇద్దరూ సమీపంలోని మామిడి చెట్ల కిందకు వెళ్లారు. సమీపంలో పిడుగు పడటంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పరిసర ప్రాంతంలోని రైతులు మృతదేహాలను చూసి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు.. పెద్దపంజాణి ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా గుంటూరు జిల్లా గురజాల మండలంలో బుధవారం సాయంత్రం భారీ ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం పడింది. మధ్యాహ్నం 4 గంటల నుంచి 5 గంటల వరకు వర్షం కురవడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. 31.4 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అక్కడక్కడా చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. అదే సమయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం వడదెబ్బ తగిలి నలుగురు మృత్యువాత పడ్డారు. -
భానుడి ప్రతాపంతో ప్రజలు బెంబేలు
సాక్షి, హైదరాబాద్: భానుడి ప్రకోపానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు విలవిలలాడుతున్నారు. రోహిణి కార్తె నేపథ్యంలో ఎండలు, వేడి గాలులు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. రాష్ట్రంలో రానున్న మూడు రోజులు తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని పేర్కొంది. ఆదిలాబాద్, నల్లగొండ, నిజామాబాద్, హన్మకొండ జిల్లాల్లో అత్యధికంగా 46 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. మెదక్‌లో 45 డిగ్రీలు, రామగుండంలో 45, ఖమ్మంలో 44, భద్రాచలంలో 42, హైదరాబాద్‌లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గర్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. వడదెబ్బకు 35 మంది మృతి రాష్ట్రంలో వడదెబ్బకు బుధవారం 35 మంది మృతి చెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 21 మంది, కరీంనగర్ జిల్లాలో 8 మంది, ఖమ్మం జిల్లాలో నలుగురు, రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. -
భానుడి భగభగ
మంచిర్యాల అగ్రికల్చర్ : రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఉమ్మడిజిల్లా అగ్నిగుండలా తలపిస్తుంది. ఆదివారం 45.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా కనిష్ట ఉష్ణోగ్రత 32.5 డిగ్రీలుగా నమోదైంది. ఈ ఏడాది ఇదే అత్యధికం. గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరకుంటుంటే కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం 35 డిగ్రీలకు చేరుతున్నాయి. దీంతో రాత్రిపూట కూడా వేడిగాలుల ప్రభావం చూపుతోంది. మూడు రోజులుగా భానుడు నిప్పులు చెరుగుతుండడంతో జనాలు బయటికి రావడానికి భయపడుతున్నారు. గాలిలో తేమశాతం తగ్గడంతో ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో వడదెబ్బదాటికి మార్చి నుంచి ఇప్పటి వరకు 22 మంది మృతి చెందారంటే పరిస్థితి ఎవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రోజుకు ఒకరిద్దరు చొప్పున వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. బొగ్గుబావులు, ఓపెన్‌కాస్టులు ఉన్న ప్రాంతాల్లో ఆదివారం మధ్నాహ్నం ఉష్ణోగ్రతలు 47 నుంచి 48 డిగ్రీలకు చేరుకున్నాయి. దీంతో ఓపెన్ కాస్టుల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు అల్లాడిపోయారు. అడవులు అంతరిస్తుండటం, జలాశయాలు అడుగంటడం.. తదితర కారణాల వల్ల ఎండ తీవ్రత ఏటేటా పెరుగుతోంది. సాయత్రం 6 గంటలు దాటితే కాని జనాలు బయటికి రాని పరిస్థితి. వాహన చోదకులు ముఖానికి రక్షణ లేకుండా బయటకు రావడం లేదు. అడవుల జిల్లాగా పెరుగాంచిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఏటా మే నెలలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. వాగులు, బోరు బావులుల్లో నీరు అడుగంటుతున్నాయి. గ్రామాల్లో తీవ్ర నీటిఎద్దడి తలెత్తుతోంది. మే నెలలో ఎండల తీవ్రత ఏ విధంగా ఉంటుందోనని ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. భానుడు.. బ్యాండ్ బాజా ఇదే నెలలో అత్యధికంగా పెళ్లిళ్లు ఉన్నాయి. ఇటు ఎండలతో ఇళ్లలో ఉక్కపోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఎండల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లేవారు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదాల బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రయాణాలు చేసేటప్పుడు... ►శరీరాన్ని పట్టుకునేలా ఉండే దుస్తులను కాకుండా కొద్దిగా వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. దీంతో ఉక్కపోత నుంచి ఉపశమనం పొందవచ్చు. ►సాధ్యమైనంత మేరకు ఉదయం చల్లగా ఉన్న సమయంలోనే వివాహాలకు బయలుదేరాలి. అక్కడ బంధువులతో కాలక్షేపం చేస్తూ సాయంత్రం వరకు ఉంటే మేలు. ► ముఖ్యంగా వ్యాన్, లారీల్లో వెళ్లాల్సి వస్తే.. వాటిపై తాటిపత్రిలాంటివి వేసుకోవాలి. ఇరుకుగా కాకుండా తక్కువ మోతాదులో మందిని తరలించేలా ఏర్పాటు చేసుకోవాలి. ►తప్పనిసరిగా తగినంత మేర చల్లని నీటిని తీసుకెళ్లాలి. ►వాహనాలపై వెళ్లాల్సి వస్తే తల, ముక్కు, చెవులకు నిండుగా ఉండేలా కాటన్ టవల్, కర్చీఫ్ కానీ కట్టుకోవాలి. కళ్లకు చల్లని చలువ అద్దాలు పెట్టుకోవాలి. గోడుగు, టోపి వెంట తీసుకెళ్తే మేలు. ►నీళ్లు, పండ్ల రసాలను తీసుకోవాలి. ఎండకు తిరిగి వచ్చిన వెంటనే బాగా చల్లని నీరు ఒకేసారి తీసుకోకూడదు. ►త్వరగా జీర్ణమయ్యే తేలికపాటి ఆహారం, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ► తక్కువ మోతాదులో ఎక్కువసార్లు నీటిని తాగాలి. ►నిమ్మరసంలో ఉప్పు, చక్కెర కలిపి తాగాలి. ►సోడియం, పొటాషియం ఉన్న ద్రవపదార్థాలు తీసుకోవాలి. ►వడదెబ్బకు గురైన వారిని చల్లని లేదా నీడ ప్రదేశానికి తీసుకెళ్లాలి. ►నుదుటిపై తడిగుడ్డ వేసి తడుస్తూ శరీర ఉష్ణోగ్రతను తగ్గించాలి. ►బీపీ లేదా పల్స్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ►గాలి ఎక్కువగా తగిలేలా చూడాలి. ►నీరు ఎక్కువగా తాగించాలి. ►అవసరాన్ని బట్టి వైద్యుడికి చూపించి ప్రాథమిక చికిత్స అందించాలి. వారంరోజుల్లో నమోదైన ఉష్ణోగ్రతలు తేదీ కనిష్టం గరిష్టం 22 27.6 40.8 23 27.5 39.8 24 27.4 42.3 25 26.8 43.3 26 29.8 44.3 27 32.4 44.8 28 32.5 45.3 జిల్లాలో ఐదేళ్లలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు, ప్రాంతాలు సంవత్సరం ప్రాంతం ఉష్ణోగ్రత 26–04–2014 దండేపల్లి 46.3 29–04–2015 దండేపల్లి 45.6 26–04–2016 దండేపల్లి 48.8 21–04–2017 జన్నారం 45.0 21–04–2018 దండేపల్లి 44.3 27–04–2019 దండేపల్లి 45.3 -
సాయం..శూన్యం!
కర్నూలు(అగ్రికల్చర్): ఏటా పెరుగుతున్న ఎండల తీవ్రతకు కష్టజీవులు వడదెబ్బకు గురై అశువులు బాస్తున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నాలుగేళ్ల నుంచి ఒక్క మృతుడి కుటుంబానికి కూడా చేయూతనివ్వలేదు. 2014–17మధ్య కాలంలో 192 మంది వడదెబ్బతో మృతి చెందారని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ఒక్కరికి కూడా పరిహారం మంజూరు కాకపోవడంతో కుటుంబ పెద్ద మృతితో ఆయా కుటుంబాలు వీధిన పడుతున్నా పాలకుల్లో కనికరం లోపించడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. పరిహారం నిల్.. సాధారణంగా వడదెబ్బ మరణాలను మండల తహసీల్దార్, ఎస్ఐ, మెడికల్ ఆఫీసర్లతో కూడిన బృందం ధృవీకరిస్తుంది. వీటికి ప్రత్యేకంగా పోస్టుమార్టం లేకపోయినప్పటికీ ముగ్గురు సభ్యులున్న మండలస్థాయి బృందం ధృవీకరించాలి. వడదెబ్బ మరణాలని ఈ కమిటీ నిర్ధారించిన్పటికీ ప్రభుత్వం నుంచి చేయూత దక్కకపోవడం గమానార్హం. రాష్ట్రం మొత్తం మీద 2014 నుంచి వడదెబ్బతో 2776 మంది మరణించగా జిల్లాలో 192 మంది మరణించినట్లు ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. మృతుల్లో ఒక్కరికి కూడా పరిహారం చెల్లించలేదు. గతంలో.. వడదెబ్బ మృతులు, ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు గతంలో ఆపద్బందు పథకం కింద రూ.50వేల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ఇచ్చేది. టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేయడంతో పేదలు మరణిస్తే ఆ కుటుంబాలకు చేయూత అందకుండా పోతోంది. చలివేంద్రాలు, చలువ పందిళ్లు, మజ్జిగ పంపిణీలో నిధులు భారీగా దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలున్నాయి. జిల్లాలో రూ.కోటి ఖర్చు పెడితే ఇందులో రూ.50 లక్షల వరకు దుర్వినియోగం జరిగినట్లు విమర్శలున్నాయి. స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన చలివేంద్రాలను సైతం ప్రభుత్వ ఖాతాలో వేశారనే ఆరోపణలున్నాయి. 2017లో మరణాల సంఖ్య తగ్గింపు.. 2014 నుంచి 2016 వరకు జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతలతో పోలిస్తే 2017లో ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్రత పెరిగి వడదెబ్బ మరణాలు పెరిగాయి. వివిధ వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు దాదాపు 100 మంది వరకు వడదెబ్బతో మృతి చెందారు. అయితే మరణాల సంఖ్యను తగ్గించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు సంఖ్యను తక్కువగా చూపారు. 2016లో 65 మంది మరణించినట్లు లెక్కలు ఉన్నా.. 2017లో కేవలం 8 మంది మాత్రమే మృతి చెందారని అధికారుల లెక్కలు పేర్కొంటున్నాయి. ఉద్దేశ్య పూర్వకంగానే మరణాల సంఖ్యను తగ్గించినట్లు తెలుస్తోంది. చలివేంద్రాల పేరుతో నిధులు వృథా.. చలివేంద్రాలు, చలువ పందిళ్లు, మజ్జిగ పంపిణీ పేరుతో జిల్లాలో ఏటా రూ.కోటి వరకు ఖర్చు చేస్తున్నారు. అయితే ప్రాణాలు కోల్పోయిన పేద కుటుంబాలకు మాత్రం పరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 2014 నుంచి వడదెబ్బ మరణాలు ఇలా... సంవత్సరం మృతుల సంఖ్య 2014 43 2015 76 2016 65 2017 8 మొత్తం 192 -
ఏలినోరి బాధ్యత ఎండల్లో ఆవిరి
