Heat wave
-
అమెరికాలో దంచికొడుతున్న ఎండలు.. రికార్డు స్థాయిలో హీట్ వేవ్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఎండలు దంచికొడుతున్నాయి. హీట్ వేవ్ కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. తీవ్రమైన వేడి కారణంగా పలుచోట్ల ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మరోవైపు కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీలో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.వివరాల ప్రకారం.. అమెరికాలోకి పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత పెరిగింది. హీట్ వేవ్ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శాన్ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియా సహా పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత బాగా పెరిగింది. దీంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు.. వాహనదారుల కోసం రహదారులపై హీట్ వేవ్ హెచ్చరికలను జారీ చేస్తున్నారు అధికారులు.Today's USA Coast-to-Coast Weather Outlook!• Record breaking heat wave continues to affect the Western United States• Severe weather and flooding continue for Midwest, Ohio Valley, Southern Plains• Southern Texas preparing for Hurricane Beryl's heavy rains@NBCPalmSprings pic.twitter.com/qAmjnG6HUy— Jerry ‘The Steffler’ Steffen ⚡ (@JerrySteffen) July 4, 2024ఇక, కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీలో నిన్న(గురువారం) 123 డిగ్రీ(ఫారన్‌హీట్) ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు అధికారులు చెబుతున్నారు. హీట్ వేవ్ ఇలాగే కొనసాగితే మరో 4-5 రోజుల్లో రికార్డు స్థాయిలో 130 డిగ్రీల(ఫారన్‌హీట్) ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. టెక్సాస్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. -
9 రోజులు.. 500 కోట్ల మందికి చుక్కలు చూపించిన ఎండలు!
న్యూఢిలీ: ఈ ఏడాది వాతావరణ మార్పుల కారణంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జూన్ నెలలో తొమ్మిది రోజులు నమోదైన అధిక ఎండలకు ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది ప్రజలు అల్లాడిపోయారు. ఈ విషయాన్ని తాజాగా అమెరికాకు చెందిన ‘క్లైమెట్ సెంట్రల్’ అనే సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది.జూన్ నెలలోని 9 రోజులు అధిక ఉష్ణోగ్రత నమోదై.. ఎండలు మండిపోవటంతో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 500 కోట్లమంది, భారత్‌లో 61.9 కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడినట్లు ఆ రిపోర్టు వెల్లడించింది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా చైనాలో 57.9 కోట్ల మంది, ఇండోనేషియాలో 23.1 కోట్ల మంది, నైజిరియాలో 2.06 కోట్ల మంది, బ్రెజిల్లో 1.76 కోట్లమంది, బంగ్లాదేశ్‌లో 1.71 కోట్ల మంది, అమెరికా 1.65 కోట్లమంది, యూరోప్‌లో 1.52 కోట్ల మంది, మెక్సికోలో 1.23 కోట్ల మంది, ఎథియోపియాలో 1.21 కోట్ల మంది, ఈజిప్ట్‌లో 1.03 కోట్ల మంది ప్రజలు జూన్‌లో తొమ్మిది రోజల ఎండ వేడిని ఎదుర్కొన్నారని వెల్లడించింది.వాతావరణ మార్పుల కారణంగా జూన్ 16 నుంచి 24 తేదీల మధ్య రోజుల్లో ప్రపంచ జనాభాలో సుమారు 60 శాతం మంది మూడుసార్లు అధిక ఎండకు ప్రభావితం అయ్యారని పేర్కొంది. ‘‘ సుమారు శతాబ్దం పైగా బొగ్గు, ఆయిల్, నాచురల్ గ్యాస్‌ను మండించటం మూలంగా ప్రపంచానికి అధిక ఎండల ప్రమాదం పెరుగుతోంది. అర్బన్ జనాభాను కట్టడి చేయకపోవటంతో ఈ ఏడాది ఎండాకాలంలో ఎన్నడూ చూడని ఉష్ణోగ్రతలు ప్రపంచవ్యాప్తంగా నమోదు అయ్యాయి’’ అని క్లైమెట్ సెంట్రల్ చీఫ్ ఆండ్రూ పెర్షింగ్ తెలిపారు.అదే విధంగా జూన్ 16నుంచి 24 వరకు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 4. 97 వందల కోట్ల మంది మూడు సార్లు తీవ్రమైన ఎండకు ప్రభావిత అయినట్లు క్లైమెట్ ఫిఫ్ట్ ఇండెక్స్ (సీఎస్ఐ)తెలిపిందన్నారు. భారత్‌లో అధిక ఉష్ణోగ్రత, తీవ్రమైన వేడి గాలులు రికార్డుస్థాయిలో నమోదైనట్ల రిపోర్టులో వెల్లడించింది. ఉష్ణోగ్రత, వేడి గాలులు కారణంగా సుమారు వంది మంది మరణించగా, 40 వేల మంది వడదెబ్బ తగిలిన కేసులు నమోదయ్యాయిని తెలిపింది. అధిక ఎండ, వడగాలులతో దేశరాజధాని ఢిల్లీ నీటి సంక్షోభం, పవర్ కట్ సంభవించినట్లు పేర్కొంది. అదేవిధంగా సౌది అరేబియాలో సైతం ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావటంతో ప్రపంచవ వ్యాప్తంగా హజ్ యాత్రకు అక్కడి వచ్చిన సుమారు 1300 మంది ఎండ తీవ్రత కారణంగా మృతి చెందారు. అదే విధంగా భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్, జూన్ నెలల్లో దేశంలో 40 శాతం మంది సాధారణం కంటే ఎక్కువ వేడి గాలులకు ప్రభావితం అయ్యారని పేర్కొంది. అదీ కాక కొన్ని రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో పలు చోటు రికార్డు స్థాయిలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. రాత్రి పూటి ఉష్ణోగ్రత సైతం 35 డిగ్రీల వరకు నమోదైనట్లు పేర్కొంది. -
హీట్‌వేవ్ ముగిసింది.. ఇక వానలే వానలు
న్యూఢిల్లీ: ఉత్తరభారతానికి భారత వాతావరణశాఖ(ఐఎండీ) గుడ్‌న్యూస్ చెప్పింది. జూన్ 23-25 తేదీల మధ్య అధిక ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గుముఖం పడతాయని తెలిపింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం 40కిపైగా డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది. పశ్చిమతీరంలో భారీ వర్షాలు పడే అవకాశముందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న నాలుగైదు రోజుల్లో కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర,గోవాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. వెస్ట్‌బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బిహార్లలో భారీ వర్షాలతో పాటు బంగాళాఖాతం నుంచి బలమైన గాలులు వీయనున్నాయని వెల్లడించింది. -
కరోనా రికార్డులు దాటేస్తున్న వడదెబ్బ మృతులు?
దేశరాజధాని ఢిల్లీలో వడగాడ్పుల బీభత్సం కొనసాగుతోంది. ఎండలకు తాళలేక మృతి చెందుతున్నవారి సంఖ్య గతంలో ఎదురైన కరోనా మహమ్మారి మరణాలను మించిపోతున్నది. ఢిల్లీలోని పలు శ్మశానవాటికల వద్ద దహన సంస్కారాలకు ఎదురుచూస్తున్న మృతదేహాల క్యూ కనిపిస్తోంది.ఢిల్లీ కార్పొరేషన్‌కు చెందిన బోద్ ఘాట్‌లో కరోనా తర్వాత అత్యధిక దహన సంస్కారాలు జూన్ 19న ఒక్క రోజులో జరిగాయి. బుధవారం రాత్రి 12 గంటల వరకు నిగమ్ బోద్ ఘాట్ వద్ద 142 మృతదేహాలను దహనం చేశారు. కరోనా కాలంలో 2021 ఏప్రిల్‌న 253 మృతదేహాలను ఇక్కడ దహనం చేశారు.నిగమ్ బోద్ ఘాట్ నిర్వాహకులు మాట్లాడుతూ ఇంత భారీ సంఖ్యలో మరణాలు సంభవించడానికి వడదెబ్బ కారణం కావచ్చన్నారు. ఈ జూన్‌లో ఇప్పటివరకు 1,101 మృతదేహాలను దహనం చేశామన్నారు. నిగమ్ బోద్ ఘాట్ల వద్ద మృతదేహాల అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు చాలాసేపు వేచిచూడాల్సి వస్తోంది.దేశంలో కరోనా తాండవమాడుతున్న 2022 జూన్‌లో ఈ ఘాట్‌లో మొత్తం 1,570 మృతదేహాలకు దహన సంస్కారాలు చేశారు. ఇప్పుడు ఈ రికార్డు బద్దలయ్యేలా వేసవి ఉష్ణోగ్రతలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. నిగమ్ బోద్ ఘాట్‌లో వారం రోజులుగా జరిగిన దహన సంస్కారాల గణాంకాలు ఇలా ఉన్నాయి.జూన్ 14 - 43జూన్ 15- 53జూన్ 16 - 70జూన్ 17 - 54జూన్ 18 - 97జూన్ 19- 142 (అర్ధరాత్రి 12 గంటల వరకు)ఢిల్లీలో సంభవిస్తున్న అత్యధిక ఉష్ణోగ్రతలు పేదల పాలిట శాపంగా మారాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో మృతదేహాలు కనిపిస్తున్నాయి. వడగాడ్పుల కారణంగా మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత 48 గంటల్లో 50 మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎండ తీవ్రతకు తొమ్మది రోజుల్లో 192 మంది నిరాశ్రయులు ప్రాణాలు కోల్పోయారు. అయితే వీరంతా వడదెబ్బ కారణంగా మృతిచెందారా లేదా అనేది ఆరోగ్యశాఖ అధికారులు ఇంకా ధృవీకరించలేదు. -
ఉత్తరాదిలో భానుడి భగభగలు..
-
యూపీలో వడదెబ్బకు 33 మంది మృతి
ఉత్తరప్రదేశ్‌లో ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. శనివారం నాడు కాన్పూర్‌లో దేశంలోకెల్లా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాన్పూర్‌లో పగటి ఉష్ణోగ్రత 46.3 డిగ్రీలుగా నమోదయ్యింది. రాత్రి 35.2 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది.రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తున్నాయి. శనివారం వివిధ ప్రాంతాల్లో వడదెబ్బకు 31 మంది మృతి చెందారు. సోమవారం వరకు పరిస్థితులు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం కాన్పూర్, బుందేల్‌ఖండ్‌లో ఎండ వేడిమి కారణంగా శనివారం 20 మంది మృతిచెందారు.వీరిలో కాన్పూర్‌లో ఎనిమిది మంది, చిత్రకూట్‌లో ఆరుగురు, మహోబాలో ముగ్గురు, బందా, హమీర్‌పూర్‌లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. ఇదేవిధంగా వారణాసి పరిసర ప్రాంతాల్లో ఎండ వేడిమికి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో వారణాసిలో ఏడుగురు, బల్లియాలో ముగ్గురు, మీర్జాపూర్లో ఇద్దరు, ఘాజీపూర్, సోన్‌భద్రలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.జోనల్ వాతావరణ కేంద్రం సీనియర్ వాతావరణ నిపుణులు అతుల్ కుమార్ సింగ్ మాట్లాడుతూ రాబోయే నాలుగైదు రోజుల్లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపారు. -
12 రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వడగాలులు
దేశంలోని ఉత్తరాదిన ఎండలు దంచికొడుతున్నాయి. ఈ పరిస్థితుల నేపధ్యంలో పంజాబ్, హర్యానాతో సహా వాయువ్య, మధ్య , తూర్పు భారతదేశంలోని 12 రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వడగాలులు వీచే అవకాశం ఉన్నదని భారత వాతావరణశాఖ(ఐఎండీ) తెలిపింది.పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, జమ్మూ డివిజన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్ , ఒడిశాలోని కొన్ని చోట్ల నేడు (సోమవారం) కూడా వడగాలులు కొనసాగవచ్చని ఐఎండీ పేర్కొంది. గడచిన 24 గంటల్లో ఈ రాష్ట్రాలతో పాటు జార్ఖండ్‌లో కూడా తీవ్రమైన వడగాలులు వీచాయి. రానున్న మూడు రోజుల్లో ఉత్తర భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రత రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.మరోవైపు వేసవి పరిస్థితులను, రుతుపవనాలను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆసుపత్రులు, ఇతర బహిరంగ ప్రదేశాలలో ఫైర్ ఆడిట్, ఎలక్ట్రికల్ సేఫ్టీ ఆడిట్లను క్రమం తప్పకుండా నిర్వహించాలని అధికారులను ప్రధాని ఆదేశించారు. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగానే ఉంటాయని, కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగానే ఉంటాయని ప్రధానికి అధికారులు ఈ సమావేశంలో వివరించారు.ఉత్తర భారతంలోని ప్రజలు వేడిగాలులకు చెమటలు కక్కుతుండగా, దక్షిణాదినగల కేరళ భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. రాష్ట్రంలోని ఎర్నాకులం జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అలాగే 11-20 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం కురిసే అవకాశం ఉందని తెలిపింది.అసోంలో వరద పరిస్థితులు కొనసాగుతున్నాయి. 10 జిల్లాల్లో ఆరు లక్షల మందికి పైగా ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలను ఖాళీ చేయించిన అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కోపిలి, బరాక్, కుషియార నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయని అధికారులు తెలిపారు. -
మండిపోయిన ఢిల్లీ.. దేశ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రత
సాక్షి,ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ఢిల్లీ వాసులకు హీట్‌వేవ్ సెగ తలుగుతోంది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో రాజధాని వాసులు బెంబేలెత్తుతున్నారు.భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీ మంగేశ్‌పూర్ బుధవారం (మే29) మధ్యాహ్నం 2.30 గంటలకు రికార్డు స్థాయిలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశచరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. మరోపక్క ఎండ వేడిమి తట్టుకోలేక ఉపశమనం కోసం ఢిల్లీ వాసులు కూలర్లు, ఏసీలు రికార్డుస్థాయిలో వినియోగిస్తున్నారు. దీంతో ఢిల్లీలో ఎప్పుడూ లేనంతగా విద్యుత్ వినియోగం 8302 మెగావాట్లకు చేరింది. ఢిల్లీతో పాటు రాజస్థాన్‌లోనూ 50 డిగ్రీల ఉష్ణోగ్రత రియల్ ఫీల్ పరిస్థితులు నెలకొన్నాయి.అంతలోనే వర్షం...ఓ పక్క దేశచరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన కొద్ది సేపటికే ఢిల్లీలో అకస్మాత్తుగా వర్షం పడింది. అరేబియా సముద్రంలో అల్పపీడనం, పశ్చిమ దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొద్దిసేపు ఢిల్లీలో చిరు జల్లులు కురిశాయి. -
‘మధ్యాహ్నం 12 నుంచి 3 వరకూ బయటికెళ్లొద్దు’
ఢిల్లీ-ఎన్సీఆర్తో సహా ఉత్తర భారతదేశం అంతటా వేడిగాలులుల వీస్తున్నాయి. మరికొద్ది రోజుల పాటు ఢిల్లీలో వేడిగాలులు విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం మే 28 వరకు ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లలో వేడిగాలుల ప్రభావం కనిపిస్తుంది. అలాగే జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, మధ్య మహారాష్ట్ర, గుజరాత్‌లలోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి.వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గడచిన శనివారం ఢిల్లీలో ఉష్ణోగ్రత 46.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. ఇది సాధారణం కంటే 7 డిగ్రీల అధికం. రానున్న నాలుగు రోజుల్లో ఢిల్లీ ఎన్సీఆర్తో సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వేడిగాలుల వీయనున్న కారణంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.మే 28 వరకు రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లలో రాత్రిపూట అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీయనున్న దృష్ట్యా ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఆ సమయంలో వేడిగాలులు ఉధృతంగా ఉంటాయని, వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు ఇంట్లోనే ఉండడం ఉత్తమమని సలహా ఇచ్చింది. -
ఉత్తర భారతానికి హీట్‌వేవ్ అలర్ట్
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశానికి భారత వాతావరణశాఖ(ఐఎండీ) తాజాగా హీట్‌వేవ్ అలర్ట్ ఇచ్చింది. రాజధాని ఢిల్లీ సహా మొత్తం ఉత్తర భారతమంతా మే 21వ తేదీ వరకు భానుడు చండ ప్రచండంగా నిప్పులు కురిపించనున్నాడని తెలిపింది. శుక్రవారం(మే17) దేశంలోనే రాజధాని ఢిల్లీలో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం గమనార్హం. హీట్‌వేవ్ అలర్ట్ నేపథ్యంలో జైపూర్ నహార్ఘర్ బయలాజికల్ పార్కులోని జంతువులకు చల్లదనం అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని పార్కు అధికారులు తెలిపారు. -
