massacre
-
నెతన్యాహుపై అరెస్టు వారెంట్
ద హేగ్: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) గురువారం అరెస్టు వారెంట్లు జారీ చేసింది. అలాగే ఇజ్రాయెల్ రక్షణ శాఖ మాజీ మంత్రి యోవ్ గల్లాంట్‌తోపాటు పలువురు హమాస్ నేతలపైనా వారెంట్లు జారీ చేసింది. బెంజమిన్, గల్లాంట్ గాజాలో మారణహోమం సాగించారని, మానవత్వంతో దాడి చేశారని ఐసీసీ ఆక్షేపించింది. హత్యలు చేయడం, సాధారణ ప్రజలను వేధించడం వంటి అమానవీయ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించింది. గాజాలో ప్రజలకు ఆహారం, నీరు, ఔషధాలు, విద్యుత్, ఇంధనం, ఇతర నిత్యావసరాలు అందకుండా ఆంక్షలు విధించారని, అమాయకుల మరణానికి కారకులయ్యారని మండిపడింది. నెతన్యాహు, గల్లాంట్ చర్యల వల్ల ఎంతోమంది మహిళలు, చిన్నారులు బలయ్యారని ఉద్ఘాటించింది. పౌష్టికాహారం, నీరు అందక, డీహైడ్రేషన్‌తో పసిబిడ్డలు మరణించారని పేర్కొంది. నెతన్యాహు, గల్లాంట్ ఉద్దేశపూర్వకంగానే సామాన్య ప్రజలపై వైమానిక దాడులు చేసినట్లు చెప్పడానికి సహేతుకమైన ఆధారాలను గుర్తించామని వివరించింది. గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభానికి నెతన్యాహు, గల్లాంట్ బాధ్యత వహించాలని తేల్చిచెప్పింది. యుద్ధ నేరాల్లో నెతన్యాహు నిందితుడని స్పష్టం చేసింది. గాజాలో 2023 అక్టోబర్ 8 నుంచి 2024 మే 20వ తేదీ దాకా నెలకొన్న పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నెతన్యాహు, గల్లాంట్‌పై అరెస్టు వారెంట్లు జారీ చేసింది. అలాగే గాజాలో భీకర యుద్ధానికి, సంక్షోభానికి కారణమయ్యారంటూ హమాస్ నేతలపైనా అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. హమాస్ అగ్రనేతలు మొహమ్మద్ డెయిఫ్, యహ్యా సిన్వర్, ఇస్మాయిల్ హనియేను అరెస్టు చేయాలని ఐసీసీ స్పష్టంచేసింది. అయితే, యహ్యా సిన్వర్, ఇస్మాయిల్ హనియే ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల్లో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఇప్పుడేం జరగొచ్చు? ఇజ్రాయెల్ ప్రధానమంత్రి, రక్షణ శాఖ మాజీ మంత్రిపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్లు జారీ చేయడంతో ఇప్పుడేం జరుగుతుందన్న చర్చ మొదలైంది. ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయడంతో నెతన్యాహు, గల్లాంట్ ఇప్పుడు అంతర్జాతీయంగా వాంటెడ్ నిందితులుగా మారారు. ప్రపంచ దేశాల అధినేతలు వారికి మద్దతు ఇవ్వడానికి వీల్లేదు. అదే జరిగితే అంతర్జాతీయంగా నెతన్యాహు, గల్లాంట్ ఒంటరవుతారు. చివరకు గాజాలో కాల్పుల విరమణ ప్రక్రియ ప్రారంభించే ప్రయత్నాలు మరింత సంక్లిష్టంగా మారుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
భయానక ఘటన.. గంటల వ్యవధిలో 600 మంది ఊచకోత
బుర్కినా ఫాసో: కొన్ని గంటల వ్యవధిలోనే దాదాపు 600 మందిని దారుణంగా కాల్చి చంపిన అత్యంత భయానక ఘటన పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో జరిగింది. బర్సాలోగో పట్టణంలో ఉగ్రవాదులు ఈ కిరాతకానికి పాల్పడ్డారు. ఆగస్టులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఆగస్టు 24న బర్సాలోగో పట్టణంపై బైక్‌లపై దూసుకొచ్చిన ఉగ్రవాదులు కన్పించినవారిని కాల్చేశారు. మృతుల్లో అత్యధికులు మహిళలు, చిన్నారులే ఉన్నారు. అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ అనుబంధ రెబల్స్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్, మాలిలో ఉన్న అల్-ఖైదా అనుబంధ సంస్థ, బుర్కినా ఫాసోలో ఉగ్రవాద సంస్థలు ఆ దేశంలో క్రియాశీలకంగా పని చేస్తున్నాయి. ఈ ఘటనలో.. ఐక్యరాజ్యసమితి దాదాపు 200 మంది మరణించినట్లు అంచనా వేయగా, ఉగ్రవాద సంస్థ జెఎన్ఐఎం దాదాపు 300 మందిని చంపినట్లు ప్రకటించింది.ఇదీ చదవండి: ఇరాన్ అణుస్థావరాలు పేల్చేయండి: ఇజ్రాయెల్‌కు ట్రంప్ సూచన -
ఇజ్రాయెల్‌లో సార్వత్రిక సమ్మె
టెల్ అవీవ్: హమాస్ చెరలో ఉన్న ఆరుగురు బందీల దారుణ హత్యపై ఇజ్రాయెలీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బందీలను సురక్షితంగా విడిపించడంలో బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం విఫలమైందంటూ సోమవారం ఇజ్రాయెల్ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరిగింది. కారి్మక సంఘాల పిలుపు మేరకు బ్యాంకులు, ఆరోగ్య విభాగాలు, రవాణా సంస్థలు సహా చాలా వరకు మూతబడ్డాయి. కొన్ని ప్రాంతాల్లోని స్కూళ్లు కొద్దిసేపు మాత్రమే పనిచేశాయి. ప్రధానమైన బెన్ గురియెన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం 8–10 గంటల మధ్య టేకాఫ్ సేవలు నిలిచిపోయాయి. వేలాదిగా పౌరులు వీధుల్లోకి వచ్చారు. టెల్అవీవ్తోపాటు దేశవ్యాప్తంగా జరిగిన ర్యాలీల్లో కనీసం 5 లక్షల మంది పాలుపంచుకున్నారు. హమాస్‌తో ఒప్పందం కుదుర్చుకున్న పక్షంలో వారంతా సురక్షితంగా వెనక్కి వచ్చి ఉండేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ బందీలుగా ఉన్న 100 మందిని వెనక్కి తీసుకువచ్చేందుకు వెంటనే హమాస్‌తో ఒప్పందం చేసుకోవాలన్నారు. అయితే, సమ్మె రాజకీయ ప్రేరేపితమంటూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై కారి్మక న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. సమ్మెను మధ్యాహ్నం 2.30 గంటలకల్లా ముగించాలని స్పష్టం చేసింది. కోర్టు నిర్ణయాన్ని శిరసావహిస్తామని దేశంలోని అతిపెద్ద కారి్మక సంఘం హిస్ట్రాదుట్ నేత అర్నాన్ బ్రార్ డేవిడ్ తెలిపారు. తమ వారిని వెంటనే విధుల్లోకి చేరాలని కోరారు. సమ్మె కారణంగా ప్రధాన సేవలకు అంతరాయం ఏర్పడలేదని వివరించారు. ఒప్పందానికి నెతన్యాహు సానుకూలంగా లేరు: బైడెన్ ఇజ్రాయెల్‌లో పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హమాస్‌తో ఒప్పందం కుదుర్చుకుని, బందీలను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆసక్తి చూపడం లేదన్నారు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై సలహాదారులతో వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశానికి హాజరైన అధ్యక్షుడు బైడెన్ మీడియాతో మాట్లాడారు. కాల్పుల విరమణ ఒప్పందానికి అతి చేరువలో ఉన్నామన్నారు. -
Yogi Adityanath: విడిపోతే ఊచకోతే
ఆగ్రా: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆగ్రాలో దుర్గాదాస్ రాథోడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ‘విడిపోతే ఊచకోత కోస్తారు’ అంటూ హిందువులను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘బంగ్లాదేశ్‌లో ఏమవుతోందో చూస్తున్నారుగా! ఆ తప్పిదాలను భారత్‌లో పునరావృతం చేయొద్దు. విడిపోయామంటే ఇక అంతే సంగతులు. మనల్ని ఊచకోత కోస్తారు. కలిసుంటేనే సురక్షితంగా ఉండగలం. అభివృద్ధి చెందగలం’’ అన్నారు. అనంతరం ఈ వ్యాఖ్యలను ఎక్స్‌లో కూడా యోగి పోస్ట్ చేశారు. వీటిపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ముస్లిం విద్వేషంతో యూపీని విడదీస్తున్నదే యోగి అని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ‘‘మైనారిటీల ఇళ్లపైకి ఆయన ఇప్పటికే బుల్డోజర్లు నడుపుతున్నారు. ఇప్పుడిలా మరో అడుగు ముందుకేసి విద్వేష ప్రసంగాలు చేస్తున్నారు. యూపీని మతపరంగా మరింతగా విడదీయజూస్తున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. సీఎం పదవి చేజారేలా ఉండటంతో అభద్రతా భావంతోనే ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రధాని కావాలని యోగికి ఎంత కోరికగా ఉన్నా మరీ ఇప్పట్నుంచే ఇలా విదేశీ వ్యవహారాల్లో వేలు పెట్టొద్దంటూ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు. -
సూడాన్‌లో 85 మంది ఊచకోత
ఖార్టూమ్: సూడాన్‌లో పారా మిలటరీ మూకలు గురువారం సిన్నార్ రాష్ట్రంలోని జల్క్ని గ్రామంపై దాడిచేసి బాలికలను కిడ్నాప్ చేసేందుకు యత్నించగా గ్రామస్థులు ప్రతిఘటించారు. దీంతో మూకలు గ్రామాన్ని ఐదు రోజులపాటు ముట్టడించి 85 మందిని చంపేశారని మీడియా తెలిపింది. సిన్నార్ కోసం సైన్యం, మూకల మధ్య సాగుతున్న పోరుతో ఇన్నేళ్లలో 7.25 లక్షల మంది ప్రజలు వలస వెళ్లారు. -
ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురిచేసిన హత్యాకాండలు!
ఆనాటి యుగం నుంచి నేటి వరకు మానవత్వాన్ని మంటగొలిపి, దిగ్బ్రాంతికి గురిచేసే ఎన్నో మారణకాండలు విచక్షణ రహితంగా జరుగుతూనే ఉన్నాయి. చరిత్రలో అంధకారంతో మూర్ఖత్వంతో దారుణమైనే ఊచకోతలు జరిగితే. నేడు అన్ని తెలిసి స్వార్థం అనే మాయ విశృంఖలమైన హత్యాకాండాలకు దారితీసింది. ఈ అమానీయకరమైన ఘటనలు మనిషన్నవాడు ఏమైపోయాడు అని తలెత్తే ప్రశ్నకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. ఇప్పటి వరకు జరిగిన చరిత్రలో క్రూరమైన వధకు సంబంధించిన రక్త చరిత్రలు చూస్తే... ఆసియాటిక్ వెస్పర్స్ క్రీస్తూ పూర్వం జరిగిన ఘోరమైన మారణహోమం. దీన్ని సుదీర్ఘకాలం పాటు జరిగిన వధ ఆసియాటిక్ వెస్పర్స్గా పిలుస్తారు. పొంటస్ రాజ్య పాలకుడు మిత్రిడేట్స్VIకి విధేయులైన దళాలు, పశ్చిమ అనటోలియాలోని కొన్ని ప్రాంతాల్లో నివశిస్తున్న సుమారు 80 వేల మంది రోమన్, ఇతర లాటిన్ మాట్లాడే ప్రజలను ఊచకోత కోశాయి. దీంతో రోమన్, రిపబ్లిక్ పొంటస్ రాజ్యం మధ్య మిత్రిడాటిక్ యుద్ధానికి దారితీసింది. రైన్లాండ్ యూదుల ఊచకోత ఈ మారణహోమం 1096లో జరిగింది. జర్మన్ కైస్తవుల గుంపులను సాహుహికంగా చంపేశారు. దాదాపు ఈ ఘటనలో 12 వేల మంది చనిపోయారు. యూరోప్‌లో ఇలాంటి ఉదంతాలు కోకొల్లలుగా జరిగాయి లాటిన్ల ఊచకోత ఇది 1182లో జరిగింది. కాన్స్టాంటినోపుల్లోని తూర్పు ఆర్థోడాక్స్ జనాభా పొరుగున ఉండే రోమన్ కాథలిక్‌లపై తిరుగుబాటు చేయడంతో క్రూరమైన హత్యాకాండ చోటుచేసుకుంది. దాదాపు 60 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది పాశ్చాత్య, తూర్పు కైస్తవ చర్చిల మధ్య సంబంధాలను మరింత దిగజార్చి, శత్రుత్వాన్ని పెంచింది. లిస్బన్ ఊచకోత ఏప్రిల్ 19న 1506లో ఈ ఘటన జరిగింది. క్యాథలిక్‌లు చుట్టూ తిరిగే గుంపులను యూదులుగా ఆరోపించి వందలాదిమందిని దారుణంగా హింసించి చంపేశారు. దాదాపు 2 వేల మంది చనిపోయారు. పోర్చుగీస్ రాజధానిలో టోర్రేడో టోంబో నేషనల్ ఆర్కైవ్‌లో 1755లో సంభవించిన లిస్బన్ భూకంపంలో అగ్నిప్రమాదం నుంచి బయటపడిని కొన్ని చెక్కపెట్టేలో నాటి మారణకాండను వర్ణించే ఘటన బయటపడింది. దీన్ని జర్మన్ వుడ్కట్గా అభివర్ణించారు చరిత్రాకారులు. చోళుల ఊచకోత ఇది 1519లో జరిగింది. హెర్నాన్ కోర్టేస్(1487-15747) మెక్సికోను జయించాలనే తపనతో దారుమైన మారకాండకు ఒడిగట్టాడు. దీంతో నిరాయుధ అజ్టెక్ కులీనులు స్పానిష్ ఆక్రమణదారుల చేతుల్లో హతమయ్యారు. కోర్టెస్ త్లాక్స్కలన్ మిత్రుల సాయంతో చోళ్లును హతమార్చారు. దీంతో కొన్ని గంటల్లోనే చోళల నివాసులు వేలాదిమంది చనిపోయారు. సెయింట్ బర్తోమ్యూస్ డే మారణకాండ ఇది 1572లో జరిగింది. రోమన్ కాథలిక్ ప్రభువులు, ఇతర పౌరులు చేసిన సెయింట్ బార్తోమ్యూస్ డే మారణకాండ. ఫలితంగా వేలాదిమంది హ్యూగెనోట్లు (ఫ్రెంచ్ కాల్వినిస్ట్ ప్రొటెస్టంట్లు) మరణించారు. యాంగ్జౌ ఊచకోత ఇది 1645లో జరిగింది. చరిత్రలో జరిగిన అతి పెద్ద మారకాండగా దీన్ని పరిగణిస్తారు. మే 10, 1645న, డోడో, ప్రిన్స్ యు నేతృత్వంలోని క్వింగ్ రాజవంశం దళాలు యాంగ్జౌ నగరంపై దాడి చేశారు. పదిరోజుల జరిగిన ఆ దాడిలో దాదాపు 80 వేల మంది అమాయక పౌరులు చనిపోయారు. ప్రాగా ఊచకోత ప్రాగా ఊచకోత అనేది 1794లో కోస్కియుస్కో తిరుగుబాటు సమయంలో వార్సా శివారు ప్రాంతమైన ప్రాగాపై రష్యన్ దళాలు చేసిన దాడి. దీన్ని రెండవ వార్సా యుద్ధం అని కూడా పిలుస్తారు. బోస్టన్ ఊచకోత బోస్టన్ ఊచకోత అనేది మార్చి 5, 1770న పెద్ద సంఖ్యలో నిరాయుధ వలసవాదులపై బ్రిటిష్ సైనికులు కాల్పులు జరపడంతో అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, ఇంగ్లాండ్ నుంచి స్వాతంత్య్రం కోసం లాబీయింగ్ చేయడానికి వచ్చిన ప్రచారకులను లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులను ప్రయోగించారు. పీటర్లూ ఊచకోత ఆగస్ట్ 16, 1819న ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లోని సెయింట్ పీటర్స్ ఫీల్డ్‌లో పీటర్లూ హత్యాకాండ జరిగింది. దాదాపు 60 వేల మంది శాంతియుత ప్రజాస్వామ్య అనుకూల, పేదరిక వ్యతిరేక నిరసనకారుల గుంపులను చెదరగొట్టడానికి అశ్వికదళాన్ని ప్రయోగించారు. ఈ దాడిలో 18 మంది చనిపోయారు. చియోస్ ఊచకోత గ్రీకు స్వాతంత్య్ర యుద్ధం (1821-1829) సమయంలో ఒట్టోమన్ దళాలు పదివేల మంది గ్రీకులు ఊచకోతకు గురయ్యారు. ఇది 1822లో గ్రీకు ద్వీపం చియోస్‌లో చరిత్రలోనే అత్యంత విషాదకరమైన దారుణ మారణకాండగా భావస్తారు చరిత్రకారులు. గాయపడిన మోకాలి ఊచకోత డిసెంబరు 29, 1890న సౌత్ డకోటాలోని గాయపడిన మోకాలి ప్రాంతంలో యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ దళాలు సుమారు 150 నుంచి 300 మంది లకోటా భారతీయులను వధించారు. ఆ ప్రాంతంలో ఈ దారుణం జరగడంతో గాయపడిన మోకాలి మారణకాండ అని పేరు పెట్టారు. గాయపడిన మోకాలి యుద్దభూమిని చివరికి 1965లో యూఎస్ నేషనల్ హిస్టారిక్ ల్యాండ్‌మార్క్‌గా ప్రకటించారు. హమీడియన్ మారణకాండలు హమీడియన్ మారణకాండలు 1894- 1897 మధ్య ఒట్టోమన్ దళాలచే ఆర్మేనియన్లపై జరిగిన హింసాకాండకు సంబంధించినది. దీని ఫలితంగా 3 లక్షల మంది ప్రజలు మరణించారు. ఈ మారణహోమంపై సంతకం చేసిన సుల్తాన్ అబ్దుల్ హమీద్ II (1842–1918) పేరు మీద ఈ ఊచకోతకు పేరు పెట్టారు. విల్మింగ్టన్ ఊచకోత నవంబర్ 10, 1898న నార్త్ కరోలినాలోని విల్మింగ్టన్లో పనిచేస్తున్న నల్లజాతీయుల యాజమాన్యంలోని వార్తాపత్రిక డైలీ రికార్డ్ కార్యాలయాలను తెల్లజాతి ఆధిపత్యవాదుల సాయుధ గుంపు తగలబెట్టింది. ఆఫ్రికన్-అమెరికన్ పౌరులు ప్రాణాల కోసం పారిపోవడంతో తిరుగుబాటుదారులు వీధుల్లోకి వెళ్లి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దాదాపు 300 మంది మిశ్రమ జాతి నివాసితులు ప్రాణాలు కోల్పోయారు. లుడ్లో ఊచకోత ఇది ఏప్రిల్ 20, 1914న కొలరాడోలోని లుడ్లో వద్ద జరిగింది. కొలరాడో నేషనల్ గార్డ్, ప్రైవేట్ కొలరాడో ఫ్యూయెల్ అండ్ ఐరన్ కంపెనీ గార్డులు సమ్మె చేస్తున్న బొగ్గు గని కార్మికులు వారి కుటుంబాలపై చేసిన దాడే లుడ్లో ఊచకోత. ఈ దాడిలో మహిళలు, పిల్లలతో సహా 21 మంది మరణించారు. ఈ దారుణానికి ఒడిగట్టింది బిలియనీర్ పారిశ్రామికవేత్త, బొగ్గు క్షేత్రాలను నిర్వహిస్తున్న యజమాని జాన్ డీ రాక్ఫెల్లర్ జూనియర్ . జలియన్‌వాలాబాగ్ ఊచకోత, 1919 జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారతదేశంలోని అమృత్సర్ పట్టణంలో ఒక తోటలో 1919 ఏప్రిల్ 13న సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు పది నిమిషాలపాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ వెయ్యి మందికి పైగా మరణించారు. రెండువేల మందికి పైగా గాయపడ్డారు. తుల్సా జాతి ఊచకోత తుల్సా, ఓక్లహోమాలోని గ్రీన్వుడ్ జిల్లా మే 31, 1921న శ్వేతజాతీయుల గుంపులు నల్లజాతి నివాసితులపై దాడి చేసి ఇళ్లు, వ్యాపారాలను ధ్వంసం చేసింది. దీంతో యూఎస్ చరిత్రలో జాతి హింసకు సంబంధించిన అత్యంత ఘోరమైన సంఘటనలలో ఒకటిగా ఇది వర్ణించబడింది. దాదాపు 50 మంది శ్వేతజాతీయుల మాదిరిగానే రెండు వందల మంది రంగుల ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అంచనా. మరో 10,000 మంది ఆఫ్రికన్ అమెరికన్లు నిరాశ్రయులయ్యారు. తుల్సా జాతి ఊచకోత తుల్సా, ఓక్లహోమాలోని గ్రీన్వుడ్ జిల్లా మే 31, 1921న శ్వేతజాతీయుల గుంపులు నల్లజాతి నివాసితులపై దాడి చేసి ఇళ్లు, వ్యాపారాలను ధ్వంసం చేశారు. దీంతో ఈ ఘటన యూఎస్ చరిత్రలో జాతి హింసకు సంబంధించిన అత్యంత ఘోరమైన సంఘటనలలో ఒకటిగా వర్ణించబడింది. ఈ ఘటనలో దాదాపు 50 మంది శ్వేతజాతీయుల 200 నల్లజాతీయులు ప్రాణాలు కోల్పోయారని అంచనా. మరో 10 వేల మంది ఆఫ్రికన్ అమెరికన్లు నిరాశ్రయులయ్యారు. సెయింట్ వాలెంటైన్స్ డే ఊచకోత 20వ శతాబ్దంలో అత్యంత ఎక్కువగా ఆకర్షించిన హత్యాకాండల్లో ఒది ఒకటి. ప్రత్యర్థి ముఠాలోని ఏడుగురు సభ్యులపై చికాగో మాబ్స్టర్ అల్ కాపోన్ ఆదేశించిన దాడి. ఈ ఘటన జరిగిన ప్రాంతం 1967లో కూల్చేశారు. నాన్జింగ్ ఊచకోత 1937-38 డిసెంబరు-జనవరిలో చైనా నగరమైన నాన్జింగ్ నివాసితులపై ఇంపీరియల్ జపనీస్ దళాలు చేసిన దురాగతం ఇది. ప్రపంచ చరిత్రలో మానవాళికి వ్యతిరేకంగా జరిగిన అతిపెద్ద నేరాలలో ఒకటి. ఆ ఘటనలో చైనీస్ మృతుల సంఖ్య మూడు లక్షల వరకు ఉంటుందని అంచనా. 