సాక్షి నెట్‌వర్‌క : జిల్లాలో మరణమృదంగం కొనసాగుతూనే ఉంది. ఎండల తీవ్రత పెరుగుతూనే ఉంది. మంగళవారం 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా వడగాడ్పుల తీవ్రతకు 36 మంది మరణించారు. యడ్లపాడు మండలం చెంఘిజ్‌ఖాన్‌పేటకు చెందిన బసెల వీరమ్మ (78), తిమ్మాపురానికి చెందిన జంగా రవిబాబు (43), అమరావతి మండలం గాజులపాలెం పి.వెంకాయమ్మ (70), అమరావతి పల్లపువీధికి చెందిన లక్ష్మీనరసమ్మ (59), బీహెచ్ సీతారావమ్మ (75), ఈపూరు మండలంలోని ముప్పాళ్ల గ్రామానికి తుర్లపాటి సుబ్బాయమ్మ(65), బొల్లాపల్లి మండల పరిధిలోని మేళ్లవాగుకు చెందిన చాల మహిళ రాములు, నకరిల్లు మండలంలోని చల్లగుండ్ల గ్రామానికి చెందిన బడిగంచుల హనుమయ్య(65), నకరికల్లుకు చెందిన జూలకంటిబసవయ్య(65) వడదెబ్బతో మంగళవారం మృతి చెందారు.
రొంపిచర్లలో ఐదేళ్ల బాలిక మృతి..
ఎండతీవ్రత తాళలేక మూడు రోజుల క్రితం వడదెబ్బకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రొంపిచర్ల మండలం వడ్లమూడివారిపాలెం గ్రామానికి చెందిన ఏసుపోగు షమీల(5) మంగళవారం మృతిచెందింది. అదేవిధంగా అచ్చంపేట మండలం ఓర్వకల్లు గ్రామానికి చెందిన కోట నాగయ్య (90), చామర్రులో కె.హనుమయ్య (80), పిట్టలవానిపాలెం గ్రామానికి చెందిన గోకరాజు అనసూయమ్మ (70), కర్రి తిరుపతయ్య(60), అలకాపురం శివారు సత్యనారాయణపురం గ్రామానికి చె ందిన మంతెన అన్నపూర్ణమ్మ (80), బాపట్లకు చెందిన దాది అనసూర్యమ్మ (92), మటకుమల్లి పార్వతిదేవి (49), కర్లపాలెం గ్రామానికి చెందిన కేతినేని సుబ్బమ్మ (70), మండలంలోని నల్లమోతువారిపాలెం గ్రామానికి చెందిన బడుగు తిరుపతమ్మ (64), భట్టిప్రోలుకు చెందిన కౌతరపు బాలకోటేశ్వరరావు(71), మండలంలోని పల్లెకోనకు చెందిన కోరపాటి మహాలక్ష్మీ(40),
కొడుకు వెంటే తల్లి..
చిలకలూరిపేట మండలంలోని పసుమర్రు గ్రామంలో మంగళవారం కుమారుడు మరణించిన 48 గంటల తేడాతో తల్లికూడా మృతి చెందింది. వడదెబ్బ ప్రభావంతో గుదే వెంకటప్పయ్య ఆదివారం మరణించాడు. ఆ దుఃఖంలో ఉన్నతల్లి రాములమ్మ (82)మంగళవారం మృతి చెందింది. ఇదే గ్రామానికి చెందిన గొర్రెల కాపరి యలగాల వీరయ్య (62), చిలక లూరిపేట కాసు వెంగళరెడ్డినగర్‌కు చెందిన తలమాల సింగరమ్మ( 38) కారంపూడి మండలం పెదకొదమగుండ్ల గ్రామంలో గుంటకం హనుమాయమ్మ(62), గాదెవారిపల్లె గ్రామం లో కొత్తా చెన్నమ్మ(85), కారంపూడి గ్రామంలో వంగవరపు యేసురత్నం(65), మాచర్ల పట్టణానికి చెందిన అల్లూరి శంకరమ్మ (62), రెంటచింతలమండలంలోని పాలువాయి గ్రామానికి చెందిన శొంఠిరెడ్డి లచ్చమ్మ(84) వడదెబ్బకు మృతిచెందారు.
గురజాల నియోజకవర్గంలో ఏడుగురు..
దాచేపల్లికి చెందిన ఈర్ల సురేష్, లక్ష్మీల ఐదు నెలల చిన్నారితో పాటు ముత్యాలంపాడు గ్రామానికి చెందిన పాశం మంగమ్మ(85), గురజాలలోని న్యూశాంతి లాడ్జి వెనుక నివాసం వుంటున్న బి. కోటమ్మ(80), గురజాల రూరల్ మండలంలోని జంగమహేశ్వరపురం గ్రామంలో వర్రా కొండమ్మ(80), గోగులపాడు గ్రామంలో ఇంజమూరి మార్తమ్మ(80), గుత్తికొంత సొసైటీ డెరైక్టర్ కాండ్రకుంట వెంకటేశ్వర్లు(45), మాచవరం మండలంలోని మోర్జంపాడు గ్రామానికి చెందిన వజ్జె వడితె బాయి(55) మృతిచెందారు.
వడదెబ్బకు 36 మంది మృతి
Published Tue, May 26 2015 11:48 PM | Last Updated on Sun, Sep 3 2017 2:44 AM
Advertisement
Advertisement