sunstroke
-
మండే ఎండ.. జాగ్రత్తలే అండ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఈ ఏడాది మార్చి నెల నుంచే గరిష్ట ఉష్ణోగ్రతలు నమో దవుతుండడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. దీనికితోడు వడగాడ్పులు వణికిస్తున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు, వడగాడ్పుల తీవ్రత ఇంకా ఎక్కువ ఉండే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో.. వడదెబ్బ బారినపడకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, భవన నిర్మాణ, ఇతర కార్మికులు, ఉపాధి కూలీలు, సాధారణ ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలంటున్నారు. ఎండల్లో పనిచేసే కార్మికులు గంటకు 10 నిమిషాల చొప్పున నీడపట్టున చేరి విశ్రాంతి తీసుకోవడం మంచిదంటున్నారు. ముఖ్యంగా గర్భిణులు, చిన్న పిల్లలు, వృద్ధులు, ధీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉ.11 గంటల నుంచి సాయంత్రం వరకూ ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. గతేడాది రాష్ట్రంలో 4,422.. అంతకుముందు ఏడాది 833 చొప్పున వడదెబ్బ కేసులు నమోదయ్యాయి.తీసుకోవాల్సిన జాగ్రత్తలు..– ఎక్కువ సమయం ఏసీలో ఉండి ఒక్కసారిగా ఎండలోకి రాకూడదు. అదే విధంగా 40 డిగ్రీల ఎండలో తిరిగి ఒకేసారి 18 డిగ్రీలు అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలుండే ఏసీ గదుల్లోకి వెళ్లకూడదు. – వదులుగా ఉండే నూలు దుస్తులు ధరించాలి. – ఎండలో తిరగాల్సిన పరిస్థితి వస్తే గొడుగు, టోపీ, హెల్మెట్ వాడాలి. – పిల్లలను ఎండలో ఆడుకోనివ్వకుండా, ఇండోర్ ఆటలకు ప్రాధాన్యత ఇవ్వాలి. – ఇంట్లోకి వడగాలులు రాకుండా కిటికీలకు కర్టెన్లు వాడాలి.– దాహం తీర్చుకోవడానికి శీతల పానీయాలు తాగుతుంటారు. ఇలాచేస్తే మరింత దాహం పెరుగుతుంది. వీటికి బదులు మజ్జిగా, కొబ్బరినీళ్లు, నిమ్మరసం తాగడం ఉత్తమం. – శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బొనేట్ శీతల పానీయాలు తాగకూడదు. అలాగే, అధిక ప్రొటీన్, ఉప్పు, కారం, నూనె ఉండే ఆహార పదార్థాలు తినకూడదు.వడదెబ్బకు గురైతే చేయాల్సినవి..– వడదెబ్బకు గురైన బాధితుడిని వెంటనే చల్లని ప్రదేశానికి చేర్చి ప్రథమ చికిత్స అందించాలి.– బాధితుడిని వెంటనే నీడ ఉన్న ప్రదేశానికి చేర్చాలి.– బట్టలు వదులు చేసి, చల్లటి నీటితో శరీరాన్ని తడపాలి. ఈ విధంగా చేస్తే రక్తనాళాలు కుచించుకుపోకుండా ఆపే అవకాశం ఉంటుంది.– గజ్జల్లో, చంకల్లో, మెడ వద్ద ఐస్ ప్యాక్‌లు ఉంచాలి. ఈ చర్యలు తీసుకుంటూనే వీలైనంత త్వరగా బాధితుడిని ఆస్పత్రికి తరలించాలి.రోజూ కనీసం నాలుగు లీటర్ల నీరు తాగాలి..శరీరం డీహైడ్రేడ్ కాకుండా జాగ్రత్తపడాలి. రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీరు తాగాలి. శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల పైబడినా, ఐదారు గంటలపాటు మూత్ర విసర్జన నిలిచిపోవడం.. చర్మం పొడిబారి వదులుగా మారడం, నీరసం, నిస్సత్తువ వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. చిన్నపిల్లలు వేడి, చలిని తట్టుకోలేరు కాబట్టి తల్లిదండ్రులు వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. గర్భిణులు, వృద్ధులు ఎండలేని సమయంలోనే బయటకెళ్లాలి. – డాక్టర్ పి. ప్రసాద్, మెడికల్ ఆఫీసర్, కాకుమాను, గుంటూరు జిల్లా -
పొంచి ఉన్న వడదెబ్బ ముప్పు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దీనికి తోడు వడగాడ్పులూ వీస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 8, 9 గంటల ప్రాంతంలోనే ఇంటినుంచి అడుగు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంటోంది. తీవ్రమైన ఎండలు, వడగాడ్పుల కారణంగా.. మార్చి నుంచి ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 90 మంది వడదెబ్బ బారినపడ్డారు. ఈ క్రమంలో రైతులు, భవన నిర్మాణ, ఇతర కార్మికులు, ఉపాధి కూలీలు, సాధారణ ప్రజలు సైతం ముందు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు, చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉదయం 11 గంటల తర్వాత నుంచి సాయంత్రం ఎండ తగ్గే వరకూ ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. వడదెబ్బ తగిలితే.. బాధితుడిని వెంటనే చల్లని ప్రదేశానికి చేర్చి ప్రథమ చికిత్స చేయాలి. దుస్తులు వదులు చేసి చన్నీటితో శరీరాన్ని తడపాలి. ఈ విధంగా చేస్తే రక్తనాళాలు కుచుకుపోకుండా ఆపే అవకాశం ఉంటుంది. గజ్జల్లో, చంకల్లో, మెడ వద్ద ఐస్ ప్యాక్‌లు ఉంచాలి. ఈ చర్యలు తీసుకుంటూనే వీలైనంత త్వరగా ఆస్పత్రికి తరలించడం కోసం 108కు ఫోన్ చేయాలి. 72 ఆస్పత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపడుతోంది. వడదెబ్బ నివారణకు, అనుసరించాల్సిన విధానాలపై ఇప్పటికే వైద్య శాఖ మార్గదర్శకాలిచి్చంది. పీహెచ్సీ వైద్యులు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో), ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు క్షేత్ర స్థాయిలో ప్రజలకు ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. అంగన్వాడీలకు ప్రభుత్వం ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ చేసింది. గర్భిణులు, ఆరేళ్లలోపు పిల్లలకు వీటిని పంపిణీ చేస్తున్నారు. గతేడాది అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదై, వడదెబ్బ కేసులు ఎక్కువగా నమోదైన 72 ఆస్పత్రులను వైద్య శాఖ గుర్తించింది. వీటిల్లో క్లైమేట్ రెసిలియంట్ వార్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. వడదెబ్బ బాధితులకు వైద్యం అందించడానికి వీలుగా ఈ వార్డుల్లో ప్రత్యేక వసతులను ఏర్పాటు చేస్తున్నారు. మండిన సన్డే సాక్షి, విశాఖపట్నం: ఇప్పటికే నిప్పులు కక్కుతున్న భానుడు ఆదివారం మరింత చెలరేగిపోయాడు. శనివారం నమోదైన 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు.. ఆదివారానికి 46 డిగ్రీలకు దూసుకెళ్లాయి. అత్యధికంగా మార్కాపురంలో 46 డిగ్రీలు, నంద్యాల జిల్లా చాగలమర్రి, నెల్లూరు జిల్లా కలిగిరిలో 45.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైఎస్సార్ జిల్లా కాజీపేట, సింహాద్రిపురంలలో 45.6, బాపట్ల జిల్లా జనకవరం పంగులూరులో 45.5, కర్నూలు జిల్లా అలూరు, ప్రకాశం జిల్లా బోట్ల గూడూరులో 45.4, పల్నాడు జిల్లా విజయపురిలో 45.2 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకా అనేక చోట్ల 40–44 డిగ్రీలు రికార్డయ్యాయి. వీటి ప్రభావంతో 107 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 235 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. అంటే రాష్ట్రంలో ఉన్న మొత్తం 670 మండలాలకు గాను సగానికి పైగా (342) మండలాల్లో వడగాడ్పులు వీచాయన్నమాట. దీంతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. అయితే సోమవారం నుంచి రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖం పట్టనున్నాయి. సోమవారం కేవలం రెండు మండలాల్లో (అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, కూనవరం మండలాల్లో) తీవ్ర వడగాడ్పులు వీయనున్నాయి. మరో 93 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లాలో 6 మండలాలు, విజయనగరం 20, పార్వతీపురం మన్యం 8, అల్లూరి 8, అనకాపల్లి 11, కాకినాడ 6, కోనసీమ 4, ఏలూరు 4, ఎన్టీఆర్ 2, గుంటూరు 7, పల్నాడు 2, తూర్పు గోదావరి జిల్లాలో 15 మండలాల్లోను వడగాడ్పులకు ఆస్కారం ఉందని తెలిపింది. అలాగే మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో తీవ్ర వడగాడ్పులు, మరో 27 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది. ద్రోణి ప్రభావంతో తేలికపాటి వర్షాలు దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి సముద్రమట్టానికి 1.5 కి.మీల ఎత్తులో కొనసాగుతోంది. ఈ ద్రోణి ప్రస్తుతం అంతర్గత ఒడిశా నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఛత్తీస్‌గఢ్, విదర్భ, మరఠ్వాడా, అంతర్గత కర్నాటక మీదుగా పయనిస్తోంది. దీని ప్రభావంతో సోమ, మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాంధ్రలోను ఈ నెల 10, 11 తేదీల్లో రాయలసీమలోను అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం తెలిపింది. ద్రోణి ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో సోమ, మంగళవారాల్లో పొడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. ద్రోణి కారణంగా రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి వడగాడ్పుల నుంచి ఉపశమనం కలగనుంది. కూల్‌డ్రింక్స్ తాగొద్దు ఇంట్లో ఉన్నా, బయట పనిలో ఉన్నా తప్పనిసరిగా గంట గంటకూ ఉప్పు, చక్కెర కలిపిన ద్రవాలు తీసుకోవాలి. కూల్‌డ్రింక్స్‌కు బదులు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం తీసుకోవాలి. శరీరంలో నీటి శాతాన్ని పెంచే పుచ్చకాయ, కీరదోస తినాలి. రోజుకు కనీసం 4 లీటర్ల నీరైనా తాగాలి. ఎండలో పనిచేస్తున్న వారైతే గంటకు 10 నిమిషాల చొప్పున నీడ పట్టున చేరి విశ్రాంతి తీసుకోవాలి. గాలి బాగా ఆడేలా వదులు దుస్తులు, ముఖ్యంగా నూలు వస్త్రాలు, తలకు టోపీ, గొడుగు ధరించాలి. బాటిల్లో తాగు నీటిని వెంటబెట్టుకోవాలి. వాంతులు, విరేచనాల వంటి సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. – డాక్టర్ నాగా చక్రవర్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్, సిద్ధార్థ వైద్య కళాశాల, విజయవాడ -
విషాదం.. పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో వృద్దురాలు మృతి
సాక్షి, కృష్ణా జిల్లా: కృష్జా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెనమలూరు మండలం గంగూరులో పెన్షన్ కోసం వెళ్లిన వృద్దురాలు వడదెబ్బ తగిలి మృతిచెందింది. పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో వజ్రమ్మ(80) ప్రాణాలు విడిచింది. ఉదయం నుంచి పెన్షన్ కోసం పడిగాపులు కాసిన వజ్రమ్మ వడదబ్బతో అక్కడే కుప్పకూలిపోయింది. పరీక్షించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి పెన్షన్ పంపిణీ జరుగుతోంది. ఏప్రిల్ 3 నుంచి 6 వరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. విభిన్న దివ్యాంగ లబ్దిదారులతోపాటు తీవ్ర అనారోగ్యాల పాలైనవారు, మంచం లేదా వీల్ చైర్లకే పరిమితమైనవారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న వృద్ధ వితంతువులకు మాత్రం వారి ఇంటి వద్దే పెన్షన్లు అందిస్తున్నారు. ఇదిలా ఉండగా నాలుగున్నరేళ్లుగా ప్రతి నెలా 1నే వలంటీర్ల ద్వారా లబ్దిదారుల ఇంటి వద్దే అందిస్తున్న పింఛన్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు బాబుతో సన్నిహితంగా వ్యవహరించే మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వలంటీర్లను విధుల నుంచి తప్పించడంతో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఆగిపోయింది. చంద్రబాబు అండ్ కో కుటిల రాజకీయాలకు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. లక్షల మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతు అక్కచెల్లెమ్మలు మండుటెండల్లో రోడ్లపై నిలబడాల్సి వచ్చింది. పెన్షన్ల కోసం బారులు తీరారు. ఈ ఉదంతంతో పేదలంటే చంద్రబాబుకు ఎంత వ్యతిరేకత ఉందో మరోసారి స్పష్టమైంది. చంద్రబాబు కారణంగా పింఛన్ల పంపిణీ నిలిచిపోవడం తీవ్ర ప్రజా వ్యతిరేకతకు దారితీస్తోంది. బాబుకు ఓటుతో బుద్ధి చెప్తామంటున్నారు పెన్షనర్లు. -
వడదెబ్బతో విద్యార్థిని మృతి
కామారెడ్డి టౌన్ : వడదెబ్బ సోకి చికిత్స పొందు తూ 15 ఏళ్ల విద్యార్థిని మృతి చెందిన ఘటన కా మారెడ్డి జిల్లా కేంద్ర ప్రభు త్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. క్యాసంపల్లి తండాకు చెందిన ఇస్లావత్ నాజు–నీలా దంపతుల పెద్ద కూతురు లావణ్యకు వాంతులు, తీవ్ర జ్వరం రావడంతో మంగళవారం ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకొచ్చారు. బుధవారం మధ్యాహ్నం లావణ్య ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు రాజధానికి తీసుకెళ్లాలని చెప్పారు. ఆమెను జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందిందని అక్కడి వైద్యులు తెలిపారు. దీంతో బంధువులు మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకొచ్చి ధర్నాకు దిగారు. సీ ఐ నరేష్ వారిని సముదాయించారు. ఆర్ఎంవో శ్రీ నివాస్ మాట్లాడుతూ వైద్యుల నిర్లక్ష్యం ఏమీ లేదన్నారు. లావణ్యకు మెదడులో రక్తం గడ్డ కట్టిందన్నారు. -
వడదెబ్బ కారణంగా పలువురు మృతి
వడదెబ్బ కారణంగా పలువురు మృతి -
నిప్పులకొలిమి.. ఎండకు వెళ్తే మండిపోతారు! డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నిప్పులకొలిమిపై మండుతోంది. తీవ్రమైన ఎండలతో జనం విలవిల్లాడుతున్నారు. ఉదయం 8 గంటలు దాటితేచాలు ఎండ తీవ్రతతో బెంబేలెత్తిపోతున్నారు. ఆరుబయట పనిచేసే కూలీలు, ఇతర కార్మి కులు, ఉద్యోగులు వడదెబ్బ బారినపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశించే వరకూ ఎండల తీవ్రత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది. ఎంత తీవ్రమైన ఎండ ఉన్నా రోజువారీ పనులు, శుభకార్యాలు, ఇతరత్రా కార్యకలాపాల కోసం ప్రజలు బయటకు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకోసం పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ద్విచక్ర వాహనాలు, బస్సులు, ఆటోలను ఆశ్రయిస్తారు. ఎండలు దంచికొడుతున్నా ఉపాధి కూలీలు పని మానుకునే పరిస్థితి ఉండదు. దీంతో వేలాది మంది వడదెబ్బకు గురవుతున్నారు. తీవ్రమైన జ్వరం, వాంతులు, వీరోచనాలకు గురవుతున్నారు. తలనొప్పి, వికారం ఉంటాయి. ఇలాంటి రోగాలతో వడదెబ్బ బాధితులు అనేక ఆసుపత్రులకు క్యూలు కడుతున్నారు. వేసవిలో జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లలు వడదెబ్బ, డయేరియా బారిన పడే ప్రమాదముంది. ఆహారం, తాగునీరు కలుషితమైతే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక అధిక వేడి, వడదెబ్బలతో మానవులపై శారీరక ప్రభావం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. కొందరిలో అకాల మరణం, వైకల్యం సంభవిస్తుందని హెచ్చరించింది. అధిక వేడి కారణంగా శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, మూత్రపిండ వ్యాధులు కూడా సంభవిస్తాయి. పగటి పూట గది ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, రాత్రి సమయంలో 24 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. ఎండ తీవ్రతకు గురయ్యే వారు కఠినమైన శారీరక శ్రమను నివారించాలి. తప్పనిసరిగా శ్రమతో కూడిన పని చేయాల్సి వస్తే, సాధారణంగా వేకువజామున 4 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్య ఉండేలా చూసుకోవాలి. వేసవిలో చల్లగా ఉండడం ఎలా... ఫ్లూయిడ్స్ పుష్కలంగా తాగాలి: వేడి వాతావరణంలో, పనితో సంబంధం లేకుండా ద్రవపదార్థాలు తీసుకోవాలి. దాహం వేసే వరకు వేచి ఉండకూడదు. రోజూ 8–10 గ్లాసుల కంటే ఎక్కువ నీరు తాగాలి. కొబ్బరి నీరు, తాజా పండ్ల రసాలు, మజ్జిగ, లస్సీ, నిమ్మకాయ నీరు, ప్రత్యేకంగా నీటితో ఎలక్ట్రోలైట్ తీసుకోవచ్చు. ఆల్కహాల్ లేదా పెద్ద మొత్తంలో చక్కెర ఉన్న ద్రవాలను తాగవద్దని నిపుణులు చెబుతున్నారు. మసాలాలు మానుకోవాలి తాజా పండ్లు, కూరగాయలు పుష్కలంగా తినాలి. వేడి ఆహారాలు తీసుకోవద్దు. అధిక మోతాదులో భోజనం చేయొద్దు. పుచ్చకాయ, ద్రాక్ష, పైనాపిల్, క్యారెట్, దోసకాయ వంటి చల్లని పదార్థాలను తీసుకోవాలి. రోజువారీ వంటలో మసాలాలు, ఆవాలు, ఎర్ర మిరపకాయలను ఉపయోగించడం మానుకోవాలి. ఎందుకంటే ఇవి వేడి లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. పుల్లని, మసాలా ఆహారాలకు దూరంగా ఉండాలి. తగిన దుస్తులు ధరించండి ♦ తేలికైన, లేత రంగు, వదులుగా ఉండే దుస్తులను ఎంచుకోవాలి. ముదురు రంగు బట్టలను ధరించవద్దు. ♦ చర్మాన్ని తేమగా ఉంచుకుని సంరక్షించుకోవాలి. ఆరుబయటకి వెళ్లాల్సి వస్తే సన్ గ్లాసెస్తోపాటు టోపీని ధరించడం ద్వారా సూర్యుని నుండి రక్షించుకోండి. సాధారణంగా వేసవిలోవచ్చే వ్యాధులు ♦ నీటి ద్వారా వచ్చే వ్యాధులు: అతిసారం, విరోచనాలు, టైఫాయిడ్, కలరా, హెపటైటిస్ తదితరాలు ♦ అంటువ్యాధులు: దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు డెంగీ, మలేరియా, చికున్‌గున్యా ♦ వేడి సంబంధిత వ్యాధులు: వడదెబ్బ, డీహైడ్రేషన్, తలనొప్పి వంటివి ♦ చర్మ వ్యాధులు: సన్ బర్న్, టానింగ్, చర్మ కేన్సర్ వంటివి ♦ కంటి వ్యాధులు: కండ్లకలక వంటివి -
24 గంటలూ ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు.. మార్గదర్శకాలు జారీ!
సాక్షి, హైదరాబాద్: ఎండల నుంచి ప్రజలను రక్షించేందుకు వైద్య ఆరోగ్యశాఖ కార్యాచరణ ప్రణాళిక ప్రకటించింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు మంగళవారం మార్గదర్శకాలు జారీచేశారు. ఎండ తీవ్రత మార్చి నుంచి జూన్ మధ్య ఉంటుందని, కొన్ని సందర్భాల్లో జూలై వరకు కూడా ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. ఈక్రమంలో జిల్లాల్లో 24 గంటలూ పనిచేసేలా హెల్ప్లైన్లను ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. జిల్లా నిఘా అధికారి నోడల్ ఆఫీసర్‌గా ఉంటారన్నారు. వడదెబ్బ తదితర ఆరోగ్య సమస్యలకు ఎవరైనా గురైతే వారిని కాపాడేందుకు జిల్లా, డివిజనల్ స్థాయిల్లో 24 గంటలూ పనిచేసే ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య అధికారులు వడదెబ్బ కేసులు/మరణాలు, తీసుకున్న నివారణ చర్యలపై రోజువారీ నివేదికను తనకు పంపాలని కోరారు. ప్రతీ రోజూ నీటి క్లోరినేషన్‌ను పీహెచ్సీ వైద్యాధికారులు తనిఖీ చేయాలని కోరారు. మార్గదర్శకాలివీ... ♦ అన్ని పీహెచ్‌సీలు, ఉప ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి. ♦ ఎండదెబ్బకు అందించాల్సిన ప్రాథమిక చికిత్సపై వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి. ♦ అన్ని ఆసుపత్రుల్లోనూ అత్యవసర ఔషధాలను తగినంత సంఖ్యలో నిల్వ ఉంచాలి. ♦ సీరియస్ కేసులేవైనా వస్తే వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించాలి. ♦ శిశువులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఆయా వర్గాలకు చెందినవారు ఎండకు దూరంగా ఉండాలి. ♦ ఆరు బయట పనిచేసే కార్మీకులు మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఎండలో పనిచేయకూడదు. పని ప్రదేశంలో వారికి ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా సురక్షితమైన తాగునీటిని అందించాలి. పని చేసే ప్ర దేశానికి సమీపంలోని కమ్యూనిటీ హాల్స్‌లో అవసరమైన షెల్టర్లను ఏర్పాటు చేయాలి. ♦ పట్టణ ప్రాంతాలు, మునిసిపాలిటీలలో స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతృత్వ సంస్థలు ‘చలివేంద్రం’ ద్వారా సురక్షితమైన మంచినీటి సరఫరా అందజేయాలి. ♦ నీటి పైపులైన్లు లీకేజీ కాకుండా చర్యలు తీసుకోవాలి. ♦ పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో ఎండ వేడిమి నుంచి ప్రజలను కాపాడేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. ♦ ఆసుపత్రుల్లో బాధితులకు వడదెబ్బ పాలైన వారికోసం ప్రత్యేకంగా పడకలను సిద్ధం చేయాలి. ♦ ప్రజలు దాహం వేయకపోయినా, వీలైనంత వరకు తగినంత నీరు తాగాలి. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్) వాడాలి. నిమ్మరసం, మజ్జిగ లేదా లస్సీ, పండ్ల రసాలు వంటి వాటిని తీసుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు నీటిని తీసుకెళ్లాలి. ♦ పుచ్చకాయ, నారింజ, ద్రాక్ష, పైనాపిల్, దోసకాయ వంటి పండ్లు, కూరగాయలను తినాలి. ♦ సన్నని వదులుగా ఉండే కాటన్ వ్రస్తాలను ధరించడం మంచిది ♦ ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ, టవల్ వంటి వాటిని ఉపయోగించాలి. ♦ పగటిపూట కిటికీలు, కర్టెన్లను మూసి ఉంచాలి. ♦ వేసవి ఎక్కువగా ఉండే సమయంలో వంట చేయడం మానుకోండి. వంట ప్రదేశాన్ని తగినంతగా వెంటిలేట్ చేయడానికి తలుపులు, కిటికీలను తెరవండి. ♦ ఆల్కహాల్, టీ, కాఫీ, శీతల పానీయాలు లేదా పెద్ద మొత్తంలో చక్కెరతో కూడిన పానీయాలను తాగకూడదు. -
ఎండలు ‘మండే’న్
సాక్షి, అమరావతి: భానుడి భగభగలు నిప్పుల కొలిమిని తలపించాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండాయి. వేడి తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో సోమవారం 44.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అదే జిల్లా చందర్లపాడు, కంచికచర్లలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనేక ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి వైఎస్సార్ జిల్లా నందలూరు, పెనగలూరు, చిట్వేల్, ప్రకాశం జిల్లా దోర్నాలలో 43.4 డిగ్రీలు, కర్నూలు జిల్లా కల్లూరు, వెల్దుర్తి, నెల్లూరు జిల్లా గూడూరు, తిరుపతి అర్బన్‌లో 43.1 డిగ్రీలు, కర్నూలు, కృష్ణా జిల్లా తిరువూరు, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, పుల్లల చెరువు, ముండ్లమూరులో 43 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం, రాజమండ్రి, గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో 42.9 డిగ్రీలు, చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురంలో 42.8, కర్నూలు జిల్లా పాణ్యం, బనగానపల్లె, ప్రకాశం జిల్లా మార్కాపురంలో 42.6, పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం, తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట, కిర్లంపూడి, ప్రకాశం జిల్లా తర్లపాడులో 42.5, చిత్తూరు జిల్లా చిత్తూరు, గుడిపలలో 42 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 152 మండలాల్లో తీవ్రమైన వేడి రాష్ట్రంలో 670 మండలాలు ఉండగా.. 514 మండలాల్లో సోమవారం బాగా వేడి వాతావరణం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 152 మండలాల్లో మాత్రం తీవ్రమైన వేడి గాలులు ఉన్నట్లు పేర్కొంది. నెల్లూరు, వైఎస్సార్, తిరుపతి, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని ఎక్కువ మండలాల్లో ఎండ ప్రభావం అధికంగా ఉంది. రాయలసీమ జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో ఎండ వేడి, ఉక్కపోత వాతావరణంలో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. మంగళ, బుధవారాలు కూడా ఇదే తరహా వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు. మరోవైపు బంగాళాఖాతంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో చిత్తూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. విశాఖ ఏజెన్సీలోనూ అక్కడక్కడా జల్లులు పడ్డాయి. వడదెబ్బకు ఇద్దరు మృతి నారాయణవనం (తిరుపతి): తిరుపతి జిల్లా నారాయణవనంలో వడదెబ్బకు గురై ఇద్దరు మృతి చెందారు. స్థానిక కోమటి బజారువీధికి చెందిన దొరస్వామి కుమారుడు ప్రేమ్(12) ఆదివారం వడదెబ్బ బారినపడి తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా.. అరుణానది సమీపంలోని డంపింగ్ యార్డు వద్ద ప్లాస్టిక్, ఇనుప వ్యర్థాలను సేకరిస్తున్న పళనిస్వామి (47) వడదెబ్బకు గురై అక్కడికక్కడే మరణించాడు. -
బాబోయ్.. ఎండలు.. ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త! ఇవి మాత్రం వద్దు!
సాక్షి, ఖమ్మం: ఎండలు తీవ్రంగా మండుతుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉదయం 10 గంటలకే ఎండ తీవ్రత పెరిగిపోతుండటంతో బయటకు వెళ్తే ముచ్చెమటలు పడుతున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతుండటంతో చాలామంది వడదెబ్బ బారిన పడుతున్నారు. ఇక వచ్చే మే నెలలో మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండటంతో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. రోజురోజుకూ పెరుగుతున్న వేడి నేపథ్యంలో ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పెరగనున్న ఉష్ణోగ్రతలతో వడదెబ్బ బారినపడి చిన్నాపెద్ద అల్లాడిపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వడదెబ్బ లక్షణాలు, నివారణ మార్గాల గురించి తెలుసుకుందాం. లక్షణాలు ఇవీ.. కళ్లు తిరగడం, శరీరంలో నీటి శాతం కోల్పోవడం, శరీర కండరాలు పట్టుకోవడం, కాళ్లు వాపులు రావడం, తీవ్ర జ్వరం వంటివి కనిపిస్తాయి. అధిక చెమట పట్టడం, తల తిరిగి పడిపోవడం వంటివి జరుగుతుంటాయి. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండ సమస్యలు కలిగి ఉన్నవారి శరీరం సూర్యరశ్మి వలన త్వరగా డీహైడ్రేషన్‌కు గురై వడదెబ్బ తీవ్రత అధికంగా ఉంటుంది. ప్రాథమిక చికిత్స.. ►వడదెబ్బ తగిలిన వ్యక్తి వెంటనే నీడకు తీసుకెళ్లాలి. చల్లని నీరు, ఐస్‌తో ఒళ్లంతా తుడవాలి. ►వదులుగా ఉన్న నూలు దుస్తులు వేయాలి. ►చల్లని గాలి తగిలేలా చూడాలి. ►ఉప్పు కలిపిన మజ్జిగ లేదా కొబ్బరి బొండాం నీరు, చిటికెడు ఉప్పు, చక్కర కలిపిన నిమ్మరసం, గ్లూకోజు ద్రావణం లేదా ఓరల్ రీ హైడ్రేషన్ ద్రావణం(ఓఆర్ఎస్) తాగించవచ్చు. ►వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్తే దగ్గరలోని ఆస్పత్రికి తరలించాలి. జాగ్రత్తలు.. ►ఎండలో వెళ్లేటప్పుడు కళ్లకు సన్ గ్లాసెస్, తలకు టోపి వంటివి ధరించాలి. ►ఉదయం, సాయంత్రం సమయాల్లో మాత్రమే బయటకు వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలి. ►హారంలో ఎక్కువగా ద్రవ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ►వదులైన నూలు దుస్తులు ధరించాలి. ►వేసవి కాలంలో డీహైడ్రేషన్ అధికంగా ఉంటుంది. రోజుకు కనీసం 15 గ్లాసుల నీరు తాగాలి. భోజనం మితంగా చేయాలి. ►మాంసామారం తగ్గించి, తాజా కూరగాయల్ని ఎక్కువగా భోజనంలో తీసుకోవాలి. ►నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి. పుచ్చకాయలు, కీర, తాటి ముంజలు, బీర పొట్టు వంటి వాటిలో నీటి శాతం పుష్కలంగా ఉంటుంది. వీటి ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. దీంతో కడుపు నిండినట్లుగా ఉండి డైట్ కంట్రోల్ అవుతుంది. ►వేసవిలో ఆకలి తక్కువగా, దాహం ఎక్కువగా ఉంటుంది. సరైన డైట్ పాటించాలి. నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తీసుకోవాలి. చేయకూడని పనులు.. ►మండు వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రత సమయంలో ఎక్కువగా తిరగరాదు. ►రోడ్లపై చల్లగా ఉండే రంగు పానీయాలు తాగొద్దు. ►రోడ్లపై విక్రయించే కలుషిత ఆహారం తినకూడదు. ఇంట్లో వండుకున్నవే తినాలి. ►శీతల పానీయాలు అధికంగా షుగర్ వేసిన జ్యూస్‌లు తీసుకుంటే కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి. -
పచ్చి మామిడికాయ రసంలో ఉప్పు , జీలకర్ర కలిపి రోజూ తాగితే..
Summer Care- Useful Tips: ఎండలు ముదురుతున్నాయి. ఈ సమయంలో వడదెబ్బ తగిలితే కష్టం. దానికంటే కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ చిట్కాలు పాటిస్తే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు. ►వేసవి ఎండలో నడవవలసి వచ్చినపుడు ఒక ఉల్లిపాయను టోపీలో గాని రుమాలులో గాని నడినెత్తిన పెట్టి కట్టుకొని నడిస్తే వడదెబ్బ తగలదు. ►వడడెబ్బ తగిలిందని అనుమానంగా ఉంటే ముఖం మీద, ఒంటిమీదా నీళ్లు చల్లుతూ తలపైన ఐస్‌క్యూబ్స్ ఉంచి నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగించడం వల్ల నష్ట నివారణ జరుగుతుంది. ►ఉడికించిన పచ్చి మామిడికాయ రసంలో ఉప్పు , జీలకర్ర కలిపి రోజూ తాగడం వల్ల వడదెబ్బ తగలదు. ►తరువాణి తేటలో ఉప్పు కలిపి తాగుతుండాలి. ►తాటిముంజలను పంచదారతో కలిపి తింటూ ఉంటే వడదెబ్బనుంచి తప్పించుకోవచ్చు. ►వేడి వేడి గంజిలో ఉప్పు వేసి తాగించడం, ఉల్లిపాయ రసాన్ని రెండు కణతలకు, గుండె మీద పూయడం వల్ల వడదెబ్బ తగలడం వలన కలిగిన బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. చదవండి: Inti Panta: జానెడు జాగా ఖాళీగా ఉంచరు.. అక్కడ కూరగాయలన్నీ ఉచితమే! -
నిజామాబాద్ జిల్లాలో విషాదం..
సాక్షి, నిజామాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ప్రజలు మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటే జంకుతున్నారు. ఎండల ధాటికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సైతం చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఎండదెబ్బతో నిజామాబాద్ జిల్లాలో ఓ యువతి మృతి చెందింది. డిచ్పల్లి మండలం లింగసముద్రం గ్రామానికి చెందిన చిన్నోళ్ల సవిత(19) వడదెబ్బకు మృత్యువాత పడటం ఆ గ్రామంలో విషాదం రేపింది. వడదెబ్బ కారణంగా అనారోగ్యానికి గురైన సవితను ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. కాగా, జిల్లావ్యాప్తంగా ఎండల తీవ్రత అధికంగా ఉంది. గత వారం రోజుల నుంచి 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
మండుతున్న ఎండలు... వడదెబ్బ తగలకుండా ఉండాలంటే
ప్రచండ భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. మార్చిలోనే విరుచుకుపడుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాడు. అంతకంతకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వేడి సెగలతో జిల్లా వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏటా ఏప్రిల్ నెలాఖరులో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. కానీ.. వాతావరణ సమతుల్యత లోపించిన కారణంగా మార్చి నెలాఖరులోనే సూర్యుడు మండిపోతున్నాడు. గత నాలుగేళ్లతో పోల్చితే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు నెల రోజుల ముందే అమాంతంగా పెరిగిపోవడంతో జనం ఆందోళన చెందుతున్నారు. ఫిబ్రవరి ఆరంభంలో 31 డిగ్రీలుగా నమోదైన ఉష్ణోగ్రత.. ఆ నెల చివరికే 36 డిగ్రీలుగా నమోదైంది. అదే వేగంతో పెరుగుతూ మార్చి నెల చివరి వారంలో 41 డిగ్రీలకు చేరుకుంది. దీనికి తోడు వడగాల్పులు అధికమయ్యాయి. పగలంతా ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతూ కూలర్ల ముందే సేదతీరుతున్నారు. సాక్షి – కరీంనగర్ ఉదయం 10 గంటలకే... వారం రోజులుగా ఉదయం 10 గంటలకే ఎండలు మండుతుండడంతో జిల్లా వాసులు బయటకు రావాలంటేనే అల్లాడిపోతున్నారు. ఒకవేళ వచ్చినా 11 గంటలకల్లా నీడను ఆశ్రయిస్తున్నారు. దీంతో 12 కొట్టే సరికి రోడ్లన్నీ బోసిపోతున్నాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే టవర్‌సర్కిల్, బస్టాండ్ రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. వారం రోజుల్లోనే ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులు చోటు చేసుకోవడంతో ఇబ్బంది తలెత్తింది. ఏప్రిల్ ఆరంభం కాకముందే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక సెగలు కక్కే ‘మే’ నాటికి పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. వడదెబ్బ తగలకుండా.. చెమటపట్టకపోవడం.. శరీర ఉష్ణోగ్రతలు పెరగడం.. వణుకు పుట్టడం.. ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితి రావడం వడదెబ్బ లక్షణాలు. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే తీవ్ర ఉష్ణోగ్రతలు ఉండే సమయంలో ఎక్కువగా ఎండలో తిరగద్దు. రోడ్ల వెంట విక్రయించే చల్లని రంగు పానీయాలు, కలుషిత ఆహారానికి దూరంగా ఉండాలి. మద్యం, మాంసం తగ్గించాలి. నీరు, పళ్ల రసాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు వాడడం, టోపీ ధరించడం మంచిది. నిర్లక్ష్యం చేయవద్దు.. వడదెబ్బ తగిలిన వ్యక్తిని వీలైనంత త్వరగా చల్లని గాలి తగిలే ప్రదేశానికి చేర్చాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు ద్రావణం లేదా ఓఆర్ఎస్ తాగించాలి. పిల్లలు, గర్భిణులు, వృద్ధులు మరింత జాగ్రత్త తీసుకోవాలి. వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లిన వ్యక్తికి బీపీ హెచ్చుతగ్గుల వల్ల కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వెంటనే ఆసుపత్రికి తరలించాలి. – డాక్టర్ కొండపాక కిరణ్, కార్డియాలజిస్టు -
Health Tips: ఆకలి నశించడం, అలసటగా అనిపిస్తోందా? అయితే..
వేసవి కాలం మొదలైంది. ఇప్పటికే ఎండలు ముదిరిపోయాయి. ఉదయం పదకొండు దాటిందంటే సూర్యుడు సుర్రుమంటున్నాడు. మరి.. ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు లేకుండా బయటకు వెళ్తే సన్‌స్ట్రోక్(వడదెబ్బ) తగిలితే అంతే సంగతులు! ఈ గడ్డు కాలాన్ని దాటాలంటే లక్షణాలను ముందే పసిగట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే సాంత్వన చేకూరుతుంది. లక్షణాలు: ►తలనొప్పి, తల తిరగడం, మెదడు బ్లాంక్‌గా మారి అయోమయంలోకి జారిపోవడం ►ఆకలి నశించడం, అనారోగ్యంగా అనిపించడం, ఫలానా సమస్య అని స్పష్టంగా తెలియకపోవడం, అలసట ►చేతులు, కాళ్లు, కడుపు కండరాల నొప్పులు, పట్టేసినట్లు ఉండడం ►ఊపిరి తీసుకోవడంలో వేగం పెరగడం ►దేహం ఉష్ణోగ్రతలు పెరగడం... ►పిల్లలైతే ఊరికే పడుకోవడానికి ఇష్టపడుతుంటారు. సాధారణంగా కంటే ఎక్కువ సమయం నిద్రపోతుంటారు. లేచిన తర్వాత కూడా హుషారుగా ఉండలేకపోతారు. ఈ లక్షణాలు కనిపిస్తే సన్‌స్ట్రోక్ నుంచి సాంత్వన కోసం వైద్యం చేయాల్సిందే. సాంత్వన ఇలాగ ►ఎండ నుంచి వెంటనే చల్లటి ప్రదేశంలోకి మారాలి. ►పడుకుని పాదాలను కొంచెం ఎత్తులో ఉంచాలి. ►డీ హైడ్రేషన్‌కు గురయిన దేహం తిరిగి హైడ్రేషన్ పొందడానికి ఇన్స్టంట్ రీ హైడ్రేషన్ ద్రవాలను తాగాలి. ►తడి టవల్‌తో దేహాన్ని, పాదాలను, అరచేతులను, ముఖాన్ని, మెడను తరచుగా తుడవాలి. ∙గాలి ధారాళంగా తగిలేటట్లు, హాయిగాఊపిరి పీల్చుకోగలిగిన స్థితిలో విశ్రాంతి తీసుకోవాలి. ►ఈ జాగ్రత్తలు పాటిస్తే అరగంట సేపటికి వడదెబ్బ నుంచి దేహం సాంత్వన పొందుతుంది. తీవ్రంగా వడదెబ్బ బారిన పడినప్పుడు నీళ్లు, ఇతర రీ హైడ్రేషన్ ద్రవాలు ఏవి తాగినా వాంతి అవుతుంది. అలాంటప్పుడు వెంటనే వైద్యుని పర్యవేక్షణలో సెలైన్ పెట్టించుకోవాల్సి ఉంటుంది. చదవండి: Health Tips: ఉడికించిన శనగలు, బొబ్బర్లు తిన్నారంటే.. ఇక -
బెంబేలెత్తిన బీహార్.. ఒక్కరోజులో 40 మంది మృతి
పాట్నా : బీహార్ రాష్ట్రంలో భానుడి భగభగలకు మనుషులు పిట్టల్లా నేలకొరుగుతున్నారు. శనివారం ఒక్కరోజే దాదాపు 40మంది వడదెబ్బ కారణంగా మృతిచెందారు. రెండు రోజుల వ్యవధిలో దాదాపు 70 మంది మృత్యువాత పడ్డారు. ఔరంగా బాద్, గయ, నవాడా ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఔరంగాబాద్‌లో 30 మంది, గయలోని అనురాగ్ మగద్ మెడికల్ కాలేజీలో దాదాపు 10మంది వడదెబ్బ కారణంగా మరణించారు. మరణించిన వారిలో 40 సంవత్సరాలు దాటిన వారు ఎక్కువగా ఉన్నారు. ఎండల కారణంగా పదుల సంఖ్యలో జనం మృత్యువాత పడగా చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతిచెందిన ఒక్కో వ్యక్తి కుటుంబానికి రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కేంద్రమంత్రి డా. హర్ష వర్ధన్ దీనిపై స్పందిస్తూ.. వడదెబ్బ కారణంగా పదుల సంఖ్యలో మరణాలు సంభవించటం దురదృష్టకరమన్నారు. -
భానుడి ఉగ్రరూపం
-
నిప్పుల కొలిమిగా తెలంగాణ
సాక్షి నెట్వర్క్ : భానుడు ఉగ్రరూపం దాల్చాడు. మండుతున్న ఎండలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్టోగ్రతలు 48 డిగ్రీలకు చేరువగా నమోదవుతున్నాయి. అత్యవసర పనులపై వెళ్లాల్సిన వారు వడదెబ్బ బారిన పడుతున్నారు. మంగళవారం ఒక్కరోజే 55 మంది వ్యక్తులు పిట్టల్లా రాలిపోవడం చూస్తుంటే పరిస్థితి తీవ్రత ఇట్టే అర్థమవుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 18 మంది, నల్లగొండ జిల్లాలో 10 మంది, ఖమ్మం జిల్లాలో 13 మంది, వరంగల్ జిల్లాలో 14 మంది మృతి చెందారు. జగిత్యాల జిల్లాలోని బీర్పూర్ మండలం కొల్వాయి, వెల్గటూరు మండలం రాజారాంపల్లి గ్రామాల్లో రెండ్రోజులుగా రాష్ట్రంలోనే అత్యధికంగా ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం ఏకంగా 47.9 డిగ్రీలకు చేరుకున్నాయి. ఈ స్థాయిలో ఎండలు గతంలో చూడలేదని వృద్ధులు అంటున్నారు. ఉష్ణోగ్రతల ధాటికి కూలర్లు సైతం ఉపశమనం కల్పించడం లేదు. ప్రజలు చెట్ల నీడన చేరి సాంత్వన పొందుతున్నారు. రానున్న మూడ్రోజులు తీవ్ర వడగాడ్పులు రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల పాటు సాధారణం నుంచి తీవ్ర వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు మంగళవారం వెల్లడించారు. మరోవైపు మధ్య మహారాష్ట్ర నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు ఇంటీరియర్ కర్ణాటక, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని పేర్కొన్నారు. దీంతో బుధ, గురువారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. ఇదిలావుండగా రాష్ట్రంలో తీవ్రమైన వడగాడ్పులు వీస్తున్నాయి. మంగళవారం 43 నుంచి 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, నిజామాబాద్‌ల్లో ఏకంగా 46 డిగ్రీల చొప్పన ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. హన్మకొండ, ఖమ్మం, మెదక్, నల్లగొండ, రామగుండంల్లో 45 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 44, హైదరాబాద్, భద్రాచలంల్లో 43 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాష్ట్రంలో మంగళవారం అత్యధికంగా నమోదైన ఉష్టోగ్రతలు సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
'సల్ల'ని కబురేది?
