Aqua Culture
-
రొయ్యల కోసం ఆక్వారోబో
సాక్షి, అమరావతి: అత్యాధునిక సాంకేతిక పరిజా్ఞనాన్ని అందిపుచ్చుకున్న ఓ ఆక్వా రైతు రొయ్యల పెంపకంలో రోబోను వినియోగిస్తూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని చినఅమిరం గ్రామానికి చెందిన వత్సవాయి లక్ష్మీకుమార్‌రాజు మద్రాస్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. కొంతకాలం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన ఆయన ఆ కొలువును వదిలి రొయ్యల సాగు చేపట్టారు. కృష్ణా జిల్లా నందివాడ మండలం అరిపిరాల గ్రామంలో దాదాపు 700 ఎకరాల్లో రొయ్యలను పెంచుతున్నారు. వాటికి ఆహారం అందించేందుకు ఆక్వా రోబో (బాట్)ను తయారు చేయించుకుని వినియోగిస్తున్నారు. ఇది సౌర విద్యుత్ తానే తయారు చేసుకుని పని చేస్తుంది. విద్యుత్ ఆదా కోసం అనేక సాంకేతిక విధానాలను, పరికరాలను వాడుతున్నారు. ఈ మొత్తం వ్యవస్థను ఒక ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా అరచేతిలోనే నడిపిస్తున్నారు. ఆక్వా రంగంలో భారతదేశంలోనే తొలి రోబో ఇదే కావడం విశేషం. కూలీల అవసరం లేకుండానే..: చెరువులోని రొయ్యలకు మనుషులే ఆహారం (ఫీడింగ్) అందించడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. అది అనేక ఇబ్బందులతో కూడుకోవడంతో పాటు ఆహారం సకాలంలో అందేది కాదు. దీంతో మార్కెట్లో ఆటోమేటిక్ ఫీడర్ల కోసం వెతికారు. కానీ.. అవి కూడా ఒకేచోట ఫీడింగ్ చేసేవి. దానివల్ల రొయ్యలన్నిటికీ ఆహారం సమానంగా అందేది కాదు. దీంతో చెరువు మొత్తం తిరిగేలా యంత్రాన్ని తయారు చేస్తే బాగుంటుందనే ఆలోచనకు వచ్చారు లక్ష్మీకుమార్‌రాజు. నెక్ట్ ఆక్వా సంస్థతో తన ఆలోచనను పంచుకున్నారు. ఆ సంస్థ ఐఐటీ గ్రాడ్యుయేట్లతో ఏర్పాటైంది. వారికి ఈ ఆలోచన నచ్చి నాలుగేళ్ల పాటు అరిపిరాలలోనే ఉండి పరిశోధన చేశారు. రకరకాల ప్రయత్నాల తరువాత చివరకు మూవింగ్ రోబోను తయారు చేశారు. చెరువులో తాడుతో (గైడెడ్) లైన్లా కట్టి దాని సాయంతో రెండేళ్లుగా ఈ రోబోను నడుపుతున్నారు. దీని ఆపరేటింగ్ మొత్తం మొబైల్‌తోనే జరుగుతుంది. ఎన్ని కేజీల ఆహారం.. ఏ సమయంలో.. ఎన్నిసార్లు అందించాలనేది ముందుగానే ప్రోగ్రా>మింగ్ చేసుకోవచ్చు. దాని ప్రకారం కచ్చితంగా అంతే ఆహారాన్ని ఆయా సమయాల్లో ఈ రోబో రొయ్యలకు అందిస్తుంది. ముఖ్యంగా ఈ రోబోకి అవసరమైన విద్యుత్‌ను దానిపైనే అమర్చిన సౌర పలకల ద్వారా తానే తయారు చేసుకుంటుంది. క్షణక్షణం.. అప్రమత్తం కరెంట్ ట్రాన్స్ఫార్మర్ (సీటీ) లేదా పవర్ మోనిటర్ (బ్లాక్ బాక్స్)అనే పరికరంతో విద్యుత్ సరఫరాను పర్యవేక్షిస్తున్నారు. ఇది ఆటోమేటిక్ పవర్ ఫ్యాక్టర్ కంట్రోలర్‌గా పనిచేస్తూ విద్యుత్ నష్టాలను, విద్యుత్ బిల్లులను తగ్గిస్తుంది. ఎన్ని ఏరియేటర్స్ (రొయ్యలకు ఆక్సిజన్ అందించే పరికరాలు) పని చేస్తున్నాయనేది నిరంతరం చూస్తుంటుంది. ఏరియేటర్స్ ఆగితే వెంటనే చెబుతుంది. మూడు మొబైల్ నంబర్లకు ఫోన్ అలర్ట్ వెళ్లిపోతుంది. నిజానికి ప్రతి పరిశ్రమలో ఆటోమేటిక్ పవర్ ఫ్యాక్టర్ కంట్రోలర్స్ వాడుతుంటారు. వీటిని ఆక్వాలో వాడటం అనేది చాలా అరుదు. మోటార్లు ఆగిపోతే వెంటనే సరిచేసి ఆన్ చేయాలి. లేదంటే రొయ్యలు చనిపోతాయి. ఇందుకోసం రైతులు రాత్రివేళల్లో చెరువుల వద్ద కాపలాగా పడుకోవాల్సి వస్తోంది. అలాంటి సమయంలో విద్యుత్ ప్రమాదాల బారినపడి రైతులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు జరుగుతున్నాయి. ఈ సమస్యలను పవర్ మోనిటర్ తీరుస్తోంది. ఎన్ని ఏరియేటర్స్ ఆన్ చేస్తే అన్నే కెపాసిటర్లు ఆన్ అయ్యేలా చూస్తుంది. అవి ఆగిపోతే కెపాసిటర్లను ఆపేస్తుంది. జనరేటర్ పనితీరును కూడా ఇది పర్యవేక్షిస్తుంది. దీనివల్ల డీజిల్ దొంగతనాన్ని అరికట్టవచ్చు. స్మార్ట్ స్టార్టర్ కంట్రోలర్ అనే పరికరం ద్వారా మొబైల్‌తోనే ఏరియేటర్స్ని ఆన్ చేయవచ్చు. అవి ఎంతసేపు పనిచేయాలనేది ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. సాంకేతిక సమస్య ఏదైనా ఏర్పడితే మొబైల్‌కి సమాచారం వచ్చేస్తుంది. ఇలా చేయడం వల్ల మోటారు కాలిపోకుండా కాపాడుతుంది. విద్యుత్ బిల్లులు ఆదా విద్యుత్ వ్యవస్థకు సాంకేతికతను జోడించి మా చెరువుల్లో వినియోగిస్తున్నాం. పర్యావరణ హితం కోరి 15 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను వాడుతున్నాం. పవర్ మాంక్స్ సాఫ్ట్వేర్ ద్వారా చెరువుల మొత్తం ఎంత విద్యుత్ వినియోగం జరుగుతోంది, సరఫరా ఎలా ఉంది, ఎక్కడైనా సాంకేతిక, భౌతిక ఇబ్బందులు ఉన్నాయా అనేది రియల్ టైమ్ (ఎప్పటికప్పుడు) సమాచారాన్ని టీవీ (మోనిటర్)లో కనిపించేలా సెన్సార్లు ఏర్పాటు చేశాం. దీనివల్ల 95 శాతం కంటే ఎక్కువగా విద్యుత్ వినియోగం సక్రమంగా జరుగుతోంది. ప్రతి 100 కేవీ ట్రాన్స్ఫార్మర్పై నెలకు కనీసం రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ విద్యుత్ ఆదా అవుతోంది. – వత్సవాయి లక్ష్మీకుమార్‌రాజు, ఆక్వా రైతు -
మత్స్య సంపద మురిపిస్తోంది.. ఎగుమతుల్లో నాలుగో స్థానం
నూట పది కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం కలిగిన ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మత్స్య సంపదలో గణనీయ ఆదాయం సాధిస్తూ పురోగమిస్తోంది. జిల్లాలో సహజ సిద్ధంగా ఉన్న చెరువులు, రిజర్వాయర్లలో వివిధ రకాలైన చేపలు పెరుగుతుంటాయి. వాటిని కొన్ని పేద కుటుంబాలు పట్టుకుని జీవనం సాగిస్తుంటాయి. ఇక సముద్ర తీరంలో ఉన్న 98 మత్స్యకార గ్రామాల ప్రజలు ప్రధానంగా పడవలు, బోట్ల ద్వారా సముద్రంలోకి వెళ్లి రోజుల తరబడి అక్కడే ఉండి చేపలు, రొయ్యలు వేటాడి తీసుకొస్తుంటారు. వాటిని వ్యాపారులకు విక్రయించి ఆదాయం పొందుతుంటారు. ఇవే కాక జిల్లాలో సుమారు 32 వేల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. బ్రాకిష్ వాటర్‌లో సాగుచేసే చెరువుల నుంచి ఏడాదికి దాదాపు 90 వేల టన్నుల రొయ్యలు పట్టుబడుతున్నాయి. ఇవన్నీ జిల్లా నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. – సాక్షి, నెల్లూరు డెస్క్ జిల్లాలో అధికారికంగా సుమారు 8 వేల ఎకరాల్లో చేపల చెరువులున్నాయి. అనధికారికంగా ఇది ఇంకా ఎక్కువే ఉంటాయని సమాచారం. వీటిలో ఏటా దాదాపు రెండు లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రస్తుతం టన్ను చేపల ధర రూ.1.50 లక్షలు ఉంది. ఈ లెక్క ప్రకారం వాటి విలువ రూ.3,000 కోట్లు. పట్టుబడిన చేపల్లో కొంత జిల్లాలో వినియోగం అవుతుండగా, ఎక్కువ సరుకు ఇతర రాష్ట్రాలకు, పొరుగు జిల్లాలకు ఎగుమతి అవుతోంది. ఇవి కాకుండా జిల్లాలో సహజసిద్ధంగా ఏర్పడిన సాగునీటి చెరువులు, కాలువలు, నదుల్లో కూడా మత్స్యసంపద దొరుకుతోంది. భారీగా రొయ్యల చెరువులు జిల్లాలో దాదాపు 24 వేల ఎకరాల్లో రొయ్యల చెరువులు ఉన్నాయి. వీటిలో 80 శాతం బ్రాకిష్ వాటర్ (సెలెనిటీ తగినంతగా ఉన్నవి) చెరువులే. రొయ్యల ఉత్పత్తి జిల్లాలో ఏటా లక్ష టన్నులకు పైగానే ఉంటోంది. ఇందులో 90 వేల టన్నులు రాష్ట్రం నుంచి దేశంలోని పలు ప్రాంతాలతోపాటు విదేశాలకు కూడా ఎగుమతి అవుతోంది. ప్రస్తుతం టన్ను రొయ్యల ధర రూ.2.50 లక్షల వరకు ఉంది. ఈ ప్రకారం లెక్కిస్తే జిల్లాలో ఉత్పత్తి అవుతున్న రొయ్యల విలువ రూ.2,500 కోట్లు. ఆదాయం భారీగా ఉండటంతో రైతులు కూడా ఎక్కువమంది రొయ్యలు సాగుకే మొగ్గుచూపుతున్నారు. ఎగుమతులు ఎక్కడెక్కడికి.. బ్రాకిష్ వాటర్‌లో పెంచే రొయ్యలతోపాటు సముద్ర చేపలు ఎక్కువ భాగం జిల్లా నుంచి కృష్ణపట్నం పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. కొంత వరకు చెన్నై, ముంబై, కోల్‌కతా, కొచ్చి, గుజరాత్‌కు కూడా ఎగుమతి అవుతున్నాయంటే జిల్లాలో సముద్ర ఉత్పత్తులు ఎంత మేరకు లభిస్తున్నాయో అర్థమవుతుంది. శీతలీకరణ వాహనాల (ఇన్సులేటెడ్ వెహికల్స్) ద్వారా కూడా రోడ్డు మార్గాన పొరుగు రాష్ట్రాలకు చేపలు, రొయ్యలను పంపుతున్నారు. ఆక్వా ఉత్పత్తులలో జిల్లా గణనీయ ప్రగతి సాధిస్తోందని అధికారులు వివరించే లెక్కలు తెలియజేస్తున్నాయి. ఉపాధి అవకాశాలు జిల్లాలో 9 తీర ప్రాంత మండలాల్లో 98 మత్స్యకార గ్రామాలున్నాయి. వాటిలో 1,98,000 మంది జనాభా ఉన్నారు. వీరంతా సముద్రంలో చేపలు, రొయ్యలు వేటాడి బతుకుతున్నారు. కుటుంబంలోని మగవారు సముద్రంలోకి వేటకు వెళతారు. ఒక్కోసారి చేపలు పట్టడానికి వారం రోజులు కూడా పట్టవచ్చు. అందుకే వేటకు వెళ్లే ముందు తగినంత ఆహారం కూడా తమతోపాటు తీసుకెళ్తారు. వేటాడి తెచ్చిన మత్స్యసంపదను వీరు వ్యాపారులకు విక్రయించి తమ కుటుంబాలను పోషించుకుంటారు. జిల్లా స్థానం ఇదీ ఆక్వా ఉత్పత్తుల్లో జిల్లా ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉంది. సముద్రంలో, ఆక్వా చెరువుల్లోనే కాకుండా నదులు, కాలువలు, సాగునీటి చెరువులు తదితర వాటితో కలిపి జిల్లాలో ఏటా 3.50 లక్షల టన్నుల మత్స్య సంపద దొరుకుతోంది. ఇంత కంటే ఎక్కువ సంపదతో ముందు వరుసలో ఉమ్మడి కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలున్నాయి. ప్రభుత్వ పరంగా ఆక్వా రంగానికి విద్యుత్ సబ్సిడీ ఇస్తుండటం, రైతులకు నాణ్యమైన ఫీడ్, సీడ్ సరఫరా చేస్తుండటంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా రైతులకు ప్రభుత్వ సహకారం ఆక్వా సాగు రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై విద్యుత్‌ను అందిస్తోంది. చేపలు, రొయ్యలకు ఫీడ్ కూడా నాణ్యమైనది అందించేలా శాఖా పరంగా చర్యలు తీసుకుంది. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా రాష్ట్రానికి ఏటా సుమారు రూ.2,500 కోట్ల ఆదాయం వస్తోంది. ఇందుకు జిల్లా రైతులూ తమవంతుగా తోడ్పాటు అందిస్తున్నారు. సాగును ఇంకా ప్రోత్సహించేందుకు ప్రభుత్వపరంగా అన్నివిధాలుగా రైతులకు తోడ్పాటు అందిస్తున్నాం. – నాగేశ్వరరావు, మత్స్యశాఖ జేడీ రూ.1.50కే యూనిట్ విద్యుత్ గతంలో ఆక్వా సాగుకు యూనిట్ ధర రూ.4.86 ఉండేది. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.2కే విద్యుత్‌ను అందిస్తామని చెప్పడంతో అధికారంలో ఉన్న చంద్రబాబు రూ.2కు యూనిట్ కరెంట్ ఇచ్చారు. జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రస్తుతం ఆక్వా జోన్‌లోని రైతులకు యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే అందిస్తోంది. – ఫణీంద్రనాయుడు, ఆక్వారైతు, గంగపట్నం సబ్సిడీతో రైతులకు ఊరట రొయ్యల చెరువులకు ప్రభుత్వం ఇస్తున్న విద్యుత్ సబ్సిడీ వల్ల లాభం పొందుతున్నాం. నేను పది రొయ్యల చెరువులు సాగు చేస్తున్నా. ఈ ఏడాది మొత్తం చూస్తే మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఏడాదికి మూడుసార్లు సాగు జరుగుతుంది. గతేడాది మేలో వేసినప్పుడు రొయ్యల రేటు బాగుంది. 100 కౌంట్ రూ.280, 70 కౌంట్ రూ.340 వరకు పలికింది. సెప్టెంబర్‌లో రేటు భారీగా తగ్గి 100 కౌంట్ రూ.160 పలికింది. ఈ సమయంలో నష్టపోయాం. ప్రస్తుతం 100 కౌంట్ రూ.240 పలుకుతోంది. ప్రభుత్వం విద్యుత్‌పై యూనిట్‌కు రూ.1.50 పైసలు సబ్సిడీ ఇస్తుండటంతో నష్టపోయే పరిస్థితి లేదు. – ఆవుల సోమయ్య, పెదపట్టపుపాళెం, రొయ్యల సాగు రైతు -
నాణ్యమైన రొయ్యల ఉత్పత్తే లక్ష్యం
సాక్షి, అమరావతి: ఆక్వాసాగులో యాంటిబయోటిక్స్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించేదిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మూడున్నరేళ్లుగా ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా యాంటిబయోటిక్స్ వినియోగాన్ని 95 శాతానికిపైగా నియంత్రించగలిగారు. ఇకముందు 100 శాతం నియంత్రించేదిశగా చర్యలు చేపట్టింది. ఇందుకోసం సీడ్ నుంచి మార్కెటింగ్ వరకు దశలవారీగా యాంటిబయోటిక్స్ శాతాన్ని పరీక్షించేలా కార్యాచరణ సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఏటా తొమ్మిదిలక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి. లక్షటన్నులు స్థానికంగా వినియోగమవుతుండగా, లక్షన్నర టన్నులు ఒడిశా, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలకు వెళుతున్నాయి. మిగిలిన 6.50 లక్షల టన్నులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. దీన్లో 50 శాతం అమెరికా సంయుక్త రాష్ట్రాలకు, 30 శాతం చైనాకు, 10 శాతం వియత్నాం, థాయ్‌లాండ్ దేశాలకు, 6–8 శాతం యూరప్ దేశాలకు, మిగిలింది మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. యాంటిబయోటిక్ రెసిడ్యూల్స్ మితిమీరి ఉన్నాయంటూ ఒకప్పుడు పెద్ద ఎత్తున కన్సైన్మెంట్స్ వెనక్కి వచ్చే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. సర్టిఫై చేసిన సీడ్, ఫీడ్ అందించే లక్ష్యంతో ఏపీ సడా, సీడ్, ఫీడ్ యాక్టులు తీసుకురావడంతోపాటు తీరప్రాంత జిల్లాల్లో రూ.50 కోట్లతో 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వాల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన సీడ్, ఫీడ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆర్బీకే చానల్ ద్వారా శాస్త్రవేత్తలతో అవగాహన ఆక్వాసాగు వివరాలను ఈ ఫిష్ యాప్‌లో నమోదుచేస్తూ, నాణ్యమైన దిగుబడులు లక్ష్యంగా పెద్ద ఎత్తున మత్స్యసాగుబడులు నిర్వహిస్తున్నారు. యాంటిబయోటిక్స్ వినియోగంవల్ల తలెత్తే దుష్పరిణామాలపై ఆర్బీకే చానల్ ద్వారా శాస్త్రవేత్తలతో అవగాహన కల్పిస్తున్నారు. పంటకాలంలో కనీసం నాలుగైదుసార్లు వాటర్ అనాలసిస్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. ఫలితంగా ఉత్పత్తి ఖర్చులు 5–7 శాతం తగ్గడమే కాదు.. పొరుగు రాష్ట్రాలు, దేశాలతో పోల్చుకుంటే రొయ్యల ఎదుగుదల 12.76 శాతం మేర పెరిగింది. మరోవైపు యాంటిబయోటిక్స్ వినియోగం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి విదేశాలకు పంపే రొయ్యల్లో యాంటిబయోటిక్స్ అవశేషాలు 0.3 నుంచి 0.4 శాతం ఉంటే, మన రాష్ట్రం నుంచి వెళ్లే వాటిలో 0.2 శాతం మాత్రమే నమోదవుతున్నాయి. అవికూడా కొద్దిపాటి కన్సైన్మెంట్లలోనే. ఈక్విడార్ వంటి దేశాల్లో ప్రతి ఉత్పత్తిని టెస్ట్ చేసిన తర్వాతే విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతినిస్తారు. అదే మనదేశంలో ర్యాండమ్‌గా చెక్‌చేసిన తర్వాత ఎగుమతులకు అనుమతినిస్తుంటారు. వ్యాధుల నియంత్రణ పేరుతో విచ్చలవిడిగా వినియోగిస్తున్న యాంటిబయోటిక్స్ వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. యాంటిబయోటిక్స్ అవశేషాలుంటే ఇకనుంచి రొయ్యలను కొనుగోలు చేయబోమని ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో ప్రాసెసింగ్ ఆపరేటర్లు, ఎక్స్‌పోర్టర్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నూరుశాతం యాంటిబయోటిక్స్ రహిత ఉత్పత్తులుగా మన రొయ్యలను తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈక్విడార్ తరహాలోనే నూరుశాతం తనిఖీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ ఆపరేటర్లతోపాటు రైతుసంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా ఓ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కమిటీ పర్యవేక్షణలో సీడ్ నుంచి మార్కెటింగ్ వరకు దశలవారీగా యాంటిబయోటిక్స్ అవశేషాలను క్రమం తప్పకుండా పరీక్షించనుంది. ప్రస్తుత సీజన్ నుంచే ఈ కార్యాచరణ అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. యాంటిబయోటిక్స్ పరీక్షలకు అయ్యే వ్యయం రైతులపై పూర్తిగా పడకుండా సమష్టిగా భరించేలా ఏర్పాటు చేస్తోంది. యాంటిబయోటిక్స్ నియంత్రణే లక్ష్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు యాంటిబయోటిక్స్ వినియోగం నూరుశాతం నియంత్రణే లక్ష్యంగా కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ కమిటీ రైతుల్లో అవగాహన కల్పించడమే కాదు.. సీడ్ నుంచి పట్టుబడి వరకు దశలవారీగా ప్రతి చెరువులోని రొయ్యలను పరీక్షిస్తుంది. – వడ్డి రఘురాం, అప్సడా వైస్ చైర్మన్ కమిటీ ఏర్పాటు మంచి ఆలోచన యాంటిబయోటిక్స్ వినియోగాన్ని నియంత్రించేందుకు ఉమ్మడి కమిటీ ఏర్పాటు చేయడం చాలా మంచి ఆలోచన. యాంటిబయోటిక్స్ లేని రొయ్యలను మాత్రమే ఎగుమతి చేసేందుకు ఇది ఎంతో దోహదపడనుంది. – ఐ.పి.ఆర్.మోహనరాజు, జాతీయ రొయ్యరైతుల సంఘం అధ్యక్షుడు -
రొయ్య రైతుకు వెన్నుదన్ను: దేశంలో అత్యధిక రేట్లు ఏపీలోనే
సాక్షి, అమరావతి: అంతర్జాతీయంగా రొయ్యల ధరలు తగ్గుతున్న ప్రస్తుత తరుణంలో రైతులకు ప్రభుత్వం బాసటగా నిలుస్తూ, వారికి మద్దతు ధర లభించేలా అహరహం కృషి చేస్తోందనడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న చర్యల ఫలితంగా రొయ్య రైతులకు దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ దక్కనంత ధర ఒక్క ఏపీలోనే లభిస్తోంది. ఓ పక్క అంతర్జాతీయంగా రొయ్యల మార్కెట్ తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. వివిధ కారణాలతో ఎగుమతులు తగ్గుతున్నాయి. మరో పక్క మేత ధరలు పెరిగిపోతున్నాయి. వీటన్నింటినీ తట్టుకోవడం రాష్ట్రంలో రొయ్య రైతుకు కష్టంగా ఉంది. ఈ సమయంలో ఏ ఒక్క రైతూ ఆర్థికంగా నష్టపోకూడదన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల సీనియర్ మంత్రులతో ఆక్వా సాధికారత కమిటీని నియమించారు. రొయ్య రైతులకు మేలు చేయడానికి చర్యలు చేపట్టారు. పెరిగిన ఫీడ్ ధరలను నియంత్రించడంతోపాటు రొయ్య ధరలను క్రమబద్ధీకరించేందుకు కమిటీకి పూర్తిస్థాయి అధికారాలను అప్పగించారు. కమిటీ నిర్ణయాలు, చర్యలపై సీఎం వైఎస్ జగన్ నిరంతరం సమీక్షిస్తూనే ఉన్నారు. ప్రభుత్వ కృషి ఫలితంగా రెండుసార్లు పెంచిన ఫీడ్ ధరలను కంపెనీలు వెనక్కి తీసుకున్నాయి. ఇటీవల టన్నుకు రూ.2,600 చొప్పున పెంచగా, సీఎం ఆదేశాలతో సాధికారత కమిటీ ఆ కంపెనీలతో చర్చలు జరిపింది. ఫలితంగా పెంచిన ధరలను కంపెనీలు తగ్గించాయి. ఇది రైతులకు చాలా మేలు చేసింది. నెల రోజులుగా ప్రభుత్వ ధరకే కొనుగోలు ప్రాసెసింగ్ యూనిట్లతోనూ మంత్రుల కమిటీ చర్చలు జరిపింది. రొయ్య రైతులకు గిట్టుబాటు అయ్యేలా ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన రీతిలో ధరలను నిర్ణయించారు. వంద కౌంట్ రొయ్యలను రూ.210కు, 30 కౌంట్ రూ.380కు తక్కువ కాకుండా కొనాలని కమిటీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నెల రోజులుగా ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. ఫలితంగా ఇంతటి తీవ్ర సంక్షోభ సమయంలో కూడా దేశంలో మరెక్కడా లేని విధంగా ఒక్క ఏపీలోనే రొయ్యల ధరలు నిలకడగా ఉన్నాయి. రోజూ ప్రభుత్వం నిర్దేశించిన రేట్లు, మార్కెట్లో రేట్లను సమీక్షించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ప్రభుత్వం నియమించింది. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్‌తో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ధరల క్రమబద్ధీకరణకు ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) చట్టం ద్వారా «ప్రత్యేకంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్వోపీ) రూపొందిస్తున్నారు. 14న మరోసారి భేటీ... ఆక్వా రైతులను ఆదుకునే క్రమంలో సీఎం ఆదేశాల మేరకు ఈ నెల 14వ తేదీన ఆక్వా ఫీడ్, సీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులతో సాధికారత కమిటీ మరోసారి భేటీ కానుంది. సమీప భవిష్యత్‌లో ధరల క్రమబద్ధీకరణకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనుంది. రైతులకు మేలు చేసే అంశాలపై చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోనుంది. . నాడు జోన్లుగా విభజించి... నేడు రాజకీయాలు టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలో ఉండగా ఆక్వా రంగాన్ని, రైతులను ఏనాడూ పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్‌గా విభజిస్తూ 2018, ఏప్రిల్ 20వ తేదీన జీవో ఎంఎస్ నం.16 జారీ చేసింది చంద్రబాబు ప్రభుత్వమే. ఆహారం పండిస్తున్న భూములను కాపాడుకోవడం, కాలుష్యాన్ని నివారించడం, లవణీయత (సెలనిటీ) పెరగడం వల్ల భూములు నిరుపయోగంగా కాకుండా చూడడం, పర్యావరణ పరిరక్షణ తదితర కారణాలతో ఈ జోన్ల వర్గీకరణ జరిగింది. ఆక్వా జోనింగ్ చేయకపోతే భవిష్యత్ తరాలకు ముప్పు వాటిల్లడమే కాదు, ఆహార ఉత్పత్తులు పండించే భూములు తగ్గిపోయి, ఆహారం కొరత ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు పరిస్థితుల్లో వచ్చిన మార్పులేమిటి? అప్పట్లో చంద్రబాబు చేతిలో దగా పడ్డ ఆక్వా రైతులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలతో మరింత మేలు పొందుతున్నారు. చంద్రబాబు జోన్ వ్యవస్థను మధ్యలోనే వదిలేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక జోన్ వ్యవస్థను పూర్తిచేసి, రైతులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. అధికారంలో ఉండగా జోన్లతో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ రూ.3.86కు విద్యుత్‌ను సరఫరా చేసిన చంద్రబాబు, మళ్లీ అధికారంలోకి వస్తే తగ్గిస్తానంటూ కొత్త రాగం అందుకున్నారు. వైఎస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత మూడున్నరేళ్లుగా ఆక్వా జోన్ పరిధిలోని రైతులకు విద్యుత్ ధరలు తగ్గించి, యూనిట్ రూ.1.50కే సరఫరా చేస్తోంది. నాన్ ఆక్వాజోన్‌లో అప్పటి నుంచి ఉన్న రేట్లు యథాతథంగా కొనసాగిస్తోంది. చంద్రబాబు హయాంలో ఉన్న మాదిరిగా ఇప్పుడూæ యూనిట్ రూ.3.86కే విద్యుత్ సరఫరా చేస్తోంది. పైగా, రైతులకు నాణ్యమైన ఫీడ్, సీడ్ తక్కువకు దొరికేలా చూస్తోంది. ఇంకోపక్క రైతులకు ఎక్కువ ధర దక్కేలా చర్యలు తీసుకుంటోంది. ఈ వాస్తవాలను మరిచిన చంద్రబాబు.. ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో రాజకీయాలు చేయడానికి దీన్ని అజెండాగా తీసుకున్నారు. అబద్ధాలతో ప్రజలను వంచించే ప్రయత్నం చేస్తున్నారు. -
ప్రభుత్వ ధరకు కొనాల్సిందే.. నష్ట పరిచే చర్యలు వద్దు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రస్తుత సీజన్లో పండించిన రొయ్యలను రైతుల వద్ద నుంచి ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, ఎక్స్‌పోర్టర్లు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కచ్చితంగా కొనుగోలు చేయాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) వైస్ చైర్మన్ వడ్డి రఘురాం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఒంగోలు నగరంలో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు చెందిన ఆక్వా రైతుల సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ ఆక్వా రైతుల సదస్సుకు రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, ఎక్స్‌పోర్టర్లు, ట్రేడర్లను కూడా ఆహ్వానించారు. ప్రకాశం జిల్లా రొయ్య రైతుల సంఘం కన్వీనర్ దుగ్గినేని గోపీనాథ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాం మాట్లాడుతూ రొయ్యల రైతులను నష్టపరిచే పనులు ఏ ఒక్కరూ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ‘‘సాధికార కమిటీలో 100 కౌంటు రొయ్యలకు కిలో రూ.240 నిర్ణయించాం. కానీ 100 కౌంటును రూ.225కు కొనుగోలు చేస్తున్నారు. ధర లేదంటే ప్రభుత్వం ఒక మెట్టు దిగి 100 కౌంటును రూ.210 తగ్గించి నిర్ణయం తీసుకుంది. అయినా ఆ ధరకు కూడా కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. మీకు గిట్టుబాటు కాకపోతే చెప్పండి... 10 ఎకరాలు సాగుచేసే రైతును 5 ఎకరాలు సాగుచేయమంటారా’’ అని నిలదీశారు. అలా చెబితే రైతులు మానసికంగా నిర్ణయించుకుంటారని సలహా కూడా ఇచ్చారు. రైతు వద్ద ఒక కౌంటు రొయ్యలు ఉంటే లేని కౌంటు రొయ్యలను రైతులను అడుగుతున్నారని వారు చెబుతున్నారని..ఇదే విధంగా కొనసాగితే ప్రాసెసింగ్ ప్లాంట్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. విద్యుత్ సమస్యతో పాటు రొయ్యల రైతులకు ఉన్న అన్ని సమస్యలపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులతో సమీక్షిస్తున్నారని, 15 రోజుల్లో సీఎం రొయ్యల రైతులకు శుభవార్త చెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా రొయ్య రైతుల సంఘం కన్వీనర్ దుగ్గినేని గోపీనా«థ్ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో ప్రసంగించిన వారిలో జిల్లా ఎక్స్‌పోర్టర్ల సంఘం అధ్యక్షుడు మున్నంగి రాజశేఖర్, రైతులు టంగుటూరుకు చెందిన దివి హరిబాబు, కొత్తపట్నంకు చెందిన శ్రీనివాస రావు, నెల్లూరు జిల్లాకు చెందిన చంద్రశేఖర నాయుడు, గూడూరుకు చెందిన శ్రీనాథ్‌రెడ్డి, నరేంద్ర, నెల్లూరు జిల్లా కోటకు చెందిన వెంకురెడ్డితో పాటు జిల్లా మత్స్యశాఖ జేడీ చంద్ర శేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం మన దేశం నుంచి ఈ సంవత్సరం 8.50 లక్షల టన్నులు ఎగుమతి చేస్తున్నాం. ఈక్విడార్ దేశంలో 8.85 లక్షల టన్నులు ఎగుమతి చేస్తోంది. వాళ్లకు ఇచ్చే ధర ఇక్కడ ఎందుకు ఇవ్వరు. పలు దేశాల్లో 100 కౌంటుకు కిలో రూ.300 నుంచి రూ.350 వరకు ఇస్తున్నారు. ఇక్కడ ఎందుకు సాధ్యం కావటం లేదో చెప్పండి. ప్రభుత్వం చొరవ తీసుకొని అందరినీ ఒకచోటకు చేర్చి సదస్సులు నిర్వహిస్తోంది. ఆక్వా రైతు అప్పుల పాలు కాకుండా చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. – మోహన రాజు, రొయ్య రైతుల సంఘం జాతీయ అధ్యక్షుడు ఈ సీజన్లో రైతులను ఆదుకోండి ఈ సీజన్లో సిద్ధంగా ఉన్న రొయ్యలను కొనుగోలు చేసి ఆదుకోండి. ప్రభుత్వం ఆక్వా రైతుల పక్షాన నిలబడింది. ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, ఎక్స్‌పోర్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో జిల్లాల వారీగా ఆక్వా రైతులతో పాటు రొయ్యలను కొనుగోలు చేస్తున్న సంస్థల యజమానులను కూడా సదస్సులకు పిలిపిస్తోంది. ఇది మంచి పరిణామం. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా అందరితో కలిపి సంయుక్తంగా సదస్సులు నిర్వహించలేదు. – దుగ్గినేని గోపీనా«థ్, ప్రకాశం జిల్లా ఆక్వా రైతు సంఘం కన్వీనర్ ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కొనుగోలు ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రొయ్యలను కొనుగోలు చేస్తాం. నేను కూడా 1500 ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నాను. సాగులో నేను కూడా నష్టపోతున్నాను. అయితే ఈ సంక్షోభం తాత్కాలికమే. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆక్వా రంగంలో ఎదురవుతున్న సంక్షోభంపై చొరవ చూపుతోంది.గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా చొరవ చూపలేదు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతులకు అండగా ఉండాలని నిర్ణయించి జిల్లాల వారీగా రైతులు, ఎక్స్‌పోర్టర్లతో సమావేశాలు ఏర్పాటు చేయటం మంచి పరిణామం. రైతులు కూడా ఖర్చులు తగ్గించుకోవాలి. – బీద మస్తాన్ రావు, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు ఈ రెండు జిల్లాల్లో 50 టన్నులు కొంటాం ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉత్పత్తి అయ్యే రొయ్యలను తాము ఇక నుంచి 50 టన్నులు కొనుగోలు చేస్తాం. సింగరాయకొండ, నెల్లూరు జిల్లాల్లో ఉండే ప్రాసెసింగ్ ప్లాంట్లకు ఈ రెండు జిల్లాల నుంచే కొనుగోలు చేస్తాం. బయట జిల్లాల నుంచి ఇక్కడకు తెప్పించేది లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కొనుగోలు చేస్తాం... చేస్తున్నాం. రైతులు చిన్నసైజు రొయ్యల ఉత్పత్తినే లక్ష్యంగా పెట్టుకోవద్దు. మిగతా సంస్థల చేత కూడా కొనుగోలు చేయిస్తాం. – బ్రహ్మానందం, ఏపీ ఎక్స్‌పోర్టర్ల సంఘం అధ్యక్షుడు, దేవీ సీఫుడ్స్ చైర్మన్ -
