Temperature
-
ఎండలు ముదిరే.. గొడుగులు అదిరే..
హైదరాబాద్: రోజురోజుకూ ఎండలు ముదురుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈసారి వేసవి కాస్త ముందుగానే వచ్చినట్టు ఎండల తీవ్రతను చూస్తే తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం గొడుగుల నీడలో వెళ్తున్న యువతుల చిత్రం ఎన్టీఆర్ మార్గ్‌లో కనిపించింది. -
అమ్మో.. ఇవేం ఎండలు
బనశంకరి: రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా 2024 ఎండాకాలంలో వేడిమి నమోదైంది. ఏప్రిల్, మే మాసాల్లో రాష్ట్రంలో సరాసరి ఉష్ణోగ్రత కంటే 3–4 సెల్సియస్ డిగ్రీలు పెరిగి ప్రజలు అల్లాడిపోయారు. గత ఐదేళ్లలో ఉష్ణోగ్రతలను గమనిస్తే ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే మాసాలలో, అలాగే అక్టోబరులో ఎండలు ఎక్కువని తేలింది. కళ్యాణ కర్ణాటక, కిత్తూరు కర్ణాటక ప్రాంతాల్లో కనబడుతున్న అధిక ఎండలతో అక్కడి ప్రజలు హైరానా పడుతున్నారు. బెళగావి, బాగల్‌కోటే, ధారవాడ, హావేరి, ఉత్తర కన్నడ ప్రాంతాల్లో సరాసరి ఉష్ణోగ్రత 3– 4 డిగ్రీలు సెల్సియస్ పెరిగింది. దీంతో రాబోయే వేసవిని తలచుకుని భయపడాల్సి వస్తోంది.ఈ జిల్లాల్లో హడల్బాగల్కోటే, బెళగావి, బీదర్, ధారవాడ, గదగ, కొప్పళ, హావేరి, హాసన్, కలబుర్గి, ఉత్తర కన్నడ, కొడగు, మంగళూరు, రాయచూరు, విజయపుర జిల్లాల్లో గత అక్టోబరులో 30 డిగ్రీలు సెల్సియస్ కంటే ఎక్కువ తాపమానం ఏర్పడింది. బెంగళూరులో 29 డిగ్రీలు సెల్సియస్ నమోదైంది. వర్షంతో పాటు వేడి కూడా పెరిగింది. అక్టోబరులో ఇంత వేడి రావడం వాతావరణ నిపుణులను కూడా విస్మయపరచింది. ఇక బెంగళూరులో వేసవిలో అనేక ప్రాంతాల్లో చుక్క నీటికి కటకటలాడారు.అక్టోబరులో ఎందుకలా?సెప్టెంబరులో వర్షం పడకపోతే నేలలో తేమ తగ్గిపోయి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని బెంగళూరు కేంద్ర వాతావరణశాఖ డైరెక్టర్ సీఎస్ పాటిల్ తెలిపారు. ఎల్‌నినో, లానినో ప్రభావాల వల్ల అధిక ఎండలు, ఆకస్మిక వరదలు సంభవిస్తున్నట్లు చెప్పారు. వాతావరణానికి అనుగుణంగా ఈ ఏడాది వానలు కురవలేదని, అనూహ్యంగా అక్టోబరులో ఉష్ణోగ్రతలు పెరిగాయని ధార్వాడ అగ్రి యూనివర్శిటీ వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ రవిపాటిల్ తెలిపారు. -
ఛత్తీస్‌గఢ్‌లో చలి విజృంభణ
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌ను చలిపులి చంపేస్తోంది. నవంబర్ రెండో వారం నాటికే ఇక్కడి వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని సూరజ్‌పూర్, సుర్గుజా, మార్వాహి, కోర్బా, ముంగేలి, బిలాస్పూర్, రాజ్‌నంద్‌గావ్, బలోద్, కంకేర్, నారాయణపూర్, బీజాపూర్, బస్తర్, దంతెవాడ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఈ జిల్లాల్లో చలి తీవ్రంగా ఉంది.రానున్న మూడు రోజుల్లో ఛత్తీస్‌గఢ్‌లో కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు వచ్చే అవకాశం లేదని వాతావరణ నిపుణుడు హెచ్‌పీ చంద్ర తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాజధాని రాయ్‌పూర్‌లో ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ , కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంది.గత 24 గంటల్లో పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటుచేసుకోనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సూరజ్‌పూర్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 28.8 డిగ్రీలు, బలరామ్‌పూర్ రామానుజ్గంజ్లో 29.4 డిగ్రీలు, సర్గుజాలో 28.9 డిగ్రీలు, జష్పూర్లో 29.9 డిగ్రీలు, కొరియాలో 29.4 డిగ్రీలు, మర్వాహిలో 28.9 డిగ్రీలు, కోర్బాలో 30.3 డిగ్రీలు, ముంగేలిలో 3.4 డిగ్రీలు, 3.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.అదే సమయంలో, రాజ్‌నంద్‌గావ్‌లో 30.5 డిగ్రీలు, బలోద్‌లో 31.7 డిగ్రీలు, కంకేర్‌లో 30.7 డిగ్రీలు, నారాయణపూర్‌లో 29.4 డిగ్రీలు, బస్తర్‌లో 30.3 డిగ్రీలు, బీజాపూర్‌లో 30.9 డిగ్రీలు, దంతవాడలో 32 డిగ్రీల సెల్సియస్‌గా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజధాని రాయ్‌పూర్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 32.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.ఇది కూడా చదవండి: National Education Day: ఉన్నత విద్యకు ఊపిరి పోసి.. -
అలర్ట్: యూపీలో భారీవర్షాలు.. ఉత్తరాఖండ్‌కు కొండచరియల ముప్పు
దేశంలోని పలుప్రాంతాల్లో రుతుపవనాలు జోరందుకున్నాయి. అయితే ఢిల్లీలోకి రుతుపవనాలు ప్రవేశించి, 20 రోజులకు పైగా సమయం గడిచినా గత కొద్ది రోజులుగా ఇక్కడ భారీ వర్షాలు లేవు. ఊహించని విధంగా ఎండలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ఇక్కడికి పక్కనే ఉన్న తూర్పు యూపీలో ప్రతిరోజూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశవ్యాప్తంగా వాతావరణం ఎలా ఉండబోతున్నదనేది ఇప్పుడు తెలుసుకుందాం.ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు (శనివారం) చినుకులు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ ప్రకటించింది. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా ఉండవచ్చు. శుక్రవారం నాటి ఉష్ణోగ్రత కంటే ఈరోజు రాజధానిలో ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదుకానున్నదని వాతావరణశాఖ అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్‌లో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. తూర్పు, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ఈరోజు కూడా వర్షం పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఉత్తరాఖండ్‌లో రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ వారాంతంలోగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతోపాటు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే నాలుగైదు రోజుల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా గుజరాత్‌లోని పోర్బందర్ ప్రాంతమంతా జలమయమైంది. జూలై 22 వరకు గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. -
అటు వర్షాలు..ఇటు వడగాడ్పులు!
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ పక్క మోస్తరు వర్షాలు కురుస్తుండగా, మరోపక్క వడగాడ్పులూ వీస్తున్నాయి. జూన్ మొదటి వారం వరకు దడ పుట్టించిన వడగాడ్పులు ఆ తర్వాత నైరుతి రుతుపవనాల ఆగమనంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పగటి ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు గణనీయంగా తగ్గాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ ఊపందుకొని, వడగాడ్పులు వీస్తున్నాయి. వాస్తవానికి నైరుతి రుతుపవనాలు ఆరంభంలో ఆశాజనకంగానే ప్రభావం చూపాయి.గత వారంలో ఉత్తరాంధ్రకు విస్తరించాయి. అప్పట్నుంచి ముందుకు కదలకుండా స్తబ్దుగా ఉండిపోయాయి. దీంతో వర్షాలు అరకొరగానే కురుస్తున్నాయి. ఎక్కడైనా కొన్ని చోట్ల మినహా అనేక చోట్ల తేలికపాటి జల్లులు పడుతున్నాయి. ప్రస్తుతం కోస్తాంధ్రపైకి పశ్చిమ గాలులు వీస్తుండడం, కోస్తా వైపు రుతుపవనాలు విస్తరించకపోవడం వంటి కారణాల వల్ల మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగి వడగాడ్పులకు దోహద పడుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.ప్రస్తుతం కోస్తాంధ్రలో కొన్నిచోట్ల సాధారణంకంటే 4 నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న ఒకట్రెండు రోజులు ఇదే వాతావరణం కొనసాగుతుందని, ఫలితంగా పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో వడగాడ్పులకు ఆస్కారం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం ఒక నివేదికలో వెల్లడించింది. విశాఖపట్నం జిల్లాలోనూ వడగాడ్పుల అనుభూతి కలుగుతుందని పేర్కొంది.నేడు, రేపు తేలికపాటి వర్షాలు..వచ్చే 4 రోజుల్లో నైరుతి రుతుపవనాల్లో కదలిక వచ్చి, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బెంగాల్, బీహార్, కోస్తాంధ్ర అంతటా విస్తరించేందుకు అనువైన పరిస్థితులు నెలకొన్నాయి. మరోపక్క గోవా నుండి దక్షిణ కోస్తాంధ్ర వరకు ఉన్న ద్రోణి సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్లు, 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉంది. వీటన్నంటి ప్రభావంతో రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకా>శం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.అదే సమయంలో పలు ప్రాంతాల్లో వడ గాలులు కూడా వీస్తాయని తెలిపింది. మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నంద్యాల, తిరుపతి, విజయనగరం, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోను, బుధవారం అల్లూరి, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, పార్వతీపురం మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కర్నూలు, శ్రీసత్యసాయి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.మరోవైపు గంటకు 40 – 50 కిలోమీటర్ల వేగంతో ఈదరు గాలులు వీస్తాయని, అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని ఐఎండీ హెచ్చరించింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు చిత్తమూరు (తిరుపతి)లో 4.2 సెంటీమీటర్లు, నెమలికళ్లు (పల్నాడు)లో 3.9, మంగళగిరి (గుంటూరు)లో 3.5, ఎస్.కోట (విజయనగరం)లో 3.5, నగరి (చిత్తూరు)లో 2.1 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. -
ఢిల్లీలో అధిక ఉష్ణోగ్రత.. విమానంలో సాంకేతిక లోపం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఢిల్లీ నుంచి బెంగాల్‌లోని బాగ్డోగ్రా వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.దీంతో విమానం బయలుదేరడం రెండు గంటలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏసీ పనిచేయకపోవడంతో విమానంలో గాలి లేక కొందరు అస్వస్థతకు గురయ్యారు. విమానం డోర్ మూసివేయడంతో వేడి తీవ్రత ఎక్కువైంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై స్పందించిన ఇండిగో సంస్థ వివరణ ఇచ్చింది. ‘ప్రయాణికుల భద్రతకు ఇండిగో ప్రాధాన్యతనిస్తుంది. ఈ ఘటనపై చర్యలు తీసుకుంటున్నాం. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం’అని తెలిపింది. -
ఢిల్లీలో 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు
ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో వేడి వాతావరణం కొనసాగుతోంది. వేడి గాలులు వీస్తున్నాయి. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లలోని పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.రానున్న రోజుల్లో ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరిక జారీ చేసింది. ఈ పరిస్థితుల దృష్ట్యా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాజధాని ఢిల్లీలో సోమవారం ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్‌ను దాటింది. ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో 46.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. నజాఫ్‌గఢ్‌లో ఉష్ణోగ్రత 46.3 డిగ్రీలకు చేరుకుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల మధ్య, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వరుసగా రెండవ రోజు కూడా వేడిగాలులు వీస్తున్నాయి.రానున్న రోజుల్లో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని, పగటిపూట ఢిల్లీ-ఎన్సీఆర్లో గంటకు 25 నుండి 35 కిలోమీటర్ల వేగంతో వేడి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రుతుపవనాలు దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. కేరళ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ రుతుపవనాల ప్రభావం ఇతర రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లాలో తేలికపాటి వర్షం కురిసింది. దీంతో ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. -
‘సీజన్’ ముంచుకొస్తోంది
సాక్షి, హైదరాబాద్: వానాకాలం అంటేనే సీజనల్ వ్యాధుల ముప్పు ఉంటుంది. అధికారులకు ముందస్తు ప్రణాళిక లేకుంటే జనంపై వ్యాధులు పంజా విసురుతాయి. మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, గ్రామాల్లో వ్యాధులు ప్రబలిపోతాయి. డెంగీ, మలేరియా, చికున్‌గున్యా సహా ఇతరత్రా వ్యాధులు సోకుతాయి. అయితే ఇప్పటివరకు ఆ వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించలేదు. ప్రధానంగా దోమలతో వచ్చే వ్యాధులతో జనం సతమతమవుతారు. నీటి వల్ల వచ్చే రోగాలతో ఆస్పత్రుల్లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడతుంది. కానీ వ్యాధుల నివారణకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక అమలుకు ప్రభుత్వం సన్నద్ధం కాలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. జ్వరాలు సర్వసాధారణం... సీజన్ మారిందంటే జ్వరాలు సర్వసాధారణం అవుతాయి. ఒక్కోసారి పరిస్థితి అదుపు తప్పుతుంది. మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రబలితే పరిస్థితి మన నియంత్రణలో ఉండదు. దీనికి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికే కాదు. అందుకు అవసరమైన అమలు కూడా ఉండాలి. ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించాలి. అన్నిచోట్లా మందులు అందుబాటులో ఉంచాలి. జ్వరం క్లినిక్‌లను తీసుకురావాలి. సాయంత్రం కూడా క్లినిక్‌లు తెరవాలి.మలేరియా, డెంగీ నియంత్రణకు టెస్టింగ్ కిట్లు ఆస్పత్రులకు పంపాలి. డెంగీ వంటి జ్వరాల్లో ప్లేట్లెట్లు పడిపోతే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్లేట్లెట్లు అందుబాటులో లేకుంటే పేదలు ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ప్లేట్లెట్లు ఎక్కించేందుకు ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడీకి పాల్పడతాయి. రూ.50 వేల నుంచి రూ. లక్షకు పైగా వసూలు చేస్తాయి. ఇలాంటి పరిస్థితులను నియంత్రించాలంటే అన్ని రకాల చర్యలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేయాల్సి ఉంటుంది. అయితే ఆ శాఖ మంత్రి సమీక్షలకే పరిమితం కాగా, వైద్య విద్య సంచాలకులు, వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని ఆస్పత్రుల పనితీరుపై ఎలాంటి సమీక్షలూ జరపలేదు. అధికారులూ అంతే... అధికారుల తీరుపై విమర్శలు ఉన్నాయి. ఆస్పత్రుల తనిఖీలు లేవు. వైద్యవిధాన పరిషత్ కమిషనర్, ప్రజారోగ్య సంచాలకులు సహా రాష్ట్రస్థాయిలో ఉన్న అధికారులు బయట కాలుపెట్టడంలేదన్న విమర్శలున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో అనేక ఆస్పత్రుల్లో కొందరు సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్న డాక్టర్లు, నర్సులు చాలా మంది వెళ్లడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఉంటూ కొందరు కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్నారు. బయోమెట్రిక్ ఉన్నా వాటి కన్నుగప్పి తప్పించుకుంటున్నారన్న విమర్శలున్నాయి. వాతావరణ మార్పులతో వ్యాధుల ముప్పుజాగ్రత్తలు సూచించిన ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ బి.రవీందర్ నాయక్సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు పడుతుండటంతో ఉ ష్ణోగ్రతల తగ్గుదల, గాలిలో తేమ వంటి వాతావరణ మా ర్పుల వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని, అలాగే దోమలు, ఆహారం, నీటి ద్వారా వ్యాధుల వ్యాప్తి పొంచి ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పబ్లిక్ హెల్త్, ఫ్యా మిలీ వెల్పేర్ విభాగం డైరెక్టర్ డాక్టర్ బి.రవీందర్ నాయక్ అ న్నారు. దోమల బెడద కారణంగా మలేరియా, డెంగీ, చికు న్‌గున్యా వంటి వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవా లని సూచించారు.వర్షాకాలం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కిటికీలకు దోమ తెరలు/ స్క్రీన్లు పెట్టుకోవాలని, దోమల సంతానోత్పత్తి సమయాలైన ఉదయం, సాయంత్రం తలుపులు, కిటికీలు మూసి ఉంచాలని సూచించారు. దోమలు కుట్టకుండా క్రీములు, లోషన్లు వంటివి రాసుకోవాలని తెలిపారు. మురుగు కాల్వల్లో నీళ్లు నిలిచిపోకుండా చూడాలని, సెప్టిక్ ట్యాంకులను మెష్‌లతో కవర్ చేయాలని పేర్కొన్నారు. ప్రతీ శుక్రవారం ఇంటి చుట్టూ నీళ్లు నిలిచిపోకుండా డ్రైడే నిర్వహించాలని, కాచి వాడబోసిన నీళ్లు, బయట ఉన్నపుడు బాటిల్డ్ వాటర్ తీసుకోవాలని తెలిపారు. -
నిప్పుల కుంపటిలా తెలంగాణ
-
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న ఎండలు..విలవిలాడుతున్న జనం (ఫొటోలు)
-
మండిపోయిన ఢిల్లీ.. దేశ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రత
సాక్షి,ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ఢిల్లీ వాసులకు హీట్‌వేవ్ సెగ తలుగుతోంది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో రాజధాని వాసులు బెంబేలెత్తుతున్నారు.భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీ మంగేశ్‌పూర్ బుధవారం (మే29) మధ్యాహ్నం 2.30 గంటలకు రికార్డు స్థాయిలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశచరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. మరోపక్క ఎండ వేడిమి తట్టుకోలేక ఉపశమనం కోసం ఢిల్లీ వాసులు కూలర్లు, ఏసీలు రికార్డుస్థాయిలో వినియోగిస్తున్నారు. దీంతో ఢిల్లీలో ఎప్పుడూ లేనంతగా విద్యుత్ వినియోగం 8302 మెగావాట్లకు చేరింది. ఢిల్లీతో పాటు రాజస్థాన్‌లోనూ 50 డిగ్రీల ఉష్ణోగ్రత రియల్ ఫీల్ పరిస్థితులు నెలకొన్నాయి.అంతలోనే వర్షం...ఓ పక్క దేశచరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన కొద్ది సేపటికే ఢిల్లీలో అకస్మాత్తుగా వర్షం పడింది. అరేబియా సముద్రంలో అల్పపీడనం, పశ్చిమ దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొద్దిసేపు ఢిల్లీలో చిరు జల్లులు కురిశాయి. -
16కు తగ్గదు.. 30కి పెరగదు.. ఏసీతో ఎందుకలా?
ఎండ వేడిమికి దేశంలోని పలు ప్రాంతాల్లోని జనం ఉక్కపోతతో చెమటలు చిందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏసీలు, కూలర్లు జనానికి ఉపశమనం కల్పిస్తున్నాయి. అయితే బయటి ఉష్ణోగ్రత 45 డిగ్రీలు లేదా దానికిమించినప్పుడు ఏసీలు, కూలర్లు అందించే చల్లదనం ఎవరికీ ఏమాత్రం సరిపోవడం లేదు.ఎయిర్ కండీషనర్లో 16 డిగ్రీల కంటే తక్కువ, 30 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలను సెట్ చేయలేం. ఏసీలోని కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా, ఒకే మాదిరిగా ఉంటాయి. అయితే దీనికి కారణం ఏంటి?ఏసీ రిమోట్లో ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉండదనే సంగతి మనకు తెలిసిందే. ఏ బ్రాండ్ ఏసీలోనైనా కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల కంటే తక్కువకు ఉండదు. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది ఏసీ మరమ్మతుకు గురికావడం. రెండోది వినియోగదారుల ఆరోగ్యానికి హానికరంగా పరిణమించడం.అన్ని ఎయిర్ కండీషనర్లలో ఇవాపొరేటర్ ఉంటుంది. ఇది శీతలకరణి సహాయంతో గదిని చల్లబరుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఏసీ ఉష్ణోగ్రత 16 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే ఆ ఇవాపొరేటర్లో మంచు పేరుకుపోతుంది. దీంతో అది త్వరగా మరమ్మతుకు గురవుతుంది. అలాగే వినియోగదారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే ఏ ఏసీలోనైనా ఉష్ణోగ్రత 16 డిగ్రీల కంటే తక్కువ ఉండదు.ఇక ఏసీలోని గరిష్ట ఉష్ణోగ్రత విషయానికొస్తే అది 30 డిగ్రీలకు మించి ఉండదు. సాధారణంగా ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్నప్పుడు మనకు ఏమాత్రం ఇబ్బందిగా అనిపించదు. అయితే ఉష్ణోగ్రత అంతకు మించినప్పుడు ఉక్కపోతకు గురవుతాం. అలాగే ఏసీ ఉష్ణోగ్రతను 30 కంటే ఎక్కువగా ఉంచడం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే 30 డిగ్రీలకు మించి ఏసీ ఉంటే దాని నుంచి వేడి గాలి వీస్తుంది. నిజానికి ఎయిర్ కండీషనర్ పని గాలిని చల్లబరచడం. వేడి చేయడం కాదు. -
ఉడుకుతున్న ఉత్తరాది
న్యూఢిల్లీ/కొచ్చి: ఆదిత్యుని ఆగ్రహ కిరణాలకు ఉత్తరభారతం ఎండలతో భగభగ మండుతోంది. వడగాలులు తోడవడంతో వేసవికాలంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలో మంగళవారం దాదాపు 50 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ముంగేశ్‌పూర్, నరేలా ప్రాంతాల్లో 49.9 డిగ్రీ సెల్సియస్, నజఫ్గఢ్లో 49.8 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. ఇది ఇక్కడి సాధారణ ఉష్ణోగ్రత కంటే 9 డిగ్రీసెల్సియస్ ఎక్కువ ఉండటం గమనార్హం.ఉత్తర ప్రదేశ్, హరియాణా, రాజస్థాన్, పంజాబ్‌లోనూ ఎండలు ఇలాగే మండిపోయాయి. రాజస్థాన్‌లోని చురులో అత్యధికంగా 50.5 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఇక్కడి సాధారణ ఉష్ణోగ్రత కంటే 7 డిగ్రీ సెల్సియస్ ఎక్కువ. హరియాణాలోని సిర్సాలో 50.3, హిసార్, పంజాబ్‌లోని భటిండాలో 49.3, ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ పట్టణంలో 49, ప్రయాగ్‌రాజ్‌లో 48.2, వారణాసి, కాన్పూర్‌లో 47.6 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యప్రదేశ్‌లోనూ నాలుగైదు ప్రాంతాల్లో 48 డిగ్రీలకంటే ఎక్కువ ఉష్ణోగ్రత రికార్డయింది. కేరళలో భారీ వర్షాలు ఉత్తరాది ప్రజలు ఉక్కపోతతో చెమట చిందిస్తుంటే దక్షిణాదిన కేరళలో భారీ వర్షాలతో ప్రజలు తడిసి ముద్దయ్యారు. ఈదురుగాలులతో కూలిన భారీ వర్షం కేరళ దక్షిణ, మధ్య ప్రాంతాలను అతలాకుతలం చేసింది. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఇళ్లు కూలిపోయాయి. దీంతో కొందరు పునరావాస శిబిరాల్లో తలదాచుకున్నారు. చాలా జిల్లాల్లో పర్యాటక కేంద్రాలను మూసేశారు. కొండ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నిషేధించారు.కొచ్చి సిటీ, ఎర్నాకులం జిల్లాల్లో గంటల తరబడి వర్షం పడటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొచ్చిలోని కలమసెర్సీ ప్రాంతంలో వందలాది ఇళ్లలోకి వర్షపునీరు చేరింది. మీనాచిల్, కొల్లియార్ నదుల్లో నీటిమట్టాలు పెరిగాయి. అరవిక్కర, మలాంకర డ్యామ్‌ల గేట్లను స్వల్పంగా ఎత్తారు. జలాశయాలు ఉప్పొంగడంతో శివారు గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. తిరువనంతనపురంలోని ముథలపోజీ తీరం వద్ద భారీ అల కారణంగా పడవ బోల్తాపడి మత్స్యకారుడు చనిపోయాడు. -
రేపు అల్పపీడనం! రాష్ట్రానికి మూడు రోజులు వర్షసూచన
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది తొలుత వాయవ్య దిశలో కదిలి ఈ నెల 24వ తేదీ నాటికి మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచించింది. కాగా సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా పసుమాములలో 5.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్ సరిహద్దు జిల్లాల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ప్రస్తుతం రాష్ట్రానికి ఆగ్నేయ దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నాయి. సోమవారం చాలాచోట్ల సాధారణం కంటే 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్టంగా ఆదిలాబాద్‌లో 41.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తున్న వానలు (ఫొటోలు)
-
3 రోజులు తేలికపాటి వానలు!
సాక్షి, హైదరాబాద్: అధిక ఉష్ణోగ్రతలు, ఉక్క పోతతో అల్లాడుతున్న జనానికి వాతావరణ శాఖ కాస్త చల్లని కబురు చెప్పింది. వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వానలు పడతాయని ప్రకటించింది. మరోవైపు ఈ మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే నమోదుకావొచ్చని పేర్కొంది.19 జిల్లాల్లో వానలకు చాన్స్: ప్రస్తుతం తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని.. దాని ప్రభావంతో మంగళ, బుధ, గురు వారాల్లో ఉరు ములు, మెరుపులు, ఈదురు గాలులతో (గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో) కూడిన తేలిక పాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకా శం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా.. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్ద పల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జన గామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. వానలకు సంబంధించి ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.జల్లులు పడినా ఎండల మంటలే..రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. దానితో ఆదివారం రాత్రి వాతావరణం కాస్త చల్లబడింది. అయినా సోమవారం ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా గుల్లకోట, అల్లిపూర్‌లో 46.8 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 46.4 డిగ్రీల అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 23 ప్రాంతాల్లో 45 డిగ్రీలకుపైనే నమోదైంది. వచ్చే మూడు రోజులు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగానే నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
ఎండలకు చచ్చిపోతున్న చేపలు.. వ్యాపిస్తున్న దుర్వాసన!
మండుతున్న ఎండలు మన దేశాన్నే కాదు ప్రపంచంలోని పలు దేశాలను భయపెడుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు అటు జనాలను, ఇటు జీవాలను మలమలమాడిపోయేలా చేస్తున్నాయి. కరువు బారిన పడిన దక్షిణ వియత్నాంను ఈ ఎండలు మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దక్షిణ వియత్నాంలో అంతకంతకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు చేపలను బలి తీసుకుంటున్నాయి. 300 హెక్టార్లలో విస్తరించి ఉన్న ‘సాంగ్ మే’ చెరువులోని వేలాది చేపలు ఎండ వేడికి తాళలేక చనిపోయాయి. డాంగ్ నైలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలను దాటింది. 1998లో ఈ ప్రాంతంలో ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు రిజర్వాయర్ నిర్వహణ సంస్థ నిర్లక్ష్యం కూడా చేపలు చనిపోవడానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుత వేసవి కాలంటో 200 టన్నులకు పైగా చేపలు చనిపోయాయి. అత్యధిక ఉష్ణోగ్రత, నీటి కొరత కారణంగా ఈ చేపలు చనిపోయాయని స్థానికులు చెబుతున్నారు. చనిపోయిన చేపల వాసన గత కొన్నిరోజులుగా ఈ ప్రాంతంలో విపరీతంగా వ్యాపించడంతో ఇక్కడి జనం నానా అవస్థలు పడుతున్నారు. ఈ చనిపోయిన చేపలను చెరువులో నుంచి తొలగించే పనిలో మత్స్యకారులు నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక యంత్రాంగం విచారణ ప్రారంభించింది. -
ఎండ ప్రచండం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఉగ్రరూపం దాలుస్తూనే ఉన్నాయి. అసాధారణ ఎండలు జనాన్ని అల్లాడిస్తున్నాయి. కొద్దిరోజులుగా కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు (సాధారణం కంటే 4–7 డిగ్రీలు అధికంగా) నమోదవుతుండగా.. ఇప్పుడు 48 డిగ్రీలకు చేరువగా పయనిస్తున్నాయి. శుక్రవారం రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు, గోస్పాడుల్లో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఈ సీజన్లో అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. ఇంకా అర్ధవీడు (ప్రకాశం)లో 47.3, చిన్నచెప్పలి (వైఎస్సార్) 47.2, వి.అక్కమాంబపురం (నెల్లూరు) 47.1, పెద్దకన్నాలి (తిరుపతి) 46.9, పంచలింగాల (46.8), తవణంపల్లె (చిత్తూరు), రావిపాడు (పల్నాడు)ల్లో 46 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకా 15 జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 63 మండలాలు తీవ్ర వడగాడ్పులతో అల్లాడిపోగా.. 208 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. శనివారం 58 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 169 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం మరింత తీవ్ర రూపం దాల్చి 78 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 273 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. -
సెగలు.. భగభగలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సోమవారం రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాల జిల్లా ఆత్మకూరులో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే సింహాద్రిపురం (వైఎస్సార్)లో 45.9, రామభద్రపురం (విజయనగరం) 45.1, కోడుమూరు (కర్నూలు) 44.8, సాలూరు (పార్వతీపురం మన్యం) 44.5, రాపూరు (నెల్లూరు) 44.4, లక్ష్మీనర్సుపేట (శ్రీకాకుళం) 44.3, మార్కాపురం (ప్రకాశం)లో 44.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫలితంగా 59 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 78 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. మంగళవారం 61 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 173 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. వీటిలో శ్రీకాకుళంలో 13, విజయనగరం 24, పార్వతీపురం మన్యం 14, అనకాపల్లి 9, విశాఖ జిల్లాలోని పద్మనాభం మండలంలోనూ తీవ్ర వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే కోస్తా జిల్లాలోని పలు మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని వివరించింది. -
కొనసాగుతున్న వడగాడ్పులు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఎండ తీవ్రతతో పాటు వడగాడ్పులు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం కూడా పలుచోట్ల 43–45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 72 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 102 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. శుక్రవారం 56 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 174 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. శనివారం 64 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 170 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశాలున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గురువారం నంద్యాల జిల్లా నందవరంలో 45.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.రాజాం (విజయనగరం)లో 45.5, కొండయ్యగూడెం (అల్లూరి జిల్లా)లో 45.1, కాజీపేట (వైఎస్సార్)లో 44.7, కోడుమూరు (కర్నూలు)లో 44.2, దేవరాపల్లి (అనకాపల్లి)లో 44.1, నందరాడ (తూర్పు గోదావరి), రావిపాడు (పల్నాడు), కొల్లివలస (శ్రీకాకుళం)లలో 44 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో పలుచోట్ల 43–44 డిగ్రీలు, కొన్నిచోట్ల 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యే అవకాశాలున్నాయి. కోస్తాంధ్రపై ఉన్న ఉపరితల ఆవర్తనం గురువారం బలహీన పడింది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర కోస్తా తమిళనాడు ఉత్తర కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో శుక్రవారం ఉత్తర కోస్తాంధ్రలో ఒకట్రెండుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
45 డిగ్రీలు దాటేసింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. ఉదయం నుంచే మంట పుట్టిస్తున్న సూర్యుడి భగభగలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చండ ప్రచండ వేడితో ప్రజలు తల్లడిల్లుతున్నారు. గురువారం మంచిర్యాల జిల్లా హాజిపూర్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 45.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అదే విధంగా నల్లగొండ జిల్లా మాడుగులపల్లిలో కూడా గరిష్ట ఉష్ణోగ్రత 45.2 డిగ్రీ ల సెల్సియస్, ములుగు జిల్లా మేడారంలో 45.1 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతా యని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు రావొద్దని సూచించింది. ఎండల తీవ్రతకు తోడు వడగాల్పుల ప్రభావంతో చిన్నపిల్లలు, వృద్ధులు ఎండదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా, ఏప్రిల్‌లోనే గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటడంతో వచ్చే నెల మేలో పరిస్థితేంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా... రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. సగటున 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గురువారం రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో 43.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత దుండిగల్‌లో 24.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 5.6 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదు కాగా, భద్రాచలం, నల్లగొండలో 4 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్, మెదక్, హనుమకొండ, నిజామాబాద్, రామగుండంలో 3 డిగ్రీల సెల్సియస్ మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో 2 డిగ్రీల సెల్సియస్ మేర సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు మన్నార్ గల్ఫ్ నుంచి దక్షిణ తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. శుక్రవారం ఉత్తరాది జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. -
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న ఎండలు (ఫొటోలు)
-
ఒకేరోజు 12 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు!
ఛత్తీస్‌గఢ్‌లో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోయాయి. గత 24 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీలు తగ్గింది. తేమ 87 శాతానికి పెరిగింది. ఫలితంగా రాష్ట్రంలోని ఇళ్లు, కార్యాలయాల్లోని ఏసీలు, కూలర్లకు విశ్రాంతి దొరికింది. రాజధాని రాయ్‌పూర్‌లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షం కురుస్తోంది. గడచిన 24 గంటల్లో రాయ్‌పూర్‌లో ఒక సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది, రాయ్‌పూర్‌లో 24.7, మనాలో 24, బిలాస్పూర్లో 28.4, పెండ్రారోడ్లో 29.6, అంబికాపూర్‌లో 31.5, జగదల్పూర్లో 26.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయ్‌పూర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత మూడు డిగ్రీల సెల్సియస్ తగ్గింది. -
వచ్చే నెలలో 50 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు!
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో అసాధారణ ఉష్ణోగ్రతలు అరుదుగా నమోదవుతున్నాయి. వేసవిలో రికార్డయ్యే ఈ ఉష్ణోగ్రతలు ఒకింత ఆశ్చర్యం గొలుపుతున్నాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఏప్రిల్ ఆరంభంలోనే మే నెలను తలపించే వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి. మే నెలలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు మించి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గడచిన 132 ఏళ్లలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గణాంకాలను పరిశీలిస్తే.. మన రాష్ట్రంలో నమోదైన గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 1875లో ఐఎండీ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో రికార్డయిన ఉష్ణోగ్రతలను గమనిస్తే.. 2003 మే 28న రెంటచింతలలో (ప్రస్తుత పల్నాడు జిల్లా) అత్యధికంగా 49.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటివరకు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఇదే రికార్డు. ఆ తర్వాత స్థానంలో ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నిలిచింది. అక్కడ 1962 మే 26న 48.9 డిగ్రీలు నమోదైంది. గన్నవరంలో 2002 మే 11న 48.8, నంద్యాలలో 1994 మే 11న 48.2, మచిలీపట్నంలో 1906 మే 25న 47.8, తునిలో 1998 మే 30న 47.5, విజయవాడలో 1980 మే 26న 47.5, ఒంగోలులో 2003 మే 31న 47.4, నరసారావుపేటలో 1983 మే 2,3 తేదీల్లో 47, నెల్లూరులో 1892 మే 15న, 1894 జూన్ 1న 46.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఇలా.. ఏప్రిల్ నెలలోనూ అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితులున్నాయి. గడచిన పదేళ్లలో (ఏప్రిల్‌లో) 2016 ఏప్రిల్ 25న తిరుపతిలో నమోదైన 45.7 డిగ్రీల ఉష్ణోగ్రతే అత్యధికం. ఈ రికార్డును ఆదివారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో నమోదైన 46 డిగ్రీల ఉష్ణోగ్రత చెరిపేసింది. ఇంకా ఆదివారం నంద్యాల జిల్లా చాగలమర్రి, నెల్లూరు జిల్లా కలిగిరిలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్‌లో ఎల్‌నినో వంటి ప్రత్యేక పరిస్థితుల్లో అసాధారణ ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్.స్టెల్లా ‘సాక్షి’కి చెప్పారు. -
దేశరాజధాని ఢిల్లీలో పెరిగిన ఉష్ణోగ్రతలు
దేశరాజధాని ఢిల్లీలో ఉక్కపోతల కాలం మొదలయ్యింది. ఢిల్లీలో ఉష్ణోగ్రత 33 డిగ్రీలు దాటింది. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రానున్న మూడునాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో విపరీతమైన వేడి వాతావరణం ఉండనుందని, పలు రాష్ట్రాల్లో వేడిగాలులు మొదలు కానున్నాయిని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. సోమవారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 33.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుత కనిష్ట ఉష్ణోగ్రత 15.8 డిగ్రీల సెల్సియస్, ఇది సీజన్ సగటు కంటే ఒక డిగ్రీ తక్కువ. తేమ శాతం 40 నుంచి 94 శాతం వరకు ఉంటున్నదని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం రాబోయే రెండుమూడు రోజుల్లో ఢిల్లీ-ఎన్సీఆర్లో ఉష్ణోగ్రత 35 డిగ్రీలకు చేరుకోనుంది. కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్‌కు చేరే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ)తెలిపిన వివరాల ప్రకారం మార్చి 26న ఈశాన్య భారతదేశం, పశ్చిమ బెంగాల్‌లోని ఉప-హిమాలయ ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. -
ఉక్కపోత పెరుగుతోంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలకు సమాంతరంగా రాత్రి ఉష్ణోగ్రతలు సైతం అదేస్థాయిలో పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతల్లో పెరుగుదల వేగంగా నపమోదవుతోంది. శుక్రవారం రాష్ట్రంలోని గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ... గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 38.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 16.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. శుక్రవారం రాష్ట్రంలోని చాలాచోట్ల గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. మెదక్‌లో సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదు కాగా... ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో 2 డిగ్రీల సెల్సియస్, మిగతా చోట్ల ఒక డిగ్రీ సెల్సియస్ చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వాతావరణంలో తేమశాతం తగ్గడంతో ఉక్కపోత కూడా పెరుగుతోంది. -
మైనస్ 25 డిగ్రీల టెంపరేచర్లో... మాంగల్య తంతునానేనా!
సాధారణంగా ఎవరైనా పెళ్లిమండపం ఎంపిక చేసుకోవడానికి సౌకర్యాలు, అనుకూలతలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అయితే అన్ని పెళ్లిళ్లూ ఒకేలా ఉండవు అని చెప్పడానికి ఈ పెళ్లి ఒక ఉదాహరణ. హిమాచల్‌ప్రదేశ్‌లోని స్పితి వ్యాలీలో మైనస్ 25 డిగ్రీల ఉష్ణోగ్రతలో గుజరాతీ జంట పెళ్లి చేసుకుంది. ‘ఏ మ్యారేజ్ లైక్ దిస్ టూ! ఏ లవింగ్ కపుల్ ఫ్రమ్ గుజరాత్’ కాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. పెళ్లికి వచ్చిన అతిథుల సందడి కూడా వీడియోలో కనిపిస్తుంది. వరుని పక్కన కూర్చోబెట్టుకొని పూలతో అలంకరించిన ఎరుపు రంగు కారును వధువు నడపడంతో వీడియో ముగుస్తుంది. అయితే ఈ వీడియోను చూసి ప్రశంసించిన వాళ్ల కంటే ‘ఓవర్ యాక్టింగ్’ అని వెక్కిరించిన వాళ్లే ఎక్కువ. ‘మీ పెళ్లి సంబరం సరే, అక్కడ ఎంత చెత్త పేరుకు పోయి ఉంటుందో’ అని ఒక యూజర్ స్పందించాడు. -
రానున్నది ఉష్ణ ప్రకోపమే!
వాతావరణం, శీతోష్ణస్థితి గురించి లెక్కలు తీసి రికార్డుగా దాచి ఉంచడం మొదలుపెట్టి 170 సంవత్సరాలకు పైనే అయింది. ఈ మొత్తం కాలంలోనూ 2023వ సంవత్సరం అన్నిటికన్నా వేడి అయినదిగా నమోదవుతుంది అని పరి శోధకులు అప్పుడే చెప్పేస్తున్నారు. ఇటీ వలి కాలం ఇంత వేడిగా ఉండడా నికి మనుషుల కారణంగా మారుతున్న శీతోష్ణస్థితి మాత్రమే అని ఎటువంటి అనుమానం లేకుండా తేల్చేస్తున్నారు. యూరోపియన్ యూనియన్ స్పేస్ ప్రోగ్రావ్‌ు వారి ‘కోపర్ని కస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్’ వారి లెక్కల ప్రకారం, ఇంతకు ముందు ఎప్పుడూ వేసంగి ఇంత వేడిగా ఉన్నది లేదు. గతంలో కంటే ఈసారి ఉష్ణోగ్రత 0.32 డిగ్రీ సెల్సియస్ సగటున ఎక్కువగా ఉన్నట్టు లెక్క తేలింది. ప్రపంచం మొత్తం మీద మునుపెన్నడూ లేని మూడు వేడి దినాలు నమోదైనట్లు కూడా తెలిసింది. ఇప్పటికే ఈ ఏడాది వేసవికాలం మునుపెన్నడూ లేనంత వేడిగా ఉందని లెక్కతేల్చి పెట్టారు. 2023వ సంవత్సరంలో నెలల ప్రకారం లెక్కలు చూచినా... ప్రపంచమంతటా ఆరు మాసాలు అంతకు ముందు ఎన్నడూ లేని వేడి కనబరిచినట్టు ఇప్పటికే లెక్కలు వచ్చాయి. అంటార్కిటికాలో మంచు కూడా అంతకు ముందు ఎన్నడూ లేనంతగా కరిగిపోయినట్టు కూడా గమనించారు. ప్రపంచంలో పారిశ్రామికీకరణ కన్నా ముందు కూడా వాతా వరణంలోని వేడి గురించిన రికార్డులు ఉన్నాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు సగటున ప్రపంచం మొత్తం మీద 1.46 డిగ్రీల సెల్సియస్ వేడి పారిశ్రామికీకరణకు ముందున్న వేడి కన్నా ఎక్కువగా ఉంది. పరిశ్రమల వల్ల వాతావరణం వేడెక్కుతున్న దన్న భావన చాలాకాలంగా ప్రపంచంలో ఉండటం తెలిసిందే. 2016లో వేడిమి ఎక్కువగా ఉన్నట్టు ఇప్పటి వరకు ఉన్న రికార్డులు తెలుపుతున్నాయి. అయితే ఈ సంవత్సరం వేడి 2016లో కన్నా ఎక్కువగా ఉన్నట్టు నమోదయింది. ఈ ప్రకారంగా ఇప్పటి వరకు రికార్డులో ఉన్న సంవత్సరాల అన్నింటిలోకీ 2023 అత్యంత వేడిగా ఉన్నట్టు లెక్క తేలింది. ఈ విషయాన్ని ఈ మధ్యనే ‘సీ త్రీ ఎస్’ సంస్థ పరిశోధకురాలు సమంతా బుర్జెస్ ఒక ప్రకటనలో బయటపెట్టారు. శరత్ కాలం కూడా వేడిగా ఉండడానికి ‘ఎల్ నినో’ కారణం అని ఇప్పటికే మనకంతా తెలుసు. ఎల్ నినో వల్ల భూమధ్య రేఖ వద్ద సముద్రాలలో ఉపరితలం నీరు వేడెక్కుతుంది. దాని వల్ల ప్రపంచంలోని గాలులు వేడవుతాయి. 2023 జూన్‌లోనే ఈ ప్రక్రియ మొదలైంది. వచ్చే ఏడాది కూడా ఈ వేడి కొనసాగుతుందని అంటున్నారు. గడచిన మూడు సంవత్సరాల పాటుఎల్ నినోకు వ్యతిరేకంగా ఉండే ‘లా నినా’ అనే పరిస్థితి కారణంగా వేడిమి కొంతవరకు అదుపులో ఉంది. ఈ ‘లా నినా’ప్రస్తుతం లేదు. కనుక వేడిమి హద్దు లేకుండా పెరుగుతున్నది. మరికొంతమంది నిపుణులు టోంగాలో సముద్రం లోపల 2022లో పేలిన అగ్నిపర్వతం కారణంగా వేడి నీటి ఆవిరులు వాతావరణంలో పెరిగాయనీ, ఈ సంవత్సరం వేడి పెరుగుదలకు అది కూడా కొంతవరకు కారణం కావచ్చుననీ అంటున్నారు. అయితే పరి శోధకులు మాత్రం ఈ విషయం గురించి అను మానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచమంతటా వాతావరణం వేడిగా మారడానికి ‘గ్లోబల్ వార్మింగ్’ అన్న ప్రక్రియ కారణం అని అందరికీ తెలుసు. గ్రీన్ హౌస్ వాయువుల కారణంగా ఈ పరిస్థితి ఎదురవుతున్నదని కూడా తెలుసు. ఈ ప్రక్రియ వల్ల ప్రపంచ వాతావరణంలో 25 బిలి యన్ల అణుబాంబుల శక్తికి సమానంగా ఉష్ణశక్తి చేరిందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇదంతా గడిచిన 50 సంవ త్సరాల పాటు జరిగిన మార్పు. ఈ మార్పు ఒక పక్కన గాలిని వేడెక్కిస్తుండగా, మరొక పక్కన ఊహకు అందకుండా ఎల్ నినో వచ్చే పరిస్థితులకు దారితీస్తున్నది. రానురానూ పరిస్థితి మరింత దారుణంగా మారుతున్నది. డిసెంబర్ 4న ‘కాప్’ 28 అనే యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ ఛేంజ్ కాన్ఫరెన్స్ జరిగింది. వాతావరణంలోకి కార్బన్ డై ఆక్సైడ్నుపంపించడం ఈ సంవత్సరం అంతకు ముందు ఎన్నడూ లేని స్థాయికి చేరిందని అక్కడ ప్రకటించారు. పరిస్థితి ఇలాగుంటే, వాతావరణం నియంత్రణలో ఉంటుందని అనుకోవడానికి వీలే లేదు అన్నారు అక్కడ.గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలు ప్రస్ఫుటంగా బయట పడు తున్నాయి. ప్రపంచమంతటా తీర ప్రాంతాల్లో ఉన్న నగరాలు ముంపునకు గురవుతున్నాయి. ప్రపంచంలోని పెద్ద పెద్ద సరస్సులు, జలాశయాలు సగం కుదించుకుపోయాయి. సముద్ర అంతర్భాగంలో ఉండే గల్ఫ్ ప్రవాహం కూడా ప్రభావం కనపరు స్తున్నది. సముద్ర మట్టాలు ఎక్కడికక్కడ పెరుగుతున్నాయి. అయితే పరిశోధకులు, పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి అవ కాశాలు ఇంకా ఉన్నాయి అని ఆశాభావం కనబరుస్తున్నారు. వాతావరణంలో మార్పులను మనకు అనుకూలంగా మార్చే మార్గాలు లేకపోలేదు అంటున్నారు పెన్సిల్వేనియా విశ్వ విద్యా లయం పరిశోధకులు. కానీ ఆ అవకాశం కూడా రానురానూ తగ్గి పోతున్నది అన్నది వారి అభిప్రాయం. కె. బి. గోపాలం వ్యాసకర్త సైన్స్ రచయిత -
హాట్ వింటర్పై ఐఎండీ కీలక అప్డేట్ !
న్యూఢిల్లీ : గ్లోబల్ వార్మింగ్‌తో వాతావరణ మార్పులు కళ్ల ముందు కనిపిస్తునే ఉన్నాయి. ఓ పక్క సీజన్‌తో సంబంధం లేకుండా వర్షాలు దంచి కొడుతున్నాయి. మరో పక్క శీతాకాలంలోనూ మధ్యాహ్నం వేళల్లో ఎండలు వేడెక్కిస్తున్నాయి. ఉక్కపోత కూడా ఎక్కువగానే ఉంటోంది. అయితే ఇదే అంశానికి సంబంధించి భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) ఒక కీలక అప్డేట్ ఇచ్చింది. దేశంలో ఈ శీతాకాలంలో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు సాధారణంగా కంటే వేడి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ‘దేశంలో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పీక్ వింటర్‌గా పరిగణిస్తారు. అయితే ఈ టైమ్‌లో ఈ ఏడాది దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణంగా కంటే కనీస, గరిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదవుతాయి. మధ్య, ఉత్తర భారతాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి’అని ఐఎండీ డైరెక్టర్ మహాపాత్ర తెలిపారు. ఇప్పటికే నవంబర్ నెలలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఐఎండీ ఉష్ణోగ్రతలు రికార్డు చేయడం ప్రారంభించిన 1901 నుంచి గణాంకాలు తీసుకుంటే ఈ ఏడాది నవంబర్‌లో మూడోసారి కనీస, గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయి కొత్త రికార్డు సృష్టించాయి. ఇదీచదవండి.. రిసార్టులకు పండగే! ఎగ్జిట్‌పోల్స్‌తో సోషల్ మీడియాలో వెల్లువెత్తిన మీమ్స్ -
పర్యావరణ హిత జీవనశైలి అవశ్యం
క్రమపద్ధతి లేని ఉష్ణోగ్రత, వర్షపాతాల రూపంలో వాతావరణ మార్పు పరిణామాలు అనుభవిస్తున్నాం. ఒక శతాబ్దానికి పైగా, మండుతున్న శిలాజ ఇంధనాలు, అసమానమైన, నిలకడలేని శక్తి, భూవినియోగాల వలన, యావత్ ప్రపంచం మితిమీరి వేడెక్కడానికి దారితీసిందని, వాతావరణ మార్పును పరిశీలించడానికి నియమింపబడిన ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ తన నివేదికలో నిర్ధారించింది. పర్యావరణాన్ని రక్షించడానికి సమగ్రమైన ప్రతిస్పందన, ప్రతి ఒక్కరికీ దానిని రక్షించాలనే భావన అనివార్యం. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ విపరీత పర్యావరణ సవాలును ఎలా ఎదుర్కోవాలనే విషయమై సతమతమవుతున్నాయి. పర్యావరణ రక్షణకు ఉపయోగపడే స్థిరమైన జీవనశైలి, ప్రతి వ్యక్తి తీసుకునే చర్యలు పెద్ద మార్పును తేగలవు. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడా నికి తక్షణ, నిశ్చయాత్మకమైన ప్రయత్నాల అవసరం ఎంతైనా ఉంది. దీనికి గాను వాతావరణ నిపుణులు, సర ఫరా, వినియోగ ప్రవర్తన వైపు పరిష్కారాలు ప్రతిపాదించారు.ఇందులో ఉద్గారాలు, వాటి నిర్వహణ, సాంకేతిక ఎంపికలు, జీవనశైలి మొదలైన వాటిని లక్ష్యంగా చేసుకుని, పరిష్కారాలు సూచించారు. వినియోగ నిర్వహణ అనునది, ఉత్పత్తి వ్యవస్థల నుండి వచ్చే ప్రతి కూల పర్యావరణ ప్రభావాలను తగ్గించడం కొరకే గానీ, నాణ్యమైన జీవితం కోల్పోవడానికి కాదనీ వక్కాణించారు. ఈ ప్రయత్నంలో, వ్యక్తిగత ప్రవర్తన ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మన దేశంలోని నీతి ఆయోగ్, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(యూఎన్డీపీ) వారిచే సంయుక్తంగా ఒక కార్యాచరణ నివేదిక 2023లో విడుదల అయింది. భారతదేశంతో సహా అనేక దేశాలలో నిర్వహించిన అధ్య యనాల ఫలితాలను క్రోఢీకరించి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఉపయోగపడే ఏడు ముఖ్యమైన అంశాలు ఈ నివేదికలో పొందుపర చారు. వీటిలో నీటి పొదుపు, వ్యర్థాల నిర్వహణ, సుస్థిరమైన ఆహార వ్యవస్థ, ఇంధన సంరక్షణ, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, స్థిరమైన జీవన శైలి, ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ ఉన్నాయి. అన్ని అధ్యయనాలు భారతదేశంలో జరగనప్పటికీ, ఫలితాలు మాత్రం పర్యావరణాన్ని పరిరక్షించడానికి మనకు కూడా వర్తిస్తాయి. ఆహార రంగం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆహారాన్ని సక్రమంగా వినిగించు కొని, పంట నుండి వినియోగం వరకు వృథాను తగ్గించాలి. మొక్కల ఆధారిత ఆహారాలను ఎక్కువగా తిని, జంతు ఆధారిత ఉత్పత్తులను తక్కువగా తినడం అలవాటు చేసుకోవాలి. ‘ఆహారాన్ని ప్రేమించు – వ్యర్థాలను ద్వేషించు’ అను నినాదం, ఆహార వృథాను తగ్గించడానికి ఉపయోగపడటంతోపాటు, ఆహారం తయారీ యజమానులలోను, చిల్లర వ్యాపారులలోను, వినియోగదారులలోను గణనీయమైన సాను కూల ఫలితాలను అందించింది. గృహ స్థాయిలో వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించడం వల్ల కంపోస్ట్ తయారీకి దారితీసి, నేల సారాన్ని పెంపొందించడంలో సహాయపడింది. స్థానికంగా పండించిన, కాలానుగుణమైన, ప్రకృతి మరియు సేంద్రీయ పద్ధతిలో పండించిన ఆహారాన్ని వినియోగిస్తున్నవారు, శాకాహారులు, యితర వ్యక్తు లతో పోలిస్తే, తక్కువ తలసరి ప్రతికూల పర్యావరణ ప్రభావాన్ని కలిగిస్తున్నారని ఫలితాలు చూపించాయి. వ్యవసాయం, భూమి నిర్వహణ పద్ధతులు ఉత్పాదకతను పెంచడానికి పచ్చిక బయళ్లలో చెట్లను పెంచడం, వార్షిక పంటలతోపాటు చెట్లను పెంచడం, ప్రకృతి వ్యవసాయం పాటించడం, అనగా కంపోస్ట్ ఎరువు వాడకం, కలుపు అణచివేసే కవరు పంటలు వేయడం, రసాయన ఎరువుల వాడకం నిషేధించడం, యితర సహజ/సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు పాటించడం, సారం క్షీణించిన వ్యవసాయ భూమిని పునరుద్ధరించడం,పంట మార్పిడి చేయడం, పంట వేయడానికి నేలను తక్కువసార్లు దున్నడం, డ్రిప్ లేదా స్ప్రింక్లర్ పద్ధతుల ద్వారా పంటలకిచ్చే నీటి విని యోగాన్ని, వృథాను బాగా తగ్గించడం లాంటివన్నీ పర్యావరణ పరిరక్షణకు దారి తీస్తాయి. నీటికి సంబంధించిన లెక్కలు, తనిఖీ ప్రయోగం విజయవంతమైన వ్యూహంగా నిరూపితమైంది. నీటి విని యోగదారుల సంఘాలను ఏర్పాటు జేసుకోవడం, నీటి సంరక్షణ, వాతావరణ అంచనా కోసం అందుబాటులో ఉన్న సాంకేతికతను స్వీకరించడం వలన నీటి నిల్వను, వినియోగాన్ని మెరుగుపరచు కోవచ్చని ధ్రువీకరించడమై నది. ఆంధ్రప్రదేశ్‌లో, సహజ వ్యవసా యంతో బాటు, రుతుపవనా లకు ముందు అనగా వేసవి కాలంలో పంట వేయడం, స్థిరమైన వ్యవసాయం వైపు ప్రోత్సహించడం దీనికి ఒక ఉత్తమ ఉదాహరణ. ఈ పద్ధతులు నీటి సంరక్షణకు తోడ్పడుతూ, నేల నాణ్యతను సైతం మెరుగుపరుస్తున్నాయి. దీనికితోడు, రసాయన రహిత ఆహార ధాన్యాలను అందిస్తూ, భూమిలో 365 రోజుల పచ్చ దనాన్ని, చల్లటి వాతా వరణాన్ని యిస్తున్నాయి. రవాణా కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో రవాణా కీలక పాత్ర వహిస్తు న్నది. పట్టణాలు, నగరాల్లో ప్రయాణించడానికి, ప్రజలు వ్యక్తిగత వాహనాలను ఉపయోగించకుండా ప్రజా రవాణాను ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. బ్యాటరీతో నడిచే వాహనాలను ఉప యోగించడం, గమ్యస్థానాలు చేరుకోడానికి సైకిలు ఉపయోగించడం, సాధ్యమైన చోటల్లా నడవడం, ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది కలిసి వాహనాల్లో వెళ్ళడం, కార్‌పూలింగ్ పద్ధతులను పాటించడం, భౌతిక ఉనికికి బదులుగా వీడియో సాంకేతికతలను ఉపయోగించి టెలిప్రెసెన్స్ను పెంపొందించి రవాణా ఖర్చు తగ్గించడం వంటి చర్యలన్నీ కాలుష్యాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. రవాణాలో రద్దీని, ఖర్చును తగ్గించడానికి, సమర్థవంతమైన ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం సహాయపడుతున్నది. శక్తి సంబంధిత పదార్థాలు శక్తి వినియోగంలో, పొదుపు ప్రవర్తన పెద్ద సవాలుగా మారింది. భవనం పైకప్పులో సోలార్‌ను అమర్చడం, వేడి నీటి కోసం సోలార్ హీటర్లను అమర్చుకోవడం, ఇంట్లో వెలుతురు, వంట కోసం బయో గ్యాస్ ఏర్పాటు చేసుకోవడం, ఎల్ఈడీ బల్బులు ఉపయోగించడం, ఇంధన సమర్థవంతమైన వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలను వాడటం, పైకప్పులో తోటలను పెంచడం పర్యావరణ పరిరక్షణకు గణ నీయంగా దోహదపడతాయి. వంటకు మెరుగైన స్టవ్‌లు (పొయ్యిలు) వాడితే, పొగ స్థాయిలను 55 శాతం వరకు తగ్గించాయని మన దేశంలో చేసిన ప్రయోగాలు నిరూపించాయి. అవసరమైన వ్యూహాలు మీడియా ప్రసారాలు, ప్రకటనలు, వార్తాపత్రికలలో కథనాలు అవగాహన స్థాయిని పెంచడంలో సహాయపడతాయి. పర్యావరణ అనుకూల పద్ధతులను పాటిస్తున్న వినియోగదారులను, ప్రభుత్వాలు తగు రీతిలో ప్రోత్సహించి, ప్రశంసిస్తే ఇతరులు కూడా అనుసరిస్తారని పరిశోధనలలో తేలింది. వినియోగదారుల నిర్ణయం ప్రభావితం చేయ డానికి, వస్తువులపై ‘పర్యావరణ అనుకూలమైనది’ అని ముద్రించాలి. వ్యర్థాలు, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, ఆరోగ్యకరమైన జీవనము నకు, స్థిరమైన ఆహార పద్ధతులను స్వీకరించడానికి దోహదపడుతుంది. పల్చటి ప్లాస్టిక్ కలిగించే ప్రతికూల ప్రభావాలను పాఠశాల పిల్లలకు తెలియబరిచాక, వారిలో గణనీయమైన మార్పు వచ్చింది. ధూమపానం చేసేవారు, తమ సిగరెట్ పీకలను నిర్ణీత ప్రదేశంలో పడ వేసేలా అవగాహన కల్పించాలి. సిగరెట్ పీకలు పర్యావరణంలోకి హానికరమైన రసాయనాలను వెదజల్లి, మైక్రోప్లాస్టిక్లుగా విడ దీయడం వల్ల పర్యావరణం కలుషితమవుతున్నది. కుళాయిలలో నీటి ప్రవాహాన్ని తగ్గించడం, నీటి లీకేజీలను ఆపడం, పళ్ళు తోముకునే టప్పుడు కుళాయిని ఆపివేయడం వంటి చర్యల ద్వారా గృహాలలో నీటి ఆదా చేయవచ్చని అధ్యయనాలు వెల్లడించాయి. వ్యర్థాలను తగ్గించడానికి, చిన్న చిన్న మోతాదులలో వస్తువులను ప్యాకేజి చేయడం, ఒకసారి ఉపయోగించి పారవేయకుండా తిరిగి వాడటం అత్యంత ప్రభావవంతమైన మార్గాలు. సూట్‌కేసులు, ప్రింటర్లు, బూట్లు, వాషింగ్ మెషీన్లు సుదీర్ఘ కాలం ఉండేవి కొనుగోలు చేయ డానికి వినియోగదారులు ఇష్టపడతారు, కాబట్టి వీటి జీవితకాలాన్ని ప్రముఖంగా కనబడేటట్లు ముద్రించాలి. తద్వారా వీటి వ్యర్థాలను తగ్గించవచ్చు. మొబైల్, టెలివిజన్, కంప్యూటర్ తయారీదారులు, వాటి వ్యర్థాలను రీసైకిల్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. పైన చెప్పినట్లుగా, వ్యక్తిగత స్థాయిలో ప్రవర్తన మార్పులు వచ్చి నచో, కచ్చితంగా పర్యావరణాన్ని రక్షించవచ్చు. డా‘‘ పి. పృథ్వీకర్ రెడ్డి వ్యాసకర్త హైదరాబాద్‌లోని ‘సెస్’(సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్) సీనియర్ పరిశోధకుడు ‘ prudhvikar@cess.ac.in -
AP: రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో కొన్నాళ్లుగా వాతావరణం పొడిగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల్లో మార్పు వల్ల ఉక్కపోత ఉంటోంది. తాజాగా గాలుల దిశ మారిన కారణంగా తూర్పు, ఆగ్నేయ గాలులు రాష్ట్రంపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. అదే సమయంలో తేలికపాటి జల్లులు లేదా వర్షాలకు ఆస్కారం ఉందని భారత వాతావరణశాఖ శనివారం ఓ నివేదికలో తెలిపింది. రానున్న మూడు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల జల్లులు కురవవచ్చని పేర్కొంది. అదే సమయంలో ఉరుములు, మెరుపులకు ఆస్కారం ఉందని అంచనా వేసింది. -