1935లో ప్రిన్స్ యసుహికో అసకా (1887–1981) ఈ దాడిని ఆదేశించినట్లు ఆరోపణలు ఉన్నాయి గానీ అతడిపై ఎలాంటి అరెస్టుల వంటివి జరగలేదు. కాటిన్ ఊచకోత రెండవ ప్రపంచ యుద్ధంలో అనేక దురాగతాలు జరిగాయి, కానీ ఒక సింగిల్ సంఘటన ఊచకోత నిలుచింది. ఏప్రిల్ మరియు మే 1940లో ఎన్‌కేవీడీ సభ్యులు, సోవియట్ రహస్య పోలీసు స్మోలెన్స్క్ నగరానికి సమీపంలోని కాటిన్ ఫారెస్ట్‌లో 22 వేల మంది పోలిష్ సైనికాధికారులు, మేధావులను హత్య చేశారు. వారి సామూహిక సమాధులను 1943లో జర్మన్ దళాలు వెలికితీశాయి. 1990 వరకు నాజీలు ఊచకోతకు కారణమయ్యారు. చివరకు రష్యన్ అధికారులు ఈ నేరాన్ని అంగీకరించారు. ఒరాడోర్-సుర్-గ్లేన్ ఊచకోత ప్రతికార చర్య కారణంగా జరిగిన ఊచకోత. జూన్ 10 1944న నాజీలు ఫ్రెంచ్ గ్రామమైన ఒరడోర్ సుర్ గ్లేన్ నివాసితులను సందర్శించడమే ఈ ఘటనకు ప్రధాన కారణం. అక్కడ తమ ఫ్రెంచ్ నివాసితుల చేతిలో పట్టుబడ్డారని తెలియడంతో వాఫెన్ ఎస్ఎస్ యూనిట్ సభ్యులు 600 మంది నివాసితులను హతమార్చారు. దీంతో ఆ గ్రామం యుద్ధంతో అట్టుడికిపోయింది. దీని కారణంగా గ్రామం శిథిలంగా మారిపోయింది. ప్రస్తుతం దీన్ని శాశ్వత స్మారక చిహ్నంగా, మ్యూజియంగా మార్చాలని అధ్యక్షుడు చార్లెస్ డీ గల్లె ఆదేశించారు. మాల్మెడీ ఊచకోత వాఫెన్-ఎస్ఎస్ చేపట్టిన మరో దారుణ ఉదంతం ఇది. బెల్జియన్ నగరమైన మాల్మెడీ సమీపంలో డిసెంబర్ 17, 1944న 84మంది యూఎస్ ఆర్మీ యుద్ధ ఖైదీలను ఉరితీశారు హిల్ 303 ఊచకోత హిల్ 303 ఊచకోత అనేది దక్షిణ కొరియాలోని వేగ్వాన్ పైన ఉన్న కొండపై 40 మంది అమెరికన్ యుద్ధ ఖైదీలను కాల్చి చంపేశారు. ఇది ఉత్తర కొరియా సైనికులు చేసిన ఘోర యుద్ధ నేరం. షార్ప్‌విల్లే ఊచకోత షార్ప్‌విల్లే హత్యాకాండ మార్చి 21, 1960న దక్షిణాఫ్రికా టౌన్‌షిప్‌లోని షార్ప్విల్లేలోని ట్రాన్స్‌వాల్‌లోని పోలీస్ స్టేషన్లో (నేడు గౌటెంగ్‌లో భాగం) జరిగింది. పాస్ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు 5 వేల నుంచి 7 వేల మంది నల్లజాతీయులు నిరసనలు చేయడంతో దక్షిణాఫ్రికా పోలీసులు వారిని చెదరగొట్టేందుకు కాల్పులు జరిపారు. దీంతో ఈ ఘటనలో 69 మంది ప్రాణాలు కోల్పోయారు. యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ టవర్ మారణకాండ ఆగష్టు 1, 1966 ఉదయం, చార్లెస్ విట్మన్ ఆస్టిన్లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ టవర్ పైకి ఎక్కి.. క్రింద ఉన్న పాదచారులపై విచక్షణారహితంగా కాల్చడం ప్రారంభించాడు. ఆ రోజు మొత్తం 15 మంది మరణించారు. విట్మన్ తన తల్లి, భార్యని అంతకుముందే హత్య చేశాడు. చివరికి విట్మన్ను ఆస్టిన్ పోలీసు అధికారులు కాల్చి చంపారు. ఈ సంఘటన యునైటెడ్ స్టేట్స్ చరిత్రలో బహిరంగ ప్రదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన సామూహిక హత్యలలో ఒకటి. మై లై ఊచకోత యూఎస్ సైనిక చరిత్రలో జరిగిన అత్యంత అవమానీయకరమైన ఘటనలో ఒకటి ఇది. మార్చి 16, 1968న దక్షిణ వియత్నాంలోని మై లై గ్రామంలోకి ప్రవేశించిన సుమారు 500 మంది పురుషులు, మహిళలు, పిల్లలను అమెరికన్ సైనికుల సంస్థ ఊచకోత కోయడం జరిగింది. ఈ సంఘటన నవంబర్ 1969లో ప్రజలకు తెలిసినప్పుడు ప్రపంచ ఆగ్రహాన్ని ప్రేరేపించింది. బోగ్‌సైడ్ ఊచకోత బ్లడీ సండేగా ప్రసిద్ధి చెందింది. జనవరి 30, 1972 నాటి బోగ్‌సైడ్ మారణకాండలో 13 మంది నిరాయుధ పౌరులు ఉత్తర ఐర్లాండ్‌లోని డెర్రీలో బ్రిటిష్ ఆర్మీ సభ్యులు కాల్చి చంపారు. మ్యూనిచ్ ఊచకోత పాలస్తీనా టెర్రరిస్టు గ్రూప్ బ్లాక్ సెప్టెంబర్ సభ్యులు ఇజ్రాయెల్ ఒలింపిక్ జట్టులోని 11 మంది సభ్యులను బందీలుగా పట్టుకుని చంపేశారు. ఆ ఘటనలో అథ్లెట్లు ఫర్స్టెన్ఫెల్డ్బ్రక్ ఎయిర్ బేస్‌లో వారి బంధీలచే చంపబడ్డారు. సబ్రా, షటిలా ఊచకోత, 1982 బీరుట్‌లోని సబ్రా, షటిలా శరణార్థి శిబిరంలో లెబనీస్ దళాల మిలీషియా అనే ఆర్మీ ద్వారా 460 మంది ప్రజలను 3,500 మంది పౌరులును హతమార్చారు. వారిలో ఎక్కువగా పాలస్తీనియన్లు, లెబనీస్ షియాలు చనిపోవడంతో దీనిపై విస్తృతమైన వ్యతిరేకత ఎదురైంది. ఈ ఊచకోత సెప్టెంబర్ 18, 1982న మిలీషియా మిత్రపక్షమైన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కనుచూపు మేరలో జరిగింది. స్రెబ్రెనికా ఊచకోత 1995 మారణహోమం బాధితుల కోసం స్రెబ్రెనికా-పోటోకారి మెమోరియల్ శ్మశానవాటికలో వేలకొద్దీ పారుల సమాధిగా ప్రతీకాత్మకంగా పేర్చబడి ఉన్నాయి. జూలై 1995 స్రెబ్రెనికా ఊచకోతలో వేలకు పైగా ఎక్కువ మంది ముస్లిం పురుషులు మరణించారు. వా పోర్ట్ ఆర్థర్ ఊచకోత ఏప్రిల్ 1996లో తాస్మానియాలోని పోర్ట్ ఆర్థర్‌లో మార్టిన్ బ్రయంట్ అనే ఒంటరి ముష్కరుడు హత్యాకాండకు దిగి 35 మందిని అంతమొందించాడు. అతను చివరికి సీస్కేప్ గెస్ట్‌హౌస్‌లో పట్టుబడ్డాడు. ఇది ఇప్పుడు స్మారక ప్రదేశం. ఈ ఘటన ఆధునిక ఆస్ట్రేలియాలో ఒకే వ్యక్తి చేసిన అత్యంత ఘోరమైన ఊచకోతగా మిగిలిపోయింది. (చదవండి: ఈ టూర్ యాప్ మహిళల కోసమే.. ఇందులో ప్రత్యేకతలు ఏంటో చూసేయండి) -
కాంగోలో ఉగ్ర ఘాతుకం.. 36 మంది మృతి
గోమా: ఆఫ్రికా దేశం కాంగోలో ఇస్లామిక్ స్టేట్ అనుబంధ ఉగ్ర సంస్థ అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్(ఏడీఎఫ్) జరిపిన మారణకాండలో 36 మంది పౌరులు చనిపోయారు. నార్త్ కివు ప్రావిన్స్ ముకోండి గ్రామంలోకి బుధవారం రాత్రి కత్తులు, తుపాకులతో ప్రవేశించిన ఉగ్రమూకలు ఇళ్లకు నిప్పుపెట్టాయి. బయటకు వచ్చిన పౌరులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డాయి. ఘటనలో 36 మంది చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కొందరిని ఎత్తుకుపోయారు. ఏడీఎఫ్ ఉగ్రమూకలు చిన్నారులపైనా దారుణాలకు పాల్పడుతున్నాయి. -
నరకుడికి మోక్షపురి.. నరకాసురుడి వధ జరిగింది ఇక్కడే..!
చల్లపల్లి(కృష్ణా జిల్లా): పవిత్ర కృష్ణానదీ తీరంలోని చారిత్రక పుణ్యక్షేత్రాల్లో చల్లపల్లి మండలం నడకుదురు గ్రామం ఒకటి. నరకాసుర సంహార క్షేత్రంగా, మోక్షపురిగా చరిత్ర ప్రసిద్ధి గాంచి కాలక్రమేణా నరకొత్తూరు, నరకదూరుగా మారి నడకుదురుగా స్థిరపడింది. గ్రామంలో కృష్ణానది గర్భంలో ఉన్న శ్రీ ఫృద్వీశ్వరస్వామి ఆలయం, చెంతనే ఉన్న పాటలీవనం సందర్శనీయ స్థలాలు. నడకుదురు నరకునికి మోక్షం ప్రసాదించిన క్షేత్రంగా, మోక్షపురిగా గుర్తింపు ఉంది. నరకాసురుడు పూజించిన స్థలం.. నారద మహాముని నరకాసురుడితో నీవు భూదేవి పుత్రుడవని తెలియజేసి, ద్విముఖుడనే రాక్షసుడిని సంహరించిన పాపాన్ని ప్రక్షాళన చేసుకునేందుకు పుష్కరకాలం స్వయంభువైన శ్రీ ఫృద్వీశ్వరుని పూజించమని సూచిస్తాడు. నరకాసురుడు ఫృద్వీశ్వరాలయానికి చేరుకుని కృష్ణానదిలో నిత్య స్నానమాచరిస్తూ 4,320 రోజుల పాటు స్వామిని పూజిస్తాడు. అదే నడకుదురు గ్రామంలోని ఫృద్వీశ్వరాలయం. వధ జరిగింది ఇక్కడే.. నరకాసురుడి ఆగడాలతో అల్లాడిపోతున్న ముల్లోకాల వాసులను కాపాడేందుకు నరకాసురుని సంహరించ దలచిన శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై ఈ ప్రాంతంలో ఉన్న నరకాసురుడితో యుద్ధానికి దిగుతాడు. యుద్ధంలో శ్రీకృష్ణుడు మూర్చబోగా, సత్యభామ ఫృద్వీశ్వర క్షేత్రం సమీపంలో నరకాసురుని సంహరించినట్లు చారిత్రక కథనం. భూదేవికి ప్రతిరూపం, నరకాసురుని తల్లిలాంటి సత్యభామ నరకాసురునికి ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించి, నదీతీరాన పిండ తర్పణాలు వదిలినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. కృష్ణ–భామల విహార స్థలం.. నరకాసుర సంహారం అనంతరం ఆలయం చెంతనున్న పాటలీవనంలో విశ్రాంతి తీసుకున్న శ్రీకృష్ణుడు, సత్యభామలు లక్ష్మీనారాయణుని విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు పూజలు చేసినట్లు కథనం. నడకుదురు ఆలయం వద్ద పాటలీవృక్షంకింద లక్ష్మీనారాయణుని విగ్ర హం నేటికీ భక్తుల పూజలందుకుంటోంది. మహిమాన్వితం పాటలీవృక్షం.. గ్రామ చారిత్రక, ఆథ్యాత్మిక వైభవానికి నిదర్శనం నడకుదురు ఫృద్వీశ్వరాలయం చెంతనున్న దేవతావనం. దేవలోక వనమాత పాటలీ వృక్షాలు దేశంలో కేవలం కాశీ తర్వాత నడకుదురులో మాత్రమే ఉన్నాయి. కరకట్ట దిగువనే నదిలో కొబ్బరిచెట్లు, పాటలీవృక్షాలు, ఉసిరిచెట్ల మధ్య ఆలయం ఉంటుంది. చుట్టూ పసుపుతోటలు, వాణిజ్య పంటలతో చల్లని వాతావరణం భక్తులకు ఆలయం స్వాగతం పలుకుతుంది. దీపావళి ప్రత్యేకత సంతరించుకుంటుంది. -
రక్తక్షేత్రం వెలుగులో దళిత ఉద్యమ ప్రజ్వలనం
కారంచేడు తర్వాత దక్షిణ భారతంలోనే పేర్కొనదగిన ఉద్యమం చుండూరు దళిత ఉద్యమం. గుంటూరు జిల్లాలో విజయవాడ – చెన్నై రైలు మార్గంలో ఉన్న ఊరు చుండూరు. 1991 ఆగస్ట్ 6న దళితులను ఆధిపత్య కులాల వారు ఊచకోత కోసిన అమానవీయ ఘటన జరిగింది. అదే చుండూరు ఘటనగా ప్రసిద్ధి చెందింది. తెనాలి ప్రాంతంలో హరిత విప్లవం ద్వారా భూములు సస్యశ్యామలం అయినాయి. దళిత వాడ కూడా బలంగా ఉంది. మాలలు, మాదిగలు కలిసి సుమారు 500 కుటుంబాలు కాపురాలు ఉంటున్నాయి. వీరిలో కారంచేడు ఉద్యమం తర్వాత సామాజిక చైతన్యం వచ్చింది. ప్రతి ఇంట్లో చదువుకున్న పిల్లాడో, పిల్లో ఉన్నారు. కొందరు ఉద్యోగులూ ఉన్నారు. ఈ చైతన్యానికి ఆధిపత్య కులాలవారు తట్టుకోలేక పోయారు. ముఖ్యంగా హైస్కూళ్ళలో ఎస్సీ విద్యార్థులు పక్కపక్క బెంచీల్లో కూర్చోవడం, విద్యా సహకారాన్ని పొందడం... ఇవన్నీ అగ్రకుల గ్రామాల్లో చర్చనీయ అంశాలయ్యాయి. కొన్ని చోట్ల ప్రేమ ఘట్టాలు జరగటం కూడా విద్వేషం రావడానికి మూల కారణం అయ్యింది. ఫలితంగా 8 మంది దళితులు ఆధిపత్య కులాల వారి దాడిలో మరణించారు. ఆ తర్వాత జరిగిన ఉద్యమంలో మరో ఇద్దరు దళితులు ప్రాణాలు కోల్పోయారు. వీరందరినీ ఊరు నడి బొడ్డున ‘రక్త క్షేత్రం’లో పాతి పెట్టాం. చుండూరు బాధితుల పక్షాన జరిగిన ఉద్యమానికి నేను నాయకత్వం వహించడం వలన అంబేడ్కర్ ఆలోచనల్ని జాతీయస్థాయి పోరాటంలో మమేకం చేసే అవకాశం కలిగింది. ఉద్యమం ముఖ్యంగా ఢిల్లీ అంబేడ్కర్ భవన్లో కొన్నివందల మంది ఆశ్రయం తీసుకుని, అక్కడ నుంచి బయలుదేరి బోట్ క్లబ్ వరకు 13 కిలోమీటర్లు ర్యాలీగా వచ్చి సాయంత్రం వరకూ ధర్నా నిర్వహించాం. 1991 అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడు ఢిల్లీ కోటను ముట్టడించాం. ఢిల్లీలోని 120 మంది ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం బలపరచడంతో ఈ ఉద్యమానికి బలం చేకూరింది. మాజీ హోం మినిస్టర్ బూటా సింగ్, ప్రతిపక్షంలో కీలక పాత్ర పోషిస్తున్న పార్లమెంట్ సభ్యులు రామ్ విలాస్ పాశ్వాన్, ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు సమస్య పట్ల అవగాహన కలిగించడంలో ముఖ్య పాత్ర వహించారు. అక్టోబర్ నాలుగవ తేదీ ప్రధానమంత్రి – ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. బాధిత కుటుంబాలతో పాటు నేనూ చర్చలకు హాజరయ్యాను. చర్చలు చుండూరు కేసు విచారణకు, దాడి జరిగిన చుండూరులోనే ప్రత్యేక కోర్టు పెట్టాలనేది ముఖ్యమైన డిమాండ్. 440 బాధిత కుటుంబాలకూ ఇళ్ళ స్థలంతో సహా ఒక ఇల్లు నిర్మించడం, ప్రతి కుటుంబానికీ ఒక ఎకరం పొలం ఇవ్వడం, బాధిత కుటుంబాలలో పదవ తరగతి ఉత్తీర్ణులైన వాళ్ళందరికీ ఉద్యోగాలు, చనిపోయిన కుటుంబాలలో 18 సంవత్సరాలు వయసు దాటిన వారందరికీ ఉద్యోగాలు ఇవ్వడం, చుండూరులో ఒక రెసిడెన్షియల్ హైస్కూల్ ఏర్పాటు, 150 మంది ముద్దాయిలందరనీ అరెస్ట్ చేయడం వంటివి బాధితులు ప్రధానమంత్రిని చేసిన మరికొన్ని డిమాండ్లు. (క్లిక్: పై కోర్టుల్లోనూ రిజర్వేషన్లు ఉండాలి) చుండూరు ఉద్యమం భారతదేశ దళిత ఉద్యమానికి చుక్కాని. 111 మంది ఎస్సీ, ఎస్టీ ఎంపీలని ఏకం చేసి రాష్ట్రపతి భవన్‌కు దళిత ఉద్యమం ర్యాలీ చేయించిన మహోన్నత చారిత్రక ఘటన. అప్పటి రాష్ట్రపతి వెంకట్రామన్ ప్రత్యేక కోర్టు నివేదనను తిరస్కరించడంతో... రాష్ట్రపతి దళితుడు కావాలి అనే నినాదం చేయడం ద్వారా ఇప్పుడు ఒక నారాయణన్, ఒక గోవింద్, ఒక ద్రౌపదీ ముర్మూలు ఆ పీఠాన్ని అధిష్టించడానికి అవకాశం కల్పించిన ఉద్యమం. ‘ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ ఎట్రాసిటీ యాక్ట్–1989’ ననుసరించి చుండూరులోనే ప్రత్యేక కోర్టును సాధించిన ఉద్యమం. కమ్యూనిస్టులూ కుల సమస్య గురించి చర్చించేలా చేసిన ఉద్యమం. మూడు దశాబ్దాల తర్వాత ‘రక్త క్షేత్రం’ ఆగస్ట్ 6ను దళిత బహుజన మైనారిటీల రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా పోరాడే బాధ్యతను మనకు అప్పజెబుతున్న రోజుగా భావిద్దాం. అంబేడ్కర్ మార్గంలో విజయ సోపానాన్ని అధిరోహించేద్దాం. (క్లిక్: ఆంగ్ల సహన పాఠం నేర్చుకుందామా?) - డాక్టర్ కత్తి పద్మారావు సామాజిక ఉద్యమకారుడు (చుండూరు ఘటనకు మూడు దశాబ్దాలు) -
జైహింద్ స్పెషల్: ఖిస్సా ఖ్వానీ బజార్ ఊచకోత
బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కోసం భారతదేశంలో ఎగసిపడిన చిన్న నిప్పు రవ్వ కూడా స్వాతంత్య్ర సమరజ్వాలకు ఆజ్యం పోసినదే. నేటి పాకిస్థాన్‌లోని ఖిస్సా ఖ్వామీ బజార్లో 90 ఏళ్ల క్రితం 1930 ఏప్రిల్‌లో చెలరేగిన అలాంటి జ్వాలే ఒకటి భారత స్వాతంత్య్ర సంగ్రామానికి తన వంతుగా నిప్పందించింది. ఆనాటి ఘటనకు ఈనాటి చేదు జ్ఞాపకమే.. ‘ఖిస్సా ఖ్వానీ బజార్ ఊచకోత’. నేటి పాకిస్థాన్‌లోని ప్రస్తుత ప్రావిన్సులలో ఒకటైన ఖైబర్ పక్తున్‌క్వా రాజధాని పెషావర్‌లోని ఒక వీధి పేరే ఖిస్సా ఖ్వానీ. ఖిస్సా ఖ్వానీ అంటే ‘కథలు చెప్పేవాళు’్ల అని. మన బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ సరిగ్గా నూరేళ్ల క్రితం ఆ ఖిస్సా ఖ్వానీ వీధిలోనే జన్మించారు! మరో నటుడు రాజ్ కపూర్ పుట్టింది కూడా ఖిస్సా ఖ్వానీలోనే. షారుక్ ఖాన్ కుటుంబ సభ్యులు కొందరు కూడా ప్రస్తుతం అక్కడే నివసిస్తున్నారు. ఆ వీధికి ఇంతకుమించి ఉన్న చారిత్రక గుర్తింపు మాత్రం అక్కడ జరిగిన ఊచకోతే. ఆ రోజు.. ఏప్రిల్ 23 న ఖిస్సా ఖ్వానీలో ‘ఖుదాయి కిద్మత్గార్’ ఉద్యమకారులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అహింసాయుత ప్రదర్శన జరుపుతున్నారు. వారి నాయకుడు అబ్దుల్ గఫార్ ఖాన్. ఖుదాయీ కిద్మత్గార్ (దేవుని సేవకులు) ఉద్యమకర్త ఆయనే. నాటి వాయవ్య సరిహద్దు ప్రావిన్సులోని ఉత్మాన్‌జాయ్ పట్టణంలో గఫార్ ఖాన్ తన ప్రసంగం పూర్తి చేసి వేదిక కిందికి దిగుతుండగానే గఫార్ ఖాన్‌ను, మరికొందరు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రదర్శనా స్థలానికి చేరుకున్న బ్రిటిష్ బలగాలు అందుకు నిరసనగానే అనేక ప్రాంతాలతో పాటు ఖిస్సా ఖ్వానీలోనూ ప్రదర్శనలు జరిగాయి. గఫార్ ఖాన్‌ను తక్షణం విడుదల చేయాలని ప్రదర్శనకారులు నినాదాలిచ్చారు. ‘గుమికూడి ఉన్న మీరంతా తక్షణం నినాదాలు మాని ఎవరిదారిన వారు వెళ్లకుంటే తగిన సమాధానం చెప్పవలసి ఉంటుంది’ అని ఆ ప్రాంతంలోకి ప్రవేశించిన బ్రిట్రిష్ సైనిక బలగాలు హెచ్చరించాయి. ఆ బలగాలలో ఉన్నది కూడా భారతీయులే. ప్రదర్శనకారులు కదల్లేదు. సైనికులు తుపాకులు తీశారు. ప్రదర్శనకారులు బెదరలేదు. దాంతో సైనిక వాహనాలు క్రూరాతిక్రూరంగా వారిని తొక్కిపడేశాయి. ఆ ఘటనలో ప్రదర్శనకారులతో పాటు, నిలబడి చూస్తున్న కొందరు పౌరులు కూడా అక్కడికక్కడే మరణించారు. తుపాకీ కాల్పులకు మరికొందరు ప్రాణాలు వదిలారు. ఆ బలగాలు ‘గర్వాల్ రెజిమెంట్’వి. అందులోని కొందరు సైనికులు నిరాయుధులైన ప్రదర్శనకారులపై కాల్పులు జరిపేందుకు నిరాకరించారు. కానీ పైనుంచి ఆదేశాలు రావడంతో రెజిమెంట్‌లోని మిగతా సైనికులు తమ ‘డ్యూటీ’ తాము చేసేశారు. కాల్పులు జరిపేందుకు నిరాకరించిన సైనికులపై బ్రిటిష్ అధికారులు ఆ తర్వాత సైనిక విచారణ జరిపించి ఎనిమిదేళ్ల జైలుశిక్ష విధించారు. ఊచకోత తర్వాత కూడా పెషావర్, ఆ పరిసర ప్రాంతాలలో ఖుదాయి కిద్మత్గార్ కార్యకర్తలు తీవ్రమైన అణచివేతలను ఎదుర్కొన్నారు. దీనిపై వ్యాఖ్యానిస్తూ .. ‘హింసాత్మకమైన ఉద్యమకారుడికన్నా, అహింసాయుతంగా పోరాడుతున్న ఒక పష్తూన్ తెగ మనిషి ఎక్కువ ప్రమాదకారి అని బ్రిటిష్ ప్రభుత్వం భావించినట్లుంది..’ అని గఫార్ ఖాన్ రాశారు. ఈ కారణంగానే తరచు తమ ఉద్యమం తేలికపాటి ప్రదర్శనకే భగ్గుమనేటంతటి ఘర్షణగా మారేది అని కూడా రాసుకున్నారు. ఖిస్సా ఖ్వామీ ఊచకోత దేశవ్యాప్తంగా ప్రజల్ని ఆగ్రహావేశాలకు గురిచేసింది. దేశంలో తిరుగుబాటు ధోరణులు వ్యాప్తి చెందాయి. ఖిస్సా ఖ్వామీ ఊచకోత విషయం బ్రిటన్ రాజు ఆరవ జార్జి దృష్టికి వెళ్లి, ఘటనపై ఆయన న్యాయ విచారణకు ఆదేశించారు. నాటి లక్నో ప్రొటెక్టరేట్‌కు చెందిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నైమతుల్లా చౌదరికి కేసు బాధ్యతను అప్పగించారు. ఆయన ఘటనాస్థలి వద్దకు అనేకమార్లు స్వయంగా వెళ్లి, సాక్షులతో మాట్లాడి ‘బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ’దే తప్పు అంటూ.. 200 పేజీల నివేదికను రాజుకు సమర్పించారు. రాజు ఆయన నిబద్దతను గుర్తించి, గౌరవించారు. ఖుదాయీ కిద్మత్గార్ దేశ విభజనను వ్యతిరేకించింది. అయితే స్వతంత్ర పాకిస్తాన్ ఏర్పడేందుకు అలాంటి వ్యతిరేకత ప్రతికూలాంశమౌతుందని ఎక్కువశాతం పాక్ నాయకులు భావించారు. అబ్డుల్ గఫార్‌ఖాన్‌కు ఇష్టం లేకుండానే ఒక దేశం రెండు దేశాలుగా విడిపోయింది. ఖిస్సా ఖ్వామీ ఊచకోత.. స్వాతంత్య్ర సంగ్రామాల జ్ఞాపకాల్లోంచి కాలంతో పాటు దాదాపుగా కరిగిపోయింది. -
Texas shooting: ఫేస్బుక్లో ప్రకటించి మరీ...
హూస్టన్: హంతకుడు రామోస్ ఫేస్బుక్లో ముందుగా ప్రకటించి మరీ నరమేధానికి పాల్పడ్డాడు! ‘నానమ్మను కాల్చబోతున్నా’ అని మంగళవారం 11 గంటలప్పుడు ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఆమెను కాల్చాక, ‘ఇప్పుడు స్కూల్లో షూటౌట్‌కు బయల్దేరుతున్నా’’ అంటూ మరో పోస్ట్ చేశాడు. అరగంటకే దారుణానికి తెగబడ్డాడు. దీనిపై ఉదయం నుంచీ పలు సంకేతాలిస్తూ వచ్చాడు. ‘ఓ చిన్న రహస్యం చెప్పాలనుకుంటున్నా’ అంటూ లాస్‌ఏంజెలెస్‌కు చెందిన ఓ యువతికి ఇన్‌స్టాగ్రాంలో మంగళవారం ఉదయమే మెసేజ్ చేశాడు. ‘‘ఇంకాసేపట్లో నేను...’’ అంటూ 9.16కు ఓ స్మైలీ ఎమోజీ పెట్టాడు. ‘‘11 గంటల లోపు చెప్తా’’ అంటూ ముగించాడు. 11.30కు నరమేధం సృష్టించాడు. తన టిక్‌టాక్ పేజీ పరిచయంలో ‘పిల్లలూ! నిజ జీవితంలో కూడా భయపడేందుకు రెడీగా ఉండండి’’ అని కూడా రాసుకున్నాడు! కాల్పులకు వాడిన తుపాకులను, మేగజైన్లను రామోస్ తన 18వ పుట్టిన రోజు సందర్భంగా గత వారమే కొన్నాడు. వాటితో పోజిస్తూ ఫొటోలు దిగడమే గాక ఇన్‌స్టాగ్రాంలో అప్లోడ్ చేశాడు. టెక్సాస్‌లో 18 ఏళ్లు నిండితే లైసెన్సుతో పని లేకుండా తుపాకులు కొనుక్కోవచ్చు. నానమ్మతో నిత్యం గొడవలే డిగ్రీ చదవలేకపోయానంటూ రామోస్ నిత్యం బాధపడేవాడని పొరుగువారు చెప్పారు. ఈ విషయమై నిత్యం నానమ్మతో గొడవ కూడా పడేవాడన్నారు. స్థానిక విండీస్ సరుకుల దుకాణంలో పని చేసే అతనిది దూకుడు మనస్తత్వమని సహోద్యోగులు చెబుతున్నారు. ‘‘ఎప్పుడూ మౌనంగా ఉండేవాడు. మహిళా ఉద్యోగులకు అసభ్య మెసేజీలు పంపేవాడు. వాళ్లతో చాలా దురుసుగా ప్రవర్తించేవాడు. స్థానిక పార్కులో పలువురితో బాక్సింగ్ చేసేవాడు’’ అన్నారు. అతనికి తల్లితోనూ సరిపడేది కాదని, అందుకే కొద్ది నెలల క్రితమే నానమ్మ ఇంటికి వచ్చాడని చెప్పారు. రామోస్ స్కూల్ మేట్స్ సోమవారం డిగ్రీ పూర్తి చేసి పట్టాలు తీసుకున్నారని సమాచారం. ఆ ఆక్రోశంతోనే దారుణానికి ఒడిగట్టాడని భావిస్తున్నారు. నానమ్మపై కాల్పులు జరిపి, ‘నన్ను కాల్చేస్తున్నాడు’ అని ఆమె అరుస్తుండగానే కారెక్కి స్కూలుకేసి దూసుకెళ్లాడు. నత్తితో బాధపడేవాడు రామోస్‌కు నత్తి ఉండేదని, దాంతో బాల్యంలో స్కూళ్లో తోటి పిల్లల చేతిలో చాలా అవమానాలకు గురయ్యాడని అతని సహ విద్యార్థి చెప్పాడు. ‘‘రామోస్ నత్తిని, అతను వేసుకునే నాసిరకం బట్టలను పిల్లలంతా బాగా వెక్కిరించేవారు. అతని పేదరికాన్ని కూడా హేళన చేసేవారు. చూట్టానికి గే మాదిరిగా కన్పిస్తున్నావంటూ ఆటపట్టించేవారు. అది భరించలేక అతను స్కూలు ఎగ్గొట్టేవాడు. చివరికి మొత్తానికే మానేశాడు’’ అని చెప్పుకొచ్చాడు. తర్వాత షూటింగ్ అంటే ఇష్టం పెంచుకున్నాడని, కాల్ ఆఫ్ డ్యూటీ అనే ఫైటింగ్ గేమ్‌కు వీరాభిమానిగా మారాడని వివరించాడు. -
బుచా నరమేధంపై పుతిన్ స్పందన
ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు నరమేధానికి, అకృత్యాలకు పాల్పడ్డాయన్న పాశ్చాత్య దేశాల ఆరోపణలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. ఉక్రెయిన్‌లో మిలిటరీ ఆపరేషన్ ముగిసేది.. పోరాట తీవ్రతను బట్టే ఉంటుందని మంగళవారం సాయంత్రం ఆయన స్పష్టం చేశారు. ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై, పాశ్చాత్య దేశాల ఆరోపణలపై పుతిన్ ఈ రేంజ్లో బహిరంగంగా స్పందించడం విశేషం. ఉక్రెయిన్‌లో తమ లక్ష్యసాధనలో నష్టం స్వల్పంగా ఉండాలనే రష్యా కోరుకుందని ఆయన అన్నారు. అయితే పరిస్థితులు అందుకు విఘాతం కలిగించాయని పుతిన్ చెప్పుకొచ్చారు. రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షలు బెడిసి కొట్టాయని, రష్యా తట్టుకుని నిలబడగలిగిందని, పైగా అది వాళ్లకు ఎదురుదెబ్బగా పరిణమించిందని పుతిన్ అభివర్ణించారు. రష్యా, బెలారస్‌ల ఆంక్షలతో మరింత ఇరకాటం పెట్టే ప్రయత్నాలు చేశారని, ఇలాంటి సమయంలో ఇరు దేశాల సమగ్రతను పెంచడం చాలా ముఖ్యమని పుతిన్ అభిప్రాయపడ్డారు. ఇక బుచా మారణహోమాన్ని.. ఫేక్‌గా అభివర్ణించిన రష్యా అధ్యక్షుడు పుతిన్,ఉక్రెయిన్ గడ్డపై రష్యా బలగాలు నరమేధానికి పాల్పడిందని ఆరోపణలు తోసిపుచ్చారు. డిమాండ్ల విషయంలో ఉక్రెయిన్ అస్థిరత్వం వల్లే శాంతి చర్చల పురోగతి మందగిస్తుందని పుతిన్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ తూర్పు దాడికి కట్టుబడి ఉన్నందున మాస్కో తన సైనిక దూకుడును కొనసాగిస్తుందని చెప్పారు. ఉత్తమ యుద్ధ లక్ష్యాలన్నింటిలో విజయం సాధిస్తుందని పుతిన్ ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. చదవండి: రష్యాతో వ్యాపారమా?.. ముందు వాళ్ల సంగతి చూడండి -
రష్యా నరమేధం!.. భారత్ స్పందన ఇది
ఉక్రెయిన్‌లో రష్యా బలగాల నరమేధంపై భారత్ స్పందించింది. బుచా నగరం శవాల దిబ్బగా మారడం, ఉక్రెయిన్ సామాన్యులపై రష్యా సైన్యం అకృత్యాలకు పాల్పడిందంటూ కొన్ని ఫొటోలు, వీడియోలు వెలుగులోకి రావడం తెలిసిందే. ఈ పరిణామాలను పలుదేశాలు తీవ్రస్థాయిలో ఖండించాయి. రష్యా రాయబారులను తమ తమ దేశాల నుంచి బహిష్కరిస్తున్నట్లు పలు దేశాలు కూడా ప్రకటించాయి. తాజాగా బుచా నగరంలో పౌరులపై జరిగిన దారుణ హత్యాకాండపై భారత్ స్పందించింది. ఉక్రెయిన్‌లో పౌరులను నిర్దాక్షిణ్యంగా చంపడం హేయనీయమైన చర్యలని, దీనిపై అంతర్జాతీయ విచారణ జరగాలని.. అదీ స్వతంత్ర్యంగా ఉండాలన్న డిమాండ్‌కు భారత్ మద్దతు ఉంటుందని ప్రకటించింది. బుచాలో పౌర హత్యల ఇటీవలి నివేదికలు తీవ్రంగా కలచివేశాయి. మేము(భారత్) ఈ హత్యలను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాము. స్వతంత్ర విచారణకు మద్దతు ఇస్తున్నాం. అదే సమయంలో దౌత్యమే సమస్యకు పరిష్కారమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టి.ఎస్.తిరుమూర్తి పునరుద్ఘాటించారు. ‘‘అమాయక మానవ జీవితాలు ప్రమాదంలో ఉన్నప్పుడు.. దౌత్యం మాత్రమే అనుకూలమైన మార్గం’’ అంటూ పేర్కొన్నారాయన. మరోవైపు ఉక్రెయిన్ పరిణామాలపై అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌తో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మంగళవారం ఫోన్ చర్చలు జరిపారు. పనిలో పనిగా ద్వైపాక్షిక సంబంధాలూ చర్చకు వచ్చినట్లు సమాచారం. -
Ukraine: ఊచకోత.. ఊహించినదానికంటే ఎక్కువే!
ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు సాధారణ పౌరులపై సాగించిన ఊచకోత.. ఊహించినదానికంటే ఎక్కువే ఉందని తెలుస్తోంది. ఈ మేరకు కేవలం బుచాలోనే 300 మందికిపైగా పౌరులు బలయ్యారంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఆరోపిస్తున్నారు. అయితే బోరోడ్యాంకా, ఇతర పట్టణాల్లో ఆ సంఖ్యే లెక్కకు అందనంత ఉండొచ్చని అంచనా వేస్తోంది ఉక్రెయిన్. మానవతాధృక్పథంతో.. ఉక్రెయిన్‌లోని కొన్ని నగరాలు, పట్టణాల నుంచి బలగాలను వెనక్కి తీసుకుంటున్నట్లు రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. అప్పటికే అక్కడ దారుణాలకు తెగబడిన విషయం ఇప్పుడు వెలుగు చూస్తోంది. రోడ్ల వెంబడి చెల్లాచెదురుగా మృతదేహాలు పడి ఉండగా.. రష్యా సైన్యం అకృత్యాలకు సైతం పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన పట్టణాల్లో ఇలా పౌరులను కిరాతకంగా బలిగొన్న ఉదంతాలు.. వీడియో ఆధారాలతో సహా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఉక్రెయిన్ తో పాటు పాశ్చాత్య దేశాల కూటమి ఈ దమనకాండను ఖండిస్తున్నాయి. రష్యాపై మరింత ఆంక్షలు విధించడంతో పాటు యుద్ధ నేరాలకు పాల్పడిన కారణంగా దర్యాప్తునకు ఆదేశించాలంటూ అంతర్జాతీయ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. మరోవైపు ఐక్యరాజ్య సమితి సైతం ఈ మారణహోమంపై తీవ్రస్థాయిలో స్పందించింది. ఆధునిక కాలంలో ఇలాంటి ఘోరాలను చూడలేదని పేర్కొంటూ.. స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది కూడా. అయితే రష్యా మాత్రం తాము ఎలాంటి అఘాయిత్యాలకు, అకృత్యాలకు పాల్పడలేదని చెబుతోంది. ఇదిలా ఉండగా.. రష్యా మారణహోమంపై మంగళవారం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రసంగించనున్నాడు. సాధారణ పౌరులను బలిగొన్న ఘటనలకుగానూ రష్యాపై బహిరంగ దర్యాప్తును కోరుతూ ఆయన ప్రపంచ దేశాలపై ఒత్తిడి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నరమేధంపై దర్యాప్తు పారదర్శకంగా ఉండాలని ఇప్పటికే ఆయన విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. చదవండి: రష్యా అకృత్యాలు.. ఈ ఒక్క ఫొటో చాలు! -
