అమెరికాలో దంచికొడుతున్న ఎండలు.. రికార్డు స్థాయిలో హీట్‌ వేవ్‌ | Heat Wave Continues In Eastern California And Many Cities, More Information Inside | Sakshi
Sakshi News home page

అమెరికాలో దంచికొడుతున్న ఎండలు.. రికార్డు స్థాయిలో హీట్‌ వేవ్‌

Published Fri, Jul 5 2024 7:25 AM | Last Updated on Fri, Jul 5 2024 9:38 AM

Heat Wave Continues In Eastern California And Many Cities

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో ఎండలు దంచికొడుతున్నాయి. హీట్‌ వేవ్‌ కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. తీవ్రమైన వేడి కారణంగా పలుచోట్ల ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మరోవైపు కాలిఫోర్నియాలోని డెత్‌ వ్యాలీలో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

వివరాల ప్రకారం.. అమెరికాలోకి పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత పెరిగింది. హీట్‌ వేవ్‌ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శాన్‌ఫ్రాన్‌సిస్కో, లాస్‌ ఏంజిల్స్‌, కాలిఫోర్నియా సహా పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత బాగా పెరిగింది. దీంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు.. వాహనదారుల కోసం రహదారులపై హీట్‌ వేవ్‌ హెచ్చరికలను జారీ చేస్తున్నారు అధికారులు.

ఇక, కాలిఫోర్నియాలోని డెత్‌ వ్యాలీలో నిన్న(గురువారం) 123 డిగ్రీ(ఫారన్‌హీట్‌) ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు అధికారులు చెబుతున్నారు. హీట్‌ వేవ్‌ ఇలాగే కొనసాగితే మరో 4-5 రోజుల్లో రికార్డు స్థాయిలో 130 డిగ్రీల(ఫారన్‌హీట్‌) ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. టెక్సాస్‌ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement