sikkhu
-
కెనడాలో వైశాఖి పరేడ్..మూడేళ్ల అనంతరం వేడుకగా జరిగిన నగర కీర్తన!
కెనడాలో జరిగే పురాతన వేశాఖి వేడుక కోవిడ్ 19 దృష్ట్యా మూడేళ్ల అనంతరం అట్టహాసంగా జరిగింది. దీనికోసం దాదాపు 2 లక్షలమంది పరేడ్‌లో హజరయ్యి రాస్ స్ట్రీట్ గురద్వారా(నగర కీర్తన)కు స్వాగత పలికారు. ఇది ఖల్సాపంత్కు గుర్తుగా జరిగే సిక్కులకు సంబంధించిన వేడుక. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని వాంకోవర్‌లో 1906లో స్థాపించబడిన ఖల్సా దివాన్ సొసైటీ ఈ ఖల్సా డే పరేడ్‌ను నిర్వహించడమేగాక చారిత్రాత్మకమైన రాస్ స్ట్రీట్ గురద్వారా(నగర సంకీర్తన)ను కూడా నిర్వహిస్తోంది. చివరిసారిగా 2019లో ఖల్సా పంత్‌కు గుర్తుకు జరిగిన ఈ వేడుకలో సుమారు లక్షమంది హజరయ్యారు. ఐతే మూడేళ్ల అనంతర జరుగుతున్న వేడుకలో అంచనాకు మించి దాదాపు రెండు లక్షల మంది హాజరుకావడం విశేషం. గతమూడేళ్ల ఈ వేడుకగా జరుగక కమ్ముకున్న నిరాశను అట్టహాసంగా సాగుతున్న వేడుక భర్తీ చేసింది. ఇందులో సిక్కు మత గ్రంథమైన 52 అడుగుల గురుగ్రంథ్ సాహిబ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ మేరకు సోసైటీ ప్రెసిడెంట్ కుల్దిప్ సింగ్ తాండి మాట్లాడుతూ..ఈ వేడుక అద్భుతంగా జరిగిందని, ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. ఇది 1979లో తొలిసారిగా జరిగిందన్నారు. ఈ నగర కీర్తన విజయవంతంగా జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ వేడుకలో కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ట్రుడో, అతని తోపాటు మంత్రి వర్గ సహచరుడు హర్జిత్ సజ్జన్ కూడా హాజరయ్యారు. (చదవండి: మోదీ నమ్మశక్యంకాని గొప్ప దార్శనికుడు..అమెరికా మంత్రి పొగడ్తల జల్లు) -
భారత సంతతి అమృతపాల్ సింగ్ మాన్కు యూకే గౌరవ జాబితాలో చోటు !
లండన్‌కు చెందిన భారతీయ సంతతికి చెందిన రెస్టారెంట్ అమృత్‌పాల్ సింగ్ మాన్‌కి యూకే నూతన సంవత్సర గౌరవాల జాబితాలో చోటు దక్కింది. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి సుమారు 2 లక్షల మందికి పైగా నిరుపేదలకుకి భోజనాన్ని అందించిన గొప్ప మహోన్నత పరోపకారి అమృతపాల్ సింగ్ మాన్. స్వచ్ఛంద సంస్థల ద్వారా సమాజానికి అందించిన సేవలకు గుర్తింపుగా ఓబీఈ అవార్డును పొందారు. (చదవండి: టెస్లా ఆటో పైలెట్ టీమ్‌కి ఎంపికైన తొలి భారత సంతతి వ్యక్తి!) అంతేకాదు న్యూ ఇయర్ గౌరవ జాబితా 2022లో క్వీన్ సత్కరించబడిన వారిలో ఆయన కూడా ఉన్నారు. అయితే ఆయన్ను చాలా మందికి అమృత్ మాన్ అని పిలుస్తారు. ఆయన చాలా సంవత్సరాలుగా నిరాశ్రయులు, సాయుధ దళాలు, వారసత్వం కళలతో కోసం కృషి చేసే స్వచ్ఛంద సంస్థలకు తనవంతు మద్దతు ఇచ్చారు. అంతేకాదు ఆయన యూకే తొలి పంజాబీ రెస్టారెంట్‌గా అతని ముత్తాత 1946లో స్థాపించిన కోవెంట్ గార్డెన్‌లోని పంజాబ్ రెస్టారెంట్ ఎండీగానే యూకేలో ఎక్కువమందికి తెలుసు. ఈ మేరకు యూకే లెఫ్టినెంట్ కల్నల్ డేవిడ్ ఉటింగ్ మాట్లాడుతూ...."సిక్కు సమాజంలో గుర్తింపు పొందిన నాయకుడిగా, అమృత్ మాన్ చాలా మంది సిక్కులు నివసించే విభిన్న దేశంలో వారి గుర్తింపు ఏమిటో, వారి సంస్కృతిని ఎలా కొనసాగించాలో నిర్వచించడంలో సహాయపడటానికి చాలా కష్టపడ్డారు. ఇందులో భాగంగా సాయుధ బలగాలకు అతని మద్దతు అద్భుతంగా ఉంది. అతని సహాయం లేకుండా సిక్కు సమాజంలో ప్రస్తుతం ఉన్న ప్రగతిని సాధించగలమా! అనే సందేహం కలుగుతుంది. ఆయనతో కలిసి అనేక సందర్భాల్లో పనిచేసినందున, ఈ గౌరవానికి ఆయన అర్హులు" అని అన్నారు. ఈ క్రమంలో అమృత్ మాన్ మాట్లాడుతూ..." నేను గౌరవానికి సంబంధించిన ఇమెయిల్ నోటిఫికేషన్‌ను స్వీకరించినప్పుడు నమ్మలేకపోయాను. ఈ గౌరవం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు ఆఫీసర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ గుర్తింపు దాతృత్వ పనిని మరింతంగా కొనసాగించాలనే తన సంకల్పాన్ని బలపరుస్తుంది అని" అమృత్ మాన్ అన్నారు. (చదవండి: చిన్నారిపై కుక్కలు మూకుమ్మడి దాడి.. నిజంగానే దేవుడిలా వచ్చాడు!) -
జస్టిస్ ధింగ్రా నేతృత్వంలో సిట్
-
జస్టిస్ ధింగ్రా నేతృత్వంలో సిట్
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిర హత్యానంతరం జరిగిన సిక్కుల ఊచకోత కేసుల దర్యాప్తుపై పర్యవేక్షణకు సిట్ ఏర్పాటైంది. విచారణ జరపకుండానే మూసేసిన ఆనాటి 186 కేసులపై ఈ సిట్ విచారణ జరపనుంది. ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఎస్ఎన్ ధింగ్రా నేతృత్వంలో త్రిసభ్య బృందాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటుచేసింది. ఈ సిట్‌లో ఆయనతోపాటు అభిషేక్ దులార్ (2006 బ్యాచ్ ఐపీఎస్), రాజ్‌దీప్ సింగ్ (రిటైర్డ్ ఐజీ ర్యాంకు అధికారి) సభ్యులుగా ఉన్నారు. ఈ సిట్ రెండు నెలల్లో నివేదిక అందజేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసింది. సిట్‌లో ఉండాల్సిన సభ్యులపై హోం మంత్రిత్వ శాఖతోపాటుగా పిటిషనర్ జీఎస్ కహ్లాన్ ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతే సుప్రీం కోర్టు ఈ పేర్లను విడుదల చేసింది. -
సిక్కుల గాయం రేగనుందా!
సిక్కుల ఓట్లను చీల్చి, అకాలీలను బలహీనం చేయడానికి కాంగ్రెస్ భింద్రన్‌వాలేను సమర్థించిన మాట నిజం. దీనితో ఇతడు 1980లో స్వర్ణదేవాలయాన్ని తన కార్యకలాపాలకు కేంద్రంగా మార్చాడు. వాటికి జగ్జీత్సింగ్ చౌహాన్ మొదలుపెట్టిన ఖలిస్తాన్ ఉగ్రవాదం తోడైంది. ఆధునిక కాలం, సమాచార వ్యవస్థ చారిత్రక సత్యాలను చీకట్లో మిగిలిపోకుండా చేస్తున్నాయి. ఆధునిక సంక్షోభాలూ మూలాలూ ఇప్పటి తరానికి అక్షరం పొల్లుపోకుండా అందుతు న్నాయి. 1984 నాటి అమృత్సర్ సైనిక చర్య ఆ విధంగానే చరిత్ర పుటలలో వాక్యాలుగా జనం ముందుకువస్తోంది. ఈ డొంకకు చెందిన తీగ ఇంగ్లండ్‌లో కదిలింది. జూన్ 3-8, 1984లో స్వర్ణదేవాలయం మీద జరిగిన సైని క చర్య ‘ఆపరేషన్ బ్లూ స్టార్’కు సంబంధించిన రెండు ప్రస్తా వనలు 2013, జూన్, ఈ జనవరిలలో ప్రపంచం ముందుకు వచ్చాయి. ఈ చర్యలో ఇంగ్లండ్ సాయం ఉందని తెలియజేసే ఒక పత్రం ప్రస్తావన ఈ జనవరి 17న అక్కడి పార్లమెంటులో రావడంతో గగ్గోలు మొదలైంది. హర్మందిర్ సాహెబ్ (స్వర్ణ దేవాలయం)లో దాగిన సిక్కు వేర్పాటువాదులను బయటకు రప్పించడానికి సాయపడాలని నాటి మన ప్రధాని ఇందిర, ఇంగ్లండ్ ప్రధాని మార్గరెట్ థేచర్ (కన్సర్వేటివ్ పార్టీ)కు లేఖ రాశారనీ, ఈ మేరకు బ్రిటన్‌కు చెందిన స్పెషల్ ఎయిర్ సర్వీస్ (ఎస్ఎఎస్) సభ్యులు భారతదేశం వచ్చి పథక రచన చేసి ఇచ్చా రనీ, దానినే ఇందిర ఆమోదించారనీ ఆ పత్రం సారాంశం. 1984, ఫిబ్రవరి 6, 23 తేదీలలో రెండు దేశాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. ఆ పథకమే ‘ఆపరేషన్ బ్లూ స్టార్’. బ్రిటిష్ పార్లమెంటులో ఉన్న ఒకే ఒక్క సిక్కు ఎంపీ ఇందర్జిత్ సింగ్ దీని మీద దర్యాప్తు జరిపించాలని కోరారు. కన్సర్వేటివ్ పార్టీ ప్రధాని థేచర్కు ఇందులో ఉన్న ప్రమేయం గురించి దేశా నికి తెలియచేయాలని లేబర్ పార్టీ ఎంపీ టామ్ వాట్సన్ కూడా ప్రస్తుత ప్రధాని కామెరూన్‌కు విజ్ఞప్తి చేశారు. ‘సిక్కుల చరిత్రలో మనం నిర్వహించిన నెత్తుటి కాండ నుంచి పలాయనం చిత్తగించలేం’ అంటూ జనవరి 17నే ‘ది టైమ్స్’ పత్రికలో బెన్ మేసింటైర్ అనే కాలమిస్ట్ వ్యాఖ్యానిం చాడు. 1919 నాటి జలియన్ వాలాబాగ్ దురంతంతో దీనిని పోలుస్తూ, బెన్ చేసిన తీవ్ర వ్యాఖ్య అది. కానీ, ఇందులో బ్రిటన్ ప్రమేయం ఉన్నట్టు చెప్పలేనని ఆపరేషన్‌కు నాయకత్వం వహించిన లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) కుల్దీప్సింగ్ బ్రార్ ఒక ఇంగ్లిష్ న్యూస్ చానెల్‌తో వెంటనే చెప్పారు. ‘సాయం’ సమా చారం సైన్యం దృష్టికి ఎప్పుడూ రాలేదు కాబట్టి దర్యాప్తు అవస రమని కూడా బ్రార్ చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆంతరంగిక కల్లోలంలో సైన్యం పాలు పంచుకున్న వివాదాస్పదమైన కార్యక్రమం బ్లూ స్టార్. ప్రభుత్వ లెక్కల ప్రకారం అందులో మృతులు నాలుగు వందలు. ఆ సంఖ్య వేలల్లోనే ఉందని సిక్కుల ఆరోపణ. సంత్ జర్నయిల్ సింగ్ భింద్రన్‌వాలే కేంద్ర బిందువుగా ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది. సిక్కులలో దమ్దమి అనే చిన్న తెగ నాయ కుడు భింద్రన్‌వాలే. సిక్కుల ఓట్లను చీల్చి, అకాలీలను బల హీనం చేయడానికి కాంగ్రెస్ భింద్రన్‌వాలేను సమర్థించిన మాట నిజం. దీనితో ఇతడు 1980లో స్వర్ణదేవాలయాన్ని తన కార్యకలాపాలకు కేంద్రంగా మార్చాడు. వాటికి జగ్జీత్సింగ్ చౌహాన్ మొదలుపెట్టిన ఖలిస్తాన్ ఉగ్రవాదం తోడైంది. చివరికి 1984లో ఆపరేషన్ బ్లూస్టార్ ద్వారా భింద్రన్‌వాలేను, అతడి అనుచరులను హతమార్చారు. ఇందులో వేర్పాటువాదుల, ఉగ్రవాదుల పాత్ర ఎంత వివాదాస్పదమో, సైన్యం నిర్వ హించిన పాత్ర కూడా అంతే వివాదాస్పదం. సైనిక చర్య పేరు తో అప్పుడు ఏం జరిగిందో మాజీ కేంద్రమంత్రి బల్వంత్ సింగ్ రామూవాలియా 2013 జూన్‌లో వెల్లడించారు. ‘డే అండ్ నైట్ న్యూస్ చానెల్’లో (చండీగఢ్) కన్వర్సాంధు అనే జర్నలిస్ట్ ఏర్పాటు చేసిన చర్చలో (30 ఏళ్లు గడిచిన సందర్భంగా) రామూవాలియా చెప్పిన అంశాలు తీవ్రమైనవి. ఆపరేషన్ మొదలయ్యాక జూన్ 5వ తేదీ సాయంత్రం, ఒక ట్రాన్స్మి ట్టర్తో సహా వచ్చిన ఐదుగురు సిక్కు యువకులు జీఎస్ తోహ్రా (శిరోమణి ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు), హెచ్ ఎస్ లోంగో వాల్ (అకాలీదళ్ నేత) మీద తుపాకులు ఎక్కు పెట్టి ఖలిస్తా న్ను ప్రకటించవలసిందిగా ఆదేశించారనీ, అందుకు తోహ్రా నిరాకరించారనీ మాజీ మంత్రి వెల్లడించారు. అప్పుడే, తోహ్రా, లోంగోవాల్ మాటలు ట్రాన్స్మిట్టర్ ద్వారా జియా ఉల్ హక్ విని దాడికి వస్తారని కూడా ఉగ్రవాదులు చెప్పార ట. 30 మంది సిక్కు యువకులను సైన్యం నిర్దాక్షిణ్యంగా కాల్చిన వైనాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. బ్లూస్టార్ దేశానికో చేదు అను భవం. సరిగ్గా 5 మాసాల తరువాత అక్టోబర్ 31న ఇందిరను సిక్కు అంగరక్షకులు కాల్చిచంపారు. తరువాత జరిగిన అల్ల ర్లలో మూడువేలకు పైగా అమాయక సిక్కులు చనిపోయారు. బ్లూస్టార్ చర్యలో ఇంగ్లండ్ పాత్ర గురించి కామెరూన్ దర్యా ప్తునకు ఆదేశించారు. భారత్ ఏం చేస్తుందో తెలియదు. కానీ ఎన్నికల ముందే ఇంగ్లండ్ దర్యాప్తు పూర్తయితే మిగిలిన పరిణా మాలు ఎలా ఉన్నా, సిక్కుల గాయం రేగక తప్పదు. ఇందిర నోట పదేపదే వినిపించిన విదేశీ హస్తం సంగతీ తేలుతుంది! - డాక్టర్ గోపరాజు నారాయణరావు