![Union Minister Sonowal Inaugurate Vizag Cruise Terminal - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/4/vizag.jpg.webp?itok=nmpMoOv3)
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పోర్టులో నూతనంగా నిర్మించిన క్రూయిస్ టెర్మినల్‌ను పోర్ట్‌లు షిప్పింగ్‌శాఖ కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డాక్టర్ సత్యవతి, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, విశాఖ మేయర్ హరివెంకట కుమారి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. విశాఖలో చరిత్రలో క్రూయిజ్ టెర్మినల్ ఒక మైలురాయి అని పేర్కొన్నారు. టూరిజం అభివృద్ధి చెందడానికి క్రూయిజ్ ఎంతోగానో దోహదం పడుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో పోర్టులు కీలక భూమిక పోషిస్తున్నాయన్నారు.
త్వరలో విశాఖకు జాతీయ,అంతర్జాతీయ క్రూయిజ్‌లు రాబోతున్నాయని రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నర్సింహరావు అన్నారు. విశాఖ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ పాత్ర విశేషమైనదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ మరింత అభివృద్ధి చెందబోతుందని.. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
చదవండి: రాధాకృష్ణను కమ్మేసిన చంద్ర మాయ
Comments
Please login to add a commentAdd a comment