కృష్ణ, తూర్పు గోదావరి జిల్లాల్లో స్కూళ్లకు సెలవు | Heat wave in coastal Andhra districts: Schools to be closed two days | Sakshi
Sakshi News home page

కృష్ణ, తూర్పు గోదావరి జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

Published Fri, Jun 13 2014 10:18 AM | Last Updated on Sat, Sep 15 2018 5:49 PM

కృష్ణ, తూర్పు గోదావరి జిల్లాల్లో  స్కూళ్లకు సెలవు - Sakshi

కృష్ణ, తూర్పు గోదావరి జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ప్రజలు విలవిలల్లాడుతున్నారు. ఉక్కపోత ఒకవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. ఉడికించేలా వేడిగాలులు ఊపిరాడకుండా చేస్తున్నాయి.మూడు రోజులుగా అనూహ్యంగా వాతావరణంలో మార్పులతో బెంబేలెత్తిపోతున్నారు. రోడ్ల మీదకు రావాలంటే భయపడుతున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి.

విపరీతమైన వడగాలులు, ఉక్కపోతతో తూర్పు గోదావరి జిల్లాలో 13మంది, విశాఖలో 8మంది మృతి చెందారు. వడగాల్పులు, పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో విశాఖ జిల్లాలో పాఠశాలను ఒక్కపూటే నడపాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో శుక్రవారం, శనివారం పాఠశాలలకు విద్యాశాఖ అధికారులు జిల్లా కలెక్టర్ల ఆదేశాలతో సెలవు ప్రకటించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement