ఎండ వేడిమికి తాళలేక ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు.
ఎండ వేడిమికి తాళలేక ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. బుధవారం ఒక్కరోజే పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా.. ఐదుగురు వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డారు. ఈ రోజు ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి వడదెబ్బ బాధితులు బారులు తీరుతున్నారు. దీంతో ఆస్పత్రిలో స్థలం చాలక వరండాలు కూడా నిండిపోయే పరిస్థితి ఏర్పాడింది.