
నా పాత్ర ముగిసిందనే అనుకుంటున్నా...
హైదరాబాద్ : ప్రజల కేంద్రంగా అభివృద్ధి ఉండాలనే తన ఆకాంక్ష అని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఆయన గురువారం ‘సాక్షి టీవీ’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ...‘ఛత్తీస్‌గఢ్‌లో ప్రజల కనీస అవసరాలపై దృష్టి సారించా, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ అదే చేస్తున్నా. ఆరోగ్యం, విద్య విషయాల్లో ఇంకా చేయాల్సింది చాలా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నాది శాంతి కాముకుడి పాత్ర. నా పాత్ర ముగిసిందనే అనుకుంటున్నా. అభివృద్ధిలో రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలి.
నాగార్జునసాగర్ వద్ద రెండు రాష్ట్రాలు తలపడినప్పుడు సానుకూల వాతావరణంలో సమస్యను పరిష్కరించా. హైదరాబాద్ అత్యంత శాంతియుత నగరం. నా కెరీర్‌ను ఇక్కడే ముగిస్తా, ఆ తర్వాత చెన్నై వెళ్తా’ అని తెలిపారు. కాగా గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పదవీకాలాన్నితాత్కాలికంగా పొడిగిస్తూ కేంద్ర హోం శాఖ మౌఖిక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.