సాక్షి, హైదరాబాద్: గత 24 గంటల్లో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త ఎక్కువగా, కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయి. సాధారణం కంటే 3 డిగ్రీల వరకు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు రికార్డు కాగా.. రాత్రి ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యాయి.
ఖమ్మంలో పగటి ఉష్ణోగ్రత 3 డిగ్రీలు ఎక్కువగా 33 డిగ్రీలు కాగా.. రాత్రి ఉష్ణోగ్రత 3 డిగ్రీలు తక్కువగా 16 డిగ్రీలు నమోదైంది. మహబూబ్‌నగర్‌లో పగటి ఉష్ణోగ్రత 2 డిగ్రీలు ఎక్కువగా 34 డిగ్రీలు.. రాత్రి ఉష్ణోగ్రత ఒక డిగ్రీ తక్కువగా 17 డిగ్రీలు నమోదైంది. నల్లగొండలో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ చొప్పున తక్కువగా నమోదయ్యాయి. రామగుండంలో రాత్రి ఉష్ణోగ్రత 2 డిగ్రీలు తక్కువగా 15 డిగ్రీలు... పగటి ఉష్ణోగ్రత 31 డిగ్రీలు నమోదైంది.
పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు
Published Mon, Jan 23 2017 2:44 AM | Last Updated on Tue, Sep 5 2017 1:51 AM
Advertisement
Advertisement