‘వీరంతా సిండికేట్‌గా ఏర్పడి ఆక్వా రంగాన్ని పాడు చేశారు’
శ్రీకాకుళం: చంద్రబాబుకు పెట్టుబడి పెట్టే పెట్టుబడిదార్లు ఆక్వా రంగంలో స్థిర పడ్డారని, వీరంతా ఒక సిండికేట్‌గా ఏర్పడి వ్యవస్థను పాడు చేశారని మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. చంద్రబాబు వదిలి వెళ్లిపోయిన రూ. 330 కోట్ల బకాయిలను సైతం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించిందన్నారు. శుక్రవారం ప్రెస్‌మీట్ నిర్వహించిన మంత్రి అప్పలరాజు.. ‘వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడ్డాక ఆక్వారంగానికి 2వేల ఆరువందల కోట్ల రూపాయిలు పవర్ సబ్సిడీ చెల్లించాం. సీఎం జగన్ తన పాదయాత్రలో యూనిట్ విద్యుత్ రూపాయిన్నరకు ఇస్తామన్న తర్వాత, చంద్రబాబు రెండు రూపాయిలు అని ప్రకటించి ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వలేదు. ఆక్వా రైతులను ఆదుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. చంద్రబాబు పరిపాలన కాలంలో రూపాయిన్నరకు విద్యుత్ ఎందుకు ఇవ్వలేదు. ఆక్వా ప్రాసెస్, సీడ్ మిల్లర్లు వద్ద డబ్బులు వసూలు చేస్తున్నామని అంటున్నారు.. దీనికి సంబంధించి ఒక్కరితోనైనా మాట్లాడించగలరా. చంద్రబాబుకు పెట్టుబడి పెట్టే పెట్టుబడి దార్లు ఆక్వారంగంలో స్థిరపడ్డారు. వీరంతా ఒక సిండికేట్‌గా ఏర్పడి వ్యవస్థను పాడుచేసారు. ఆక్వారంగంలో మాఫియా ను సీఎం జగన్ ఆడ్డుకోకపోతే ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఆక్వారంగం కుదేలు అయిపోయేది. ప్రపంచంలో ఆర్దిక మాంద్యం, ప్రపంచ మార్కెట్ ధరల నేపధ్యంలో ఎగుమతులు తగ్గాయి. ప్రతికూల పరిస్థితుల్లో సీఎంజగన్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడింది. ఆక్వా ఎగుమతిదార్లకు ఎదరువతున్న సమస్యలు పరిష్కారానికి కమిటీ వేసి సమీక్ష చేస్తున్నాం. ఆక్వా రంగంలో సంస్కరణలు తెచ్చి చట్టాలు చేశాం.చంద్రబాబు పాలనలో ఆక్వారంగం స్టేక్ హోల్డర్స్ తో ఎప్పుడైనా మాట్లాడారా’ అని ప్రశ్నించారు. -
ఏపీలో తొలి ఆక్వా వర్సిటీ
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఆక్వా కల్చర్ సుస్థిర అభివృద్ధి కోసం రాష్ట్రంలో మొట్టమొదటి ఆక్వా యూనివర్సిటీని నరసాపురంలో నెలకొల్పుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఇది దేశంలో మూడో ఆక్వా యూనివర్సిటీ కానుందని చెప్పారు. ఫిషరీస్ పాలిటెక్నిక్ డిప్లొమా నుంచి పీహెచ్డీ వరకు ఇక్కడ అందుబాటులోకి తెచ్చి ఆక్వా కల్చర్‌లో మానవ వనరుల కొరత తీరుస్తామన్నారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో రూ.3,300 కోట్ల విలువైన 15 అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపనలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ఆ వివరాలివీ.. నరసాపురం చరిత్రలో తొలిసారిగా.. పవిత్ర కార్తీక మాసంలో చివరి సోమవారం రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. ఒకేరోజు సుమారు రూ.3,300 కోట్ల నిధులతో 15 అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించాం. ఇన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం నరసాపురం చరిత్రలో బహుశా మునుపెన్నడూ జరిగిన దాఖలాలు లేవు. నరసాపురం, నియోజకవర్గం రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలను మీ ముందుంచుతున్నా. ఫిషరీస్ యూనివర్సిటీ ఇక్కడ ఆక్వా కల్చర్ ప్రధానమని మనందరికీ తెలుసు. మెరైన్ ప్రొడక్షన్, ఎక్స్‌పోర్ట్స్‌లో మన రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ఆక్వా కల్చర్‌కు సంబంధించిన స్కిల్, పరిజ్ఞానం పిల్లలకు అందుబాటులోకి వస్తే మెరుగైన ఉద్యోగాలు, మెరుగైన జీతాలు లభిస్తాయి. ప్రపంచంలో ఎక్కడ అవసరమున్నా మన వారి నైపుణ్యాన్ని వినియోగించేలా గొప్ప చదువు అందించేందుకు ఇవాళ నాంది పలుకుతున్నాం. ఆక్వా కల్చర్ సుస్థిర అభివృద్ధి కోసం ఫిషరీస్ పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్స్, బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ డిగ్రీ హోల్డర్లు, మాస్టర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ పీజీ, డిగ్రీ హోల్డర్లతో ఆక్వా కల్చర్‌లో మానవ వనరుల కొరత తీర్చేందుకు ఆక్వా విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటివరకు దేశంలో తమిళనాడు, కేరళలలో మాత్రమే ఇవి ఉండగా మూడో వర్సిటీ మన రాష్ట్రంలో ఏర్పాటవుతోంది. రూ.332 కోట్లతో ఈ యూనివర్సిటీని నరసాపురంలో నెలకొల్పుతున్నాం. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కూడా పూర్తై పనులు ప్రారంభించడానికి శ్రీకారం చుట్టాం. మత్స్యకారులకు మేలు చేస్తూ.. ముమ్మిడివరంలో ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల ప్రభావితమైన 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు ఇక్కడి నుంచే బటన్ నొక్కి రూ.108 కోట్లు విడుదల చేశాం. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల నష్టపోయిన మత్స్యకారులకు మంచి చేసేందుకు గత ప్రభుత్వం ఏనాడూ ముందుకు రాలేదు. ఇప్పుడు మన ప్రభుత్వ హయాంలో వారందరికీ మేలు చేసేలా చర్యలు చేపట్టాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకులాల్లోని పేదలంతా కూడా జగనన్న ప్రభుత్వమంటే మన ప్రభుత్వమనేలా ప్రతి అడుగూ వేస్తున్నాం. ఉప్పుటేరుపై రూ.188 కోట్లతో.. నరసాపురంలోనే ఉప్పుటేరుపై మోళ్లపర్రు వద్ద రెగ్యులేటర్ నిర్మించాలని ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. వారి కోరికను నెరవేరుస్తూ ఈరోజు శంకుస్థాపన చేశాం. ఉప్పునీరు కొల్లేరులోకి రాకుండా రైతులకు మంచినీరు ఇంకా మెరుగ్గా అందేలా, కొల్లేరులో ఐదో కాంటూరు వరకు మంచినీరు నిల్వ ఉండేలా ఉప్పుటేరుపై రూ.188 కోట్లతో రెగ్యులేటర్ కమ్ బ్రిడ్జి లాక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. వంద పడకలతో ఏరియా ఆసుపత్రికి కొత్త భవనం నరసాపురంలో రూ.1,300 కోట్లతో ఏరియా ఆసుపత్రికి కొత్త భవనాన్ని నిర్మించి జాతికి అంకితం చేస్తూ ప్రారంభించాం. ఈ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచడంతో పాటు మరో రూ.66 లక్షల విలువైన వైద్య పరికరాలను అందించి ఆక్సిజన్ ప్లాంట్, జనరేటర్ కూడా అందుబాటులోకి తెచ్చాం. రూ.1,400 కోట్లతో వాటర్ గ్రిడ్ ఇక్కడ ఒకపక్క గోదావరి మరోపక్క సముద్రతీర ప్రాంతం ఉన్నా తాగడానికి గుక్కెడు నీళ్లు లేని దుస్థితిని నా పాదయాత్ర సమయంలో చూశా. బోరు వేస్తే ఉప్పునీరు వస్తోందని, ఆక్వా కల్చర్ సాగుతో ఉపరితల జలాలు కలుషితమవుతున్న నేపథ్యంలో తాగునీరు లేకుంటే ఎలా బతకాలన్న ఈ ప్రాంత ప్రజల ఆవేదనను తొలగిస్తూ ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.1,400 కోట్లతో రక్షిత మంచినీటి సరఫరా వాటర్ గ్రిడ్ పథకానికి శంకుస్థాపన చేశాం. విజ్జేశ్వరం వద్ద గోదావరి నీటిని ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ల ద్వారా అక్కడే శుద్ధి చేసి పైప్‌లైన్ ద్వారా సరఫరా చేస్తాం. ఈ పథకం ద్వారా తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని నిడదవోలు, తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, ఉంగుటూరు, ఏలూరు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల ప్రజలతో పాటు కృష్ణా జిల్లాలోని కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన, గుడ్లవల్లేరు మండలాల ప్రజలకు సురక్షిత తాగునీరు సరఫరా అవుతుంది. మొత్తం 26 మండలాల్లో 1,178 గ్రామాలకు చెందిన సుమారు 18.50 లక్షలమంది ప్రజలకు దీనిద్వారా మేలు జరుగుతుంది. 2,240 ఎకరాలకు సాగునీరు, తాగునీరు నరసాపురంలో రూ.87 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఫేజ్ 1కి శంకుస్థాపన చేశాం. మరో రూ.26 కోట్లతో వశిష్ట వారధి, బుడ్డిగవాని రేవు ఏటిగట్టు పటిష్టం చేయడంతోపాటు రూ.7.83 కోట్లతో శేషావతారం పంట కాలువ అభివృద్ధి, టైల్ డ్యామ్ నిర్మాణం, సీసీ లైనింగ్ పనులకు కూడా శ్రీకారం చుట్టాం. మొగల్తూరు పంట కాలువ అభివృద్ధి పనులను రూ.24 కోట్లతో చేపట్టాం. 2,240 ఎకరాలకు సాగునీరు, వాటి పరిధిలోని గ్రామాలకు తాగునీరు అందుతుంది. కాజ, ఈస్ట్ కొక్కిలేరు, ముస్కేపాలెం, మడుగు తూముల స్లూయిజ్‌ల పునర్నిర్మాణ పనులకు రూ.9 కోట్లతో శంకుస్థాపన చేశాం. ఒక్క నరసాపురం అభివృద్ధి పనుల గురించి చెప్పేందుకే ఇంత సమయం పట్టిందంటే ప్రజలకు ఎంత మంచి జరుగుతుందో ఆలోచించండి. పాలకొల్లు మెడికల్ కాలేజీ.. పాలకొల్లులో రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ పనులు ప్రారంభమయ్యాయి. వశిష్ట బ్రిడ్జి నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. కోర్టుల్లో వేసిన కేసులను పరిష్కరించి కేంద్రాన్ని ఒప్పించాం. జనవరిలో బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలుస్తాం. హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు.. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, తానేటి వనిత, సీదిరి అప్పలరాజు, అంబటి రాంబాబు, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మార్గాని భరత్, చింతా అనురాధ, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.3500 కోట్లతో 9 హార్బర్లు ఆరు వేల మంది మత్స్యకారులకు మేలు చేసేలా నరసాపురం ప్రాంతంలోని బియ్యపుతిప్ప వద్ద ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. రూ.430 కోట్ల వ్యయంతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కానుంది. హార్బర్లో 640 మీటర్ల బెర్తు, 2,400 మీటర్ల బ్రేక్ వాటర్ నిడివి ఉండేలా బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్‌ను నిర్మిస్తున్నాం. ప్లాట్‌ఫామ్స్, వేలం కోసం హాల్స్, డ్రైయింగ్ యార్డ్స్, బోట్ పార్కింగ్ ఏరియా, మత్స్యకారులకు విశ్రాంతి గదులు, కోల్డ్ స్టోరేజీలు తదితర సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. మన రాష్ట్ర మత్స్యకారులు గుజరాత్ సహా ఇతర రాష్ట్రాలకు వెళ్లి బతకాల్సిన అవసరం రాకుండా ఇక్కడే తలెత్తుకుని జీవించేలా తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను రూ.3,500 కోట్లతో ఏర్పాటు చేస్తున్నాం. అగ్రికల్చర్ కంపెనీ భూములపై రైతులకు హక్కులు నరసాపురంలో అగ్రికల్చర్ కంపెనీ భూములపై పూర్తి హక్కులను రైతులకు ఈ రోజు నుంచి కల్పిస్తున్నాం. 1921లో బ్రిటీష్ ప్రభుత్వం దర్భరేవులో 1,754 ఎకరాల భూమిని నరసాపురం అగ్రికల్చర్ కంపెనీకి 99 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది. ఆనాటి నుంచి 1,623 మంది రైతులు సాగు చేస్తున్నప్పటికీ ఆ భూములపై వారికి ఎలాంటి హక్కులూ లేకపోవడంతో ప్రయోజనాలు అందని పరిస్థితి నెలకొంది. ఎన్నికల్లో నాడు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వారికి రిజిస్ట్రేషన్ చేసి పట్టాలను అందిస్తున్నాం. రైతుల కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపించాం. ఎకరానికి కేవలం రూ.100తో రైతులకు రిజిస్ట్రేషన్ చేసి వారికి హక్కులు కల్పించాం. నీటి ఎద్దడిని శాశ్వతంగా నివారించేలా.. నరసాపురంలో శాశ్వతంగా నీటి ఎద్దడి నివారణ, రక్షిత మంచి నీటి సరఫరా కోసం ఫిల్టరేషన్ ప్లాంట్, సర్వీస్ రిజర్వాయర్లు, వాటర్ సప్లై పైప్‌లైన్ పనులకు నేడు శంకుస్థాపన చేశాం. రూ.62 కోట్ల వ్యయంతో మంచినీటి సరఫరా ప్రాజెక్టు చేçపట్టాం. రూ.4 కోట్లతో నరసాపురం బస్‌స్టేషన్ అభివృద్ధి, కొత్త ప్లాట్‌ఫాంలు నిర్మించి నేడు వాటిని ప్రారంభించాం. బ్రిటీషర్ల కాలంలో నిర్మించిన ట్రెజరీ ఆఫీస్ బిల్డింగ్ నూతన భవనానికి శంకుస్థాపన చేశాం. పారిశ్రామిక, వ్యవసాయ, ఆక్వా రంగానికి మెరుగైన విద్యుత్ అవసరాల కోసం 220/132/33 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి రూ.132 కోట్లు మంజూరు చేసి శంకుస్థాపన చేశాం. దీనివల్ల నరసాపురం, మొగల్తూరు, పాలకొల్లు, యలమంచిలి మండలాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుంది. పారదర్శకంగా రూ.1,76,516 కోట్లు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేద ఓసీల అభివృద్ధికి కట్టుబడిన మన ప్రభుత్వ పాలనలో ఎలాంటి లంచాలు, అవినీతికి తావు లేకుండా బటన్ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో మూడేళ్ల ఐదు నెలల వ్యవధిలో రూ.1,76,516 కోట్లు జమ చేశాం. మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, బైబిల్‌గా, ఖురాన్‌గా భావించి 98 శాతం హామీలను నెరవేర్చాం. మేనిఫెస్టోలో చెప్పనివి కూడా అమలు చేస్తున్నాం. వైద్యం, ఆరోగ్యం, ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలాలు, విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత.. ఇలా ఏ రంగం చూసినా పారదర్శకంగా పరిపాలన అందిస్తున్నాం. చంద్రబాబు 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నడూ చేయనివిధంగా గత పాలకుల ఊహకు కూడా అందని విధంగా దేవుడి దయతో అన్ని వర్గాలకు అండగా, తోడుగా మీ బిడ్డ నిలబడ్డాడు. -
ఫిషింగ్ హార్బర్‌పై పచ్చ కుట్ర
పచ్చకుట్రలకు హద్దూపద్దూ లేకుండాపోతోంది. లక్షలాది మంది మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణంపై కుట్రలకు తెగబడింది. చివరి దశకు చేరుకున్న హార్బర్ నిర్మాణం పూర్తయితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, టీడీపీకి పుట్టగతులు లేకుండా పోతాయనే ఆక్రోశంతో అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. మత్స్యకారులకు వర ప్రసాదినిగా మారుతున్న హార్బర్ నిర్మాణాన్ని ఎలాగైనా అడ్డుకోవాలనే విద్వేషాలు రెచ్చగొట్టేలా రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు. బిట్రగుంట(పీఎస్ఆర్ నెల్లూరు): టీడీపీ నేతలా మజకా. ప్రభుత్వ భూములను దర్జాగా ఆక్రమించారు. రొయ్యల గుంతలుగా మార్చుకుని ఏళ్ల తరబడి అనుభవిస్తున్నారు. ఆ భూమిని లక్షలాది మత్స్యకారుల జీవితాలను మార్చే ఫిషింగ్ హార్బర్‌కు కేటాయించడంతో స్వాధీనం చేసేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులకు టీడీపీ నేతల ఆక్రమణలు కనిపించాయి. వీటిని తొలగించేందుకు ప్రయత్నించిన అధికారులకు రొయ్యలు సాగులో ఉన్నాయి... రెండు నెలలు గడువిస్తే స్వాధీనం చేస్తామని లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేశారు. సరే కదా అని గడువిస్తే.. ఇప్పుడు రెవెన్యూ అధికారులను అడ్డుకోవడంతో పాటు నిర్ధాక్షిణ్యంగా రొయ్యల గుంతలు తొలగిస్తున్నారంటూ పచ్చ మీడియా, సోషల్ మీడియా వేదికగా అసత్య, విష ప్రచారాలు సాగిస్తున్నారు. రెవెన్యూ అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అసలు వాస్తవాలు ఇవీ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేలా, గంగపుత్రుల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేలా రాష్ట్ర ప్రభుత్వం జువ్వలదిన్నె వద్ద సుమారు రూ.300 కోట్ల వ్యయంతో ఫిషింగ్ హార్బర్‌ను మంజూరు చేసింది. ఇందుకోసం సర్వే నంబర్లు 1197, 1198, 1196, 1194, 1199, 1200, 1201,1202, 1203, 1204, 1205, 1206లో 76.87 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించారు. వీటిలో 1205, 1206 సర్వే నంబర్లతో పాటు మరికొన్ని సర్వే నంబర్లలోని సుమారు 45 ఎకరాల భూమి చుక్కల భూమిగా నమోదై ఉండడంతో ప్రభుత్వ పోరంబోకు భూమిగా మార్పు చేస్తూ కలెక్టర్‌కు స్థానిక రెవెన్యూ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఈ మేరకు ఫారం–5 ద్వారా స్థానికుల నుంచి కూడా అభ్యంతరాలు స్వీకరించారు. స్థానికులు ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడంతో చుక్కల భూమిగా నమోదైన 45 ఎకరాల భూమిని ప్రభుత్వ పోరంబోకు భూమిగా మారుస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. శాఖాపరంగా అన్ని ప్రక్రియలు పూర్తిచేసిన తర్వాత మొత్తం 76.89 ఎకరాల భూమిని హార్బర్ నిర్మాణం కోసం మత్స్యశాఖకు అందజేశారు. ప్రభుత్వం కూడా త్వరితగతిన టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నిధులు విడుదల చేయడంతో హార్బర్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. జనవరి నాటికి పనులు పూర్తి చేసి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇప్పటికే 75 శాతం పనులు పూర్తి చేసిన ప్రస్తుతం హార్బర్ చుట్టూ ప్రహరీ నిర్మాణం చేస్తున్నారు. ఆక్రమణలతో అడ్డుకునే కుట్ర ప్రస్తుతం ఫిషింగ్ హార్బర్ ప్రహరీ 1205, 1206 సర్వే నంబర్ల మీదుగా నిర్మాణం జరగాల్సి ఉంది. ఈ సర్వే నంబర్లలో మొత్తం 12.04 ఎకరాల భూమి ఉండగా కావలిరూరల్ మండలం తుమ్మలపెంటకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఆక్రమించుకుని రొయ్యల గుంతలు సాగు చేసుకుంటున్నారు. దీంతో ఆక్రమణలు తొలగించి హార్బర్ నిర్మాణానికి సహకరించాల్సిందిగా మత్స్యశాఖ రెవెన్యూ అధికారులకు సూచనలు చేసింది. రొయ్యల గుంతలు ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులకు సూచించగా ప్రస్తుతం రొయ్యలు సాగులో ఉన్నాయని 60 రోజులు గడువు కావాలని కోరారు. ఈ మేరకు ఆక్రమణదారులు సెప్టెంబర్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయడంతో రొయ్యలు పట్టుబడి అయ్యేంత వరకు రెవెన్యూ అధికారులు ఆగారు. ఇందుకు సంబంధించిన ఎండార్స్‌మెంట్‌ను కూడా ఆక్రమణదారులకు అందించారు. ప్రస్తుతం రొయ్యల పట్టుబడి పూర్తవడంతో రెండు రోజుల క్రితం అధికారులు గుంతలు తొలగించేందుకు వెళ్లగా తుమ్మలపెంటకు చెందిన టీడీపీ నాయకులు అడ్డుతగిలి నానా హంగామా చేశారు. ఈ భూములను 2012లో అగ్రిమెంట్ ద్వారా కొనుగోలు చేశామని, ప్రస్తుతం తమకు రూ.3 కోట్లు పరిహారం చెల్లించి స్వాధీనం చేసుకోవాలని వాదనకు దిగారు. రెవెన్యూ అధికారులు నిబంధనల మేరకు గ్రామస్తులు, స్థానిక సంస్థల ప్రతినిధుల సమక్షంలో పంచనామా నిర్వహించి ఖాళీగా ఉన్న రెండు గుంతలను తొలగించారు. అయితే టీడీపీ నాయకులు మాత్రం రొయ్యల గుంతలు ధ్వంసం చేసి రూ.1.5 కోట్ల మేర నష్టం కలిగించారంటూ సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తూ గొడవలు సృష్టించేలా పోస్టులు పెడుతున్నారు. కోర్టుకెళ్లి హార్బర్ నిర్మాణాన్ని అడ్డుకుంటామని శపథాలు చేస్తుండడంతో మత్స్యకారుల్లో ఆందోళన మొదలైంది. దీంతో స్థానికంగా శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే పరిస్థితి నెలకొంది. ఆ 12.04 ఎకరాలు ప్రభుత్వ భూములే ఫిషింగ్ హార్బర్‌కు కేటాయించిన భూముల్లో సర్వే నంబర్లు 1205, 1206లో ఉన్న 12.04 ఎకరాల భూమి పూర్తిగా ప్రభుత్వానికి చెందిందే. చుక్కల భూమిగా ఉన్న ఈ భూమిని ప్రభుత్వ పోరంబోకు భూమిగా మార్చే సమయంలో కూడా స్థానికుల నుంచి అభ్యంతరాలు స్వీకరించాం. ఎటువంటి అభ్యంతరాలు రాకపోవడంతో నిబంధనల మేరకు చుక్కల భూమి నుంచి ప్రభుత్వ పోరంబోకు భూమిగా మార్చి హార్బర్‌కు కేటాయించడం జరిగింది. ప్రభుత్వ భూమిని అగ్రిమెంట్ల ద్వారా విక్రయించడం, కొనుగోలు చేయడం చెల్లదు. రొయ్యల గుంతలు ఖాళీ చేసేందుకు ఆక్రమణదారులకు 60 రోజులకు పైగా గడువు కూడా ఇవ్వడం జరిగింది. రొయ్యలు పట్టుబడి చేసిన తర్వాత గ్రామస్తులు, సర్పంచ్, ఎంపీటీసీల సమక్షంలో పంచనామ నిర్వహించి ఖాళీగా ఉన్న రెండు గుంతలు మాత్రమే తొలగించాం. – లక్ష్మీనారాయణ, తహసీల్దార్, బోగోలు -
రొయ్యల మార్కెట్‌ను కుదిపేస్తున్న ‘ఈక్వెడార్’
ఆకివీడు: ఈక్వెడార్.. ఓ బుల్లి దేశం. అంతర్జాతీయంగా రొయ్యల మార్కెట్‌కు పెద్ద దెబ్బే కొట్టింది. మొత్తం ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది. నాణ్యతతో కూడిన రొయ్యలను తక్కువ ధరకు ఎగుమతి చేస్తుండటంతో ఇతర దేశాల రొయ్యల ధరలు పడిపోయాయి. ఈ ప్రభావం రాష్ట్రంలోని రొయ్యల ఎగుమతులపైనా పడింది. ధరలు తగ్గిపోయి, రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా రొయ్యల ఉత్పత్తి 5049.5 మెట్రిక్ టన్నులు. ఇందులో ఇండియా వాటా 700 మెట్రిక్ టన్నులు.మన దేశం నుంచి ప్రాసెసింగ్ జరిగిన రొయ్యలు అమెరికా, చైనా, జపాన్, బంగ్లాదేశ్ దేశాలకు ఎగుమతి అవుతాయి. ఆ దేశాల్లో ప్యాకింగ్ చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఇటీవలి కాలంలో రొయ్యల సాగులో ఈక్వెడార్ తారాజువ్వలా దూసుకొచ్చింది. గత ఆరు నెలల్లో ఏకంగా 1,150 మెట్రిక్ టన్నుల రొయ్యలు ఉత్పత్తి చేసింది. దీనిలో 1,010 మెట్రిక్ టన్నులు వనామి, మిగిలినవి టైగర్ రొయ్య. 2021లో ఈక్వెడార్ ఉత్పత్తులు 1,010 మెట్రిక్ టన్నులు మాత్రమే. అయితే, గత ఆరు నెలల్లోనే అక్కడ అంతకు మించి రొయ్యల ఉత్పత్తి జరిగింది. పైగా, ఈక్వెడార్‌లో వేగంగా యాంత్రీకరణ జరిగి, రొయ్యల ఉత్పత్తి వ్యయం బాగా తగ్గింది. ఎకరాకు 50 వేల పిల్లలను మాత్రమే పెంపకానికి వినియోగిస్తారు. ఎగుమతుల ఖర్చు తక్కువ. ఆరు నెలల్లోనే కౌంట్‌కు వస్తున్నాయి. ఈక్వెడార్‌లో తల్లి రొయ్య నుంచి 3 నుంచి 5 సార్లు మాత్రమే సీడ్ తీస్తారు. దీంతో నాణ్యమైన సీడ్ రైతులకు లభిస్తుంది. ఇది వైరస్లు, వ్యాధులను తట్టుకుంటుంది. దీంతో ఉత్పత్తి నాణ్యత ఎక్కువగా ఉంది. మన దేశంలో తల్లి రొయ్య నుంచి 10 నుంచి 15 సార్లు సీడ్ తీస్తున్నారు. దీంతో నాసిరకం, ఇమ్యూనిటీ లేని రొయ్య సీడ్ వస్తోంది. దీనినే పెంపకందారులకు సరఫరా చేస్తున్నారు. ఇటువంటి రొయ్యలు వ్యాధులు, వైట్‌గట్ తదితర వైరస్ల బారిన పడుతున్నాయి. 30, 40, 50 కౌంట్ రొయ్యల పెంపకానికి మన దేశంలో.. ముఖ్యంగా డెల్టా ప్రాంతాల్లో రూ.250 పైబడి ఖర్చవుతుంది. దీంతో పోలిస్తే ఈక్వెడార్‌లో అన్ని కౌంట్ రొయ్యలు రూ.100 తక్కువకు లభిస్తున్నాయి. దీంతో మన దేశం రొయ్యలకు ఆర్డర్లు తగ్గిపోయాయి. చైనా, అమెరికా దేశాల నుంచి ఆర్డర్లు రావడంలేదని బయ్యర్లు వాపోతున్నారు. మంచి ధర లభించేలా ప్రభుత్వ చర్యలు.. రొయ్య రైతులను ఆదుకునేందుకు గత రెండు నెలలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. రొయ్య ధరలు తగ్గకుండా చూసేందుకు ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ యూనిట్ యజమానులతో సంప్రదింపులు జరిపేందుకు ముగ్గురు మంత్రులతో కూడిన సాధికార కమిటీని నియమించింది. నిపుణుల కమిటీని వేసి పరిశీలన జరుపుతోంది. సాధికార కమిటీ నిత్యం రొయ్యల మార్కెట్‌ను సమీక్షిస్తోంది. ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతి సంస్థలు, సీడ్, ఫీడ్ ఉత్పత్తిదారులతో సంప్రదింపులు జరుపుతోంది. మేత ధరలు తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా నాణ్యమైన రొయ్య ఉత్పత్తికి చర్యలు తీసుకుంది. దీనివల్ల కొద్ది రోజుల్లోనే మన రాష్ట్రంలోని రొయ్యలకు కూడా మంచి డిమాండ్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అక్కడ ఉత్పత్తి వ్యయం తక్కువ.. నాణ్యత ఎక్కువ అంతర్జాతీయ రొయ్యల మార్కెట్లో ఈక్వెడార్ విపరీతంగా పోటీనిస్తోంది. అక్కడ ఉత్పత్తి వ్యయం తక్కువ. నాణ్యత ఎక్కువ. పోటీని తట్టుకునేందుకు మన దేశంలో నాణ్యమైన రొయ్య సీడు రైతులకు అందజేయాలి. మేత, మందుల ధరలను నియంత్రించాలి. ఉత్పత్తి వ్యయం బాగా తగ్గాలి. ఆధునిక పద్ధతులు వినియోగించాలి. ప్రభుత్వ సబ్సిడీలు కొనసాగించాలి. ఆక్వా రైతులకు తర్ఫీదు ఇవ్వాలి. ఈ ఏడాది చివరి నాటికి ఈక్వెడార్ ఉత్పత్తులు రెండువేల మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందని అంచనా. అప్పటికల్లా మనమూ పోటీని తట్టుకొని నిలబడగలగాలి. – గోవిందరావు, ఆక్వా కన్సల్టెంట్, ఆకివీడు, పశ్చిమగోదావరి జిల్లా ఒడుదుడుకులు తాత్కాలికమే ఆక్వా మార్కెట్లో ఒడుదుడుకులు తాత్కాలికమే. రొయ్య ధరలు తగ్గకుండా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంది. మంత్రుల కమిటీ, నిపుణుల కమిటీలను వేసి పరిశీలన చేస్తోంది. ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులతో సంప్రదింపులు జరుపుతోంది. త్వరలోనే రొయ్యలకు మంచి ధర లభిస్తుంది. –కేఎస్వీ నాగ లింగాచారి, జిల్లా మత్స్య శాఖ, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా -
రొయ్యల కొనుగోళ్లు: కోతేస్తే.. కొరడా
అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకుల కారణంగా ఆక్వా ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. ధరల పతనంతో రొయ్య రైతులు దిగాలు పడ్డారు. ఈ సమయంలో ప్రభుత్వం అండగా నిలబడింది. గిట్టుబాటు ధర కల్పించేందుకు ముందుకొచ్చింది. ధరల స్థిరీకరణకు ఆక్వా సాధికారత కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేయని ప్రాసెసింగ్ కంపెనీలపై కొరడా ఝులిపించేందుకు రంగం సిద్ధం చేసింది. మరో వైపు ఆక్వా రైతులు, ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు, సీడ్, ఫీడ్ తయారీదారులు సమన్వయంతో ముందుకు సాగేలా చర్యలు చేపట్టింది. ఎప్పుటికప్పుడు ధరలను సమీక్షిస్తూనే రైతుల కోసం జిల్లా మత్స్యశాఖ అధికారులు హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. హెల్ప్‌లైన్ నంబర్లు : 9392905878, 9392905879 సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దాదాపు 16 వేల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. ప్రధానంగా రొయ్యల సాగు చేపడుతున్నారు. రొయ్యల సాగును మూడు విడతల్లో చేపడతారు. ప్రధాన రెండు సీజన్లలో అధిక సంఖ్యలో రైతులు అధిక మొత్తంలో దిగుబడి సాధిస్తారు. ఒక్కో సీజన్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దాదాపు 30 వేల టన్నుల రొయ్యల దిగుబడి వస్తోంది. ఈ మొత్తాన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్లు కొనుగోలు చేయాల్సిందే. జిల్లాలో ఉన్న ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్లు దేవీ సీ ఫుడ్స్, జీవీఆర్ ఆక్వా, మున్నంగి ఆక్వా, సదరన్ ఆక్వా, కళ్యాణి ఆక్వా, నీలా ఆక్వా, క్రిస్టల్ ఆక్వా, రాయల్ ఆక్వా, ఆక్వా టీకాలు కొనుగోలు చేయాలి. ఇదిలా ఉండగా అంతర్జాతీయంగా ఏర్పడిన సంక్షోభంతో రొయ్యల ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. దీనిని సాకుగా చూపి వ్యాపారులు రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఆక్వా వ్యాపారులు, ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులు, ఎగుమతిదారులు కుమ్మక్కై కూడబలుక్కుని రొయ్యలు సాగు చేస్తున్న రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. దీంతో నీలివిప్లవానికి పెట్టింది పేరైన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రొయ్యల రైతులు విలవిల్లాడిపోతున్నారు. ఈ దశలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. గత నెల 17వ తేదీ విజయవాడలో అధికారులు, మంత్రులు కలిసి రొయ్యల రైతులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. వ్యాపారులకు దిశానిర్దేశం చేశారు. అయినా వారిలో మార్పురాలేదు. రైతుల పక్షాన ప్రభుత్వం... ప్రభుత్వం ఆక్వా రైతుల పక్షాన నిలిచింది. వ్యాపారులు, ఎగుమతిదారులతో మంత్రుల సబ్ కమిటీ సంప్రదింపులు జరిపింది. ప్రస్తుతం ఎగుమతులు లేవని, అందుకోసం తగ్గించి కొనుగోలు చేయాల్సి వస్తుందని వ్యాపారులు, ఎగుమతిదారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కూడిన మంత్రుల సబ్ కమిటీ సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లింది. రొయ్యలు పచ్చి సరుకు కాబట్టి ప్రభుత్వమే ఒక మెట్టు దిగి గతంలో నిర్ణయించిన ధరను కొంచెం తగ్గించి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ధరలు సవరించిన ప్రభుత్వం... వ్యాపారులు, ఎగుమతిదారులు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తక్కువగా ఉన్నాయనడంతో ప్రభుత్వం ఆక్వా రైతులతో చర్చించిన మీదట ధరల్లో కొంత మార్పు చేసింది. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని ముందు నిర్ణయించిన ధరలను కొంచెం తగ్గించి కొనుగోలు చేయాలని నూతన ధరలను ప్రకటించింది. ఆ ధరలకు కొనుగోలు చేస్తున్నామంటూనే నూతనంగా నిర్ణయించిన ధరలను కూడా పెడచెవిన పెట్టి మరీ తక్కువకు కొనుగోలు చేయడం ప్రారంభించారు. బుధవారం మరోసారి రాష్ట్ర మంత్రులు సాధికారిత కమిటీతో సమావేశమయ్యారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఎప్పటికప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు స్థానిక మార్కెట్లో ధరలను సమీక్షించేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రేట్లకు కొనుగోలు చేయకపోతే రైతులు తమ దృష్టికి తీసుకురావాలని సూచిస్తున్నారు. ఈ విషయంపై రైతులకు ఆవగాహన కల్పిస్తున్నారు. ఇందుకు సంబంధించి హెల్ప్‌లైన్ నంబర్లు కూడా అందుబాటులో ఉంచారు. ఇక్కడ పండించిన పంట ఉత్పత్తులను ఇదే ప్రాంతంలో విక్రయించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాల వారీగా ఆక్వా రైతు కమిటీలు గురువారం జూమ్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుచుకునేలా తీర్మానం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం రొయ్యల రైతులకు అండగా ఉంది. అందుకే అటు వ్యాపారులతో, ఇటు రైతులతో విరామం లేకుండా చర్చలు జరుపుతోంది. అయినా రొయ్యల ధరల విషయంలో వ్యాపారుల్లో మార్పు లేదు. ప్రభుత్వం స్పష్టంగా చెప్పినా రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, వ్యాపారులు రైతులను నిలువునా నష్టపరుస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధరల కంటే తక్కువకు కొనుగోలు చేయడం ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. – దుగ్గినేని గోపీనా«థ్, రొయ్యల రైతు సంఘ నాయకుడు వ్యాపారులు, ఎగుమతిదారులు తీరు మార్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా సాగుకు పూర్తి భరోసానిస్తోంది. కరోనా సమయంలోనూ రైతులకు ఇబ్బంది లేకుండా వ్యాపారులతో రొయ్యలు కొనుగోలు చేయించింది. 10 ఎకరాల్లోపు సాగు చేసే రైతులకు విద్యుత్ చార్జీ యూనిట్‌కు కేవలం రూ.1.50గా నిర్ణయించింది. ఇటీవల రొయ్య మేత ధరలను టన్ను రూ.2,600కు తగ్గించింది. ప్రస్తుతం ఆక్వా వ్యాపారులు ధరలు తగ్గించేందుకు ప్రయత్నిస్తే ప్రభుత్వం 100 కౌంట్ రూ.210గా నిర్ణయించి వ్యాపారులచే కొనుగోలు చేయిస్తోంది. – మాలె రంగారెడ్డి, ఆక్వా రైతు, మూలగుంటపాడు ఇతర దేశాల్లో తక్కువ ధరకు రొయ్యల ఎగుమతి ఇతర దేశాల్లో తక్కువ ధరకు రొయ్యలు ఎగుమతి చేయడం వలన మన దేశం రొయ్యల ధర దిగజారింది. యూరప్ కంట్రీస్‌లో ఉన్న ఈక్విల్యాండ్ దేశంలో రొయ్యలు 100 కౌంట్ రూ.140కు విక్రయిస్తున్నారు. అక్కడ ఏడాది క్రితం రొయ్యల కల్చర్ మొదలుపెట్టారు. ఎకరానికి 5 టన్నులకు తగ్గకుండా తీస్తారు. మన దేశంలో 2 టన్నుల్లోపే వస్తుంది. వారికి ఎగుమతి ఖర్చులు, రొయ్యల యూనిట్లు దగ్గర ఉండటం వలన చార్జీలు తక్కువ. అందుకే తక్కువ ధరకు ఇస్తారు. మనదేశంలో రొయ్యల రైతులకు 100 కౌంట్ ధర రూ.250కు తగ్గకుండా ఇస్తేనే గిట్టుబాటవుతుంది. – గాదె కోటిరెడ్డి, రొయ్యల రైతు, గాదెపాలెం -
రొయ్యల ధరల నియంత్రణకు ఎస్వోపీ
సాక్షి, అమరావతి: రొయ్య రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. అంతర్జాతీయంగా మార్కెట్ ఒడుదొడుకుల నేపథ్యంలో రొయ్య రైతులకు నష్టం వాటిల్లకుండా అన్ని విధాలుగా కృషిచేస్తోంది. ధరల నియంత్రణ కోసం ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) చట్టం ప్రకారం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్వోపీ) రూపొందిస్తోంది. రోజూ మార్కెట్‌ను సమీక్షించడమేగాక రొయ్య రైతుల కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తోంది. మరోపక్క రొయ్యల ఎగుమతులను ప్రోత్సహించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రత్యేక ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ వల్లే.. ప్రధానంగా 100 కౌంట్ రొయ్యల ప్రధాన దిగుమతిదారైన చైనా కొనుగోలు ఆర్డర్లను పూర్తిగా నిలిపేసింది. రూ.వెయ్యి కోట్లకుపైగా చెల్లింపులను ఆపేసింది. మరోవైపు నాలుగులక్షల టన్నులకు మించి ఉత్పత్తి చేయని ఈక్వెడార్ దేశం ఈ ఏడాది 13 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తూ మన రొయ్యల కంటే తక్కువ ధరకు అమెరికాకు ఎగుమతి చేస్తోంది. ఫలి తంగా దేశీయంగా రొయ్యల మార్కెట్ తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. పరిస్థితిని సమీక్షించేందుకు సీనియర్ మంత్రులతో ఏర్పాటు చేసిన సాధికారత కమిటీ పలుమార్లు సమావేశమై పెంచిన ఫీడ్ ధరలను తగ్గించడమేగాక తగ్గిన కౌంట్ ధరలను నియంత్రించేలా చర్యలు చేపట్టింది. దీంతో రొయ్యల మేత ధరను కిలోకు పెంచిన రూ.2.60ని మేత తయారీదారులు తగ్గించారు. ఎగుమతి మార్కెట్‌కు అనుగుణంగా పంటల ప్రణాళిక ప్రాసెసింగ్ కంపెనీలు, ట్రేడర్లతో విస్తృతస్థాయిలో చర్చలు జరిపి ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన రీతిలో రొయ్యల ధరలను నిర్ణయించారు. ఈ ధరలు కనీసం 10 రోజులు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇకనుంచి సీజన్ ప్రారంభానికి ముందే ఎగుమతి మార్కెట్ పోకడలను అంచనావేస్తూ పంటల ప్రణాళికను రూపొందించి తదనుగుణంగా సాగుచేపట్టేలా రైతులను సన్నద్ధం చేయాలని నిర్ణయించారు. మరోవైపు రొయ్య రైతులు, మేత తయారీదారులు, సీ ఫుడ్ ప్రాసెసర్లు, ఎగుమతిదారులకు ప్రాతినిధ్యం వహించే సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక బృందాన్ని న్యూఢిల్లీ పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రొయ్యలు దిగుమతి చేసుకునే దేశాలతో స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం చేసుకోవడం, రొయ్యల ఎగుమతుల ప్రోత్సాహకాల (డ్యూటీ డ్రా బ్యాక్) శాతం పెరుగుదల, ఆక్వాఫీడ్ ఇన్పుట్లపై దిగుమతి సుంకాల తగ్గింపు తదితర విషయాలపై సంబంధిత కేంద్రమంత్రులతో చర్చించనున్నారు. స్థానిక వినియోగాన్ని పెంచడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చేసేందుకు రాష్ట్రంలోని ప్రతి నివాస ప్రాంతాల్లో మత్స్య ఉత్పత్తుల రిటైల్ అవుట్లెట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆక్వా రైతులకు రూ.2,377.52 కోట్ల సబ్సిడీ వాస్తవంగా యూనిట్ విద్యుత్ రూ.6.89 ఉండగా ఆక్వాజోన్ పరిధిలోని 10 ఎకరాల విస్తీర్ణంలో చెరువులకు యూనిట్ రూ.1.50, జోన్ వెలుపల ఉన్న చెరువులకు రూ.3.86 చొప్పున విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. ఈ విధంగా మూడేళ్లలో రూ.2,377.52 కోట్ల విద్యుత్ సబ్సిడీ ఇచ్చారు. వాస్తవాలు ఇలా ఉంటే.. రొయ్య రైతులు విలవిల అంటూ ఆక్వారంగంలో ఉన్న వారిని ఆందోళనకు గురిచేసేలా ఈనాడు తప్పుడు కథనాలు రాస్తుండడం పట్ల ఆక్వా రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ చర్యలు చూసి ఓర్వలేకనే ‘ఈనాడు విలవిల’లాడిపోతోందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో రొయ్యల ధరలు ఇలా.. కౌంట్ ధర (రూపాయల్లో) 100 210 90 220 80 240 70 250 60 270 50 290 40 340 30 380 కష్టకాలంలో ప్రభుత్వం మేలు మరిచిపోలేం నేను 30 ఎకరాల్లో రొయ్యలు సాగుచేస్తున్నా. 20టన్నుల ఉత్పత్తి వచ్చింది. ఇటీవల సాధికారత కమిటీ నిర్ణయించిన రేట్ల ప్రకారం 30 కౌంట్ రూ.380 చొప్పున 6 టన్నులు, 40 కౌంట్ రూ.340 చొప్పున 5 టన్నులు, 50 కౌంట్ రూ.290 చొప్పున 3 టన్నులు, 60 కౌంట్ రూ.270 చొప్పున 6 టన్నులు విక్రయించా. గతంలో ఎన్నడూ ఇలాంటి కష్టకాలంలో ప్రభుత్వం అండగా నిలిచిన దాఖలాలు లేవు. ప్రభుత్వమే దగ్గరుండి మరీ ప్రాసెసింగ్ కంపెనీల ద్వారా కొనుగోలు చేసి మద్దతుధర లభించేలా చేసింది. అంతర్జాతీయంగా ధరలు పతనమైనప్పటికీ ప్రభుత్వం దగ్గరుండి మరీ అమ్మించడంతో రైతులు గట్టెక్కగలుగుతున్నారు. – త్సవటపల్లి నాగభూషణం, ఆక్వారైతు, చెయ్యేరు, కోనసీమ అంబేద్కర్ జిల్లా ప్రభుత్వం అండగా నిలుస్తోంది అంతర్జాతీయ మార్కెట్ ఒడుదొడుకుల నేపథ్యంలో కౌంట్ ధరలు గణనీయంగా తగ్గినప్పటికీ, రాష్ట్రంలో మాత్రం రైతులకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సాధికారత కమిటీ ద్వారా రైతులను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంటే రొయ్య రైతులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ ఆరోపణలు చేయడం సరికాదు. ఈనాడు కథనంలో చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. – కె.కన్నబాబు, రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ -
ఆక్వా రైతులకు నష్టం కలిగిస్తే చర్యలు తప్పవు
సాక్షి, అమరావతి: ‘ఆక్వా రంగ బలోపేతం కోసమే ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) చట్టాన్ని ప్రభుత్వం తెచ్చింది. ఆక్వా రంగ కార్యకలాపాలన్నీ ఈ చట్టం పరిధిలోకే వస్తాయి. రొయ్యల ధరలు తగ్గించినా.. ఫీడ్ ధరలు పెంచినా అప్సడా చట్టం ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’ అని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. ఆక్వా రైతుల ఫిర్యాదుల నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఆక్వా సాధికారిత కమిటీ బుధవారం విజయవాడలో సమావేశమైంది. తొలుత కమిటీ సభ్యుడైన అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్ ఆక్వా రైతుల సమస్యలను మంత్రుల దృష్టికి తెచ్చారు. అంతర్జాతీయ మార్కెట్‌ను సాకుగా చూపి ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు, దళారులు ఇష్టానుసారంగా రొయ్యల కౌంట్ ధరలను తగ్గించేస్తున్నారన్నారు. మూడు నెలల క్రితం రూ.90 వేల నుంచి రూ.97 వేలున్న టన్ను సోయాబీన్ ప్రస్తుతం రూ.45 వేల–రూ.55 వేల మధ్య ఉందని చెప్పారు. అలాగే గత ఆర్నెళ్లుగా ఫిష్ ఆయిల్, వీట్ ధరలు భారీగా తగ్గినప్పటికీ కంపెనీలు ఫీడ్ రేట్లును ఇష్టానుసారంగా పెంచేస్తున్నాయని, దీని వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ప్రతి మూడు నెలలకోసారి సమావేశమై చర్చించాక ఫీడ్ ధరల పెంపుపై నిర్ణయం తీసుకుందామని గతంలో అంగీకరించినదానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయన్నారు. రైతుకు అన్యాయం జరిగితే ఊరుకోం.. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స మాట్లాడుతూ.. రొయ్యల కౌంట్ ధరలు ఎందుకు పడిపోతున్నాయి? ఫీడ్ ధరలు ఎందుకు పెంచాల్సి వచ్చిందో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కొనుగోలుదారులు, తయారీదారులపై ఉందన్నారు. ఆక్వా రైతులకు ప్రభుత్వం అండగా ఉందని, వారికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇష్టానుసారంగా ధరలు పెంచడం, తగ్గించడం చేస్తే చర్యలు తప్పవన్నారు. రైతులతోపాటు ఫీడ్ తయారీదారులు, ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వాహకులతో గురువారం విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో ఫీడ్ ధరల నియంత్రణ, కౌంట్ ధరల పెంపుపై అనుసరించాల్సిన భవిష్యత్ కార్యాచరణపై నివేదిక రూపొందించాలని సూచించారు. ఈ నివేదికను కమిటీకి ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతోపాటు కమిటీ సభ్యులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఇంధన, అటవీ శాఖల ముఖ్య కార్యదర్శి విజయానంద్ తదితరులు పాల్గొన్నారు. -
వెనామీకి గిరాకీ: ఆక్వా రైతుల్లో జోష్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆక్వా రంగం మళ్లీ వికసిస్తోంది. 2014–19 టీడీపీ హయాంలో కుదేలైన రైతులు ప్రభుత్వ ప్రోత్సాహంతో మళ్లీ కోలుకుంటున్నారు. విద్యుత్ సబ్సిడీ, ధరల స్థిరీకరణ, నాణ్యమైన సీడ్, ఫీడ్ అందే విధంగా ఆక్వా ల్యాబ్‌లను అందుబాటులోకి తేవడంతో ఆదాయబాట పడుతున్నారు. జిల్లాలో 15 వేల హెక్టార్లలో ఆక్వా సాగులో ఉంది. దాదాపు లక్ష టన్నుల ఆక్వా ఉత్పత్తులు వస్తున్నాయి. ఈ దఫా విదేశాలకు ఎగుమతులకు అనుమతులు లభించడంతో ఒక్కసారిగా ధరలు ఊపందుకున్నాయి. పక్షం రోజుల క్రితం వరకు 100 కౌంట్ రూ. 90 ఉండగా ఇప్పుడు రూ. 270లకు చేరడంతో ఆక్వా రైతులు ఆనందానికి అవధుల్లేవు. ఆక్వా రైతుల పక్షపాతిగా.. రైతు ముఖ్యమంత్రిగా ముద్ర వేసుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్వా రంగంలో పెను మార్పులు తీసుకువచ్చారు. విద్యుత్ చార్జీల తగ్గింపు, ఉచితంగా ఆక్వా ల్యాబ్‌లు, నాణ్యమైన సీడ్, సాగులో మెళకువలు, సూచనలు అందేలా మత్స్యశాఖ పర్యవేక్షణలో చేపట్టారు. దళారుల నియంత్రణ, గిట్టుబాటు ధర, విదేశాలకు ఎగుమతులకు అనుమతులు తదితర లాభసాటి ప్రయోజనాలతో ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. ఆక్వా సాగు రోజు రోజుకు వృద్ధి చెందింది. వెనామీ రొయ్యల ధరలు మూడు వారాలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రతి నెల ఆక్వా ధరలు పెరుగుతూ ప్రతి కౌంట్‌లో వ్యత్యాసం కనిపిస్తోంది. 30 కౌంట్ రూ. 530 వద్ద ట్రేడ్ అవుతోంది. గత రెండు నెలల ధరలతో పోలిస్తే ప్రస్తుతం ప్రతి కౌంట్‌పై రూ.100 నుంచి రూ. 150 వరకు ధర పెరుగుదలతో రైతులకు గణనీయమైన ఆదాయం దక్కుతోంది. టీడీపీ హయాంలో ఆక్వాసాగు కుదేలు టీడీపీ హయాంలో ఆక్వా రైతులు అప్పులు ఊబిలో కూరుకుపోయారు. అధిక విద్యుత్ చార్జీలు, ప్రకృతి వైపరీత్యాలతో టీడీపీ ప్రభుత్వ హయాంలో సాగు సంక్షోభంలో పడింది. ఆశించిన దిగుబడులు లభించకపోవడంతో ఆక్వా రంగం క్రమేపీ అవరోహణ క్రమంలో దిగజారిపోయింది. -
ఫిష్ ఆంధ్రా.. ఫిట్ ఆంధ్రా..
సాక్షి, పశ్చిమగోదావరి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా మత్స్య, ఆక్వా కల్చర్ సుస్థిర అభివృద్ధికి ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) పథకాన్ని నిర్వహిస్తున్నాయి. ఇందులో ఆక్వా రైతులు, ఔత్సాహికులకు సబ్సిడీ అందిస్తూ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మత్స్యశాఖ అధికారులు ఈ పథకంపై మత్స్యకార సొసైటీలు, రైతులకు అవగాహన కలిగిస్తున్నారు. మొత్తం 14 రకాల ఆక్వా సంబంధిత ఉత్పత్తులకు ప్రభుత్వాలు సబ్సిడీలు అందిస్తున్నాయి. చేపలు, రొయ్యల వినియోగాన్ని మరింత పెంచడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 2,50,045 ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. ప్రతి ఏటా 17,15,362 టన్నుల ఆక్వా ఉత్పత్తి జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2024 వరకు ఐదేళ్ల కాలానికి గాను రూ.20,050 కోట్లు పీఎంఎంఎస్వై పథకానికి కేటాయించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.9407 కోట్లు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.4880 కోట్లు, లబ్ధిదారుల వాటా రూ.5763 కోట్లుగా ఉంది. ప్రోత్సాహకాలు ఇలా.. పీఎంఎంఎస్వై పథకంలో 14 అంశాలకు సంబంధించిన వివిధ పథకాలు ఉన్నాయి. ఇందులో ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఎంచుకున్న యూనిట్లకు కేంద్రం 36 శాతం, రాష్ట్రం 24 శాతం కలిపి 60 శాతం సబ్సిడీని అందిస్తున్నాయి. లబ్ధిదారులు 40 శాతం చెల్లించాలి. ఇతరులకు కేంద్రం 24 శాతం, రాష్ట్రం 16 శాతం కలిపి మొత్తం 40 శాతం సబ్సిడీ అందిస్తున్నాయి. లబ్ధిదారులు 60 శాతం నగదు చెల్లించాలి. యూనిట్ల విషయానికి వస్తే చేప, రొయ్య పిల్లల నర్సరీకి రూ.7 లక్షలు, రిజర్వాయర్లలో కేజ్ కల్చర్‌కు రూ.3 లక్షలు, ఆక్వా ల్యాబ్ ఏర్పాటుకు రూ.25 లక్షలు, బతికిన చేపల అమ్మకాల యూనిట్‌కు రూ.20 లక్షలు, చేపల రవాణా రిఫ్రిజిరేటెడ్ వాహనానికి రూ.25 లక్షలు, ఫిష్ కియోస్క్ యూనిట్‌కు రూ.10 లక్షలు, రోజుకు 20 టన్నుల ఆక్వా ఉత్పత్తులు చేసే కర్మాగారానికి రూ.2 కోట్లు సైతం అందించనున్నారు. ఫలిస్తున్న సీఎం జగన్ కల.. ప్రపంచంలోనే చేపల ఉత్పత్తిలో మన దేశం రెండో స్థానంలో ఉంది. సింహభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సరఫరా అవుతోంది. మత్స్యరంగాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆక్వా హబ్‌లను ఏర్పాటు చేసి ఫిష్ ఆంధ్రా పేరుతో తాజా చేపలు, పీతలు, రొయ్యలను విక్రయించడానికి ఏర్పాట్లు చేశారు. ఏలూరు జిల్లాలో మొత్తం 101 వివిధ యూనిట్లకు గాను మొత్తం రూ.327.60 లక్షలు మంజూరయ్యాయి. వీటిలో రాష్ట్ర వాటా రూ.131.04 లక్షలు, కేంద్ర వాటా రూ.196.56 లక్షలుగా ఉంది. ఈ పథకం ద్వారా మంజూరైన వాహనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. పథకంపై అవగాహన కలిగిస్తున్నాం... పీఎంఎంఎస్వై పథకంపై రైతులకు మత్స్య శాఖ ద్వారా అవగాహన కలిగిస్తున్నాం. ఈ పథకాలకు భూమి వివరాలు, ఆధార్ కార్డు, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు, రుణ మంజూరుకు బ్యాంకు నుంచి జారీ చేసిన పత్రం, లబ్ధిదారుని వాటా భరించు డిక్లరేషన్ పత్రం ఉండాలి. మరిన్ని వివరాలకు కావాల్సినవారు స్థానిక మత్స్యశాఖ కార్యాలయాల్లో సంప్రదించాలి. – ఈశ్వర చంద్ర విద్యాసాగర్, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, ఏలూరు -
చేపల చెరువులకు అనుమతి తప్పనిసరి
సాక్షి, అమరావతి: అనుమతులు తీసుకోకుండా చేపల చెరువులు తవ్వడం చట్టవిరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో చట్టం తెలియదని తప్పించుకోవడం కుదరదని పేర్కొంది. అనుమతి లేకుండా చేపల చెరువులు తవ్వేవారిపై ఏపీ రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చర్యలు తీసుకోవచ్చని చెప్పింది. ప్రస్తుత కేసులో కోర్టు ఆదేశాల మేరకు చేపల చెరువుల తవ్వకాలను నిలిపేసిన వ్యక్తులు అనుమతి తీసుకోకుండా తవ్వకాలను కొనసాగిస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఆ వ్యక్తులు తమ భూముల్లో చేపల చెరువు తవ్వుకోవాలనుకుంటే చట్టప్రకారం సంబంధిత అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావు ఇటీవల తీర్పు చెప్పారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలోని పలు సర్వే నంబర్లలో శివకోటి గోవిందు, మరో ఆరుగురు చట్టప్రకారం అనుమతులు తీసుకోకుండా చేపల చెరువులు తవ్వుతున్నారని, ఈ తవ్వకాలను అడ్డుకునేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ శ్రీగాయత్రి హౌసింగ్ మేనేజింగ్ పార్ట్నర్ పుల్లా ప్రభాకరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ గంగారావు విచారించారు. పిటిషనర్ న్యాయవాది ఎన్.శివారెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ 7.80 ఎకరాల్లో చట్టప్రకారం అనుమతులు తీసుకుని లేఅవుట్ వేసి 53 ప్లాట్లు చేశారని తెలిపారు. ఈ లేఅవుట్ చుట్టూ శివకోటి గోవిందు మరికొందరు చట్ట విరుద్ధంగా చేపల చెరువులు తవ్వుతున్నారని, దీనివల్ల తమ ప్లాట్లలోకి నీళ్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. నీరు కలుషితమై మంచినీరు లభించే పరిస్థితి ఉండదన్నారు. ఈ విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రతివాదుల న్యాయవాది కె.అన్నపూర్ణ వాదనలు వినిపిస్తూ.. పక్కన ఉన్న చేపల చెరువుల నీరు తమ భూముల్లోకి వస్తుండటంతో పంట పండే అవకాశం లేదని చెప్పారు. చేపల చెరువులు తవ్వుకునేందుకు అనుమతులు తీసుకోవాలని తమకు తెలియదన్నారు. అనుమతులు తీసుకోవాలని కోర్టు ద్వారా తెలుసుకున్న తరువాత అనుమతుల కోసం అధికారులకు దరఖాస్తు చేసుకున్నామని, వారు తమ దరఖాస్తులను స్వీకరించడం లేదని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ తీర్పు చెప్పారు. -
పర్ర భూములను చెరబడుతున్న ఆక్వా చెరువులు
సాక్షి, అమలాపురం(కోనసీమ జిల్లా): వేలాది ఎకరాల పంట భూముల నుంచి ముంపు నీరు, ఇతర డ్రెయిన్ల నీరు దిగడానికి సముద్రపు మొగలు ఎంతో అవసరం. సరిగ్గా ఇక్కడే సహజసిద్ధంగా ఏర్పడిన పర్ర భూములను కొంతమంది స్వార్థపరులు కబ్జా చేసి, అక్రమంగా ఆక్వా చెరువులు ఏర్పాటు చేయడంతో మొగలు పూడుకుపోతున్నాయి. ఫలితంగా ఏటా వేలాది ఎకరాల్లో పంటలు ముంపు బారిన పడి, కోనసీమ రైతులు భారీగా నష్టపోతున్నారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్), మద్రాస్ కన్జర్వెన్స్ యాక్టులను తోసిరాజని మరీ పర్ర భూముల్లో ఆక్వా చెరువులు తవ్వేస్తున్నా.. వేలాది ఎకరాల వరి ఆయకట్టు ముంపునకు కారణమవుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. కొల్లేరు ఆపరేషన్ తరహాలో అక్రమ చెరువులను ధ్వంసం చేసి, రెగ్యులేటర్లు నిర్మిస్తేనే ఇక్కడ ముంపు సమస్యకు మోక్షం కలుగుతుందని ఇరిగేషన్ నిపుణులు, రైతులు చెబుతున్నారు. పులికాట్, కొల్లేరు తరహాలోనే కోనసీమలోని కాట్రేనికోన మండలం వృద్ధ గౌతమి నదీపాయ నుంచి అల్లవరం మండలం వైనతేయ నదీపాయ వరకూ సుమారు 6 వేల ఎకరాల్లో పర్ర భూములున్నాయి. మధ్య డెల్టాలో 1.72 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. రామేశ్వరం, కూనవరం మొగల ద్వారా సుమారు 65 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో 45 వేల ఎకరాలు వరి ఆయకట్టు ఉంది. మిగిలింది ఆక్వా చెరువులుగా మారిపోయింది. మొత్తం 45 వేల ఎకరాల ఆయకట్టు ముంపు నీరు ఈ మొగల ద్వారానే దిగాల్సి ఉంది. అయితే మొగలు పూడుకుపోవడం, వీటిని తెరచినా ముంపునీరు దిగకపోవడంతో రైతులు ఏటా రూ.60 కోట్ల మేర పంటలు నష్టపోతున్నారని అంచనా. పర్ర భూముల కబ్జా మొగల ద్వారా నేరుగా సముద్రంలోకి నీరు దిగే అవకాశం తక్కువ. భారీ వర్షాల సమయంలో ముంపునీరు రామేశ్వరం, కూనవరం డ్రెయిన్ల నుంచి పర్ర భూముల్లోకి వెళ్లేది. కూనవరం డ్రెయిన్ నీరు చిర్రయానం పర్ర భూమి ద్వారా వెళ్లి పల్లం, నీళ్లరేవు, ఏటిమొగ వద్ద సముద్రంలోకి వెళ్లేది. దీనివల్ల భారీ వర్షాల సమయంలో చేలు ముంపు బారిన పడినా రెండు మూడు రోజుల్లోనే నీరు తీసేది. కొన్నేళ్లుగా పర్ర భూముల్లో పెద్ద ఎత్తున ఆక్వా చెరువులు ఏర్పాటయ్యాయి. రామేశ్వరం పర్ర భూముల్లో 480 ఎకరాలు, ఎస్.యానాం, చిర్రయానాం పర్ర భూముల్లో సుమారు 1,650 ఎకరాల విస్తీర్ణంలో అక్రమ ఆక్వా సాగు జరుగుతున్నట్టు అంచనా. సుమారు 2,130 ఎకరాల భూమి కబ్జాల బారిన పడటంతో డ్రెయిన్ల ద్వారా వస్తున్న ముంపునీరు పర్ర భూముల్లోకి వెళ్లే సామర్థ్యం పడిపోయింది. ఆక్వా చెరువుల వల్ల ముంపునీరు పర్రభూముల ద్వారా కాకుండా మొగల ద్వారానే సముద్రంలో కలవాల్సి వస్తోంది. ఇసుక మేటలు వేయడంతో మొగల వెడల్పు కుదించుకుపోతోంది. కూనవరం స్ట్రెయిట్ కట్ ద్వారా 25 క్యూమిక్స్ (క్యూబిక్ మీటర్ పర్ సెకన్) నీరు సముద్రంలోకి దిగాల్సి ఉండగా, మొగ తెరచిన తరువాత కూడా 10 క్యూమిక్స్ కూడా దిగడం లేదు. కొల్లేరు తరహాలోనే.. పూర్వపు పశ్చిమ, కృష్ణా జిల్లాల సరిహద్దులో ఉన్న కొల్లేరు సరస్సులో కబ్జాలు చేసి, ఏర్పాటు చేసిన ఆక్వా చెరువులను నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ధ్వంసం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అక్కడ రూ.412 కోట్లతో మూడుచోట్ల రెగ్యులేటర్లు నియమిస్తున్నారు. ఇదేవిధంగా పర్ర భూముల్లోని ఆక్రమణలను సైతం తొలగించాలని ఇక్కడి రైతులు కోరుతున్నారు. మొగల పరిస్థితిపై గతంలో కూనా ఓషనోగ్రఫీ, ఉస్మానియా ఓషనోగ్రఫీ విభాగాలు సర్వేలు చేశాయి. డ్రెయిన్ నుంచి మొగ దాటుకుని సముద్రంలోకి 200 మీటర్ల మేర లాంగ్ రివిట్మెంట్లు నిర్మించాలని సూచించాయి. వీటికి ఆటోమెటిక్ రెగ్యులేటర్లు నిర్మించాలని సిఫారసు చేశాయి. డ్రెయిన్‌లో నీరు ఎక్కువగా ఉన్నప్పుడు తెరచుకునేలా.. సముద్రం పోటు సమయంలో మూసుకుపోయేలా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ప్రకారం రెగ్యులేటర్లు నిర్మించాలని రైతులు కోరుతున్నారు. అనధికార చెరువులపై చర్యలు పర్ర భూముల్లో అనధికారికంగా ఆక్వా చెరువులు సాగు చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. అలాగే పంచనదిని ఆనుకుని కూడా చెరువులున్నాయి. వీటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – ఆర్.నాగార్జున,డీఈఈ, డ్రెయిన్ అమలాపురం మొగల స్వరూపమిదీ.. కూనవరం ప్రధాన మురుగు కాలువ ద్వారా ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ముమ్మిడివరం, అమలాపురం మండలాల్లోని సుమారు 35 వేల ఎకరాల్లోని ముంపునీరు దిగాల్సి ఉంది. రంగరాజు, ఓల్డ్ సమనస, అయినాపురం, గొరగనమూడి మీడియం డ్రెయిన్ల నీరు కూడా దీని ద్వారానే వస్తోంది. 1996 తుపాను సమయంలో దీనికి గండి పడింది. తరువాత ఏప్రిల్ నుంచి జూలై వరకూ పూడుకుపోయి, మిగిలిన సమయంలో అప్పుడప్పుడు కొద్దిమేర తెరచుకుంటోంది. అల్లవరం మండలం రామేశ్వరం మొగ ద్వారా వాసాలతిప్ప, పంచనది డ్రెయిన్ల నుంచి వస్తున్న ముంపునీరు దిగుతోంది. అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాలకు చెందిన సుమారు 25 వేల ఎకరాల్లోని ముంపునీరు దీని ద్వారా దిగాల్సి ఉంది. ముంపునీరు రామేశ్వరం మొగ వద్దకు వచ్చి ఇక్కడున్న పర్ర భూమిలోకి చేరుతోంది. అక్కడి నుంచి కిలోమీటరు ప్రవహించి సముద్రంలో కలుస్తోంది. (క్లిక్: పంట కాలువను కబ్జా చేసిన అయ్యన్న) -
పేద అక్కచెల్లెమ్మల మేలే లక్ష్యం
మురమళ్ల నుంచి సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేదరికంలో ఉన్న అగ్రవర్ణాల్లోని అక్కచెల్లెమ్మల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ప్రతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి కలిగేలా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రతి 50 –100 ఇళ్లకు ఒక వలంటీర్ చొప్పున నియమించిన వ్యవస్థ ద్వారా చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ సేవలు అందిస్తున్నామని చెప్పారు. మత్స్యకారులకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నామని తెలిపారు. కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్లలో శుక్రవారం ఆయన నాలుగో ఏడాది మత్స్యకార భరోసాతోపాటు ఓఎన్జీసీ నష్ట పరిహారం సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘మనందరికీ పరిచయం ఉన్న మల్లాడి సత్యలింగ నాయకర్ 180 ఏళ్ల క్రితం ఇక్కడ పుట్టారు. ఈయన ఒక మత్స్యకారుడు. ఆ రోజుల్లో చదువుకోలేకపోయారు. సముద్రాన్నే నమ్ముకుని, ఆ సముద్రాన్ని దాటి బర్మాకు చేరుకున్నారు. అక్కడ ఒక కూలీగా జీవితాన్ని ప్రారంభించి, రంగూన్లో అత్యంత ధనవంతుల్లో ఒకరిగా ఎదిగారు. సొంత గడ్డ మీద మమకారంతో తను సంపాదించినదంతా అమ్మేసి.. ఈ ప్రాంతంలో భూములు కొని ఒక ట్రస్టు పెట్టారు. దాదాపుగా 110 సంవత్సరాలుగా వేల మంది పేదలకు మంచి చేశారు. అదే స్ఫూర్తితో పేదరికంలో ఉన్న అక్కచెల్లెమ్మలను నా వాళ్లుగా భావించి దాదాపు 32 పథకాలు అమలు చేస్తున్నాం’ అని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. మీ కష్టాలు కళ్లారా చూశాను ► మత్స్యకార కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో కళ్లారా చూశాను. చేపల వేట నిషేధ సమయంలో వారిని ఆదుకునేందుకు వరుసగా నాలుగో ఏడాది కూడా వైఎస్సార్ మత్స్యకార భరోసాలో భాగంగా 1,08,755 మందికి ఒక్కొక్క కుటుంబానికి రూ.10 వేలు చొప్పున మొత్తంగా రూ.109 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం. రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా కూడా ఇలా సహాయం చేసిన చరిత్ర లేదు. ► మరోవైపు ఇక్కడే ఓఎన్జీసీ (ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్) పైప్‌లైన్ కోసం డ్రిల్లింగ్ పనులు జరుగుతున్న సమయంలో తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లోని 69 గ్రామాల్లో 6078 బోట్లకు పని లేకుండా పోయింది. దీంతో జీవనోపాధి కోల్పోయిన 23,458 మత్స్యకార కుటుంబాలకు మనందరి ప్రభుత్వమే చొరవ తీసుకుని మొదటి విడదతగా ఒక్కో కుటుంబానికి నెలకు రూ.11,500 చొప్పున, 4 నెలలకు రూ.46 వేలు వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఇలా ఇస్తున్న సొమ్ము రూ.108 కోట్లు. మత్స్యకార భరోసాగా ఇస్తున్న సొమ్ము మరో రూ.109 కోట్లు. మొత్తంగా ఇవాళ రూ.217 కోట్లు నేరుగా ఇస్తున్నాం. ► గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జీఎస్పీసీ వాళ్లు డ్రిల్లింగ్ చేయడం వల్ల అప్పట్లో జీవనోపాధి కోల్పోయిన 14,824 బాధిత మత్స్యకార కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 7 నెలల కాలానికి రూ.47,250 చొప్పున మొత్తం రూ.70 కోట్లు మన ప్రభుత్వం విడుదల చేసింది. ఇది గత ప్రభుత్వ పాలనకు, మన ప్రభుత్వ పాలనకు మధ్య ఉన్న తేడా. వలసల నివారణకు చర్యలు ► మత్స్యకారుల వలసలు నివారించాలని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 9 ఫిషింగ్ హార్బర్లు, 4 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు నిర్మిస్తున్నాం. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ చేస్తున్నాం. వీటి కోసం రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇప్పటికే మచిలీపట్నం, ఉప్పాడ, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లలో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. మిగిలినవి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ► ఫిష్ ఆంధ్రా పేరిట నాణ్యమైన ఆక్వా ఉత్పత్తులను సరసమైన ధరలకే అందుబాటులోకి తీసుకువస్తున్నాం. రూ.333 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 70 ఆక్వా హబ్‌లు, వాటికి అనుసంధానంగా సుమారు 14 వేల రిటైల్ దుకాణాల ఏర్పాటు దిశగా అడుగులు శరవేగంగా పడుతున్నాయి. వీటివల్ల రాష్ట్ర వ్యాప్తంగా 80 వేల మందికి ఉపాధి లభించనుంది. ఎంత తేడానో మీరే చూడండి ► చేపల వేట నిషేధ సమయంలో అందించే సహాయం అప్పట్లో రూ.4వేలు ఉంటే దాన్ని రూ.10 వేలకు పెంచాం. గతంలో కొంతమందికి మాత్రమే ఇచ్చేవారు. ఇవాళ అర్హులందరికీ ఇస్తున్నాం. గతంలో చంద్రబాబు పాలనలో 2014–15 కాలంలో కేవలం 12,128 కుటుంబాలకు మాత్రమే మత్స్యకార భృతి కేవలం రూ.2 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఎన్నికలు దగ్గర పడటంతో రూ.4 వేలకు పెంచుతూ 2018–19లో 80 వేల కుటుంబాలకు పెంచారు. ► 2014–15లో మత్స్యకార భృతికి ఇచ్చిన మొత్తం కేవలం రూ.2.50 కోట్లు. 2018–19లో రూ.32 కోట్లు. ఈ రోజు మీ బిడ్డగా సంవత్సరానికి రూ.109 కోట్లు బటన్ నొక్కి ఇస్తున్నాను. ఆ పెద్దమనిషి చంద్రబాబు ఐదేళ్లలో ఇచ్చింది కేవలం రూ.104 కోట్లు. మన ప్రభుత్వంలో ఈ ఏడాది ఇచ్చిన రూ.109 కోట్లతో కలుపుకుంటే మొత్తం రూ.419 కోట్లు మీ చేతుల్లో పెట్టాం. ► డీజిల్ సబ్సిడీని రూ.6 నుంచి రూ.9కి పెంచాం. మత్స్య శాఖకు చెందిన 6 డీజిల్ బంకులతో పాటు 93 ప్రై వేటు బంకుల్లో కూడా డీజిల్ పట్టుకునేటప్పుడే సబ్సిడీ అందేలా స్మార్ట్ కార్డ్స్ జారీ చేశాం. మెకనైజ్డ్ బోట్లకు నెలకు 3 వేల లీటర్లు, మోటరైజ్డ్ బోట్లకు నెలకు 300 లీటర్లు చొప్పున సబ్సిడీ ఇస్తున్నాం. మొత్తం 17,770 బోట్లకు మూడేళ్లుగా సబ్సిడీపై డీజిల్ ఇస్తున్నాం. ► సముద్రంలో చనిపోయిన వారికి గత ప్రభుత్వంలో రూ.5 లక్షలు ఇస్తామనే వారు. కానీ అది ఎప్పుడొస్తుందో.. అసలు రాదో తెలియని పరిస్థితి. మన ప్రభుత్వం రాగానే ఆ పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచి ఇస్తున్నాం. ఇప్పటిదాకా ఇలా 116 కుటుంబాలకు మేలు చేయగలిగాం. -
మత్స్య సాగుబడులతో సత్ఫలితాలు
సాక్షి, అమరావతి: ఆక్వా రంగం బలోపేతానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాన్నిస్తున్నాయి. పెట్టుబడి తగ్గిపోయి దిగుబడి, నాణ్యత పెరుగుతోంది. పొలం బడి, ఉద్యానబడి తరహాలో నాణ్యమైన ఉత్పత్తులే లక్ష్యంగా నిర్వహిస్తున్న మత్స్య సాగుబడులు సత్ఫలితాలనిస్తున్నాయి. ఫార్మర్స్ ఫీల్డ్ స్కూల్స్ నిర్వహణ ద్వారా ఆక్వా ఉత్పత్తుల్లో మితిమీరిన యాంటి బయోటిక్స్ వాడకం అనూహ్యంగా తగ్గడమే కాకుండా నాణ్యమైన దిగుబడులు పెరుగుతున్నాయి. మూడేళ్లలో 12.76 శాతం వృద్ధి రేటు తూర్పు గోదావరి జిల్లా కరపకు చెందిన లక్ష్మీపతి రాజు చెరువు వద్ద అవగాహన కల్పిస్తున్న మత్స్య శాఖాధికారులు ఆక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. రాష్ట్రానికి 974 కి.మీ. సువిశాల సముద్రతీర ప్రాంతం ఉంది. ఏపీలో సుమారు ఐదు లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. దేశవ్యాప్తంగా చేపల ఉత్పత్తిలో 29 శాతం, రొయ్యల ఉత్పత్తిలో 76 శాతం వాటా మన రాష్ట్రానిదే. 2018– 19లో 39.92 లక్షల మత్స్య టన్నులున్న దిగుబడులు 2020–21 నాటికి 46.20 లక్షల టన్నులకు (16 శాతం వృద్ధి) చేరాయి. 2018–19లో వార్షిక వృద్ధి రేటు 7.69 శాతం కాగా 2019–20లో 11 శాతంగా నమోదైంది. 2020–21 నాటికి 12.76 శాతానికి పెరిగింది. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన సీడ్, ఫీడ్ తూర్పు గోదావరి జిల్లా కరపకు చెందిన లక్ష్మీపతి రాజు చెరువు వద్ద అవగాహన కల్పిస్తున్న మత్స్య శాఖాధికారులు 2018–19లో ఆక్వా ఎగుమతుల్లో 86 శాతానికిపైగా మితిమీరిన యాంటి బయోటిక్స్ ఉండటంతో అమెరికా, చైనా సహా ఐరోపా, మధ్య ఆసియా దేశాలు వెనక్కి పంపాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా యాంటి బయోటిక్స్ శాతం 37.5 శాతానికి తగ్గింది. సర్టిఫై చేసిన సీడ్, ఫీడ్ అందించే లక్ష్యంతో ఏపీ సడా, సీడ్, ఫీడ్ చట్టాలని ప్రవేశపెట్టి రూ.50.30 కోట్లతో 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్‌లతో పాటు ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన సీడ్, ఫీడ్ అందుబాటులోకి తెచ్చారు. సర్వే నెంబర్ల వారీగా రైతులు సాగు చేస్తున్న మత్స్య ఉత్పత్తులను ఈ –క్రాప్ ద్వారా గుర్తించి నాణ్యమైన ఆక్వా దిగుబడుల కోసం మత్స్య సాగుబడులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మత్స్య సాగుబడులు ఇలా.. మూస పద్ధతి సాగు విధానాలకు తెరదించి యాంటి బయోటిక్స్ వాడకుండా నాణ్యమైన ఆక్వా ఉత్పత్తుల కోసం నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం బాటలు వేస్తోంది. మత్స్యసాగుబడుల ద్వారా మెరైన్/ఇన్‌ల్యాండ్ మత్స్యకారులు, ఆక్వా రైతులకు సాగులో మెళకువలు, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందిస్తున్నారు. ఒకవైపు ఆర్బీకే ఛానల్ ద్వారా శాస్త్రవేత్తలతో అవగాహన కల్పిస్తూనే క్షేత్ర స్థాయిలో ఆర్బీకేల ద్వారా ఆక్వా, ఇన్‌ల్యాండ్, మెరైన్ సెక్టార్లలో మత్స్యసాగుబడుల ద్వారా అంశాలవారీగా శిక్షణ ఇస్తున్నారు. యాంటి బయోటిక్స్ వినియోగాన్ని నియంత్రించేలా పంటకాలంలో కనీసం ఐదుసార్లు వాటర్ ఎనాలసిస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించే రైతులను సమీప ఆర్బీకేలకు ట్యాగ్ చేస్తున్నారు. చెరువులను జియోట్యాగ్ చేస్తున్నారు. ప్రతీ విషయాన్ని ఈ–మత్స్యకార పోర్టల్‌లో అనుసంధానం చేస్తున్నారు. హెక్టార్‌కు 4 టన్నులు నేను 12 హెక్టార్లలో ఆక్వా సాగు చేస్తున్నా. ఆర్బీకే ద్వారా ఎంపిక చేసుకున్న నాణ్యమైన సీడ్, మత్స్యసాగుబడుల్లో సూచించిన సాగు విధానాలను పాటించా. పంట కాలంలో దశలవారీగా నీటి నమూనాలను సేకరిస్తూ వ్యా«ధుల నిర్ధారణ, ఫీడ్ నిర్వహణ పాటించా. నిషేధిత యాంటి బయోటిక్స్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేశా. సిఫార్సు చేసిన ప్రొ బయోటిక్స్, ఇమ్యునోస్టిమ్యులెంట్స్‌ను మాత్రమే వినియోగించా. గతంలో తెగుళ్ల నివారణ కోసం హెక్టార్‌కు రూ.80 వేల నుంచి రూ.లక్ష ఖర్చు కాగా ప్రస్తుతం రూ.10 వేల నుంచి రూ.20 వేలలోపే వ్యయం అవుతోంది. గతంలో హెక్టార్‌కు 3–3.2 టన్నుల దిగుబడి రాగా ఇప్పుడు 4 టన్నుల దిగుబడితో రూ.2–3 లక్షలు అదనపు ఆదాయం లభించింది. – పి.లక్ష్మిపతిరాజు, కరప, తూర్పుగోదావరి జిల్లా సత్ఫలితాలనిస్తున్న మత్స్యసాగుబడులు నాణ్యమైన దిగుబడులు సాధించడమే లక్ష్యంగా మత్స్యసాగుబడులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలో ఎక్కడా ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్ నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. ప్రతీ రైతును భాగస్వామిగా చేయడం ద్వారా నైపుణ్యాలను పెంపొందిస్తున్నాం. శాస్త్రవేత్తలతో క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహిస్తూ సలహాలు అందిస్తున్నాం. నిషేధిత యాంటి బయోటిక్స్ వినియోగం 10 శాతానికి తగ్గినట్లు గుర్తించాం. పెట్టుబడులు తగ్గడంతో పాటు దిగుబడులు పెరిగాయి. – కె.కన్నబాబు, మత్స్యశాఖ కమిషనర్ -
జనాలకు చేరువగా జల పుష్పాలు.. ఇక ఈజీ!
ఆ వారానికి చేపల నుంచి పీతల మీదకు మనసు మళ్లింది. కానీ ఎలా..? అన్ని ఏరియాల్లో అవి దొరకవే. కొందరికి కంచంలో కారంగా రొయ్యలు కనిపిస్తే గానీ ఆ వీకెండ్ పూర్తవదు. ఏం లాభం..? ఉదయాన్నే మార్కెట్‌పై పడితే గానీ పని జరగదు. అలా కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏవి కావాలంటే అవి దొరికేలా.. మన చెంతనే మీనాల జాతర జరిగితే..? కానాగార్తల నుంచి ఖరీదైన పీతల వరకు అన్నీ మనకు సమీపంలోనే విక్రయిస్తే..? సగటు మనిషి జిహ్వ‘చేప’ల్యం తీరుతుంది కదా. సర్కారు అదే పనిలో ఉంది. అటు మత్స్యకారులకు లాభం కలిగేలా.. ఇటు చేపల వినియోగం మరింత పెరిగేలా ప్రత్యేక యూనిట్లను మంజూరు చేసి రాయితీ నిధులు కూడా కేటాయించింది. సాక్షి, శ్రీకాకుళం: జనాలకు మత్స్య సంపదను మరింతగా చేరువ చేసేందుకు, మత్స్యకారుల విక్రయాలు ఇంకా పెరిగేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధమయ్యాయి. తోపుడు బళ్లపై కూరగాయలు, పండ్లు విక్రయించినట్టు.. భవిష్యత్‌లో జల పుష్పాలను కూడా జనాలకు చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. చేపలు, రొయ్యిలు, పీతలు కూడా స్వచ్ఛంగా నాణ్యతతో ప్రజల చెంత ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. మత్స్య ఉత్పత్తుల తలసరి వినియోగాన్ని పెంచేందుకు సరికొత్త పథకాలను రూపొందించింది. నూతనంగా ఆక్వా హబ్‌లు, ఫిష్ కియోస్క్‌లు, రిటైల్ ఔట్ లెట్లు, లైవ్ ఫిష్ వెండింగ్ సెంటర్లు, ఫిష్ వెండింగ్ కం ఫుడ్ కార్ట్లు, ఈ–రిక్షాలు, వ్యాల్యూ యాడెడ్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి సర్కారు ఇప్పటికే చర్యలు చేపట్టింది. స్వయం ఉపాధిని కోరుకుంటున్న వారి కోసం ప్రత్యేక రాయితీలతో పథకాలను అమలు చేయనున్నారు. అందుకోసం సమీప గ్రామ/వార్డు సచివాలయాల్లో విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్స్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తులను కూడా ఆహ్వానించింది. చదవండి: అయ్యో పాపం.. టీవీ మీద పడటంతో చిన్నారి మృతి శ్రీకాకుళం జిల్లాలో రూ.7.34 కోట్లతో 300 యూనిట్లు.. ♦ అన్ని రంగాలపై పడినట్టే కోవిడ్ ప్రభావం మత్స్య సంపదపై కూడా పడింది. ♦దీంతో అటు గంగపుత్రులను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి, జనాలకు మత్స్య సంపదను చేరువ చేసేందుకు ప్రధాన మంత్రి సంపద యోజన పథకం (పీఎంఎంఎస్వై) కింద 300 యూనిట్లు మంజూరయ్యాయి. ♦ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసే క్రమంలో జిల్లాలో లబ్దిదారుల దరఖాస్తులను పరిశీలించి పథకాల అమలుకు చర్యలు చేపట్టింది. ♦ ఇందుకోసం సుమారు 13 విభాగాల యూనిట్లను సిద్ధం చేసి, బీసీ (జనరల్) కేటగిరీకి 40 శాతం, ఎస్సీ, ఎస్టీ, మహిళా కేటగిరీలకు 60 శాతం రాయితీలను కల్పించేలా చర్యలు చేపడుతోంది. ♦జిల్లాలో రాయితీల కోసం రూ.7.34 కోట్లు మంజూరు చేసింది. ఈ పథకాలతో జిల్లాలో ఉన్న 11 మండలాల తీర ప్రాంతాల నుంచి వస్తున్న మత్ప్య ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని భావించిన రాష్ట్ర మత్స్య శాఖ ఈ మేరకు జిల్లాలో దాదాపుగా అన్ని యూనిట్లను ఏర్పాటు చేసి లక్ష్యాన్ని సాధించాలని చర్యలు చేపట్టింది. ♦అలాగే జిల్లా కేంద్రంలో ఒక ఆక్వా హబ్‌ను కూడా రూ.1.85 కోట్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం స్థల సేకరణ పనులు జరుగుతున్నాయి. చదవండి: ఇన్నాళ్లు ఎక్కడున్నావయ్యా.. భర్తను చూడగానే.. తలసరి వినియోగం పెంచేందుకే చేపల తలసరి వినియోగం పెంచేందుకు మత్స్యశాఖలో ఈ పథకాలను అమలు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా జిల్లాలో 300 యూనిట్లు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే 50 శాతం నిధులు విడుదలయ్యాయి. సచివాలయాల్లో నవ శకంలో భాగంగా ఆసక్తి ఉన్న వారు ఈ పథకాల్లో లబ్దిదారులుగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు. వివరాలకు 9346007766 నంబర్‌ను సంప్రదించవచ్చును. – ఎం.షణ్ముఖరావు,జిల్లా ప్రోగ్రాం మేనేజర్, శ్రీకాకుళం -
టైగర్ తిరిగొస్తోంది
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ ఆక్వా మార్కెట్లో మీసం మెలేసిన ఆంధ్రా టైగర్ రొయ్యలు తిరిగి సాగులోకి వస్తున్నాయి. సుమారు రెండు దశాబ్దాల క్రితం వరకూ ఆక్వా రంగంలో తిరుగులేని రారాజుగా వెలుగొందిన టైగర్ రొయ్యలపై వివిధ రకాల వైరస్లు ముప్పేట దాడితో మూలన పడ్డాయి. దాంతో ఆ స్థానాన్ని వెనామీ రొయ్యల రొయ్యలు ఆక్రమించాయి. తాజాగా వెనామీ సాగులోనూ వైరస్ల దాడి పెరగటం, వివిధ రకాల వ్యాధులు విజృంభిస్తుండటంతో నష్టాల పాలవుతున్న రైతులకు టైగర్ రొయ్యలు తిరిగి ఆశాదీపంలా కనిపిస్తున్నాయి. వెనామీకి ప్రత్యామ్నాయంగా టైగర్ సాగు ద్వారా సిరుల పంట పండించేందుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లాలోని సముద్ర తీర ప్రాంత రైతులు 4,500 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా టైగర్ రొయ్యల సాగుకు శ్రీకారం చుట్టి మంచి ఫలితాలు సాధించారు. గుంటూరు జిల్లాతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని తీరప్రాంత ఆక్వా రైతులు సైతం టైగర్ రొయ్యల సాగు వైపు ఇప్పటికే అడుగులు వేశారు. నష్టాల సాగు నుంచి గట్టెక్కేలా.. దేశవ్యాప్తంగా ఏటా 8.64 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి అవుతుంటే.. అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 6.34 లక్షల టన్నుల (74 శాతం) రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో సింహభాగం వెనామీ రొయ్యలదే. అంతకు ముందు మన ప్రాంత నాటు రొయ్య (టైగర్) హవా నడిచింది. ఆ తరువాత టైగర్ రొయ్యలకు వైట్ స్పాట్ (తెల్ల మచ్చ) వైరస్, ఇతరత్రా వ్యాధులు సోకడం, వ్యాధి రహిత తల్లి రొయ్యల (స్పెసిఫిక్ పాత్ జోన్ ఫ్రీ బ్రూడర్స్) ఉత్పత్తి లేకపోవడంతో ‘టైగర్’ శకం ముగిసింది. అదే సమయంలో విదేశాల నుంచి స్పెసిఫిక్ పాత్ జోన్ ఫ్రీ (ఎస్పీఎఫ్) వెనామీ బ్రూడర్స్ (తల్లి రొయ్యలు) రావడం, విస్తృత స్థాయిలో సీడ్ అందుబాటులోకి రావడంతో ఆక్వా రంగం పూర్తిగా వెనామీ వైపు మళ్లింది. ప్రస్తుతం వెనామీ రొయ్యలకు సైతం వైట్ స్పాట్, వెబ్రియా తదితర వైరస్లు, వ్యాధుల కారణంగా 40 కౌంట్‌లో పట్టాల్సిన 80–100 కౌంట్‌లో పట్టేయాల్సి వస్తోంది. దీంతో వెనామీ సాగు చేస్తున్న రొయ్యల రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తిరిగి టైగర్ రొయ్యలు అందుబాటులోకి వస్తున్నాయి. గుజరాత్లో తల్లి రొయ్యల పునరుత్పత్తి అమెరికాలోని హవాయికి చెందిన ఓ సంస్థ ఎస్పీఎఫ్ టైగర్ తల్లి రొయ్యలను అభివృద్ధిపర్చడంతో తిరిగి టైగర్ శకం ప్రారంభమైనట్టయ్యింది. వాటి దిగుమతికి 2019లో కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఓ ప్రైవేట్ సంస్థ టైగర్ బ్రూడర్స్‌ను దిగుమతి చేసుకుని నెల్లూరు జిల్లాలో హేచరీ ద్వారా సీడ్ (రొయ్య పిల్లల)ను ఉత్పత్తి చేసింది. ఆ సీడ్‌తో గుంటూరు, నెల్లూరు, ఒంగోలు ప్రాంత రైతులు ప్రయోగాత్మకంగా సాగు చేపట్టి సత్ఫలితాలు సాధించారు. దేశీయ అవసరాలకు సరిపడా బ్రూడర్స్ దిగుమతికి అవకాశాలు తక్కువగా ఉండటంతో తల్లి రొయ్యల పునరుత్పత్తి కోసం గుజరాత్లో బ్రూడర్ మల్టిప్లికేషన్ సెంటర్ (బీఎంసీ)ను ఆ ప్రైవేటు సంస్థ ఏర్పాటు చేస్తోంది. తల్లి రొయ్యల నుంచి ఉత్పత్తయ్యే సీడ్‌ను ఇక్కడ 4 నెలల పాటు పెంచి.. వాటిద్వారా తిరిగి తల్లి రొయ్యలను పునరుత్పత్తి చేస్తారు. వైట్స్పాట్తో పాటు ఇతర వ్యాధులను సైతం తట్టుకునేలా వాటిని అభివృద్ధి చేస్తారు. ప్రస్తుతం ఒక్కో రొయ్య పిల్ల 99 పైసలకు అందుబాటులో ఉంది. ప్రయోగం సక్సెస్ ఈ ఏడాది జనవరిలో ప్రైవేట్ సంస్థ ఏపీ మార్కెట్లోకి తీసుకొచ్చిన సీడ్‌ను గుంటూరు జిల్లా నిజాంపట్నం, రేపల్లె, కర్లపాలెం, పీవీ పాలెం ప్రాంత రైతులు ప్రయోగాత్మకంగా 4,500 ఎకరాల్లో సాగు చేశారు. రొయ్యలు ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా ప్రతిరోజు 0.3 గ్రాముల నుంచి 0.5 గ్రాముల వరకు పెరుగుతూ 120 రోజుల్లోనే 20 కౌంట్లోపే పంట చేతికొచ్చింది. ఊహించని రీతిలో ఫలితాలు రావడంతో సీడ్‌కు డిమాండ్ ఏర్పడింది. 70 ఎకరాల్లో రూ.1.40 కోట్ల ఆదాయం నిజాంపట్నం మండలం లంకవానిదిబ్బలోని 70 ఎకరాల్లో టైగర్ రొయ్యలు సాగు చేశా. రూ.1.90 కోట్లు పెట్టుబడి పెట్టా. 13–15 కౌంట్‌లో 62 టన్నుల దిగుబడి వచ్చింది. వైట్ స్పాట్‌ను తట్టుకుంది. ఎలాంటి మందులు వాడలేదు. పెట్టుబడి పోను రూ.1.40 కోట్ల ఆదాయం వచ్చింది. – కొక్కిలిగడ్డ ఐజాక్, ఆక్వా రైతు, నిజాంపట్నం, గుంటూరు తీర ప్రాంత ఆక్వా రైతులకు వరం టైగర్ రొయ్యలు తీరప్రాంత ఆక్వా రైతులకు వరం. వెనామీకి ప్రత్యామ్నాయంగా మారుతుంది. పెట్టుబడి తక్కువగా ఉండే టైగర్ సాగు సన్న, చిన్నకారు రైతులకు అనుకూలం. వెనామీ సాగుకు అనుకూలంగా లేని ఇసుక భూముల్లో టైగర్ సాగు లాభదాయకం. టైగర్ రొయ్యల పెంపకం విజయవంతం కొనసాగితే సాగు విస్తీర్ణం, ఉత్పత్తితోపాటు ఎగుమతులు కూడా గణనీయంగా పెరుగుతాయి. – డాక్టర్ పి.సురేష్‌కుమార్, డిప్యూటీ డైరెక్టర్, మత్స్య శాఖ -
‘హైదరాబాద్‌లో చేపల ఉత్పత్తికి మంచి డిమాండ్ ఉంది’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పెద్ద ఎత్తున చేప పిల్లలను ఇప్పుడు పంపిణీ చేశామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పేర్కొన్నారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ రీజనల్ సబ్ సెంటర్‌ను శుక్రవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో మంచి నీటి చేపలు, రోయ్యల ఎగుమతిపై దృష్టి పెట్టామన్నారు. హైదరాబాద్ నగరంలో చేపలకు, సముద్ర ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నగరంలో 150 డివిజన్లలో లైవ్ ఫీష్ ఔట్లేట్లు పెట్టబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. రైతులకు లాభాం చేకూరే విధంగా ప్రణాళికలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో చేపల ఉత్పత్తి బాగా వస్తుందని, మార్కెట్లు బాగా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో 1:15 రేషియోలో చేపలకు లాభం ఉంటుందని, రాబోయో రోజుల్లో ప్రభుత్వమే మార్కెటింగ్‌కు సహకారం అందిస్తుందని చెప్పారు. కేంద్ర సముద్ర ఉత్పత్తుల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీనివాసన్ మాట్లాడుతూ.. తెలంగాణలో నీటి వసతులు బాగా పెరిగాయని, రిజర్వాయర్లు చెరువులు, కాలువలు నీటి వసతి పెరిగిందన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపల ఉత్పత్తులకు అవకాశం ఉందన్నారు. ఇప్పటికే మెరైన్ ఉత్పత్తుల కంటైన్ లాండ్ ఫిష్‌ల ఉత్పత్తులపై దృష్టి సారించామపి చెప్పారు. తెలంగాణలో సబ్ సెంటర్ ద్వారా నాణ్యమైన సముద్ర ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని చెప్పారు. స్థానిక ప్రజలు నాణ్యమైన సముద్ర ఉత్పత్తులను కొనడానికి ఇష్టపడుతున్నారని, హైదరాబాదులో ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. అయితే ఆక్వా కాంప్లెక్స్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి సహకారం కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు. -
‘ఆ కుట్రల్లో నిమ్మగడ్డ బలి పశువు కావొద్దు’
సాక్షి, విశాఖపట్నం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ఆక్వా, మత్స్యశాఖ రంగాలకు బంగారు భవిష్యత్తు ఏర్పడుతోందని మంత్రి మోపిదేవి వెంకట రమణ అన్నారు. బుధవారం నక్కపల్లి మండలం బంగారమ్మపేటలో 34.76 కోట్ల రూపాయల వ్యయంతో ఆక్వాటిక్ క్వారంటైన్ ఫెసిలిటీ సెంటర్ నిర్మాణానికి మంత్రి మోపిదేవి వెంకటరమణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ.. దేశంలోనే రెండో ఆక్వా క్వారంటైన్ సెంటర్‌ను రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఏర్పాటు చేశారన్నారు. క్వారంటైన్ సెంటర్ ఏర్పాటుతో ఆక్వా రంగంలో పెను మార్పులు తీసుకు రావచ్చన్నారు. (త్వరలో వారికి కూడా కాపునేస్తం తరహా పథకం ) నిరుద్యోగ యువతకు ఉపాధితోపాటు, పారిశ్రామికంగా కోస్తా ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందని మంత్రి మోపిదేవి పేర్కొన్నారు. దేశంలో యాబై శాతం పైగా ఆంధ్ర రాష్ట్రం నుంచే ఎగుమతులవుతున్నాయన్నారు. కరోనా కష్టకాలంలో సరైన నిర్ణయాలతో ఆక్వా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నారని తెలిపారు. ఆక్వాతో పాటు మత్స్య సంపద అభివృద్దికి మూడు వేల కోట్లతో మేజర్ పోర్ట్‌ల అభివృద్ధి జరుగుతందని, ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో మెరైన్ యూనివర్సిటీ ఏర్పాటుచేయబోతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మంచి పరిపాలనకు ఆటంకం కల్గించే దిశగా చంద్రబాబు కుట్రలు చేస్తున్నరని మండిపడ్డారు. (ఆ హక్కు రాష్ట్రానికి లేదు.. జూన్ నుంచి పూర్తి పింఛన్లు) చంద్రబాబు కుట్రల్లో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ బలి పశువు కావద్దని సూచించారు. ఎన్నికల కమిషనర్‌కు సమస్యలుంటే ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించుకోవాలని హితవు పలికారు. పరిపాలనా సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రులలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నాలుగో స్థానం కైవసం చేసుకున్నారని మంత్రి మోపిదేవి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ సత్యవతి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, మత్స్య శాఖ కమిషనర్ కన్నబాబు పాల్గొన్నారు. (వైఎస్సార్ కాపు నేస్తం ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్) -
‘అప్పుడు గుర్తుకు రాలేదా బాబూ..’
సాక్షి, విజయవాడ: దేశంలోనే ఆక్వా ఉత్పత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రథమస్థానంలో ఉందని మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కరోనా మహమ్మారితో ప్రపంచదేశాలన్ని అస్తవ్యస్తమయ్యాయని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి గిట్టుబాటు ధరలు కల్పిస్తోందన్నారు. ప్రభుత్వమే ప్రత్యక్షంగా ఆక్వా రైతులను ఆదుకుందని తెలిపారు. ఆక్వా ఉత్తత్తి చేసే రైతులందరిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఎగుమతులకు సంబంధించిన అనుమతులు లేకపోవడంతో ఆక్వా మెరైన్ ఎక్స్‌ఫోర్ట్ ఇండియా ఛైర్మన్‌ను పిలిపించి మాట్లాడారని తెలిపారు. (అటవీ ఉత్పత్తులకు మద్దతు ధర ప్రకటించాలి) త్వరలో ఆక్వా ఆథారిటీ ఏర్పాటు.. గిట్టుబాటు ధరను కల్పించిన ముఖ్యమంత్రికి ఆక్వా రైతులు జేజేలు పలుకుతున్నారని తెలిపారు. రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఆక్వా, ఫిషరీష్ రోజుకు 250 లారీలు ద్వారా ఎగుమతులు అయ్యేవని.. అవి 50 లారీలకు ఎగుమతులు పడిపోయాయని వివరించారు. సీఎం చొరవ చూపి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి మార్కెట్లు తెరిపించే ప్రయత్నం చేశారని చెప్పారు. ఆక్వా, ఫిష్ కల్చర్, మెరైన్ ఉత్పత్తులను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి ఆక్వా ఆథారిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. (కరోనా: 17 వేల మంది ఖైదీల విడుదల) అప్పుడు రానివి.. ఇప్పుడు గుర్తుకొస్తున్నాయా..? పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ భావిస్తుంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి మోపిదేవి ధ్వజమెత్తారు. కాకినాడలో భూసేకరణ చేసే చోట చంద్రబాబు టిట్కో ద్వారా ఇళ్లు నిర్మించారని.. అప్పుడు గుర్తుకు రాని మడ అడవులు ఆయనకు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయా అని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాలపై టీడీపీ దుర్మార్గ రాజకీయాలు చేస్తోందని మంత్రి మోపిదేవి మండిపడ్డారు. -
అసోం ముఖ్యమంత్రికి సీఎం జగన్ ఫోన్
సాక్షి, అమరావతి : అసోం సరిహద్దుల్లో లారీలు నిలిచిపోకుండా తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసోం ముఖ్యమంత్రి శరబానంద సోనోవాల్‌కు సూచించారు. శనివారం అసోం ముఖ్యమంత్రి శరబానంద సోనోవాల్‌తో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్బంగా ఏపీ నుంచి పెద్ద ఎత్తున ఆక్వా ఉత్పత్తులు అసోంకు ఎగుమతి అవుతాయన్న విషయాన్ని గుర్తుచేసిన సీఎం వైఎస్ జగన్ ఏపీ నుంచి చేపల ఎగుమతికి ఉన్న అడ్డంకుల తొలగింపుపై దృష్టిపెట్టాలని అసోం ముఖ్యమంత్రిని కోరారు. అలాగే చేపలు విక్రయించే మార్కెట్లను తెరవాలంటూ విజ్ఞప్తి చేశారు. (కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష ) సీఎం వైఎస్ జగన్ మాటలు విన్న అనంతరం తగు చర్యలు తీసుకుంటామని అసోం సీఎం శరబానంద సోనోవాల్ హామీ ఇచ్చారు. లాక్డౌన్ కారణంగా ఏపీలో చిక్కుకుపోయిన అసోం వాసులకు తగిన సహాయాన్ని అందించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను అసోం సీఎం కోరారు. ఏపీలోని అసోం వాసులకు అన్ని రకాలుగా తోడుగా నిలుస్తున్నామని అసోం సీఎంకు వైఎస్ జగన్ తెలిపారు. (ప్రజలంతా లాక్డౌన్ పాటిస్తుంటే ‘మాలోకం’ మాత్రం.. ) -
కరోనా: అక్వా రంగం అధికారులతో రేపు చర్చ
సాక్షి, అమరావతి : ఆక్వా(చేపల పెంపకం) రైతులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అక్వా రైతులను ఆదుకోవడానికి సీఎం జగన్ అధికార యంత్రాంగానికి తగు ఆదేశాలు జారీచేశారని చెప్పారు. ఆక్వా పంటకు సంబంధించిన ఉత్పత్తులు, ధరలపై కరోనా ప్రభావం పడకుండా ప్రభుత్వం సూచించన విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. (కరోనా కట్టడికి అన్నిజాగ్రత్తలు తీసుకున్నాం) కాగా రైతులు చేపలకు ఎదైనా వైరస్ కానీ ఇతరత్రా ఇబ్బందులు లేకపోతే తొందరపడి తమ పంటను హార్వెస్ట్ చేయోద్దని ఆయన రైతులను కోరారు. ఆక్వా రంగానికి సంబంధించిన అసోసియేషన్, సంబంధిత అధికారులతో కలిసి రేపు ఉన్నత స్థాయితో సమావేశం జరగనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆక్వా రంగానికి సంబంధించిన సారాంశాన్ని సీఎం జగన్‌తో చర్చిస్తామన్నారు. ఆ తర్వాత దీనిపై సీఎం జగన్ ఇచ్చే తదుపరి ఆదేశాల ప్రకారమే సత్వర చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి వెల్లడించారు.