
పశ్చిమగోదావరి జిల్లా : రాష్ట్రంలో ఆక్వారంగం సంక్షోభంలో ఉంటే ప్రస్తుత ఏపీ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు విమర్శించారు. మత్యం ఎగుమతుల్లో మొదటి స్థానంలో ఉన్న ఏపీలో ఆక్వారంగం సంక్షోభంలో ఉందన్నారు. దీన్ని ప్రభుత్వం పట్టించుకోకుండా మొద్దు నిద్రపోతుందంటూ మండిపడ్డారు.
‘అమెరికా సుంకాల పెంపు సాకుతో కొన్ని కంపెనీలు సిండికేట్ గా మారి దోపిడీకి పాల్పడుతున్నాయి. కేవలం రెండు రోజుల్లోనే కౌంట్ కి20 నుండి 40 రూపాయలు తగ్గించేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఒక సాధికారత కమిటీ వేశారు. రాష్ట్రంలో 75 శాతం ఆక్వా రంగంలోనే ఆదాయం వస్తుంది. హయాంలో ఒక సాధికారత కమిటీ వేశారు. కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవు. జగన్ హయాంలో రూపాయిన్నరకే పవర్ సబ్సిడీ ఇచ్చి రైతుకు అండగా నిలిచారు. ఫీడ్ కంపెనీలు ఎక్స్ పోటర్ సిండికేట్ గా మారిపోయారు. కూటమి ప్రభుత్వంలో నాయకులే ఎగుమతిదారులుగా చాలా మందే ఉన్నారు. అమెరికా దిగుమతి సుంకాలను సాకగా చూపి.. ఇక్కడ రొయ్య ధరలు తగ్గించడం దుర్మార్గం.
కేవలం రూ. 20, రూ. 30, రూ. 40 కౌంటర్ రొయ్య మాత్రమే అమెరికాకు ఎక్స్ పోర్ట్ అవుతాయి. 70 కౌంట్ గానీ, 100 కౌంట్ గానీ అమెరికా లాంటి ఎక్స్ పోర్ట్ చేసుకోదు. గతంలో ఫీడ్ రేట్లు పెరిగితే అప్సడా(Andhra Pradesh State Aquaculture Development Authority) ద్వారా రేట్లు నియంత్రించారు. అప్పుడు సోయా కేజీ 85 రూపాయలు ఉంది. ఇప్పుడు కేజీ 25 రూపాయలు ఉన్నా ఫీడ్ రేటు తగ్గించడం లేదు. చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చి రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చారు.

జగన్ హయాంలో ఇంటిగ్రేటెడ్ ఆక్వాలాబ్ లో పెట్టి.. రైతులకు అండగా నిలిచారు. ఫీడ్ గానీ, సీడ్ కానీ కల్తీ లేకుండా చట్టాలను తీసుకొచ్చారు. జగన్ చైర్మన్ గా ఉండి అప్సడా ద్వారా మానిటరింగ్ చేసేవారు.’ అని పేర్కొన్నారు. ముడిసరుకులు తగ్గించినప్పుడు ఫీడ్ రేటు తగ్గించాలి కదా.. ప్రభుత్వ పెద్దల సహకారంతో రైతులు నడ్డివిరుస్తున్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా రైతులకు జగన్ అండగా నిలిచారు. ఎగుమతుదారులతో కో ఆర్డినేషన్ చేసి రైతులను ఆదుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతుల పక్షాన ఉండాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం ఆక్వా రైతులలో ఉన్న ఆందోళన తొలగించాలి’ అని ఆయన పేర్కొన్నారు.