రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి శుక్రవారం ఒక్కరోజే వడదెబ్బకు 35 మంది ప్రాణాలు విడిచారు.
హైదరాబాద్ సిటీ: రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి శుక్రవారం ఒక్కరోజే వడదెబ్బకు 35 మంది ప్రాణాలు విడిచారు. తెలంగాణాలోని ఖమ్మం జిల్లాలో అత్యధికంగా ఏడుగురు మృతిచెందగా, నల్గొండలో ఐదుగురు, ఆదిలాబాద్‌లో ముగ్గురు, వరంగల్‌లో ముగ్గురు, కరీంనగర్‌లో ఇద్దరు మరణించారు.
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో అత్యధికంగా నలుగురు మృతిచెందగా, నెల్లూరు,గుంటూరులో ముగ్గురేసి చొప్పున, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు చొప్పున, అనంతపురంలో ఒకరు వడదెబ్బతో మృతిచెందారు. మొత్తంగా తెలంగాణాలో 19 మంది, ఏపీలో 16 మంది శుక్రవారం వడదెబ్బకు తట్టుకోలేక తనువు చాలించారు.