సాక్షి, హైదరాబాద్: ఆయనో ఆర్టీసీ బస్సు కండక్టర్.. కొడుకు పుట్టినరోజు వేడుకను పొద్దున్నే పూర్తి చేసుకుని సెకండ్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్లాడు. డిపోకు రాగానే అందుబాటులో ఉన్న తోటి కార్మికులు ఆయన చుట్టూ మూగారు. కొడుకు పేరుతో డిపోలోని సిబ్బంది అందరికి మజ్జిగ తాగించమని అడిగారు. జేబులోంచి రూ.2 వేలు తీసి అప్పటికప్పుడు పెరుగు డబ్బాలు తెప్పించి మజ్జిగ చేయించి అందరికీ తాగించాడు. కానీ మరుసటి రోజు ఎవరింటిలో ఏ ప్రత్యేక సందర్భం లేకపోవటంతో సిబ్బందికి మజ్జిగ లేకుండా పోయింది. ఈ వ్యవహారం కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. ఇప్పుడు ఆర్టీసీ డిపోల్లో జరుగుతున్న తంతు ఇదే. భగభగలాడుతున్న భానుడి ప్రభావానికి గురికాకుండా వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ఇలా మజ్జిగనో, నిమ్మరసమో తాగాల్సి ఉంది. అవి దొరకాలంటే కచ్చితంగా సిబ్బందిలో ఎవరింటిలోనో ప్రత్యేక సందర్భం ఉంటే వారి పేరుతో ఆ సిబ్బంది జేబు ఖర్చు నుంచి తెప్పించాల్సిందే. లేదంటే మంచినీళ్లు తాగి సరిపెట్టుకోవాల్సిందే. జీతాలు చెల్లించేందుకు డబ్బులు లేక అల్లాడుతున్న ఆర్టీసీలో సిబ్బందికి మజ్జిగ తాగించే పరిస్థితి లేకుండా పోయింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ముందుజాగ్రత్త చర్యగా పాఠశాలల సెలవులను ప్రభుత్వం పొడిగించింది. కానీ ఉష్ణోగ్రత ఎంతున్నా సరే విధుల్లో నిమగ్నమయ్యే డ్రైవర్లు, కండక్టర్లకు మాత్రం వేసవి నుంచి కాస్త ఉపశమనం కూడా లేకుండా పోవటం గమనార్హం. నయా పైసా రాదు.. ఓవైపు ఎండ తీవ్రత.. మరోవైపు ఇంజిన్ వేడితో ఆర్టీసీ డ్రైవర్లు నరకయాతన అనుభవిస్తున్నారు. ఎండలో గంటల తరబడి బస్సు ఉంటుండటంతో అది బాగా వేడెక్కి డ్రైవర్లు, కండక్టర్లు సెగకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో వడదెబ్బకు గురికాకుండా వారికి మంచినీటితోపాటు మజ్జిగ, నిమ్మరసం సరఫరా చేయాల్సి ఉంది. కానీ మంచినీళ్లు తప్ప అవి దొరికే పరిస్థితి లేదు. బస్‌భవన్ నుంచి డిపోలకు వీటి ఖర్చు కోసం నయాపైసా రావటం లేదు. కొన్ని డిపోల్లో మేనేజర్లే సొంత ఖర్చుతో కొన్నిరోజులు వాటిని ఏర్పాటు చేసినా కొనసాగించలేక చేతులెత్తేస్తున్నారు. ఫలితంగా సిబ్బంది రోజుకొకరు చొప్పున వాటాలేసుకుని వాటిని ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కువ మంది సిబ్బంది ఉండే డిపో అయితే రోజువారి ఖర్చు దాదాపు రూ.2 వేలు అవుతోంది. అంతమొత్తం భరించటం కొందరికి ఇబ్బందిగా మారటంతో చేతులెత్తేస్తున్నారు. మరో 20 రోజులకుపైగా ఎండలు కొనసాగనున్నాయి. రోహిణి కార్తె కావటంతో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. గత 2 రోజులుగా 45 డిగ్రీలను మించుతుండటంతో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంత ఎండలో సెకండ్ షిఫ్ట్‌లో ఉండే డ్రైవర్లు, కండక్టర్లు బస్సులో ఏర్పడే సెగతో వడదెబ్బకు గురవుతున్నారు. దాన్నించి తప్పించుకోవాలంటే సొంత డబ్బులతోనే మజ్జిగ, నిమ్మరసం తాగాల్సి వస్తోంది. కోటితో వేసవి మొత్తం.. రాష్ట్రంలో ఉన్న 97 డిపోలకు వేసవి మొత్తం మజ్జిగ, నిమ్మరసం నిత్యం అందుబాటులో ఉంచాలంటే దాదాపు రూ.కోటి వరకు ఖర్చవుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితిలో అది ఆర్టీసీకి భరించలేని మొత్తమే. నిత్యం రూ.11 కోట్ల ఆదాయం ఉన్నా, ఖర్చు దాన్ని మించి ఉంటుండటంతో ఆర్టీసీ నష్టాల్లోకి కూరుకుపోతోంది. వేరే పద్దు నుంచి ఈ ఖర్చును భరిద్దామన్నా అవకాశం ఉండటం లేదు. దీంతో డబ్బు లేక వేసవి ప్లాన్‌ను అమలు చేయటం లేదు. మంచినీళ్లు చల్లగా ఉండేందు కు కుండలు కొనటం తప్ప వేసవి ప్లాన్‌లో మజ్జిగ, నిమ్మరసం సరఫరా లేకుండా పోయింది. ఇలాంటి తరుణంలో ఉన్నతాధికారులు దాతలతో మాట్లాడి వాటిని ఏర్పాటు చేసే వీలున్నా అది అమలు కావటం లేదు. రాష్ట్రంలో విజయ డెయిరీతోపాటు పలు ప్రైవేటు డెయిరీలున్నాయి. వాటి యజమానులతో ఉన్నతస్థాయి వర్గాలు మాట్లాడితే.. సామాజిక బాధ్యత కింద పెరుగు సరఫరా చేసే అవకాశం ఉంది. కానీ ఆర్టీసీ యాజమాన్యం ఈసారి అలాంటి ప్రయత్నమే చేయలేదు. డిపో మేనేజేర్ల స్థాయిలో చిన్న దాతలు తప్ప పెద్ద స్థాయి కంపెనీలతో మాట్లాడటం సాధ్యం కావటం లేదు. చిన్న దాతలు ఒకట్రెండు రోజులు ఖర్చు భరించటానికే పరిమితమవుతున్నారు. డబుల్ డ్యూటీలపై ఆరా.. మజ్జిగ సంగతి పట్టించుకోరా.. డ్రైవర్లు కొరత వల్ల కొన్ని సర్వీసులు నిత్యం డిపోలకే పరిమితం కావాల్సి వస్తోంది. కొందరు డ్రైవర్లను డబుల్ డ్యూటీలకు ఒప్పించటం ద్వారా కొన్ని సర్వీసులను తిప్ప గలుగుతున్నారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో డబుల్ డ్యూటీలకు వారు నిరాకరిస్తున్నారు. ఫలితంగా డిపోలకు పరిమితమయ్యే బస్సుల సంఖ్య పెరుగుతోంది. ఇది మళ్లీ ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే అంశం కావటంతో ఉన్నతాధికారు లు నిత్యం డిపో మేనేజర్ల స్థాయిలో వాకబు చేస్తూ డబుల్ డ్యూటీల విషయంపై ఆరా తీస్తున్నా రు. బస్సులు నిలిచిపోతే ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉన్నందున ఎలాగోలా కొందరు డ్రైవర్లను ఒప్పించి డబుల్ డ్యూటీలకు పంపాలని పేర్కొంటున్నారు. ఎండలో మాడిపోతున్నా డబుల్ డ్యూటీలకు పంపుతూ.. వడ దెబ్బకు గురికాకుండా మజ్జిగ ఏర్పాటు చేయలేరా అంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రోజు బస్సులు ఆగిపోతే జనం అల్లాడిపోతారు. అలాంటి అతి ముఖ్యమైన బస్సులను ఎండ తీవ్రతకు వెరవకుండా నడుపుతున్న వారికి ఇప్పటికైనా మజ్జిగ, నిమ్మరసం అందుబాటులో ఉంచాల్సిన అవసరాన్ని గుర్తించాలని కార్మికులు కోరుతున్నారు. -
ముందుంది నిప్పుల వాన!
సాక్షి, విశాఖపట్నం/సాక్షి నెట్వర్క్: రాష్ట్రానికి నిప్పుల ముప్పు ఇంకా పొంచి ఉంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించేదాకా ఉష్ణ తీవ్రత కొనసాగనుంది. ఫొని తుపాను తీరాన్ని దాటక ముందు నుంచీ భానుడు నిప్పులు చెరుగుతూనే ఉన్నాడు. ఎడతెరపి లేకుండా వడగాడ్పులు వీస్తూనే ఉన్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ అన్న తేడా లేకుండా సాధారణం కంటే 4–7 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కోస్తాంధ్రలోని నెల్లూరు, ప్రకాశం, తూర్పు గోదావరి, రాయలసీమ జిల్లాల్లోనూ వెరసి 139 మండలాల్లో వడగాడ్పులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గడిచిన పదేళ్లలో ఉష్ణోగ్రతల పెరుగుదల తీరుపై ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీడీఎంఏ) ఒక అట్లాస్‌ను రూపొందించింది. దాని ప్రకారం రాష్ట్రంలో ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అలాగే ఐఎండీ నేషనల్ మాన్సూన్ మిషన్ ఏప్రిల్, మే నెలల్లో దేశంలో ఉష్ణోగ్రతల ప్రభావంపై పరిశీలన చేసింది. పంజాబ్, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల్లోని కొన్ని ప్రాంతాలను తీవ్ర వడగాడ్పుల ప్రభావిత ఏరియాలుగా తేల్చింది. ఏపీ, తెలంగాణపైనా డెడ్లీ హీట్‌వేవ్స్ ప్రభావం ఉత్తర, వాయవ్య భారతదేశంలో ఈ వేసవిలో 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు (డెడ్లీ హీట్‌వేవ్స్) నమోదయ్యే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి ఇటీవల హెచ్చరించింది. వాటి ప్రభావం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై కూడా ఉంటుందని తెలిపింది. అధిక ఉష్ణోగ్రతల ధాటికి చాలా మరణాలు సంభవిస్తాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఐక్యరాజ్యసమితి అత్యంత అరుదుగా ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రస్తుతం రెండు రోజుల నుంచి ఉపరితల ద్రోణి ప్రభావంతో వడగాడ్పుల తీవ్రత తగ్గి రాష్ట్రంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ పరిస్థితి రెండు మూడు రోజులకే పరిమితమని, ఎండలు విజృంభించి, మళ్లీ తీవ్ర వడగాడ్పులు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వడదెబ్బకు గురై మంగళవారం ప్రకాశం, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో నలుగురు వంతున, గుంటూరు జిల్లాలో ఇద్దరు, విశాఖ జిల్లాలో ఒకరు వంతున మృతి చెందారు. నేడు, రేపు కోస్తాంధ్రకు వర్ష సూచన కోస్తాంధ్రలో బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. అదే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో గంటకు 50–60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) మంగళవారం రాత్రి ఒక నివేదికలో తెలిపింది. ఈదురుగాలులు, వర్షాలతో పాటు కొన్నిచోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాయలసీమలో బుధవారం అక్కడక్కడ తేలికపాటి వర్షం గానీ, జల్లులు గానీ కురిసే అవకాశం ఉంది. గురువారం నుంచి అక్కడ రెండు రోజులు పొడి వాతావరణం నెలకొంటుంది. 47 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు ‘‘జూన్ ఒకటి రెండు తేదీల్లో రుతుపవనాలు కేరళను తాకిన వారం పది రోజుల నాటికి రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అప్పటిదాకా ద్రోణుల ప్రభావంతో ఒకట్రెండు రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసి కాస్త చల్లబరచినా మళ్లీ వడగాడ్పులు విజృంభిస్తాయి. ఇప్పటికన్నా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. కొన్నిచోట్ల 47 డిగ్రీల వరకు నమోదై నిప్పుల కొలిమిని తలపిస్తాయి. రానున్న రెండు మూడు రోజుల్లోనే వీటి పెరుగుదల మొదలవుతుంది. మరోవైపు ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మంచి వర్షాలనే కురిపిస్తాయి. ముందుగా ఊహించినట్టుగా ఎల్‌నినో (వర్షాభావ) భయం లేదు’’ – ఓఎస్ఆర్యూ భానుకుమార్, వాతావరణం, సముద్ర అధ్యయనవిభాగ మాజీ అధిపతి. ఏయూ -
తెలంగాణ : నిప్పుల కొలిమి..!
మున్ముందు భగభగే.. గత నెల నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 13 వడగాడ్పు రోజులు నమోదయ్యాయి. మున్ముందు దాదాపు 20 వడగాడ్పు రోజులు ఉండనున్నాయి. గతంలో ఎన్నడూ ఇన్ని వడగాడ్పు రోజులు వచ్చిన పరిస్థితి లేదు. 13 రెడ్ అలర్ట్‌లు... ఈ సీజన్లో ఇప్పటివరకు 13 రెడ్ అలర్ట్‌లు నమోదైనట్లు నిపుణులు అంటు న్నారు. ఈ నెల రాష్ట్రంలో కొన్నిచోట్ల 47 నుంచి 49 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తుంది. అలర్ట్ జారీ ఇలా.. సాధారణం కంటే ఆరు డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదైతే రెడ్ అలర్ట్, నాలుగైదు డిగ్రీల వరకు అధికమైతే ఆరెంజ్, సాధారణం కంటే కొద్దిగా ఎక్కువైతే ఎల్లో, సాధారణం కంటే తక్కువైతే వైట్ అలర్ట్ జారీ చేస్తారు. (చదవండి: ఆంధ్రప్రదేశ్.. నిప్పుల గుండం) సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విజృంభిస్తున్న వడగాడ్పులకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. పదుల సంఖ్యలో జనం చనిపోతున్నట్లు అంచనాలున్నా.. కలెక్టర్ల నుంచి ఇప్పటివరకు వడదెబ్బ మృతులకు సంబంధించి తమకు ఎటువంటి నివేదిక రాలేదని విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. మే రెండో వారం ప్రారంభం నుంచే.. ఎండల పరిస్థితి రోజురోజుకూ మరింత తీవ్రంగా మారుతోంది. ఈ పరిస్థితి రోహిణీ కార్తె వరకు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉత్తరాది నుంచి వేడిగాలులు రాష్ట్రంపై పంజా విసురుతున్నాయి. దీంతో గాలిలో తేమ శాతం తగ్గి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గతేడాది ఎండాకాలంలో మధ్యమధ్యలో కాస్తంత ఉపశమనం కలిగించేలా వర్షాలు వచ్చేవి. కానీ ఈ నెల నాలుగో తేదీ నుంచి ఎక్కడా వర్షపు జాడలే లేవు. నిరంతరాయంగా వేడిగాలులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం విలవిల్లాడుతున్నారు. మరీ దారుణమైన విషయం ఏంటంటే గత నెల నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 13 రోజులు వడగాడ్పులు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మున్ముందు ఇంకా 15 నుంచి 20 వడగాడ్పు రోజులు ఉంటాయని వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు హెచ్చరించారు. అంటే మొత్తంగా ఈ ఎండాకాలం సీజన్లో 30 రోజులకుపైగా వడగాడ్పుల రోజులు నమోదయ్యే పరిస్థితి కనిపి స్తుంది. గతంలో ఎన్నడూ ఇన్ని రోజులపాటు వడగాడ్పులు వచ్చిన పరిస్థితి లేదు. 2017లో అత్యధికంగా 27 వడగాడ్పుల రోజులు నమోదు కాగా, ఈసారి ఆ రికార్డును ఈ ఎండాకాల సీజన్ బద్దలు కొట్టే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యలో ఊరటనిచ్చేలా ఏమైనా వర్షాలుంటే సరేసరి.. లేకుంటే ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వాతావరణ కేంద్రం అలర్ట్ ఎండల తీవ్రతను బట్టి వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తుంది. సాధారణం కంటే ఆరు డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదైతే అత్యంత తీవ్రమైన ఎండగా గుర్తించి రెడ్ అలర్ట్ జారీచేస్తారు. సాధారణం కంటే నాలుగైదు డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైతే అప్పుడు ఎండల తీవ్రతగా గుర్తించి ఆరెంజ్ అలర్ట్ జారీచేస్తారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే కొద్దిగా ఎక్కువగా నమోదైతే వేడి రోజుగా గుర్తించి ఎల్లో (హీట్‌వేవ్ వార్నింగ్) ఇస్తారు. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే వైట్ అలర్ట్ జారీచేస్తారు. తీవ్రమైన వడగాడ్పులు నమోదైతే రెడ్ అలర్ట్ ఉంటుంది. ఆ ప్రకారం ఈ సీజన్లో ఇప్పటివరకు 13 రెడ్ అలర్ట్‌లు నమోదైనట్లు నిపుణులు అంటున్నారు. తెలంగాణలో ఈ ఏడాది సాధారణం కంటే 0.5 డిగ్రీల నుంచి 1 డిగ్రీ వరకు అధికంగా ఉంటాయని వాతావరణ కేంద్రం వేసవి ఆరంభంలోనే హెచ్చరించింది. రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి తెలంగాణపైకి వడగాడ్పులు వీస్తున్నాయి. అంతేకాదు దేశంలో వడగాడ్పులు అధికంగా వచ్చే డేంజర్ జోన్లో తెలంగాణ ఉండటంతో ఈసారి భగభగలాడుతోంది. ఈ నెల రాష్ట్రంలో కొన్నిచోట్ల 47 నుంచి 49 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తూ వస్తోంది. ఆదిలాబాద్, భద్రాచలం వంటి చోట్లనైతే 48–49 వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. హైదరాబాద్‌లో ఈసారి 45–47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకునే ప్రమాదం ఉంది. ఎండదెబ్బకు గురికాకుండా.. ఎండ తీవ్రత బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రజలకు సూచించింది. ఆ మేరకు ఒక కరపత్రాన్ని విడుదల చేసింది. వడదెబ్బ లక్షణాలు... తలనొప్పి, తలతిరగడం, తీవ్రమైన జ్వరం కలిగి ఉండటం, చర్మం పొడిబారటం, మత్తు నిద్ర, వాంతులు, కలవరింతలు, ఫిట్స్, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితి. నేడు వడగాడ్పులు ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో శనివారం వడగాడ్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఆదివారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల (గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో)తో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని రాజారావు తెలిపారు. ఇదిలావుండగా శుక్రవారం ఖమ్మం, నల్లగొండ, రామగుండంలలో 45 డిగ్రీల చొప్పు న అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, భద్రాచలం, మహబూబ్‌నగర్‌లలో 44 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 42 డిగ్రీలు రికార్డు అయింది. వడగాడ్పులుంటే... నిర్మాణ కార్మికుల కోసం సంబంధిత యాజమాన్యాలు తాగునీటి వసతి, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి. కార్మికులకు అవసరమైన నీడ కల్పించాలి. ఉపాధి హామీ కూలీలకు పనిచేసే చోట టెంట్లు ఏర్పాటు చేయాలి. నీటి వసతి కల్పించాలి. పశువులు, కోళ్లకు వడదెబ్బ తగలకుండా తగు చర్యలు తీసుకోవాలి. క్యాబ్, ఆటో డ్రైవర్లకు వేసవి తీవ్రతపై అవగాహన కల్పించాలి. బస్టాండ్లలో ప్రయాణికుల కోసం తాగునీటి వసతి కల్పించాలి. కరపత్రాలు పంచాలి. సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో చల్లని తాగునీరు, ఐస్ ప్యాక్‌లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి. ఈ మేరకు ఆర్టీసీ చర్యలు తీసుకోవాలి. వడగాడ్పుల సమయంలో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బస్సులను నిలిపివేయాలి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు పలు ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు చేయకూడనివి ఎండలో తిరగకూడదు. బాగా ముదురురంగు ఉండే దుస్తులు ధరించకూడదు. కాఫీ, టీలు సేవించకూడదు. ఎండవేడిలో అధికంగా పనిచేయకూడదు. మధ్యమధ్యలో చల్లని ప్రదేశంలో సేదతీరుతూ పనిచేయాలి. తగిన జాగ్రత్తలు లేని నిల్వ చేసిన ఆహారం, అధిక వేడి వల్ల త్వరగా చెడిపోతాయి. వాటిని తినకూడదు. డయేరియాకు గురయ్యే ప్రమాదముంది. ఎండలో పార్కు చేసిన కారులో చిన్న పిల్లలు, వృద్ధులను, అనారోగ్యస్తులను ఎక్కువ సేపు ఉంచకూడదు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ఆరుబయట పనిచేసేవారు సూర్యరశ్మి నుంచి కాపాడుకునేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తరచూ నీళ్లు తాగుతూ బయటకు వెళ్లేప్పుడు వెంట మంచినీళ్లు ఉండేలా చూసుకోవాలి. వేసవిలో ఎక్కువగా నిమ్మరసం, కొబ్బరినీళ్ల వంటివి తీసుకోవాలి. తెలుపురంగు, లేతవర్ణం కలిగిన పలుచటి కాటన్ వస్త్రాలు ధరించాలి. తలకు వేడి తగలకుండా టోపీ పెట్టుకోవాలి. లేదా రుమాలు చుట్టుకోవాలి. పలుచటి మజ్జిగ, గ్లూకోజు నీరు, చిటికెడు ఉప్పు, చెంచాడు చక్కెర ఒక గ్లాసు నీటిలో కలుపుకొని ఇంటిలోనే తయారుచేయబడిన ఓఆర్ఎస్ ద్రావణం తాగినట్లయితే వడదెబ్బ నుంచి తక్షణం ఉపశమనం లభిస్తుంది. వడదెబ్బ తగిలిన వారిని నీడలో చల్లని ప్రదేశంలో ఉంచాలి. శరీర ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. కావున సాధారణ ఉష్ణోగ్రత వచ్చే వరకు తడిగుడ్డతో తుడుస్తూ ఉండాలి. చంటి పిల్లలు, గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవారు వడగాడ్పులకు గురికాకుండా కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వడదెబ్బకు గురైనవారు ప్రాథమిక చికిత్స అనంతరం సాధారణ స్థితికి రాకుంటే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి. -
నేడు రాష్ట్రంలో పలుచోట్ల తీవ్ర వడగాడ్పులు
సాక్షి, హైదరాబాద్: ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే పొడివాతావరణం కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. ఇక శనివారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు(గంటకు 40 కి.మీ. నుంచి 50 కి.మీ.)లతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని పేర్కొంది. ఉత్తర ఇం టీరియర్ ఒడిశా నుంచి రాయలసీమ వరకు కోస్తాంధ్ర మీదుగా 0.9 కి.మీ. ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. వడదెబ్బకు ఏడుగురు మృతి వడదెబ్బకు వేర్వేరు ప్రాంతాల్లో గురువారం ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెంకు చెందిన మాజీ ఉప సర్పంచ్ బచ్చు పురుషోత్తం (82), ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం గ్రామానికి చెందిన పొన్నెకంటి వెంకమ్మ (75),, వైరా మండలం కేజీ సిరిపురంలో దుప్పటి సత్యం (63), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ప్రకాశ్‌నగర్ కాలనీకి చెందిన చింతలచెరువు వీరస్వామి (59) మృతి చెందారు. అలాగే.. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామానికి చెందిన బురగల్ల వెంకటయ్య (65), సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన కొమ్ముల చిన్నమల్లయ్య (55), ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో సందెవేణి మల్లయ్య (55) మృతి చెందిన వారిలో ఉన్నారు. -
ఎన్నికల పోలింగ్‌కు వడదెబ్బ ఎఫెక్ట్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా పరిషత్ తొలిదశ ఎన్నికల పోలింగ్‌పై వడదెబ్బ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఎండ ప్రభావంతో చాలా చోట్ల పోలింగ్ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. 44డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉదయం 7 నుంచి 9 వరకు ఓటర్లు బారులు తీరినా, 10 తర్వాత పోలింగ్ కేంద్రాలు బోసిపోయాయి. ఎండ దెబ్బకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. -
భానుడి భగభగ
మంచిర్యాల అగ్రికల్చర్ : రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఉమ్మడిజిల్లా అగ్నిగుండలా తలపిస్తుంది. ఆదివారం 45.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా కనిష్ట ఉష్ణోగ్రత 32.5 డిగ్రీలుగా నమోదైంది. ఈ ఏడాది ఇదే అత్యధికం. గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరకుంటుంటే కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం 35 డిగ్రీలకు చేరుతున్నాయి. దీంతో రాత్రిపూట కూడా వేడిగాలుల ప్రభావం చూపుతోంది. మూడు రోజులుగా భానుడు నిప్పులు చెరుగుతుండడంతో జనాలు బయటికి రావడానికి భయపడుతున్నారు. గాలిలో తేమశాతం తగ్గడంతో ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో వడదెబ్బదాటికి మార్చి నుంచి ఇప్పటి వరకు 22 మంది మృతి చెందారంటే పరిస్థితి ఎవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రోజుకు ఒకరిద్దరు చొప్పున వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. బొగ్గుబావులు, ఓపెన్‌కాస్టులు ఉన్న ప్రాంతాల్లో ఆదివారం మధ్నాహ్నం ఉష్ణోగ్రతలు 47 నుంచి 48 డిగ్రీలకు చేరుకున్నాయి. దీంతో ఓపెన్ కాస్టుల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు అల్లాడిపోయారు. అడవులు అంతరిస్తుండటం, జలాశయాలు అడుగంటడం.. తదితర కారణాల వల్ల ఎండ తీవ్రత ఏటేటా పెరుగుతోంది. సాయత్రం 6 గంటలు దాటితే కాని జనాలు బయటికి రాని పరిస్థితి. వాహన చోదకులు ముఖానికి రక్షణ లేకుండా బయటకు రావడం లేదు. అడవుల జిల్లాగా పెరుగాంచిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఏటా మే నెలలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. వాగులు, బోరు బావులుల్లో నీరు అడుగంటుతున్నాయి. గ్రామాల్లో తీవ్ర నీటిఎద్దడి తలెత్తుతోంది. మే నెలలో ఎండల తీవ్రత ఏ విధంగా ఉంటుందోనని ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. భానుడు.. బ్యాండ్ బాజా ఇదే నెలలో అత్యధికంగా పెళ్లిళ్లు ఉన్నాయి. ఇటు ఎండలతో ఇళ్లలో ఉక్కపోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఎండల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లేవారు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదాల బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రయాణాలు చేసేటప్పుడు... ►శరీరాన్ని పట్టుకునేలా ఉండే దుస్తులను కాకుండా కొద్దిగా వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. దీంతో ఉక్కపోత నుంచి ఉపశమనం పొందవచ్చు. ►సాధ్యమైనంత మేరకు ఉదయం చల్లగా ఉన్న సమయంలోనే వివాహాలకు బయలుదేరాలి. అక్కడ బంధువులతో కాలక్షేపం చేస్తూ సాయంత్రం వరకు ఉంటే మేలు. ► ముఖ్యంగా వ్యాన్, లారీల్లో వెళ్లాల్సి వస్తే.. వాటిపై తాటిపత్రిలాంటివి వేసుకోవాలి. ఇరుకుగా కాకుండా తక్కువ మోతాదులో మందిని తరలించేలా ఏర్పాటు చేసుకోవాలి. ►తప్పనిసరిగా తగినంత మేర చల్లని నీటిని తీసుకెళ్లాలి. ►వాహనాలపై వెళ్లాల్సి వస్తే తల, ముక్కు, చెవులకు నిండుగా ఉండేలా కాటన్ టవల్, కర్చీఫ్ కానీ కట్టుకోవాలి. కళ్లకు చల్లని చలువ అద్దాలు పెట్టుకోవాలి. గోడుగు, టోపి వెంట తీసుకెళ్తే మేలు. ►నీళ్లు, పండ్ల రసాలను తీసుకోవాలి. ఎండకు తిరిగి వచ్చిన వెంటనే బాగా చల్లని నీరు ఒకేసారి తీసుకోకూడదు. ►త్వరగా జీర్ణమయ్యే తేలికపాటి ఆహారం, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ► తక్కువ మోతాదులో ఎక్కువసార్లు నీటిని తాగాలి. ►నిమ్మరసంలో ఉప్పు, చక్కెర కలిపి తాగాలి. ►సోడియం, పొటాషియం ఉన్న ద్రవపదార్థాలు తీసుకోవాలి. ►వడదెబ్బకు గురైన వారిని చల్లని లేదా నీడ ప్రదేశానికి తీసుకెళ్లాలి. ►నుదుటిపై తడిగుడ్డ వేసి తడుస్తూ శరీర ఉష్ణోగ్రతను తగ్గించాలి. ►బీపీ లేదా పల్స్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ►గాలి ఎక్కువగా తగిలేలా చూడాలి. ►నీరు ఎక్కువగా తాగించాలి. ►అవసరాన్ని బట్టి వైద్యుడికి చూపించి ప్రాథమిక చికిత్స అందించాలి. వారంరోజుల్లో నమోదైన ఉష్ణోగ్రతలు తేదీ కనిష్టం గరిష్టం 22 27.6 40.8 23 27.5 39.8 24 27.4 42.3 25 26.8 43.3 26 29.8 44.3 27 32.4 44.8 28 32.5 45.3 జిల్లాలో ఐదేళ్లలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు, ప్రాంతాలు సంవత్సరం ప్రాంతం ఉష్ణోగ్రత 26–04–2014 దండేపల్లి 46.3 29–04–2015 దండేపల్లి 45.6 26–04–2016 దండేపల్లి 48.8 21–04–2017 జన్నారం 45.0 21–04–2018 దండేపల్లి 44.3 27–04–2019 దండేపల్లి 45.3 -
నేడు, రేపు వడగాడ్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మరో రెండు రోజులు ఉత్తర తెలంగాణలో వడగాడ్పులు వీచే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. ఇదిలావుండగా ఆదివారం ఆదిలాబాద్, నిజామాబాద్‌లలో అత్యధికంగా 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండంలో 44, నల్లగొండ, మెదక్‌లో 43 డిగ్రీలు, భద్రాచలం, ఖమ్మంలో 42 డిగ్రీలు, హైదరాబాద్, మహబూబ్‌నగర్‌లో 41 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలావుండగా ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న ఫణి తుఫాను ఉత్తర దిశగా ప్రయాణించి ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంది. ఇది 12 గంటలలో తీవ్ర తుఫానుగాను, తదుపరి 24 గంటలలో అతి తీవ్ర తుఫానుగాను మారే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అనంతరం మే 1వ తేదీ సాయంత్రం వరకు వాయవ్య దిశగా ప్రయాణించి, తరువాత దిశ మార్చుకుని క్రమంగా ఉత్తర ఈశాన్య దిశ వైపు ప్రయాణించే అవకాశం ఉందన్నారు. ఇక దక్షిణ ఛత్తీస్‌గఢ్ దానిని ఆనుకుని ఉన్న విదర్భ ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్నారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వచ్చే మూడు రోజులు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వడదెబ్బతో నలుగురు మృతి ధర్మపురి/వెల్గటూర్/కథలాపూర్/కోల్‌సిటీ: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వడదెబ్బతో ఆదివారం ఒక్కరోజే నలుగురు మృత్యువాతపడ్డారు. వెల్గటూర్ మండలం ఎండపెల్లి గ్రామానికి చెందిన ముస్కు ఆదిరెడ్డి (80) వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. ధర్మారం మండలం కమ్మరిఖాన్‌పేట గ్రామానికి చెందిన ముత్తునూరి శాంతమ్మ (58) వారం రోజుల క్రితం వడదెబ్బకు గురైంది. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం మృతిచెందింది. కథలాపూర్ మండలం పెగ్గెర్లలో వార్డు సభ్యుడు మామిడిపెల్లి గంగారెడ్డి(50) వడదెబ్బకుగురై సాయంత్రం మృతిచెందారు. అలాగే గోదావరిఖనిలో అనిల్‌కుమార్ షిండే (55) ఇంట్లో అకస్మాత్తుగా కళ్లు తిరిగి కిందపడిపోయాడు. హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
పోలింగ్ కేంద్రం వద్దే చేనేత కార్మికుడి మృతి
సాక్షి,ధర్మవరం టౌన్: ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ఓటు వేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి వడదెబ్బతో మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళితే... పట్టణంలోని కేతిరెడ్డి కాలనీకి చెందిన చండ్రాయుడు(74) భార్య నరసమ్మతో కలసి గురువారం ఇందిరమ్మ కాలనీ వద్దనున్న పోలింగ్ కేంద్రానికి ఓటు వేసేందుకు వచ్చాడు. జనం ఎక్కువగా ఉండటం...అధికారులు కనీస సౌకర్యాలు కల్పించక పోవడంతో క్యూలోనే గంటల తరబడి వేచి ఉన్నాడు. కనీసం తాగేందుకు మంచినీరు, షామియానాలు కూడా సమకూర్చకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఈక్రమంలోనే ఎలాగోలా లోనికి వెళ్లి ఓటు వేసిన చంద్రాయుడు తిరిగి వస్తూ పోలింగ్ కేంద్రం వద్దనే కుప్పకూలాడు. స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా... పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిపారు. కాగా ఇంటి పెద్ద మరణంతో ఆ కుటుంబం దిక్కులేనిది అయ్యింది. మృతదేహం వద్ద భార్య రోధనలు అందరిని కలచివేశాయి. -
సన్‌దడ
ఎండలు బాగా ముదిరాయి. గతంతో పోలిస్తే ఈ వేసవిలో ఎండ చండప్రచండంగా కాస్తూ ఉంది. గత ఏడాది కంటే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా నమోదు కావచ్చంటూ వాతావరణశాఖ వారూ హెచ్చరికలు చేస్తున్నారు. ఇంత ఎండలో బయటకు వెళ్లడం ప్రమాదకరం. కానీ పరీక్షలంటూ ఇటు విద్యార్థులూ, ఎన్నికల హడావుడిలో కార్యకర్తల రూపంలో అటు సాధారణ ప్రజలూ ఎండలో తిరగక తప్పని పరిస్థితి. అందుకే బాగా తీవ్రమైన ఎండలో తిరగడం వల్ల వచ్చే సమస్యలూ, పిల్లల్లో ఎండదెబ్బకు అవకాశాలూ, ఎండ తీవ్రతకూ, వడదెబ్బకూ గురికాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కోసం ఈ కథనం. ఎండ తీవ్రత వల్ల చాలా రకాల సమస్యలొస్తుంటాయి. వాటిలో ఈ కింద పేర్కొన్నవి కొన్ని... హీట్ సింకోప్: ఎండలో ఎక్కువసేపు తిరుగుతూ ఉండటం వల్ల తల తిరిగినట్లు అనిపించడం, మరీ ఎక్కువ సేపు తిరిగితే సొమ్మసిల్లి పడిపోవడం జరగవచ్చు. ఎండలో ఎక్కువ సేపు ఉండటం వల్ల రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. దాంతో మెదడుకు ఎంత రక్తం అందాలో అంతా అందకపోవచ్చు. ఇలాంటి పరిస్థితిలో సొమ్మసిల్లడం జరుగుతుంది. ఈ పరిస్థితినే హీట్ సింకోప్ అంటారు. ఎంత ఆరోగ్యవంతులకైనా ఇలా జరిగేందుకు అవకాశం ఉంటుంది. అందుకే జాగ్రత్తగా ఉండటం అవసరం. అయితే కొన్ని జాగ్రత్తలతో రోగులు కోలుకుంటారు. చికిత్స: హీట్ సింకోప్‌కు గురైన వ్యక్తిని వెంటనే చల్లటి ప్రదేశంలోకి తీసుకెళ్లాలి. అక్కడ మంచినీరు, తాజా పండ్లరసాలు, కొబ్బరినీళ్ల వంటి ద్రవాలను తాగించాలి. హీట్ క్రాంప్స్ / మజిల్ క్రాంప్స్: ఎండలో బాగా తిరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో రాత్రివేళల్లో లేదా అప్పటికప్పుడు కూడా పిక్కలు పట్టేసినట్లుగా ఉండి, తీవ్రమైన నొప్పికి గురికావడం జరుగుతుంది. ఎండలో ఆరుబయట ఆటలాడే పిల్లలకూ, రాత్రివేళల్లో పిక్క బలంగా పట్టేసి నిద్రాభంగమయ్యే పెద్దలకు ఇది అనుభవమే. దీనికి కారణం మన ఒంట్లో లవణాలూ, ద్రవాలు తగ్గడమే. శరీరం తన జీవక్రియలను కొనసాగించడానికి మెదడు నుంచి ప్రతి నరానికీ ఆదేశాలందాలి. ఈ ఆదేశాలన్నీ లవణాలలోని విద్యుదావేశం కలిగిన అయాన్ల రూపంలో నరాల ద్వారా ప్రసరించి, కండరాలకు ఆదేశాలిస్తాయి. ఎండవేడిమి తీవ్రతతో నీటిని తీవ్రంగా కోల్పోయి, దాంతోపాటూ లవణాలనూ కోల్పోవడం వల్ల నరాల ద్వారా మెదడునుంచి కండరాలకు ఆదేశాలు సరిగా అందవు. దాంతో నీరు కోల్పోయి డీ–హైడ్రేషన్‌కు గురి కాగానే... కండరాలు బిగుసుకు పోతాయి. వీటినే మజిల్క్రాంప్స్ అంటారు. జాగ్రత్తలు: మజిల్క్రాంప్స్కు గురైనప్పుడు శరీరం కోల్పోయిన నీటిని మళ్లీ వెంటనే భర్తీ చేయాలి. అందుకే గంటలకొద్దీ సాగే టెన్నిస్ వంటి ఆటలాడే సమయంలో ఆటగాళ్లు పొటాషియం లవణాలు ఉండే అరటిపండునూ, చక్కెరతోపాటు, ఇతర లవణాలు ఉండే నీళ్లను తరచూ కొద్దికొద్ది మోతాదుల్లో తాగుతూ ఉంటారు. చికిత్స: పిల్లలకు మజిల్క్రాంప్స్ వచ్చి వాళ్ల కండరాలు బిగదీసుకుపోతుంటే వారికి ‘ఓరల్–రీ–హైడ్రేషన్ (ఓఆర్ఎస్) ద్రావణాన్ని తాగించాలి. ఇప్పుడీ ఓఆర్ఎస్ పాకెట్లు అన్ని మెడికల్ దుకాణాలలోనూ ఓఆర్ఎస్ ద్రావణపు పౌడర్ మనకు ఇష్టమయ్యేలా ఎన్నో ఫ్లేవర్లలో దొరుకుతుంది. ►ఓఆర్ఎస్ అందుబాటు లేక... ఒకవేళ కొబ్బరినీళ్లు అందుబాటులో ఉంటే అవి కూడా తాగించవచ్చు. ►ఓఆర్‌ఎస్‌గానీ, కొబ్బరినీళ్లుగానీ అందుబాటులో లేకపోతే... ఒక అరటిపండు తిని, మంచినీళ్లు తాగాలి. పిల్లల విషయంలోనూ ఇదే జాగ్రత్త పనిచేస్తుంది. అరటిపండులో పొటాషియం వంటి లవణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అరటిపండు, నీటితో అవి చాలావరకు భర్తీ అవుతాయి. హీట్ ఎగ్జషన్: శరీరంలోని నీరు, ఖనిజలవణాలు కోల్పోవడం వల్ల కలిగే పరిస్థితి ఇది. బాగా తీవ్రమైన ఎండకు కొన్నాళ్లపాటు అదేపనిగా ఎక్స్పోజ్ కావడం వల్ల ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. నీరసం, నిస్సత్తువ, కండరాల్లో పట్టులేకపోవడం వంటివి దీని లక్షణాలు. ఈ సమస్య ఎక్కువగా వృద్ధుల్లో కనిపిస్తుంది. జాగ్రత్తలు / చికిత్స : ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిని చల్లటి ప్రదేశానికి తరలించి, అక్కడ తగినన్ని ద్రవాలు తాగించాలి. వెంటనే మళ్లీ ఎండకు వెళ్లకుండా చూడాలి. బయట తిరగాల్సిన అవసరం ఉంటే... బాగా చల్లబడ్డాకే వెళ్లనివ్వాలి. హీట్ హైపర్ పైరెక్సియా: బయటి ఎండ కారణంగా రోగికి జ్వరం వచ్చేస్తుంది. దాంతో శరీర ఉష్ణోగ్రత గరిష్ఠంగా 104 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకూ పెరుగుతుంది. మెదడులో ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ తాత్కాలికంగా దెబ్బతింటుంది. ఇలాంటి పరిస్థితినే హైపర్ పైరెక్సియా అంటారు. దీనికీ, వడదెబ్బకూ కాస్త తేడా ఉంది. ఈ కండిషన్లో మెదడులో ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ తాత్కాలికంగా దెబ్బతింటే... వడదెబ్బ (హీట్‌స్ట్రోక్)లో మాత్రం తక్షణం వైద్యసహాయం అందితే తప్ప మెదడులో ఉష్ణోగ్రత వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించలేం. హీట్ స్ట్రోక్ / వడదెబ్బ : ఈ హీట్స్ట్రోక్నే మనం సాధారణ పరిభాషలో వడదెబ్బగా చెబుతుంటాం. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ పూర్తిగా విఫలం కావడంతో వచ్చే ఈ కండిషన్ వల్ల ఒక దశలో శరీర ఉష్ణోగ్రత గరిష్ఠంగా 106 డిగ్రీల ఫారెన్హీట్ను కూడా దాటిపోవచ్చు. కళ్లు తిరగడం, వాంతులు కావడం, శరీరాన్ని ముట్టుకుని చూస్తే విపరీతమైన వేడి కనిపిస్తుంది. రోగి క్రమంగా అపస్మారక స్థితిలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇది చాలా తీవ్రమైన దశ. చివరికి చంకల్లో కూడా చెమట పట్టని పరిస్థితి వస్తుంది. దీన్ని వడదెబ్బకు సూచనగా గుర్తుంచుకోవాలి. ఇదే పరిస్థితి వస్తే... రోగి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్లడానికి (మార్బిడిటీకి) 40% అవకాశం ఉంటుంది. అప్పటికీ జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బ ప్రాణాంతకం కూడా కావచ్చు. ఎందుకింత తీవ్రం : వడదెబ్బ ప్రాణాంతకంగా ఎందుకు పరిణమిస్తుందో చూద్దాం. మన పరిసరాల ఉష్ణోగ్రత బాగా ఎక్కువైనప్పటికీ లేదా బాగా తక్కువైనప్పటికీ మన శరీర ఉష్ణోగ్రత మాత్రం స్థిరంగా 98.4 డిగ్రీల ఫారిన్‌హీట్ ఉంటుంది. ఆ ఉష్ణోగ్రతల వద్దనే మన శరీరం నిర్వహించాల్సిన జీవక్రియలన్నీ (మెటబాలిక్ ఫంక్షన్స్) సక్రమంగా జరుగుతుంటాయి. మన ఉష్ణోగ్రత ఎప్పుడూ 98.4 డిగ్రీల ఫారిన్‌హీట్ ఉండేందుకు మెదడులోని హైపోథెలామస్ తోడ్పడుతుంది. మన ఒంటి ఉష్ణోగ్రత పెరుగుతున్నప్పుడు దాని ఆదేశాల మేరకు స్వేదగ్రంథులు మనకు చెమట పట్టేలా చూస్తాయి. ఇలా చెమటలు పట్టినప్పుడు బయటి గాలి తగిలితే... ఆ స్వేదం ఇగిరిపోతుంటుంది. ఇలా ఇగిరిపోడానికి అది మన ఒంటి ఉష్ణోగ్రత (లేటెంట్ హీట్)ను తీసేసుకుంటుంది. దాంతో ఒంట్లోని ఉష్ణోగ్రత తగ్గుతుంది. అయితే వాతావరణంలో వేడి మరీ ఎక్కువగా ఉండి, స్వేదగ్రంథులు అదేపనిగా నిరంతరం పనిచేయాల్సి వస్తే... అవి కూడా పూర్తిగా అలసిపోతాయి. ఇక దాంతో చెమటపట్టని పరిస్థితి. ఫలితంగా ఒంట్లోని ఉష్ణం బయటకు పోదు కాబట్టి... మన శరీర ఉష్ణోగ్రత అదేపనిగా, అనియంత్రితంగా పెరిగిపోతుంది. హైపోథెలామస్ కూడా దాన్ని తగ్గించలేని పరిస్థితి. మన దేహంలోని అన్ని వ్యవస్థలూ తమ జీవక్రియలను నిర్వహించేందుకు ఆదర్శ ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్‌హీట్ అన్న విషయం తెలిసిందే. కానీ శరీర ఉష్ణోగ్రత 104 నుంచి 106... కొన్ని సందర్భాల్లో 110కి కూడా చేరి అది ఎంతకూ తగ్గకపోవడంతో, దేహంలోని అన్ని వ్యవస్థల పనితీరుకు (మెటబాలిక్ ఫంక్షన్స్) తీవ్రంగా దెబ్బ తగులడంతో అన్ని వ్యవస్థలూ కుప్పకూలిపోతాయి. దాంతో వృద్ధులు, బలహీనంగా ఉన్న కొందరిలో మరణం కూడా సంభవించే ఆస్కారం ఉంది. అది అపోహ మాత్రమే : కొంతమంది ఎండలో లేకుండా నీడ పట్టున ఉంటే వడదెబ్బ తగలదని అనుకుంటారు. అయితే ఎండలో ఉన్నా నీడలో ఉన్నా పరిసరాలు చాలా వేడిగా ఉన్నప్పుడు, వేడి చాలా అధికంగా ఉండే సముద్రప్రాంతాల్లో నేరుగా ఎండతగలని చోట ఉన్నప్పటికీ వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. అందుకే వడదెబ్బనుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే... మనకు నేరుగా ఎండ తగలకుండా చూసుకోవడం మాత్రమే సరిపోదు. చల్లటి ప్రదేశంలో ఉండటం అవసరమని గుర్తించాలి. వడదెబ్బ లక్షణాలు : వికారం; వాంతులు; కళ్లు తిరగడం; నీరసం; ►స్పృహతప్పడం; ఫిట్స్ రావడం; ►చివరగా కోమాలోకి వెళ్లడం జరగవచ్చు. వడదెబ్బకు చికిత్స ఒంటి ఉష్ణోగ్రత 100 ఫారెన్‌హీట్ డిగ్రీలకు మించుతున్నట్లు తెలియగానే పెద్దలనైనా, పిల్లలనైనా వెంటనే చల్లటి గాలి సోకేలా ఫ్యాన్ కింద ఉంచాలి. (ఫ్యాన్ కింద వేడిగాలి వస్తుంటే అలాంటి చోటకు తీసుకెళ్లినా ప్రయోజనం ఉండదు). దుస్తులను వదులుగా చేసి, ఒంటికి చల్లగాలిని బాగా తగలనివ్వాలి. ఒకవేళ బట్టలు ఇబ్బందికరంగా ఉంటే నడుముకు చిన్న ఆచ్ఛాదన ఉంచి, మిగతా బట్టలన్నీ తీసేయాలి. ఈ జాగ్రత్తల తర్వాత కూడా శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతే పిల్లలకు చంకల కింద / గజ్జల వద్ద ఐస్ గడ్డలను ఉంచాలి. దాంతో ఒళ్లు చల్లబడుతుంది. అప్పటికీ శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతే, దాన్ని మెడికల్ ఎమర్జెన్సీగా గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించాలి. పిల్లలకూ, వృద్ధులకూ వడదెబ్బ ప్రభావం మరింత ఎక్కువ: పెద్దలతో పోలిస్తే పిల్లల్లో చెమట పట్టడం తక్కువ. అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ వృద్ధుల్లోనూ చెమట గ్రంథుల పనితీరు తగ్గుతుంది. దాంతో పిల్లలూ, వృద్ధులు తేలిగ్గా వడదెబ్బ ప్రభావానికి లోనయ్యే ప్రమాదం ఉంది. పిల్లలకు పెద్దగా చెమట పట్టకపోవడం వల్ల వారు పెద్దగా ద్రవాలను కోల్పోవడం లేదనీ, వారు సురక్షితంగానే ఉన్నారని అపోహ పడుతుంటారు. కానీ తమకు విపరీతంగా చెమటలు పడుతున్నందున పిల్లల కంటే తామే ఎక్కువగా ద్రవాలను కోల్పోతున్నామని అనుకుంటారు. కానీ ఈ అభిప్రాయాలు వాస్తవం కాదు. పిల్లలతో పోలిస్తే పెద్దల్లో చెమట గ్రంథులు ఎక్కువ. కాబట్టి ఉష్ణోగ్రతలు కాస్తంత ఎక్కువగా పెరగగానే పెద్దల్లో చెమటలు పట్టే ప్రక్రియ వెంటనే మొదలవుతుంది. కానీ పిల్లల్లో అలా కాదు. వాళ్లలో పెద్దల తరహాలోనే చెమటలు పట్టాలంటే పెద్దలకంటే ఉష్ణోగ్రత చాలా చాలా రెట్లు పెరగాలి. కానీ అమితంగా పెరిగినప్పుడు పిల్లల ఒంటిని చల్లబరిచే మెకానిజం అయిన చెమట పట్టడం తక్కువ కావడంతో పిల్లల ఒంటి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. అందుకే పిల్లల్లో పెద్దగా చెమటలు పట్టకపోయినా... వాళ్ల ఒంటి ఉష్ణోగ్రత తేలిగ్గా పెరుగుతుందని పెద్దలు గ్రహించాలి. పైగా ఒంటిని చల్లబరిచేందుకు ఉద్దేశించిన స్వేద గ్రంథుల సంఖ్య వాళ్లలో తక్కువ కాబట్టి ఒళ్లు వెంటనే ఒక పట్టాన చల్లబడదని గ్రహించాలి. అందుకే ఈ వేసవి సీజన్లో వారిని ఎప్పుడూ చల్లగా ఉండే ప్రదేశాల్లోనే ఆడుకొమ్మని చెప్పాలి. ఒకవేళ ఆరుబయట ఆడుకోడానికి వెళ్తుంటే సాయంత్రం 5 తర్వాతే వారిని బయటకు అనుమతించాలి. ఒబేస్ పిల్లల విషయంలో మరింత జాగ్రత్త.. మామూలు పిల్లలతో పోలిస్తే కాస్త ఒళ్లు చేసి ఉన్న పిల్లలూ, ఒబేసిటీతో బాధపడే పిల్లలూ వేసవిలో మరింత జాగ్రత్తగా ఉండాలి. బాగా ఒళ్లు చేసి ఉన్న పిల్లలు ఆటలాడుతున్నప్పుడు వాళ్లకు చెమట పట్టడం, బరువు తగ్గడం జరుగుతుంది. అలా తమ పిల్లలు బరువు తగ్గారు కదా అంటూ పెద్దలు ఆనందించడం మామూలే. కానీ ఇలా స్థూలకాయంతో ఉన్న పిల్లలు చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు తగ్గితే అది ఆనందించాల్సిన విషయం కాదు. ఆ పిల్లలు ఆటలాడటం వల్ల తమ ఒంట్లోంచి నీళ్లు కోల్పోవడంతో పాటు, ఆ నీటితో పాటు విలువైన ఖనిజలవణాలనూ కోల్పోయారని గ్రహించాలి. ఇలా స్థూలకాయం కలిగి ఉన్న పిల్లలు బాగా ఆటలాడితే ప్రతి కిలో బరువుకు 500 మిల్లీలీటర్ల మేరకు ద్రవాలను కోల్పోవచ్చు. ఆ మేరకు బరువూ తగ్గుతారు. దాంతో తమ పిల్లలు బరువు కోల్పోయి ఆరోగ్యంగా మారుతున్నారంటూ పెద్దలు అపోహ పడవచ్చు. కానీ అలా సరికాదు. వాళ్లు విలువైన ఖనిజలవణాలు కోల్పోయి డీ–హైడ్రేషన్‌కు గురవుతున్నారనే విషయాన్నే గ్రహించాలి. అందుకే ఇలా బరువు తగ్గుతున్నప్పుడు పెద్దలు వారి ఒంటిలో జరిగే జీవక్రియలకు (మెటబాలిక్ ఆక్టివిటీస్‌కు) అవసరమైన నీటిని భర్తీ చేస్తూ ఉండాలి. అందుకే స్థూలకాయులైన పిల్లలు వెంటవెంటనే మరింత బరుతు తగ్గుతున్నట్లు గ్రహిస్తే పెద్దలు వారి ఒంట్లోకి తగిన ఎలక్ట్రోలైట్స్ పంపించేందుకు కొబ్బరినీళ్లు, గ్లూకోజ్ వంటివి ప్రతి 20 నిమిషాలకొకసారి తప్పనిసరిగా తాగిస్తూ ఉండాలి. ఎండ దుష్ప్రభావాల నివారణ ఇలా... ►ఎండవేళల్లో పెద్దలూ, పిల్లలూ ఎండకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక పిల్లలను ఇంట్లోని చల్లటి జాగాల్లో ఆడుకునేలా ప్రోత్సహించాలి. ఎండవేళల్లో పిల్లలను కేవలం ఇన్డోర్ గేమ్స్‌కు మాత్రమే పరిమితం చేయాలి. ►పెద్దలూ, పిల్లలూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారిని ఇంట్లోనే ఉండాలి. మరీ ఎక్కువ పని ఉంటే తప్ప ఉదయం పది తర్వాత పెద్దలు బయటకు ఎండవేడికి వెళ్లకూడదు. ►మనం నేరుగా ఎండ∙తగలకుండా నీడలోనే ఉన్నా లేదా గదిలోనే ఉన్నా ఒకవేళ ఆ గది ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటే నీడపట్టున ఉన్నప్పటికీ వడదెబ్బ తగలవచ్చు. కాబట్టి నేరుగా ఎండకు వెళ్లకపోవడమే కాదు... మనం ఉన్నచోట చల్లగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. చల్లగా ఉండే ప్రదేశాల్లోనే ఉండండి. ►ఆరుబయటకు తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే తప్పక గొడుగు తీసుకెళ్లండి. లేదా అంచు వెడల్పుగా ఉండే బ్రిమ్ క్యాప్ వాడాలి. ►బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా వాటర్‌బాటిల్‌ను దగ్గర ఉంచుకోండి. డ్రైవింగ్ చేసేవారు ఎప్పుడూ తప్పనిసరిగా తమతో వాటర్ బాటిల్ ఉంచుకోవాల్సిందే. ►మనం వేసవిలో తరచూ నీరు తాగుతూ ఉండాలి. ముఖ్యంగా ఆటల్లో నిమగ్నమైపోయే పిల్లలు తరచూ మంచినీళ్లు తాగకపోవచ్చు. అందుకే వారికి తరచూ మంచినీళ్లు తాగిస్తూ ఉండాలి. ఈ వేసవిలో కొబ్బరినీళ్లు, తాజా పండ్లరసాలు తీసుకుంటూ ఉండటం మంచిది. కూల్‌డ్రింక్స్ వద్దు. కార్బొనేటెడ్ డ్రింక్స్, శీతల పానీయాల వల్ల మరింత డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. దాంతో ఒంట్లోని లవణాలను మరింత వేగంగా కోల్పోతామని గుర్తుపెట్టుకోండి. -
వడదెబ్బకు విరుగుడు
సాక్షి, హైదరాబాద్: వడదెబ్బ బాధితులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా పడకలను సిద్ధం చేయాలని వేసవి కార్యాచరణ ప్రణాళిక స్పష్టం చేసింది. వడదెబ్బకు గురై ఆస్పత్రుల పాలయ్యేవారికి అవసరమైన వైద్యం అందించాలని పేర్కొంది. ఈ ఏడాదీ వడగాడ్పులు అధికంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో వేసవి ప్రణాళికపై అధికారులు దృష్టి సారించారు. ఏటా ఈ ప్రణాళికను అమలుచేసే బాధ్యతను విపత్తు నిర్వహణ శాఖ చేపడుతుంది. అందులో భాగంగా ఈ ఏడాదికీ వేసవి ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. తీవ్రమైన ఎండల నుంచి ప్రజలను అప్రమత్తం చేయడం, బాధితులకు అవసరమైన సహాయ చర్యలు తీసుకోవడమే ప్రణాళిక ముఖ్య ఉద్దేశం. ఈ విషయంలో వివిధ శాఖలు ఎటువంటి పర్యవేక్షణ చేయాలన్న దానిపై వేసవి ప్రణాళిక కార్యాచరణ రూపొందించింది. జిల్లా రాష్ట్ర స్థాయిలో కమిటీలు.. వడదెబ్బకు ఎక్కువగా పేదలే గురవుతున్నారు. పైగా వారిలో ఎక్కువమంది ఆరుబయట కాయకష్టం చేసేవారు, కార్మికులు. వడదెబ్బకు చనిపోయే వారిలో 40–60 ఏళ్ల వయసు వారు ఎక్కువగా ఉంటున్నారు. వారికి ఎండ తీవ్రత నుంచి రక్షణ కల్పించేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులతో కమిటీని ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రస్థాయి కమిటీకి విపత్తు నిర్వహణశాఖ కమిషనర్ నోడల్ ఆఫీసర్‌గా ఉంటారు. వైద్య, రెవెన్యూ తదితర శాఖల ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయిలో వేసవి ప్రణాళిక అమలుకు కలెక్టర్ నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సంబంధిత కమిషనర్లు నోడల్ ఆఫీసర్లుగా ఉంటారు. మార్చి నుంచి జూన్ వరకు ఈ ప్రణాళిక అమలు చేస్తారు. తీవ్రమైన వడగాడ్పులు, ఎండలుండే హైరిస్క్ ప్రాంతాలను ఈ కమిటీలు గుర్తించాలి. తద్వారా వడదెబ్బకు ప్రజలు గురికాకుండా నివారించాలి. ఆరోగ్య కార్యకర్తలకు, పాఠశాల విద్యార్థులకు, స్థానిక ప్రజలకు వడదెబ్బ నివారణపై శిక్షణ ఇవ్వాలి. వాతావరణ కేంద్రం ద్వారా ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా ఎండల తీవ్రతపై హెచ్చరికలు జారీచేయాలి. మీడియాకు, వివిధ ప్రభుత్వ శాఖలకు వర్క్‌షాప్ నిర్వహించాలి. పౌరసంబంధాల శాఖ ద్వారా ముఖ్యమంత్రి బహిరంగ సభల లేఖలను ముద్రించి గ్రామ సభల్లో చదివించాలి. సినిమా హాళ్లలో స్లైడ్లను ప్రదర్శించాలి. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బందికి, ఆశా వర్కర్లు, పారామెడికల్ సిబ్బందికి ఎండల తీవ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ కల్పించాలి. వైద్య విద్య సంచాలకుల ద్వారా వైద్య విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి. వైద్య విధాన పరిషత్, వైద్య విద్య సంచాలకుల ఆధ్వర్యంలో సంబంధిత ఆస్పత్రుల్లో వడదెబ్బ బాధితులకు ప్రత్యేక పడకలు ఏర్పాటు చేయాలి. మధ్యాహ్నం బస్సులు నిలిపివేసేలా.. - నిర్మాణ కార్మికులకోసం సంబంధిత యాజమాన్యాలు తాగునీటి వసతి, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి. - ఉపాధి హామీ కూలీలకు పనిచేసే చోట టెంట్లు ఏర్పాటు చేయాలి. నీటి వసతి కల్పించాలి. - పశువులు, కోళ్లకు వడదెబ్బ తగలకుండా తగు చర్యలు తీసుకోవాలి. - క్యాబ్, ఆటో డ్రైవర్లకు వేసవి తీవ్రతపై అవగాహన కల్పించాలి. - బస్టాండ్లలో ప్రయాణికులకోసం తాగునీటి వసతి కల్పించాలి. కరపత్రాలు పంచాలి. సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో చల్లని తాగునీరు, ఐస్ ప్యాక్‌లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి. ఈ మేరకు ఆర్టీసీ చర్యలు తీసుకోవాలి. - వడగాడ్పుల సమయంలో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బస్సులను నిలిపివేయాలి. - పాఠశాల తరగతి గదుల్లో సీలింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేయాలి. తాగునీటి వసతి కల్పించాలి. ఓఆర్ఎస్, ఐస్ ప్యాక్‌లను అందుబాటులో ఉంచాలి. వడగాడ్పుల సమయంలో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు నిర్వహించకూడదు. అలాగే ఆరుబయట తరగతులను నడపకూడదు. - ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు పలుచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. - వాతావరణశాఖ ఎప్పటికప్పుడు వడగాడ్పులపై సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలి. -
బయట నుంచి రాగానే తేనె తినకండి
సాక్షి, హైదరాబాద్: మార్చి నెల రాకముందే ఎండ తీవ్రత పెరుగుతోంది. పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి నమోదవుతుండటంతో వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది. ఈ మేరకు శుక్రవారం కొన్ని సూచనలతో కూడిన ప్రకటనను జారీ చేసింది. తల తిరగడం, తీవ్ర జ్వరం, మత్తు నిద్ర, కలవరింతలు, ఫిట్స్, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితి వంటి వడదెబ్బ లక్షణాలు ఉంటే అప్రమత్తం కావాలని పేర్కొంది. తీవ్రమైన ఎండలో బయటకు వెళ్లినప్పుడు తల తిరగడం, ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడితే దగ్గరలో ఉన్న వైద్యుడిని సంప్రదించాలని సూచించింది. ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు.. - తెలుపు రంగు పలుచటి కాటన్ వస్త్రాలను ధరించాలి. - తలకు టోపి పెట్టుకోవాలి లేదా రుమాలు కట్టుకోవాలి. - ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు కలిపిన నీటిని, ఓరల్ రీ హైడ్రేషన్ కలిపిన నీటిని తాగాలి. - వడదెబ్బకు గురైన వారిని వెంటనే నీడ ఉన్న ప్రాంతానికి చేర్చాలి. - వడదెబ్బకు గురైన వారిని తడిగుడ్డతో శరీరం అంతా రుద్దుతూ ఉండాలి. ఐస్ నీటిలో బట్టను ముంచి శరీరం అంతా తుడవాలి. శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల కంటే లోపునకు వచ్చే వరకు బట్టతో శరీరాన్ని తుడుస్తూ ఉండాలి. ఫ్యాను కింద ఉంచాలి. - వడదెబ్బకు గురైన వారు సాధారణ స్థితికి రానట్లయితే వారిని దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించాలి. - మంచినీరు ఎక్కువగా తాగాలి. ఎండలో నుంచి వచ్చిన వెంటనే నిమ్మరసం గానీ కొబ్బరినీరు లేదా చల్లని నీరు తాగాలి. ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు చేయకూడనివి.. - నలుపురంగు, మందపాటి దుస్తులు ధరించరాదు. - మధ్యాహ్నం (ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు) ఆరుబయట ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పనిచేయవద్దు. - ఎండలో బయట నుంచి వచ్చిన వెంటనే తీపి పదార్థాలు, తేనె తీసుకోకూడదు. - శీతల పానీయాలు, మంచుముక్కలు తీసుకుంటే గొంతుకు సంబంధించిన అనారోగ్యం ఏర్పడుతుంది. రాష్ట్రంలో దంచికొట్టిన ఎండలు భద్రాచలం, మహబూబ్‌నగర్‌ల్లో 38 డిగ్రీలు నమోదు రాష్ట్రంలో ఎండలు దంచికొట్టాయి. శనివారం భద్రాచలం, మహబూబ్‌నగర్‌ల్లో ఏకంగా 38 డిగ్రీలు నమోదు కావడం గమనార్హం. ఇక ఆదిలాబాద్, హన్మకొండ, హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండంల్లో 37 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలతో జనం ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడే ఈ స్థాయిలో ఎండలున్నాయంటే మున్ముందు పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనన్న చర్చ జరుగుతోంది. మరోవైపు ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఆదివారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. సోమవారం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఆయన వెల్లడించారు. -
మండుతున్న ఎండలు.. ఆగుతున్న గుండెలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండల తీవ్రతకు జనజీవనం అల్లాడిపోతోంది. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు మించి నమోదవుతుండటంతో వడదెబ్బకు మృతి చెందే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత పదిరోజుల్లో 40 మందికిపైగా మృతి చెందినట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి. అయితే వివరాలను అధికారికంగా బయటపెట్టడం లేదు. మే నెల ప్రారంభం కావ డంతో పరిస్థితి ఇంకా ఎంత తీవ్రంగా ఉంటుం దోననే ఆందోళన నెలకొంది. వడగాడ్పులు మరిన్ని రోజులుంటాయని, 45 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పిల్లలు, వృద్ధులపై ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. మరోవైపు ఎండవేడి కారణంగా అనేక చోట్ల వరి కోతలు నిలిచిపోయాయి. ఎండలకు కూలీలు దొరకడం లేదు. వరి కోత యంత్రాలు అందుబాటులో లేకపోవడంతో అనేకచోట్ల ధాన్యం భూమి మీదే రాలిపోతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడానికి కూడా అవకాశాలు కనిపించడం లేదు. ప్రణాళిక ఘనం.. ఆచరణ శూన్యం కలెక్టర్లు, ఇతర అన్ని శాఖల అధికారులకు విపత్తు నిర్వహణ శాఖ వేసవి ప్రణాళికను అందజేసింది. ప్రణాళికను ఘనంగా తయారు చేసినా దాని అమలులో మాత్రం ఘోర వైఫల్యం కనిపిస్తోంది. మొబైల్ ఫోన్లలో మెసేజ్‌లు, వాట్సాప్ తదితర పద్దతుల ద్వారా వడదెబ్బ, ఎండ వేడిమి హెచ్చరికలను ఎప్పటికప్పుడు జనానికి చేరవేయాలన్న విపత్తు నిర్వహణ శాఖ సూచనలను పట్టించుకునే పరిస్థితి లేదు. అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్న నిర్ణయం దాదాపు ఎక్కడా అమలు కావడం లేదని ప్రజలు చెబుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐవీ ఫ్లూయీడ్స్ అందుబాటులో ఉంచాలన్న నిబంధన ఆచరణలో పెట్టడం లేదు. వివిధ ప్రాంతాల్లో తాగునీటి కేంద్రాల ఏర్పాటులోనూ లోపం కనిపిస్తోంది. ఉపాధి హామీ పథకం కూలీలకు పనిచేసే చోట షెల్టర్లు కట్టించాలన్న నిబంధన కాగితాలకే పరిమితమైంది. కార్మికులు ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఆరుబయట పనిచేయకూడదన్న నిబంధనను అనేక కంపెనీలు ఉల్లంఘిస్తున్నాయి. గుళ్లు, ప్రభుత్వ భవన సముదాయాలు, మాల్స్ తదితర చోట్ల ప్రజలకు నీడ కల్పించేలా చర్యలు తీసుకోవాలన్న నిర్ణయాన్ని జిల్లాల్లో పెద్దగా పట్టించుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి. ఎండల తీవ్రత, జాగ్రత్తలపై విరివిగా కరపత్రాలు, గోడ పత్రికలు, ఇతర సమాచారాన్ని ముద్రించి ఇవ్వాలని ఆదేశించినా అధికారులు పట్టించుకోవడంలేదు. ఇక పశువులకు నీటి వసతికి దిక్కే లేదు. ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగుల సమయ వేళలను మార్చాలని పేర్కొన్నా ఆచరణలో కనిపించడంలేదు. ప్రధాన బస్టాండ్లలో ఆరోగ్య బృందాలు ఏర్పాటు చేయాలని విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది. కానీ అవి ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదని ప్రయాణికులు వాపోతున్నారు. అత్యవసరమైతే తప్ప.. వడగాడ్పులు తీవ్రంగా ఉన్న సమయంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు బస్సులను తిప్పకూడదు. కానీ జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతూ బస్సులను తిప్పుతున్నారు. ఏసీ బస్సులు కాకుండా ఇతర బస్సుల్లో ఇలాంటి సమయంలో ప్రయాణిస్తే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి – ఆరుబయట పనిచేసేవారు సూర్యరశ్మి నుంచి కాపాడుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి. – తెలుపు లేదా లేత వర్ణం కా>టన్ వస్త్రాలు ధరించాలి. – పలుచటి మజ్జిగ, గ్లూకోజు నీరు, చిటికెడు ఉప్పు, చెంచా చక్కెర ఒక గ్లాసులో కలుపుకొని ఇంటిలోనే తయారుచేసిన ఓఆర్ఎస్ ద్రావణం తాగితే వడదెబ్బ నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది. – వడదెబ్బ తగిలిన వారిని నీడలో చల్లని ప్రదేశంలో ఉంచాలి. శరీర ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది కాబట్టి సాధారణ ఉష్ణోగ్రత వచ్చే వరకు తడి గుడ్డతో తుడుస్తూ ఉండాలి. – వడదెబ్బకు గురైనవారు ప్రాథమిక చికిత్స అనంతరం సాధారణ స్థితికి రాకుంటే వెంటనే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలి. -
వడదెబ్బతో 13 మంది మృతి
సాక్షి, నెట్వర్క్: వడదెబ్బతో సోమవారం 13 మంది మృత్యువాతపడ్డారు. ఇందులో ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఆరుగురు మృతిచెందారు. వైరా మండలం రెబ్బవరానికి చెందిన నాగేశ్వరరావు, చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన భారతమ్మ, బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలకు చెందిన ఏలయ్య, పాల్వంచకు చెందిన తవిటినాయుడు, కూసుమంచి మండలం బోడియాతండాకు చెందిన చినరాములు, కొత్తగూడెంలోని రామ వరం పద్మశాలి బస్తీకి చెందిన శ్రీనివాస్ మృతిచెందారు. సూర్యాపేట జిల్లాలో చివ్వెంలకు చెందిన ఇమామ్ సాహెబ్, అర్వపల్లికి చెందిన వీరయ్య , మఠంపల్లి మండలం బక్కమంతులగూడేనికి చెందిన గోపయ్య, ఉమ్మడి కరీంనగర్ జిల్లా సైదాపూర్‌కు చెందిన కొండ లచ్చమ్మ, జమ్మికుంట మండలం విలాసాగర్‌కు చెందిన పద్మ, బుగ్గారం మండలం సిరికొండకు చెందిన పోచయ్య ఎండలకు తాళలేక ప్రాణాలొదిలారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేట గ్రామంలో శివలక్ష్మి మృతి చెందింది. -
వడదెబ్బతో 12 మంది మృతి
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో గురువారం వడదెబ్బతో 12 మంది మృతిచెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐదుగురు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నలుగురు, ఖమ్మం జిల్లాలో ఇద్దరు, హుజూరాబాద్‌లో ఒకరు మరణించారు. వడదెబ్బతో వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం గునకపల్లిలో చింతల ఓదెలు (60), సంగెం మండలం కాపులకనిపర్తిలో సదిరం ఏలియా(55), నల్లబెల్లి మండలం పద్మాపురంలో తుర్సం పద్మ(45), జనగామ జిల్లా చిల్పూరు మండలంలోని నష్కల్ గ్రామానికి చెందిన పాశం చంద్రమౌళి (60), జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని వెంకట్రావుపల్లి (బి)కి చెందిన కందుల రాజేష్ (40) వడదెబ్బతో మృతి చెందారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామానికి చెందిన చిట్యాల నర్సింహ (36), చందంపేట మండల కేంద్రానికి చెందిన కొండ్రపల్లి శ్రీను(30), కోదాడ పట్టణానికి చెందిన రంగా నర్సింహారావు(71), నకిరేకల్‌లోని ప్రగతినగర్‌కు చెందిన ముత్యాల రాములు(65) ఎండవేడిమికి అస్వస్థతకు గురై మృత్యువాతపడ్డారు. సూర్యాపేట జిల్లా మోతె మండలానికి చెందిన దామెర్ల రామచంద్రు(50), స్టేషన్ రోడ్‌లోని క్రిస్టిల్ బార్ సందులో చిత్తు కాగితాలు ఏరుకునే భూలక్ష్మి(60), సిద్దిపేట జిల్లా హుజూరాబాద్ మండలంలోని జూపాక గ్రామానికి చెందిన నీలం కొమరయ్య(58) వడదెబ్బతో మృతి చెందారు. -
వడదెబ్బతో నలుగురు మృతి
నర్సంపేట రూరల్/బయ్యారం/భువనగిరి అర్బన్ : వడదెబ్బతో వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం నలుగురు మృతి చెందారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం దాసరిపల్లికి చెందిన మేకల సమ్మయ్య(60), నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండ లం బాస్మాన్‌పల్లికి చెందిన శివరాత్రి వెంకటయ్య(70), భువనగిరి పట్టణం తారకరామనగర్ కాలనీకి చెందిన కోళ శ్రీను(45), మోత్కూరు మండల కేంద్రం సుందరయ్య కాలనీకి చెందిన బుర్ర వెంకటమ్మ(58) మృతి చెందారు. -
సాయం..శూన్యం!
కర్నూలు(అగ్రికల్చర్): ఏటా పెరుగుతున్న ఎండల తీవ్రతకు కష్టజీవులు వడదెబ్బకు గురై అశువులు బాస్తున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నాలుగేళ్ల నుంచి ఒక్క మృతుడి కుటుంబానికి కూడా చేయూతనివ్వలేదు. 2014–17మధ్య కాలంలో 192 మంది వడదెబ్బతో మృతి చెందారని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ఒక్కరికి కూడా పరిహారం మంజూరు కాకపోవడంతో కుటుంబ పెద్ద మృతితో ఆయా కుటుంబాలు వీధిన పడుతున్నా పాలకుల్లో కనికరం లోపించడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. పరిహారం నిల్.. సాధారణంగా వడదెబ్బ మరణాలను మండల తహసీల్దార్, ఎస్ఐ, మెడికల్ ఆఫీసర్లతో కూడిన బృందం ధృవీకరిస్తుంది. వీటికి ప్రత్యేకంగా పోస్టుమార్టం లేకపోయినప్పటికీ ముగ్గురు సభ్యులున్న మండలస్థాయి బృందం ధృవీకరించాలి. వడదెబ్బ మరణాలని ఈ కమిటీ నిర్ధారించిన్పటికీ ప్రభుత్వం నుంచి చేయూత దక్కకపోవడం గమానార్హం. రాష్ట్రం మొత్తం మీద 2014 నుంచి వడదెబ్బతో 2776 మంది మరణించగా జిల్లాలో 192 మంది మరణించినట్లు ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. మృతుల్లో ఒక్కరికి కూడా పరిహారం చెల్లించలేదు. గతంలో.. వడదెబ్బ మృతులు, ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు గతంలో ఆపద్బందు పథకం కింద రూ.50వేల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ఇచ్చేది. టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేయడంతో పేదలు మరణిస్తే ఆ కుటుంబాలకు చేయూత అందకుండా పోతోంది. చలివేంద్రాలు, చలువ పందిళ్లు, మజ్జిగ పంపిణీలో నిధులు భారీగా దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలున్నాయి. జిల్లాలో రూ.కోటి ఖర్చు పెడితే ఇందులో రూ.50 లక్షల వరకు దుర్వినియోగం జరిగినట్లు విమర్శలున్నాయి. స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన చలివేంద్రాలను సైతం ప్రభుత్వ ఖాతాలో వేశారనే ఆరోపణలున్నాయి. 2017లో మరణాల సంఖ్య తగ్గింపు.. 2014 నుంచి 2016 వరకు జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతలతో పోలిస్తే 2017లో ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్రత పెరిగి వడదెబ్బ మరణాలు పెరిగాయి. వివిధ వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు దాదాపు 100 మంది వరకు వడదెబ్బతో మృతి చెందారు. అయితే మరణాల సంఖ్యను తగ్గించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు సంఖ్యను తక్కువగా చూపారు. 2016లో 65 మంది మరణించినట్లు లెక్కలు ఉన్నా.. 2017లో కేవలం 8 మంది మాత్రమే మృతి చెందారని అధికారుల లెక్కలు పేర్కొంటున్నాయి. ఉద్దేశ్య పూర్వకంగానే మరణాల సంఖ్యను తగ్గించినట్లు తెలుస్తోంది. చలివేంద్రాల పేరుతో నిధులు వృథా.. చలివేంద్రాలు, చలువ పందిళ్లు, మజ్జిగ పంపిణీ పేరుతో జిల్లాలో ఏటా రూ.కోటి వరకు ఖర్చు చేస్తున్నారు. అయితే ప్రాణాలు కోల్పోయిన పేద కుటుంబాలకు మాత్రం పరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 2014 నుంచి వడదెబ్బ మరణాలు ఇలా... సంవత్సరం మృతుల సంఖ్య 2014 43 2015 76 2016 65 2017 8 మొత్తం 192 -
వడదెబ్బతో ఐదుగురు మృతి
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. వడదెబ్బ కారణంగా ఆదివారం రాష్ట్రంలోని వేర్వేరుచోట్ల ఐదుగురు మృతి చెందారు. నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ మండలం జప్తివీరప్పగూడేనికి చెందిన గుంజ వీరమ్మ (75), శాలిగౌరారం మండలంలోని మాధారంకలాన్ గ్రామానికి చెందిన గంగాధరి రామ చంద్రయ్య(55) వడదెబ్బతో మృతి చెందారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని అయిలాపూర్ గ్రామానికి చెందిన కుముటం శాంతి కుమార్(42), ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహ స్వామి దేవస్థాన అటెండర్ వావిలాల చంద్రయ్య (52), రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని మర్రిపల్లి గ్రామానికి చెందిన గడప లక్ష్మణ్ (63) మృతి చెందిన వారిలో ఉన్నారు. -
వడదెబ్బతో ఇద్దరు మృతి
వెల్దుర్తి రూరల్ : వడదెబ్బతో బుధవారం ఇద్దరు మహిళలు మృతి చెందారు. రామళ్లకోట గ్రామం దాసరిపేటలో మహబూబ్‌బీ(57)..అధిక ఉష్ణోగ్రతలతో రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఎండలో తిరిగి స్పృహ తప్పిపడిపోయారు. ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందారు. అలాగే వెల్దురికి చెందిన ముత్యాల తిమ్మక్క (48) బుధవారం కూలీపనికి వెళ్లి అస్వస్థతకు గురైయ్యారు. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించేలోపు మృతిచెందారు. మృతురాలికి పెళ్లైన కుమార్తె ఉంది. -
పిట్టల్లా రాలిపోతున్నారు..
►వడదెబ్బకు జిల్లాలో ఒకే రోజు ఏడుగురు మృతి ►బెంబేలెత్తిస్తున్న ఎండలు జిల్లా వ్యాప్తంగా ఎండలు మండి పోతున్నాయి. భానుడు తన ఉగ్రరూపం చూపిస్తుంటే చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వణికిపోతున్నారు. ఒక్క సోమవారం రోజునే ఎండలకు తాళలేక ఏడుగురు మరణించారు. నెల్లిమర్లలో ముగ్గురు, సాలూరులో ఒకరు, వేపాడలో ఒకరు, చీపురుపల్లిలో ఇద్దరు వడదెబ్బ బారిన పడి మరణించిన వారిలో ఉన్నారు వేపాడ (ఎస్‌కోట) : వేపాడ మండలంలోని సోంపురం గ్రామానికి చెందిన దాసరి సత్యం (76) అనే వ్యక్తి ఆదివారం రాత్రి వడదెబ్బ బారిన పడి మరణించినట్లు త్రిసభ్య కమిటీ సభ్యులు సోమవారం వెల్లడించారు. ఈ మేరకు కమిటీ సభ్యులకు కుటుంబీకులు సమాచారం ఇవ్వడంతో వారు వెళ్లి నిర్ధారించారు. డీటీ కె ప్రసాదరావు, వైద్య, పోలీస్ శాఖాధికారులు గ్రామానికి వెళ్లి వివరాలు కనుక్కొని వివరాలు వెల్లడించారు. నెల్లిమర్ల నగర పంచాయతీలో ముగ్గురు.. నెల్లిమర్ల : ఎండదెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. సోమవారం ఒక్కరోజే ఎండ తీవ్రతకు తట్టుకోలేక నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. నెల్లిమర్ల పట్టణంలో నగర పంచాయతీకి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు చనిపోగా, జరజాపుపేటలో మరో ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. స్థానికులు అందించిన వివరాల ప్రకారం నెల్లిమర్ల నగర పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న జలగడుగుల సత్తియ్య (55) రోజులాగే సోమవారం కూడా విధులకు హాజరయ్యారు. కానీ ఎండ తీవ్రతకు తట్టుకోలేక మధ్యలోనే ఇంటికి వెళ్లిపోయారు. అస్వస్థతగా ఉండడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బంధువులు ప్రయత్నించారు. ఇంతలోనే ఆయన మృతి చెందారు. జరజాపుపేటకు చెందిన సూరి ముత్యాలమ్మ (60), గంటా పెంటయ్య (63) కూడా ఎండ తీవ్రతకు తట్టుకోలేక ఇళ్లల్లోనే మృత్యువాత పడ్డారు. నెల్లిమర్ల పట్టణానికి చెందిన నక్కాన వెంటకరావు (43) అనే వ్యక్తి ఆదివారం రాత్రి మృతి చెందారు. మొత్తంగా ఈ వేసవిలో వడదెబ్బ బారిన పడి నెల్లిమర్ల నగర పంచాయతీ, మండల వ్యాప్తంగా 45 మంది మరణించారు. అధికారులు మాత్రం ఇద్దరినో, ముగ్గురినో మాత్రమే వడదెబ్బ మృతులుగా గుర్తించారు. సమాచారం అందించినా రెవెన్యూ అధికారులు రావడం లేదని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. బహర్భూమికని వెళ్లి.. సాలూరు : సాలూరు మండలం ఇద్దనవలస గ్రామానికి చెందిన దమరసింగు అప్పలస్వామి ( 65) సోమవారం ఉదయం గ్రామం సమీపంలో ఉన్న చెరువుకి బహిర్భూమికి వెళ్లి అక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ముందురోజు బాగా ఎండలో పని చేసిన ఆయన ఉదయం లేచిన తర్వాత హఠాత్తుగా కుప్పకూలినట్లు భార్య సీతమ్మ, ఆయన ముగ్గురు కుమారులు పేర్కొన్నారు. ఇద్దరు మహిళల మృతి చీపురుపల్లి రూరల్/చీపురుపల్లి : చీపురుపల్లి మండలంలో సోమవారం ఎండ దాటికి తాళలేక ఇద్దరు మహిళలు మృతి చెందారు. మండలంలోని అలజంగి పంచాయతీ పరధిలోని విశ్వనాథపురం గ్రామానికి చెందిన రేవల్ల సత్యవతి (36) వడదెబ్బతో మరణించారు. దివ్యాంగురాలైన సత్యవతి ఇంటి వద్దనే ఉన్నప్పటికీ మధ్యాహ్నం సమయానికి సొమ్మసిల్లి పడిపోయినట్లు కుటుంబీకులు తెలిపారు. రెవెన్యూ అధికారులు వచ్చిన వివరాలు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే చీపురుపల్లి పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న పరిటాల పుష్పలత (43) అనే మహిళ ఎండకు తట్టుకోలేక సోమవారం మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. అంతవరకు బాగానే ఉన్న పుష్పలత మధ్యాహ్నం హఠాత్తుగా ఇంటిలోనే కుప్ప కూలిపోగా, విశాఖ కేజీహెచ్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఎండకు తట్టుకోలేక.. వేపాడ (ఎస్‌కోట) : వేపాడ మండలంలోని సోంపురం గ్రామానికి చెందిన దాసరి సత్యం (76) అనే వ్యక్తి ఆదివారం రాత్రి వడదెబ్బ బారిన పడి మరణించినట్లు త్రిసభ్య కమిటీ సభ్యులు సోమవారం వెల్లడించారు. ఈ మేరకు కమిటీ సభ్యులకు కుటుంబీకులు సమాచారం ఇవ్వడంతో వారు వెళ్లి నిర్ధారించారు. డీటీ కె ప్రసాదరావు, వైద్య, పోలీస్ శాఖాధికారులు గ్రామానికి వెళ్లి వివరాలు కనుక్కొని వివరాలు వెల్లడించారు. ఇద్దరు మహిళల మృతి చీపురుపల్లి రూరల్/చీపురుపల్లి : చీపురుపల్లి మండలంలో సోమవారం ఎండ దాటికి తాళలేక ఇద్దరు మహిళలు మృతి చెందారు. మండలంలోని అలజంగి పంచాయతీ పరధిలోని విశ్వనాథపురం గ్రామానికి చెందిన రేవల్ల సత్యవతి (36) వడదెబ్బతో మరణించారు. దివ్యాంగురాలైన సత్యవతి ఇంటి వద్దనే ఉన్నప్పటికీ మధ్యాహ్నం సమయానికి సొమ్మసిల్లి పడిపోయినట్లు కుటుంబీకులు తెలిపారు. రెవెన్యూ అధికారులు వచ్చిన వివరాలు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే చీపురుపల్లి పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న పరిటాల పుష్పలత (43) అనే మహిళ ఎండకు తట్టుకోలేక సోమవారం మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. అంతవరకు బాగానే ఉన్న పుష్పలత మధ్యాహ్నం హఠాత్తుగా ఇంటిలోనే కుప్ప కూలిపోగా, విశాఖ కేజీహెచ్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
‘వడ’లిపోతున్నారు..!
- 32 మంది మృత్యువాత - పాత వరంగల్ జిల్లాలో 17 మంది - పూర్వ కరీంనగర్లో 9 మంది సాక్షి నెట్వర్క్: తెలంగాణ జిల్లాల్లో వడదెబ్బ మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు వడదెబ్బకు 32 మంది మృత్యువాత పడ్డారు. పాత వరంగల్ జిల్లా పరిధిలో 17 మంది మృ తిచెందారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్లలో రావుల యాదమ్మ (52), పెద్దముప్పారంలో కొండ యాకయ్య (32), కురవి మండలం కాంపల్లి శివారు సక్రాంనాయక్ తండాలో బానోత్ శాలి(75), వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట ఎస్సీ రామ్‌నగర్ కాలనీలో దామెర దినకర్(7), ఖానా పురం మండలం కొత్తూరులో అంకేశ్వరపు రాములు(40), నల్లబెల్లి మండలం మామిండ్లవీరయ్యపల్లిలో గొనే కేశవరెడ్డి(60) వడదెబ్బతో మృతిచెందారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో సరిగొమ్ముల లక్ష్మయ్య (55), టేకుమట్ల మండలం రామక్రిష్ణపూర్(వి)లో గొడుగు రాములు (45), వెల్లంపలిలో తాడవేన రాజయ్య(60), తాడ్వాయి మండలంలోని కాటాపూర్‌లో మేడిశెట్టి సమ్మయ్య(50), మహదేవపూర్ మండలం సూరారంలో సానెం ఓదెమ్మ (70), వరంగల్ నగరంలో గాండ్ల అనసూర్య(70), వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రానికి చెందిన చేనేత కార్మికుడు చిలగాని చక్రపాణి(65), జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లుట్లలో తండ అండాలు (58) వడదెబ్బతో మృతిచెందారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం గూడూరులో పి ల్లల మొండయ్య(60), కొండం బుచ్చయ్య (80), మహబూబాబాద్ మండలంలోని కం బాలపల్లిలో ఎండీ.హుస్సేన్‌బీ(74) మృతి చెందింది. పాత కరీంనగర్ జిల్లాలో పది మంది మృతిచెందారు. రామడుగు మండలం వెదిరలో కట్ల సత్యనారాయణ (45), మానకొండూర్ మండల కేంద్రానికి చెందిన కిన్నెర బింద య్య (68), శంకరపట్నం మండలం మొలం గూర్లో కుక్కముడి కొంరయ్య, గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన సంజన (5), హుజూరాబాద్ మండలం కందుగులలో గడ్డం లింగయ్య(68) మృతిచెందారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గోపరపల్లెలో ఈరవేన పోశాలు (80), అదే జిల్లాలోని ఎలిగేడు మండలంలోని బుర్హాన్‌మియాపేటలో దుబ్బాసి సంజీవ్(30), రాజన్న జిల్లా సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సంకెపల్లిలో గవ్వలపల్లి బాలయ్య, జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన చిర్ర రాజయ్య (68) మృతిచెందిన వారిలో ఉన్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పంచగుడిలో మంజూలపురం పెద్దసాయారెడ్డి(52), కామారెడ్డి మండలం హాజీపూర్ తండా లో సబావత్ కిమిలీ(46) వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలం బూర్గుపలిలో బోయిన భుజంగం(53), యాలాల మండలం విశ్వనాథ్‌పూర్ లో మాజీ ఉప సర్పంచ్ బహదూర్ బాలప్ప (38) చనిపోయారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బనపల్లిలో బండ పద్మారావ్(60), మంచిర్యాలకు చెందిన చిలువేరు ప్రసాద్(35) మృతిచెందారు. వడదెబ్బతో వధువు తల్లి మృతి: నిలిచిన పెళ్లి కొత్తగూడెంక్రైం: వడదెబ్బతో వధువు తల్లి చనిపోవడంతో మరికొన్ని గంటల్లో జరగాల్సిన వివాహం ఆగిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంచుపల్లి మండలం రామాంజనేయకాలనీకి చెందిన షేక్ సైదానీబేగం(65), షేక్ రజ్జబ్ హుస్సేన్‌లకు ముగ్గురు కూతుళ్లు. చిన్నకూతురు జకియాబేగంకు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల కేంద్రానికి చెం దిన హైమత్ పాషాతో పెళ్లి కుదిరింది. సోమవారం ఉదయం 11 గంటలకు వీరి పెళ్లి జరగా ల్సి ఉంది. సైదానీబేగం 2, 3 రోజులుగా పెళ్లికార్డులు పంపణీ చేస్తోంది. ఈ క్రమంలో ఆది వారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతూ మరునాడు కన్నుమూసింది. భానుడి దెబ్బకు కాలిపోయిన లారీ చౌటుప్పల్(భువనగిరి): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం శివారులో జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం ఓ లారీకి అకస్మాత్తుగా మంటలు అంటుకుని దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి నల్లగొండ జిల్లా చండూరు మండలం ఇడకుడ గ్రామానికి లారీ పశువుల పేడతో వెళ్తోంది. ఎండ తీవ్రతతో పాటు పచ్చి పేడ కావడం వల్ల ఇంజన్ లారీ విపరీతంగా వేడెక్కింది. గమనించిన డ్రైవర్ చెన్నగోని సైదులు దండు మల్కాపురం వద్ద లారీని ఆపాడు. దిగి చూస్తుండగా ఇంజిన్‌లో నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చి క్యాబిన్ అంతటికీ మంటలు వ్యాపించాయి. ఫైరింజన్ వచ్చి చల్లార్చగా, అప్పటికే లారీ ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. -
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కూతురు పెళ్లి పత్రికలు ఇవ్వడానికి వెళ్లిన మహిళ వడదెబ్బకు గురై మృతిచెందింది. ఈ సంఘటన సోమవారం వెలుగు చూసింది. కొత్తగూడెంలోని గాంధీనగర్ కాలనీలో నివాసముంటున్న షేక్ రజ్జబ్ హుస్సేన్- సైదానిబేగంల మూడో పుత్రిక జకియాబేగం వివాహం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలానికి చెందిన అహ్మద్ పాషాతో నిశ్ఛయమైంది. ఈ రోజు పెళ్లి జరగనుండగా.. నిన్న(ఆదివారం) పెళ్లి కూతురు తల్లి సైదానిబేగం బంధుమిత్రులకు శుభలేఖలు ఇవ్వడానికి వెళ్లి వడదెబ్బకు గురైంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా ఈ రోజు మృతి చెందింది. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది. మరి కాసేపట్లో పెళ్లి జరగనుండగా పెళ్లి కూతురి తల్లి మరణించడంతో పెళ్లికొచ్చిన బంధువులంతా కన్నీరుమున్నీరవుతున్నారు. -
వడదెబ్బతో తొమ్మిది మంది మృతి
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వడ దెబ్బ కారణంగా ఆదివారం తొమ్మిది మంది మృతిచెందారు. తెలంగాణలో.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నాచారం గ్రామంలో వడదెబ్బకు గురై ఓ వృద్ద అనాధ మహిళ కలవేని లచ్చమ్న(65) మృతిచెందింది. ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో వడదెబ్బతో వృద్దురాలు పలుగుల నర్సయ్య గారి సత్తెమ్మ (65) మృతిచెందింది. కరీంనగర్జిల్లా కొత్తపల్లికి చెందిన భూస రాములు వడదెబ్బతో మృతిచెందాడు. జేఎస్‌భూపాలపల్లి జిల్లా చెల్పూరు గ్రామానికి చెందిన మొగిలి కూడా వడదెబ్బతో మృతిచెందాడు. నల్గొండజిల్లా చౌటుప్పల్‌లో వడదెబ్బకు గురై చేనేత కార్మికుడు సంగిశెట్టి స్వామి(65) మృతిచెందాడు. కట్టంగూర్‌లో రెడ్డిపల్లి బుచ్చయ్య(80) ఇంటి వద్దనే ఉంటూ తీవ్ర ఎండలతో అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆంద్రప్రదేశ్‌లో.. నెల్లూరుజిల్లా కావలిరూరల్ మండలంలోని కొత్తపల్లికి చెందిన ఆదెమ్మ(75) వడదెబ్బతో మృతిచెంది. ప్రకాశంజిల్లా దర్శి పట్టణంలోని పొదిలి రోడ్డులో వడదెబ్బ తగిలి మేడగం వెంకటరమణారెడ్డి(40) అనే వ్యక్తి మతిచెందాడు. హనుమంతునిపాడు మండలంలోని కూటాగుండ్ల పంచాయతీ పరిధి పాతమల్లవరం గ్రామంలో నాళి కొండయ్య(76) మృతిచెందాడు. -
వడదెబ్బకు నలుగురు బలి
ధర్మవరం: వడదెబ్బకు శనివారం మరో నలుగురు మరణించారు. ధర్మవరం మండలం తుమ్మలలో లక్ష్మమ్మ(76) వడదెబ్బకు గురై మతి చెందినట్లు బంధువులు తెలిపారు. పొలం వద్దకు వెళ్లిన ఆమె ఇంటికి తిరిగొచ్చిన కాసేపటికే ఒంట్లో నలతగా ఉందంటూ నిద్రపోయినట్లు వివరించారు. ఆ తరువాత నిద్ర లేపినా ప్రయోజనం లేదని, నిద్రలోనే ఆమె ప్రాణం విడిచినట్లు కన్నీరుమున్నీరయ్యారు. మతురాలికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మేడాపురంలో మరొకరు.. చెన్నేకొత్తపల్లి(రాప్తాడు) : చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురంలో గంగప్ప(65) అనే కూలీ వడదెబ్బతో మతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గురువారం కూలి పనికి వెళ్లిన ఆయన అస్వస్థతకు గురయ్యాడన్నారు. కుటుంబ సభ్యులు వైద్యం కోసం అనంతపురం తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మతి చెందినట్లు వివరించారు. మతునికి ఇద్దరు కుమార్తెలు, కుమారులు ఉన్నారు. యలగలవంక తండాలో ఇంకొకరు.. బెళుగుప్ప(ఉరవకొండ) : బెళుగుప్ప మండలం యలగలవంక తండాలో రామచంద్రానాయక్(56) వడదెబ్బతో మరణించినట్లు బంధువులు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలసి ఉపాధి పనులకు వెళ్లిన అతను శుక్రవారం నీరసంతో ఇంటికి వచ్చాడన్నారు. ఆ తరువాత వాంతులు చేసుకుంటూ మరింత నీరసించి పోయాడని వివరించారు. శనివారం ఉదయం స్పహ కోల్పోవడంతో వెంటనే 108కు సమాచారం తెలిపారు. అదొచ్చేలోగానే అతను మతి చెందినట్లు తెలిపారు. మతునికి భార్య దేవీబాయి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పిల్లలపల్లిలో బేల్దారి.. బ్రహ్మసముద్రం(కళ్యాణదుర్గం) : బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లిలో రామకష్ణ(38) అనే బేల్దారి వడదెబ్బతో మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఇంటి నిర్మాణ పనుల కోసం స్వగ్రామం నుంచి రాయలప్పదొడ్డి గ్రామానికి వెళ్లిన అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో పని చేయడంతో ఒక్కసారిగా కళ్లు తిరిగి కుప్పకూలి అక్కడికక్కడే మతి చెందినట్లు వివరించారు. విషయం తెలుసుకున్న వైద్యాధికారిణి డాక్టర్ నాగస్వరూప, తహసీల్దార్ సుబ్రమణ్యం, ఏఎస్ఐ వెంకటేశులు, ఆర్ఐ విజయకుమార్, వీఆర్ఓ తిప్పేస్వామి ఘటన స్థలానికి చేరుకున్నారు. మతదేహాన్ని సందర్శించారు. వివరాలడిగి తెలుసుకున్నారు. మతునికి భార్య వరలక్ష్మీ, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. -
వడదెబ్బతో ఒకరు మృతి
పాములపాడు: వడదెబ్బతతో పాములపాడుకు చెందిన బాలనాగశేషులు(24) బుధవారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం ఉదయం ఇతను ఉపాధి పనులకు వెళ్లాడు. ఎండ వేడిమి తట్టుకోలేక మధ్యలోనే ఇంటికి వచ్చాడు. సాయంత్రం పెట్రోల్ బంకులో విధుల నిమిత్తం వెళ్లి అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం ఆత్మకూరుకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. మృతుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ సుధాకరరెడ్డి కేసు నమోదు చేశారు. లావణ్య నిండు గర్భిణి కాగా.. మృతుని తల్లి లింగమ్మ చిన్న వయస్సులోనే భర్తను కోల్పోయింది. -
వడదెబ్బతో ఐదుగురు మృతి
సాక్షి, నెట్వర్క్: భానుడి ప్రతాపానికి ఆదివారం రాష్ట్రంలోని వేర్వేరుచోట్ల ఐదుగురు బలయ్యారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణానికి చెందిన ఎస్కే రహమాన్(65), కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన రాచకొండ లింగయ్య(70) ఎండవేడిమికి అస్వస్థతకు గురై మృత్యువాతపడ్డారు. అలాగే, మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తంగళ్లపెల్లికి చెందిన రాంటేంకి పోశవ్వ(46) వడదెబ్బతో మృతిచెందింది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన చంద్రయ్య(65) కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలకేంద్రానికి చెందిన మారపెల్లి స్వామి(50) కూడా ఎండ వేడిమి తట్టుకోలేక మృతి చెందారు. ఎండవేడికి 11 నెమళ్లు మృతి ఆత్మకూర్: ఎండలు తీవ్రరూపం దాల్చడం తో పక్షులు విలవిలలాడిపోతున్నాయి. ఒకేసారి 11 నెమళ్లు మృత్యువాతపడ్డ సంఘటన ఆదివారం వనపర్తి జిల్లా ఆత్మకూర్‌లో వెలుగుచూసింది. స్థానిక పరమేశ్వరస్వామి చెరువుకు సమీపంలో 11నెమళ్లు అపస్మారక స్థితిలో పడి ఉండగా గమనించిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సీహెచ్ రాజు బృందం సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించగా 9నెమళ్లు చనిపోయి ఉండగా రెండు నెమళ్లు ప్రాణాలతో ఉండటాన్ని గమనించి స్థానిక పశువుల ఆస్పత్రికి తరలించారు. పశువైద్య అధికారి వాటిని పరీక్షించగా అప్పటికే అన్ని నెమళ్లు చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని సంబంధిత ఫారెస్ట్ అధికారులకు అందించామని, పంచనామా నిర్వహించిన అనంతరం వాటిని ఖననం చేయిస్తామని ఎస్సై తెలిపారు. -
వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి
మద్దికెర: మండలపరిధిలోని బసినేపల్లికి చెందిన ఉపాధి కూలీ మల్లికార్జున(50) వడదెబ్బకు గురై ఆదివారం మరణించాడు. శనివారం ఉపాధి పనులకు వెళ్లి వచ్చిన వెంటనే ఆస్వస్థతకు గురికావడంతో చికిత్సకోసం వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. -
వడ దెబ్బతో వ్యక్తి మృతి
కల్లూరు: పాత కల్లూరు జమ్మిచెట్టు వీధికి చెందిన పర్ల మద్దయ్య (35) వడ దెబ్బకు గురై మృతి చెందాడు. మృతుని భార్య పర్ల ఈశ్వరమ్మ సమాచారం మేరకు.. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో కరెంటు బిల్లు చెల్లించేందుకు చెన్నమ్మ సర్కిల్లోని విద్యుత్ బిల్ కౌంటర్ వద్ద ఎండలో నిలబడి సొమ్మసిల్లి కిందపడిపోయాడు. అతని సోదరుడు చిన్న మద్దయ్య ఇతరుల సహాయంతో అతడిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు సంతానం ఉన్నారు. -
ఉపాధి మంటలు!
హడలిపోతున్న కూలీలు – జిల్లాలో తొమ్మిది వడదెబ్బ మరణాలు - ఇందులో ఐదుగురు ఉపాధి కూలీలే.. – జాడలేని షేడ్‌నెట్స్ ఏర్పాటు – కాగితాల్లోనే మజ్జిగ పంపిణీ కర్నూలు(అర్బన్): జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలతో ఉపాధి కూలీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు ఇప్పటి వరకు జిల్లాలో తొమ్మిది మంది వడదెబ్బతో మరణించగా.. ఇందులో ఐదుగురు ఉపాధి కూలీలే ఉన్నట్లు సమాచారం. అయితే త్రీమెన్ కమిటీ మాత్రం ఏడుగురు మాత్రమే వడదెబ్బతో మరణించినట్లు నివేదించారు. ప్రస్తుత వేసవిలో వ్యవసాయ పనుల్లేక గ్రామీణ ప్రాంతాల్లో అధిక శాతం వ్యవసాయ కూలీలు ఉపాధి పనులకు వెళ్తున్నారు. మండుతున్న ఎండల్లో ప్రభుత్వం కనీస ఉపశమన చర్యలు చేపట్టకపోవడంతో కూలీల పాలిట శాపంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో కూలీల సంఖ్య కూడా రోజురోజుకూ తగ్గిపోతోంది. ఏప్రిల్ నెలలో 1.65 లక్షల మంది కూలీలు ఉపాధి పనులు చేపట్టాల్సి ఉండగా.. ప్రస్తుతం 1.45 లక్షల మంది మాత్రమే పనులకు వస్తున్నట్లు అధికారిక లెక్కలను బట్టి తెలుస్తోంది. కాగా ప్రతి రోజు జిల్లాలో 2లక్షల మంది ఉపాధి కూలీలకు పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆదేశాలు జారీ చేసినప్పటికీ వివిధ కారణాలతో కూలీల సంఖ్య మందగిస్తోంది. జాడలేని షేడ్‌నెట్స్ ఉపాధి కూలీలకు కాస్తంత ఉపశమనం కలిగించేందుకు వర్క్సైట్లలో షేడ్‌నెట్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే కారణాలేవైనా ఇంకా జిల్లాలో వీటి ఊసే కరువైంది. మొత్తం 50,136 షేడ్‌నెట్స్ ఏర్పాటు చేయాలనేది లక్ష్యం కాగా, ఇప్పటి వరకు ఒక్కచోట కూడా ఏర్పాటు చేయలేకపోయారు. అయితే గత ఏడాదికి సంబంధించిన షేడ్‌నెట్స్‌ను ప్రస్తుతం 20,441 వర్క్సైట్లలో ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా మెజారిటీ ప్రాంతాల్లో కూలీలు పనిచేస్తున్న వర్క్సైట్లలో వీటిని ఏర్పాటు చేయకపోవడంతో మండే ఎండల్లో చుక్కలు చూస్తున్నారు. స్థానికంగా మేటీలే షేడ్స్ ఏర్పాటు చేసుకోవాలనే అధికారుల సూచన ఎక్కడా అమలుకు నోచుకోవట్లేదు. ఈ ఏడాది కొత్తగా షేడ్‌నెట్స్ ఏర్పాటు చేసేందుకు గత నెల 26న టెండర్లు ఓపెన్ చేసినా, ఇంకా రేట్ల నెగోషియేషన్ కారణంగా ఫైల్ జాయింట్ కలెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఉపాధి కూలీలకు అందని మజ్జిగ ఎండల్లో పనులు చేస్తున్న ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ చేసే బాధ్యతను ఈ నెల 1వ తేదీ నుంచి సంబంధిత మేటీలకే అప్పగించారు. మజ్జిగకు రూ.4, మేటీకి రూ.1 ప్రకారం ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే జిల్లాలోని మెజారిటీ ప్రాంతాల్లో మజ్జిగ పంపిణీ ఇప్పటికీ ప్రారంభం కాలేదు. కేవలం ఆయా వర్క్సైట్లలో మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు బ్యానర్లు ఏర్పాటు చేశారే కానీ, కూలీలకు మాత్రం మజ్జిగ సరఫరా చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే అన్ని మండల పరిషత్ కార్యాలయాలకు 3.18 లక్షల ఓఆర్ఎస్ ప్యాకెట్లు సరఫరా చేశామని చెబుతున్నా, ఇంకా అనేక గ్రామాలకు ఇవి అందకపోవడం గమనార్హం. షేడ్‌నెట్స్ ఏర్పాటుకు చర్యలు జిల్లాలోని అన్ని వర్క్సైట్లలో షేడ్‌నెట్స్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నాం. గత నెల 26న టెండర్లు ఓపెన్ చేసి జేసీకి పంపాం. జేసీ రాగానే ఫైల్ క్లియర్ అవుతుంది. మజ్జిగను కూడా కచ్చితంగా 1వ తేదీ నుంచి పనులకు వచ్చే కూలీలందరికీ అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి మండలానికి 5వేల ప్రకారం ఓఆర్ఎస్ ప్యాకెట్లను సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ గత నెల 29న ఆర్డీఓలకు ఆదేశాలు జారీ చేశారు. సరఫరా చేసిన ప్యాకెట్లు అయిపోగానే తిరిగి ఇండెంట్ పెట్టి తీసుకుంటాం. - డాక్టర్ సీహెచ్ పుల్లారెడ్డి, డ్వామా పీడీ -
వడదెబ్బతో ఇద్దరు మృతి
అప్పలాపురం(బనగానపల్లె రూరల్): నందివర్గం స్టేషన్ పరిధిలోని అప్పలాపురం గ్రామానికి చెందిన ఉపాధి కూలీ అవుకు దానియల్(27) వడదెబ్బతో శుక్రవారం మృతి చెందాడు. దానియల్ ఉదయం ఉపాధి పనికి వెళ్లాడు. ఎండ దెబ్బకు పనిప్రదేశంలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా కోలుకోలేక మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
జల్లులు కురిసినా ఎండలు తీవ్రమే
రామగుండంలో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములతో కూడిన చిరు జల్లులు కురుస్తూ వాతావరణం కాస్త చల్లబడ్డా మిగిలిన ప్రాంతాల్లో ఎండలు మండుతున్నాయి. గురువారం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగైదు డిగ్రీల మేర ఎక్కువగా నమోదవుతున్నాయి. రామగుండంలో గరిష్టంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్‌లలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా రికార్డయ్యాయి. హైదరాబాద్‌లో 41 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైంది. శుక్ర, శని వారాల్లో వరంగల్, కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూలు, ఖమ్మం, వనపర్తి, జోగులాంబ గద్వాల తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని, అయినా పగటి ఉష్ణోగ్రతలు తీవ్రంగానే ఉంటాయని వాతవారణ శాఖ అధికారులు చెప్పారు. వడగాడ్పుల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుందన్నారు. వడదెబ్బతో 8 మంది మృతి వడదెబ్బతో గురువారం వేర్వేరుచోట్ల 8 మంది మృతి చెందారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముగ్గురు మృతి చెందగా, మృతుల్లో జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలంలోని లక్ష్మీదేవిపల్లికి చెందిన తోట కాపలాదారు కస్తూరి మల్లయ్య (55), గన్నేరువరం మండలకేంద్రానికి బోయిని రాజమల్లు(60), పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామానికి చెందిన రైతు బోయిని ఓదెలు (45) ఉన్నారు. అలాగే, సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం రుద్రారం గ్రామానికి చెందిన గుండాడి యాదగిరి (35) వడదెబ్బతో బుధవారం మృతి చెందాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వడదెబ్బతో గురువారం నలుగురు మృతి చెందారు. మృతుల్లో పెనుబల్లి మండలం లంకపల్లికి చెందిన కొత్తపల్లి సాయిలు (65), వేంసూరు మండలం వెంకటపురం గ్రామస్తురాలు గండ్ర విజయలక్ష్మి (65), అశ్వారావుపేట మండలం బచ్చువారిగూడేనికి చెందిన రామినేని శాంతమ్మ(90), బోనకల్ మండలం ముష్టికుంట్లకు చెందిన షేక్ సలీం(55) ఉన్నారు. -
ఆగని మరణాలు
= వడదెబ్బకు మరో ముగ్గురి మృత్యువాత = అంతకంతకూ పెరుగుతున్న మృతుల సంఖ్య = పెద్ద దిక్కును కోల్పోయి వీధిన పడుతున్న కుటుంబాలు సూర్యుడు భగబట్టినట్లున్నాడు. వడదెబ్బ రూపంలో దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు. రోజుకు కనీసం ముగ్గురు, నలుగుర్ని చొప్పున బలవుతున్నారు. తాజాగా బుధవారం మరో ముగ్గురు చనిపోయారు. అంతకంతకూ పెరుగుతున్న మృతుల సంఖ్యతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అప్పటి వరకు ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వారు వడదెబ్బతో అకాల మృత్యువాతపడుతుండడంతో ఆయా కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి, బజారున పడుతున్నాయి. నల్లమాడ(పుట్టపర్తి): నల్లమాడ మండలం రెడ్డిపల్లిలో బి.ఓబులేసు(58) వడదెబ్బ బారిన పడి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మంగళవారం ఉదయం పని నిమిత్తం బయటకు వెళ్లి మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ఇంటికి చేరుకున్న ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడన్నారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, కర్నూలుకు తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. కర్నూలుకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడన్నారు. మృతునికి భార్య రామకృష్ణమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి దుద్దుకుంట సుధాకర్‌రెడ్డి, మండల కన్వీనర్ పొరకల రామాంజనేయులు, స్థానిక సర్పంచ్ సూర్యనారాయణ, గ్రామ కమిటీ అ«ధ్యక్షుడు టీడీ కేశవరెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా నాయకుడు నాగప్ప, పట్టణాధ్యక్షుడు షంషీర్ తదితరులు ఓబులేసు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మారెంపల్లి తండాలో మరొకరు గుమ్మఘట్ట(రాయదుర్గం): గుమ్మఘట్ట మండలం మారెంపల్లి తండాలో లల్యానాయక్(61) వడదెబ్బతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఖరీఫ్ దగ్గరపడుతుండడంతో పొలంలోని కంపచెట్లను తొలగించేందుకు వెళ్లగా ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయ్యాడన్నారు. ఆస్పత్రికి తరలించేలోగానే మృతి చెందాడని వివరించారు. విషయం తెలియగానే వైద్యాధికారి రమేశ్ తమ సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. వై.టి.చెరువులో ఇంకొకరు గుంతకల్లు రూరల్: మండలంలోని వై.టి.చెరువులో లక్ష్మీదేవి(58) వడదెబ్బకు గురై మంగళవారం రాత్రి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వంట చెరుకు కోసం అడవికి వెళ్లిన ఆమె వడదెబ్బకు గురైనట్లు వివరించారు. ఒక్కసారిగా వాంతులతో పాటు నీరసపడిపోవడంతో గుంతకల్లులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు. -
సన్‌స్ట్రోక్ 45.8 డిగ్రీలు
– భానుడి భగభగ – వడదెబ్బకు పిట్టల్లా రాలుతున్న జనం – ఇప్పటివరకు 40 మంది దాకా మృతి అనంతపురం అగ్రికల్చర్ : భానుడు భగ్గుమంటున్నాడు. ‘అనంత’ను నిప్పుల కుంపటిలా మార్చేస్తున్నాడు. వడదెబ్బకు జనం పిట్టల్లా రాలుతున్నారు. ఉక్కపోత, వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పశుపక్ష్యాదులు, జంతుజాలం కూడా విలవిలలాడుతున్నాయి. ఉదయం పది గంటలకే సూర్యుడు పంజా విసురుతున్నాడు. బయట అడుగుపెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. దీంతో చాలామంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. అత్యవసర పనుల నిమిత్తం బయటకొచ్చిన వారు నీళ్లు, నీడ కోసం పరుగులు తీస్తున్నారు. హిందూపురం, మడకశిర నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలు మినహా జిల్లా అంతటా 40 డిగ్రీలకు తక్కువగా కాకుండా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శింగనమల, గుంతకల్లు, పుట్టపర్తి, కదిరి, ధర్మవరం, కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లో 42 నుంచి 45 డిగ్రీల వరకు కొనసాగుతుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. బుధవారం శింగనమల మండలం తరిమెల గ్రామంలో ఏకంగా 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే తాడిపత్రి 44.6 డిగ్రీలు, తాడిమర్రి 44.4, కూడేరు 44.4, శింగనమల 44.3, పుట్లూరు 44.2, యల్లనూరు 43.9, పామిడి 43.7 డిగ్రీలు... ఇలా చాలా మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం అల్లాడిపోయారు. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా 26 నుంచి 29 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. గాలిలో తేమశాతం ఉదయం 40 నుంచి 60 వరకు ఉంటున్నా.. మధ్యాహ్నానికి దారుణంగా పడిపోతోంది. ఆ సమయంలో 10 నుంచి 15 శాతం మాత్రమే నమోదవుతోంది. 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వడగాల్పులు వీస్తున్నాయి. నీటికి కటకట గత ఏడాది ఆగస్టు నుంచి జిల్లాలో ఒక్క భారీ వర్షం కూడా పడలేదు. దీంతో చెక్‌డ్యాంలు, కుంటలు, చెరువులు ఒట్టిపోయాయి. పట్టణీకరణ, నగరీకరణ పేరుతో పెద్ద వృక్షాలను అడ్డంగా నరికేయడంతో ఎండతీవ్రత పెరిగిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీనికితోడు భూగర్భజలాలు అడుగంటిపోవడంతో పచ్చదనం కనుమరుగైంది. తాగునీటికీ ఇబ్బందులు పడుతున్నారు. పండ్లతోటలు, పట్టు, పాడి, పశుసంపద పరిస్థితి దయనీయంగా తయారైంది. మండే ఎండలకు పిల్లలు, వృద్ధులతో పాటు రైతులు, కూలీలు, వ్యాపారులు, ఇతరత్రా అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 15 నుంచే జిల్లా వ్యాప్తంగా 25 మంది వరకు వడదెబ్బతో మృతిచెందారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అంతకు ముందు కూడా కొందరు చనిపోయారు. ఇప్పటివరకు 40 మంది వరకు వడదెబ్బతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నివారణ చర్యలూ చేపట్టకపోవడంతో వడదెబ్బ మరణాలు కొనసాగుతున్నాయి. మే నెలలో కూడా రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతుండటంతో ప్రజల ఆందోళన రెట్టింపవుతోంది. వడదెబ్బ లక్షణాలు.. జాగ్రత్తలు వేసవిలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిదని సూచిస్తున్నారు. నీళ్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు, నిమ్మరసం, కళింగర, కర్భూజా లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. అధిక ఉష్ణోగ్రతలకు మెదడులోని ఉష్ణోగ్రతను నియంత్రించే కేంద్రం (హైపోథలామస్) దెబ్బతిని ప్రాణాంతకమైన వడదెబ్బకు గురవుతారు. శరీరంలో ఎక్కువ వేడి ఉత్పత్తి కావడం, లేదంటే శరీరం ఉష్ణాన్ని కోల్పోవడం వల్ల వడదెబ్బ తగులుతుంది. శరీరం ఎక్కువ వేడికి గురికావడం వల్ల చెమట పట్టి శరీరంలోని లవణాలు (సోడియం క్లోరైడ్) తగ్గిపోవడం, లేదంటే శరీరంలో నీటి నిష్పత్తి తగ్గిపోవడం, అధిక ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతాల్లో ఎక్కువ సమయం పనిచేయడం వల్ల వడదెబ్బ బారిన పడతారు. 65 ఏళ్లు పైబడిన వారు, గర్భిణులు, పాలిచ్చేతల్లులు, పసిపిల్లలు, గుండెజబ్బులు, బీపీ, షుగర్ లాంటి వాటితో బాధ పడుతున్న వారు, అనారోగ్యంతో ఉన్న వారు త్వరగా వడదెబ్బకు గురవుతారు. విపరీతమైన తలనొప్పి, తలతిరగడం, తీవ్ర జ్వరం, మగత నిద్ర లేదా కలవరింతలు, ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. వడదెబ్బ నివారణకు సూచనలు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయట ప్రాంతాల్లో శారీరక శ్రమతో కూడిన పనులు చేయకపోవడమే మేలు. మంచినీరు, మజ్జిగ, కొబ్బరినీళ్లు, నిమ్మరసం లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. వడదెబ్బ సోకినట్లు గమనించిన వెంటనే త్వరగా నీడ ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి ఐస్నీటిలో ముంచిన తడిగుడ్డతో ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చేదాకా శరీరం తుడవాలి. ఫ్యాన్ లేదా చల్లటి గాలి కల్పించాలి. ఉప్పు కలిపిన మజ్జిగ లేదా చిటికెడు ఉప్పు కలిగిన గ్లూకోజు ద్రావణం లేదా ఓరల్ రీ హైడ్రేషన్ ద్రావణం (ఓఆర్ఎస్) తాగించాలి. అపస్మారక స్థితిలో ఉన్న వారికి నీరు తాపించకూడదు. వీలయినంత త్వరగా వైద్యున్ని సంప్రదించి చికిత్స చేయించాలి. ఉష్ణోగ్రతల వివరాలు: శింగనమల 45.8 డిగ్రీలు తాడిపత్రి 44.6 తాడిమర్రి 44.4 కూడేరు 44.4 పుట్లూరు 44.2 పామిడి 44.2 యల్లనూరు 43.9 గుత్తి 43.5 గుంతకల్లు 42.9 పుట్టపర్తి 42.2 ధర్మవరం 42.2 ఉరవకొండ 42.1 అనంతపురం 42.0 కదిరి 41.7 కళ్యాణదుర్గం 41.4 పెనుకొండ 40.5 -
ప్రాణాలు తీస్తున్న వడదెబ్బ
సూర్యభగవానుడు అగ్నిగోళమై మండుతున్నాడు. వడగాల్పులతో జనం బిక్కచచ్చిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న వడదెబ్బ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మంగళవారం మరో ముగ్గురు బలికావడంతో ఆయా ప్రాంతాల్లో విషాదం నెలకొంది. పెద్దదిక్కును కోల్పోయి ఆయా కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. గుంతకల్లు రూరల్: గుంతకల్లు మండలంలోని వై.టి.చెరువు గ్రామంలో చిన్నాయప్ప అలియాస్ ఆంజనేయులు(52) అనే వ్యవసాయ కూలీ వడదెబ్బతో మృతి చెందారు. సోమవారం కూలీ పనులకు వెళ్లొచ్చిన ఆయన రాత్రి ఇంటికి చేరుకున్నారని బంధువులు తెలిపారు. నీరసం, తలనొప్పిగా ఉందంటూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు చెప్పారు. ఆ వెంటనే ప్రాణం వదిలినట్లు పేర్కొన్నారు. మృతునికి భార్య సోమక్క, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకట్రావిురెడ్డి(వైవీఆర్) మంగళవారం ఉదయాన్నే గ్రామానికి చేరుకున్నారు. మృతదేహాన్ని సందర్శించి నివాళులరి్పంచారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట పార్టీ నాయకులు దశరథరెడ్డి, శంకర్, జయరావిురెడ్డి, మద్దన్న, జయన్న, సిపాయి బాషా, గోపాల్, నరసింహులు, పక్కీరప్ప ఉన్నారు. డి.చెర్లోపల్లిలో మరొకరు... బత్తలపల్లి (ధర్మవరం): బత్తలపల్లి మండలం డి.చెర్లోపల్లిలో గుజ్జల కృష్ణమూర్తి(55) వడదెబ్బతో మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం కూలీ పనులకు వెళ్లిన అతను సాయంత్రం ఇంటికి రాగానే తీవ్ర తల, ఒళ్లు నొప్పులతో అస్వస్థతకు గురైనట్లు వివరించారు. తెల్లవారుజామున మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. నాయనపల్లిలో ఇంకొకరు... నార్పల(శింగనమల): నార్పల మండలం నాయనపల్లిలో వల్లెపు ఆదినారాయణ(69) అనే గొర్రెల కాపరి వడదెబ్బకు గురై మంగళవారం సాయంత్రం మరణించినట్లు బంధువులు తెలిపారు. ఉదయం పొట్టేళ్లను మేత కోసం తోలుకెళి్లన ఆయన, మధ్యాహ్నం 3 గంటలకు అస్వస్థతకు గురై కుప్పకూలిపోయినట్లు వివరించారు. తోటి కాపర్లు చికిత్స కోసం నాయనపల్లి క్రాస్‌లోని ఆస్పత్రి వద్దకు తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు అక్కడి వైద్యుడు నిర్ధారించారన్నారు. మృతుని భార్య, కుమారుడు అనాథలయ్యారు. -
వడదెబ్బతో ముగ్గురి మృతి
మహానంది/బనగానపల్లె: భానుడి ఉగ్రరూపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. వడదెబ్బతో జిల్లాలో మంగళవారం ఒక్కరోజే ఐదుగురు మృతి చెందారు. వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన అస్వస్థతకు గురై ఇంటికొచ్చిన కుటుంబ సభ్యులు కాసేపటికే మృత్యవాత పడటంతో ఆ కుటుంబాలు బోరున విలపించాయి. పేరు మండలం గ్రామం మృతికి కారణం వెంకటేశ్వర్లు(45) మహానంది అల్లీనగరం పొలం పనులకు వెళ్లి.. వి.చిన్నమ్మ(74) మహానంది తిమ్మాపురం రెండ్రోజులుగా అస్వస్థతకు గురై.. సయ్యద్‌హుస్సేన్(47) బనగానపల్లె బనగానపల్లె ఇంట్లోనుంచి బయటకు వెళ్లి వచ్చి.. రహీమ్(39) కర్నూలు జొహరాపురం పొలం పనులకు వెళ్లి.. మాల కిష్టానమ్మ (78) దేవనకొండ కరివేముల పొలం పనికి వెళ్లి -
తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
-
వడదెబ్బకు ముగ్గురి మృతి
వెల్దుర్తి రూరల్ / తుగ్గలి / రుద్రవరం : జిల్లావ్యాప్తంగా వడదెబ్బతో ముగ్గురు మృతి చెందారు. ఇందులో ఒకరు ఉపాధి కూలీ ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి.. వెల్దుర్తి మండలం రామళ్లకోటకు చెందిన మీసాల ఎల్లమ్మ(55)భర్త కొన్నేళ్ల క్రితం మృతిచెందగా పుట్టింట్లోనే ఉంటోంది. రెండు రోజులుగా పొలంలో కంది కొయ్యలు కోసి కాల్చివేస్తోంది. ఇందులో భాగంగా శనివారం పొలంలో పని చేస్తుండగా ఎండ ధాటికి అస్వస్థతకు గురైంది. తర్వాత ఇంటికి వెళ్లి పడుకుంది. ఈక్రమంలో నిద్రలోనే తుదిశ్వాస విడిచింది. ఇక తుగ్గలికి చెందిన చాకలి లక్ష్మన్న(37) శనివారం ఉపాధి హామీ పనికి వెళ్లాడు. పని అనంతరం ఇంటికి రాగానే ఒక్కసారి సొమ్మసిల్లిపడిపోయాడు. స్థానికంగా చేయించుకున్నాడు. అయితే కోలుకోలేక ఆదివారం ఉదయం మృతి చెందాడు. అతడికి భార్య, కూతురు ఉన్నారు. అలాగే రుద్రవరం మండలం టి లింగందిన్నెకు చెందిన బీగాల రాముడు(65) వరి కోతల పనికి వెళ్లాడు. ఎండ కారణంగా అస్వస్థతకు గురికావడంతో ఇంటికి మంచంపై పడుకున్నాడు. కుటుంబ సభ్యులు మధ్యాహ్నం భోజనం చేసేందుకు పిలిచినా లేవకపోడంతో వెళ్లి చూశారు. ఆయన అప్పటికే మృతి చెందడంతో బోరున విలపించారు. ఆయనకు ఐదుగురు కుమార్తెలు, నలుగురు కుమారులు ఉన్నారు. -
వడదెబ్బతో శతాధిక వృద్ధురాలి మృతి
చాగలమర్రి: స్థానిక లాల్‌స్వామి మకానం కాలనీకి చెందిన శతాధిక వృద్ధురాలు ముల్లా జైతూన్‌బీ శనివారం వడదెబ్బతో మృతి చెందారు. వృద్ధురాలు రెండు రోజుల క్రితం వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురై శనివారం తెల్లవారు జామున కోలుకోలేక మృతి చెందారు. ఈమెకు 108 సంవత్సరాలు ఉంటాయని కుమారుడు ముల్లా గౌస్‌మోహిద్దీన్ తెలిపారు. మూడేళ్ల క్రితం ఆమెకు దంతాలు ఊడిపోయి పోయి కొత్త దంతాలు వచ్చాయన్నారు. జైతూన్‌బీకు ముగ్గురు కుమారులు ఉండగా ఇద్దరు మృతి చెందారు. ఆమె మృతి పట్ల వైఎస్ఆర్సీపీ నాయకులు బాబులాల్, మాజీ సర్పంచ్ అన్సర్‌బాషా, మండల కో ఆప్షన్ సభ్యుడు ముల్లా మాబుబాషా, పారిశ్రామిక వేత్త ఎన్ఎండీ హారీస్, న్యాయవాది పీఎస్ మహబూబ్‌బాషా సంతాపం వ్యక్తం చేశారు. -
వడదెబ్బతో నలుగురు మృతి
సాక్షి నెట్వర్క్: వడదెబ్బతో శుక్రవారం జిల్లాలో నలుగురు మృతి చెందారు. పత్తికొండ మండలం ఆర్.మందగిరి గ్రామానికి చెందిన రైతు కటికే నాగేంద్రరావు(43), చాగలమర్రి వినాయక నగర్ కాలనీకి చెందిన కృష్ణయ్య (58), అవుకు గ్రామానికి చెందిన నడిపి సుబ్బయ్య (57), కర్నూలు నగరంలోని ముజఫర్ నగర్‌కు చెందిన ఆటో కిష్టప్ప..మృత్యువాత పడ్డారు. వివిధ పనుల నిమిత్తం వీరు ఎండలో తిరిగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తీసుకుపోతుండగా ఇద్దరు..చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. -
వడదెబ్బకు ఇద్దరు మృతి
అద్దంకి: ప్రకాశం జిల్లాలో వడదెబ్బకు ఇద్దరు మృతి చెందారు. జిల్లలోని సంతమాగుళూరు మండలం వెల్లాలచెరువు గ్రామంలో గురువారం మధ్యాహ్నం వడదెబ్బకు ఇద్దరు వృద్ధులు మరణించారు. ఆటోలో వెళుతున్న చెన్నయ్య(75), సుబ్బులు(65) అనే వృద్ధులు ఎండవేడిమికి తట్టుకోలేక ఆటోలోనే ప్రాణాలు విడిచారు. -
వడదెబ్బకు 37 మంది మృతి
-
వడదెబ్బకు 37 మంది మృతి
- కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 9 మంది - విపత్తు నిర్వహణ శాఖకు కలెక్టర్ల నివేదిక - నేడు తెలంగాణ వ్యాప్తంగా వడగాడ్పులు సాక్షి, హైదరాబాద్/రామాయంపేట/ నిజాం పేట/మనూర్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వడగాడ్పుల తీవ్రత పెరిగింది. సాధారణం కంటే నాలుగైదు డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదవు తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వడదెబ్బ తగిలి బుధవారం నాటికి 37 మంది మృతి చెందినట్లు విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ కమిషనర్ సదా భార్గవి ‘సాక్షి’కి తెలిపారు. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 9 మంది వడదెబ్బతో మృతిచెందారు. నాగర్ కర్నూలు, ఖమ్మం జిల్లాల్లో నలుగురు, భద్రాద్రి జిల్లాలో ముగ్గురు, కామారెడ్డి, మహబూబ్ నగర్, మంచి ర్యాల, రంగారెడ్డి జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. కుమ్రం భీం, మహబూబాబాద్, మేడ్చల్, సిరిసిల్ల, సంగా రెడ్డి, సూర్యాపేట, వనపర్తి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పు న చనిపోయారని కలెక్టర్లు వెల్లడించారు. చర్యలు శూన్యం.. రాష్ట్రంలో ప్రస్తుతం 45 డిగ్రీల వరకు ఉష్ణో గ్రతలు నమోదవుతున్నాయి. పరిస్థితి తీవ్ర తపై సర్కారుకు ఎప్పటికప్పుడు నివే దికలు అందుతున్నా ప్రజలను వడదెబ్బ నుంచి కాపాడటంలో వైఫల్యం కనిపిస్తోందన్న ఆరో పణలు వస్తున్నాయి. రాష్ట్ర విపత్తు నిర్వ హణ శాఖ వేసవి కార్యాచరణ ప్రణాళికను రూపొం దించింది. ఎఫ్ఎం రేడియో ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలి. ఐస్ ప్యాక్స్, ఐవీ ఫ్లూయిడ్స్‌ను అందుబాటులో ఉంచాలి. 108 సర్వీసులను అందుబాటులో ఉంచాలి. ఆరు బయట శారీరక శ్రమ చేసే వారికి నీడ కల్పించాలి. ఫ్యాక్టరీల్లో ఏసీ వసతి కల్పించాలి. నేడు వడగాడ్పులు.. రాష్ట్రంలో వడగాడ్పుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. గురువారం కూడా రాష్ట్రంలో వడ గాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతా వరణ కేంద్రం హెచ్చరించింది. సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్ర తలు నమోదవుతాయని తెలిపింది. కాగా, బుధవారం ఆదిలాబాద్‌లో అత్యధి కంగా 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వడదెబ్బతో 9 మంది మృతి సాక్షి, నెట్వర్క్: వడదెబ్బతో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది మృతి చెందారు. మృతు ల్లో నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం రాజవరం గ్రామానికి చెందిన గడ్డమీది వెంక మ్మ(65), మిర్యాలగూడలో విజయనగరం శ్రీను(38) యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడంలో భూమ అంజయ్య (55), జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్లలో కాంపెల్లి దుబ్బయ్య (65), కథలాపూర్ మండలం సిరి కొండలో ఏనుగు లింగారెడ్డి(36), యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండ లం మైలారం గ్రామ తండాలో కంకరమిల్లు కూలీ రమావత్ నీలా (30), మెదక్ జిల్లా నిజాంపేట మం డలం ఖాసీంపూర్‌లో మైలు నారాయణ(62), సిద్దిపేట జిల్లా బెజ్జంకి మం డలం గుండారంలో కోరుకొప్పుల కిష్టవ్వ (68), సంగారెడ్డి జిల్లా మనూరులో ఎర్ర రామయ్య(70) ప్రాణాలు కోల్పోయారు. -
నేడు రాష్ట్రవ్యాప్తంగా వడగాడ్పులు
-
నేడు రాష్ట్రవ్యాప్తంగా వడగాడ్పులు
ఆదిలాబాద్‌లో 44.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడుతున్నారు. రోజురోజుకూ వడగాడ్పుల తీవ్రత పెరుగుతూఉంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. అనేక ప్రాంతాల్లో 42 డిగ్రీల సెల్సియస్‌కు మించి పగటి ఉష్ణోగ్రతలు రికార్డు అవుతాయని వివరించింది. కాగా, మంగళవారం ఆదిలాబాద్‌లో 44.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత రికార్డయింది. మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ల లోనూ 44 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్‌లో 43, హైదరాబాద్, భద్రాచలం, రామగుండంలో 42, ఖమ్మంలో 41, హకీంపేటలో 40 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్‌లో సాధారణం కంటే 4.7 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడదెబ్బతో 13 మంది మృతి సాక్షి, నెట్వర్క్: మండుతున్న ఎండలు మంగళవారం వేర్వేరుచోట్ల 13 మందిని బలిగొన్నాయి. వడదెబ్బకు తాళలేక భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మంగళవారం ఐదుగురు మృత్యువాత పడ్డారు. వైరా మండలం జింకలగూడేనికి చెందిన షేక్ బేగంబీ(75), ఇదేమండలంలోని బ్రాహ్మణపల్లికి చెందిన తాటి జగన్నాథం(70), దుమ్ముగూడెం మండలం చినబండిరేవు గ్రామానికి చెందిన బుద్దా రామయ్య (60), సత్తుపల్లి పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన వేముల కొండమ్మ(85), తల్లాడ మండల పరిధిలోని అన్నారుగూడేనికి చెందిన తాళ్లూరి గోపులు (45) ఎండవేడిమికి తట్టుకోలేక చనిపోయారు. అలాగే, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మంగళవారం వడదెబ్బతో ఐదుగురు మృత్యువా తపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం లోని అనుగొండ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నారాయణ గౌడ్(60), నవాబుపేట మండలం కాకర్‌జాల్ తండాకు చెందిన టీక్యానాయక్ (42) అనే ఉపాధి కూలీ, నాగర్క ర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మంగనూరుకు చెందిన ఉపాధి కూలీ పాశం మల్లయ్య(46) మృతిచెందారు. వనపర్తి జిల్లా వనపర్తి మండలం రాజపేటకు చెందిన గొడుగు కురుమయ్య(60), పెద్దమందడి మండలం వీరాయపల్లికి చెందిన బోయ లొట్టి చెన్నయ్య (60) మృతిచెందారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట నగర పంచాయతీ పరిధిలోని మోత్కులగూడెం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ దాసారపు భద్రమ్మ (37), రాజన్నసిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మండలం సర్ధాపూర్ గ్రామానికి చెందిన దడిగెల వెంకటమ్మ (60), పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రానికి చెందిన పోశవేని రాజమ్మ(70)కూడా వడదెబ్బతో మరణించారు. -
వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి
కూడేరు (ఉరవకొండ) : కూడేరు మండలం కరుట్లపల్లికి చెందిన ఉపాధి కూలీ బండి లక్ష్మీదేవి (45) వడదెబ్బతో సోమవారం మృతి చెందింది. కుటుంబ సభ్యులు అందించిన వివరాల మేరకు... లక్ష్మీదేవి శనివారం ఉపాధి పనికి వెళ్లింది. ఎండలోనే పని చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత నీరసంగా ఉండడంతో స్థానికంగా ఉన్న వైద్యునితో చూపించుకుంది. ఆదివారం ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవడంతో అనంతపురంలోని సర్వజన ఆస్పత్రికి వెళ్లింది. పరిస్థితి విషమించడంతో సోమవారం మృతి చెందింది. మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యురాలు నిర్మలమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మీదేవి ప్రభుత్వాన్ని కోరారు. -
వడదెబ్బతో ఇద్దరు మృతి
కోడుమూరు రూరల్: ఎండవేడిమితో వడదెబ్బకు గురై జిల్లాలో మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. కోడుమూరు మండలం వర్కూరు గ్రామానికి చెందిన కుర్నూరు రాముడు (66) శనివారం ఉపాధి పనులకు వెళ్లాడు. అక్కడ తీవ్రమైన ఎండను తట్టుకోలేక అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు అదేరోజు సాయంత్రం కోడుమూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక సోమవారం తెలవారుజామున మృతి చెందాడు. మృతుడికి భార్య చెన్నమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. గని కార్మికుడు మృతి గడివేములకు చెందిన గని కార్మికుడు ఎస్. వెంకటేశ్వర్లు (40) సోమవారం ఉదయం గనికి వెళ్లాడు. మధ్యాహ్నం పని ముగించుకుని ఇంటికి వస్తుండగా ఎండ వేడిమితో అస్వస్థతకు గురై మార్గమధ్యంలో సొమ్మసిల్లి పడిపోయాడు. చికిత్స నిమిత్తం ఆర్ఎంపీకి వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నాడు. -
నడినెత్తిన నిప్పులే..
- రాష్ట్రంలో మండుతున్న ఎండలు - ఆదిలాబాద్‌లో 44.4 డిగ్రీలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భానుడు భగభగమంటున్నాడు. ఆదివారం అనేక చోట్ల 43, 44 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధి కంగా ఆదిలాబాద్‌లో 44.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లో 44 డిగ్రీలు, రామగుండంలో 43.4, నల్ల గొండ, మెదక్‌లో 43, ఖమ్మం, భద్రాచలంలో 42, హకీంపేట 41, హన్మకొం డలో 40.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. మండుతున్న ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సోమవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల వడగాడ్పులు వీస్తాయని, సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోద వుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నగరంలో 42.4 డిగ్రీలు.. గ్రేటర్‌పైనా ప్రచండభానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఆదివారం హైదరా బాద్‌లో గరిష్టంగా 42.4 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణో గ్రత ఇదే. మండుటెండకు వేడి గాలులు తోడవ్వడంతో నగరవాసులు ఇబ్బం దులు పడుతున్నారు. ఎండతీవ్రత పెరగ డంతో ఆదివారం మధ్యాహ్నం పలు ప్రధాన రహదారులు బోసిపోయి కనిపిం చాయి. మరోవైపు రాగల 48 గంటల పాటు నగరంలో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని బేగంపేట్‌లోని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. వడదెబ్బతో ముగ్గురు మృతి సాక్షి నెట్వర్క్: తెలంగాణ జిల్లాల్లో వడదెబ్బతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం జూపాకకు చెందిన తాళ్లపల్లి దానయ్య(70) శనివారం పశువుల మేతకు వెళ్లి అస్వస్థతకు గురయ్యాడు. ఆదివారం వేకువజామున మృతి చెందాడు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం మాధారంకలాన్ గ్రామానికి చెందిన మామిడాల మల్లయ్య(68) ఆదివారం వ్యవసాయ పనుల కోసం వెళ్లి ఎండతీవ్రతతో అస్వస్థతకు గురై చనిపో యాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లికి చెందిన ఒగ్గు బుచ్చిరాజం (55) శనివారం గొర్రెలను మేపేందుకు వెళ్లాడు. రాత్రి ఇంటికి వచ్చి నలతగా ఉందని చెప్పాడు. ఉదయం చూడగా, చనిపోయి ఉన్నాడు. -
కలెక్టర్ వాహన డ్రైవర్‌కు నోటీసు జారీ
- వడదెబ్బతో విధులకు గైర్హాజర్ - తనకు చెప్పలేదని నోటీసులిచ్చిన కలెక్టర్ - విచారణ చేయాలని డీఆర్ఓకు ఆదేశం కర్నూలు (అగ్రికల్చర్): తన వాహన డ్రైవర్ వెంకోబ అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యారని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ నోటీసులు జారీ చేసినట్లు ఆలస్యంగా తెలిసింది. ఈనెల 7వ తేదీన కలెక్టర్ కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో పర్యటించాల్సి ఉండగా వడదెబ్బ కారణంగా వాహన డ్రైవర్ విధులకు రాలేక పోయాడు. ఈ క్రమంలో తన అనుమతి తీసుకోకుండా గైర్హాజర్ కావడం, తన విధులకు అంతరాయం కలిగించాడని, ఎందుకు చర్యలు తీసుకోరాదో చెప్పాలని డీఆర్ఓ ద్వారా డ్రైవర్‌కు నోటీసులు జారీ చేయించారు. తీవ్రమైన ఎండలతో వెంకోబ వడదెబ్బకు గురై ఆసుపత్రిలో చేరగా, డాక్టర్ ఐదు సెలిన్ బాటిళ్లు పెట్టి వైద్య సేవలు అందించినట్లు తెలిసింది. కాగా డ్రైవర్ వడబెబ్బ కారణంగానే ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాడా లేదా అనే విషయంపై పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని రెండు రోజుల క్రితం కలెక్టర్ డీఆర్ఓను ఆదేశించారు. కలెక్టరేట్లో ఈ విషయం చర్చనీయాంశమైంది. -
వడదెబ్బకు ముగ్గురు మృతి
ఓర్వకల్లు: రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో జిల్లాలో మరో ముగ్గురు వడదెబ్బకు గురై మృతి చెందారు. ఓర్వకల్లు గ్రామంలో స్థానిక పెండేకంటి నగర్లో నివాసముంటున్న జల్ల నాగరాజు (46) 15 సంవత్సరాల నుంచి స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో చిరు వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పది రోజుల నుంచి పెరుగుతున్న ఉష్ణోగ్రతల మూలంగా ఎండ తీవ్రతకు తట్టుకోలేక మూడు రోజుల క్రితం అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు. శనివారం.. రోజు మాదిరిగానే మళ్లీ బస్టాండ్‌కు చేరుకుని వ్యాపారం చేస్తుండగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో అస్వస్థతకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సరోజమ్మ ఉన్నప్పటికీ కుటుంబ కలహాలతో వేర్వేరుగా నివసిస్తున్నారు. పది రోజుల్లో కుమారుడి పెళ్లి.. వడదెబ్బతో తండ్రి మృతి వెల్దుర్తి రూరల్: పది రోజుల్లో కుమారుడి పెళ్లి ఉండగా వడదెబ్బతో తండ్రి మృతి చెందాడు. ఈ విషాద ఘటన నర్సాపురంలో శనివారం చోటు చేసుకుంది. నర్సాపురం గ్రామ పంచాయతీ 4వ వార్డు మెంబర్ దేవనకొండ కిష్టన్న(60)కు భార్య రామలక్ష్మమ్మ, ముగ్గురు కూతుర్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పది రోజుల్లో కుమారుడి పెళ్లి నిశ్చయమైంది. ఓ వైపు పెండ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పొలంలో కంది కొయ్యలు పాస్తుండడంతో శనివారం కిష్టన్న ఉదయం పొలానికి వెళ్లాడు. సాయంత్రానికి ఇంటికి తిరిగి వస్తూ ఎండవేడికి అస్వస్థతకు గురై గ్రామ శివారులో పడిపోయాడు. గమనించిన గ్రామస్తులు.. కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో అతడిని కర్నూలు ప్రభుత్వాస్పుత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. ఉపాధి కూలీ మృతి పత్తికొండ రూరల్: పెద్దహుల్తి గ్రామంలో వడదెబ్బతో ఉపాధి కూలీ అయ్యన్న (62) వడదెబ్బకు గురై మృతి చెందాడు. శనివారం రోజులాగానే ఉపాధి పనులకు Ððవెళ్లి ఎండవేడిమితో అస్వస్థతకు గురై ఇంటికొచ్చాడు. కొద్ది సేపికి సొమ్మసిల్లి పడిపోవడంతో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. మృతుడు అయ్యన్నకు భార్య లక్ష్మీదేవి, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. -
ఎండలు@ 44
-
ఎండలు@ 44
మంచిర్యాలలో అత్యధిక ఉష్ణోగ్రత హాజిపూర్ (మంచిర్యాల), హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. సోమవారం మంచిర్యాల జిల్లాలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వారం రోజులుగా 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం గమనార్హం. సోమవారం ఏకంగా 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు పలు వాతావరణ వెబ్సైట్లు పేర్కొనగా.. అధికారులు మాత్రం 41 డిగ్రీల మేర నమోదైనట్లు వెల్లడించారు. మంచిర్యాల జిల్లాలో సింగరేణి బొగ్గు గనులు, విద్యుత్ ప్రాజెక్టులు, ఇతర పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో గరిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు కాస్త అటూఇటుగా నమోదవుతున్నాయి. ఇంకా మే రాక ముందే ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం లబోదిబోమంటున్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవు తున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండలు మండుతున్నాయి. అక్కడక్కడా వడగాడ్పులు వీస్తున్నాయి. దాంతో పగటిపూట బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. చాలా చోట్ల మధ్యాహ్నం పూట కర్ఫ్యూ తరహా వాతావరణం కనిపిస్తోంది. వాతావరణంలో తేమ శాతం కూడా ఎక్కువగా ఉంటుండటంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరోవైపు వడదెబ్బకు సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు మృతి చెందారు. నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం భీమనపల్లి గ్రామానికి చెందిన పశువుల కాపరి మారుపాక కృష్ణయ్య(55), యాదాద్రి భువనగిరి జిల్లా లక్ష్మీదేవిగూడెంకు చెందిన ఉల్లెంతల బిచ్చయ్య(70), సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగకు చెందిన పండపాక రాజేందర్, కవిత దంపతుల కూతురు భానుజ (16 నెలలు)లు మృతి చెందారు. -
నేటి నుంచి 3 రోజులు తీవ్ర ఎండలు
-
ప్రచండ భానుడు
నేటి నుంచి 3 రోజులు తీవ్ర ఎండలు - భారత వాతావరణ శాఖ హెచ్చరిక - ఇప్పటికే నిప్పుల కుంపటిలా రాయలసీమ - రాష్ట్రంలో పెరుగుతున్న వడగాడ్పుల మరణాలు - 42.2 శనివారం కర్నూలులోఅత్యధిక ఉష్ణోగ్రత (డిగ్రీల సెల్సియస్) - వడదెబ్బతో మృతి చెందిన వారు 9 సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. ప్రచండ భానుని ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇదే సమయంలో ఆదివారం నుంచి మూడు రోజులపాటు ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ తాజాగా శనివారం రాత్రి హెచ్చరికలు చేసింది. ముఖ్యంగా రాయలసీమలో ఈ ఎండల తీవ్రత బాగా అధికంగా ఉంటుందని తెలిపింది. రెండు, మూడు డిగ్రీల వరకు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే వీలున్నట్టు వెల్లడించింది. దీంతో ఇప్పటికే నిప్పులకుంపటిలా మారిన రాయలసీమలో రాబోయే మూడురోజులపాటు ఎండ భగభగలు మరింత తీవ్ర స్థాయిలో ఉండనున్నాయి. ఇదిలా ఉంటే శనివారం కర్నూలులో అత్యధికంగా 42.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అనంతపురంలో 41.9, కడపలో 41.5, జంగమేశ్వరపురంలో 41.2, తిరుపతిలో 40.6, విజయవాడలో 39.2 డిగ్రీల సెల్సియస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రం మొత్తమ్మీద కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. వడదెబ్బతో 9 మంది మృతి రాష్ట్రంలో ఎండల తీవ్రతకు వడగాడ్పులు తోడవడంతో వడదెబ్బ మరణాలు అధికమయ్యాయి. వడదెబ్బకు గురై తాజాగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా వైఎస్సార్ జిల్లాలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. చింతకొమ్మదిన్నె మండలం ఇప్పెంట పంచాయతీ పరిధిలోని బోడెద్దులపల్లె గ్రామవాసి పఠాన్ జమాల్‌ఖాన్(68), నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె మేజర్ పంచాయతీ పరిధిలోని దళితవాడకు చెందిన కొండా రామలక్షుమ్మ(70), ఎర్రగుంట్ల పట్టణంలో వెంకటయ్య(55) వడదెబ్బ కారణంగా చనిపోయారు. గుంటూరులోని పల్నాడు బస్టాండ్ సమీపంలో చెప్పులు కుట్టుకుని జీవనం సాగిస్తున్న 60 ఏళ్ల వృద్ధుడు వడదెబ్బతో మృతిచెందాడు. ఇతని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని సుగాలీ కాలనీకి చెందిన దివ్యాంగుడు మేఘావతు బ్రహ్మనాయక్(45) శనివారం వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయాడు. చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం బసినికొండ పంచాయతీకి చెందిన భీమన్నగారి రామన్న(65) శుక్రవారం మధ్యాహ్నం పొలానికి నీళ్లు కడుతూ ఎండ తీవ్రత తట్టుకోలేక కుప్పకూలిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. శ్రీకాళహస్తికి చెందిన షేక్ రమీజాబీ(52) ఎండల తీవ్రతకు పదిరోజులక్రితం అనారోగ్యానికి గురైంది. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంది. శనివారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూసింది. అనంతపురం జిల్లా గుత్తి మండలం తురకపల్లికి చెందిన పెయింటర్ శ్రీనివాసులు(45), గుత్తి పట్టణంలోని ఎస్సీ కాలనీవాసి మాతాంగి రామకృష్ణ(28) వడదెబ్బతో మృత్యువాత పడ్డారు. -
మండే ఎండలతో ఆరోగ్యానికి దెబ్బ
- పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి - ఇప్పటికే 20కి చేరిన వడదెబ్బ మరణాల సంఖ్య.. - తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న వైద్య, ఆరోగ్యశాఖ - స్కూళ్లు మిట్టమధ్యాహ్నం వరకు ఉండటంతో విద్యార్థులకు ఇక్కట్లు సాక్షి, హైదరాబాద్: అప్పుడే ఎండలు 43 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. సాధారణం కంటే అనేకచోట్ల మూడు నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతు న్నాయి. మండే ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వడదెబ్బతో మృతి చెందుతున్న వారి సంఖ్య దాదాపు 20కి చేరింది. ముఖ్యంగా కూలీలు, వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు భానుడి ప్రతాపానికి విలవిలలా డుతు న్నారు. తీవ్రమైన ఎండలో తిరిగేవారికి వడదెబ్బ తగిలే ప్రమాదముంది. దీంతో వాంతులు, విరేచనాలు, హైఫీవర్, చర్మం పొడిబారడం, డీహైడ్రేషన్, బీపీ పెరగడం, కిడ్నీ, గుండె వంటి ఫెయిల్యూర్ అవడం సంభవిస్తాయి. వేసవిలో నీరు, ఆహారం కారణంగా కూడా అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఎండల తీవ్రతతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. దీంతో వైద్యారోగ్యశాఖ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వేసవి ప్రణాళిక అమలులో నిర్లిప్తత... ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించి మిట్టమధ్యాహ్నం ఎర్రటి ఎండలో వదిలిపెడుతుండటంతో విద్యా ర్థులు విలవిలలాడుతున్నారు. అధిక ఉష్ణోగ్రత లుంటే ఉదయం 11 గంటల వరకే పాఠశాలలను నిర్వహించాలన్న వేసవి ప్రణాళికను విద్యాశాఖ ఏమాత్రం పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు న్నాయి. బస్టాండుల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడంలేదు. వేసవి ప్రణాళిక అమలుకు ప్రభుత్వం ఒక్క పైసా కూడా కేటాయించ లేదని అధికారులు పెదవి విరుస్తున్నారు. వైద్యారోగ్యశాఖ పేర్కొన్న జాగ్రత్తలు... ► ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు బయట తిరగకూడదు. ► తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళితే టోపీ, తెల్లటి నూలు వస్త్రాలు ధరించాలి. ► నీరు, ఇతర ద్రవ పదార్థాలు వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి. ► మత్తుపానీయాలు తీసుకోకూడదు. ► వడదెబ్బకు గురైన వారిని ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి తరలించాలి. ► ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ► వడదెబ్బకు గురైన వారి శరీరాన్ని చల్లని నీటిలో ముంచిన గుడ్డతో తుడవాలి. ► వారికి ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరినీళ్లు, నిమ్మరసం, గ్లూకోజ్ లేదా ఓఆర్ఎస్ కలిపిన నీటిని తాగించాలి. వడదెబ్బ లక్షణాలు... ► రోజుకు ఐదారుసార్ల కంటే ఎక్కువగా నీళ్ల విరేచనాలు రావడం, వాంతులు, వికారం, మెలిపెట్టినట్లుగా కడుపునొప్పి ఉండటం. ► జ్వరం 101 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండటం. ► ఐదారు గంటలుగా మూత్రవిసర్జన నిలిచిపోవడం, నాలుక తడారిపోవడం. ► ఒక్కోసారి పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితికి చేరుకోవడం. ► పిల్లల శరీరంపై దద్దుర్లు రావడం, నుదురు వేడిగా ఉండటం. -
ఆదిలాబాద్‌లో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత
మంచిర్యాల అగ్రికల్చర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం గరిష్టంగా 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, కనిష్టంగా 22.3 డిగ్రీలు నమోదైంది. దీంతో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు ఏవిధంగా ఉండబోతాయో నని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రైతులు, కూలీలు రోజువారీ పనులు చేసు కోలేని పరిస్థితి నెలకొంది. విద్యార్థులకు పరీక్ష టెన్షన్‌తోపాటు ఎండ తీవ్రత ప్రధాన అడ్డంకిగా మారుతోంది. సింగరేణి బొగ్గు గని ఏరియాల్లో ఎండవేడిమి మరింత ఎక్కువగా ఉంటోంది. ఓపెన్ కాస్టుల్లో పనిచేస్తున్న కార్మికులు భానుడి ప్రతాపానికి మాడిపోతున్నారు. పగటిపూట విధులకు హాజరయ్యే కార్మికుల సంఖ్య తగ్గిపోతోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గత పదిరోజుల్లోనే వడదెబ్బతో ఏడుగురు మరణించారు. -
వడదెబ్బతో ఐదుగురు మృతి
సాక్షి నెట్వర్క్: మండు ఎంతున్న ఎండలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన వారు వడదెబ్బతో మృత్యువాత పడుతున్నారు. శనివారం జిల్లాలో ఐదుగురు వడదెబ్బతో మృతి చెందారు. జిల్లాలో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వడదెబ్బకు గురికాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఎండకు బయటకు వెళ్లకూడదని..ఎండలో తిరగాల్సి వస్తే టోపీగాని, గొడుగుగాని ధరించాలని సూచిస్తున్నారు. ఎక్కువగా నీరు తాగాలని, చల్లని ప్రదేశంలో సేద తీరాలని చెబుతున్నారు. జిల్లాలో వడదెబ్బ మృతులు.. పేరు(వయస్సు) ఊరు మండలం కారణం తొట్ల లక్ష్మమ్మ (69) లద్దగిరి కోడుమూరు పొలంలో చౌళకాయలు తెపేందుకు వెళ్లి సిద్ధయ్య(31) హాల్వి కౌతాళం వ్యవసాయ పనులకు వెళ్లి.. వెంకటేశ్వర్లు(50) బలపనూరు పాణ్యం పొలం పనికి వెళ్లి.. బోయ కిష్టమ్మ(65) చనుగొండ్ల గూడూరు పొలం పనికి వెళ్లి.. వెంకటేశ్వరమ్మ(52) తెర్నెకల్ దేవనకొండ పొలం పనికి వెళ్లి.. -
వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి
అవుకు: మెట్టుపల్లె గ్రామంలో ఉపాధి కూలీ ఒకరు వడదెబ్బతో బుధవారం మృతి చెందారు. స్థానికులు, ఫీల్డ్ అసిస్టెంట్ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గడ్డం పుల్లయ్య (35)ఉదయం ఉపాధి పనికి వెళ్లి.. 11 గంటలకు ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే ఎండ తీవ్రతతో వడదెబ్బకు గురై స్పృహ తప్పి పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసపత్రికి తరలించేలోపు మృతి చెందాడు. మృతునికి భార్య రమాదేవి, ఒక కూతురు, కూమారుడు ఉన్నారు. -
వడదెబ్బ నుంచి తప్పించుకోండిలా..
నిడమర్రు: రోజురోజుకూ ఎండలు మండుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతల తీవ్రత మరింత పెరగనుంది. దాంతో వడదెబ్బ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో వడదెబ్బ అంటే ఏమిటి.. దాని లక్షణాలు.. నివారణ మార్గాల గురించి తెలుసుకుందాం. - వడదెబ్బ అంటే..? ఎక్కువ ఉష్ణోగ్రతల తాకిడికి గురైన కారణంగా శరీరంలోని వేడిని నియంత్రించే విధానం విఫలమై ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడటాన్ని వడదెబ్బ అంటారు. అత్యధిక వేడి వాతావరణం లేదా అధిక శారీరక శ్రమను శరీరం తట్టుకోలేనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఈస్థితిలో శరీరంలో సహజంగా జరగాల్సిన చర్యలు జరగకపోవడం వల్ల దాని ప్రభావం అవయవాల పనితీరుపై పడుతుంది. దాంతో వడదెబ్బ తగిలిన వ్యక్తి నీరసించి కుప్పకూలిపోతాడు. కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం కూడా ఏర్పడుతుంది. -లక్షణాలు -గుండె / నాడి కొట్టుకునే వేగంలో ఆకస్మిక మార్పు, వేగంగా / తక్కువగా శ్వాస తీసుకోవడం, చెమట పట్టకపోవడం, ఎక్కువ/ తక్కువ రక్తపోటు, చిరాకు, కంగారు, తలతిరగడం, శరీరం గాలిలో తేలిపోతున్నట్టు ఉండటం, తలపోటు, వికారం, వాంతులు, అపస్మారక స్థితి వంటివి వడదెబ్బ తగిలినవారిలో సహజంగా కనిపించే లక్షణాలు. -ప్రాథమిక చికిత్స -వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే నీడలోకి తీసుకొచ్చి ఆ వ్యక్తి శరీరాన్ని చల్లబరచాలి. రోగి శరీరాన్ని చల్లటి నీటిలో ముంచిన వస్త్రంతో తుడవాలి. -రోగి తాగ గలిగితే చల్లటి పానీయాలు ఇవ్వాలి. వదులు దుస్తులు కట్టాలి. - ఎటువంటి మందులు ఇవ్వకూడదు. వెంటనే వైద్యులను సంప్రదించాలి ముందు జాగ్రత్తగా - వేసవిలో డీ హైడ్రేషన్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడికి వెళ్లినా వాటర్ బాటిల్‌ను వెంట తీసుకెళ్లాలి. నీరు శరీరంలోని వేడిని క్రమబద్ధీకరిస్తుంది. - ఎక్కువ సేపు ఎండలో ఉండకుండా జాగ్రత్త పడాలి. ఎండలో పనిచేసేవారయితే మధ్యమధ్యలో నీడ పట్టుకు వచ్చి సేదతీరుతూ ఉండాలి. -గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండ సమస్యలు ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్లు సాధారణ వ్యక్తుల కంటే తొందరగా డీ హైడ్రేషన్ ప్రభావానికి గురవుతారు. -ఆల్కహాల్, సిగరెట్, కార్బోనేటెడ్ ద్రావణాలకు దూరంగా ఉండాలి. వీటి వల్ల శరీరంలో ఉండే నీటి నిల్వలు తొందరగా తగ్గిపోతాయి. - ఎండలో వెళ్లేటప్పుడు కళ్లకు సన్‌గ్లాస్, తలకు టోపీ వంటివి ధరించడం మంచింది. -వేసవి కాలంలో బయటకు వెళ్లే అవసరం ఉంటే ఉదయ, సాయంత్రం వేళల్లో మాత్రమే వెళ్లేలా ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. -వేడి వాతావరణంలో శారీరక శ్రమ అధికంగా ఉండే పనులు చేయడం మంచింది కాదు. ఒక వేళ శారీరక శ్రమ అధికంగా ఉండే వృత్తుల్లో ఉన్నవారయితే తరచూ శక్తినిచ్చే పానీయాలు తాగాలి. -ఆహారంలో ఎక్కువగా ద్రవ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి, కారం, మసాలాలు ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. - బయటకు వెళ్ళిన సందర్భాల్లో టీ, కాఫీ, వేపుడు పదార్థాలు, ఫాస్ట్ఫుడ్స్ మానెయ్యాలి. వాటి బదులుగా కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి -ప్రయాణాల్లో సోడియం వంటి ఎలక్ట్రోలైట్ ద్రావణాలను త్రాగటం మంచిది - వేసవిలో వాంతులు, అలసట, బలహీనంగా కనిపించడం, తలనొప్పి, కండరాలలో తిమ్మిరులు, మైకం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలి. ––––––––––––––––––––––––––––– వయసుతో నిమిత్తం లేదు ఏ వయసువారైనా వడదెబ్బ బారిన పడొచ్చు. వారిలో పిల్లలు, వృద్ధులు, క్రీడాకారులు, మధుమేహ వ్యాధి ఉన్న వ్యక్తులు, మద్యపానం అలవాటు ఉన్న వారికి వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువ. అలాగే కొన్ని రకాల ఔషధాలు కూడా వడదెబ్బకు కారణమవుతాయి. వేసవిలో తగిన జాగ్రత్తలు పాటించడం మంచిది.-– పి.సతీష్కుమార్రాజు, వర్మ హాస్పిటల్, గణపవరం -
వడదెబ్బ నుంచి తప్పించుకోండిలా..
నిడమర్రు: రోజురోజుకూ ఎండలు మండుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతల తీవ్రత మరింత పెరగనుంది. దాంతో వడదెబ్బ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో వడదెబ్బ అంటే ఏమిటి.. దాని లక్షణాలు.. నివారణ మార్గాల గురించి తెలుసుకుందాం. వడదెబ్బ అంటే..? ఎక్కువ ఉష్ణోగ్రతల తాకిడికి గురైన కారణంగా శరీరంలోని వేడిని నియంత్రించే విధానం విఫలమై ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడటాన్ని వడదెబ్బ అంటారు. అత్యధిక వేడి వాతావరణం లేదా అధిక శారీరక శ్రమను శరీరం తట్టుకోలేనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఈస్థితిలో శరీరంలో సహజంగా జరగాల్సిన చర్యలు జరగకపోవడం వల్ల దాని ప్రభావం అవయవాల పనితీరుపై పడుతుంది. దాంతో వడదెబ్బ తగిలిన వ్యక్తి నీరసించి కుప్పకూలిపోతాడు. కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం కూడా ఏర్పడుతుంది. లక్షణాలు గుండె / నాడి కొట్టుకునే వేగంలో ఆకస్మిక మార్పు, వేగంగా / తక్కువగా శ్వాస తీసుకోవడం, చెమట పట్టకపోవడం, ఎక్కువ/ తక్కువ రక్తపోటు, చిరాకు, కంగారు, తలతిరగడం, శరీరం గాలిలో తేలిపోతున్నట్టు ఉండటం, తలపోటు, వికారం, వాంతులు, అపస్మారక స్థితి వంటివి వడదెబ్బ తగిలినవారిలో సహజంగా కనిపించే లక్షణాలు. ప్రాథమిక చికిత్స వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే నీడలోకి తీసుకొచ్చి ఆ వ్యక్తి శరీరాన్ని చల్లబరచాలి. రోగి శరీరాన్ని చల్లటి నీటిలో ముంచిన వస్త్రంతో తుడవాలి. రోగి తాగ గలిగితే చల్లటి పానీయాలు ఇవ్వాలి. వదులు దుస్తులు కట్టాలి. ఎటువంటి మందులు ఇవ్వకూడదు. వెంటనే వైద్యులను సంప్రదించాలి ముందు జాగ్రత్తగా వేసవిలో డీ హైడ్రేషన్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడికి వెళ్లినా వాటర్ బాటిల్‌ను వెంట తీసుకెళ్లాలి. నీరు శరీరంలోని వేడిని క్రమబద్ధీకరిస్తుంది. ఎక్కువ సేపు ఎండలో ఉండకుండా జాగ్రత్త పడాలి. ఎండలో పనిచేసేవారయితే మధ్యమధ్యలో నీడ పట్టుకు వచ్చి సేదతీరుతూ ఉండాలి. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండ సమస్యలు ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్లు సాధారణ వ్యక్తుల కంటే తొందరగా డీ హైడ్రేషన్ ప్రభావానికి గురవుతారు. ఆల్కహాల్, సిగరెట్, కార్బోనేటెడ్ ద్రావణాలకు దూరంగా ఉండాలి. వీటి వల్ల శరీరంలో ఉండే నీటి నిల్వలు తొందరగా తగ్గిపోతాయి. ఎండలో వెళ్లేటప్పుడు కళ్లకు సన్‌గ్లాస్, తలకు టోపీ వంటివి ధరించడం మంచింది. వేసవి కాలంలో బయటకు వెళ్లే అవసరం ఉంటే ఉదయ, సాయంత్రం వేళల్లో మాత్రమే వెళ్లేలా ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. వేడి వాతావరణంలో శారీరక శ్రమ అధికంగా ఉండే పనులు చేయడం మంచింది కాదు. ఒక వేళ శారీరక శ్రమ అధికంగా ఉండే వృత్తుల్లో ఉన్నవారయితే తరచూ శక్తినిచ్చే పానీయాలు తాగాలి. ఆహారంలో ఎక్కువగా ద్రవ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి, కారం, మసాలాలు ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. బయటకు వెళ్ళిన సందర్భాల్లో టీ, కాఫీ, వేపుడు పదార్థాలు, ఫాస్ట్ఫుడ్స్ మానెయ్యాలి. వాటి బదులుగా కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి ప్రయాణాల్లో సోడియం వంటి ఎలక్ట్రోలైట్ ద్రావణాలను త్రాగటం మంచిది వేసవిలో వాంతులు, అలసట, బలహీనంగా కనిపించడం, తలనొప్పి, కండరాలలో తిమ్మిరులు, మైకం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలి. వయసుతో నిమిత్తం లేదు పి.సతీష్కుమార్రాజు, వర్మ హాస్పిటల్, గణపవరం ఏ వయసువారైనా వడదెబ్బ బారిన పడొచ్చు. వారిలో పిల్లలు, వృద్ధులు, క్రీడాకారులు, మధుమేహ వ్యాధి ఉన్న వ్యక్తులు, మద్యపానం అలవాటు ఉన్న వారికి వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువ. అలాగే కొన్ని రకాల ఔషధాలు కూడా వడదెబ్బకు కారణమవుతాయి. వేసవిలో తగిన జాగ్రత్తలు పాటించడం మంచిది. -
హైదరాబాద్ @ 39.2 డిగ్రీలు
నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు సాక్షి, హైదరాబాద్: వేడి గాలులు నగర ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్‌లో 39.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరో 48 గంటల పాటు హైదరాబాద్‌లో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని, వేడిగాలులు కూడా కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండలో బయటికి వెళ్లేవారు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. విద్యుత్ వినియోగం పైపైకి... నగరంలో ఉష్ణోగ్రతలు అనుహ్యంగా పెరగడం తో విద్యుత్ వినియోగం కూడా రెట్టిపైంది. గ్రేటర్లో గత 2 రోజుల్లో విద్యుత్ వినియోగం 53.8 మిలియన్ యూనిట్లు నమోదైంది. మార్చి లోనే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్, మేలో విద్యు త్ వినియోగం 60 ఎంయూలు దాటే అవకాశం ఉందని డిస్కం అంచనా వేస్తోంది. పెరుగుతు న్న విద్యుత్ ఒత్తిడిని తట్టుకోలేక ఫీడర్లు ట్రిప్ప వుతూ సరఫరాకు అంతరాయం కలిగిస్తు న్నా యి. ఒత్తిడిని తట్టుకునేవిధంగా ఇప్పటికే సరఫ రా వ్యవస్థను తీర్చిదిద్దినట్లు చెబుతున్నారు. రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి.. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామా బాద్, రామగుండంలలో 40 డిగ్రీల చొప్పున, హన్మకొండ, ఖమ్మం, మెదక్‌లలో 39 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 48 గంటలు రాష్ట్రంలో సాధారణం కంటే 2–3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరా బాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పెరిగిన విద్యుత్ డిమాండ్... ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ అమాంతం పెరిగింది. గత మార్చిలో 148.73 మిలియన్ యూనిట్లుగా ఉన్న విద్యుత్ డిమాండ్ కాస్తా ఈ మార్చిలో ఏకంగా 184.11 మి.యూనిట్లకు పెరిగింది. వడదెబ్బతో నలుగురి మృతి నెట్వర్క్: వడదెబ్బతో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు మృతిచెందారు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం యల్లాపురంలో గడగోజు దుర్గాచారి(51), రంగుండ్లలో ఆంగోతు రవి నాయక్, ఇదే జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెంలో నక్క చంద్రమ్మ (70), మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేటలో గొల్ల నర్సింలు (56) వడదెబ్బతో మృతి చెందారు. -
వడదెబ్బతో వృద్ధురాలి మృతి
తనకల్లు : మండలంలోని గొళ్లవారిపల్లికి చెందిన నరసమ్మ(60) వడదెబ్బతో గురువారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. నల్లచెరువు మండలం కె.పూలకుంట నుంచి తన స్వగ్రామానికి బయలుదేరిన ఆమె బస్సు దిగి కాలినడకన వెళ్తుండగా.. ఉన్నపళంగా కుప్పకూలిపడిపోయిందని వివరించారు. గమనించిన స్థానికులు వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. -
వడదెబ్బతో వృద్ధురాలి మృతి
పత్తికొండ టౌన్: పట్టణంలోని శ్రీరాములపేటలో నివాసముంటున్న ఎరుకలి దుగ్గెమ్మ(62) మంగళవారం వడదెబ్బతో మృతిచెందింది. వెదురుదబ్బలతో చాటలు అల్లి ఊరిలో వీధుల్లో తిరిగి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న దుగ్గెమ్మ వడదెబ్బతో అస్వస్థతకు గురైంది. మంగళవారం ఉదయం తీవ్ర అస్వస్థతతో ఉండటంతో బంధువులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందింది. వడదెబ్బతో మృతిచెందిన వృద్ధురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎరుకల హక్కుల పోరాటసమితి నాయకుడు దుగ్గెన్న విజ్ఞప్తి చేశారు. -
వడదెబ్బ మరణాల నిరోధానికి కృషి చేయండి
విజయనగరంఫోర్ట్: వడదెబ్బ మరణాల నిరోధానికి కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లట్కర్ అన్నారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం సాయంత్రం వైద్య ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్, డ్వామా, ఆర్డబ్లు్యఎస్శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడాది వడదెబ్బకు గురై 125 మంది మృత్యువాత పడ్డారని ఈ ఏడాది సైతం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున మరణాలు లేకుండా చూడాలని సూచించారు. ఉపాధి హామీ కూలీల వద్ద 104 వాహనాలను అందుబాటులో ఉంచాలన్నారు. గర్భిణులు, వృద్ధులు, షుగర్ వ్యాధిగ్రస్తులను ఉపాధి పనులకు అనుమతించవద్దన్నారు. పీహెచ్సీ, సీహెచ్‌సీ, సబ్ సెంటర్ల్లో తగినన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రజలకు ఓఆర్ఎస్ ద్రావణం వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు. వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ప్రజలకు వివరించాలన్నారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ సి.పద్మజ, డ్వామా పీడీ ప్రశాంతి, డీఐఓ కిషోర్‌కుమార్, కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్ కె.సీతారామరాజు, డిప్యూటీ డీఎంహెచ్ఓ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. -
స్కూల్ వేళల మార్పు
⇒ వేసవి ప్రణాళిక ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ⇒ ఉపాధి కూలీలకు నీడ,నీటి వసతి కల్పించాలి ⇒ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐవీ ప్లూయీడ్స్, ఐస్ ప్యాక్స్ ఉంచాలి సాక్షి, హైదరాబాద్: వడగాడ్పుల నుంచి ప్రజలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేసవి కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసింది. ప్రధానంగా ఆరుబయట శారీరక శ్రమ చేసే ఉపాధి కూలీలకు అవసరమైన నీడ... నీటి వసతి కల్పించాలని, పాఠశాలలను ఉదయం 11 గంటల లోపే నిర్వహించాలని, మరీ వడగాడ్పులు తీవ్రమైతే ముందే వేసవి సెలవులు ప్రకటించాలని వేసవి కార్యాచరణ ప్రణాళిక స్పష్టం చేసింది. అలాగే పారిశ్రామిక వాడల్లో పనిచేసే కార్మికులకు ఏసీ సౌకర్యం కల్పించాలని, వడగాడ్పుల సమయంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల మధ్య బస్సులను నడపొద్దని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐవీ ప్లూయిడ్స్, ఐస్ ప్యాక్స్ తదితర వాటిని అందుబాటులో ఉంచాలని పేర్కొంది. విపత్తు నిర్వహణశాఖ ఈ ప్రణాళికను జిల్లా కలెక్టర్లకు, వివిధ శాఖల అధిపతులకు పంపించింది. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఈసారి ఉష్ణోగ్రతలు అధికమే.. సాధారణ ఉష్ణోగ్రత 40 డిగ్రీలుండి... దానికి అదనంగా నాలుగైదు డిగ్రీలు పెరిగితే అధిక ఉష్ణోగ్రతతో కూడిన వడగాడ్పులుగా పరిగణిస్తారు. అలాగే ఏడు డిగ్రీలు అధికంగా ఉండి 47 డిగ్రీలకు చేరకుంటే దాన్ని తీవ్రమైన వడగాడ్పులుగా పరిగణిస్తారు. ఈ పరిస్థితి ఏప్రిల్, మే నెలల్లో ఉంటుంది. గతేడాది ఇటువంటి వడగాడ్పులు అధిక రోజులు వచ్చాయి. ఈసారి అంతకుమించిన పరిస్థితి ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదీ ప్రణాళిక... ► బస్టాండుల్లో ప్రయాణికుల కోసం, ఆరుబయట పనిచేసే వారికి ఉచితంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేయాలి. ► నగరాలు, పట్టణాల్లో ఎల్ఈడీ స్క్రీన్స్ పెట్టి ఉష్ణోగ్రతల వివరాలు ప్రదర్శించడం. ► పాఠశాల టీచర్లకు శిక్షణ ఇచ్చి విద్యార్థులు వడదెబ్బ నుంచి రక్షణ తీసుకునేలా చేయడం. ►ఎఫ్ఎం రేడియో ద్వారా ప్రజలను అప్రమత్తం చేయడం. ► 108 సర్వీసును, ఆరోగ్య కార్యకర్తలను, ఆశా వర్కర్లను అందుబా టులో ఉంచడం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వేళలను పెంచడం. ► ట్వీటర్, ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించి ప్రజలను అప్రమత్తం చేయడం. మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్లు పంపడం. ► అత్యంత ఎండ తీవ్రత ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం. ► అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసి తాగునీరు, వైద్య వసతి, నీడ కల్పించడం వంటి చర్యలు చేపట్టడం. ► వడదెబ్బకు గురైన వారికోసం ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా వార్డులను నెలకొల్పడం. -
ముందస్తు ప్రణాళికతో వడదెబ్బ నివారణ