ఇస్రో కీలక ప్రకటన.. చంద్రునిపై ఉష్ణోగ్రతల వివరాలు పంపిన విక్రమ్
న్యూఢిల్లీ: చంద్రయాన్-3 ఉపగ్రహంలోని ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలం గురించి అధ్యయనం చేసి సమాచారాన్ని ఇస్రోకి చేరవేసింది. చంద్రుడి దక్షిణ ధృవం నేలకి సంబంధించి ఉష్ణోగ్రతలకు సంబంధించిన హెచ్చుతగ్గుల సమాచారం ప్రపంచానికి చేరడం ఇదే మొదటిసారి. చంద్రయాన్-3 విజయవంతంగా చందుడిపై అడుగుపెట్టడమే కాదు దాని కార్యాచరణను కూడా మొదలుపెట్టింది. శనివారం శివశక్తి పాయింట్ వద్దనున్న విక్రమ్ ల్యాండర్ నుండి ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లి ఉపరితలంపైకి జారుకుని అధ్యయనాలను కూడా ప్రారంభించింది. చంద్రుడి ఉపరితలంపై 10సెం.మీ. లోతు వరకు ఉపరితలాన్ని అధ్యయనం చేసిన ప్రజ్ఞాన్ రోవర్ తొట్టతొలిసారి చంద్రుడి దక్షిణ ధృవం వద్దనున్న నేలకి సంబంధించిన సమాచారాన్ని భూమికి చేరవేసింది. ChaSTE(చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్) పేలోడ్ చంద్రుడి ఉపరితలం యొక్క ఉష్ణోగ్రతలను అధ్యయనం చేసింది. ఇస్రో ఈ సమాచారాన్ని తన అధికారిక ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసింది. ఇస్రో షేర్ చేసిన ఈ గ్రాఫ్‌లో చంద్రుడి ఉపరితలం ఉష్ణోగ్రత -10 డిగ్రీల సెల్సియస్ నుండి 60 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగినట్లు తెలుస్తోంది. 'ఈ గ్రాఫ్ చంద్రుని ఉపరితలంపై లోతు వ్యత్యాసాన్ని బట్టి ఉష్ణోగ్రతల్లోని హెచ్చుతగ్గులను సూచిస్తోంది. చంద్రుని దక్షిణ ధృవానికి సంబంధించి ఇదే మొట్టమొదటి అధ్యయనం. ఇంకా లోతైన పరిశీలనలు జరుగుతున్నాయి' అని ఇస్రో ట్వీట్ చేసింది. చంద్రయాన్-3లో మొతం ఏడు పేలోడ్లు ఉండగా అందులో విక్రమ్ ల్యాండర్ నాలుగు, ప్రజ్ఞాన్ రోవర్ రెండు నిర్వహించనుండగా ఒకటి మాత్రం ప్రపల్షన్ మాడ్యూల్ నిర్వహించనుంది. ఈఏడు పేలోడ్లు ఒక్కొక్కటీ కొన్ని శాస్త్రీయ పరిశోధనలు నిర్వహిస్తాయి. చంద్రుడి నేలపై అధ్యయనం చేస్తున్న ChaSTE కాకుండా విక్రమ్‌లోని RAMBHA (అయాన్లు మరియు ఎలక్ట్రాన్లను అధ్యయనం చేయడానికి), ILSA (భూకంపాన్ని అధ్యయనం చేయడానికి), LRA (చంద్రుని వ్యవస్థ యొక్క గతిశీలతను అర్థం చేసుకోవడానికి) నిర్దేశించబడ్డాయి. Chandrayaan-3 Mission: Here are the first observations from the ChaSTE payload onboard Vikram Lander. ChaSTE (Chandra's Surface Thermophysical Experiment) measures the temperature profile of the lunar topsoil around the pole, to understand the thermal behaviour of the moon's… pic.twitter.com/VZ1cjWHTnd — ISRO (@isro) August 27, 2023 ఇది కూడా చదవండి: ఢిల్లీలో హై అలర్ట్.. మెట్రో స్టేషన్ గోడలపై ఖలిస్థాన్ నినాదాల కలకలం -
మళ్లీ ఉక్కపోత..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వాతావరణం మళ్లీ సెగలు కక్కుతోంది. కొద్దిరోజుల నుంచి ఉష్ణ తీవ్రత అధికమై పగటి పూట ఎండ చుర్రుమంటోంది. వర్షాకాలంలో ఇలాంటి వాతావరణం అరుదుగా కనిపిస్తుంది. మరోవైపు ఉష్ణతాపానికి ఉక్కపోత కూడా తోడవుతోంది. ఇది ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తోంది. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిన తర్వాత రాష్ట్రంలో ఈ వాతావరణం నెలకొంది. వారం రోజులుగా ఇదే పరిస్థితి ఉంటోంది. ఉదయం 9 గంటలు దాటితే చాలు.. ఎండ ఊపందుకుని సాయంత్రం వరకు కొనసాగుతోంది. కొన్నాళ్లుగా రాష్ట్రంలో తేలికపాటి జల్లులే తప్ప ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. పైగా మేఘాలు కూడా అంతగా ఏర్పడటం లేదు. ఫలితంగా సూర్యుడి నుంచి నేరుగా కిరణాలు పడటం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి ఎండల ప్రభావం కనిపిస్తోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి మరో వారం రోజులపాటు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఆగస్టు మొదటి వారంలో అల్పపీడనాలు ఏర్పడి వర్షాలు విస్తారంగా కురుస్తాయి. కానీ.. అందుకు భిన్నంగా ఇప్పుడు వానలకు బదులు ఎండలు కాస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంపైకి నైరుతి గాలులు వీస్తున్నాయి. ఈ గాలుల్లో వర్షాలు కురిపించేటంత తేమ ఉండటం లేదు. దీంతో వానలకు ఆస్కారం ఉండకపోగా ఉక్కపోత కూడా ఇబ్బంది పెడుతోంది. 40 డిగ్రీలకు చేరువలో.. రాష్ట్రంలో ప్రస్తుతం సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో రికార్డవుతున్నాయి. సోమవారం బాపట్లలో అత్యధికంగా 39 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 5.2 డిగ్రీలు అధికం. ఇంకా పలుచోట్ల 35నుంచి 38 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఉష్ణతీవ్రత కొనసాగుతుందని, అసౌకర్యంతో కూడిన వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. సాధారణం కంటే 3–5 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు గాని కురిసే అవకాశం ఉందని వివరించింది. -
Green Roof : మండుటెండల్లో రేకుల ఇల్లు కూడా చల్లచల్లగా..!
వేసవిలో మండే ఎండలు, ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ఎగువ మధ్యతరగతి, ధనికులైతే ఇళ్లలో ఏసీలు పెట్టుకొని సేదతీరుతుంటారు... మరి నగరాల్లోని బస్తీలు, మురికివాడల్లో రేకుల ఇళ్లలో నివసించే పేదల పరిస్థితి ఏమిటి? పైకప్పుల నుంచి లోపలికి వచ్చే వేడికి తాళలేక, నిద్ర పట్టక వారు విలవిల్లాడా ల్సిందేనా? ఈ ప్రశ్నకు వినూత్న ప్రయోగాలు చవకైన ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తెస్తున్నాయి. భూతాపం ఏటేటా పెరిగిపోతున్న ఈ కాలంలో పేదల ఇళ్లను చల్లబరిచే పనిని విస్తృతంగా వ్యాప్తిలోకి తేవడానికి జూన్ 6న ‘వరల్డ్ గ్రీన్ రూఫ్ డే’ని జరుపుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం. (బ్రెజిల్‌లోని రియో డి జెనీరో నగరంలోని ఓ మురికివాడ (ఫావెల్)లో లూయిస్ కాసియానో తన అస్బెస్టాస్ రేకుల ఇంటిపై స్వయంగా ఏర్పాటు చేసుకున్న గ్రీన్ రూఫ్ (ఏరియల్ వ్యూ)) జూన్ 6 వరల్డ్ గ్రీన్ రూఫ్ డే పై ఫొటోలో తన ఆకుపచ్చని ఇంటి పైకప్పుపై కూర్చున్న వ్యక్తి పేరు లూయిస్ కాసియానో (53). బ్రెజిల్‌లోని రియో డి జెనీరో మహానగరంలో పార్క్యు అరర అనే మురికివాడలో ఆస్బెస్టాస్ సిమెంటు రేకుల ఇంట్లో 85 ఏళ్ల తల్లితో కలసి నివాసం ఉంటున్నాడు. వేసవిలో అక్కడ పగటి ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్షియస్ దాటిపోతూ ఉంటుంది. ‘ఇటుకలు పగలు వేడిని పీల్చుకొని రాత్రుళ్లు వదులుతూ ఉంటాయి. తెల్లవారుజామున 3 గంటలయ్యే వరకు ఇల్లు చల్లబడేది కాదు. చెమటలు ఆగేవి కాదు. నిద్రపట్టేది కాదు. (మురికివాడలో ఇరుకైన రేకుల ఇళ్ల మధ్య 50 డిగ్రీల సెల్షియస్ ఎండలోనూ మొక్కలతో పచ్చగా లూయిస్ కాసియానో ఇల్లు. పైపు డ్రిప్ ద్వారా ఈ మొక్కలకు తగుమాత్రంగా నీరు ఇస్తూ లూయిస్ పరిరక్షించుకుంటున్నారు.) భరించలేనంత వేడిగా ఉండేది..’అని పదేళ్ల క్రితం పరిస్థితిని కాసియానో గుర్తు చేసుకుంటూ ఉంటారు. కానీ ఆయన స్వయంగా తన ఇంటిపై గ్రీన్ రూఫ్ ఏర్పాటు చేసుకోవటంతో పరిస్థితి సానుకూలంగా మారిపోయింది. 2012లో రేకుల ఏటవాలు పైకప్పు మీద మొక్కల్ని పెంచడం మొదలుపెట్టాక ఇల్లు చల్లబడింది. ‘ఇరుగు పొరుగు ఇళ్లకన్నా మా ఇల్లు 15 డిగ్రీల సెల్సియస్ వరకు చల్లగా ఉంటోంది. రాత్రివేళల్లో విద్యుత్ సరఫరా కొన్ని గంటలు లేకపోయినా ఇంట్లో ఉండగలుగుతున్నాం’అని కాసియానో చెప్పారు. (లూయిస్ కాసియానో రేకుల ఇంటి పైకప్పుపై మొక్కల్ని పెంచుతున్నది ఇలా) రియో డి జెనీరో యూనివర్సిటీలో గ్రీన్రూఫ్స్పై పరిశోధన చేస్తున్న బ్రూనో రెసెండో సహకారంతో కాసియానో తన ఇంటిపై ప్లాస్టిక్ కూల్‌డ్రింక్ సీసాలను రీసైకిల్ చేసి తీసిన తేలికపాటి పాలిస్టర్ నాన్‌ఓవెన్ జియోటెక్స్‌టైల్ పరదాను పరచి, మట్టి పోసి తీవ్ర ఎండలను సైతం తట్టుకొనే మొక్కలను పెంచుతున్నారు. గ్రీన్‌రూఫ్ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి మరీ ఆయన ప్రచారం చేస్తున్నారు. గ్రీన్‌రూఫ్‌లు.. కొన్ని ప్రయోగాలు ముంబై, బెంగళూరులలో సీబ్యాలెన్స్, హసిరుదల వంటి స్వచ్ఛంద సంస్థలు ఇళ్ల పైకప్పులపై వినూత్న ప్రయోగాలు చేస్తున్నాయి. బెంగళూరులోని జ్యోతిపుర మురికివాడలో రేకుల ఇంటి పైకప్పు మీద నీలిరంగు టార్పాలిన్‌పై నీరు నింపిన ప్లాస్టిక్ సీసాలను సీబ్యాలెన్స్ సంస్థ ఏర్పాటు చేసింది. ఈ సీసాల్లోని నీరు ఉష్ణోగ్రతను గ్రహించడం వల్ల ఆ మేరకు ఇల్లు తక్కువగా వేడెక్కుతుందని ఆ సంస్థ చెబుతోంది. రేకుల ఇంటిపై నీలిరంగు ప్యానెళ్లను అమర్చడం ద్వారా కూడా వేడిని తగ్గించవచ్చు. రేకుల ఇంటిపై తెల్ల టి ‘ఎకోబోర్డ్ పేనల్స్’ను పరచి అధిక ఉష్ణోగ్రత నుంచి కొంత మేరకు రక్షణ పొందొచ్చు. రేకుల ఇంటిపై అడుగు ఎత్తున ఇనుప ఫ్రేమ్‌ను ఏర్పాటు చేసి.. దానిపై ఎకోబోర్డ్ ప్యానళ్లను అమర్చటం వల్ల అధిక ఉష్ణోగ్రతను ఎదుర్కొనే ప్రయత్నం చేయొచ్చు. ఈ ఉపాయం సత్ఫలితాలిస్తున్నట్లు సీబ్యాలెన్స్ సంస్థ చెబుతోంది. (బెంగళూరులోని జ్యోతిపుర మురికివాడలో రేకుల ఇంటిపై ఎకోబోర్డ్ ప్యానల్స్‌ను పరచి అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే ప్రయత్నం) మొండి మొక్కలతో కూల్‌కూల్‌గా.. 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లోనూ ఇళ్ల పైకప్పులను చల్లగా ఉంచే కొన్ని మొండి జాతుల మొక్కలను కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖకు చెందిన స్వతంత్ర పరిశోధనా సంస్థ పుణేలోని అఘార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఆర్ఐ) ఇటీవల గుర్తించింది. పశ్చిమ కనుమల్లో కనుగొన్న 62 రకాల మొండి జాతి మొక్కలు 95% తేమను కోల్పోయినా చనిపోవని, తిరిగి తేమ తగిలినప్పుడు చిగురిస్తాయని తెలిపింది. (బెంగళూరులోని జ్యోతిపుర మురికివాడలో ఓ రేకుల ఇంటిపైన అడుగు ఎత్తున ఇనుప ఫ్రేమ్‌ను ఏర్పాటు చేసి, దానిపై ఎకోబోర్డ్ ప్యానళ్లను అమర్చటం వల్ల అధిక ఉష్ణోగ్రతను ఎదుర్కొనే ప్రయత్నం) నగరాల్లో పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే రేకులు, శ్లాబ్ ఇళ్ల పైకప్పులపై ఈ జాతులను పెంచితే స్వల్ప ఖర్చుతోనే గ్రీన్‌రూఫ్‌లు అందుబాటులోకి వస్తాయి. డ్రిప్ ద్వారా నీటిని తగుమాత్రంగా అందిస్తే ఎంత ఎండైనా ఇవి పచ్చగానే పెరిగే అవకాశం ఉంది. – పంతంగి రాంబాబు, సీనియర్ న్యూస్ ఎడిటర్, సాక్షి సాగుబడి డెస్క్ -
యాపిల్ స్పెషల్ ఫీచర్‌తో స్మార్ట్ ట్రావెల్ మగ్, ధర వింటే..!
సాక్షి, ముంబై: టెక్ దిగ్గజం యాపిల్ ఉత్పత్తులకు ఉండే క్రేజే వేరు. అత్యంత ప్రజాదరణ పొందిన వాటిల్లో ఐఫోన్లు, ఎయిర్‌పాడ్స్, ఐపాడ్స్, స్మార్ట్ వాచెస్‌ను చూశాం. తాజాగా టెంపరేచర్‌ను కంట్రోల్ చేసే కీలక ఫీచర్‌తో యాంబర్ ట్రావెల్మగ్ 2+ను యాపిల్ తన ఆన్లైన్ స్టోర్‌లో విక్రయిస్తోంది. యాపిల్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ట్రావెల్ మగ్ ధర ప్రస్తుతం 199.95 డాలర్లు (రూ. 16,542) గా ఉంది. (మంటల్లో మహీంద్రా ఎక్స్‌యూవీ700: వీడియో వైరల్, స్పందించిన కంపెనీ) ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్‌లో ఫైండ్ మై యాప్‌కు సపోర్ట్‌ను అందిస్తోంది అంటే ఒక వేళ ఈ స్మార్ట్ ట్రావెల్ మగ్ పోతే, దాన్ని ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. (మారుతీ ‘జిమ్నీ’: మీకో గుడ్‌న్యూస్, ఇంట్రస్టింగ్ అప్డేట్స్) వేడిగా వేడిగా కాఫీనో, టీనో ఆస్వాదించే ఈ యాంబర్ ట్రావెల్ మగ్ 2+ లో మనం తాగే డ్రింక్ ఉష్ణోగ్రతను (120°F- 145°F) సెట్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ బ్యాటరీ సాయంతో ఉష్ణోగ్రతను 3 గంటల వరకు ఉంచుకోవచ్చు. లేదా ఛార్జింగ్ కోస్టర్ సాయంతో రోజంతా కూడా ఇందులోని డ్రింక్స్‌ను హాట్‌గా ఉంచుకోవచ్చు. ఇలాంటి టెక్ వార్తలు, ఇతర బిజినెస్ వార్తలకోసం చదవండి: సాక్షిబిజినెస్ -
తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి వానలు
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ బిహార్ నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆదివారం రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడి న వర్షాలు కూడా పడొచ్చని చెప్పింది. ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదవుతాయని వివరించింది. హైదరాబాద్ పరిసరాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 39–42 డిగ్రీల వరకు నమోదు కానున్నట్లు అంచనా వేసింది. చదవండి: మళ్లీ అకాల వర్ష బీభత్సం -
TS: రెండ్రోజులు సాధారణ ఉష్ణోగ్రతలే
సాక్షి, హైదరాబాద్: తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వివరించింది. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో తూర్పు, దక్షిణ ప్రాంత జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నల్లగొండ జిల్లా దామెరచర్లలో 45.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 42.5 డిగ్రీల చొప్పున నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 25.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. రాష్ట్రానికి వాయవ్య దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వడదెబ్బకు ముగ్గురు మృతి.. అశ్వారావుపేట రూరల్: ఒకే గ్రామ పరిధిలో వడదెబ్బకు గురై ముగ్గురు వ్యక్తులు శుక్రవారం మృతి చెందారు. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం కాలనీ గ్రామానికి చెందిన అచ్చె రామారావు (75) ఎండవేడితో తీవ్ర అస్వస్థతకు గురికాగా కుటుంబసభ్యులు ఆస్పత్రి తీసుకెళ్లేలోగానే మృతి చెందాడు. వినాయకపురం గ్రామానికి చెందిన బేతం చిన్ని (58), తన్నీరు మనోహర్ (48) కూడా వడదెబ్బతో మృతి చెందారు. -
ఏపీలో తీవ్ర వడగాల్పులు.. ఈ జిల్లాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక
సాక్షి, అమరావతి: నేడు రాష్ట్రంలో 127 మండలాల్లో తీవ్రవడగాల్పులు,173 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ తెలిపింది. బుధవారం 92 మండలాల్లో తీవ్ర వడగాల్పులు,190 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. నేడు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(127) : ⇒ అల్లూరి జిల్లా -2 ⇒ అనకాపల్లి -8 ⇒ బాపట్ల -9 ⇒ తూర్పుగోదావరి -17 ⇒ ఏలూరు -3 ⇒ గుంటూరు -13 ⇒ కాకినాడ -18 ⇒ కోనసీమ -15 ⇒ కృష్ణా -18 ⇒ ఎన్టీఆర్ -8 ⇒ పల్నాడు -2 ⇒ మన్యం -1 ⇒ విశాఖ -3 ⇒ పశ్చిమగోదావరి జిల్లాలోని 13 మండలాల్లో తీవ్రవడగాల్పులు, మరో 173 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. ⇒ నేడు విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ,ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది ⇒ కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆదివారం ఎన్టీఆర్ జిల్లాలో 10 మండలాలు, మిగిలిన చోట్ల మొత్తం 34 మండలాల్లో వడగాల్పులు వీచాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో 44.8°C, ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలో 44.7°C ల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనవి. -డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ. చదవండి: బంగ్లా తీరాన్ని తాకిన మోకా -
మైనస్ 15 డిగ్రీల చలి.. బికినీలో స్టార్ హీరోయిన్ హాట్ ట్రీట్.!
తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ గుర్తింపు దక్కించుకున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్లో ఛత్రివాలి, డాక్టర్ జి, థ్యాంక్ గాడ్ చిత్రాల్లో విభిన్న పాత్రల్లో రకుల్ నటించింది. టాలీవుడ్లో దూరమయ్యాక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతోంది. అయితే ఇటీవల తన గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. అయితే తాజాగా ఆమె చేసిన సాహసానికి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. (ఇది చదవండి: మాళవిక బోల్డ్ కామెంట్స్.. సిగ్గుపడి మెలికలు తిరిగిపోయిన డైరెక్టర్!) రకుల్ ప్రీత్ మరీ బోల్ట్ డ్రెస్సులతో కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. బికినీ ధరించి మైనస్ 15 డిగ్రీల వాటర్‌లో ఉంటూ అందరినీ ఆశ్చర్యానికీ గురి చేసింది. బికినీ డ్రెస్‌లో.. అది మైనస్ డిగ్రీల చన్నీళ్లలో మునగడం సాహసమేనని మెచ్చుకుంటున్నారు. అయితే ఇదంతా ఆమె ఇటీవలే క్రియో థెరపీ చేయించుకుంది. అందులో భాగంగానే ఇలా గడ్డకట్టే నీటిలో స్నానం చేసిందంటున్నారు. ఏది ఏమైనా ఇలా అందాలు ఆరబోస్తూ రకుల్ ప్రీత్ సింగ్ ఏమాత్రం తగ్గడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: అసలు కీర్తీ సురేశ్‌కు ఏమైంది.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్!) -
జోరుగా వానలు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. వానాకాలాన్ని తలపించేలా అన్ని ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. గడచిన 24 గంటల వ్యవధిలో తిరుపతి జిల్లా నారాయణవనంలో అత్యధికంగా 103.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తిరుపతి జిల్లా దొరవారిసత్రంలో 96.2, సూళ్లూరుపేటలో 88.4, కుమార వెంకట భూపాలపురంలో 87.8, పెళ్లకూరులో 74.8, గూడూరులో 73.2, పుత్తూరులో 67.2 మిల్లీమీటర్ల వర్షం పడింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరంలో 92.2, ముమ్మిడివరంలో 85.4, కాకినాడ జిల్లా తాళ్లరేవులో 91 మి.మీ. వర్షం పడింది. ఇక సోమవారం ఉ.8.30 గంటల నుంచి మంగళవారం ఉ.8.30 గంటల వరకు అనకాపల్లి జిల్లాలో సగటున 36.11 మి.మీ. వర్షం పడింది. అంబేద్కర్ కోనసీమలో 31.89, కాకినాడ జిల్లాలో 33.03, తిరుపతి జిల్లాలో 31.55 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. రాష్ట్రం మొత్తంగా 9.81 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. మండలాల్లో అత్యధిక వర్షం ఇలా.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో అత్యధికంగా 79 మిల్లీమీటర్ల సగటు వర్షం కురిసింది. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో 61.50, కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలో 48.75, ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలంలో 67.75, పల్నాడు జిల్లా పెదకూరపాడులో 68, ప్రకాశం జిల్లా మార్కాపురంలో 58.25, వైఎస్సార్ జిల్లా శ్రీ అవధూత కాశీనాయన మండలంలో 44 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ద్రోణి మరోవైపు.. విదర్భ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకూ విస్తరించి ఉన్న ద్రోణి (గాలుల కోత) మధ్యప్రదేశ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు మరఠ్వాడా మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా ఉన్న మరో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 3.1 కిలోమీటర్ల మధ్య ఉంది. అలాగే.. ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ/దక్షిణ దిశలో గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎండలు మండినా వర్షాలూ ఎక్కువే ఇక ఇప్పటికే మే నెలను తలపించేలా ఏప్రిల్‌లో ఎండలు మండగా.. పది రోజులకు పైగా వడగాడ్పులూ వీచాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు ఎగబాకి జనాన్ని బెంబేలెత్తించాయి. అయినప్పటికీ రాష్ట్రంలో ఏప్రిల్ నెలలో వర్షపాతం ఎక్కువగానే నమోదైంది. ఈ నెలలో సాధారణ వర్షపాతం 21.9 మిల్లీమీటర్లు కాగా.. 27.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అంటే కురవాల్సిన దానికంటే 26 శాతం అధికంగా వర్షం కురిసింది. కోస్తాంధ్ర–యానాం సబ్ డివిజన్లో 17.1 మి.మీలకు గాను 61 మి.మీలు (257 శాతం అధికంగా), రాయలసీమ సబ్ డివిజన్లో 19 మి.మీలకు 24.9 (31 శాతం అధికంగా) వర్షం కురిసింది. అత్యధిక వర్షపాతం బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 73.8 మి.మీలు (+327 శాతం) రికార్డయింది. అత్యల్ప వర్షపాతం కురిసిన జిల్లాల్లో విశాఖ జిల్లా ఉంది. ఇక్కడ 27 మి.మీలు కురవాల్సి ఉండగా 4.1 మి.మీలు మాత్రమే నమోదైంది. మరో 3 రోజులు వర్షాలు, పిడుగులు మరో మూడ్రోజులు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో బుధవారం అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు ఆయన తెలిపారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. -
ఎండలు బాబోయ్ ఎండలు.. జాగ్రత్తలు తీసుకోకుంటే కష్టం
భానుడి భగభగలతో వేసవి తాపం కొనసాగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు స్థిరంగానూ రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో తూర్పు దిశగా గాలి వీచింది. అనంతపురం అర్బన్: ఎండలు మండుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ ఎమ్.గౌతమి జిల్లా ప్రజలకు సూచించారు. ఈ మేరకు గురువారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. మధ్యాహ్నం వేళ 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోందని, వీలైనంత వరకూ ఉదయం, సాయంత్రం వేళల్లోనే బయటకు రావాలని తెలిపారు. అధికారులు తీసుకోవాల్సిన చర్యలనూ పేర్కొన్నారు. ఆదేశాలు ఇలా.. ● మునిసిపల్, పంచాయతీ అధికారులు జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాలు, కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. పట్టణాల్లో అక్కడక్కడా చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలి. ● డ్వామా, ఎంపీడీఓలు ఉపాధి హామీ పనుల వేళల్లో మార్పులు చేసుకోవాలి. ● 104, 108 అంబులెన్స్‌ల్లో ఐస్‌ప్యాక్‌లు, వడదెబ్బ తగిలిన వారికి అసవరమయ్యే మందులు అందుబాటులో ఉంచాలి. ● వడదెబ్బ బాధితులకు చికిత్స అందించేందుకు కావాల్సిన ఏర్పాట్లు ఆరోగ్య కేంద్రాల్లో ఉంచాలి. ప్రజలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాలి. ● వడదెబ్బ తగిలిన వారికి అందించే ప్రాథమిక చికిత్సపై విస్తృత ప్రచారం నిర్వహించాలి. ● అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా ఉండాలి. సిబ్బంది, నీటిని అందుబాటులో ఉంచుకోవాలి. ● సూదూర రూట్లలో నడిచే బస్సుల్లో తప్పసరిగా ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఆర్టీసీ అధికారులు అందుబాటులో ఉంచాలి. -
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగ.. వడగాడ్పుల సెగ.. అల్లాడుతున్న జనం
-
ఏపీలో దంచికొడుతున్న ఎండలు - అల్లాడిపోతున్న ప్రజలు ( ఫొటోలు)
-
దంచికొడుతున్న ఎండలకు గబ్బిలాలు విలవిల.. చలించిపోయిన గ్రామస్తులు
భువనేశ్వర్: దంచికొడుతున్న ఎండలకు మనుషులే తట్టుకోలేకపోతున్నారు. ఇక పక్షులు, జంతువుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా కబటబంధా గ్రామంలో గబ్బిలాలు ఎండ వేడికి విలవిల్లాడిపోతున్నాయి. హీట్ స్ట్రోక్ కారణంగా మృత్యువాత పడుతున్నాడు. అధిక ఉష్ణోగ్రతలతో మూడు రోజుల్లోనే 8 గబ్బిలాలు మరణించాయి. ఈ గ్రామం సమీపంలో దాదాపు 5వేలకు పైగా గబ్బిలాలు మూడు చెట్లపై నివసిస్తున్నాయి. రోజంతా వీటి చప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఎండదెబ్బకు వందల కొద్ది గబ్బిలాలు నేలపై పడిపోతున్నాయి. గ్రామస్థులు వీటిని చూసి చలించిపోతున్నారు. వాటికి ఉపశమనం కల్పించేందుకు వాటర్ స్ప్రే కొడుతున్నారు. గబ్బిలాలు పవిత్రమైనమని తాము భావిస్తామని, అందుకే వాటిని 20 ఏళ్లుగా కాపాడుకుంటున్నామని కేశవ్ చంద్ర సాహు అనే స్థానికుడు తెలిపాడు. ఎండ వేడికి తట్టుకోలేక గబ్బిలాలు కిందపడి చనిపోవడం చూస్తుంటే బాధగా ఉందన్నాడు. కాగా.. ఒడిశాలో ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు రానున్న ఐదు రోజుల్లో ఒడిశాలోని పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చదవండి: దేశవ్యాప్తంగా ఠారెత్తిస్తున్న ఎండలు -
తెలుగు రాష్ట్రాల్లో ఠారెత్తిస్తున్న ఎండలు
-
రాష్ట్రంలో దంచికొట్టనున్న ఎండలు..ఇప్పటికే పలుచోట్ల 40 డిగ్రీలకు పైగా నమోదు
సాక్షి, అమరావతి/గోనెగండ్ల: రాష్ట్రంలో సోమవారం నుంచి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే ఐదు రోజులు రెండు నుంచి నాలుగు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో.. ఆదివారమే అనేక ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నంలో 41.9 డిగ్రీలు, చింతూరులో 41.5, కూనవరంలో 40.1, తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో 41.9, కోరుకొండలో 40.3, రాజమండ్రిలో 40.6, రాజానగరంలో 40.7, ఏలూరు జిల్లా భీమడోలులో 41.6, ద్వారకా తిరుమలలో 41.2, కాకినాడ జిల్లా శంఖవరంలో 40.3, అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి, ముమ్మిడివరంలో 41.8, నంద్యాల జిల్లా కొత్తపల్లెలో 40, పగిడ్యాలలో 40.5, పల్నాడు జిల్లా నకరికల్లులో 40, పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టంలో 41.2, ప్రకాశం జిల్లా కొనకనమిట్లలో 41.2, జరుగుమిల్లిలో 40.6, శ్రీకాకుళం జిల్లా బుర్జలో 40, కోటబొమ్మాళిలో 40.4, లక్ష్మీనరసుపేటలో 40.2, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురంలో 41.3, వరికుంటపాడులో 41, విజయనగరం జిల్లా కొత్తవలసలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చాలాచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు. ఎండవేడికి పగిలిపోయిన కొండరాయి.. మరోవైపు.. అధిక ఉష్ణోగ్రతతో కర్నూలు జిల్లా గోనెగండ్లలోని నరసప్ప దేవాలయం దగ్గర ఉన్న పెద్ద కొండరాయి రెండుగా చీలిపోయింది. ఆదివారం మధ్యాహ్నం రెండుగంటల సమయంలో పెద్ద శబ్దం రావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా వచ్చి పరిశీలించారు. కొండరాయి పగిలిన దగ్గర నుంచి పొగలు రావడం, రాయి చిన్నచిన్న ముక్కలుగా పడిపోతుండటాన్ని గమనించారు. ఎండ ఎక్కువగా ఉండటంతో కొండరాయి పగిలిందని తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది చెప్పారు. చదవండి: 1991లో ఒకటి.. ఇప్పుడు నిమిషానికి 175.. యాక్టివ్‌గా ఉన్నది 18 శాతం మాత్రమే! -
తెలంగాణ: రానున్న రెండ్రోజులు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గత రెండు రోజులుగా కొనసాగిన ఉపరితల ద్రోణి శనివారం బలహీనపడింది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయని వాతావరణ శాఖ సూచించింది. మరో రెండ్రోజులు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. శనివారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే..గరిష్ట ఉష్ణోగ్రత మహబూబ్‌నగర్‌లో 37.9 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 19.8 డిగ్రీ సెల్సియస్‌గా నమోదయ్యాయి. -
ఎండలు.. జర జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల సమయంలో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రత్యేకంగా సూచనలు చేసింది. దాహం వేయకపోయినా వీలైనప్పుడల్లా తగినంత నీరు తాగాలని పేర్కొంది. దాహం వేసేంతవరకు వేచిచూడడం మంచి సూచిక కాదని తెలిపింది. పార్క్ చేసిన వాహనాల్లో పిల్లలను లేదా పెంపుడు జంతువులను వదిలి వెళ్లవద్దనీ, వాహనం లోపల ఉష్ణోగ్రత ప్రమాదకరంగా మారవచ్చని హెచ్చరించింది. ►బయటకు వెళ్లేప్పుడు తాగునీటిని వెంట తీసుకెళ్లాలి. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్)ను వినియోగించాలి. నిమ్మరసం, మజ్జిగ, లస్సీ వంటి ఇంట్లో తయారుచేసిన పానీయాలు, ఉప్పు కలిపిన పండ్ల రసాలను తీసుకోవాలి. పుచ్చ, కర్బూజ, ఆరెంజ్, ద్రాక్ష, వంటి అధిక నీటి కంటెంట్ ఉన్న సీజనల్ పండ్లు, కూరగాయలను తినాలి. అలాగే పైనాపిల్, దోసకాయ, పాలకూర లేదా ఇతర స్థానికంగా లభించే పండ్లు, కూరగాయలు తినాలని సూచించింది. సన్నని వదులుగా ఉండే కాటన్ వస్త్రాలను ధరించడం మంచిది. గొడుగు, టోపీ, టవల్ వంటి ఇతర సాంప్రదాయ పద్ధతుల్లో తలను ఎండ వేడి నుంచి రక్షించుకోవాలి. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు బూట్లు లేదా చెప్పులు తప్పనిసరిగా ధరించాలి. ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ►బాగా వెంటిలేషన్ ఉన్న చల్లని ప్రదేశాల్లో ఉండాలి. ప్రత్యక్ష సూర్యకాంతి, వేడి గాలులను నిరోధించాలి. పగటిపూట కిటికీలు, కర్టెన్లను మూసి ఉంచాలి. ►ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే బయటకు వెళ్లేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ►అనారోగ్యంతో ఉన్నవారు ఎండాకాలంలో ఇతరులకన్నా ఎక్కువ ప్రమాదంలో ఉంటారు. వీరు అదనపు శ్రద్ధ తీసుకోవాలి. మరీ ముఖ్యంగా శిశువులు, చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, ఆరుబయట పనిచేసే వ్యక్తులు, మానసిక వ్యాధి ఉన్న వ్యక్తులు, శారీరకంగా అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు, గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి. ►ఒంటరిగా నివసించే వృద్ధులు లేదా అనారోగ్యంతో ఉన్న వారి ఆరోగ్యాన్ని ప్రతి రోజూ పర్యవేక్షించాలి. ►శరీరాన్ని చల్లబరచడానికి ఫ్యాన్, తడిబట్టలను ఉపయోగించాలి. ►మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య బయటకు రావొద్దు. ఒకవేళ వచ్చినా ఎండలో శారీరకమైన కఠినమైన పనులు చేయకూడదు. ►తీవ్రమైన ఎండ సమయంలో వంట గదిలో వంట చేయకూడదు. ఒకవేళ చేయాల్సి వస్తే వంటిల్లు వెంటిలేషన్‌తో ఉండాలి. వెంటిలేట్ చేయడానికి తలుపులు, కిటికీలను తెరవాలి. ►ఆల్కహాల్, టీ, కాఫీ, శీతల పానీయాలు, పెద్ద మొత్తంలో చక్కెరతో కూడిన పానీయాలను తీసుకోకూడదు. ఇవి శరీర ద్రవాన్ని కోల్పోవడానికి లేదా కడుపు తిమ్మిరికి కారణం కావచ్చు. ►ఆరు బయట పనిచేసే కార్మికుల కోసం పని ప్రదేశంలో చల్లని తాగునీటిని అందుబాటులో ఉంచాలి. ప్రతి 20 నిమిషాలకు ఒక గ్లాసు నీరు తాగాలని వారికి చెప్పాలి. ►సాధారణ మానవ శరీర ఉష్ణోగ్రత 97.5ని ఫారిన్‌హీట్ నుండి 98.9ని ఫారీన్ హీట్ ఉండాలి. -
ఫ్యాన్.. ఏసీ ఆన్.. హీటెక్కుతున్న 'గ్రేటర్'.. భారీగా విద్యుత్ వినియోగం
సాక్షి, సిటీబ్యూరో: భానుడి ప్రతాపం అప్పుడే మొదలైంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు విద్యుత్ శాఖకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. సాధారణంగా శివరాత్రి తర్వాత ఎండల తాకిడి పెరుగుతుంది. ఈసారి మాత్రం ముందుగానే ఎండలు మండుతుండటంతో గ్రేటర్లో విద్యుత్ డిమాండ్ పెరిగింది. . ఉదయం 10 గంటల తర్వాత సూర్యుడు సుర్రుమంటున్నాడు. మధ్యాహ్నం పూట బయటికి రావాలంటేనే నగరవాసులు కాస్త ఆలోచిస్తున్నారు. శనివారం గరిష్ఠంగా 35.4 సెల్సియస్ డిగ్రీలు, కనిష్ఠంగా 16.8 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భగ్గున మండుతున్న ఎండలకు ఉక్కపోత తోడవడంతో ఉపశమనం కోసం సిటీజన్లు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వినియోగిస్తున్నారు. 57 ఎంయూలకుపైగా.. ► వాతావరణంలో ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ మార్పులను శరీరం తట్టుకోలేక పోతోంది. నిజానికి చలి కారణంగా నిన్న మొన్నటి వరకు ఫ్యాన్లు పెద్దగా వాడలేదు. ప్రస్తుతం ఉక్కపోత ప్రారంభం కావడంతో ఏకంగా ఏసీలను ఆన్ చేస్తున్నారు. కేవలం గృహ విద్యుత్ మాత్రమే కాకుండా వాణిజ్య వినియోగం భారీగా నమోదవుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు పూర్తి స్థాయిలో పని చేస్తుండటమే ఇందుకు కారణం. ► ఫిబ్రవరి మొదటి వారంలో నగరంలో రోజు సగటు విద్యుత్ డిమాండ్ 52 మిలియన్ యూనిట్లు ఉండగా, ప్రస్తుతం 57 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. రెండో శనివారం విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు. వర్కింగ్ డేస్‌తో పోలిస్తే.. సెలవు దినాల్లో వినియోగం కొంత తగ్గాల్సి ఉంది. కానీ ఇందుకు విరుద్ధంగా రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మార్చి చివరి నాటికి 75 నుంచి 80 ఎంయూలకు చేరుకునే అవకాశం ఉన్నట్లు డిస్కం అంచనా వేసింది. హీటెక్కుతున్న డీటీఆర్లు ఒక్కసారిగా విద్యుత్ వినియోగం పెరగడంతో సబ్స్టేషన్లలోని ఫీడర్లు ఒత్తిడికి గురవుతున్నాయి. ఆయిల్ లీకేజీలను సరి చేయకపోవడంతో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఒత్తిడి తట్టుకోలేక పేలిపోతున్నాయి. తాజాగా శనివారం పాతబస్తీ దారుíÙఫాలోని ఓ డీటీఆర్ నుంచి మంటలు వ్యాపించి భారీ శబ్దంతో పేలిపోవడంతో స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు. వేసవి ప్రారంభానికి ముందే లైన్ల పునరుద్ధరణ, లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, డీటీఆర్‌లలో ఆయిల్ లీకేజీల నియంత్రణ, ఎర్తింగ్ ఏర్పాటు, లూజు లైన్లను సరి చేయడం వంటి పనులు పూర్తి చేయాల్సి ఉన్నా.. అధికారులు ఇప్పటి వరకు వాటిపై దృష్టిపెట్టకపోవడం ఆందోళన కలిగిస్తోంది. చదవండి: ఆల్‌టైం రికార్డు సృష్టించిన చికెన్ ధర.. కేజీ రూ.720..! -
బాబోయ్ చలి.. ఈ డివైజ్ చేతుల్లో పట్టుకుంటే చాలు, క్షణాల్లో..
అసలే ఇది చలికాలం. కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు మరీ దారుణంగా పడిపోతుంటాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అరచేతులు చల్లబడిపోవడం అందరికీ ఎదురయ్యే సమస్యే! చేతులు వెచ్చబరచుకోవడానికి చలిమంటల ముందు కూర్చుంటుంటారు. పనుల మీద బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటే, చలిమంటల ముందు గంటల తరబడి కూర్చోవడం సాధ్యం కాదు కదా! ఈ ఆలోచనతోనే చేతులు వెచ్చగా ఉంచడానికి తగిన పరికరాన్ని అమెరికన్ కంపెనీ ‘ఒకూపా’ అందుబాటులోకి తెచ్చింది. ఇది రీచార్జబుల్ హ్యాండ్ వార్మర్. దీనిని చేతుల్లో పట్టుకుంటే చాలు, అరచేతులు క్షణాల్లోనే వెచ్చబడతాయి. అరచేతుల్లో పట్టుకోవడం ఇబ్బందిగా ఉంటే, గ్లోవ్స్‌లో దీనిని పెట్టేసుకున్నా సరిపోతుంది. ఒకసారి పూర్తిగా చార్జ్ చేసుకుంటే, దాదాపు ఆరుగంటల వరకు పనిచేస్తుంది. మోడల్స్ బట్టి దీని ధర 28.99 నుంచి 42.99 డాలర్ల వరకు (రూ.2389 నుంచి రూ.3543)వరకు ఉంటుంది. చదవండి: పాల ప్యాకెట్ తెచ్చిన అదృష్టం..వందల కోట్లు సంపాదిస్తున్న పేటీఎం సీఈవో! -
Europe Heatwave: మండిపోతున్న యూరప్.. చరిత్రలో తొలిసారి
లండన్: యూరప్‌ను ఎండలు అల్లాడిస్తున్నాయి. ముఖ్యంగా బ్రిటన్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మంగళవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం లింకన్షైర్లోని కోనింగ్స్‌బైలో ఏకంగా 40.3 డిగ్రీలు, హీత్రూలో 40.2 డిగ్రీలు నమోదైంది! దేశంలోని మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే మాదిరిగా అసాధారణ స్థాయిలో ఎండలు మండిపోయాయని వాతావరణ విభాగం తెలిపింది. సోమవారం రాత్రి నమోదైన 26 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా ఒక రికార్డేనని తెలిపింది. లండన్‌తోపాటు ఇంగ్లండ్‌లోని చాలా ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతావరణ విభాగం ప్రమాద హెచ్చరికలు చేసింది. సోమవారం జారీ చేసిన రెడ్ వార్నింగ్‌ను అధికారులు మంగళవారం కూడా కొనసాగించారు. అత్యధిక ఉష్ణోగ్రతలతో తూర్పు లండన్‌లోని వెన్నింగ్టన్ గ్రామంలో గడ్డికి అంటుకున్న మంటలు ఇళ్లకు వ్యాపించాయి. వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. యూరప్‌లో పలు దేశాలు ఎండ దెబ్బకు అల్లాడుతున్నాయి. ఎండల తీవ్రత, వడగాలుల ప్రభావం ఫ్రాన్సు, స్పెయిన్, జర్మనీ, బెల్జియం దేశాల్లో ఎక్కువగా ఉంది. ఫ్రాన్సు, స్పెయిన్, పోర్చుగల్, గ్రీసుల్లో అడవులను వారం రోజులుగా మంటలు దహించి వేస్తున్నాయి. ఇంగ్లండ్‌లో లండన్‌లోని కేంబ్రిడ్జిలో 2019లో నమోదైన 38.7 డిగ్రీల ఉష్ణోగ్రతే ఇప్పటిదాకా రికార్డు. వేసవి తాపం నుంచి కాపాడుకునేందుకు జనం జలాశయాలను ఆశ్రయిస్తున్నారు. రెడ్ జోన్‌గా ప్రకటించిన ప్రాంతాల్లో రైళ్ల రాకపోలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కువ సేపు ఎండ ప్రభావానికి గురైతే అనారోగ్యం తప్పదంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. వేసవి తీవ్రత నేపథ్యంలో కొన్ని చోట్ల ట్రాఫిక్ నిలిచిపోవడంతో రహదారులను మూసివేశారు. కొన్ని రైళ్లను ఆలస్యంగా నడిపారు. కొన్నిటిని రద్దు చేశారు. 40 డిగ్రీల ఎండలుంటే రైలు పట్టాలపై ఉష్ణోగ్రతలు 50, 60, 70 డిగ్రీల వరకు వెళ్తుంది. అలాంటి సమయాల్లో పట్టాలు అతుక్కుపోయి, రైళ్లు పట్టాలు తప్పే ప్రమాదముందని రైల్వే శాఖ తెలిపింది. ఎండలతో తలెత్తే డిమాండ్ కారణంగా ఇంగ్లండ్‌లోని కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని నీటి సరఫరా సంస్థలు తెలిపాయి. -
నిప్పులు కక్కుతున్న సూర్యుడు (ఫోటోలు)
-
ఆదిలాబాద్ జిల్లాలో దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
-
రెండు రోజులు వేడి గాలులు, ఉక్కపోత
-
రాత్రి సమయంలోనూ తగ్గని సెగలు
-
ఏపీలో సాధారణ స్థితికి చేరుకున్న ఉష్ణోగ్రతలు
-
నిప్పుల కొలిమి..!
-
మెరుపు మెరిస్తే.. కార్చిచ్చు
వాతావరణ మార్పులతో అకాల వర్షాలు, వరదలతోపాటు కార్చిచ్చులు కూడా ప్రబలిపోతాయని మనకు తెలుసు. అయితే పోర్ట్‌ల్యాండ్ స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్త ఒకరు ఇంకో ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు. మెరుపుల కారణంగా కార్చిచ్చులు రావడం మరింత ఎక్కువ అవుతుందని.. ఇది మధ్యధర ప్రాంతంలోనూ.. దక్షిణార్ధ భూగోళంలోని సమశీతోష్ణ ప్రాంతాల్లోనూ ఉండే అవకాశం ఉందని వీరు అంటున్నారు. ఎల్‌నినో, లా నినా వంటి వాతావరణ పరిస్థితుల కారణంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరగడం.. తద్వారా కొన్ని ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మారిపోవడం దీనికి ఒక కారణమని అంటున్నారు. ఉష్ణోగ్రతతోపాటు ఆక్సిజన్, మండేందుకు అవసరమైన పదార్థాలు అందుబాటులో ఉండటం వల్ల మెరుపులతోనూ కార్చిచ్చులు ప్రబలే అవకాశాలు ఎక్కువవుతాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పశ్చిమ దిక్కు నుంచి వీచే గాలులు అంటార్కిటికా సమీపానికి చేరుకోవడం వల్ల దక్షిణ అమెరికా, ఆఫ్రికా ఆస్ట్రేలియాల్లో వాన చినుకు అన్నది కనిపించకుండా పోతుందని.. దీనివల్ల వేడి ఎక్కువై కార్చిచ్చులు ఎక్కువ అయ్యే అవకాశాలు పెరిగిపోతాయని ఆయన అన్నారు. చలికాలంలో తేమ తక్కువగా ఉండటం.. వేసవి ఎక్కువ కాలం కొనసాగడం వంటివన్నీ పరిస్థితి మరింత విషమించేందుకు దోహదపడుతున్నాయని అన్నారు. -
ఏపిలో తగ్గిన ఉష్ణోగ్రతలు
-
రూటు మార్చిన రుతుపవనాలు
వానాకాలం మొదలై నెల గడుస్తోంది. అడపాదడపా చినుకులు పలకరిస్తున్నాయే గానీ.. పదునైన వానలు తక్కువే. ఎందుకిలా? సింపుల్‌గా చెప్పాలంటే వానలు దిశ మార్చుకున్నాయి. గత 15 ఏళ్లుగా భారతదేశానికి జీవనాడిగా చెప్పుకొనే నైరుతి రుతుపవనాలు మధ్య భారతదేశానికి ఉత్తరంగా ఎక్కువ బలపడ్డాయని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధన ఒకటి స్పష్టం చేస్తోంది. 2002 నాటి నుంచి ఏటా భారతదేశం మొత్తమ్మీద సగటు ఉష్ణోగ్రత 0.1 డిగ్రీ నుంచి 1 డిగ్రీ సెల్సి యస్ వరకూ పెరిగిందని, అదే సమయంలో హిందూ మహాసముద్ర ప్రాంతంలో మాత్రం ఉష్ణోగ్రతల పెరుగుదలలో మందగమనం కనిపించిందని ఎంఐటీ గుర్తించింది. ఈ తేడా ఎక్కువగా ఉండటం వల్ల రుతుపవన మేఘాలు బలంగా మారతాయి. ఎక్కువ వానలు కురిపిస్తాయి. అయితే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పు ఎందుకు వచ్చిందన్న విషయాన్ని ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. నైరుతి రుతుపవనాల తీరుతెన్నులపై బ్రిటిష్ కాలం నుంచి రికార్డులు ఉండగా.. 1950 నుంచి ఉన్న వాటిని పరిశీలిస్తే మధ్యభారతదేశం ప్రాంతంలో వర్షపాతం క్రమేపీ తగ్గుతూ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందని.. మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రల్లోని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు మరీ అధ్వానమవుతాయని అందరూ అనుకున్నారు. అయితే ఆఫ్రికా, తూర్పు ఆసియా ప్రాంతాల్లో మాదిరిగానే ఈ ప్రాంతంలోనూ పరిస్థితిలో మార్పులు కనిపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ కొంచెం ఆలస్యమైందని ఎంఐటీ శాస్త్రవేత్త చెన్ వాంగ్ అంటున్నారు. -
కొనసాగుతున్న భగభగలు!
- ఖరీఫ్ మొదలైనా తగ్గని ఉష్ణోగ్రతలు - గత ఏడాదితో పోలిస్తే 12 డిగ్రీలు అధికం - గూడూరులో అత్యధికంగా 42.53 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్ మొదలైనా..ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గుముఖం పట్టలేదు. గత ఏడాది జూన్ 2వ తేదీన ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల వరకే ఉన్నాయి. అయితే ఈ నెల 2వ తేదీన అత్యధికంగా 42.53 డిగ్రీలు ఉండటం గమానార్హం. వడగాల్పులు కూడా కొనసాగుతున్నాయి. ఖరీప్ సీజన్ మొదలయినా చినుక జాడ లేకపోవడం సర్వత్రా అందోళన కలిగిస్తోంది. గత ఏడాది ఖరీప్ ప్రారంభంతోనే వర్షాలు మొదలయ్యాయి. జూన్ 1వ తేదీనుంచే విత్తనం పనులు మొదలయ్యాయి. ఈ ఏడాది మాత్రం వేసవి కొనసాగుతుండడం అందోళన కలిగిస్తోంది. నైరుతి రుతుపవనాలు ముందస్తుగా అండమాన్ నికోబార్ దీవులను తాకినా.. వర్షాల జాడ మాత్రం కనిపించలేదు. మే నెలలో వర్షాలు సాధారణం కంటే తక్కువగా పడ్డాయి. జూన్ నెలలో ఎండల తీవ్రత తగ్గాల్సి ఉండగా యథావిధిగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంఓ సబ్సిడీపై పంపిణీ చేసే వేరుశనగకు డిమాండ్ లేకుండా పోయింది. శుక్రవారం నాటి ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. మండలం నమోదయిన ఉష్ణోగ్రతలు గూడూరు 42.53 నందికొట్కూరు 42.32 చాగలమర్రి 42.28 ఆళ్లగడ్డ 42.08 రుద్రవరం 41.93 డోన్ 41.86 -
తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలు
అనంతపురం అగ్రికల్చర్ : మూడు నెలల తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. గత నాలుగైదు రోజులుగా వాతావరణంలో స్వల్పంగా మార్పులు చోటు చేసుకోవడం, ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ తొలకరి జల్లులు పడటం, గాలివేగం పెరగడం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గాయి. అయితే ఉక్కపోత, వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. మొత్తమ్మీద 42 నుంచి 45 డిగ్రీల రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలతో సతమతమైన ‘అనంత’ జనం ఇపుడిపుడే కొంత ఉపశమనం పొందుతున్నారు. ఆదివారం గుమ్మగట్టలో 40.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. శింగనమల 39 డిగ్రీలు, తాడిమర్రి 38.4 డిగ్రీలు, అనంతపురం 38.2 డిగ్రీలు, గార్లదిన్నె 36.8 డిగ్రీలు, కూడేరు, రాప్తాడు 36.5 డిగ్రీలు.. ఇలా అన్ని మండలాల్లోనూ 34 నుంచి 36 డిగ్రీల మధ్య నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 24 నుంచి 26 డిగ్రీలు కొనసాగింది. గాలిలో తేమశాతం ఉదయం 75 నుంచి 85, మధ్యాహ్నం 30 నుంచి 40 శాతం మధ్య రికార్డయింది. గాలులు గంటకు 8 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో వీచాయి. నాలుగైదు మండలాల్లో తుంపర్లు పడ్డాయి. -
సన్‌స్ట్రోక్ @ 56
► ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పిట్టల్లా రాలుతున్న జనం ► 45 డిగ్రీలకు తగ్గని ఉష్ణోగ్రతలు ∙సింగరేణి ప్రాంతాల్లో మరింత తీవ్రం ► కనిపించని ప్రత్యామ్నాయ చర్యలు ఆదిలాబాద్/మంచిర్యాలఅగ్రికల్చర్: రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిప్పుల కుంపటిని తలపిస్తోంది. భానుడి ఉగ్ర రూపంతో ఎండల తీవ్రత, వడగాలుతో జనాలు విలవిల్లాడుతున్నారు. వడదెబ్బకు పిట్టల్లా రాలుతున్నారు. జిల్లాలో వేసవి ప్రారంభమైన నుంచి ఇప్పటివరకు 56 మంది వడదెబ్బతో మృతిచెందారు. ఈ ఐదు రోజుల్లోనే 15మంది మృతిచెందడం గమనార్హం. రాష్ట్రంలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఎండకు తట్టుకోలేక వడదెబ్బ మృతుల పెరుగుతోంది. రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో వడదెబ్బతో అత్యధికంగా మృతి చెందగా తరువాతి స్థానం ఆదిలాబాద్‌దే. రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాలో ప్రతీరోజు 44 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సింగరేణి ప్రాంతంలో 46 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ నిప్పుల కొలిమిలా మారుతోంది. దీంతో గని కార్మికులు కూడా పూర్తిస్థాయిలో విధులు నిర్వర్తించలేకపోతున్నారు. పాత జిల్లాలోని 52మండలాల్లోని సగం మండలాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకావడం గమనార్హం. రాష్ట్రం లోనే ఎక్కడా లేనంతగా జిల్లాలో వడదెబ్బ మృతుల సంఖ్య పెరిగిపోతోంది. కూలీ చేస్తేగానీ పొట్టగడవని పేద ప్రజలు ఎండను లెక్క చేయక పనులకు వెళ్లి అస్వస్థతకు గురవుతున్నారు. వడదెబ్బ మృతుల్లో ఉపాధి, వ్యవసాయ కూలీలే అధికంగా ఉన్నారు. వందలాది మంది అస్వస్థతకు గురవుతున్నారు. ప్రత్నామ్నాయ చర్యలేవి..? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటివరకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో వడదెబ్బ మృతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఉష్ణోగ్రతలు, వడదెబ్బకు సంబంధంచిన జాగ్రత్తలు, సూచనలు ఇంతవరకు ప్రజలకు తెలియజేయడం లేదు. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా కనీసం ఎలాంటి మందులు గానీ, సిబ్బంది ప్రచారం గానీ చేయడం లేదు. ఎండ తీవ్రతతో వడదెబ్బ తగిలిన సమయంలో ఎలా వ్యవహరించాలో తెలి యక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వేసవి కార్యాచరణ రూపొందించింది. దాని ప్రకారం పట్టణాలు, పల్లెల్లో చర్యలు తీసుకో వాల్సి ఉండగా అలాంటిదేమీ కనిపించడం లేదు. అత్యంత తీవ్రత ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉన్నప్పటికీ.. పట్టించుకు న్న నాథుడే లేకుండాపోయాడు. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని మంచిర్యాల, లక్సెట్టిపేట, బెల్లంపల్లి, మందమర్రి, జైపూర్, శ్రీరాంపూర్ వంటి బొగ్గు గనుల ప్రాంతాల్లో ఎండ నిప్పులు చిమ్ముతోంది. చాలా మండలాల్లో 45 డిగ్రీలకు పైగానే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కానీ ఈ ప్రాంతాల్లో అధికారులు ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదని తెలుస్తోంది. కూలీలే అధికం.. ఉమ్మడి జిల్లాల్లో వడదెబ్బతో ఎక్కువ మంది ఉపాధి, వ్యవసాయ కూలీలే మృత్యువాత పడుతుండడం గమనార్హం. ఉపాధి పనులు చేసే ప్రాంతాల్లో సరైన వసతులు కల్పించకపోవడంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురైతే మెడికిల్ కిట్లు చాలా చోట్ల అందుబాటులో లేవు. ఉపాధి కూలీలతో పాటు, వ్యవసాయ కూలీలు ఎండలో పనికి వెళ్లి వచ్చిన తర్వాత ఇంటి వద్ద వాంతులు చేసుకుని అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత పెరిగిపోవడం, కూలీ ప్రదేశాల్లో సౌకర్యాలు లేకపోవడం వారికి శాపంగా మారింది. కూలీనాలీ చేసుకుని పొట్టగడుపుకునే వారు వడదెబ్బతో మృత్యువాత పడుతుండడంతో ఆయా కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోతున్నాయి. వడదెబ్బతో మృతి చెందిన వారికి ఆపద్బంధు పథకం కింద ప్రభుత్వం రూ.50 వేలు ఆర్థికసాయం అందజేస్తోంది. ఈ పథకంపై చాలా మందికి అవగాహన లేకపోవడంతో లబ్ధి పొందడం లేదు. -
వడదెబ్బతో ఇద్దరు మృతి
వెల్దుర్తి రూరల్ : వడదెబ్బతో బుధవారం ఇద్దరు మహిళలు మృతి చెందారు. రామళ్లకోట గ్రామం దాసరిపేటలో మహబూబ్‌బీ(57)..అధిక ఉష్ణోగ్రతలతో రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఎండలో తిరిగి స్పృహ తప్పిపడిపోయారు. ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందారు. అలాగే వెల్దురికి చెందిన ముత్యాల తిమ్మక్క (48) బుధవారం కూలీపనికి వెళ్లి అస్వస్థతకు గురైయ్యారు. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించేలోపు మృతిచెందారు. మృతురాలికి పెళ్లైన కుమార్తె ఉంది. -
మరో నాలుగు రోజులు శగలే శగలు
► హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వడగాడ్పుల నుంచి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రోహిణీ కార్తె దగ్గర పడుతుండటంతో ఎండలు మండిపోతున్నాయి. శుక్రవారం నల్లగొండ, రామగుండంలలో 46 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు అన్నిచోట్లా 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మంలో సాధారణం కంటే ఐదు డిగ్రీలు ఎక్కువగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్లగొండలోనూ సాధారణం కంటే 4.8 డిగ్రీలు ఎక్కువగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
విచిత్ర ప్రకృతి
►పగలు తీక్షణమైన వడగాడ్పులు ►సాయంత్రం భీకర గాలులు, పిడుగుల వాన ►పిడుగుపాటుకు ఒకరు మృతి ►నేలకొరిగిన భారీ వక్షాలు ►వర్షపాతం స్వల్పమే తిరుపతి తుడా: వారం రోజులుగా భానుడు నిప్పులు కక్కుతున్నాడు. తీవ్ర ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా గురువారం సాయంత్రం అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. తిరుపతి, ఐరాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. విపత్తు నిర్వహణశాఖ ముందస్తు హెచ్చరికలు పనిచేశాయి. గురువారం సాయంత్రం జిల్లాలో పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. వీరి అంచనాకు తగ్గట్లుగానే జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. ఉరుములు, మెరుపులతో తరుముకొచ్చిన వర్షం అంతేవేగంగా వెళ్లిపోయింది. తిరుపతి తుడారోడ్డు ఒక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ షార్టుసర్క్యూట్‌తో కాలిపోయింది. అనేక ప్రాంతాల్లో గాలి, ఉరుములు మెరుపుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గురువారం జిల్లాలో 43 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు జీడీనెల్లూరు నియోజకవర్గంలో గాలుల వల్ల మామిడి కాయలు నేలరాలిపోయాయి. పిడుగుల ధాటికి జనం హడలిపోయారు. వెదురుకుప్పం మండలం ఆళ్లమడుగులో పిడుగుపాటు ఒక ఆవు మృతి చెందింది. ఒక పూరిగుడిసె దగ్ధమయింది. తిరుమలలోనూ భారీ వర్షం కురిసింది. ►ఐరాల మండలం వైఎస్గేటు, ఐరాల, నాంపల్లె, చంద్రయ్యగారిపల్లె, పొలకల, నాగవాండ్ల పల్లె, 35 యల్లంపల్లె పంచాయతీల పరిధిలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. నాంపల్లెలో పిడుగు పాటుతో ఆంజనేయుల నాయుడు అనే వ్యక్తి (52) మృతి చెందాడు. ►తొట్టంబేడు మండలం కొణతనేరిలో పిడుగుపాటుకు గడ్డివామి కాలిపోయింది. తంగేళ్లపాళెం వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పడిపోయింది. బసవయ్యపాళెంలో విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. కాసరం, చిట్టత్తూరు, చొడవరం, చియ్యవరం తదితర గ్రామాల్లో చెట్లు కూలిపోయాయి. ► రామకుప్పం మండలంలో ఈదురు గాలుల తాకిడికి ఇండ్ల పైకప్పులు ధ్వంసం కాగా ఓ విద్యుత్ స్తంభం విరిగిపడింది. అరటి, టమాట, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. కొటారుగడ్డలో విద్యుత్ స్తంభం విరిగి పడింది. మామిడి తోటల్లో మామిడి కాయలు ఎక్కువగా నేల రాలింది. ►శ్రీకాళహస్తిలోని పానగల్, ఏపీసీడ్స్, వ్యవసాయ మార్కెట్‌కమిటీ, ముత్యాలమ్మగుడి వీధి, భాస్కరపేట, రాజీవ్‌నగర్ ప్రాంతాల్లో చెట్లు కుప్పకూలిపోయాయి. పలు విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. -
వడదెబ్బతో ఒకరు మృతి
పాములపాడు: వడదెబ్బతతో పాములపాడుకు చెందిన బాలనాగశేషులు(24) బుధవారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం ఉదయం ఇతను ఉపాధి పనులకు వెళ్లాడు. ఎండ వేడిమి తట్టుకోలేక మధ్యలోనే ఇంటికి వచ్చాడు. సాయంత్రం పెట్రోల్ బంకులో విధుల నిమిత్తం వెళ్లి అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం ఆత్మకూరుకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. మృతుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ సుధాకరరెడ్డి కేసు నమోదు చేశారు. లావణ్య నిండు గర్భిణి కాగా.. మృతుని తల్లి లింగమ్మ చిన్న వయస్సులోనే భర్తను కోల్పోయింది. -
భగభగలు
రాష్ట్రవ్యాప్తంగా మండుతున్న ఎండలు ► భారీగా పెరిగిన గరిష్ట ఉష్ణోగ్రతలు ► సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీలు అధికం ► కొత్తగూడెంలో అత్యధికంగా 47.5 డిగ్రీలు ► దాదాపు అన్ని చోట్లా 43–44 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు ► పెరిగిన వడగాడ్పుల తీవ్రత.. నేడూ కొనసాగే అవకాశం ► ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: రాష్ట్రం నిప్పుల కొలిమిలా మండుతోంది. భానుడు ప్రతాపం చూపించడంతో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఉదయం 9 – 10 గంటల నుంచే వడగాడ్పులు వీస్తుండ డంతో రాష్ట్రంలో జనం అల్లాడిపోతున్నారు. మంగళవారం కొత్తగూడెంలో అత్యధికంగా 47.5 గరిష్ట ఉష్ణోగ్రత నమోదుకాగా.. నల్లగొండ, భద్రాచలం, ఖమ్మంలలో 46 డిగ్రీలుగా నమోదైంది. ప్రస్తుత వేసవి సీజన్లో ఇవే అత్యధిక ఉష్ణోగ్రతలని హైదరాబాద్ వాతా వరణ కేంద్రం ప్రకటించింది. నల్లగొండలో ఇదే తేదీన సాధారణంగా 41.2 డిగ్రీల ఉష్ణో గ్రత నమోదు కావాల్సి ఉండగా... ఏకంగా 5.2 డిగ్రీలు అధికంగా 46.4 డిగ్రీలుగా నమోదైం దని తెలిపింది. ఖమ్మంలో 40.2 డిగ్రీల సాధారణ ఉష్ణోగ్రతకుగాను 5.4 డిగ్రీలు అధికంగా రికార్డయింది. ఒకట్రెండు ప్రాం తాలు తప్పించి అంతటా 43–46 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. మరింతగా వడగాడ్పులు దేశ పశ్చిమ, వాయవ్య దిశల రాష్ట్రంపైకి వేడి గాలులు వీస్తుండటం, పొడి వాతావరణం నెలకొనడంతో ఎండలు మండిపోతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. బుధవారం కూడా వడగా డ్పులు వీస్తాయని, ముఖ్యంగా ఆదిలాబాద్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలోని పలు చోట్ల 47 డిగ్రీలకుపైగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో వడదెబ్బ కారణంగా ఇప్పటివరకు 250 మంది మృతి చెందినట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్ల నుంచి నివేదిక వచ్చిందని తెలిపారు. ఎండల తీవ్రత కారణంగా వీలైనంత మేరకు ప్రజలు ఆరుబయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విపత్తు నిర్వహణ శాఖ విజ్ఞప్తి చేసింది. మరోవైపు ఎండల తీవ్రత కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. తలనొప్పి, జలుబు, జ్వరాలు, వాంతులు, గొంతునొప్పి, దగ్గుతో అనేకమంది బాధపడుతూ చికిత్స కోసం వస్తున్నారని పేర్కొంటున్నారు. విలవిల్లాడుతున్న జనం.. భానుడి భగభగల వల్ల రాష్ట్రంలో జనం విలవిల్లాడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తం పారిశ్రామిక ప్రాంతం కావడంతో అక్కడ ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా నమోదవుతున్నాయి. కొత్త గూడెం, ఇల్లందు, మణుగూరు, పాల్వంచ, సారపాక, అశ్వాపురం తదితర ప్రాంతాల్లో, ఓపెన్‌కాస్ట్ గనుల సమీపంలో ఎండ వేడిమి కారణంగా విధులకు హాజరయ్యే కార్మికుల సంఖ్య తగ్గింది. ఇక ఖమ్మం జిల్లా అగ్ని గుండాన్ని తలపిస్తోంది. ఖమ్మం నగరం తోపాటు సత్తుపల్లి, వైరా, మధిర తదితర ప్రాంతాల్లో సాధారణానికి మించి ఉష్ణోగ్రత లు నమోదవుతున్నాయి. నల్లగొండ జిల్లాలోనూ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. ఉదయం 11 గంటల నుంచే రోడ్లన్నీ బోసిపోయాయి. కాగా ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బ తగిలి మంగళవారం ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఏపీలోనూ భానుడి ప్రతాపం.. భానుడు మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లోనూ తన ప్రతాపం చూపించాడు. వడదెబ్బ బారినపడి మంగళవారం ఒక్కరోజే 39 మంది మరణించారు. ఏపీలోని చాలాS ప్రాంతాల్లో మంగళవారం 44 నుంచి 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా రెంటచింతలలో అత్యధికంగా 46.7 డిగ్రీలు, ఆ తర్వాత బాపట్లలో 46.3, విజయవాడలో 46.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు రోజుల పాటు కోస్తాంధ్రలోని అన్ని జిల్లాల్లోనూ తీవ్ర వడగాడ్పులు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. వడదెబ్బతో ఆరోగ్యంపై ప్రభావం ఎండలు విపరీతంగా పెరిగిపోవడం, వడగాడ్పుల కారణంగా ఆరుబయటకు వెళ్లేవారు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఎక్కువ. వడదెబ్బ కారణంగా ఒక్కసారిగా నీరసించిపోతారు. వాంతులు, విరేచనాలు, జ్వరం, చర్మం పొడిబారడం, డీహైడ్రేషన్, రక్తపోటు పెరగడం, స్పృహతప్పి పోవడంతో పాటు కిడ్నీ, గుండె వంటి ఫెయిల్యూర్ తీవ్ర స్థాయి సమస్యలూ తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వడదెబ్బకు లోనైతే వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వారి శరీరాన్ని చల్లబరిచేలా చూడడంతోపాటు ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరినీళ్లు, నిమ్మరసం, గ్లూకోజ్ లేదా ఓఆర్ఎస్ కలిపిన నీటిని తాగించాలి. ఈ లక్షణాలుంటే జాగ్రత్త.. ♦ రోజుకు ఐదారుసార్ల కంటే ఎక్కువగా నీళ్ల విరేచనాలు కావడం, వాంతులు, వికారం, మెలిపెట్టినట్లుగా కడుపునొప్పి ఉండటం. ♦ జ్వరం 101 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే ఎక్కువగా ఉండటం. ♦ ఐదారు గంటలుగా మూత్ర విసర్జన నిలిచిపోవడం, నాలుక తడారిపోవడం. ♦ ఒక్కోసారి పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితికి చేరుకోవడం. ♦ పిల్లల శరీరంపై దద్దుర్లు రావడం, నుదురు వేడిగా ఉండటం. ఈ జాగ్రత్తలు తప్పనిసరి ♦ ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు వీలైనంత వరకు బ యట తిరగడం, ఆడటం వంటివి చేయకూడదు. ♦ తప్పనిసరి పరిస్థితుల్లో ఎండలోకి వెళితే టోపీ, తెల్లటి నూలు వస్త్రాలు ధరించడం మంచిది. ♦ నీరు, ఇతర ద్రవ పదార్థాలు వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి. ♦ మద్యం, టీ, కాఫీల వంటి వాటిని తగ్గించడం మంచిది. వన్యప్రాణులకూ తప్పని కష్టాలు వేడి తీవ్రతకు నీటి వనరులన్నీ ఎండిపోవడంతో వణ్యప్రాణులు జనావా సాల వైపు వస్తున్నాయి. అలా వేటగాళ్ల ఉచ్చులకు బలవుతున్నాయి. ఎండ వేడికి వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండ లం పెర్కవేడులో 300 వరకు సైబీరియా పక్షులు మృత్యువాత పడ్డాయి. ఈ నెల 6న ఇదే జిల్లా నల్లబెల్లి మండలం కొండాపురంలో నీటి కోసం వచ్చిన 2 నక్కలు బావిలో పడిపోయాయి. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం పరమేశ్వరస్వామి చెరువు సమీపంలోకి వచ్చిన 12 నెమళ్లు కలుషిత నీరు తాగి చనిపోయాయి. భూపాలపల్లి ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాల్లోకి వచ్చిన 5 దుప్పులు వేటగాళ్ల బారిన పడ్డాయి. బయటకు వెళ్లలేకపోతున్నాం ‘‘మండుతున్న ఎండల కారణంగా బయటకు వెళ్లలేకపో తున్నాం. మంగళవారమైతే బయట నిప్పుల వర్షం కురిసినట్లు అనిపించింది. హైదరాబాద్‌లో ఒకవైపు ఎండ, మరోవైపు ట్రాఫిక్ తో పరిస్థితి ఘోరంగా ఉంది..’’ – పృథ్వీ, మార్కెటింగ్ ఉద్యోగి ఎండలో తిరగొద్దు ‘‘వడగాడ్పులు వీస్తున్నందున ప్రజలు ఎండలో తిరగవద్దు. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండకు తిరగడం వల్ల డీహైడ్రేషన్ పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కోసారి బీపీ పడిపోతుంది. అందువల్ల అత్యధికంగా కొబ్బరినీళ్లు, మజ్జిగ, ఇతర ద్రవ పదార్థాలు తీసుకోవాలి..’’ – డాక్టర్ శేషగిరిరావు, నిమ్స్ గుండె వైద్య నిపుణులు వేసవి ప్రణాళిక అమలు చేయాలి ‘‘వడగాడ్పుల హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. వేసవి ప్రణాళికను అమలు చేయాలని అన్ని శాఖల అధికారులకు సూచించాం. జనం కూడా ఎండపూట ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూసుకోవాలి..’’ – సదా భార్గవి, విపత్తు నిర్వహణశాఖ ప్రత్యేక కమిషనర్ -
సూరీడు@ 44.50
మరో నాలుగు రోజులు సెగలే జిల్లాలో అల్లాడుతున్న జనం తిరుపతి తుడా: భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. మంగళవారం తిరుపతి లో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఈ ఏడాదిలో ఇదే అత్యధికం. ఈశాన్య వడగాడ్పులతోపాటు బంగా ళాఖాతం నుంచి వేడిగాలులు అధికంగా వీస్తున్నాయి. ఈ నేప«థ్యంలోనే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పెరిగిన ఎండల వల్ల ఉక్కపోత అధికమయింది. దీంతో మరో నాలుగు రోజుల పాటు ఎండ తీవ్రత ఇలానే ఉంటుందని హెచ్చరిస్తున్నారు. తిరుపతి.. చిత్తూరు గంగ జాతర వేడుకల్లో ఎండ ప్రభావం కనిపించింది. మంగళవారం మధ్యాహ్నం వేళ రహదారులన్నీ పలుచగా మారాయి. పాదచారులు మండుటెండల్లో నరకం చూశారు. చిరు వ్యాపారులు ఇంటికే పరిమితమయ్యారు. వడదెబ్బకు జిల్లాలో మంగళవారం ఐదుగురు చనిపోయారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పెరుగుతున్న ఎండలు, తీవ్ర ఉక్కపోత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో 38.5 డిగ్రీలకు తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలు 10 రోజుల వ్యవధిలోనే 44.5కు చేరాయి. ద్రోణి కారణంగా తగ్గుముఖంపట్టిన ఎండలు మళ్ళీ తీవ్రరూపం దాల్చాయి. రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పదిరోజుల్లోనే ఏకంగా ఆరు డిగ్రీల అధికంగా నమోదైంది. వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరోపక్క మునుపెన్నడూ లేనివిధంగా జనం వడదెబ్బ బారిన పడుతున్నారు. -
మండే సూరీడు
జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు తిరుపతిలో సోమవారం 43.5 ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజానీకం తిరుపతి తుడా: జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. తీవ్ర ఉష్ణోగ్రతలతో ప్రజలు ముప్పు తిప్పలు పడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఇళ్లల్లోంచి బయటకు రావడానికి మహిళలు, వృద్ధులు, చిన్నారులు భయపడుతున్నారు. భానుడి భగభగలకు రహదారులు వేడెక్కి పోయాయి. రోడ్డు కక్కుతున్న సెగలకు వాహన చోదకులు ఉక్కిరి బిక్కిరయ్యారు. సోమవారం రోజున తిరుపతిలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఈశాన్య వేడి గాలుల ప్రభావం కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. గత నెల చివరి వారం తోపాటు ఈ నెల మొదటి వారంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ద్రోణి కారణంగా జిల్లాలో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురవడంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ద్రోణి రాష్ట్రాన్ని దాటడంతో మళ్లీ భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎండ తీవ్రతకు వేడిగాలులు తోడవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు ఎండ తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. తీవ్ర ఉక్కపోత కారణంగా సాయంత్రం వేళల్లో ఇళ్లలో ఉండలేక ఆరు బయటే సేదదీరుతున్నారు. ఇక రాత్రి వేళల్లో ఫ్యాన్లు, కూలర్లు పని చేస్తున్నా జనం ఉక్కపోత నుంచి ఉపశమనం పొందలేకపోతున్నారు. ఎండ కారణంగా చిరు వ్యాపారులు, కూలీలు, పాదచారులు, కాపరులు, వాహనచోదకులు విలవిలలాడిపోయారు. ఎండలు మండుతుండడంతో ప్రధాన వ్యాపార సముదాయాల రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి. గ్రామీణ ప్రాంతాల్లో పశువులు, గొర్రెల కాపరులు ఇంటికే పరిమితమయ్యారు. -
బీర్ అయితనే బాగుంటది!
రాష్ట్రంలో భారీగా పెరిగిన వినియోగం - మండుటెండల్లో నచ్చిన బీర్‌తో మందుబాబుల మజా - ఒక్క ఏప్రిల్‌లోనే 40 లక్షల కేసుల బీర్లు అమ్మకం - దక్షిణాదిన ఉత్పత్తి, అమ్మకాల్లో తెలంగాణ టాప్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీర్లు పొంగి పొర్లుతున్నాయి. ఒకవైపు మండుటెండలు ఠారెత్తిస్తుండటం.. మరోవైపు 40 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలతో పెరుగుతున్న ఉక్కపోతతో మందుబాబులు రూటు మార్చా రు. వేసవి తాపాన్ని చల్లార్చుకునేందుకు బీరు బాట పట్టారు. నచ్చిన బీర్లతో మజా చేస్తున్నారు. ఈ పరిణామాలతో రాష్ట్రంలో బీర్ల వినియోగం అనూహ్యంగా పెరిగింది. బీర్ల ఉత్పత్తి, అమ్మకాల్లో దక్షిణాదిలోనే తెలం గాణ అగ్రస్థానంలో నిలిచింది. ఏప్రిల్ నెల లోనే రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల కేసుల బీర్లు అమ్ముడవడం గమనార్హం. ఒక్కో కేసుకు 12 సీసాల చొప్పున మొత్తంగా 4.80 కోట్ల సీసాల బీరును మందుబాబులు గుటకాయస్వాహా చేసేశారు. దక్షిణాదిలో తెలంగాణ నంబర్ వన్.. బీర్ల ఉత్పత్తి, వినియోగంలో తెలంగాణ దక్షి ణాదిలో నంబర్‌వన్‌గా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,200 మద్యం దుకాణాలు, 1,300 వరకు ఉన్న బార్లలో బీర్ల అమ్మకాలు ఉప్పొంగాయి. ఏప్రిల్ అమ్మకాల్లో 9.11 శాతం వృద్ధిరేటుతో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రెండోస్థానాన్ని దక్కించుకుంది. తమిళనాడు, కర్ణాటక మూడు, నాలుగు స్థానాలను దక్కిం చుకున్నాయి. కేరళ ఐదో స్థానంలో నిలిచింది. ఏప్రిల్‌లో ఆయా రాష్ట్రాల్లో బీర్ల అమ్మకాల్లో వృద్ధి, మందుబాబుల తలసరి బీరు వినియోగం ఇలా ఉంది. ఉత్పత్తిలోనూ అగ్రభాగమే.. బీర్ల ఉత్పత్తిలోనూ తెలంగాణ దక్షిణాదిలో అగ్రభాగాన నిలిచింది. రాష్ట్రంలోని ఐదు బీర్ల ఉత్పత్తి సంస్థలు(బ్రూవరీస్) 17 రకాల పేర్లతో బీర్లను తయారు చేస్తున్నాయి. రాష్ట్రంలో నెలవారీగా సగటున 25–30 లక్షల కేసుల బీరు అమ్ముడవుతుంది. ఏప్రిల్‌లో మండుటెండలకు అదికాస్తా.. 40 లక్షల కేసులకు చేరింది. రాష్ట్ర అవసరాలకు సరిపడా బీర్లను ఉత్పత్తి చేయడంతోపాటు.. మరో 15 లక్షల కేసుల బీర్లను కేరళ, కర్ణాటక, ఏపీలకు ఎగుమతి చేస్తుండడం విశేషం. సాధారణ రోజుల్లో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు 65 శాతం.. బీర్ల అమ్మకాలు 35 శాతం ఉంటాయి. కానీ మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మద్యం అమ్మకాలు.. బీర్ల అమ్మకాలు 50 శాతం ఉన్నట్లు ఆబ్కారీ శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఏటేటా ఛీర్స్లో వృద్ధి.. మద్యం అమ్మకాల్లో రాష్ట్రంలో ఏటా పెరుగుదల నమోదవుతోంది. ఐదేళ్లుగా రాష్ట్రంలో కేసులకొద్దీ బీర్లు, మద్యాన్ని మందుబాబులు స్వాహా చేస్తున్నట్లు ఆబ్కారీ శాఖ తాజా నివేదిక వెల్లడించింది. గతేడాది సుమారు రూ.12,706 కోట్ల విలువైన మద్యం, బీర్లను తాగేశారు. ఏటా వెయ్యి నుంచి రూ.2 వేల కోట్ల మేర అమ్మకాల్లో పెరుగుదల నమోదవుతోంది. క్షణాల్లో బీ(రు)రెడీ.. ఇక బీర్ల వినియోగంలో గ్రేటర్ హైదరా బాద్ రాష్ట్రంలోనే తొలిస్థానంలో నిలిచింది. దేశ, విదేశాలకు చెందిన బీర్లతోపాటు మన కళ్లముందే క్షణాల్లో తయారుచేసి ఫ్రెష్‌గా ముందుంచే పలు బార్లు, పబ్‌లు, రెస్టారెంట్లు నగరంలో కొలువుదీరాయి. హైటెక్‌సిటీ, బంజారాల్స్, మాదాపూర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఇవి అత్యధికంగా ఉండడం విశేషం. ఇటీవలికాలంలో 11 మినీ బ్రూవరీస్ సైతం సిటీలో ఏర్పాట య్యాయి. ఇక్కడ అమెరికా, మెక్సికో, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ తదితర దేశాలకు చెందిన పలు బీర్ల వెరైటీలు లభ్యమవు తున్నాయి. రేంజ్‌ను బట్టి వీటి ధర రూ.500 నుంచి రూ.2 వేల వరకు ఉంది. -
గరిష్ట ఉష్ణోగ్రత 40.7 డిగ్రీలు
సిటీబ్యూరో: నగరం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఎండ వేడిమికి తోడు వేడిగాలులు నగరవాసులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మంగళవారం గరిష్టంగా 40.7 డిగ్రీలు..కనిష్టంగా 24.1 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చుతగ్గులుంటాయని బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది. -
నిప్పుల కొలిమి
– డోన్‌లో అత్యధికంగా 45.14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు – రాష్ట్రంలోనే కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఎండలు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో భానుడు నిప్పులు కక్కుతున్నాడు. వడగాలుల తీవ్రత మరింత పెరిగింది. జాతీయ రహదారుల పొడవునా ఎండమావులు నీటి కుంటలను తలపిస్తున్నాయి. వాహన చోదకుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. వడదెబ్బ బారిన మృతి చెందిన వారి సంఖ్య ఇప్పటికే 30కి పైగా ఉండటం గమనార్హం. ఏప్రిల్ నెల మూడవ వారంలోనే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం డోన్‌లో 45.14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ, నందవరం తదితర మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు పట్టణాల్లో ముఖ్యమైన రహదారులు కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఇలా.. ప్రాంతం ఉష్ణోగ్రతలు డోన్ 45.14 నందికొట్కూరు 44,6 నందవరం(నాగులదిన్నె) 44.01 మద్దికెర 43.74 చాగలమర్రి 43.66 పగిడ్యాల 43.54 కర్నూలు(బుధవారపేట) 42.33 -
మండే సూరీడు
►రోజురోజుకూ పెరుగుతున్న ఎండ తీవ్రత ►ఉక్కపోతతో అల్లాడుతున్న జనం తిరుపతి తుడా: ఎండలు మండుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తుండడంతో రహదారులన్నీ కర్ఫ్యూను తలపించేలా నిర్మానుష్యంగా మారాయి. మధ్యాహ్నం వేళల్లో ఎండతీవ్రత అధికంగా ఉండడంతో జనం బయటకు రావడానికి భయపడుతున్నారు. మరోవైపు వేడి గాలుల ప్రభావం మొదలు కావడంతో జనం అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాయంత్రం వేళల్లో కొంతమేర చల్ల గాలు లు వీస్తుండడంతో ఉపశమనం కలుగుతోంది. గత ఏడాది రాష్ట్రంలో రికార్డు స్థాయిలో జిల్లాలో 50.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఈసారి ఏప్రిల్ మూడో వారంలోనే 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇక ఏప్రిల్ చివరివారం, మేలో మరింత అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆదివారం రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన జిల్లాగా చిత్తూరు రికార్డుల్లోకి ఎక్కింది. సోమవారం మరో 0.3 డిగ్రీలు పెరిగింది. హెచ్చరికలు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రెండు మూడు రోజులు ఉష్ణోగ్రతలు అధికంగా ఉండి వడగాల్పులు వీచే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. తూర్పు బంగాళా ఖాతంలో ఎన్‌నినో కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. -
సూర్య @45
జిల్లాలో ఉష్ణోగ్రత రోజు రోజుకు పెరుగుతోంది. సోమవారం జిల్లాలోని కోవెలకుంట్లలో అత్యధికంగా 45.08 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఈ వేసవిలో గరిష్టంగా నమోదయిన ఉష్ణోగ్రత ఇదే. చాగలమర్రిలో 44.14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఎండల తీవ్రతకు జిల్లా ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. గ్రామీణ ప్రజలు దాహర్తితో అల్లాడుతున్నారు. 10 రోజులకోసారి కూడా నీళ్లు సరఫరా కాని గ్రామాలు వందల్లో ఉన్నాయి. పశువుల పరిస్థితి దారుణంగా ఉంటోంది. జిల్లాలో 750 నీటి తొట్లు ఉన్నా.. వీటిల్లోనూ చుక్కనీరు ఉండకపోవడం గమనార్హం. - కర్నూలు(అగ్రికల్చర్) -
కొండ మండుతోంది
⇒తిరుమలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు ⇒శేషాచల ఏడుకొండల్లోనూ వడగాల్పులు, ఉక్కపోత ⇒శ్రీవారి భక్తుల అవస్థలు ⇒ఈసారి ఉపశమన చర్యలు పెంచిన టీటీడీ సూర్యభగవానుడు భగభగమంటున్నాడు. చల్లగా ఉండే శేషాచల ఏడుకొండల్ని కూడా వదలకుండా నిప్పులు కురిపిస్తున్నాడు. ఈ సీజన్లో తిరుమలలో గురువారం అత్యధికంగా 33.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వడగాల్పులు, ఉక్కపోత పెరగడంతో భక్తులు అల్లాడుతున్నారు. టీటీడీ కూడా ఈసారి ఉపశమన చర్యలు రెట్టింపు చేసింది. తిరుమల: ఈ వేసవి సీజన్లో తెలుగు రాష్ట్రాల్లో సూర్యభగవానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. తిరుమల ఏడుకొండల మీద కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. వేసవి సీజన్లోనూ చల్లగా ఉండే తిరుమలకొండ మీద ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం 33.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చల్లని ఈదురు గాలులకు బదులు వడగాల్పులు వీస్తున్నాయి. శ్రీవారి భక్తులకు ఉక్కపోత ఈ సీజన్లో గతంలో కంటే పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. దీని ప్రభావం శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులపై స్పష్టంగా కనిపిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు భక్తులు ఎండలోకి వచ్చేందుకు ఇష్టపడటం లేదు. ఆలయానికి వెళ్లిన భక్తులు ఎండలో నడిచేందుకు అష్టకష్టాలు చవిచూస్తున్నారు. ప్రత్యేకించి ఉత్తరాదికి చెందిన భక్తుల పరిస్థితి వర్ణనాతీతం. ఉపశమన చర్యలు రెట్టింపు వేసవిలో భక్తుల ఇబ్బందులకు తగ్గట్టుగానే ఈసారి టీటీడీ ఉపశమన చర్యలు పెంచింది. ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు పలుమార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. వేసవి ఏర్పాట్లు పెంచాలని ఆదేశించారు. ఫలితంగా ఫిబ్రవరి నుంచే వేసవి ఏర్పాట్లు చేపట్టారు. ఆలయం వద్ద, నాలుగు మాడ వీధుల్లోనూ భక్తులకు కాళ్లు కాలకుండా చలువ సున్నం (కూల్ పెయింట్) వేసి ఎర్ర తివాచీలు పరిచారు. నాలుగు మాడ వీధుల్లో వాటర్ స్ప్రింక్లర్లు ఏర్పాటుచేశారు. పగటి వేళల్లో నీటిని చల్లడం వల్ల నేల చల్లబడుతోంది. దీంతో భక్తులు కూడా సులభంగా నడిచి వెళుతున్నారు. ఆలయం వద్ద తాగునీటి ఏర్పాట్లు పెంచారు. ఆలయ ముందుభాగంలో, లడ్డూ కౌంటర్ల వద్ద చలువ పందిళ్లు నిర్మించారు. రద్దీ ఉండే ప్రాంతాల్లోనూ అవసరమైన చోట చలువ పందిళ్లు వేశారు. అధికారులూ వీటిపై దృష్టి సారించండి పెరుగుతున్న ఎండలకు తగ్గట్టుగానే వేసవి ఏర్పాట్లపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా తూర్పుమాడ వీధి మినహాయించి మిగిలిన దక్షిణ, పడమర, ఉత్తర మాడ వీధుల్లోనూ చలువ పందిళ్లు నిర్మించడం వల్ల భక్తుల కొంత సమయం పాటు ఆగి వెళ్లేందుకు వీలు పడుతుంది. ప్రత్యేకించి ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన భక్తులకు ఈ ఎండ కష్టాలు తప్పుతాయి.రూ.300 టికెట్ల క్యూ, సర్వదర్శనం క్యూ, కాలిబాట క్యూకు ప్రతిసారీ మార్చిలోనే నిర్మించే వట్టివేరు చాపలు ఇంకా అమర్చలేదు. దీనిపై అధికారులు సత్వరమే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆలయ మాడ వీధుల్లో తాగునీటితోపాటు మజ్జిగ పంపిణీ చేయడం వల్ల భక్తులకు టీటీడీ మరింత మేలు చేసినట్టువుతుంది. కాలిబాటల్లోనూ మంచినీటితోపాటు మజ్జిగ పంపిణీ చేయాలి. అవసరమైతే నడిచివచ్చే భక్తులకు గ్లూకోజ్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉచితంగా ఇస్తే భక్తులు వడదెబ్బకు గురికాకుండా క్షేమంగా తిరుమలకొండెక్కే అవకాశం కలుగుతుంది. -
అగ్గి భగ్గు
= సండే, మండే ఎండే = నేడు, రేపు జిల్లాలో తీవ్రమైన వడగాల్పులు = ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావొద్దు = వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజల్లో ఆందోళన = అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం = పాఠశాలల వేళలు సైతం కుదింపు ఒంగోలు టౌన్/కారంచేడు: ప్రచండ భానుడు భగభగమంటున్నాడు. ఏప్రిల్ మాసంలోనే తన ప్రతాపం చూపుతున్నాడు. ఇప్పుడే ఎండలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే మే నెలలో ఇంకెలా ఉంటుందోనని ఆందోళనలో ఉన్న ప్రజలకు వాతావరణ నిపుణుల హెచ్చరికలు మరింత హడలెత్తిస్తున్నాయి. రానున్న రెండురోజులు ఆది, సోమవారాల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని వాతావరణ కేంద్రం నుంచి హెచ్చరికలు రావడంతో జిల్లా యంత్రాంగం సైతం అప్రమత్తమైంది. ప్రజల్ని అప్రమత్తం చేయాలి :డీఆర్వో : రానున్న రెండు రోజుల్లో జిల్లాలో తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యలో ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్ నుంచి మున్సిపల్ కమిషనర్లు, జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆది, సోమవారాల్లో ఉష్ణోగ్రతలు పెరిగి తీవ్రమైన వడగాలులు వీస్తాయన్న హెచ్చరికలు జిల్లాకు వచ్చాయని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఎవరూ బయట తిరగరాదన్నారు. ఈ మేరకు పట్టణాలు, గ్రామాల్లో మైకులు, దండోరాలతో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. ఆ సమయంలో పశువులను కూడా బయటకు వదలరాదన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అన్ని పాఠశాలలను ఉదయం 10 గంటలకే మూసివేయాలన్నారు. ఉపాధి కూలీలు ఉదయం 10గంటలకే పనులు ముగించుకోవాలన్నారు. పింఛన్ల పంపిణీ ఉదయం 9గంటలకే పూర్తి చేయాలని ఆదేశించారు. మునిసిపల్ కమిషనర్లు అవసరమైన మేరకు మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కాన్ఫరెన్స్‌లో సీపీఓ భరత్‌కుమార్, డీఎంహెచ్ఓ యాస్మిన్, డీఆర్డీఏ పీడీ ఎంఎస్ మురళి, డ్వామా పీడీ పోలప్ప, డీపీఓ ప్రసాద్, పశుసంవర్థకశాఖ జేడీ రజనీకుమారి పాల్గొన్నారు. పాఠశాలల వేళలు కుదింపు..: వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఉదయం 7.30 నుంచి 10.00 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని ఎంఈవోలకు జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి ఆదేశాలు అందాయి. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గమనించాలని అధికారులు సూచించారు. జిల్లాలో శనివారం 25 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు పెద్దారవీడు – 42.78 మార్కాపురం – 42.53 మర్రిపూడి – 42.36, పొదిలి – 42.10, వెలిగండ్ల – 41.79, రాచర్ల – 41.55, ముండ్లమూరు – 41.51, బల్లికురవ – 41.24, సీఎస్‌పురం – 41.15, అద్దంకి – 40.48, అర్ధవీడు – 40.30, దొనకొండ – 40.39, దోర్నాల – 40.87, గుడ్లూరు – 40.58, హనుమంతునిపాడు–40.66, కనిగిరి – 40.92, కొమరోలు – 40.89, కొనకనమిట్ల –40.54, కొండపి – 40.58, పామూరు – 40.83, పొన్నలూరు – 40.06, సంతనూతలపాడు– 41.0, తర్లుపాడు – 40.62, తాళ్లూరు – 40.87, త్రిపురాంతకం – 40.26 -
నిప్పులకొలిమి
- పెరుగుతున్న ఉష్ణోగ్రతలు - అల్లాడుతున్న ప్రజలు - అవుకులో గరిష్టంగా 43.98 డిగ్రీలు నమోదు - ఎమ్మిగనూరులో 14.93 కిలోమీటర్ల వేగంతో వడగాల్పులు కర్నూలు(అగ్రికల్చర్): రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో జిల్లా ప్రజలు విలవిలలాడుతున్నారు. శనివారం జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి. గరిష్టంగా అవుకులో 43.98 డిగ్రీల నమోదైంది. కర్నూలు నగరంతో సహా జిల్లా మొత్తం దాదాపు ఇదే స్థాయిలో ఎండలు ఉన్నాయి. మరో వైపు వడగాలుల తీవ్రత పెరిగింది. ఎమ్మిగనూరులో 14.93 కిలోమీటర్ల వేగంతో వడగాలులు వీచడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. గోనెగండ్లలో 12.35, కొలిమిగుండ్లలో 11.19, కర్నూలు (దిన్నెదేవరపాడు)లో 11.17 కిలోమీటర్ల వేగంతో వడగాలులు వీచాయి. ఒకవైపు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, మరోవైపు వడగాలుల తీవ్రతతో వడదెబ్బకు గురయ్యే వారిసంఖ్య పెరిగిపోతోంది. వదడెబ్బ మృతులు పెరిగిపోతున్నారు. మొన్నటి వరకు ఉష్ణోగ్రతలు గరిష్టంగా 42.8 డీగ్రీలు ఉన్నాయి. శనివారం ఒక్కరోజులోనే ఒక డిగ్రీకి పైగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. రోజురోజుకు ఎండల తీవ్రత పెరిగిపోతుండటంతో వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు అల్లాడుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. జిల్లా సగటున ఫిబ్రవరి నెలలో 9.19 మీటర్లలోతులో ఉన్న భూగర్భ జలాలు 10.69 మీటర్ల అడుగుకు పడిపోయాయి. నెల రోజుల వ్యవధిలోనే ఒకటిన్నర మీటర్ల మేర భూగర్బ జలాలు పడిపోయాయి. భూగర్భ జలాలు పడిపోతుండటంతో నీటి సమస్య తీవ్రం అవుతోంది. వారానికి ఒక రోజు కూడ నీళ్లు సరఫరా కాని గ్రామాలు వందల్లో ఉన్నాయి. నీటి ఎద్దడి ఏర్పడటంతో మినరల్ వాటర్‌కు డిమాండ్ పెరిగింది. గ్రామాల్లో మినరల్ వాటర్ అమ్మకాలు మూడు, నాలుగు రెట్లు పెరగడం గమానార్హం. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత ఇలా మండలం ఉష్ణోగ్రతలు అవుకు 43.98 కోవెలకుంట్ల 43.93 మద్దికెర 43.47 చాగలమర్రి 43.28 సి.బెలగల్ 43.17 రుద్రవరం 43.17 ఆళ్లగడ్డ 43.01 సంజామల 42.88 పగిడ్యాల 42.71 మిడుతూరు 42.69 ఎమ్మిగనూరు 42.66 కర్నూలు 42.20 -
సూర్యప్రతాపం
అనంతపురం అగ్రికల్చర్ : మండుతున్న ఎండలతో జనం అల్లాడుతున్నారు. రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రతలు అధికమవుతుండడంతో ‘అనంత’ నిప్పులకొలిమిలా మండుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా స్వల్పంగా పెరగడంతో ఉక్కపోత అధికమైంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఎండవేడికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం కూడా శింగనమల మండలం తరిమెలలో 44.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత పామిడి 44.3 డిగ్రీలు, నార్పల 43.1 డిగ్రీలు, యాడికి 43.1 డిగ్రీలు, తాడిమర్రి 43 డిగ్రీలు, యల్లనూరు 43 డిగ్రీలు, బుక్కరాయసముద్రం 43 డిగ్రీలు, విడపనకల్ 42.8 డిగ్రీలు, పుట్లూరు 42.7 డిగ్రీలు కొనసాగింది. ప్రధాన పట్టణాలైన అనంతపురం 42.2 డిగ్రీలు, ధర్మవరం 41.8 డిగ్రీలు, ఉరవకొండ 42.5 డిగ్రీలు, కళ్యాణదుర్గం 42.4 డిగ్రీలు, గుంతకల్లు 42.4 డిగ్రీలు, కదిరి 41.1 డిగ్రీలు, పుట్టపర్తి 40.3 డిగ్రీలు నమోదు కాగా మిగతా ప్రాంతాల్లో 38 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 23 నుంచి 29 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం 46 నుంచి 76, మధ్యాహ్నం 14 నుంచి 24 శాతం మధ్య రికార్డయ్యింది. గంటకు 6 నుంచి 14 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి. వచ్చే నాలుగు రోజులూ ఎలాంటి వర్షం వచ్చే సూచనలు లేవని, ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో స్థిరంగా కొనసాగనున్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్ర్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి తెలిపారు. -
సూరీడి సెగలు
అనంతపురం అగ్రికల్చర్ : సూరీడు సెగలు కక్కుతున్నాడు. అధిక ఉష్ణోగ్రతలతో ‘అనంత’ జనం అల్లాడుతున్నారు. గురువారం శింగనమల మండలం తరిమెలలో 43.7 డిగ్రీలు గరిష్టం నమోదు కాగా... పామిడి 42.5 డిగ్రీలు, రాప్తాడు, పెద్దపప్పూరు 42.3 డిగ్రీలు, యల్లనూరు, బుక్కరాయసముద్రం 42.1 డిగ్రీలు, తనకల్లు 42 డిగ్రీలు, శింగనమల 41.9 డిగ్రీలు, బత్తలపల్లి 41.7 డిగ్రీలు, పెనుకొండ 41.6 డిగ్రీలు, బెళుగుప్ప 41.5 డిగ్రీలు, తాడిమర్రి 41.4 డిగ్రీలు, నార్పల 41.3 డిగ్రీలు, అనంతపురం 41.2 డిగ్రీలు, రాయదుర్గం, కూడేరు 41.2 డిగ్రీలు, గార్లదిన్నె 41.1 డిగ్రీలు, ఉరవకొండ, పుట్టపర్తి 40.5 డిగ్రీలు, ధర్మవరం 40.3 డిగ్రీలు, గుత్తి 40.2 డిగ్రీలు, కదిరి 40.1 డిగ్రీలు నమోదు కాగా మిగతా మండలాల్లో 38 నుంచి 40 డిగ్రీల మధ్య కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 22 నుంచి 28 డిగ్రీల మధ్య కొనసాగాయి. గాలిలో తేమశాతం ఉదయం 48 నుంచి 78, మధ్యాహ్నం 16 నుంచి 26 శాతం మధ్య రికార్డయ్యింది. గాలులు గంటకు 6 నుంచి 15 కిలో మీటర్ల వేగంతో వీచాయి.