సమకాలీనం ఉమ్మడి ఏపీలో ఏటా సంభవించినన్ని వడదెబ్బ మరణాలు తెలంగాణ, ఏపీలలో విడివిడి గానే నమోదవుతున్నాయి. శాస్త్ర సాంకేతికత పెరిగి కచ్చితమైన ముందస్తు హెచ్చరికలు అందు తున్నా నివారణ చర్యలుండటం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే అరకొర చర్యలు మరీ మొక్కుబడిగా, కాగితాలకు పరిమితమైనవిగా ఉంటున్నాయి. మనిషి ప్రాణానికి విలువిచ్చే చిత్తశుద్ధి ఉంటేనే, వడదెబ్బ మరణాల్ని సర్కార్లు నిలువరించగలుగుతాయి. సగటు మనిషి ప్రాణాలతో పాటు, సర్కార్ల పరువూ నిలబడుతుంది. ఇది మీ దయ కాదు, బాధ్యత! పట్టపగటింటి సూర్యుని పగిది కర్ణు డుగ్రమూర్తిౖయె చెలరేగుచున్నవాడు, మాధవా! మన రథంబిప్డు మరలనిమ్ము, బతికి యుండిన సుఖముల బడయవచ్చు! కురుక్షేత్ర యుద్ధభూమిలో ప్రత్యర్థి కర్ణుడు మిట్ట మధ్యాహ్నపు సూర్యుడిలా చెలరేగుతున్నాడని బెంబేలెత్తి పోయాడు అర్జునుడు. ‘బావా! మన రథాన్ని ఇక వెనక్కి మళ్లించు, మున్ముందు సుఖాలు పొందొచ్చేమో కానీ, ముందు బతికుండాలి కదా!’ అని కృష్ణుడ్ని వేడుకుంటాడు. సూర్యుడిలా కర్ణుడు చెల రేగుతుంటేనే విజయుడు అంత జడిసినప్పుడు, ఇక సూర్యుడే విజృంభిస్తే సాధారణ మనుషుల పరిస్థితేమిటి? మనం చాటింపు వేసుకునే అభివృద్ధి– సంక్షేమాలు తర్వాత, ముందు ఈ సూర్య ప్ర‘తాపం’ నుంచి బడుగు జీవులు బతికి బయటపడటం కదా ముఖ్యం! కానీ, ఇవేవీ ఈ రోజున ప్రభుత్వాలకు, వ్యవస్థలకు, పట్టడం లేదు. వృద్ధులు, పిల్లలు, యువకులు, పెద్దలు.. ఇలా అన్ని వయస్సుల వారూ ఎండదెబ్బకి పిట్టల్లా రాలుతున్నారు. ఏయేటికా యేడు ఎండలు తెగ ముదురుతున్నాయి. కిందటేడు, ఈ ఏడు దేశంలో ఎండలు రికార్డు స్థాయిలో ఉండటంతో వడదెబ్బకు లక్షల మంది జబ్బుల బారిన పడుతుంటే, వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ విపరీతపు ఎండలకు జనం అల్లాడిపోతున్నారు. ఇంటా, బయటా, పని ప్రదేశాల్లో, ఎక్కడబడితే అక్కడ వెంటాడి వేధిస్తున్న ఎండ వేడికి, వడదెబ్బకు ఏటా వందలాది మంది దిక్కులేని చావు చస్తు న్నారు. మార్కెట్లో ధాన్యపు రాశి మీదే ఓ రైతు, ఫ్యాక్టరీ పనిచేస్తూనే ఓ కార్మి కుడు, రాత్రి నిద్రలోనే ఓ పెద్దమనిషి, బడి నుంచి నడిచొచ్చి వాంతులు చేసు కొని ఒక బాలిక... ఇలా ఎందరెందరో వడదెబ్బకు వడలి, రాలిపోతున్నారు. ఇంటి పెద్ద దిక్కు అకాల మృత్యువు వాతబడటం కుటుంబాల్ని కల్లోలపరు స్తోంది. తిండిపెట్టే దీపమారి ఇంటిల్లిపాదీ ఘొల్లుమంటున్నారు. మనిషి స్వార్థం, నిర్లక్ష్యం వల్ల భూమ్యావరణం కాలుష్యమై, భూతాపం పెరిగి పోతోంది. వాతావరణం తీవ్ర మార్పులకు గురవుతోంది. ఫలితంగా అసా« దారణంగా ఎండలు పెచ్చు పెరిగి నిండు బతుకుల్ని నుసి చేస్తున్నాయి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి జీవులు, మరీ ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు బలి అవుతున్నారు. తాగునీరు లేక, వడదెబ్బకు తట్టుకోలేక ప్రాణాలు వదిలే పశువులకు లెక్కే లేదు. సమస్య తీవ్రతను ప్రభుత్వాలు తగు రీతిన గుర్తిం చడం లేదు. అధిగమించే శాస్త్రీయ పంథాను అనుసరించడం లేదు. విపత్తు నివారణ శూన్యం. మానవతా దృక్పథం కొరవడగా స్పందించడమే లేదు. ధ్రువాల్లో పచ్చగడ్డి మొలుస్తోంది భూతాపోన్నతి విశ్వ సమస్య. ప్రపంచ వ్యాప్త పరిణామాలే ఈ మార్పులకు కారణం. గత కొన్ని దశాబ్దాల్లో హెచ్చిన వేడి వల్ల ధ్రువాల మంచు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. ఇది దీవులు, ద్వీపకల్పాలు, తీర నగ రాలు, పట్టణాల జనాభా మనుగడకే పెను సవాల్‌గా మారుతోంది. ధ్రువాల్లో మంచు కరగటం ఎంత ప్రమాదకర స్థితిలో ఉందంటే, సూర్యరశ్మి సోకి అక్కడ పసరిక పెరుగుతోంది. అంటార్కిటికా కన్నా ఆర్కిటిక్‌లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. రమారమి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఇంకా అనేక సమ స్యల్ని సృష్టిస్తున్నాయి. అందులో ఈ వడదెబ్బ చావులు ఒక ఘోరం. ఈ పాపంలో అంతో ఇంతో అందరి పాత్రా ఉంది. అభివృద్ధి చెందిన దేశాలు వారి ప్రగతి క్రమంలో ఇన్నాళ్లూ చేసిన నిర్వాకాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఇక కట్టడి విధిస్తే జరుగబోయే నష్టం తదితరాలపై ఇటీవల పారి స్లో లోతైన చర్చే జరిగింది. ఈ అసమతుల్యతల్ని అధిగమించడానికే ‘ఉమ్మడి సమస్య భిన్న బాధ్యతలు’ (సీపీడీఆర్) అన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. 2030 నాటికి భూతాపోన్నతిని 2 సెంటీమీటర్లకు మించి పెర క్కుండా చేయడమే లక్ష్యంగా దాదాపు 190 ‘భాగస్వామ్య దేశాలు’ బాధ్యత తీసుకున్నాయి. స్వీయ నియంత్రణకు కార్యాచరణను ప్రకటించాయి. ఈ దిశలో మరింత వేగంగా అడుగులు పడాలి. అప్పుడే ఈ భూతాపోన్నతి నియంత్రణలోకి వస్తుంది. లేకుంటే ఈ మితిమీరిన ఎండలు మనుషులతో పాటు సకల జీవవైవిధ్యాన్నీ నాశనం చేస్తాయి. విపత్తు తొలగించేందుకు ప్రపంచస్థాయి యత్నాలు ఇప్పుడిప్పుడే బలపడుతున్నాయి. అంతమాత్రాన, వడదెబ్బ చావుల్ని నియంత్రించేందుకు స్థానికంగా పరిష్కారాలు లేవనీ కాదు. వ్యక్తులు, పౌర సంఘాలు, ప్రభుత్వాల స్థాయిలో స్థానికంగా చేపట్టే ఉపశమన చర్యల వల్ల ఎంతోకొంత మేలు జరుగుతుంది. కానీ, ఈ విపత్తు తీవ్రతను, విపరిణామాలను పాలకులు గుర్తించడం లేదు. వారిలో దూరదృష్టి కొరవడటం, చిత్తశుద్ది లోపం వల్ల ఇప్పుడిదొక తీవ్ర సమస్యగా మారుతోంది. దేశంలో రికార్డుల మోత సగటు మనిషి జీవితాన్ని దుర్భరం చేస్తున్న ఎండల్ని, వడగాలుల్ని ప్రభు త్వాలు ప్రకృతి విపత్తుగా పరిగణించాలి. ముందు జాగ్రత్త, సహాయక చర్యల్ని ముమ్మరం చేయాలి. ఒక వైపు శాస్త్ర సాంకేతిక పెరిగి కచ్చితమైన ముందస్తు హెచ్చరికలు అందుతున్నా నివారణ చర్యలుండటం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు చేసే అరకొర చర్యలున్నా అవి మరీ మొక్కుబడిగా, కాగితాలకు పరి మితమైనవిగా ఉంటున్నాయి. భారత వాతావరణ విభాగం (ఐఎమ్‌డీ) గత సంవత్సరం నుంచి వడగాలి హెచ్చరికలిస్తోంది. 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణో గ్రత దాటితే ఈ హెచ్చరిక వస్తుంది. సాధారణం కన్నా 4–5 డిగ్రీలు పెరిగితే దాన్ని ‘వడగాలి’గా, 6 డిగ్రీలు దాటితే ‘తీవ్ర వడగాలి’గా పరిగణిస్తారు. ఏడాదిలో సగటు తీవ్ర వడగాలి రోజుల సంఖ్య దేశంలో క్రమంగా పెరుగు తోంది. 1971–80 దశకంలో ఏడాదికి సగటున ఈ రోజుల సంఖ్య 34 కాగా, 1981–90 లలో 45గా, 1991–2000 లలో 48గా నమోదయింది. 2001–10 లలో ఏటా సగటున 98 రోజులు తీవ్ర వడగాలి రోజులుగానే నమోదయ్యా యంటే తాపోన్నతి పెరుగుదల క్రమం ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోంది. అంటే, ఏడాదిలో మూడు నెలలపైనే! ప్రస్తుత దశాబ్దిలో (2010 తర్వాత) ఇది ఏటా మరింత పెరుగుతోంది. ఉష్ణోగ్రత–వడగాలి గణనకు సంబంధించి శాస్త్రీ యమైన లెక్కలు మొదలైన్నుంచి, అంటే గత 116 ఏళ్లలో అత్యధిక వేడి సంవత్సరంగా కిందటి ఏడాది (2016) నమోదయింది. ప్రపంచ అధ్యయ నాలు కూడా గత ఏడాది ఏప్రిల్–మే మాసాలు అత్యధిక ఉష్ణ మాసాలుగా చరిత్ర సృష్టించినట్టు పేర్కొన్నాయి. మన దేశ చరిత్రలోనే ఈ ‘మే’ (2017) అత్యంత వేడి మాసంగా చరిత్ర సృష్టించనుందని (ఇప్పటికైతే గత ఏప్రిల్ నెలే రికార్డు) ‘గ్లోబల్ క్లయిమేట్ రిపోర్ట్’ తెలిపింది. దేశంలోని పట్టణాలు, ఓ మోస్తరు నగరాలు, మహానగరాల్లో కన్నా శీతల విడిది పర్వత ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నట్టు మరో అధ్యయనం తెలిపింది. సిమ్లా, కొడైకెనాల్, డార్జిలింగ్, మడికెరి, శ్రీనగర్‌లలో 1970 నుంచి ప్రతి దశాబ్దంలో సగటున 0.4 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతోంది. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ కొండ ప్రాంతాల్లో నాలుగు దశాబ్దాల్లో సగటున 2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగినట్టు లెక్క. ఇది చాలా ప్రమాదకర పరిణామం. తెలుగు రాష్ట్రాల్లో తెంపరితనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏటా సంభవించినన్ని వడదెబ్బ మరణాలు ఇప్పుడు తెలంగాణ, ఏపీలలో విడివిడిగానే నమోదవుతున్నాయి. వాస్తవిక మరణా లకు అంతకన్నా చాలాఎక్కువే. రెవెన్యూ అధికారులు ఈ మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తారనేది స్థిర విమర్శ. గడచిన నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 4,620 మంది తీవ్ర వడదెబ్బతో మరణిస్తే, అందులో 4,246 మంది (దాదాపు 90 శాతం) రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మరణించినట్టు కేంద్ర భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. వడగాలులు వీస్తాయని, ఉష్ణోగ్రతలు పెరిగి పౌరులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని తెలిసినా నిర్దిష్ట చర్యలుం డటం లేదు. వడగాలులు వీస్తున్నపుడు పాటించాల్సిన ప్రొటోకాల్ నిబంధన లున్నాయి. ముందు జాగ్రత్త చర్యలు, తదనంతర చర్యలూ ఉన్నప్పటికి అత్య ధిక సందర్భాల్లో అవి కాగితాలకే పరిమితం. తీవ్ర వడగాలులు ఉన్నపుడు మధ్యాహ్నం 12, సాయంత్రం 4 గంటల మధ్య ఆర్టీసీ బస్సులు నడపొద్దని ఉంది. బస్టాండ్లలో ప్రయాణికులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంచాలని ఉంది. ప్రాథమిక వైద్య కేంద్రాల్లో ప్రత్యేక పడకలు, వడదెబ్బ తగిలి ప్రమాదకర స్థితిలో వచ్చే వారి కోసం ఖాళీగా ఉంచాలనీ ఉంది. 104 సదుపాయాన్ని అందుబాటులో ఉంచి, ఒక ‘హెల్ప్‌లైన్’ను నిరంతరాయంగా నిర్వహించాలి. వడదెబ్బ తగిలినపుడు ‘‘ఏం చేయాలి? ఏం చేయరాదు?’’ సామాన్యులకు తెలిసేలా కరపత్రాలు తదితర మార్గాల్లో విస్తృత ప్రచారం చేయాలనీ ఉంది. ఇవేవీ అమలు కావు, పాలకులెవరికీ ఆ ధ్యాసే అంతగా ఉండదు. ఇది సర్కారు బాధ్యత కాదా? వడగాలి సమస్య ప్రధానంగా దక్షిణాదిన ఉండటంతో కేంద్రం పెద్దగా పట్టిం చుకోదనే విమర్శ ఉంది. చలి తీవ్రతతో మరణిస్తే ప్రకృతి వైపరీత్యంగా పరి గణించి, నష్టపరిహారం చెల్లిస్తున్నపుడు వడగాలి మృతులకు అదెందుకు వర్తిం పచేయరనే ప్రశ్న తరచూ వస్తోంది. వడదెబ్బతో మరణించిన వారి కుటుంబా లకు ఆపద్బంధు పథకం కింద రూ. 50వేలు ఇస్తున్నారు. కానీ, అధికారులు ల(య)క్ష ప్రశ్నలతో బాధితుల కుటుంబాలను విసిగించి, ఇతర మరణాలుగా నమోదు చేయిస్తారు. దాంతో ఆ పరిహారమూ దక్కదు. చాలా సందర్భాల్లో, పుట్టెడు దుఃఖంలో ఉండే కుటుంబానికి ఆ పాటి సహాయం దక్కించుకోవ డమూ గగనమౌతోంది. ఆరోగ్యశాఖ, తాగునీటి విభాగం, విపత్తు నివారణ సంస్థ.. ఇలా వివిధ అనుబంధ విభాగాల చర్యల్ని సమీకృతం చేయాల్సిన అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కొత్తగూడెం, రామగుండం, రెంటచింతల తదితర ప్రాంతాల్లో అక్కడి బొగ్గు, అబ్రకం, నాపరాళ్ల గనుల వల్ల విపరీత మైన వేడి ఉంటుంది. పెద్ద సంఖ్యలో వడదెబ్బ మరణాలు నమోదవుతున్నా.. ఆ ప్రాంతాల్లో ముమ్మరంగా మొక్కలు పెంచి, హరితమయం చేసేందుకు ఏనాడూ ప్రభుత్వాలు పూనుకోలేదు. చెట్లు బాగా ఉండే ఇందిరా పార్కు, తార్నాకా, లింగంపల్లి (బీహెచ్ఈఎల్) వంటి ప్రాంతాల్లో చుట్టూ కొన్ని కిలో మీటర్ల పరిధి విస్తరించే చెట్ల చలువ వడదెబ్బకు ఓ గొప్ప విరుగుడు. ప్రాథ మిక వైద్య కేంద్రం యూనిట్‌గా ప్రతి వేసవిలో వడదెబ్బను అధిగమించే ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ఉండాలి. తాగునీరు లేని గ్రామాలకు ట్యాంక ర్లతో నీటి సరఫరా చేయాలి. గంజి, అంబలి, నీళ్ల కేంద్రాల్ని నడపాలి. కొన్ని గ్రామాల్ని కలపి ఒక క్లçస్టర్‌గా చేసి అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలి. తుపాను హెచ్చరికల్లా వడగాలి తీవ్రతపై గ్రామీణులకు హెచ్చరికలు చేస్తూ, తీసుకోవా ల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం కల్పించాలి. పౌరుల్ని చైతన్య పరచి శరీరంలో ద్రావకాల సాంద్రత తగ్గకుండా చూసుకునేలా సమాయత ్తపరచాలి. వడగాలిని ఎదుర్కోవడానికి ఏం చేయాలో/చేయకూడదో తెలిసొ చ్చేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఇదంతా ఓ మూడునెల్ల పాటు జరిపితే సరిపోతుంది. ఏ రకంగా చచ్చినా మనిషి ప్రాణం ప్రాణమే! మనిషి ప్రాణానికి విలువిచ్చే చిత్తశుద్ధి ఉంటేనే, వడదెబ్బ మరణాల్ని సర్కార్లు నిలు వరించగలుగుతాయి. సగటు మనిషి ప్రాణాలతో పాటు, సర్కార్ల పరువూ నిలబడుతుంది. ఇది మీ దయ కాదు, బాధ్యత! వ్యాసకర్త ఉమ్మడి ఏపీ సమాచార పూర్వ కమిషనర్ దిలీప్ రెడ్డి ఈమెయిల్:dileepreddy@sakshi.com -
వడదెబ్బతో ఆరుగురి మృతి
అర్వపల్లి : వడదెబ్బతో ఆరుగురు వ్యక్తులు మృతిచెందారు. జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో చోటు చేసుకున్న ఘటనల వివరాలు.. మండలంలోని కోడూరు గ్రామానికి చెందిన దేశగాని మల్లయ్య(75) ఎండతీవ్రతకు అస్వస్థతకు గురయ్యాడు. ఇంటి వద్దనే చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతిడికి ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. వేణుగోపాలపురం(నడిగూడెం): మండలంలోని వేణుగోపాలపురానికి చెందిన సంపతి పెద వెంకన్న(45) వారం రోజుల కిందట వడదెబ్బకు గురయ్యాడు.ఇంటివద్దనే చికిత్స పొందుతూ శుక్రవా రం మృతిచెందాడు. కోదాడఅర్బన్: మండల పరిధిలోని గుడిబండ గ్రామానికి చెందిన ఎస్కె.ఖాసీంసాబ్(70) ఎండవేడిమికి అస్వస్థతకు గురయ్యాడు. రెండు రోజు లుగా ఇంటి వద్దనే చికిత్స పొందుతున్న ఆయన గురువారం రాత్రి మరణి ంచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం ఆయన కుటుం బాన్ని టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు వాచేపల్లి వెంకటేశ్వరరెడ్డి పరామర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. మిర్యాలగూడ : మండలంలోని దొండవారిగూడెం గ్రామ పంచాయతీ పరిధి పచ్చారిగడ్డ గ్రామానికి చెందిన చిరుమళ్ల వెంకయ్య(70) ఎండ వేడిమికి అస్వస్థతకు గురయ్యాడు. ఇంటి వద్దనే చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందినట్టు మృతుడి బంధువులు పేర్కొన్నారు. గరిడేపల్లి: మండల కేంద్రానికి చెందిన పెండెం భిక్షం (55) గీతకార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. ఎండలో తాళ్లు ఎక్కడంతో అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. చిలుకూరు : మండలంలోని చెన్నారిగూడెం గ్రామానికి చెందిన కమతం రామయ్య (68) ఎండలకు అస్వస్థతకు గురయ్యాడు. స్థానికంగా చిక్సిత పొందుతూ శుక్రవారం మృతిచెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. -
వడదెబ్బతో 11మంది మృతి
గౌరయపల్లి వృద్ధురాలు. . చేర్యాల : మండలంలోని గౌరయపల్లికి చెందిన పెద్ద యశోద(60) వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందింది. యశోదకు భర్త గతంలోనే మృతిచెందాడు. మృతురాలికి ఇద్దరు కుమారలు, ఒక కూతురు ఉన్నారు. పీచరలో ఒకరు.. ధర్మసాగర్ : మండలంలోని పీచరకు చెందిన నాగారపు ఆగయ్య(58) ఆదివారం పని నిమిత్తం బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో వడదెబ్బకుగురై అదేరోజు రాత్రి మృతిచెందాడు. మరిపెడలో.. మరిపెడ : మండల కేంద్రంలోని సీతారాంపురం వీధికి చెందిన బయ్య లాలయ్య(65) రెండు రోజల క్రితం కూలిపనికి వెళ్లి వడదెబ్బకు గురయ్యాడు. చికిత్స పొందుతూ ఆది వారం రాత్రి మృతిచెందాడు. మృతునికి భా ర్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. నర్మెటలో... నర్మెట : మండల కేంద్రానికి చెందిన ఆమెడపు సిద్దమ్మ(70) కొద్ది రోజులుగా ఎండలకు అస్వస్థతకు గురైంది. సోమవారం ఉదయం దాహం అంటూ కుప్పకూలి మృతి చెందింది. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కంచనపల్లిలో యువకుడు.. రఘునాథపల్లి : మండలంలోని కంచనపల్లికి చెందిన ఎలబోయిన రాజు(24) వడదెబ్బకు గురై సోమవారం మృతిచెందాడు. రాజు గత నెల 31న గ్రామంలో కర్ర కొట్టేందుకు కూలీ పనులకు వెళ్లాడు. వడదెబ్బకు గురై వాంతు లు, విరేచనాలు చేసుకోవడంతో స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించారు. సోమవారం తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందాడు. మడిపల్లిలో వృద్ధురాలు మడిపల్లి(హసన్‌పర్తి) : వడదెబ్బతో మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన ఎర్ర రామమ్మ(75) ఆదివారం వడదెబ్బకు గురైంది. ఆమెకు వైద్యం అందించినప్పటికీ లాభం లేకపోయింది. సోమవారం మధ్యాహ్నం తుది శ్వాసవిడిచింది. కోమటిపల్లిలో ఒకరు.. మంగపేట : మండలంలోని కోమటిపల్లికి చెందిన సంకి లక్ష్మి(60) వడదెబ్బకు గురై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. శాతపురంలో మహిళ శాతపురం(పాలకుర్తి) : మండలంలోని శాతపురం గ్రామానికి చెందిన చక్రవర్తుల వకులామాలిక(45) వడదెబ్బతో అనారోగ్యానికి గురై మృతి చెందిందని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. కమలాపురంలో ఒకరు.. కమలాపురం(మంగపేట) : మండలంలోని కమలాపురానికి చెందిన గ్యారె సాంబయ్య(52) వడదెబ్బతో సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. జనగామలో వృద్ధురాలు.. జనగామ రూరల్ : పట్టణంలోని 8వ వార్డుకు చెందిన కొమ్మ నర్సమ్మ(64) వడదెబ్బతో ఆదివారం రాత్రి మృతిచెందారు. మృతురాలికి భర్త నర్సయ్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సోమవారం బాధిత కుటుంబాన్ని స్థానిక వార్డు కౌన్సిలర్ జక్కుల అనిత, నాయకులు జక్కుల వేణు, ఎర్రంరెడ్డి రాంరెడ్డి, ఎండీ.కమాలూద్దీన్, బేజాడి కేశవులు, జిగురు రాములు, యాదవరెడ్డి పరామర్శించి ఓదార్చారు. మీట్యా తండాలో.. నెల్లికుదురు : మండలంలోని చిన్ననాగారం శివారు మీట్యాతండాకు చెందిన బానోతు రాంజి(30) వడదెబ్బతో సోమవారం మృతిచెందాడు. ఆదివారం ఎద్దుల బండిపై పశువుల పేడను పంట పొలంలో తోలాడు. మధ్యాహ్నం వడదెబ్బకు గురైన రాంజీ రాత్రి నీరసంతో పడుకున్నాడు. భార్య తెల్లవారి లేచిచూసేసరికి మృతిచెందాడు. -
వడదెబ్బకు18 మంది మృతి
సాక్షి నెట్వర్క్ : చిత్తూరు జిల్లాలో ఆదివారం వడదెబ్బ కారణంగా 18మంది మరణించారు. వరదయ్యుపాళెం మండలంలోని సంతవేలూరు గ్రావూనికి చెందిన డీ.కవులవ్ము (70), వరదయ్యుపాళెం గ్రావు పంచాయుతీ పరిధిలోని బీజేఆర్ గిరిజన కాలనీకి చెందిన వూరెయ్యు (67) ఎండ వేడిమి తాళలేక మృతి చెందారు. సోమల మండలంలోని ఎగువవీధికి చెందిన పీఎస్.సీతారామయ్య కుమా ర్తె శ్రీహా(5) వడదెబ్బతో మృతి చెందింది. కురబలకోట మండలంలోని ముదివేడు గ్రామం బుడతనరాళ్ల హరిజనవాడకు చెందిన వై.పెద్ద కదిరమ్మ (75), ఏర్పేడు మండలంలోని ఆమందూరు బీసీ కాలనీలో ఆదివారం సాయుంత్రం లక్ష్మవ్ము(57), శ్రీరంగరాజపురం మండలంలోని విలాసవరహాపురం పంచాయతీ ఎస్‌ఎస్‌ఆర్‌పురం గ్రామానికి చెందిన కుమ్మర మునస్వామిశెట్టి భార్య మంగమ్మ(79), కటికపల్లె దళితవాడలో కుప్పయ్య కుమారుడు చిన్నయ్య(61) మరణించాడు. కేవీపల్లె మండలంలోని బండవడ్డిపల్లెకు చెందిన ఏ.శ్రీనివాసులు (37) ఎండ వేడిమి తాళలేక మృతి చెందారు. రేణిగుంట పంచాయతీ వడ్డిమిట్ట ప్రాంతానికి చెందిన కేశవులు (45), కార్వేటినగరంపెద్ద దళితవాడకు చెందిన సీ.అమాసయ్య(48), తూర్పు వీధికి చెందిన వార్తాల వెంకట్రామయ్య(79), బుచ్చినాయుడుకండ్రిగ మండలంలోని కొత్తపాళెం గ్రామానికి చెందిన మాజీ వీఆర్వో సుబ్బారెడ్డి (65), ఏర్పేడు వుండలంలోని పల్లం గొల్లపల్లి గ్రావూనికి చెందిన వునవాటి సుబ్బారావు(38) మరణించారు. శ్రీకాళహస్తి మండలంలో వడదెబ్బ కారణంగా ఆదివారం ఇద్దరు మృతి చెందారు. మన్నవరం పంచాయుతీ పరిధిలోని కేపీ చింతల గ్రావూనికి చెందిన యుువకుడు వాంపల్లి చెంచయ్యు(36), బొక్కసంపాళెం గ్రావూనికి చెందిన రెడ్డిగారి చెంగారెడ్డి(54) మృతిచెందిన వారిలో ఉన్నారు. బి.కొత్తకోట మండలం కోటావూరు గ్రామం గుండ్లగుట్టవారిపల్లెకు చెందిన భజంత్రీ గంగులమ్మ (70), భాకరాపేట మండలంలోని దేవరకొండకు చెందిన పి.కృష్ణయ్య(67), చంద్రగిరి: పట్టణంలోని పాతపేట ముకుంద వీధికి చెందిన శకుంతలమ్మ (65) వడదెబ్బతో మృతిచెందారు. -
28 మందిని బలిగొన్న వడదెబ్బ
మహబూబాబాద్ నియోజక వర్గంలో.. మహబూబాబాద్/గూడూరు/మహబూబాబాద్‌రూరల్ : మానుకోట పట్టణంలోని హ న్మంతునిగడ్డకు చెందిన పుచ్చకాయల రాములు(58) శనివారం రాత్రి వడదెబ్బతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. గూడూరు మండల కేంద్రానికి చెందిన నాయూబ్రాహ్మణు డు ఎలమందల సురేందర్(36) వడదెబ్బతో ఆదివారం రాత్రి మృతిచెందాడు. మహబూబాబాద్ మండలం లక్ష్మీపురం(బ్రాహ్మణపల్లి) గ్రామానికి చెందిన గుంజె వెంకటమ్మ(52) శనివారం రాత్రి మృతిచెందింది. డోర్నకల్ నియోజకవర్గంలో నలుగురు.. డోర్నకల్/నర్సింహులపేట/కురవి : డోర్నకల్ పట్టణంలోని స్థానిక న్యూ నెహ్రూస్ట్రీట్‌కు చెందిన జైనాబీ(92) వడదెబ్బ తగలడంతో అస్వస్థతకు గురై చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందింది. మండలంలోని పెరుమాళ్లసంకీస గ్రామానికి చెందిన కొత్త గోపయ్య మూడు రోజుల క్రితం వడదెబ్బకు గురై చికిత్స పొందుతున్నాడు. ఆదివారం పరిస్థితి విషమించడం తో మృతిచెందాడు. నర్సింహులపేట మండలంలోని వంతడపల గ్రామానికి చేందిన బానో తు సేవ్యా(40) ఆదివారం వడదెబ్బకు గురై మృతిచెందాడు. కురవి మండలంలోని కొత్తూరు(సీ) గ్రామానికి చెందిన దయ్యాల హుస్సేన్(57) అస్వస్థతకు గురయ్యాడు. స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్సపొందుతూ మృతిచెందాడు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఇద్దరు.. లింగాలఘణపురం/ ధర్మసాగర్ : మండల కేంద్రంలో ఆదివారం గట్టగల్ల ఎల్లయ్య(42) వడదెబ్బతో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ధర్మసాగర్ మండలంలోని క్యాతంపల్లి గ్రామానికి చెందిన శిఖ రాజు(36) వడదెబ్బతో ఆదివారం ఉదయం మృతిచెందాడు. ములుగు నియోజకవర్గంలో ఇద్దరు.. ములుగు/ఏటూరునాగారం : ములుగు మండలంలోని దేవగిరిపట్నం గ్రామానికి చెందిన గేదెల కాపరి తేజావత్ సక్రు(60) వడదెబ్బకు గురై ఆదివారం మృతిచెందాడు. ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఓడవాడకు చెందిన బట్టు చిన్న లక్ష్మి(55) వడదెబ్బతో ఆదివారం ఉదయం మృతి చెందింది. హన్మకొండ మండలంలో ఇద్దరు.. మడికొండ : హన్మకొండ మండలం కొండపర్తి గ్రామానికి చెందిన చీకటి బుచ్చమ్మ(75), మడికొండలో వలుగోజు సత్యనారాయణ(58) ఆదివారం వడదెబ్బతో మృతిచెందారు. నగరంలో ముగ్గురు.. కాశిబుగ్గ/కరీమాబాద్ : కాశిబుగ్గ 5వ డివిజన్ రాములవారి వీధికి చెందిన నాయూ బ్రాహ్మణుడు మురహారి రాములు(54) వడదెబ్బకు గురై ఆదివారం మృతి చెందాడు. నగరంలోని రంగశాయిపేట కుంట్లవాడకు చెందిన జారతి లక్ష్మి(84) వడదెబ్బతో శనివారం రాత్రి మృతి చెందింది. అలాగే కరీమాబాద్ కటికవాడకు చెందిన ఎండీ అబ్జల్‌బీ(60) కూడా వడదెబ్బ తో మృతిచెందింది. నర్సంపేట నియోజకవర్గంలో నలుగురు.. నల్లబెల్లి: నల్లబెల్లి మండలంలోని ముచ్చింపులకు చెందిన గడ్డమీది సమ్మయ్య(80), నందిగామకు చెందిన పొరిక తావురు(65) వడదెబ్బకు గురై మృతిచెందారు. నెక్కొండ మండల కేంద్రానికి చెందిన ఎడ్ల గౌరమ్మ(71) వడదెబ్బతో శనివారం రాత్రి వరంగల్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మండలంలోని తోపనపల్లి గ్రామానికి చెందిన చొప్పడి వీరారెడ్డి(70) వడగాలి తగలడంతో మృతిచెందాడు. భూపాలపల్లి నియోజకవర్గంలో ముగ్గురు.. శాయంపేట/రేగొండ/చిట్యాల : మండలంలోని మాందారిపేట గ్రామానికి చెందిన అల్లం అమృతమ్మ (70) ఆదివారం వడదెబ్బతో మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రేగొండ మడలంలోని భాగిర్తిపేట గ్రామానికి చెందిన వెల్పుకొండ రాజమల్లమ్మ(65) వడదెబ్బతో మృతిచెందింది. చిట్యాల మండలంలోని వెలిశాల గ్రామ శివారు కిష్టయ్యపల్లి గ్రామానికి చెందిన బిరుద ప్రభాకర్(50) వడదెబ్బతో ఆదివారం మృతిచెందాడు. పరకాలలో ఐదుగురు.. పరకాల/సంగెం/గీసుకొండ : పరకాల పట్టణానికి చెందిన బొచ్చు సమ్మయ్య(60) అస్వస్థతకు గురై మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మండలంలోని రాయపర్తి గ్రామానికి చెందిన రాసమల్ల రాయమల్లమ్మ(55) పత్తి కట్టెలు ఏరేందుకు వెళ్లి వడదెబ్బ తాకి మృతిచెందింది. నాగారం గ్రామానికి చెందిన గండ్రకోట రాజయ్య(40) మేకల కాయడానికి వెళ్లి మృతిచెందాడు. సంగెం గ్రామానికి చెందిన పుట్ట వీరలక్ష్మి(87) ఇంట్లోనే వడదెబ్బకు సోకి ఆదివారం మృతిచెందింది. గీసుకొండ మండలంలోని నందనాయక్‌తండా గ్రామపంచాయతీ శివారు సింగ్యా తండాకు చెందిన బాదావత్ బీక్యానాయక్(60) వడద్బెతో చనిపోయూడు. -
‘మృత్యు’తాపం
వడదెబ్బకు 9 మంది మృతి జిల్లాలో సూర్య ప్రతాపం కొనసాగుతోంది.. ప్రచండ భానుడు నిప్పులు కక్కుతున్నాడు.. జనం విలవిలలాడిపోతున్నారు.. వడదెబ్బకు పిట్టల్లా రాలిపోతున్నారు.. శనివారం తొమ్మిది మంది మృతి చెందారు. - నెట్వర్క్ సంబేపల్లె: ఎస్.సోమవరం గ్రామానికి చెందిన కోట రెడ్డెమ్మ (32) శనివారం వడదెబ్బకు గురై మృతి చెందింది. శుక్రవారం గ్రామ సమీపాన ఉన్న పొలాల్లోకి వెళ్లి వ్యవసాయ పనులు చేస్తుండగా ఎండకు తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది. బాధితురాలిని బంధువులు తిరుపతి సిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నా కోలుకోలేక తెల్లవారుజామున మృతి చెందింది. గాలివీడు: గోరాన్ చెరువు దాసరివాండ్లపల్లెకు చెందిన తాటిపర్తి తిమ్మక్క(60) శుక్రవారం రాత్రి వడదెబ్బకు గురై మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం నుంచి బేదులు(మోషన్స్) కావడంతో పండ్ల రసాలు, మజ్జిగ ఇచ్చామని చెల్లలు అచ్చమ్మ తెలిపింది. వైద్యంకోసం బయలుదేరే లోగానే పరిస్థితి విషమించి మృతి చెందినటుర్ల సోదరుడు చంద్రయ్య పేర్కొన్నారు. ఒంటిమిట్ట: కొత్తమాధవరం గ్రామంలోని బిట్టా యానాదమ్మ(70) శుక్రవారం వడదెబ్బ కారణంగా మృతి చెందింది. ప్రొద్దుటూరు క్రైం: పట్టణంలోని వేర్వేరు ప్రాంతాలలో ఇరువురు వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డారు. పాండురంగస్వామి ఆలయం వీధిలో నివాసం ఉంటున్న ఓటూరు కుల్లాయప్ప (65) శనివారం ఇంట్లో నిద్రిపోతుండగా నీళ్లు దప్పికవుతున్నాయని అంటూ పడిపోయాడు. వెంటనే అయనను పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న అతను కోలుకోలేక మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అలాగే సంజీవనగర్‌లో నివాసం ఉంటున్న పందిటి లక్ష్మినారాయణ (58) శుక్రవారం సాయంత్రం వడదెబ్బతో మృతి చెందాడు. అతను ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మేకలు మేపుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. ఆ ప్రాంత వాసులు వెళ్లి చూడ గా మృతి చెంది ఉన్నాడు. అతనికి భార్య, కుమార్తె, నలుగురు కుమారులు ఉన్నారు. శనివారం ఉదయం అతని అంత్యక్రియలు నిర్వహించారు. పుల్లంపేట: రంగంపల్లె గొల్లపల్లెకు చెందిన గుర్రంకొండ వెంకటయ్య(60) ఉపాధి పనులకు కూలీగా వెళుతూ జీవనం సాగించే వాడు. ఈ క్రమంలో శుక్రవారం అనారోగ్యంగా వుండడంతో స్థానికంగా చికిత్స పొందాడు. శనివారం ఎండతీవ్రత అధికం కావడంతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు వున్నారు. బద్వేలు అర్బన్: పట్టణంలోని వేర్వేరు ప్రాంతాలలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. శివానగర్‌కు చెందిన ఎస్.వెంకటేశ్వర్లు(55) ధాన్యం కొనుగోలు వ్యాపారం చేస్తుండే వాడు. శుక్రవారం ఇదే పనిపై తిరిగి వచ్చి రాత్రి తీవ్ర జ్వరంతో సొమ్మసిల్లి పడిపోయాడు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అలాగే సురేంద్రనగర్‌కు చెందిన కె.రమణయ్య (46) వృత్తి రీత్యా టైలర్. శుక్రవారం సాయంత్రం నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. -
తగ్గని వడగాలులు
హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో వడగాలుల ప్రభావం ఇంకా తగ్గలేదు. వడగాలుల ప్రభావంతో మధ్యాహ్నం ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారికి చుక్కలు కనపడుతున్నాయి. శుక్రవారం ఉదయం నుండి ఇప్పటి వరకు వడదెబ్బకు ఏపీలో 10 మంది చనిపోగా , తెలంగాణలో 18 మంది చనిపోయారు. చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున చనిపోగా, అనంతపురం ,శ్రీకాకుళం, విజయవాడ, వైఎస్సార్ జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. అలాగే తెలంగాణాలోని కరీంనగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో అత్యధికంగా నలుగురేసి చొప్పున మృతిచెందగా, ఆదిలాబాద్, వరంగల్‌లో ఇద్దరేసి చొప్పున, నిజామాబాద్‌లో ఒకరు, మహబూబ్‌నగర్‌లో మరొకరు వడదెబ్బకు బలయ్యారు. -
వడదెబ్బకు 32 మంది మృతి
గత వారంతో పోల్చుకుంటే ఉష్ణోగ్రత ఒకటి రెండు డిగ్రీలు తగ్గినా వడగాడ్పుల తీవ్రత తగ్గడంలేదు. వేడిగాలుల తీవ్రతకు జనం విలవిలలాడుతున్నారు. వడదెబ్బతో పిట్టల్లా రాలుతూనే ఉన్నారు. గురువారం జిల్లా వ్యాప్తంగా వడదెబ్బకు 32 మంది మృతిచెందారు. రామగుండంలో నలుగురు కోల్‌సిటీ/ జ్యోతినగర్: గోదావరిఖని స్థానిక మార్కండేయకాలనీకి చెందిన ఎన్నం రాజేశం (61) స్థానిక ద్వారకానగర్ కు చెందిన గడ్డం మధునయ్య(60) ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్ప పొందుతూ గురువారం మృతి చెందారు. రామగుండం 3వ డివిజన్ అంబేద్కర్ భవనం రోడ్డు ఏరియాలో నివసిస్తున్న ఆటో డ్రైవర్ దొడ్డె సదానందం(40) ఎండలో ఆటో నడపడంతో బుధవారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యూడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. 44వ డివిజన్ ఎఫ్‌సీఐ టౌన్షిప్లో నివసిస్తున్న క్యాజువల్ కార్మికుడు బోయినపల్లి రత్నాకర్‌రావు(50) ఎండ తీవ్రతకు మృతిచెందాడు. కథలాపూర్ మండలంలో ముగ్గురు.. కమలాపూర్ : మండల కేంద్రానికి చెందిన మహ్మద్ ఖాజాబీ(72) ఎండ వేడిమితో మృతి చెందింది. నేరెళ్లకు చెందిన ఆకుల కొమురయ్య (65), గూనిపర్తికి చెందిన బుర్ర సమ్మక్క(55) వడదెబ్బతో చనిపోయారు. చందుర్తి మండలంలో ఇద్దరు.. రుద్రంగికి చెందిన నగరం రుచిత(12) తోటి స్నేహితులతో ఉదయం 11గంటల వరకు ఆడుకుంది. ఇంట్లోకి వచ్చి నీళ్లు తాగి కుప్పకూలి పోయింది. అస్పత్రికి తరలించగా వడదెబ్బతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కిష్టంపేటకు చెందిన మ్యాదరి లక్ష్మణ్రామన్న(72) మృతిచెందాడు. హుజూరాబాద్‌లో ఇద్దరు.. హుజూరాబాద్/టౌన్ : హుజూరాబాద్ పట్టణంలోని వడ్డెరకాలనీకి చెందిన కూలీ ముద్దంగుల రాంచందర్ (35) ఎండ తీవ్రతకు ఐదు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యాడు. కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మండలంలోని రాంపూర్‌కు బైరవేన వీరయ్య (70) వడగాలులకు ఇంటి వద్దనే మృతి చెందాడు. మానకొండూర్ మండలంలో ఇద్దరు.. మానకొండూర్ :మానకొండూర్‌కు చెందిన పిట్టల నర్సయ్య (67), లింగాపూర్ గ్రామానికి చెందిన పిట్టల లచ్చమ్మ (55) వడదెబ్బతో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. పెగడపల్లి : మండలంరాంనగర్కు చెందిన చిలుక మలయ్య(65) బుధవారం మధ్యాహ్నం చెట్ల మందుల కోసం వెంగళాయిపేట పెద్దగుట్టకు వెళ్లి ఎండ తీవ్రతతో చనిపోయడు. రామడుగు : మండల కేంద్రానికి చెందిన భీమనాతిని శ్రీనివాసన్(70) వడదెబ్బతో మృతిచెందాడు. చొప్పదండి : మండలంలోని రుక్మాపూర్‌కు చెందిన వంగ రాజమ్మ(70)వడగాల్పుల తీవ్రతకు మృతిచెందాడు. కొడిమ్యాల : మండలంలోని నల్లగొండగ్రామానికి చెందిన సబ్బనవేణి లచ్చవ్వ(55) రెండురోజులుగా ఎండలో వ్యవసాయపనులు చేసింది. వడదెబ్బ తగలడంతో కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. ముత్తారం : మండలంలోని లక్కారం గ్రామానికి చెందిన మంథని బెజ్జమ్మ(70) ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లాగా చికిత్స చేస్తుండగానే మృతిచెందింది. వేములవాడ అర్బన్ : వేములవాడ మండలం మర్రిపల్లికి చెందిన కూలీ చింతపంటి లచ్చవ్వ(55) ఎండదెబ్బ తగిలి మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు. జూలపల్లి: తేలుకుంట గ్రామానికి చెందిన అకారపు రవీందర్‌రెడ్డి(65) ఎలిగేడు మండలం నర్సాపూర్‌లోని తన మేనల్లుడి ఇంటికి వెళ్లొచ్చిచ్చాడు. ఎండ తీవ్రతకు వాంతులు, విరేచనాలు కావడంతో అస్వస్థతకు గురై వృతి చెందాడు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ప్రతిమ మెడికల్ కళాశాలకు అప్పగించినట్లు సర్పంచ్ గెడిశెల రవి తెలిపారు. ఇల్లంతకుంట : పత్తికుంటపల్లికి చెందిన కూనబోయిన లచ్చవ్వ(65) వడదెబ్బ తగిలి మృతి చెందింది. తిమ్మాపూర్ : మండలంలోని పోరండ్లకు చెందిన నాగపురి ముత్తమ్మ(50) వ్యవసాయ బావివద్దకు వెళ్లింది. అక్కడ ఎండలో పిడకలు చేయడంతో సృ్పహకోల్పోరుుంది. సమీపంలో పనులు చేస్తున్న మరో మహిళ ,రోడ్డువెంట వెళ్తున్న మాజీ ఎంపీటీసీ లకా్ష్మరెడ్డి నీళ్లు తాగించే ప్రయత్నం చేయగా మృతి చెందింది. ఇబ్రహీంపట్నం : తిమ్మాపూర్‌కు చెందిన తమడవేణి శ్రీనివాస్(39) బుధవారం కూలిపనికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చి పడిపోయూడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. భీమదేవరపల్లి : భీమదేవరపల్లికి చెందిన రైతు కేదారి(65) ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురికాగా కుటుంబ సభ్యులు ముల్కనూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కోతులనడుమ(ఎల్కతుర్తి) : కోతులనడుమకు చెందిన నద్దునూరి కొమురమ్మ(95) వడడెబ్బతో మృతిచెందింది. వెల్గటూరు: మండలంలోని కప్పారావుపేటకు చెందిన రేషన్ డీలర్ తరల్ల భూమమ్మ(45) ఎండ తీవ్రతకు గురువారం తెల్లవారు జామున మతిృ చెందింది. సిరిసిల్ల రూరల్ : మండలంలోని పద్మనగర్‌కు చెందిన వడ్డెపల్లి అంబవ్వ(65) ఎండ వేడికి అస్వస్థతకు గురై మరణించినట్లు గ్రామస్తులు తె లిపారు. ముస్తాబాద్ : తెర్లుమద్దికి చెందిన చిక్కాల లక్ష్మణ్‌రావు(72) వడగాలుల తీవ్రతకు చనిపోయాడు. ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేటలో ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతంలోని చెర్లగురుపాడుకు చెందిన తాపీ మేస్త్రీ తన్నీరు సుబ్బరావు(35) ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురై రక్తం కక్కుకుని మృతిచెందాడు. దుద్దెనపల్లి(సైదాపూర్‌రూరల్) : దుద్దెనపల్లికి చెందిన రిక్కల రాజిరెడ్డి(70) వేడి గాలులకు నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురై గురువారం మృతిచెందాడు. రాయికల్ : మండలంలోని అల్లీపూర్‌కు చెందిన అత్కపురం పెద్దగంగారాం(85) ఎండ తీవ్రతకు జ్వరంతో బాధపడుతున్నాడు. పరిస్థితి విషమించి గురువారం మృతిచెందాడు. గంగాధర : మండలంలోని గట్టుబూత్కూర్‌కు చెందిన కడారి అంజయ్య(58) వడదెబ్బతో మృతి చెందాడు. ఇద్దరు చిన్నారులు మృతి గొల్లపల్లి : మండలంలోని గంగాపూర్‌కు చెందిన కట్ట భరత్(9) వడదెబ్బతో గురువారం మృతి చెందాడు. ఆడుకోవడానికి బయటకు వెల్లిన భరత్ దాహం వేస్తుందని ఇంటికి వచ్చాడు. నీళ్లు తాగి పడి పోయాడు. తల్లి దండ్రులు చికిత్స కోసం జగిత్యాలకు తరలించారు. వైద్యుల సూచన మేరకు కరీంనగర్ చల్మెడ ఆనందరావు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందించేలోపు బాలుడు మృతిచెందాడు. కళ్లెదుటే విగత జీవుడైన ఒక్కగానొక్క కొడుకును చూసి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఆడుకునేందుకు ఎగురుతూ వెళ్లిన కొడుకు భానుడి ప్రతాపానికి చనిపోవడాన్ని వారు తట్టుకోలేక పోతున్నారు. భరత్ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కాలేదు. కోరుట్ల: పట్టణంలోని రవీంద్రరోడ్‌కు చెందిన ఉమేరా అనే మూడేళ్ల చిన్నారి మడదెబ్బతో మృతి చెందింది. అజార్-నజీమా దంపతుల కూతురు ఉమేరా(3)కు బుధవారం వడదెబ్బ తగలడంతో సాయంత్రం వాంతులు చేసుకుంది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేరుుంచారు. గురువారం ఉదయం మళ్లీ వాంతులు చేసుకుని ఆకస్మాత్తుగా మృతి చెందింది. -
నేనొస్తున్నా మనవడా!
♦ వడదెబ్బతో బాలుడు మృతి ♦ జీర్ణించుకోలేక ప్రాణాలొదిలిన తాత బొమ్మనహాళ్ : వడదెబ్బతో మనవడు మృతి చెందడంతో జీర్ణించుకోలేకపోయిన తాత కూడా ప్రాణాలొదిలాడు. ఈ హృదయ విదారక సంఘటన బొమ్మనహాళ్ మండలం నేమకల్లులో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గంగన్న(60) బుధవారం తన మనవడు రమేష్ (13)తో కలిసి పొలంలోకి వెళ్లారు. నాలుగు గంటల సమయంలో రమేష్ వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స కోసం బళ్లారికి తీసుకెళ్లారు. ఆసుపత్రికి చేరేలోగానే మృతిచెందాడు. పొలం నుంచి సాయంత్రం ఇంటికి చేరుకున్న గంగన్నకు ఈ వార్త తెలియడంతో గుండెపోటు వచ్చింది. వెంటనే అతన్ని కూడా బళ్లారికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో చనిపోయాడు. -
నిప్పులు చెరిగిన భానుడు
వడదెబ్బకు గురై 8మంది మృతి మృతుల్లో వృద్ధులే అధికం ఆత్మకూర్ : భానుడి ఉగ్రరూపానికి జనం విలవిలలాడిపోతున్నారు. జిల్లాలో జనం పిట్టల్లారాలిపోతున్నారు. ఈ క్రమంలో గురువారం ఒకేరోజు 8మంది వడదెబ్బకు గురై చనిపోయారు. ఈ క్రమంలో ఆత్మకూరులో ఓ కూలీ మృతిచెందాడు. పట్టణానికి చెందిన మండ్ల సత్యన్న(46) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బుధవారం ఎప్పటిలాగే కూలీపనులకు వెళ్లిన సత్యన్న తీవ్రఅస్వస్థతకు గురికావడంతో రాత్రి ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమిం చడంతో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. శాయిన్‌పేట పశువుల కాపరి లింగాల: మండల పరిధిలోని శాయిన్పేటకు చెందిన పశువుల కాపరి కొనమోని ఈదన్న(60) వడదెబ్బకు గురై బుధవారం రాత్రి చని పోయాడు. పశువులను కాసేందుకు వెళ్లి ఇంటికి తిరిగొచ్చి అస్వస్థతకు గురయ్యాడు. నిద్రలో కనుమూశాడని కుటుంబసభ్యులు తెలిపారు. వికలాంగుడు మృతి వనపర్తిరూరల్: వడదెబ్బతో ఓ వికలాంగుడు చనిపోయాడు. మండలంలోని కిష్టగిరి గ్రామానికి చెందిన తిరుపతయ్య(45) గ్రామంలో కూలీపనులు చేసుకుని జీవిస్తుండేవారు. భార్య లక్ష్మి, ముగ్గురు పిల్లలు ఊరికెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. స్థానికులు తలుపులు తెరిచిచూడగా గురువారం ఉదయం విగతజీవిగా ఉన్నాడు. ఎండలో తిరిగి అస్వస్థతకు గురై మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. దాసరిపల్లిలో వృద్ధుడు మల్దకల్: మండలంలోని దాసరిపల్లి గ్రామానికి చెందిన గంగావతి తిమ్మన్న (62) అనే వృద్ధుడు పొలంలో పనులు చేసేందుకు గురువారం ఉదయం వెళ్లాడు. ఎండవేడికి తాళలేక మధ్యాహ్నం సృహతప్పి పడిపోయాడు. చికిత్సకోసం ఆస్పత్రికి తర లిస్తుండగా చనిపోయాడు. జమ్మిచేడులో చిన్నారి గద్వాల న్యూటౌన్ : మండలంలోని జమ్మిచేడు గ్రామానికి చెందిన వీరన్న, సుజాత కుమార్తె భారతి(02) వడదెబ్బకు గురైంది. దీంతో తేరుకున్న తల్లిదండ్రులు సాయంత్రం చికిత్సకోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందింది. జడ్చర్లలో వృద్దుడు బలి జడ్చర్ల: స్థానిక దామోదర సంజీవయ్య కాలనీకి చెందిన సుంకసారి జంగయ్య(65)అనే వ్యక్తి వడదెబ్బ కారణంగా మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మూడురోజుల క్రితం అస్వస్థతకు గురైన జంగయ్యను చికిత్సకోసం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి వైద్యచికిత్సలు అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం చనిపోయాడు. వెల్కిచర్లలో వృద్ధుడు భూత్పూర్: వడదెబ్బకు మండలంలోని వెల్కిచర్ల గ్రామానికి చెందిన గోసుల గాలెన్న(70) మృతిచెం దాడు. అస్వస్థతకు గురికావడంతో చికిత్సకోసం జిల్లా ఆస్పత్రిలో చేర్పిం చారు.పరిస్థితి విషమించడంతో చనిపోయాడు. మస్తిపురంలో వ్యక్తి నర్వ: జములమ్మ దేవర కోసం బంధువుల ఇంటికి వెళ్లిన ఓ వ్యక్తి వడదెబ్బకు గురై చనిపోయాడు. ఈ సంఘటన ఆత్మకూర్ మండలంలోని మస్తిపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోయకుర్మన్న(30) మదనపురం గ్రామ సమీపంలోని తిరుమలాపల్లిలో ఉన్న బంధువులు జములమ్మ చేస్తున్నామని చెప్పడంతో వెళ్లాడు. రెండురోజుల పాటు దేవర ఉత్సవంలో పా ల్గొన్న కుర్మన్న అస్వస్థతకు గురయ్యాడు. పరిస్థితి విషమించడంతో గురువారం చనిపోయాడు. -
'దక్షిణ కోస్తా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బ మరణాలు గంటగంటకు పెరుగుతూ ఉన్నాయి. భానుడి భగభగలు బుధవారం కొనసాగాయి. దక్షిణ కోస్తాంధ్రలో 24 గంటలపాటు తీవ్ర వడగాల్పులు వీస్తాయని విశాఖ వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ కోస్తా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం సమాచారం ఇది. ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలవారీగా మృతుల వివరాలు: అనంతపురం: లేపాక్షి మండలం కోడిపల్లిలో సంజీవమ్మ అనే మహిళా కూలీ, శెట్టూరులో మరో వ్యక్తి వడదెబ్బతో మృతిచెందారు. కడప: చిన్నమండెం మండలం పొలిమేరపల్లిలో వడదెబ్బకు ఓ గొర్రెల కాపరి మృతి తెలంగాణలో జిల్లాలవారీగా మృతుల వివరాలు: ఆదిలాబాద్: లక్ష్మణ్ చందా మండలం పారుపల్లిలో ఉపాధి హామీ కూలీ మృతి మహబూబ్ నగర్: పెద్దేరు మండలం చెలిమిల్లలో పకీరయ్య(45) మృతి కరీంనగర్: సిరిసిల్ల బీవైనగర్ లో ఓ వృద్ధురాలు మృతి నల్లగొండ: కేతేపల్లి మండలం గుడివాడలో లక్ష్మమ్మ మృతి -
వడదెబ్బకు 36 మంది మృతి
