రెండు తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బ మరణాలు గంటగంటకు పెరుగుతూ ఉన్నాయి.
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బ మరణాలు గంటగంటకు పెరుగుతూ ఉన్నాయి. భానుడి భగభగలు బుధవారం కొనసాగాయి. దక్షిణ కోస్తాంధ్రలో 24 గంటలపాటు తీవ్ర వడగాల్పులు వీస్తాయని విశాఖ వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ కోస్తా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం సమాచారం ఇది.
ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలవారీగా మృతుల వివరాలు:
అనంతపురం: లేపాక్షి మండలం కోడిపల్లిలో సంజీవమ్మ అనే మహిళా కూలీ, శెట్టూరులో మరో వ్యక్తి వడదెబ్బతో మృతిచెందారు.
కడప: చిన్నమండెం మండలం పొలిమేరపల్లిలో వడదెబ్బకు ఓ గొర్రెల కాపరి మృతి
తెలంగాణలో జిల్లాలవారీగా మృతుల వివరాలు:
ఆదిలాబాద్: లక్ష్మణ్ చందా మండలం పారుపల్లిలో ఉపాధి హామీ కూలీ మృతి
మహబూబ్ నగర్: పెద్దేరు మండలం చెలిమిల్లలో పకీరయ్య(45) మృతి
కరీంనగర్: సిరిసిల్ల బీవైనగర్ లో ఓ వృద్ధురాలు మృతి
నల్లగొండ: కేతేపల్లి మండలం గుడివాడలో లక్ష్మమ్మ మృతి