మంచిర్యాల అగ్రికల్చర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం గరిష్టంగా 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, కనిష్టంగా 22.3 డిగ్రీలు నమోదైంది. దీంతో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు ఏవిధంగా ఉండబోతాయో నని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రైతులు, కూలీలు రోజువారీ పనులు చేసు కోలేని పరిస్థితి నెలకొంది.
విద్యార్థులకు పరీక్ష టెన్షన్‌తోపాటు ఎండ తీవ్రత ప్రధాన అడ్డంకిగా మారుతోంది. సింగరేణి బొగ్గు గని ఏరియాల్లో ఎండవేడిమి మరింత ఎక్కువగా ఉంటోంది. ఓపెన్ కాస్టుల్లో పనిచేస్తున్న కార్మికులు భానుడి ప్రతాపానికి మాడిపోతున్నారు. పగటిపూట విధులకు హాజరయ్యే కార్మికుల సంఖ్య తగ్గిపోతోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గత పదిరోజుల్లోనే వడదెబ్బతో ఏడుగురు మరణించారు.
ఆదిలాబాద్‌లో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత
Published Sun, Apr 2 2017 4:26 AM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM
Advertisement