cruise
-
వారణాసిలో తొలి హైడ్రోజన్ క్రూయిజ్
ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో దేశంలోనే తొలి హైడ్రోజన్ క్రూయిజ్‌ను నడపనున్నారు. ఈ క్రూయిజ్ ఆదివారం అర్థరాత్రి వారణాసికి చేరుకుంది. మొదట ఈ హైడ్రోజన్ క్రూయిజ్‌ను నమో ఘాట్‌కు తీసుకువచ్చి, తరువాత రామ్‌నగర్‌లోని మల్టీమోడల్ టెర్మినల్‌కు తరలించారు. ఈ క్రూయిజ్ కొచ్చిలోని షిప్‌యార్డ్‌లో అనేక సౌకర్యాలతో నిర్మితమయ్యింది.ఈ క్రూయిజ్‌లో 50 మంది ప్రయాణికులు కూర్చునేందుకు అవకాశం ఉంది. కాలుష్యాన్ని ఉత్పత్తి చేయకుండా గంగానదిలో నడిచే తొలి క్రూయిజ్ ఇది. ఈ క్రూయిజ్ వారణాసి- చునార్ మధ్య నడుస్తుంది. దీనిని పర్యాటక శాఖ పర్యవేక్షించనుంది.ఈ క్రూయిజ్ నిర్వహణ కోసం వారణాసిలోని రామ్‌నగర్ మల్టీ మోడల్ టెర్మినల్‌లో తాత్కాలిక హైడ్రోజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. హైడ్రోజన్ శక్తితో నడిచే ఈ క్రూయిజ్‌లో ఎలక్ట్రిక్ ఇంజన్ కూడా అమర్చారు. తద్వారా హైడ్రోజన్ ఇంధనం తగ్గినప్పుడు, క్రూయిజ్‌ను ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో నడపవచ్చు. వారణాసి తర్వాత అయోధ్య, మథురలలో కూడా ఈ క్రూయిజ్‌ను నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది. -
భర్తతో హీరోయిన్ ఆలియా భట్ క్యూట్ (ఫొటోలు)
-
అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్: నీతా అంబానీ వాచ్ ధర అన్ని కోట్లా..!
అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ మొదటి ప్రీ వెడ్డింగ్ వేడుకలు గత మార్చి నెలలో గుజరాత్‌లోని జామ్ నగర్లో సినీతారలు, ప్రముఖులు, సెలబ్రిటీల సమక్షంలో అత్యంత అట్టహాసంగా జరిగాయి. ఆ తర్వాత ఇటీవల ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు దాదాపు 4500 కిలోమీటర్లు క్రూయిజ్‌లో రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు అత్యంత లగ్జరియస్‌గా ముగిశాయి. ఆ వేడుకల్లో స్పెషల్ డ్రెస్సింగ్ కోడ్‌ను కూడా ఏర్పాటు చేసింది అంబానీ కటుంబం.ఈ వేడుకల్లో అంబానీ కుటుంబం ధరించే డ్రెస్‌లు, నగలు ఎప్పడూ స్పెష్టల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయనే విషయం తెలిసిందే. అలానే ఈసారి అనంత్ రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అత్యంత హైలెట్‌గా నీతా చేతి వాచ్ నిలిచింది. అందరి దృషిని ఆకర్షించింది. ఆ వాచ్ ధర, స్పెషాలిటీ ఏంటో చూద్దామా..! View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) ఇటీవలే ముగిసిన క్రూయిజ్‌లోని ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఆమె చేతి వాచ్ అత్యంత స్టైయిలిష్‌గా, లగ్జరియస్‌గా ఉంది. ఈ వేడుకలో ఆమె ధరించిన దుస్తుల ధర కంటే వాచ్ ధరం అత్యంత ఖరీదు కూడా. ఆమె ప్రముఖ డిజైనర్ ఆస్కార్ డి లా రెంటా పెయింటెడ్ పాప్పీస్ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ మ్యాక్సీ దుస్తులను ధరించారు. వాటి ధర కేవలం రూ. 6 లక్షలు కాగా ఆమె ధరించిన వాచ్ ధర అంతకు మించి అన్న రేంజ్లో ఉంది. నీలమణులతో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఈ వాచ్. ఇది జాకోబ్ అండ్ కో బ్రాండ్‌కి చెందిన టైమ్‌పీస్. దీని ధర ఏకంగా రూ 3 కోట్లు. ఈ వాచ్ ఇంద్రధనస్సులా మెరిసే నీలమణులతో కూడిన గోల్డ్ కేస్, దానికి నొక్కు కూడా ఉంటుంది. అందుకు తగ్గట్టు లైట్ మేకప్‌తో, జుట్టు వదులు చేసి అత్యంత స్టన్నింగ్ లుక్‌లో కనిపించింది నీతా. ఈ ఆహార్యం నీతా ఆధనాతన స్టెయిలింగ్ శైలి రేంజ్ ఏంటన్నది చెప్పకనే చెప్పింది. View this post on Instagram A post shared by JACOB & CO. (@jacobandco) (చదవండి: దగ్గడంతో తొడ ఎముక విరిగిపోవడమా?..షాక్‌లో వైద్యులు!) -
‘క్రూయిజ్’కు పెరుగుతున్న క్రేజ్
సాక్షి, అమరావతి: పర్యాటకుల్లో రోజురోజుకు పెరుగుతున్న ఆసక్తి, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రణాళికల ఫలితంగా క్రూయిజ్ పర్యాటకం దేశంలో ఆల్‌టైమ్ రికార్డులు సృష్టిస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 4.70 లక్షల మంది క్రూయిజ్‌లో ప్రయాణించడమే ఇందుకు నిదర్శనం. ఇది కరోనా ముందు 2019–20లో 4.20 లక్షల మంది క్రూయిజ్ ఫుట్‌ఫాల్‌తో పోలిస్తే గణనీయమైన పెరుగుదలను చూపిస్తోంది. ఈ క్రమంలోనే 2041 నాటికి 40లక్షల మందిని క్రూయిజ్‌లో పర్యటించేలా కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది.లోతైన సముద్ర క్రూయిజ్‌లు, తీర ప్రాంత క్రూయిజ్‌లు, రివర్ క్రూయిజ్‌లు, యాచ్ క్రూయిజ్లలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం రూ.45 వేల కోట్ల పెట్టుబడితో రివర్ క్రూయిజ్ టూరిజంను అభివృద్ధి చేయాలని చూస్తోంది. ప్రస్తుతం కోర్డెలియా, కోస్టా క్రూయిజ్ వంటి క్రూయిజ్ లైన్లు ప్రస్తుతం అరేబియా సముద్రంలో దేశీయ విహార యాత్రలను నిర్వహిస్తున్నాయి.దేశీయంగా పెరుగుదల..గడిచిన ఆర్థిక సంవత్సరంలో 80 శాతం మంది దేశీయంగానే ప్రయాణించారు. ఇందులో 29వేల మంది మాత్రమే అంతర్జాతీయ పర్యటనలు చేశారు. ఇప్పటికీ అంతర్జాతీయ క్రూయిజ్ టూరిజం ఇంకా కోవిడ్‌కు మునుపటి స్థాయిలో చేరకపోవడంతో విదేశీ పర్యాటకులు తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దేశీయ పర్యాటకులలో క్రూయిజ్‌లకు ఆదరణ పెరుగుతోంది. 2019–20లో 50 శాతం దేశీయ, 50 శాతం అంతర్జాతీయ క్రూయిజ్ పర్యటనలు నమోదయ్యాయి. వాటితో పోలిస్తే తాజాగా దేశీయ పర్యాటకులు దాదాపు 85శాతం పెరిగారు. సింగపూర్ వంటి దేశాలలో క్రూయిజ్ పరిశ్రమకు భారతీయ పర్యాటకులు కీలకంగా ఉన్నారు. అయితే అబుదాబి కూడా భారతీయ పర్యాటకులను తన క్రూయిజ్ ఆఫర్లకు ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది.క్రూయిజ్ పర్యటనలు ఇలా..ముంబై, గోవా, న్యూ మంగళూరు, కొచ్చి, విశాఖ పోర్టులకు అంతర్జాతీయ క్రూయిజ్ షిప్‌ల రాక పెరుగుతోంది. దేశీయ క్రూయిజ్‌లు ముంబై–గోవా, ముంబై–డయ్యూ, ముంబై–కొచ్చి, ముంబై–లక్ష ద్వీప్, ముంబై–హై సీస్, చెన్నై–వైజాగ్ మార్గాల్లో అందుబాటులో ఉన్నాయి. నది క్రూయిజ్ టూరిజం కోసం తొమ్మిది జలమార్గాలను గుర్తించారు. వాటిలో గంగానదిపై వారణాసి–హలి్దయా, బ్రహ్మపుత్రలోని ధుబ్రి–సాదియా మార్గాలున్నాయి. గుజరాత్ తీర్థయాత్ర పర్యటనలు, పశ్చిమ తీర సాంస్కృతిక, సుందరమైన పర్యటనలు, సౌత్ కోస్ట్ ఆయుర్వేద వెల్నెస్ పర్యటనలు, తూర్పు తీర వారసత్వ పర్యటనలు వంటి థీమ్–ఆధారిత పర్యాటక సర్క్యూట్లను అభివృద్ధి చేయాలని కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ యోచిస్తోంది.అందుబాటులో విశాఖ అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్..దక్షిణ భారతదేశంలో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే దేశీయ, అంతర్జాతీయ క్రూయిజ్ టూరిజం అందుబాటులో ఉంది. విశాఖలో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పర్యాటకులకు విశేష సేవలందిస్తోంది. సుమారు రూ.100 కోట్లతో నిర్మించిన విశాఖ అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ సుమారు 2వేల మంది ప్రయాణికులకుపైగా సామర్థ్యం ఉన్న నౌకలకు వసతి కల్పిస్తోంది. -
అనంత్-రాధిక క్రూయిజ్ పార్టీ : బాలీవుడ్ తారల సందడి, వీడియో వైరల్
బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ రెండో ప్రీ వెడ్డింగ్ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ స్పెషల్ క్యూయిజ్ పాప్-రాక్ స్టార్ కేటీ పెర్రీ అదర గొట్టేసింది. అలాగే బాలీవుడ్ హీరో రణవీర్ సందడి చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సారా అలీఖాన్ తన 'రోమన్ హాలిడే'ని ఆస్వాదిస్తూ స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. అలాగే త్వరలో తండ్రి కాబోతున్న రణ్వీర్ సింగ్ కూడా స్టేజ్‌పై స్టెప్పులతో అలరించాడు. క్రూయిజ్‌లో అతిథులతో సెల్ఫీకి పోజులిచ్చాడు. అలాగే ఓర్రీ అమాంతం ఎత్తివేసిన దృశ్యాలు నెట్టింట్ హల్ చల్ చేస్తున్నాయి.Radhika-Anant's 2nd pre wedding bash: Backstreet Boys perform 'I Wanna Be With You' at cruise party.#AmbaniWedding @backstreetboys Read more: https://t.co/fUFPEByuB0 pic.twitter.com/og7wMLZj6k— editorji (@editorji) May 30, 2024'లా వీటా ఇ అన్ వియాజియో' అనే థీమ్‌తో ఇచ్చిన లైవ్ ఈవెంట్ అతిథులను మెస్మరైజ్ చేసింది. ఈ ఈవెంట్ కోసం ఆమె 45 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే కొలంబియన్ సింగర్ షకీరా అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో ప్రత్యేకంగా పెర్ఫామ్ చేయడానికి ఆమె రూ.15 కోట్లు అందుకుంటున్నట్టు సమాచారం.'స్టార్రీ నైట్స్' క్రూయిజ్ వేడుకలో లెజెండరీ బాయ్ బ్యాండ్ బ్యాక్‌స్ట్రీట్ బాయ్స్ హై-ఎనర్జీ ప్రదర్శనతో ఈవెంట్ షురూ అయింది. వారి ట్రేడ్‌మార్క్ ఆల్-వైట్ దుస్తులను ధరించి, పాపులర్ ట్రాక్స్‌తో ఆహూతులను అలరించారు. ఇదే పార్టీలో అంబానీ, నీతా దంపతుల పెద్ద కుమారుడు ఆకాశ్-శ్లోకా మెహతా ముద్దుల తనయ వేదా తొలి బర్త్‌డే వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు. కాగా అనంత్-రాధిక మర్చంట్ జూలై 12న పెళ్లి పీటలెక్కబోతున్నారు. ముంబైలోని BKCలోని జియో వరల్డ్ సెంటర్లో సాంప్రదాయ హిందూ వైదిక ఆచారాల ప్రకారం ఈ వివాహం జరగనుంది. -
US: క్రూయిజ్ ఎక్కే అదృష్టం కూడా ఉండాలేమో.!
రోడ్డు, రైలు, వాయు రవాణాలు ఎన్నున్నా తెలంగాణా సముద్ర తీరంలేని రాష్ట్రం కావడం వల్ల జల రవాణాకు ఉపయోగించే ఓషన్ లైనర్స్, విహార యాత్రలకు వాడే క్రూయిజ్ షిప్‌లు ఇక్కడి వాళ్లకు కొత్త. అయితే మన దేశంలో విస్తారమైన తీర ప్రాంతం ఉంది. ముఖ్యంగా ముంబై , గోవా, విశాఖ, లక్ష్యదీప్, కేరళ, అండమాన్, కొచ్చి, మాల్ దీవ్ జలాల్లో క్రూయిజ్‌లు సందర్శకులతో రౌండ్ ట్రిప్‌లు చేస్తూ మన పర్యాటక పరిశ్రమలో ప్రధానపాత్ర వహిస్తున్నాయి. క్రూయిజ్ అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది ‘ టైటానిక్ ’ . 1912 నాటి ఈ అతిపెద్ద ప్రయాణికుల నౌక తన మొదటి ప్రయాణంలోనే ఏప్రిల్ 14 న ప్రమాదవశాత్తు ఒక మంచుకొండను ఢీకొని సముద్రంలో మునిగిపోవడం, అందులోనున్న 1500కు పైగా ప్రయాణికులు, సిబ్బంది చనిపోవడం అదో పెద్ద చరిత్ర. ఈ నేపథ్యంతో జేమ్స్ కామెరాన్ రూపొందించిన హాలీవుడ్ ప్రేమ కథా చిత్రం టైటానిక్ ( 1997 ) ప్రపంచ వ్యాప్తంగా విడుదలయి సినీ ప్రపంచంలోనే మరో చరిత్ర సృష్టించింది. సముద్ర మార్గాల్లో తిరిగే ఈ క్రూయిజ్లలో పర్యాటకులు బస చేయడానికి కావలసిన అన్ని సౌకర్యాలు, విలాసాలు ఉంటాయని వినడమే కానీ వీటిలో విహరించే అవకాశం మాకు 2016 అక్టోబర్‌లో అమెరికా వెళ్ళినప్పుడు మాత్రమే వచ్చింది. అప్పుడే అమెరికాలో హాలోవిన్ దయ్యాల పండగ నడుస్తోంది. మన దగ్గర పీర్ల పండగ కోలల్లాగ పిల్లలు ఇంటింటికి వెళ్లి క్యాండీలు సేకరిస్తూ ఆనందోత్సాహల్లో మునిగి తేలుతున్నారు. మా అమ్మాయి ఎంబీఏ పట్టా ప్రదానం చేసిన సందర్భంగా కోజుమల్ మెక్సికో క్రూయిజ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. డల్లాస్ నుం కారులో బయలుదేరి, ఆ రోజంతా ప్రయాణం తర్వాత ,రాత్రి 12 గంటలకు కుబాసియానా ఒక హోటల్లో బస చేసి మరునాడు ఉదయమే పోర్ట్‌కు చేరుకున్నాము. మేము క్రూయిజ్ అనబడే కొత్త ప్రపంచం లోకి అడుగు పెట్టింది డిసెంబర్ 15 నాడు, ఎయిర్పోర్ట్ లాగే సెక్యూరిటీ, పాస్‌పోర్ట్, వీసా వగైరా చెకింగ్లు చేశారు. అదో బహుళ అంతస్తుల భవనంలా ఉంది, అందులో అన్ని వసతులున్న ఏసి గదులున్నాయి. బాల్కనీ నుంచి కరీబియన్ సముద్రాన్ని చూస్తుంటే చుట్టు పక్కల ఏమీ కనబడలేదు పెద్ద పెద్ద అలలతో మమ్మల్ని ఆహ్వానిస్తున్న జలాలు తప్ప. లంచ్ అయినా డిన్నర్ అయినా షిప్‌లోని పెద్దపెద్ద హోటళ్లలోనే. డిసెంబర్ 16 నాడు క్రిస్మస్ ప్రోగ్రాము కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. పక్కకే క్యాసినోలు, క్యాబరేలు.. డబ్బులుంటే వినోదాలకు కొరత లేదు. డిసెంబర్ 17 నాడు కొజు మల్ మెక్సికో ఐలాండ్ మీద అడుగు పెట్టాం. అక్కడి బీచ్ సన్ బాత్ చేసేవాళ్లతో కళకళలాడిపోతుంది. నదీ స్నానాన్ని మించిన ఆనందమేదో సముద్రంలో ఉన్నట్టుంది. అక్కడే డాల్ఫిన్లను చూశాం, ఆ సరదా కూడా తీర్చుకున్నాం. అక్కడ ఎన్ని సౌకర్యాలున్నాయంటే.. అప్పటికప్పుడు మన ఫోటోలు తీసిపెట్టేవాళ్లకు కొదువ లేదు. అక్కడ లభించే బఫె భోజనాల్లో రకరకాల సీఫుడ్ జీర్ణించుకునే శక్తి ఉంటే ఎంతైనా తినవచ్చు. ఆ ద్వీపాన్ని వదిలి మళ్ళీ క్రూయిజ్‌లోకి ప్రవేశించే సరికి సొంత ఇంట్లోకి వచ్చిన భావన కలిగింది. ఆ రోజు రాత్రంతా సముద్రం మీద ప్రయాణం, డిసెంబర్ 19 నాడు క్రూయిజ్ మళ్లీ మేము బయలుదేరిన పోర్ట్‌కు చేర్చింది. ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్ పెట్టి మరీ క్రూయిజ్ సిబ్బంది మాకు వీడ్కోలు పలికారు, మళ్ళీ మళ్ళీ రావాలని చెబుతూ ! వేముల ప్రభాకర్ (చదవండి: యూఎస్‌లోనే అత్యంత సంపన్న మహిళగా..ఏకంగా రూ. 75 వేల కోట్లు..!) -
ఏడాదికిపైగా ఆ జంట నీటిపైనే జీవనం! ఎందుకో తెలుసా
ఏడాదికి పైగా ఆ జంటే నీటిపైనే జీవనం సాగించారు. ఆమె వంటగదిలోకి అడుగుపెట్టడం, వాషింగ్ మెషిన్ వినియోగించటం వంటివి చేయలేదట. పైగా అన్ని రోజులు నీటిపైనే ఎలా జీవించారు. ఎందుకంటే.. మోనికా బ్రజోస్కో, ఆమె భర్త జోరెల్ కాన్లీ ప్రత్యకమైన జీవనశైలిని ప్రారంభించారు. టేనస్సీలోని మెంఫిస్‌కు చెందిన ఈ జంట వారు ఆస్తులను విక్రమయించి మరీ క్రూయిజ్ షిప్ల్లోనే పయనిస్తున్నారు. వారికి కొత్త ప్రదేశాలను చుట్టి రావడమంటే మహా సరదా. అందుకోసం అని 9 టు 5 ఉద్యోగాలను కూడా వదిలేశారు. పైగా వారి ఇంటిని కూడా అమ్మేసి వచ్చిన డబ్బులతో కొత్త కొత్త ప్రదేశాలను చుట్టోస్తున్నారు. ఇలా ఏడాదికిపైగా షిప్ల్లోనే ప్రయాణాలు చేశారు ఈ జంట. పైగా మోనికా తాను వంటగదిలోకి అడుగుపెట్టి ఏడాదికి పైగా అయ్యిందని చెబుతోంది. ఆఖరికి వాషింగ మెషిన్ వినియోగించ లేదంటోంది. ఆ షిప్ సిబ్బందే తమ అవసరాలన్నీ చూసుకునేవారని చెప్పింది. అలాగే ఈ క్రూయిజ్ షిప్‌ల్లో ప్రయాణించేందుకు చక్కటి ఆర్థిక ప్రణాళికతో సాగుతున్నారు. ఏడాదికి సుమారు రూ. 8 లక్షలకు మించకుండా ఖర్చులు చూసుకుంటూ చక్కెర్లు కొడుతోంది ఈ జంట. తాము ఈ క్రూయిజ్ షిప్‌ల్లో ప్రయాణించేలా చక్కటి ఆఫర్లను ఉపయోగించుక్నుట్లు తెలిపింది. అలాగే భూమిపై జీవితాన్ని విడిచిపెట్టడాన్ని విముక్తిగా అభివర్ణించారు. అంతేగాదు మాకు రోజులన్నీ విశ్రాంతిగా అన్యప్రదేశాలను అన్వేషించడంతో బిజీగా ఉన్నాయని ఆనందంగా చెబుతున్నారు. ఈ నీటిపై జీవనం ప్రతిక్షణం ఓ మాయజాలంలా అద్భుతంగా ఉంటుందని అంటోంది ఆ జంట. అలాగే ప్రపంచ అన్వేషణ గురించి సాగుతున్న తమ కల కూడా నిజం అవుతోందని ఆనందంగా చెబుతోంది ఆ జంట. (చదవండి: గుడ్లు ఎక్కువగా తింటున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు!) -
ప్రపంచ ఆర్థిక ప్రగతిలో ఐదో స్థానానికి భారత్
దొండపర్తి (విశాఖ దక్షిణ):ప్రపంచ ఆర్థిక ప్రగతిలో భారతదేశం ఐదో స్థానానికి చేరుకుందని కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద్ సోనోవాల్ పేర్కొన్నారు. ఈ ఘనతను సాధించడంలో ఆంధ్రప్రదేశ్ కూడా భాగస్వామిగా ఉందని చెప్పారు. విశాఖ పోర్టులో జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా రూ.96 కోట్లతో నిర్మించిన క్రూయిజ్ టెర్మినల్‌ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్తో కలిసి సోమవారం ప్రారంభించారు పోర్టులో రూ.237 కోట్లతో పూర్తి చేసిన ట్రక్ పార్కింగ్ టెర్మినల్, కవర్డ్ స్టోరేజ్ షెడ్లతోపాటు ఓఆర్ బెర్తుల ఆధునికీకరణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ ప్రధాని మోదీ 2015లో ప్రారంభించిన సాగరమాల కార్యక్రమం ద్వారా రూ.5.60 లక్షల పెట్టుబడులతో పోర్టుల ఆధునికీకరణను చేపట్టినట్టు వెల్లడించారు. ఫలితంగా ఆధునిక మౌలిక సదుపాయాలతో భారతీయ ఓడరేవులు ప్రపంచంలోనే అత్యుత్తమంగా మారుతున్నాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని గుర్తు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని వెల్లడించారు. విశాఖను క్రూయిజ్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ క్రూయిజ్ టెర్మినల్‌లో ఒకేసారి 2 వేల మంది ప్రయాణికులకు సేవలందించే అవకాశం ఉందన్నారు. కేంద్ర షిప్పింగ్, టూరిజం శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ వై.నాయక్ మాట్లాడుతూ విశాఖ క్రూయిజ్ టెర్మినల్‌ను దేశంలోనే ప్రముఖ క్రూయిజ్ టూరిజం డెస్టినేషన్‌గా తీరిదిద్దాలన్ని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ పరిశ్రమ వివిధ రంగాల్లో ఉద్యోగాలను సృష్టిస్తోందని తెలిపారు. క్రూయిజ్ టెర్మినల్ విశాఖకు మైలురాయి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. విశాఖ చరిత్రలో క్రూయిజ్ టెర్మినల్ ఒక మైలురాయిగా మిగిలిపోతుందన్నారు. సిటీ ఆఫ్ డెస్టినీగా గుర్తింపు పొందిన విశాఖలో పర్యాటకాభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. రాష్ట్రాభివృద్ధిలో పోర్టులు కీలక భూమిక పోషిస్తున్నాయని తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కొత్త పోర్టులు, హార్బర్లు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతి, జీవీఎల్ నరసింహారావు, విశాఖ పోర్ట్ అథారిటీ చైర్మన్ ఎం.అంగముత్తు, డిప్యూటీ చైర్మన్ దుబే, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గణబాబు పాల్గొన్నారు. -
‘విశాఖలో చరిత్రలో క్రూయిజ్ టెర్మినల్ ఓ మైలురాయి’
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పోర్టులో నూతనంగా నిర్మించిన క్రూయిస్ టెర్మినల్‌ను పోర్ట్‌లు షిప్పింగ్శాఖ కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డాక్టర్ సత్యవతి, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, విశాఖ మేయర్ హరివెంకట కుమారి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. విశాఖలో చరిత్రలో క్రూయిజ్ టెర్మినల్ ఒక మైలురాయి అని పేర్కొన్నారు. టూరిజం అభివృద్ధి చెందడానికి క్రూయిజ్ ఎంతోగానో దోహదం పడుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో పోర్టులు కీలక భూమిక పోషిస్తున్నాయన్నారు. త్వరలో విశాఖకు జాతీయ,అంతర్జాతీయ క్రూయిజ్‌లు రాబోతున్నాయని రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నర్సింహరావు అన్నారు. విశాఖ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ పాత్ర విశేషమైనదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ మరింత అభివృద్ధి చెందబోతుందని.. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. చదవండి: రాధాకృష్ణను కమ్మేసిన చంద్ర మాయ -
విశాఖ తీరం..క్రూయిజ్ విహార కేంద్రం
అంతర్జాతీయ నగరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ సిటీ సిగలో మరో ప్రతిష్టాత్మక పర్యాటక మణిహారం చేరుతోంది. అంతర్జాతీయ స్థాయి సముద్ర విహారానికి ఆసక్తి చూపే పర్యాటకుల కోసం విశాఖ పోర్టులో క్రూయిజ్ టెర్మినల్ ముస్తాబైంది. వివిధ దేశాల పర్యాటకులు క్రూయిజ్‌లో వచ్చి మహా విశాఖ నగరంలో పర్యటించేలా ఈ టెర్మినల్‌లో వివిధ ఏర్పాట్లు చేశారు. పోర్టులోని గ్రీన్ చానల్ బెర్త్‌లో రూ.96.05 కోట్లతో నిర్మించిన ఈ సముద్ర విహార కేంద్రాన్ని క్రూయిజ్ షిప్స్‌తోపాటు భారీ కార్గో నౌకల హ్యాండ్లింగ్‌కు అనుగుణంగా తీర్చిదిద్దారు. ఈ క్రూయిజ్ టెర్మినల్‌ను సోమవారం కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ ప్రారంభించనున్నారు. అనంతరం ట్రయల్స్ నిర్వహించేందుకు పోర్టు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.– సాక్షి, విశాఖపట్నం ఏపీ టూరిజంతో కలిసి... ఈ టెర్మినల్ నిర్వహణలో ఏపీ టూరిజం, కేంద్ర టూరిజం శాఖలతో కలిసి విశాఖపట్నం పోర్టు పని చేయనుంది. భారత్‌లో క్రూయిజ్ టూరిజానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం 7.1 యూఎస్ బిలియన్ డాలర్ల మార్కెట్ ఉంది. రానున్న పదేళ్లలో 12.1 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా క్రూయిజ్ రంగం 1.17 మిలియన్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. దేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెరిగేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో అద్భుతమైన సందర్శనీయ ప్రాంతాలు ఉన్నాయి. క్రూయిజ్ సేవలు ప్రారంభమైతే రాష్ట్రంలో ఇంటర్నేషనల్ టూరిజం గణనీయంగా పెరగనుంది. ఇవీ విశాఖ క్రూయిజ్ టెర్మినల్ ప్రత్యేకతల్లో కొన్ని... 2,500 చదరపు మీటర్లలో టెర్మినల్ బిల్డింగ్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, విదేశీ కరెన్సీ మార్పిడి కౌంటర్లు, గ్యాంగ్ వే, రెస్టారెంట్, స్పెషల్ లాంజ్, షాపింగ్, రెస్ట్ రూమ్స్, టూరిజం ఆపరేటర్స్ కౌంటర్లు ఏర్పాటు చేసే విధంగా నిర్మాణాలు పూర్తిచేశారు. క్రూయిజ్‌లో వచ్చే అంతర్జాతీయ పర్యాటకుల చెకింగ్ కోసం ప్రత్యేకంగా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ క్యాబిన్స్, పర్యాటకులు సేదతీరేందుకు టూరిస్ట్ లాంజ్ నిర్మించారు. టెర్మినల్ పార్కింగ్ ప్రాంతంలో 7 బస్సులు, 70 కార్లు, 40 బైక్‌లు నిలిపేలా ఏర్పాట్లు చేశారు. గంటకు 200 కి.మీ. వేగంతో వీచే గాలులను సైతం తట్టుకునేలా షోర్ ప్రొటెక్షన్ వాల్ కూడా ఇందులో నిర్మిస్తున్నారు. రెగ్యులర్ బెర్త్ 180 మీటర్ల పొడవు కాగా.. ఈ టెర్మినల్‌లో 330 మీటర్ల భారీ పొడవైన క్రూయిజ్ బెర్త్ నిర్మించారు. 15 మీటర్ల వెడల్పు, 9.50 మీటర్ల డ్రెడ్జ్ డెప్త్‌ని నిర్మించారు. తద్వారా క్రూయిజ్ రాని సమయంలో సరుకు రవాణా చేసే భారీ కార్గో నౌకలను కూడా ఈ బెర్త్‌లోకి అనుమతించేలా డిజైన్ చేశారు. స్థానికులకు ఉపాధి పెరుగుతుంది గరిష్టంగా 2,000 మంది టూరిస్టులకు సరిపడా సౌకర్యాలతో క్రూయిజ్ టెర్మినల్ భవనాన్ని సుందరంగా నిర్మించాం. ఈ టెర్మినల్ కేవలం పర్యాటకంగానే కాకుండా స్థానికులకు ఉపాధి పెరిగేందుకు ఉపయోగపడుతుంది. క్రూయిజ్ షిప్స్‌లో వచ్చే టూరిస్టులు స్థానిక దుకాణాల్లో షాపింగ్స్ చేయడం, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించడం... ఇలా ఎన్నో విధాలుగా మేలు కలగనుంది. సందర్శనీయ స్థలాల్లో పర్యటించడం వల్ల స్థానికంగా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. క్రూయిజ్ టెర్మినల్ ప్రారంభించిన తర్వాత ట్రయల్ నిర్వహిస్తాం. ఇప్పటికే రెండు భారీ ఆపరేటర్ సంస్థలు పోర్టుతో సంప్రదింపులు జరుపుతున్నాయి. వింటర్ సీజన్లో కొత్త టెర్మినల్ నుంచి సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.– డాక్టర్ అంగముత్తు,విశాఖపట్నం పోర్టు అథారిటీ చైర్మన్ -
సాగర యాత్రకు సిద్ధం కండి
విహార ప్రపంచానికి విశాఖ నగరం మరోసారి ముస్తాబవుతోంది. పర్యాటక రంగంలో కీలకమైన క్రూయిజ్ సేవలందించేందుకు ఈసారి రెండు నౌకలుసిద్ధమవుతున్నాయి. సాగర జలాల్లో మూడు రోజులపాటు విహరిస్తూ.. విశాఖ నుంచి దక్షిణ భారత దేశంలోని పలు నగరాలకు సర్వీసులు నడిపేందుకు క్రూయిజ్ సంస్థలు సిద్ధమవుతున్నాయి. మే నెల నుంచి ఎంఎస్సీ సంస్థ, జూన్ నుంచి కార్డిలియా సంస్థ సర్వీసులను ప్రారంభించనున్నాయి. మరోవైపు విశాఖపట్నం పోర్టులో నిర్మిస్తున్న క్రూయిజ్ టెర్మినల్ మే నాటికి అందుబాటులోకి రానుంది. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం తేడాది విశాఖ నుంచి చెన్నైకు సర్వీసులు నడిపిన ఎంప్రెస్ సంస్థకు చెందిన కార్డిలియా క్రూయిజ్ నౌక తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు మధురానుభూతిని అందించింది. ఇప్పుడు దాంతోపాటు స్విట్జర్లాండ్ ప్రధాన కేంద్రంగా లండన్, వెనిస్, ఇటలీ సహా ప్రపంచవ్యాప్తంగా సర్వీసులు నడిపిస్తున్న ఎంఎస్సీ క్రూయిజ్ సంస్థ కూడా విశాఖ కేంద్రంగా సేవలకు సిద్ధమైంది. ఈ రెండు సంస్థల ప్రతినిధులు రెండు రోజుల క్రితం విశాఖపట్నం పోర్టు అధికారులతో సంప్రదింపులు జరిపారు. వీటికి అనుమతులు ఇచ్చేందుకు పోర్టు అంగీకారం తెలిపింది. ఎంఎస్సీ క్రూయిజ్ మే నుంచి, కార్డిలియా నౌక జూన్ నుంచి సర్వీసులు నడపనుంది. ప్రతి మూడు రోజులకోసారి రోజు విడిచి రోజు నడిపించేలా పోర్టు అధికారులు వీటికి బెర్తులు అందించనున్నారు. ఒక్కో క్రూయిజ్ ఆరు నెలల పాటు విశాఖ నుంచి సర్వీసులు నడపనుంది. త్వరలోనే సర్వీసుల వివరాలను ఈ సంస్థలు ప్రకటించనున్నాయి. క్రూయిజ్లలో ఎన్నో సౌకర్యాలు ఈ క్రూయిజ్ నౌకలలో ప్రయాణించే వారికి అనేక సౌకర్యాలు ఉంటాయి. ఒక్కోటి 11 అంతస్తులుండే ఈ భారీ నౌకల్లో ఒకేసారి 1,500 నుంచి 2 వేల మంది వరకు ప్రయాణించవచ్చు. వీటిలో ఫుడ్ కోర్టులు, స్పెషాలిటీ రెస్టారెంట్లు, బార్లు, స్పా, సెలూన్, థియేటర్, నైట్ క్లబ్, స్విమ్మింగ్ పూల్స్, ఫిట్నెస్ సెంటర్లు, డీజే ఎంటర్టైన్మెంట్, లైవ్ బ్యాండ్, అడ్వెంచర్ యాక్టివిటీస్, షాపింగ్ మాల్స్, లైవ్ షోలు ఉంటాయి. చిన్నారుల కోసం ప్రత్యేక ఫన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. టికెట్ తీసుకున్న వారందరికీ షిప్‌లోని క్యాసినో వరల్డ్‌కు ఎంట్రీ ఉచితం. లిక్కర్, ఇతర సర్వీసులకు అదనపు చార్జీలు ఉంటాయి. చురుగ్గా టెర్మినల్ నిర్మాణం విశాఖ పోర్టులోని గ్రీన్‌చానెల్‌లో రూ.72.26 కోట్లతో నిర్మిస్తున్న క్రూయిజ్ బెర్త్, టెర్మినల్ బిల్డింగ్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మే నాటికి ఈ పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా టెర్మినల్‌లో అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. సాధారణంగా బెర్త్ 180 మీటర్ల పొడవు కాగా.. ఇక్కడ 330 మీటర్ల భారీ పొడవైన బెర్త్ నిర్మిస్తున్నారు. 15 మీటర్ల వెడల్పు, 9.50 మీటర్ల డ్రెడ్జ్డ్ డెప్త్‌తో దీనిని నిర్మిస్తున్నారు. ఈ విశాలమైన బెర్త్ పైకి క్రూయిజ్ రాని సమయంలో సరుకు రవాణా చేసే కార్గో నౌకల్ని కూడా అనుమతిస్తారు. అంతర్జాతీయ పర్యాటకుల ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ కార్యాలయాలతో పాటు పర్యాటకులు సేదతీరేందుకు పర్యాటక భవన్ని నిర్మిస్తున్నారు. 2 వేల చదరపు మీటర్ల టెర్మినల్ బిల్డింగ్తోపాటు పరిపాలన భవనం, కరెన్సీ మార్పిడి కౌంటర్లు, గ్యాంగ్వేస్, రెస్టారెంట్, లాంజ్‌లు, ఎంటర్టైన్మెంట్స్, షాపింగ్ మాల్స్, రెస్ట్‌రూమ్స్, టూరిజం ఆపరేటర్స్ కౌంటర్లు కూడా ఇక్కడ ఉంటాయి. గరిష్టంగా 2,500 మంది పర్యాటకులు రావొచ్చు. ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే విశాఖ నుంచి క్రూయిజ్ సేవలు నిరంతరాయంగా ఉండే అవకాశాలున్నాయని పోర్టు అధికారులు చెబుతున్నారు. -
రివర్ క్రూయిజ్ చిక్కుకోలేదు! భద్రత దృష్ట్యా అలా చేశాం
ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ గంగా విలాస్‌ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. లగ్జరీ రివర్ క్రూయిజ్ ఒకచోట చిక్కుకుపోయిందంటూ వచ్చిన వార్తలు గుప్పుమన్నాయి. కానీ అవి ఎంతమాత్రం వాస్తవం కావని క్రూయిజ్‌ని నిర్వహస్తున్న ఎక్సోటివ్ హెరిటేజ్ గ్రూప్ చైర్మన్ రాజ్‌సింగ్ చెప్పారు. షెడ్యూల్ ప్రకారం ఓడ పాట్నా చేరుకుంది. ఓడ నదిలో లంగరు వేయగా..పర్యాటకులు సందర్శన కోసం పడవలు తీసుకుని బయలుదేరారని తెలిపారు. "ఓడ ఎల్లప్పుడూ ప్రధానంగా లోతైన ప్రదేశంలోనే ఉంటుంది. పెద్ద ఓడలు ఎప్పుడూ ఒడ్డుకు వెళ్లలేవు. ఈ ఓడను చూడటానికి వేలాదిమంది తరలి వచ్చారు. ఓడ గోప్యత, ప్రయాణికుల భద్రత తదితర కారణాల రీత్యా తాము పాట్నాకి తీసుకువచ్చామని, జెట్టీకి తీసుకురాలేకపోయామని చెప్పారు". అలాగే పర్యాటకులు అక్కడ చిరాంద్ అనే పర్యాట ప్రదేశాన్ని చూడటానికి పడవలను తీసుకుని వెళ్లారని, మళ్లీ సురక్షితంగా తిరిగి వచ్చేశారని వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా, ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, జాతీయ ఉద్యానవనాలు, నదీ ఘాట్లు, బీహార్‌లోని పాట్నా, జార్ఖండ్‌లోని షాహిగంజ్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, అస్సాంలోని గౌహతి, బంగ్లాదేశ్‌లోని ఢాకా వంటి ప్రధాన నగరాలతో సహా 50 పర్యాటక ప్రాంతాలను ఈ క్రూయిజ్ కవర్ చేస్తుంది. శాకాహార భారతీయ వంటకాలు, ఆల్కహాల్ లేని పానీయాలు, స్పా, కాల్‌లోనే అందుబాటులో ఉండే వైద్యులు తదితర సౌకర్యాలు ఉన్నాయి. ఈ రివర్ క్రూయిజ్‌కి రోజుకు సుమరు రూ. 25 వేల నుంచి రూ. 50 వేలు వరుకు ఖర్చు అవుతుంది. మొత్తం 51 రోజుల ప్రయాణానికి ప్రతి ప్రయాణికుడికి దాదాపు రూ. 20 లక్షలు ఖర్చవుతుంది. (చదవండి: ఆ విమానం నేరుగా మావైపే వచ్చింది... వెలుగులోకి కీలక విషయాలు) -
ప్రపంచంలోనే సుదూర నదీ పర్యాటకం
సాక్షి, న్యూఢిల్లీ: నదీజలాల్లో పర్యాటకులు సుదూరాలకు విలాసవంత ప్రయాణం సాగించేలా రివర్ క్రూయిజ్ (షిప్) పర్యాటకానికి భారతీయ నదులు సిద్ధమయ్యాయి. 52 రోజులపాటు గంగావిలాస్ పేరుతో కొనసాగే ఈ పర్యాటక నౌక సేవలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నాను. గంగా నది, బ్రహ్మపుత్ర నదుల మీదుగా కొనసాగే ఈ ప్రయాణం జనవరి 13న వారణాసిలో ప్రారంభం అవుతుంది. దాదాపు 3,200 కిలోమీటర్ల పాటు 5 రాష్ట్రాల్లో మొత్తం 27 నదుల్లో ప్రయాణించి బంగ్లాదేశ్ మీదుగా మార్చి ఒకటిన అస్సాంలోని దిబ్రూగఢ్‌కు గంగా విలాస్ చేరుకుంటుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రపంచంలో ఇంతవరకు ఇలా రెండు పొడవైన నదులపై క్రూయిజ్ (షిప్)లో పర్యటన సందర్భాలు లేవని తెలిపారు. అందుకే తొలిసారిగా అత్యంత ఎక్కువ దూరాలకు గంగ, బ్రహ్మపుత్ర నదులపై కొనసాగే ఈ యాత్రపై ఆసక్తి నెలకొందని వివరించారు. ‘గంగా విలాస్ రివర్ క్రూయిజ్ ప్రాజెక్టు ద్వారా భారత్, బంగ్లాదేశ్ మధ్య సాంస్కృతిక బంధాన్ని ప్రపంచానికి చాటిచెప్తాం. భారతీయ పర్యాటకరంగ రూపురేఖలు మార్చడంలో ఈ ప్రాజెక్ట్ కీలక భూమిక పోషించనుంది’ అని ఉద్ఘాటించారు. -
వైజాగ్ పోర్టులో క్రూయిజ్ టెర్మినల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ప్రపంచస్థాయి క్రూయిజ్ టెర్మినల్ ఏడాదిలో సాకారం కానుంది. ఈ ప్రాజెక్టుకు రూ.96 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు సంస్థ డిప్యూటీ చైర్మన్ దుర్గేశ్ దూబే వెల్లడించారు. హైదరాబాద్‌లో గురువారం జరిగిన ట్రేడ్ మీట్ సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో ఆయన మాట్లాడారు. ‘మినిస్ట్రీ ఆఫ్ టూరిజం సహకారంతో క్రూయిజ్ టెర్మినల్ నెలకొల్పుతున్నాం. పర్యాటక రంగ వృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుంది. క్రూయిజ్‌లో 2,000 మందికిపైగా ప్రయాణించే సామ ర్థ్యం ఉంటుంది’ అని వివరించారు. ఆయనింకా ఏమన్నారంటే.. అడ్డంకుల్లేని రవాణా..: రైలు, రోడ్డు మార్గంలో వివిధ ప్రాంతాల నుంచి పోర్టుకు.. అలాగే పోర్టు నుంచి వివిధ రాష్ట్రాలకు సరుకు రవాణాకు ఎటువంటి అడ్డంకులు లేకుండా పెద్ద ఎత్తున మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నాం. తూర్పు ప్రాంతంలో ప్రధాన పోర్టుగా నిలవాలన్నది మా లక్ష్యం. ఇందుకోసం మౌలిక వసతులకు 2–3 ఏళ్ల లో రూ.1,000 కోట్లు వెచ్చిస్తున్నాం. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో వెస్ట్, ఈస్ట్ క్యూ బెర్త్‌ల ఆధునీకరణకు రూ.488 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పోర్టును కంటైనర్ ట్రాన్షిప్మెంట్ హబ్‌గా తీర్చిదిద్దుతాం. హైదరాబాద్ నుంచి..: ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ప్రధానంగా ముంబై పోర్ట్ ద్వారా కార్గో రవాణా జరుగుతోంది. ఏటా 30 లక్షల టన్నుల సరుకు విదేశాలకు ఎగుమతి అవుతోంది. వైజాగ్ పోర్ట్ సమీపంలో ఉన్నప్పటికీ భాగ్యనగర వర్తకులు ముంబై నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారు. అర్హతగల వర్తకులకు చార్జీల్లో భారత్‌లో అత్యధికంగా 80 శాతం తగ్గింపు ఇస్తున్నాం. చార్జీల పరంగా చవకైన పోర్టు ఇదే. హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్తున్న కార్గోలో 10 లక్షల టన్నులు వైజాగ్ పోర్ట్ నుంచి జరిగేలా ప్రణాళికతో ఉన్నాం. ► కోవిడ్ దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా నౌకలు, కంటైనర్ల కొరత ఉంది. చార్జీలు అధికమయ్యాయి. పరిశ్రమపై తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. సాధారణ స్థితికి రావడానికి 6–12 నెలలు పట్టొచ్చు. 2020–21 మాదిరిగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ రూ.1,400 కోట్ల ఆదాయం ఆశిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 6.89 కోట్ల టన్నుల సరుకు రవాణా జరిగింది. 2021–22లో 7.1 కోట్ల టన్నులు ఆశిస్తున్నాం. పోర్టు కార్గో రవాణాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాటా 30 శాతముంది. -
ప్రస్తుతానికి పోర్టుల ప్రైవేటీకరణ ఆలోచన లేదు!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : దేశంలోని మేజర్ పోర్టులను ప్రైవేటీకరించాలన్న ఆలోచన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి శాంతాను ఠాకూర్ తెలిపారు. మూడ్రోజుల పర్యటన నిమిత్తం విశాఖ చేరుకున్న ఆయన ఇక్కడి పోర్టులో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఇండియన్ పోర్టుల ముసాయిదా బిల్లును ఏపీతో పాటు తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలతో మరోసారి చర్చించి ముందుకెళ్తామని తెలిపారు. ప్రైవేటు పోర్టుల నుంచి వస్తున్న పోటీ నేపథ్యంలో విశాఖ పోర్టు అమలుచేస్తున్న బెర్తు లీజులను క్రమబద్ధీకరించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఈ సందర్భంగా క్రూయిజ్ టెర్మినల్, పలు బెర్తుల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గత దశాబ్ద కాలంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో విశాఖపట్నం పోర్టు రూ.2 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందన్నారు. ఇక మారిటైం ఇండియా సమ్మిట్‌లో పోర్టు ఏకంగా రూ.26 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందన్నారు. తద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న 8 నెలల్లో విశాఖ–రాయపూర్ సాగరమాల ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పోర్టు చైర్మన్ రామ్మోహన్రావు, డిప్యూటీ చైర్మన్ దూబె పాల్గొన్నారు. -
విశాఖపట్నం: నేడు క్రూయిజ్ టెర్మినల్ పనులకు శంకుస్థాపన
దొండపర్తి (విశాఖ దక్షిణ): అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేందుకు విశాఖ పోర్టులో చేపట్టిన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ అభివృద్ధి పనులకు కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలరవాణా శాఖ సహాయ మంత్రి శాంతాను ఠాగూర్ శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం మంత్రి గురువారం సాయంత్రం విశాఖకు చేరుకున్నారు. పర్యటనలో భాగంగా మంత్రి శుక్రవారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. క్రూయిజ్ టెర్మినల్ అభివృద్ధి పనులుతో పాటు ఓఆర్ఎస్ జెట్టీ మరమ్మతు పనులు, కవర్డ్ స్టోరేజ్ యార్డ్ నిర్మాణ పనులు, ఐఎన్ఎస్ డేగ వద్ద ట్రక్కు పార్కింగ్ టెర్మినల్ పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి పర్యటనలో ఆయన వెంట పోర్ట్ చైర్మన్ రామమోహనరావు, ఇతర అధికారులు పాల్గొననున్నారు. -
పడవలో మూడు ముళ్లు, ఏడు అడుగులు
వెబ్‌డెస్క్ : వివాహ వ్యవస్థకు అత్యంత గౌరవం ఇచ్చే సమాజం మనది. అందుకే పెళ్లికి సంబంధించిన ప్రతీ అంశానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి వేడుకలు నిర్వహించడంపై ఎంతో దృష్టి పెడతారు. కేపీఎంజీ సంస్థ 2017లో రూపొందించిన నివేదిక ప్రకారం ఇండియాలో పెళ్లి వేడుకలపై ఏడాదికి ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారని చెప్పింది. పెళ్లిని ఘనంగా నిర్వహించడంలో అమెరికరా తర్వాత స్థానం ఇండియన్లదే. న్యూ బిజినెస్ అయితే కరోనా తర్వాత పెళ్లి వేడుకల్లో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్ రూల్స్, సోషల్ డిస్టెన్సింగ్‌తో స్వంతూరిలో ఘనంగా పెళ్లి నిర్వహించడం కష్టంగా మారింది. డెస్టినేషన్ వెడ్డింగ్‌కి ఇంచుమించ ఇవే తిప్పలు ఎదురువుతున్నాయి. ఈ తరుణంలో ఒక్కసారిగా క్రూయిజ్ వెడ్డింగ్‌కి డిమాండ్ పెరిగింది. రెండేళ్ల క్రితం అక్కడక్కడ మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. రాబోయే కార్తీక మాసంలో పెళ్లిళ్లలకు సంబంధించి ఇప్పటికే వెయిటింగ్ లిస్టు ఉందంటున్నారు క్రూయిజ్ వెడ్డింగ్ ఈవెంట్ నిర్వహకులు. రాబోయే రోజుల్లో ఈ రంగంలో వ్యాపార అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. చదవండి : Tesla: భారత్‌లో రయ్..రయ్ : వైరల్ వీడియో -
కడలిపై.. హాయి హాయిగా..
