సాక్షి, అమరావతి : అసోం సరిహద్దుల్లో లారీలు నిలిచిపోకుండా తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసోం ముఖ్యమంత్రి శరబానంద సోనోవాల్‌కు సూచించారు. శనివారం అసోం ముఖ్యమంత్రి శరబానంద సోనోవాల్‌తో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్బంగా ఏపీ నుంచి పెద్ద ఎత్తున ఆక్వా ఉత్పత్తులు అసోంకు ఎగుమతి అవుతాయన్న విషయాన్ని గుర్తుచేసిన సీఎం వైఎస్ జగన్ ఏపీ నుంచి చేపల ఎగుమతికి ఉన్న అడ్డంకుల తొలగింపుపై దృష్టిపెట్టాలని అసోం ముఖ్యమంత్రిని కోరారు. అలాగే చేపలు విక్రయించే మార్కెట్లను తెరవాలంటూ విజ్ఞప్తి చేశారు. (కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష )
సీఎం వైఎస్ జగన్ మాటలు విన్న అనంతరం తగు చర్యలు తీసుకుంటామని అసోం సీఎం శరబానంద సోనోవాల్ హామీ ఇచ్చారు. లాక్‌డౌన్ కారణంగా ఏపీలో చిక్కుకుపోయిన అసోం వాసులకు తగిన సహాయాన్ని అందించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను అసోం సీఎం కోరారు. ఏపీలోని అసోం వాసులకు అన్ని రకాలుగా తోడుగా నిలుస్తున్నామని అసోం సీఎంకు వైఎస్ జగన్ తెలిపారు. (ప్రజలంతా లాక్‌డౌన్ పాటిస్తుంటే ‘మాలోకం’ మాత్రం.. )
Comments
Please login to add a commentAdd a comment