
పాక్‌తో సిరీస్‌కు క్రీడాశాఖ మద్దతు
భారత్, పాకిస్తాన్‌ల మధ్య శ్రీలంకలో సిరీస్‌కు తాము మద్దతిస్తున్నట్లు క్రీడాశాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ ప్రకటించారు. ‘బీసీసీఐ ఎలాంటి చర్య తీసుకున్నా దానికి మా మద్దతు ఉంటుంది. బీసీసీఐ ఆట అభివృద్ధి కోసం, సంబంధాల మెరుగుదల కోసం కృషి చేస్తుందనే నమ్మకం నాకు ఉంది’ అని సోనోవాల్ ప్రకటించారు. శ్రీలంకలో పాక్‌తో సిరీస్ ఆడేందుకు బీసీసీఐ విదేశాంగ శాఖకు దరఖాస్తు ఇచ్చినా దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ స్పందన రాలేదు.