two telugu states
-
కొత్తగా మరో జాతీయ రహదారి.. హైదరాబాద్–తిరుపతి.. మరింత దగ్గర
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ కొత్తగా మరో జాతీయ రహదారి ఏర్పాటుకానుంది. దీనివల్ల హైదరాబాద్, తిరుపతి మధ్యదూరం దాదాపు 70 కిలోమీటర్ల మేర తగ్గనుంది. తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాల బైపాస్ రోడ్డు వరకు ఆరులేన్ల జాతీయ రహదారి (కొల్లాపూర్ ఎన్‌హెచ్ –167కే) నిర్మాణానికి రూపొందించిన ప్రణాళికకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదం తెలిపింది. ఈ రహదారిలో భాగంగా కృష్ణా నదిపై సోమశిలవద్ద వంతెనను కూడా నిర్మించనున్నారు. ఈ మేరకు రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఆమోదిస్తూ కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. అలాగే మహబూబ్‌నగర్ నుంచి కర్ణాటకలోని చించోలి వరకు ఎన్‌హెచ్–167ఎన్ విస్తరణకు కూడా గ్రహణం వీడింది. దీని అలైన్మైంట్ ఖరారు కావడంతో పాటు నిర్మాణానికి రూ.703.68 కోట్లు మంజూరయ్యాయి. ఈ రహదారుల నిర్మాణంతో వివిధ ప్రాంతాలకు దూరం తగ్గనుండడంతో ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది. కొల్లాపూర్ ఎన్‌హెచ్‌కు టెండర్లే తరువాయి.. కొల్లాపూర్ జాతీయ రహదారి–167కే నిర్మాణానికి కేంద్రం గతేడాది గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు 173.73 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టనున్న ఈ రహదారి పనులకు రూ.600 కోట్లు, మార్గ మధ్యలో కొల్లాపూర్ వద్ద సోమశిల సమీపంలోని కృష్ణానదిపై 2 కిలోమీటర్ల మేర చేపట్టనున్న ఐకానిక్ వంతెన నిర్మాణానికి మరో రూ.600 కోట్లను కేంద్రం కేటాయించింది. ఈ రహదారి డీపీఆర్‌కు కేంద్రం ఆమోదముద్ర వేయడంతో నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలవడమే తరువాయని తెలుస్తోంది. తెలంగాణలోని కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, రాంపూర్.. ఆంధ్రప్రదేశ్‌లోని మందుగుల, శివాపురం, కరివెన మీదుగా నంద్యాల వరకు నిర్మించనున్న ఈ రహదారి పూర్తయితే హైదరాబాద్, తిరుపతి మధ్య దాదాపు 70 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. ఈ మార్గంలో పది ప్రాంతాల్లో బైపాస్ రోడ్లు, జంక్షన్లను అభివృద్ధి చేయనున్నారు. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేయాలని భావిస్తున్నట్లు ఎన్హెచ్ఏఐ అధికారవర్గాలు తెలిపాయి. కల్వకుర్తి కొట్రా జంక్షన్ టు నంద్యాల బైపాస్ తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని కొట్రా జంక్షన్ నుంచి కొల్లాపూర్ ఎన్‌హెచ్–167కే ప్రారంభమవుతుండగా.. కల్వకుర్తి, తాడూరు, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్‌లలో బైపాస్ రోడ్లు నిర్మించనున్నారు. సోమశిల సమీపంలో కృష్ణా నదిపై రీ–అలైన్మెంట్ బ్రిడ్జి, ఆ తర్వాత ఏపీలోని కర్నూలు జిల్లాలో ఎర్రమఠం, ముసిలిమాడ్, ఆత్మకూరు, వెలుగోడు, సంతజుటూరు, కరివెనపై నంద్యాల బైపాస్ రోడ్డు వరకు రహదారి నిర్మిస్తారు. చివరగా అక్కడ జాతీయ రహదారి–40 జంక్షన్‌కు అనుసంధానించనున్నట్లు డీపీఆర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం నంద్యాలనుంచి హైదరాబాద్ రావాలంటే కర్నూలు, వనపర్తి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ మార్గం పూర్తయితే నంద్యాలనుంచి నేరుగా నాగర్‌కర్నూలు మీదుగా హైదరాబాద్‌కు చేరుకోవచ్చు. అలైన్మెంట్ ఖరారు ఇలా.. మహబూబ్‌నగర్ జిల్లాలోని భూత్పూర్ ఫ్లైఓవర్, పాలకొండ, పాలమూరు యూనివర్సిటీ మీదుగా ఎన్‌హెచ్–167ఎన్ అలైన్మెంట్ ఖరారైంది. ఆ తర్వాత వీరన్నపేట, డంప్ యార్డు మీదుగా చిన్న దర్పల్లి, హన్వాడ.. నారాయణపేట జిల్లాలోని కోస్గి, వికారాబాద్ జిల్లాలోని కొడంగల్, తాండూరు మీదుగా కర్ణాటకలోని చించోలి వరకు విస్తరణ పనులు చేపట్టనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం చుట్టూ 8 కి.మీ.లు, కొడంగల్‌లో 5 కి.మీ.లు, తాండూర్‌లో 6 కి.మీ.ల మేర బైపాస్ రోడ్లు నిర్మించనున్నారు. ఎన్‌హెచ్–167ఎన్ నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ నుంచి ముంబైకి వెళ్లే వారికి దూరం తగ్గనుంది ఎన్‌హెచ్–167ఎన్.. రూ.703 కోట్లు మంజూరు మహబూబ్‌నగర్–చించోలి అంతర్రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మార్పు చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గతేడాది ప్రకటించారు. ఈ మేరకు సర్వే పూర్తి కాగా.. అలైన్‌మెంట్‌పై కూడా స్పష్టత వచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్‌హెచ్–44పై ఉన్న భూత్పూర్ ఫ్లైఓవర్ నుంచి కర్ణాటకలోని చించోలి వరకు జాతీయ రహదారి–167ఎన్ను విస్తరించేందుకు డీపీఆర్ సిద్ధమైంది. దీంతో ఇటీవల రూ.703.68 కోట్లు మంజూరు చేస్తున్నట్లు గడ్కరీ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ రహదారి మొత్తం 190 కిలోమీటర్ల నిడివి ఉండగా.. మహబూబ్‌నగర్ నుంచి వికారాబాద్‌లోని కర్ణాటక సరిహద్దు వరకు 126కి.మీ.లు, కర్ణాటక రాష్ట్రం పరిధిలో 64కి.మీ.లు విస్తరించనున్నారు. పట్టణాలు, గ్రామాలు కలిసే చోట 120 అడుగులు, మిగతా చోట్ల 100 అడుగుల మేర రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. -
తెలుగు రాష్ట్రాల్లోకి ‘హోమ్’ టీవీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎల్ఈడీ టీవీల విపణిలోకి ఇటీవల ప్రవేశించిన కొత్త బ్రాండ్ ‘హోమ్’ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టింది. కంపెనీ 12 రకాల మోడళ్లను రూ.10,990–64,990 ధరల శ్రేణిలో విక్రయిస్తోంది. 365 రోజులపాటు రీప్లేస్మెంట్ వారంటీ ఉంది. 4కే హెచ్డీ స్మార్ట్ టీవీలు రూ.29,990 నుంచి, 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ టీవీల శ్రేణి రూ.34,990 నుంచి అందుబాటులో ఉంది. మొబైల్స్ రిటైల్ దుకాణాల్లో ఈ టీవీలు లభిస్తాయి. హ్యాండ్సెట్స్ పంపిణీ, విక్రయం, ఏవియేషన్ తదితర వ్యాపారాల్లో ఉన్న గుజరాత్‌కు చెందిన రూ.2,500 కోట్ల పూజారా గ్రూప్ హోమ్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తోంది. శామ్సంగ్ ప్యానెళ్లను దిగుమతి చేసుకుని నోయిడాలోని ప్లాంటులో టీవీల అసెంబ్లింగ్ చేపడుతున్నామని హోమ్ ఇండియా ఎండీ రాహిల్ పూజారా శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. మొబైల్ కంటే చవకగా టీవీలు అన్న నినాదంతో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌లో యూనిట్.. భాగ్యనగరిలో అసెంబ్లింగ్ ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో హోమ్ పంపిణీదారు సీవోఎస్‌ఆర్ వెంచర్స్ సీఈవో రమేశ్ బాబు చెప్పారు. ఏడాదిలో ఇది కార్యరూపంలోకి వస్తుందన్నారు. నోయిడా ప్లాంటు సామర్థ్యం నెలకు 50,000 యూనిట్లు. మరో 50,000 యూనిట్ల సామర్థ్యాన్ని దీనికి జోడిస్తున్నారు. విస్తరణకు రూ.25 కోట్లు ఖర్చు చేయనున్నట్టు కంపెనీ డైరెక్టర్ అహ్మద్ జియా తెలిపారు. వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల తయారీలోకి సైతం హోమ్ ప్రవేశిస్తోంది. -
తెలుగు రాష్ట్రాల్లో రక్తమోడిన రహదారులు
-
ప్రకంపనలు సృష్టిస్తున్న నకిలి వేలిముద్రల స్కామ్
-
సీఎస్‌లతో మార్చి 5న కేంద్ర హోంశాఖ భేటీ
న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ మార్చి 5న సమావేశం కానుంది. విభజన చట్టం అమలు తీరు, మౌలిక వసతుల ప్రాజెక్టులు, 13వ షెడ్యూల్లోని అంశాలపై ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. ఈ సమావేశానికి తెలంగాణ సీఎస్ శైలేంద్ర కుమార్ జోషీ, ఆంధ్రప్రదేశ్ సీఎస్ దినేష్ కుమార్ హాజరు కానున్నారు. కాగా ఫిబ్రవరి 23న సమావేశం జరగాల్సి ఉండగా, ఆ భేటీ వాయిదా పడిన విషయం తెలిసిందే. -
ఇరురాష్ట్రాల సీఎస్ల సమావేశం వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ : విజభన చట్టం అమలుపై ఈ నెల 23న జరగాల్సిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల సమావేశం వాయిదా పడింది. కేంద్ర హోంశాఖ ఈ మేరకు ఉభయ రాష్ట్రాలకు సమాచారం అందించింది. అయితే తదుపరి సమావేశం ఎప్పుడనే దానిపై స్పష్టత లేదు. తొలుత ఈ నెల 21న సమావేశం కావాలని భావించినా, ఎస్సీ కమిషన్ పర్యటనతో మరో తేదీన నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర హోంశాఖను కోరింది. దీంతో సీఎస్ల సమావేశం వాయిదా పడింది. విభజన హామీల అమలుపై పెద్ద ఎత్తున ఆందోళన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకున్న విషయం తెలిసిందే. -
పరస్పర సహకారంతో రెండు రాష్ట్రాల అభివృద్ధి
సాక్షి, తిరుమల: రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పర సహకారంతో అభివృద్ధి చెందాలని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించానని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు. ఆదివారం ఆయన కుటుం బ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కుటుంబ సభ్యుల పుట్టు వెంట్రుకలు సమర్పించే పవిత్ర కార్యక్రమంలో భాగంగా శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సకాలంలో వర్షాలు కురిసి, ›ప్రాజెక్టులు నీటితో నిండి, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించానన్నారు. అంతకుముందు ఆలయంలో జేఈఓ కేఎస్ శ్రీనివాసరాజు మంత్రి హరీశ్‌రావుకు ప్రత్యేక మర్యాదలతో శ్రీవారి దర్శనం కల్పించి, స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందజేశారు. -
‘మస్కట్’ ఆశలు ఆవిరి!
సాక్షి, హైదరాబాద్: చదువు పూర్తయ్యాక గల్ఫ్ దేశాలకు వెళ్లి ఉద్యోగం చేద్దామనుకున్నవారి ఆశలపై ఒమన్ (మస్కట్) ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఐటీ, ఇంజనీరింగ్, మెడికల్, మార్కెటింగ్ తదితర రంగాల్లోని 87 రకాల ఉద్యోగాలకు వీసాలను నిలిపివేసింది. ఆరు నెలల పాటు ఈ నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది. దీనిని ఆదివారం నుంచే అమల్లోకి తెచ్చింది. విదేశాల నుంచి వలసలు పెరుగుతుండటం, స్వదేశంలో నిరుద్యోగులు పెరుగు తుండటంతో ఒమన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసు కున్నట్టు చెబుతున్నారు. దీనిపై మిగతా గల్ఫ్ దేశాల్లోనూ తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఒమన్ నిర్ణయం ప్రధానంగా గల్ఫ్ దేశాలకు వెళ్లే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నిరుద్యోగులకు ఆశనిపాతంగా మారుతోంది. ఉన్నత ఉద్యోగాల కోసం.. గల్ఫ్ దేశాల్లో దాదాపు ఇరవై లక్షల మంది భారతీయులు ఉన్నారు. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణకు చెందిన 4.75 లక్షల మంది గల్ఫ్‌కు వలస వెళ్లినట్లు సమగ్ర కుటుంబ సర్వే సమయంలో వెల్లడైంది. తర్వాత ఆ సంఖ్య మరింతగా పెరిగింది. యుఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్–దుబాయి, అబుదాబీ, షార్జా, రస్ అల్ ఖైమా, అజ్మన్, ఫుజైరా, ఉమల్‌ఖివైన్ ప్రాంతాలు)లోనే రెండు లక్షల మంది తెలంగాణవారున్నారు. వారిలో చాలా మంది భవన నిర్మాణం, ఇతర రంగాల్లో కార్మికులుగా, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తుంటారు. ఇక యూఏఈ తర్వాత ఒమన్ (మస్కట్)కు ఎక్కువ మంది తెలుగువారు ఉపాధి పొందుతున్నారు. అయితే ఒమన్ సంపన్న దేశం కావడం, పర్యాటక రంగం కీలకం కావడంతో హోటళ్లు, ఇంజనీరింగ్, మార్కెటింగ్, హెచ్ఆర్, సేల్స్ తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువ. దీంతో గత పదేళ్లుగా తెలంగాణ యువత ఈ రంగాల్లో ఉద్యోగాల కోసం ఒమన్ బాట పట్టింది. స్వదేశీయులకు ప్రాధాన్యం కోసం విదేశాల నుంచి వలసలు పెరగటంతో ఒమన్‌లో ఉన్నత శ్రేణి ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది. స్థానికులకు ఉద్యోగాలు అందని పరిస్థితి తలెత్తింది. దీంతో కీలకమైన ఉద్యోగాలు స్వదేశీయులకే చెందాలని ఒమన్ యువత డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో కీలకమైన ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యమివ్వాలని ఒమన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఉన్నత ఉద్యోగాలకు సంబంధించిన వీసాల జారీపై ఆరు నెలల పాటు నిషేధం విధించింది. అన్ని కంపెనీలు, రిక్రూటింగ్ ఏజెన్సీలు విధిగా స్థానిక నిరుద్యోగులతోనే ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆదేశించింది. వీసాలు నిషేధించిన రంగాలివే.. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, తమ దేశంలో ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన వారికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతోనే ఒమన్ ప్రభుత్వం వీసాలపై నిషేధం నిర్ణయం తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యవృత్తి, మార్కెటింగ్–సేల్స్, అడ్మినిస్ట్రేషన్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్, ఇన్సూరెన్స్, ఎయిర్పోర్ట్, ఇంజనీరింగ్, టెక్నికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ అండ్ మీడియా రంగాల్లోని 87 ఉద్యోగాలకు నిషేధం వర్తించనుంది. చిన్న కంపెనీ అయినా.. ఒమానీలే ‘‘గతంలో ఎక్కడ ఉద్యోగావకాశం ఉన్నా విదేశీయులా, స్వదేశీయులా అని పట్టించుకోకుండా ఒమన్ ప్రభుత్వం వీసాలు ఇచ్చింది. కానీ కొంతకాలంగా కీలక రంగాల ఉద్యోగాల్లో ఒమనీలే ఉండాలనే డిమాండ్ తలెత్తింది. చిన్నా, పెద్దా అన్ని కంపెనీల్లో ఎక్కువ శాతం స్వదేశస్తులే ఉండేలా నిబంధనలను రూపొందించింది. పది మంది ఉద్యోగులుండే చిన్న హోటల్లో కూడా కనీసం ఆరుగురు స్వదేశస్తులు ఉంటేనే అనుమతి మంజూరు చేస్తోంది..’’ – ఒమన్‌లో ప్రైవేటు జాబ్ రిక్రూటింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు ప్రకాశ్ -
తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ల ముప్పు
-
రహదారిపై మరణమృదంగం
-
నా పాత్ర ముగిసిందనే అనుకుంటున్నా...
హైదరాబాద్ : ప్రజల కేంద్రంగా అభివృద్ధి ఉండాలనే తన ఆకాంక్ష అని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఆయన గురువారం ‘సాక్షి టీవీ’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ...‘ఛత్తీస్‌గఢ్‌లో ప్రజల కనీస అవసరాలపై దృష్టి సారించా, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ అదే చేస్తున్నా. ఆరోగ్యం, విద్య విషయాల్లో ఇంకా చేయాల్సింది చాలా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నాది శాంతి కాముకుడి పాత్ర. నా పాత్ర ముగిసిందనే అనుకుంటున్నా. అభివృద్ధిలో రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలి. నాగార్జునసాగర్ వద్ద రెండు రాష్ట్రాలు తలపడినప్పుడు సానుకూల వాతావరణంలో సమస్యను పరిష్కరించా. హైదరాబాద్ అత్యంత శాంతియుత నగరం. నా కెరీర్‌ను ఇక్కడే ముగిస్తా, ఆ తర్వాత చెన్నై వెళ్తా’ అని తెలిపారు. కాగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పదవీకాలాన్నితాత్కాలికంగా పొడిగిస్తూ కేంద్ర హోం శాఖ మౌఖిక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. -
రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో లారీల సమ్మె
-
తెలుగు రాష్ట్రాల్లో అగ్ని గుండంల సూర్యుడు
-
తెలుగు రాష్ట్రాలను ఠారెత్తిస్తున్న ఎండలు.
-
స్వైన్‌ప్లూ టెర్రర్
-
మరో మూడు రోజులపాటు వడగాలులు
హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజు రోజుకి మరింత ఎక్కువవుతోంది. మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. ఏపీ, తెలంగాణలలో వడగాలులకు ఇప్పటివరకు 150మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరో మూడు రోజులపాటు వడగాలుల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో గురువారం 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. అలాగే తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక మిగిలిన జిల్లాల్లో 40డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
ఇసుక తవ్వకాలపై హైకోర్టు కన్నెర్ర
-
తెలంగాణ, ఆంధ్రాలో పాల ధరల యుద్ధం!
-
మీడియాలో వస్తున్న వార్తలు..గాలి వార్తలే
-
తగ్గని వడగాలులు
హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో వడగాలుల ప్రభావం ఇంకా తగ్గలేదు. వడగాలుల ప్రభావంతో మధ్యాహ్నం ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారికి చుక్కలు కనపడుతున్నాయి. శుక్రవారం ఉదయం నుండి ఇప్పటి వరకు వడదెబ్బకు ఏపీలో 10 మంది చనిపోగా , తెలంగాణలో 18 మంది చనిపోయారు. చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున చనిపోగా, అనంతపురం ,శ్రీకాకుళం, విజయవాడ, వైఎస్సార్ జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. అలాగే తెలంగాణాలోని కరీంనగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో అత్యధికంగా నలుగురేసి చొప్పున మృతిచెందగా, ఆదిలాబాద్, వరంగల్‌లో ఇద్దరేసి చొప్పున, నిజామాబాద్‌లో ఒకరు, మహబూబ్‌నగర్‌లో మరొకరు వడదెబ్బకు బలయ్యారు. -
ఎండల తీవ్రతపై డేంజర్ బెల్స్
విశాఖపట్నం : ఎండల తీవ్రతపై విశాఖ వాతావరణ కేంద్రం డేంజర్ బెల్స్ మోగించింది. ఇప్పటికే భానుడి భగభగలకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. తాజా నివేదికలో ఎండ తీవ్రత మరింత పెరగనుందని పేర్కొంది. మరో రెండు రోజులపాటు తీవ్రమైన ఎండకు వడగాలులు కూడా తోడవుతాయని తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకి రాకూడదని హెచ్చరించింది. ఒకటి, రెండు చోట్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి జల్లులు కురిసే అవకాశం కూడా ఉందని విశాఖ వాతావరణ కేంద్రం సోమవారం వెల్లడించింది. -
తెలుగు రాష్ట్రాలు భగభగ
నిజామాబాద్‌లో 45 డిగ్రీలు కోస్తాలోనూ సెగలు సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. వేడి సెగలు కక్కుతున్నాయి. తెలంగాణతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమలోనూ ఉష్ణోగ్రతలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌లో శనివారం 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. రెండు రాష్ట్రాల్లో ఈ సీజనులో ఇదే అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత కావడం విశేషం. రామగుండంలో 43 డి గ్రీలు, రాయలసీమలోని కర్నూలు, కోస్తాంధ్రలోని నెల్లూరులో 42 డిగ్రీలు, హైదరాబాద్, తిరుపతి, అనంతపురంలో 41 డిగ్రీలు, నందిగామ, కావలి, గన్నవరంలో 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇరు రాష్ట్రాల్లోనూ సాధారణంకంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో ఒకట్రెండు రోజుల పాటు ఉష్ణతాపం కొనసాగవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం గాని, జల్లులు గాని కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం శనివారం తన నివేదికలో పేర్కొంది. -
ఏప్రిల్ 1 నుంచి ఇరు రాష్ట్రాలలో ఎంట్రీ ట్యాక్స్
హైదరాబాద్ : ఏప్రిల్ 1వ తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వాహనాలకు ఎంట్రీ పన్ను విధించనున్నాయి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే రవాణా, సరుకుల వాహనాలపై విధిగా ఎంట్రీ ట్యాక్స్ చెల్లించాల్సిందే. ఈ మేరకు ఇదివరకే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత గవర్నర్ సమక్షంలో మార్చి 31వ తేదీ వరకు రెండు రాష్ట్రాల్లో రవాణా, సరుకుల వాహనాలపై పన్ను విధించకుండా ఉండాలని గతంలో నిర్ణయం తీసుకున్నారు. గడువు ముగియడంతో రెండు రాష్ట్రాలు కలిసి కూర్చుని మాట్లాడుకునేందుకు ప్రయత్నించగా వీలుపడలేదని సమాచారం. ఏపీ రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు, తెలంగాణా మంత్రి మహేందర్‌రెడ్డిలు ఓ దఫా సమావేశమై ఈ సమస్యపై చర్చించారు. ఇదే సమయంలో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు కోర్టును ఆశ్రయించారు. విషయం కోర్టు పరిధిలో ఉందని తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి చర్చలు జరిపేందుకు విముఖత చూపారు. ఉమ్మడి రాజధానిగా ఉన్నంతవరకు ఎంట్రీ ట్యాక్స్ విధించడానికి వీల్లేదన్న ఏపీ వాదనలు తెలంగాణ పట్టించుకోలేదు. దీంతో ఏప్రిల్ 1 నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు ఎంట్రీ పన్ను విధించనున్నాయి. ఈ ఎంట్రీ పన్నుతో ఆంధ్ర కంటే తెలంగాణకు మూడు నెలలకు అదనంగా రూ.30 కోట్లు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. రవాణా రంగంలో ఏపీది 60 శాతం వాటాగా ఉండటమే ఇందుకు కారణం. ఇందులో ముఖ్యంగా స్టేజి క్యారియర్లుగా ఏపీలోని పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రైవేటు బస్సులపై పన్ను భారం పడనుంది. దీంతో ప్రైవేటు బస్సు ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు ప్రైవేటు ఆపరేటర్లు ఏప్రిల్ 1తర్వాత బుక్ చేసుకునే టిక్కెట్లపై ఛార్జీలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులకు మాత్రం ఈ ఎంట్రీ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంది. ఆర్టీసీ విభజన జరగనందున ట్యాక్స్ వసూలు చేసే వెసులుబాటు లేదు. కాగా తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ నుంచి గ్రానైట్ లారీలు అనునిత్యం కాకినాడ పోర్టుకు వెళతాయి. నల్గొండ నుంచి సిమెంటు, ఇతర ప్రాంతాల నుండి సరుకుల వాహనాలు ఏపీకి వస్తాయని, సరిహద్దుల్లో చెక్‌పోస్టుల వద్ద ఎంట్రీ ట్యాక్స్ విధించక తప్పదని చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంట్రీ ట్యాక్స్ విధించడం వల్ల మూడు నెలలకు చెల్లించే క్వార్టర్లీ పన్ను కొంత వరకు తగ్గించాలని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. ఈ ఎంట్రీ ట్యాక్స్ వసూలుపై ఏపీ రవాణా శాఖ అధికారులు నోరు మెదపడం లేదు. ఉన్నత స్థాయిలో తీసుకునే ఈ నిర్ణయంపై తాము మాట్లాడబోమని నిరాకరించడం గమనార్హం. -
రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల
న్యూఢిల్లీ: 13వ ఆర్ధిక సంఘం సిఫార్సు మేరకు రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు 385 కోట్ల రూపాయలు, తెలంగాణకు 150 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి గణాంకాల వ్యవస్థ అమలుకు రెండు కోట్ల 60 లక్షల రూపాయలు, పంచాయతీరాజ్ సంస్థలు/ అర్బన్ లోకల్‌బాడీ/ ప్రత్యేక ప్రాంతాలకు 298 కోట్ల 82 లక్షలు, ఎ.సి.ఎ (ఇతర ప్రాజెక్టులకు) 49 కోట్ల 99 లక్షలు, కొత్త రాష్ట్ర ప్రత్యేక పరిస్థితుల దష్ట్యా 33 కోట్ల 50 లక్షల రూపాయలు విడుదల చేసింది. తెలంగాణకు పంచాయతీరాజ్ సంస్థలు/అర్బన్ లోకల్‌బాడీ/ప్రత్యేక ప్రాంతాలకు 73కోట్ల పది లక్షల రూపాయలు, పీఆర్ఐ/యూఎల్బీ/ ప్రత్యేక ప్రాంతాలకు గ్రాంటు కింద 76కోట్ల 77 లక్షల రూపాయలు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ ఆదివారం వెల్లడించింది. రూ.1,410 కోట్లు రానట్లే సాక్షి, హైదరాబాద్: పదమూడో ఆర్థిక సంఘం గడువు మార్చి 31తో ముగియనుండటంతో రాష్ట్రానికి రావాల్సిన రూ. 1,410 కోట్ల నిధులకు గండి పడనుంది. ఏప్రిల్ 1 నుంచి 14వ ఆర్థిక సంఘం కేటాయింపులు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో రూ. 1,560 కోట్ల నిధులకు గాను రూ. 150 కోట్లు విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 13వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన మిగతా బకాయిలపై ఆశలు ఆవిరయ్యాయి. తమకు రావాల్సిన నిధులు విడుదల చేయాలని గత నాలుగు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం లేఖల ద్వారా విజప్తి చేసింది. ఇప్పటి వరకు దాదాపు 40 లేఖలు రాసింది. ఎట్టకేలకు స్పందించిన కేంద్రం సగం బకాయిలు రూ.1,579 కోట్లకు మంజూరీ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31 లోగా మిగతా బకాయిలు తెచ్చుకోకపోతే వచ్చే అవకాశం లేకపోవటం... ఆర్థిక సంఘ కాల పరిమితి ముగియనుండటంతో ప్రభుత్వం పట్టు వీడకుండా మరో ప్రయత్నం చేసింది.మిగతా రూ.1,560 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని వారం రోజుల కిందట మరోమారు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. తాజాగా రూ.150 కోట్లు విడుదల చేసి కేంద్రం చేతులు దులుపుకుందని, మిగతా నిధులు వచ్చే అవకాశం లేదని ఆర్థిక శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. -
’తెలుగు రాష్ట్రాలు రెండూ మాకు సమానమే’
-
'కేంద్ర ప్రభుత్వానికి తెలుగు రాష్ట్రాలు రెండూ సమానమే'
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వానికి రెండు తెలుగు రాష్ట్రాలు సమానమే అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలను ఒకే విధంగా చూస్తుందని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ... తెలంగాణలో జెన్కో ప్రాజెక్టును నల్గొండ జిల్లా దామరచర్లలో త్వరలో ప్రారంభిస్తామన్నారు. పర్యావరణానికి నష్టం కలిగించకుండా ఆ ప్రాజెక్టును గ్రీనరీతో పరిరక్షిస్తామని వెల్లడించారు. తెలంగాణలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉందన్నారు. మార్చి 27వ తేదీన ధూళిపల్లి, నారపల్లి పారెస్ట్‌లను సందర్శిస్తానని ఆయన హామీ ఇచ్చారు. రైతులకు న్యాయం చేసేందుకే భూసేకరణ బిల్లు తెచ్చామన్నారు. కాంగ్రెస్ అధిష్టానం చేసిన కుట్రలో భాగంగానే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దోషిగా నిలవాల్సి వస్తుందని ప్రకాశ్ జావదేకర్ ఆరోపించారు. గతంలో యూపీఏ ప్రభుత్వం పర్యావరణానికి ఇచ్చే అనుమతులన్నీ పెండింగ్‌లో ఉన్నాయని ప్రకాశ్ జావదేకర్ వెల్లడించారు. -
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం!
-
రెండు రాష్ట్రాల్లో ఘనంగా న్యూయిర్ వేడుకలు!
-
రాజకీయాలు ఆపండి!
-
రెండు రాష్ట్రాలలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలు
-
రెండు రాష్ట్రాలలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలు
హైదరాబాద్: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 2న సేవా కార్యక్రమాలు, విగ్రహాల వద్ద నివాళులు అర్పించే కార్యక్రమాలు నిర్వహించాలని వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఆ పార్టీ నేత మైసూరా రెడ్డి పిలుపు ఇచ్చారు. వైఎస్ఆర్ సేవలు స్మరించుకునేలా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆ మహానేత ఉండి ఉంటే రాష్ట్రానికి ఈ గతిపట్టి ఉండేది కాదన్నారు. ఆయన మరణించిన తరువాత రాజకీయ లబ్ది కోసం రాష్ట్రాన్ని రెండుగా విభజించారన్నారు. ఏదిఏమైనా జరిగింది జరిగిపోయిందన్నారు. తెలుగువారు ఐకమత్యంగా ఉండాలని, రెండు రాష్ట్రాల అభివృద్ధిని వైఎస్ఆర్ సిపి కాంక్షిస్తుందని చెప్పారు.వర్ధంతి రోజున చేపట్టే కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలవాలని మైసూరా రెడ్డి అన్నారు.