సాక్షి నెట్‌వర్క్ : చిత్తూరు జిల్లాలో ఆదివారం వడదెబ్బ కారణంగా 18మంది మరణించారు. వరదయ్యుపాళెం మండలంలోని సంతవేలూరు గ్రావూనికి చెందిన డీ.కవులవ్ము (70), వరదయ్యుపాళెం గ్రావు పంచాయుతీ పరిధిలోని బీజేఆర్ గిరిజన కాలనీకి చెందిన వూరెయ్యు (67) ఎండ వేడిమి తాళలేక మృతి చెందారు. సోమల మండలంలోని ఎగువవీధికి చెందిన పీఎస్.సీతారామయ్య కుమా ర్తె శ్రీహా(5) వడదెబ్బతో మృతి చెందింది.
కురబలకోట మండలంలోని ముదివేడు గ్రామం బుడతనరాళ్ల హరిజనవాడకు చెందిన వై.పెద్ద కదిరమ్మ (75), ఏర్పేడు మండలంలోని ఆమందూరు బీసీ కాలనీలో ఆదివారం సాయుంత్రం లక్ష్మవ్ము(57), శ్రీరంగరాజపురం మండలంలోని విలాసవరహాపురం పంచాయతీ ఎస్‌ఎస్‌ఆర్‌పురం గ్రామానికి చెందిన కుమ్మర మునస్వామిశెట్టి భార్య మంగమ్మ(79), కటికపల్లె దళితవాడలో కుప్పయ్య కుమారుడు చిన్నయ్య(61) మరణించాడు. కేవీపల్లె మండలంలోని బండవడ్డిపల్లెకు చెందిన ఏ.శ్రీనివాసులు (37) ఎండ వేడిమి తాళలేక మృతి చెందారు.
రేణిగుంట పంచాయతీ వడ్డిమిట్ట ప్రాంతానికి చెందిన కేశవులు (45), కార్వేటినగరంపెద్ద దళితవాడకు చెందిన సీ.అమాసయ్య(48), తూర్పు వీధికి చెందిన వార్తాల వెంకట్రామయ్య(79), బుచ్చినాయుడుకండ్రిగ మండలంలోని కొత్తపాళెం గ్రామానికి చెందిన మాజీ వీఆర్వో సుబ్బారెడ్డి (65), ఏర్పేడు వుండలంలోని పల్లం గొల్లపల్లి గ్రావూనికి చెందిన వునవాటి సుబ్బారావు(38) మరణించారు. శ్రీకాళహస్తి మండలంలో వడదెబ్బ కారణంగా ఆదివారం ఇద్దరు మృతి చెందారు.
మన్నవరం పంచాయుతీ పరిధిలోని కేపీ చింతల గ్రావూనికి చెందిన యుువకుడు వాంపల్లి చెంచయ్యు(36), బొక్కసంపాళెం గ్రావూనికి చెందిన రెడ్డిగారి చెంగారెడ్డి(54) మృతిచెందిన వారిలో ఉన్నారు. బి.కొత్తకోట మండలం కోటావూరు గ్రామం గుండ్లగుట్టవారిపల్లెకు చెందిన భజంత్రీ గంగులమ్మ (70), భాకరాపేట మండలంలోని దేవరకొండకు చెందిన పి.కృష్ణయ్య(67), చంద్రగిరి: పట్టణంలోని పాతపేట ముకుంద వీధికి చెందిన శకుంతలమ్మ (65) వడదెబ్బతో మృతిచెందారు.
వడదెబ్బకు18 మంది మృతి
Published Mon, Jun 1 2015 5:05 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 AM
Advertisement
Advertisement