ఎండలతో బీ కేర్‌ఫుల్ ..ఐఎండీ తాజా వార్నింగ్
న్యూఢిల్లీ: రానున్న రోజుల్లో ఎండలు మరింతగా మండుతాయని వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఈ మేరకు శుక్రవారం(ఏప్రిల్26) అలర్ట్ జారీ చేసింది. తూర్పు,దక్షిణ భారతాల్లో రానున్న ఐదు రోజుల పాటు హీట్‌వేవ్ పరిస్థితులు కొనసాగుతాయని పేర్కొంది. ఈ ప్రాంతాల్లో పౌరులు బయటికి వెళ్లేటపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. అయితే ఏప్రిల్ 28 నుంచి 30 మధ్య ఈశాన్య రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. -
నిప్పుల కొలిమి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఎండలు భగ్గుమంటున్నాయి. సాధారణం కంటే 5 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికితోడు తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కూలర్లు, ఫ్యాన్లు ఏమాత్రం ఉపశమనం ఇవ్వక తిప్పలు పడుతున్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా బుగ్గబావిగూడలో 45 డిగ్రీలు, మాడుగులపల్లిలో 44.8 డిగ్రీల సెల్సియస్ చొప్పు న గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. శుక్రవారం ఖమ్మంలో సాధారణం కంటే 5.2 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, నల్లగొండలలో 4 డిగ్రీలు, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్‌లలో 3 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో 2 డిగ్రీల మేర అధికంగా ఉన్నాయి. మరో మూడు రోజులు ఇలానే.. రాష్ట్రంలో మరో మూడు రోజులు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. ఇదే తరహా పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. అత్యవసర పనులుంటే తప్ప మధ్యా హ్నం పూట బయటికి రావొద్దని అధికారులు హెచ్చరించారు. ఇక ప్రస్తుతం మరాఠ్వాడ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దాని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వానలు పడవచ్చని తెలిపారు. శనివారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. తీవ్ర ఎండలతో జాగ్రత్త అధిక ఉష్ణోగ్రతలు,వడగాడ్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజారో గ్య విభాగం సూచించింది. ఈ మేరకు శుక్రవార ం ప్రకటన జారీ చేసింది. వాతావరణ శాఖ కూ డా హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. అవేమంటే.. ► దాహం వేయకపోయినా కూడా అవసరమైన మేర నీళ్లు తాగుతూ ఉండాలి. ఓఆర్ఎస్, నిమ్మరసం, లస్సీ, మజ్జిగ, పండ్ల రసాలు వంటివి తాగాలి. ► వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి. మధ్యాహ్న సమయంలో బయటికి వెళ్లకపోవడం మంచిది. బాగా గాలి వచ్చే, చల్లని ప్రదేశాలలో ఉండాలి. ► ఎండకు వెళ్లాల్సి వస్తే.. సన్నని వదులుగా ఉండే కాటన్ వ్రస్తాలను ధరించాలి. తలపై టోపీ, గొడుగు వంటివి కప్పుకోవాలి. ► మధ్యాహ్న సమయంలో ఆరు బయట తీవ్ర శారీరక శ్రమ చేయవద్దు. ► ఎవరైనా వడదెబ్బకు లోనైట్టు గుర్తిస్తే.. వెంటనే వైద్య సహాయం అందించాలి. -
వెదర్ అప్డేట్: కొనసాగనున్న హీట్‌వేవ్
న్యూఢిల్లీ: దేశంలో ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ తాజా అప్డేట్ ఇచ్చింది. రానున్న రోజుల్లో దక్షిణ, ఉత్తర భారతాల్లోని పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని తెలిపింది. అయితే ఈశాన్య భారతంలోని కొన్ని చోట్ల మాత్రం వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. రాజధాని ఢిల్లీలో వేసవి ప్రారంభం అయినప్పటి నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు 36.4డిగ్రీలుగా నమోదయ్యాయి. ఇది సాధారణం కంటే 2 డిగ్రీలు ఎక్కువ కావడం గమనార్హం. రానున్న ఐదు రోజుల్లో విదర్భ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, అధిక ఉష్ణోగ్రతలకు కారణమయ్యే ఎల్‌నినో పరిస్థితులు జూన్ వరకు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇదీ చదవండి.. మండే ఎండల్లో వర్ష సూచన -
తెలంగాణకు హెచ్చరిక.. బయటకు రావొద్దు..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటుతున్నాయి. ఎండ తీవ్రతకు జనం అల్లాడుతున్నారు. అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతలు.. ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అడుగు తీసి బయట పెట్టాలంటే జంకుతున్నారు. శుక్రవారం నల్గొండ జిల్లాలోని ఇబ్రహీంపేటలో 43.5, కనగల్‌లో 43.4, మాడుగులపల్లిలో 43.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఏప్రిల్ మొదటి వారంలోనే 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ముందుముందు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో వచ్చే రెండురోజులు(శని, ఆది) వడగాలులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదే సమయంలో ఎండల తీవ్రత సైతం రెండు, మూడు డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో ఎండలు 43 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయని.. ఉదయం 11 నుంచి సాయంత్రం 4.30 గంటలకు ప్రజలు బయటకు రావొద్దని పేర్కొంది.. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లే జాగ్రత్తలు తీసుకోవాలని.. ఆదివారం తర్వాత ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది. శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. ఆదివారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ వడగాలులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అలాగే, ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. చదవండి: కరీంనగర్లో కేసీఆర్ పొలంబాట.. రైతులకు పరామర్శ -
మండే ఎండల్లో వర్ష సూచన: వాతావరణ శాఖ
న్యూఢిల్లీ: రోజురోజుకి భానుడి భగభగలు ఎక్కువైపోతున్నాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నగరాల్లో వేడి అంతకంతకు పెరిగిపోతోంది. ఈ తరుణంలో భారత వాతావరణ శాఖ (IMD) దేశంలోని రానున్న రెండు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తాయని, మరి కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుందని వెల్లడించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, విదర్భ, ఉత్తర కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ, తెలంగాణలలో ఈరోజు, రేపు వేడిగాలుల ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది దేశంలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతుందని ఐఎండీ ఇటీవల అంచనా వేసింది. ఏప్రిల్ ప్రారంభం నుంచి దేశంలోని చాలా ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, దీని కారణంగా హీట్ స్ట్రోక్ ప్రమాదం పెరిగిందని ఇప్పటికే పేర్కొన్నారు. -
భానుడి భగభగ.. తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న ఎండలు
సాక్షి,హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఏప్రిల్ వచ్చీ రాగానే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 40 డిగ్రీల దాకా నమోదవుతున్నాయి. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలో తీవ్ర వడగాలులు వీయడంతో పాటు సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవనున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్‌నినో పరిస్థితులు జూన్ చివరి వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఈ వేసవిలో ఎండలు ఎక్కువగానే ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదీ చదవండి.. ఎన్నికల వేడి.. కరువు దాడి -
తిరుమల: భక్తగిరులపై భానుని భగభగలు (ఫొటోలు)
-
ఒక వైపు మండుతున్న ఎండలు..మరోవైపు వర్షాలు
-
ఓరి దేవుడో.. ఇవేం ఎండలు! వడదెబ్బకు 54 మంది మృతి
ఉత్తరప్రదేశ్: రాజస్థాన్‌లో బిపర్ జాయ్ తుపాను బీభత్సం సృష్టిస్తుంటే.. పక్కనే ఉన్న ఉత్తరప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గత మూడు రోజుల్లోనే బల్లియా జిల్లా ఆస్పత్రిలో 54 మంది మృతి చెందారు. దాదాపు 400 మంది తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరిన రోగులకు వేరువేరు కారణాలున్నప్పటికీ ఎండ తీవ్రత ఓ కారణమని వైద్యులు చెప్పారు. రోజురోజుకూ వేడితీవ్రత ఎక్కువగా..ఆస్పత్రిలో చేరుతున్నవారి సంఖ్య పెరిగిపోతోందని తెలిపారు. రాష్ట్రంలో చాలా ప్రదేశాల్లో ఎండలు 40 డిగ్రీలపైనే నమోదవుతున్నాయని వెల్లడించారు. ఆస్పత్రిలో చేరుతున్న రోగుల్లో తీవ్రమైన జ్వరం, శ్వాసకోశ సమస్యలతో సహా పలు ఆరోగ్య సమస్యలను గుర్తించినట్లు పేర్కొన్నారు. జూన్ 15న 23 మంది మరణించగా..ఆ మరుసటి రోజు 20 మంది మృతి చెందారు. కాగా.. శనివారం 11 మంది ప్రాణాలు పోయాయని జిల్లా మెడికల్ సూపరింటెండెంట్ ఎస్కే యాదవ్ వెల్లడించారు. రోగుల ఆరోగ్య పరిస్థితికి ఏదైనా వ్యాధి కారకమా? అని తెలుసుకోవడానికి లక్నో నుంచి ఓ బృందం వస్తోందని అడినల్ హెల్త్ డైరెక్టర్ డా.బీపీ తివారీ తెలిపారు. వేడి, చలి పెరిగినప్పుడు శ్వాసకోశ సమస్యలు, డయాబెటిస్, బీపీ విపరీతంగా పెరుగుతాయని వైద్యులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ఎండలు పెరగడమే తాజా మృతులకు కారణమని వెల్లడించారు. ఆస్పత్రికి రోగుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో స్ట్రెచర్స్ లేమి కారణంగా రోగులను బంధువులు భుజాలపై మోసిన సందర్భాలు ఎదురయ్యాయని చెప్పారు. ఇదీ చదవండి:అల్పపీడనంగా మారుతున్న ‘బిపర్జోయ్’.. ఆ ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ -
రానున్న ఐదు రోజులు వడగాల్పులే.. యెల్లో అలర్డ్ జారీ..
హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న ఐదు రోజులు వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 42°C నుంచి 44°C వరకు స్థిరంగా నమోదవుతాయని పేర్కొంది. హైదరాబాద్‌తో సహా చుట్టుపక్కల జిల్లాల్లో 39°C నుంచి 41°C వరకు నమోదవుతాయని స్పష్టం చేసింది. వడగాలల నేపథ్యంలో పలు జిల్లాలకి వాతావరణశాఖ యెల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ రోజు.. రేపు ఖమ్మం ,నల్గొండ,సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. వడగాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. రాగల మూడు రోజులు కొన్ని జిల్లాల్లో తేలికపాటి ఉరుములు, మెరుపులు,ఈదురు గాలులతో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ చత్తీస్‌గఢ్ మీదుగా అవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది. ఉత్తర చత్తీస్‌గఢ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు ద్రోణి విస్తరించిందని పేర్కొంది. ఇదీ చదవండి:విషాదం: ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు చిన్నారులు మృతి.. -
ఏపీలో జూన్ మొదటి వారం వరకూ ఎండల తీవ్రత
-
తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్ సలసల
-
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బతో ముగ్గురి మృతి
సాక్షి ముంబై: తీవ్రమైన ఎండలు, వడగాడ్పుల దేశంలోని అన్ని ప్రాంతాలు ఉడికిపోయాయి. వారం రోజుల వ్యవధిలోనే ఎండ తీవ్రత అమాంతం పెరి గింది. మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. విదర్భ, మరాఠ్వాడాలో 20 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వడగాడ్పులు వీస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో వడదెబ్బతో ముగ్గురు మృతి చెందారు. వీరిలో జల్గావ్ జిల్లాలోని రావేర్‌లోని నమ్రతా చౌదరి, అమల్నేర్లోని రూపాలి రాజ్‌పుత్ ఉండగా.. నాందేడ్ జిల్లాలోని విశాల్ మాదస్‌వార్ ఉన్నారు. ఈ ముగ్గురు వడదెబ్బతోనే మృతి చెందినట్లు సంబంధిత డాక్టర్లు తెలిపారు. ఈ వార్త భయాందోళనతోపాటు విషాదాన్ని నింపింది. మరోవైపు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. చదవండి: హృదయ విదారకం.. అంబులెన్సుకు డబ్బుల్లేక కుమారుడి శవంతో 200 కిమీ.. -
నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత
-
వర్షాకాలంలో పెరుగుతున్న ఉష్ణతాపం.. వైజాగ్ వాసుల అవస్థలు
సాక్షి, విశాఖపట్నం: ప్రస్తుతం వర్షాకాలం నడుస్తోంది. కానీ వాతావరణం వేసవి అనుభూతిని కలిగిస్తోంది. ఒకపక్క ఉష్ణతాపం, మరోపక్క ఉక్కపోత వెరసి జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు, వాయుగుండాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఆ సమయంలో చల్లదనం పరచుకుంటున్నా, అవి బలహీన పడ్డాక సూర్యుడు చుర్రుమంటున్నాడు. కొద్దిరోజుల నుంచి ఈ పరిస్థితులే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వీటి తీవ్రత ఒకింత ఎక్కువగానే ఉంటోంది. కొన్నాళ్లుగా విశాఖపట్నంలో సాధారణం కంటే 2–4 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవి వేడిని వెదజల్లుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఆకాశంలో కొద్దిపాటి మబ్బులు కమ్ముకుంటున్నా వాతావరణంలో అంతగా చల్లదనం కనిపించడం లేదు. మేఘాలు కనుమరుగయ్యాక భానుడు ప్రతాపం చూపుతున్నాడు. కొద్దిపాటి సమయానికే సూర్య తాపం తీవ్రత పెరిగి చిర్రెత్తిస్తున్నాడు. మరోవైపు దీనికి ఉక్కపోత కూడా తోడవుతోంది. సాధారణంగా ఇతర ప్రాంతాలకంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉక్కపోత అధికంగా ప్రభావం చూపుతుంది. వేసవిలో మరింత తీవ్రరూపం దాలుస్తుంది. కానీ ప్రస్తుతం వర్షాల సీజనే అయినా అధిక ఉష్ణోగ్రతలతో పాటు ఉక్కపోత కూడా కొనసాగుతోంది. ఫలితంగా జనానికి ముచ్చెమటలు పోస్తున్నాయి. దీంతో వేసవి సీజనులో మాదిరిగా పగలే కాదు.. రాత్రి వేళల్లోనూ ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను విరివిగా వినియోగిస్తూ ఉపశమనం పొందుతున్నారు. ఇదీ కారణం.. కొద్దిరోజులుగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు/ద్రోణులు గాని, ఆవర్తనాలు గాని లేవు. దీంతో వర్షాలు కూడా కురవడం లేదు. ప్రస్తుతం పశ్చిమం నుంచి తేమతో కూడిన గాలులు వీస్తున్నాయి. ఇలా విశాఖలో గాలిలో తేమ శాతం 60 నుంచి దాదాపు 90 శాతం వరకు ఉంటోంది. సాధారణంగా గాలిలో తేమ 50 శాతం ఉంటే ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. అంతకుమించితే ఉక్కపోత ప్రభావం మొదలవుతుంది. (క్లిక్: గిరిజనులకు పీఎంఏవై ఇళ్లు ఇవ్వండి) ఆకాశంలో మేఘాలు ఏర్పడుతున్నా అవి వచ్చి పోతున్నాయి తప్ప స్థిరంగా ఉండడం లేదు. దీంతో సూర్య కిరణాలు నేరుగా భూ ఉపరితలంపైకి ప్రసరిస్తున్నాయి. ప్రస్తుతం విపరీతమైన ఉక్కపోతకు గాలిలో అధిక తేమ, ఉష్ణోగ్రతలు పెరుగుదలకు మేఘాలు, వర్షాలు లేకపోవడం వంటివి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి బంగాళాఖాతంలో ఏదైనా అల్పపీడనం వంటిది ఏర్పడే వరకు కొద్దిరోజుల పాటు కొనసాగుతుందని వీరు పేర్కొంటున్నారు. (క్లిక్: గిరిజనులకు విలువిద్యలో శిక్షణ) -
Europe Heatwave: వేడి పుడుతోంది...
ఇది కనివిని ఎరుగని పరిస్థితి. నిత్యం చల్లగా, హాయిగా ఉంటాయని పేరుపడ్డ ప్రాంతాలు కూడా ఇప్పుడు చండభానుడి దెబ్బకు చేతులెత్తేస్తున్నాయి. నిన్నటి దాకా వేసవిలో ఉష్ణపవనాల తాకిడికి భారత్ లాంటి అనేక దేశాలు అల్లాడితే, నేడు ఐరోపా ఖండం వంతు. కొద్దిరోజులుగా స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్ తదితర ప్రాంతాల్లో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు పాత రికార్డులను బద్దలుకొట్టి, కొత్త చరిత్ర రాస్తున్నాయి. అయిదేళ్ళ క్రితం దాకా జూలైలో సగటున 20 డిగ్రీల సెల్సియస్ ఉండే బ్రిటన్‌లో ఇప్పుడది 40 దాటేసింది. ఉడుకెత్తిస్తున్న ఈ ఉష్ణపవనాలు ఇక తరచూ తప్పవట. కనీసం మరో 40 ఏళ్ళ పాటు 2060ల వరకు ఈ ధోరణి కొనసాగుతుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరిక. రెండు నెలల క్రితం ఫ్రాన్స్‌లో మునుపెన్నడూ లేనంత అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన మే నెల ఎదురైంది. మళ్ళీ గత నెల కూడా ఫ్రాన్స్ నిప్పులకొలిమి అయింది. ఈసారి ఉష్ణపవనాలు స్పెయిన్, ఇటలీ సహా అనేక దేశాలను అల్లాడించాయి. ఈ నెలలో పోలండ్, తూర్పు ఐరోపాలోని ఇతర ప్రాంతాలు అత్యధిక ఉష్ణోగ్రత బారినపడ్డాయి. జూలై 19న బ్రిటన్‌లో కనివిని ఎరుగని ఉష్ణతాపం కనిపించింది. ప్రసిద్ధ లండన్ హీత్రూ విమానాశ్రయంలో భానుప్రతాపం 40 డిగ్రీలు దాటేసింది. ఇప్పటికే ఐరోపాలో అల్లాడుతున్న ప్రజానీకానికి మరో రెండు నెలలైతే కానీ వేసవి ముగియదని గుర్తొచ్చినప్పుడల్లా గుండె గుభేలుమంటోంది. భరించలేని వేడి, ఉక్కపోతల బాధ అలా ఉంటే, వేడిగాలుల దెబ్బకు ఫ్రాన్స్, గ్రీస్, పోర్చుగల్, స్పెయిన్ – ఇలా అనేక ప్రాంతాల్లో కార్చిచ్చులు రేగడం మరో పెనుసమస్యయింది. వేలకొద్దీ ఎక రాల భూమి, పంట అగ్నికీలలకు ఆహుతి అవుతున్నాయి. మంటల్ని అదుపులో ఉంచడం అగ్ని ప్రమాద నివారక బృందాలకు నిత్యపోరాటమైంది. మంటలతో పాటు దట్టమైన పొగ ఉక్కిరిబిక్కిరి చేస్తుండడంతో వేలాదిగా ప్రజల్ని అక్కడ నుంచి ఖాళీ చేయిస్తున్న పరిస్థితి. క్రూరమైన ఎండల తాకిడికి చెలరేగిన మంటలతో లండన్‌లో అగ్నిప్రమాద నివారక బృందాలు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మునుపెన్నడూ లేనంత బిజీగా మొన్న మంగళవారం గడిపాయట. ఇంతటి ఎండలను తట్టుకొనేలా నిర్మించకపోవడంతో బ్రిటన్‌లో రోడ్లు, రైలు పట్టాలు, తీగలు, సిగ్నలింగ్ వ్యవస్థలు దెబ్బతిని, రవాణా వ్యవస్థకు ఆటంకాలు ఎదురయ్యాయి. స్కూళ్ళు, ఆఫీసులు మూతబడ్డాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అమెరికాలోనూ వేడిగాలులు విలయం సృష్టిస్తున్నాయి. అక్కడ శరవేగంతో వృద్ధి చెందుతున్న నగరాల్లో కోటికి పైగా జనాభా ఉక్కపోతతో మగ్గిపోతున్నారు. టెక్సస్, క్యాలిఫోర్నియా, అలాస్కా – ఇలా కనీసం 13 రాష్ట్రాల్లో దాదాపు వంద కార్చిచ్చుల్లో 30 లక్షలకు పైగా ఎకరాలు బూడిదయ్యాయి. వాతావరణ సంక్షోభ రీత్యా దేశంలో తక్షణం ‘జాతీయ వాతావరణ ఎమర్జెన్సీ’ని ప్రకటించాలని బుధవారం పలువురు సెనేటర్లు సైతం కోరాల్సి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు ఎమర్జెన్సీ ప్రకటి స్తారో, లేదో కానీ, యమ అర్జెంటుగా కొత్త చర్యలకు దిగక తప్పదు. పునరుద్ధరణీయ ఇంధన విధా నాలనూ, పర్యావరణ అనుకూల రవాణా పద్ధతులనూ అనుసరించేలా సత్వర ఆదేశాలిస్తేనే ఫలితం. ఈ దుష్పరిణామాల పాపంలో ప్రపంచ దేశాలన్నిటికీ వాటా ఉంది. కర్బన ఉద్గారాలను తగ్గించుకోవాలన్న లక్ష్యంలో ఇప్పటికీ అమెరికా, చైనా సహా అగ్ర రాజ్యాలు వెనుకబడే ఉన్నాయి. వర్ధమాన దేశాలకు లక్ష్యాలు పెట్టడమే తప్ప, స్వయంగా పెద్దన్నలు చేస్తున్నది తక్కువే. గత రెండే ళ్ళుగా బ్రిటన్‌లో ఆగస్ట్ వాతావరణం మారి, కూలర్లు, ఏసీలు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. రోడ్లు కుంగి, ఇంటి గాజు పైకప్పులు కరిగిపోతూ నిత్యం 40 – 45 డిగ్రీలుండే సూడాన్ లాగా బ్రిటన్ మండిపోతుంటే, వాతావరణంపై అత్యవసర సమావేశానికి హాజరు కాకుండా, ప్రభుత్వ ఖర్చుతో వీడ్కోలు విందు ఇచ్చే పనిలో ఆ దేశ ప్రధాని ఉన్నారంటే ఎంత దౌర్భాగ్యం? ఉప ప్రధాని ఏమో విషయ తీవ్రతను వదిలేసి, ‘ఎండల్ని ఎంజాయ్ చేయండి’ అన్నారంటే ఇంకేమనాలి? ఆసియా, ఆఫ్రికా, ఐరోపాల్లో ప్రమాదస్థాయిని మించి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సంగతిని ‘నాసా’ సైతం తాజాగా ధ్రువీకరించింది. గ్రీన్హౌస్ వాయువుల విడుదలతో మన పుడమి ఇంటిని మనమే నాశనం చేసుకుంటున్నామని ఐరాస ప్రపంచ వాతావరణ సంస్థ నెత్తీనోరూ బాదు కుంటోంది. ఏటేటా పెరుగుతున్న ఈ ఉష్ణపవనాలతో లండన్, ఢిల్లీ సహా ప్రపంచంలో కనీసం 10 ప్రధాన నగరాల్లో భవిష్యత్తులో తాగడానికి చుక్కయినా భూగర్భ జలాలు లేకుండా పోతాయని ఓ తాజా నివేదిక. ‘డే జీరో’ అని ప్రస్తావించే ఆ రోజు ఎంతో దూరంలో లేదట. మరో మూడేళ్ళలోనే ఈజిప్ట్ రాజధాని కైరోలో, పాతికేళ్ళలో లండన్‌లో ఇలాంటి పరిస్థితి వస్తుందట. 2018లోనే కేప్ టౌన్ నగరంలో ఇలా పరిస్థితి పీకల మీదకొచ్చింది. చివరకు ‘డే జీరో’ను నివారించేందుకు ఆ నగరంలో నీటి వినియోగాన్ని సగానికి తగ్గిస్తూ, అత్యవసర చర్యలు అమలుచేయాల్సి వచ్చింది. ఇవన్నీ గమనించైనా చేతులు కాలక ముందే తెలివితెచ్చుకోవడం ప్రపంచ దేశాలకు మేలు. భూగోళం వేడెక్కుతోంది. కార్చిచ్చుల దెబ్బకు ఫ్రాన్స్‌లో వేలమంది ఇల్లూవాకిలి పోయిన వేళ, ఆ వేడి పాశ్చాత్య ప్రపంచానికీ తెలిసొస్తోంది. ఇకనైనా దేశాలన్నీ సమష్టిగా కదిలితే మంచిది. త్రికరణశుద్ధిగాæపర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టకపోతే, రాబోయే రోజుల్లో చండప్రచండ తాపం ఎవరినీ వదిలిపెట్టదు. అందరి సరదా తీర్చేస్తుంది. పారాహుషార్! -
రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు... ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
న్యూఢిల్లీ: భానుడి ప్రతాపానికి చిగురుటాకులా అల్లాడిపోతోంది ఢిల్లీ. రానున్న నాలుగైదు రోజులు వాతావరణం పొడిగా ఉండి, తీవ్ర వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదీగాక శనివారం ఒక్కరోజే 47 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతను నమోదు చేసింది. దీంతో ఢిల్లీలో వేడుగాలులు అధికమవుతాయని, వడ దెబ్బ అధికంగా ఉంటుందని ప్రజలను హెచ్చరిస్తూ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అంతేకాదు ఢిల్లీలో కనీసం ఐదు వాతావరణ స్టేషన్లో 45 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతను నమోదు చేశాయి. దీనికి తోడు ప్రస్తుతం ఢిల్లీ పీల్చే వాయువులో కూడా నాణ్యత లేక ఉక్కిరబిక్కిరి అవుతోంది. పైగా ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది అసలు అధిక ఉష్ణోగ్రతలు అంటే.. వాతావరణ శాఖ వివరణ ప్రకారం...గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా అంటే సాధారణం కంటే కనీసం 4.5 నాచ్‌లు ఎక్కువగా ఉంటే గరిష్ట ఉష్ణోగ్రతగా ప్రకటిస్తారు. అంతేకాదు 6.5 నాచ్‌లు అధికంగా ఉంటే తీవ్ర ఉష్ణోగ్రతగా పరిగణిస్తారు. వాస్తవంగా ఒక ప్రాంతం ఉష్ణోగ్రత గరిష్టంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను నమోదు చేసినప్పుడు అధిక ఉష్ణోగ్రతగా ప్రకటిస్తారు. గరిష్ట ఉష్ణోగ్రత 47 డిగ్రీ సెల్సియస్ మార్క్‌ను దాటితే తీవ్రమైన ఉష్ణోగ్రతగా పరిగణిస్తారు. i) Increase in rainfall activity likely over South Peninsular India from 07th June. ii) Intense spell of rainfall over Northeast India and Sub-Himalayan West Bengal & Sikkim during next 5 days. pic.twitter.com/UFLgM7b6sF — India Meteorological Department (@Indiametdept) June 4, 2022 (చదవండి: భారత్‌లో కరోనా టెన్షన్.. కేంద్రం అలర్ట్) -
మండే ఎండలు తగ్గాలంటే... మైండ్‌సెట్ మారాలి!
రోహిణి కార్తెలో రోళ్లు బద్దల వుతాయి అనేవాళ్లు. కానీ గడచిన కొన్ని సంవత్సరాలుగా ఆ సమయం రాగానే ఓ తుపాను, అడపాదడపా వర్షాలు వచ్చి ఎండలు మరీ మండకుండానే వేసవి ముగుస్తున్నది. అలాగని అంతటా అదే పరిస్థితి మాత్రం లేదు. ఉత్తరంగా పోయినకొద్దీ ఎండల తాకిడి మరీ దుర్భరంగా ఉంటున్నది. ఈసారి మే మొదటి వారం ముగియక ముందే దేశంలో హీట్ వేవ్ మొదలయింది అన్నారు. మార్చ్–ఏప్రిల్ మాసాలలో కూడా మామూలు కన్నా ఎక్కువ వేడిమి సాగింది. ఉత్తర భారతంలో 46 డిగ్రీలు సెల్సియస్ మామూలయింది. ఇక పాకిస్తాన్లో 49 డిగ్రీల వేడి కనిపిస్తోంది. ‘వర్షాలకు ముందు ఇటువంటి ఎండలు కొత్తేమీ కాదు. అయితే ఈసారి తీవ్రత... అనుకున్న సమయానికి ముందే మొదలయింది. వ్యవసాయం జరుగుతున్నది. బడులు, కాలేజీలకు సెలవులు ఇవ్వలేదు. ఇక ఎక్కువమంది ఎండకు గురవుతున్నారంటే ఆశ్చర్యం లేద’ంటున్నారు ప్రపంచ వనరుల సంస్థలో వాతావరణ కార్యక్రమం డైరెక్టర్ ఉల్కా కేల్కర్. రుతుపవనాలు కూడా ఈసారి త్వరగా వస్తాయంటున్నారు మరోవైపున. ప్రతి సంవత్సరం ఉత్తర భారతదేశంలో, మన దగ్గర కొన్ని ప్రాంతాలలో 40 డిగ్రీలు దాటిన వేడిమి మామూలుగా అలవాటయింది. అంతటి వేడికి మానవ శరీరం తట్టుకోజాలదు. కండరాల సమస్యలు మొదలవుతాయి. అలసట, తల తిప్పటం, చివరికి గుండెపోట్లు కూడా రావచ్చు. హాయిగా ఎయిర్ కండిషనర్లు, కూలర్ల ముందు బతికే వారికి పరిస్థితి అర్థం కాదు. బతుకుతెరువు పేరున ఎండనబడి పనిచేసే కష్టజీవుల స్థితి అధ్వాన్నం అవుతుంది. అయినా వాళ్లు అలవాటుగా పనిచేస్తూనే ఉండటం ఆశ్చర్యం. వాతావరణం రానురానూ మారుతున్నది అన్న సంగతి అందరికీ అర్థమయింది. రానురానూ మరింత వేడి పెరుగుతుంది. అందరూ ఒంటినిండా కప్పుకుని అరబ్ దేశాల వారివలె తిరిగే పరిస్థితి వస్తుంది. ఎండ తాకిడికి గురవుతున్న వారి సంఖ్య దేశంలో ఇప్పటికే బిలియన్‌ను దాటిందని పరిశోధకులు చెబుతున్నారు. ఎండ కారణంగా పంటలు, ముఖ్యంగా గోధుమ పంట దెబ్బతింటుంది అంటున్నారు. ముంబయి వంటి చోట్ల పరిస్థితి మరింత విచిత్రంగా ఉంది. అక్కడ గాలిలో తేమ మరీ ఎక్కువ. వేడిమి 32 డిగ్రీలే ఉన్నప్పటికీ 38 దాటినట్లు ఉడికిపోతుంది. దానివల్ల అలసట, అనారోగ్యం ఎక్కువవుతాయి అంటారు ఐఐటీ పరిశోధకురాలు అర్పితా మొండల్. మొత్తానికి దేశంలో ఎండలు మండే దినాల సంఖ్య పెరుగుతున్నది. 2011 నుంచి 2020 మధ్యన ఇటువంటి దినాలు 600 అని లెక్క తేలింది. 1981–1990లలో ఆ సంఖ్య కేవలం 413 మాత్రమే. మార్చి నుంచి జూన్ మధ్యన ఇటువంటి వేడి రోజులు ఎదురవుతాయి. కానీ మారుతున్న పరిస్థితులలో వాటి తీవ్రత పెరుగుతున్నది అంటారు ఎన్ఆర్డీసీ నిపుణురాలు కిమ్ నోల్టన్. భవన నిర్మాణం, వ్యవసాయం, మరిన్ని రకాల రంగాల మీద ఈ ప్రభావం తీవ్రంగా పడింది. ఎండలు పెరుగుతున్నందుకు ఇప్పుడు ఏదో చేయడం అర్థం లేని పని. మొత్తం దక్షిణాసియాలోనే దీర్ఘకాలిక పథకాలు అమలు చేయాలి. ముందుగా ప్రజలకు ఈ విషయంపై అవగాహన కలుగజేయాలి. ఎండ తీరును ముందే అంచనాలు వేసే పద్ధతులు అమలులోకి రావాలి. అందరికీ ఆరోగ్య రక్షణ, కాస్తంత నీడ, తాగునీరు అందాలి. పల్లె ప్రాంతాలలో పశువుల విషయంగా తగు జాగ్రత్తలు తీసుకొని ఏర్పాట్లు ముందే చేయాలి అంటారు ఉల్కా కేల్కర్. (చదవండి: విపత్తులు సరే... నివారణ ఎలా?) నగరాల పెరుగుదల తీరును గట్టిగా పట్టించు కోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జలాశయాలు తరిగిపోవడం, నిర్మాణాల పేరున అడవుల వినాశనం తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తాయి. ఏసీల పేరున విద్యుత్తు డిమాండ్ పెరగడం మరొక సమస్య. ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకం వేపు చూపు మరలించాలి. అంతా కలసి పెద్ద ఎత్తున ప్రణాళికలు వేయడంతో ఏదీ జరగదు. ‘నా పని నేను చేసుకుంటాను, నా బతుకు నేను బతుకుతాను’ అనే మనస్తత్వం మారాలి. అందరి కోసం ఆలోచించే తీరు రావాలి. (చదవండి: ఇప్పటికీ నేర్వని ఆహార పాఠాలు) - కె.బి. గోపాలం రచయిత, అనువాదకుడు -
వడదెబ్బ నుంచి తప్పించుకోండి ఇలా..
ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండల తీవ్రత ఎక్కువ అవుతోంది. సాయంత్రం 6 కానిదే తగ్గడం లేదు. దీనికితోడు ఉక్కపోత, వడగాడ్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేసవి తాపానికి జనం బయటకు రాలేని పరిస్థితి. ఇంట్లో ఏసీలు, కూలర్లు 24 గంటల పాటు వినియోగించాల్సి వస్తోంది. అయితే అందరూ ఇంట్లో ఉంటే కుదరదు కదా? అలాగని ఎండ బారిన పడితే వచ్చే అనర్థాలను తట్టుకునే పరిస్థితి ఉండదు. అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రాష్ట్ర విపత్తుల నివారణ, వైద్య ఆరోగ్య శాఖలు తెలిపాయి. – డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ) జాగ్రత్తలు.. ► ఆరుబయట పని చేసే వారు సూర్యరశ్మి నుంచి కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. ► తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి. బయటకు వెళ్లే ముందు నుంచి నీళ్లు వెంట తీసుకెళ్లాలి. ► ఎక్కువగా నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండాలి. ► అవసరాన్ని బట్టి ఓఆర్ఎస్ ద్రవణం తీసుకోవాలి. పండ్ల రసాలు, గంజి, మజ్జిగ, జావ వంటివి ఎక్కువగా తీసుకుంటే మేలు. ► తెలుపు లేత రంగుల్లో ఉన్న పలుచని కాటన్ దుస్తులు ధరించాలి. ► లకు ఎండ తగలకుండా టోపీ, రుమాలు చుట్టుకోవాలి. వడదెబ్బ ప్రమాదం ► ఎండలు, వడగాడ్పుల సమయంలో బయట తిరగడం వల్ల వడదెబ్బకు గురవుతారు. ► తక్కువగా నీరు తాగడం, ద్రవపదార్థాలు తీసుకోకపోవడం, చల్లదనం ఇవ్వని దుస్తులు ధరించడం, చెమటను పీల్చని దుస్తులు, మద్యం సేవించడం వల్ల వడదెబ్బ సోకుతుంది. ► వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నపిల్లలు, వృద్ధులు దీని బారిన పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై వైద్యు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ► శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా 104.9 డిగ్రీల వరకు పెరిగిపోయి, దానిని నియంత్రించే శక్తి కోల్పోవడమే వడదెబ్బగా పరిగణిస్తారు. దీనిని చాలా మంచి జ్వరంగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా చేస్తే ప్రాణాంతకంగా మారుతుంది. లక్షణాలు.. ► రక్తప్రసరణ తగ్గి బీపీ డౌన్ అవుతుంది ► శరీరంతో పాటు పెదాలు, గోర్ల రంగు మారుతుంది. ► ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతాయి. ► కీళ్ల నొప్పులు అధికంగా ఉంటాయి. ► నరాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. ► స్పృహ కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది ► మాటల్లో స్పష్టత తగ్గుతుంది. ► ఇతరులు చెప్పే మాటలను కూడా వినలేకపోతారు ► కొంత మంది కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది ► విపరీతమైన తలనొప్పి రావడం, హృదయ స్పందన బాగా పెరగడం, శ్వాస తీసుకోవడం కష్టమవడం, చర్మం బాగా కందిపోయి మంటగా ఉండటం, బుగ్గలు, మెడ, గొంతు, మోచేతులు, ఛాతి బాగాలు ఎరుపెక్కడం మొదలైనవి.. నివారణ చర్యలు.. ► తక్షణమే శరీర ఉష్ణోగ్రతను తగ్గించే చర్యలు చేపట్టకపోతే అవయవాలు శాశ్వతంగా పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది. ► వారిని వెంటనే చల్లని ప్రదేశానికి చేర్చాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వచ్చే వరకు అలానే చేయాలి. ► చల్లని నీరు తాగడం వల్ల శరీర ఉష్ణాగ్రత తగ్గుముఖం పడుతుంది. బాత్‌టబ్‌లో ఐదు నుంచి పది నిమిషాలు గడపాలి. లేదా చల్లని దుప్పటిని శరీరమంతా కప్పాలి. ఆ తరువాత ఐస్ ముక్కలలతో శరీరమంతా అద్దాలి. ఇలా చేస్తే శరీరం వణుగు తుగ్గుతుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ► తీవ్రతను బట్టి ఆలస్యం చేయకుండా వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి. వెంటనే చికిత్స ప్రారంభం అయితే ప్రమాదం నుంచి గట్టెక్కవచ్చు. ఏం తినాలి.. వడదెబ్బ సోకిన వారు ఆహారం తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువగా తాజా పండ్లు, కూరగాయలు, అదనంగా ద్రవపదార్థాలు, పండ్ల రసాలు, శక్తినిచ్చే శీతలపానీయాలు, మజ్జిగ తాగాలి. అలాగే చిరుధానాయలు తీసుకోవాలి. షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవాలి. తద్వారా వడదెబ్బ తీవ్రతను తగ్గిస్తాయి. -
నాలుగురోజులు... వడగాల్పులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరగడంతో వడగాల్పులు నమోదవుతున్నాయి. రానున్న నాలుగు రోజులు పలుచోట్ల వడగాల్పుల తీవ్రంగా ఉండనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు సూచనలు ఇవ్వాలని సూచించింది. -
ఏపీ ప్రజలకు అలర్ట్.. ఎండలు మరింత తీవ్రం
సాక్షి, అమరావతి: వచ్చే నాలుగు రోజులపాటు రాష్ట్రంలో ఎండలు మరింత తీవ్రం కానున్నాయి. శనివారం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. అనేక చోట్ల 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు. వేసవి తీవ్రత, ఉత్తర భారతదేశం వైపు నుంచి వీస్తున్న వేడిగాలుల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. శనివారం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 43నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. చదవండి: తోటలో పెంచుకుంటున్న కోడిని దొంగిలిస్తావా? విశాఖ, తూర్పు గోదావరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూ రు, వైఎస్సార్, అన్నమయ్య, నంద్యాల, అనంతపురం, కర్నూలు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. 24న పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45నుంచి 46 డిగ్రీలు, అల్లూరి, తూర్పు గోదావరి, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, వైఎస్సార్, నంద్యాల జిల్లాల్లో 42నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. 25న అల్లూరి, పార్వతీపురం మన్యం, విజయనగరం, ఏలూరు, పల్నాడు, నంద్యాల జిల్లాల్లో 45నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విశాఖ, తూర్పు గోదావరి, అనకాపల్లి, కాకినాడ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, వైఎస్సార్, నెల్లూరు, అన్నమయ్య, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో 42నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. 26న కూడా 43నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని, వృద్ధులు, పిల్లలు, గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. -
1.5 లీటర్ల కోల్డ్ డ్రింక్ పది నిముషాల్లో తాగేశాడు.. 18 గంటల్లోనే..
కొన్నిసార్లు అత్యుత్సాహంతో చేసే పనులు తీవ్ర ఇబ్బందులపాలు చేస్తాయి. ఓ వ్యక్తి ఎండవేడిని తట్టుకోలేక ఒకేసారి ఒకటిన్నర లీటర్ల కూల్‌డ్రింక్ తాగాడు. అనంతరం తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందాడు. అసలేంజరిగిందంటే.. చైనాకు చెందిన 22 ఏళ్ల యువకుడు గత నెలలో ఎండ వేడిని తట్టుకోలేక ఒకే సారి 1.5 లీటర్ల కోకాకోలా తాగాడు. ఐతే తదుపరి 6 గంటల్లోనే తీవ్రమైన కడుపునొప్పి, ఉబ్బరం సమస్యలు తలెత్తడంతో బీజింగ్‌లోని చావోయాంగ్ హాస్పిటల్‌కు అతన్ని తరలించారు. చికిత్స సమయంలో రక్తపోటు గణనీయంగా పడిపోయిందని, గుండె వేగంగా కొట్టుకుందని, ఊపిరి వేగం కూడా పెరిగిందని వైద్యులు తెలిపారు. ఇవన్నీ గమనించిన తర్వాత డాక్టర్లు చికిత్స ప్రారంభించారట. క్లినిక్ అండ్ రీసెర్చ్ ఇన్ హెపటాలజీ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ జర్నల్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. శీతల పానీయాలు ఎక్కువగా తాగితే న్యుమాటోసిస్ సమస్య తలెత్తుతుంది. ఫలితంగా కడుపులో అధిక మోతాదులో గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఇతని విషయంలో కూడా అదే జరిగింది. చికిత్స సమయంలో యువకుడి ఛాతీకి ఆక్సిజన్ సరఫరా తగ్గడంతో హెపాటిక్ ఇస్కీమియాకు గురయ్యాడు (అంటే లివర్ షాక్‌కు గురవ్వడం). ఫలితంగా అతనికి మరణం సంభవించిందని వైద్యులు తెలిపారు. ఐతే గ్యాస్ నుండి ఉపశమనం పొందటానికి వైద్యులు ప్రయత్నించినప్పటికీ 18 గంటల చికిత్స తర్వాత మరణించాడని నివేదిక తెల్పింది. చదవండి: అతిగా నిద్రపోతున్నారా? స్ట్రోక్ ఆ తర్వాత కార్డియక్ అరెస్ట్.. ఇంకా.. -
అమెరికాలో భానుడి భగభగలు
వాషింగ్టన్ ‘మేము దుబాయ్‌లో ఉన్నామా? అమెరికాలో ఉన్నామా? మండే ఎండల్ని భరించడం ఎలా? ఎన్ని ఏసీలు వేసినా చల్లబడడం లేదేంటి?’ ఇప్పుడు పశ్చిమ అమెరికా నగరవాసుల్ని కదిలిస్తే ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎండవేడి తట్టుకోలేక జనం విలవిల్లాడిపోతున్నారు. అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్, ఒరేగాన్, సలేమ్, సియాటిల్ నగరాల్లో ఎండలు దారుణంగా ఉన్నట్టు నేషనల్ వెదర్ సర్వీసు వెల్లడించింది. రోజురోజుకీ ఈ నగరాల్లో ఎండలు పెరిగిపోతున్నాయి. 43 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ‘‘పశ్చిమ అమెరికాలో అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తర అమెరికాలో కూడా ఎండలు దంచికొట్టే అవకాశాలున్నాయి.వాతావరణం మార్పుల వల్ల పెరిగిపోతున్న ఈ ఎండల్ని ఎదుర్కోవడానికి ఇప్పట్నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి’’ అని వాషింగ్టన్ గవర్నర్ జే ఇన్స్లీ చెప్పారు. అత్యవసరమైతే తప్ప ఏసీ గదులు వీడి బయటకు రావద్దని అమెరికా నేషనల్ వెదర్ సర్వీసు హెచ్చరికలు జారీ చేసింది. నీళ్లు ఎక్కువగా తాగాలని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అమెరికాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ వాడకం పెరిగిపోవడంతో బ్లాక్ఔట్లు సంభవిస్తున్నాయి. వాషింగ్టన్, ఒరేగాన్‌లో ఎండవేడి తట్టుకోలేక డజనుకి పైగా మరణాలు చోటు చేసుకున్నాయి. కాలిఫోర్నియా–ఒరేగాన్ సరిహద్దుల్లో కార్చిచ్చులు ఏర్పడి 600 హెక్టార్ల అటవీ ప్రాంతం దగ్ధమైంది. మండే ఎండలకు, గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులకి ఎలాంటి సంబంధం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఈస్థాయి ఎండల్ని ఎప్పుడూ చూడలేదన్నారు. కెనడాలో 84 ఏళ్ల రికార్డులు బద్దలు కెనడాలో కూడా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మండే ఎండలకు రికార్డులు బద్దలైపోతున్నాయి. కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో రికార్డు స్థాయిలో ఏకంగా 49.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత నాలుగైదు రోజుల్లోనే వడగాడ్పులకు తాళలేక వెన్కౌర్ ప్రాంతంలో 200 మందికి పైగా మృతి చెందారు. 84 ఏళ్ల తర్వాత కెనడాలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి. బ్రిటీష్ కొలంబియా, అల్బెర్టా, సస్కాచ్వాన్, యూకన్ వాయవ్య ప్రాంతాల్లో మరో వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటాయని కెనడా వాతావరణ శాఖ హెచ్చరించింది. హీట్ డోమ్ కారణం..! ఫసిఫిక్ మహాసముద్రంలో వాతావరణంలోని మార్పుల కారణంగా తీవ్రమైన ఒత్తిడి వల్ల హీట్ డోమ్ ఏర్పడడంతో అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి కెనడాలోని ఆర్కిటిక్ ప్రాంతాల వరకు ఎండలు భగభగలాడుతున్నట్టుగా బెర్కెలే ఎర్త్‌కి చెందిన పర్యావరణ శాస్త్రవేత్త జెకె హస్ఫాదర్ చెప్పారు. గత 50 ఏళ్ల కాలంలో ఫసిఫిక్ సముద్రంలోని వాయవ్య ప్రాంతం సగటున 1.7 డిగ్రీ లు వేడెక్కిందని, అందుకే ఈ స్థాయిలో ఎండలు మండుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. -
21 ఏళ్ల తర్వాత మళ్లీ ఇంత ‘వేడి’
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ తీరాన్ని ‘వాయు’ తుపాను గురువారం నాడు తాకే అవకాశం ఉందని వార్తలు వస్తోన్న నేపథ్యంలో కూడా దేశవ్యాప్తంగా వడగాల్పులు తీవ్రంగా వీస్తున్నాయి. మున్నెన్నడు లేని విధంగా ఈసారి దేశంలోని 23 రాష్ట్రాలను వడగాల్పులు కుదిపేశాయి. కొన్ని నగరాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌ను తాకాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ వేసవి కాలంలో ఇప్పటివరకు వడ గాల్పులకు 36 మంది మరణించారు. 2015లో తొమ్మదిమంది మరణం కన్నా ఇది నాలుగింతలు ఎక్కువ. సరిగ్గా 21 ఏళ్ల క్రితం అంటే, 1988లో సుదీర్ఘకాలం పాటు వడగాల్పులు దేశాన్ని వణికించాయి. ఈ నెల జూన్ 13వ తేదీతో నాటి రికార్డు సమమైందని భూ వాతావరణ శాఖ లెక్కలు తెలియజేస్తున్నాయి. 1880 తర్వాత ప్రపంచ ఉష్ణోగ్రతలు 2014లో భారీగా పెరిగాయి. వాతావరణంలో వస్తున్న అకాల మార్పులే అందుకు కారణం. వడ దెబ్బ తగిలి తక్షణం మరణించిన వారినే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడ గాల్పుల మతులుగా పరిగణిస్తోంది. కానీ వడగాల్పుల కారణంగా ఆరోగ్యం క్షీణించి మరణిస్తున్న వారి సంఖ్య వేలల్లో ఉంటోంది. జాతీయ విపత్తు నిరోధక యంత్రాంగం (ఎన్డీఎంఏ) నివేదిక ప్రకారం వడగాల్పులు లేదా ఎండ తీవ్రత కారణంగా 1991–2000 మధ్య ఆరువేల మంది మరణిస్తే 2001–2010 నాటి మతుల సంఖ్య 1,36,000 మందికి చేరుకుంది. 2010లో దేశవ్యాప్తంగా వీచిన వడగాల్పులకు వందలాది మంది మత్యువాత పడ్డారు. 2010 నుంచి ఇప్పటి వరకు ఆరువేల మంది మరణించారు. 2005 నాటి ‘నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్’ చట్టంగానీ, 2009లో తీసుకొచ్చిన ‘నేషనల్ పాలసీ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్’ గానీ వడ గాల్పుల మతులను ప్రకతి వైపరీత్యాల కింద గుర్తించడం లేదు. అలా గుర్తించి ఉన్నట్లయితే మతుల కుటుంబాలకు నష్టపరిహారం అందడంతోపాటు వడగాల్పులను ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక నిధులు కూడా అందుబాటులో ఉండేవి. 2016లో దేశవ్యాప్తంగా కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల ఆ సంవత్సరం మతుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రజలకు అందుబాటులో చలివేంద్రాలు, మజ్జిక కేంద్రాలను ఏర్పాటు చేయడం, రోడ్లు కరిగి పోకుండా నీళ్లు చల్లడం, ప్రజలు సేదతీరేందుకు 24 గంటలపాటు పార్కుల తలుపులు తెరచి ఉంచడం లాంటి చర్యలు తీసుకున్నారు. ఇంకా తీసుకోవాల్సిన చర్యలు ఎన్నో ఉన్నాయి. గూడు లేని అనాధలు, భిక్షగాళ్లు ఎక్కువగా వడగాల్పులకు మత్యువాత పడుతుంటారు. అలాంటి వారందరిని వేసవి శిబిరాలను ఏర్పాటు చేసి వాటిల్లోకి తరలించారు. రోడ్లను ఎప్పటికప్పుడు తడపడంతోపాటు రోడ్ల పక్కన విస్తతంగా చెట్లను పెంచాలి. ప్రతి చోట పార్కులను అభివద్ధి చేయాలి. ప్రజల చల్లబడేందుకు వారికి అందుబాటులో కూలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. వడదెబ్బ తగిలిన వారికి అత్యవసర చికిత్స అందించేందుకు అందుబాటులో ప్రత్యేక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలి. -
ఏపీలో స్కూళ్లకు సెలవులు పొడగింపు
-
ఈ నెల 21వరకు స్కూళ్లకు సెలవులు
-
మన సిటీ చాలా సెన్సిటివ్..!
సాక్షి, హైదరాబాద్ : ఎండాకాలం ఇంకా పూర్తిగా మొదలుకానేలేదు.. అప్పుడే ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. రాష్ట్ర రాజధానిలో మార్చి ప్రారంభం నుంచే పగటి ఉష్ణోగ్రత 37 డిగ్రీల మేర నమోదవుతున్నాయి. మానవ శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీలు(98.6 ఫారిన్‌హీట్స్). అదే స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలనూ నగరవాసులు తట్టుకోలేకపోతున్నారు. దీనికి తోడు కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరంలో రేడియేషన్ సూచీ పది పాయింట్ల మేర నమోదవుతోంది. ఉక్కపోత, వేసవితాపాన్ని తట్టుకునేందుకు ఏసీ లు, కూలర్లు, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్ల వినియోగం కొద్దిరోజులుగా విపరీతంగా పెరిగింది. దీంతో సిటీలో విద్యుత్ వినియోగం అనుహ్య స్థాయికి చేరింది. సాధారణంగా సాయంత్రం పీక్ అవర్(ఆరు నుంచి పది గంటలు)లో మాత్రమే కనిపించే విద్యుత్ వినియోగం గత కొద్ది రోజులు గా అర్ధరాత్రి తర్వాత కూడా రికార్డ్ స్థాయిలో నమోదవుతోంది. సాధారణ రోజుల్లో రాత్రిపూట విద్యుత్ వినియోగం 800 మెగావాట్లు ఉండగా, ప్రస్తుతం రాత్రి పూట 1,200 మెగావాట్లకు పైగా విద్యుత్ వినియోగం నమోదు అవుతుండటం గమనార్హం. గ్రేటర్ చరిత్రలో రాత్రి వేళల్లో ఇంత భారీగా విద్యుత్ వినియోగం జరగడం ఇదే ప్రథమమని డిస్కం పేర్కొంది. పెరిగిన ఏసీలు.. కూలర్లు.. ఒకప్పుడు ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు ధనవంతుల నివాసాల్లోనే కన్పించేవి. ప్రస్తుతం ఇవి ప్రతి ఇంట్లోనూ సర్వసాధారణం అయ్యాయి. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఆయా కంపెనీలు.. బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుని వడ్డీ లేకుండా రుణాలు మంజూరు చేస్తున్నాయి. దీనికి తోడు గతంతో పోలిస్తే ఏసీల ధరలు కొంత తగ్గుముఖం పట్టడం, సులభ వాయిదాల పద్ధతుల్లో కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో మధ్యతరగతి వారు వీటి కొనుగోలుకు వెనకాడటం లేదు. ఇక ఐటీ, అనుబంధ సంస్థలు అర్ధరాత్రి కూడా తెరిచే ఉంటున్నాయి. ఈ సమయంలో ఏసీలు ఆన్‌లో ఉండటం వల్ల కూడా విద్యుత్ వినియోగం పెరగడానికి మరో కారణం. ఆసక్తికర అంశం ఏమిటంటే అర్ధరాత్రి తర్వాత (గది చల్లబడిన తర్వాత) బంద్ కావాల్సిన ఏసీలు.. తెల్లవార్లూ ఆన్‌లోనే ఉండటంతో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం.. గ్రేటర్ పరిధిలో 50 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 42 లక్షలు గృహ, ఏడు లక్షలకుపైగా వాణిజ్య కనెక్షన్లు.. చిన్న, మధ్య, భారీ పరిశ్రమల కనెక్షన్లు మరో యాభై వేల వరకు ఉన్నాయి. పగలు నమోదైన ఉష్ణోగ్రతలు రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా చల్లబడటం లేదు. దీంతో ఏసీలను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రెట్టింపైంది. జనవరిలో సగటు విద్యుత్ వినియోగం 34–36 మిలియన్ యూనిట్లు(ఎంయూ) ఉండగా, ప్రస్తుతం అది 54 ఎంయూలకు చేరింది. మార్చి చివరి నాటికి 60–65 ఎంయూలకు చేరుకునే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో డిమాండ్‌ను తట్టుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. అన్ని సబ్స్టేషన్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని ఇప్పటికే పెంచాం. - శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్, ఆపరేషన్స్, సీపీడీసీఎల్ -
నేడూ వడగాడ్పులు
-
నేడూ వడగాడ్పులు
సాక్షి, హైదరాబాద్: వడగాడ్పులతో రాష్ట్రం మండిపోతోంది. గురువారం కూడా వడగాడ్పులుంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరోవైపు కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశముందని తెలిపింది. ఇక శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని సమాచారం. ఇదిలావుండగా బుధవారం నల్లగొండలో అత్యధికంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, రామగుండంలలో 44, ఖమ్మంలో 42, ఆదిలాబాద్‌లో 41, మెదక్‌లో 40, హైదరాబాద్‌లో 39, మహబూబ్‌నగర్, హకీంపేట, నిజామాబాద్‌లలో 38 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. -
మరణమూ విడదీయలేదు
శ్రీకాకుళం: అగ్ని సాక్షిగా ఒక్కటయ్యారు. కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరం తోడుగా ఉంటామని బాసలు చేసుకున్నారు. జీవన మలి సంధ్య వరకు చేసిన బాసలను నిలబెట్టుకుంటూ ఒకరి కోసం ఒకరు బతికారు. ఆఖరుకు మరణంలోనూ విడిపోకుండా ఒకరి వెంట మరొకరు నడిచారు. శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్ పేట మండలం ధనుకువాడ గ్రామానికి చెందిన మెండ సావిత్రి(65) బుధవారం వడదెబ్బ తగిలి మృతి చెందారు. ఆమె మృతితో భర్త శ్రీరాములు(70) విలవిలలాడిపోయారు. తల్లి మరణించిన విషయాన్ని కందుకూరులో ఉంటున్న వారి కుమారుడు విశ్వనాథంకు స్థానికులు తెలియజేశారు. గురువారం ఉదయానికి గ్రామానికి చేరుకుంటానని, అప్పటి వరకు మృతదేహాన్ని ఉంచాలని ఆయన కోరడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. అయితే, భార్య మృతి చెందినప్పటి నుంచి ఆమె పార్థివ దేహం పక్కనే ఉన్న భర్త శ్రీరాములు చాలా సేపటి నుంచి కదలకుండా ఉండడం స్థానికులు గమనించారు. ఏమైందని పరిశీలించి చూస్తే ఆయన కూడా తుది శ్వాస విడిచారని వారికి అర్థమైంది. ఈ భార్యాభర్తలు మరణించడంతో ధనుకువాడ గ్రామంలో విషాదం అలముకుంది. వీరికి ఒక కొడుకు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. -
తిరుపతిలో మండిపోతున్న ఎండలు
-
పుడమి గుండెల మీద కొలిమి
రెండో మాట తాజాగా వెలువడిన అనేక అంతర్జాతీయ వాతావరణ పరిశోధనలలో నిపుణులు మరో సత్యాన్ని బయటపెట్టారు. కొలిమిని మరిపిస్తున్న వేసవి వేడిమితో, వడగాడ్పులతో ప్రపంచవ్యాప్తంగా కకావికలవుతున్న 44 ప్రధాన మండలాలలో ఉన్న నగరాలలో హైదరాబాద్ ఒకటని ఆ పరిశోధనలు వెల్లడించాయి. ‘ఎల్–నినో’ మన నెత్తిన తాండవించే సమయంలో, తాపాన్ని రెట్టించే వడగాడ్పులకు భారీ సంఖ్యలో జనాలు, ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలు గురి కావచ్చునని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రాక్షస సంహారంలో ఎంతో సాహసవంతులుగా కనిపించే మన దేవుళ్లు, సూర్యతాపం దగ్గర మాత్రం గడగడలాడిపోయారు. ఎర్రన ‘హరివంశం’ ఇదే చెబుతోంది. మూడేళ్లు చండప్రచండంగా ఎండలు కాసినా చలించకూడని త్రిమూర్తులు నెలవులు తప్పి ఏం చేశారో ఆయన వర్ణించాడు. అంతటి విష్ణు మూర్తి కూడా వేసవి తాపానికి పాలసంద్రంలో దూకి ఒంటిని చల్లబరుచు కున్నాడట. శివుడు కొండల చాటుకు వెళ్లి సేద తీరాడట. చతుర్ముఖ బ్రహ్మ చల్లటి పద్మాలను ఆశ్రయించాడట. మరో కవీశ్వరుడు సారంగి తమ్మయ్య కైలాసంలో ఉన్నా ఈశ్వరుడు పడిన బాధను చిత్రించాడు. చల్లగా ఉండే కైలాసగిరిని వదిలి శివుడు వేసవి తాపాన్ని చల్లార్చుకోవడానికి భూమ్మీద చెట్ల నీడలను (వటమూల తలమూల) ఆశ్రయించవలసి వచ్చిందిట. వేసవి తాపం దేవతలనే ఆ విధంగా గంగ వెర్రులెత్తిస్తే, పూట బత్తెం, పుల్ల వెలుగుగా గడిపే దరిద్ర నారాయణుల బాధను వర్ణించడం ఎవరికి సాధ్యం? రాళ్లను కరిగించే, ఊళ్లను కాగించే వేసవి తాపోద్ధతి ఈ ఏడాది ఫిబ్రవరి నెల పూర్తి కాకుండానే విజృంభించి, మార్చిలో హద్దు మీరి, ఏప్రిల్ తొలివారం కూడా గడవకుండానే ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఈ ఘడియలలోనే అంతర్జాతీయ వాతావరణ శాస్త్రవేత్తలు పిడుగులాంటి వార్తను మోసుకు వచ్చారు. అనిశ్చితమైన సమాచారంతోనే దేశీయ శాస్త్రవేత్తలు వేసవి తాపం గురించి అంచనాలు వేస్తున్నారు. వాతావరణం గురించి వారు వేస్తున్న అంచ నాలు (జోస్యాలు కావు) ప్రకృతి చిత్రాల మాదిరిగానే తారుమారవుతు న్నాయి. అదొక్కటే కాదు. ఈ ఏడాది జూలైలో మరో ఉపద్రవం ముంచుకు రాబోతోందని శాస్త్రవేత్తలు తాజాగా హెచ్చరిస్తున్నారు. చంద్రుడి మీద కాలు మోపిన తరువాత మానవుడు జాంబవంతుడి అంగలతో రోదసీయాత్రలను, దూర గ్రహయాత్రలను సాగించే యత్నం ఆరంభించాడు. సరికొత్త వైజ్ఞానిక విజయాలతో సూర్యుడి నుంచి నాలుగో గ్రహమైన అంగారకుడి (మార్స్) మీద సాగుకు ఉన్న సానుకూలత ఎంతో ధ్రువపరిచేందుకూ పరిశోధనలు వేగవంతమవుతున్నాయి. ఇలాంటి ప్రయో గాలను (బంగాళదుంపలు పండించడం) ఏండీస్ పర్వత శ్రేణులలో ఏడు వేల ఏళ్ల నాడే జరిగినట్టు మానవుడు నిరూపించాడు. ఈ నేపథ్యంలో మార్స్ మీద ఆ ప్రయోగానికి పునాదులు పడ్డాయి. లీమా (పెరూ) ఊసర క్షేత్రాలలో బొగ్గు పులుసు వాయువు (కార్బన్ డయాక్సైడ్) దట్టంగా పేరుకున్న నేలలో ఈ విజయం సాధ్యమైందని శాస్త్ర వేత్తలు మొన్న మార్చి 29న ప్రకటించారు. అంటే, సుదూర గ్రహరాశుల గురించి సాగిస్తున్న పరిశోధనలలో ఫల వంతమైన ఫలితాలను సాధిస్తున్న తరుణమిది. కానీ వాతావరణానికి సంబం ధించిన అంచనాలు ఇతమిత్థంగా లేకపోవడం మానవాళికి పెద్ద లోటు. వాతావరణ నివేదికలతో తంటా భారత వాతావరణ శాఖ ఇటీవల వెల్లడించిన జోస్యం (అంచనా) గురించి ఇక్కడ చెప్పుకోవాలి. వేసవి తాపం 42 డిగ్రీలకు పెరుగుతుందనీ, తరువాత తగ్గి 40–41 డిగ్రీల మధ్య స్థిరపడుతుందని ఆ శాఖ వెల్లడించింది. నిరుడు ఏప్రిల్ 12వ తేదీ దాకా ౖహె దరాబాద్‌లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తరువాత 43 డిగ్రీలకు చేరింది. అంటే ఐదేళ్ల కాలపరిమితిని తీసుకుంటే వేసవి తాపం ఏటా పెరిగిపోతున్న వాస్తవం అర్థమవుతుంది. నిరుడు ఏప్రిల్ 12కు రెండు రోజుల ముందే రాయలసీమలో సాధారణ ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ తాపశక్తి నమోదు కావచ్చునని ప్రకటించారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వెంటనే వడగాడ్పులు ఉండవని చెప్పింది. ఈ జోస్యమూ వమ్మయింది. రాష్ట్రంలో ఇంకొన్ని చోట్ల 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. హైదరాబాద్‌లో ఎన్నడూ ఎరగని సాధారణ ఉష్ణోగ్రత మొత్తం రాష్ట్రంలోనే 4 డిగ్రీలు అదనంగా నమోదైంది. ఇక ఈ వారంలో (1–4–17 నుంచి) వేసవి తాపం 48 డిగ్రీలకు పెరిగిపోవచ్చునని ప్రైవేట్ ప్రొవైడర్ల అంచనా. అస్థిమితమైన అంచనాల వల్ల గానీ, వాతావరణంలో వేగంగా వచ్చిన మార్పుల వల్లగానీ, తీవ్ర వేసవి తాపం వల్ల గానీ లేదా ఎల్–నినో అనే వాతావరణ వ్యవస్థ ప్రభావంతో గానీ దక్షిణాది రాష్ట్రాలలో జలాశయా లలో నీటి నిల్వలు మార్చి 25 నాటికే 16 శాతానికి పడిపోయాయి. ఇదే రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడులలో ఉన్న 31 జలాశయాల పూర్తి సామర్థ్యం 51.59 శతకోటి ఘనపుటడుగులు. ఆ నీటి నిల్వ ప్రస్తుతం 8 శతకోటి ఘనపుటడుగు లకు తగ్గింది. రైతాంగం కలవరానికి మూలం ఇదే. దేశంలో చాలాచోట్ల ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఉత్తర, మధ్య భారత రాష్ట్రాలు అట్టుడికినట్టు ఉడుకుతున్నాయి. మరణాల సంఖ్య పెరిగిపోతోంది. యూపీ, గుజరాత్, దక్షిణ హరియాణా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లతో పాటు బెంగాల్, మహారాష్ట్రలో కూడా వడగాలులు స్వైర విహారం చేస్తున్నాయి. భగ్గుమంటున్న భాగ్య నగరం తాజాగా వెలువడిన అనేక అంతర్జాతీయ వాతావరణ పరిశోధనలలో నిపు ణులు మరో సత్యాన్ని బయటపెట్టారు. కొలిమిని మరిపిస్తున్న వేసవి వేడి మితో, వడగాడ్పులతో ప్రపంచ వ్యాప్తంగా కకావికలవుతున్న 44 ప్రధాన మండలాలలో ఉన్న నగరాలలో హైదరాబాద్ ఒకటని ఆ పరిశోధనలు (30.3.17) వెల్లడించాయి. శరవేగాన జరుగుతున్న నగరీకరణ, పచ్చని పరి సరాలను అంతే వేగంగా నాశనం చేయడం ఇందుకు కారణమని కూడా అవి స్పష్టం చేశాయి. అంతేకాదు, అమిత ఉష్ణోగ్రతలకు, కరవు కాటకాలకూ దారి తీసే ‘ఎల్–నినో’ అనే వాతావరణ వ్యవస్థ మన నెత్తిన తాండవించే సమ యంలో, తాపాన్ని రెట్టించే వడగాడ్పులకు భారీ సంఖ్యలో జనాలు, ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలు గురి కావచ్చునని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వాతావరణ పరిస్థితుల కారణంగానే 1992– 2015 సంవత్స రాల మధ్య దేశవ్యాప్తంగా 22,562 మంది చనిపోయారని ‘జాతీయ విపత్తుల నివారణ సంస్థ’ నిర్ధారించింది. 2015లో ఒక్క ఆంధ్రా, తెలంగాణల్లో 2,500 మంది వడగాడ్పులకు మరణించారు. ఈ ఏడాది కూడా సగటున దేశ వ్యాప్తంగా 42 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివిధ అంచనాలను బట్టి తెలుస్తోంది. మొత్తం వర్షపాతం కన్నా ఆరు రెట్లు తక్కువ పడుతుందని ఊహిస్తున్నారు. జూలై వర్షపాతాన్ని నిరోధించే దిశగానే ప్రకృ తిలో ‘ఎల్–నినో’ వ్యవస్త కదలవచ్చని శాస్త్రవేత్తల ఆందోళన. ఈసారి తొలకరి వర్షాలు కూడా వాయిదా పడవచ్చునని అంచనా. కరుగుతున్న మంచు, పెరుగుతున్న వేడి ఈ వేసవి వాతావరణంలో ఇంతటి పెను మార్పులకు భూఖండపు ధ్రువ ప్రాంత వాతావరణం పెను మార్పులకు గురికావడమే ప్రధాన కారణం. ఉత్తర, దక్షిణ ధ్రువ ప్రాంత మంచుకొండలు తొలిసారి వేగంగా కరిగి పోతు న్నాయి. 38 సంవత్సరాలుగా ఉపగ్రహాలు సేకరించిన రికార్డుల ప్రకారం అంటార్కిటిక్ ప్రాంతాన్ని దట్టంగా కప్పేసిన సముద్రపు మంచు గుట్టలు కరిగిపోయి కనిష్ట ప్రమాణంలో కనపడీ కనపడనట్టుగా ఉన్నాయనీ, ఈ పరిణామం ఆందోళనకరమనీ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఏనాడూ ఆర్కి టిక్ సముద్రంలో ఇంత కనిష్ట స్థాయిలో మంచుగుట్టలు ఉండటం చూడ లేదని పరిశోధకుల భావన. సాధారణంగా మార్చి నెలలో ఆర్కిటిక్ మంచు కంటికి కానరానంత దట్టంగా అలుముకుని ఉంటుంది. అంటే 1981–2010 నాటికన్నా ఈ ఏడాది ఆర్కిటిక్ సముద్రపు మంచు గుట్టల పరిమాణం వేగంగా (ప్రతి పదేళ్లకు దాదాపు 3 శాతం చొప్పున) తరిగిపోతోందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ దృష్ట్యానే 2017లో వర్షాలు సాధారణ స్థాయికన్నా తగ్గిపోతాయని వాతావరణ పరిశోధ కులు చెబుతున్నారు. అంచనాలలో 5 శాతం మేర జోస్యం తప్పుతుందను కున్నా జూన్–సెప్టెంబర్ వరకు వర్షాలు 95 శాతం (887 మిల్లీమీటర్లు) పడ వచ్చునని ఇప్పటికీ ఉన్న అభిప్రాయం. అదే సమయంలో ఉష్ణోగ్రతలను తీవ్రతరం చేస్తూ దుర్భిక్ష పరిస్థితులకు దారితీసే ‘ఎల్–నినో’ వాతావరణ వ్యవస్థ మాత్రం జూలై నుంచే వర్షాగమనాన్ని అటకాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ‘స్కైమెట్’ అధినేత జతీన్ సింగ్ అంచనా. వర్ష రుతువు ద్వితీయార్థంలో మాత్రం కొంత మేర వర్షపాతానికి అనుకూలంగా ఉండ వచ్చునని కూడా చెబుతున్నారు. మొత్తంమీద ఎల్–నినో తీవ్రత 60 శాతానికి మించే ఉండవచ్చునని శాస్త్ర వేత్తలు నిర్ధారిస్తున్నారు. ఇదే జరిగితే వర్షపాతం గత నాలుగేళ్లలో నామ మాత్రంగానే నమోదు కావటం ఇది మూడవసారి అవుతుందనీ వాతావరణ శాస్త్రవేత్తల అభిప్రాయం. ప్రకృతితో పోరాటమూ పాఠమే ఇలాంటి ఒడిదుడుకులలోనే మానవుడి వైజ్ఞానిక సంపద తమస్సును చీల్చుకుని మనస్సును చిత్రికపట్టి సునిశితం చేసుకుంటుంది. ఇతర ఖండాలలోని శాస్త్రవేత్తలు ప్రకృతి వైపరీత్యాలను గురించి చేసే అన్వేషణతో పోల్చితే నిరం తరం సునామీలను, టార్నాడోలను, టార్పీడోలను చవిచూస్తూ, అపార జన నష్టానికి, ఆస్తి నష్టానికి గురవుతున్న జపాన్ను ఉపద్రవాల నుంచి బయ టపడవేయటానికి చేస్తున్న శాస్త్ర, సాంకేతిక ప్రయోగాలు ఎన్నో రెట్లు ప్రయో జనకరంగా కన్పిస్తున్నాయి. ఉదాహరణకు భీకరమైన ఉప్పెనలు, క్షణాలలో విరుచుకుపడే సునామీల ఉధృతిని, అది కలిగించే నష్టాల్నీ గణనీయంగా నియంత్రించేందుకు జపాన్ నిత్య ప్రయోగాలలో నిమగ్నమై ఉంది. ప్రకృతి విలయ తాండవానికి పరిష్కారంగా, ఇటీవల విద్యుదుత్పా దనకు వనరుల కొరత ఉన్న జపాన్ ఆధారపడిన న్యూక్లియర్ రియాక్టర్ సునామీ దాడివల్ల విధ్వంసానికి గురికాగా, దేశ ఇంధన సమస్య పరిష్కారా నికి సిద్ధమైంది. ఈ పరిష్కారంలో భాగమే అత్యంత ఆధునిక పద్ధతిలో దేశవాళీ సాంకేతిక పరి జ్ఞానాన్ని వినియోగించుకుని సునామీ లాంటి రాక్షస వైపరీత్యాన్ని కూడా తట్టుకుని నిలబడగల ఒక ‘టర్బైన్’ను రూపొందించింది జపాన్. కొన్ని వైజ్ఞానిక సత్యాలను ఏనాడో ఊహించినవాడు శ్రీశ్రీ. ‘‘చంద్రుడి ఎకరాల్లో/చుక్కల విత్తనాలు నాటే/శుభ మహోత్సాహాన్ని చూడ గల’’శ్రీశ్రీ, మానవుడు చంద్ర లోకాధినేత కావడానికి ముందే కొన్ని దశాబ్దాల నాడు ఆ పండుగను కవితా రూపంలో ఆవిష్కరించిన ఆశాజీవి. అంతేకాదు ‘ఉత్తర ధ్రువంలో వ్యవసాయం జరిగి తీరుతుంది’ అన్నవాడూ కవే. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
పాతికేళ్ల రికార్డు.. బద్దలైంది!
