
'విజయదశమి నుంచే రాజధాని పనులు ప్రారంభిస్తాం'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణ పనులను విజయదశమి నుంచి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణ పనులను విజయదశమి నుంచి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణంలో భాగంగా ముందు ఖరారు చేసిన శంకుస్థాపన తేదీలో ఎటువంటి మార్పులేదన్నారు. జూన్ 6వ తేదీ ఉదయం 8.49నిమిషాలకే శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని బాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వడగాల్పులపై శనివారం లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో ప్రెస్ మీట్ చంద్రబాబు నిర్వహించారు. వడదెబ్బ మృతుల కుటుంబాలకు రూ.లక్ష పరిహారం అందించనున్నట్లు బాబు తెలిపారు.
ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని.. ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో విశాఖ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో వడదెబ్బ మృతులు అధికంగా ఉన్నారని ఈ సందర్భంగా బాబు తెలిపారు.