► ముఖ్య కూడళ్లలో మజ్జిగ, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి ► బాధితులకు అత్యవసర వైద్య సేవలందించాలి ► రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం విజయనగరం కంటోన్మెంట్: వేసవి కాలంలో ప్రజలు వడదెబ్బ భారిన పడకుండా ముందస్తుగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాల కొండయ్యతో కలసి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆరోగ్య జాగ్రత్తలను వివరించాలన్నారు. తెలుపు రంగు ఉన్న పలుచటి కాటన్ వస్త్ర ధారణను ప్రోత్సహించాలని సూచించారు. ఓఆర్ఎస్, గ్లూకోజ్, ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పీహెచ్‌సీల్లో 24 గంటల వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు. ఉపాధి హామీ వేతనదారులు ఉదయం 6 నుంచి 9.30 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4 నుంచి ఆరు గంటల వరకు పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ముఖ్య కూడళ్లలో మజ్జిగ కేంద్రాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. వేసవిలో పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల దాహార్తి తీర్చేందుకు, వైద్యం అందించేందుకు పశు సంవర్ధక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో వడదెబ్బ మరణాలు సంభవించకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామన్నారు. జిల్లాలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు పంపిణీకి గతేడాది జిల్లాకు రూ.3 కోట్లు విడుదలయ్యాయని, వీటిలో రూ.23.38 లక్షలు ఖర్చు చేసి మిగతా నిధులు ప్రభుత్వానికి తిరిగి పంపించామన్నారు. 2015లో జిల్లాలో 149 వడదెబ్బ మరణాలు సంభవిస్తే బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందించామన్నారు. 2016లో 115 మంది వడదెబ్బకు గురై మృతి చెందగా మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించేందుకు ప్రతిపాదించామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ శ్రీకేశ్, బి.లఠ్కర్, డీఆర్వో మారిశెట్టి జితేంద్ర, సీపీఓ జె.విజయలక్ష్మి, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల జేడీలు లీలావతి, వై.సింహాచలం, ఉద్యాన వన శాఖ డీడీ పీఎన్వీ లక్ష్మీనారాయణ, డీఎఫ్ఓలు వేణుగోపాల్, లక్ష్మణ్, డీఎంఅండ్‌హెచ్‌ఓ పద్మజ, డీసీహెచ్ఓ ఉషశ్రీ, సాలూరు కమిషనర్ మల్లయ్యనాయుడు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు. -
వడదెబ్బతో వ్యక్తి మృతి
సంజామల : ఆకుమళ్లకు చెందిన పూల ఖాజా(45) ఆదివారం వడదెబ్బతో మృతి చెందాడు. ఖాజా లారీ డ్రైవరు పని చేస్తూ జీవనం చేçస్తున్నాడు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఉదయం పని మీద తిమ్మనాయునిపేటకు వెళ్లాడు. పనిముగించుకొని మధ్యాహ్నం తిరిగి ఆటోలో వస్తుండగా పేరుసోముల సమీపానికి వచ్చేసరికి ఎండల తీవ్రతకు ఆటోలోనే సొమ్మసిల్లి పడిపోయాడు. తోటి ప్రయాణికులు కిందకు దింపి నీరు తాపించేలోపే మృత్యువాత పడ్డాడు. మృతుడికి భార్య ఉంది. -
వడదెబ్బతో వృద్ధుడు మృతి
సిరిసిల్ల: తెలంగాణలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపడం ప్రారంభించాడు. అప్పుడే వడ దెబ్బతో మృతిచెందుతున్న సంఘటనలు షురూ అయ్యాయి. సిరిసిల్ల రాజన్న జిల్లాలోని తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పసుల బాణయ్య(60) వడదెబ్బతో మృతిచెందాడు. ఈయనకు భార్య, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గురువారం పొద్దంతా పొలంలో పనిచేసి రావడంతో వడదెబ్బ తగిలి రాత్రి మృతిచెందాడని స్థానికులు చెబుతున్నారు. -
వడదెబ్బ తగిలి ఇద్దరి మృతి
విజయనగరం: వడదెబ్బ ధాటికి జిల్లా వ్యాప్తంగా ఇద్దరు మృతి చెందారు. ఎస్.కోట పట్టణంలో మొండివీధికి చెందిన రొంగలి చంద్రరావు(35) అనే వ్యక్తి బుధవారం ఉదయం వడదెబ్బ తగిలి మృతి చెందాడు. ఉదయం తొమ్మిది గంటలకు కూలి పనులకు కాపుసోపురం వెళ్లాడు. 11.30 గంటల సమయంలో కళ్లు తిరిగి పడిపోయి మృతి చెందాడు. జియ్యమ్మవలస మండలంలోని చినబురిడి గ్రామానికి చెందిన నారంశెట్టి గోపాలకృష్ణ (46) ఉపాధి పనులకు వెళ్తూ కళ్లు తిరిగి పడిపోయాడు. వెంటనే సహచరులు చినమేరంగి పీహెచ్‌సీకి తరలించగా ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం తరలిస్తుండగా మృతి చెందాడు. -
అయ్యో పాపం.. లక్ష్మి
- బస్టాండ్‌లో తండ్రి ఒడిలో తనువు చాలించిన కూతురు - శవాన్ని ఇంటికి తీసుకెళ్లే స్తోమత లేక తల్లడిల్లిన తండ్రి - మెదక్ జిల్లా నర్సాపూర్‌లో విషాదకర ఘటన నర్సాపూర్ రూరల్: ఓ వృద్ధుడు విషమ పరీక్షను ఎదుర్కొన్నాడు. తనను పోషించే కూతురు తన ఒడిలోనే ప్రాణాలు వదలడంతో తట్టుకోలేకపోయాడు. బస్టాండ్‌లో ఉండగానే ఈ ఘటన జరిగింది. శవాన్ని ఇంటికి తీసుకెళ్దామన్నా చేతిలో చిల్లిగవ్వ లేక బోరుమన్నాడు. గ్రామస్తులకు, బంధువులకు సమాచారమిచ్చినా ఎవరూ రాకపోవడంతో తల్లడిల్లిపోయాడు. ఈ పరిస్థితుల్లో ప్రయాణికులు ఆటో సమకూర్చడంతో ఎట్టకేలకు పుట్టెడు దుఃఖంతో బిడ్డ శవాన్ని తీసుకొని ఇంటిముఖం పట్టాడు. ఈ విషాదకరమైన ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ బస్టాండ్‌లో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. కౌడిపల్లి మండలం వెంకటాపూర్‌కు చెందిన ఎల్లయ్యకు కొడుకులు లేరు. కూతురు లక్ష్మికి పెళ్లి చేసి అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నాడు. అల్లుడు పాపయ్య రెండేళ్ల క్రితం మరణించాడు. ఎల్లయ్యకు కూతురు లక్ష్మి ఆసరాగా నిలిచింది. లక్ష్మి (32) పొట్టకూటి కోసం ఉపాధి హామీలో కూలీ పనులకు వెళ్లింది. వడదెబ్బ తగిలి బుధవారం తీవ్ర అనారోగ్యానికి గురైంది. కూతురిని బస్సులో నర్సాపూర్‌కు తీసుకొచ్చాడు. ఆపై ప్రభుత్వాసుపత్రిలో చూపించాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని సంగారెడ్డి లేదా హైదరాబాద్‌లోని గాంధీకి తీసుకువెళ్లాలని సూచించగా తిరిగి నర్సాపూర్ బస్టాండ్‌కు చేరుకున్నాడు. అక్కడ ఆయన ఒడిలోనే కూతురు లక్ష్మి ప్రాణాలు విడిచింది. బిడ్డ శవాన్ని ఇంటికి తీసుకుపోదామన్నా చిల్లిగవ్వ లేక బస్టాండ్‌లోనే బోరుమన్నాడు. అతని పరిస్థితి చూసిన అక్కడున్న వారు సైతం కంటతడి పెట్టారు. ఎవరికి తోచిన విధంగా వారు చిల్లర డబ్బులు ఇచ్చారు. ఎల్లయ్య ఇతరుల ఫోన్ ద్వారా గ్రామస్తులకు, బంధువులకు సమాచారమిచ్చి రెండుగంటలు నిరీక్షించినా ఎవరూ రాలేదు. చీకటిపడ్డాక స్థానికులు కొంతమంది ఓ ఆటోను ఏర్పాటు చేసి లక్ష్మి శవాన్ని వారి స్వగ్రామానికి పంపిం చారు. తనను పోషించే కూతురు మరణించడంతో తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. -
వడదెబ్బతో వృద్ధుడి మృతి
అవనిగడ్డ: పించన్ కోసం వచ్చిన ఓ వృద్ధుడు వడదెబ్బకు మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. అవనిగడ్డకు చెందిన రాసమళ్ల కృష్ణమూర్తి(80) అనే వ్యక్తి వడదెబ్బతో బుధవారం మృతిచెందాడు. పింఛన్ తీసుకోవడానికి స్థానిక పంచాయతీ కార్యాలయానికి వచ్చినపుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు ఈ సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. -
వడదెబ్బతో వృద్ధుడి మృతి
ఖానాపూర్ మండలం శాంతినగర్‌కు చెందిన పులి మల్లయ్య(65) ఎండవేడిమి తాళలేక బుధవారం సొమ్మసిల్లి పడిపోయాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. -
వడదెబ్బతో యువకుడు మృతి
నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లిలో ఓ యువకుడు వడదెబ్బతో మృతి చెందాడు. కంసాని నవీన్ (26) ఆదివారం పని ఉందని బయటకు వెళ్లి రాత్రి తిరిగి వచ్చిన తర్వాత అస్వస్థతకు గురయ్యాడు. సోమవారం తెల్లవారుజామున ఇంట్లోనే మృతి చెందాడు. -
నేడూ తీవ్ర వడగాడ్పులే
వడదెబ్బకు మరో 44 మంది మృతి సాక్షి, హైదరాబాద్: వడదెబ్బ బారినపడి రాష్ట్రంలో శనివారం 44 మంది మృతి చెందారు. ఖమ్మం జిల్లాలో పదకొండు మంది, కరీంనగర్ జిల్లాలో ఆరుగురు, నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు, ఆదిలాబాద్ జిల్లాలో ఐదుగురు, వరంగల్‌లో ఎనిమిది మంది, నల్లగొండలో 9 మంది, మెదక్‌లో ఒకరు, మహబూబ్‌నగర్ జిల్లాలో ఒకరు మరణించారు. కొద్ది రోజులుగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న తీవ్ర వడగాడ్పులు ఆదివారం కూడా కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మెదక్, నల్లగొండ జిల్లాల్లో వీటి తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. అలాగే నాలుగు రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. శనివారం రామగుండంలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు గత 24 గంటల్లో ఖమ్మం జిల్లా ఏన్కూరు, జూలూరుపాడుల్లో 3 సెంటీమీటర్లు, వరంగల్ జిల్లా హసన్‌పర్తిలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శనివారం ప్రధాన పట్టణాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ప్రాంతం ఉష్ణోగ్రత రామగుండం 45.0 హన్మకొండ 44.5 ఖమ్మం 43.6 ఆదిలాబాద్ 43.3 నిజామాబాద్ 43.0 నల్లగొండ 43.0 మెదక్ 42.0 హైదరాబాద్ 41.0 మహబూబ్‌నగర్ 40.1 హకీంపేట 38.8 -
వడదెబ్బతో 12 మంది మృతి
భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఎండ తీవ్రత తట్టుకోలేక జనం పిట్టల్లా రాలుతున్నారు. జిల్లాలో బుధవారం వడదెబ్బతో 12 మంది మృతిచెందారు. కురవి మండలంలోనే నలుగురు మృత్యువాత పడ్డారు. మహబూబాబాద్ : మానుకోట పట్టణానికి చెందిన గోపు నర్సయ్య(89) రెండురోజుల క్రితం వదెబ్బకు గురయ్యాడు. కుటుంబసభ్యులు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా బుధవారం మృతిచెందాడు. మృతుడికి ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. డోర్నకల్ : మండలంలోని పెరుమాళ్లసంకీస గ్రామపంచాయతీ పరిదిలోని బొడ్రాయితండాకు చెందిన ఉపాధి కూలీ అజ్మీర వెంకన్న(46) వడదెబ్బతో బుధవారం మృతి చెందాడు. మంగళవారం ఉపాది పనులకు వెళ్లిన వెంకన్న వాంతులతో అస్వస్థతకు గురయ్యూడు, బుధవారం తెల్లవారుజామున ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. పరకాల : మండలంలోని మల్లక్కపేట గ్రామానికి చెందిన సంగెం మల్లయ్య(60) వడదెబ్బతో బుధవారం మృతి చెందారు. ఉదయం వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన మల్లయ్య ఎండవేడిమి భరించలేక అస్వస్థతకు గురయ్యూడు. ఇంటికి వచ్చాక ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతిచెందాడు. మరిపెడ : మండల కేంద్రానికి చెందిన షేక్ జానీమియూ సోడాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజుల క్రితం వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యూడు. ఈ క్రమంలో బుధవారం మృతిచెందాడు. జానీమియూకు భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కురవి : మండలంలోని బలపాల గ్రామానికి చెందిన చిగురుపాటి రంగమ్మ(70) వడదెబ్బతో అస్వస్థతకు గురైంది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా బుధవారం మృతిచెందింది. అదే గ్రామ శివారు లింగ్యాతండాకు చెందిన బానోత్ నాజీ(65) తన కుమార్తెకు చెందిన గొర్రెలను కాసేది. అడవిలో ఎండ వేడి తట్టుకోలేక మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురైంది. తెల్లవారితే ఆస్పత్రికి తీసుకెళ్దామనుకుంటే అర్ధరాత్రే మృతి చెందిందని కుటుంబసభ్యులు తెలిపారు. అలాగే కురవికి చెందిన బత్తిని లింగమ్మ(69) అనే వృద్దురాలు వడదెబ్బతో బుధవారం మృతి చెందింది. రాజోలు గ్రామానికి చెందిన కొటూరి రాధమ్మ(65) వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురై మృతి చెందింది. కేసముద్రం : మండలంలోని ఇంటికన్నె గ్రామానికి చెందిన చెలగొల్ల కొమురయ్య(75) మంగళవారం చేను వద్దకు వెళ్లాడు, ఎండ తీవ్రతతో ఇంటికి రాగానే వాంతులు, విరేచనాలు అయ్యూరుు. కుటుంబసభ్యులు మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడికి భార్య ముత్తయ్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. చెన్నారావుపేట : వుండలంలోని ఖాధర్పేట శివారులోని అడ్డబాట తండాకు చెందిన బోడ లక్ష్మి(50) తన ఇంటి వుుందున్న గోడలు లేని గుడిసెలో పడుకుంది. వేడి గాలులతో వడదెబ్బకు గురై వాంతులు, విరేచనాలు చేసుకుంది. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగానే వుృతి చెందింది. జనగామ రూరల్ : మండలంలోని చౌడారం గ్రామానికి చెందిన రాచకొండ లక్ష్మి (56) రోజు వారి కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తోంది. మూడు రోజుల క్రితం వడదెబ్బకు గురై స్థానిక వైద్యుల వద్ద చికిత్స చేయించుకుంటూ బుధవారం మృతి చెందింది. లక్ష్మికి కుమారుడు రమేష్ ఉన్నాడు. మండలంలోని మరిగడి గ్రామానికి చెందిన కూరాకుల సోమయ్య (60) అనే రైతు గత మూడు రోజుల క్రితం పొలం పనులు చేస్తూ ఎండతో అస్వస్థతకు గురయ్యాడు. ఇంటి వద్ద, జనగామ ఆస్పత్రిలో వైద్య చికిత్సలు చేయిస్తుండగా బుధవారం మృతిచెందాడు. -
వడదెబ్బకు ఐదుగురు మృతి
ఎండ వేడిమికి తాళలేక ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. బుధవారం ఒక్కరోజే పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా.. ఐదుగురు వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డారు. ఈ రోజు ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి వడదెబ్బ బాధితులు బారులు తీరుతున్నారు. దీంతో ఆస్పత్రిలో స్థలం చాలక వరండాలు కూడా నిండిపోయే పరిస్థితి ఏర్పాడింది. -
వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి
నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలంలో వడదెబ్బకు ఉపాధి హామీ కూలీ మృతి చెందాడు. కాచవారిగూడెం గ్రామానికి చెందిన చింతల శ్రీనివాస్ (50) బుధవారం ఉదయం కూలీ పనులకు వెళ్లాడు. అక్కడ ఉన్నట్టుండి అస్వస్థతకు గురికావడంతోఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. -
వడదెబ్బ మృతులు 869
సర్కారుకు కలెక్టర్ల తాజా నివేదిక ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 351 మంది మృతి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వడదెబ్బ మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. జిల్లా కలెక్టర్లు పంపిన తాజా ప్రాథమిక నివేదిక ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 869 మంది మృతిచెందారు. నివేదికలోని గణాంకాల ప్రకారం అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 351 మంది కన్నుమూయగా, మహబూబ్‌నగర్ జిల్లాలో 144 మంది, కరీంనగర్ జిల్లాలో 115 మంది, ఆదిలాబాద్ జిల్లాలో 69, మెదక్ జిల్లాలో 48, రంగారెడ్డి జిల్లాలో 28, వరంగల్ జిల్లాలో 15, హైదరాబాద్‌లో ఎనిమిది మంది చనిపోయారు. నల్లగొండ జిల్లాలో 332 మంది మరణించినట్లు గతంలో నివేదిక ఇచ్చిన అక్కడి అధికారులు తాజాగా దాన్ని 91కి తగ్గించి నివేదికలో పేర్కొన్నారని విపత్తు నిర్వహణశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. రాష్ట్ర చరిత్రలో ఇంతమంది వడదెబ్బకు చనిపోవడం ఇదే తొలిసారి. 2015 వేసవిలో వడదెబ్బకు 541 మంది మరణించారు. జూన్ మొదటి వారం వరకు వడగాడ్పులు కొనసాగే అవకాశం ఉండటంతో వడదెబ్బ మరణాలు పెరుగుతుందేమోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. కాగా, కలెక్టర్ల ప్రాథమిక లెక్కలపై జిల్లాల్లోని త్రిసభ్య కమిటీలు మృతుల వివరాలపై విచారణ చేపట్టాయి. 317 మరణాలు మాత్రమే వడదెబ్బ వల్ల సంభవించాయని లెక్కగట్టాయి. అయితే మృతుల సంఖ్యను త్రిసభ్య కమిటీ తక్కువ చేసి చూపిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. చర్యలు శూన్యం... రాష్ట్రం నిప్పుల కుంపటిపై కుతకుతలాడుతోంది. ప్రస్తుతం 50 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పరిస్థితి తీవ్రతపై సర్కారుకు ఎప్పటికప్పుడు నివేదికలు అందుతున్నా ప్రజలను వడదెబ్బ నుంచి కాపాడటంలో విఫలమైందని ఆరోపణలున్నాయి. ఎండల తీవ్రత నుంచి ప్రజలను కాపాడేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ వేసవి కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ప్రభుత్వం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, ప్రభుత్వ కార్యాలయాలు, గుళ్లు తదితర చోట్ల నీడ కల్పించడం, ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి ఉష్ణోగ్రతల వివరాలు ప్రదర్శించడం, ఐస్ ప్యాక్స్, ఐవీ ఫ్లూయిడ్స్, 108 సర్వీసులను అందుబాటులో ఉంచడం వంటి చర్యలు చేపట్టాలి. వడగాడ్పులుంటే ఆర్టీసీ బస్సులను మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య నడపకూడదు. వడదెబ్బకు గురైన వారి కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా వార్డులను ఏర్పాటు చేయాలి. కానీ ఇవేవీ అమలుకావడంలేదన్న విమర్శలున్నాయి. -
మూడో రోజూ భగభగ
కొత్తగూడెం: పారిశ్రామిక ప్రాంతం కొత్తగూడెంపై భానుడు ప్రతాపం చూపుతూనే ఉన్నాడు. వరుసగా మూడోరోజు 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండవేడికి తోడు మంగళవారం వడగాలులు విపరీతంగా వీయడంతో ప్రజలు అల్లాడిపోయారు. సింగరేణి కార్మిక ప్రాంతం ఖమ్మం జిల్లా కొత్తగూడెం పట్టణం, పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఎండ వేడితో భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పలువురు వృద్ధులు, కూలీలు వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డారు. మరికొంతమంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఎండదెబ్బ తగలడంతో ఈ మూడురోజులుగా ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య పెరుగుతోంది. కార్మిక ప్రాంతాలు, స్థానిక ఓపెన్‌కాస్టు గనికి అతి సమీపంలో ఉన్న ప్రజలు, కార్మిక కుటుంబాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నిత్యం వీస్తున్న వేడి గాలులు, భానుడి ప్రభావంతో ఇళ్లల్లో సైతం ఉండలేక పోతున్నారు. కార్మికుల ఇళ్లకు ఏసీలు పెట్టుకునేందుకు యాజమాన్యం అనుమతించకపోవడం, కూలర్ల గాలి ఏమాత్రం సరిపోకపోవడంతో ఉక్కపోత మధ్య కార్మిక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఓపెన్‌కాస్టు గనిలో మధ్యాహ్నం షిఫ్టుకు వెళ్లే కార్మికుల సంఖ్య విపరీతంగా తగ్గుముఖం పట్టింది. సాధారణం కంటే రెండు డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా ఉండటం, బొగ్గు పెళ్లల మధ్య ఉండటంతో వేడి మరింత ఎక్కువగా ఉండటం వల్ల విధులకు హాజరయ్యే కార్మికులు జంకుతున్నారు. ఎండదెబ్బ కారణంగా జాతీయ రహదారి మొత్తం నిర్మానుష్యంగా మారిపోయింది. మధ్యాహ్నం రోడ్లు, షాపులు ఖాళీగా దర్శనమిచ్చాయి. రోడ్లవెంట ఉండే చిరు వ్యాపారులు ఎండల కారణంగా వ్యాపారాలను మానుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో రోడ్లవెంట నీళ్లు చల్లించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
వడదెబ్బకు 869 మంది మృతి
-సర్కారుకు కలెక్టర్ల తాజా నివేదిక -ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 351 మంది మృతి -మహబూబ్‌నగర్ జిల్లాలో 144 మంది -నల్లగొండలో గతంలో పెంచి చూపిన సంఖ్యను 91కి తగ్గించిన వైనం హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వడదెబ్బకు మృతిచెందుతోన్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. జిల్లా కలెక్టర్లు పంపిన తాజా ప్రాథమిక నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఏకంగా 869 మంది వడదెబ్బకు చనిపోయారు. అందులో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 351 మంది చనిపోయారని సర్కారుకు అందజేసిన నివేదికలో వెల్లడించారు. ఆ తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాలో 144 మంది, కరీంనగర్ జిల్లాలో 115 మంది, ఆదిలాబాద్ జిల్లాలో 52 మంది, మెదక్ జిల్లాలో 48, రంగారెడ్డి జిల్లాలో 28, వరంగల్ జిల్లాలో 15, హైదరాబాద్‌లో 8 మంది చనిపోయారని నివేదికలో వివరించారు. నల్లగొండ జిల్లాలో 332 మంది చనిపోయారని గతంలో నివేదిక ఇచ్చిన అక్కడి అధికారులు తాజాగా దాన్ని 91 తగ్గించి నివేదికలో ప్రస్తావించినట్లు విపత్తు నిర్వహణశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. రాష్ట్ర చరిత్రలో ఇంతమంది వడదెబ్బకు చనిపోవడం ఇదే తొలిసారి. 2015 వేసవిలో 541 మంది వడదెబ్బకు చనిపోతే... ఇప్పుడు ఏకంగా 869 చనిపోవడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైపెచ్చు 45 నుంచి 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పరిస్థితి దారుణంగా మారింది. ఇటీవల వారం పది రోజులపాటు రాష్ట్రంలో కాస్తంత వర్షాలు కురవడం, ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల వడదెబ్బ మృతుల సంఖ్య పెరగలేదని... ఇప్పటి నుంచి జూన్ మొదటి వారం వరకు వడగాల్పుల కారణంగా మరిన్ని వడదెబ్బ మృతులు పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. త్రిసభ్య కమిటీ ప్రకారం 317... ఇదిలావుండగా కలెక్టర్ల ప్రాథమిక లెక్కలపై జిల్లాల్లోని త్రిసభ్య కమిటీలు మృతుల వివరాలపై విచారణ చేపట్టాయి. విచారణ అనంతరం 317 మరణాలు మాత్రమే వడదెబ్బతో సంభవించాయని పేర్కొనడం గమనార్హం. వడదెబ్బతో చనిపోయిన వారి సంఖ్యను త్రిసభ్య కమిటీ తక్కువ చేసి చూపిస్తోందన్న ఆరోపణలున్నాయి. కలెక్టర్లు నిర్థారించాక... త్రిసభ్య కమిటీ అందుకు విరుద్ధంగా తక్కువ చేసి చూపించడంపై విమర్శలు వస్తున్నాయి. వడదెబ్బ మృతుల సంఖ్యను తక్కువ చేసి చూపించేందుకే ప్రభుత్వం త్రిసభ్య కమిటీ పేరుతో గందరగోళం సృష్టిస్తోందని అంటున్నారు. వడదెబ్బతో చనిపోయినవారిని పోస్టుమార్టం చేయడంలేదు. కాబట్టి వడదెబ్బ మృతుల వివరాలను గుర్తించడంలో అశాస్త్రీయత నెలకొందని తెలిసింది. చర్యలు శూన్యం... రాష్ట్రం నిప్పుల కుంపటిపై కుతకుతలాడుతోంది. ప్రస్తుతం 50 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పరిస్థితి తీవ్రతపై సర్కారుకు ఎప్పటికప్పుడు నివేదికలు అందుతున్నా ప్రజలను వడదెబ్బ నుంచి కాపాడటంలో వైఫల్యం కనిపిస్తోందన్న ఆరోపణలున్నాయి. ఎండతీవ్రత నుంచి ప్రజలను కాపాడేందుకు తెలంగాణ విపత్తు నిర్వహణశాఖ వేసవి కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఆ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ఎల్ఈడీ స్క్రీన్స్ పెట్టి ఉష్ణోగ్రతల వివరాలు ప్రదర్శించాలి. ఎఫ్ఎం రేడియో ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలి. ఐస్ ప్యాక్స్, ఐవీ ఫ్లూయిడ్స్‌ను అందుబాటులో ఉంచాలి. 108 సర్వీసును అందుబాటులో ఉంచాలి. వడగాల్పులుంటే ఆర్టీసీ బస్సులను మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య నడపకూడదు. ఆరు బయట శారీరక శ్రమ చేసేవారికి తగు నీడ కల్పించాలి. ఫ్యాక్టరీల్లో ఏసీ వసతి కల్పించాలి. వడదెబ్బకు గురైనవారి కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా వార్డులను ఏర్పాటు చేయాలి. చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలు ఇతర అన్నిచోట్లా నీడ వసతి కల్పించాలి. కానీ ఇవేవీ అమలుకావడంలేదన్న విమర్శలున్నాయి. ఇటీవల కాస్తంత వర్షాలు కురవడంతో అసలు కార్యాచరణ ప్రణాళికనే అటకెక్కించారన్న విమర్శలున్నాయి. -
వడదెబ్బకు ఇద్దరి మృతి
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం కారేపల్లి క్రాస్‌రోడ్డు గ్రామంలో ఇద్దరు కార్మికులు వడదెబ్బ కారణంగా మృతి చెందారు. షేక్ మొగిలి ఆటో డ్రైవర్‌గా కాగా, ఆదివారం పగలంతా ఆటో నడిపిన అతడు రాత్రి ఇంటికి చేరుకుని వాంతులతో అస్వస్థతకు గురయ్యాడు. సోమవారం ఉదయం మృతి చెందాడు. బొమ్మల రవి ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్లగా వారం క్రితం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అప్పటి నుంచి ఇంటి పట్టునే ఉంటున్న అతడు పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం ఉదయం మృతి చెందాడు. -
వడదెబ్బకు వృద్ధుడు మృతి
ఎండ ఎక్కువగా ఉండడంతో చెట్టు కింద సేదతీరుతున్న ఓ వృద్ధుడు నిద్రలోనే ప్రాణాలు వదిలాడు. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రం గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది. గ్రామంలో వెంకటి (65) కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. గ్రామంలో ఒంటరిగానేఉంటున్న అతడు శనివారం ఎండ ఎక్కువగా ఉండడంతో ఇంటికి సమీపంలో ఓ చెట్టు కింద పడుకున్నాడు. సాయంత్రమైనా నిద్రలేవకపోయే సరికి స్థానికులు తట్టి చూడగా అప్పటికే మృతి చెందినట్టు గుర్తించారు. -
చచ్చినా లెక్కలేదు!
► వడదెబ్బ మరణాలపై ఆరోగ్యశాఖ కాకిలెక్కలు మూణ్నెళ్లలో వెయ్యిమందికిపైగా మృతి.. ► రికార్డుల్లో 30మంది మాత్రమే! ► మృతుల్లో ఉపాధి, రైతు కూలీలే అధికం ► రాష్ట్రంలోనే పాలమూరు ప్రథమస్థానం ► శాఖల మధ్య సమన్వయలోపం.. బాధితులకు శాపం మహబూబ్‌నగర్ క్రైం: ప్రచండభానుడి దెబ్బకు సామాన్యులు విలవిల్లాడిపోతున్నారు. ముఖ్యంగా కూలినాలీ పనులకు వెళ్లే, ఎండలో ఎక్కువసమయం పనిచేసేవారు పిట్టల్లారాలిపోతున్నారు. జిల్లాలో వడదెబ్బకు రోజుకు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మూణ్నెళ్ల కాలంలో జిల్లాలో సుమారు వెయ్యిమందికిపైగా చనిపోయినట్లు అంచనా.. వడదెబ్బ మరణాల్లో రాష్ట్రంలో జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. మృతుల్లో ఎక్కువమంది ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న కూలీలు, రైతులు, గొర్రెలు, మేకలు, పశువులకాపరులు, వ్యవసాయ, దినసరి కూలీలు ఉన్నారు. వీరిలో మధ్యవయస్కులే అధికం. కానీ వైద్యారోగ్య శాఖ మాత్రం మరణాలపై కాకిలెక్కలు వేసింది. ఎండల తీవ్రతకు కేవలం 30మంది మాత్రమే చనిపోయినట్లు రికార్డుల్లో పేర్కొంది. ఫలితంగా బాధిత కుటుంబాలకు న్యాయం జరగకుండాపోయింది. పోలీసు, తహసీల్దార్, వైద్యాధికారి ధ్రువీకరిస్తే వడదెబ్బ మృతులుగా పరిగణించాలని ఉన్నతాధికారుల ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. కానీ వైద్యారోగ్య శాఖ వారిని నామమాత్రంగా చూస్తూ ఏదో ఒకరోగం అంటగట్టి తమకేమీ సంబంధం లేదన్నట్లుగా తప్పించుకుంటుందనే విమర్శలు ఉన్నాయి. జిల్లా అధికారులు పంపించే నివేదికల ఆధారంగానే బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరిహారం దక్కుతుంది. ఈ నేపథ్యంలో శాఖల సమన్వయలోపం బాధితులకు శాపంగా మారింది. ఈనెల చివరి వరకు ఉష్ణోగ్రతల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉండటంతో జిల్లావాసులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. అందని పరిహారం ప్రస్తుత కరువు పరిస్థితుల్లో ఎంతోమంది పేదలు ఎర్రటి ఎండలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనులు చేస్తున్నారు. తీవ్రమైన వడగాలులు, ఉష్ణోగ్రతలకు తట్టుకోలేక వడదెబ్బతో చాలామంది చనిపోతున్నారు. అయితే బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.50వేల ఆర్థికసాయం వస్తుందనే అవగాహన లేకపోవడంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేకపోతున్నారు. తద్వా రా పరిహారం పొందలేకపోతున్నారు. జిల్లాలో వడదెబ్బతో ఇప్పటివరకు 1012మంది అంచనా. కానీ వారిలో కేవలం 30మంది మాత్రమే మరిణించినట్లు వైద్య ఆరోగ్యశాఖ నివేదిక రూపొందించింది. ఓ వైపు వడదెబ్బ ని వారణ చర్యలు తీసుకోవడంలోనూ నిర్లక్ష్యం నెలకొంది. జిల్లాలో ఆరులక్షల ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశామ ని, మరో లక్ష ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నా.. పీహెచ్‌సీల్లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని వడదెబ్బ బాధితులు చెబుతున్నారు. 30మరణాలు గుర్తించాం జిల్లాలో ఇప్పటి వరకు వడదెబ్బతో మృతిచెందిన వాళ్లను 30మందిని గుర్తించాం. జిల్లాలో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించాం... ఇటీవలే కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా దీనిపై కార్యక్రమం ఏర్పాటుచేశాం. - డాక్టర్ పార్వతి, ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ -
వడదెబ్బతో ఎనిమిది మంది మృతి
సాక్షి నెట్వర్క్ : జిల్లాలో వడదెబ్బ కారణంగా మంగళవారం ఎనిమిది మంది మృతిచెందారు. నిండ్ర వుండలం నెట్టేరి ఆదిఆంధ్రవాడకు చెందిన మునస్వామి భార్య చెంగవ్ము(56) సోమవారం ఇంటి నుంచి రోడ్డుపై నడిచి వెళుతుండగా స్పృహతప్పి పడిపోయింది. స్థానికులు ఆమెను నగరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సోమవారం రాత్రి ఆమె మృతిచెందింది. ఆరూరు గ్రామానికి చెందిన నాగతర్నవ్ము (67) వుంగళవారం వుధ్యాహ్నం పొలం నుంచి ఇంటికి వస్తుండగా కుప్పకూలిపోరుుంది. ఇంటికి తీసుకెళుతుండగా చనిపోయింది. నారాయణవనం మండలం పాలమంగళం ఉత్తరపు కండ్రిగకు చెందిన రాధాకృష్ణయ్య(56) ఎండ తీవ్రతతో నాలుగు రోజులుగా నీరసంగా ఉండి మంగళవారం మధ్యాహ్నం మృతిచెందాడు. ఇప్పన్‌తాంగాళ్ గ్రామానికి చెందిన చంద్రమ్మ(64) మంగళవారం ఉదయం వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఐరాల మండలం మెటకంపల్లె గ్రామానికి చెందిన మునార్సాహెబ్ (60) ఐస్ వ్యాపారం చేసేవాడు. సోమవారం సాయంత్రం ఇంటికి చేరుకున్న అతను అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ప్రాథమిక చికిత్స చేశారు. మంగళవారం వేకువజామున మరణించాడు. కార్వేటినగరం మండలం ఎర్రమరాజుపల్లె గ్రామానికి చెందిన గోవిందయ్య(45) మంగళవారం ఉదయం కూలి పనులకెళ్లాడు. సొమ్మసిల్లి పడిపోవడంతో స్థానికులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రామచంద్రాపురం మండలం పాతకందులవారిపల్లి పంచాయతీ ఐఏవైకాలనీకి చెందిన కె.చిన్నసామి(70) కూలి పని చేసుకుని జీవించేవాడు. రెండు రోజులుగా వాంతులు, విరేచనాలతో బాధపడుతూ కమ్మపల్లి పీహెచ్ సీలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వరదయ్యుపాళెం వుండలం పెద్దపాండూరు గ్రామానికి చెందిన గిరి(40) వుంగళవారం ఉదయుం పొలంలో దుక్కిదున్నుతుండగా వడగాల్పులకు సృ్పహ తప్పిపడిపోయూడు. సూళ్ళూరుపేటకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. -
ఆపదలో ఆపద్బంధు
► మూడేళ్లుగా అందని నిధులు ► జంట జిల్లాల్లో 419 పెండింగ్ కేసులు ► వడదెబ్బ మరణాలదీ ఇదే పరిస్థితి సాక్షి,సిటీబ్యూరో: ప్రమాదవశాత్తు కుటుంబ పెద్ద మరణిస్తే.. వారికి ఆర్థిక సాయం అందించేందుకు తలపెట్టిన ఆపద్బంధు పథకం నిధుల లేమితో తల్లడిల్లుతోంది. మూడేళ్లుగా ఈ పథకానికి పలు కుటుంబాలు అర్హత సాధించినప్పటికీ.. ప్రభుత్వం మాత్రం నిధులు విడుదల చేయలేదు. దీంతో పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాలు ఆర్థికసాయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్-రంగారెడ్డి జంట జిల్లాల్లో ఆపద్బంధు పథకం కింద 419 కుటుంబాలు ఆమోదం పొందాయి. వీటికి రూ. 2.09 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే...సర్కారు నుంచి నిధులు రాకపోవడంతో ఆయా కుటుంబాలకు ఇప్పటికీ ఆర్థికసాయం అందించలేదు. ప్రమాదాల సంఖ్య పెద్దగా ఉన్నప్పటికీ.. అందులో యంత్రాంగానికి అందిన సమాచారం మేరకు కేసులను పరిశీలించి ఆపద్బంధు కింద అర్హతను నిర్ధారిస్తున్నారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. వాస్తవానికి ఈ ప్రక్రియలో గరిష్టంగా మూడు నెలల్లోపు సదరు కుటుంబానికి లబ్ధి చేకూర్చాలి. కానీ మూడేళ్లుగా ఆర్థిక సాయం కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం నిధులివ్వలేదని అధికారులు చెబుతున్నప్పటికీ.. ప్రత్యామ్నాయ పద్ధతిలోనైనా జిల్లా యంత్రాంగం సర్దుబాటు చేస్తే ఆయా కుటుంబాలకు ఆర్థిక చేయూత దక్కేది. అయితే... నిధులను సాకుగా చూపుతూ సాయంపై అధికార యంత్రాంగం నిమ్మకుండటంతో అర్హత సాధించిన లబ్ధిదారుల్లో తీవ్ర ఆవేదన నెలకొంది. వడదెబ్బ మృతులకూ అంతే... ఈ వేసవి కాలంలో ప్రతీ రోజూ 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2015-16 సంవత్సరంలో జంట జిల్లాల్లో 15 మంది వడదెబ్బతో చనిపోయారు. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. అనధికారికంగా ఈ సంఖ్య ఎక్కువగానే ఉంది. గుర్తించిన బాధిత కుటుంబాలకు ఆపద్బంధు పథకం కింద ఆర్థిక సాయం అందేలా యంత్రాంగం ప్రతిపాదనలు చేసింది. కానీ... ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో సాయం అందలేదు. ఇదిలావుండగా.. ఇటీవల సీఎం ఆధ్వర్యంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆపద్బంధు పథకానికి సంబంధించి పెండింగ్ నిధులు విడుదల చేయాలని జంట జిల్లాల కలెక్టర్లు సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. -
వడదెబ్బతో గీతకార్మికుడి మృతి
వీణవంక మండలం కనపర్తి గ్రామంలో చెప్పాళ్ల సత్తయ్య(60) అనే గీతకార్మికుడు వడదెబ్బ తగిలి సొమ్మసిల్లి పడిపోయాడు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ప్రాణాలు విడిచాడు. -
దాహార్తితో ప్రాణాలొదిలిన లేగదూడ
విపరీతమైన ఎండలు.. తాగునీటి ఎద్దడి.. అంతటా అలుముకున్న కరువుతో మనుషులే కాదు.. మూగజీవాలు తల్లడిల్లుతున్నాయి. ఖమ్మం జిల్లా మణుగూరు మండలం సమితిసింగారం గ్రామ పంచాయతీ పీవీ కాలనీ రోడ్డు రైల్వేగేట్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఓ లేగదూడ ఎండతీవ్రత, దాహంతో ప్రాణాలొదిలింది. సింగరేణి బొగ్గు గనులు ఉండడం వల్ల ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ క్రమంలో మేతకొచ్చిన దూడ..దప్పికకు తాళలేక సమీపంలోని ఇళ్ల వద్దకు చేరుకొని అటూఇటూ తచ్చాడినా నీటి జాడ కనిపించలేదు. డ్రెయినేజీలో నీళ్లు తాగేందుకు ప్రయత్నించినా..అంతా మురుగే ఉండడంతో మింగలేక.. చివరికి ఊపిరొదిలింది. కొద్దిసేపటికే అక్కడికొచ్చిన తల్లిఆవు..దూడ శరీరాన్ని నాలుకతో నాకుతూ..తలతో ఆటూఇటూ నెట్టుతూ లేపేందుకు ప్రయత్నిస్తూ..‘తల్లి’డిల్లింది. దూపతోనే అల్లాడుతోందని అక్కడి వారు గ్రహించి బక్కెట్లో నీళ్లు పెట్టగా, ఆవు ఆతృతగా తాగడం..అప్పటికే దూడ ఊపిరొదిలిన సంఘటన..స్థానికులను కలచివేసింది. -
బయోమెట్రిక్ కోసం వెళ్లి..
- వడదెబ్బతో ఒకరి మృతి జవహర్‌నగర్ రేషన్‌షాపు వద్ద బయోమెట్రిక్ కోసం ఎండలో నిలబడిన ఓ వ్యక్తి వడదెబ్బకు గురై మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్ గిరిప్రసాద్‌నగర్‌లో బుధవారం ఈ విషాదం చోటుచేసుకుంది. వివరాలు.. గబ్బిలాలపేటలోని రేషన్ దుకాణంలో బయోమెట్రిక్ విధానం కోసం బుధవారం అధికారులు వేలిముద్రలు తీసుకున్నారు. ఈక్రమంలో గిరిప్రసాద్నగర్కు చెందిన మహమ్మద్ ఇబ్రహీం(44) ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్యూలో నిలబడి వేలిముద్రలు ఇచ్చాడు. ఇంటికి వచ్చిన అతడు మంచినీళ్లు తాగిన వెంటనే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోగానే కన్నుమూశాడు. అతడు వడదెబ్బతోనే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. -
వడదెబ్బతో వృద్ధురాలి మృతి
గార మండలం తులుగు గ్రామంలో వడదెబ్బకు బంతుపల్లి సూరమ్మ(69) అనే వృద్ధురాలు మృతిచెందింది. ఎండవేడికి తాళలేక మంగళవారం సొమ్మసిల్లి పడిపోవడంతో స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం ప్రాణాలు విడిచింది. -
వడదెబ్బతో ఇద్దరు కూలీల మృతి
సూర్యుడు రోజురోజుకూ తన ప్రతాపాన్ని చూయిస్తున్నాడు. బుధవారం ఎండవేడికి తాళలేక వడదెబ్బతో ఇద్దరు ఉపాధిహామీ కూలీలు మృతిచెందారు. కర్నూలు జిల్లా హోలగుండ మండలం వందవాగిలి గ్రామంలో దేవమ్మ(35) అనే కూలీ మృతిచెందగా..మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ మండలం జూకల్కు గ్రామంలో మాగయ్య(55) అనే కూలీ వడదెబ్బతో చనిపోయారు. -
ఏమిటీ ఘోరం
ఐదుగురి మృతి దురదృష్టకరమని వ్యాఖ్య ప్రభుత్వానికి జాతీయ హక్కుల కమిషన్ నోటీసు రెండువారాల్లోగా బదులివ్వాలని ఆదేశం మండుటెండల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఐదుగురి అకాలమృతికి కారణమైన అన్నాడీఎంకే ప్రచారసభలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ మండిపడింది. రాజకీయ ప్రయోజనాల కోసం పేదల ప్రాణాలను హరించడమా అంటూ నిలదీసింది. ఈ ఘోరాలపై రెండువారాల్లోగా వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి కమిషన్ నోటీసు జారీచేసింది. చెన్నై : అన్నాడీఎంకే అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేయడం కోసం పార్టీ అధినేత్రి జయలలిత సేలంలో బహిరంగ సభ నిర్వహించారు. సభకు హాజరైన ఇద్దరు వ్యక్తులు ఎండవేడిమి తాళలేక అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అలాగే విరుదాచలంలో నిర్వహించిన సభలో మరో ఇద్దరు, అరుప్పుకోట్లలో ఒకరు ఇలా మొత్తం ఐదుగురు మృతి చెందారు. బహిరంగ సభ ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో ఎటువంటి ప్రాథమిక సౌకర్యాలు, జాగ్రత్తలు తీసుకోలేదు. బహిరంగ సభ కోసం పిలుచుకు వచ్చిన ప్రజలను 100 డిగ్రీలకు పైగా కాలుతున్న ఎండలో సుమారు ఐదుగంటల పాటు ఉంచడం వల్లనే ప్రాణాలు కోల్పోయారని ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల ప్రచార సమయంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అన్నాడీఎంకే సభ నిర్వాహకులపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా డీఎంకే, డీఎండీకే, పీఎంకే తదితర పార్టీలు జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కమిషన్ ఈనెల 2వ తేదీన ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తర్వుల వివరాలు ఇలా ఉన్నాయి. ‘మండుటెండల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించరాదని అన్ని రాజకీయ పార్టీలను, అభ్యర్థులను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఎన్నికల సభల వద్ద తాగునీరు, ప్రాథమిక చికిత్స సదుపాయాలు, భద్రతా చర్యలు తీసుకుని ఉన్నారా అని తనిఖీ చేసిన తరువాతనే అనుమతి ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాగం సైతం తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేదని తేటతెల్లమైంది. వేసవి తీవ్రతగా ఉన్న సమయంలో సభలకు అనుమతి ఇవ్వరాదనే నిబంధన ఉన్నా అధికారులు పాటించక పోవడం దురదృష్టకరం. ప్రజల సంక్షేమం కోసం, మానవ హక్కుల ఉల్లంఘన జరుగకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే ఫిర్యాదుల్లో పేర్కొన్న ప్రకారం విరుదాచలం, సేలం, విరుదునగర్ జిల్లాల్లో జరిగిన ప్రచార సభల్లో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఐదుగురు మృత్యువాత పడిన సంఘటనలపైనా, ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా తీసుకోనున్న చర్యలపై రెండువారాల్లోగా సవివరమైన నివేదికను దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను జాతీయ మానవహక్కుల కమిషన్ ఆదేశించింది. -
ఉదయం ఎండ.. సాయంత్రం ఠండా
- నగరవాసులకు ఉపశమనం.. - రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు మరో 53 మంది మృతి సాక్షి, నెట్వర్క్/హైదరాబాద్: ఉదయమంతా ఎండ వేడిమితో సతమతమైన హైదరాబాద్‌వాసులకు సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై కురి సిన చిరుజల్లులు ఉపశమనమిచ్చాయి. విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఆవరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో మరో ఐదు రోజులపాటు నగరంలో చిరుజల్లులు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు 0.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలో వడగాడ్పులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. వడదెబ్బకు గురై మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 53 మంది మృతి చెందారు. వరంగల్ జిల్లాలో 13 మంది, ఖమ్మం జిల్లాలో 11 మంది, కరీంనగర్ జిల్లాలో 8 మంది, మహబూబ్‌నగర్‌లో ఐదుగురు, నల్లగొండ జిల్లాలో 8 మంది, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో ముగ్గురు చొప్పున, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కరు చొప్పున బలయ్యారు. రామగుండంలో 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని, ప లుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని వాతావరణశాఖ పేర్కొంది. ప్రధాన పట్టణాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ప్రాంతం ఉష్ణోగ్రత రామగుండం 45.0 నిజామాబాద్ 43.6 ఆదిలాబాద్ 43.0 భద్రాచలం 42.8 నల్లగొండ 42.6 ప్రాంతం ఉష్ణోగ్రత మెదక్ 42.5 మహబూబ్‌నగర్ 42.4 ఖమ్మం 42.2 హన్మకొండ 42.1 హైదరాబాద్ 40.4 -
వడదెబ్బతో గొర్రెల కాపరి మృతి
గొర్రెలకు కాపలాగా వెళ్లిన ఓ మహిళ వడదెబ్బకు గురై మృతి చెందింది. వైఎస్సార్ జిల్లా వీరబల్లి మండలం వంగిమళ్ల పంచాయతీ పొలిమేరపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓరంపాటి సావిత్రమ్మ(52) మంగళవారం గొర్రెలను తోలుకుని పొలానికి వెళ్లింది. ఎండతీవ్రతకు అస్వస్థతకు గురైన ఆమెను సాయంత్రం కుటుంబసభ్యులు రాయచోటి ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయింది. -
వడదెబ్బతో నలుగురి మృతి
♦ రోజురోజుకూ తీవ్ర మవుతున్న ఎండలు ♦ పనులకు వెళ్లి పిట్టల్లా రాలుతున్న జనం వడదెబ్బకు జిల్లాలో సోమవారం ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. ఉదయం నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో రోజురోజుకూ వడదెబ్బ మృతులు పెరుగుతున్నా రు. శంషాబాద్ మండలం కాచారం గ్రామానికి చెందిన తసల యాదయ్య (58), ఘట్కేసర్ మండలం ఏదులాబాద్కు చెంది న జవాజీ బాల్‌రాజు (67), మంచాల మండలం ఆరుట్లకు చెందిన లక్ష్మమ్మ (55), బషీరాబాద్ మండలం ఎక్మాయికి చెందిన సాయప్ప (55) మృతి చెందిన వారిలో ఉన్నారు. శంషాబాద్‌రూరల్/ఘట్కేసర్/మంచాల /బషీరాబాద్ : వడదెబ్బకు జిల్లాలో సోమవారం ఒక్కరోజే వేర్వేరు ప్రాంతాలకు చెందిన నలుగురు మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి.. శంషాబాద్ మండలం కాచారం గ్రామానికి చెందిన తసల యాదయ్య (58) కొన్ని రోజుల క్రితం వడదెబ్బతో అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రిలో చికిత్సలు చేయించారు. కాగా.. ఆదివారం రాత్రి పరిస్థితి విషమించడంతో తిరిగి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అదేవిధంగా ఘట్కేసర్ మండలం ఏదులాబాద్కు చెందిన జవాజీ బాల్‌రాజు (67) వ్యవసాయకూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆదివారం సాయంత్రం తనకు ఆరోగ్యం సరిగా లేదంటూ స్థానిక వైద్యుడి వద్దకు వెళ్లాడు. అతను పరీక్షలు నిర్వహించి వడదెబ్బ సోకిందని నిర్ధారించి చికిత్సలు అందించాడు. అయితే ఆదివారం రాత్రి మృతి చెందాడు. సమాచారం అందుకున్న తహ శీల్దార్ విష్ణువర్ధన్, వైద్యుడు సతీష్చందర్లు సోమవారం గ్రామానికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతుడికి భార్య, నలుగురు కొడుకులు, ఒక కుమార్తె ఉంది. మరో ఘటనలో మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన గట్ల లక్ష్మమ్మ (55) వృత్తి రీత్యా వ్యవసాయ కూలీ. ఆదివారం వడదెబ్బకు గురై అనారోగ్యానికి గురైంది. అదే రాత్రి పరిస్థితి విషమించి మృతి చెందింది. పోస్టుమార్టం అనంతరం మృతదే హాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అదే విధంగా బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామానికి చెందిన పోచమొళ్ల సాయప్ప(55) కూలీ పనులు చే స్తూ జీవనం సాగిస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం ఉపాధి పనులకు వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు తాండూరులోని ప్రభుత్వం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. సాయప్పకు భర్య వెంకటమ్మ, ఇద్దరు కుమారులున్నారు. -
వడదెబ్బతో ఇద్దరు చిన్నారుల మృతి
వడదెబ్బ కారణంగా ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలం బుద్ధారం గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో చిన్నారుల మృతదేహాలను సోమవారం గుర్తించారు. మండలంలోని లింగపల్లి గ్రామానికి చెందిన యేలాది లక్ష్మి తన ఇద్దరు పిల్లలు మధు (12), అశోక్ (8)తో కలసి బుద్ధారం గ్రామంలో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఆదివారం కాలినడకన బయల్దేరింది. వడదెబ్బతో ముగ్గురూ స్పృహ తప్పి పడిపోయారు. సోమవారం మధ్యాహ్న సమయంలో వారిని అటవీ ప్రాంతంలో గుర్తించగా... అప్పటికే మధు, అశోక్ మృతి చెంది ఉన్నారు. అపస్మారక స్థితిలో ఉన్న లక్ష్మిని చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
వడదెబ్బతో ఎనిమిది మంది మృతి
కాశిబుగ్గ : వడ గాల్పులకు, ఎండ తీవ్రతకు తట్టుకోలేక జిల్లాలో ఆదివారం తొమ్మిది మంది మృతి చెందారు. వివారాలు... వరంగల్ 16వ డివిజన్ లక్ష్మీపురానికి చెందిన జన్ను అరుణ(25) వడదెబ్బకు గురై ఆదివారం సాయంత్రం మృతి చెందింది. శనివారం కూలీకి వెళ్లి అరుణ పని చేస్తూ ఎండ వేడి తాకిడికి గురై అస్వస్థతకు గురైంది. ఆదివారం తెల్లవారు జామున కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగానే మృతి చెందింది. కరీమాబాద్ : కరీమాబాద్ దసరా రోడ్‌లోని అప్పాల రాజుకుమార్(45) ఆదివారం వడదెబ్బతో మృతి చెందాడు. చికెన్ సెంటర్ నిర్వహిస్తున్న రాజుకుమార్ ఎండ తీవ్రతను తట్టుకోలేక మృతి చెందాడు. చెన్నారావుపేట: వుండలంలోని పాత వుగ్దుం పురం గ్రావూనికి చెందిన దొనికల భద్రవ్ము (65) వంట చెరుకు కోసం బయుటికి వెళ్లింది. దీంతో వడదెబ్బకు గురై వుృతి చెందింది ఇప్పగూడెం(స్టేషన్‌ఘన్‌పూర్): మండలంలోని ఇప్పగూడెంకు చెందిన బట్టమేకల ఆగమ్మ (90) వడదెబ్బతో మృతిచెందింది. ఆమె ఆది వారం ఉదయం అస్వస్థతకు గురై రాత్రి మృతి చెందింది. నెల్లికుదురు : మండలంలోని వావిలాల గ్రా మానికి చెందిన ఎరుకొండ పరమేష్ (23) వడ దెబ్బతో మృతిచెందాడు. పరమేష్ గౌడ కుల స్తులకు కథలు చెప్పుకుంటూ జీవనం సాగి స్తుంటాడు. ఈ క్రమంలో కతలు చెప్పేందుకు వెళ్తున్న క్రమంలో ఆదివారం వడ దెబ్బకు గుైరె అస్వస్థతకు గురయ్యూడు. చికిత్స నిమిత్తం 108లో మహబూబాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. డోర్నకల్: మండలంలోని ఉయ్యాలవాడ గ్రామ పంచాయతీ పరిధిలోని దాన్యా తండాకు చెందిన కేలోతు హరి(60) వడ దెబ్బతో మృతి చెందాడు. హరి కూలీ పనికి వెళ్లి ఇంటికి వచ్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యూడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగానే మృతి చెందాడు. లింగాలఘణపురం: మండలంలోని కళ్లెం గ్రామంలో మబ్బు సిద్దయ్య (55) వడదెబ్బతో మృతి చెందాడు. సిద్దయ్య ఇంటి వద్ద ఇంకుడు గుంత తీస్తుండగా తీవ్రమైన ఎండతో అక్కడే కింద పడిపోయాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. మన్సాన్పల్లి(బచ్చన్నపేట): మండలంలోని మన్సాన్పల్లి గ్రామానికి చెందిన శాకంపల్లి మల్లారెడ్డి (75) వడదెబ్బతో మృతిచెందాడు. మల్లారెడ్డి రోజూ ఉదయం, సాయంత్రం బావి వద్దకు వెళ్లి వచ్చే వాడు. రోజూ మాదిరిగానే ఆయన ఆదివారం బావి వద్ద వెళ్లి వచ్చి అస్వస్థతకు గురి కాగా, చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకపోతుండగానే మృతి చెందాడు. -
వడదెబ్బతో 14 మంది మృతి
తుమ్మడం (నిడమనూరు) : భానుడి ప్రతానికి జనం విలవిల్లాడుతున్నారు. ఆదివారం జిల్లాలో వడదెబ్బతో 14 మంది మృత్యువాత పడ్డారు. నిడమనూరు మండలం తుమ్మడంలో పోతుగంటి మైసయ్య (58) వడదెబ్బతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం వడదెబ్బ తగులగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రో జు అర్ధరాత్రి మృతి చెందినట్లు తెలిపారు. యాదగిరి గుట్టలో ఓ మహిళ యాదగిరిగుట్ట : మండలంలోని వంగపల్లికి చెందిన కె.లక్ష్మి (59) వడదెబ్బతో వృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం తన బంధువుల ఇంటికి వెళ్లి వచ్చిన లక్ష్మి తీవ్రంగా వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైందని చెప్పారు. సాయంత్రం నిద్రలోకి జారుకున్న ఆమె ఆదివారం వేకువజామున నిద్రలోనే వృతి చెందినట్లు తెలిపారు. త్రిపురారంలో వృద్ధుడు... త్రిపురారం : మండలంలోని బాబుసాయిపేట గ్రామంలో ఆదివారం వడదెబ్బతో ఒకరు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సకినాల జానయ్య (75) ఎండి వేడిమికి మూడు రోజుల క్రితం అస్వస్థతకు గురైయ్యాడు. ఇంటి వద్ద చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జానయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. నాంపల్లిలో వృద్ధుడు... నాంపల్లి : మండల కేంద్రంలోని పూల రాములమ్మ (60) వడదెబ్బతో ఆదివారం మృతి చెందింది. రాములమ్మ ఎండ తీవ్రతతో వారం రోజుల క్రితం అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మోత్కూరులో వృద్ధురాలు... మోత్కూరు : మండల కేంద్రంలోని అన్నెపువాడ కాలనీకి చెందిన అన్నెపు బక్కమ్మ ( 55) అనే వృద్ధురాలు వడదెబ్బతో ఆదివారం సాయంత్రం మృతిచెంది. రెండు రోజుల క్రితం వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు కాలనీవాసులు తెలిపారు. మృతురాలికి కుమార్తె ఉన్నారు. వెల్లటూరులో మహిళ... వెల్లటూరు (మేళ్లచెర్వు) : మండలంలోని వెల్లటూరు పునరావాసకేంద్రంలో వడదెబ్బతో ఓ మహిళ మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కేతపల్లి యలమందమ్మ (58) అనే మహిళ కూలీ పనులు చేసుకుంటూ జీవన సాగిస్తుండగా రెండు రోజుల క్రితం వడదెబ్బతో అస్వస్థతకు గురైంది. ఆమెకు ఇంటి వద్ద చికిత్స అందిస్తుండగా శనివారం రాత్రి మృతి చెందినట్లు తెలిపారు. నూతనకల్‌లో వృద్ధుడు... నూతనకల్ : మండల పరిధిలోని పెద్ద నెమిల గ్రామంలో వడదెబ్బకు గురై పయ్యావుల వెంకటయ్య (70) ఆదివారం మృతి చెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వారం రోజుల నుంచి వీస్తున్న వడగాల్పులు, ఎండవేడిమితో వెంకటయ్య అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందాడాని చెప్పారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. అలేరులో వృద్ధుడు... ఆలేరు : మండలంలోని మధిర గ్రామం సాయిగూడెంకు చెందిన చింతకింది భూమయ్య (75) వడదెబ్బతో ఆదివారం మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో ఒంటరిగా ఉంటున్న భూమయ్య రెండు రోజులుగా పెన్షన్ కోసం ఆలేరులోని పోస్టాఫీస్ కార్యాలయం వద్దకు వెళ్లొస్తున్నాడని, ఈ క్రమం లో ఎండకు తాళలేక అస్వస్థతకు గురై ఆదివారం మృతి చెందాడని తెలిపారు. వెల్మగూడెంలో వృద్ధురాలు... వెల్మగూడెం (పెద్దవూర) : వడదెబ్బతో వృద్ధురాలు మృతి చెందిన ఘటన ఆదివారం మండలంలోని వెల్మగూడెంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పగడాల లక్ష్మమ్మ (76) శనివారం పశువులను మేపటానికి పొలానికి వెళ్లింది. తీవ్రమైన ఎండలతో అస్వస్థతకు గురైంది. సాయంత్రం ఇంటికి వచ్చిన లక్ష్మమ్మ వాంతులు, విరేచనాలు చేసుకోవడంతో స్థానిక వైద్యుని వద్ద చికిత్స చేయించారు. ఆదివా రం పరిస్థితి విషమించి మృతి చెందింది. శాలిగౌరారంలో ఒకరు... శాలిగౌరారం : వడదెబ్బతో వృద్ధుడు మృతి చెందిన ఘటన మండలంలోని ఎన్.జీ కొత్తపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. ఎన్.జీ కొత్తపల్లి గ్రామానికి చెందిన సిరుపంగి లింగయ్య (60) వడదెబ్బతో అస్వస్థతకు గురికాగా నకిరేకల్‌కు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఇంట్లో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజాపేటలో వృద్ధుడు... రాజాపేట : మండలంలోని సోమారం గ్రామంలో ఆదివారం వడదెబ్బతో ఒకరు మృతి చెందారు. గ్రామానికి చెందిన పర్స నర్సయ్య (70) ఆదివారం వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలంలో జరిగే పశువుల సంతకు వెళ్లాడు. కాగా, తిరిగివచ్చిన నర్సయ్య తీవ్ర ఆస్వస్థతకు గురై రాత్రి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మిర్యాలగూడ మేస్త్రీ... మిర్యాలగూడ అర్బన్ : వడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన ఘటన పట్టణంలోని బంగారుగడ్డలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వద్దెనిపల్లి సుబ్బారావు (68) సుతారి మేస్త్రీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఎండ వేడికి తట్టుకోలేక వడదెబ్బకు గురై చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి కుటుంబాన్ని స్థానిక కౌన్సిలర్ ఆలగడప గిరిధర్ పరామర్శించారు. సిలార్మియాగూడెంలో లారీ డ్రైవర్... తిప్పర్తి : మండలంలోని సిలార్మియాగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వడదెబ్బతో శనివారం రాత్రి మృతి చెందాడు. గ్రామానికి చెందిన బుర్రి సైదులు (37) లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. శనివారం గరిడేపల్లి మండలం వెంకటాపురం గ్రామంలోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లాడు. ఈ క్రమంలో వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురై అక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
వడదెబ్బకు నవవరుడు బలి
♦ మరో నలుగురు.. ♦ వడదెబ్బతో నవ వరుడు మృతి ♦ పెళ్లయిన వారం రోజులకే కన్నుమూత నర్సాపూర్ రూరల్: పెళ్లి అయిన వారం రోజులకే నవ వరుడు వడదెబ్బకు గురై మృతి చెందాడు. నర్సాపూర్‌కు చెందిన మహ్మద్ సాదక్ అలీ మూడో కుమారుడు మహ్మద్ ఆబేద్(26) శుక్రవారం స్థానిక సంతలో పండ్ల వ్యాపారం ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు. సాయంత్రం వాంతులు, విరేచనాలు కావడంతో కుటుంబసభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. శనివారం సైతం మరోసారి పరీక్ష చేయించారు. సాయంత్రం ఉన్నట్టుండి కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. ఆబేద్‌కు ఏప్రిల్ 22న సదాశివపేట మండలం సిద్దపూర్‌కు చెందిన నజేరాబేగంతో పెళ్లి జరిగింది. వారం రోజులకే ఆబేద్ విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యుల రోదనలు అందరిని కలచివేశాయి. -
వడదెబ్బకు ఆరుగురి మృతి
భానుడి ప్రతాపానికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ మేర కు ఎండతీవ్రత కారణంగా శనివారం జిల్లాలోని వేర్వేరు ప్రాంతా ల్లో ఆరుగురు వడదెబ్బకు గురై మృతిచెందారు. మద్దూరు : మండల కేంద్రానికి చెందిన ఇట్టబోరుున సిద్ధిరాములు (68) వడదెబ్బతో మృతి చెందాడు. ఇంటివద్ద ఉంటున్న ఆయన వడగాలులకు తీవ్ర కు గురై మృతి చెందినట్లు కుటుంబసభ్యులు చెప్పారు. గుండ్రాతిమడుగు (కురవి) : మండలంలోని గుండ్రాతిమడుగు(విలేజీ) గ్రామానికి చెందిన కుంచం వెంకటేశ్వర్లు(49) వడదెబ్బతో మృతి చెందాడు. పని నిమిత్తం బయటకు వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఇంటికి చేరుకుని మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. మడికొండ : హన్మకొండ మండలంలోని మడికొండ గ్రామానికి చెందిన కొలిశెట్టి నర్సమ్మ(64) వడదెబ్బకు గురై మృతి చెందింది. శుక్రవారం కూలీ పనులకు వెళ్లిన ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ క్రమంలో తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ములుగు : మండలంలోని కాసీందేవిపేటకు చెందిన సల్లూరి రవి (42) వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రవి శుక్రవారం ఉదయం కూలీపనికి వెళ్లాడు. అరుుతే ఎండవేడిమికి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయన స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. కాగా, పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం ములుగు సివిల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు కుటుంబసభ్యులు చెప్పారు. కరీమాబాద్ : నగరంలోని కరీమాబాద్‌కు చెందిన గుమస్తా వడికిచెర్ల రాజన్‌బాబు (52) వడదెబ్బతో మృతి చెందాడు. రాజన్‌బాబు మూడు రోజుల క్రితం తన కూతురు వివాహం చేశాడు. అరుుతే ఆ సమయంలో పెండ్లి పనుల్లో భాగంగా ఎండలో తిరగడంతో తీవ్ర అస్వస్థతకు గురై మధ్యాహ్నం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఖిలా వరంగల్ : ఖిలా వరంగల్ పరిధిలోని తూర్పుకోటకు చెందిన వ్యవసాయ కూలి మేకల కుమార్(38) వడదెబ్బతో మృతి చెందాడు. శుక్రవారం ఉదయం రోజు మాదిరిగా భార్యతో కలిసి కూలీకి వెళ్లిన ఆయన సాయంత్రం వడదెబ్బకు గురయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను ఇంటికి తీసుకొచ్చి చికిత్స చేయించారు. కాగా, శనివారం ఉదయం కుమార్ తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందాడు. -
కళ్ల ముందే కన్నుమూశాడు...
హైదరాబాద్: ఈయన సుభాష్‌నగర్ డివిజన్ పాండుబస్తీకి చెందిన అర్జున్ నాయక్.వయసు 60. భార్యతో గొడవపడి గురువారం ఇల్లు వదిలి వచ్చిన ఆయన సాయిబాబానగర్ హమీద్ బస్తీ ఉర్దూ పాఠశాల ఆవరణలో ఎండకు ఇలా సొమ్మసిల్లి పడివున్నాడు. ► శుక్రవారం ఉదయం 10.30 గంటలు. నాయక్‌ను గమనించిన స్థానికులు అతడిని లేపి మంచి నీళ్లు, కాస్తంత తిండి అందించారు. కానీ తినలేని పరిస్థితి అతనిది. ► స్థానికుల సమాచారంతో వచ్చిన 108 సిబ్బంది కొన ఊపిరితో ఉన్న అతడికి ప్రాథమిక చికిత్స అందించారు. సెలైన్ పెట్టారు. కానీ... ఫలితం శూన్యం... ప్రాణాలు గాల్లో కలసిపోయాయి. పోలీసుల సాయంతో ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతిచెందినట్టు నిర్ధారించారు. ► మండే ఎండలు... వడ గాడ్పులు... నిండు ప్రాణాలను నిలువునా బలితీసుకున్న మరో విషాదం ఇది. కట్టెలు కొట్టుకుని జీవించే ఈ శ్రమజీవి తాపానికి తట్టుకోలేక కళ్లముందే కుప్పకూలిన ఈ ఘటన అక్కడివారి హృదయాలను ద్రవింపజేసింది. - హైదరాబాద్ -
బొడ్రాయి తెచ్చిన తంటా
♦ వడదెబ్బతో యువకుడి మృతి ♦ బోనాలయ్యే వరకు మృతదేహాన్ని తేవొద్దన్న గ్రామస్తులు ♦ ఆస్పత్రిలో మృతదేహంతో 14 గంటలు బంధువుల నిరీక్షణ నల్లగొండ టౌన్: బొడ్రాయి పండుగ తెచ్చిన తంటా ఇంతా అంతా కాదు.. అనారోగ్యంతో మృతి చెందిన ఓ వ్యక్తి మృతదేహాన్ని బోనాలు పూర్తయ్యే వరకు గ్రామానికి తీసుకురావద్దని స్థానికులు చెప్పడంతో ఓ కుటుంబం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ వద్ద సుమారు 14 గంటలు నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వలపల్లికి చెందిన ఉప్పర శంకరయ్య గురువారం బొడ్రాయి పండుగ పనుల కోసం ఎండలో తిరి గాడు. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చనిపోయాడు. మృతదేహాన్ని గ్రామానికి తీసుకురావొద్దని గ్రామస్తులు హుకుం జారీ చేశారు. బొడ్రాయి పండుగను నిర్వహిస్తున్నందున ఇతర గ్రామస్తులు గ్రామానికి రారని, తమ గ్రామస్తులు కూడా గ్రామం విడిచి వెళ్లవద్దని సూచించారు. దీంతో మృతుడిని కడసారి చూసేందుకు అతడి తల్లి కూడా బయటకు రాలేని స్థితి ఏర్పడింది. మరోవైపు మృతదేహాన్ని వార్డులో ఉంచే అవకాశం లేకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది మార్చురీ ఆవరణలో ఉంచారు. మృతుడి కుటుంబ సభ్యులు గురు వారం అర్ధరాత్రి నుంచి మార్చురీ వద్ద రోదిస్తూ గ్రామస్తుల అనుమతి కోసం వేచి చూశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు పండుగ పూర్తయిందని గ్రామస్తులు చెప్పడంతో మృతదేహాన్ని అంబులెన్స్‌లో గ్రామానికి తీసుకెళ్లారు. కాగా మృతుడి సోదరి సునీత మాట్లాడుతూ ‘అన్న శంకరయ్య అర్ధరాత్రి చనిపోతే పండుగ ఉందని గ్రామానికి తీసుకురావద్దని చెప్పారు. అనారోగ్యంగా ఉన్న అమ్మ ముత్తమ్మను ఆస్పత్రికి వెళ్లొద్దన్నారు. మానసికంగా నలిగిపోయిన ఆమెకు ఏమైనా అయితే ఎవరిది బాధ్యత ’ అని ప్రశ్నించారు. -
వడదెబ్బతో 23 మంది మృతి
రోజురోజుకు ఎండలు పెరుగుతుండగా.. జిల్లా లో శుక్రవారం వడదెబ్బ కారణంగా 23 మంది మృతి చెందారు. పోచమ్మమైదాన్ : నగరంలో కొత్తవాడకు చెంది న క్యాతం లింగయ్య(85) ఆటోనగర్‌లో పనిచేస్తాడు. ఎండలు వేడిగాలులు బాగా ఉండడంతో వడదెబ్బ బారిన పడి మృతి చెందాడు. వెల్దండ(నర్మెట) : మండలంలోని వెల్దండకు చెందిన కొలిపాక రజిత(35) వ్యవసాయం భర్త తో కలిసి వ్యవసాయం చేస్తుండగా, గురువారం బావి వద్దకు వెళ్లి అస్వస్థతకు గురైంది. వెంటనే ఇంటికి తీసుకువచ్చి చికిత్స చేయించారు. అరుునా తగ్గకపోవడంతో శుక్రవారం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. నర్సంపేట రూరల్ : వుండలంలోని దాసరిపల్లికి చెందిన వుండల కొవుురవ్ము(68) ఉపాధి కూలీకి వెళ్తోంది. ఈక్రమంలో అస్వస్థతకు గురి కాగా, చికిత్స చేరుుస్తుండగా వుృతి చెందింది. ధర్మసాగర్ : గ్రామానికి చెందిన ఆవుల కొ మురమ్మ(80) వడదెబ్బకు గురైంది. ఈ మేరకు గురువారం రాత్రి తన ఇంట్లో మృతి చెందింది. కాశిబుగ్గ : వరంగల్ వివేకానంద కాలనీకి చెందిన దేవర రాజమణి-కిషోర్ కుమార్తె, ఏడో తరగతి విద్యార్థి హరిత(12) ఆడుకునే క్రమం లో గురువారం వడదెబ్బకు గురైంది. కుటుంబ సభ్యులు ఎంజీఎంలో చేర్పించగా చికిత్స పొం దుతూ శుక్రవారం ఉదయం మృతి చెందింది. ఏటూరునాగారం : మండలంలోని గుర్రెవులకు చెందిన పూజారి బుసయ్య(65) మిరప కళ్లం వద్ద కూలీకి వెళ్లాడు. అక్కడ ఎండదెబ్బకు గురైన ఆయనకు గురువారం రాత్రి వాంతులు, విరోచనాలు కాగా, శుక్రవారం మృతి చెందాడు. రాజోలు(కురవి) : రాజోలుకు చెందిన పడా ల వర్ధయ్య(50) చేను వద్దకు వెళ్తుండగా ఎండవేడితో కళ్లు తిరిగి కిందపడిపోయాడు. స్థానికు లు ఊరికి తీసుకొస్తుండగా మృతి చెందాడు. మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామ శివారు చోక్లా తండకు చెందిన గుగులోత్ సోమ్లా-భద్రి కుమా ర్తె ఐశ్వర్య(12) శుక్రవారం వడదెబ్బతో మృతి చెందింది. వారంగా ఎండ తీవ్రత వల్ల ఐశ్వర్య అస్వస్థతకు గురైన ఆమెను శుక్రవారం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. నెక్కొండ : మండల కేంద్రానికి చెందిన కొంకాల సాయిలు(66) వడదెబ్బకు గురై శుక్రవారం మృతి చెందాడు. సాయిలుకు నలుగురు కుమార్తెలు కావడంతో పెద్ద కూతురు ఉదయ తలకొరివి పెట్టింది. అలాగే, సాయిరెడ్డిపల్లికి చెందిన గునుగుంట్ల వెంకటేశ్వర్లు(45) వడదెబ్బకు గురికాగా కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం వరంగల్ తరలించగా పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందాడు. పెద్దకొర్పోలుకు చెందిన బండారి కమలమ్మ(72) వడదెబ్బకు గురై గురువారం రాత్రి మృతి చెందింది. చిట్యాల : మండలంలోని జూకల్లు గ్రామానికి చెందిన మేకల వీరస్వామి(70) వడదెబ్బకు గురై శుక్రవారం వడదెబ్బకు గురయ్యూడు. ఈ మేరకు కుటుంబ సభ్యులు చిట్యాల ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మడికొండ : హన్మకొండ మండలంలో వడదెబ్బకు ఇద్దరు మృతి చెందారు. వనమాలకనపర్తి గ్రామానికి చెందిన తంపుల రామయ్య(70), మడికొండ గ్రామానికి చెందిన బొల్లికొండ రాజు(50) శుక్రవారం మృతి చెందాడు. మద్దూరు : మండలంలోని ధూల్మిట్టకు చెంది న రైతు తుషాలపురం రాజయ్య(64) వడదెబ్బకు గురయ్యూడు. ఈ మేరకు చికిత్స పొందు తూ మృతి చెందాడు. చెన్నారావుపేట : వుండలంలోని పాపయ్యుపేటకు చెందిన ఉప్పుల భద్రవ్ము(58) వ్యవసా యు పనులకు వెళ్లి వడదెబ్బకు గురై మృతి చెం దింది. అలాగే, ఖాధర్పేట గ్రావు శివారులోని గొల్లపెల్లెకు చెందిన వజినపల్లి సుదర్శన్(60) కిరాణం సామగ్రి తెచ్చేందుకు వెళ్తూ వడదెబ్బకు గురై వుృతి చెందాడు. డోర్నకల్ : డోర్నకల్ యాదవనగర్‌కు చెంది న ఎర్రబోయిన రాములు(70) తీవ్ర ఎండలతో గురువారం అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు శుక్రవారం చికిత్స చేయించే ప్రయత్నాలు చేస్తుండగా మృతి చెందాడు. భూపాలపల్లి : భూపాలపల్లి నగర పంచాయ తీ జంగేడు శివారు కాకతీయకాలనీలో నివాసముండే వైనాల సదయ్య(50) చేపలు పెంచుకుంటూ జీవనం సాగించేవాడు. గురువారం ఉ దయం నుంచి సాయంత్రం వరకు చెరువు వద్దే ఉన్న ఆయన వడదెబ్బకు గురై మృతి చెందాడు. చింతలపల్లి(సంగెం) : మండలంలోని చింతలపల్లికి చెందిన దుడ్డె వెంకటలక్ష్మి(70) గురువారం పొలం వద్దకు వెళ్లింది. అక్కడ వడదెబ్బకు గురైన ఆమె శుక్రవారం మృతి చెందింది. పరకాల : ధర్మారానికి చెందిన గొర్ల కాపరి చిన్న సమ్మయ్య(48) గొర్లను మేపడానికి వెళ్లి అస్వస్థతకు గురయ్యూడు. ఈ మేరకు నిద్రలోనే మృతిచెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. గోపాల్‌నగర్(బచ్చన్నపేట): మండలంలోని చిన్నరామన్చర్ల శివారు గోపాల్‌నగర్‌లో గంగంరబోయిన బిక్షపతి(60) వడదెబ్బతో మృతి చెం దాడు. గురువారం కూలీకి వెళ్లిన ఆయన అస్వస్థతకు గురయ్యూడు. ఈ మేరకు శుక్రవారం ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మృతి చెందాడు. జనగామ రూరల్ : జనగామ మండలం గోపరాజుపల్లికి చెందిన వాటర్‌మెన్ పెరుమాం డ్ల కిషన్ వడదెబ్బతో మృతి చెందాడు. గొర్రెలు మేపడానికి వెళ్లి ఆయన ఎండ కారణంగా వడదెబ్బ బారిన పడ్డాడు. -
వడదెబ్బతో తెలంగాణలో 65 మంది మృతి
హైదరాబాద్: ఎండ తీవ్రతకు ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. వడదెబ్బతో రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం వడదెబ్బకు 65 మంది బలయ్యారు. నల్లగొండ జిల్లాలో 12 మంది, వరంగల్ జిల్లాలో 22 మంది, ఖమ్మం జిల్లాలో 10 మంది, మెదక్ జిల్లాలో ఒక్కరు, కరీంనగర్ జిల్లాలో ముగ్గురు, మహబూబ్‌నగర్ జిల్లాలో 11 మంది, నిజామాబాద్ , రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున వడదెబ్బతో మృతి చెందారు. -
వడ దెబ్బకు వ్యవసాయ కూలి మృతి
వడదెబ్బ తగిలి వ్యవసాయ కూలీ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గంధమల్ల చిన్నసాయిలు(49) అనే వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అలాగే గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు కూడా వెళ్లుతున్నారు. రోజువారిలాగే శుక్రవారం గ్రామంలో కూలీ పనులు చేసి మధ్యాహ్నం ఇంటికి వచ్చి నీళ్లు తాగారు. నీళ్లు తాగిన వెంటనే అవస్థకు గురై అక్కడిక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య ఎల్లమ్మ, ఒక కుమారుడు ఉన్నారు. -
వడదెబ్బకు ఇద్దరు మృత్యువాత
వరంగల్ జిల్లాలో వడెదెబ్బ కారణంగా శుక్రవారం ఇద్దరు మృతి చెందారు. నర్మెట్ట మండలం వెల్దండ గ్రామానికి చెందిన కొలిపాక రజిత (35) గురువారం కూలీ పనులకు వెళ్లి అస్వస్థతకు గురైంది. వాంతులు అవుతుండడంతో స్థానికంగానే వైద్య చికిత్స ఇప్పించారు. పరిస్థితి విషమించడంతో ఆమె శుక్రవారం మృతి చెందింది. ఆమెకు భర్త సత్తయ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మరో ఘటనలో ఏటూరు నాగారం మండలం గూడరేవుల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ బూషయ్యగౌడ్ వడదెబ్బకు గురై శుక్రవారం మృతి చెందాడు. -
వడదెబ్బతో జీడి రైతు మృతి
విజయనగరం జిల్లాలో వడదెబ్బ కారణంగా శుక్రవారం ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. గుమ్మలక్ష్మీపురం మండలం ఇరిడి గ్రామంలో కోలక భీమారావు (58) శుక్రవారం జీడి తోటకు వెళ్లి మధ్యాహ్న సమయంలో ఇంటికి తిరిగి వచ్చాడు. కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతడు ప్రాణాలు విడిచాడు. -
వడదెబ్బకు వ్యవసాయ కూలీ మృతి
వడదెబ్బకు గురై వ్యవసాయ కూలీ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఎరోల్ల రాములు(47) అనే వ్యక్తి గ్రామంలో తన వ్యవసాయ పనులు చూసుకుంటూ ఆదే గ్రామానికి చెందిన లకా్ష్మరెడ్డి దగ్గర పాలేరుగా పనిచేస్తున్నారు. అయితే బుధవారం ఉదయం వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లారు. ఎండ తీవ్రత వల్ల వడదెబ్బకు గురయ్యారు. సాయంత్రం కుటుంబ సభ్యులు గ్రామంలో ఉన్నా ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. కాగా గురువారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతినికి భార్య నాగమణి, కొడుకు, కుతూరు ఉన్నారు. -
ఎండకు తాళలేక..
మండుతున్న ఉష్ణోగ్రతలు.. వడ గాలులకు జనం పిట్టల్లా రాలుతున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అమ్దాపూర్ గ్రామానికి చెందిన సత్తమ్మ(60) వడదెబ్బకు మృతి చెందింది. బుధవారం వేడికి తాళలేక స్పృహ కోల్పోయిన ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. మార్గమధ్యంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. మరో వైపు ఎండలకు వన్యప్రాణులు సైతం అల్లాడుతున్నాయి. దుర్గి మండలం ఓబులేశుపురం గ్రామ సమీపంలో ఎండలకు ఓ దుప్పి ప్రాణాలు విడిచింది. ఇది గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. -
కుటుంబం కోసం కూలీ పనులకు వెళ్లి..
వేసవి సెలవుల్లో తమ పేద కుటుంబానికి ఆసరా ఉందామని కూలీ పనులకు వెళ్లిన 13 ఏళ్ల బాలిక వడదెబ్బకు గురై ప్రాణాలు విడిచింది. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి గ్రామంలో జరిగిన ఈ విషాధ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తెల్లం ఆదిలక్ష్మి ఏడవ తరగతి పరీక్షలు ఇటీవలే రాసింది. వేసవి సెలవులు కావడంతో కుటంబ పోషణకు తన వంతు సాయంగా పొగాకు కట్టే పనులకు ఆదివారం వెళ్లింది. ఎండలు బాగా ఉండడంతో వడదెబ్బకు గురై అదే రోజు అస్వస్థతకు గురైంది. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి మృతి చెందింది. -
వడదెబ్బతో 17మంది మృతి
పెద్దపంజాణి/శ్రీకాళహస్తి టౌన్/గంగవరం/కార్వేటినగరం/పెనుమూరు/గంగాధరనెల్లూరు/ఏర్పేడు/చంద్రగిరి/బంగారుపాళెం/ఐరాల / ఓటేరు(తిరుపతి రూరల్)/కేకే పేట(కల్లూరు): జిల్లాలో వడదెబ్బ కారణంగా మంగళవారం 17 మంది మృతి చెందారు. పెద్దపంజాణి మండలం ఆకులవారిపల్లె గ్రామానికి చెందిన శ్రీరామయ్య(38) పొలం పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి చేరుకోగానే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపు మృతి చెందాడు. బసవరాజకండ్రిగ గ్రామానికి చెందిన సమ్మక్క(70) ఎండతీవ్రతకు తట్టుకోలేక ఇంట్లోనే మృతి చెందింది. ఒంటిళ్లుకు చెందిన గోవిందప్ప కుమారుడు సుబ్రమణ్యం(43) పొలం పనులు చేస్తూ కుప్పకూలిపోయాడు. సహచరులు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లే లోపు మృతి చెందాడు. శ్రీకాళహస్తి పట్టణం బీపీ అగ్రహరం రెవెన్యూ కాలనీకి చెందినధనయ్యు(75) ఎండల తీవ్రతకు పది రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. సోవువారం వాంతులు, విరేచనాలు కావడంతో ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. వుంగళవారం పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో వుృతి చెందాడు. వీఎం పల్లికి చెందిన కె.చలపతి(50) సోవువారం భవన నిర్మాణ పనులకు వెళ్లాడు. రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఏరియూ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. గంగవరం మండలం వంటిండ్ల గ్రామానికి చెందిన సుబ్రమణ్యం(45) మంగళవారం పది గంటలకు పొలంలో పనులు చేస్తుండగా కుప్పకూలిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించేలోపు మరణించాడు. కార్వేటినగరం త్యాగరాజుపిళ్ళై వీధికి చెందిన సుబ్రమణ్యంరెడ్డి కుమారుడు దామోదరం(40) కూలి పనులకు వెళ్లి ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి తీసుకెళుతుండగా మృతిచెందాడు. పెనుమూరు గ్రామసేవత ముత్యాలమ్మ ఆలయ అర్చకులు పార్థసారథి(75) సోమవారం రాత్రి వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురయ్యాడు. పెనుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చికిత్స చేసేలోపు మృతి చెందాడు. గంగాధరనెల్లూరు మండలం వేల్కూరు గ్రామానికి చెందిన కుప్పిరెడ్డి భార్య రాజమ్మ(68) పొలం పనులకెళ్లి సొమ్మసిల్లిపడి పోయింది. ఆస్పత్రికి తీసుకెళుతుండగా మృతి చెందింది. వైఎస్సార్సీపీ నేత తిమ్మిరెడ్డిపల్లి రామచంద్రారెడ్డి (67) ఎండ తీవ్రతకు తట్టుకోలేక మృతిచెందారు. కాంగ్రెస్ హయాంలో గంగాధరనెల్లూరు సింగిల్‌విండో డెరైక్టర్‌గా పనిచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఏర్పేడు మండలం పాయిల్సెంటర్ ఎస్టీకాలనీకి చెందిన బత్తెవ్ము(67) ఎండతీవ్రతకు అస్వస్థతకు గురైంది. ఆస్పత్రికి తీసుకెళుతుండగా మృతిచెందింది. చంద్రగిరి జెండామాను వీధిలో కాపురముంటున్న యూసఫ్ భార్య ఉసూద్ బేగం (70) ఎండ తీవ్రత తట్టుకోలేక ఉదయం అస్వస్థతకు గురైంది. ఆస్పత్రికి తీసుకె ళ్లేలోపు మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. బంగారుపాళెం మండలం బోడబండ్ల గ్రామానికి చెందిన పి.వెంకటాద్రిబోయుడు(63) మడికోత పనులు చేపడుతుండగా ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన ద్విచక్ర వాహనంలో బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళుతుండగా మృతిచెందాడు. పులిచెర్ల మండలం ఎల్లంకివారిపల్లె(కేకేపేట) మసీదు వీధికి చెందిన ఎస్.నవాబ్‌జాన్(53) ఎండ తీవ్రతకు మంగళవారం రాత్రి స్పృహతప్పి పడిపోయాడు. ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీ ఓటేరుకు చెందిన పి.దొరస్వామినాయుడు(70) తిరుపతి వ్యవసాయ మార్కెట్లో కూలీగా పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం వడదెబ్బకు గురయ్యాడు. వాంతులు, విరేచనలు, యూరిన్‌లో రక్తం పడడంతో రుయా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. ఐరాల మండలం పైపల్లె పంచాయతీ జంగాలపల్లె గ్రామానికి చెందిన సి.కుమారి(42) సోమవారం పొలం పను లు చేసి అస్వస్థతకు గురైంది. మంగళవారం వేకువజామున రెండు గంట లకు మరణించింది. వేదగిరివారిపల్లె పంచాయతీ గుట్టపాళ్యం గ్రామానికి చెందిన శివశంకర్ నాయుడు (50) పొలానికి వెళ్లి తిరిగి వచ్చి అస్వస్థతకు గురయ్యాడు. ప్రథమ చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
ఠారెత్తిస్తున్న ఎండలకు పిట్టల్లా రాలిన జనం
♦ వడదెబ్బకు ఒకే రోజు 8 మంది బలి ♦ మరో ఘటనలో ప్రహరీ కూలి ఒకరు, ♦ ఇసుకదిబ్బ కూలి మరొకరు.. ♦ రోడ్డు ప్రమాదంలో ఇంకొకరు మృతి ♦ విలవిల్లాడిన మెతుకుసీమ జిల్లాలో మరణమృదంగం మోగింది. మంగళవారం ఒక్కరోజే వివిధ కారణాలతో మొత్తం 11 మంది ప్రాణాలు విడిచారు. వడదెబ్బకు ఏకంగా ఎనిమిది మంది పిట్టల్లా రాలారు. ఇసుక దిబ్బ కూలి ఒకరు, ప్రహరీ కూలి మరొకరు చనిపోగా రోడ్డు ప్రమాదంలో పంచాయతీ కార్మికుడు దుర్మరణం చెందాడు. మెదక్, రామాయంపేట, శివ్వంపేట, చేగుంట, మనూరు, కోహీర్, సిద్దిపేట, కొండపాక మండలాల్లో వడదెబ్బ బారిన పడిన ఎనిమిది మంది నేలకొరి గారు. ఇసుక దిబ్బకూలడంతో చిన్నశంకరంపేట మండలం సూరారంలో భిక్షపతి (27) అనే కూలీ దుర్మరణం చెందాడు. ప్రహరీ కూలడంతో తూప్రాన్ మండలం రామాయిపల్లిలో దాచారం నరేష్(23) అనే కార్మికుడు ప్రాణాలు విడిచాడు. రోడ్డు ప్రమాదంలో కంగ్టి మండలం భీంరాకు చెందిన పంచాయతీ కార్మికుడు పెంటాగౌడ్(35) మరణించాడు. వడదెబ్బకు 8మంది మృతి జిల్లాలో వడదెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. మంగళవారం ఒక్కరోజే 8 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మెదక్, రామాయంపేట, శివ్వంపేట, చేగుంట, మనూరు, కోహీర్, సిద్దిపేట, కొండపాక మండలాల్లో ఒక్కొక్కరు మరణించారు. ఆర్ వెంకటాపూర్‌లో.. రామాయంపేట: ఆర్ వెంకటాపూర్‌లో బోళ్ల నర్సింలు (42) అనే వ్యక్తి వడదెబ్బకు గురై మంగళవారం తెల్లవారు జామున మృతి చెందాడు. పాత ఇళ్లు మరమ్మతు చేసుకుంటూ నర్సింలు తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వారం రోజులుగా ఎండలో పనిచేయడంతో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం రామాయంపేట ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో మృతి చెందాడు. నర్సింలుకు భార్య పద్మ, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. గోల్కొండ వీధిలో.. మెదక్: పట్టణంలోని గోల్కొండ వీధికి చెందిన కర్నిం గొల్ల రాజు (28) వడదెబ్బకు గురై మృతి చెందాడు. కూలీపని చేస్తూ జీవనం సాగిస్తుం టాడు. మూడురోజుల క్రితం వడదెబ్బకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఉపాధి కూలీ.. శివ్వంపేట: నవాబుపేట గ్రామంలో ఉపాధి కూలి చింతాల లక్ష్మి(40) వడదెబ్బతో మృతి చెందింది. సోమవారం ఎప్పటిలాగే గ్రామ శివారులో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు వెళ్లి ఇంటికి వచ్చింది. సాయంత్రం అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. వృద్ధుడు బలి.. మనూరు: రాణాపూర్లో గడ్డమీద నాగన్న (68) వడదెబ్బతో మృతి చెందాడు. సోమవారం పశువులను మేపి ఇంటికి వచ్చి రాత్రి నిద్రపోయాడు. మంగళవారం వేకువజామునా అస్వస్థతకు గురై మరణించాడు. ఇతనకి భార్య నర్స మ్మ, 5గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బిలాల్పూర్లో రైతు.. కోహీర్: పొలం వద్ద పని చేస్తూ వడదెబ్బకు గురై రైతు మృతి చెందాడు. బిలాల్పూర్ గ్రామా నికి చెందిన రైతు నర్సింలు (50) పొంలోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అపస్మారకస్థితిలో ఉన్న నర్సింలును ఆటోలో చికిత్స నిమిత్తం కోహీర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే చని పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నర్సింలుకు భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. నార్సింగిలో మహిళ.. చేగుంట: నార్సింగిలో అంబటి ఆగవ్వ (65) వడదెబ్బతో మృతి చెందింది. వీఆర్వో గణేష్ గ్రామానికి చేరుకొని పంచనామా నిర్వహించి నివేదికను ఉన్నతాధికారులకు పంపారు. వ్యవసాయ కూలీ.. చిన్నకోడూరు: గాడిచర్లపల్లిలో గాంధారి బా లయ్య (55) వడదెబ్బతో మృత్యువాత ప డ్డారు. పొలంలో పనులు చేస్తూ కుప్పకూలి పోయారు. వెంటనే కుటుంబసభ్యులు సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొం దుతూ మృతి చెందాడు. మృతునికి భార్య కనకవ్వ, ఇద్దరు కుమారులు, కూతుర్లు ఉన్నారు. చికిత్స పొందుతూ.. కొండపాక: వడదెబ్బకు గురై సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. వివరాలు ఇలా.. కొండపాక మండలం సిర్సనగండ్ల గ్రామానికి చెందిన హుస్సేన్(66) సైకిల్‌పై ఊరూరా ఐస్‌క్రీంలు విక్రయిస్తుంటాడు. సోమవారం ఐస్‌క్రీంలు, సమోసాలు అమ్మి మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నాడు. అస్వస్థతకు గురికావడంతో సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య సుల్తాన్‌బీ, కూతురు, కుమారుడు ఉన్నారు. -
కర్నూల్ జిల్లాలో వడదెబ్బకు ఇద్దరు మృతి
వడదెబ్బ తగిలి ఇద్దరు మృత్యవాత పడిన సంఘటన కర్నూల్ జిల్లాలో మంగళవారం జరిగింది. కోడుమూరు మండలంలోని మూడుమూల గ్రామంలో మహబూబ్ బాష (15) పశువులకు నీళ్లు తాపడానికి వెళ్ళి వడదెబ్బ తగిలి చనిపోయాడు. మరో ఘటనలో గోనెగండ్ల మండలం కురిమాల గ్రామంలో చాకలి వెంకటేశ్వర్లు పొలంలోని వరిగడ్డిని తరలిస్తుండగా వడదెబ్బ తగిలి కుప్పకూలిపోయాడు. ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. -
వడదెబ్బతో 13 మంది మృతి
ఉదయం ఏడు దాటుతుండగానే నడినెత్తిపైకి వస్తున్న సూర్యుడు, మండుతున్న ఎండలు.. ఫలితంగా వడగాలులు తీవ్రమవుతున్నాయి. దీంతో వేడి గాలులు తట్టుకోలేక మృతి చెందుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ మేరకు సోమవారం వడదెబ్బ కారణంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 13 మంది మృతి చెందారు. మడికొండ : గ్రేటర్ వరంగల్ 34వ డివిజన్లోని బాలజీనగర్కు చెందిన దేవర మణేమ్మ (60) ఆదివారం పని కి వెళ్లింది. సోమవారం ఉదయం తర్వాత వడదెబ్బ కారణంగా ఆమె మృతి చెందింది. మృతురాలికి భర్త, కుమార్తె ఉన్నట్లు తెలిపారు. కాజీపేట : కాజీపేటలో వడదెబ్బ కారణంగా ఇద్దరు మహిళలు మృతి చెందారు. వడదెబ్బతో అస్వస్థతకు గురై తిలక్‌నగర్‌కు చెందిన గొర్రె దర్గమ్మ(52), బాలాజీనగర్ చెందిన దేవర మీనమ్మ(65) మరణించారు. కరీమాబాద్ : వరంగల్ కరీమాబాద్ ప్రాంతానికి చెందిన వృద్ధురాలు పిట్ట పుల్లమ్మ(80) వడదెబ్బతో తీవ్ర అస్వస్తతకు గురై సోమవారం మధ్యాహ్నం మృతి చెందింది. కేసముద్రం : ఇనుగుర్తికి చెందిన లింగాడపు వెంకన్న(35) కొద్దిరోజులుగా రేకుల షెడ్డులో ఉంటున్నాడు. ఎండతీవ్రత ఎక్కువ కావడంతో వడదెబ్బకు గురయ్యాడు. ఆదివారం రాత్రి ఇంటి వద్ద మృతి చెందాడు. చేర్యాల : వేచరేణికి చెందిన మాదాసు చంద్రమ్మ(60) రోజు వారిలాగే వ్యవసాయ కూలీగా వెళ్తున్న క్రమంలో వడదెబ్బ తగిలింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన చంద్రమ్మ మృతి చెందింది. నాగిరెడ్డిపల్లి(బచ్చన్నపేట) : మండలంలోని నాగిరెడ్డిపల్లిలో దేవరాయ కనుకయ్య(35) ఆదివారం వ్యవసాయ బావి వద్దకు పనుల నిమిత్తం వెళ్లాడు. రాత్రి వేళ ఇంటికి వచ్చి అనారోగ్యంగా ఉందని అన్నం తినకుండానే పడుకున్నాడు. ఉదయం ఆటోలో జనగామ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గ మధ్యలో మృతి చెందాడు. నర్సింహులపేట: మండలంలోని బీరిశెట్టిగూడెంలో సూరబోయిన కిష్టయ్య(65) వడదెబ్బకు మృతి చెందాడు. ఎండ వేడిమి తీవ్ర అస్వస్తతకు గురైన కిష్టయ్య స్థానికంగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మహబూబాబాద్ : మానుకోట పట్టణంలోని కంకరబోడ్డు ప్రాంతానికి చెందిన రిటైర్డ్ సీఐ శేర్ వెంగళయ్య(85) వడదెబ్బతో సోమవారం మృతి చెందాడు. దేశాయిపల్లి(దుగ్గొండి) : మండలంలోని దేశాయిపల్లికి చెందిన కానుగుల అయిలయ్య(65) ఇంటి వద్ద రేకులషెడ్డులో నివసిస్తున్నాడు. ఇదే క్రమంలో ఆదివారం అనారోగ్యానికి గురయ్యాడు. రాత్రంతా ఇంటి వద్ద చికిత్స అనంతరం ఉదయం వరంగల్‌కు తరలిస్తుండగా మృతి చెందాడు. జనగామ రూరల్ : జనగామ మండలంలోని ఎల్లంల గ్రామానికి చెందిన బక్క భాస్కర్(30) జనగామలో ట్రాక్టర్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం వడదెబ్బకు గురయ్యాడు. ఇంటి వద్ద వైద్య చికిత్సలు చేయించుకున్నప్పటికీ పరిస్థితి తగ్గుముఖం పట్టలేదు. సోమవారం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించిన కొద్దిసేపటికే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి గత ఏడాదే వివాహమైంది. స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : మండల కేంద్రానికి చెందిన గట్టు మైసయ్య(65) స్థానికంగా హమాలీ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రోజూ మాదిరిగానే ఆదివారం పనికి వెళ్లిన అతడు రాత్రి ఇంటికి వచ్చి దాహంగా ఉందని నీరు తాగి ఒక్కసారిగా కుర్చీలో కుప్పకూలాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. ఏటూరునాగారం : మండలంలోని ముల్లకట్టకు చెందిన గడిగ సమ్మక్క (75) పొలం పనుల కోసం ఎండలో తిరగడంతో ఆదివారం రాత్రి వడదెబ్బ తాకింది. ఆమె అపస్మార్థక స్థితికి చేరుకొని సోమవారం వేకువజామున మృతి చెందింది -
వడదెబ్బకు కుప్పకూలిన విద్యార్థి
పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో ఓ యువకుడు వడదెబ్బకు కుప్పకూలిపోయాడు. ద్వారకా తిరుమలకు చెందిన కనికిచర్ల మణికంఠ (20) స్థానికంగా కూల్‌డ్రింక్ షాపు నడుపుతున్న తల్లి లక్ష్మికి సాయంగా ఉంటూనే ప్రైవేటుగా డిగ్రీ చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్ తెచ్చుకుందామని సోమవారం భీమడోలులోని తన కళాశాలకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో భీమడోలు జంక్షన్లో బస్సు కోసం వేచి ఉండగా... ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు గమనించి అతని వద్దనున్న సమాచారం ఆధారంగా తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పారు. లక్ష్మి భర్త రెండేళ్ల క్రితం మరణించాడు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉండగా మణికంఠ పెద్దవాడు. -
వడదెబ్బతో వ్యక్తి మృతి
కరీంనగర్ జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో వడదెబ్బ కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. 43వ డివిజన్ పరిధిలోని అల్లూరు గ్రామానికి చెందిన బాదే చిన్న ఎల్లయ్య (60) పనుల కోసం ఆదివారం బయటకు వెళ్లాడు. ఎండ కారణంగా అస్వస్థత పాలయ్యాడు. అర్ధరాత్రి ఇంట్లో మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
వడదెబ్బకు ఇద్దరి మృతి
ఖమ్మం: ఎండల తీవ్రతకు ఖమ్మం జిల్లాలో సోమవారం ఇద్దరు మృతిచెందారు. ఎర్రుపాలెం మండలం జమలాపురం మండలం గ్రామానికి చెందిన కోట భూషణం(62) సోమవారం వ్యవసాయ పనులకు వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయాడు. అలాగే, మధిర మండలం మునగాల గ్రామానికి చెందిన కోట రాంబాబు(21) అనే వికలాంగుడు కూడా మృత్యువాతపడ్డాడు. ఎండలు ఎక్కువగా ఉన్నందు వల్ల మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దని డాక్టర్లు సలహా సూచిస్తున్నారు. -
అగ్నిగుండంగా ఏపీ
సాక్షి, హైదరాబాద్: మండుతున్న ఎండలతో ఆంధ్రప్రదేశ్ అగ్ని గుండాన్ని తలపించింది. ఉష్ణోగ్రతలతోపాటు వడగాడ్పుల తీవ్రత కూడా పెరుగుతుండటంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఆదివారం తిరుపతిలో 45.7 డిగ్రీల సెల్సియస్‌తో కొత్త రికార్డు నమోదైంది. ఈ ఏడాది వేసవిలో ఏపీ వ్యాప్తంగా ఇప్పటికే వడదెబ్బ మరణాల సంఖ్య 500 దాటిపోయిందని అనధికార వర్గాల అంచనా. అయినా ప్రభుత్వం వడదెబ్బ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు తీసుకోవడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. చలివేంద్రాల ఏర్పాటు చేసి మజ్జిగ అందించేందుకు జిల్లాకు మూడు కోట్లు చొప్పున 36 కోట్లు తక్షణమే విడుదల చేస్తామని మంత్రివర్గం ప్రకటించి వారం రోజులైనా ఇప్పటికీ నిధులు విడుదల చేయకపోడం పట్ల జిల్లాల్లో అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక మరింత సెగలు.. వచ్చే మూడు రోజులు కోస్తా లోని తొమ్మిది జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం రాత్రి వెబ్సైట్లో ప్రకటించింది. ప్రముఖ వేసవి విడిది కేంద్రం, ఆంధ్రా ఊటీగా పేరొందిన చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్ నిప్పుల కుంపటిలామారింది. సముద్ర మట్టానికి 4,312 అడుగుల ఎత్తులో ఉండే ఈ కొండపై ఆదివారం ఉష్ణోగ్రత 37 డిగ్రీలకు చేరుకోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వడదెబ్బకు 68 మంది మృతి భానుడి ప్రతాపంతో వడదెబ్బ బారిన పడి వివిధ జిల్లాల్లో ఆదివారం 68మంది మృత్యువాత పడ్డారు. ప్రకాశం,శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో 13 మంది చొప్పున, చిత్తూరు జిల్లాలో 11 మంది, విశాఖ జిల్లాలో ఏడుగురు, అనంతపురం జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాలో ఐదుగురు, వైఎస్సార్ జిల్లాలో నలుగురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు, పశ్చిమగోదావరి జిల్లాలో ముగ్గురు, తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతిచెందారు. -
సండే కూడా మండేశాడు..
► వడదెబ్బకు 48 మంది మృత్యువాత.. హైదరాబాద్‌లో నవ వరుడు కూడా.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ ఉధృతమవుతూనే ఉంది. మే నెల రాకముందే ఆస్థాయి ఎండలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం తెలిపిన ప్రకారం.. రాష్ట్రంలో ఐదు చోట్ల 47 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల, కోదాడ మండలం తొగర్రి, మెట్పల్లి మండలం పెద్దవేడ, ఖమ్మం జిల్లా వైరా, వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలం కోమలవంచల్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అలాగే ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చోడులో 46.11, ముదిగొండ మండలం పమ్మిలో 46.58, బాణాపురంలో 46.96, బూర్గుంపాడులో 46.83, వేంసూరులో 46.15, నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్ మండలం చీదెళ్లలో 46.48, మేళ్లచెరువు మండలం దొండపాడులో 46.21, పెద్దవూర మండలం పులిచెర్లలో 46.67 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ నివేదిక ప్రకారం నల్లగొండలో 45.2, రామగుండం, ఖమ్మంలలో 45 చొప్పున అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలంలో 44.2 డిగ్రీలు, హైదరాబాద్‌లో 42.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో తీవ్రంగా వీస్తున్న వడగాడ్పులు, రాత్రి 10 గంటలైనా కొనసాగుతున్నాయి. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరికొన్ని రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. 48 మంది మృతి.. వివిధ జిల్లాల్లో వడదెబ్బతో 48 మంది మృతి చెందారు. కరీంనగర్ జిల్లాలో 14 మంది, నల్లగొండ జిల్లాలో 12 మంది, వరంగల్ జిల్లాలో 11 మంది, ఖమ్మం జిల్లాలో నలుగురు, మెదక్ జిల్లాలో ముగ్గురు, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున వడదెబ్బకు బలయ్యారు. హైదరాబాద్‌లో ముగ్గురు మృతి చెందారు. వీరిలో చంపాపేటకు చెందిన కాచీపురం రాఘవేంద్ర(34) అనే నవ వరుడు కూడా ఉన్నాడు. వడదెబ్బ చావులన్నీ ప్రభుత్వ హత్యలే: నారాయణ వడదెబ్బ చావులన్నీ ప్రభుత్వ హత్యలేనని సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ ఆరోపించారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రజలు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య పార్కు వద్ద వడదెబ్బ నివారణకుగాను హోమియోపతి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ, వడదెబ్బతో చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
భానుడి ప్రతాపం: వడదెబ్బతో 71 గొర్రెల మృతి
చేవెళ్ల రూరల్ (రంగారెడ్డి): తీవ్రమైన ఎండలతో బీభత్సం సృష్టిస్తోన్న భానుడు మనుషులతోపాటు జంతువుల ప్రాణాలనూ హరించుకుపోతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బ మృతుల సంఖ్య 100కు చేరువవుతున్న తరుణంలో వడదెబ్బకు గురై 71 మూగజీవాలు ఒకేసారి మృత్యువాత పడ్డాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్‌లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామానికి చెందిన ఆంజనేయులు, బురాన్, కిష్టయ్య ఏడాది క్రితం ఖానాపూర్‌కు వలస వచ్చారు. మొదట్లో కూలీపని చేసిన వీరు అప్పు చేసి గొర్రెలను కొనుగోలు చేసి వాటిని సాకుతున్నారు. ఆంజనేయులు వద్ద 300 జీవాలు, బురాన్‌వద్ద 400, కిష్టయ్య వద్ద 300 గొర్రెలున్నాయి. నిత్యం వీటిని మేత కోసం పొలాల్లో తిప్పుతున్నారు. ఇటీవల తీవ్ర ఎండల ప్రభావానికి జీవాలు అస్వస్థతకు గురయ్యాయి. వీటికి సరిగా నీళ్లు కూడా దొరకడం లేదు. ఆదివారం ఉదయం మేత కోసం గొర్రెలను తోలుకెళ్లిన కాపరులు మధ్యాహ్నం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో జీవాలు ఒక్కొక్కటిగా పడిపోసాగాయి. దీంతో వాటిని నీడకు చేర్చారు. కొద్దిసేపట్లోనే ముగ్గురు కాపరులకు చెందిన 71 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. రూ. 4 లక్షల నష్టం జరిగిందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని కాపరులు వేడుకొంటున్నారు. -
వడదెబ్బకు ఉద్యోగి మృతి
భానుడి ప్రతాపానికి జనం పిట్టల్లా రాలుతున్నారు. తాజాగా.. చంపాపేట రెడ్డిబస్తీకి చెందిన ఓ యువకుడు వడదెబ్బ కారణంగా మృతి చెందాడు. బీమ్నెట్ బంజారాహిల్స్ కార్యాలయంలో టీమ్హెడ్గా పనిచేస్తున్న కాశీపురం రాఘవేంద్రరావు (34) శనివారం ఎండలో బంజారాహిల్స్‌లోని కార్యాలయానికి వెళ్లాడు. కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో కార్యాలయంలో సిబ్బంది కొబ్బరి బోండా నీరు ఇచ్చి తిరిగి ఇంటికి పంపించేశారు. అర్ధరాత్రి అపస్మారక స్థితికిలోకి వెళ్లిన రాఘవేంద్రరావును కుటుంబ సభ్యులు మొదట స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం అక్కడి నుంచి మలక్‌పేట యశోద ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు ఆదివారం మృతి చెందాడు. రాఘవేంద్ర వివాహం జరిగి నెల రోజులు అయినట్లు సమాచారం. దీంతో మృతుడి కుటుంబంలో విషాదం నెలకొంది. -
దండేపల్లిలో వడదెబ్బకు ఇద్దరి మృతి
అదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలో వడదెబ్బకు ఇద్దరు మృతిచెందారు. మండల కేంద్రానికి చెందిన పొదిల పున్నమ్మ(55) వడగాల్పుల ధాటికి అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతిచెందింది. ఇదే మండలంలోని వెలగనూరు గ్రామానికి చెందిన మానం రాయబోసు(60) వడదెబ్బకు గురై స్పృహ కోల్పోయాడు. కుటుంబ సభ్యులు గుర్తించి ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందాడు. -
వడదెబ్బతో ఆరుగురి మృతి
♦ ఒకే రోజు ఆరుగురు మృత్యువాత ♦ వేర్వేరు చోట్ల ఘటనలు ♦ భానుడు ప్రతాపానికి జనం విలవిల ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. భానుడి ప్రతాపానికి జనం విలవిల్లాడుతున్నారు. శనివారం గరిష్టంగా 44.3 ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో జిల్లాలో ఒక్క రోజే ఆరుగురు మృత్యువాత పడ్డారు. వడగాడ్పులు వీస్తుండటంతో వృద్ధులు, చిన్నారులు హడలెత్తిపోతున్నారు. ఉదయం 8 గంటలకే ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో జనం బయటికి రావడానికి జంకుతున్నారు. పెద్దగుండవెళ్లిలో వృద్ధుడు.. దుబ్బాక: వడదెబ్బతో 80 ఏళ్ల వృద్ధుడు మరణించిన సంఘటన మండలంలోని పెద్దగుండవెళ్లిలో శనివారం జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వృద్ధాప్యంలో ఉన్న రామయ్య(80) పశువులను చూసుకోవాలనే ఆతృతతో శుక్రవారం మధ్యాహ్నం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. బావి నుంచి ఇంటికి నడుచుకుంటూ వచ్చిన రామయ్య వాంతులతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి వద్ద ప్రాథమిక చికిత్స చేయించినా ఫలితం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో రామయ్యను 108 వాహనంలో తరలించడానికి ప్రయత్నం చేశారు. 108 వాహన సిబ్బంది వచ్చి పరీక్షించేలోపే రామయ్య మరణించాడు. మృతుడికి ఇద్దరు కుమారులు దుర్గారెడ్డి, నర్సింలు ఉన్నారు. నిరుపేదైన రామయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ చందిరి రత్నమ్మ విజ్ఞప్తి చేశారు. గోల్కొండవీధిలో వృద్ధుడు.. మెదక్: వడదెబ్బతో వృద్ధుడు మృతి చెందిన సంఘటన మెదక్ పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. కుటుంబీకుల కథనం ప్రకారం.. పట్టణంలోని గోల్కొండ వీధికి చెందిన అస్త్రగల్ల దేవయ్య(55) కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మూడు రోజుల క్రితం కూలీపని వెళ్లగా వడదెబ్బ తగలడంతో అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో శనివారం మృతి చెందాడు. మృతుడికి భార్య యశోద, నలుగురు సంతానం ఉన్నారు. శివ్వంపేటలో మహిళ.. శివ్వంపేట: వడదెబ్బతో మహిళ మృతి చెందిన సంఘటన శివ్వంపేటలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.... గ్రామానికి చెందిన దర్జి లక్ష్మీబాయి(60) ఊరెళ్ళి సాయత్రం ఇంటికి వచ్చాక అస్వస్థతకు గురైంది. వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. రామునిపట్లలో మహిళా కూలీ... చిన్నకోడూరు: వడదెబ్బతో మహిళా కూలీ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని రామునిపట్లలో శనివారం రాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఆకుల నర్సవ్వ(55) వ్యవసాయ కూలీగా పనిచేస్తోంది. ఈ క్రమంలో వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురైంది. చికిత్స కోసం శనివారం రాత్రి సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు, కూతురు ఉంది. గ్రామ సర్పంచ్ వర్కోలు లావణ్య రాజలింగం, ఎంపీటీసీ బొల్లం భాగ్యలక్ష్మిలు మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం పరంగా ఆర్థిక సహాయం అందజేయాలని వారు కోరారు. కొండపాకలో వృద్ధుడు... కొండపాక: పట్టణానికి చెందిన కడూరి రామయ్య(75) వడదెబ్బతో శుక్రవారం మృతి చెందాడని గ్రామస్తులు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రామయ్య శుక్రవారం పని మీద బయటకు వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి చేరుకొని నీళ్ల వాంతుల చేసుకొని సొమ్మసిల్లిపడిపోయాడు. తీవ్ర అస్వస్థతకు గురైన రామయ్య రాత్రి మృతి చెందాడని గ్రామస్తులు తెలిపారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. దామరకుంటలో మహిళ.. ములుగు: వడదెబ్బతో మహిళ మృతి చెందిన సంఘటన ములుగు మండలం దామరకుంట గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పరిగె బాలమణి(60) ప్రతిరోజు ఉపాధిహామీ కూలీ పనులకు వెళుతుండేది. ఈ క్రమంలో రెండు రోజులుగా వడదెబ్బ తగలడంతో ఆమె అస్వస్థతకు గురైంది. శనివారం సాయంత్రం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్సకోసం ఆసుపత్రికి తరలిస్తుండగా బాలమణి మార్గమధ్యలోనే మృతిచెందింది. మృతురాలికి భర్త లక్ష్మినారాయణ, నలుగురు కూతుళ్లున్నారు. -
వడదెబ్బకు ఇద్దరు మృతి
హైదరాబాద్: ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండటంతో వడదెబ్బ బారిన పడి అనారోగ్యంతో మృతిచెందుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. తాజాగా మహబూబ్‌నగర్ జిల్లాలో ఒకరు, ఖమ్మం జిల్లాలో ఒకరు మృతి చెందారు. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం నిజలాపూర్ గ్రామానికి చెందిన ఎం.బుచ్చమ్మ (60) గురువారం వడదెబ్బకు గురైంది. అస్వస్థతతో బాధపడుతున్న ఆమెను స్థానిక వైద్యుడికి చూపించారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి ఆమె మృతి చెందింది. అలాగే, ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం అలియాతండాలో వడదెబ్బ కారణంగా భూక్యా జగన్ అస్వస్థతకు గురై శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. -
వడదెబ్బతో ఇద్దరు మృత్యువాత
ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రతకు తాళలేక ఇద్దరు మృత్యువాతపడ్డారు. దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన బాణావత్ రాంచందర్(70) శుక్రవారం వడదెబ్బకు తాళలేక ఇంట్లోనే చనిపోయాడు. అలాగే, నెన్నెల మండలం మెట్పల్లి గ్రామానికి చెందిన వేల్పుల శంకరయ్య(65) గురువారం తోట కాపలాకు వెళ్లాడు. సాయంత్రానికి అతడు అస్వస్థతకు గురయ్యాడు. పరిస్థితి విషమించటంతో శుక్రవారం వేకువజామున ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయాడు. -
వడదెబ్బతో ఉపాధి కూలి మృతి
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం ఊరగాంలో ఉపాధి కూలీ వడదెబ్బతో చనిపోయాడు. గ్రామానికి చెందిన తెల్ల మథేను(55) శుక్రవారం ఉదయం గ్రామ చెరువులో జరిగే ఉపాధి పనులకు వెళ్లాడు. పది గంటల సమయంలో వేడిగాలులు, ఎండతీవ్రతకు తీవ్ర అస్వస్థతకు గురైన మథేను అక్కడికక్కడే చనిపోయాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
వడదెబ్బతో వరంగల్ జిల్లాలో 12 మంది మృతి
వరంగల్: వడదెబ్బతో వరంగల్ జిల్లాలో గురువారం 12 మంది మృతిచెందారు. వరంగల్ శివనగర్ పుప్పాల గుట్ట ప్రాంతానికి చెందిన నల్లబెల్లి స్వామి(66), డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ శివారు చాప్లాతండాకు చెందిన రత్నావత్ మాంజా(75), వరంగల్ ఎల్బీనగర్కు చెందిన కూరపాటి మల్లయ్య(76), చిట్యాల మండలం జడల్పేట గ్రామానికి చెందిన బొట్ల చంద్రయ్య, (60), అదే మండలం భావుసింగ్పల్లికి చెందిన జయ్యారపు కొమురయ్య(62), స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన తాటికొండ లక్ష్మి(54), తొర్రూరు మండలం జమస్థానపురం గ్రామానికి చెందిన పెంతల కొమురయ్య (58), జనగామ రైల్వే స్టేషన్ వద్ద గుర్తుతెలియని వృద్ధురాలు, రేగొండ మండలం నిజాంపల్లికి చెందిన ఇంగ్లీ వీరక్క (65), ములుగు మండలం చిన్నగుంటూరుపల్లికి చెందిన తంగెళ్ల లక్ష్మయ్య(55), కేసముద్రం మండలం సబ్‌స్టేషన్‌తండాకు చెందిన గుగులోతు లచ్చిరాం(70), మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన మునిగాల కొమురయ్య(75) మృత్యువాత పడ్డారు. -
వడదెబ్బకు ఇద్దరి మృతి
మండు టెండలకు ఓ వ్యక్తికి వడదెబ్బ తగిలి మృతి చెందిన సంఘటన బూర్గుంపాడు మండలం నాగినేని ప్రోలులో గురువారం జరిగింది. బూర్గుంపాడు మండలం నాగినేనిప్రోలు గ్రామానికి చెందిన కడారి రాములు(55)లకు వడదెబ్బ తగిలింది. చికిత్స చేస్తుండగానే మృతి చెందాడు. అలాగే గురువారం అశ్వారావుపేట నందమూరి కాలనీకి చెందిన హుస్సేన్(25) వడదెబ్బకు మరణించాడు. -
మృత్యు శతకం
► రోజురోజుకూ పెరుగుతున్న వడదెబ్బ బాధితులు ► ఇప్పటిదాకా దాదాపు వంద మంది మృతి ► 14 మందేనంటున్న అధికారులు ► ఎక్స్‌గ్రేషియాపై కొరవడిన స్పష్టత అనంతపురం అర్బన్ : ఎండలు మండిపోతున్నాయి. ‘అనంత’ అగ్నిగోళంగా మారింది. వడదెబ్బకు జనం మృత్యువాత పడుతున్నారు. ఎండలు తీవ్రమయ్యే కొద్దీ మృతుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు వంద మంది చనిపోయారు. అధికారులు మాత్రం ‘అంత’ లేదంటున్నారు. 14 మంది మాత్రమే చనిపోయారని బుకాయిస్తున్నారు. వారు చెబుతున్న సంఖ్య వాస్తవ విరుద్ధంగా ఉందని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు మండిపడుతున్నారు. ఎండల తీవ్రత పెరిగిన మార్చి నుంచి ప్రతి రోజు సగటున ఇద్దరు చొప్పున మృతి చెందుతూనే ఉన్నారు. ఈ నెల 17, 19 తేదీల్లోనే 10 మంది మృతి చెందారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు వడదెబ్బకు మృతి చెందిన వారిలో ఎక్కువ మంది కూలి పనులు చేసుకునే వారు, పేదలే కావడం గమనార్హం. అన్నీ కాదంటున్న అధికారులు వైద్యులు, కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం మరణాలన్నీ వడదెబ్బ కారణంగా సంభవించినవి కాదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. వారి దృష్టికి 40 వరకు కేసులొస్తే అందులో 14 మాత్రమే వడదెబ్బతో చనిపోయినవిగా నిర్ధారించారు. మిగతా వారు అనారోగ్యంతో చనిపోయినట్లుగా తేల్చారు. ఇందుకు సంబంధించి రెవెన్యూ అధికారుల వాదన ఇలా ఉంది. ‘గుండె జబ్బులు, బీపీ, ఇతర వ్యాధులు ఉన్నవారు ఎందుకు ఎండలో తిరగాలి? ఉపాధి పనులు కూడా ఉదయం 6 నుంచి 10లోపు ముగించాలని చెబుతున్నాం కాదా! ప్రతి చోట చలివేంద్రాలు ఏర్పాటు చేయించాం. ఓఆర్ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్) ప్యాకెట్లు అందుబాటులో ఉంచాం. కనీస జాగ్రత్తలు పాటించకుండా ఎండలోకి వచ్చి తీవ్ర అనారోగ్యానికి గురై చనిపోతే అది వడదెబ్బ మృతి ఎలా అవుతుంది?’అని లాజిక్‌లు మాట్లాడుతున్నారు. ఎక్స్‌గ్రేషియా ఎంతిస్తారో... వడదెబ్బ మృతులకు ఎక్స్‌గ్రేషియా ఎంత ఇస్తారనేది ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారని, అయితే అది ఎంత మొత్తం నిర్ధారణ కాలేదని అంటున్నారు. జీవో విడుదల చేస్తేకానీ చెప్పలేమంటున్నారు. ప్రజాశ్రేయస్సుపై చిత్తశుద్ధి లేదు - వి.రాంభూపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభుత్వానికి ప్రజా శ్రేయస్సుపై చిత్తశుద్ధి లేదు. అందుకే వడదెబ్బ మరణాలను తక్కువ చేసి చూపిస్తోంది. చనిపోయిన వారంతా పేదలే. పౌష్టికాహారం లేక రోగనిరోధక శక్తి తగ్గి.. ఎండవేడిమి తట్టుకోలేక చనిపోతున్నారంటే వడదెబ్బ మృతి కిందకే వస్తుంది. వడదెబ్బతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. -
వడదెబ్బతో ఇద్దరు మృతి
చెన్నూర్ రూరల్ : జిల్లాలో వడదెబ్బ ధాటికి బుధవారం ఇద్దరు మృత్యువాపడ్డారు. చెన్నూర్ మండలంలోని కాచన్‌పల్లి గ్రామానికి చెందిన చంటి కిష్టయ్య(28) అనే ఆటో డ్రైవర్ బుధవా రం వడదెబ్బ తగిలి మృతిచెందాడు. బంధువు ల కథనం ప్రకారం... కిష్టయ్య బుధవారం కు టుంబ సభ్యులతో కలసి మండలంలోని సుందరశాలలో గల గోదావరి నదికి స్నానం ఆచరించేందుకు వెళ్లాడు. స్నానాల తర్వాత తిరిగి వస్తుండగా అస్వస్థతకు గురై మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. ప్రభుత్వ సాయం అందేలా కృషి కిష్టయ్య కుటుంబానికి ప్రభుత్వం నుంచి సహాయం అందేలా కృషి చేస్తామని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, ఎంపీపీ మైదం కళావతి పేర్కొన్నారు. కిష్టయ్య మృతి విషయాన్ని తహశీల్దార్ దిలీప్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. తాళ్లపల్లిలో వృద్ధుడు... శ్రీరాంపూర్ : శ్రీరాంపూర్ ఏరియాలోని తాళ్లపల్లి గ్రామానికి చెందిన బొడ్డు రాజయ్య(70) వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజయ్య మధ్యాహ్నం నస్పూర్ కాలనీలోని న్యూ కమ్యూనిటీ హాల్లో జరిగిన బంధువుల వివాహానికి హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తరువాత ఇంటికి వెళ్లే క్రమంలో నడుచుకుంటూ వెళ్తుండగా సొమ్మసిల్లి కంకర కుప్పపై పడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న వారు మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వడబెబ్బతోనే మృతి చెందాడని భార్య రాజమ్మ పేర్కొంది. వీరికి ముగ్గురు కుమారులు, నలుగురు కూతుళ్లు కలరు. మృతుడి కుటుంబ సభ్యులను సర్పంచ్ ఐత శంకర్, వార్డు సభ్యులు రుకుం తిరుమల్, ముదాం చందు పరామర్శించారు. -
వడదెబ్బతో ఎనిమిది మంది మృతి
త్రిపురారం వడదెబ్బతో ఎనిమిది మంది మృతి చెందారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో చో టు చేసుకున్న ఘటనల వివరాలు.. త్రిపురా రం మండలం పెద్దదేవులపల్లి గ్రామ పంచాయతీ పరిధి నర్లకంటివారిగూడెం గ్రామాని కి చెందిన గుండెబోయిన వెంకన్న(32) కూ లీగా జీవనం సాగిస్తున్నాడు. రెండురోజుల క్రితం పనులకు వెళ్లి అస్వస్థతకు గురయ్యా డు. ఇంటి వద్ద చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. అనంతారంలో వృద్ధుడు గుండాల : మండలంలోని అనంతారానికి చెందిన నల్ల అబ్బసాయిలు (65) బుధవా రం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి కట్టె లు కొట్టుకుని ఇంటికి వచ్చి అస్వస్థతకు గురయ్యాడు. దాహం వేస్తుందని మంచి నీరుతాగి అక్కడికక్కడే మృతిచెందాడు. నీర్నెముల గొర్రెల కాపరి.. రామన్నపేట : మండలంలోని నీర్నెముల గ్రామానికి చెందిన ఆవుల అంజయ్య(55) జీవాలను పెంచుతూ జీవనం సాగిస్తున్నా డు. బుధవారం జీవాలను తోలుకుని చెరు వు సమీపంలోని తుంబాయి సమీపంలో మేపుతుండగా ఎండవేడిమికి అస్వస్థతకు గురయ్యాడు. అక్కడే ఉన్న సహచర కాపలాదారులు ఇంటికి తీసుకువచ్చి ప్రథమ చికిత్స అందిస్తుండగానే మృతిచెందాడు. మృతుడికి భార్య,కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. గొర్రెలమేకల పెంపకందారుల సంఘం జిల్లా డెరైక్టర్ కల్గూరి మల్లేశం నివాళులర్పించారు. పెర్కకొండారంలో ఆటోడ్రైవర్.. శాలిగౌరారం: మండలంలోని పెర్కకొం డారానికి చెందిన ఏదుల్ల జితేందర్‌రెడ్డి(45) వృత్తిరిత్యా ట్రాలీ ఆటో నడుపుకుం టూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో రోజు వారీగా మంగళవారం ఆటో నడిపి ఇంటికి వచ్చి అస్వస్థతకు గురయ్యాడు. కుటిం బీకులు నకిరేకల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందిన జితేం దర్‌రెడ్డి కొంత నయం కాగా నే రాత్రి ఇం టికి వచ్చాడు. బుధవారం మధ్యాహ్నం తిరి గి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించేలోపు మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. h.†ర్మలగిరిలో వృద్ధురాలు.. చివ్వెంల : చివ్వెంల మండలం జి.తిర్మలగిరి గ్రామానికి చెందిన పిట్టా రంగమ్మ(75) మంగళవారం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి సాయంత్రం ఇంటికి రాగానే అస్వస్థతకు గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. అనంతరం ఇంటికి తీసుకురాగా బుధవారం తెల్లవారుజామును మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుక్కడంలో యువకుడు వేములపల్లి : మండలంలోని కుక్కడం గ్రామానికి చెందిన బాలెం రమేష్ (23 ) నాలుగు రోజులుగా కట్టెలు కొట్టేందుకు వెళుతూ మంగళవారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యాడు. స్థానిక వైద్యుడి వద్ద చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతిచెందాడు. రమేష్ 2 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే తల్లి మరణించింది. నాటి నుంచి రమేష్ బాగోగులను నాయనమ్మ రాములమ్మ చూస్తుంది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న మనువడు మృతితో రాములమ్మ రోదిస్తున్న తీరు కలచివేసింది. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ సర్పంచ్ అలుగుబెల్లి గోవిందరెడ్డి, కోఆప్షన్ సభ్యుడు మస్తాన్‌వలీ, శర్మ, మహేష్, రాబర్టులు కోరారు. బెట్టెతండాలో.. దామరచర్ల : మండలంలోని వాచ్యాతండా గ్రామ పంచాయతీ పరిధి బెట్టెతండాకు చెందిన లావూరి మేత్యా(51) పొలం పనులకు వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇంటి వద్దనే చికిత్స పొందుతూ మృతిచెం దినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. గొట్టిపర్తిలో సహకార బ్యాంక్ వైస్ చైర్మన్.. తుంగతుర్తి : తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామానికి చెందిన సహకార బ్యాంక్ వైస్‌చైర్మన్ కేతిరెడ్డి విజయ్‌పాల్‌రెడ్డి (63) ఇటీవల వీస్తున్న వడగాల్పులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇంటి వద్దనే చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. ఆయనకు కుమారుడు కుతురు, భార్య ఉన్నారు. సొసైటి చైర్మన్ గుడిపాటి వెంకటరమణ, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి గుడిపాటి నర్సయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చెవిటి వెంకన్న, డెరైక్టర్స్ మేనేని మాధవరావు, కుశలవ రెడ్డి, రామలింగం, రామవల్లయ్య, సోమయ్య, లలిత, సీఈఓ వెంకటేశ్వర్, యాధగిరి, ఉపేందర్, తదితరులు సంతాపం తెలిపారు. -
మరో మూడు రోజులు తీవ్ర వడగాడ్పులు
హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: తెలంగాణ వ్యాప్తంగా మరో మూడు రోజులపాటు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. బుధవారం ఆదిలాబాద్‌లో అత్యధికంగా 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. నిజామాబాద్‌లో 43.9, మెదక్‌లో 43 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు రాజధాని హైదరాబాద్‌లోనూ ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం నగరంలో గరిష్టంగా 41.2 డిగ్రీలు, కనిష్టంగా 26.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. వడదెబ్బతో 31 మంది మృతి రాష్ట్రవ్యాప్తంగా మండుతున్న ఎండలకు 31 మంది ప్రాణాలు కోల్పోయారు. వడదెబ్బతో వరంగల్ జిల్లాలో తొమ్మిది మంది, నల్లగొండ జిల్లాలో ఎనిమిది మంది, మహబూబ్‌నగర్ జిల్లాలో ఆరుగురు, కరీంనగర్ జిల్లాలో ముగ్గురు, ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు, మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. -
ఓరుగల్లులో వడదెబ్బతో ఏడుగురి మృతి
వరంగల్: వరంగల్ జిల్లాలో బుధవారం వడదెబ్బతో ఏడుగురు మృతిచెందారు. మంగపేట మండలంలోని రాజుపేటకు చెందిన మోదుగు నాగమ్మ(90), చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన ఏరుకొండ మానస(17), ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన బత్తిని రాధిక (12), రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన రామగిరి సత్తెయ్య(52), చేర్యాల మండలం గురువన్నపేటకు చెందిన మకిలి రామయ్య (65), వరంగల్ నగరంలోని 2వ డివిజన్ మొగిలిచర్లకు చెందిన సిద్దని ఐలయ్య(60), మానుకోట శివారు కొండపల్లి గోపాల్‌రావునగర్ కాలనీకి చెందిన జక్కుల బుచ్చమ్మ (45) మృతిచెందారు. -
వడదెబ్బతో వ్యక్తి మృతి
కర్నూలు జిల్లా మానవపాడు గ్రామంలో వడదెబ్బతో జయరాజ్(55) అనే వ్యక్తి బుధవారం మధ్యాహ్నం మృతిచెందాడు. బుధవారం ఉదయం వడదెబ్బకు గురైన జయరాజ్‌ను కర్నూలు ఆస్పత్రికి తరలించగా క్కడ చికిత్సపొందుతూ మృతిచెందాడు. మృతునికి భార్య లక్ష్మీదేవి, నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. -
గోదావరిఖనిలో వడదెబ్బకు వ్యక్తి మృతి
కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో కొలిపాక సమ్మయ్య(55) మంగళవారం ఉదయం వడదెబ్బతో మృతిచెందాడు. బట్టలు ఉతికేందుకు చాకిరేవుకు వెళ్లిన సమ్మయ్య ఎండవేడిమికి తట్టుకోలేక క్కడే కుప్పకూలాడు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. -
అన్ని రక్షణ చర్యలు తీసుకున్నాం..
వడదెబ్బలపై హైకోర్టుకు ఉభయ రాష్ట్రాల నివేదన సాక్షి, హైదరాబాద్: వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారినపడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు సోమవారం హైకోర్టుకు నివేదించాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు కార్మికులు ఎండలో పనిచేయకుండా చర్యలు చేపట్టినట్లు ఏపీ అడ్వొకేట్ జనరల్ పి.వేణుగోపాల్ చెప్పారు. ప్రజల రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యల విషయంలో అధికారులకు తమ ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసిందని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ కోర్టుకు తెలిపారు. ఇప్పటికే పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటించారన్నారు. వారి ప్రకటనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. వడగాడ్పులపై దాఖలైన వ్యాజ్యాన్ని పరిష్కరిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. వడదెబ్బ మృతులకు పరిహారం చెల్లింపు విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ప్రభుత్వాలకు సూచించింది. వడదెబ్బ వల్ల ఏటా మరణాలు పెరిగిపోతున్నాయని, ఈ నేపథ్యంలో తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీశైలం యాదవ్ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. -
వడదెబ్బకు ఇద్దరు మృతి
కమలాపురం (వైఎస్సార్ జిల్లా) : ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండటంతో వడదెబ్బ బారిన పడి మృతిచెందినవారి సంఖ్య ఎక్కువవుతోంది. సోమవారం వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం మండలంలోని ఎర్రగుడిపాడు గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి(45) వ్యవసాయ పనులు చేస్తుండగా సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించడానికి యత్నిస్తుండగా అంతలోనే మృతిచెందాడు. మండలంలోని గంగవరం గ్రామానికి చెందిన కె. పెద్దలక్ష్మమ్మ(60) వడదెబ్బకు గరై మృతిచెందింది.