గత వారంతో పోల్చుకుంటే ఉష్ణోగ్రత ఒకటి రెండు డిగ్రీలు తగ్గినా వడగాడ్పుల తీవ్రత తగ్గడంలేదు. వేడిగాలుల తీవ్రతకు జనం విలవిలలాడుతున్నారు. వడదెబ్బతో పిట్టల్లా రాలుతూనే ఉన్నారు. గురువారం జిల్లా వ్యాప్తంగా వడదెబ్బకు 32 మంది మృతిచెందారు.
రామగుండంలో నలుగురు
కోల్‌సిటీ/ జ్యోతినగర్: గోదావరిఖని స్థానిక మార్కండేయకాలనీకి చెందిన ఎన్నం రాజేశం (61) స్థానిక ద్వారకానగర్ కు చెందిన గడ్డం మధునయ్య(60) ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్ప పొందుతూ గురువారం మృతి చెందారు. రామగుండం 3వ డివిజన్ అంబేద్కర్ భవనం రోడ్డు ఏరియాలో నివసిస్తున్న ఆటో డ్రైవర్ దొడ్డె సదానందం(40) ఎండలో ఆటో నడపడంతో బుధవారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యూడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. 44వ డివిజన్ ఎఫ్‌సీఐ టౌన్‌షిప్‌లో నివసిస్తున్న క్యాజువల్ కార్మికుడు బోయినపల్లి రత్నాకర్‌రావు(50) ఎండ తీవ్రతకు మృతిచెందాడు.
కథలాపూర్ మండలంలో ముగ్గురు..
కమలాపూర్ : మండల కేంద్రానికి చెందిన మహ్మద్ ఖాజాబీ(72) ఎండ వేడిమితో మృతి చెందింది. నేరెళ్లకు చెందిన ఆకుల కొమురయ్య (65), గూనిపర్తికి చెందిన బుర్ర సమ్మక్క(55) వడదెబ్బతో చనిపోయారు.
చందుర్తి మండలంలో ఇద్దరు..
రుద్రంగికి చెందిన నగరం రుచిత(12) తోటి స్నేహితులతో ఉదయం 11గంటల వరకు ఆడుకుంది. ఇంట్లోకి వచ్చి నీళ్లు తాగి కుప్పకూలి పోయింది. అస్పత్రికి తరలించగా వడదెబ్బతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కిష్టంపేటకు చెందిన మ్యాదరి లక్ష్మణ్‌రామన్న(72) మృతిచెందాడు.
హుజూరాబాద్‌లో ఇద్దరు..
హుజూరాబాద్/టౌన్ : హుజూరాబాద్ పట్టణంలోని వడ్డెరకాలనీకి చెందిన కూలీ ముద్దంగుల రాంచందర్ (35) ఎండ తీవ్రతకు ఐదు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యాడు. కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మండలంలోని రాంపూర్‌కు బైరవేన వీరయ్య (70) వడగాలులకు ఇంటి వద్దనే మృతి చెందాడు.
మానకొండూర్ మండలంలో ఇద్దరు..
మానకొండూర్ :మానకొండూర్‌కు చెందిన పిట్టల నర్సయ్య (67), లింగాపూర్ గ్రామానికి చెందిన పిట్టల లచ్చమ్మ (55) వడదెబ్బతో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
పెగడపల్లి : మండలంరాంనగర్‌కు చెందిన చిలుక మలయ్య(65) బుధవారం మధ్యాహ్నం చెట్ల మందుల కోసం వెంగళాయిపేట పెద్దగుట్టకు వెళ్లి ఎండ తీవ్రతతో చనిపోయడు.
రామడుగు : మండల కేంద్రానికి చెందిన భీమనాతిని శ్రీనివాసన్(70) వడదెబ్బతో మృతిచెందాడు.
చొప్పదండి : మండలంలోని రుక్మాపూర్‌కు చెందిన వంగ రాజమ్మ(70)వడగాల్పుల తీవ్రతకు మృతిచెందాడు.
కొడిమ్యాల : మండలంలోని నల్లగొండగ్రామానికి చెందిన సబ్బనవేణి లచ్చవ్వ(55) రెండురోజులుగా ఎండలో వ్యవసాయపనులు చేసింది. వడదెబ్బ తగలడంతో కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది.
ముత్తారం : మండలంలోని లక్కారం గ్రామానికి చెందిన మంథని బెజ్జమ్మ(70) ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లాగా చికిత్స చేస్తుండగానే మృతిచెందింది.
వేములవాడ అర్బన్ : వేములవాడ మండలం మర్రిపల్లికి చెందిన కూలీ చింతపంటి లచ్చవ్వ(55) ఎండదెబ్బ తగిలి మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు.
జూలపల్లి: తేలుకుంట గ్రామానికి చెందిన అకారపు రవీందర్‌రెడ్డి(65) ఎలిగేడు మండలం నర్సాపూర్‌లోని తన మేనల్లుడి ఇంటికి వెళ్లొచ్చిచ్చాడు. ఎండ తీవ్రతకు వాంతులు, విరేచనాలు కావడంతో అస్వస్థతకు గురై వృతి చెందాడు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ప్రతిమ మెడికల్ కళాశాలకు అప్పగించినట్లు సర్పంచ్ గెడిశెల రవి తెలిపారు.
ఇల్లంతకుంట : పత్తికుంటపల్లికి చెందిన కూనబోయిన లచ్చవ్వ(65) వడదెబ్బ తగిలి మృతి చెందింది.
తిమ్మాపూర్ : మండలంలోని పోరండ్లకు చెందిన నాగపురి ముత్తమ్మ(50) వ్యవసాయ బావివద్దకు వెళ్లింది. అక్కడ ఎండలో పిడకలు చేయడంతో సృ్పహకోల్పోరుుంది. సమీపంలో పనులు చేస్తున్న మరో మహిళ ,రోడ్డువెంట వెళ్తున్న మాజీ ఎంపీటీసీ లకా్ష్మరెడ్డి నీళ్లు తాగించే ప్రయత్నం చేయగా మృతి చెందింది.
ఇబ్రహీంపట్నం : తిమ్మాపూర్‌కు చెందిన తమడవేణి శ్రీనివాస్(39) బుధవారం కూలిపనికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చి పడిపోయూడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
భీమదేవరపల్లి : భీమదేవరపల్లికి చెందిన రైతు కేదారి(65) ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురికాగా కుటుంబ సభ్యులు ముల్కనూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కోతులనడుమ(ఎల్కతుర్తి) : కోతులనడుమకు చెందిన నద్దునూరి కొమురమ్మ(95) వడడెబ్బతో మృతిచెందింది.
వెల్గటూరు: మండలంలోని కప్పారావుపేటకు చెందిన రేషన్ డీలర్ తరల్ల భూమమ్మ(45) ఎండ తీవ్రతకు గురువారం తెల్లవారు జామున మతిృ చెందింది.
సిరిసిల్ల రూరల్ : మండలంలోని పద్మనగర్‌కు చెందిన వడ్డెపల్లి అంబవ్వ(65) ఎండ వేడికి అస్వస్థతకు గురై మరణించినట్లు గ్రామస్తులు తె లిపారు.
ముస్తాబాద్ : తెర్లుమద్దికి చెందిన చిక్కాల లక్ష్మణ్‌రావు(72) వడగాలుల తీవ్రతకు చనిపోయాడు.
ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేటలో ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతంలోని చెర్లగురుపాడుకు చెందిన తాపీ మేస్త్రీ తన్నీరు సుబ్బరావు(35) ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురై రక్తం కక్కుకుని మృతిచెందాడు.
దుద్దెనపల్లి(సైదాపూర్‌రూరల్) : దుద్దెనపల్లికి చెందిన రిక్కల రాజిరెడ్డి(70) వేడి గాలులకు నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురై గురువారం మృతిచెందాడు.
రాయికల్ : మండలంలోని అల్లీపూర్‌కు చెందిన అత్కపురం పెద్దగంగారాం(85) ఎండ తీవ్రతకు జ్వరంతో బాధపడుతున్నాడు. పరిస్థితి విషమించి గురువారం మృతిచెందాడు.
గంగాధర : మండలంలోని గట్టుబూత్కూర్‌కు చెందిన కడారి అంజయ్య(58) వడదెబ్బతో మృతి చెందాడు.
ఇద్దరు చిన్నారులు మృతి
గొల్లపల్లి : మండలంలోని గంగాపూర్‌కు చెందిన కట్ట భరత్(9) వడదెబ్బతో గురువారం మృతి చెందాడు. ఆడుకోవడానికి బయటకు వెల్లిన భరత్ దాహం వేస్తుందని ఇంటికి వచ్చాడు. నీళ్లు తాగి పడి పోయాడు. తల్లి దండ్రులు చికిత్స కోసం జగిత్యాలకు తరలించారు. వైద్యుల సూచన మేరకు కరీంనగర్ చల్మెడ ఆనందరావు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందించేలోపు బాలుడు మృతిచెందాడు. కళ్లెదుటే విగత జీవుడైన ఒక్కగానొక్క కొడుకును చూసి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఆడుకునేందుకు ఎగురుతూ వెళ్లిన కొడుకు భానుడి ప్రతాపానికి చనిపోవడాన్ని వారు తట్టుకోలేక పోతున్నారు. భరత్ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కాలేదు.
కోరుట్ల: పట్టణంలోని రవీంద్రరోడ్‌కు చెందిన ఉమేరా అనే మూడేళ్ల చిన్నారి మడదెబ్బతో మృతి చెందింది. అజార్-నజీమా దంపతుల కూతురు ఉమేరా(3)కు బుధవారం వడదెబ్బ తగలడంతో సాయంత్రం వాంతులు చేసుకుంది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేరుుంచారు. గురువారం ఉదయం మళ్లీ వాంతులు చేసుకుని ఆకస్మాత్తుగా మృతి చెందింది.
వడదెబ్బకు 32 మంది మృతి
Published Fri, May 29 2015 6:09 AM | Last Updated on Sun, Sep 3 2017 2:54 AM
Advertisement