సాక్షి నెట్వర్క : జిల్లాలో మరణమృదంగం కొనసాగుతూనే ఉంది. ఎండల తీవ్రత పెరుగుతూనే ఉంది. మంగళవారం 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా వడగాడ్పుల తీవ్రతకు 36 మంది మరణించారు. యడ్లపాడు మండలం చెంఘిజ్‌ఖాన్‌పేటకు చెందిన బసెల వీరమ్మ (78), తిమ్మాపురానికి చెందిన జంగా రవిబాబు (43), అమరావతి మండలం గాజులపాలెం పి.వెంకాయమ్మ (70), అమరావతి పల్లపువీధికి చెందిన లక్ష్మీనరసమ్మ (59), బీహెచ్ సీతారావమ్మ (75), ఈపూరు మండలంలోని ముప్పాళ్ల గ్రామానికి తుర్లపాటి సుబ్బాయమ్మ(65), బొల్లాపల్లి మండల పరిధిలోని మేళ్లవాగుకు చెందిన చాల మహిళ రాములు, నకరిల్లు మండలంలోని చల్లగుండ్ల గ్రామానికి చెందిన బడిగంచుల హనుమయ్య(65), నకరికల్లుకు చెందిన జూలకంటిబసవయ్య(65) వడదెబ్బతో మంగళవారం మృతి చెందారు. రొంపిచర్లలో ఐదేళ్ల బాలిక మృతి.. ఎండతీవ్రత తాళలేక మూడు రోజుల క్రితం వడదెబ్బకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రొంపిచర్ల మండలం వడ్లమూడివారిపాలెం గ్రామానికి చెందిన ఏసుపోగు షమీల(5) మంగళవారం మృతిచెందింది. అదేవిధంగా అచ్చంపేట మండలం ఓర్వకల్లు గ్రామానికి చెందిన కోట నాగయ్య (90), చామర్రులో కె.హనుమయ్య (80), పిట్టలవానిపాలెం గ్రామానికి చెందిన గోకరాజు అనసూయమ్మ (70), కర్రి తిరుపతయ్య(60), అలకాపురం శివారు సత్యనారాయణపురం గ్రామానికి చె ందిన మంతెన అన్నపూర్ణమ్మ (80), బాపట్లకు చెందిన దాది అనసూర్యమ్మ (92), మటకుమల్లి పార్వతిదేవి (49), కర్లపాలెం గ్రామానికి చెందిన కేతినేని సుబ్బమ్మ (70), మండలంలోని నల్లమోతువారిపాలెం గ్రామానికి చెందిన బడుగు తిరుపతమ్మ (64), భట్టిప్రోలుకు చెందిన కౌతరపు బాలకోటేశ్వరరావు(71), మండలంలోని పల్లెకోనకు చెందిన కోరపాటి మహాలక్ష్మీ(40), కొడుకు వెంటే తల్లి.. చిలకలూరిపేట మండలంలోని పసుమర్రు గ్రామంలో మంగళవారం కుమారుడు మరణించిన 48 గంటల తేడాతో తల్లికూడా మృతి చెందింది. వడదెబ్బ ప్రభావంతో గుదే వెంకటప్పయ్య ఆదివారం మరణించాడు. ఆ దుఃఖంలో ఉన్నతల్లి రాములమ్మ (82)మంగళవారం మృతి చెందింది. ఇదే గ్రామానికి చెందిన గొర్రెల కాపరి యలగాల వీరయ్య (62), చిలక లూరిపేట కాసు వెంగళరెడ్డినగర్‌కు చెందిన తలమాల సింగరమ్మ( 38) కారంపూడి మండలం పెదకొదమగుండ్ల గ్రామంలో గుంటకం హనుమాయమ్మ(62), గాదెవారిపల్లె గ్రామం లో కొత్తా చెన్నమ్మ(85), కారంపూడి గ్రామంలో వంగవరపు యేసురత్నం(65), మాచర్ల పట్టణానికి చెందిన అల్లూరి శంకరమ్మ (62), రెంటచింతలమండలంలోని పాలువాయి గ్రామానికి చెందిన శొంఠిరెడ్డి లచ్చమ్మ(84) వడదెబ్బకు మృతిచెందారు. గురజాల నియోజకవర్గంలో ఏడుగురు.. దాచేపల్లికి చెందిన ఈర్ల సురేష్, లక్ష్మీల ఐదు నెలల చిన్నారితో పాటు ముత్యాలంపాడు గ్రామానికి చెందిన పాశం మంగమ్మ(85), గురజాలలోని న్యూశాంతి లాడ్జి వెనుక నివాసం వుంటున్న బి. కోటమ్మ(80), గురజాల రూరల్ మండలంలోని జంగమహేశ్వరపురం గ్రామంలో వర్రా కొండమ్మ(80), గోగులపాడు గ్రామంలో ఇంజమూరి మార్తమ్మ(80), గుత్తికొంత సొసైటీ డెరైక్టర్ కాండ్రకుంట వెంకటేశ్వర్లు(45), మాచవరం మండలంలోని మోర్జంపాడు గ్రామానికి చెందిన వజ్జె వడితె బాయి(55) మృతిచెందారు. -
తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బ మృతులు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సూర్య 'ప్రతాపం' కొనసాగుతోంది. ప్రఛండ భానుడు నిప్పులు కక్కుతుండడంతో జనం విలవిలలాడుతున్నారు. వడదెబ్బతో పిట్టల్లా రాలుతున్నారు. సోమవారం వివిధ ప్రాంతాల్లో పలువురు వడదెబ్బ కారణంగా మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్: ప్రకాశం జిల్లాలో వడదెబ్బకారణంగా ముగ్గురు మృతి చెందారు. నెట్టెంపాడు మండలం నారపల్లిలో వెంకటస్వామి(65) వడ దెబ్బతో మృతి చెందాడు. వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరులోని బలిజ వీధికి చెందిన మాదా పద్మావతమ్మ (70) నాలుగు రోజులు నుంచి విరేచనాలు, వాంతులు, నీరసంతో బాధపడుతుండగా సోమవారం ఉదయం మృతి చెందింది. కర్నూలు: వెల్దుర్తి మండలంలో సోమవారం ఓ వృద్ధుడు వడద్బెకు మృతి చెందాడు. మండలంలోని రామల్లకోట గ్రామంలో వీరశేఖర(68) ఎండ తీవ్రతను తట్టుకోలేక తీవ్ర అస్వస్థతతో ప్రాణాలొదిలాడు. తెలంగాణ: ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన శేర్ల పెద్దయ్య ఆదివారం ఇళ్లకు తడికెలు అల్లే పనికి వెళ్లి ఎండవేడికి అస్వస్థత పాలయ్యాడు. సోమవారం వేకువ జామున మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా పరిగి మండలం సయ్యద్ మల్కాపూర్‌కు చెందిన స్మిత (18) కూడా వడదెబ్బ కారణంగా సోమవారం ఉదయం మృతి చెందింది. మెదక్ జిల్లా సిద్ధిపేల మండలం లక్ష్మీందేవపల్లిలో వడదెబ్బతో ఇద్దురు మృతి చెందారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టాపురంలో వడదెబ్బకు మహిళ మృతి చెందింది. -
‘మృత్యు’తాపం
నిప్పులు కక్కుతున్న ప్రచండ భానుడు వడదెబ్బకు పిట్టల్లా రాలుతున్న జనం మరో 17 మంది మృతి మృతుల్లో ఎనిమిదేళ్ల బాలుడు జిల్లాలో సూర్య‘ప్రతాపం’ కొనసాగుతోంది. ప్రచండ భానుడు నిప్పులు కక్కుతుండడంతో జనం విలవిలలాడుతున్నారు. వడదెబ్బతో పిట్టల్లా రాలుతున్నారు. శని, ఆదివారాల్లో మరో 17 మంది చనిపోయారు. గాండ్లపెంట మండలంలో ఇద్దరు, గుత్తిలో ముగ్గురు, ధర్మవరం మండలంలో ఇద్దరు, గుంతకల్లు, అమడగూరు, ముదిగుబ్బ, యాడికి, ఉరవకొండ, హిందూపురం, కొత్తచెరువు, చిలమత్తూరు, రాయదుర్గం, రాప్తాడు మండలాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. -సాక్షి నెట్వర్క్ గాండ్లపెంట మండలం బనాన్‌చెరువుపల్లికి చెందిన ముద్దిరెడ్డి కళావతమ్మ(47) శనివారం తన అన్న శివారెడ్డి పొలంలో పని చేసి సాయంత్రం ఇంటికొచ్చి సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే కదిరిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ చనిపోయింది. ఇదే మండలం కటారుపల్లికి చెందిన మహమ్మద్ఫ్రీ(36) రెండు నెలల క్రితం విజయవాడకు వెళ్లాడు. అక్కడే రేషం దారం తీస్తూ జీవనం సాగించేవాడు. శనివారం పనిలో ఉండగానే వడదెబ్బకు గురయ్యాడు. తోటి కార్మికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. ఇతనికి భార్య, కుమారుడు ఉన్నారు. గుత్తి పట్టణంలోని దాసర కాలనీలో నివాసముంటున్న ఆర్బీ సుంకమ్మ(55) ఆదివారం కట్టెలు కొట్టడానికి కాలనీ పక్కనే ఉన్న తన పొలంలోకి వెళ్లింది. ఎండ తీవ్రత వల్ల స్పృహ తప్పి పడిపోయింది. అక్కడున్న వారు గమనించి ఇంటికి తీసుకొచ్చారు. ఆస్పత్రికి తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుండగానే ఆమె మృతి చెందింది. ఇదే పట్టణంలోని కమాటం వీధిలో నివాసముండే అబూ సలేహ(40) ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా రిక్షా తోలాడు. ఈ క్రమంలో ఎండకు తాళలేక స్పృహ తప్పి పడిపోయాడు. ఆస్పత్రికి తరలించడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుండగానే మృతి చెందాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. గుత్తి పట్టణంలోని సీపీఐ కాలనీకి చెందిన నక్కా వెంకటరమణ(56) పగలంతా ఎండలో తిరిగాడు. మధ్యాహ్నం అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. ఇంటికి తీసుకొచ్చాక రాత్రి ఎనిమిది గంటల సమయంలో మృతి చెందాడు. గుంతకల్లు పట్టణంలోని బెంచికొట్టాలకు చెందిన ట్యాంకర్ డ్రైవర్ మహబూబ్‌బాషా, హసీనాల పెద్దకుమారుడు షెక్షావలి (8) స్థానిక శ్రీచైతన్య స్కూల్లో రెండవ తరగతి పూర్తిచేశాడు. వేసవి సెలవులు కావడంతో స్నేహితులతో కలిసి శనివారం సాయంత్రం వరకు ఆడుకున్నాడు. సాయంత్రం ఉన్నట్టుండి స్పృహ కోల్పోయాడు. వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. అక్కడి నుంచి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వడదెబ్బతో బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఉరవకొండ మండలం రేణువూకులపల్లికి చెందిన తలారి వన్నూరప్ప (70) శనివారం సొంత పనిపై ఉరవకొండకు వెళ్లాడు. ఉదయుం నుంచి సాయుంత్రం వరకు ఎండలో తిరిగిరాత్రి ఇంటికొచ్చాడు. తనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పాడు. ఆదివారం ఉదయం ఆస్పత్రికి తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయి.. ప్రాణాలొదిలాడు. మండల కేంద్రం యాడికిలోని ఆంజనేయస్వామి కాలనీకి చెందిన రామలక్ష్మమ్మ(38) శనివారం కట్టెల కోసం ఎండలో తిరిగింది. ఇంటికొచ్చి ఎక్కువ నీరసంగా ఉందని చెప్పింది. కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఒక ఆర్ఎంపీ డాక్టర్‌తో చికిత్స చేయించారు. అయినా ఆదివారం తెల్లవారుజామున ఆమె చనిపోయింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మండల కేంద్రం కొత్తచెరువులోని కెంపుల వీధికి చెందిన పండ్ల వ్యాపారి రాజారాం(54) చెన్నేకొత్తపల్లి మండలం ఓబుళంపల్లి సమీపంలో కర్భూజా తోటను తీసుకున్నాడు. ఆదివారం కాయలను కోసి తరలిస్తుండగా ఎండ వేడిమికి స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే చికిత్స నిమిత్తం కొత్తచెరువుకు తీసుకువస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి పంచాయతీలోని జన్మభూమి నగర్‌కు చెందిన ఏసయ్య (55) ఆదివారం మధ్యాహ్నం కాలనీకి నీటి ట్యాంకర్ రావడంతో ఎండ వేడిమిని కూడా పట్టించుకోకుండా వెళ్లాడు. మండే ఎండలోనే నీటిని తీసుకుని వెళుతూ అస్వస్థతకు గురయ్యాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతన్ని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. ఇతనికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ముదిగుబ్బ మండలం మర్తాడు గ్రామానికి చెందిన వెంగముని(70) ఆదివారం వ్యక్తిగత పని నిమిత్తం ధర్మవరం పట్టణానికి వెళ్లాడు. పని ముగించుకుని ఆటోలో తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో ఎండ వేడిమికి తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. హిందూపురం మండలంలోని హనుమేపల్లికి చెందిన రైతుకూలీ రామాంజినప్ప(35) ఆదివారం మధ్యాహ్నం కూలి పనులు చేస్తూ ఆస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అక్కడున్నవారు అతని ముఖంపై నీళ్లుపోసి సపర్యలు చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే మృతిచెందాడు. ఇతను ఉదయం సరైన ఆహారం తీసుకోకుండానే మధ్యాహ్నం వరకు పనులు చేయడంతో ఆస్వస్థతకు గురై మృతిచెందినట్లు కూలీలు తెలిపారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. -అమడగూరు మండలం కందుకూరిపల్లికి చెందిన కుంచపు వెంకటరమణ(65) ఆదివారం గేదెలను కాసేందుకు వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చాడు. నీరు తాగి మంచంపై పడుకున్నాడు. ఎంత సేపటికీ లేవదు. అప్పటికే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. ఇతనికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ధర్మవరంలోని దుర్గానగర్‌కు చెందిన లారీడ్రైవర్ మణియార్ షాజహాన్ (45) శనివారం మధ్యాహ్నం లారీలో ద్రాక్ష లోడు వేసుకుని ఒడిశాకు వెళ్లాడు. తిరుగు ప్రయాణమై వస్తుండగా మార్గమధ్యంలోనే లారీని ఆపి కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. ధర్మవరం మండలం గొట్లూ రు గ్రామానికి చెందిన దాసరి శివయ్య(32) అనే చేనేత కార్మికుడు ఆదివారం సాయంత్రం కదిరి సమీపంలోని ఎర్రదొడ్డి గంగమ్మకు మొక్కులు తీర్చడానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించారు. అప్పటికే మృతి చెందాడు. చిలమత్తూరు మండలం చిన్నన్నపల్లికి చెందిన నారాయణమ్మ (52) ఆదివారం వడదెబ్బతో మృతి చెందింది. ఈమె కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతుండేది. ఆదివారం ఉదయం నుంచి బయట చిన్నచిన్న పనులు చేసింది. ఈ క్రమంలో ఎండవేడిమి తాళలేక అస్వస్థతకు గురై చనిపోయింది. రాయదుర్గం మండలం ఆయతపల్లికి చెందిన గంగప్ప(70) రైతు. ఆదివారం తోటలో పనిచేస్తుండగా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వడదెబ్బకు గురై అక్కడిక్కడే మృతి చెందాడు. నేడు ‘మీ కోసం’ రద్దు అనంతపురం అర్బన్ :జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో సోమవారం నిర్వహించనున్న మీ కోసం కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు సాధ్యమైనంత వరకూ ఎండలో తిరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. -
'విజయదశమి నుంచే రాజధాని పనులు ప్రారంభిస్తాం'
-
సూర్య @ 45.2
శింగనమల మండలంలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో సూర్యప్రతాపం కొనసాగుతోంది. ప్రజలు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. వైశాఖం ముగిసిన తరువాత భానుడు భగ్గుమనడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉష్ణోగ్రతలు 40 నుంచి 46 డిగ్రీలు నమోదవుతుండటంతో ‘అనంత’ వేడెక్కిపోయింది. పట్టణాల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారుతుండగా ఎండవేడికి గ్రామీణ ప్రాంతాలు అల్లాడుతున్నాయి. శనివారం కూడా శింగనమల మండలం తరిమెలలో 45.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. యాడికి, కళ్యాణదుర్గం మండలాల్లో వడదెబ్బతో ముగ్గురు మృత్యువాతపడ్డారు. చిన్నారులు, వృద్ధులు, రోజువారీ కష్టజీవులు, ఉపాధి కూలీలు ఉక్కపోతకు సొమ్మసిల్లిపోతున్నారు. మొత్తమ్మీద సూర్యప్రతాపంతో ‘అనంత’ ఉడికిపోతోంది. శింగనమల మండలంలో 45.2 డిగ్రీలు, యల్లనూరు 42.6 డిగ్రీలు, అనంతపురం 42.3 డిగ్రీలు, పామిడి 42.3 డిగ్రీలు, కూడేరు 42.1 డిగ్రీలు, యాడికి, ఆత్మకూరు 42 డిగ్రీలు, పుట్లూరు, విడపనకల్ 41.9 డిగ్రీలు, కళ్యాణదుర్గం 41.7 డిగ్రీలు, తాడిమర్రి, పెద్దవడుగూరు 41.4 డిగ్రీలు, రొద్దం 41.3 డిగ్రీలు, రాయదుర్గం 41.2 డిగ్రీలు, పెద్దపప్పూరు, నార్పల 41.1 డిగ్రీలు, ఉరవకొండ, తనకల్లు 41 డిగ్రీలు మేర నమోదు కాగా తక్కిన మండలాల్లో 38 నుంచి 40 డిగ్రీల మేర వేసవితాపం కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 27 నుంచి 29 డిగ్రీలుగా నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం పూట 60 నుంచి 70 శాతం ఉండగా మధ్యాహ్న సమయానికి 20 నుంచి 30 శాతానికి పడిపోయాయి. మరికొద్ది రోజులు వేసవితాపం కొనసాగే అవకాశం ఉన్నందున వడదెబ్బ సోకకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. -
'విజయదశమి నుంచే రాజధాని పనులు ప్రారంభిస్తాం'
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణ పనులను విజయదశమి నుంచి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణంలో భాగంగా ముందు ఖరారు చేసిన శంకుస్థాపన తేదీలో ఎటువంటి మార్పులేదన్నారు. జూన్ 6వ తేదీ ఉదయం 8.49నిమిషాలకే శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని బాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వడగాల్పులపై శనివారం లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో ప్రెస్ మీట్ చంద్రబాబు నిర్వహించారు. వడదెబ్బ మృతుల కుటుంబాలకు రూ.లక్ష పరిహారం అందించనున్నట్లు బాబు తెలిపారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని.. ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో విశాఖ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో వడదెబ్బ మృతులు అధికంగా ఉన్నారని ఈ సందర్భంగా బాబు తెలిపారు. -
'ప్రాణ నష్టం తగ్గేలా చర్యలు తీసుకుంటాం'
-
ప్రాణ నష్టం తగ్గేలా చర్యలు తీసుకుంటాం:చంద్రబాబు
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వడగాల్పులపై సీఎం చంద్రబాబు నాయుడు శనివారం లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని.. ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో విశాఖ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో వడదెబ్బ మృతులు అధికంగా ఉన్నారని ఈ సందర్భంగా బాబు తెలిపారు. ప్రతీ గ్రామంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండటమే కాకుండా వైద్యుల సలహాలు తీసుకోవాలని స్పష్టం చేశారు.మరోవారం పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందన్నారు. ప్రాణనష్టం తగ్గించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
సూర్యుడు.. చంపేస్తున్నాడు!
హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భానుడి ప్రతాపం శనివారం కూడా కొనసాగింది. వడగాలులు విపరీతంగా వీయడంతో గంట గంటకూ వడదెబ్బకు మరణించేవాళ్ల సంఖ్య పెరుగుతూనే వచ్చింది. ఇళ్ల నుంచి కాలు బయట పెట్టాలంటే ప్రజలు గజగజలాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో చిన్నారులు, పెద్దలు, కూలీలు, వృద్ధులు, రైతులు వడదెబ్బ తీవ్రతను తట్టుకోలేక పిట్టల్లా రాలిపోయారు. ఖమ్మంలో అత్యధికంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వడదెబ్బ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో శనివారం మృతిచెందిన వారి వివరాలు జిల్లాల వారీగా.. అనంతపురం: యాకిడిలో ఏడేళ్ల బాలుడు జ్ఞానేశ్వర్ మృతి చెందాడు కర్నూలు: బనగానపల్లె మండలం సైఫాలో ఓ మహిళ మృతి కడప: రైల్వే కోడూరు మండలం రెడ్డివానిపల్లి దళితవాడలో గాలితొట్టి పెంచులమ్మ మృతి చెందింది గుంటూరు: ఈ జిల్లాలో వడదెబ్బ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. వడగాలులు ఎక్కువగా వీస్తున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి జిల్లాలో ఇప్పటివరకు 9 మంది మృతిచెందారు. మృతులలో మంగళగిరి మండలానికి చెందిన ఓ వృద్ధుడు, క్రోసూరుకు చెందిన పోతుగంటి జగన్నాథం(70) ఉన్నారు. శ్రీకాకుళం: వీరఘట్టం మండలం కుంబిడిలో ఒకరు, సారవకోటలో మరో వ్యక్తి మృతి చెందాడు. విజయనగరం: భోగాపుర మండలం ముంజేరులో వడదెబ్బతో చందర్ రావు(67), దత్తిరాజేరు మండలం మానాపురంలో ఓ మహిళ మృతి చెందింది. విశాఖపట్నం: జిల్లాలోని చీడికాడలో వడదెబ్బతో ఓ మహిళ సహా ముగ్గురు మృతిచెందారు నెల్లూరు: ఈ జిల్లాలో వడదెబ్బ తీవ్రంగా ఉండటంతో 13 మంది మృతి. కావలిలో వడదెబ్బకు ఆరుగురు మృతిచెందారు. ఉదయగిరి మండలంలో మరో ఐదుగురు మృతిచెందారు. ప్రకాశం: పొదిలిలో వడదెబ్బకు నాలుగేళ్ల చిన్నారి భారతి మృతిచెందింది. దర్శిలో అయితే ఏకంగా ఏడుగురు మృతిచెందారు. కొరివిపాడు మండలం మేదరమెట్లలో వడదెబ్బతో ఓ వృద్ధురాలు మృతి. కృష్ణా: తిరువూరు మండలం మునికోళ్లలో ఉపాధిహామీ కూలీ మోహన్ (65), రాజుపేటలో రొయ్యల వైకుంఠరావు(70) మృతిచెందారు. కాకర్లలో దేవసహాయ(70) అనే వృద్ధుడు, నందిగామ మండలం జొన్నలగడ్డలో అనసూయమ్మ(65) అనే వృద్ధురాలు, గన్నవరం మండలంలో మరో వృద్ధురాలు, ఓ మధ్యవయస్కుడు మృతిచెందారు. తెలంగాణలో వడదెబ్బతో మృతిచెందిన వారి వివరాలు జిల్లాల వారీగా.. కరీంనగర్: సిరిసిల్ల బీవై నగర్లో మాద్యం రామస్వామి (65) మృతి నల్లగొండ: కేతెపల్లి మండలం గుడివాడలో ఓ వృద్ధుడు, చివ్వేంల మండలం గుంజనూరులో ఓ మహిళ మృతి మెదక్: ఈ జిల్లాలో వడదెబ్బ ప్రభావంతో ఐదుగురు మృతిచెందారు ఖమ్మం: భద్రాచలం రెవెన్యూ మండలం గట్టికల్లు శివారు తండాలో ఓ వ్యక్తితో పాటు, రాయపర్తిలో యాదయ్య(55), వర్ధన్నపేట మండలం దివిటిపల్లిలో కూలీ చిన్నయ్య మృతి ఆదిలాబాద్: బెల్లంపల్లి మండలం మాలగురజాలలో ఓ వ్యక్తి మృతిచెందాడు రంగారెడ్డి : హయత్ నగర్ మండలం ఇంజాపూర్ గ్రామంలో శనివారం వడదెబ్బతో యాదమ్మ(32) అనే మహిళ మృతిచెందింది. మహబూబ్ నగర్: జిల్లాలో 5 మంది మృతిచెందారు ఉష్ణోగ్రతలు అసాధారణంగా నమోదవుతోన్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ శనివారం దేశంలో రెడ్ అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు భానుడి భగభగలతో మండిపోతున్నాయి. శుక్రవారం రాత్రి వరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బకు 427 మంది మృత్యువాత పడ్డారు. -
‘వడదెబ్బ'కు అందని సాయం
- అక్కరకు రాని ఆపద్బంధు క్షేత్రస్థాయిలో స్పందించని రెవెన్యూశాఖ మెడికల్, పోలీసు - రిపోర్టుల్లో జాప్యం మూడు శాఖలు కలిస్తేనే సాయం. సాక్షి, హన్మకొండ : జిల్లాలో వడదెబ్బతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పెద్ద దిక్కును కోల్పోరున కుటుంబాలకు ఆపద్బంధు పథకం కింద ప్రభుత్వం రూ.50 వేలు అందిస్తోంది. ఈ సాయం అందాలంటే రెవెన్యూ, మెడికల్, పోలీసుశాఖలు నివేదికలు ఇవ్వాలి. ఈ మూడు శాఖల మధ్య సమన్వయం లోపిస్తే ఆపద్బంధు ద్వారా అందాల్సిన సాయం మధ్యలో ఆగిపోతుంది. కాగా, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లోని వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ఆపద్బంధు పథకం ద్వారా రూ.50 వేల ఆర్థిక సాయం అందిస్తుంది. ప్రస్తుతం వడదెబ్బ మృతులకు కూడా ఆపద్బంధు పథకం ద్వారానే సాయం అందిస్తున్నారు. ఈ సాయాన్ని అందించేందుకు మండలం, డివిజన్, జిల్లాస్థాయిల్లో కమిటీలు ఉంటాయి. జిల్లా స్థాయిలో కలెక్టర్ కమిటీకి సారథ్యం వహిస్తారు. వడదెబ్బ కారణంగా వ్యక్తి చనిపోయినప్పుడు ఆర్థిక సాయం కోసం మరణించిన కుటుంబానికి చెందిన వ్యక్తులు గ్రామ రెవెన్యూ అధికారికి దరఖాస్తు చేయాలి. ఆయన తహసీల్దార్‌కు సమాచారం ఇస్తారు. అనంతరం తహశీల్దార్, పోలీసులు, మెడికల్ ఆఫీసర్లు విచారణ చేపడతారు. ఈ విచారణలో వడదెబ్బ కారణంగానే మృతి చెందినట్లుగా ధ్రువీకరిస్తే ఆపద్బంధు పథకం ధ్వారా రూ 50,000 సాయం అందుతుంది. సాయంలో జాప్యం ఆపద్బంధు సాయం పొందడంలో మెడికల్ రిపోర్టుది కీలక పాత్ర. మెడికల్ ఆఫీసర్ ఇచ్చే రిపోర్టులో వడదెబ్బ అని తేలితేనే సాయమందిస్తామని అధికార యంత్రాంగం స్పష్టం చేస్తున్నారు. దీనితో ఎక్కువ మరణాలు సాధారణ మరణాలుగానే పరిగణిస్తూ సాయం చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరిస్తున్నారు. గ్రామస్థాయిలో వడదెబ్బ కారణంగా మరణాలు సంభవించినప్పుడు రెవెన్యూ, పోలీసు, ఆరోగ్యశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మరణం సంభవించినప్పుడు గ్రామస్థాయిలో ఉండే వీఆర్వోలు తహశీల్దార్‌కు సమాచారం ఇవ్వగానే.. పోలీసులు, మెడికల్ ఆఫీసర్లు వెంటనే శవపరీక్ష నిర్వహించడం వల్ల కచ్చితమైన రిపోర్టు వచ్చేందుకు అవకాశం ఉంది. మరణం సంభవించినప్పుడు గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల అంత్యక్రియలు పూర్తవుతున్నాయి. ఆ తర్వాత నివేదిక ఇచ్చే సమయంలో వడదెబ్బ కారణంగానే మరణించారు అని నిర్ధారించడం కష్టంగా మారుతోంది. దీనితో అనేక పేద కుటుంబాలకు సాయం అందడం లేదు. పూట గడవడం కష్టమే మరిపెడకు చెందిన కర్నాటి సత్యనారాయణ(65) స్థానిక పంచాయతీ పరిధిలో కాంట్రాక్టు ఉద్యోగిగా జీవనం సాగిస్తున్నాడు. సోమవారం విధులకు వెళ్లిన సత్యనారాయణ వడదెబ్బకు గురయ్యారు. ఆ తర్వాత రెండు రోజుల పాటు ఇంట్లోనే చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈయన మరణంతో భార్య, పెద్దకూతురు ది క్కులేనివారయ్యారు. సెంట్‌భూమి కూడా లేని దుర్భర పరిస్థితి. అంత్యక్రియలు నిర్వహించేందుకు సర్పంచ్ సాయం చేశారు. ఆపద్బంధు పథకం ద్వారా తమను ఆదుకోవాలని ఈ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పోలీసులు, తహశీల్దార్, మెడికల్ ఆఫీసర్లు ఇచ్చే రిపోర్టుపైనే ఈ కుటుంబానికి సాయం అందనుంది. -
నిప్పుల వాన
- కొనసాగుతున్న వడగాడ్పులు - వడదెబ్బకు ఆరుగురు మృతి - తల్లడిల్లుతున్న జిల్లా ప్రజలు - విశాఖలో ఉష్ణతీవ్రత 37.2 డిగ్రీలు సాక్షి, విశాఖపట్నం: భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోజురోజుకు ఉష్ణతీవ్రతను పెంచుతున్నాడు. దాంతోపాటు వడగాడ్పులు అదే స్థాయిలో ఉధృతమవుతున్నాయి. వరసగా మూడు రోజుల నుంచి వేడిగాలులు జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. గురువారం కూడా ఉష్ణోగ్రతలు పెరిగాయి. జిల్లా వ్యాప్తంగా వడదెబ్బకు ఒక్క గురువారమే ఆరుగురు చనిపోయారు. బుధవారం నగరంలో 37 డిగ్రీలు నమోదుకాగా గురువారం మరో .2 డిగ్రీలు పెరిగి 37.2 డిగ్రీలకు చేరుకుంది. ఇళ్లలో కిటికీలు, తలుపులు వేసినా వేడి తీవ్రత తగ్గలేదు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. నిత్యావసర సరకుల కొనుగోలు చేయాల్సి వచ్చిన వారు ఉదయం పది గంటలలోపు, సాయంత్రం ఐదు గంటల తర్వాత వెళ్లి వస్తున్నారు. పగలంతా వడగాడ్పులతో అలసట చెందిన వారు సాయంత్రం వేళ సాగరతీరంలోకి వెళ్లి సేద తీరుతున్నారు. గంటల తరబడి అక్కడే గడిపి ఉపశమనం పొందుతున్నారు. రాత్రికి ఇళ్లకు చేరుకుంటున్నారు. మరోవైపు ఎండ లు, వడగాడ్పులతో పాటు ఉక్కపోతతో నగర వాసులు సతమతమవుతున్నారు. నగరం సముద్రతీరంలో ఉండడం వల్ల ఉక్కపోత ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఇళ్లలో ఒకపక్క ఫ్యాన్లు అదే పనిగా తిరుగుతున్నా చెమటలు తగ్గడం లేదు. పశ్చిమ, వాయవ్య దిశ నుంచి గాలులు వీస్తున్నా అవి కూడా వేడినే వెదజల్లుతున్నాయి తప్ప ఫలితం కనిపించడం లేదు. వచ్చే రెండు రోజులు ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అందువల్ల బయటకు వెళ్లాల్సి వస్తే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఇళ్లకే పరిమితమవ్వాలని సూచిస్తున్నారు. -
వడదెబ్బకు రాలిన ప్రాణాలు
మృతుల్లో ఇద్దరు రైతులు, ఒక ఉపాధి కూలీ, ఉపాధ్యాయుడు, వృద్ధుడు బాధిత కుటుంబాల్లో విషాదం వర్గల్/పాపన్నపేట/చిన్నకోడూరు/ తూప్రాన్ /ములుగు : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురు వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన రైతు గడ్డం నర్సయ్య (68) తనకున్న మూడున్నర ఎకరాల పొలంలో వరిని సాగు చేశాడు. బుధవారం మిషన్‌తో వరి కోయించాడు. అదేరోజు కొడుకు స్వామితో కలిసి పొలంలో వరిగడ్డిని కట్టలుగా కట్టి ఇంటికి తరలించే పనిలో నిమగ్నమయ్యాడు. రాత్రి ఇంటికి చేరిన నర్సయ్య వడదెబ్బ లక్షణాలతో అస్వస్థతకు గురయ్యాడు.గురువారం ఉదయం వరకు పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబ సభ్యు లు అతడిని 108లో గజ్వేల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య యాదమ్మ, కుమారుడు స్వామిలు ఉన్నారు. పాపన్నపేట మండలం బాక్యా తండాకు చెందిన దేవసోత్ కిషన్ (56) వారం రోజులుగా గ్రామశివారులోని మాచిరెడ్డికుంటలో జరుగుతున్న ఉపాధి పనులకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం కూడా పనులు హాజరయ్యాడు. అయితే మధ్యాహ్నం ఒ క్కసారిగా.. కిషన్ వడదె బ్బతో కుప్పకూలిపోయాడు. సహచరులు అతడిని ఇం టికి తీసుకువచ్చే సారికి అప్పటికే మృతి చెందాడు. మృతుడికి భార్య పెంటి, కు మార్తె చాంగును, కుమారులు మోహన్, వసంత్, శ్రీనివాస్‌లు ఉన్నా రు. చిన్నకోడూరు మండలం చౌడారం గ్రామానికి చెందిన కొమ్మెర మల్లారెడ్డి (65) వ్యసాయ పనులు చేస్తూ కుటుం బాన్ని పోషిస్తున్నాడు. గురువారం ఉద యం పనులకు వెళ్లి వచ్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇది గమనించిన కు టుంబీకులు ఆస్పత్రికి తరలించే క్రమం లో మల్లారెడ్డి మృతి చెందాడు. మృతుడికి భార్య శాంతవ్వ, కుమారుడు రవీం దర్‌రెడ్డిలు ఉన్నారు. మృతుడి కుటుం బాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ పరకాల వజ్రమ్మ, ఎంపీటీసీ భూంరెడ్డిలు కోరారు. తూప్రాన్ పట్టణానికి చెందిన గడ్డం శ్రీనివాస్ (33) స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. పాఠశాలలకు సెలవులు కావడంతో బుధవారం బంధువుల శుభ కార్యక్రమానికి వెళ్లాడు. అక్కడ ఎండలో బాగా తిరిగి అదేరోజు సాయంత్రం ఇంటికి వచ్చి పడుకున్నాడు. అయితే గురువారం ఉదయం బంధువులు ఇంటికెళ్లగా అక్కడ శ్రీనివాస్ విగతజీవుడై పడి ఉన్న విషయాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య అనిత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ములుగుకు చెందిన తీగుళ్ల కిష్టయ్య (60) ప్రతి రోజూ పశువులను మేతకు తిప్పుకువస్తుంటాడు. గురువారం కూ డా పశువులను మేతకు వెళ్లిన కిష్టయ్య ఎండ వేడిమి తాళలేక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వ్యవసాయ బావి వద్దకు చేరుకుని కుప్పకూలి మృతి చెందాడు. మృతుడికి భార్య చం ద్రమ్మ, నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. వడదెబ్బతో వివాహితకు అస్వస్థత రామాయంపేట మండలం కోనాపూర్ చిన్నతండాకు చెందిన సునీత గురువారం వడదెబ్బతో అస్వస్థతకు గురైంది. వివరాలిలా ఉన్నాయి.. వారం రోజులుగా సునీత వ్యవసాయ పనుల కు వెళుతోంది. ఇటీవల కాలంలో ఎండల ప్రభావం పెరగడంతో గురువారం వడదెబ్బకు గురైంది. దీంతో స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. -
వడదెబ్బకు ముగ్గురి బలి
తలకొండపల్లి / పెబ్బేరు : జిల్లాల్లో వేర్వేరు చోట్ల ముగ్గురు వ్యక్తులు వడదెబ్బకు గురై మృత్యువాతపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. తలకొండపల్లికి చెందిన బుడ్డ రామయ్య (75) ఇంటి వద్ద చెప్పులు కుడుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు భార్య నాగమ్మతో పాటు నలుగురు కుమారులున్నారు. ఎప్పటిలాగే అతను శనివారం ఉదయం నుంచి పనిచేస్తుండగా వడదెబ్బతో అదే రాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతి చెందాడు. మరో సంఘటనలో కొంతకాలంగా చంద్రధనకు చెందిన ముంతగల్ల కృష్ణయ్య (37) స్థానికంగా జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో కూలీగా పని చేస్తున్నాడు. ఈయనకు భార్య చిట్టెమ్మతో పాటు ఇద్దరు కుమారులున్నారు. ఎప్పటిలాగే శనివారం ఉదయం శివారులో పనికి వెళ్లిన అతను మధ్యాహ్నం వడదెబ్బకు గురై రెండుసార్లు వాంతులు చేసుకున్నాడు. ఇది గమనించిన తోటికూలీలు వెంటనే ఇంటికి పంపించారు. ఆ కొద్దిసేపటి కే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరుమన్నారు. ఆదివారం ఉదయం బాధిత కుటుంబాన్ని జెడ్పీటీసీ సభ్యుడు నర్సింహతో పాటు ఏపీఓ శివశంకర్ పరామర్శించారు. ఈ మేరకు కృష్ణయ్య కుటుంబానికి *వెయ్యి, రాములు కుటుంబానికి *మూడు వేల ఆర్థికసాయం అందజేశారు. కాగా, శనివారం సాయంత్రం జూలపల్లిలో పిడుగుపాటుకు కడారి వెంకటయ్యకు చెందిన ఎద్దు మృతి చెందింది. ఇంకో సంఘటనలో పెబ్బేరు మండలం గుమ్మడానికి చెందిన బోయజల్లి భాస్కర్ (40) వృత్తిరీత్యా వ్యవసాయ కూలీ. ఈయనకు భార్య లక్ష్మితోపాటు కుమారుడు, కూతురు ఉన్నారు. ఎప్పటిలాగే రెండు రోజుల క్రితం పనికి వెళ్లి ఎండ తీవ్రత వల్ల అస్వస్థతకు గురయ్యాడు. స్థానికంగా వైద్యం చేయించుకున్నా ఎంతకూ తగ్గలేదు. దీంతో ఆదివారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు అతడిని కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఈ సంఘటనతో వారు కన్నీరు మున్నీరయ్యారు. -
వడదెబ్బ శుక్రవారం మృతులు 40
- వడగాడ్పులు, ఎండల తీవ్రతతో అల్లాడుతున్న జిల్లా - పిట్టల్లా రాలిపోతున్న వృద్ధులు, అనాథలు, పిల్లలు - రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు - తీవ్రమైన ఉక్కపోత.. ఆపై విద్యుత్ కోతలు - పాఠశాలలకు ఆలస్యంగా సెలవు ప్రకటించిన అధికారులు - రెండు రోజుల్లో 53 వడదెబ్బ మరణాలు వడగాలుల ధాటికి పేదల ఊటీ వడలిపోతోంది. ఎండ తీక్షణత.. తీవ్రమైన ఉక్కపోతతో ఉడికిపోతోంది. శరీరంలోని శక్తి చెమట రూపంలో బయటకు వచ్చేస్తుండటంతో వృద్ధులు, పిల్లలు జావగారిపోతున్నారు. పిట్టల్లా రాలిపోతున్నారు. గురువారం 13 మంది మరణిస్తే.. శుక్రవారం ఏకంగా 40 మంది వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. రుతుపవనాలతో చల్లగా ఉండాల్సిన వాతావరణం.. సూర్యతాపంతో నాలుగు రోజులుగా సెగలు కక్కుతోంది. దీనికితోడు వేళాపాళాలేని కరెంటు కోతలు ప్రజలను పెనం మీది నుంచి పొయ్యిలోకి తోసేస్తున్నాయి. మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి ఉండవచ్చన్న వాతావరణ శాఖ సూచనలతో జనం బెంబేలెత్తుతున్నారు.