
ఎప్పుడైనా జనాభా విషయమై విస్తృత ప్రస్తావనకు వస్తే రెండు వాదనలు వినిపిస్తుంటాయి. వాటిలో ఒకటి.. అధిక జనాభా సమస్యగా మారుతున్న దేశాలు. మరొకటి తగ్గుతున్న జనాభా సంఖ్య కారణంగా జనన రేటును పెంచుకోవాలనుకుంటున్న దేశాలు.
ఏ దేశంలోనైనా వృద్ధుల జనాభా అధికంగా ఉంటే ఆ దేశంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. వాటిని పరిష్కరించడం ఆయా ప్రభుత్వాలకు సమస్యగా మారుతుంది. అయితే ఇప్పుడు మనం ప్రపంచంలోని అతి పిన్న వయస్కుల జనాభా కలిగిన దేశం గురించి తెలుసుకుందాం. ఆ దేశంలో జనాభాలో సగం మంది 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మరోవైపు ఆఫ్రికన్ దేశాలలో నెలకొన్న పేదరికం, వనరుల కొరత కారణంగా అక్కడి ప్రజల ఆయుర్దాయం అంతకంతకూ తగ్గుతోంది. ఫలితంగా అక్కడి ప్రజల సగటు వయస్సు క్షీణిస్తోంది.
ఇక అత్యంత పిన్న వయస్కుల జనాభా కలిగిన దేశాల విషయానికొస్తే ఆఫ్రికన్ దేశమైన నైజర్ ఈ జాబితాలో ముందువరుసలో ఉంటుంది. ఐక్యరాజ్యసమితి అందించిన డేటా ప్రకారం ఈ దేశంలోని ప్రజల సగటు వయస్సు 14.8 ఏళ్లు. ఈ జనాభాలో సగం మంది 15 ఏళ్ల కంటే తక్కువ వయస్సు గలవారేకావడం విశేషం. పేదరికం, వనరుల కొరత కారణంగా ఇక్కడ జనన రేటు చాలా ఎక్కువగా ఉంది. నైజర్‌లో సగటు జనన రేటు ప్రతి స్త్రీకి 7.6 మంది పిల్లలు. ప్రపంచ సంఖ్య 2.5 అయితే. ఇక్కడ ఆయుర్దాయం దాదాపు 58 ఏళ్లు.
యువ జనాభా పరంగా నైజర్ ముందు వరుసలో ఉంది. అయితే పెరుగుతున్న యువత జనాభా ఈ దేశానికి సమస్యగా మారింది. నైజర్ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటంతో దేశంలో విద్యా సౌకర్యాలు, ప్రాథమిక అవసరాలు యువతకు అందడం లేదు. ఈ కారణంగా, ఇక్కడ పేదరికం, బాల్యవివాహాలు తదితర సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ప్రపంచ బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం పేద దేశాలలో అధిక సంతానోత్పత్తి రేట్లు కూడా ఆరోగ్య సమస్యలను సృష్టిస్తున్నాయి.
ఆఫ్రికాలో పిన్న వయస్కుల జనాభా కలిగిన దేశం నైజర్ ఒక్కటి మాత్రమే కాదు. ఉగాండా, అంగోలాలలో కూడా పిన్న వయస్కుల జనాభా అధికంగా ఉంది. ఈ రెండు దేశాలలో యువత సగటు వయస్సు 16 సంవత్సరాలు. మధ్యప్రాచ్యంలోని పాలస్తీనా, యెమెన్, ఇరాక్‌లలో యువత సగటు వయస్సు దాదాపు 22 ఏళ్లు. దీని తరువాత ఆఫ్ఘనిస్తాన్ 20 ఏళ్లు, తైమూర్-లెస్టే 20.6 ఏళ్లు, పాపువా న్యూ గినియాలో యువత సగటు వయస్సు 21.7 ఏళ్లుగా ఉంది.
ఇది కూడా చదవండి: Delhi Election 2025: ప్రచారంలో మూమూస్ రుచిచూసిన కేజ్రీవాల్
Comments
Please login to add a commentAdd a comment