మాజీ ప్రధాని ఇందిర హత్యానంతరం జరిగిన సిక్కుల ఊచకోత కేసుల దర్యాప్తుపై పర్యవేక్షణకు సిట్ ఏర్పాటైంది. విచారణ జరపకుండానే మూసేసిన ఆనాటి 186 కేసులపై ఈ సిట్ విచారణ జరపనుంది. ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఎస్‌ఎన్ ధింగ్రా నేతృత్వంలో త్రిసభ్య బృందాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటుచేసింది.