Sarbananda Sonowal
-
5 రాష్ట్రాల్లో షిప్ బిల్డింగ్ క్లస్టర్స్.. లిస్ట్‌లో ఏపీ
న్యూఢిల్లీ: షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ క్లస్టర్లను అయిదు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ బుధవారం తెలిపారు. నౌకా నిర్మాణం, నౌకల మరమ్మత్తు వ్యూహాత్మక ప్రాముఖ్యతను గుర్తిస్తూ గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, ఒడిశాలో క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించారు.మూడవసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజులలో తన మంత్రిత్వ శాఖ సాధించిన ప్రధాన విజయాలను ఈ సందర్భంగా సోనోవాల్ వివరించారు. రాబోయే ఐదేళ్లలో కంటైనర్ హ్యాండ్లింగ్ 40 మిలియన్ టీఈయూలకు (ట్వెంటీ ఫుట్ ఈక్వలెంట్ యూనిట్) చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. తద్వారా దేశవ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందన్నారు. తొలి భారతీయ పోర్టుగా.. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ నిర్వహణ సామర్థ్యాన్ని ప్రస్తుత 6.6 మిలియన్ టీఈయూల నుండి 10 మిలియన్లకు పెంచుకుంటుందని సోనోవాల్ వివరించారు. ఇది కార్యరూపం దాలిస్తే ఈ సామర్థ్యానికి చేరుకున్న తొలి భారతీయ పోర్టుగా నిలుస్తుందని అన్నారు. హైడ్రోజన్ తయారీ కేంద్రాల ఏర్పాటుకై దీనదయాళ్ పోర్ట్ అథారిటీ, వీఓ చిదంబరనార్ పోర్ట్ ట్రస్ట్‌లో 3,900 ఎకరాల భూమిని కేటాయించినట్టు మంత్రి తెలిపారు.ఇది రానున్న సంవత్సరాల్లో రూ.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షిస్తుందని ఆయన వెల్లడించారు. గ్రేట్ నికోబార్ ద్వీపంలోని గలాథియా బే వద్ద అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ప్రధాన ట్రాన్స్షిప్మెంట్ హబ్‌గా పనిచేస్తుందని వివరించారు. టాప్–10 కంటైనర్ పోర్ట్‌లలో.. కామరాజర్ ఓడరేవును స్థాపించిన 25 సంవత్సరాల తరువాత వధ్వన్ పోర్ట్ చేరిక భారత సముద్ర ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని సర్బానంద సోనోవాల్ తెలిపారు. 21వ శతాబ్దపు భారత మొట్టమొదటి ప్రధాన పోర్ట్ ప్రాజెక్ట్ అయిన వధ్వన్ పోర్ట్ 298 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యంతో అతిపెద్ద ఆల్ వెదర్ డీప్ వాటర్ పోర్ట్‌లలో ఒకటిగా అవతరించడానికి సిద్ధంగా ఉందన్నారు.ఈ మెగా పోర్ట్ 12 లక్షల మందికి ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని చెప్పారు. అంతర్జాతీయ షిప్పింగ్ కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుందని, రవాణా సమయం, ఖర్చులను తగ్గించడం ద్వారా ప్రపంచంలో టాప్–10 కంటైనర్ పోర్ట్‌లలో ఒకటిగా ఉంచుతుందని భావిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. -
సెప్టెంబర్ 3న రాజ్యసభ ఉప ఎన్నికలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయిన 12 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ 12 స్థానాలకు సెప్టెంబర్ 3న ఎన్నికలు జరుగనున్నట్లు బుధవారం ప్రకటించింది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, దీపేందర్ హుడా వంటి సిట్టింగ్ సభ్యులు లోక్‌సభకు ఎన్నికవడంతో ఆ స్థానాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న కె.కేశవరావు కాంగ్రెస్‌లోకి మారడంతో పాటు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఒక సీటు, ఒడిశాలో మమతా మొహంతా రాజీనామాతో మరో సీటు ఖాళీ అయింది. ఈ 12 స్థానాలకు ఆగస్టు 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా, నామినేషన్ పత్రాల దాఖలుకు ఆగస్టు 21 చివరి తేదీగా ఈసీ ప్రకటించింది. 22న నామినేషన్ పత్రాల పరిశీలన, 26న అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, త్రిపుర, 27న బిహార్, రాజస్తాన్, తెలంగాణ, ఒడిశాల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువిచి్చంది. సెపె్టంబర్ 3వ తేదీన ఓటింగ్ నిర్వహిస్తారని, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేస్తారని తెలిపింది. -
‘సాగరమాల’ కింద ఏపీలో 13 ప్రాజెక్టులు
సాక్షి, అమరావతి: సాగరమాల పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.2,483 కోట్ల విలువైన 13 ప్రాజెక్టులను చేపట్టినట్లు కేంద్ర నౌకాయాన, ఓడరేవుల శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ లోక్‌సభలో వెల్లడించారు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ మొత్తం ఏడు ప్రాజెక్టుల్లో ఇప్పటికే రూ.1,114 కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టుల పనులు పూర్తయినట్లు తెలిపారు. పూర్తయిన పనుల్లో రూ.85.83 కోట్లతో కాకినాడ యాంకరేజ్ పోర్టు ఆధునికీకరణ, విశాఖ పోర్టులో రూ.43 కోట్లతో కోస్టల్ బెర్త్ నిర్మాణం, రూ.46.34 కోట్లతో విశాఖ పోర్టును అనుసంధానం చేసే రహదారి నిర్మాణం, రెండో దశలో రూ.77 కోట్లతో రెండు లైన్ల రహదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరణ, రూ.574 కోట్లతో మారిటైమ్ షిప్‌బిల్డింగ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ ఏర్పాటు, రూ.288 కోట్లతో నెల్లూరు వద్ద జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం వంటి ప్రాజెక్టులు ఉన్నాయని వివరించారు. మరో ఆరు ప్రాజెక్టుల పనులు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. ఇందులో ముఖ్యమైనవి రూ.386 కోట్లతో బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్, రూ.364 కోట్లతో కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్, రూ.387 కోట్లతో పూడిమడక వద్ద ఫిషింగ్ హార్బర్, రూ.152 కోట్లతో విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ, రూ.73 కోట్లతో బియ్యపు తిప్ప వద్ద కోస్టల్ బెర్త్ నిర్మాణం తదితర ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు. మూడేళ్లలో రాష్ట్రంలోని నాన్ మేజర్ పోర్టులు(విశాఖ పోర్టు కాకుండా మిగిలిన పోర్టులు) ద్వారా వాణిజ్య ఎగుమతులు 88 మిలియన్ టన్నుల నుంచి 118 మిలియన్ టన్నులకు పెరిగాయని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న నాన్ మేజర్ పోర్టులు గంగవరం, కాకినాడ గేట్‌వే పోర్టు, కాకినాడ యాంకరేజ్ పోర్టు, కృష్ణపట్నం పోర్టుల నుంచి 2021–22లో 88 మిలియన్ టన్నుల సరుకులు ఎగుమతి కాగా, అది 2023–24 ఆర్థిక సంవత్సరానికి 118 మిలియన్ టన్నులకు పెరిగిందని, ఇదే సమయంలో మేజర్ పోర్టు విశాఖ నుంచి ఎగుమతులు 69 మిలియన్ టన్నుల నుంచి 81 మిలియన్ టన్నులకు పెరిగినట్లు ఆయన వివరించారు. -
‘విశాఖలో చరిత్రలో క్రూయిజ్ టెర్మినల్ ఓ మైలురాయి’
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పోర్టులో నూతనంగా నిర్మించిన క్రూయిస్ టెర్మినల్‌ను పోర్ట్‌లు షిప్పింగ్శాఖ కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డాక్టర్ సత్యవతి, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, విశాఖ మేయర్ హరివెంకట కుమారి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. విశాఖలో చరిత్రలో క్రూయిజ్ టెర్మినల్ ఒక మైలురాయి అని పేర్కొన్నారు. టూరిజం అభివృద్ధి చెందడానికి క్రూయిజ్ ఎంతోగానో దోహదం పడుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో పోర్టులు కీలక భూమిక పోషిస్తున్నాయన్నారు. త్వరలో విశాఖకు జాతీయ,అంతర్జాతీయ క్రూయిజ్‌లు రాబోతున్నాయని రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నర్సింహరావు అన్నారు. విశాఖ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ పాత్ర విశేషమైనదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ మరింత అభివృద్ధి చెందబోతుందని.. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. చదవండి: రాధాకృష్ణను కమ్మేసిన చంద్ర మాయ -
ఏపీలో లక్షా 20 వేల కోట్లతో సాగరమాల ప్రాజెక్ట్‌లు
న్యూఢిల్లీ: సాగరమాల కింద ఆంధ్రప్రదేశ్‌లో లక్షా 20 వేల కోట్ల రూపాయలతో 113 ప్రాజెక్టులు చేపట్టినట్లు కేంద్ర పోర్టులు, షిప్పింగ్, వాటర్ వేస్ శాఖ మంత్రి సర్భానంద సోనోవాల్ పేర్కొన్నారు. రాజ్యసభలో మంగళవారం విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. సాగరమాల ప్రోగ్రాం కింద ప్రస్తుతం ఉన్న పోర్టులు, టెర్మినల్స్, రోల్ ఆన్, రోల్ ఆఫ్, టూరిజం జెట్టీల ఆధునీకరణ, పోర్టుల కనెక్టివిటీ, విస్తరణ, ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు వంటి ప్రాజక్టులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు, స్టేట్ మారిటైం బోర్డులు, మేజర్ పోర్టులు, పబ్లిక్ రంగం ప్రైవేటు భాగస్వామ్యంతో స్పెషల్ పర్పస్ వెహికల్ సమన్వయంతో ప్రాజెక్టులను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. విశాఖ పోర్ట్ అథారిటీ, ఎన్హెచ్ఏఐ, రాష్ట్ర రోడ్ విభాగం, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, ఇండియన్ రైల్వే, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ, విద్యుత్ శాఖ, ఐఆర్ ఎస్, ఏపీ టూరిజం అభివృద్ధి కార్పొరేషన్, ఏపీ మారిటైం బోర్డు మెదలగు సంస్థలు ఇంప్లిమెంటింగ్ ఏజన్సీలుగా వ్యవహరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో చేపట్టిన మొత్తం ప్రాజెక్టుల్లో ఇప్పటికే 32 వేల కోట్లతో చేపట్టిన 36 ప్రాజక్టులు పూర్తి చేశామని, మిగిలిన రూ.91వేల కోట్లతో చేపట్టిన 77 ప్రాజక్టులు వివిధ దశల్లో ఉన్నట్లు మంత్రి వివరించారు. పోర్టు ఆధునీకరణ, కనెక్టివిటీ పెంపు,పరిసర ప్రాంతాల్లో పరిశ్రమల అభివృద్ధి, కోస్టల్ కమ్యూనిటీ డెవలప్మెంట్, కోస్టల్ షిప్పింగ్, ఇన్ ల్యాండ్ వాటర్ ట్రాన్స్ పోర్ట్ కు సంబంధించి రూ.32210 కోట్లతో చేపట్టిన 36 ప్రాజెక్టులు పూర్తయ్యాయని తెలిపారు. అలాగే రూ.17,741 కోట్లతో చేపట్టిన 27 ప్రాజెక్టులు పురోగతి దశలోనూ, రూ.73527 కోట్లతో చేపట్టిన మిగిలిన 50 ప్రాజెక్టులు అమలు దశలోనూ ఉన్నట్లు మంత్రి తెలిపారు. రైతులకు అందుబాటులో నానో డీఏపీ న్యూఢిల్లీ: నానో డీఏపీని మార్కెట్లోకి ప్రవేశపెట్టి రైతులకు అందుబాటులో ఉంచినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖూబా వెల్లడించారు. రాజ్యసభలో శ్రీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా బదులిస్తూ ఈ విషయం తెలిపారు. ఇఫ్కో సమాచారం ప్రకారం నానో డీఏపీ ద్రవరూపంలో ఉండగా, సాంప్రదాయ డీఏపీ కణికల రూపంలో ఉంటుందని తెలిపారు. నానో డీఏపీ విత్తనాలు, వేర్లు, ఆకులకు అందేలా వినియోగించగా, సాంప్రదాయ డీఏపీ మట్టిలో మాత్రమే వినియోగిస్తారని తెలిపారు. వినియోగ సామర్థ్యం 20%-30%గా ఉన్న సాంప్రదాయ డీఏపీతో పోలిస్తే నానో డీఏపీ వినియోగ సామర్థ్యం 80%-90% ఉంటుందని అన్నారు. సాంప్రదాయ డీఏపీకి రాయితీ అందిస్తుండగా, నానో డీఏపీకి మాత్రం సబ్సిడీ లేదని తెలిపారు. -
దేశీ పోర్టుల్లో రికార్డు స్థాయిలో కార్గో హ్యాండ్లింగ్
న్యూఢిల్లీ: దేశీయంగా ప్రధాన పోర్టులు 2022 - 23లో రికార్డు స్థాయిలో 795 మిలియన్ టన్నుల మేర కార్గోను హ్యాండిల్ చేశాయని కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ తెలిపారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 10.4 శాతం అధికం అని ఆయన చెప్పారు. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. దేశీయంగా వైజాగ్‌తో పాటు ముంబై, కొచ్చిన్, చెన్నై, పారాదీప్ తదితర 12 ప్రధాన పోర్టులు ఉన్నాయి. డేటా అనలిటిక్స్, కృత్రిమ మేథ (ఏఐ)ను ఉపయోగించి పోర్టుల సామర్థ్యాలను మరింతగా మెరుగుపర్చుకునేందుకు వీలుందని మంత్రి చెప్పారు. హరిత హైడ్రోజన్ హ్యాండ్లింగ్, నిల్వ, రవాణా కోసం ప్రధాన పోర్టులను హైడ్రోజన్ హబ్‌లుగా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. జాతీయ హైడ్రోజన్ మిషన్ కింద 2035 నాటికి అన్ని పెద్ద పోర్టుల్లోనూ హరిత హైడ్రోజన్ / అమోనియం బంకర్లను ఏర్పాటు చేయాలని నిర్దేశించుకున్నట్లు సోనోవాల్ చెప్పారు. -
ఏపీ అభివృద్ధికి మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది
-
విశాఖలాంటి నగరం ఉండటం ఏపీ అదృష్టం: సర్బానంద సోనోవాల్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా ప్రతిష్టాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 కార్యక్రమాలు రెండో రోజు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు పోర్ట్స్ అండ్ షిప్పింగ్ కేంద్ర మంత్రిసర్బానంద సోనోవాల్ హాజరయ్యారు. ఈ సందర్బంగా సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ.. ‘జీఐఎస్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది. దేశంలో విశాఖపట్నం ప్రత్యేక నగరంగా నిలిచింది. శతాబ్ధాలుగా భారతదేశంలో విశాఖ కీలకంగా ఉంది. విశాఖ కేంద్రంగా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషం. ఏపీ వేగంగా అభివృద్ధి చెందడానికి మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. విశాఖ పోర్టు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం. విశాఖపట్నం చాలా అందమైన ప్రదేశం. విశాఖలాంటి నగరం ఉండటం ఏపీ అదృష్టం. భారత దేశ ప్రగతిలో ఏపీ కీలకం కానుంది’ అని కామెంట్స్ చేశారు. -
ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
అక్కయ్యపాలెం (విశాఖ, ఉత్తరం): ఆంధ్రప్రదేశ్ ఎన్నో సహజ వనరులున్న సుందర రాష్ట్రమని.. దీనిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ చెప్పారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మంగళవారం విశాఖలోని అక్కయ్యపాలెంలో పేదల సంక్షేమ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎనిమిదేళ్లలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఏపీ ప్రజలకు 22 లక్షల ఇళ్లు కేటాయించామని చెప్పారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి రావాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం అనకాపల్లి, విశాఖ జిల్లాల లబ్ధిదారులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి చెక్కులను ఆయన అందజేశారు. సమావేశంలో ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీ మాధవ్, కలెక్టర్ మల్లికార్జున, పోర్టు చైర్మన్ రామ్మోహన్, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ పాల్గొన్నారు. కాగా, ప్రధాని మోదీ కేంద్ర పథకాల లబ్ధిదారులతో వర్చువల్ విధానంలో మాట్లాడారు. ఇందుకోసం సభా ప్రాంగణంలో ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అయితే ఆయన లద్దాఖ్, బిహార్, త్రిపుర, కర్ణాటక, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన లబ్ధిదారులతోనే ముచ్చటించారు. -
ఏపీలో 12 సాగరమాల ప్రాజెక్ట్‌లు: కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: సాగరమాల పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విశాఖపట్నం పోర్టు ట్రస్టు చేసిన 12 ప్రాజెక్ట్ ప్రతిపాదనలను చేపట్టినట్లు కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద్ సోనోవాల్ తెలిపారు. రాజ్యసభలో మంగళవారం ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా ఆయన ఈ విషయం వెల్లడించారు. సాగరమాల పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.412 కోట్లు కేటాయించినట్లు మంత్రి చెప్పారు. ఈ నిధులను సాగరమాల ప్రాజెక్ట్‌లు చేపట్టే మేజర్ పోర్టులు, నాన్-మేజర్ పోర్టులు, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర మారిటైమ్ బోర్డులు ఇతర ప్రభుత్వ సంస్థలకు ఆర్థిక సాయం కింద కేటాయించడం జరుగుతుందని చెప్పారు. ప్రాజెక్ట్ పురోగతిని బట్టి మూడు విడతలుగా నిధులు విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సాగరమాల పథకం కింద చేపట్టిన ప్రాజెక్ట్‌లలో ఇప్పటి వరకు అయిదు ప్రాజెక్ట్‌లు పూర్తయినట్లు మంత్రి వెల్లడించారు. విజయవాడ భవానీ ద్వీపంలో పాసింజర్ జెట్టీ నిర్మాణ పనులు, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు, కోస్తా జిల్లాల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రెండో దశ పనులు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. కాకినాడ యాంకరేజ్ పోర్ట్‌లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, కాకినాడలో ప్రస్తుతం ఉన్న జెట్టీని మెరుగుపరచి సీ ప్లేన్ జెట్టీ అభివృద్ధి చేయడం, భీమునిపట్నంలో పాసింజర్ జెట్టీ నిర్మాణం, కళింగపట్నంలో పాసింజర్ జెట్టీ నిర్మాణం పనులను ఆయా నిర్మాణ సంస్థలకు అప్పగించామని రెండేళ్లలోగా పూర్తవుతాయని మంత్రి చెప్పారు. చదవండి: (బెంగాల్ సీఎం లేఖ.. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ) -
సూర్య నమస్కారంతో సంపూర్ణ ఆరోగ్యం
నందిగామ: యోగా, ధ్యానం మన జీవితంలో అంతర్భాగం కావాలని కేంద్రమంత్రి శర్భానంద సోనోవాల్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కాన్హా విలేజ్‌లోని కాన్హా శాంతి వనంలో అజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా హార్ట్‌ఫుల్ నెస్ ఇన్స్టిట్యూట్, ఫిట్ ఇండియా, పతంజలి ఫౌండేషన్, కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ భాగస్వామ్యంతో 75 కోట్ల సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. హార్ట్‌ఫుల్ నెస్ గురూజీ కమ్లేష్ డి.పటేల్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి శర్భానంద హాజరయ్యారు. యోగా గురు రామ్‌దేవ్ బాబా, రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలసి అంతర్జాతీయ యోగా అకాడమీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ..75 కోట్ల సూర్య నమస్కారాలు వర్చువల్ పద్ధతిలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రామ్‌దేవ్ బాబా మాట్లాడుతూ.. సూర్య నమస్కారాలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు. కమ్లేష్ డి.పటేల్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ యోగా అకాడమీని స్థాపించడం ద్వారా అనేక మందికి ఉపయోగపడుతుందని అన్నారు. గవర్నర్ దత్తాత్రేయ మాట్లాడుతూ..అంతర్జాతీయ స్థాయిలో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయడం చాలా సంతోషమని తెలిపారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ఆహ్లాదకరమైన వాతావరణంలో యోగా సాధన చేయాలని, అలాంటి వాతావరణం మన రాష్ట్రంలోనే ఉందని చెప్పారు. అంతకు ముందు వీరంతా కలసి ‘ది అథెంటిక్ యోగా’పుస్తకాన్ని ఆవిష్కరించారు. -
సముద్రతీర అధ్యయనాల్లో భారత్ అగ్రస్థానంలో ఉండాలి
సబ్బవరం(పెందుర్తి): సముద్రతీర అధ్యయనాల్లో భారతదేశం అగ్రస్థానంలో నిలవాలని కేంద్ర ఓడరేవులు, జలరవాణా శాఖ మంత్రి శర్భానంద్ సోనోవాల్ ఆకాంక్షించారు. మండలంలోని వంగలిలో గల ఇండియన్ మారిటైం విశ్వవిద్యాలయాన్ని గురువారం ఆయన జాతికి అంకితం చేశారు. సుమారు 110 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ విశ్వవిద్యాలయాన్ని ఇండియన్ మారిటైం విశ్వవిద్యాలయాల ప్రధాన కార్యాలయం చెన్నై నుంచి కేంద్ర మంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మన దేశానికి మూడు వైపుల సముద్రం ఉండడంతో సముద్రతీర అధ్యయనాలకు ఓడరేవుల అభివృద్ధికి, నౌకా నిర్మాణాలకు, డిజైన్లకు ఎంతో భవిష్యత్ ఉందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను అందిపుచ్చుకుని దేశం పట్ల తమ బాధ్యతను నిర్వర్తించాలని తెలియజేశారు. చెన్నై నుంచి ఐఎంయూ ఉపకులపతి మాలిని పి.శంకర్, ఎంపీ రవీంద్రనాథ్, ఎమ్మెల్యే రమేష్ అరవింద్ పాల్గొనగా.. విశాఖ కలెక్టరేట్లోని నిక్ నుంచి వర్సిటీ డైరెక్టర్ కేశవదేవ్, వీవీ శివకుమార్, ఆకెళ్ల వెంకటరమణ మూర్తి, డాక్టర్ భానుప్రకాష్, డాక్టర్ షైజీ, డాక్టర్ పట్నాయక్, డాక్టర్ వి.రవిచంద్రన్, సీతాకుమారి, డాక్టర్ శిరీషా, ఈపీఎస్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
టీమ్ ఇండియాగా పని చేయాలి!... మన జట్టుకు కెప్టెన్ మోదీ
అహ్మదాబాద్: భారత్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో మనమంతా చేతులు కలపాలంటూ కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు మనం టీమ్ ఇండియాగా పని చేయాలని ఈ జట్టుకు కెప్టెన్ నరేంద్ర మోదీ అని అన్నారు.ఈ మేరకు నౌకాశ్రయాలు, షిప్పింగ్‌ల జలమార్గాల మంత్రి సోనోవాల్ గాంధీనగర్‌లోని మహాత్మా మందిరంలో జరుగుతున్న ప్రధానమంత్రి గతి శక్తి కార్యక్రమంలో మాట్లాడుతూ.. "మోదీ నాయకత్వంలో ప్రతి రంగం మార్పుని, అభివృద్ధిని చవిచూస్తోంది. భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా మార్చడానికి ఆయన నిబద్ధతతో పని చేస్తున్నారు. పైగా అందుకోసం కొన్ని లక్ష్యాలను కూడా నిర్దేశించుకున్నారు. మనమందరం కలిసి ఆ లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలి " అని అన్నారు. (చదవండి: కరోనా కొత్త వేరియంట్.. జర్మనీలో తీవ్రరూపం..రంగంలోకి వైమానిక దళం) అంతేకాదు మనమందరం నిబద్ధతతో మన బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం ఉందని కూడా సోనోవాల్ స్పష్టం చేశారు. ఈ మేరకు గతి శక్తి కేవలం కనెక్టివిటీ మాత్రమే కాదు, దేశాన్ని బలోపేతం చేసేలా అన్ని రాష్ట్రాలను ఏకతాటిపైకి తీసుకువ్చే దిశగా సారిస్తున్న ముఖ్యమైన అడుగుగా అభివర్ణించారు. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సాకారం చేసేందుకు కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని సోనోవాల్ పేర్కొన్నారు. అంతేకాదు మోదీ నాయకత్వంలో ప్రతి వర్గానికి అవకాశాలను అందించారని అందువల్ల ప్రతి పౌరుడు ఈ గతి శక్తి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సోనోవాల్ అన్నారు. ఈ క్రమంలో నౌకాశ్రయాలు, షిప్పింగ్ జలమార్గాల శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ మాట్లాడుతు.. "రెండు రవాణా మార్గాలను ఏకీకృతం చేయడం వల్ల వస్తువులను తరలించడంలో ఖర్చు తగ్గుతుంది. మల్టీమోడల్ కనెక్టివిటీని మంత్రిత్వ శాఖ కనెక్టివిటీ కీలక ప్రాంతంగా తీసుకుంది. అయితే ఇది పీఎం గతి శక్తి ప్రధాన ఇతివృత్తం. పైగా ఇక్కడ ప్రాజెక్ట్ నిర్వహణకు సంబంధించిన ప్రణాళిక అమలు, నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌లలో మార్పులను తీసుకురావాలని భావిస్తోంది. ఇప్పటి వరకు 500 కంటే ఎక్కువ ప్రాజెక్టులను మల్టీమోడల్ కనెక్టివిటీ ప్రాజెక్టులుగా చేపట్టింది. ఇది ఒక రకంగా ఉద్యోగాల కల్పనకు దోహదపడటమే కాక కొత్త వ్యాపార అవకాశాలతో ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన మార్పులను తీసుకురానుంది. అంతేకాదు మేము సాగరమాల కార్యక్రమంలో దాదాపు రూ.1.7 లక్షల కోట్లతో సుమారు 181 ప్రాజెక్టులను చేపడుతున్నాం. పైగా ఇందులో 19 రోడ్డు ప్రాజెక్టులు, 91 రైలు ప్రాజెక్టులు ఉన్నాయి." అని అన్నారు. ఈ మేరకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ మల్టీమోడల్ కనెక్టివిటీ సామర్థ్యాన్ని పెంచడం, ఖర్చును తగ్గించడమే కాక చివరికి ప్రపంచంలో స్థానిక ఉత్పత్తులను మరింత పోటీగా మార్చడంలో తమకు సహాయపడుతుందని అన్నారు. అంతేకాదు ఈ చొరవ దేశంలో లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల ముఖచిత్రాన్ని మారుస్తుందని చెప్పారు. అయితే ఇది యువతకు కొత్త ఉద్యోగాలను సృష్టించడమేకాక ప్రపంచవ్యాప్తంగా స్థానిక ఉత్పత్తులను తీసుకువెళ్తోందంటూ భూపేంద్ర పటేల్ ఆశాభావం వ్యక్తం చేశారు. (చదవండి: పోలీస్ ఎగ్జామ్ రాసి వస్తున్న యువతిపై....ఫేస్బుక్ స్నేహితుడే అత్యాచారం) -
గతిశక్తి ప్లాన్ కింద 101 ప్రాజెక్టులు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కింద 101 ప్రాజెక్టులను గుర్తించినట్టు కేంద్ర పోర్టులు, షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. వినియోగం, ఉత్పత్తి కేంద్రాలను పోర్ట్‌లతో అనుసంధానించేందుకు గతిశక్తి పథకాన్ని కేంద్రం తీసుకురావడం గమనించాలి. సీఐఐ వర్చువల్‌గా నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా సోనోవాల్ మాట్లాడారు. 24 రాష్ట్రాల పరిధిలో 11 జలమార్గాలు విస్తరించాయని.. వీటిని జాతీయ జలమార్గాలుగా గుర్తించినట్టు తెలిపారు. ‘‘రవాణా వ్యయాలను తగ్గించడం భారత్‌కు కీలకం. దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దృష్టితో ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే అనుసంధానం విస్తృతికి 101 ప్రాజెక్టులను మా శాఖ గుర్తించింది’’ అని సోనోవాల్ వివరించారు. ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులైన సాగర్మాలా, భారత్‌మాలా, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అమలు దశల్లో ఉన్నట్టు చెప్పారు. సాగర్మాలా ప్రాజెక్టు కింద పోర్టుల సదుపాయాల విస్తరణకు, నైపుణ్యాల శిక్షణకు రాష్ట్ర ప్రభుత్వాలకు తమ శాఖా తరఫున ఆర్థిక సాయం అందిస్తున్నట్టు పేర్కొన్నారు. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ఇతర పోర్ట్‌లతో అనుసంధానానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. దేశంలో రవాణా సదుపాయాల విస్తరణ, రవాణా వ్యయాలు తగ్గించే లక్ష్యాలతో రూ.100 లక్షల కోట్ల నేషనల్ మాస్టర్‌ప్లాన్‌ను ప్రధాని మోదీ ఈ ఏడాది అక్టోబర్ 13న ప్రారంభించడం గమనార్హం. మౌలిక, రవాణా సదుపాయాలను విస్తరించడం ద్వారా భవిష్యత్తులో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలన్నది ఇందులోని ఉద్దేశ్యం. దేశ వాణిజ్యం, వృద్ధిలో సముద్రరంగం కీలక పాత్ర పోషిస్తుందని సోనోవాల్ అన్నారు. సరఫరా వ్యవస్థ, రవాణా సామర్థ్యాలు బలోపేతం అయితే 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించడం సాధ్యమవుతుందన్నారు. -
ఎమ్మెల్యేగా ఎన్నికైన నెలరోజులకే కరోనాకు బలి
డిస్పూర్: మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ అదుపులోకి వస్తున్నా మరణాలు పెరగడం ఆందోళన కలిగించే విషయమే. కరోనా బారిన పడిన వారు పెద్ద ఎత్తున మృతి చెందుతున్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే కరోనాతో బాధపడుతూ మృత్యువాత పడ్డారు. ఆయనే అసోంకు చెందిన లెహో రామ్ బొరో. గౌహతి వైద్య కళాశాల ఆస్పత్రి (జీఎంసీహెచ్)లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ అండ్ యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్) తరఫున ఇటీవల జరిగిన ఎన్నికల్లో తముల్పూర్ స్థానం నుంచి గెలిచాడు. ఎమ్మెల్యేగా ఎన్నికై నెల కూడా కాకముందే ఆయన కన్నుమూశాడు. ఆయన మృతికి మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవల్ సంతాపం ప్రకటించారు. ఆయనతోపాటు ఆ పార్టీకి చెందిన నాయకులు నివాళులర్పించారు. -
అసోం సీఎంగా హిమంత బిశ్వ శర్మ!
దిస్పూర్: అస్సాం నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై సస్పెన్స్ వీడింది. ఆదివారం జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మను బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఈ పదవి కోసం సీనియర్ నేతలు సర్బానంద సోనోవాల్, హిమంత బిశ్వ శర్మ పోటీపడిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో సోనోవాల్ ముఖ్యమంత్రిగా, శర్మ ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. మరో వైపు అసోం సీఎం సర్బానంద సోనోవాల్ రాజీనామా చేశారు. గవర్నర్‌కు తన రాజీనామా లేఖను సమర్పించారు. ఇక సీఎంగా ఎన్నికైన బిశ్వ శర్మ అస్సామీ బ్రాహ్మణుడు. ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. అస్సాంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నాయకత్వం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ప్రకటించలేదు. అస్సాంలో 126 అసెంబ్లీ సీట్లుండగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 60 సీట్లు గెలుచుకుంది. దాని మిత్రపక్షాలైన ఏజీపీ 9, యూపీపీఎల్ 6 సీట్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే. చదవండి: ఒట్టి చేతులతో వచ్చారేంటి.. సీఎస్‌పై గవర్నర్ ఫైర్ -
అస్సాం ముఖ్యమంత్రి ఎవరో?
న్యూఢిల్లీ: అస్సాం నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ పదవి కోసం సీనియర్ నేతలు సర్బానంద సోనోవాల్, హిమంత బిశ్వ శర్మ పోటీపడుతున్నారు. గత ప్రభుత్వంలో సోనోవాల్ ముఖ్యమంత్రిగా, శర్మ ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. వారిద్దరూ శనివారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, పార్టీ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) బి.ఎల్.సంతోష్‌తో పలుమార్లు సమావేశమయ్యారు. తదుపరి ముఖ్యమంత్రి ఎవరో తేల్చాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. ఢిల్లీకి రావాలంటూ సోనోవాల్, శర్మకు శుక్రవారం వర్తమానం పంపింది. శనివారం పార్టీ పెద్దలతో భేటీ అనంతరం హిమంత బిశ్వ శర్మ మీడియాతో మాట్లాడారు. బీజేపీ అస్సాం శాసనసభాపక్ష సమావేశం ఆదివారం గువాహటిలో జరిగే అవకాశం ఉందని చెప్పారు. కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై చర్చిస్తామని వెల్లడించారు. కొత్త ముఖ్యమంత్రి పేరు ఖరారుపై, నూతన ప్రభుత్వ ఏర్పాటుపై అన్ని ప్రశ్నలకు ఈ సమావేశంలోనే సమాధానం దొరుకుతుందన్నారు. ఢిల్లీలో సోనోవాల్, శర్మతో బీజేపీ అగ్రనేతలు రెండుసార్లు విడివిడిగా మాట్లాడారు. ఒకసారి ఇద్దరినీ కలిపి కూర్చోబెట్టి చర్చించారు. నడ్డా నివాసానికి వేర్వేరు వాహనాల్లో వచ్చిన సోనోవాల్, శర్మ తిరిగి వెళ్లేటప్పుడు ఒకే కారులో వెళ్లారు. సీఎం రేసులో ముందంజలో ఉన్నారని భావిస్తున్న సోనోవాల్ అస్సాంలోని స్థానిక సోనోవాల్–కచారీ గిరిజన తెగకు చెందిన నాయకుడు. ఇక శర్మ అస్సామీ బ్రాహ్మణుడు. ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈసారి ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కాలని ఉవ్విళ్లూరుతున్నారు. అస్సాంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నాయకత్వం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ప్రకటించలేదు. 2016లో ఎన్నికల కంటే ముందు సోనోవాల్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. రాష్ట్రంలో తొలిసారిగా గెలిచింది. ఆయనకు ముఖ్యమంత్రి పదవి అప్పగించింది. అస్సాంలో 126 అసెంబ్లీ సీట్లుండగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 60 సీట్లు గెలుచుకుంది. దాని మిత్రపక్షాలైన ఏజీపీ 9, యూపీపీఎల్ 6 సీట్లు దక్కించుకున్నాయి. -
కొనసాగుతున్న ఉత్కంఠ: హస్తినకు అసోం రాజకీయం
సాక్షి,ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీని నిలబెట్టుకున్నప్పటికీ అక్కడ ప్రభుత్వ ఏర్పాటులో ఇంకా ప్రతిష్టంభన కొసాగుతోంది. ఫలితాలొచ్చి అయిదు రోజులైనా సీఎం ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు ఇంకా తెరపడలేదు. దీంతో అసోం రాజకీయం హస్తినకు చేరింది. తదుపరి ముఖ్యమంత్రిపై అనిశ్చితి మధ్య నాయకత్వ సమస్యలపై చర్చించడానికి అసోం సిట్టింగ్ ముఖ్యమంత్రి శర్వానంద్ సోనోవాల్, హిమాంత్ బిశ్వలను బీజేపీ అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించింది. కొత్త సీఎం ఎవరనేది శనివారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇరువురు నేతలూ ఢిల్లీకి చేరుకుని, బీజేపీ జాతీయధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమవుతారు. నడ్డా నివాసంలో హోంమంత్రి అమిత్ షా, బీఎల్ సంతోష్ సమాశానికి తొలుత హిమంత బిశ్వ శర్మను పిలిపించిన అధిష్టానం శర్వానంద్ సోనో వాల్ని కూడా పిలిపించడం విశేషం. ఈ సమాశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా హాజరుకానున్నారని తెలుస్తోంది. హిమంత బిశ్వ శర్మ తనకు 40 మంది ఎమ్మెల్యేలతోపాటు మిత్ర పక్షాల మద్దతు ఉందని అంటుండగా, సీఎం తన పరిపాలనకే ప్రజలు ఓటు వేశారని శర్వానంద్ వాదిస్తున్నారు. అటు 50 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీయే, హిమాంత బిశ్వ శర్మకు మద్దతుగా నిలుస్తోంది. తమ పార్టీకి చెందిన 29 ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తారని కాంగ్రెస్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. దీంతో అనిశ్చిత రాజకీయం వాతావరణం మరింత వేడెకింది. ఈ నేపథ్యంలో నాయకత్వ సమస్యను సామరస్యంగా పరిష్కరించే దిశగా అధిష్టానం పావులు కదుపుతోంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో అంతిమ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా అసోంలోని మొత్తం 126 స్థానాలకుగానూ 75 సీట్లలో బీజేపీ నాయకత్వంలోని ఎన్ఏడీ కూటమి విజయం సాధించగా, బీజేపీ 60 సీట్లలో గెలిచింది. ఎన్నికల జరిగిన మిగతా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరినా అసోంలో మాత్రం సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికలకు ముందు బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించని సంగతి తెలిసిందే. -
అస్సాంలో కమలదళానికి కఠిన పరీక్ష
అస్సాంలో కమలదళానికి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలో కఠిన పరీక్ష ఎదురుకానుంది. క్లీన్ఇమేజ్తో బీజేపీ విజయానికి తోడ్పడిన ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ను మళ్లీ సీఎంగా ఎంపిక చేయాలా లేక అస్సాంలో అత్యంత ప్రజాదరణగల నేతల్లో ఒకరైన ఆర్థిక మంత్రి హిమంతా బిశ్వ శర్మను సీఎం చేయాలా అనే దానిపై బీజేపీ అధినాయకత్వం తేల్చుకోవాల్సి ఉంది. బీజేపీ ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవడం ద్వారా సీఎం మార్పుపై ముందుగా సంకేతాలు ఇచ్చిందన్న అభిప్రాయం ఓవైపు వ్యక్తమవుతుండగా... మరోవైపు అధికారంలో ఉన్న రాష్ట్రంలో నాయకత్వ మార్పు గురించి బీజేపీ చర్చించిన సంప్రదాయమేదీ గత 40 ఏళ్లలో లేదనే అంశమూ తెరపైకి వస్తోంది. ఏది ఏమైనా వారిద్దరి రాజకీయ భవిష్యత్తును ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిర్ణయిస్తారని, మోదీ ఎంపిక మేరకు సీఎం అభ్యర్థి ఎవరో ఖరారవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సర్బానంద... విద్యార్థి నేతగా మొదలై... దిబ్రూగఢ్‌కు చెందిన సర్బానంద సోనోవాల్ ఆ రాష్ట్ర కీలక రాజకీయ నేతల్లో ఒకరిగా ఎదిగారు. బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి చొరబడే అక్రమ వలసదారులను వెనక్కి పంపాలంటూ 1970లలో భారీ ఉద్యమం సాగించిన ఆల్‌అస్సాం స్టూడెంట్స్ యూనియన్‌లో విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. 1992 నుంచి 1999 వరకు ఆ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సంస్థ రాజకీయ అవతారమైన అసోం గణ పరిషత్ (ఏజీపీ)లో 2001లో చేరారు. తదనంతర పరిణామాల్లో 2011లో ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. 2014లో లఖీంపూర్ ఎంపీగా గెలిచి మోదీ మంత్రివర్గంలో యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) అయ్యారు. 2016లో అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నాయకత్వం ఆయనను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమిని గెలిపించి సీఎం పగ్గాలు చేపట్టారు. హిమంతా... విలక్షణ నేత అస్సాంలోని గువాహటికి చెందిన డాక్టర్‌హిమంతా బిశ్వ శర్మ విలక్షణ రాజకీయ నేతగా అంచెలంచెలుగా ఎదిగారు. కాలేజీ రోజుల్లో విద్యార్థి సంఘం కార్యదర్శిగా పనిచేసిన అనుభవమున్న శర్మ 2001లో కాంగ్రెస్‌లో చేరి రాజకీయాల్లోకి వచ్చారు. 2001లో తొలిసారి ఏజీపీ నేత బీర్గు కుమారు ఫుకన్‌ను ఓడించి జాలుక్‌బరి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 2006, 2011లో అదే నియోజకవర్గం నుంచి గెలిచి హ్యాట్రిక్‌కొట్టారు. 2006లో వైద్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శర్మ 2011లో విద్యాశాఖ పగ్గాలు అందుకున్నారు. ఆ శాఖలో మంచి పనితీరు కనబరిచారు. 2014లో నాటి కాంగ్రెస్ సీఎం తరుణ్‌గొగోయ్‌పై తిరుగుబాటు చేసి 2015లో బీజేపీలో చేరారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో జాలుక్‌బరి స్థానం నుంచి తిరిగి గెలవడం ద్వారా ప్రభుత్వంలో కేబినెట్‌మంత్రిగా చేరారు. -
స్ప్రింటర్ హిమదాస్‌కు డీఎస్పీ కొలువు
గౌహతి: స్టార్ స్ప్రింటర్ హిమదాస్‌ను డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్‌గా నియమించాలని అసోం ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం సర్బానంద సోనోవాల్ అధ్యక్షతన బుధవారం రాత్రి జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. లీస్, ఎక్సైజ్, రవాణా తదితర వివిధ విభాగాల్లోని క్లాస్-1, క్లాస్-2 ఆఫీసర్లుగా క్రీడాకారులను నియమించడం ద్వారా రాష్ట్రంలో సమీకృత క్రీడా విధానాన్ని సవరించాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు పరిశ్రమల శాఖ మంత్రి చంద్రమోహన్ పటోవరి విలేకరులకు తెలిపారు. అసోం పోలీస్ విభాగంలో డీఎస్పీ ర్యాంకు అధికారిగా హిమదాస్‌ను.. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన వారికి క్లాస్ -1 ఆఫీసర్లుగా నియమించనున్నట్లు పేర్కొన్నారు. 20 ఏళ్ల ఈ అస్సామీ స్టార్ స్పింటర్ 2018లో అద్భుతంగా రాణించింది. ఫిన్లాండ్లో జరిగిన అండర్–20 ప్రపంచ చాంపియన్‌షిప్ 400మీ.ఈవెంట్లో స్వర్ణం గెలిచి అంతర్జాతీయ స్థాయిలో ఏ పోటీల్లోనైనా అగ్రస్థానం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచింది. ఇదే చాంపియన్‌షిప్‌లో 4*400 రిలేలో మరో స్వర్ణం, మిక్స్డ్ రిలేలో రజతం ఆమె ఖాతాలో చేరాయి. ఐఏఏఎఫ్ వరల్డ్ అండర్-20 చాంపియన్ షిప్స్‌లో గ్లోబల్ ట్రాక్ ఈవెంట్ ఏదైనా ఫార్మాట్లో బంగారు పతకం సాధించిన మొట్టమొదటి భారతీయ అథ్లెట్‌గా రికార్డు సాధించింది. -
బిర్యానీ ఎఫెక్ట్: 145 మందికి అస్వస్థత
డిస్పూర్: అస్సాంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ముఖ్య అతిథిగా హాజరైన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ఫుడ్ పాయిజనింగ్ వల్ల 145 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ కూడా ఉన్నారు. వివరాలు.. మంగళవారం రాష్ట్రంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లా డిఫు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ అకాడమిక్ సెషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 8,000 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక వీరందరికి బిర్యానీ ప్యాకెట్స్ ఇచ్చారు. ఇది తిన్న తర్వాత వారిలో పలువురు అస్వస్థకు గురయ్యారు. వీరిలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. ‘‘కార్యక్రమానికి వచ్చిన వారందరికి బిర్యానీ ప్యాకెట్స్ ఇచ్చాం. నేను కూడా అదే బిర్యానీ తిన్నాను. కాసేపటి తర్వాత అనారోగ్యానికి గురయ్యాను. చికిత్స తీసుకున్నాను. ప్రస్తుతం బాగానే ఉన్నాను. నాతో పాటు మరో 145 మంది అస్వస్థతకు గురయ్యారు. అందరిని ఆస్పత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్నాం. వీరిలో 28 మందిని డిశ్చార్జ్ చేయగా.. మరో 118మందికి చికిత్స కొనసాగుతోంది. అందరూ బాగానే ఉన్నారు’’ అని తెలిపారు. (చదవండి: చద్ది బిర్యానీ పెట్టిందని వదినను..) ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితులపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించినట్లు కర్బీ ఆంగ్లాంగ్ డిప్యూటీ కమిషనర్ ఎన్జీ చంద్ర ధ్వాజా సింఘా తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఒక వ్యక్తి మంగళవారం రాత్రి ఆసుపత్రిలో మరణించాడు. అయితే అతను ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయాడా లేక వేరే కారణమా అనేది ఇంకా తెలియలేదు. అతడు తీసుకున్న ఆహార నమూనాలను సేకరించి పరీక్ష కోసం పంపారు. ఆసుపత్రిలో చేరిన వారు కడుపు నొప్పి, వాంతులతో బాధ పడుతున్నట్లు వైద్యులు తెలిపారు. -
బాలీవుడ్ సింగర్ తల్లి మృతి
గువహటి: ప్రముఖ బాలీవుడ్ సింగర్ పాపోన్ తల్లి, అలనాటి అస్సాం గాయని అర్చన మహంత(72) మరణించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె గువహటిలోని హెల్త్ సిటీ ఆస్పత్రిలో గురువారం తుది శ్వాస విడిచారు. కాగా జూలై 14న ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్(పక్షవాతం) రావడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అప్పటికే ఆమె మధుమేహం, అధిక రక్తపోటు, పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో శరీరం ఎడమ వైపు అంతా చచ్చుబడిపోయింది. దీంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో ప్రాణాలు విడిచారు. ((చదవండి: అంతరిక్షం కూడా ఆయన పేరు దాచుకుంది) ఆమె మరణం పట్ల అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "అస్సామీ ఫోక్ సింగర్ అర్చన మహంత ఇక లేరన్న వార్త నన్ను కలిచివేస్తోంది. నేడు ఓ ప్రతిభావంతురాలిని రాష్ట్రం కోల్పోయింది. నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం" అంటూ ట్వీట్ చేశారు. కాగా అర్చన మహంత సాంప్రదాయ గాయని. ఆమె భర్త కూడా సింగరే. అనేక కార్యక్రమాల్లో వీరిద్దరూ కలిసి పాటలు పాడేవారు. వీరికి జన్మించిన కుమారుడు పాపోన్ కూడా సింగర్‌గానే రాణిస్తున్నారు. (చదవండి: నకిలీ ఫాలోవర్ల స్కామ్‌లో ర్యాపర్) Anguished at the demise of renowned Assamese folk singer Archana Mahanta baidew. Today, we have lost a shining star among the cultural stalwarts of the state. I offer my deepest condolences and join all her well-wishers and fans in prayers for the departed soul.@paponmusic pic.twitter.com/iMLl0CCe7e — Sarbananda Sonowal (@sarbanandsonwal) August 27, 2020 -
అక్షయ్ కుమార్‌కు ధన్యవాదాలు తెలిపిన అస్సాం సీఎం
దిస్పూర్: అక్షయ్ కుమార్ ఆయన సినిమాలలోనే కాదు బయట కూడా కరోనా కాలంలో రూ. 25కోట్లు దానం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు. మరోసారి వరదలతో అతలాకుతలం అవుతున్న అస్సాంకు కోటి రూపాయల విరాళం ప్రకటించి ఆదుకున్నాడు. ఇందుకు గాను అస్సాం ముఖ్యమంత్రి సర్భానంద సోనోవాల్ ట్విటర్ వేదికగా అక్షయ్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు. ధ్యాంక్యూ అక్షయ్ జీ. అస్సాం వరదల బాధితుల కోసం రూ. కోటి రూపాయలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మీరు విపత్కర పరిస్థితుల్లో ఎప్పుడూ అండగా నిలుస్తారు. అస్సాంకు మంచి స్నేహితుడైన మీకు ఎల్లప్పుడూ దేవుడి ఆశీర్వాలు ఉండాలి. మీ కీర్తి ప్రపంచ వ్యాప్తంగా విరాజిల్లాలి అని ట్వీట్ చేశారు. గత రెండు నెలలుగా కురుస్తున్న వర్షాల కారణంగా అస్సాంలోని ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. చదవండి: అస్సాంలో వరదలు..104 మంది మృతి Thank you @akshaykumar ji for your kind contribution of ₹1 crore towards Assam flood relief. You have always shown sympathy and support during periods of crisis. As a true friend of Assam, may God shower all blessings to you to carry your glory in the global arena. — Sarbananda Sonowal (@sarbanandsonwal) August 18, 2020 -
చేపల ఎగుమతికి సహకరించండి!
సాక్షి, అమరావతి/భీమవరం: ఏపీ నుంచి అసోంకు చేపల ఎగుమతిలో ఎదురవుతున్న ఇబ్బందులు తొలగించి సహకరించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అసోం సీఎం శరబానంద సోనోవాల్‌కు విజ్ఞప్తి చేశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. చేపల ఎగుమతుల అంశం మీద శనివారం ఇరువురూ ఫోన్లో మాట్లాడుకున్నారు. ఏపీ నుంచి పెద్దఎత్తున ఆక్వా ఉత్పత్తులు అసోంకు ఎగుమతి అవుతున్నందున అక్కడి రాష్ట్ర సరిహద్దుల్లో అవి నిలిచిపోకుండా తగు చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ కోరారు. అంతేకాక.. చేపలు విక్రయించే మార్కెట్లను తెరవాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సోనోవాల్ స్పందిస్తూ.. తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే, లాక్డౌన్ కారణంగా ఏపీలో చిక్కుకుపోయిన అసోం వాసులకు అవసరమైన సహాయాన్ని అందించాలని కోరారు. దీనికి.. ఇప్పటికే తాము అన్ని రకాలుగా అండగా నిలుస్తున్నామని వైఎస్ జగన్ బదులిచ్చారు. సీఎం చొరవతో తొలగనున్న అడ్డంకులు : మోపిదేవి కాగా, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల ఫలితంగా అతిత్వరలోనే చేపల ఎగుమతులకు సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగిపోనున్నాయని పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. చేపల ఎగుమతికి, వాటి మార్కెటింగ్‌లో అసోంలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి సీఎం వైఎస్ జగన్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శరబానంద సోనోవాల్‌కి వివరించారని చెప్పారు. అసోంలో కదిలిన చేపల లారీలు ఇదిలా ఉంటే.. అసోం సరిహద్దుల్లో తాజాగా నిలిచిపోయిన చేపల లోడు లారీలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవతో ముందుకు కదిలాయి. భీమవరం, ఆకివీడు, కైకలూరు ప్రాంతాల నుంచి ప్రతీరోజు సుమారు 200 లారీల్లో చేపలు అసోం, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్, మేఘాలయ, త్రిపుర, మిజోరం తదితర రాష్ట్రాలకు ఎగమతి అవుతాయి. లాక్‌డౌన్‌తో లారీల రాకపోకలు నిలిచిపోయాయి. కానీ, ఆక్వా ఎగుమతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అనుమతులివ్వడంతో భీమవరం పరిసర ప్రాంతాల నుంచి పలు లారీలు అసోం బయల్దేరాయి. ఇవి ఆ రాష్ట్ర సరిహద్దుల్లో నిలిచిపోవడంతో శనివారం సీఎం వైఎస్ జగన్ ఆ రాష్ట్ర సీఎంతో మాట్లాడారు. దీంతో లారీలు అసోంలోకి ప్రవేశించాయి. కాగా, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో బిహార్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో చేపల ఎగుమతులు అవుతున్నాయని రాష్ట్ర చేపల ఎగుమతిదారుల సంఘం కోశాధికారి గాదిరాజు సుబ్బరాజు చెప్పారు. -
అసోం సీఎంతో ఫోన్లో మాట్లాడిన ఏపీ సీఎం
-
అసోం ముఖ్యమంత్రికి సీఎం జగన్ ఫోన్
సాక్షి, అమరావతి : అసోం సరిహద్దుల్లో లారీలు నిలిచిపోకుండా తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసోం ముఖ్యమంత్రి శరబానంద సోనోవాల్‌కు సూచించారు. శనివారం అసోం ముఖ్యమంత్రి శరబానంద సోనోవాల్‌తో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్బంగా ఏపీ నుంచి పెద్ద ఎత్తున ఆక్వా ఉత్పత్తులు అసోంకు ఎగుమతి అవుతాయన్న విషయాన్ని గుర్తుచేసిన సీఎం వైఎస్ జగన్ ఏపీ నుంచి చేపల ఎగుమతికి ఉన్న అడ్డంకుల తొలగింపుపై దృష్టిపెట్టాలని అసోం ముఖ్యమంత్రిని కోరారు. అలాగే చేపలు విక్రయించే మార్కెట్లను తెరవాలంటూ విజ్ఞప్తి చేశారు. (కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష ) సీఎం వైఎస్ జగన్ మాటలు విన్న అనంతరం తగు చర్యలు తీసుకుంటామని అసోం సీఎం శరబానంద సోనోవాల్ హామీ ఇచ్చారు. లాక్డౌన్ కారణంగా ఏపీలో చిక్కుకుపోయిన అసోం వాసులకు తగిన సహాయాన్ని అందించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను అసోం సీఎం కోరారు. ఏపీలోని అసోం వాసులకు అన్ని రకాలుగా తోడుగా నిలుస్తున్నామని అసోం సీఎంకు వైఎస్ జగన్ తెలిపారు. (ప్రజలంతా లాక్డౌన్ పాటిస్తుంటే ‘మాలోకం’ మాత్రం.. ) -
ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే..
అసోం: అసోంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే రాయడం, మాట్లాడడం కచ్చితంగా రావాల్సిందే. సర్బానంద సోనావాల్ ప్రభుత్వం తాజా నిబంధనలను రూపొందించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అసోం ఆర్థిక మంత్రి హిమంత బిస్వా శర్మ స్పందిస్తూ..ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే కేవలం అసోం భాషలో మాట్లాడడం సరిపోదని, రాయడం కూడా వచ్చి ఉండాలని తెలిపారు. అసోం భాషను కాపాడుకోవడంలో భాగంలోనే ఈ నిబంధనలను రూపొందించినట్లు పేర్కొన్నారు. తన కుమారుడు వేరే రాష్ట్రంలో చదువుతున్నాడని.. అతడు అసోం భాషలో మాట్లాడగలడని, కానీ రాయడం రాకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత పొందలేడని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెడుతున్నామని అన్నారు. పదవ తరగతి వరకు అసోం భాషను బోధించాలనే నిబంధనను పాఠశాలల్లో ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. రాజ్యాంగాన్ని సవరించి అసోంని రాష్ట్ర భాషగా ఎప్పటికి కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని అన్నారు. -
అసోంలో పలు చోట్ల బాంబు పేలుళ్లు!
గువాహటి : దేశవ్యాప్తంగా 71వ గణతంత్ర వేడుకలు జరుగుతున్న వేళ అసోం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆదివారం రోజున దాదాపు గంట వ్యవధిలో అసోంలో పలు చోట్ల బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. దిబ్రుగర్లో రెండు ఎల్ఈడీ బ్లాస్ట్‌లు జరగగా.. సోనారి, దులియాజన్, దూమ్‌దూమా ప్రాంతాల్లో గ్రానేడ్ పేలుళ్లు జరిగాయని అధికారులు తెలిపారు. అయితే ఈ పేలుళ్లలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని వెల్లడించారు. ఈ ఘటనలపై పోలీసులు విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు. అసోంలోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న బాంబు పేలుళ్లను ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ ఖండించారు. ‘రిపబ్లిక్ డే రోజున బీభత్సం సృష్టించేందుకు ఉగ్రమూకలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఘటనకు కారకులపై మా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుద’ని ఆయన ట్వీటర్లో పేర్కొన్నారు. నిషేధిత యూనైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం ఈ పేలుళ్లుకు పాల్పడి ఉండోచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, అసోం ప్రజలు రిపబ్లిక్ డే వేడుకలకు దూరంగా.. ఈ సంస్థ పిలుపునిచ్చింది. -
మరికొద్ది గంటల్లో బర్త్‌డే వేడుకలు.. అంతలోనే
గుహవాటి : మరికొద్ది గంటల్లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాల్సిన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్న ఘటన గుహవాటిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుహావటికి చెందిన తుషార్ శివసాగర్‌లో జియాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. కాగా తన భార్య శిల్సి గోస్వామి, పిల్లలు ఇషాన్(7), ఇవాన్(4)లతో కలిసి బైస్తాపూర్‌లో ఒక డూప్లెక్స్‌లో నివసిస్తున్నారు. కాగా గురువారం ఇవాన్ గోస్వామి పుట్టిన రోజు కావడంతో అతని బర్త్‌డే పార్టీని ఘనంగా నిర్వహించాలనుకున్నారు. శిల్పి గోస్వామి, తుషార్ తల్లి ఇంటి గ్రౌండ్ ప్లోర్లో అందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమవగా, ఇవాన్,ఇషాన్‌లు ఇంటి మొదటి అంతస్తులో ఆడుకుంటున్నారు. ఇంతలో మొదటి అంతస్తు మంటల్లో చిక్కుకోవడంతో శిల్పి గోస్వామి పైకి వెళ్లి చూశారు. అప్పటికే ఇద్దరు మంటల్లో కాలిపోవడం చూసి ఆపేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆమెకు కూడా మంటలంటుకున్నాయి. కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఇళ్లు మొత్తం మంటల్లో చిక్కుకోవడంతో స్థానికులు ఫైర్ స్టేషన్‌కు సమాచారమందించారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పి వారందరిని గుహవాటి మెడికల్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి ఇవాన్, ఇషాన్‌లు చనిపోయారని వెల్లడించారు. కాగా శిల్సి గోస్వామి, తుషార్ తల్లికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని తమ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదే విషయమై గుహవాటి పోలీస్ కమిషనర్ ఎంపి గుప్తా మాట్లాడుతూ.. ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అవడంతో మొదటి అంతస్తు మంటల్లో చిక్కుకుందని తెలిపారు. కాగా తమ ప్రాథమిక విచారణలో షార్ట్ సర్క్యూట్‌తో గ్యాస్ సిలిండర్‌కు మంటలు అంటుకోవడంతో ఇళ్లు మొత్తం అంటుకుందని పేర్కొన్నారు. కాగా తుషార్‌కు ప్రమాదంపై సమాచారం ఇచ్చామని, అతను బయలుదేరినట్లు గుప్తా వెల్లడించారు. ఈ ఘటనపై అస్సాం సీఎం శరబనంద సోనోవాల్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. వెంటనే విచారణను వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించారు. -
సీఏఏ: అసోం మంత్రి కీలక వ్యాఖ్యలు
గువాహటి: పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి 2014లోనే కటాఫ్ నిర్ణయించబడిందని అసోం మంత్రి హిమాంత బిస్వా శర్మ అన్నారు. 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తప్పులను సరిదిద్దేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. సీఏఏను సమర్థిస్తూ బీజేపీ గువాహటిలో శుక్రవారం ర్యాలీ నిర్వహించింది. అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ సహా పలువురు ముఖ్యనేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా హేమంత మాట్లాడుతూ... ‘ 1972 నుంచి ఎంతో మంది వలసదారులు అక్రమంగా రాష్ట్రంలో చొరబడ్డారు. అయితే 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత కనీసం ఒక్క చీమైనా సరే రాష్ట్రంలో అడుగుపెట్టలేకపోయింది. అదే విధంగా బంగ్లాదేశ్‌లో ఒక్క హిందువు కూడా ప్రవేశించలేదని... ప్రధానమంత్రి షేక్ హసీనాకు ఆయన చెప్పారు. ఇప్పుడు సీఏఏ ద్వారా దాదాపు నాలుగు లక్షల మంది శరణార్థులు పౌరసత్వం కోసం అర్హత సాధించారు. ఇక్కడే ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. నిజానికి రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు ప్రధానులుగా ఉన్న సమయంలో పౌరసత్వ చట్టానికి సవరణలు చేసినపుడు ఎవరూ ఆందోళనలు చేయలేదు. ఇప్పుడు సీఏఏ వల్ల లాభం కలుగుతుందన్నా నిరసనలు ఎందుకు చేస్తున్నారు’ అని ప్రశ్నించారు. (పౌరసత్వ చట్టం: ఎందుకీ ఆందోళనలు?) కాగా ఈశాన్య రాష్ట్రం అసోంలో దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యావకాశాలు వలస వచ్చిన విదేశీయులకు వెళ్తున్నాయని, స్థానికులైన తమకు రావడం లేదని 1950వ దశకం నుంచే ‘సన్స్ ఆఫ్ సాయిల్’గా పిలుచుకునే 34 శాతం జనాభా కలిగిన అస్సామీ భాష మాట్లాడే అస్సామీలు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో అఖిల అసోం విద్యార్థుల సంఘం 1979 నుంచి ఆందోళనను తమ చేతుల్లోకి తీసుకొని నడిపించింది. సమ్మెలు, దిగ్బంధనాలు, సహాయ నిరాకరణ వంటి వివిధ రీతుల్లో కొనసాగిన ఆందోళనలో విధ్వంసాలు, ప్రభుత్వ పతనాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రపతి పాలనలో కూడా పౌర జీవితం స్తంభించిపోయింది. ఈ క్రమంలో ఆరేళ్ల తర్వాత 1985లో అప్పటి కేంద్రంలోని రాజీవ్ ప్రభుత్వం దిగివచ్చి అసోం ఆందోళనకారులతో ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం1951 నుంచి 1961 లోపు వచ్చిన బంగ్లాదేశీయులకు భారత పౌరసత్వం కల్పించాలి. 1971 తర్వాత వచ్చిన వారిని వెనక్కి పంపించాలి. 1961 నుంచి 1971 మధ్యన వలస వచ్చిన వారికి ఓటింగ్ హక్కు మినహా అన్ని పౌర హక్కులు ఉంటాయి. నాటి ఒప్పందంలో 90 శాతం అంశాలు కూడా ఇప్పటికి అమలు కాలేదని ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో 1985 అస్సాం ఒప్పందంలోని అంశాలను మార్గదర్శకంగా తీసుకొని పౌరులను గుర్తించాల్సిందిగా కోరుతూ బీజేపీ ప్రభుత్వం 2015లో ఓ ఉన్నతాధికార కమిటీని వేసింది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ సర్కారు తీసువచ్చిన పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది. ఈ బిల్లుపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేయడంతో చట్టరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడు పొరుగు దేశాలైన.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్లకు భారత పౌరసత్వం కల్పించే వీలు కలుగుతుంది. అయితే ఈ చట్టం ముస్లిం వర్గ ప్రయోజనాలను కాలరాస్తోందని, భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ప్రతిపక్షాలు దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. -
అసోం సీఎం సంచలన వ్యాఖ్యలు
దిస్పూర్ : పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా చేపడుతున్న ఆందోళనలు, నిరసనలతో దేశం అట్టుడుకుతోంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ చట్టంపై రగులుతున్న నిరసనలపై అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ శుక్రవారం స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించే వారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా హింసాకాండకు పాల్పడుతున్న వారిని వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. హింసాత్మక చర్యలపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ‘హింసకు పాల్పడుతున్న వారిని విడిచిపెట్టం. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశాం. అసోం అస్సామీ ప్రజలతోనే ఉంది. ఇందుకోసం అవసరమైతే ఏ చట్టాన్ని అయినా తీసుకువస్తాం. అసోం ప్రజలు చేసుకున్న 1985 ఒప్పందంలోని ఆరవ షెడ్యూల్ ప్రకారం ఒప్పందాన్ని అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా హామీయిచ్చారు’ అని సర్బానంద సోనోవాల్ పేర్కొన్నారు. భారత ముస్లింలు, రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమ హక్కులకు ఎలాంటి భంగం కలగదని ఆయన హామీ ఇచ్చారు. కాగా అసోంలో ఇంటర్నెట్ సేవలను పునరుద్దరించామని పోలీసులు తెలిపారు. పౌరులు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టు పెట్టకూడదని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పునరుద్ధరించడంలో మీ సహకారం కోసం ఎదురు చూస్తున్నామని అసోం పోలీసులు ట్వీట్ చేశారు. పౌరసత్వ సవరణ చట్టంపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో రాష్ట్రంలో డిసెంబర్ 11న ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. -
చచ్చినా సరే.. ‘పౌరసత్వం’ అనుమతించను
గువాహటి : ప్రాణాలు పోయినా సరే పౌరసత్వ సవరణ చట్టాన్ని తమ రాష్ట్రంలో అనుమతించేది లేదని అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ వ్యాఖ్యానించారు. ఈ చట్టం ద్వారా అస్సాం ప్రజలకు కలుగుతున్న బాధ కేంద్ర ప్రభుత్వానికి పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాంద్‌మరిలో అస్సాం ఆర్టిస్ట్ అసోషియేషన్ ఆదివారం తలపెట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జుబీన్.. ‘చచ్చినా సరే అస్సాంలో సీఏఏని అనుమతించను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మా బాధను అర్థం చేసుకోవాలి. కానీ, నిరసన గళం వినిపించిన అమాయక పిల్లల్ని చంపుతున్నారు’అని పేర్కొన్నాడు. (చదవండి : 5 వేల మంది ఒకవైపు.. ఒక్కడు ఒకవైపు) సీఏఏపై అస్సాం ఆర్టిస్ట్ అసోషియేషన్ సుప్రీంకు వెళ్లనుందని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ రాష్ట్రంలో బీజేపీ నామరూపాల్లేకుండా పోతుందని హెచ్చరించారు. కాగా, ఈ నిరసన కార్యక్రమంలో సినిమా రంగానికి చెందిన వేల మంది కళాకారులు పాల్గొన్నారు. శాంతి సమ్మేళనం పాటల కచేరిని నిర్వహించారు. ఆల్ ఆస్సాం విద్యార్థి యూనియన్ (ఏఏఎస్‌యూ) ఈ నిరసనకు మద్దతు పలికింది. ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ యూటర్న్ తీసుకున్నారని ఏఏఎస్‌యూ నాయకులు మండిపడ్డారు. ఏఏఎస్‌యూలో ఉన్నప్పుడు అక్రమ వలసలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. కాగా, జుబీన్ బాలీవుడ్లో కూడా పలు విజయవంతమైన పాటలు పాడారు. (చదవండి : ‘పౌరసత్వం’పై అపోహలు.. నిజాలు తెలుసుకోండి..!) -
విధిగా సదుపాయం
మహిళా కార్మికుల ఆరోగ్యం, సంక్షేమం కోసం అసోంలోని అన్ని పరిశ్రమలు, కర్మాగారాలలో ఇకనుంచి తప్పనిసరిగా శానిటరీ న్యాప్కిన్స్ని అందుబాటులో ఉంచాలని మంగళవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
‘మాకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదా?’
దిస్పూర్ : సోషల్ మీడియా వేదికగా అస్సాం ముఖ్యమంత్రిపై విమర్శలు చేసిన బీజేపీ కార్యకర్తను గువాహటి పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. మారిగన్ జిల్లాకు చెందిన నీతు బోరా అస్సాం బీజేపీ సోషల్ మీడియా టీంలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో సీఎం సర్బానంద సోనోవాల్ పనితీరును విమర్శిస్తూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చేశాడు. రాష్ట్రంలో బీజేపీ సర్కారు ముస్లిం వలసదారుల నుంచి స్థానిక ప్రజలను రక్షించడంలో విఫలమైందని ఆరోపించాడు. దీనికి ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ కారణమంటూ నీతు బోరా సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. అంతేకాక జలుక్ బరి నియోజక వర్గానికి చెందిన హిమంత బిస్వా శర్మను నూతన హోం శాఖ మంత్రిగా నియమించాలని డిమాండ్ చేస్తూ నీతు బోరా ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఇవి కాస్తా వైరల్‌గా మారడంతో పోలీసులు నీతు బోరాతో పాటు మరో ముగ్గురు వ్యక్తులను గురువారం అదుపులోకి తీసుకున్నారు. అంతేకాక బుధవారం అర్థరాత్రి బీజేపీ ఐటీ సెల్ మెంబర్‌గా పనిచేస్తున్న హేమంత బరువా అనే వ్యక్తి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. అయితే సొంత పార్టీ కార్యకర్తల్ని అరెస్ట్ చేయడం పట్ల బీజేపీపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్గత ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే బీజేపీ పెద్దలు వాక్ స్వాతంత్ర్య హక్కును ఎందుకు కాలరాస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్నవారు తమ అసంతృప్తిని వెలిబుచ్చారే తప్ప ఎవరినీ కించపరచలేదంటున్నారు. అరెస్ట్ చేసిన కార్యకర్తల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్‌ను షేర్ చేశారని ఆరోపిస్తూ.. ఢిల్లీకి చెందిన ఓ జర్నలిస్ట్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
వైరల్ : చిన్నారిని ఏడిపించిన సీఎం
గువహటి : పౌరసత్వ(సవరణ) బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు ఉదృతమయ్యాయి. ఈ నేపథ్యంలో పలు ఈశాన్య రాష్ట్రాలు ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలను నిషేదించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రులు, మంత్రులు నిర్వహిస్తోన్న కార్యక్రమాల్లో కూడా నల్ల జండాలు చూపుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు జనాలు. ఈ క్రమంలో అస్సాంలో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వివరాలు.. రెండు రోజుల క్రితం అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనొవాల్, బిస్వాంత్ జిల్లాలో ర్యాలీని నిర్వహించారు. ఓ మహిళ, మూడేళ్ల తన చిన్నారితో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చారు. అయితే భద్రతా సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. కారణం అడగ్గా.. మీ చిన్నారి నల్ల స్వెటర్ వేసుకుంది. దాన్ని విప్పేస్తేనే లోపలికి అనుమతిస్తామని తెలిపారు. అంతేకాక స్వయంగా వారే ఆ చిన్నారి స్వెటర్‌ను తొలగించారు. ఈ చర్యకు భయపడిన చిన్నారి ఏడవడం ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చిన్నారి పట్ల కఠినంగా వ్యవహరించిన భద్రతా సిబ్బంది తీరును తప్పుపడుతున్నారు నెటిజన్లు. నల్ల రంగును చూస్తేనే పోలీసులు, అధికారులు ఒణికిపోతున్నారంటూ కామెంట్ చేస్తున్నారు. విమర్శలు ఎక్కువ కావడంతో సీఎం విచారణకు ఆదేశించారు. Assam CM Sarbananda Sonowal directs State DGP Kula Saikia to probe incident where a toddler was reportedly forced to open his black sweater at a function attended by the CM at Borgang in Biswanath today amid the spectre of black flag protests. pic.twitter.com/KtwmPCF8Fw — Nandan Pratim Sharma Bordoloi 🇮🇳 (@NANDANPRATIM) January 29, 2019 -
రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఐదుగురి మృతి
గువాహటి : అసోంలో దారుణం చోటుచేసుకుంది. ఖబారీ గ్రామానికి చెందిన ఐదుగురు యువకులను గుర్తు తెలియని దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. గురువారం రాత్రి సదియా పట్టణంలో ఓ షాపు ముందు కూర్చున్న ఈ యువకులను బ్రహ్మపుత్ర నదీ తీరంలోకి తీసుకువెళ్లిన దుండగులు... ఒకరి తర్వాత ఒకరిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆ తర్వాత వారి శవాలను అక్కడే పడేశారు. అసోం వేర్పాటువాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఉగ్రవాదులే ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా భావిస్తున్నారు. కాగా అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకోవాలని డీజీపీని ఆదేశించారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ఇలాంటి ఉన్మాద చర్యలకు పాల్పడుతున్న వారిని ఉపేక్షించేది లేదని, ఈ విషయం గురించి అసోం సీఎంతో మాట్లాడానని పేర్కొన్నారు. ఎన్ఆర్సీ ప్రతిఫలమేనా? ‘ఇది చాలా భయాందోళన కలిగించే అంశం. ఈ పాశవిక హత్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్ఆర్సీ (భారత పౌరులను గుర్తించే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్) అభివృద్ధి ఫలితం ఇదేనా’ అంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ఈ ఘటనకు నిరసనగా సిలిగురి, కోల్‌కతా తదితర ప్రాంతాల్లో ర్యాలీలు చేపడతామని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. (చదవండి : అసోంలో ఏం జరుగుతోంది) Terrible news coming out of Assam. We strongly condemn the brutal attack in Tinsukia and the killing of Shyamlal Biswas, Ananta Biswas, Abhinash Biswas, Subodh Das. Is this the outcome of recent NRC development ? 1/2 — Mamata Banerjee (@MamataOfficial) November 1, 2018 -
ప్లీజ్.. సంయమనం పాటించండి
గువాహటి: ఎన్ఆర్సీ తుది జాబితా విడుదల తర్వాత అసోం నివురుగప్పిన నిప్పులా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్లో ప్రభుత్వం, పోలీసులు ఉన్నారు. నేటి ఉదయం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ) తుది ముసాయిదాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇంకో 1.9 కోట్ల మందినే అసోం పౌరులుగా గుర్తించి జాబితాలో చోటు కల్పించారు. సుమారు 40 లక్షల మందికి పౌరసత్వం దక్కకపోవటంతో ఆందోళనలు తలెత్తే అవకాశం ఉందని అప్రమత్తమయ్యారు. అల్లర్లు తలెత్తకుండా రాష్ట్రమంతటా పోలీసులతో పాటు 220 కంపెనీల సాయుధ బలగాలను మోహరించారు. బర్పెట, దరంగ్, దిమా హసొవ్, సోనిట్‌పుర్, కరీమ్గంజ్, గోలాఘాట్, ధుబ్రి జిల్లాలో అధికారులు 144 సెక్షన్‌తో పాటు నిషేధాజ్ఞల్ని విధించారు. మరోవైపు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సోషల్‌మీడియాపై డేగ కన్ను వేశారు. ప్రశాంతంగా ఉండాలి... ‘తాజా పరిస్థితుల నేపథ్యంలో అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ప్రజలకు ప్రశాంతంగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘గతంలో మొదటి డ్రాఫ్ట్ విడుదల తర్వాత ప్రశాంత వాతావరణం కనిపించింది. ఇప్పుడు అదే రీతిలో సమన్వయం పాటించాలని ప్రజలను నేను కోరుతున్నా’ అని ఆయన ఓ ప్రకటనలో ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే హింసాత్మక ఘటనలను మాత్రం ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, రాష్ట్రంలో ఎన్ఆర్సీపై భయాందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో రిపోర్టు పేరు లేనంత మాత్రన వారిని విదేశీయులుగా భావించబోమని సోనోవాల్ ఇదివరకే స్పష్టం చేశారు. మమతాగ్రహం.. మరోవైపు ఎన్ఆర్సీ తుది డ్రాఫ్ట్‌పై రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి. ప్రజలపై బీజేపీ రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటోందని, విజభన రాజకీయాలకు పాల్పడుతోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.తాజా ముసాయిదా జాబితాలో పౌరసత్వం దక్కని వలస మైనార్టీ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఎన్ఆర్సీ... అస్సాంలో స్థానికుల్ని, స్థానికేతరుల్ని గుర్తించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ) పేరిట ముసాయిదాను విడుదల చేసింది. గతేడాది డిసెంబర్ 31న విడుదల చేసిన తొలి ముసాయిదాలో.. మొత్తం 3.29 కోట్ల మందిలో కేవలం 1.9 కోట్ల మందినే అస్సాం పౌరులుగా గుర్తించి జాబితాలో చేర్చింది. ఇక ఇప్పుడు తుది జాబితా పేరిట సోమవారం ఉదయం మరో డ్రాఫ్ట్‌ను రిలీజ్ చేసింది. తాజాగా ప్రకటించిన జాబితాతో మొత్తం 2,89,83,677 మందికి పౌరసత్వం లభించింది. అంటే మిగతా 40 లక్షల మంది భవితవ్యంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పైగా 1971, మార్చి 25కు ముందు రాష్ట్రంలో నివాసం ఉన్నవారినే స్థానికులుగా గుర్తిస్తున్నట్లు అందులో ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం గుర్తించిన జాబితా అని, తుది జాబితా మాత్రం కాదని ఎన్ఆర్సీ అస్సాం సమన్వయకర్త ప్రతీక్ హజేలా తెలిపారు.అక్రమ వలసల్ని నిరోధించేందుకు ఈ ముసాయిదాను ప్రకటించామని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చునని వెల్లడించారు. పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి మైనార్టీల అక్రమ వలసలు కొనసాగడం వల్లే పౌరసత్వ జాబితాను రూపొందించాల్సి వచ్చిందని నార్త్ ఈస్ట్ జాయింట్ సెక్రటరీ సత్యేంద్ర గార్గ్ తెలిపారు. -
మృతదేహాన్ని చాపలో చుట్టి.. సైకిల్‌కు కట్టుకుని..
-
మృతదేహాన్ని చాపలో చుట్టి.. సైకిల్‌కు కట్టుకుని..
గువాహటి: తన భార్య మృతదేహాన్ని ఒడిశా గిరిజనుడు భుజాలపై మోసుకుంటూ కిలోమీటర్లు నడిచిన ఘటనను మరవకముందే అసోంలో ఇటువంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. ఒక గిరిజనుడు తన తమ్ముడి మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి సైకిల్‌పై తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ హృదయ విదారక దృశ్యం స్థానిక చానళ్లలో ప్రసారం కావడంతో ఆ రాష్ట్ర సీఎం సర్బానంద సోనోవాల్ బుధవారం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న మజూలి నియోజకవర్గంలోనే ఈ ఘటన జరగడంతో ఆయన ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. బలిజయన్ గ్రామానికి చెందిన డింపుల్దాస్ (18) శ్వాసకోశవ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతదేహం తరలింపునకు ఆస్పత్రి అధికారులు ఏర్పాట్లు చేస్తుండగానే, దాస్ సోదరుడు మృతదేహాన్ని చాపలో చుట్టి సైకిల్‌కు కట్టుకుని ఇంటికి బయల్దేరాడని అధికారులు చెబుతున్నారు. మరోవైపు బాధితుడి గ్రామానికి వాహనాలు వెళ్లేందుకు రోడ్డు మార్గమే లేదు. ఓ కాలువపై వెదురు బొంగులతో నిర్మించిన బ్రిడ్జిని దాటి ఆ గ్రామానికి చేరుకోవాలి. ఆర్థిక స్థోమత లేకపోవడంతో తమ్ముడి మృతదేహాన్ని చాపలో చుట్టుకుని ఇంటికి తీసుకెళ్లడంతో అధికారులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ ఘటనపై విచారణకు సీఎం ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు సూచించారు. -
ఆయన పాల్గొంటే చైనాకు ఎందుకు నొప్పి?
భారత్‌లోని అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ తాజాగా ఈశాన్య సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌ను సందర్శించి.. తవాంగ్ ఉత్సవంలో పాల్గొనడం.. చైనాను ఇరకాటంలో పడేసింది. మూడురోజుల పర్యటన కోసం శుక్రవారం ఇక్కడికి వచ్చిన రిచర్డ్ వర్మ అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ, అసోం ముఖ్యమంత్రి సర్వానంద్ సబర్వాల్‌తో కలిసి తవాంగ్ ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇద్దరు సీఎంలతో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్లో పోస్టు చేసి.. అరుణాచల్‌ప్రదేశ్ ప్రజల ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ‘అద్భుతమైన కొండలు.. అద్భుతమైన ప్రజలు.. తవాంగ్ ఫెస్టివల్ కోసం అరుణాచల్ ప్రదేశ్ రావడం చాలా గొప్పగా ఉంది’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. సీఎం పెమాఖండూ సొంతూరు అయిన తవాంగ్ సముద్ర మట్టానికి మూడువేల మీటర్ల ఎత్తులో తూర్పు హిమాలయాల్లో చైనా సరిహద్దులకు చేరువలో ఉంటుంది. ఇక్కడ తూర్పు సరిహద్దు విషయంలో భారత్-చైనా మధ్య అనేక వివాదాలు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ టిబేట్లో భాగమని మొండిగా వాదిస్తూ సరిహద్దు వివాదాలకు ఆజ్యం పోస్తున్న చైనా.. గతంలో ఈ రాష్ట్రం భారత్‌లో అంతర్భాగమేనన్న అమెరికా కాన్సుల్ జనరల్ ప్రకటనపై మండిపడింది. తమ మధ్య ఉన్న వివాదాలను ఇరుదేశాలు చర్చలు, సంప్రదింపులు ద్వారా పరిష్కరించుకోగలవని, ఇందులో మూడో వ్యక్తి జోక్యం చేసుకోవడం బాధ్యతరాహిత్యమేనంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో తవాంగ్ పట్టణాన్ని అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ సందర్శించి ఆ ఫొటోలు ట్విట్టర్లో పెట్టారు. అంతేకాకుండా చైనా సరిహద్దుల్లో ఉన్న ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులైన సరబానంద్ సోనోవాల్, పెమాఖండూ కూడా తమ ట్విట్టర్ పేజీల్లో రిచర్డ్ వర్మతో దిగిన ఫొటోలు పెట్టి.. తవాంగ్ ఉత్సవం ప్రత్యేకతను వివరించారు. తవాంగ్ భారత్‌లో అంతర్భాగమన్న గట్టి సందేశాన్ని చైనాకు ఈ ట్వీట్ల ద్వారా వారు చెప్పినట్టు అయింది. తమ భూభాగంలో తాము ఉత్సవం చేసుకుంటే చైనా నొప్పేంటి అన్నరీతిలో ఈ ట్వీట్లు ఉండటం గమనార్హం. అయితే, దీనిపై చైనా అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా టిబేట్ బౌద్ధుల మతగురువు దలైలామాను అరుణాచల్ ప్రదేశ్‌కు ఆహ్వానించాలన్న సీఎం పెమాఖండూ నిర్ణయంపైనా చైనా నిప్పులు కక్కే అవకాశముందని భావిస్తున్నారు. -
పరిశుభ్రతకు మారు పేరుగా 'కామాఖ్య'
గౌహతిః పరిశుభ్రతను పాటించడంలో మొదటి స్థానంలో కామాఖ్య నిలుస్తుందని అస్పాం ముఖ్యమంత్రి సర్వానంద సోనోవాల్ తెలిపారు. స్వచ్ఛత అభియాన్ పథకం అమలులో భాగంగా ఎన్నుకున్న పది గుర్తింపు పొందిన ప్రాంతాల్లో ఒకటైన కామాఖ్యలో.. అన్నింటికన్నా ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించడంపై ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలతో కలిసి ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛత అభియాన్ పథకంతో గాంధీ మహాత్ముని 'క్లీన్ ఇండియా' కల నెరవేరుతుందని అస్పాం సీఎం సోనోవాల్ ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన విధానాలను పాటించడంలో దేశంలోనే అస్పాం ముందుందన్న సోనోవాల్.. నీలాచల్ హిల్స్ లోని కామాఖ్య ఆలయం వద్ద స్వచ్ఛత అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ అభియాన్ పథకం కింద పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన స్వచ్ఛత అభియాన్ ను ముందుగా దేశంలోని పది గుర్తింపు పొందిన, ధార్మిక, ఆధ్యాత్మిక కేంద్రాల్లో ప్రారంభిస్తున్నట్లు సోనోవాల్ తెలిపారు. మొదటిగా ఎంపిక చేసిన పది ప్రాంతాల్లో అస్సాం లోని కామాఖ్య ఆలయం, జమ్ము కశ్మీర్ లోని వైష్ణోదేవి ఆలయం, ఉత్తర ప్రదేశ్ లోని తాజ్ మహల్, ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి, పంజాబ్ లోని గోల్డెన్ టెంపుల్, రాజస్థాన్ లోని అజ్మీర్ షరీఫ్, ఒరిస్సాలోని జగన్నాథ ఆలయం, మహరాష్ట్రలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఉత్తర ప్రదేశ్ లోని మణికర్ణిక ఘాట్, తమిళనాడులోని మీనాక్ఖీ ఆలయం ఉన్నట్లు సీఎం వెల్లడించారు. స్వచ్ఛత అభియాన్ పథకం అమలు చేయనున్న దేశంలోని మొత్తం 100 ప్రాంతాల్లో ముందుగా పది కేంద్రాల్లో అమలు చేస్తున్నారని, అనంతరం మిగిలిన 90 ప్రాంతాల్లో కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్ ను విజయవంతంగా కొనసాగించేందుకు ప్రతి ఒక్కరికీ ఆ కామాఖ్య దేవి దీవెనలు అందిస్తుందని, అలాగే ప్రధాని పరిశుభ్ర భారతదేశం కలను నెరవేర్చేందుకు అస్సాం ప్రత్యేకంగా కృషి చేస్తుందని సోనోవాల్ తెలిపారు. -
ఒకే ఊళ్లో 14 మంది ముఖ్యమంత్రులు!
ఒకళ్లు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 14 మంది ముఖ్యమంత్రులు ఒకే రోజు ఒకే ఊళ్లో ఉన్నారు. ఎందుకో తెలుసా? అసోం కొత్త ముఖ్యమంత్రిగా సర్వానంద సోనోవాల్ ప్రమాణస్వీకారం చూడటానికి. అవును.. ఈశాన్య రాష్ట్రాలలో తొలిసారిగా బీజేపీ అధికారంలోకి రావడంతో ఆ సంబరాన్ని కళ్లారా చూసేందుకు ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ, జాతీయాధ్యక్షుడు అమిత్ షాలతో పాటు బీజేపీ, దాని మిత్రపక్షాల పాలనలో ఉన్న 14 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా గువాహటి వెళ్లారు. టీచర్‌గా పనిచేసిన ఒక గిరిజనుడు ఇప్పుడు ప్రజలకు సేవ చేసేందుకు ముఖ్యమంత్రిగా మీ ముందుకు వచ్చాడంటూ సోనోవాల్ గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ఆయన తన ప్రసంగం ప్రారంభం, ముగింపు రెండూ అసామీ భాషలోనే చేశారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇద్దరూ తమ ప్రసంగం చివర్లో భారత్ మాతాకీ జై అన్నారు. సోనోవాల్, హిమాంత బిశ్వ శర్మ ఇద్దరూ అస్సామీ భాషలోనే ప్రమాణస్వీకారం చేశారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన హిమాంతకు అత్యంత కీలకమైన ఆర్థిక శాఖ ఇవ్వొచ్చని తెలుస్తోంది. -
మోదీ భుజం తట్టారు.. సీఎం హత్తుకున్నారు
గువాహటి: ఎట్టకేలకు ఈశాన్య రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగిరింది. అసోం ముఖ్యమంత్రిగా సర్వానంద సోనోవాల్ మంగళవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. గువాహటిలోని ఖానపరా వెటర్నరీ కాలేజీలో ఈ కార్యక్రమం జరిగింది. అసోం గణపరిషత్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) సహకారంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ మొత్తం 126 సీట్లలో 86 సీట్లను గెలుచుకుని విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దాదాపు 15 ఏళ్ల కాంగ్రెస్ పాలన తర్వాత తొలిసారి ఇక్కడ బీజేపీ పరిపాలన బాధ్యతలు చేపట్టింది. ఈ ప్రమాణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, ఇతర ముఖ్య కేంద్రమంత్రులు హాజరయ్యారు. ఈ సందర్బంగా 11మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్ నుంచి 2015లో బీజేపీలో చేరి పార్టీ విజయానికి కీలకంగా పనిచేసిన హిమంత్ బిస్వా శర్మ కూడా మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా బిస్వాల్‌కు ప్రధాని మోదీ కరచాలనం ఇచ్చి భుజం తట్టగా.. ముఖ్యమంత్రి సోనోవాల్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. కాంగ్రెస్ నేత మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. -
ఈ ముగ్గురూ పెళ్లికాని ముఖ్యమంత్రులు
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కొన్ని పార్టీలకు సంతోషం, మరికొన్ని పార్టీలకు బాధను మిగిల్చాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డులు సృష్టించినవారు, చరిత్ర తిరగరాసినవారు ఉన్నారు. ఈ ఎన్నికల ఫలితాల్లో మరో విశేషం కూడా ఉంది. కొత్తగా ప్రమాణం చేయనున్న ఐదుగురు ముఖ్యమంత్రుల్లో ముగ్గురు అవివాహితులే..! తమిళనాడు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రులు జయలలిత, మమతా బెనర్జీలు అవివాహితులన్న విషయం తెలిసిందే. అసోంకు కాబోయే కొత్త ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ కూడా పెళ్లి చేసుకోలేదు. విద్యార్థి దశ రాజకీయాల నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన 52 ఏళ్ల సోనోవాల్ బ్రహ్మచారిగా ఉంటూ తన జీవితాన్ని పూర్తిగా ప్రజలకు అంకింతం చేశారు. అసోం ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. అసోంలో బీజేపీ తొలిసారి మెజార్టీ సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇక పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా వైదొలగబోతున్న ఎన్సీఆర్ కాంగ్రెస్ చీఫ్ రంగసామి (66) కూడా అవివాహితుడే. పుదుచ్చేరిలో అధికారం చేపట్టనున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. కేరళకు కాబోయే కొత్త ముఖ్యమంత్రి విజయన్ మాత్రం వివాహితుడే. -
సీఎం అభ్యర్థులు ఎంజాయ్ చేస్తున్నారు!
ప్రస్తుతం ఎన్నికలు జరిగిన తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో కానీ, అసోంలో మాత్రం రాజకీయ ప్రత్యర్థుల గుండె మీద చెయి వేసుకుని హాయిగా నిద్రపోతున్నారు. సాధారణంగా ఎన్నికలు అనగానే.. ఓటర్లను ఎలా ఆకర్షించాలి, ఏ పథకాలు, ఫండ్స్ అంటూ వాగ్దానాలు చేయాలి అని రాజకీయ నేతలు తలలు పట్టుకు కుర్చుంటారు. పోనీ ఎన్నికలు అయిపోయాక కుదురుగా కూర్చుంటారా అది లేదు. తమ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అని ఆందోళన చెందుతుంటారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చినా అందులో విజయం తమదేనని తెలిస్తే సరిగ్గానే సర్వే జరిగిందని, లేనిపక్షంలో అవన్నీ బోగస్ సర్వేలంటూ డంభికాలు పోవడం మనకు తెలిసిన విషయమే. బీజేపీ నుంచి సీఎం రేసులో ఉన్న కేంద్ర క్రీడాశాఖ మత్రి సర్భానంద సోనోవాల్ హాయిగా సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. రియో ఒలింపిక్స్ నేపథ్యంలో పాటియాలా లోని నేషనల్ స్పోర్ట్ అకాడమిని ఆకస్మికంగా సందర్శించారు. ఎన్నికల ఫలితాలపై మీడియా ఆయనను ప్రశ్నించగా... తాను సంజయ్ లీలా భన్సాలీ తీసిన బాజీరావ్ మస్తానీ మూవీ చూసి ఎంజాయ్ చేశానని చెప్పడంతో అందరూ షాక్ తిన్నారు. టెన్షన్ పైకి కనపడకుండా ఉండటమే బీజేపీ వ్యూహమని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మూడుసార్లు కాంగ్రెస్ కు అధికారపీఠం సాధించిన తరుణ్ గొగోయ్ కూడా ఎన్నికల ఫలితాలపై ఉండే ఒత్తిడికి దూరంగా ఉంటున్నారు. కుటుంబంతో కలిసి థాయ్ లాండ్ కు వెళ్లి సరదాగా గడుపుతూ, గోల్ఫ్ ప్రాక్టీస్ చేస్తున్నారట. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కొట్టిపారేశారు. సీఎంగా వరుసగా నాలుగోసారి సీఎం కుర్చిలో కూర్చునేది తానేని గగోయ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఎన్నికలలో ఓడినా.. ప్రధాని మోదీ చెప్పినట్లుగా రాజకీయ సన్యాసం చేయాల్సిన గత్యంతరం తనకు లేదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గెలిచినా, ఓడినా రాజకీయంగా తాను చాలా యాక్టివ్ గా ఉన్నానని చెప్పారు. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు గురువారం జరుగుతుందన్న విషయం విదితమే. -
రెజ్లింగ్ ట్రయిల్స్ నిర్వహించండి: సుశీల్ కుమార్
న్యూఢిల్లీ : రెజ్లర్ సుశీల్ కుమార్ శుక్రవారం కేంద్ర కీడ్రాశాఖ మంత్రి శర్బానంద్ సోనోవాల్‌కు లేఖ రాశాడు. రెజ్లింగ్ ట్రయిల్స్ నిర్వహించాలంటూ అతడు తన లేఖలో పేర్కొన్నాడు. కాగా రియో ఒలింపిక్స్‌కు క్రీడాకారుల అక్రిడిటేషన్ కోసం భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)కు వచ్చిన రెజ్లర్ల జాబితాలో సుశీల్ కుమార్ పేరు లేకపోవడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. 74 కేజీల విభాగంలో రియోకు ఎవరు వెళ్లాలనే విషయంపై సుశీల్, నర్సింగ్ల మధ్య వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఐఓఏకు వచ్చిన జాబితాలో సుశీల్ పేరు లేదు. అయితే ఈ జాబితాను తాము పంపలేదని, సుశీల్‌కు అవకాశం ఉందని భారత రెజ్లింగ్ సమాఖ్య పంపింది. ‘ఒలింపిక్స్‌కు అర్హత పొందిన రెజ్లర్ల పేర్లను ప్రపంచ రెజ్లింగ్ సంఘం ఐఓఏకు పంపుతుంది. కాగా రియో ఒలింపిక్స్ కు రెజ్లర్ సుశీల్ కుమార్ కు మొండిచేయి చూపారని వచ్చిన వార్తలను భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) తోసిపుచ్చింది. మరోవైపు ఈ వివాదంలో తాము జోక్యం చేసుకోమని క్రీడా శాఖ స్పష్టం చేసిన నేపథ్యంలో సుశీల్ కుమార్ రాసిన లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఈ లేఖపై మంత్రిత్వ శాఖ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. -
చాంపియన్ షూటర్ ఫతేసింగ్ కు కేంద్ర మంత్రి నివాళి
న్యూఢిల్లీ: ఉగ్రవాదుల దాడిలో అమరుడైన అంతర్జాతీయ ఛాంపియన్ షూటర్, సుబేదార్ మేజర్ ఫతేసింగ్(51) మృతిపట్ల కేంద్ర క్రీడాశాఖమంత్రి సర్బానంద సోనోవాల్ నివాళులర్పించారు. మేజర్ ఫతేసింగ్ మృతిపట్ల ట్విట్టర్లో విచారం వ్యక్తం చేశారు. ఫతేసింగ్ 1995నాటి తొలి కామన్వెల్త్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో రెండు బంగారు, ఒక రజత పతకం గెలిచారు. డోగ్రా రెజిమెంట్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్న ఫతేసింగ్ డిఫెన్స్ సెక్యూరిటీ కోర్లో విధులు నిర్వహిస్తున్నారు. మేజర్ చేసిన సేవల్ని పేర్కొంటూ ఆయనకు సెల్యూట్ అని ట్విట్టర్ పోస్టులో రాసుకొచ్చారు. పాక్ ముష్కరులు పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై శనివారం దాడులు జరుపుతుండగా, ఉగ్రవాదులను తుదముట్టించే ఆపరేషన్‌లో ఆయన కన్నుమూసిన విషయం అందరికీ తెలిసిందే. దేశం ఒక గొప్ప రైఫిల్ షూటర్, కోచ్‌ను కోల్పోయిందంటూ కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. 2009లో డోగ్రా రెజిమెంట్ లో సుబేదార్ మేజర్ పదవి నుంచి 2009లో రిటైర్ అయ్యారు. అనంతరం డిఫెన్స్ సర్వీస్‌లో చేరి విధులు నిర్వర్తిస్తున్నారు. -
పాక్‌తో సిరీస్‌కు క్రీడాశాఖ మద్దతు
భారత్, పాకిస్తాన్ల మధ్య శ్రీలంకలో సిరీస్‌కు తాము మద్దతిస్తున్నట్లు క్రీడాశాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ ప్రకటించారు. ‘బీసీసీఐ ఎలాంటి చర్య తీసుకున్నా దానికి మా మద్దతు ఉంటుంది. బీసీసీఐ ఆట అభివృద్ధి కోసం, సంబంధాల మెరుగుదల కోసం కృషి చేస్తుందనే నమ్మకం నాకు ఉంది’ అని సోనోవాల్ ప్రకటించారు. శ్రీలంకలో పాక్‌తో సిరీస్ ఆడేందుకు బీసీసీఐ విదేశాంగ శాఖకు దరఖాస్తు ఇచ్చినా దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ స్పందన రాలేదు. -
డయాస్ కూలి బీజేపీ నేతలు కిందపడ్డారు
దిబ్రూగఢ్: అసోంలో బీజేపీ నిర్వహిస్తున్న ఓ సభలో అపశృతి చోటుచేసుకుంది. బీజేపీకి చెందిన యువమోర్చా ఓ కార్యక్రమం నిర్వహిస్తుండగా దానికి సంబంధించిన డయాస్ కూలిపోయి కేంద్ర క్రీడాశాఖమంత్రితో సహా 15 మంది గాయాలపాలయ్యారు. వారిలో కొందరికి మోస్తరు గాయాలుకాగా మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. అసోంలోని బీజేపీ అనుభంద శాఖ అయిన బీజేపీ యువ మోర్చా (బీజేవైఎం) కార్యకర్తలు సోమవారం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసింది. 25 మంది అతిథులు ఆశీన్నులయ్యేలా డయాస్‌ను ఏర్పాటు చేసింది. దీనికి కేంద్ర క్రీడాశాఖ మంత్రి సర్బానంద సోనోవాల్, బీజేపీ సీనియర్ నేత ఉజ్వల్ కశ్యప్, ఎంపీలు కామాఖ్య ప్రసాద్, రామేశ్వర్ తేలి హాజరయ్యారు. అయితే, ఒక్కసారిగా డయాస్ మీదకు పరిమితికి మించి రెట్టింపుగా దాదాపు 150 మంది ఎక్కారు. వీరంతా కార్యక్రమానికి వచ్చిన కేంద్ర క్రీడాశాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌కు అభినందనలు తెలిపేందుకు ఎగబడ్డారు. దాంతో అది ఒక్కసారిగా కుప్పకూలి స్వల్ప గాయాలపాలయ్యారు. వెంటనే అక్కడికి వైద్యులు చేరుకొని ప్రథమ చికిత్సలు అందించారు. -
అవకాశం ఉంటే సిఫారసు చేస్తాం
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్... ప్రతిష్టాత్మక ‘పద్మభూషణ్’ అవార్డు కోసం చేసుకున్న దరఖాస్తు తమకు శనివారమే అందిందని కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ స్పష్టం చేశారు. ఈ పురస్కారం కోసం సైనా పేరును పంపే అవకాశాలు ఏమైనా ఉన్నాయో లేదో సోమవారం పరిశీలిస్తానన్నా రు. ‘సైనా చేసిన ఆరోపణలను మీడియాలో చూశా. ఈనెల 3కు ముందు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నుంచి మా శాఖకు ఎలాంటి దరఖాస్తు అం దలేదు. 2014 ఆగస్టు 9వ తేదీతో ఉన్న ‘బాయ్’ లేఖ ఈనెల 3న మాకు అందింది. అందులో సైనా పేరును అవార్డుకు ప్రతిపాదించినట్లు ఉంది. దీన్ని అధికారులు మా ఇంటి దగ్గర నాకు చూపించారు. ఈ అంశాలన్నింటినీ పక్కనబెడితే సైనా పేరును హోంశాఖకు పంపేం దుకు ఏమైనా అవకాశాలు ఉన్నాయో లేదో వివరంగా పరిశీలిస్తాం’ అని సోనోవాల్ వివరించారు. రెండోసారి పద్మ అవార్డును స్వీకరించేందుకు ఐదు సంవత్సరాల విరామం ఉండాలన్న నిబంధనను కూడా తాను పరి శీలిస్తానని సోనోవాల్ హామీ ఇచ్చారు. మరోవైపు సైనా దరఖాస్తును ఆగస్టులోనే పంపామని ‘బాయ్’ అధ్యక్షుడు అఖిలేశ్ దాస్‌గుప్తా పునరుద్ఘాటించారు. మం త్రిత్వశాఖ నుంచి రసీదు కూడా తమకు వచ్చిందని... ఇందులో గందరగోళానికి తావు లేదని చెప్పారు. -
75 వేల మంది చిన్నారులను గుర్తిస్తాం
క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ న్యూఢిల్లీ: దేశంలోని చిన్నారుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు కేంద్ర క్రీడా శాఖ ప్రయత్నాలు ప్రారంభించనుంది. దీంట్లో భాగంగా ‘జాతీయ క్రీడా ప్రతిభాన్వేషణ పథకం’ను ప్రవేశపెట్టనుంది. ఈ పథకం ద్వారా 75 వేల మంది చిన్నారులను గుర్తిస్తామని క్రీడా మంత్రి శర్బానంద సోనోవాల్ అన్నారు. ‘వ్యక్తిగత క్రీడా విభాగాల్లో భారత్‌కు మంచి పేరే ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని త్వరలోనే జాతీయ క్రీడా ప్రతిభాన్వేషణ పథకాన్ని ప్రవేశపెట్టనున్నాం. 8 నుంచి 12 ఏళ్లలోపు నైపుణ్యం కలిగిన 75 వేల మంది బాలబాలికలను మేం గుర్తించనున్నాం. అలాగే వచ్చే ఐదు, ఏడేళ్లలో ప్రతీ జిల్లా కూడా స్పోర్ట్స్ స్కూల్ కలిగి ఉంటుంది. స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ మెడిసిన్‌పై దృష్టి పెట్టేందుకు ప్రతీ జోన్లో విశ్వవిద్యాలయంను ఏర్పాటు చేస్తాం’ అని మూడు రోజుల పాటు జరిగే భారత అంతర్జాతీయ స్పోర్టింగ్ గూడ్స్ కార్యక్రమంలో పాల్గొన్న సోనోవాల్ తెలిపారు. -
బాక్సర్ సరితాదేవికి సచిన్ మద్దతు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) నుంచి నిషేధానికి గురైన భారత మహిళా బాక్సర్ ఎల్.సరితా దేవికి రాజ్యసభ సభ్యుడు, భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మద్దతు పలికారు. ఇంచియాన్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో సరిత తన పతకాన్ని తీసుకోవడానికి నిరాకరించడంతో ఏఐబీఏ ఆమెపై తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై సచిన్ ఈరోజు కేంద్ర క్రీడా మంత్రి సర్బానందా సోనోవాల్‌ను కలిశారు. సరితాదేవి భవిష్యత్‌ను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘంతో చర్చించి సరితపై చర్యలు లేకుండా చేయాలని సచిన్ విజ్ఞప్తి చేశారు. సచిన్ బాటలోనే సరితకు అండగా నిలుస్తానని బాక్సర్ విజేందర్‌తోపాటు పలువురు క్రీడాకారులు ప్రకటించారు. భారత ప్రభుత్వం తరపున ఈ విషయం తాము ఏఐబీఏతో చర్చిస్తామని మంత్రి సర్బానందా సోనోవాల్ హామీ ఇచ్చారు. భారత ప్రజలు సరితాదేవికి అండగా ఉన్నట్లు ఆయన తెలిపారు. సరితాదేవిపై నిషేధం ఎత్తివేసేందుకు తాను కృషి చేస్తానని మంత్రి చెప్పారు. ** -
రేపు క్రీడామంత్రితో రేపు సచిన్ భేటీ!
న్యూఢిల్లీ: ఏఐబీఏ నుంచి తాత్కాలిక నిషేధానికి గురైన భారత మహిళా బాక్సర్ సరితా దేవి అంశంపై రాజ్యసభ ఎంపీ, భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ క్రీడా మంత్రి సర్బానందా సోనోవాల్ తో బుధవారం సమావేశం కానున్నారు. ఇంచియాన్ లో జరిగిన ఏషియన్ గేమ్స్ లో సరితా తన పతకాన్ని తీసుకోవడానికి నిరాకరించడంతో అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం(ఏఐబీఏ) ఆమెపై తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సరితకు న్యాయం జరిగేలా చూడాలని కేంద్ర క్రీడల మంత్రికి లేఖ రాశాడు. ఓ క్రీడాకారుడిగా సరిత భావోద్వేగ సంఘటనను అర్థం చేసుకోగలనని చెప్పాడు. ఆ సంఘటనలో బాక్సర్ తన ఆందోళనను అణుచుకోలేకపోయిందని, దురదృష్టవశాత్తు అది బహిర్గతమైందన్నాడు. ఈ క్రమంలోనే రేపు క్రీడా మంత్రితో సచిన్ సమావేశం కానున్నారు. -
క్రీడాశాఖకు వన్నె తెస్తా
కేంద్ర క్రీడల మంత్రి సోనోవాల్ వ్యాఖ్య న్యూఢిల్లీ: క్రీడాశాఖను ప్రాధాన్యత కలిగిన శాఖగా మార్చడమే తన లక్ష్యమని కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ అన్నారు. తన విధుల్ని సక్రమంగా నిర్వర్తించేందుకు నిపుణులు, క్రీడాకారుల నుంచి సలహాలు తీసుకుంటానని చెప్పారు. అస్సాం లఖీంపూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికై, ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సోనోవాల్ మంగళవారం ఢిల్లీలోని శాస్త్రి భవన్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన ఆచితూచి స్పందించారు. ‘మంత్రిగా ఇదే నాకు మొదటి రోజు.. క్రీడాశాఖకు వన్నె తెచ్చేందుకు మీతోపాటు ప్రతీ ఒక్కరి సహకారం కావాలి. భారత్ నుంచి మరింత మంది క్రీడాకారులు వెలుగులోకి రావాలని కోరుకుంటున్నా’ అని సోనోవాల్ అన్నారు.