ఎండలు మండిపోతున్నాయి.. గత పాతికేళ్లలో ఎప్పుడూ లేనంత స్థాయిలో మండిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో సరిగ్గా 25 ఏళ్ల నాటి ఎండల రికార్డు తాజాగా బద్దలైంది. డెహ్రాడూన్, పంత్నగర్, ఉధమ్‌సింగ్‌నగర్ ప్రాంతాలలో ఎండలు మండిస్తున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం అక్కడ ఎండలు 35-36 డిగ్రీల స్థాయిలో ఉన్నాయి. 1991 మార్చి 31వ తేదీన పంత్‌నగర్‌లో 36.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటివరకు అదే అత్యధికం, అయితే, శుక్రవారం నాడు దాన్ని అధిగమించి 36.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తరాఖండ్ రాజధాని నగరమైన డెహ్రాడూన్‌లో ఉష్ణోగ్రత 35.8 డిగ్రీలకు పెరిగింది. 2001 తర్వాత అక్కడ ఇంత స్థాయిలో ఉష్ణోగ్రత నమోదుకావడం ఇదే మొదటిసారి. సగటు ఉష్ణోగ్రతల కంటే అన్నిచోట్లా 6-8 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదవుతున్నాయని వాతావరణ కేంద్రం డైరెక్టర్ విక్రమ్ సింగ్ తెలిపారు. మరికొన్ని రోజుల పాటు ఎండలు ఇలాగే ఉంటాయని చెప్పారు. ఆ తర్వాత క్రమంగా తగ్గుతాయని, కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా కురుస్తాయని అంటున్నారు. దేశంలో మిగిలిన ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉన్నాయి. ఎండ వేడి ఎక్కువగా ఉంటున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఈ వారం మొదట్లో హెచ్చరిక జారీచేసింది. గుజరాత్లో అయితే ఈ వారం ప్రారంభంలో 40-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
పొంచివున్న వడగాలి పంజా!
► రెండేళ్ల కిందట తెలుగురాష్ట్రాలను గడగడలాడించిన పెను వడగాడ్పు ► 2015 మే చివర్లో ఆంధ్ర, తెలంగాణల్లో 2,500 మంది మృత్యువాత ► భూతాపానికి లింకు.. పదేళ్లలో ఒకసారి పునరావృతమయ్యే ప్రమాదం ► కొంతమేరకైనా కాపాడుతున్న హైదరాబాద్ నగరంపై కాలుష్యం దుప్పటి ► ఆ దుప్పటి తొలగిస్తే ప్రతి రెండేళ్లలో ఓసారి పెను వడగాడ్పుల విజృంభణ ► వడగాడ్పులపై భారత, విదేశీ వాతావరణ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి ► ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సంసిద్ధం కావాలంటున్న పరిశోధకులు సరిగ్గా రెండేళ్ల కిందట.. వేసవి కాలం.. మే నెలలో చివరి వారం.. ఎండలు భగభగమండుతున్నాయి.. ఒక్కసారిగా వడగాడ్సులు ఉధృతమయ్యాయి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో జనం పిట్టల్లా రాలిపోయారు. పదీ ఇరవై వందా అంతకంతకూ పెరుగుతూ పోయింది. ఏకంగా రెండున్నర వేల మంది వడగాలుల దెబ్బకు అసువులుబాశారు. ఈ ప్రాంతంలో ఆస్థాయి వడగాలులు ప్రతి వందేళ్లలో ఒకసారి వస్తాయని అంచనా. కానీ.. భూతాపం పెరగడం కారణంగా ఈ ప్రమాదం ఏకంగా పది రెట్లు పెరిగిపోయిందని వాతావరణ నిపుణుల అంచనా. అంటే.. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పదేళ్లలో ఒకసారి ఆ స్థాయి వడగాడ్పులు వీచే ప్రమాదం పొంచివుంది. ఇంకా చెప్పాలంటే.. హైదరాబాద్ మహానగరం, పరిసరాల మీద నింగిలో దట్టంగా ఆవరించివుండే కాలుష్యం దుప్పటి తొలగిపోతే.. ఆ భీకర వడగాడ్పులు ముప్పు ప్రతి రెండేళ్లకోసారి ముంచుకొస్తుందని నిపుణులు చెప్తున్నారు. మానవ కల్పిత భూతాపంతో లింకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను గడగడలాడించిన 2015 నాటి భీకర వడగాడ్పుల మీద అధ్యయనం చేసిన భారతదేశం, విదేశాలకు చెందిన పలువురు వాతావరణ నిపుణులు మూడు ప్రధాన సూత్రీకరణలకు వచ్చారు. ఆ పరిశోధకుల బృందంలో ఒకరైన యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్ కార్స్టెన్ హాస్టీన్.. ‘ఆ పెను వడగాడ్పులకు మనుషుల వల్ల జరిగిన వాతావరణ మార్పుకు సంబంధం ఉంద’నేందుకు చాలా బలమైన ఆధారాలు కనుగొన్నట్లు చెప్పారు. వాతావరణ ప్రమాదాలపై అవగాహనను పెంపొందించే అంశం మీద ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన ఢిల్లీలో జరిగిన ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ అధ్యయన నివేదికను అమెరికన్ మెటియోరాలాజికల్ సొసైటీ బులెటిన్‌లో ప్రచురణ కోసం సమర్పించారు. కాలుష్య దుప్పటిని తొలగిస్తే మరింత వేడి ‘మున్ముందు ఇప్పటికన్నా మరింత తీవ్రమైన వడగాడ్పులు వచ్చే ప్రమాదం ఉంది. వాటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సంసిద్ధం కావాల్సి ఉంది. అలాగే పారిశ్రామిక కార్యకలాపాలు, రవాణా వాహనాల ద్వారా వాతావరణంలోకి విడుదలయ్యే కాలుష్యాలను శుభ్రం చేసినట్లయితే.. మరింత బలమైన వడగాడ్పులు వస్తాయి. గతంలో ఉత్తర అమెరికా, యూరప్‌లలో ఇదే విధంగా జరిగింది’ అని ఆ సమావేశంలో పరిశోధకులు హెచ్చరించారు. దక్షిణాసియా భూభాగాన్ని ఎక్కువగా కప్పివుంచే కాలుష్యం దుప్పటి.. సూర్యుడి వేడిమిలో కొంతైనా భూ ఉపరితలాన్ని తాకకుండా నిరోధిస్తోంది. అయితే.. దీనర్థం గాలి కాలుష్యం మంచిదని కాదు. గాలి కాలుష్యం ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా డెబ్బై లక్షల మందిని బలితీసుకుంటోంది. వర్షపాతం మీద ప్రతికూల ప్రభావం కూడా చూపుతోంది. ఈ గాలి కాలుష్యాన్ని శుభ్రం చేసే క్రమంలో మరింత అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొనేందుకు ముందుగా సంసిద్ధం కావాలి. ముందుగా పసిగట్టగలిగితే ప్రయోజనం అయితే.. వడగాడ్పులకు భూతాపానికి సంబంధం ఉందని సూత్రప్రాయంగా చెప్పటం సరిపోదని.. ఇటువంటి పెను వడగాడ్పులు ఏ నెలలో రావచ్చు, ఎన్ని రోజులు కొనసాగవచ్చు అనేది ముందస్తుగా అంచనావేయగలిగితే ప్రభుత్వం అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోగలదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విపత్తు నిర్వహణ విభాగ అధికారి నాగేంద్ర కె. బియానీ ఈ సమావేశంలో పేర్కొన్నారు. ఏదేమైనా గానీ వడగాడ్పులను ఎదుర్కోవడానికి తాము ఎప్పుడూ ప్రణాళికలు రచిస్తామని చెప్పారు. కానీ.. ప్రతి ఏటా రెండు తెలుగు రాష్ట్రాల్లో వడగాడ్పుల వల్ల జబ్బుపడుతున్న వారు, మరణిస్తున్న వారి సంఖ్యను చూస్తే.. ఈ ప్రణాళికలు ఏమాత్రం సరిపోవడం లేదన్నది స్పష్టమవుతోంది. అహ్మదాబాద్ వడగాడ్పు కార్యాచరణ ప్రణాళిక మంచి మార్గదర్శకమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అక్కడ 2010లో వడగాడ్పుల మరణాల సంఖ్య 700 గా ఉంటే.. 2015 నాటికి అది 20కి తగ్గిపోయింది. అటువంటి ప్రణాళికనే విజయవాడ కోసం అభివృద్ధి చేసినట్లు బియానీ తెలిపారు. అయితే.. ఈ విషయంలో వివిధ మంత్రిత్వశాఖలు, నగర పాలక సంస్థలోని వివిధ విభాగాల మధ్య చాలా సమన్వయం అవసరమవుతుందన్నారు. హ్యుమిడిటీ పెరిగితే మరింత తీవ్రం గాలిలో తేమ శాతం (హ్యుమిడిటీ) ఎక్కువగా ఉండడం వల్ల వడగాడ్పుల ప్రభావం మరింత తీవ్రమవుతుందని ఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకుడు కృష్ణా అచ్యుతరావు వివరించారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఎట్ బర్కిలీ, లారెన్స్ బర్కిలీ నేషనల్ లేబొరేటరీ పరిశోధకులతో కలిసి తాము నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలినట్లు చెప్పారు. 2015 మే నెలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెను వడగాడ్పుల వెంటనే పాకిస్తాన్‌లోని కరాచీలో కూడా అదే తరహా వడగాడ్పులు విజృంభించాయి. అక్కడ 700 మంది మృత్యువాతపడ్డారు. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో వడగాడ్పుల సమయంలో నమోదైన ఉష్ణోగ్రతల కంటే కరాచీలో వడగాడ్పుల సమయంలో ఉష్ణోగ్రతలు ఐదారు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. అయినా కరాచీలో వడగాడ్పుల తీవ్రతకు ప్రధాన కారణం.. అక్కడ వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండటమే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆ తేమ శాతం 20 శాతంగా ఉంటే.. కరాచీలో 35 శాతం నుంచి 70 శాతం వరకూ నమోదైంది. ఈ తేమశాతం ప్రభావంపై ఉత్తర అమెరికా, యూరప్ దేశాల్లో ప్రత్యేక సూచికలు ఉంటాయి. కానీ అవి దక్షిణాసియా దేశాలకు వర్తించవు. ఈ నేపథ్యంలో దక్షిణాసియాకు వర్తించే విధంగా.. ఉష్ణోగ్రత, హ్యుమిడిటీ తదితర వివరాలతో కూడిన వేడి సూచికలను అభివృద్ధి చేయడానికి పరిశోధకులు కృషి చేస్తున్నారు. ఇటువంటి సూచికలు ప్రభుత్వాలు తగిన ప్రణాళికలు రూపొందించడానికి దోహదం చేస్తాయి. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ (దథర్డ్పోల్.నెట్ సౌజన్యంతో) -
మళ్లీ ఎండాకాలం!
రాష్ట్రంలో మండుతున్న ఎండలు ► సాధారణం కంటే ఐదారు డిగ్రీలు అధికం ► ఎల్‌నినో పోయినా.. లానినా రాని పరిస్థితి ► వర్షాల్లేక విలవిల్లాడుతున్న రైతులు ► ఎండిపోయే దశకు చేరుకుంటున్న పంటలు ► వచ్చే నెలలో వర్షాలు పడే అవకాశం: వాతావరణ శాఖ హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కన్నా ఐదారు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో అనేకచోట్ల ఉక్కపోత వాతావరణం కనిపిస్తోంది. ఖమ్మంలో సాధారణంగా గరిష్ట ఉష్ణోగత్ర 31 డిగ్రీలు ఉండాల్సి ఉండగా, గడిచిన 24 గంటల్లో 37 డిగ్రీలు నమోదైంది. ఏకంగా ఇక్కడ 6 డిగ్రీలు అధికంగా నమోదు కావడం గమనార్హం. హైదరాబాద్‌లో సాధారణం కన్నా 5 డిగ్రీలు ఎక్కువగా 35 డిగ్రీలు నమోదైంది. మెదక్‌లో కూడా సాధారణం కన్నా 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, హకీంపేట్, హన్మకొండ, నల్లగొండ, నిజామాబాద్, రామగుండంలలో 4 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పంటలకు భారీ నష్టం రాష్ట్రంలో పది రోజులకు పైగా చుక్క వర్షం కురవకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. కీలకమైన పూత, కాత దశలో వానలు లేకపోవడం, ఎండలు మండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు ముఖం చాటేయడంతో రాష్ట్రంలో వేసిన 13.90 లక్షల ఎకరాల మొక్కజొన్న పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల వల్ల అన్నింటి కన్నా కూడా మొక్క జొన్న పంటే భారీగా నష్టపోతుందని పేర్కొంటున్నారు. కాగా, 7.36 లక్షల ఎకరాల్లో వేసిన సోయాబీన్ ప్రస్తుతం పూత, కాత దశలో ఉంది. ఇప్పుడు ఈ పంటకు కూడా వర్షం చాలా అవసరం. నల్లరేగడి భూముల్లో పత్తి పంట వేస్తారు కాబట్టి ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదం లేకున్నా.. ఇంకో వారం రోజుల పాటు ఇలాగే ఉంటే పరిస్థితులు దారుణంగా ఉంటాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 3.68 లక్షల ఎకరాల్లో వేసిన పెసర ఎండిపోయే దశకు చేరుకుం టోంది. మరోవైపు పశ్చిమబెంగాల్, గ్యాంగ్‌టక్ వైపు అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం వచ్చే మూడు రోజుల తర్వాత రాష్ట్రంపై ఉంటుంది. కానీ సాధార ణం కన్నా తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. లానినా జాడేదీ? పరస్పర విరుద్ధ చర్యలు కలిగించే ఎల్‌నినో, లానినాలు వాతావరణ పరిస్థితులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అధిక ఎండలకు కారణమయ్యే ఎల్‌నినో ప్రభావం పూర్తిగా తగ్గింది. కానీ అధిక వర్షాలకు కారణమయ్యే లానినా మాత్రం ఇంకా ఏర్పడలేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం ఎల్‌నినో, లానినాల ప్రభావం లేదని రెండింటికి మధ్య తటస్థ స్థితి కొనసాగుతోందని పేర్కొన్నారు. వచ్చే నెలలో లానినా ప్రభావం పెరిగే అవకాశం ఉందని, అప్పుడు సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముందుగా వాతావరణ శాఖ అంచనా ప్రకారం జూన్, జూలై, ఆగస్టు నాటికి ఎల్‌నినో 16 శాతం నుంచి 6 శాతానికి పడిపోవాలి. లానినా 26 శాతం నుంచి 52 శాతానికి చేరుకోవాలి. ఆగస్టు, సెప్టెంబర్ మధ్యలో లానినా 67 శాతానికి, ఎల్‌నినో 4 శాతానికి చేరుకోవాలి. అక్టోబర్ చివరకు లానినా ప్రభావం 71 శాతానికి పెరగాలి. అయితే ఎల్‌నినో ప్రభావం ముగిసినప్పటికీ అనుకున్న ప్రకారం లానినా మాత్రం ప్రవేశించలేదు. -
128 డిగ్రీల జ్వరం వచ్చింది!