విశాఖ నగర సిగలో మరో పర్యాటక మణిహారం చేరనుంది. విదేశీ పర్యాటకులు వాహ్వా అనేలా.. స్వదేశీయులకు విదేశీ విహారం కల్పించే అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణానికి ముందడుగు పడింది. విశాఖ పోర్టు ట్రస్ట్, పర్యాటక శాఖ సంయుక్తంగా నిర్మించే ఈ టెర్మినల్ వచ్చే ఏడాది చివరికల్లా అందుబాటులోకి రానుంది. పోర్టులోని జనరల్ కార్గో టెర్మినల్ పక్కనే 10 ఎకరాల విస్తీర్ణంలో సముద్ర విహార కేంద్రం సిద్ధమవనుంది. సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయ పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రతి మేజర్ పోర్టులో క్రూయిజ్ టెర్మినల్ ఏర్పాటు చేయాలని మూడేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు దేశంలోని వివిధ ప్రధాన పోర్టుల్లో క్రూయిజ్ టెరి్మనల్‌కు సంబంధించిన ప్రాజెక్టు పట్టాలెక్కింది. విశాఖలో గతేడాది క్రూయిజ్ ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ప్రపంచంలో అందాలన్నీ ఓచోట చేరిస్తే విశాఖగా మారిందన్నట్లుగా.. దేశానికి వచ్చే ప్రతి 10 మంది పర్యాటకుల్లో ముగ్గురు ఈ నగరాన్ని సందర్శిస్తుంటారు. విదేశీ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న విశాఖ నగరం.. మరింత ఆకర్షణీయంగా మారేందుకు క్రూయిజ్ టెరి్మనల్ దోహదపడనుంది. అంతర్జాతీయ పర్యాటకులు పెరగాలంటే విహారనౌకల రాకపోకలు జరగాల్సిందే. దేశంలో ఇప్పటికే ముంబయి, కొచ్చి, చెన్నై, మంగుళూరు పోర్టుల్లో క్రూయిజ్ టెర్మినల్స్ ఏర్పాటయ్యాయి. అక్కడ నుంచి నౌకలు రాకపోకలు సాగిస్తుండటంతో అక్కడ టూరిజం బాగా వృద్ధి చెందింది. విశాఖలోనే అదే రీతిలో అభివృద్ధి చేసేందుకు విశాఖ పోర్టు ట్రస్టు అడుగులు వేసింది. రూ.77కోట్లతో నిర్మాణం తూర్పు తీరంలో ఎక్కడా క్రూయిజ్ టెరి్మనల్స్ లేవు. కోస్తా తీరంలో కీలక పర్యాటక స్థావరమైన విశాఖలో ఏర్పాటైతే పర్యాటకం పరుగులు పెట్టనుంది. ఈ మేరకు దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధమయ్యాయి. విశాఖపట్నం పోర్టు ట్రస్టు ఎంట్రన్స్ చానెల్, కంటైనర్ టెరి్మనల్ మధ్యలోని జనరల్ బెర్త్ పక్కనే ఈ టెరి్మనల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి రూ.77 కోట్లు ఖర్చవుతుందని నిర్ధారించారు. ఇందులో 50 శాతం నిధులను కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ, మరో 50 శాతం టూరిజం శాఖ కేటాయించనుంది. దీనికి సంబంధించి ఎని్వరాన్మెంటల్ ఇంపాక్ట్ ఎసెస్మెంట్(ఈఐఏ)కూడా పూర్తయ్యాయి. 2021 నాటికి అందుబాటులోకి వస్తుంది అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేందుకు పోర్టులో క్రూయిజ్ టెర్మినల్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. మరికొద్ది నెలల్లో దీనికి సంబంధించిన పరిపాలన భవనాన్ని సిద్ధం చేస్తాం. 2021 చివరికల్లా అంతర్జాతీయ క్రూయిజ్ టెరి్మనల్ అందుబాటులోకి రానుంది. దీని వల్ల విశాఖ పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుంది. ఏపీ తీరంలో ఎక్కడా ఈ తరహా టెరి్మనల్స్ లేవు. విశాఖ ప్రజలకు సముద్రయానం అందుబాటులోకి రానుంది. – కె.రామ్మోహన్రావు, విశాఖ పోర్టు ట్రస్టు చైర్మన్ 180 మీటర్ల పొడవైన బెర్త్ అంతర్జాతీయ పర్యాటకులు క్రూయిజ్‌లో వచ్చి.. నగరంలో పర్యటించే వి«ధంగా వివిధ ఏర్పాట్లు చేయనున్నారు. టెరి్మనల్ నిర్మాణంలో అనేక సౌకర్యాలు కలి్పంచనున్నారు. 10 ఎకరాల విస్తీర్ణంలో దీని నిర్మాణం జరగనుంది. 180 మీటర్ల పొడవైన క్రూయిజ్ బెర్త్ నిర్మించనున్నారు. ఈ విశాలమైన బెర్త్‌ను రెండు విధాలుగా వినియోగించుకోనున్నారు. క్రూయిజ్ రాని సమయంలో సరకు రవాణా చేసే కార్గో నౌకలను కూడా బెర్త్‌పైకి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. క్రూయిజ్‌లో వచ్చే ఇంటర్నేషనల్ టూరిస్టుల చెకింగ్ కోసం ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ కార్యాలయాలతో పాటు పర్యాటకులు సేదతీరేందుకు పర్యాటక భవన్‌ను నిర్మిస్తున్నారు. దీనికి తోడుగా పరిపాలన భవనం, కరెన్సీ మారి్పడి కౌంటర్లు, విశ్రాంతి గదులు, టూరిజం ఆపరేటర్స్ కౌంటర్లు కూడా నిర్మాణం కానున్నాయి. త్వరలోనే పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. -
కరోనా కాటేస్తోంది కాపాడరూ..!
-
కరోనా కాటేస్తోంది కాపాడరూ..!
టోక్యో : కరోనా వైరస్ కలకలం నేపథ్యంలో జపాన్ తీరంలో డైమండ్ ప్రిన్సెస్ నౌకలో చిక్కుకున్న భారత సిబ్బంది తమను కాపాడాలని భారత ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఈ నౌకలో ఇప్పటికే 135 కరోనా పాజిటివ్ కేసులను నిర్ధారించడంతో వారు ఆందోళనకు లోనవుతున్నారు. నౌకలో చిక్కుకున్న తమిళనాడులోని మధురైకి చెందిన అంబలగన్ తమను కాపాడాలని వేడుకుంటూ వీడియోలను షేర్ చేయడం వైరల్‌గా మారింది. ప్రయాణీకులను ఎక్కడికీ కదలకుండా ఉంచారని, వారు ఉన్న గదులకే ఆహారాన్ని పంపుతున్నారని వీడియోలో ఆయన చెప్పారు. తమకూ కరోనా వైరస్ సోకే ప్రమాదం పొంచిఉందని, తమను భారత ప్రభుత్వం కాపాడాలని సిబ్బంది తరపున అంబలగన్ వేడుకున్నారు. (చదవండి: ఇద్దరు భారతీయులకు కోవిడ్) నౌక సిబ్బందిలో పది మందికి వైరస్ సోకడంతో తాము ప్లేట్లను పంచుకుంటామని, సిబ్బందికి కేటాయించిన మెస్‌లో భోజనం చేస్తామని దీంతో తమకు సులభంగా వైరస్ సోకే ప్రమాదం ఉందని, తమను ఇక్కడ నుంచి భారత్‌కు తీసుకువెళ్లాలని అంబలగన్ అభ్యర్థించారు. మరో భారత సిబ్బంది వినయ్ కుమార్ సర్కార్ కూడా డైమండ్ ప్రిన్సెస్ నౌకలో చిక్కుకున్న భారత సిబ్బందిని వెనక్కిపిలిపించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ ఓ వీడియో రూపొందించారు. గతంలో పాక్ సేనల నుంచి ఐఏఎఫ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను కాపాడినట్లే తమనూ ఇక్కడి నుంచి రక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నౌకకు సంబంధించిన ప్రోటోకాల్స్ తమను వీడియో షేర్ చేసేందుకు అనుమతించకపోయినా అసలు తాము అప్పటివరకూ బతికిఉంటమనే నమ్మకం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సెస్ క్రూయిస్‌కు చెందిన డైమండ్ ప్రిన్సెస్‌లో 2,500 మందికి పైగా ప్రయాణికులు 1,000 మంది సిబ్బంది ఉన్నారు. ఫిబ్రవరి 4 నుంచి క్రూయిజ్ షిప్ జపాన్‌లోని యోకోహామా నౌకాశ్రయంలో నిలిచిపోయింది. చదవండి : రొయ్యకు ‘కోవిడ్’ దెబ్బ -
‘ఇదొక అందమైన, అరుదైన అనుభూతి’
ప్రతీ ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఓ మధుర ఙ్ఞాపకం. అలాంటి వేడుకను రొటీన్‌గా కాకుండా కాస్త ప్రత్యేకంగా చేసుకోవాలని కొందరు కోరుకుంటుంటారు. ముంబైకి చెందిన ప్రబీర్, సయాలీ కొర్రియాలు కూడా ఆ కోవకు చెందిన వారే. అందుకే ‘ఆంగ్రియా’ వేదికగా సముద్రం మధ్యలో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ‘ఇదొక అందమైన, అరుదైన అనుభూతి. ఇది నా కల. మొదటిసారిగా క్రూయిజ్‌లో ప్రయాణిస్తున్నా’ అంటూ వధువు సయాలీ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. భర్తతో కలిసి కేక్ కట్‌చేసి తియ్యని వేడుక చేసుకున్నారు. ఆంగ్రియా.. ది క్రూయిజ్! భారత తొలి లగ్జరీ క్రూయిజ్ షిప్ పేరే ఆంగ్రియా. ముంబై నుంచి గోవాల మధ్య ప్రయాణించే ఈ తొలి దేశీయ నౌక వేదికగా.. ‘సముద్రంలో అరుదైన అనుభూతితో ఓ జంట ఒక్కటైంది. ఇలా పెళ్లి వేడుకకు ఆంగ్రియా వేదిక కావడం చాలా సంతోషంగా ఉంది. నౌక కెప్టెన్‌గా నాకు పెళ్లి నిర్వహించే అవకాశం ఉంది’ అంటూ కెప్టెన్ ఇర్విన్ సీక్వెరియా ఆనందం వ్యక్తం చేశారు. పదిహేనేళ్ల కెరీర్లో 60 నౌకలకు కెప్టెన్‌గా వ్యవహరించిన తనకు ఇది కొత్త అనుభూతి అన్నారు. కాగా ఆంగ్రియా ఆరు డెక్‌లు, 104 క్యాబిన్లతో చాలా విశాలంగా ఉంటుంది. ఒకేసారి 399 మంది ప్యాసింజర్లను తీసుకువెళ్లగలదు. వర్షాకాలంలో తప్ప మిగతా అన్ని కాలాల్లో వారానికి నాలుగు సార్లు ఈ నౌక ముంబై- గోవాల మధ్య ప్రయాణిస్తుంది. టికెట్ ధర 7 నుంచి 12 వేల వరకు ఉంటుంది. -
ఇక మనదేశంలోనూ ఆ తరహా పెళ్లిళ్లు
ఆహ్లాదకరమైన వాతావరణంలో, జీవితాంతం గుర్తుండిపోయేలా తమ పెళ్లి వేడుక జరుపుకోవాలని అనుకోవడం మామూలే. కాసులకు వెరవకుండా.. నింగిపై.. నేలపై అంటూ విభిన్నంగా ఆలోచించే జంటలకు కూడా మన దేశంలో కొదవలేదు. ఈ ఆలోచనలనే మన ప్రభుత్వం క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. అందుకే నడి సముద్రంలో ముచ్చటగా మూడు ముళ్ల తంతును అత్యంత రొమాంటిక్‌గా జరిపించడానికి కేంద్రప్రభుత్వం ఆలోచిస్తోంది. కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. విదేశాల్లో కాసులు కురిపిస్తున్న ఈ తరహా పెళ్లిళ్లను త్వరలో మన దేశంలో కూడా పరిచయం చేయబోతున్నట్టు తెలిపారు. సముద్రంలో విహారానికి వినియోగించే విహార ఓడలను వివాహ వేదికలుగా అద్దెకు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, సముద్రంలోను, ఆకాశమార్గాన విహరించేందుకు సీ ప్లేన్ సేవలను కూడా ప్రారంభించనున్నామని వెల్లడించారు. నడి సముద్రంలో ఓడలపై కొత్త తరహా పెళ్లి వేదికలకు శ్రీకారం చుట్టునున్నామని ఆయన తెలిపారు. వీటి ఆమోదం కోసం పౌరవిమానయాన సంస్థ డైరెక్టర్ జనరల్‌కు పంపామన్నారు. దీంతోపాటు అదనంగా విందు, వినోదం లాంటి సకల సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. అంటే ఇక హిందూ మహాసముద్రంపైనో.. బంగాళాఖాతం నట్ట నడిమధ్యనో లేదా అరేబియా సముద్రంపైనో విలాసంగా వధూవరులు విహరించవచ్చన్నమాట. అయితే మొదట కొచ్చిన్ , చెన్నై, ముంబైలలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. పర్యాటక రంగానికి మరింత ఊతం ఇచ్చేందుకు వీలుగా షిప్పింగ్, పర్యాటకశాఖ సంయుక్త ఆధ్వర్యంలో కొత్త పర్యాటక విధానాలను రూపొందించనున్నట్టు తెలిపారు. భూమి మీద, నీటి మీద కూడా ల్యాండయ్యే విమానాలను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామన్నారు. ఫ్లోటింగ్ రెస్టారెంట్లు, సముద్ర విమానాల లాంటి సేవలతో పాటు ఈ క్రూయిజ్ పర్యాటక పెట్టుబడిలో ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు కూడా ప్రోత్సాహాన్ని ఇవ్వనున్నట్టు గడ్కరీ తెలిపారు. ఇప్పటికే 101 జలమార్గాలలో ఇలాంటి 25 విమానాలను నడిపేందుకు ప్రైవేట్ సంస్థ నుంచి ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే మెరుగ్గా 7,500 కి.మీ పొడవైన తీరప్రాంతం ఉన్నా.. భారతదేశంలో ఈ తరహా పర్యాటక అభివృద్ధి తక్కువగా ఉందన్నారు. అందుకే ఈ తరహా అభివృద్ధిపై దృష్టి పెట్టామన్నారు.