Congo
-
Disease X: ఆ ప్రాణాంతక మహమ్మారి ఇదేనా?
అంతుచిక్కని వ్యాధి మధ్య ఆఫ్రికా దేశం కాంగోను వణికిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందో ఇప్పటిదాకా ఓ అంచనాకి రాలేకపోయింది. ఇప్పటిదాకా ఈ వ్యాధి బారినపడి 31 మంది చనిపోగా.. అందులో పిల్లలే ఎక్కువమంది ఉండడం ఆందోళనకు గురి చేస్తోంది. ఫ్లూ తరహాలో విజృంభిస్తూ.. శ్వాసకోశ సమస్యలతో మరణాలకు కారణమవుతోందని ఈ వ్యాధిపై వైద్య నిపుణులు ఓ అంచనాకు వచ్చారు.మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టికి ఈ అంతుచిక్కని వ్యాధి విషయం చేరింది. నవంబర్ 29వ తేదీన కాంగో ఆరోగ్య శాఖ.. డబ్ల్యూహెచ్‌వోకి ఈ వ్యాధి గురించి నివేదిక ఇచ్చింది. ఇప్పటికే దర్యాప్తు నడుస్తోంది. దర్యాప్తులో ఆఫ్రికా సీడీసీ(వ్యాధుల నియంత్రణ &నిర్మూలన) కూడా భాగమైంది. అయితే ఇన్నిరోజులు గడిచినా వ్యాప్తికి గల కారణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటిదాకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీంతో ఈ వ్యాధిని డిసీజ్ (Disease X)గా పరిగణిస్తున్నారు.ఏమిటీ డిసీజ్ ఎక్స్కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా మరో మహమ్మారి విజృంభణ ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ గత కొంతకాలంగా అంచనా వేస్తోంది. శరవేగంగా వ్యాపిస్తూ మనుషులకు ప్రాణాంతకంగా(హైరిస్క్ రేటు) మారవచ్చని అభిప్రాయపడుతోంది. ఈ క్రమంలోనే ఆ ముందస్తు మహమ్మారికి ‘డిసీజ్ ఎక్స్’గా నామకరణం చేసింది. ఆపై దానిని ఎబోలా, జికా వైరస్ సరసన జాబితాలో చేర్చింది.అయితే.. డిసీజ్ ఎక్స్‌కు ఏ వైరస్ కారణం కావొచ్చనే దానిపై డబ్ల్యూహెచ్‌వో ఇప్పటిదాకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ, కోవిడ్ తరహాలోనే శ్వాసకోశ సంబంధమైనదే అయ్యి ఉండొచ్చని మాత్రం నిపుణులు అంచనా వేస్తున్నారు.సంబంధిత వార్త: డిసీజ్ ఎక్స్ ప్రభావం కరోనా కంటే ఎన్ని రేట్లంటే..ఆలోపు వ్యాక్సిన్ సిద్ధం!డిసీజ్ ఎక్స్‌పై ఓవైపు ఆందోళనలు నెలకొంటున్న వేళ.. మరోవైపు వ్యాక్సిన్‌ను తయారు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆక్స్‌ఫర్ట్ యూనివర్సిటీ కోవిడ్-19 వ్యాక్సిన్‌లోనే మార్పులు చేస్తోందని తెలుస్తోంది. అలాగే.. భవిష్యత్తులో రాబోయే మహమ్మారి కోసం మరిన్ని వ్యాక్సిన్లను సిద్ధం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.కాంగోలో విజృంభిస్తోంది ఏంటి?మారుమూల కువాంగో(Kwango) నుంచి అంతుచిక్కని వ్యాధి విజృంభణ మొదలైందని ఆ దేశ ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటిదాకా 406 కేసులు నమోదుకాగా.. 31 మంది చనిపోయారు. మృతుల్లో పిల్లలు ఎక్కువగా ఉన్నారు. అయితే పాతికేళ్లలోపు వాళ్లలోనే లక్షణాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. అయితే ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందో అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కాంగో కొత్త వ్యాధి లక్షణాలుజ్వరంతలనొప్పిదగ్గు,జలుబుఒళ్లు నొప్పులుఅయితే.. కాంగోలో అంతుచిక్కని వ్యాధి రికార్డుల్లోని తీవ్రస్థాయిలో కేసులను పరిశీలించిన డబ్ల్యూహెచ్‌వో నిపుణుల బృందం.. పౌష్టికాహార లోపాన్ని గుర్తించినట్లు చెబుతోంది. చనిపోతున్నవాళ్లలో శ్వాసకోశ ఇబ్బందులు, రక్తహీనత సమస్యలను గుర్తించినట్లు వెల్లడించింది. అలాగే వ్యాధి వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల్లో ఆహార కొరత, తక్కువ వ్యాక్సినేషన్ నమోదు, పరీక్షలకు.. వైద్యానికి సరైన వసతులు లేకపోవడం కూడా గుర్తించినట్లు ఓ నివేదిక ఇచ్చింది. అయితే కాంగోలో విజృంభిస్తోందని డిసీజ్ ఎక్స్ యేనా? దాని తీవ్రత ఏంటి? వ్యాప్తి రేటు తదితర అంశాలపై ల్యాబోరేటరీ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని, ఆ తర్వాతనే(అదీ దశలవారీగా) ఈ వ్యాధి విజృంభణకు గల కారణాలపై కచ్చితమైన నిర్దారణకు రాగలమని ఆ బృందం స్పష్టత ఇచ్చింది. -
కాంగోలో 37 మందికి మరణ శిక్ష
కిన్షాసా: ఆఫ్రికా దేశం కాంగోలో మే నెలలో జరిగిన విఫల తిరుగుబాటు యత్నం ఘటన లో పాలుపంచుకున్న ఆరోపణలపై అక్కడి కోర్టు ఏకంగా 37 మందికి మరణ దండన విధించింది. దోషుల్లో అమెరికాకు చెందిన ముగ్గురు, బెల్జియం, కెనడా, యూకేలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. అప్పీల్ చేసుకునేందుకు వీరికి కోర్టు ఐదు రోజుల గడువిచ్చింది. తిరుగుబాటుకు పాలుపంచుకున్నారంటూ మొత్తం 50 మందిపై ఆర్మీ అభియోగాలు మోపింది. కోర్టు వీరిలో 14 మందిని నిర్దో షులుగా పేర్కొంటూ విడుదల చేసింది. కో ర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తామని ఆరుగురు విదేశీయుల తరఫు లాయర్ తెలిపారు. -
పరారీకి యత్నం.. 129 మంది ఖైదీలు మృతి
కిన్సాసా: డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని సెంట్రల్ మకాల జైలులో విషాద ఘటన జరిగింది. జైలులో నుంచి పారిపోయేందుకు ప్రయత్నించి 129 మంది ఖైదీలు మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని కాంగో అంతర్గత వ్యవహారాల మంత్రి షబానిలుకో మంగళవారం(సెప్టెంబర్3) ఎక్స్(ట్విటర్)లో తెలిపారు.ఖైదీల్లో 24 మంది మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయినట్లు మంత్రి తెలిపారు. మకాల జైలు నుంచి తప్పించుకొనేందుకు ఖైదీలు ప్రయత్నించారని, దీంతో గార్డులు అప్రమత్తమై రంగంలోకి దిగడంతో జైలులో తొక్కిసలాట జరిగిందని చెప్పారు. తొక్కిసలాటకు తోడు జైలు కిచెన్‌లో చెలరేగిన మంటల్లో మొత్తం 129 మంది మరణించారు. మరో 59 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఖైదీలు ఎవరూ తప్పించుకోలేదని.. తప్పించుకొనేందుకు ప్రయత్నించినవారు మరణించారని జైలు అధికారులు చెప్పారు. జైలు నుంచి కాల్పుల శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు కొందరు చెబుతున్నారు. -
మాయరోగం... మరోసారి!
అవును... మళ్ళీ మరో మాయరోగం బయటకొచ్చింది. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మంకీపాక్స్ (ఎంపాక్స్) తాజాగా విజృంభించింది. స్వీడన్ నుంచి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ దాకా అనేక ప్రాంతాలకు విస్తరించింది. ఫలితంగా, ప్రపంచం మరోసారి ఉలిక్కిపడింది. దీన్ని ఆందోళన చెందా ల్సిన అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా రెండేళ్ళలోనే రెండోసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించాల్సొచ్చింది. భారత్ సైతం ఎయిర్‌పోర్ట్‌లు, ఆస్పత్రుల్ని అప్రమత్తం చేసి, కాంగో సహా మధ్య ఆఫ్రికా దేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల ఆరోగ్యంపై కన్నేసింది. మాస్కుల ధారణ, చేతుల పరిశుభ్రత, గుంపుల్లో తిరగకపోవడం లాంటి ముందుజాగ్రత్తలే శ్రీరామ రక్ష అని మంకీపాక్స్ మరోసారి గుర్తుతెచ్చింది. తరచూ తలెత్తుతున్న ఈ వైరస్ల రీత్యా ఔషధ పరి శోధన, ఆరోగ్య వసతుల కల్పనపై మరింత పెట్టుబడి పెట్టాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పింది. ప్రపంచంపై ఎంపాక్స్ పంజా విసరడం ఇప్పటికిది మూడోసారి. అసలు 15 నెలల పైచిలుకు క్రితం ఇది ఇక ఆందోళన చెందాల్సినది కాదని డబ్ల్యూహెచ్ఓ తేల్చింది. తీరా ఇటీవల కొద్ది వారాలుగా వైరస్ పునర్ విజృంభణతో ఆగస్ట్ 14న మరోసారి అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సి వచ్చింది. దీనికి కారణం లేకపోలేదు.2023 సెప్టెంబర్ నుంచి కేసులు పెరుగుతున్నాయి. పైగా గతంలో 2022–23లో ప్రపంచాన్ని చుట్టుముట్టినప్పటితో పోలిస్తే, ఈసారి జన్యుపరంగా విభిన్నమైన వైరస్ (క్లాడ్ 1బి వేరియంట్) దీనికి కారణమవుతోంది. ఈ సాంక్రమిక వ్యాధి గతంలో ఒకరి నుంచి మరొకరికి లైంగిక సంపర్కం ద్వారానే వ్యాపించేది. కొత్త వేరియంట్ ఇప్పుడు రోగితో స్పర్శ, దగ్గరగా మాట్లాడడం, రోగి వాడిన దుస్తులు, దుప్పట్లు వాడడం ద్వారా కూడా వ్యాపిస్తున్నట్టు నిపుణుల మాట. మరణాల రేటూ మునుపటి కన్నా పెరిగింది. ఈ ఒక్క ఏడాదే 116కి పైగా దేశాల్లో 15,600కి పైగా కేసులు నమోదయ్యాయి. 500 పైచిలుకు మంది ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్రికాలో నిరుటితో పోలిస్తే ఇప్పుడు మరణాలు 160 శాతం పెరిగాయి. ప్రపంచంలో దాదాపు 70 లక్షల మందికి పైగా మరణానికి కారణమైన కోవిడ్ లానే మంకీపాక్స్‌కూ జనం భయపడుతున్నది అందుకే!ఏడాది ౖక్రితం అత్యవసర పరిస్థితిని ఎత్తివేసినప్పుడే ఎంపాక్స్‌పై దీర్ఘకాలిక నిఘా, నియంత్రణ ప్రణాళికలు అవసరమని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ వ్యాధి సాంక్రమిక రోగ విజ్ఞానంపై ఇంకా పూర్తిగా అవగాహన లేదంటూ ప్రజారోగ్య నిపుణులు, వైరస్ శాస్త్రవేత్తలు సైతం హెచ్చరించారు. అయినా సరే ఈ రోగాన్ని కనిపెట్టే పరీక్షల్ని మెరుగుపరచడం, టీకాలు – యాంటీ వైరల్ మందులకు సంబంధించి క్లినికల్ పరీక్షలపై దృష్టి పెట్టడం, టీకాల తయారీని విస్తరించడం లాంటి చర్యలేవీ ఆచరణలో పెట్టలేదు. ఈ అంతర్జాతీయ నిర్లక్ష్యమే ఇప్పుడు శాపమైంది. ఇవాళ్టికీ మంకీపాక్స్‌కు టీకాల సరఫరా పరిమితం. నియంత్రణకు కోటి డోసుల అవసరం ఉంటే, 2.1 లక్షల డోసులే తక్షణం అందుబాటులో ఉన్నాయట. డోసులు దానం చేస్తామని యూరోపియన్ యూనియన్, అమెరికాలు వాగ్దానం చేశాయి కానీ, వ్యాక్సిన్లపై ఇప్పటికీ కొన్ని అధికాదాయ దేశాల గుత్తాధిపత్యమే సాగుతోంది. అత్యవసరంలో ఉన్న అనేక దేశాలకు అది పెద్ద దెబ్బ. ఆఫ్రికాలో అవసరమున్నా యూరోపియన్ దేశాల్లోనే టీకాలను మోహరించడమే అందుకు ఉదాహరణ. కోవిడ్ కాలంలో లానే ఇప్పుడూ పేదదేశాలకు సాంకేతికత బదలాయింపు జరగట్లేదు. టీకాలకై పెనగులాట తప్పట్లేదు. మహమ్మా రుల కట్టడికి ఒక సమానత్వ ఒప్పందంపై ప్రపంచ దేశాలు విఫలమైతే దెబ్బతినేది ప్రజారోగ్యమే!మన దేశంలోనూ ఈ ఏడాది మంకీపాక్స్ కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులేవీ లేవనీ, మన దగ్గర ఇది పెద్దయెత్తున రాకపోవచ్చనీ అంచనా. అయినా అప్రమత్తత తప్పదు. కేంద్రం ఇప్పటికే ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిపి, చర్యలు ప్రారంభించింది. రోగ నిర్ధారణ వసతు లతో పాటు, ఆరోగ్య బృందాల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తోంది. అక్కడితో ఆగకుండా ప్రజల్లో చైతన్యం కల్పించాలి. రాష్ట్రాలతో అన్ని రకాల కీలక సమాచారాన్ని పంచుకోవాలి. నిజానికి, ఇలాంటి వైరస్ల విజృంభణ వేళ వ్యవహరించాల్సిన తీరుపై కోవిడ్ విలువైన పాఠాలే నేర్పింది. ఇన్ఫెక్షన్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. అలాగే, కేసుల వివరాలను సమగ్రంగా నమోదు చేయాలి. ప్రాథమిక అంశాలే అనిపించినా, ఇవే అతి ముఖ్యం. కోవిడ్‌లో లాగా కాక ఈసారైనా రోగ నిర్ధారణ కిట్లు, టీకాలు వర్ధమాన దేశాలకు సక్రమంగా చేరితేనే ఉపయోగం. సరిహద్దులు దాటి సులభంగా విస్తరించే ఇలాంటి మాయదారి రోగాలను కట్టడి చేయాలంటే అన్నిచోట్లా సమస్థాయిలో ప్రయత్నాలు జరగడం కీలకం. వ్యాధి సోకిన, సోకే అవకాశం ఉన్న వర్గాలన్నిటికీ టీకాలు అందుబాటులో ఉంచి, సంరక్షణ చేపట్టేలా ఆర్థిక, విధానపరమైన అండదండలు కావాలి. సత్వర, కీలక చర్యలు చేపట్టడమే ముఖ్యమనేది కోవిడ్ నేర్పింది. అందులోనూ ఇలాంటి మాయరోగాలకు ముకుతాడు వేయాలంటే, తొలి 100 రోజుల్లోని ఆచరణే అతి ముఖ్యం. ఎప్పటికప్పుడు స్వరూప స్వభావాల్ని మార్చుకుంటున్న ఎంపాక్స్ ఆఫ్రికా సమస్య, కేసులు బయట పడ్డ కొన్ని దేశాల తలనొప్పి అనుకుంటే పొరపాటు. ఇది ప్రపంచానికే ముప్పు అని ముందు గుర్తించాలి. ‘ఇది మరో కరోనా కాదు’ అంటూ డబ్ల్యూహెచ్ఓ అంటున్నా, వైరస్ విజృంభణ ధోరణులు భయపెడుతున్నాయి. టీకాలు, చికిత్సలు లేకుండా ఆఫ్రికా దేశాలను వాటి ఖర్మానికి వదిలేయడం దుస్సహం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ సమన్వయంతో కట్టడికి కృషి చేయాలి. అత్యవసర ఆరోగ్య పరిస్థితి అని ప్రకటించడంలోని అసలు ఉద్దేశం అదే! జంతుజాల వైరస్లు పదే పదే ఎందుకు తలెత్తుతున్నాయో దృష్టి పెట్టాల్సి ఉంది. విస్మరిస్తే మనకే కష్టం, నష్టం. పారాహుషార్! -
Mpox Virus: హడలెత్తిస్తున్న మంకీపాక్స్
మధ్య ఆఫ్రికా దేశం డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎంపాక్స్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోందని ఆ దేశ ఆరోగ్య మంత్రి శామ్యూల్-రోజర్ కంబా తెలిపారు. కేసులు పెరగుతున్న క్రమంలో అమెరికా, జపాన్ నుంచి వచ్చే వ్యాక్సిన్ల కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘మేము ఖండాంతర అత్యవసర పరిస్థితి గురించి మాట్లాడుతున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపాక్స్‌ను ఎదుర్కోవడానికి టీకా కార్యక్రమాలను వేగవంతం చేయాలని ప్రభావిత దేశాలకు పిలుపునిచ్చింది’’ అని అన్నారు.స్వల్ప వ్యవధిలో పెరుగుతున్న కేసులుపై కాంగో ఆందోళన వ్యక్తం అవుతోంది. మరోవైపు.. కేసులు పెరుగుతున్న కాంగోకు 50 వేల టీకాలు పంపిస్తామని అమెరికా హామీ ఇచ్చింది. మరోదేశం జపాన్ కూడా 35 లక్షల టీకా డోసును కాంగో పంపిస్తామని పేర్కొంది. అయితే జపాన్ ప్రధానంగా ఈ టీకాలను చిన్నపిల్లలకు అందిస్తామని వెల్లడించినట్లు అధికారులు పేర్కొన్నారు. ‘‘35 లక్షల పిల్లలతో సహా 40 లక్షల మందికి టీకాలు వేయించాలని కాంగో యోచిస్తున్నాం. వచ్చే వారం నాటికి మేము పొందగలమని ఆశిస్తున్నాం. వ్యాక్సిన్ మా సమస్యలకు పరిష్కారం చూపుతుంది. మా వ్యూహాత్మక టీకా ప్రణాళిక సిద్ధంగా ఉంది. మేము వ్యాక్సిన్ల కోసం ఎదురు చూస్తున్నాము’’ అని కంబా తెలిపారు.