రష్యా నరమేధం.. బుచా వీధుల వెంట చెల్లాచెదురుగా శవాలు
Bucha Massacre Ukraine: యుద్ధ నేరానికి దిగిన రష్యా.. నర మేధానికి పాల్పడింది!. కాళ్లు చేతులు కట్టేసి.. తలలో బుల్లెట్లు దింపిన పౌరుల ఫొటోలు, వీడియోలు ఉక్రెయిన్‌లో జరిగిన మారణహోమం తాలుకా పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. రాజధాని కీవ్‌కు ఇంతకాలం అడ్డుగోడగా నిలిచిన బుచా పట్టణంలో.. శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. మరోవైపు మహిళలపై నడిరోడ్డుపైనే అఘాయిత్యాలు జరిగినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో ఉక్రెయిన్, అమెరికాలు రష్యాపై తీవ్రస్థాయిలో ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి. కీవ్‌కు ఈశాన్యంగా 37 కిలోమీటర్ల దూరంలో ఉంది బుచా పట్టణం. నెలరోజుల పాటు జరిగిన రష్యా దురాక్రమణలో సుమారు 300 మంది పౌరులు మరణించినట్లు బుచా మేయర్ ఫెడోరుక్ ఇదివరకే ప్రకటించారు. ఈ తరుణంలో.. రష్యా బలగాలు తిరుగుముఖం పట్టిన టైంలో మరో 400 మందికి పైగా పొట్టనపెట్టుకుందని చెప్పారాయన. వీధుల వెంట బుల్లెట్ గాయాలతో, కాళ్లు చేతులు కట్టేసి ఉన్న శవాలే దర్శనమిస్తున్నాయి ఎటు చూసినా. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేషీలోని ఒలెక్సీ అరెస్టోవీచ్ బుచా ఊచకోతకు సంబంధించిన వ్యాఖ్యలు చేశారు. Butcha లో మహిళలపై రష్యా బలగాలు సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డాయని, ఆపై వాళ్లను కట్టేసి నిప్పటించి సజీవ దహనం చేశారని ఆరోపించారు. అంతేకాదు స్థానిక అధికారులు, పిల్లల మృతదేహాలు రోడ్ల వెంబడి చెల్లాచెదురుగా పడి ఉన్న హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఒకే చోట 300 మందికి నైరుతి భాగంలో ఉన్న ఓ చర్చి దగ్గర అంత్యక్రియలు నిర్వహించగా.. ఇది రష్యా జరిపిన ఉద్దేశపూర్వక మారణకాండగా ఉక్రెయిన్ రక్షణ శాఖ మంత్రి దిమిత్రి కులేబా అభివర్ణించారు. మృతుల్లో ఓ పసికందు, 14 ఏళ్ల బాలుడు కూడా ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే ఈ ఘటనపై ఇండిపెండెంట్ దర్యాప్తునకు ఆదేశించింది ఐక్యరాజ్య సమితి. I am deeply shocked by the images of civilians killed in Bucha, Ukraine. It is essential that an independent investigation leads to effective accountability. — António Guterres (@antonioguterres) April 3, 2022 రష్యా కౌంటర్ ఈ ఆరోపణలపై రష్యా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అదంతా కీవ్ నుంచి జరుగుతున్న కుట్రే అని పేర్కొంది. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. బుచాలో శవాల ఫొటోలు, వీడియోలు కీవ్ నుంచి వెలువడుతున్న రెచ్చగొట్టుడు సంకేతాలే అని పేర్కొంది. ఇదంతా కీవ్‌వర్గాలు ఆడుతున్న నాటకం. పాశ్చాత్య దేశాల మీడియా కోసమే ఇదంతా చూపిస్తున్నారు. రష్యా బలగాలు అక్కడ ఉన్న టైంలో ఒక్క సాధారణ పౌరుడు కూడా మరణించలేదు. ఎలాంటి హింసకు, అఘాయిత్యాలకు కూడా మా సైన్యం పాల్పడలేదు. శాంతి స్థాపనలో భాగంగానే మా దళాలు ఎలా వెళ్లాయో.. అలాగే వెనక్కి వచ్చేశాయి. అలాంటప్పుడు ఇదంతా ఎలా జరుగుతుంది? అని ప్రశ్నించింది రష్యా రక్షణ శాఖ. -
స్వతంత్ర భారత తొలి దళిత ప్రతిఘటన
కుల రక్కసి సృష్టించిన అసమానతల వ్యవస్థపై దేశంలో తిరుగుబాట్లెన్నో జరిగాయి. స్వతంత్ర∙భారత తొలి దళిత ప్రతిఘటనగా నిలిచిన ‘కీలవేణ్మని పోరాటం’ అందులో ఒక మహోజ్వల ఘట్టం. ‘త్రేతాయుగంలో నేను శంభూకుణ్ణి. ఇరవై రెండేళ్ళ క్రితం నా పేరు కంచికచర్ల కోటేశు. నా జన్మస్థలం కీలవేణ్మని...’ అంటూ ఆ తమిళ పల్లె ధిక్కార స్వరాన్ని అక్షరీకరించాడు కలేకూరి ప్రసాద్. 1960 దశకంలో తమిళనాడులోని కావేరీ డెల్టాలో భాగమైన పూర్వపు తంజావూరు జిల్లా సస్య శ్యామలంగా విలసిల్లేది. అయితే భూమి గల ఆసాములందరూ అగ్ర వర్ణాల వారు కాగా, రైతుకూలీలలో తొంభై శాతం నిమ్న వర్గాలకు చెందినవారే. మగవాళ్లు ఒంటి పైభాగంలో వస్త్రం వేసుకోవడం, వీధుల్లో చెప్పులేసుకుని నడవడం, దళిత స్త్రీలు వక్షస్థలాన్ని దాచుకోవడం నిషిద్ధం. ఈ నేపథ్యంలో జిల్లాలోని రైతు కూలీలు సంఘటితమై సీపీఎం నాయకత్వంలో వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1968లో కూలీ రేట్లు పెంచాలనే ఉద్యమం ఊపందుకున్నది. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేంత వరకు పొలాలలో పనులు సాగవంటూ రైతు కూలీలు సమ్మెకు దిగారు. భూస్వాములు పోటీగా వ్యవసాయదారుల సంఘాన్ని స్థాపించారు. స్థానిక కూలీలను తొలగించి, వేరే ప్రాంతాల నుండి కూలీలను తెచ్చి పనులు చేయించడం మొదలు పెట్టారు. డిసెంబర్ 25, 1968న భూస్వాముల గూండాలు... గణ పతి, ముత్తుస్వామి అనే కార్మిక సంఘం కార్యకర్తలను కిడ్నాపు చేసి చిత్రహింసలకు గురిచేశారు. రైతు కూలీలందరూ కర్రలు, బరిసెలు పట్టుకుని ఊరేగింపుగా బయల్దేరి, భూస్వాముల ఇండ్లపై దాడి చేసి తమవారిని విడిపించుకున్నారు. ఆ దాడిలో ఒక భూస్వాముల గూండా రైతుకూలీల చేతుల్లో చనిపోవడం జరిగింది. రైతు కూలీల ప్రతిఘటన భూస్వాముల ఉక్రోషాన్ని రెచ్చగొట్టింది. పోలీసుల అండతో అదేరోజు రాత్రి దళితవాడపై దండెత్తారు. భూస్వాముల పక్షం వహించిన పోలీసులు అకార ణంగా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో కొందరు మరణిం చారు. మిగతా వారందరూ పోలీసుల దాడినుండి తప్పించు కునే క్రమంలో రైతుకూలీ రామయ్యకు చెందిన గుడిసెలో తలదాచుకున్నారు. గోపాలకృష్ణన్ నాయుడు, ఇతర భూస్వా ములూ గుడిసెపై పెట్రోల్ పోసి నిప్పంటించమని గుండాలను ఆదేశించారు. క్షణాల్లో రామయ్య గుడిసె అగ్నిగుండంగా మారింది. లోపల తలదాచుకున్న వారు ఆర్తనాదాలు చేస్తూ అగ్నికి ఆహుతయ్యారు. పసి పిల్లల్నైనా రక్షించుకుందామనే ఆశతో తగలబడుతున్న తల్లులు తమ పిల్లల్ని బయటకి గిర వాటు వేస్తే... బయటనున్న భూస్వాములు వాళ్లని మళ్లీ గుడిసె మంటల్లోకి తోశారు. తెల్లారి తీరిగ్గా వచ్చిన పోలీసులు... కాలి బూడిదైన గుడిసె పరిసరాలను పరిశీలిస్తే... 44 మంది దళిత బిడ్డల కాలిన శవాలు దర్శనమిచ్చాయి. 23 మంది పిల్లలు, 16 మంది మహిళలు, ఐదుగురు పురుషులు. కీలవేణ్మని మారణకాండ వార్త దేశమంతా దావానలంలా వ్యాపించింది. నాటి తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాదురై తన మంత్రివర్గంలోని పీడబ్ల్యూడీ శాఖ మంత్రి కరుణానిధిని తక్షణం కీలవేణ్మని వెళ్లి పరిస్థితులు చక్కదిద్దాలని ఆదేశించాడు. కేరళలో పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఉన్న సీపీఎం నాయకులు జ్యోతిబసు, రణదివే, రామ్మూర్తి హుటాహుటిన కీలవేణ్మని చేరుకున్నారు. తంజావూరు జిల్లాలోని రైతు కూలీ సంఘాల కార్యకర్తలందరూ బహిరంగ సభ నిర్వహించి ప్రతీ కారేచ్ఛతో రగిలిపోయారు. పార్టీ నాయకులు వారిని శాంతింప జేసి.. చట్టప్రకారం చర్యలు తీసుకుందామని నచ్చజెప్పారు. నాగపట్టిణం జిల్లా కోర్టు గోపాలకృష్ణన్ నాయుడుతో సహా పది మందిని దోషులుగా నిర్ధారిస్తూ పదేళ్ల జైలు శిక్ష విధిస్తే.. మద్రాస్ హైకోర్టు సరైన సాక్ష్యాధారాలు లేవనే నెపంతో రద్దు చేసింది. డబ్బున్న ఆసాములు ఇళ్లలోనే ఉండి తమ మనుషు లకు ఆదేశాలు ఇస్తారు తప్ప స్వయంగా మారణకాండలో పాల్గొన్నారంటే నమ్మలేము... అనే కారణాలను న్యాయమూర్తి పేర్కొన్నారు. డీఎంకే ప్రభుత్వం సైతం బాధితులకు న్యాయం అందించడంలో ప్రేక్షక పాత్ర వహించింది. రామయ్య గుడిసె స్థానంలో ఒక స్మారక స్థూపాన్ని ఏర్పరచి 44 మంది అమర వీరుల పేర్లు చెక్కారు. మాయంది భారతి అనే స్వాతంత్య్ర సమర యోధుడు మారణకాండ జరిగిన మరుసటి రోజు మృత వీరుల అవశేషాలను గాజు గిన్నెలో సేకరించాడు. ఆ గిన్నెను స్మృతి చిహ్నంలో నిక్షిప్తం చేశారు. ఐద్వా జాతీయ నాయకురాలు మైథిలి శివరామన్ విస్తృ తంగా వ్యాసాలు రాసి... బాధితులకు బాసటగా రాష్ట్ర ప్రజ లను సమీకరించారు. ఆ ప్రతిఘటనపై ఇందిరా పార్థసారథి రాసిన ‘కురుదిప్పునల్’కు సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. 1983లో ఆ నవల ఆధారంగా ‘కన్న్ శివంతల్ మన్న్ శివక్కం’ తమిళ చిత్రం వచ్చింది. 2019లో వచ్చిన అసురన్ (తెలుగులో నారప్ప) సైతం దీన్ని ఇతివృత్తంగా తీసుకున్నదే. – ఆర్. రాజేశమ్ కన్వీనర్, సామాజిక న్యాయవేదిక ‘ 94404 43183 (నేడు కీలవేణ్మని మృతవీరుల సంస్మరణ దినం) -
ఇమ్రాన్‌పై ప్రశ్నల వర్షం.. పిల్లల ప్రాణాలు తీసేవారితో చర్చలా?
ఇస్లామాబాద్: పాకిస్తాన్ తాలిబన్ల పార్టీ అయిన తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ)తో పాక్ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్న ఒక్కరోజు తర్వాత ఆ సంస్థ చేసిన ఊచకోతపై ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ఆ దేశ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 2014లో ఆర్మీ ఆధ్వర్యంలో నడిచే స్కూలుపై ఈ ఉగ్రసంస్థ జరిపిన హేయమైన దాడిలో 150 మంది మరణించారు. ఈ ఘటనకు సంబంధించి ఇమ్రాన్ బుధవారం సుప్రీంకోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టు ఇమ్రాన్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. చిన్నారుల ప్రాణాలను బలి తీసుకున్న వారికి మీరు మోకరిల్లుతారా అని ప్రశ్నించింది. ‘మీరు అధికారంలో ఉన్నారు. ఏం చేస్తున్నారు ? ఆ దోషులతో తీరిగ్గా చర్చలు జరుపుతున్నారు’ అని సీజే అహ్మద్ ప్రధానిని నిలదీశారు. ఆనాడు తాము అధికారంలో లేమని, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం కింద ఆర్థికసాయం చేశామని ఇమ్రాన్ బదులిచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రుల గాయాలపై కారం రాసినట్టుగా ప్రధాని మాటలు ఉన్నాయంటూ ప్రధాన న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఈ మారణహోమానికి చైనాదే బాధ్యత
వాషింగ్టన్: కరోనా వైరస్ వ్యాప్తికి, ప్రపంచవ్యాప్తంగా అది సృష్టించిన మారణహోమానికి చైనానే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మండిపడ్డారు. కరోనా కల్లోలానికి పూర్తి బాధ్యత ఆ వైరస్ ముప్పును దాచిపెట్టిన డ్రాగన్ దేశానిదేనన్నారు. అమెరికా 244వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం దేశ ప్రజలనుద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. దేశంలో కరోనా తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతున్నప్పటికీ.. ఆ ప్రాణాంతక వైరస్‌పై పోరాటంలో ముందున్నామన్నారు. వెంటిలేటర్లు, పీపీఈ కిట్స్, ఇతర సర్జికల్ సామగ్రి రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. గతంలో ఇవన్నీ విదేశాల నుంచి.. ముఖ్యంగా చైనా నుంచి అత్యధికంగా దిగుమతి అయ్యేవన్నారు. ‘కుట్రపూరితంగా కరోనా ముప్పును చైనా రహస్యంగా దాచిపెట్టడం వల్లనే అది ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. దీనికి బాధ్యత కచ్చితంగా చైనాదే’ అని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ ఏడాది చివరిలోగా అమెరికాలో కోవిడ్–19కు ఔషధం, కరోనా వైరస్‌కు టీకా అమెరికాలోనే కనుగొంటామని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. అమెరికా లవ్స్ ఇండియా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన భారత ప్రధాని ¯మోదీకి ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా భారత్‌ను అభిమానిస్తోందంటూ ట్వీట్ చేశారు. ‘థాంక్యూ మై ఫ్రెండ్.. అమెరికా లవ్స్ ఇండియా’ అని ట్రంప్ పేర్కొన్నారు. అంతకుముందు, 244వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు, ఆ దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ శనివారం ట్వీట్ చేశారు. మోదీ, ట్రంప్ ట్వీట్ సంభాషణను పలువురు నెటిజెన్లు స్వాగతించారు. 1776 జులై 4న గ్రేట్ బ్రిటన్ నుంచి అమెరికా స్వాతంత్య్రం పొందింది. -
‘పూలన్‌దేవి’ కేస్ డైరీ మాయం
కాన్పూర్ దేహత్: బందిపోటు రాణి పూలన్ దేవి.. 1981 ఫిబ్రవరి 14వ తేదీన ఆ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లా బెహ్మాయి గ్రామానికి చెందిన ఠాకూర్ కులస్తులైన 20 మందిని పూలన్‌దేవి ముఠా ఊచకోత కోసింది. తనపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారనే ఆగ్రహంతో ఆమె ఈ రూపంలో తీవ్ర ప్రతీకారం తీర్చుకుంది. దాదాపు నలబై ఏళ్ల పాటు కోర్టులో వివిధ పరిణామాల మధ్య కొనసాగిన ఈ కేసు తుది దశకు రాగా, మరో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బెహ్మాయి హత్యకాండగా పేరున్న ఈ ఘటనకు సంబంధించిన కీలకమైన కేసు డైరీ మాయమైంది. కోర్టు రికార్డుల్లో నుంచి బెహ్మాయి హత్యాకాండ కేసు డైరీ కనిపించకుండా పోయిందని సిబ్బంది చెప్పడంతో తీర్పును ప్రత్యేక కోర్టు (ఉత్తరప్రదేశ్‌లోని బందిపోటు ప్రభావిత ప్రాంత) జడ్జి సుధీర్ కుమార్ ఈనెల 24కు వాయిదా వేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీవ్ పోర్వాల్ తెలిపారు. దీని వెనుక ఎటువంటి కుట్ర లేదని ఆయన స్పష్టం చేశారు. నిందితుల తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఈ కేసు తుది తీర్పులో అలవిమాలిన జాప్యం, అనుమానాస్పదంగా కేసు డైరీ మాయంకావడాన్ని అలహాబాద్ హైకోర్టు దృష్టికి తీసుకెళతామని తెలిపారు. భారత బందిపోటు రాణి! రాజకీయాల్లోకి ప్రవేశించిన పూలన్‌దేవి సమాజ్‌వాదీ పార్టీ తరఫున 1996, 1999 ఎన్నికల్లో మిర్జాపూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆమెపై ఉన్న 55 కేసులను ‘ప్రజాభీష్టం మేరకు’అప్పటి యూపీ సీఎం ములాయం సింగ్ ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఆ నిర్ణయాన్ని కాన్పూర్ కోర్టు పక్కనబెట్టింది. తనపై కేసులన్నిటినీ కొట్టేయాల్సిందిగా పూలన్‌దేవి సుప్రీంకోర్టులో 2001లో పిటిషన్ వేయగా.. ముందుగా కాన్పూర్ కోర్టులో లొంగిపోవాలని కోర్టు సూచించింది. అవేమీ జరగకుండానే, ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఉండగా పూలన్‌దేవిని అదే ఏడాది దుండగులు కాల్చి చంపారు. సంచలనాలమయమైన ఆమె జీవిత కథ ఆధారంగా శేఖర్ కపూర్ దర్శకత్వంలో తీసిన ‘ఇండియాస్ బాండిట్ క్వీన్: ది ట్రూ స్టోరీ ఆఫ్ పూలన్‌దేవి’ సినిమా హిట్టయ్యింది. పూలన్ దేవి పాత్రధారి సీమా బిశ్వాస్ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు పొందారు. అత్యాచారానికి తీవ్ర ప్రతీకారం బందిపోటు రాణి పూలన్ దేవి ముఠా 1981 ఫిబ్రవరి 14వ తేదీన కాన్పూర్ దేహత్ జిల్లా బెహ్మాయి గ్రామానికి చెందిన ఠాకూర్ కులస్తులైన 20 మందిని ఊచకోత కోసింది. ఆ గ్రామంలోని ఠాకూర్ కులస్తులు లాలా రామ్, శ్రీరామ్ అనే వారు తనపై అత్యాచారానికి పాల్పడినందుకు ప్రతీకారంగానే ఆమె ఈ హత్యాకాండకు ఒడిగట్టిందని చెబుతారు. ఈ ఘటన అప్పట్లో యూపీ ప్రభుత్వాన్ని కుదిపేసింది. అప్పటి సీఎం వీపీ సింగ్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. అనంతరం ఆయన ప్రధానమంత్రి అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో పూలన్ దేవితోపాటు 35 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. వీరిలో 8 మంది పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందగా మరో ముగ్గురు జాడ తెలియకుండా పోయారు. రెండేళ్ల తర్వాత 1983లో పూలన్‌దేవి మధ్యప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్ష పథకం కింద పూలన్‌దేవి ఆ రాష్ట్రంలో లొంగిపోయారు. దీంతో ఆమెను ఉత్తరప్రదేశ్ పోలీసులకు అప్పగించడానికి బదులుగా అప్పటి సీఎం అర్జున్ సింగ్ ఆమెను జైలుకు తరలించారు. యూపీ పోలీసులు, కాన్పూర్ కోర్టు ఎన్ని సమన్లు, నాన్‌బెయిలబుల్ వారెంట్లు పంపినా ప్రభుత్వం పూలన్‌దేవికి అందజేయకుండా వెనక్కి పంపింది. 11 ఏళ్లపాటు గ్వాలియర్, జబల్పూర్ జైళ్లలో గడిపిన ఆమె..ఎటువంటి విచారణ లేకుండానే 1994లో జైలు నుంచి విడుదలయ్యారు. హత్యాకాండకు సంబంధించి పూలన్‌దేవి ముఠాలోని పోషా జైలు జీవితం గడుపుతుండగా, బిఖా, విశ్వనాథ్, శ్యామ్‌బాబు అనే వారు బెయిల్‌పై బయట ఉన్నారు. మాన్సింగ్ సహా మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. ఈ కేసులో మిగిలిన నలుగురు నిందితులపై 2012లో నేరారోపణ జరిగింది. -
32 ట్రాక్టర్లు.. 200 మంది
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లా ఘోరవాల్ పట్టణం సమీపంలోని మారుమూల గ్రామం ఉభాలో గ్రామపెద్ద మనుషులు బుధవారం విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన ఘటనలో మృతుల సంఖ్య 10కి పెరిగింది. ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ ‘భూమిని స్వాధీనం చేసుకోవడంలో తన దారికి అడ్డొచ్చిన వారిని చంపడానికి ముందుగానే నిశ్చయించుకునే, వందల సంఖ్యలో మనుషులను వెంటబెట్టుకుని గ్రామ పెద్ద యజ్ఞా దత్ వచ్చాడు. 32 ట్రాక్టర్లలో దాదాపు 200 మంది బలగాన్ని, ఆయుధాలను అతను తీసుకొచ్చాడు. 200 మంది యజ్ఞా దత్ మనుషులు వివాదంలో ఉన్న భూమి వద్దకు చేరుకున్నారు. చుట్టుపక్కల పొలాల్లో పనులు చేసుకుంటున్న మేమంతా అక్కడకు వెళ్లగానే, కనీసం మాట్లాడే సమయం కూడా ఇవ్వకుండా వారు తుపాకులతో మాపై కాల్పులు ప్రారంభించారు. యజ్ఞా దత్ మనుషులు తుపాకులు, ఆయుధాలతో వచ్చినట్లు మాకు ముందుగా తెలియదు. వారు కాల్పులు జరుపుతుండటంతో ప్రాణాలను కాపాడుకోవడానికి మేం తలో దిక్కుకు పరుగెత్తాం. దాదాపు అర్ధగంట పాటు వారు కాల్పులు జరిపారు. కింద పడ్డ వారిని లాఠీలతో కొట్టారు’అని వివరించారు. ఎన్నో ఏళ్లుగా తాము ఈ భూమినే సాగు చేసుకుంటున్నామనీ, తమకు ఇదే జీవనాధారమనీ, ఇప్పుడు యజ్ఞా దత్ వచ్చి తమ భూములు లాక్కోడానికి ప్రయత్నిస్తున్నాడని స్థానికులు అంటున్నారు. కాగా, కాల్పుల ఘటనలో 25 మందిని పోలీసులు ఇప్పటి వరకు అరెస్టు చేశారు. ఈ ఘటనలో 18 మంది గాయపడ్డారు. 36 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఓ భూమికి సంబంధించిన వివాదం కారణంగా బుధవారం ఉభా గ్రామంలో ఆ గ్రామపెద్ద యజ్ఞా దత్ మనుషులు బుధవారం గోండు జాతి గిరిజనులపై విచక్షణా రహితంగా కాల్పులు జరపగా తొమ్మిది మంది మరణించడం తెలిసిందే. ఖననానికి స్థలంపై అధికారులతో వాగ్వాదం కాల్పుల ఘటనలో చనిపోయిన వారిని ఖననం చేసే స్థలంపై ఉభా గ్రామస్తులు గురువారం అధికారులతో వాదనకు దిగారు. 10 మంది మృతదేహాలను తాము వివాదాస్పద స్థలంలోనే పూడుస్తామని గ్రామస్తులు పట్టుబట్టారు. అధికారులు మాత్రం ఆ స్థలంలో వద్దనీ, సాధారణంగా చనిపోయిన వారి అంత్యక్రియలు ఎక్కడ నిర్వహిస్తారో వీరి మృతదేహాలను కూడా అక్కడే ఖననం చేయాలని సూచిస్తున్నారు. గురువారం సాయంత్రానికి కూడా ఈ విషయం ఓ కొలిక్కి రాలేదు. మరోవైపు ఈ ఘటనను నిరసిస్తూ రాష్ట్ర శాసనమండలి కార్యకలాపాలను ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. రాష్ట్ర ఎస్పీ,ఎస్టీ కమిషన్ కూడా ఈ ఘటనపై సొంతంగా విచారణ జరపాలని నిర్ణయించింది. స్థానిక అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆరోపించింది. ఘటనా స్థలాన్ని గురువారం కాంగ్రెస్ పార్టీ బృందం పరిశీలించి, దీనిపై సుప్రీంకోర్టు చేత జ్యుడీషియల్ విచారణ జరగాలని డిమాండ్ చేసింది. -
జలియన్‌వాలా బాగ్‌కు వందేళ్లు
అమృత్సర్/న్యూఢిల్లీ: జలియన్‌వాలా బాగ్ మారణకాండ జరిగి నేటికి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ నరమేధంలో ప్రాణాలర్పించిన వారిని స్మరించుకున్నారు. వెంకయ్య నాయుడు జలియన్‌వాలా బాగ్ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అలాగే సిక్కు గురువులు పాడిన శ్లోకాలను ఆలకించారు. ఈ నరమేధం జ్ఞాపకార్థం వెంకయ్య నాయుడు స్మారక నాణెం, తపాలా బిళ్లను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్య్రం ఎంత విలువైనదో జలియన్‌వాలా బాగ్ దురంతం మనందరికీ గుర్తు చేస్తుందని ఆయన ట్వీట్ చేశారు. 1919 ఏప్రిల్ 13న సిక్కుల ముఖ్య పండుగ వైశాఖీ సందర్భంగా అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కల్నల్ రెజినాల్డ్ డయ్యర్ ఆధ్వర్యంలో బ్రిటిష్ ఇండియన్ సైన్యం వారిపై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో వేలాదిమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రధాని మోదీ నివాళులు జలియన్‌వాలా బాగ్ దురంతంలో అమరులైన వారికి ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఆ పోరాట వీరులు దేశం కోసం పనిచేయడానికి స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. ‘జలియన్‌వాలా బాగ్ నరమేధం జరిగి నేటికి వందేళ్లు. ఈ సందర్భంగా ఆ ఘటనలో అమరులైన వారికి భారత్ నివాళులర్పిస్తోంది. వారి విలువైన ప్రాణ త్యాగాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. దేశం కోసం మరింత కష్టపడి పనిచేయడానికి వారు స్ఫూర్తిగా నిలిచారు’అని మోదీ ట్వీట్ చేశారు. స్మారకం వద్ద రాహుల్ నివాళి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జలియన్‌వాలాబాగ్ స్మారకం వద్ద నివాళులర్పించారు. రాహుల్‌తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, ఆ రాష్ట్ర మంత్రి నవజోత్ సింగ్ సిద్ధు ఇతర కాంగ్రెస్ నేతలు కూడా అంజలి ఘటించారు. నాటి ఉదంతాన్ని గుర్తు చేసుకుంటూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ‘స్వాతంత్య్రపు విలువ ఎప్పటికీ మర్చిపోలేనిది. ప్రాణత్యాగం చేసిన నాటి పోరాట వీరులకు అభివాదం చేస్తున్నాం’అని రాహుల్ సందర్శకుల పుస్తకంలో రాశారు. -
ఐరాసకు ఆ హక్కు లేదు
యాంగాన్: తమ దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు ఐక్యరాజ్యసమితికి లేదని మయన్మార్ సైనిక ప్రధానాధికారి మిన్ అంగ్ స్పష్టం చేశారు. రొహింగ్యా మారణకాండపై చర్చించేందుకు ఐరాస సర్వప్రతినిధి సభ సమాయత్తమవుతుండగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గత ఏడాది ఆగస్టు నుంచి మయన్మార్ సైనికుల అత్యాచారాలు, దాడులు, గృహ దహనాలకు భీతిల్లిన రొహింగ్యా ముస్లింలు లక్షలాదిగా పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌లో తలదాచుకుంటున్నారు. మయన్మార్ సైనిక మారణకాండపై ఐరాస నిజ నిర్ధారణ కమిటీ ఒక నివేదిక రూపొందించింది. సైనికాధికారి మిన్ అంగ్ సహా మయన్మార్ అగ్రశ్రేణి సైనికాధికారులపై అంతర్జాతీయ నేర న్యాయస్థానంలో విచారణ చేపట్టా ల్సిందిగా కోరింది. దీంతోపాటు సైనికాధికారులు రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం మానాలంది. ఈ నివేదికపై స్పందించిన మిన్ అంగ్ వ్యాఖ్యలను సైన్యం నడిపే వార్తాపత్రిక ప్రచురించింది..‘ఏ దేశానికి గానీ, సంస్థకు గానీ మరో దేశం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు, నిర్ణయాలు తీసుకునే హక్కు లేవు. ఇటువంటి చర్యలు అపార్థాలకు దారి తీస్తాయి’ అని తెలిపారు. నోబెల్ బహుమతి గ్రహీత అంగ్ సాన్ సూకీ నేతృత్వంలో బర్మాలో ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పటికీ సైన్యమే కీలకంగా ఉంది. -
రాయిటర్స్ జర్నలిస్టులకు ఏడేళ్ల జైలు
యాంగూన్: మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింల ఊచకోతపై కథనాలు రాసిన ఇద్దరు రాయిటర్స్ జర్నలిస్టులకు అక్కడి న్యాయస్థానం సోమవారం ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. జర్నలిస్టులు వా లోన్(32), కా సో ఓ(28)లు అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారని యాంగూన్ కోర్టు వ్యాఖ్యానించింది. గతేడాది ఆగస్టులో అరాకన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ(ఏఆర్ఎస్ఏ)కి చెందిన కొందరు ఉగ్రవాదులు మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు, ఆర్మీ కేంద్రాలపై దాడిచేశారు. దీంతో ఉగ్రవాదుల ఏరివేత పేరిట మయన్మార్ సైన్యం ఊచకోత ప్రారంభించడంతో దాదాపు 7 లక్షల మంది రోహింగ్యా ముస్లింలు ప్రాణాలు అరచేత పట్టుకుని బంగ్లాదేశ్‌కు పారిపోయివచ్చారు. ఈ సందర్భంగా రఖైన్‌లోని ఇన్ డిన్ గ్రామంలో 10 మంది అమాయకుల్ని మయన్మార్ సైన్యం కాల్చిచంపిన విషయాన్ని వా లోన్, కా బయటపెట్టారు. అనంతరం యాంగూన్‌లో జరిగిన ఓ విందు కార్యక్రమంలో పాల్గొన్న వీరికి పోలీస్ అధికారి ఒకరు కొన్ని కాగితాలను రహస్యంగా అందించారు. వాటిని తీసుకుని హోటల్ నుంచి బయటకు రాగానే ఆర్మీ అధికారులు కా, లోన్లను అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసును విచారించిన యాంగూన్ కోర్టు ఇద్దరు జర్నలిస్టుల వద్ద దేశానికి సంబంధించిన రహస్య పత్రాలు లభ్యమయ్యాయని తెలిపింది. తామిద్దరం ఎలాంటి తప్పు చేయలేదని జర్నలిస్టులు చేసిన వాదనను ఈ సందర్భంగా న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదు. అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినందుకు వీరిద్దరికి ఏడేళ్ల జైలుశిక్ష విధిస్తున్నట్లు కోర్టు తీర్పునిచ్చింది. తీర్పు అనంతరం లోన్ మీడియాతో మాట్లాడుతూ..‘ఈ తీర్పును మేం దృఢచిత్తంతో, ధైర్యంగా ఎదుర్కొంటాం’ అని తెలిపారు. ప్రభుత్వం తమను అరెస్ట్ చేయగలదనీ, కానీ ప్రజల కళ్లు, చెవులను మాత్రం మూయలేదని కా అన్నారు. ఈ రోజు మయన్మార్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియాకు దుర్దినమని రాయిటర్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ స్టీఫెన్.జె.అడ్లర్ వ్యాఖ్యానించారు. మీడియా నోరు మూయించేందుకు, భయపెట్టేందుకు మయన్మార్ ప్రభుత్వం ఈ చర్య తీసుకుందన్నారు. కాగా ఇద్దరు జర్నలిస్టులను విడుదల చేయాలని మయన్మార్‌లో ఐక్యరాజ్యసమితి ప్రతినిధులతో పాటు బ్రిటన్, యూరోపియన్ యూనియన్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ డిమాండ్ చేశాయి. -
చరిత్రలోనే అతిపెద్ద విషాదం
చరిత్రలోనే భారీ విషాదాంతంగా మిగిలిన జోన్స్టౌన్ నరమేధం గురించి తెలిసిన వాళ్లు చాలా తక్కువే. ఒకేసారి 900 మందికి పైగా ఆత్మహత్య చేసుకోవటం.. సామూహిక ఆత్మహత్యల ఘటనగా చరిత్రలో మిగిలిపోయింది. వెనిజులా-సురీనామ్ మధ్య ఉన్న తీరప్రాంతం గుయానాలోని జోన్స్టౌన్లో నాలుగు దశాబ్దాల క్రితం ఇది చోటుచేసుకుంది. అమెరికా మతగురువు, పీపుల్స్ టెంపుల్ వ్యవస్థాపకుడు జిమ్ జోన్స్‌ను వేలాది మంది అనుచరులు గుడ్డిగా నమ్మేవారు. నవంబర్ 19, 1978న భారీ సంఖ్యలో అనుచర గణాన్ని ఒక్కచోట చేర్చారు. వారందరు విషపు పానీయాన్ని స్వీకరించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో ఐదొంతుల మంది చిన్నారులు ఉండటం గమనార్హం. వారికి సిరంజీల ద్వారా వారి వారి తల్లిదండ్రులు విషం ఎక్కించారని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ తర్వాత దర్యాప్తులో వెల్లడించింది. ఘటన తర్వాత జిమ్ జోన్స్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కారణం.. జోన్స్టౌన్లో పరిస్థితులు బాగా లేవని, పూర్తిగా అక్రమాలు సాగుతున్నాయని అమెరికాకు నివేదిక అందింది. దీంతో లియో ర్యాన్‌ను తమ ప్రతినిధిగా అమెరికా జోన్స్టౌన్కు పంపింది. అయితే పీపుల్స్ టెంపుల్ ముసుగులో అరాచకాలు జరుగుతున్నాయన్న నివేదిక లియోర్యాన్‌కు చేరటంతో.. జోన్స్‌టౌన్‌పై వైమానిక దాడులకు ఆదేశించాడు. అప్పటికే పీపుల్స్ టెంపుల్ సభ్యులు కొందరినీ అమెరికా సైన్యం కాల్చి చంపింది. దీంతో కలత చెందిన జిమ్స్ జోన్స్ పెద్ద ఎత్తున్న అనుచరులను సమీకరించి.. ఈ నరమేధానికి కారకుడయ్యాడు. అయితే ఆ ఘటన నుంచి తప్పించుకున్న కొందరు జోన్స్టౌన్ ప్రజలు మాత్రం.. ఈ ఘటనను అతిపెద్ద హత్యాపర్వంగా అభివర్ణిస్తుంటారు. ఢిల్లీ బురారీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో ఈ కథనం ఇప్పుడు మరోసారి వెలుగులోకి వచ్చింది. -
పత్రికపై కక్ష.. మారణహోమం
వాషింగ్టన్: ఒక వార్తాపత్రికపై కక్ష పెంచుకున్న వ్యక్తి.. అమెరికాలోని అన్నాపోలిస్ నగరంలో మారణహోమం సృష్టించాడు. పత్రిక కార్యాలయంలోకి చొరబడి స్మోక్ గ్రనేడ్లు విసిరి గన్‌తో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఐదురుగు మరణించగా.. వారిలో నలుగురు జర్నలిస్టులు. అమెరికా రాజధాని వాషింగ్టన్కు 50 కి.మీ దూరంలో ఉన్న మేరిల్యాండ్ రాష్ట్రం అన్నాపోలిస్‌లోని ‘క్యాపిటల్ గెజిట్’ పత్రికా కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం(భారత కాలమానం శుక్రవారం అర్ధరాత్రి) జరిగిన ఈ కాల్పుల్లో ముగ్గురు గాయపడ్డారు. దుండగుడు జరోద్ వారెన్ రామోస్(38)ను పోలీసులు అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. క్యాపిటల్ గెజిట్ పత్రికకు వ్యతిరేకంగా 2012లో పరువునష్టం దావా వేసిన రామోస్ ఆ కేసులో ఓడిపోవడంతో కక్ష పెంచుకుని ఈ ఘోరానికి పాల్పడ్డాడు. అంత ఘోరం జరిగినా.. క్యాపిటల్ గెజిట్ సిబ్బంది బాధను దిగమింగుకుని తర్వాతి రోజు పత్రికను మార్కెట్లోకి తీసుకురావడం ద్వారా కాల్పుల్లో మరణించిన సహచర సిబ్బందికి నివాళులర్పించారు. ముందస్తు లక్ష్యంతోనే దాడి ‘ముందస్తు లక్ష్యంతోనే దుండగుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. కాల్పులు జరిపేందుకు అన్నీ సిద్ధం చేసుకుని పత్రికా కార్యాలయానికి వచ్చాడు’ అని స్థానిక కౌంటీ డిప్యూటీ పోలీసు చీఫ్ విలియం క్రాంఫ్ తెలిపారు. కాల్పుల్లో పత్రిక అసిస్టెంట్ ఎడిటర్ రాబ్ హియాసెన్, ఎడిటోరియల్ పేజ్ ఎడిటర్ గెరాల్డ్ పిస్క్మేన్, ఎడిటర్ అండ్ రిపోర్టర్ జాన్ మెక్నమార, స్పెషల్ పబ్లికేషన్స్ ఎడిటర్ వెండీ వింటర్స్, సేల్స్ అసిస్టెంట్ రెబెక్కా స్మిత్‌లు మరణించారని ఆయన వెల్లడించారు. మీడియా కథనాల ప్రకారం.. 2011లో పత్రికలో వచ్చిన ఒక వార్త తనను అపఖ్యాతి పాలు చేసేలా ఉందని రామోస్ పరువునష్టం కేసు వేశాడు. ఆ కేసులో అతను ఓడిపోయాడు. సోషల్ మీడియాలో ఒక మహిళను వేధించిన కేసులో రామోస్ నేరాంగీకార వివరాలు పత్రికలో ప్రచురితమయ్యాయి. విచారణకు సహకరించని నిందితుడు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి నిందితుడు బల్ల కింద దాక్కున్నాడని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన కొద్దిసేపటికే రామోస్‌ను అదుపులోకి తీసుకున్నామని... విచారణకు అతను సహకరించడం లేదని వారు వెల్లడించారు. తన గుర్తింపును కనుగొనకుండా రామోస్ చేతివేళ్లకు గాయం చేసుకున్నాడని.. అయితే అతని ముఖాకృతి ఆధారంగా పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ వివరాల్ని పోలీసులు సేకరించారని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న గెజిట్ పత్రిక విలేకరి ట్వీట్ చేస్తూ.. ‘దుండగుడు న్యూస్‌రూం గాజు తలుపుపై గుళ్ల వర్షం కురిపించి పలువురు ఉద్యోగులపై కాల్పులకు పాల్పడ్డాడు’ అని ఘోరాన్ని గుర్తుచేశారు. ట్రంప్ సంతాపం ఈ సంఘటన పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. డెమొక్రటిక్ పార్టీ నేత నాన్సీ పెలోసీ మాట్లాడుతూ.. సామూహిక కాల్పులు, రోజువారీ తుపాకీ హింస అనేక మంది ప్రాణాల్ని బలి తీసుకుంటుందని, ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా అమెరికన్ కాంగ్రెస్ తక్షణం చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. తుపాకీ హింసపై కాంగ్రెస్ స్పందించాలని భారతీయ సంతతి కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా కూడా డిమాండ్ చేశారు.