ఫలోడి: మామూలుగా 102-103 డిగ్రీల జ్వరం వచ్చిందంటేనే భరించడం కష్టం. అలాంటిది ఏకంగా 128 డిగ్రీల జ్వరం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఔనండీ.. రాజస్థాన్ లోని ఫలోడి ప్రాంతానికి శుక్రవారం 128 ఫారెన్ హీట్ ఎండతో జ్వరం వచ్చినట్లయింది. దీన్ని సెంటీగ్రేడ్లోకి మారిస్తే.. 51 డిగ్రీలు అవుతుంది. ఇప్పటివరకు దేశంలో సంభవించిన అత్యధిక ఉష్ణోగ్రతల రికార్డులను ఇది బద్దలుకొట్టింది. ఎండ దెబ్బతో విలవిలలాడిన రాజస్థాన్ వాసులు... తాగునీటి కోసం తహతహలాడారు. ఇక రోజువారీ కూలి చేసుకుని అరకొర వేతనంతో జీవించే వారయితే ఎండ బాగా ఉన్న సమయంలో అంటే మధ్యాహ్నం ఒకటి నుంచి నలుగున్నర గంటల వరకు విరామ సమయంగా ప్రకటించేశారు. వేసవిలో ఎప్పుడూ రికార్డుస్థాయిలో ఎండలు నమోదవుతాయి కానీ.. ఇంతపెద్ద మొత్తంలో ఎప్పుడూ చూడలేదని స్థానికులు వాపోయారు. -
పాక్‌లో భానుడి ప్రతాపం.. 641మంది మృతి
కరాచీ: మనల్ని మాత్రం ఇప్పటికే చిరుజల్లులు పలుకరించి చల్లటి గాలులు అలుముకుంటుండగా పాకిస్థాన్‌ను మాత్రం వడగాలులు వణికిస్తున్నాయి. రంజాన్ ప్రారంభమైన గత శుక్రవారం నుంచి మంగళవారం వరకు వేడిగాలుల వల్ల 630 మందికిపైగా మృత్యువాతపడ్డారు. ముఖ్యంగా కరాచీ ప్రాంతంలో చనిపోయేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో పలు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని విధించారు. వెంటనే పరిస్థితిని సమీక్షించి చక్కదిద్దాల్సిందిగా అధికారులకు అదేశాలు జారీ చేశారు. దాదాపు కొన్న దశాబ్దాల తర్వాత పాకిస్థాన్‌లో ఇలాంటి పరిస్థితి దాపురించింది. అక్కడ బాణుడు భగభగ మండిపోతుండటంతో జనాలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ప్రభుత్వ ఆరోగ్యశాఖ సమాచారం మేరకు మంగళవారం చనిపోయిన మరోపదిమందితో కలిపి వడగాలుల వల్ల చనిపోయిన వారి సంఖ్య 641కి చేరింది. మితిమీరిన వేడిగాలుల వల్ల వడదెబ్బతగిలి..రక్తపోటు పడిపోతుండటంతో మరణాలు సంభవిస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు. కరాచీలో గత శుక్రవారం నుంచి ఇప్పటివరకు వరుసగా 44 డిగ్రీల నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే వేలమందికి ఆయా ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు అందిస్తున్నారు. -
పాక్ లో వడగాడ్పులు: 140 మంది మృతి
కరాచీ: భారత దేశాన్ని వర్షాలు ముంచెత్తుతుంటే.. మన పొరుగు దేశం పాకిస్తాన్ లో వడగాడ్పులు విజృంభిస్తున్నాయి. ఈ కారణంగా కరాచీలో ఇప్పటి వరకు 140 మందికి పైగా మృతి చెందినట్టు అధికారులు గుర్తించారు. శనివారం నమోదైన ఉష్ణోగ్రతలను గమనిస్తే.. కరాచీ - 44.8 డిగ్రీలు, జకోబాబాద్, లర్కనా, సుక్కుర్ జిల్లాలో 48 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఈ ఏడాదిలోనే నమోదైన అత్యధికం ఉష్ణోగ్రత గణాంకాలు ఇవే. ఆదివారం నాడు 42.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, రానున్న రెండు రోజుల్లో ఎండలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు రంజాన్ మాసం కావడంతో పాకిస్తాన్లో చాలా మంది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వేసవిలో వడగాడ్పుల కారణంగా భారత్‌లో కూడా 1000 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. -
వడదెబ్బతో వృద్ధురాలు మృతి
గుంటూరు: వడదెబ్బతో వృద్ధురాలు మృతి చెందిన సంఘటన గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం చంగిజ్‌ఖాన్‌పేట గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోడా ఝాన్సీ(59) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం కూలికి వెళ్లడానికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా అప్పటికే మృతిచెందింది. -
తగ్గని వడగాలులు
హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో వడగాలుల ప్రభావం ఇంకా తగ్గలేదు. వడగాలుల ప్రభావంతో మధ్యాహ్నం ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారికి చుక్కలు కనపడుతున్నాయి. శుక్రవారం ఉదయం నుండి ఇప్పటి వరకు వడదెబ్బకు ఏపీలో 10 మంది చనిపోగా , తెలంగాణలో 18 మంది చనిపోయారు. చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున చనిపోగా, అనంతపురం ,శ్రీకాకుళం, విజయవాడ, వైఎస్సార్ జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. అలాగే తెలంగాణాలోని కరీంనగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో అత్యధికంగా నలుగురేసి చొప్పున మృతిచెందగా, ఆదిలాబాద్, వరంగల్‌లో ఇద్దరేసి చొప్పున, నిజామాబాద్‌లో ఒకరు, మహబూబ్‌నగర్‌లో మరొకరు వడదెబ్బకు బలయ్యారు. -
తెలుగురాష్ట్రాల్లో భానుడి భగభగలు
-
వడదెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో 35 మంది మృతి
హైదరాబాద్ సిటీ: రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి శుక్రవారం ఒక్కరోజే వడదెబ్బకు 35 మంది ప్రాణాలు విడిచారు. తెలంగాణాలోని ఖమ్మం జిల్లాలో అత్యధికంగా ఏడుగురు మృతిచెందగా, నల్గొండలో ఐదుగురు, ఆదిలాబాద్‌లో ముగ్గురు, వరంగల్‌లో ముగ్గురు, కరీంనగర్లో ఇద్దరు మరణించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో అత్యధికంగా నలుగురు మృతిచెందగా, నెల్లూరు,గుంటూరులో ముగ్గురేసి చొప్పున, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు చొప్పున, అనంతపురంలో ఒకరు వడదెబ్బతో మృతిచెందారు. మొత్తంగా తెలంగాణాలో 19 మంది, ఏపీలో 16 మంది శుక్రవారం వడదెబ్బకు తట్టుకోలేక తనువు చాలించారు. -
వడగాల్పులకు పిట్టల్లా రాలుతున్న జనం
రాజమండ్రి: మండుతున్న ఎండలు, వడగాల్పులతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అల్లడుతున్నారు. వేడి గాలులకు జనం పిట్టల్లా రాలుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం వడదెబ్బకు 25 మంది మృతి చెందారు. వడగాల్పులు తగ్గకపోవడంతో జిల్లా వ్యాప్తంగా రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలో నేడు వడదెబ్బకు 24 మంది మృతి చెందారని జిల్లా కలెక్టర్ అధికారికంగా ప్రకటించారు. రేపు కూడా వడగాల్పులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. విశాఖపట్నం జిల్లాలో ఎండలు మండుతున్నాయి. వడదెబ్బకు మాకవరపాలెం మండలంలో ఇద్దరు, నాతవరం మండలంలో ఒకరు మృతి చెందారు. కైలాసపురం దుర్గానగర్‌లో వడదెబ్బకు పద్మా అనే వికలాంగ యువతి ప్రాణాలు విడిచింది. -
కృష్ణ, తూర్పు గోదావరి జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
-
కృష్ణ, తూర్పు గోదావరి జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ప్రజలు విలవిలల్లాడుతున్నారు. ఉక్కపోత ఒకవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. ఉడికించేలా వేడిగాలులు ఊపిరాడకుండా చేస్తున్నాయి.మూడు రోజులుగా అనూహ్యంగా వాతావరణంలో మార్పులతో బెంబేలెత్తిపోతున్నారు. రోడ్ల మీదకు రావాలంటే భయపడుతున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. విపరీతమైన వడగాలులు, ఉక్కపోతతో తూర్పు గోదావరి జిల్లాలో 13మంది, విశాఖలో 8మంది మృతి చెందారు. వడగాల్పులు, పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో విశాఖ జిల్లాలో పాఠశాలను ఒక్కపూటే నడపాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో శుక్రవారం, శనివారం పాఠశాలలకు విద్యాశాఖ అధికారులు జిల్లా కలెక్టర్ల ఆదేశాలతో సెలవు ప్రకటించారు. -
నగరం భగభగ
ఇప్పట్లో వానలు లేనట్టేనంటున్న వాతావరణ శాఖ ఎండ ... ఈ పేరు వింటేనే నగరవాసుల గుండె దడదడలాడుతోంది. నగరంలో శుక్రవారం ఏకంగా 47.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఉదయం నుంచే వడగాలులు వీచాయి. దీంతో ఇంటి నుంచి బయటికొచ్చినవారి బాధలు వర్ణనాతీతంగా మారాయి. మరోవైపు విద్యుత్ సరఫరాలో కోత కారణంగా ఇళ్లకే పరిమితమైన వారు సైతం ఉక్కపోతతో విలవిలలాడారు. సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని నగరం అగ్ని గుండాన్ని తలపిస్తోంది. ఉత్తర భారత్‌లో కొనసాగుతోన్న హీట్ వేవ్ ప్రభావంతో శుక్రవారం పాలం ప్రాంతంలో 47.2 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పశ్చిమ రాజస్థాన్ నుంచి వీస్తున్న వేడిగాలుల కారణంగా రాజధానిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయంటున్నారు. ఈ ఉష్ణతాపం మరికొన్ని రోజులపాటు కొనసాగవచ్చని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు. మరో వారంరోజులపాటు ఉష్ణోగ్రతలు తీవ్రంగానే ఉంటాయని వాతావరణ విభాగం అంటోంది. వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ చురుగ్గా లేనందువల్ల నగరంలో ఇప్పట్ల్లో వానపడే అవకాశం లేదని చెబుతోంది. శుక్రవారం కనీస ఉష్ణోగ్రత కూడా 30 డిగ్రీల సెల్సియస్‌కు పైనే ఉంది. తఉదయం నుంచే ఢిల్లీ ఎన్సీఆర్లో వేడిగాలులు, ఎండ తీవ్రరూపం దాల్చాయి. దీంతో ఇళ్ల నుంచి బయటపడినవారు భానుడి తీవ్రత నుంచి తప్పించుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. పాదచారులు, బస్సులతోపాటు ద్విచక్రవాహనాలపై ప్రయాణించేవారు ఎం డ ధాటికి విలవిలలాడారు. పాదచారులు గొడుగుల కింద నడుస్తూ, ముఖానికి స్కార్ఫ్ చుట్టుకుని నడుస్తూ దర్శనమిచ్చారు. ఎండ తీవ్రత తమను బాగా ఇబ్బందులకు గురిచేస్తున్నప్పటికీ తమ వ్యాపారం బాగా జరుగుతోందంటూ రహదారుల వెంబడి తాగునీరు, బేల్ షర్బత్, లస్సీ, ఐస్‌క్రీం, శీతల పానీయాల విక్రేతలు ఆనందం వ్యక్తం చేశా రు. ఎండ తీవ్రత కారణంగా మధ్యాహ్నం మార్కె ట్లు బోసిపోయి కనిపించాయి. ఎండవేడి తట్టుకోలేక షాపర్లు మార్కెట్లకు రావడానికి బదులు మాల్స్‌కు వెళ్లడానికి ఇష్టపడుతున్నారని దుకాణదారులు చెప్పారు. వారాంతంలో కూడా ఎండ తీవ్రత ఇలాగే కొనసాగితే సరుకు అలాగే మిగిలిపోతుందని సరోజినీనగర్ మార్కెట్ సమీపంలో రోడ్డుపక్కన దుస్తులు విక్రయించే ఓ వ్యాపారి చెప్పాడు. ఒకవైపు ఎండ తీవ్రత, మరోవైపు విద్యుత్ సరఫరాలో కోతతో నగరవాసులు నానాయాతనలకు గురయ్యారు. -
శాన్‌డియాగో చెలరేగిన మంటలు
శాన్‌డియాగో: అమెరికాలోని శాన్‌డియాగో ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగడంతో దాదాపు 20 వేల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శాంతా బార్బరా కౌంటీకి 400 కిలోమీటర్ల దూరంలో సైతం మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. అక్కడి నుంచి 1200 కుటుంబాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ రెండు ప్రాంతాల్లోనూ మంగళవారం కార్చిచ్చు చెలరేగింది. అయితే, రెండు ప్రాంతాల్లోనూ చీకటిపడే వేళకు మంటలు చల్లారడంతో సురక్షిత ప్రాంతాల్లో ఉన్నవారు తమ తమ ఇళ్లకు వెళ్లవచ్చని అధికారులు సూచించారు. మంటల కారణంగా ఇళ్లకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఎవరూ గాయపడలేదు. ఈ సీజన్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి ఉండటంతో మంటలను చల్లార్చేందుకు అగ్నిమాపక సిబ్బంది కొంత ప్రయాసపడ్డారు. మంటలను అదుపు చేయడానికి హెలీకాప్టర్ల ద్వారా నీటిని పోశారు. శాన్‌డియాగో సమీపంలోని రాంకో బెర్నార్డో అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు శరవేగంగా 280 హెక్టార్ల మేరకు విస్తరించాయి. మంటలు ఇళ్ల వరకు రావడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడి వారిని హుటాహుటిన తరలించి, మంటలను అదుపు చేశారు. కొంత ప్రయాసపడ్డా, సాయంత్రంలోగా మంటలను సమర్థంగానే అదుపు చేయగలిగామని శాన్‌డియాగో అగ్నిమాపక విభాగాధిపతి జేవియర్ మయినార్ చెప్పారు. -
ప్రచారంలో సొమ్మసిల్లి పడిపోయిన రోజా
చిత్తూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే అభ్యర్థి రోజా వడదెబ్బ తగిలింది. శుక్రవారం ఏకాంబరకుప్పంలో ఎన్నికల ప్రచారం చేస్తూ సొమ్మసిల్లి పడిపోయారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో రోజా అస్వస్థతకు గురయ్యారు. ప్రచారంలోనే సొమ్మసిల్లిపోవటంతో రోజాను హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. ఆమెకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు.