Extremists kill at least 36 people in Eastern Congo - Sakshi
Sakshi News home page

కాంగోలో ఉగ్ర ఘాతుకం.. 36 మంది మృతి

Mar 10 2023 6:19 AM | Updated on Mar 10 2023 10:51 AM

Extremists Kill People in Eastern Congo - Sakshi

గోమా: ఆఫ్రికా దేశం కాంగోలో ఇస్లామిక్‌ స్టేట్‌ అనుబంధ ఉగ్ర సంస్థ అలైడ్‌ డెమోక్రటిక్‌ ఫోర్సెస్‌(ఏడీఎఫ్‌) జరిపిన మారణకాండలో 36 మంది పౌరులు చనిపోయారు. నార్త్‌ కివు ప్రావిన్స్‌ ముకోండి గ్రామంలోకి బుధవారం రాత్రి కత్తులు, తుపాకులతో ప్రవేశించిన ఉగ్రమూకలు ఇళ్లకు నిప్పుపెట్టాయి.

బయటకు వచ్చిన పౌరులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డాయి. ఘటనలో 36 మంది చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కొందరిని ఎత్తుకుపోయారు. ఏడీఎఫ్‌ ఉగ్రమూకలు చిన్నారులపైనా దారుణాలకు పాల్పడుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement