హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో వడగాలుల ప్రభావం ఇంకా తగ్గలేదు. వడగాలుల ప్రభావంతో మధ్యాహ్నం ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారికి చుక్కలు కనపడుతున్నాయి. శుక్రవారం ఉదయం నుండి ఇప్పటి వరకు వడదెబ్బకు ఏపీలో 10 మంది చనిపోగా , తెలంగాణలో 18 మంది చనిపోయారు.
చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున చనిపోగా, అనంతపురం ,శ్రీకాకుళం, విజయవాడ, వైఎస్సార్ జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. అలాగే తెలంగాణాలోని కరీంనగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో అత్యధికంగా నలుగురేసి చొప్పున మృతిచెందగా, ఆదిలాబాద్, వరంగల్‌లో ఇద్దరేసి చొప్పున, నిజామాబాద్‌లో ఒకరు, మహబూబ్‌నగర్‌లో మరొకరు వడదెబ్బకు బలయ్యారు.
తగ్గని వడగాలులు
Published Fri, May 29 2015 2:41 PM | Last Updated on Sun, Sep 3 2017 2:54 AM
Advertisement
Advertisement