నేడూ వడగాడ్పులు
సాక్షి, హైదరాబాద్: వడగాడ్పులతో రాష్ట్రం మండిపోతోంది. గురువారం కూడా వడగాడ్పులుంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరోవైపు కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశముందని తెలిపింది.
ఇక శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని సమాచారం. ఇదిలావుండగా బుధవారం నల్లగొండలో అత్యధికంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, రామగుండంలలో 44, ఖమ్మంలో 42, ఆదిలాబాద్‌లో 41, మెదక్‌లో 40, హైదరాబాద్‌లో 39, మహబూబ్‌నగర్, హకీంపేట, నిజామాబాద్‌లలో 38 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.