కేంద్రం అలెర్ట్:ఎంపాక్స్‌పై భారత్ అప్రమత్తమైంది. ఎమర్జెన్సీ వార్డులను సిద్ధం చేయడం, విమానాశ్రయాల్లో తనిఖీలు చేయడంతో పాటు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. దద్దుర్లు ఉన్న రోగులను గుర్తించి ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆసుపత్రులను ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఢిల్లీలోని మూడు నోడల్ ఆసుపత్రులు సఫ్దర్‌జంగ్, లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజ్,రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ ఎంపిక చేసింది. అనుమానిత రోగులపై ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేసి అవసరమైన జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. విమానాశ్రయాలను కూడా అప్రమత్తం చేసింది.ఎంపాక్స్ లక్షణాలు..జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, అలసట, వాపుతో పాటు చీము నిండిన పొక్కులు ఎంపాక్స్ వైరస్ సోకిన వ్యక్తుల్లో సాధారణ లక్షణాలుగా కనిపిస్తాయి. ఈ పొక్కులు ముఖంపై మొదలై క్రమంగా శరీరమంతా విస్తరిస్తున్నాయి. సాధారణంగా ఈ పరిస్థితి రెండు నుంచి నాలుగు వారాలు ఉంటుంది. ఏ చికిత్స తీసుకోకున్నా అది తగ్గిపోతుంది కానీ.. ఆ తర్వాత దాని వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో అది ఏకంగా మరణానికీ దారితీస్తుండటం ఆందోళన కలిగించే అంశం. మరీ ముఖ్యంగా రోగనిరోధకశక్తి తక్కువ ఉండేవాళ్లు, అప్పటికే కొన్ని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ వైరస్ బారిన పడితే కోలుకోవడం కష్టంగా మారుతోందని వైద్యులు పేర్కొంటున్నారు.మంకీపాక్స్‌ను ఎంపాక్స్ అని కూడా అంటారు. 1958లో కోతులలో పాక్స్ లాంటి వ్యాధి వ్యాప్తి చెందినప్పుడు దీనిని తొలిసారిగా గుర్తించారు. ఇటీవలి మధ్య, పశ్చిమ ఆఫ్రికాలో సోకిన జంతువులతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్న వ్యక్తులలో ఎంపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. -
కాంగోలో హింసాకాండ.. తొమ్మిది మంది సైనికులతో పాటు 72 మంది మృతి
కాంగోలోని ఒక గ్రామంలో సాయుధ దుండగులు జరిపిన హింసాకాండలో తొమ్మిది మంది సైనికులతో పాటు 72 మంది సామాన్య పౌరులు మృతి చెందారు. కాంగో రాజధాని మిలీషియాకు సమీపంలో జరిగిన ఈ హింసాయుత దాడిలో 72 మంది మృతి చెందారని స్థానిక అధికారులు మీడియాకు తెలిపారు.కాంగోలో ఇటీవలి కాలంలో ప్రత్యర్థి వర్గాల మధ్య హింస తీవ్రమైంది. రాజధాని కిన్షాసాకు తూర్పున 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిన్సాలే గ్రామంలో ఈ హింసాయుత ఘటన చోటుచేసుకుంది. కిన్సాలే క్వేమౌత్ ప్రాంతంలో టెకే- యాకా కమ్యూనిటీల మధ్య రెండేళ్లుగా ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా వందలాది మంది పౌరులు బలి అవుతున్నారు. దాడికి పాల్పడుతున్న వారు మొబోండో మిలీషియా సభ్యులని తెలుస్తోంది. వీరు యాకా వర్గంలోని ప్రజలను రక్షించేవారిగా పేరొందారు.క్వామౌత్ ఏరియా ప్రావిన్షియల్ అధికారి డేవిడ్ బిసాకా మీడియాతో మాట్లాడుతూ వారం రోజుల వ్యవధిలో రెండోసారి మిలీషియాను తరిమికొట్టడంలో సైన్యం విజయవంతమైందన్నారు. 2024 ఏప్రిల్‌లో కాంగో అధ్యక్షుడు ఫెలిక్స్ షిసెకెడి సమక్షంలో కాల్పుల విరమణపై ఒప్పందం జరిగినప్పటికీ, ఈ గ్రూపుల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఇటీవలి కాలంలో అవి తీవ్రరూపం దాల్చాయి. దేశంలోని తూర్పు ప్రాంతంలో చెలరేగుతున్న హింసను నిరోధించడానికి కాంగో సైన్యం నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ ప్రాంతంలోని బంగారం ఇతర వనరులలో వాటా కోసం ఇరు వర్గాలు పరస్పరం పోరాటం సాగిస్తున్నాయి. -
86కు చేరిన కాంగో పడవ మృతులు
కిన్షాసా: కాంగోలో పడవ మునిగిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 86కు పెరిగింది. 271 మంది ప్రయాణికులతో కిక్కిరిసిన నాటు పడవ ఇంజన్ వైఫల్యంతో మంగళవారం నీట మునగడం తెలిసిందే. 185 మంది ఈదుతూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. దట్టమైన అటవులు, నదుల కారణంగా కాంగోలో రోడ్డు వ్యవస్థ సరిగా లేదు. జనం పడవ ప్రయాణాలకే మొగ్గుచూపుతారు. పడవ ప్రమాదాలు అక్కడ సర్వసాధారణం. ఫిబ్రవరిలోనూ నాటు పడవ మునిగి డజన్లకొద్దీ చనిపోయారు. -
మిస్టరీగా మారిన 'కాంగో జాతీయుడి లాకప్ డెత్!' ఆరోజు ఏం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్–నాబ్), హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, సైబరాబాద్, రాచకొండలకు చెందిన స్పెషల్ ఆపరేషన్ టీమ్స్‌లతో (ఎస్ఓటీ) పాటు స్థానిక పోలీసులకు చిక్కిన ప్రతి నాలుగు డ్రగ్ ముఠాల్లో మూడింటి లింకులు బెంగళూరులో ఉంటున్నాయి. ఆ నగరం డ్రగ్ పెడ్లర్స్, సప్లయర్లకు అడ్డాగా మారడానికి దాదాపు రెండున్నరేళ్ళ క్రితం చోటు చేసుకున్న ఓ లాకప్ డెత్ కారణమైంది. దీనిని గమనించిన రాష్ట్ర పోలీసు విభాగం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది. ఒకప్పుడు గోవా.. ఇప్పుడు బెంగళూరు.. నగరంలో ఎక్కువగా లభించే మాదకద్రవ్యాల్లో గంజాయి సంబంధితమైన వాటి తర్వాతి స్థానంలో సింథటిక్ డ్రగ్స్ ఉంటున్నాయి. గంజాయి, చెరస్, హష్ ఆయిల్ తదితరాలు ఏజెన్సీ ప్రాంతాల నుంచి సిటీకి వస్తున్నాయి. కోకై న్, బ్రౌన్‌షుగర్, హెరాయిన్ తదితర సింథటిక్ డ్రగ్స్ మూలాలు మాత్రం విదేశాల్లో ఉంటున్నప్పటికీ ఇక్కడకు సరఫరా మాత్రం ఉత్తరాదితో పాటు బెంగళూరు నుంచి జరుగుతోంది. ఒకప్పుడు ఈ డ్రగ్ డాన్స్ అంతా గోవా కేంద్రంగా కథ నడిపే వారు. హైదరాబాద్ పోలీసులు వరుస దాడులు చేసి ఎడ్విన్, స్టీవ్ సహా బడా డ్రగ్ డాన్స్‌కు చెక్ చెప్పారు. దీంతో ఇక్కడి వారికి గోవా నుంచి డ్రగ్స్ సరఫరా దాదాపు ఆగిపోయింది. దీంతో బెంగళూరు కేంద్రంగా సరఫరా మొదలైంది. ఆ నగరమూ విదేశీయుల అడ్డా.. బెంగళూరుతో పాటు ఉత్తరాదిలోని అనేక నగరాల్లో తిష్ట వేసి, డ్రగ్స్ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్న వారిలో నల్లజాతీయులే ఎక్కువగా ఉంటున్నారు. స్టడీ, బిజినెస్, విజిట్ సహా వివిధ రకాలైన వీసాలపై వస్తున్న నైజీరియా, సూడాన్, సోమాలియా, కాంగో జాతీయులు డ్రగ్ పెడ్లర్స్, సప్లయర్స్‌గా మారుతున్నారు. ఇలాంటి వాళ్లు ఇతర నగరాలతో పాటు బెంగళూరులోనూ పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. 2021 ప్రథమార్ధం వరకు ఆ నగరంలో నేరాలు చేస్తున్న, అక్రమంగా నివసిస్తున్న ఇలాంటి వారిపై ఉక్కుపాదం మొపేవారు. వీళ్ళు సాధారణంగా ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లోనే పెద్ద సంఖ్యలో నివసిస్తుంటారు. బెంగళూరులోని అలాంటి ప్రాంతాల్లో తరచూ తనిఖీలు చేసే అక్కడి పోలీసులు అక్రమంగా నివసిస్తున్న, దందాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఒక్క ఉదంతంలో అడ్డం తిరిగిన కథ.. ఆ నగరంలో 2021 ఆగస్టులో చోటు చేసుకున్న ఓ ఉదంతంతో కథ అడ్డం తిరిగింది. కాంగోకు చెందిన జోయల్ షిండానీ ములు (27) స్టడీ వీసాపై బెంగళూరుకు వచ్చాడు. డ్రగ్స్ పెడ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కకుండా ముప్పతిప్పలు పెట్టిన ఇతడిని 2021 ఆగస్టులో జేసీ నగర్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నేపథ్యంలో ఠాణాలోనే అతడు చనిపోయాడు. కార్డియాక్ అరెస్టు వల్ల మరణం సంభవించిందని పోలీసులు చెప్పగా, పోలీసులే కొట్టి చంపారని నల్లజాతీయులు ఆరోపించారు. దీంతో పెద్ద సంఖ్యలో ఆ ఠాణా వద్దకు చేరుకున్న నల్లజాతీయులు రాళ్లు రువ్వడంతో పాటు నిరసన చేపట్టారు. దాదాపు రెండు రోజుల పాటు ఈ ఘర్షణలు అక్కడి పోలీసులు ఉలిక్కిపడేలా చేశాయి. ఈ పరిణామం తర్వాత ఆ నగర అధికారులు నల్లజాతీయుల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. పరిస్థితులు చేయి దాటుతుండటంతో.. దీనిని అలుసుగా చేసుకున్న అనేక మంది డ్రగ్ పెడ్లర్స్, సప్లయర్స్ బెంగళూరును అడ్డాగా మార్చుకున్నారు. ఇతర మెట్రోల్లో నివసించే నల్లజాతీయులు సైతం ఆ నగరానికి వచ్చివెళ్తూ డ్రగ్స్ దందా చేస్తున్నారు. కొన్ని రకాలైన డ్రగ్స్ విదేశాల నుంచి నేరుగా కర్ణాటకలోని వివిధ నగరాలకు వచ్చి బెంగళూరు చేరుతున్నాయి. అక్కడ నుంచే హైదరాబాద్ సహా వివిధ నగరాలకు సరఫరా అవుతున్నాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన కేసులను అధ్యయనం చేసిన అధికారులు ఈ విషయం గుర్తించారు. దీంతో అక్కడ ఉన్న డ్రగ్ పెడ్లర్స్‌కు చెక్ చెప్పడానికి, మాదకద్రవ్యాల దందాను కట్టడి చేయడానికి అవసరమైన మార్గాలను అన్వేషిస్తున్నారు. అవసరమైతే దీనిపై కేంద్ర ఏజెన్సీల సహకారం కూడా తీసుకోవాలని భావిస్తున్నారు. ఇక్కడ నుంచి సూత్రధారులను పట్టుకోవడానికి వెళ్లినా సరైన సహకారం లభించకపోవడాన్నీ ప్రస్తావించనున్నారు. ఇవి కూడా చదవండి: అగ్నిసాక్షిగా ఏడడుగులు.. అంతలోనే అంతర్వేది బీచ్‌లో విషాదం! -
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో తొక్కిసలాట.. 31 మంది మృతి
బ్రజ్జావిల్లే: కాంగో ఆర్మీ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో అపశ్రుతి చొటుచేసుకుంది. ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 31 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. కాంగో రాజధాని బ్రజ్జావిల్లేలోని ఓర్నానో స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను అధికారులు నిర్వహించారు. నవంబర్ 14 నుంచి ర్యాలీ జరుగుతోంది. ఈ క్రమంలో సోమవారం వేలాది మంది యువత ర్యాలీకి హాజరయ్యారు. యువత గుంపులుగా రావడంతో పరిస్థితిని సిబ్బంది అదుపు చేయలేకపోయారు. దీంతో ఒకరిపై మరొకరు పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడినట్లు ప్రభుత్వం మంగళవారం తెలిపింది. ఇదీ చదవండి: బందీల విడుదలకు హమాస్‌తో డీల్.. ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం -
బొగ్గును మించిన నల్లని నది ఏది? కారణమేమిటి?
ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ వందల కొద్దీ నదులు ప్రవహిస్తున్నాయి. వీటిలో కొన్ని నదుల నీరు శుభ్రంగా ఉంటుంది. మరికొన్ని నదుల నీరు మురికిగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం బొగ్గుకన్నా నల్లగా ఉండే నది గురించి తెలుసుకుందాం. ఇది ప్రపంచంలోనే అత్యంత నల్లని నదిగా పేరొందింది. ఈ నదిలో బొగ్గు కన్నా నల్లటి నీరు ప్రవహించడం వెనుకగల కారణం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఆఫ్రికా దేశమైన కాంగోలో రుకీ అనే నది ప్రవహిస్తుంటుంది. ఈ నదిలోని నీరు నల్లగా కనిపించడానికి కారణం.. ఆ నీటిలో కరిగిన సేంద్రియ పదార్థమేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. డెయిలీ మెయిల్ తెలిపిన వివరాల ప్రకారం.. రుకీ నదిలోని నీటితో కనీసం చేతులు కడుక్కునేందుకు కూడా ఎవరూ ఇష్టపడరు. ఈటీహెచ్ జ్యూరిచ్ పరిశోధకులు ఈ నదికి సంబంధించిన తమ శాస్త్రీయ అధ్యయనాన్ని ప్రపంచానికి అందించారు. నదిలోని నీటికి నలుపు రంగు రావడానికి కారణం వర్షారణ్యం నుండి సేంద్రియ పదార్థాలు వచ్చి, ఈ నీటిలో కలవడమేనని నిపుణులు చెబుతున్నారు. కాగా ఆఫ్రికన్ దేశమైన కాంగోలో స్విట్జర్లాండ్ కంటే నాలుగు రెట్లు అధికమైన డ్రైనేజీ బేసిన్ ఉంది. దీనిలో కుళ్ళిన చెట్లు, మొక్కల నుండి వచ్చే కార్బన్ సమ్మేళనాలు పేరుకుపోతున్నాయి. ఇవి వర్షాలు, వరదల కారణంగా నదులలోకి చేరుకుంటున్నాయి. నీటిలో కరిగిన ఇటువంటి కార్బన్ సమ్మేళనాల సాంద్రత అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది డార్క్ టీ మాదిరిగా కనిపిస్తుంది. దీనికితోడు రుకీ నది.. అమెజాన్ రియో నెగ్రా కంటే 1.5 రెట్లు లోతుగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నల్ల నీటి నదిగా పేరొందింది. రుకీ బేసిన్ దిగువన పెద్ద మొత్తంలో పీట్ బోగ్ మట్టి ఉంది. కాంగో బేసిన్‌లోని పీట్ బోగ్లలో సుమారు 29 బిలియన్ టన్నుల కార్బన్ ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది కూడా చదవండి: యురేనస్ మీద ఐదు సెకెన్లు ఉండగలిగితే? వజ్రాల వానలో తడుస్తామా? -
కాంగోలో వరదల బీభత్సం..200 మందికిపైగా మృతి
ఆఫ్రికా దేశమైన డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో వరదలు బీభత్సం సృష్టించాయి. గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా దక్షిణ ప్రావిన్స్‌లోని కలేహలో నదులు వరదలతో పోటెత్తాయి. దీంతో బుషుషు, న్యాముకుబి వంటి గ్రామాలను ముంచెత్తింది. ఈ వరదల ధాటికి కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 200 మందికిపైగా మృతి చెందగా, పలువురు గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 203 మృతదేహాలను గుర్తించినట్లు సివిల్ సొసైటీ సభ్యుడు కసోల్ మార్టిన్ చెప్పారు భారీ వర్షాల కారణంగా ఆయా ప్రాంతాల్లోని నదులు పొంగిపొర్లడంతో అనేక గ్రామాలు మునిగిపోయాయని, చాలా ఇళ్లు కొట్టుకుపోయాయని పేర్కొన్నారు. ఈ మేరకు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డెనిస్ ముక్వేగే ప్రకృతి విపత్తులో నిరాశ్రయులైన ప్రజలకు తక్షణ వైద్య సాయం అందించేలా వైద్యులను, సాంకేతిక నిపుణలను ఆయా ప్రాంతాలకు పంపినట్లు ప్రకటించారు. ఐతే రువాండ సరిహద్దులో ఉన్న దక్షిన కిపులో తరచుగా వరదలు, కొండచరియలు విరిగిపడటం సర్వసాధారణమని అధికారులు చెబుతున్నారు. కాగా, ఈ వారం రువాండాలో భారీ వర్షాలకు వరదలు సంభవించి.. కొండచరియలు విరిగిపడటంతో సుమారు 130 మంది దాక మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ విధ్వంసంలో ఐదువేలకు పైగా గృహాలు ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, రువాండ, కాంగోలో సంభవించిన ప్రకృతి విపత్తులకు ప్రభావితమైన ప్రజలకు యూఎన్ సెక్రటరీ జనరల్ గుటెర్రెస్ తన సంతాపాన్ని తెలియజేశారు. గ్లోబల్ వార్మింగ్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోని దేశాలకు ఇదోక వినాశకరమైన ఉదాహరణ అని పేర్కొంది. వేగవంతమైన వాతావరణ మార్పులకు ఇదొక మచ్చుతునక అని స్పష్టం చేసింది. కాగా, 2014లో కూడా కాంగో ఇంతే స్థాయిలో ప్రకృతి విపత్తుని ఎదర్కొన్నట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. నాటి విధ్వంసంలో సుమారు 130 మందికి పైగా ప్రజలు గల్లంతయ్యినట్లు యూఎన్ పేర్కొంది. (చదవండి: చైనా తమ దేశంలోని పేదరికం గురించి బయటకు పొక్కనీయదు..ఆఖరికి ఆన్లైన్ వీడియోలను) -
కేజీఎఫ్ లాంటి సూపర్ హీరో: అస్సలేమీ లెక్క చేయలే!
న్యూఢిల్లీ: గుండె నిండా ధైర్యం, తెగింపు ఉండాలేగానీ ఎంతటి కష్టమైనా దూదిపింజలా తేలిపోవాల్సిందే. అలాగే భూమ్మీద నూకలుంటే.. ఎలాంటి ప్రమాదం నుంచైనా ప్రాణాలతో బయటపడవచ్చు. కుప్పకూలిపోతున్న బంగారు గని నుంచి అన్యూహంగా బతికి బయటపడ్డ వీడియో చూస్తే ఇదే అభిప్రాయం కలుగక మానదు. ముఖ్యంగా తన ప్రాణాలను ఫణంగాపెట్టి మరీ గనిలో చిక్కుకున్న 9మంది కార్మికులను రక్షించడం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. భారీ వర్షంతో అక్కడున్న బంగారు గని కూలిపోయింది. దీంతో అక్కడి పనిచేస్తున్న కార్మికులు (మైనర్లు) చిక్కుకుపోయారు. కానీ ఒకవ్యక్తి సకాలంలో స్పందించాడు. తన చేతులతో మట్టిని తొలగించుకుంటూ లోపల ఇరుక్కుపోయిన తొమ్మిది మంది మైనర్లను నిమిషాల్లో రక్షించడంతో అక్కడున్నవారంతా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒకవైపు పలుగుతో తవ్వుతుండగా మరోవైపు నుంచి కూలీలు ఒక్కొక్కరుగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు రావడం వీడియోలో చూడవచ్చు. ఒక్కొక్కరూ అలా శిథిలాల్లోంచి బయటకు వస్తున్న క్షణాలు తీవ్ర ఉద్విగ్నతను , ఉత్కంఠను కలిగించాయి. సెంట్రల్ ఆఫ్రికన్ దేశంలో మైనింగ్ ప్రమాదాలు, విపత్తులు, కొండ చరియలు విరిగి పడటం లాంటి సంఘటనలు సర్వసాధారణం. సరియైన భద్రతా విధానాలు, సరైన పరికరాలు లేక పోవడమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. Nine Congolese miners were rescued from the rubble of a collapsed gold mine as onlookers cried out in joy in a victorious escape pic.twitter.com/BmPJNe0iQY — TRT World (@trtworld) March 28, 2023 -
కాంగోలో ఉగ్ర ఘాతుకం.. 36 మంది మృతి
గోమా: ఆఫ్రికా దేశం కాంగోలో ఇస్లామిక్ స్టేట్ అనుబంధ ఉగ్ర సంస్థ అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్(ఏడీఎఫ్) జరిపిన మారణకాండలో 36 మంది పౌరులు చనిపోయారు. నార్త్ కివు ప్రావిన్స్ ముకోండి గ్రామంలోకి బుధవారం రాత్రి కత్తులు, తుపాకులతో ప్రవేశించిన ఉగ్రమూకలు ఇళ్లకు నిప్పుపెట్టాయి. బయటకు వచ్చిన పౌరులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డాయి. ఘటనలో 36 మంది చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కొందరిని ఎత్తుకుపోయారు. ఏడీఎఫ్ ఉగ్రమూకలు చిన్నారులపైనా దారుణాలకు పాల్పడుతున్నాయి. -
ప్రారంభోత్సవం రోజునే పరాభవం... హఠాత్తుగా కుప్పకూలిన వంతెన: వీడియో వైరల్
Bridge collapsed immediately after an official cut the ribbon to inauguration: డెమొక్రెటిక్ రిపబ్లక్ ఆఫ్ కాంగో(డీర్సీ)లో ఒక వంతెన ప్రారంభోత్సవంలో అధికారులు ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మాధ్యమంలో చక్కర్లు కొడుతుండటంతో ఈ ఘటన వెలుగు చూసింది. వాస్తవానికి కాంగ్లోలో వర్షాకాలంలో స్థానికులు నదిని దాటేందుకు ఒక చిన్న వంతెనను నిర్మించారు. ఆ వంతెన ప్రారంభోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. పైగా పెద్ద ఎత్తున్న అధికారులు కూడా వచ్చారు. సరిగ్గా ఒక మహిళా అధికారి రిబ్బన్ కటింగ్ చేస్తుండగా... హఠాత్తుగా వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో అధికారులు అంతా ఒక్కసారిగా హాహాకారాలు చేస్తూ బెంబేలెత్తిపోయారు. దీంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమై అధికారులను రక్షించి సురక్షిత ప్రాంతాలకి తరలించారు. అదృష్టవశాత్తు ఎవరు కిందపడిపోలేదు, పైగా ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఐతే ఈ వంతెనను మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి నిర్మించారు. కానీ వంతెన నిర్మాణ నాణ్యతల్లో లోపాలు కారణంగా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో... స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున్న ప్రభుత్వ వైఖరిపై దుమ్మెత్తిపోస్తున్నారు. అదీగాక ఈ వంతెనకు ముందు ఉన్న తాత్కాలికా నిర్మాణం తరుగచుగా కూలిపోతుంటుందని ఒక స్థానిక వార్త సంస్థ పేర్కొనడం గమనార్హం. (చదవండి: యూకే హోం సెక్రటరీగా భారత సంతతి మహిళ) -
నరరూప రాక్షసులు: కిడ్నాప్ చేసి మానభంగం, ఆపై..
న్యూయార్క్: మానవ హక్కుల ఉల్లంఘనలో హేయనీయమైన ఘటనలు వెలుగులోకి రావడం కొత్తేం కాదు. కానీ, ప్రపంచమంతా ఉలిక్కిపడేలా దారుణాతిదారుణాలు ఆఫ్రికన్ దేశం కాంగోలో చోటుచేసుకుంటున్నాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో బుధవారం ఓ మహిళ కథ.. అక్కడి రెబల్ గ్రూప్‌ల అరాచకాలను బయటపెట్టడంతో పాటు సభ్య దేశ్యాలను నివ్వెరపోయేలా చేసింది. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో పరిస్థితులపై భద్రతా మండలిలో సాధారణ సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా.. సోఫెపడి హక్కుల సంఘం అధ్యక్షురాలు, న్యాయవాది జూలియెన్నె లుసెంగె.. తూర్పు కాంగోలో తనకు తారసపడ్డ ఓ మహిళ కథను మండలికి వినిపించగా.. ఆమె ప్రసంగిస్తున్నంత సేపు అక్కడ నిశబ్ద వాతావరణం నెలకొంది. కాంగోలో ప్రభుత్వం, రెబెల్ గ్రూప్స్ మధ్య అంతర్యుద్ధం.. ఈ మే నెలలో తారాస్థాయికి చేరింది. ఆ పరిస్థితులు కాస్త తీవ్ర హింసకు దారి తీశాయి. ఈ తరుణంలో.. కోడ్‌కో అనే మిలిటెంట్ గ్రూప్ ఓ కుటుంబం నుంచి ఓ మహిళను ఎత్తుకెళ్లింది. పలుమార్లు ఆమెపై మానభంగానికి పాల్పడ్డారు ఆ గ్రూప్ సభ్యులు. ఆపై ఓ వ్యక్తిని ఆమె కళ్లెదుటే గొంతు కోసి హత్య చేశారు. ఆ శవం నుంచి పేగులు బయటకు లాగేసి.. వాటిని వండాలంటూ ఆమెకు ఆదేశించారు. రెండు కంటెయినర్ల నీళ్లు తెచ్చి.. భోజనం సిద్ధం చేయమన్నారు. ఆపై ఆమెతో మనిషి పచ్చి మాంసం బలవంతంగా తినిపించారు’ అంటూ భావోద్వేగంగా జూలియెన్నె ఆ ఘటనలను వినిపించారు. కొన్నిరోజుల తర్వాత ఆమెను విడిచిపెట్టింది ఆ గ్రూప్. కానీ, ఇంటికి వెళ్తున్న దారిలో ఆమెను మరొక మిలిటెంట్ ఎత్తుకెళ్లింది. పలుమార్లు మానభంగం చేశారు ఆ గ్రూప్‌సభ్యులు. అక్కడ ఆమెకు అలాంటి రాక్షస అనుభవమే ఎదురైంది. ఆ పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు ఆమె తన ప్రాణాలనే పణంగా పెట్టుకుంది.. అని జూలియెన్నెకు భద్రతా మండలికి వినిపించారు. ఈ ఘటనను మండలి సంయుక్తంగా ఖండించింది. ఇలాంటి ఘటనలను నిలువరించాల్సిన అవసరం ఉందని, మానవ హక్కుల్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ఈ ఆరోపణలపై కోడ్‌కో మిలిటెంట్ గ్రూప్‌గానీ, ఇతర సంస్థలుగానీ స్పందించలేదు. అంతర్యుద్ధంతో కాంగో నెత్తుటి నేలను తలపిస్తున్న వేళ.. గత 20 ఏళ్లుగా ఐరాస ప్రతినిధులు కాంగోలో శాంతి స్థాపనకు ప్రయత్నిస్తున్నా అది వీలుపడడం లేదు. Disclaimer: ఇందులోని కంటెంట్ ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి కాదు.. కేవలం పరిణామాలను తెలియజేయడానికే!. -
మళ్లీ పడగ విప్పుతున్న ప్రాణాంతక ఎబోలా..!
జెనీవా: ప్రాణాంతక ఎబోలా మళ్లీ పడగ విప్పుతోంది. ఆఫ్రికా ఖండంలో ఎబోలా వ్యాప్తి మళ్లీ మొదలైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించింది. డెమొక్రటిక్ రిపబ్లిక ఆఫ్ కాంగోలో వైరస్ వ్యాప్తి వెలుగులోకి వచ్చిందని తెలిపింది. ఆఫ్రికా ఈశాన్య ప్రాంతమైన ఈక్వెటర్ ప్రావిన్స్‌లోని మబండకా అనే పట్టణంలో ఎబోలా కేసు నమోదైంది. ఈ ప్రావిన్స్‌లో 2018 నుంచి ఎబోలా స్థానికంగా వ్యాప్తి చెందడం ఇది మూడోసారి. ఈ దేశంలో 1976నుంచి 14 సార్లు ఎబోలా వ్యాపించింది. రెండు వారాల క్రితమే వ్యాధి వ్యాప్తి ప్రారంభమైందనీ, ప్రస్తుతం దానిని అదుపు చేయడానికి అన్ని చర్యలు చేపట్టామని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. చదవండి👉🏾 మొట్టమొదటిసారిగా.. యూఎస్‌లో పోర్నోగ్రఫీపై కోర్సు ‘ఇప్పటి వరకు ఒక కేసును ఎబోలాగా అధికారికంగా ధ్రువీకరించారు. 31 ఏళ్ల రోగిలో ఈనెల 5వ తేదీన ఎబోలా లక్షణాలు కనిపించాయి. వారం తర్వాత స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆ తర్వాత ఏప్రిల్ 21న ఎబోలా చికిత్సా కేంద్రంలోని ఐసీయూలో చేర్పించారు. కానీ, ఒక రోజు తర్వాత అతడు మరణించాడు. వైద్య సిబ్బందిలో ఎబోలా లక్షణాలు కనిపించడంతో వెంటనే వారు పరీక్షల కోసం నమూనాలను ఇచ్చారు. ఇక ఎబోలాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలను గౌరవ ప్రదంగా నిర్వహించారు’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. చదవండి👉🏻 ట్రిపుల్ బొనాంజా.. ఒకే కాన్పులో ఇద్దరు కాదు ముగ్గురు -
ఐరాస హెలికాప్టర్ కూల్చివేత
దకర్: కాంగోలో వేర్పాటువాదులు తెగించారు. ఎనిమిది మంది ఐక్యరాజ్య సమితి శాంతిదూతలు, పర్యవేక్షకులను తీసుకెళ్తున్న ఒక హెలికాప్టర్‌ను వేర్పాటువాదులు కూల్చేశారు. సోమవారం కాంగో తూర్పుప్రాంతంలో ఎం23 రెబల్స్ గ్రూప్ నేతృత్వంలో ఈ దాడి జరిగిందని, హెలికాప్టర్ జాడ, ప్రయాణికుల కోసం అన్వేషణ కొనసాగుతోందని కాంగో సైన్యం మంగళవారంప్రకటించింది. ఖనిజ సంపదతో నిండిన తూర్పు కాంగోపై పట్టు కోసం చాలా వేర్పాటువాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. (చదవండి: పుతిన్ చేస్తున్న దుర్మార్గాలపై ఆక్రోశమది: బైడెన్) -
కరెంట్ తీగలు తెగిపడి 26 మంది దుర్మరణం
మధ్య ఆఫ్రికా దేశం కాంగోలో ఘోరం జరిగింది. రద్దీ మార్కెట్లో హై వోల్టేజ్ కేబుల్ తెగిపడి 26 మంది దుర్మణం చెందారు. కాంగో రాజధాని కిన్షాసా శివారులో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాలు, వరదల కారణంగా.. నాలా వ్యవస్థ దెబ్బతిని నీరు రోడ్ల మీదకు చేరుకుంది. ఆ సమయంలో మార్కెట్ దగ్గర్లోని బస్సు కోసం కొందరు ఎదురు చూస్తుండగా.. హఠాత్తుగా వైర్ తెగిపడి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో 24 మంది మహిళలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. -
Corona Virus: కరోనా ట్విండెమిక్‌గా మారుతుందా?
న్యూఢిల్లీ/పిట్స్బర్గ్/మాస్కో/లండన్: అమెరికాలోని వైద్యాధికారులకు మరో కొత్త చిక్కు వచ్చి పడింది. ఆ దేశంలో ప్రస్తుతం శీతాకాలం జరుగుతోంది. దీంతో కరోనా రోగంతో పాటు సీజనల్‌గా వచ్చే ఫ్లూ (జలుబు) కూడా సోకుతోంది. ప్రస్తుతం కరోనాను పాండెమిక్ (మహమ్మారి) అని పిలుస్తున్న నేపథ్యంలో కరోనా, సీజనల్ ఫ్లూని కలిపి ట్విండెమిక్‌గా (రెండు పాండెమిక్‌లు కలసి) వ్యవహరిస్తారు. ఈ తరహా రూపంలో వచ్చే కేసులను ప్రస్తుతం మేథమేటికల్ మోడల్స్ ద్వారా అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కోవిడ్‌పై పోరాడేందుకు తీసుకునే చర్యలు ఫ్లూకి కూడా అడ్డుకట్ట వేస్తాయని అన్నారు. మరోవైపు ఇంగ్లండ్‌లో గత మూడు వారాల్లో 20 లక్షల మందికి బూస్టర్ డోస్ ఇచ్చినట్లు యూకే ఆరోగ్య సంస్థ శనివారం ప్రకటించింది. కోవిడ్ నుంచి అత్యధిక ముప్పు ఉన్న వర్గాలను ఎంపిక చేసి వారికి వ్యాక్సినేషన్ ఇస్తున్నట్లు వెల్లడించింది. 19,740 కొత్త కరోనా కేసులు భారత్‌లో శనివారం 19,740 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,39,35,309కు చేరుకుంది. మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య 2,36,643కు తగ్గింది. గత 206 రోజుల్లో ఇదే అత్యంత కనిష్ట సంఖ్య కావడం గమనార్హం. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,32,48,291కు చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్త రికవరీ రేటు 97.98గా ఉంది. మరణాల శాతం 1.33గా ఉంది. ఇదిలా ఉండగా అండమాన్ నికోబార్ కేంద్ర పాలిత ప్రాంతంలో గత 24 గంటల్లో ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదు కాలేదు. ప్రస్తుతం ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో 10 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకూ 94.62 కోట్ల డోసులకు పైగా వ్యాక్సినేషన్ జరిగింది. మరోవైపు ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి మాట్లాడుతూ.. భారత్‌కు ప్రపంచ నలుమూలల నుంచి వ్యాక్సిన్ తయారీ ముడి పదార్థాల సరఫరా కొనసాగాలని కోరారు. భారత్‌లో వ్యాక్సిన్ల తయారీ ఊపు అందుకున్న నేపథ్యంలో కోవ్యాక్స్ కార్యక్రమం ద్వారా ప్రపంచానికి కూడా వ్యాక్సిన్లను అందించేందుకు అది ఉపకరిస్తుందని పేర్కొన్నారు. వ్యాక్సిన్ మైత్రి ద్వారా ఐక్యరాజ్య సమితి ద్వారా 2021 నాలుగో త్రైమాసికంలో వ్యాక్సిన్లను అందిస్తామని అన్నారు. ఇదిలా ఉండగా రష్యాలో రోజూవారీ మరణాలు శనివారం ఏకంగా 968 నమోదయ్యాయి. సెపె్టంబర్ చివరి రోజులతో పోలిస్తే 100కు పైగా అధిక మరణాలు సంభవించాయని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు రష్యాలో శనివారం 29 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. బ్రెజిల్లో మరణాలు 6 లక్షలు దాటాయి. ఈ నేపథ్యంలో అక్కడ పలు బార్లు నిండిపోయి కనిపిస్తున్నాయి. డెల్టా వైరస్ విస్తరిస్తోందన్న అనుమానాలు ఓ వైపు ఉండగా, ప్రజలు జాగ్రత్తలు పాటించకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కాంగోలో ఎబోలా కేసు.. ప్రమాదకరమైన ఎబోలా వైరస్ సోకి మూడేళ్ల బాలుడు మరణించిన ఘటన కాంగోలో చోటు చేసుకుంది. గత అయిదు నెలలుగా కాంగోలో ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదు. అంతకు ముందు 6 మంది ఎబోలా కారణంగా మరణించారు. బాలున్ని ఆస్పత్రిలో చేర్చినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని, అక్టోబర్ 6న కన్నుమూసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. మరణించాక ఎబోలా పాజిటివ్‌గా తేలిందన్నారు. -
విషాద గాథ: కాపాడినోడి చేతిలోనే కన్నుమూసింది
Ndakasi Selfie Pose Gorilla No More: ఫేస్బుక్ మీద ఆరోపణల తర్వాత సోషల్ మీడియా మనుషుల మీద మానసికంగా ప్రభావం చూపెడతాయా? లేదా? అనేది ప్రస్తుతం చర్చలో నడుస్తోంది. ఇలాంటి తరుణంలో ఓ ఘటన ఇంటర్నెట్లో యూజర్లను భావోద్వేగాల్ని ప్రదర్శించేలా చేస్తోంది. కొన్నేళ్ల క్రితం మనిషితో సెల్ఫీకి ఫోజులిచ్చిన ఓ గొరిల్లా.. చివరికి తనను కాపాడిన వ్యక్తి ఒడిలోనే తుదిశ్వాస విడిచి అందరితో కంటతడి పెట్టిస్తోంది. సెల్ఫీ స్టార్ ఎండకశి.. కొండ జాతికి చెందిన గొరిల్లా ఇది (Mountain Gorilla). 2019లో తన తోటి గొరిల్లా ఎన్‌డెజెతో కలిసి పార్క్ రేంజర్ మాథ్యూ షమావూ తీసిన సెల్ఫీకి సీరియస్ ఫోజు ఇచ్చింది. అప్పటి నుంచి ఈ గొరిల్లా వరల్డ్ ఫేమస్ అయ్యింది. ఎండకశి మీద మీమ్స్, కథనాలు ఎన్నో వచ్చాయి. కొన్ని డాక్యుసిరీస్లలోనూ కనిపించింది. చివరికి పద్నాలుగేళ్ల వయసులో.. దాని చిన్నప్పటి నుంచి సంరక్షిస్తున్న ఆండ్రే బౌమా కౌగిలిలోనే కన్నుమూసింది అది. View this post on Instagram A post shared by Virunga National Park (@virunganationalpark) సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి విపరీతంగా వైరల్ అవుతోంది. అనారోగ్య సమస్యలతోనే ఎండకశి చనిపోయినట్లు పార్క్ నిర్వాహకులు తెలిపారు. చిన్నపిల్లలా చూసుకున్నా. కానీ, వీడు నన్ను వదిలేసి వెళ్లిపోయాడు అంటూ ఆండ్రే పేరిట ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. This picture of two gorillas 🦍 posing for a selfie is one of the best things I’ve seen this week! 😭😭 pic.twitter.com/ftj2k3s1DF — A̶l̶h̶a̶j̶i̶ 𝔻𝕣𝕦𝕟𝕜𝕒𝕣𝕕 (@The_Nifemi) April 19, 2019 కాంగో విరుంగ నేషనల్ పార్క్‌లో సెన్‌వెక్వే సెంటర్లో ఇంతకాలం పెరిగింది ఎండకశి. విశేషం ఏంటంటే.. ఈ సెంటర్లో పెరిగే గొరిల్లాలన్నీ దాదాపు అనాథలే!. విరుంగ నేషనల్ పార్క్‌లో నివసించే గొరిల్లాలను, సాయుధులైన మిలిటెంట్లు కాల్చి చంపుతూ వస్తున్నారు. ఈ క్రమంలో 2007లో ఎండకశి తల్లిని సైతం కాల్చి చంపారు. ఆ టైంలో తల్లి శవం మీద గట్టిగా పడుకున్న నెలల వయసున్న పిల్ల గొరిల్లా(ఎండకశి)ని పార్క్ రేంజర్ ఆండ్రే బౌమా కాపాడి.. ఇంతకాలం ఆలనా పాలనా చూసుకున్నాడు. ఇక ఈ ఘటన తర్వాత కొండ గొరిల్లాలను సంరక్షించేందుకు కాంగో భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఇది సత్ఫలితం ఇవ్వగా.. 2007లో 720 కొండ గొరిల్లాల సంఖ్య.. ఇప్పుడు ఆ సంఖ్య 1,063కి చేరిందని తెలుస్తోంది. Sharing again, selfie of the century, a ranger and friends at Virunga National Park in DR Congo. On #WorldRangerDay pic.twitter.com/Kp3BCkCHCS — Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 31, 2020 చదవండి: ఆకలేస్తుందన్నాడు.. సాయం చేస్తే.. చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు -
నిరాశ్రయులైన వేలాది మంది ప్రజలు
కిన్షాసా: కాంగో దేశంలో అగ్నిపర్వతం పేలిన ఘటనలో ఇరవైవేల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆ దేశంలోని గోమాలో అగ్నిపర్వతం పేలడంతో లావా ప్రవహించింది. దీంతో డజన్లకొద్దీ ప్రజలు మరణించినట్లు, 40 మంది వరకు తప్పిపోయినట్లు బుధవారం ఐక్యరాజ్యసమితి తెలిపింది. అంతేకాకుండా అగ్నిపర్వత విస్ఫోటనాకి వందలాది గృహాలు ధ్వంసమయ్యాయి. వేలాది మంది అక్కడి నుంచి దూరంగా పారిపోయారని తెలిపారు. కాగా నైరాగోంగో నుంచి 15 కి.మీ (9 మైళ్ళు) దూరంలో 200 సార్లు భూమి కంపించింది. అయితే ఇప్పటివరకు భూకంపానికి ఎటువంటి మరణాలు సంభవించలేదని అధికారులు తెలిపారు. కానీ భూమి కంపించడంతో పగుళ్లు ఏర్పడ్డాయని, ఈ పగుళ్లు అక్కడి నివాసితులను భయాందోళనలకు గురిచేస్తున్నాయని తెలిపారు. కాంగో దేశ అధికారులు పునరావాస సహాయక పనులు చేపట్టారు. అయితే దశాబ్దాలుగా రగులుతున్న ఇరగోంగో అగ్నిపర్వతం బద్దలయ్యే సమయాన్ని అక్కడి యంత్రాంగం అంచానా వేయలేకపోయింది. దీంతో ప్రాణ, ఆస్తి నష్టం భారీగా సంభవించింది. (చదవండి: ఆకుపచ్చగా మారుతున్న గంగానది.. కారణం ఏంటి?) -
20 ఏళ్ల తర్వాత అగ్నిపర్వతం బద్ధలు..భయం గుప్పిట్లో ప్రజలు
కిన్షాసా: కాంగోలోని ఇరగోంగో అగ్నిపర్వం దాదాపు రెండు దశాబ్దాల తర్వాత బద్దలైంది. అగ్ని పర్వతం విస్ఫోటనంతో లావా పైకి ఉప్పొంగుతోంది. దీంతో ఆకాశమంతా ఎరుపురంగులోకి మారింది. లావా ధారలుగా ప్రవహిస్తూ గోమా నగరంలోని ప్రధాన రహదారులపైకి చేరడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దాదాపు రెండు మిలియన్ల మంది గోమా నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని అధికార వర్గాలు తెలిపాయి.1977 లో నైరాగోంగో పర్వతం విస్ఫోటనం వల్ల సుమారు 2 వేల మంది మరణించారు. అలాగే 2002లో విస్పోటనం చెందగా.. తప్పించుకునే దారిలేక వందలాది మంది మృతి చెందారు. లక్ష మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. శనివారం రాత్రి మరోసారి అగ్నిపర్వతం బద్దలవడంతో ప్రజలంతా ఆందోళనకు గురవుతున్నారు. అయితే అగ్నిపర్వతం పేలుడుతో వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం సహాయక చర్యలు ప్రారంభించింది. కాగా యూరప్ పర్యటనలో ఉన్న కాంగో అధ్యక్షుడు ఫెలిక్స్ టిసెకెడి ఆదివారం స్వదేశానికి రానున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు సుమారు మూడువేల మంది ప్రజలు కాంగోను విడిచి వెళ్లినట్లు రువాండా ఇమ్మిగ్రేషన్ అధికారులు పేర్కొన్నారు. కొందరు కివు సరస్సు పడవల్లో ఆశ్రయం పొందగా.. మరికొందరు మెట్రోపాలిటన్ ప్రాంతంలోని ఎత్తయిన పర్వత ప్రాంతానికి చేరుకున్నారు. ఇక ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి శాంతి భద్రత బృందం స్పందించింది. లావా గోమా నగరం వైపు వెళ్లడం లేదని, ప్రస్తుతం తాము అప్రమత్తంగానే ఉన్నట్లు పేర్కొంది. కాగా అగ్నిపర్వత విస్ఫోటనం గురించి సకాలంలో తెలియజేయకపోవడంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. అధికారులు సకాలంలో స్పందిచకపోవడం, సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారం కావడంతో ప్రజల్లో గందరగోళం పెంచింది. 🚨🚨Activité volcanique aux alentours de Goma: la MONUSCO fait des vols de reconnaissance. La lave ne semble pas se diriger vers la ville de Goma. Nous restons en alerte. pic.twitter.com/JQmz7v16Ne — MONUSCO (@MONUSCO) May 22, 2021 (చదవండి: హఠాత్తుగా మారిన వాతావరణం: చైనాలో పెనువిషాదం) -
బయటపడిన బంగారు కొండ.. మట్టికోసం ఎగబడ్డ జనం
కాంగో: కాంగోలోని బుకావుకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ కివూ ప్రావిన్స్‌లోని ఓ కుగ్రామం లుహిహి. అక్కడి ప్రజలు తట్టా, బుట్టా చేతికి ఏది దొరికితే అది పట్టుకొని పక్కనే ఉన్న కొండపైకి పరుగులు పెడుతున్నారు. ఏంటి మట్టి కోసం అనుకుంటున్నారా? కానేకాదు. బంగారం తవ్వుకొచ్చుకునేందుకు. మరి ఆ కొండ మామూలు కొండ కాదు. అచ్చంగా బంగారు కొండ. అసలు మట్టిని కూడా వదిలిపెట్టని మనజనం. ఇక బంగారం కొండ దొరికితే వదులుతారా? అదే జరిగింది ఇక్కడ కూడా. ఇటీవలే రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని ఆ కుగ్రామంలో బంగారం గని బయటపడింది. ఆ కొండలోని 60 నుంచి 90 శాతం మట్టిలో బంగారం ఉన్నట్టు బయటపడింది. అంతే దీంతో అక్కడి ప్రజలు పలుగు పారలు పట్టుకొని కొండమీదికి చీమల దండులా పాకేశారు మట్టిలో దాగివున్న బంగారు ఖనిజం కోసం. పలుగూ పారా ఉంటే సరే, ఏదీ లేకపోతే చేతుల్తోనే మట్టిని తోడేస్తున్నారట అక్కడి జనం. పలువురు గని ఉన్న ప్రాంతంలోని మట్టిని సంచుల్లో నింపేసుకున్నారు. కొందరేమో వాటిని ఇళ్ళల్లో కుప్పలు పోసుకుంటే, మరికొంత మంది అంతదూరం ఈ బరువెందుకు మోయాలనుకున్నారో ఏమో, అక్కడే నీళ్ళు పెట్టుకుని మట్టిని కడిగేసి, బంగారాన్ని సంచుల్లో నింపుకుంటున్నారు. ఈ వీడియోని అహ్మద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాంత మంతా ఇసుక వేస్తే రాలనంత జనం వెల్లువెత్తడంతో పాలకులకు చేసేదేం లేక తవ్వకాలపై నిషేధం విధించాల్సి వచ్చింది. A video from the Republic of the Congo documents the biggest surprise for some villagers in this country, as an entire mountain filled with gold was discovered! They dig the soil inside the gold deposits and take them to their homes in order to wash the dirt& extract the gold. pic.twitter.com/i4UMq94cEh — Ahmad Algohbary (@AhmadAlgohbary) March 2, 2021 -
ఆ కొండంతా బంగారం.. ఎగబడ్డ జనం
కిన్షాసా : డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోలో తాజాగా ఓ బంగారు కొండ వెలుగుచూసింది. దాన్ని తవ్విన కొద్ది బంగారం బయటపడుతోంది. సౌత్ కివు ప్రావిన్స్, లుహిహిలో ఉన్న ఈ కొండ మీదకు జనం ఎగబడ్డారు. చేతికి దొరికిన వస్తువుతో మట్టి తవ్వి సంచుల్లో, పాత్రల్లో నింపుకుని వెళ్లారు. ఈ మట్టిలో 60-90శాతం బంగారం ఉన్నట్లు సమాచారం. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అహ్మద్ అల్గోభరి ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘ రిపబ్లికన్ కాంగోలో బంగారు కొండ వెలుగుచూసింది. జనం బంగారం కోసం ఎగబడుతున్నారు. కొండమీద మట్టిని ఇంటికి తీసుకెళ్లి, దాన్ని శుభ్రం చేసి బంగారాన్ని వెలికి తీస్తున్నారు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, బంగారు కొండపై దేశ మైనింగ్ శాఖ స్పందించింది. ప్రజలెవరూ ఆ కొండపై బంగారు తవ్వుకోవటానికి వీల్లేకుండా ఆంక్షలు విధించింది. చదవండి : వైరల్: చేప కడుపులో తాబేలు చక్కర్లు! గడ్డం గీయటానికి రూ. 4 లక్షల గోల్డ్ రేజర్ -
కుప్పకూలిన విమానం; ఐదుగురు మృతి
కాంగో : ఆఫ్రికా దేశమైన కాంగోలో శుక్రవారం అర్థరాత్రి కార్గో విమానం అడవుల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు సహా ఐదుగురు మృతిచెందారు. ఏజ్‌ఫ్రెకో అనే కంపెనీకి చెందిన చిన్న కార్గో మనీమా ప్రావిన్స్‌లోని కలిమా నుంచి దక్షిణ కివూ ప్రావిన్స్‌లోని బుకావు వెళ్తున్నది. మరికొద్ది సేపట్లో లాండింగ్ అవుతుందనగా దక్షిణ కివూ ప్రావిన్స్‌లోని దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది. అందులో ఇద్దరు పైలట్లతోపాటు ముగ్గురు ప్రయాణికులు ఉన్నారని, ప్రమాదంలో అందరూ మరణించారని ప్రావిన్స్ రవాణ, సమాచార శాఖ మంత్రి క్లౌడీ స్వీడి బాసిలా తెలిపారు. ఈ విమాన ప్రమాదానికి గల కారణాలపై అమెరికా మిషన్ బృందం దర్యాప్తు చేస్తున్నదని వెల్లడించారు. కాంగోలో భద్రతా ప్రమాణాలు సరిగా పాటించకపోవడం వల్ల విమానాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. దీంతో సరైన భద్రతా ప్రమాణాలు పాటించని కారణంగా యూరోపియన్ యూనియన్ కాంగో విమాన సర్వీసులపై నిషేధం విధించింది.