వారణాసిలో తొలి హైడ్రోజన్‌ క్రూయిజ్‌ | Varanasi Country First AC Hydrogen Cruise | Sakshi
Sakshi News home page

వారణాసిలో తొలి హైడ్రోజన్‌ క్రూయిజ్‌

Published Mon, Jul 15 2024 1:08 PM | Last Updated on Mon, Jul 15 2024 1:23 PM

Varanasi Country First AC Hydrogen Cruise

ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో దేశంలోనే తొలి హైడ్రోజన్ క్రూయిజ్‌ను నడపనున్నారు. ఈ క్రూయిజ్ ఆదివారం అర్థరాత్రి వారణాసికి చేరుకుంది. మొదట ఈ హైడ్రోజన్ క్రూయిజ్‌ను నమో ఘాట్‌కు తీసుకువచ్చి, తరువాత రామ్‌నగర్‌లోని మల్టీమోడల్ టెర్మినల్‌కు తరలించారు. ఈ క్రూయిజ్ కొచ్చిలోని షిప్‌యార్డ్‌లో అనేక సౌకర్యాలతో నిర్మితమయ్యింది.

ఈ క్రూయిజ్‌లో 50 మంది ప్రయాణికులు కూర్చునేందుకు అవకాశం ఉంది. కాలుష్యాన్ని ఉత్పత్తి చేయకుండా గంగానదిలో నడిచే తొలి క్రూయిజ్‌ ఇది. ఈ క్రూయిజ్ వారణాసి- చునార్ మధ్య నడుస్తుంది. దీనిని పర్యాటక శాఖ పర్యవేక్షించనుంది.

ఈ క్రూయిజ్‌ నిర్వహణ కోసం వారణాసిలోని రామ్‌నగర్ మల్టీ మోడల్ టెర్మినల్‌లో తాత్కాలిక హైడ్రోజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. హైడ్రోజన్ శక్తితో నడిచే ఈ క్రూయిజ్‌లో ఎలక్ట్రిక్ ఇంజన్ కూడా అమర్చారు. తద్వారా హైడ్రోజన్ ఇంధనం తగ్గినప్పుడు, క్రూయిజ్‌ను  ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో నడపవచ్చు. వారణాసి తర్వాత అయోధ్య, మథురలలో కూడా ఈ క్రూయిజ్‌ను నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement