ప్రాణ నష్టం తగ్గేలా చర్యలు తీసుకుంటాం:చంద్రబాబు | chandra babu naidu says, people will protect from sunstroke | Sakshi
Sakshi News home page

ప్రాణ నష్టం తగ్గేలా చర్యలు తీసుకుంటాం:చంద్రబాబు

Published Sat, May 23 2015 5:31 PM | Last Updated on Sat, Jul 28 2018 6:48 PM

chandra babu naidu says, people will protect from sunstroke

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వడగాల్పులపై సీఎం చంద్రబాబు నాయుడు శనివారం లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని.. ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో విశాఖ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో వడదెబ్బ మృతులు అధికంగా ఉన్నారని ఈ సందర్భంగా బాబు తెలిపారు.

 

ప్రతీ గ్రామంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండటమే కాకుండా వైద్యుల సలహాలు తీసుకోవాలని స్పష్టం చేశారు.మరోవారం పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందన్నారు. ప్రాణనష్టం తగ్గించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement