ఇది కదా లాటరీ అంటే.. ఏకంగా రూ.10 వేలకోట్లు | Indian-American Owned Store Sells $1.22 Billion Lottery Ticket | Sakshi
Sakshi News home page

లాటరీ చరిత్రలో అతిపెద్ద జాక్‌పాట్‌: ఏకంగా రూ.10 వేలకోట్లు

Published Fri, Jan 3 2025 1:33 PM | Last Updated on Fri, Jan 3 2025 2:57 PM

Indian-American Owned Store Sells $1.22 Billion Lottery Ticket

లాటరీలలో భారీ మొత్తాలను గెలుచుకున్న వారి గురించి గతంలో చాలా కథనాల్లో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన సంఘటనలో కాలిఫోర్నియాలోని ఓ చిన్న కుటుంబం ఏకంగా రూ. 10వేలకోట్ల లాటరీ టికెట్ (Lottery Tickets) విక్రయించింది.

కాలిఫోర్నియా (California)లోని కాటన్‌వుడ్‌లో ఒక చిన్న కుటుంబం ఓ చిన్న స్టోర్ నడుపుతోంది. ఆ కుటుంబం ఇటీవల 1.22 బిలియన్ డాలర్ల విలువైన లాటరీ టికెట్ విక్రయించి వార్తల్లో నిలిచింది. ఇది లాటరీ చరిత్రలోని అతిపెద్ద జాక్‌పాట్‌లలో ఒకటిగా నిలవడంతో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్‌టాపిక్‌గా మారింది.

ఈ లాటరీ ఎవరు గెలిచారు అనేదానికి సంబంధించిన వివరాలు.. టికెట్స్ విక్రయదారులు వెల్లడించలేదు. కానీ కాటన్‌వుడ్‌ సిటీలోని రోండారోడ్‌లోని సర్కిల్‌ కే(సన్‌షైన్‌ ఫుడ్‌ అండ్‌ గ్యాస్‌)స్టోర్‌లో ఈ టికెట్‌ను కొనుగోలు చేశారని సమాచారం. దీనిని జస్పాల్ సింగ్.. అతని కుమారుడు ఇషార్ గిల్ నిర్వహిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా కాటన్‌వుడ్ సంఘంలో భాగమైన సింగ్ కుటుంబం రూ.10 వేలకోట్ల లాటరీ టికెట్ విక్రయించినందుకు 1 మిలియన్ రిటైలర్ బోనస్ అందుతుందని కాలిఫోర్నియా లాటరీ ధృవీకరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement