ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ వందల కొద్దీ నదులు ప్రవహిస్తున్నాయి. వీటిలో కొన్ని నదుల నీరు శుభ్రంగా ఉంటుంది. మరికొన్ని నదుల నీరు మురికిగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం బొగ్గుకన్నా నల్లగా ఉండే నది గురించి తెలుసుకుందాం. ఇది ప్రపంచంలోనే అత్యంత నల్లని నదిగా పేరొందింది.
ఈ నదిలో బొగ్గు కన్నా నల్లటి నీరు ప్రవహించడం వెనుకగల కారణం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఆఫ్రికా దేశమైన కాంగోలో రుకీ అనే నది ప్రవహిస్తుంటుంది. ఈ నదిలోని నీరు నల్లగా కనిపించడానికి కారణం.. ఆ నీటిలో కరిగిన సేంద్రియ పదార్థమేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. డెయిలీ మెయిల్ తెలిపిన వివరాల ప్రకారం.. రుకీ నదిలోని నీటితో కనీసం చేతులు కడుక్కునేందుకు కూడా ఎవరూ ఇష్టపడరు.
ఈటీహెచ్ జ్యూరిచ్ పరిశోధకులు ఈ నదికి సంబంధించిన తమ శాస్త్రీయ అధ్యయనాన్ని ప్రపంచానికి అందించారు. నదిలోని నీటికి నలుపు రంగు రావడానికి కారణం వర్షారణ్యం నుండి సేంద్రియ పదార్థాలు వచ్చి, ఈ నీటిలో కలవడమేనని నిపుణులు చెబుతున్నారు. కాగా ఆఫ్రికన్ దేశమైన కాంగోలో స్విట్జర్లాండ్ కంటే నాలుగు రెట్లు అధికమైన డ్రైనేజీ బేసిన్ ఉంది. దీనిలో కుళ్ళిన చెట్లు, మొక్కల నుండి వచ్చే కార్బన్ సమ్మేళనాలు పేరుకుపోతున్నాయి. ఇవి వర్షాలు, వరదల కారణంగా నదులలోకి చేరుకుంటున్నాయి.
నీటిలో కరిగిన ఇటువంటి కార్బన్ సమ్మేళనాల సాంద్రత అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది డార్క్ టీ మాదిరిగా కనిపిస్తుంది. దీనికితోడు రుకీ నది.. అమెజాన్ రియో నెగ్రా కంటే 1.5 రెట్లు లోతుగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నల్ల నీటి నదిగా పేరొందింది. రుకీ బేసిన్ దిగువన పెద్ద మొత్తంలో పీట్ బోగ్ మట్టి ఉంది. కాంగో బేసిన్‌లోని పీట్ బోగ్‌లలో సుమారు 29 బిలియన్ టన్నుల కార్బన్ ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: యురేనస్ మీద ఐదు సెకెన్లు ఉండగలిగితే? వజ్రాల వానలో తడుస్తామా?
Comments
Please login to add a commentAdd a comment